కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )
09 జన 2012 అభిప్రాయములు
in సమాజం ట్యాగులు:capitalism, communism, etc
ఈ మధ్య మన బ్లాగులలో కమ్యూనిస్టులకీ, వాళ్ళని వ్యతిరేకించే వారికీ మధ్య వాగ్యుధ్ధాలూ, దూషణ, భూషణ , తిరస్కారములూ నడుస్తున్నాయి. వాటిని చూసినప్పుడు, కాసేపు ఆవేశం గా కమ్మీ భాయీలని చీల్చి చెండాడుదాం అనిపిస్తుంది. కానీ, ఇంతలోనే వారి వాదనలో అసలు సబబు లేకుండా పోలేదు కదా అనిపిస్తుంది. ఇంకాసేపు వారి వ్యతిరేక వర్గాన్ని విమర్శించుదాం అనిపిస్తుంది. కానీ వారి విమర్శలు కొన్ని కూడా సహేతుకమే కదా అనిపిస్తుంది. ఆ.. మనకెందుకు లే “గో.పి” లా కూర్చుందాం అని మరి కొంత సేపు అనిపిస్తుంది.
మొత్తానికి ఈ పీకులాట లో నా స్థానం ఏమిటో చెప్పేస్తే పోలా, ఈ రోజు కొంచెం టైం చిక్కింది కదా అని,ఈ టపా వేస్తున్నాను.
1.తప్పదు. విశ్లేషణ మొదలు పెట్టటానికి జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ గెడ్డపాయన డార్విన్ ని లాక్కొని రావలసిందే! (ఏమిటో ఖర్మ, నాకు అందరూ గెడ్డపాళ్ళే దొరుకుతారు). గుంపులు గుంపులు గా ఉండే క్షీరదాలైన జంతువులలోంచీ మనిషి జాతి పరిణామం చెందింది అని ఆయన చెప్పాడు. మనిషి జంతువు స్థితి లో ఉన్నపుడు సమాజం ఉండేది. అంటే సమాజం సహజమైనదే. ఇక్కడ సహజమైనది అంటే, మనిషి తన ఆలోచన తో “నిర్మించనిది”. (డార్వినిజం పై నాది “నమ్మకం” మాత్రమే! డార్విన్ గారి సిధ్ధాంతాలని నేను వ్యక్తిగతం గా నిరూపించి నిగ్గు తేల్చుకోలేదు
)
2. జంతువు నుంచీ మనిషి గా మారే క్రమం లో మనిషి లో మొదటి గా “నేను” అనే ఒక self-conscious center ఏర్పడింది. ఇది ఆలోచనల తో చేయబడిన ఒక దారబ్బంతి లాంటిది. ఆలోచనలు అంటే, ఈ నేను అనేది గడచి పోయిన కాలం తో చేయబడినది. memories తో చేయబడినది. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భౌతికం గా చూస్తే, చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కానీ సిస్టం ఆన్ చేస్తే దీనిదే హవా!
3. ఆలోచనల తో కూడిన “నేను” చింపాంజీల లాంటి జంతువులలో కూడా ఉంటుంది కానీ, ప్రస్తుతానికి దానిని పక్కన పెడదాం. ఈ “నేను” ఏర్పడక ముందు మనిషి “ఆ క్షణం” లో జీవించేవాడు. పరిస్థితులూ, తన instincts మొదలైనవి ఆడించినట్లు ఆడే వాడు. జీవితం చాలా simple గా ఉండేది.
4.”నేను” గారు ఏర్పడటం మనిషి మనుగడ లో పెద్ద మైలు రాయి. ఎందుకంటే, అంతకు ముందు వ్యక్తి గత స్థాయి లో మనిషి మనుగడ గురించి plan చేసి, పట్టించుకొనే పదార్ధం లేదు. “నేను” గారు, “వచ్చే వేసవి కాలం లో food ఎలా దొరుకుతుంది?” వంటి అనేక సమస్యల గురించి ఆలోచించి, దానికి ప్లాన్ చేయటం మొదలు పట్టారు.(The selfish gene అని ఓ అమెరికా ఆయన ఒక పుస్తకం రాసుళ్ళా! )
అలానే, అనేక వైజ్ఞానిక మైన ఆవిష్కరణలూ, సాంకేతిక ఉపకరణాలు కనిపెట్టబడటానికి కూడా ఈ “నేను” గారూ, ఆయనకి ఉన్న అతిశయమే కారణం.
5. ఈ “నేను” గారి వలన మనిషికి “సాఫ్ట్ వేర్” ఒకటి ఏర్పడి, తద్వారా మానసిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించబడింది. మనిషి చేసే “భోంచేయటం”, వంటి చిన్న చిన్న పనుల నుంచీ, పట్టణ అభివృధ్ధి కోసం వేసే ప్లాన్ ల దాకా, ఈ మానసిక ప్రపంచం పరిధి లోనే జరుగుతాయి.నేను గారి జననం తో పాటు మనిషి లో భావోద్వేగాలు పదునెక్కి నిశితమైనాయి. నేను గారు ఏర్పడిన తరువాత కొంత (ఎంత అని అడగకండి) కాలానికి కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడినాయి. ఎందుకంటే నేను గారికి memory ఉంది. జంతువులలో లా కాకుండా, మనుషులకి, “యాభై యేళ్ళు వచ్చిన కొడుకు కూడా” పిల్ల వాడిలా కనపడటానికి కారణం, “ఈ నేను గారికి ఉన్న మెమొరీ, భావోద్వేగాలను record చేసి అట్టే పెట్టుకోవటం “.
6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది. కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
7. ముందు భూస్వామ్య వ్యవస్థా, తరువాత పెట్టుబడి దారీ ఏర్పడటం ఈ క్రమం లోనివే. మార్క్స్ అనే గెడ్డపాయన కూడా, ఏంగెల్స్ అనబడే ఇంకొక గెడ్డపాయన తో కలిసి చెప్పింది ఏమిటంటే, ఈ పరిణామ క్రమం లో తరువాత ఏర్పడబోయేది, సామ్య వాద వ్యవస్థ అని. అయితే, ఈ వ్యవస్థ ఏర్పాటును త్వరితం చేయటానికి “కమ్యూనిస్ట్ పార్టీ” ఏర్పాటు అనేది, విప్లవం రూపం లో “రసాయనిక చర్యను త్వరితం చేయటానికి catalyst ను కలపటం”, లాంటిది. .
8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు. ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.
ఆస్తికులైనా నాస్తికులైనా తర్కం ద్వారా అన్వేషణ జరిపితే, ఒక తెలియని ప్రాంతాన్ని (realm) దర్శించాల్సిందే! “ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?” అని నాస్తికుడిని అడగండి. “ఇంకా తెలియదు” అని సమాధానం వస్తుంది.
దేవుడిని నిర్వచించండి అని ఒక ఆస్తికుడిని అడగండి, “నిర్వచనాలకి అందని వాడు”, అన్న సమాధానం ఇవ్వకపోతే ఆస్తికుడి వాదం ఆటే నిలవదు.
9. ఇక పోతే, సమాజం గురించి… వ్యక్తులతో కూడిన వ్యవస్థ నే సమాజం అంటాం. ఒక సైకిల్ లో ఉన్న చిన్న చిన్న భాగాలని వ్యక్తులు అనుకొంటే, ఆ భాగాల అమరిక నే సామాజిక వ్యవస్థ అనుకోవచ్చు. సైకిల్ బిగించే వాడు సీట్ బిగించే చోట కారేజీ బిగిస్తే సైకిల్ ఉపయోగ పడకుండా పోతుంది. అలానే, సైకిల్ బిగించే టపుడు బ్రేకులు గాఠ్ఠిగా బిగిస్తే, అవితొందరగ అరిగి పోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒక frame work ఉంటుందనీ, అలానే చిన్న చిన్న భాగాలనే వ్యక్తులు ఉంటారనీ. frame work ని సరి గా అమర్చక పోతే, దాని ప్రభావం component పై పడి అవి త్వరగా అరిగిపోతాయి. అలానే, చెత్త components వేస్తే (చెత్త ట్యూబ్) framework దెబ్బతింటుంది.
కమ్యూనిజం అనేది సామాజికం గా ఒక మెరుగైన frame work కావచ్చు. ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.
10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.
ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
మనిషి కి ఉన్న ఈ లక్షణాలు, సామ్యవాద చట్రం పరిఘి లోనివి కావు. కాబట్టీ ఈ లక్షణాలున్న వ్యక్తి (component), చివరికి చట్రాన్ని (framework), తుప్పు పట్టిస్తాడు. సామ్యవాద వ్యవస్థ లు కొన్ని కూలటానికి కారణం ఇదే కావచ్చు.
సామ్యవాద వ్యవస్థలు, social engineering ద్వారా నిలబడవేమో! వ్యక్తులు కూడా ఆ దిశలో కొంత పరిపక్వత సాధించిన తరువాతే, సామ్యవాద చట్రం నిలబడవచ్చు. సమాజం లోని వ్యక్తులలో అధిక భాగానికి సుందరయ్య, నంబూదిరి వంటి వారికున్న నిస్వార్ధతలో సగం ఉన్నా, సామ్యవాద చట్రం నిలబడుతుందేమో! కానీ ఆ వ్యక్తిగత పరిపక్వత పరిణామం ద్వారానే రావాలి. అది సామ్యవాద చట్రం ఇచ్చేది కాదు. ఒక రకం గా ఈ పరిపక్వత కు కారణం కూడా ఒక enlightened selfishness అనవచ్చు. నా సిధ్ధాంతం గెలవాలి, నా సమాజం బాగుండాలి, అనే ఒక స్వార్ధం. కానీ అటువంటి స్వార్ధాన్ని ప్రస్థుత పరిస్థుతులలో ఆహ్వానించ వచ్చుననుకొంటా!
అందరూ మహనుభావులైనపుడు ఏ ఆదర్శమైనా పని చేస్తుంది. ఒక సిధ్ధాంతం పని చేయటానికి మనుషుల వ్యక్తిత్వ స్థాయి పెరగాలంటే, ఆ సిధ్ధాంతం, తాను పుట్టిన పరిస్థితులలో విఫలమైనట్లే లెక్క!ఎందుకంటే, సామాజిక సిధ్ధాంతం వ్యవస్థ స్థాయి లో framework ని fix చేయాలి. సిధ్దాంతం యొక్క success మనుషుల వ్యక్తిత్వ ఔన్నత్యం యొక్క దయాదాక్షిణాలపై ఆధారపడ కూడదు.
10.పరిపూర్ణ సమానత్వం అనేది ఒక ” సాధ్యం కాని విషయం”. ఈ నా టపా చూడండి.
స్త్రీ పురుష సమానత్వం లో కొంత డొల్ల తనముంది. ఇంతకుముందు ఈ టపాలో చెప్పాను.
డబ్బు వలన అసమానత్వం పెరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వ విధానాలు ఈ అసమానత్వ అగ్నికి ఆజ్యం పోస్తాయి.
డబ్బు లేని సమాజాన్ని ఊహించుకోండి. అప్పుడు డబ్బుని అపరిమితం గా కూడబెట్టటానికి వీలుండదు. వస్తువులూ ఆహారం మొ. అన్నీ కొంత కాలం తరువాత నశించేవే. భూమిని కూడబెట్టినా దానిని అదుపు చేయటం కష్టం. అలానే జనాల నుంచీ డబ్బుని బొట్టూ బొట్టూ పిండినట్లు వస్తువులని పిండటానికి కుదరదు. డబ్బు లేక పోతే అనేక రకాలైన ద్రవ్యోల్బణాలు ఉండవు.
డబ్బు ని ఎలా మానేజ్ చేయటం అనే expertise తెలుసుకొని సంపాదించటం(manipulate చేయటం) అసలే కుదరదు.డబ్బులేక పోతే, ఒక్క గుండు సూది కూడా ఉత్పత్తి చేయని speculative markets కూడా ఉండవు. తద్వారా వాటి దోపిడీ ఉండదు.
కానీ డబ్బు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. సులువు గా కదలటం, వ్యవహారిక మైన సదుపాయాలూ, బ్యాకింగ్ రంగమూ మొ||. కాబట్టీ డబ్బు ని బ్యాన్ చేయటం కుదరదు. దానిని నియంత్రించటమొక్కటే మార్గం.
11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).
12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.
13. “మార్క్స్ ఏ ఫాక్టరీ లోకీ వెళ్ళి అధ్యయనం చేసి తన సిధ్ధాంతాన్ని ప్రవచించలేదు”, అని చెప్తున్నారు. మార్క్స్ అలాంటి అధ్యయనం చేసి ఉంటే , ఆయన సిధ్ధాంతానికి మరింత విశ్వస నీయత చేకూరేదేమో! కానీ ఆయన ఒక సామాజిక శాస్త్ర వేత్త మాత్రమే. ఐన్-స్టీన్ లాంటి, Theoretical physicists ల్యాబ్ లో ప్రయోగాలు చేయరు. అంతరిక్షం లోకి వెళ్ళరు. కానీ వారిని ఎవరూ, అలా చేయమని అడగరు కదా! అలాంటిదే, మార్క్సిస్ట్ తీరీ కూడా.
మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది. ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?
అయితే, వ్యక్తిగత పరిమితుల వలన ఒక సిధ్ధాంతాన్ని పాటించలేని వారికి, సమాజం హితం కోరి సిధ్ధాంతాన్ని చెప్పే హక్కు ఇందుకు మినహాయింపు. (ఒక కాన్సర్ రోగి దీర్ఘ కాలం ఆసుపత్రి లో ఉండవలసి రావచ్చు. అతను వర్గ పోరాటం చేయలేక పోవచ్చు. కానీ ఇతరులను ఉత్తేజ పరచవచ్చు.)
“మార్క్స్ చెప్పాడని ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించ వలసిన అవసరం లేదు”, అనే విషయం మార్క్సిస్టులు గుర్తించాలి. “మార్క్స్ అంతటి వాడు చెప్పిన దానిని ప్రశ్నిస్తావా?”,అనేది సరైన స్పందన కాదు.
కాయలున్న చెట్లకే రాళ్ళ దెబ్బలనట్లు, ఆదర్శాలు చెప్పే వారికే అతిక్రమణల ఆరోపణలు ఎదురౌతాయి. అలా అని ఏ ఆదర్శాలూ చెప్పని వారు ఏ వెధవ పనైనా చేయటానికి లైసెన్స్ ఉందనుకొంటే పొరపాటే!
14. అలానే మార్క్సిస్ట్ ల ను విమర్శించేవారు, …. “పలానా లింక్ లో పలానా చోట మార్క్స్, ఈ నాటి పరిస్థితులకి సరిపోయే వ్యాఖ్యానం చేశాడు”, అని చెప్తే, ఆ లింక్ ని చూడను కూడా చూడ కుండా,
“ఆ మార్క్సిజం అంతా పిడి వాద మతం!” అని తీసివేయటం కూడా సరి కాదు. అలానే, “ఏది సరైన కమ్యూనిజం, మావోదా?మార్క్స్ దా? CPI, CPM వాళ్ళదా?, మవోయిస్టులదా?”, అని గదమాయించి, అసలు మార్క్సిజం గురించి చదవకుండా తప్పించుకోవటం కూడా మంచిది కాదు.
అవన్నీ అధ్యయనం చేసి, వాటిలో దేని వలన convince అవుతారో, దేని వలన కారో వ్యక్తులు నిర్ణయించుకోవాలి. ఏదీ చదవకుండానే (ఆ టైం , ఓపికా లేక పోతే ఒప్పుకోవచ్చు కదా?) రోడ్డు మీది పిచ్చివాడి మీద, “అందరూ వేస్తున్నారు, మనం కూడా వేసి చూద్దాం”, అన్నట్లు నాలుగు రాళ్ళు వేయటం, గేలి చేయటం అనేది మంచిది కాదు. ఇంటర్నెట్లో దొరికే అవగాహన లేని పిల్లల తో దెబ్బలాటలు పెట్టుకొని, మార్క్సిజం అంటే “అంతా చెత్త”, అనుకోవటం మంచిది కాదు. ఒక వేళ చర్చించటానికి తగిన స్థాయి కల మార్క్సిస్టులు దొరకక పోతే, చర్చలనుంచీ దూరం గా ఉండటం మంచిది. అన్ని సిధ్ధాంతాలను సమర్ధించే వారి లోనూ, అన్ని రకాల వారూ (తెలివైనవారు, జోకర్లూ, మంచివారూ, చెడ్డవారూ) ఉంటారని మరిచిపో వద్దు.
మార్క్సిస్టులు “అన్నీ మా మార్క్స్ చెప్పాడట,(ఇదొక వ్యక్తి పూజ)” అనటం సహించలేని ప్రత్యర్ధులు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, వాదాలను మళ్ళీ నిలబెట్టాలని చూడటాన్ని, “భౌతిక మైన నిరూపణల కంటే, తమ జీవనపధ్ధతుల వలన ఏర్పరచుకొన్న వ్యక్తిగత నమ్మకాలకు మద్దతు కూడగట్టటం ద్వారా పై చేయి సంపాదించాలని ప్రయత్నించటం”, గానే అర్ధం చేసుకోవచ్చు.
15. పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”. సంబంధిత టపా.
16. సామ్యవాద సిధ్ధాంతం పాతబడి పోయిందనేది ఒక వాదన. కానీ, కమ్యూనిస్ట్ మానిఫెస్టో కానీ కాపిటల్ కానీ చదివిన వారికి, ఇప్పటి సమాజ పరిణామాలు చాలా వరకూ ఆ సిధ్ధాంతం పరిధి లోకే వస్తాయనే విషయం అవగతమౌతుంది. కొత్త కొత్త గా వస్తున్న global warming వంటి విషయాలపై సామ్యవాదం యొక్క వైఖరి ఏమిటొ స్పష్తం గా లేదు. సహజ వనరులు తక్కువ గా ఉన్నపుడూ, త్వరగా తగ్గి పోతున్నపుడూ వాటిని సమానం గా పంచుకోవటం మరీ చెడ్డ విషయం కాదేమో!
global warming ని తగ్గించటానికి మనమందరం మధ్య యుగాలలోని, పచ్చి ఆహారం తినే స్థితికి వెళ్ళటానికి సిధ్ధం గా లేమనేది స్పష్టం. దీనికి, emissions ని క్రమం గా తగ్గిస్తూ, ఒక balanced state కి వెళ్ళటమొక్కటే మార్గం.
అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ పరిధిలోనే దీనికి సమాధానం దొరక వచ్చు. ప్రభుత్వాలు తమ regulations ద్వారా, కాలుష్యాన్ని తగ్గించటాన్ని ఒక లాభ దాయకమైన వ్యాపారం గా మలచాలి. దీని కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి అవసరం.
17. పెట్టుబడి దారీ వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కోంటున్న నేటి స్థితి లో, ఏది సరైన పరిష్కారం? ఉత్తర ఐరోపా దేశాల లా , మనుషుల కనీస అవసరాలు తీరేంత వరకూ సామ్యవాద విధానాలూ, తరువాత పెట్టుబడి దారీ పోటీ విధానాలూ అవలంబించటం ఒక సమాధానం.
ఉద్యోగుల యాజమాన్యం ఉన్న కో-ఆపరేటివ్ లు ఇంకొక ప్రత్యామ్నాయం. వినియోగ దారుల కో-ఆపరేటివ్లూ, ఉత్పతి దారుల కోఆపరేటివ్ లూ (మహా రాష్ట్ర లో చక్కెర ఫాక్టరీలూ, మన రాష్ట్రం లో రైతుల కో-ఆపరేటివ్ లూ) ఇవన్నీ మన దేశం లో ప్రయత్నించి చూసినవే! (ప్రజలందరి కో-ఆపరేటివ్ నే సామ్యవాద సమాజం అంటారనుకోండి. అది మరీ పాత చింతకాయ కదా! అందుకే కొత్త సీసా లో పాత సారా పోద్దామని ఈ కో-ఆపరేటివ్ ల proposal. class less society, withering of state ల కి కొత్త ముసుగేస్తే, ఈ co-operative వాదం వస్తుంది. )
18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.
మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.
19. ప్రజల బాధల పట్ల సానుభూతి తో వారితో భుజం కలపటం వేరు, ప్రజల ఆక్రోశాన్నీ, కోపాన్నీ ఒక ఆయుధం గా వ్యూహాత్మకం గా ఉపయోగించుకొని అధికారం లోకి రావటం వేరు అని మన కమ్మీ పార్టీలు గుర్తించాలి.
అలానే కమ్యూనిస్ట్లు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ ఆదర్శ సమాజం వచ్చేస్తే, తరువాత వారి అస్థిత్వం ఏమిటి? ఆదర్శ సమాజాన్ని రక్షించటమా? ఆదర్శ సమాజం స్థిరపడి పోయింది అనుకొందాం. మరి అప్పుడు కమ్యూనిస్టుల పని ఏమిటి? అప్పుడు పని ఏమీ ఉండదు. కాబట్టీ, ప్రజలు కష్టాలలో ఉంటేనే కమ్యూనిస్టుల ప్రభావానికి మంచిదా?
ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా? OK . Then, have a nice weekend.
ఎవరు (తెలుగు)కథలు రాయకూడదు?..wth some updates..
05 జన 2012 అభిప్రాయములు
in సమాజం
కథలు రాయాలనే బులపాటం చాలా మందికి ఉంటుంది. అచ్చు లో తమ పేరు చూసుకోవాలనో, పేరు తెచ్చుకోవాలనో, తమ భావాలనూ ఆలోచనలను పంచు కోవాలనో రాస్తారు.
నేనేమీ గొప్ప కథకుడిని కాదు. కనీసం చిన్న కథకుడిని కూడా కాదు. కథలు రాయాలని ఒకప్పుడు ఆశపడిన ఔత్సాహికుడిని మాత్రమే!
కథలు రాసే క్రమం లో నేను తెలుసుకొన్న విషయాలు, నా లాంటి కొత్త ఔత్సాహికులకు ఉపయోగపడతాయని, ఇక్కడ:
1. మీరు మీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథ రాయాలనుకొంటే, మరొక్క సారి ఆలోచించుకోండి. అభిప్రాయాలను వ్యాసాల ద్వారా సూటి గా చాల తక్కువ మాటలలో చెప్పవచ్చు. ఒక ఇరవై పేజీల కథ ద్వారా చెప్పే అభిప్రాయాన్ని , ఓ వాక్యం ద్వారా వ్యాసం లో చెప్పవచ్చు.కథ, రచయిత అభిప్రాయాలను ఏదో ఒక స్థాయి లో ప్రతిబింబిస్తుంది. కానీ అభిప్రాయాలు చెప్పటం కోసం మాత్రమే కథను రాయనవసరం లేదు.
2. కథలు రాయటం చిత్రాలు గీయటం లాంటిది, మట్టి తో బొమ్మలు చేయటం లాంటిది. ఉదాహరణ కి ఒక స్త్రీ బొమ్మ ఎంత నిజమైన స్త్రీలా కనపడితే అంత ఆ బొమ్మ గొప్పది అవుతుంది. అలా అని బొమ్మ నిజం కాదు. బొమ్మ బొమ్మే. అది వాస్తవ భ్రమ ను కలుగజేస్తుంది. ఈ సూత్రం కథలకు కూడా వర్తిస్తుంది.కథ అనేది నిజం లా అనిపించే “అందమైన” అబధ్ధం. దీనినే శిల్పం అంటారు. కథ రాసే వారికి అందమైన కల్పనలు చేసే ఆసక్తి ఉండాలి. వాస్తవం లో ఉన్న చెత్త అంతా కథల లోకి ఎక్కటం బాగుండదు. కథలు ముఖ్యం గా మనిషి మానసికప్రపంచం లో చోటున్న విషయాల గురించి రాస్తాము. మన మానసిక ప్రపంచం లో ఏ విషయాలకి చోటు ఉంటుంది అనేది మన విలువలూ ప్రాముఖ్యతలూ నిర్ణయిస్తాయి.మన చేతన లో చోటు లేని విషయాలకి అంతశ్చేతన లో చోటుంది. (ఉదా: నిషిధ్ధమైన సెక్స్) . వాస్తవాన్నే కొలబద్ద గా పెట్టుకొంటే, మన మానసిక ప్రపంచం లో స్థానం లేని అనేక విషయాలు (కాల కృత్యాలు తీర్చుకోవటం లాంటివి) కథలలోకి ప్రవేశిస్తాయి. మనం ఈ వాస్తవ విషయాల ఆధారం గా కథలు రాస్తే అవి మళ్ళీ మన మానసిక ప్రపంచం లోనీ విషయాల గురించే ఏదో ఒక పాయింట్ చెప్పేవై ఉండాలి. వాస్తవ విషయాలను వాటి యధాతధ నిడివి తో కథలలో ప్రస్తావిస్తే అది వాస్తవికత కాజాలదు. ఒక వ్యక్తి పది నిమిషాలు పళ్ళుతోముకొంటే, కథలో ఆ వర్ణన పది నిమిషాల పాటు ఉండజాలదు కదా!
వ్యాసాలు నేరు గా పాఠకుడి ఆలోచనలను ప్రభావితం చేస్తే, కథలు సబ్-కాన్షస్ గా ప్రభావితం చేస్తాయి.
3. కథకు ఒక ఇన్స్పిరేషన్ ఉండవచ్చు. ఆ ఇన్స్పిరేషన్ తో సంఘటనలూ, సన్నివేశాలూ అల్లటం లో కథకుడి ప్రతిభ బహిర్గతమౌతుంది. కథ ద్వారా ఒక భావోద్వేగ పరమైనా, లేక ఆలోచనా పరమైన సత్యాన్ని కథకుడు చెప్పగలగాలి.అంటే కథ చదివే వారి లో భావోద్వేగాలనైనా కలిగించగలగాలి, లేక ఆలోచనలనైనా రేపగలగాలి. సన్నివేశాలు అల్లటం కోసం కష్టపడే వారు, “ఇంకా కథలు అల్లటం నేర్చుకోవాలి” అని అర్ధం.పాత్రలకి “నిజ జీవితం లో వ్యక్తులకి ఉన్న multi-dimesionality”, ఎంత ఎక్కువ గా ఉంటే అవి అంత సజీవం గా కనపడుతాయి
4.పరిభావనల స్థాయి లోనే ఆలోచనలు చిక్కుకు పోయి, వివరాలంటే పడని వారు కథలు రాయటం కష్టం.
5. తమ నిజ జీవిత అనుభవాలను పంచుకోవటానికి కథలు రాయవచ్చు. ఆ అనుభవాలూ, కథకుడి ఆలోచనా సరైనవైతే, పాఠకుడికి ఆ కథ ద్వారా నాణ్యమైన అనుభూతే దొరుకుతుంది. అయితే, నిజ జీవితం లోని సంఘటనల ఆధారం గా కథలల్లటం లో ఉన్న ప్రతిభ, పూర్తి కాల్పనిక కథలల్లటం లో ఉన్న ప్రతిభ కన్నా తక్కువ అనే విషయాన్ని కథకుడు అంగీకరించాల్సిందే!
6. కథలు చదివి ఆనందించే చాల మంది కథలు రాయటానికి ఉత్సాహపడతారు. కానీ రాయటం చదవటం కంటే భిన్నమైన ప్రక్రియ. ఇతరులు రాసిన కథలను చదివేటపుడు, కథకుడు చెప్పే పరిధిలోని విషయాలు మాత్రమే మన మనో ఫలకం పై ఆడతాయి. కానీ కథ రాసేటపుడు మన అనేక ఇష్టాఇష్టాలు priority ప్రకారం మనో ఫలకం పై ముందుకు వస్తాయి. ఉదాహరణ కు ఇతరులు రాసిన వర్ణనలు చదివి ఆనందించే మనం, రాసేటపుడు వర్ణనలు రాయలేక పోవచ్చు. కారణం వర్ణనలు మనకు ఇష్టమైనప్పటికీ, వాటికంటే మనకు వ్యక్తి గతం గా ముఖ్యమైన పరిభావనలూ మానవ సంబంధాలూ మన మనోఫలకం పైకి రావచ్చు.
మొత్తానికి నేను చెప్పొచ్చేదేమిటంటే, వంట తిని ఆనందించే వాళ్ళందరూ వంట చేయటం ఇష్టపడనవసరం లేదని.చాలా సార్లు కథలు రాయటం లోని ఆనందం కంటే వేరే వాళ్ళు రాసిన కథలు చదవటం లోని ఆనందమే ఎక్కువ గా ఉంటుంది.
7. కథ కి సాంఘిక ప్రయోజనం ఉండాలా వద్దా? అని పెద్ద పెద్ద విషయాలు నేను మాట్లాడను , కానీ, “కథ కు అంత సీన్ ఉందా?” అనేది నా సందేహం. రా.వి శాస్త్రి లాంటి వారు చివరి రోజులలో పెన్ను పక్కన పెట్టి, గన్ను పట్టాలన్నారు. కొ.కు(కొడవటిగంటి . కుటుంబ రావు) చివరికి కథలు రాయటం అపేశారు. చా.సో(చాగంటి సోమయాజులు) ముందే విరమించారు. ఫ్రెంచ్ విప్లవం నాటి పరిస్థితులు ఈ రోజున లేవు.
తెలుగు సమాజం లో, టాల్ స్టాయ్, హెమింగ్వే ల లా గన్ను పట్టి ఆ పై పెన్ను పట్టిన రచయితలెవరూ లేరు. ప్రముఖ రచయితలందరూ పట్నాలలోని తమ మధ్యతరగతి వాలు కుర్చీలలో సుఖం గా కూర్చొని పెన్ను పట్టి, ఇతరులను గన్నుపట్టమని ప్రోత్సహించినవారే!
శ్రీ శ్రీ మహాప్రస్థానం వంటి సులభమైన కావ్యమే, పాటక జనాలకు అర్ధం కాదు. పేద వారి గురించి రాసే కథలన్నీ, నాకు “పేద వారిని ముడి పదార్ధం గా తీసుకొని మధ్య తరగతి చేసుకొనే రస సృష్టి గా కనిపిస్తాయి.”
8. ఈ రోజుల్లో, తెలుగు కథలు రాసి డబ్బులు చేసుకోవాలనుకోవటం, “తివిరి ఇసుమున తైలమ్ము తీయవచ్చు” అనేదాన్ని గుర్తు చేస్తుంది. యండమూరులూ, మల్లాదులూ మానేశారంటే పరిస్థితి తీవ్రతని అర్ధం చేసుకోవచ్చు.
9. కథలు ప్రధానం గా మానవ సమాజం లోని సంబంధాల ను చిత్రిస్తాయి. కానీ ఈ పరిధికి ఆవల ఉండే సైన్స్, టెక్నాలజీ, తత్వం, కాస్మాలజీ వంటి అనేక విషయాలపై కథలు చదివి వాటి పై అవగాహన పెంచుకోవటం కంటే, ఆయా విషయాలను నేరు గా చదివి అవగాహన పెంచుకోవటం సులువు. అందుకే కథలకు ఉండే ప్రభావం ఈ విషయలలో చాల పరిమితం.జీవితం లో ఉండే సవా లక్ష రంగాలలో, సాహిత్యం అనే ఒక చిన్న రంగం లో, ఒక కొత్త చిన్న ప్రక్రియ మాత్రమే కథ. దానికి ఉన్న పరిమితులు అనేకం.
10. మీకు అందమైన రసన కంటే ఆచరణ ఇష్టమైతే, కథలు రాయటం శుధ్ధ దండుగ.
11. సాహిత్యానికి సమాజం లో ఉండే స్థానాన్ని ఎక్కువగా ఊహించుకోవద్దు. హాయిగా ఇంట్లో కూర్చొని, ఊహలతో రాసిపారేయటం చాలా సులువు. దానికి కావలసింది కథలు రాసే ప్రతిభ మాత్రమే. పీపాడు ఆలోచనల కంటే, చెంచాడు ఆచరణ కొండంత మెరుగు. బయటకు వచ్చి సమాజం తో తలపడి పోరాడి సాధించటం చాలా కష్టం. వ్యక్తి గతం గా రచయితలు ఆచరించని ఆదర్శాలను ప్రబోధిస్తూ రచనలు చేసే హక్కు, రచయితలకు లేదు కాక లేదు.అత్యున్నత ఆదర్శాలూ, నీతులూ ప్రవచించే రచయితలు, ఏ ఆదర్శాలూ విలువలూ లేని రాజకీయ మీడియా సంస్థలు విసిరే కుక్క బిస్కట్లకూ ఉద్యోగాలకూ ఆశపడటం ఆ రచయితల ఆదర్శాల పైపూతలను తెలియజేస్తోంది. ఒక వేళ పొట్టకూటి కోసం ఆయా సంస్థలకు పనిచేస్తోన్నట్లైతే, ఆ విషయాలను నిజాయితీ గా, బహిరంగం గా ఒప్పుకోవటం మంచిది(శ్రీ శ్రీ లా).తన దాకా వస్తే గానీ తెలియదంటారు కదా మరి!
రచయిత ఓ ఆదర్శాన్ని పాటించాడని, అలా పాటించని వారిని తప్పుపట్టే హక్కు అతనికి లేదు. ఇతరులకి ఆ ఆదర్శాన్ని పాటించటం “రచయితకి అయినంత convenient” కాక పోవచ్చు. లేక, ఆ ఆదర్శం గురించి ఇతరులు convince అయి ఉండక పోవచ్చు. కాకపోతే ఇతరులకి ఆ ఆదర్శం పట్ల ఆసక్తి ఉండకపోవచ్చు.రచయిత కి ఆ ఆదర్శం పాటించటానికి ఎంత హక్కు ఉందో ఇతరులకి “పాటించక పోవటానికి” అంతే హక్కు ఉంటుంది.
12. మన వ్యక్తి గత గోడునూ, ఉద్వేగాలనూ,అనుభూతులనూ పంచుకోవటానికి కవిత్వం సరైన సాధనం అనుకొంటా.!
13. అసలు విషయం ఉంటే ఎవరైనా రాస్తారు. విషయం లేనప్పుడు కూడా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా వంటి విషయాలపై పేజీలకు పేజీలు రాసి జనాలను మెప్పించటం( జనాలకు వినోదాన్ని పంచటం) ఒక గొప్ప కళే. అలాంటి రాత గాళ్ళకు నా “సెల్యూట్”.
14. భాష పై పట్టు లేని వారు కథలకి దూరం గా ఉండటం మంచిది. కవిత్వం సంగతి చెప్పనవసరం లేదు.
15. గొప్ప రచయితల రచనలు చదివి, వాటి తో స్ఫూర్తిని పొంది రాయాలనుకొని కలం పట్టే వారికి నిరాశ ఎదురవ్వవచ్చు. ఎందుకంటే, గొప్ప రచయితలకు అప్పటికే జీవితం సగం అయిపోయి ఉంటుంది. లేక పూర్తి గా అయిపోయి ఉంటుంది. వారి వ్యక్తిత్వం వారి అనుభవాల సారం గా ఏర్పడి ఉంటుంది. వారి రచనలు వారి వ్యక్తిత్వం లోంచీ పుట్టుకొని వస్తాయి. వారి జీవితం లోని వయసు,దశలను బట్టి వారి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. వారిని చూసి స్ఫూర్తిని పొందిన మన లాంటి వారు వేరే స్థల కాలాల్లో ఉంటాం. అంటే మన వ్యక్తిత్వం వారి కంటే చాలా భిన్నం గా ఉండే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో మెరుగ్గా, ఇంకొన్నిటిలో నాసి గా. కాబట్టీ వారి స్థాయి లో కథలల్లటం కష్టమే. అనుకరణ మాత్రం కుదరవచ్చు.పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవటం అవసరమా?
16.విశాల సమాజం లో లానే రచయితల సమాజం లో కూడా కుల ప్రాంత మతాల కుమ్ములాటలూ, భావజాలపు పీకులాటలూ, రాజకీయాలూ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త!
17. ఈ రొజుల్లో తెలుగు రచయితకొచ్చే పాపులారిటీ కొన్ని వేల పాఠకుల సంఖ్యను మించకపోవచ్చు. అచ్చు లో మీ పేరు చూసుకోవాలంటే (పుస్తకం వేసుకోవాలంటే), మీ చేతి చమురు వదలవచ్చు.
18.తెలుగు రచనలకి భవిష్యత్తు లేదు. పీరియడ్. ఇంకో పదేళ్ళ లో, బళ్ళో తెలుగు మీడియం చదివే వారు దాదాపు మృగ్యమవుతారు. ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి తెలుగు చదవటం నేర్చుకొన్న వారికి (అసలు నేర్చుకొంటే) తెలుగు చదివే ఫ్లూయెన్సీ చాలా తక్కువ గా ఉంటుంది (కాలేజి వరకూ తెలుగు మీడియం లో చదివిన నాకే, ఇంగ్లీషు మాటలు లేకుండా రాయటం కుదరటం లేదు). ఇక తెలుగు రచనలు చదివేది ఎవరు? చేసేది ఎవరు?తెలుగు లో రాయటం అనేది శిల్ప కళ లా “ఒకప్పుడు విలసిల్లిన కళ” కావటానికి ఎన్నో రోజులు పట్టదు.
19. కథలు రాయాలంటే వ్యక్తి గత సమయాన్ని వెచ్చించాలి. కాబట్టీ వ్యక్తి గత సంబంధాలు ప్రభావితమౌతాయి. మీరు కథలు రాసే సమయం లో ఇంటి పనులలో సాయ పడాలని మీ భార్య కోరుకోవచ్చు. మీ పిల్లలు పక్క పార్కు కి తీసుకొని వెళ్ళాలని కోరుకోవచ్చు. వారికి మీ భావాల కంటే, తమ వ్యక్తిగత అవసరాలే ముఖ్యమౌతాయి. మీరు ఎప్పుడూ పుస్తకాలలో మునిగి తేలేటట్లైతే మీ పిల్లల మీద మీ ప్రభావం కంటే మీ భార్య ప్రభావం ఎక్కువ ఉంటుంది (వారి తో ఎక్కువ సమయం గడపటం వలన). శ్రీ శ్రీ గారు తన నాస్తికతను ఆయన ఇద్దరు భార్యలూ కొడుకు చేత కూడా ఆచరింప చేయలేకపోయారు. అలానే అనేక వామపక్ష మేధావుల పిల్లలు ఇప్పుడు అమెరికా లో ఉంటూ, తమ పెద్ద వారివి ఛాదస్తపు ఆలోచనలు గా భావిస్తున్నారు. ఇంట్లోనే మీ భావాలకు గొప్ప విలువ లేని పరిస్థితి దాపురించ వచ్చు. ఇంట్లో వారిని తమ ఆదర్శాల తో ఒప్పించలేని వారి భావాలను సమాజం ఒప్పుకోవాలనుకోవటం అత్యాశ కదా?
20. మీరు రాజకీయ సవ్యత ఉన్న తెలంగాణ వాదం, స్త్రీ వాదం, దళిత వాదం వంటి వాటికి వ్యతిరేకం గా కథలు రాసేటట్లైతే ఇంకొక సారి ఆలోచించుకోండి. పత్రికలు మిమ్మల్ని చూసి జడుసు కొంటాయి. మిమ్మల్ని ఆమడ దూరం లో పెడతాయి. ఎవరి సర్క్యులేషన్ వారికి ముఖ్యం కదా! అలానే పత్రికల పోకడల గురించి వ్యంగ్యం గా రాస్తే వాటిని ప్రచురించేంత విశాల హృదయం పత్రికలకు ఉండదని గుర్తుంచుకోండి.లౌక్యం అనేది కథలు రాసేవారికి కూడా అవసరం మరి.
21. పబ్లిషర్లూ, పత్రికలలో ఉండే ఉద్యోగులతో స్నేహాలూ, నెట్వర్కింగూ లేని వారు,తమ కథలను పబ్లి ష్ చేసుకోవటం గురించి పునరాలోచించుకోవలి.
22. జీవితం లో రచయిత ఉండే మూడ్ ని బట్టీ, జీవిత దశ ని బట్టీ కూడా అతని రచనలు ఉంటాయి. డిప్రెషన్ లో ఉన్న రచయిత హాస్య రచనలు రాయటం కష్టం.అంతర్ముఖుడైన రచయిత సంభాషణలు రాయటానికి కష్టపడవచ్చు. డెబ్బై యేళ్ళ రచయిత రొమాన్స్ రచించటం అరుదు (ఆ రచయిత మనసు కవి ఆత్రేయ లాంటి వాడైతే తప్ప).
పాపులర్ తెలుగు టపాలు రాయటం ఎలా? : కొన్ని సూత్రీకరణలు
31 డిసెం 2011 అభిప్రాయములు
in తెలుగు ట్యాగులు:how to write popular posts
ఈ కింది సూత్రీకరణలు మీకు ఇంతకు ముందే తెలిస్తే, ఈ టపా ని skip చేసేయండి. “చదవకుండా ఎలా తెలుస్తాయి?” అంటారా? తీరా చదివిన తరువాత..”అబ్బే! ఇవన్నీ మాకు ముందే తెలుసు”, అనొద్దు మరి.. ..
1. తెలుగు బ్లాగులను ఒక సీరియస్ సబ్జెక్ట్ లా చదివే వారు చాలా తక్కువ ఉంటారు. “ఆఫీస్ లో బోర్ కొట్టినపుడో, ఇంట్లో ఉబుసు పోకో, బ్లాగులు ఫాలో అవ్వటం అలవాటయ్యో, ఉద్యోగాలలోంచీ రిటైర్ అయ్యో, ప్రభుత్వోద్యోగాల్లో ఉండో, పెద్దతనం లో తమ పిల్లల తో పాటు అమెరికా చేరో,” ఈ బ్లాగులను చదివే వారే ఎక్కువ. సీరియస్ సబ్జెక్ట్ లు(ఫిలాసఫీ, సైన్సూ, టెక్నాలజీ, ఇంజినీరింగూ, సామాజిక శాస్త్రం, మన్నూమశానం.. ) నేర్చుకోవాలంటే అందుకు కాలేజీలూ, యూనివర్సిటీలూ ఉన్నాయి. బ్లాగులు దానికి వేదిక కాదు. కాబట్టీ, టపాలు సరదా గా వీలైనంత మందిని అలరించేవి గా, లైట్ రీడింగ్ కి ఉపయోగపడేవి గా , కాలక్షేపానికి పనికి వచ్చేవి గా ఉంటే ఎక్కువ మంది చదువుతారు.
ఒక వేళ ఏదైనా సీరియస్ విషయం చెప్పాల్సి వచ్చినా దానిని sugar coated pill లా సరదా గా చెప్పాలి.
2. ఏ భాషా బ్లాగులలో అయినా sex sells. నేరు గా సెక్స్ రాస్తే సంకలినులు బ్లాగులను పీకేస్తాయి. కాబట్టీ, ఇండైరెక్ట్ గా సెక్స్ “గురించి” రాసిన ఏ టపా ని అయినా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
3. controversial విషయాల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు. తెలుగు సమాజం లో caste అనేది ఒక incendiary thing. అలానే తెలంగాణా, రిజర్వేషన్లూ, హిందూత్వ ల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు.
4. నలుగురి imagination లోనూ నానుతున్న current event గురించి కూడా చదువుతారు. ఉదా: డర్టీ పిక్చర్.
5. ఎక్కువ మంది పాఠకుల కి సంబంధించిన విషయాలని కూడా పాఠకులు చూస్తారు. స్త్రీ పురుష సంబంధాలు సమాజం లో దాదాపు నూరు శాతం జనాలని కవర్ చేస్తాయి. కాబట్టీ వీటిని గురించి కూడా చదువుతారు.
6. పాపులర్ బ్లాగర్ గా పేరు తెచ్చుకొన్న వారి టపాలకి minimum guarantee ఉంటుంది, సూపర్ స్టార్ ల సినిమాల కి మినిమం కలెక్షన్లు వచ్చినట్లు గా (సూపర్ స్టార్ బ్లాగర్ ల కి , ఈ టపా లో చెప్పిన మెజారిటీ విషయాలను పాటించటం వలన ఆ స్టార్-డం వస్తుంది.)
7.తెలుగు బ్లాగ్లోకం అసలు తెలుగు లోకానికి ఒక sample లాంటిది. ఐతే, ఇక్కడ చదువు కొన్నవారు ఎక్కువ. కాబట్టీ, అసలు తెలుగు లోకం లో జనాదరణ ఉన్న చాలా విషయాలకి బ్లాగ్ లోకం లో కూడా జనాదరణ ఉండే అవకాశం ఎక్కువ. ఉదహరణకి సినిమా గాసిప్పులూ, క్రికెట్ కబుర్లూ,రాజకీయాలు. కాకపోతే, కొంచెం క్లాస్ సినిమాలూ, క్రికెట్ గురించి కొంచెంలోతైన విశ్లేషణలూ.
8. అసలు విషయం ఉన్న కథలూ, టపాలకి కూడా ఆదరణ ఎక్కువ.
9. రేటింగ్స్ ఎక్కువ వచ్చిన టపా కి కామెంట్సూ, హిట్సూ ఎక్కువ వస్తాయని చెప్పనవసరం లేదు కదా?
10. అమ్మాయిల బ్లాగులకి (వయసు మళ్ళిన అమ్మాయిలు కాదండీ) అబ్బాయిల బ్లాగుల కన్నా కొంచెం రద్దీ ఎక్కువ. ఎందుకో చెప్పనవసరం లేదు.
11. నాలా “వేసినటపానే జనాలు చదివే వరకూ మళ్ళీ వేయటం” వలన వాటిని ఎక్కువ మంది చదివే అవకాశం ఎక్కువ.
12. తెలుగు బ్లాగులు చదివే వారిలో చాలా మంది తమ సొంత బ్లాగులు కూడా నడుపుతారు. దీనిలో నాకు కొంత conflict of interest కనపడుతుంది. దీని వలన పక్కవాడి టపా బాగున్నపటికినీ, మన మొదటి అభినందన కొంత ఆలశ్యం అవ్వవచ్చు.
13. పై పాయింట్ వలన, ఒక్క సారి పక్కవాడి టపా ని మెచ్చుకొంటే, తరువాత అతను మన టపా ని మెచ్చుకొంటాడు. ఈ రకం గా పరస్పర గోకుడు ఎక్కువై వీళ్ళు గ్రూప్ లు గా ఏర్పడతారు. ఇక సామాజిక వర్గాల పరం గా, అభిప్రాయాలూ, సిధ్ధాంతాల పరం గా,లింగపరం గా, ప్రాంతపరం గా,ఊరి పరం గా,వయసు పరం గా ఏర్పడే గ్రూప్ ల సంగతి చెప్పనవసరం లేదు. ఈ గ్రూపుల్లో ఉంటే కామెంట్స్ వలన బ్లాగ్ పాపులారిటీ పెరుగుతుంది.
14.టపా వేసే టైం ని బట్టి కూడా టపా కి స్పందనలు ఉంటాయి. ఏ అర్ధ రాత్రో, సంకురాత్రి రోజో వేసే టపా ని ఎవరు చదువుతారు, చెప్పండి?
ఇక కామెంట్లూ, హిట్స్ విషయానికి వద్దాం.
1.టపా పేరు ఆసక్తికరం గా ఉంటే, హిట్స్ ఎక్కువగా ఉంటాయి.
2. టపా లో జనాలను ఆకట్టుకొనే విషయం ఉంటే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి.
3. వారాంతాలలో కామెంట్స్ ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. పాఠకులకి తీరిక ఎక్కువ గా ఉండటం వలన అనుకొంటా!
4. ఇతరుల టపాలకి కామెంట్స్ పెట్టని వాళ్ళ టపాలకి కామెంట్స్ వచ్చే అవకాశం తక్కువ కదా!
5. కామెంట్స్ ఎక్కువ వచ్చిన టపాకి ఇంకా ఎక్కువ కామెంట్సూ, హిట్సూ వస్తాయి (courtesy: maalika,koodali comments section), హిట్ టాక్ వచ్చిన సినిమాకే ప్రేక్షకులు వెళ్ళినట్లు. (కాకి రెట్టేసినట్లు “good”, “interesting” అని కామెంటేసి మళ్ళీ తిరిగి చూడని వారి కామెంట్లు దీనికి మినహాయింపు.)
6. కొన్ని niche బ్లాగులు చదవటానికి ఆయా విషయాలలో పాండిత్యం అవసరం. వాటికి, సత్యజిత్ రే, సినిమాలకి ఉన్నట్లు, niche రీడర్స్ ఉంటారు.
7. కామెంట్లు రాసిన వారికి కొంచెం మర్యాద చేస్తే వాళ్ళు మళ్ళీ కామెంటుతారు. మీరు సెలబ్రిటీ బ్లాగ్ ల కు కామెంటే వారైతే, అది బ్లాక్ హోల్ లో పడిన కాంతి అని గుర్తుంచుకోండి. దానికి response రాదు. ఎందు కంటారు? బడుగు జీవుల మాటలను ఎవరైనా పట్టించుకొంటారా?
పైన చెప్పిన సూత్రాలు కాకుండా మీకు ఏమైనా తోస్తే, కామెంటండేం? పైన చెప్పిన విషయాలు తప్పయ్యే అవకాశం కూడా ఉంది. మీరు అలా భావిస్తే నిర్మొహమాటం గా చెప్పేయండి.
PS: బ్లాగు చర్చల్లోని అభిప్రాయాలనూ, వాదాలనూ, రాతలనూ, ఆవేశ కావేశాలనూ సీరియస్ గా తీసుకొను వాడు “దున్నపోతై పుట్టున్!”. ఎందుకంటారా? చూడుడు: ఈ టపా లో మొదటి పాయింట్.బ్లాగర్లకు రాజకీయ నాయకులకు ఉన్నంత విశ్వసనీయత కూడా ఉండదు.రాజకీయ నాయకులైతే వారి పేర్లు తెలుస్తాయి. వారి ఊరు ఏమిటో తెలుస్తుంది. దీని వలన వారు కొంచెం (చాలా కొంచెం)బాధ్యత గా ఉండాల్సి వస్తుంది. మారు పేర్ల వెనుక దాకునే ఊరు లేని బ్లాగర్లకి ఈ మాత్రం విశ్వసనీయత కూడా ఉండదు.
విశ్లేషణలు అక్కరలేని సందర్భాలు..
30 డిసెం 2011 అభిప్రాయములు
in అవర్గీకృతం
మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చొన్నాం.
హఠాత్తుగా మా స్నేహితుడి నాలుగేళ్ళ చిన్న క్యూట్ పాప “షేం, షేం” అంది.
తల తిప్పి చూస్తే ఆ పాప తన చూపుడు వేలూ మధ్య వేలూ కలిపి టీవీ వైపు చూపిస్తూ మళ్ళీ అంది, “షేం షేం”.
టీవీ లో ఏమి వస్తుందా అని చూస్తే అక్కడ ఒక న్యూస్ చానల్ లో డర్టీ పిక్చర్ గురించి విద్యా బాలన్ ఎక్స్-పోజింగ్ చూపించే ప్రోగ్రాం నడుస్తోంది.
ఏది సభ్యత, ఏది అసభ్యత,అసభ్యత చూసే వాళ్ళ కళ్ళలో ఉందా? చేసే వాళ్ళ చేష్టలలో ఉందా? అని పెద్ద పెద్ద విశ్లేషణలు అవసరమా?
************
నా చిన్నపుడు..మా పల్లెటూరి స్కూల్ కి ఫర్నీచర్ సప్లై చేయటానికి హైదరాబాద్ నుంచీ ఓ ఇద్దరు వచ్చారు. ఒకాయన పూల పూల చొక్కా వేసుకొని, దాని మీదకి చిల్లులు ఉన్న జీన్స్ వేసుకొన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొన్నాడు. పిల్లి గడ్డం కూడా ఉంది. .
అతనిని చూసి,”ఏందబ్బా పగటి వేషగాడిలా ఉన్నాడు. మన ఊరి కుక్కలు చూస్తే వెంటబడతాయి”, అన్నాడు నా ఫ్రెండ్.
అది ఆ సాయంత్రానికి కన్-ఫం అయింది. మా ఊరి ధర్మాసుపత్రికి కుక్క కాటు వైద్యం కోసం ఆ “ఒకాయన” వచ్చాడని అక్కడ పని చేసే ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ద్వారా తెలిసింది.
********************
ఆ రోజుల్లో ఉత్తర భారతం లోని ఒక కాలేజీ హాస్టల్లో ఉండే వాళ్ళం. హాస్టల్ మెస్ లో రోటీలు పెట్టేవారు. ఆ రోటీలు చాలా చెత్తగా ఉంటున్నాయనీ. మెస్ సెక్రటరీ వార్డెనూ కలిసి డబ్బులు మింగి కల్తీ రొట్టెలు పెడుతున్నారనీ విద్యార్ధులందరం సమ్మె చేశాం.
వార్డెన్ మా అందరినీ చర్చలకు పిలిచాడు.
“రోటీల క్వాలిటీ బాగోలేదని ఎలా చెప్పగలరు? మనం ఏవిషయాన్నైనా సాపేక్షం గా చూడాలి. ఒక కోణం నుంచీ చూస్తే అవి చాలా మంచి రొట్టెలు. ఈ రొట్టెలు లేకే దేశం లో చాలా మంది బాధ పడుతున్నారు”, అని తన “చాతుర్రిం” చూపటం మొదలు పెట్టాడు వార్డెన్. చర్చల సందర్భం లొ మాటా మాటా పెరిగి మా లో ఒకతను “మెస్ లో పెట్టే రొట్టె లను కుక్కలు కూడా ముట్టవు “, అన్నాడు.దానికి మెస్ సెక్రటరీ ఆవేశం గా, “మరీ అన్యాయం గా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కుక్కలకు రొట్టెలు వేసి చూద్దాం”, అన్నాడు.
సరే అంటే సరే అన్నారంతా. మెస్ కుర్రాడిని పిలిపించి, మా క్యాంపస్ లో విరివి గా ఉండే కుక్కల చెట్టుకింది కుక్కలకి ఆ ఉదయం చేసిన రొటీ లు వేయించారు. అవి, ఆ రోటీలను మూచూసి, వెనక్కి తిరిగి, వెనక కాళ్ళ తో ఆ రొట్టెల పై కి దుమ్ము చిమ్మి కప్పి పెట్టాయి. దానితో వాదనలు బంద్! రోటీలు మాత్రం మెరుగయ్యాయి.
**********
చట్ట సభలలో ప్రభుత్వాలు అనేక పధకాల గురించిన చర్చలు చేస్తాయి. విశ్లేషణలూ వాదోపవాదాలకు కొదవ లేదు. రాజు గారికి బట్టలు లేవని ఒక చిన్న పిల్ల వాడు చెప్పవలసి వచ్చింది.
మన నాయకులూ,అధికారులూ రచించే పధకాలు ఉపయోగ పడ్డాయా లేదా అనేది, “విశ్లేషణలూ, మేధావిత్వాలూ లేని సామాన్య మానవుడు”, “తన రిపేరు కి నోచుకోని ఏ సైకిల్నో” చూపించి క్షణం లో తేల్చేస్తాడు, నాయకుల హామీలకి సంబంధించిన బట్టలు అసలు లేనే లేవని. ఈ లోపు మేతావులూ, నాయకులూ మల్ల గుల్లాలు పడుతూనే ఉంటారు “మనం వెనక్కి పోతున్నామా.., ముందుకు పోతున్నామా?”, అని.
అసభ్యతా, మన సమాజం యొక్క average tolerance
29 డిసెం 2011 అభిప్రాయములు
in అమ్మాయిలు
డీ జీ పీ దినేష్ రెడ్డి, “స్త్రీల అసభ్య వస్త్ర ధారణ వలన రేప్ లు పెరుగుతున్నాయని”, కామెంట్ చేసి, మళ్ళీ నా బుర్రలోని విశ్లేషణ సాఫ్ట్వేర్ ని activate చేశాడు. యధావిధి గా మన short sighted మీడియా మళ్ళీ గగ్గోలు మొదలు పెట్టింది.
మనిషి ఆది మానవుడిగా ఉన్న రోజులలో బట్టలు కట్టే వాడు కాదు. తరువాత ఎండా చలి నుంచీ అవి ఇచ్చే రక్షణ గురించి తెలిసిన తరువాత ఆకులతో, నారలతో బట్టలు కుట్టి వేసుకోవటం మొదలు పెట్టాడు.
సభ్యత అంటే సభ్యుడు కావటానికి తగిన ప్రవర్తన. ఒక గుంపు లొ సమాజం లో సభ్యుడు కావటానికి తగిన ప్రవర్తన. అంటే ఆ గుంపూ లేక సమూహానికి అప్పటికి ఉన్న విలువలను ఆమోదించి వాటికి conform అయేటట్లు ప్రవర్తించటం.
మనుషులు ఆది మానవులు గా ఉన్నపుడు, మొట్టమొదట బట్టలు వేసుకొన్న వాడి ప్రవర్తన మిగిలిన వారికి చాలా అసభ్యం గా కనిపించి ఉంటుంది. కానీ తరువాత బట్టలు వేసుకోవటం లోని లాభాలను గుర్తించి మిగిలిన వారు కూడా బట్టలు వేసుకోవటం మొదలు పెట్టి ఉంటారు.
బట్టలు వేసుకోవటం లో అప్పటి మనుషులకి అందాన్ని ఇనుమడించే గుణం కూడా కనపడి ఉండవచ్చు.
ఇక సమాజం లో కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడిన తరువాత, మనిషి కి ఉండే అనేక ఆలోచనలను బహిరంగ పరచటం నిషిధ్ధమైంది. మన మనసులోని ఆలోచనలను మన మొహం తరువాత ఎక్కువ గా బహిరంగ పరిచే అవయవమేదో అందరికీ తెలుసు. పక్క వాడి భార్య పై కలిగిన కామోద్రేకాన్ని మొహం లో కనపడనీయకుండా దాచవచ్చు. కానీ ఆ అవయవం జనాలను మోసం చేయదు.
కొన్నాళ్ళకి కామ సంబంధమైన భావాలే నిషిధ్ధమైన అంశాలైనాయి. అప్పుడు కామోద్రేకం, తన భార్య లేక భర్త మీద కలిగినదైనా, బహిరంగ పరచటం నిషిధ్ధమైంది. (ఆడం, ఈవ్, యాపిల్ కథ ని కాసేపు పక్కన పెడదాం)
ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత శరీరాన్ని కొంచెం చూపించీ, కొంచెం చూపించకుండానూ ఉండటం లో ఆకర్షణ ఉందని జనాలు గుర్తించారు. అసలు బట్టలు వేసుకోని ఆదిమానవుడికి ఈ ఆకర్షణ అర్ధం కాదు. ఈ ఆకర్షణ బట్టలు వేసుకొనే స్టేజీ నుంచీ వచ్చిందే.
ఈ కొంచెం చూపించటం లో, అన్ని విషయాలలో లానే, పాశ్చాత్య దేశాలు ముందున్నాయి. అక్కడ కూడా ఏ క్రికెట్ మాచ్ లోనో, రోడ్ పైనో ఎవరైనా బట్టలు అసలు వేసుకోకుండా కనపడితే వాళ్ళను జైల్లో పెట్టి public nudity కింద కేసు బుక్ చేస్తారు. మరి కొన్నాళ్ళకి అక్కడ మళ్ళీ ఆది మానవుల స్థాయి నగ్నత్వానికి వెళ్తారేమో తెలియదు. ఇప్పటికే, nudist society లు అక్కడ కొన్ని ఉంటాయి.
మొత్తం మీద పదిమందీ ఆమోదించే స్థాయి కి భిన్నం గా ఉన్న వస్త్ర ధారణే “అసభ్య వస్త్ర ధారణ”.
ఇంకా మన పల్లెల లోని స్త్రీలు కాలి పిక్కలు కనపడే వస్త్రాలను కూడా వేసుకొనే స్థాయి లో లేరు. అంటే మన సమాజం యొక్క యావరేజ్ tolerance limit అనేది కొంచెం conservative గా ఉంటుంది. అయితే ఈ లిమిట్, కొంచెం ధైర్యం గా ఎక్స్-పోజింగ్ చేసే వారి వలన రోజు రోజు కీ రిలాక్స్ వుతోందనేది నిజం.
ఒక పల్లెటూరి నుంచీ వచ్చే వాడికి, ఒంట్లో సగం కనపడేటట్లు బట్టలు వేసుకొన్న స్త్రీ సెక్స్ కి ఆహ్వానించి నట్లు గా కనపడటం లో ఆశ్చర్యం లేదు.అలా అని పల్లెటూరి నుంచీ వచ్చిన ప్రతి ఒకడూ రేప్ లు చేస్తాడని కాదు.
ఇక్కడే సెక్స్ ని చూపించి డబ్బు చేసుకొనే మీడియా, అలా చూపించటం లో ఆనందం పొందే వారూ అనేక సంబంధం లేని ప్రశ్నలు వేస్తారు.
-ఒక పదేళ్ళ పాప రేప్ కి గురయింది. మరి ఇక్కడ అసభ్యత లేదు కదా?
obviously దినేష్ రెడ్డి మాట్లాడుతుంది ఇలాంటి కేస్ ల గురించి కాదు.
-సంప్రదాయకం గా డ్రెస్ చేసుకొన్న వారు రేప్ కి గురి కావటం లేదా?
అవుతున్నారు. again, ఆయన ఈ కేస్ గురించి మాట్లాడటం లేదు.
- పాశ్చాత్య దేశాలలో నాలుగో వంతే బట్టలు వేసుకొన్నా, అక్కడ రేప్ లు జరగవు. ఇక్కడ ఎందుకు రేప్లు జరుగుతున్నాయి?
మన సమాజం యొక్క average tolerance ఇంకా ఆ స్థాయి కి చేర లేదు. ప్రస్థుతం ఎక్స్పోజింగ్ చేసే వారు , ఇంకా చాలా మందిని inspire చేస్తే, త్వరలోనే మనమూ ఆ స్టేజ్ కి చేరతాం.
- స్త్రీల ఎక్స్పోజింగ్ పై బాధ్యతను తోసివేయటం ద్వారా, పోలీసులు మీ బాధ్యతను తప్పించుకొంటున్నారు.
పోలీసులు రేప్ ని సమర్ధించటం లేదు. చేసినవాడిని పట్టుకొని కటకటాల వెనుకకి పంపాల్సిందే! కానీ పోలీసులు ఒక preventive measure చెప్తున్నారు.modest గా dress చేసుకొంటే మంచిదని. అత్యచారాలు జరగటం లో ఎక్స్పోజింగ్ బాధ్యత అసలు లేదనటం, స్త్రీలు తమ బాధ్యత నుంచీ తప్పించుకోవటానికి చేసే బుకాయింపు మాత్రమే!
- మా ఇష్టమైన బట్టలు మేము వేసుకొంటాం. అది అసభ్యత ఎలా అవుతుంది?
అసలు బట్టలు వేసుకోకుండా ఉన్నా మాకు పరవా లేదు. western countries లో కూడా అలాంటి వారి పై ఓ దుప్పటి కప్పి లాకప్ సెల్ లో పడేస్తారు. నలుగురు ఆడవాళ్ళు ఉన్న చోట ఒక మగ వాడు బూతు మాట అంటేనే అది immodesty కిందికి వస్తుంది. మరి, రోడ్ మీదా, పబ్లిక్ ప్లేసుల్లోనూ మన సమాజ పధ్ధతి ప్రకారం దాచుకోవలసిన శరీర భాగాలను బయటకు చూపించటం immodesty కదా? మీకు ఇష్టమైన బట్టలు మీరు వేసుకొంటే, మగ వారికి ఇష్టమైన “మిర్రి చూపులూ, తమలో తాము చేసుకొనే కామెంట్లూ”, ఆపటానికి మీరెవరు?
మొత్తం మీద దినేష్ రెడ్డి చెబుతున్నది, “సగం బట్టలు వేసుకొని, ఆ విధం గా మగ వాళ్ళ నుంచీ వచ్చే అటెన్షన్ ని ఎంజాయ్ చేస్తూ, వాళ్ళతో కలిసి ఏ ఫాం హౌస్ కో మందు పార్టీలకి పోయి, అక్కడ మద్యం మత్తులో ఎవడొ ఒక మగ వాడు శృతి మీరితే, దానిని గురించి అమాయకం గా వాపోయే వారిని గురించి”, మాత్రమే!
మా కాలేజీ రోజులు- ఒక కథ కాని కథ
26 డిసెం 2011 వ్యాఖ్యానించండి
in అమ్మాయిలు, సమాజం ట్యాగులు:abstinence, girls, society
అవి మా కాలేజీ రోజులు. ఊహలు మబ్బులలో తేలే రోజులు. కాళ్ళు భూమి మీదకి ఇంకా రాని రోజులు. ఆలోచనలు జీవిత వాస్తవపు మురికి గుంటలో ఇంకిపోని రోజులు. ఏమీ ఆశించకుండా మంచి చేసిన రోజులు. మంచి చేసి మరచిపోయిన రోజులు.భావోన్నతుల రోజులు.’శరీర పరీవృతులైన ‘ రోజులు.
అపోహలలో సంతోషం గా గడిపిన రోజులు. అందమైన అమ్మాయి నవ్వితే “నన్నే ఇష్టపడిందనుకొనే”, రోజులు. అసలు పాటల వెనుక లేని బూతు పాటలను కనిపెట్టే రోజులు.పొగరు గా, పచ్చి గా మాట్లాడుకొనే రోజులు.అనుకోకుండా అమ్మాయిల మనసు కష్టపెట్టి, తరువాత సారీలు చెప్పే రోజులు. ఇష్టం లేని వాడిని కసి తీరా తిట్టుకొని , లేని వెధవాయిత్వాన్ని వాడికి ఆపాదించి తృప్తి పడే రోజులు. ఆత్మ విమర్శకు నిర్దయత్వం రాని రోజులు. ఆ నిర్దయత్వం కూడా స్వార్ధం కోసమేనన్న అవగాహన రాని రోజులు. ఆలోచనలు భౌతికత బాట పట్టని రోజులు. రోగం, రొష్టూ, డబ్బూ దస్కం, వ్యవహారం, సంభవం, అసంభవం గురించి ఆలోచించని రోజులు. ఆదర్శాలతో బతికేయ వచ్చనుకొనే రోజులు. ప్రపంచం లోని అన్ని విషయాల మీదా పందాలు వేసుకొనే రోజులు. స్నేహితుల హృదయాల మధ్య “డైరెక్ట్ ఆన్-లైన్ ట్రాన్స్-ఫర్ ఏదో” జరుగుతుండే రోజులు. జీవితపు విశ్లేషణ లు ఇంకా మేలుకోని రోజులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జీవితాన్ని జీవించే రోజులవి.
ఆ రోజుల్లో మా రూం మేట్లు ఇద్దరు, గర్ల్స్ హాస్టల్ కి కి వెళ్ళి, అమ్మాయిలను కలుసుకొని, తిరిగి రూం కి వచ్చి , అక్కడి కబుర్లు మొదలెట్టే వారు. వాళ్ళను సోది మొదలెట్టారంటూనే, మిగిలిన వాళ్ళము కూడా వాళ్ళతో కలిసి సోది కి రాగం కలిపే వాళ్ళం.అందరూ రూం లోని పరుపుల మీద పడుకొని తన్మయత్వం తో సోది కబుర్లలో తేలియాడే వాళ్ళం. అమ్మాయిలు ఏమి మాటలాడుతున్నారో, ఆ మాటల వెనుక మర్మాలేమిటో ఉన్నవీ లేనివీ ఊహించుకొని మాట్లాడేవాళ్ళం. కాలేజీ లో ఎవరు ఎవరికి లైన్లు వేస్తున్నారో, ఎవరి మధ్య ఏమి నడుస్తున్నదో ఉన్నదీ లేనిదీ కూడా సృజించేవాళ్ళం.
సోదంతా ఐపోయిన తరువాత, “అరే, టైం అంతా వేస్ట్ అయిపోయిందే, ప్రతి రోజూ ఇలానే చేస్తున్నాం. ఇవాళ స్టడీస్ మొత్తం చంకనాకిపోయాయి”, అన్నాడు సురేష్ .
దానికి కీట్స్ అనబడే కృష్ణా రావు గాడు, “ఈ సోది కబుర్లు ఎందుకు రా బాబు. ఈ అమ్మాయిల గురించి మన టైమంతా వేస్ట్ అవుతోంది.వాళ్ళ గురించి చొంగ కార్చటం మానేయండి. ఈ టైం లో నేను ఓ రెండు కవితలు రాసేవాడిని కదా..!”, అన్నాడు. కీట్స్ గాడు అమ్మాయిల గురించి అందమైన కవితలల్లుతాడు.
“ఒరేయ్, మేము మాటలు చెప్పుకొని చొంగ కారిస్తే, నువ్వు కవితలు రాసి, అలా కూడా చొంగ కారుస్తున్నావు. అయినా, సోది మనం కొట్టుకొని, వాళ్ళను అంటే ఎలా రా ? అసలు అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి ఒకే హాస్టల్లో రూం షేరింగ్ చేసుకొంటూ ఉంటే బాగుంటుంది. అమెరికా లో అలానే ఉంటుందట!”సురేష్ అన్నాడు.
“అవును అమ్మాయిలూ అబ్బాయిలూ కలిసి ఉంటే అన్ని ముచ్చట్లూ అయిపోతాయి. ముచ్చట్లు తీరిన తరువాత, ఇక హస్కు కొట్టుకోవలసిన అవసరం ఏముంది? అప్పుడు స్టడీస్ మీద ఫోకస్ చేయవచ్చు,” అన్నాన్నేను.
“ఆగండి” , అన్నాడు అప్పటి దాకా కళ్ళు మూసుకొని నిశ్శబ్దం గా మా మాటలు వింటున్న జంగ్ గాడు. వాడి అసలు పేరు జంగయ్య. కానీ వాడు జనాల సైకాలజీ ఎక్కువ వి”శ్లేషించటం” వలన వాడికి జంగ్ అని పేరు పెట్టాము.లైబ్రరీ లో ఎప్పుడు చూసినా ఎవో పుస్తకాలు చదువుతూనే ఉంటాడు.
జంగ్ గాడు చెంపకి అరిచెయ్యి ఆనించి, మో చేతిని కిందికి ఆనించి, “పామ్మీద విస్ణు మూర్తి”లా పడుకొని, మొదలు పెట్టాడు. “అరే, మనమంతా పడవలేసుకొని ఒక ఉధృతం గా ప్రవహించే నదిలో పోతున్నాం రా. మన సంఘమూ పెద్దాళ్ళూ ఆ నదికి కట్టుబాట్లనే ఒక ఆనకట్ట కట్టారు. మనకి ఆనకట్ట కొన్ని మైళ్ళ దూరం లో ఉండగానే మనలో కొంత మంది నది కి ఉండే మురికి కాలువల లోకి ఎదురు పోతున్నారు. వాళ్ళని వదిలేద్దాం. మురికి కాలువ ఉధృతం గా ఉండదు. కానీ మనం ఉన్న నది కి భావోద్వేగాల,కోరికల ఉధృతి ఎక్కువ. మనం డ్యాం రిజర్వాయర్ లో నిలకడ గా ఉన్న నీటిలో ఉన్నంత వరకూ పరవాలేదు. ఒక్కోసారి డ్యాం గేట్లు సగం తెరచుకొంటాయి. కాకతాళీయం గా మన పడవ ఆ గేట్ దగ్గరికి వెళ్తే, మన పడవ డాం కిందికి బోల్తా కొడుతుంది. అంటే బై చాన్స్ మనం లవ్ లో పడితే మన చదువు కొన్నాళ్ళైనా బోల్తా పడుతుంది. మన పక్క రూం భాస్కర్ గాడిని చూడటం లా. వాడు ఆ ‘శిశిర’ తో లవ్ లో పడిన తరువాత, వాడి పర్సెంటేజీ తగ్గిపోయింది కదా! ఒక్కోసారి డాం కిందికి పడిన పడవ లోని మనిషి బతికి బట్ట కట్టడు. కిందటి సంవత్సరం మెకానికల్ లో శివ అనే వాడు మెడికల్ కాలేజీ అమ్మాయి రిజెక్ట్ చేసిందని ఆత్మ హత్య చేసుకొన్నాడు. లా కాలేజీ వాడొకడు తనను తిరస్కరించిన అమ్మాయి మీద యాసిడ్ పోయబోయాడు. వాడి మీద కేసు బుక్ అయింది. వాడి జీవితం నాశనం అయినట్లే! ఇవన్నీ మరిచిపోయారా? ….అలా అన్న మాట. కాబట్టీ మనమందర మన పెద్ద వాళ్ళు పెళ్ళి అనే లీవర్ ద్వారా డాం లోని నీటిని క్రమం గా సేఫ్ లెవల్ కి తెచ్చేదాకా ఆగి అప్పుడు డాం అవతలిపైపుకి వెళ్ళ వచ్చు. అదీ సంగతి!”, అన్నాడు జంగ్.
జంగ్ గాడి వాదన లో నాకొక లొసుగు కనిపించింది. ” అసలు ఆనకట్టే లేక పోతే, మనకు ఈ తిప్పలు ఉండవు కదా?”, అన్నాను.
“ఆనకట్టలేక పోయినా మన కుర్రతనపు నదిప్రవాహం ఉధృతం గా ఉంది. ప్రవాహం లో మన పడవ బోల్తాపడక తప్పదు. కాబట్టీ, అప్పుడప్పుడూ ఇలా అమ్మాయిల గురించి సొల్లు కబుర్లు చెప్పుకొంటూ, స్థిరమైన రిజర్వాయర్ లో తెడ్డేసుకొంటూ తిరగటమే మేలు”, జంగ్ నవ్వాడు.
“పెద్ద వాళ్ళు కట్టిన ఆనకట్ట గేట్లు ఈ మధ్య చాలానే ఊడిపోతున్నాయి. అమెరికాలో లా ఇంకా ఆనకట్టే కొట్టుకొనిపోలేదనుకోండి. ఒక వేళ ఆనకట్ట లేకపోయినా, ప్రవాహ ఉధృతి లో పడవ బోల్తా పడుతుంది.”
“అరే జంగ్ గా, ప్రవాహమూ ఉధృతీ డామూ అంటూ ఇంకో సోది మొదలెట్టావు. అర్ధమై చావట్లేదు. అసలు విషయం చెప్పరా!”
” పాశ్చాత్య దేశాలలో టీనేజీ సెక్స్ గురించి పరిశోధనలు జరిగాయి. . అక్కడ “కో-ఎడ్యుకేషన్” కాలేజీ ల కంటే, అబ్బాయిలకు మాత్రమే పరిమితమైన కాలేజీల లో అబ్బాయిలు మంచి ఫలితాలు సాధించారు . మన పూర్వపు గురుకులాల మాదిరి. సంఘం పరిపూర్ణం గా నిషేధించి, పూర్తిగా సాధ్యం కాని ఏ అంశం మీదికైనా మన ఆలోచన పోదు. అప్పుడు మనసు పక్క దారి పట్టక, చదివే అంశం మీద మనసు లగ్నం చేయవచ్చు. సంఘం విధించే నిషేధం, “డాం కి ఉన్న పుచ్చిపోయిన తలుపుల లా”, ఉంటే, వ్యక్తుల మనసులు అటూఇటూ కాకుండా ఊగిసలాడి మనసు లగ్నం కాదు.అలానే, టీనేక్ సెక్స్ వలన “మెదడు అభివృధ్ధి చెందటం ఆగిపోయే అవకాశం ఉంది”, అని కూడా ఈ పరిశోధనలు చెబుతున్నాయి. అయితే సెక్స్ ఎడ్యుకేషన్ వలన మాత్రం యువకుల చదువులకి నష్టం లేదు!”.
“సరేరా జంగ్, ఇంతకీ ప్రేమ గురించి నీ అభిప్రాయమేమిటి రా?”
“ప్రేమించటం అనేది కోర్ట్ కేసు లాంటిది. ఓడిపోయిన వాడు కోర్ట్-లో ఏడిస్తే, గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడంట. అలానే, ప్రేమ విఫలమైన వాడు గుండె పగిలి ఏడిస్తే, ప్రేమ సఫలమైన వాడు పెళ్ళయిన తరువాత భ్రమలు విడిపోయి ఏడుస్తాడంట! అసలు ప్రేమ లో పడనివాడిదేనోయ్ జల్సా అంతా!”
Spiritual Speculation – U.G. Krishnamurti
14 డిసెం 2011 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:U.G. Krishnamurti
There are floods. The flood water overflowed the bounds of the river and flooded the nearby villages. The dead bodies of cattle,humans, trees are carried in the swirls of the flood. The affluents from the sewage of the nearby city make the water look more muddy. The usually calm river has turned violent. It’s bounds were dug away by the villagers in normal times into their fields. Now the flood has seeped through the bounds. There is no escape from the floods.Everything on the way of the river will be washed away into the sea.
**************
while reading about J Krishnamurti,I came across the criticism of him by U.G.Krishnamurti
(Uppaluri Gopala Krishnamurti). He was taking J Krishnamurti for a task for not following
his own tenets. J Krishnamurti proclaimed “Truth is a pathless land.Nobody can teach it to anybody”. But he started schools to teach how to live. Having an epiphany is not a ticket to teach people about everything under the Sun.
U.G.Krishnamurti has been a desperate seeker of God. He used to attend J Krishnamurti’s meetings. Unlike J Krishnamurti, he was highly qualified for his pursuit. At some point in his life he has undergone what he called as “calamity” and his body has attained “natural state”. The main feature of this active state was annihilation of self. His thought came into existance only on demand from the surroundings.Otherwise, for all practical reasons there was no self consciouness, no thought.
His teachings are similar to those of J Krishnamurti.He mainly differed in two points. UG said, “Through thought only we know we are in the natural state. Without thought there’s no knowing”. While J Krishnamurti said, “for the perception of Truth, thought is not required”. After all, while looking at a house you don’t need to think it is a house or that is a chair.
UG told there is nothing to be transformed in a man. So all the inquiry in that direction is futile.
U.G. has to be credited with de-mistifying spirituality. He said his natural state is nothing related to moksha, bliss or ecstasy. He has entered that state despite, not because of, his efforts. He does not know how one enters it or not sure if anybody can enter that state. It might be possible that he was chosen by some external entity for entering the natural state,or he has the unique genes required for that. It could be an accident in which the necessary conditions for entering that state are met. He shooed away people who came to meet him some times. He sometimes hesitated to describe his natural state for some people might wrongly delude to attain it based on his description.
UG opined that self-conscious entity in us is not required for the survival of human race.
But with out self-consciousness we can’t assume man could do planning. Self-consciousness is responsible for controlling, tracking, monitoring and supervising one’s actions.The actions are due to motivations to gain power, achievement and popularity etc. These motivations are inherited by man from animals. Without self-conscious-ness many of the human achievements would not have been possible. Once man faces a problem he internalizes it’s effects and plans the counter measures. This greatly enhances his survival. Both UG and J Krishnamurti told thought could be used for practical purposes like scientific research,commerce. But thought is a liability in psychological or self-consciousness related issues. But, the problem here is there is no clear-cut distinction between practical and psychological and practical or physical needs. For instance,let’s think a person has a mental ailment. He needs to cure his mental ailment both for psychological and practical reasons.
Some drugs like LSD result in dissolving of the self,though temporarily. In this case if a man tries and consumes LSD, he will be in that state. Similarly, in future, genetic engineering might make it possible for a person to enter the natural state. In those cases, elusive theories about effort or thought not touching the natural state may prove wrong. So, because of the achievements of thought in genetics,one will be able to enter the natural state.
If you tell a kid don’t ever enter into that room,the kid will surely try to enter that room. UG was criticised of adopting similar tactics to gain popularity. His statements”Don’t come to me. I do not have anything to say” attracted more people to him. “Whether UGconsciously adopted the technique” is matter of conjecture.
UG is blamed for escaping responsibility and being a coward. He abandoned his family and abdicated his responsibility.In a similar way,he abdicated the responsibility to make people aware of the issues involved in his chats/talks. Many times he was irreverent to people.
That was his personality.He was maverick, pugnacious and at times repelling. But his approach looked more open and honest. Sometimes he even allowed scientists to study his body.
Rajneesh once quoted the words of UG from his early days about Ramana Maharshi out of contextand criticised UG. But UG him self never said after his calamity that his own words withRamana Maharshi were justfied.
There is an ancient Indian saying, “Ekam sadwipraah bahudaa vadanti”. The single entity is expressed in many ways.When one looks at people like J Krishnamurti, UG, Ramanamaharshi, one could not help wonder if all of them are talking about one and the same thing,but are expressing it differently depending on their personalities.
…to continue
దేవుడూ హేతువాదుల సంవాదం
05 డిసెం 2011 అభిప్రాయములు
in ఆధ్యాత్మికం, విశ్వమూ దేవుడూ, సైన్స్
సుందరం కళ్ళు తెరిచాడు. చిమ్మ చీకటి. కళ్ళు మూశాడు. ఏమీ కనపడటం లేదు.
ఆరు నెలలు గా గుండె జబ్బు తో తీసుకొంటున్నాడు. రాత్రి నిద్రపోయి మళ్ళీ ఇప్పుడే లేచాడు.
చేతులు విదిలించాడు.అరే చేతులు ఉన్నట్లే లేవే..! కాళ్ళు ఆడించాడు. ఊహూ.. కాళ్ళు కదల లేదు.
“నేను బతికే ఉన్నానా?”
“ఊహు.., నిన్న రాత్రే చనిపోయావు”, ఎక్కడి నుంచో సమాధానం వచ్చింది.
“అరే.., ఎంత ఘోరం జరిగింది..నా పెళ్ళాం పిల్లలు ఎలా బతుకుతారు?…. ఇంతకీ, నువ్వెవరు?”
“నీ భాషలో దేవుడు అంటారు”
“నేను నమ్మను.నాకు జీవితం లో దేవుడెప్పుడూ కనపడలేదు. నేను నాస్తికుడిని,రచయితని ..పైగా హేతు వాదిని…తెలుసా?”
“కనపడితే ఇంకా నమ్మేదేముంది గానీ, ప్రస్తుతం నువ్వు ఎవరి తో మాట్లాడుతున్నట్లో?”
“నమ్మను గాక నమ్మను! మనిషి బుర్రకి బయట, “తెలివిగానీ, ‘తెలివి లో ఉన్న వస్తువు గానీ ,” ఏదీ లేదని మా నాస్తికుల విశ్వాసం”.
“మనిషి తెలివీ చేతనా, నా తెలివీ చేతనా ఒకేవిధం గా ఉంటాయని నీకెవరు చెప్పారు?”
“మా శాస్త్రవేత్తలు ఈ విశ్వం పని చేసే నియమాలను కొన్ని ఎప్పుడో కనిపెట్టేశారు. ఇంకొన్నిటిని కనిపెడుతూ ఉన్నారు.క్వాంటం తీరీ, స్ట్రింగ్ తీరీ మొదలైన వాటిని గురించి నువ్వు ఇంకా వినలేదా?”
“ఆ నియమాలను పెట్టింది ఎవరు? వారికి కనిపెట్టే శక్తిని ఇచ్చింది ఎవరు?”
“అంటే ఆ నియమాలను నువ్వే పెట్టానంటావ్. అయినా సరే నేను నిన్ను నమ్మను. నువ్వు నన్నేం చేసినా సరే..!”
“నన్ను నమ్మని వాళ్ళని దండించటానికి నేనేమైనా నియంతనా..? నన్ను నమ్మిన దుర్మార్గులని నెత్తిన పెట్టుకోవటానికి నేనేమైనా ముఖప్రీతి మనిషినా?”
“సరే..నా మీద కోపం లేదన్న మాట”
“రాగ ద్వేషాలకతీతం గా నా నియమాలప్రకారం పని జరిగిపోతుంది. మీరూ నా నియమాల ప్రకారమే ప్రవర్తిస్తారు.కోపం పెంచుకోవటానికి నేనేమైనా మనిషినా..?. “
“నువ్వు ఈ లోకం నడిచే భౌతిక నియమాలని ఎందుకు మార్చవు? దీనివలన హాకింగ్ వంటి శాస్త్రవేత్తలు,స్థిరం గా ఉండే భౌతిక నియమాలను తెలుసుకొంటే చాలు, నిన్ను తెలుసుకొనకపోయినా వచ్చే ప్రమాదమేమీలేదంటున్నారు కదా? “
“నువ్వు రచయితవి కదా? నీకు శిల్పం యొక్క ప్రాముఖ్యత తెలిసేఉండాలి. లోక నియమాలని మారిస్తే నా లోక రచన లో శిల్పం దెబ్బతింటుంది. నా శిల్పం మీకు అర్ధం కాదులే . అది “అధిభౌతిక శిల్పం”. శిల్పాన్ని దెబ్బతీయటం ఉచితం కాదు కదా? “
“నీ ఉనికిని మా శాస్త్ర వేత్తలు ఎప్పటికైనా నిరూపించగలరా ?”
“సిధ్ధాంతపరం గా నిరూపించవచ్చు. కానీ నేనుండే లోకం వేరు.నా కొలతలు వేరు. మీకు నా లోకం లోకి ప్రవేశం లేదు. నా లోకం, మీ లోకం లోని నియమాల ప్రకారం పని చేయదు. మీ లోకం నా పరిధి లోని ఒక చిన్న నలుసు మాత్రమే! నా ఉనికిని మీ లోకం లోని నిజ జీవితం లోని దృగ్విషయాలాతో నిరూపించటం అయ్యేపనేనా? “
దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడేమో.నమ్మితే పోయిందేముంది. ఆయన తో మంచి గా మాట్లాడదాం….అనుకొన్నాడు సుందరం లోలోపల. దేవుడికి సుందరం మనసులోని మాటలు వినపడుతూనే ఉన్నాయి.
“స్వామీ, మమ్మల్ని సృష్టించింది నువ్వే కదా..అంటే, మేము చేసే చెడ్డ పనులకి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా..?”
“నువ్వు నెమ్మది గా ఆస్తికుడివై పోతున్నావనుకొంటా..మీకు స్వేఛ్ఛా సంకల్పం ఇచ్చాను కదా?దానిని పరిస్థితులకి అతీతం గా ఉంచుకోవాల్సిన బాధ్యత మీది కాదా?”
“అంటే, మంచి తో పాటు చెడు చేసే స్వేఛ్ఛ కూడా నువ్వే ఇచ్చావన్నమాట!అసలు మనిషి చెడు చేసే ఆస్కారం నువ్వు కలిగించకుండా ఉంటే పోయేది కదా..? ఆ..అయినా, నువ్విచ్చిన స్వేఛ్ఛా సంకల్పం లో ని స్వేఛ్ఛ నేతి బీరకాయ లోని నెయ్యి లాంటిది లే స్వామీ, అవునూ, ఎప్పటినుంచో నువ్వు కనపడితే అడగాలనుకొంటాను స్వామీ. జనాలకి ఇంత బాధలను ఎందుకు పెడతావు. ప్రళయాలూ, ప్రమాదాలూ ఎందుకు సృష్టిస్తావు? నువ్వు చెడ్డ వాడివా, మంచి వాడివా?”
“నేను మాత్రం కావాలని చేస్తానా?మంచి చెడులు మానవ సమాజాలు సృష్టించినవి. అనిర్వచనీయుడనైన నాకు మీ మంచి చెడులను ఎందుకు వర్తింప చేస్తున్నారు?
“కావాలని చేయవా..? అంటే నీ మీదా ఈ ప్రపంచం మీదా నీకు అదుపు లేదా స్వామీ..?”
“అదుపు అనేది, నియంత్రించటం అనేది మనుషుల లక్షణం కాదా? మీ లక్షణాలని నాకు ఆపాదిస్తే ఎలా?”
“సరే..మరి నిన్ను ఎవరైనా అదుపు చేస్తున్నారా? ఎవరైనా సృష్టించారా?”
“నన్నెవరూ సృష్టించలేదు. నాకు కారణం లేదు.నాకు మొదలు లేదు.చివర లేదు. నేనే అన్నిటినీ సృష్టించాను. అన్నిటిలోంచీ నేను వచ్చాను. అన్నీ నేనే. నేనే అన్నీ. కార్య కారణ సంబంధం మీ ప్రపంచం లోది కదా?”
ఈయనకు మొదలు లేదు, చివర లేదంట. నేనడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా భలే తప్పించుకొంటున్నాడే! అనుకొని, సుందరం, “నీకు మొదలే లేదా? నేను నమ్మను..అదెలా సాధ్యం స్వామీ?”అన్నాడు.
వెంటనే సుందరం కళ్ళముందు వెలుగుతో ఒక వృత్తం ప్రత్యక్షమైంది.
“ఈ వృత్తం చుట్టూ పోతే ఏది మొదలు? ఏది చివర? ప్రతి ప్రదేశమూ మొదలే. ప్రతిదీ చివరే. నీవు ఏది మొదలు అనుకొంటే అదే మొదలు కాదా?”
“నీ ఉదాహరణ ప్రకారం, ప్రతి విషయానికీ ముందు వేరొక విషయం ఆదిగా ఉంది కదా స్వామీ?”
“నా లోకం లో కార్యమూ కారణమూ ఒకే సమయం లో జరుగుతాయి. ఒకే బిందు సమానమైన సమయం లో కాలాలన్నీ ఉంటాయి. ఒక ప్రదేశం లోనే అనేక వస్తువులు ఉంటాయి. “
”ఏంటో! మా క్వాంటం తీరీలూ, స్ట్రింగ్ తీరీలూ చెప్పినట్లు గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంతకీ, నువ్వు ఏ కాలం లో ఉన్నావు స్వామీ?”
“అన్ని కాలాలలోనూ ఉన్నాను. కొండమీది నుంచీ చుట్టుపక్కల చెట్లన్నీ కనపడినట్లే, నాకు కాలాలన్నీ ఒక్క క్షణం లోనే కనపడుతాయి. ఏ కాలాన్నైనా నేను స్పృశించగలను. అన్ని కాలాలలోనూ నేను ప్రవేశించగలను. కాలాన్ని నేను ఆపగలనూ, పరుగులు పెట్టించగలను. అయితే, నా కాలం మీ కాలం కంటే భిన్నమైనది కదా?”
“ఏమిటో స్వామీ, నన్ను గందర గోళం లోకి నెట్టేశారు. నేను మీలా నిన్నటి వస్తువునీ రేపటి వస్తువునీ ప్రస్తుతం ఎందుకు స్పృశించలేను స్వామీ?”
“నీ లోకం లో కార్యమూ కారణమూ వేర్వేరు గా ఉన్నపుడు, “కార్యమైన నీ ప్రస్తుత లోకం లో ఉన్న నీవు కారణమైన నిన్నటిని ఎలా స్పృశించగలుగుతావు?”
“మీరు మాడైమన్షన్లో ఉన్నట్లు అగుపడటంలా.. ఏ ఆరో డైమన్షన్లోనో..ఏడో డైమన్షన్లోనో ఉన్నారా? ఏదేమైనా, కాలాన్నే అదుపు చేయగల మీరు సామాన్యులు కారు”
“ఇందులో మనుషులు చేసినట్లు గా అదుపు ఏమీ లేదు. కాలమూ, లోకమూ, నేనూ వేరు వేరు కాదు. అంతా ఒక్కటే కాదా?”
“మీరు ఎవరైనా నాకు చేతులు జోడించాలనిపిస్తోంది. ఒక్క సారి నాకు కనపడండి స్వామీ!”
“నేను నిర్గుణుడను, నిరాకారుడను, అనిర్వచనీయుడను, అమేయుడను. నన్ను నీవు చూడలేవు. భక్తి అనేది అమిత బలవంతుడైన ఇష్టుడిని చూసినపుడు మనుషులలో కలిగే ఇష్టం తో కూడిన భయం. దీనికీ మనుషుల మనుగడకీ సంబంధం ఉంది. నీ భక్తి కీ నా ప్రత్యక్షానికీ సంబంధం ఏమీ లేదు.నీ చర్మ చక్షువుల తో నన్ను గ్రహించలేవు. దివ్య చక్షువులివ్వటానికి భక్తి ఒక్కటే సరిపోతుందా?”
“సరే స్వామీ, నా ప్రశ్నలన్నిటికీ మీ ప్రశ్నలతో బ్రహ్మాండం గా సమాధానం చెప్పారు. ఒక్క సారి నన్ను మళ్ళీ బతికించండి స్వామీ!. అరే! ఏదీ సమాధానం రాదే? ఆ దేవుడా పాడా. లేనే లేదు.. లేక పోతే నా ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడు?”
కురచదైపోతున్న కాలం
28 నవం 2011 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:short time
నాకు ఒక ఏడెనిమిదేళ్ళ వయసున్నపుడు, నేను మా చుట్టాల ఊర్లో పెరిగాను. తరువాత మా ఊరు వచ్చేశాను.
నేను పెరిగి డిగ్రీ లోకి వచ్చిన తరువాత దాదాపు పదిహేనేళ్ళ కి మళ్ళీ మా చుట్టాల ఊరుకి వెళ్ళాను.
అక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాను. అక్కడి పెరటి గోడలన్నీ కురచవైపోయాయి. నా చిన్నప్పుడు దూరం గా ఉన్న ప్రదేశాలు దగ్గరగా జరిగాయి.
ఇదేంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే నాకు విషయం అర్ధమైపోయింది. పెరటి గోడలు పొట్టివవ్వ లేదు, నేనే బారు పెరిగాను. దూరాలు దగ్గరవ్వలేదు నా కాలే బారు సాగింది.
మనపై కాలం కూడా ఇలాంటి కనికట్టునే చేస్తుంది.
నేను ఎనిమిదో తరగతి లో ఉన్నపుడు, మా నాన్న ని దీపావళి కి బారు లాగూ (పాంటు) కొనిపెట్టమని అడిగాను. దానికాయన,”అప్పుడే వీడికి పాంటు కావలసి వచ్చిందంట, వచ్చేదీపావళి కి కొనిపెడతాలేరా!”, అని విసుక్కొన్నాడు.
నేను, “అమ్మో! పాంటు కోసం ఏకం గా సంవత్సరం ఆగాలా నాన్నా?” అన్నాను.
ఆయన, ” సంవత్సరం ఎంత సేపట్లో వస్తుంది. ఇలా చూస్తూ ఉండగానే గిరుక్కున తిరి వస్తుంది”, అన్నారు.
చిన్నప్పుడు ఎంతో బారు గా అనిపించిన సంవత్సరం ఇప్పుడు నాకు కూడా చాలా కురచ అయిపోయింది. ఎందుకంటే, చిన్నపుడు పన్నెండు సంవత్సరాలు ఉన్న నా మనసు ఎత్తు ఇప్పుడు పెరిగి పోయింది. అది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల ఎత్తుకు పెరిగింది. ఈ ఎత్తు ముందు, సంవత్సరం అనే పెరటి గోడ కుంచించుకొని పిట్టగోడ లా అయిపోయింది.. ఇక నేను యాభై లలోకి అడుగు పెట్టటానికి.నా చిన్నప్పటి లెక్కలో చెబితే…, ఇంకా ఓక సంవత్సరం వ్యవధి కూడా లేదు. త్వరపడాలి లేక పోతే చూస్తూ ఉండగానే వార్ధక్యం లోకి అడుగుపెడతాను.
డర్టీ పిక్చర్, సిల్క్ స్మిత జీవితం,స్త్రీ వాదం, ..కొన్ని ప్రశ్నలూ సమాధానాలు
28 నవం 2011 అభిప్రాయములు
in సమాజం ట్యాగులు:dirty picture, silk smitha life
ఆడవారి అందాలను కమర్షియలైజ్ చేసి అమ్ముకోవటం ఇప్పటిది కాదు. అది మానవ జాతి అంత పాతది.కాకపోతే మన సినిమా వాళ్ళు దానిని మన పాపులర్ కల్చర్ తో మేళవించి మనకు స్లో పాయిజన్ లా ఎక్కిస్తున్నారు.
నేను నా ఫ్రెండ్ ఒకతనిని తో సినిమాల లో సెక్స్ గురించి వాపోతుంటే, అతను “మనం చేసే టప్పుడు లేని తప్పు ఎవరో చూపిస్తుంటే ఏమిటి? ఇది హిపోక్రసీ నే కదా?”, అన్నాడు.
అతని వాదన నాకు మరీ సింప్లిస్టిక్ గా అనిపించి, “హిపోక్రసీ అనేది సామాజిక విలువల కి మాత్రమే వర్తిస్తుంది. మనం నాలుగు గోడల మధ్యా చేసే పనులకి కాదు”, అని చెప్పబోయాను కానీ నా వాదన కి నేనే కన్విన్స్ కాలేదు.
“నెట్లో బూతు సినిమాలు చూసి ఆనందించే ప్రేక్షక సామాన్యానికి సినిమాల లో ని బూతు ని గురించి ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిది?”, అని కూడా అతను అన్నాడు.
నేను, “నిర్మాతలు ప్రేక్షకుల బలహీనతలను క్యాష్ చేసుకొంటున్నారు..”, అన్నాను.
“నెట్లో ఇవన్నీ ఫ్రీగానే వస్తాయి..అయినా నువ్వు నీ అభిమాన హీరో చేసే డాన్సులూ, ఫైట్లూ చూసి ఆనందిస్తావు. ఎవరైనా అది నీ బలహీనత అంటే నువ్వు ఒప్పుకొంటావా? నీ అభిమాన దర్శకుడు తీసిన సినిమా ని నువ్వు ఆనందిస్తావు.అది నీ బలహీనత కాదు. అలానే నీ అభిమాన తార గుడ్డలిప్పి చూపిస్తే నువ్వు ఆనందిస్తావు. ఇది కూడా నీ బలహీనత కాదు”,అన్నాడు.
ఈ మధ్యే ఏదో హిందీ సినిమా లో ఒంటిమీద నూలు పోగు లేకుండా నటించిన నగ్న కళా విదుషీమణి ని ఒక బుధ్ధిలేని విలేఖరి, “మీ సినిమా లో అసభ్యత ఎక్కువయింది అంటున్నారు..?”, అని ప్రశ్నిస్తే ఆమె, “అసభ్యత అనేది చూసే వారి కళ్ళలోనే ఉంటుంది”, అని దబాయించింది.
కొంత మంది నటీమణులు పాత్రస్వభావాన్ని బట్టి ఎక్స్-పోజింగ్ చేస్తున్నామనీ, తాము నిజజీవితం లో పతివ్రతలమనీ చెబుతారు!నిజ జీవితం లో, “లో దుస్తులు” బయటికి కనపడితేనే సిగ్గుతో చితికిపోయే వారు, పాత్రాపరం గా ఎక్స్-పోజింగ్ ఎలా చేయగలరు?ఒక పాత్ర ఎక్స్-పోజింగ్ చేయాలంటే దానిని పోషించే అసలు మనిషి కూడా ఎక్స్-పోజింగ్ చేయాలి కదా!అలానే ఆ వ్యక్తి ఎక్స్-పోజింగ్ ని సినిమా సెట్లోని ఇతర పాత్రల వెనుక ఉండే అసలు మనుషులూ,, టెక్నీషియన్లూ చివరికి ప్రేక్షకుల వెనుక ఉండే అసలు మనుషులూ చూస్తారు కదా? ఒక్క డబ్బు కోసం పాత్రా పరమైన వెధవపనులు చేస్తున్నారంటే, వారు నిజ జీవితం లో కూడా ఇతర ప్రలోభాలకు లొంగి అలాంటి పనులు చేయగలరన్న మాట! ఒక పాత్ర యొక్క దుష్ట స్వభావాన్ని ఆవాహన చేసుకొని నటించటం వేరు. దానికోసం అసలు మనిషి దుష్టుడు గా మారనవసరం లేదు. నిజ జీవితం లో చెడు పనులు చేయనవసరం లేదు. రావు గోపాల రావు,సూర్యకాంతం వంటి వారు సినిమాలలో దుష్ట పాత్రలు వేసినప్పటికినీ నిజ జీవితం లో సాత్వికులుగానే ప్రసిధ్ధి చెందారు.
మానసిక స్థాయి లో అంతర్గతం గా మనలో ప్రతి ఒక్కరి లోనూ అనేక మంచీ చెడూ పాత్రలు ఉంటాయి. నటుడు సందర్భాను సారం గా తన లోని ఈ పాత్రలను ముందుకు తీసుకొని వచ్చి అభినయిస్తాడు.
అంతర్గతంగా ఉన్న మంచి పాత్రను బాహ్యం గా నిజ జీవితం లో మనం పోషించలేక పోవచ్చు, మన వ్యక్తిగత మనుగడ వంటి విషయాలు అడ్డు రావటం వలన. అలానే ,అంతర్గతం గా ఉన్న చెడు పాత్రని నిజ జీవితం లో మనం పోషించలేము. అలా పోషిస్తే పక్క వాడు మనకి దేహశుధ్ధి చేసి పోలీస్ కేస్ పెడతాడు కాబట్టీ. నిజ జీవితం లో మన బాహ్య వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దటం లో మన ఆచరణ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఎక్స్-పోజింగ్ అనే భౌతిక మైన పని నిజం గానూ, పాత్రాపరం గానూ ఒకేసారి జరిగిపోతుంది. రెండిటినీ వేరు చేసి చూడలేము. కానీ వ్యక్తిత్వాన్ని అభినయించటం మానసికమైన పరిధిలోనిది. వేరే వ్యక్తిత్వాన్ని అభినయించి, మళ్ళీ కాసేపటికి తన నిజ జీవితం లో అసలు వ్యక్తి గా అవ్వవచ్చు.
మా చుట్టాలలో ని ఒక ఫెమినిస్టు గారిని, “ఈ అర్ధ నగ్న ప్రదర్శనలు చేసే వారూ ఆడవారే కదా?” అని అడిగాను.
దానికి ఆమె నామీద ఇంతెత్తున లేచి, ” మీ మగాళ్ళే పేద స్త్రీల బలహీనతను ఆసరాగా తీసుకొని వారి చేత ఇలాంటి పనులు చేయిస్తున్నారు”, అంది.
ఎందుకనో నాకు, ” తరతరాల నట వారసులైనటువంటి కరీనా కపూర్లూ, ఇంగ్లాండ్ నుంచీ ఊడిపడే కట్రీనా కైఫ్లూ పేదవారనుకోవటానికి మనసొప్పలా..! కాకపోతే సరదాగా ఖర్చు పెట్టుకోవటానికి ఓ రెండు మూడు కోట్ల పాకెట్ మనీ కోసం ఎక్స్-పోజింగ్ చేస్తే తప్పేమిటి?”, అనిపించింది.
ఇక అసలు విషయానికి వచ్చేద్దాం, ఈ మధ్యే డర్టీ పిక్చర్ ని నిర్మించిన బాలాజీ పిక్చర్స్ అధినేత్రి ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే కదా..?! ఆమె కూటికి గతి లేని పేద రాలు కాదు. కొన్ని వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి రాణి. మధ్య తరగతి విలువలను మనం ఆమె కు అంటగట్ట రాదు.ఆమె ఎగువ తరగతి కి చెందిన ప్రభావవంతమైన స్త్రీ. ఆమె విలువలు డబ్బు చేతా, ప్రాక్టికల్ గా ఉండే సాధ్యాసాధ్యాల చేతా, న్యాయ వ్యవస్థ చేతా , ఆ పై ఆమె వ్యక్తిగత ఇష్టాఇష్టాల చేతా నిర్ణయింపబడతాయి.
ఇక సిల్క్ స్మిత అమలాపురం దగ్గర ఒక పల్లె నుంచీ పొట్టచేత పట్టుకొని మద్రాస్ చేరి, సినిమాలలో శృంగార పాత్రలు వేసి గడుపుకొంది. పాపం, ఏ కష్టమొచ్చిందో ఏమో, ఆత్మహత్య చేసుకొంది. ఆమె శృంగార పాత్రలు తన అవసరాన్ని బట్టి వేసి ఉండవచ్చు. తన కడుపు కోసంకొన్ని అక్రమ సంబంధాలలో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. కానీ ఆమె జీవితం లో కనిపించేది దయనీయత మాత్రమే. శృంగారం ఏ మాత్రం కాదు.
అటువంటి సిల్క్ స్మిత జీవితం లోకి శృంగారాన్ని జొప్పించి డబ్బు చేసుకోవాలనుకొనే ఏక్తా కపూర్ కూడా ఒక స్త్రీనే. కాబట్టీ ధన జాఢ్యానికి లింగ వివక్ష లేదు. ఇది అన్ని తరగతులకీ సమానం గా వర్తిస్తుంది.
మధ్య తరగతినే తీసుకొందాం.టీ వీ ల లో అసభ్య దృశ్యాలు వచ్చినపుడు, “ఛీ.. ఛీ.. వీళ్ళకి అసలు విలువలే లేవు” అనుకోవటం చాలా సులువు. కానీ మన విలువలు వదిలి పెడితే మనకు డబ్బు వచ్చిపడుతున్నపుడు, మనం ఈ విలువల వలువలను వదిలి డబ్బు ఇచ్చిన కొత్త వలువలు వేసుకోవటానికి ఏమాత్రం సందేహించం. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో విప్పి చూపించిన విద్యా బాలన్ గారు మధ్య తరగతి నుంచే వచ్చారు. ఈమె స్టూడియో లో చేసిన ఎక్స్పోజింగ్ చూడలేక ఈమె నాన్న గారు స్టూడియో బయటికి వచ్చి కారులో కూర్చొన్నారంట. ఆహా…! ఏమి మధ్య తరగతి విలువలూ ఎంత హిపోక్రసీ..? హిపోక్రసీ లేనిది ఒకటే ..అది డబ్బు..కాసుకు లోకం దాసోహం.. !
మొత్తానికి..తీసే వాళ్ళు తీస్తున్నారు, చేసే వాళ్ళు చేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు, మధ్య లో మనకెందుకు బాధ? ప్రతి విషయం లోనూ మంచిని చూడాలంటారు..కాబట్టీ ఈ విషయం లో కూడా అలా చూడటానికి ప్రయత్నిద్దాం! పోనీలే.., సిల్క్ స్మిత జీవితం ఏదైనా, ఈ సినిమా వలన బాలాజీ పిక్చర్స్ లో పని చేసే వారికి కొంత కాలం కడుపైనా నిండుతుంది అని సరి పెట్టుకొందాం!
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-1
07 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:bangalore, cab, forum mall, hosur road, news paper, onsite, paper, puli, silkboard, software, telugu story, van
1
రోడ్డు పక్కకి వచ్చి ఆగింది మా సాఫ్ట్ వేర్ కంపెనీ బస్సు. బస్సెక్కి రోజూ కూర్చునే సీట్ లో కూర్చున్నాను.పక్క సీటు లో అప్పటి కే కూర్చున్న వెంకట్ అనబడే వెంకట్ రావ్ తెలుగు పేపర్ నమిలేస్తున్నాడు. ఇంకో ఇద్దరు మలయాళీ అమ్మాయిలు పాట పాడినట్లు గా వుండే మలయాళం లో మాట్లాడుకొంటున్నారు. ఎఫ్ ఎం రేడియో లో నుండి కన్నడ సినిమా పాట సందడి గా వినబడుతోంది. ఇంగ్లీషు పేపరు ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతి లో కి మారుతోంది. ఈ మధ్యనే వేడెక్కడం నేర్చిన బెంగళూరు గాలి ఆటో ల పొగలను కలుపుకొని బస్సు కిటికీ ల నుండి లోనికి చొచ్చుకొని వస్తూ వుంది.
“ఏమిటి వెంకట్ ఈ రోజు న్యూస్?” వెంకట్ ను కదిలించాను నేను.
“ఏమి వుంటుంది? ఏ రోజు న్యూస్ అయినా ఒకటే లా వుంటుంది. గవర్నమెంటు వాడు అపోజిషన్ను తిట్టుడూ …. అపోజిషనోడు గవర్నమెంటు ను తిట్టుడూ వగైరా వగైరా… ఇప్పట్నుండీ రెండు సంవత్సరాల తరవాతి న్యూసు కూడా ఇప్పుడే గెస్ చేసి చెప్పొచ్చు. కాని ఈ పేపర్ వాడికి మాత్రం బోరు కొట్టదు”.
“నీకు బోరు కొడితే పేపర్ ఎందుకు కొన్నావు?” నవ్వాను.
”మల్ల పేపర్వాడు ఎట్లా బతుకుతాడు?” వెంకట్ కూడా నవ్వాడు.
“ఈ బతుకు చూస్తుంటే హాయి గా మా పల్లె కి పోయి వ్యవసాయం చేసుడు బెటర్ అనిపిస్తోంది,” అన్నాడు వెంకట్.
“మరి ఆ పనే చెయ్యక పోయావ్?” మెల్ల గా నవ్వుతూ అన్నాన్నేను.
” అదే ఆలోచిస్తున్నాను. ఊళ్ళో వున్నప్పుడు కమ్మ గా అమ్మ చేతి వంట తినే వాడిని. షికార్లూ… ఫ్రెండ్స్ తో బాతాకానీ…ఏమి లైఫ్ లే…అప్పుడు ఒక్క పైసలే వుండేటివి కాదు. ఇప్పుడు పైసలున్నై …కాని లైఫ్ మాత్రం లేదు..టైం అసలే లేదు.”
“ఒక సన్నటి ఇరుకు రోడ్ లో ట్రాఫిక్ లో చిక్కుకొంది మా కాబ్. వెంకట్ బయటకు చూస్తూ సాలోచనగా అంటున్నాడు “ఇక్కడ సిటీ అంతా దుమ్ము…పొగ…క్వాలిటీ అఫ్ లైఫ్ అస్సలు లేదు.”
“ఊళ్ళో ఉండే బాధలు ఇప్పుడు నీకు తెలియవు. అక్కడ ఉండే కష్టాలు అక్కడా వుంటాయి. ఊళ్ళో ఉన్న వాళ్ళేమో వాళ్ళది ఎదుగూ బొదుగూ లేని జీవితమనే అసంతృప్తి తో ఉంటారు. ఒక్కసారి ‘జాబ్ రాక ముందు మన జీవితం ఎలా వుండేదో గుర్తు తెచ్చుకో !”
బస్సు ఫోరం మాల్ ముందు ఆగింది. మాల్ ముందు అమ్మాయిలూ అబ్బాయిలూ గుంపులు గా వున్నారు. వాళ్ల హెయిర్ స్టైల్ నుండి నెయిల్ స్టైల్ వరకు అంతా మూస పోసినట్లు ఒకే విధం గా ఉంది. బహుశా ఊళ్ళోని బ్యూటీ పార్లర్లు అన్నీ ఒకే కోర్సు ఫాలో అవుతున్నాయేమో…! వాళ్ల హావ భావాలు కూడా అమెరికా లో మాస్ ప్రొడ్యూస్ అయినట్లున్నాయి. అమ్మాయిలయితే, మోహానికీ గోళృకీ జుట్టు కీ పెదాలకూ కళ్ళ చుట్టూ రంగుల తో కలర్ ఫుల్ గా ఉన్నారు. ఇద్దరమ్మాయిలూ ఇద్దరబ్బాయిలూ మా కాబ్ ఎక్కారు.
“హావ్ యు జాయిన్డ్ న్యూలీ?” వాళ్ళలో ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి ని అడుగుతున్నాడు.
“ఉహు”, ఆ అమ్మాయి నిట్ట నిలువు గా తల ఊపింది. తరువాత కొన్ని సెకన్ల వరకు ఆ తల అలా వూపుతూనే ఉంది. ఆ అమ్మాయి గెస్చర్ కి అమెరికన్ లో అయితే అవును అని అర్థం. తెలుగు లో మాత్రం “అలానా!” అని అర్థం.
“మా కాబ్ సిల్క్ బోర్డు దాటి బొమ్మనహళ్లి గుండా హోసూరు రోడ్ మీద పోతోంది. రోడ్ మీద ట్రాఫిక్ చుస్తే బెంగళూరు జనాలంతా ప్రాణ భయం తో పారిపోతున్నంత హడావిడి గా ఉంది. కంటి కి కనిపించినంత మేర దుమ్ము తెరలు లేస్తున్నాయి. ఆ గడబిడ లో ఎక్స్ ప్రెస్ వే కోసం వేసిన పిల్లర్లు మాత్రం స్థిరం గా తాపీ గా నుంచొని ఉన్నాయి.
కంపెనీ బస్సు ల వెనక డ్రైవర్ రాష్ గా డ్రైవ్ చేస్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ నంబర్లు రాసి వున్నాయి. కానీ, అన్ని కంపనీ ల బస్సులూ రాష్ గానే పోతున్నాయి. “నోటితో నవ్వి, నొసటి తో వెక్కిరించటం” అంటే ఇదేనేమో..!
మా కంపెనీ బస్సు ఇంకో కారు ని మెల్ల గా డీ కొట్టింది. మా కాబ్ డ్రైవర్ కిందికి దిగి కన్నడం లో బిగ్గర గా అరవడం మొదలు పెట్టాడు. అవతలి కారు లోని వ్యక్తి కి కన్నడం రానట్లుంది. ఏదో కంపెనీ ఎగ్జిక్యూటివ్ లా వున్నాడు. అతను ఇంగ్లీష్ లోనూ అప్పుడప్పుడూ హిందీ లోనూ ఏదో అరుస్తున్నాడు. వెనక ఉన్న కార్లూ బస్సులూ అసహనం గా హారన్ లు మొగించటం మొదలు పెట్టాయి. హాంకింగ్ దెబ్బకి డ్రైవర్ లు ఇద్దరూ సర్దుకొని మళ్ళీ డ్రైవింగ్ మొదలు పెట్టారు. ఈ సీన్ చుస్తే ఆఫీసు ప్రాజెక్టు లోని రిస్క్ ఆక్తివిటీస్ గుర్తుకు వచ్చాయి. నిజ జీవితం లోని ఈ ‘ఆక్సిడెంట్ రిస్కు’ ఎప్పుడు పోతుందో కదా…! నా సెల్ ఫోన్ రింగ్ అవుతోంది…సెంథిల్ కుమార్ ఫోను….తను రావటం రెండు నిమిషాలు లేటు అవుతుందట …కాబ్ ని బొమ్మనహళ్లి లో తను వచ్చే వరకు ఆపమని. సెంథిల్ వచ్చాక కాబ్ స్టార్ట్ అయింది.
వెంకట్ హోసూర్ రోడ్ ని చూస్తూ మళ్ళీ మొదలు పెట్టాడు. “ఇక్కడ రోడ్ లు ఘోరం గా వున్నాయి..గవర్నమెంట్ అస్సలు పట్టించుకోవడం లేదు. కొత్త సీఎం రోడ్లు వేయించుతా అంటున్నాడు. కానీ ఈ పొలిటిశియన్ ల ని నమ్మలేం ర భాయి. ఈ రోజు ఒక మాట చెప్తే రేపొక మాట చెప్తారు. ఈ రోజు ఒక పార్టీ ల వుంటే రేపు వేరే పార్టీ కి జంప్ అయితారు.”
“అవునూ …వెంకట్ మొన్న వేరే కంపెనీ లో ఆఫర్ వచ్చిందని అన్నావు. ఎం చేస్తున్నావ్.. జాబు మారతావా…?” వెంకట్ మాటల తో నాకు అతనికి వచ్చిన ఆఫర్ గుర్తుకు వచ్చింది.
“చూడాలె మన కంపెనీ వాడు యూఎస్ పంపించుతా అంటుండు . పంపించక పోతే అప్పుడు రిజైన్ చేస్తా.. .. అన్నట్టూ నువ్వు కూడా సాఫ్ట్వేర్ నుండి వేరే ఫీల్డ్ కి మారుతా అంటున్నావు కదా, దాని సంగతేమయింది ?” నన్నడిగాడు వెంకట్.
“నాకు మారాలనే ఉంది. కాని కుదరక పోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ జాబు పులి మీద స్వారీ లాంటిది. జాబు లో జాయిన్ అయిన కొత్తల్లో చాలా నే డబ్బు కనిపిస్తుంది . నెమ్మది గా ఖర్చులు పెరుగుతాయి. కారు లోను, హౌస్ లోను ఈఎమ్మై కట్టాలి. వాటి కోసం జాబు చేస్తూనే ఉండాలి……నువ్వు ఇప్పుడు యూఎస్ వెళ్తా అంటున్నావ్.. మీ వూరు వెళ్లి వ్యవసాయం చేసే ప్లాన్ మానుకోన్నట్లేనా? ..” అన్నాను వెంకట్ తో.
“అరే….అదో పెద్ద టాపిక్. ఇప్పుడు టైం లేదు. మల్ల సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు మాట్లాడుదాం ….”
” ఈ లోగా మా కాబ్ ఎలక్ట్రానిక్స్ సిటీ లోని మా ఆఫీసు ముందు ఆగింది. వెంకట్ వాన్ దిగి గేటు దగ్గరికి వెళ్లి కార్డు స్వయిప్ చేశాడు . తర్వాత నేనూ స్వయిప్ చేశాను . నా తరవాత చాలా మంది స్వయిప్ చేస్తున్నారు….”కిక్ కీక్……కిక్….కీక్ ” స్వయిప్ మెషిన్ తన పని తాను చేసుకు పోతోంది. నేను నా క్యూబ్ కి వెళ్లి సీట్ లో కుర్చొని సిస్టం ఆన్ చేశాను.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-2
10 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:aata, arugu, full meals, gede, kancherlagopanna, kavvam, muggu, plate meals, polam, ramadasu, taaneeshaa, venkatapuram, vesavi, village
2
కృష్ణా రావు గారిల్లు మంచి సందడి గా ఉంది. వేసవి కాలం సెలవలవడం తో కృష్ణా రావు గారి తమ్ముడు శ్రీనివాస రావూ, శ్రీనివాస రావు భార్య సరోజా, వాళ్ళబ్బాయి రఘూ వచ్చారు.శ్రీనివాస రావు గన్నవరం లో టీచర్ గా పని చేస్తున్నాడు.సరోజ కూడా టీచరే . రఘు వాళ్ళమ్మ బడి లోనే మూడవ తరగతి చదువుతున్నాడు.
కృష్ణా రావు ఒక చిన్నకారు రైతు. ఆయన భార్య చంద్రమ్మ…కృష్ణా రావు కి ఆమె మరదలు కూడా. చంద్రమ్మ కి మూర్ఛ రోగం వుంది…చదువు లేదు..అమాయకురాలు.. అందువల్లే వాళ్ల తాత కి ఆమెను బయటి సంబంధానికి ఇవ్వటం ఇష్టం లేక, కృష్ణా రావు తో చంద్రమ్మ ను పెళ్లి చేసుకొమ్మని చెప్పాడు.తాత మాట కి ఎదురు చెప్పటం అలవాటు లేని కృష్ణా రావు, ఆ విధం గానే ఆమె ను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. కవితా శ్రీధర్….కవిత శ్రీధర్ కంటే రెండేళ్ళు పెద్దది.
రఘు రావడం తో శ్రీధర్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. వాడు రఘు ని వెంటేసుకొని ఊరంతా తిరిగి వస్తున్నాడు. పగలంతా వాళ్ళిద్దరూ ఊళ్ళోని పొలాలు, తోటలు, తోపులూ కలియ తిరిగి ఈత కాయలూ, చీమ చింత కాయలూ, ముంజి కాయలూ తిని సాయంత్రం అయ్యే సరికి ఊరి పిల్లలతో బిళ్ళంగోడు ఆట మొదలెట్టారు.
మసక పడటం తో కవిత తమ్ముళ్ళని ఇద్దరినీ పిలుచు కొని వచ్చింది. రఘూ శ్రీధర్ ల తో పాటు ఊళ్ళోని వాళ్ల ఫ్రెండ్స్ ఇద్దరు వాళ్ల వెంటే వచ్చారు. వాళ్లు కవిత తో “కవితక్కా… కవితక్కా.. మరే కతేమన్నా చెప్పవా?” అన్నారు.
కవిత పిల్లలను దగ్గరేసుకొని “కథ కాదు కానీ పొడుపు కథ చెబుతాను” అంటూ మొదలు పెట్టింది.
“అడవి లో పుట్టింది
అడవి లో పెరిగింది
మా ఇంటి కొచ్చింది
తైతక్కలాడింది”
“ఏమిటి అదీ?” కవిత అడిగింది.
రఘు పొడుపు కథ సగం లోనే కవిత తో గొంతు కలిపి కవిత అడగ గానే చెయ్యెత్తి “నాకు తెలుసు…అదీ కవ్వం” అన్నాడు.
కవిత రఘు వైపు మెచ్చుకోలు గా చూసి “నాకు తెలుసు…నువ్వు చెప్తావని” అంది.
ఊరి పిల్లలలో ఒకడు “కవితక్క రఘు కి ముందే చెప్పింది” అని ఆరోపించాడు.
రఘు మూతి ముడిచి “ఏమీ కాదు బాబూ.. మా తెలుగు మాస్టారు చెప్పారు. మా మాస్టారికి ఇంకా బోలెడు కథలు వచ్చు” అన్నాడు.
ఇంతలో శ్రీధర్ అందుకొని ” ఈ పొడుపు కథ కి జవాబు కవ్వమే ఎందుకవ్వాలి, పప్పు గుత్తి కూడా కావచ్చు కదా?” అన్నాడు.
కవిత రెండు చేతులూ ముడిచి “ఒరేయ్…నీ అతి తెలివికో నమస్కారం బాబూ..” అని వ్యంగ్యం గా అంది. దక్షిణపక్క నుంచీ వేప చెట్టు మీదు గా పైర గాలి సాగింది. చల్ల గా నెమ్మది గా వీస్తున్న ఆ గాలి మనసుల్నీ శరీరాలనూ కూడా దూది పింజ లా తేలిక పరుస్తోంది.
సరోజ దీపపు గాజు ని ముగ్గు పిండి తో శుభ్రం చేసి దీపాలు పెడుతోంది. క్రిష్ణారావూ శ్రీనివాస రావూ అరుగు మీద కూర్చొని కాలువల రాక గురించీ గ్రామ రాజకీయాల గురించీ పిచ్చా పాటి గా మాట్లాడుకొంటున్నారు.
రఘు పిల్లలని జనరల్ నాలెడ్జి ప్రశ్నలడగటం మొదలు పెట్టాడు. “మన ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు?”
“ఆ….జ్ఞానీ జెయిల్ సింగ్ “, కవిత చెప్పింది.
” ఈ లోపు కృష్ణారావు గారి అమ్మ సీతమ్మ గారు, ముగ్గు వేయమని కవితకు పురమాయించి సరోజ తో అంటోంది “ఇది ముగ్గులు పొందిక గా వేస్తుంది.” ఆమె కు ముగ్గురు పిల్లల లో కవిత అంటే ఒక్క పిసరు ఇష్టం ఎక్కువ .
శ్రీనివాస రావు అంటున్నాడు కృష్ణారావు తో, “ఎన్ టి రామారావు గెలుస్తాడని ఎవరూ అనుకోలేదు. ఏదో సినిమా వాడిని చూడటానికి జనాలు వస్తున్నార్లే అనుకున్నారు …”
“మన ప్రెసిడెంట్ అప్పుడే తెలుగుదేశం లోకి దూకేశాడు. చూడబోతే ఈ తెలుగు దేశం వాళ్లదీ మూడ్నాళ్ళ ముచ్చట లానే ఉంది.” కృష్ణా రావు అన్నాడు.
తరువాత అన్నదమ్ములిద్దరూ ఊరి అరుగుల మీదికి వెళ్లి అప్పటికే వచ్చి వున్నా గ్రామస్థులతో కబుర్లలో పడ్డారు.
నలభై ఏళ్ళు గా కమ్యూనిస్ట్ లు సాధించలేని పని రామారావు సాధించాడు అంటున్నారు కొందరు. ఇది జనాల సినిమా బలహీనత వలెనే జరిగింది అంటున్నారు ఇంకొందరు. కొత్త సీసా లో పాత సారా లాంటిది, కొన్నాళ్ల తరువాత ఇదీ కాంగ్రెస్ లానే తయారవుతుంది అంటున్నారు మరి కొందరు. ఊరి ప్రెసిడెంట్ అప్పుడే రామారావు జపం మొదలు పెట్టాడు. రాజకీయ చర్చలు వాడి గా సాగుతున్నాయి.
ప్రసూనంబ గారి పాలేరు ఒక చిన్న సంచి నిండా నిమ్మకాయలు తెచ్చాడు. ఈ సంవత్సరం వాళ్ల దొడ్లోని నిమ్మ చెట్టు విరగ కాసింది. సీతమ్మ గారు ఆ నిమ్మ కాయలు తీసుకొని అదే సంచి లో మామిడి పిండాలు పోసి ఆ పాలేరు కిచ్చింది.
వంట అవ్వడం తో చంద్రమ్మ మగవాళ్ళ ని ఇద్దరినీ పిలుచుకు రమ్మని’ శ్రీధర్ ని అరుగుల దగ్గరికి పంపించింది. అన్నదమ్ములిద్దరూ ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్నారు.వాళ్ల తో పాటు పిల్లలు ముగ్గురూ కూడా కూర్చున్నారు. చంద్రమ్మ గారూ సరోజా వడ్డించ సాగారు. చంద్రమ్మ విత్తులు తీసిన చీమ తుమ్మ పప్పులతో కూర చేసింది. కూర రుచి గా వుండటం తో అందరూ భోజనాలు త్వర గా నే కానిచ్చారు.మగ వాళ్ల పళ్ళాలు కడిగి ఆడవాళ్ళూ వాటి లో భోజాలు చేయడం మొదలు పెట్టారు.
భోజనాల తరువాత సీతమ్మ గారు ఆరు బయట రెండు చాపలు పక్కపక్కనే వేసి పిల్లల్ని ముగ్గుర్నీ తన చుట్టూ పడుకో పెట్టుకుని భక్త రామదాసు కథ చెప్పా సాగింది. మధ్య మధ్య లో కథను బట్టి పద్యాలు పాదోతోందామే. పిల్లలు ఊఁ కొడుతూ వినసాగారు. కథ మధ్య లో శ్రీధర్ కి ఓ సందేహం వచ్చింది. “నాయనమ్మా! తానీషా కి శ్రీరాముడు కనపడకపోతే రామదాసు ఖైదు లోనే వుండే వాడా?”
“శ్రీ రాముల వారు భక్తజన సంరక్షకుడు. ఆయనే ఏదో ఒక విధం గా రామదాసును విడిపించేవాడు రా నాయనా..!” అంది సీతమ్మ గారు.
పిల్లలందరూ ఒక్కొక్కరే నెమ్మది గా నిద్రలోకి జారు కొన్నారు. పెద్ద వాళ్లందరూ తలవాకిట్లోకి చేరారు. మండువా ఇంటి తలుపులు తెరిచే వున్నాయి. సరోజ అడుగుతోంది కృష్ణారావు ని “బావ గారూ, ఇంటి తలుపులకి తాళాలు వేయరా?”.
“ఆ.. దొంగోడు వచ్చినా ఏమి వున్నయిలే అమ్మా మనింట్లో దోచుకు పోవటానికి,” అని తలుపులు దగ్గర గా వేసి వచ్చి మేను వాల్చాడు కృష్ణా రావు.
****************
మరుసటి రోజు కృష్ణా రావు కి బందరు వెళ్లాల్సిన పనిబడింది. పాత ఆస్తి తగవుల గురించి జిల్లా కోర్టు కు హాజారు కావలసి వచ్చింది ఆయనకు.
ఆయనకు ఓ రెండెకరాల మాగాణీ ఇంకో రెండెకరాల మామిడి తోటా ఉన్నాయి. మాగాట్లో మొదటి పంట గా వరి పండుతుంది. రెండో పంట అపరాలు అవుతాయి. వర్షాకాలం లో మామిడి తోట లో కందులు పండిస్తారు. ఉన్నంత లో నే అప్పు చేయకుండా పొడుపు గా సంసారాన్ని లాక్కొస్తున్నాడాయన. అయితే, రేవు గట్టున వున్న జామ తోట, మూడెకరాలది, దాయాదుల మధ్య కోర్టు కేసు లో నలుగుతోంది. దానికోసమే పట్నం వెళ్ళాల్సి వచ్చింది ఆయనకు.
మాళీ గేదె కు కొత్త గా పుట్టిన తువ్వాయి ని పరిగెత్తిస్తున్న చిన్నూ అనబడే శ్రీధర్ కి కృష్ణా రావు పట్నం వెళ్తున్నాడనే విషయం చెవిన పడనే పడింది. దాంతో తనూ బందరు వస్తానని పట్టుపట్టాడు వాడు. కృష్ణా రావు కి వాడి ని కూడా తీసుకొని వెళ్లక తప్పింది కాదు.
కోర్టూ, అక్కడి బంట్రోతులూ లాయర్లూ కక్షి దారులూ అంతా ఓ వింత లోకం లా అనిపించారు చిన్నూ గాడి కి. బందర్లో ఆర్నెల్ల ముందు విడుదలైన సినిమాలు కాక, రోజూ పత్రికల్లో చూసే “నేడే విడుదల!” సినిమాలు ఆడటం నచ్చింది వాడికి.
ఒక బస్తీ కి రావటం వాడికి అదే మొదటి సారి కావడం తో అక్కడి రోడ్లనీ మనుషుల్నీ శాపు లనీ విచ్చిన కన్నులతో చూశాడు వాడు.కొంత మంది ముస్లిం స్త్రీలు పరదా వేసుకోవడం వాడికి వింత గా అనిపించింది.
మద్యాహ్నం అయ్యే సరికి కోర్ట్ పనులు ముగిశాయి. ఓ హోటల్ కి భోజనాని కి వెళ్ళారు కృష్ణా రావూ చిన్నూ. కృష్ణా రావు చేతులు కడుక్కొంటూ ఉండగా చిన్నూ ఓ కుర్చీ లో కూర్చున్నాడు. వెయిటర్ వచ్చి ఏం కావాలో చెప్పమన్నాడు. ఏమి ఉన్నాయో చెప్పమన్నాడు చిన్నూ. వెయిటర్ ఉన్న పదార్థాల పేర్లన్నీ వరుస గా, యాంత్రికం గా ఒప్పచెప్పటం మొదలు పెట్టాడు. చాలా తమాషా గా అనిపించింది వాడి కి. ఆ వెయిటర్ ని చూస్తే వాడి కి వాళ్ల బాబాయి
తెచ్చిన “కీ ఇస్తే మోగే కుక్క” గుర్తుకు వచ్చింది. అయితే వాడు అలా పదార్థాల పేర్లు ఒప్పచెప్పటం చూసి చిన్నూ కి కొంచెం దిగులు వేసింది.
“నాకు భోజనం కావాలి ” అన్నాడు చిన్నూవాడితో .
“ప్లేట్ మీల్సా ? ఫుల్ మీల్సా ?” వెయిటర్ వాడిని అడిగాడు.
“అంటే?” వాడన్నది అర్థం కాక అడిగాడు చిన్నూ.
ఇంతలో కృష్ణా రావు వచ్చి వెయిటర్ కి ఆర్డర్ చెప్పాడు చెప్పాడు.
” ప్లేట్ మీల్స్ అంటే ఏమిటి ?” చిన్నూ వాళ్ల నాన్నని అడిగాడు.
“ప్లేట్ మీల్స్ అంటే ఒక ప్లేట్ నిండా మాత్రమే అన్నం ఇస్తారు”
“మరి, ఆకలయ్యి ఇంకా తినాలనిపిస్తే?”
“దానికి ఎక్కువ డబ్బులు కట్టాలి. దాన్నే ఫుల్ మీల్స్ అంటారు”.
ఈ ప్లేట్ మీల్స్ కూడా చిన్నూ దిగులు ను ఎక్కువ చేసింది.
కృష్ణా రావు ఇంటి కి కావలసిన వెచ్చాలు కొని, వెంకటాపురం తిరుగుముఖం పట్టాడు, చిన్నూ తో సహా…
ఇంకా వుంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-3
11 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:ALT+TAB, code, e-mail, joke, report, snacks
3
నేను కూడా మెయిల్స్ చెక్ చెయ్యటం మొదలెట్టాను. ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమీ లేవు. నా ఫ్రెండ్ ఒకడు ఓ మెయిల్ ఫార్వర్డ్ చేశాడు. “హౌ టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఎట్ వర్క్ ప్లేస్?” అని వుంది . క్లిక్ చేశాను.
“ఆర్ యూ ఇన్ ఆఫీస్ ?” అని అదిగిందది.
” యస్ ” సెలెక్ట్ చేశాను.
“డోంట్ వేస్ట్ యువర్ టైం బై రీడింగ్ మెయిల్స్ లైక్ దిస్”,అని తిట్టింది.
” హా… హా…హా..”
ఇంటర్నెట్ నుంచీ ఈనాడు, హిందూ పేపర్లు ఒపెన్ చేశాను. పేపర్లో వార్తలు అన్నీ ఎక్కడో విన్నట్లే వున్నాయి. ఎక్కడ విన్నానబ్బా? ఓ..రాత్రి టీవీ లో ఇవే వార్తలు చూశాను కదూ….అయినా మళ్ళీ చదువుదాం పోయేదేముంది?
“బ్రేక్ ఫాస్ట్ కి పోదాం వస్తావా?”, నా పక్క సీటు గణేష్ అడుగుతున్నాడు.
“ఒక్క నిమిషం “, ఒక అర సెకన్ లో సిస్టం లాక్ చేసి బయలుదేరాను.
క్యాంటీన్ లో తెలుగు వాళ్ళో గుంపు గా కన్నడిగులో గుంపు గా..ఇలా నానా భాష ల వాళ్ళూ నానా గుంపులుగా చేరి మాట్లాడుకొంటున్నారు. ప్లేట్లు తీసుకొని తెలుగు గుంపులో కలిశాం మేము. అందరూ వాళ్ళ ప్రాజెక్టు ల్లోని చిత్రాల గురించి విచిత్రమైన కబుర్లు చెబుతున్నారు. కాసేపు బాస్ ల ను
తిట్టుకొన్న తరవాత పోలిటిక్స్ పైకి మళ్ళింది గాలి. పొలిటిషియన్స్ ని కూడా ఒక రౌండ్ తిట్టుకున్న తరవాత గ్రూప్ లో ఎవరో వాచ్ చూసుకొన్నారు.
“ఓ మై గాడ్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది…పదండి…పదండి…”
సీట్ కి వస్తూంటె మనీషా ఎదురుపడి నవ్వింది.
“హాయ్ మనీషా..”
“హాయ్ శ్రీధర్”, అని రెచ్చగొట్టేటట్లు నవ్వుతోంది….తప్పు….తప్పూ అమె మామూలు గానే నవ్వి వుండవచ్చు. నాకే అలా కనిపించి వుండవచ్చు…
సీట్ లో కూర్చోగానే ఆనంద్ వచ్చి “హౌ ఆర్ థింగ్స్ మేన్?” అన్నాడు. అతను మా ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్త్ స్టేటస్ ఎలా వుంది అని అతని వుద్దేశం.
నేను ఆనంద్ ని చూడగానే “”ఆల్ట్ +టాబ్” కొట్టీ హిందూ పేపర్ మాయం చేశాను.
ఈ ఆనంద్ గాడొక తలకాయనొప్పి ఘటంగాడు…
“హాల్ఫ్ ది హాంగ్ ఓవర్ ఈజ్ డౌన్ నౌ…లాస్ట్ నైట్ ఐ బూజ్డ్ హెవిలీ యు నో..” అని నా నాలిక చివరి దాకా వచ్చింది గానీ చివరి క్షణం లో “థింగ్స్ ఆర్ గుడ్” అని మానేజ్ చేశాను.
“ప్లీజ్ కంప్లీట్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు మీ బై ఈఓడీ”, వాడు మాట్లాడిన మాటలకీ వాడి ఫేసు లో ఎక్స్-ప్రెషన్ కీ ఏ మాత్రం సంబంధం లేదు. వాడి ఎక్స్-ప్రెషన్ “చెప్పిన పని చెయ్యక పొతే బయటికి గెంటుతాను” అన్నట్లు వుంది. అదే వాడి ప్రత్యేకత.
ఆనంద్ వెళ్ళిన తరవాత ఆల్ట్+టాబ్ కొట్టి మళ్ళీ పేపర్ చదవటం మొదలు పెట్టాను. పేపర్ చదివే సరికి మధ్యాహ్నం పన్నెండయ్యింది. ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ చూడటం మొదలు పెట్టాను. మధ్యలో పక్క ప్రాజెక్ట్ శరత్ వచ్చాడు. వాడేదో జావా డౌట్ ని వెంటపెట్టుకుని వచ్చాడు. వాడి డౌట్ తీర్చేసరికి ఒంటిగంటయ్యింది.
“ఛా.. టైం అంతా వేస్ట్ ఇవాళ…లంచ్ తరవాతన్నా చదవాలి…”
నా రోజూ వుండే గాంగ్ తో కలిసి కాంటీన్ కి బయలుదేరాను.
ఫుడ్డు రోజూ లానే చెత్త గా వుంది. ఈ లంచ్ వారం రోజులు తినగానే బోర్ కొడుతుంది…మళ్ళీ కొత్త కాటరర్ వస్తే కొన్ని రోజులు బాగుంటుంది…తరవాత కొన్ని రోజుల కి మళ్ళీ మామూలే. అదే అమ్మ చేతి వంటయితే బోర్ కొట్టదు..ఎందుకో?
ఆఫీస్ గాసిప్ తో టైం తెలవ లేదు. ఎవరు రిజైన్ చేసిందీఎవరు కొత్తగా జాయిన్ అయిందీ…బాస్ లు ఎంత అన్-రీజనబుల్ గా ప్రెజర్ పెడుతున్నదీ వెలిగ్రక్కాక అందరం మళ్ళీ ఆఫీస్ కి బయలు దేరాం.
ఆనంద్ టీం మెంబర్స్ అందరికీ మీటింగ్ రిక్వెస్ట్ పంపాడు . “రెండున్నరకి మీటింగ్ …సారీ ఫర్ ది షార్ట్ నోటీస్” అని దాని సారంశం. నాకైతే ఆ చివరి ముక్క “ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ ” అన్నట్లు కనపడింది. టీం మీటింగ్ షార్ట్ గా వుంటుందని చెప్పి రెండు గంటలు చేశాడు ఆనంద్.
నాలుగున్నరకి మళ్ళీ సీట్ లో కొచ్చేసరికి స్నాక్స్ టైం అయ్యింది. స్నాక్స్ తిని కోడ్ చూడటం స్టార్ట్ చేశాను.
కొడ్ కాంప్లెక్సిటీ, సైజ్ గురించి ఓ డాక్యుమెంట్ తయారు చేసి ఆనంద్ కి మెయిల్ పంపించేసరికి సాయంత్రం ఐదూయాభైఅయిదు అయింది.
ఇంటికెళ్ళే బస్ ఆరు గంటలకే. వడి వడి గా నడిచి వెళ్ళి బస్ లో కూర్చుని ఆఫీస్ నుంచి బయటకు వచ్చే జనాలను అబ్సర్వ్ చేయసాగాను. అమ్మాయిలూ అబ్బాయిలూ కూడా తమకు అటెన్షన్ సరిపోవటం లేదు అన్నట్లు డ్రస్ చేసుకొని వున్నారు. ఆరు గంటలకి మా తొమ్మిదో నంబరు కాబ్ బయలు దేరింది ఇంటికి.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-4
11 అక్టో 2011 1 వ్యాఖ్య
in కథలు ట్యాగులు:arugulu, chiranjeevi, irrigation canal, karanam, munasab, nagulu, paamu, polam, raajakeeyaalu, RSS, shock, snake, sprayer
4
నాగులు కి ఇరవై ఏళ్ళు. వాడి కి పదేళ్ళున్నప్పుడు వాళ్ళ నాన్న వీరడు నాగుల్ని కృష్ణా రావు గారింట్లో కమతానికి పెట్టాడు. కృష్ణా రావు కి అప్పటి నుండీ ఇప్పటి దాకా వాడి వలన ఏ సమస్యా లేదు. ఫైగా అనేక సమస్యలకి నాగులే పరిష్కారం. వాడు చాలా నిదానస్తుడు,పనిమంతుదూ మెతక మనిషీనీ. రెండేళ్ళ క్రితం మాళీ గేదె చనిపోయినప్పుడు వాడు కంట నీరు పెట్టడం ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా గుర్తు చేసుకొంటారు.
రోజూ పది గంటలకి భోజనం పెడుతుంది చంద్రమ్మ. ఇవాళ వాడికి “రాత్రి మిగిలిన చద్దన్నం” పెట్టిందామె. అప్పుడే పొయ్యిమీదనుంచీ దింపిన కూర వేసింది. మంచి ఆకలిమీద వున్న నాగులుకి అది ఏ మూలకీ సరిపో లేదు.
“ఎలా ఉంది రా నాగులూ కూర?” పమిటకి చేతులు తుడుచుకుంటూ అడిగిందామె.
“బెమ్మాండం గా ఉందండి. మీరు చేస్తే బాగోకపోవటమేంటండీ?” చంద్రమ్మ చేత భోజనం ఎలా పెట్టించుకోవాలో నాగులికి బాగా తెలుసు.
చంద్రమ్మ ముఖం వెలిగిపోయింది.కూర మరికొంచం వేసింది. మరి కూరలోకి అన్నం కావాలికదా? అప్పుడే ఎసరు వంచిన అన్నం కూడా పెట్టింది.
భోజనం అయిన తరవాత పొలం లో ఉన్న కృష్ణా రావు కోసం టిఫిన్ బాక్స్ కట్టి, తీసుకొని వెళ్ళమని నాగులు కి ఇచ్చింది చంద్రమ్మ.
నాగులు బయలుదేరుతూ “బాబూ..చేలోకొస్తావా?” అని అడిగాడు శ్రీధర్ ని. కుడి చేత్తో లాగూ ఎగబీక్కొని, ఎడమ చేతిని వెనక్కి తిప్పి కారే ముక్కు తుదుచుకొంటూ నాగులు తో పాటు బయలుదేరాడు వాడు.
ఇద్దరూ పొలాలకి అడ్డు పడి కాసేపూ, పొలాల గట్ల మీద కాసేపూ నడుస్తూ కృష్ణా రావు గారి పొలం వైపుకు పోతున్నారు. అప్పుడే పాలు పడుతోన్న వరి కంకులు శీతా కాలపు చల్ల గాలికి తలలాడిస్తున్నాయి. దూరం గా మోటారు స్ప్రేయర్ తో పొలాలకి మందు కొడుతోన్న శబ్దం గాలి తో పాటు చెవులను తాకుతోంది. పక్క మాలపల్లి లో పెట్టిన లౌడ్ స్పీకర్ లోంచీ తెలుగు సినిమా పాటలు గాలి వాటం గా, కాసేపు బిగ్గరగా, కాసేపు నెమ్మది గా వినపడుతున్నాయి.
కాలువ గట్టు మీది సర్వీ చెట్లు దెయ్యల్లా గుస గుస లాడుతున్నాయి. కాలువ నిండు గా పారుతోంది. గట్టు మీది టెలిఫోన్ స్తంభాల్లో నుంచీ తీగ మీటినట్లు గా సవ్వడి వస్తోంది. శ్రీధర్ టెలిఫోన్ స్తంభానికి చెవి ఆనించి వినసాగాడు. నాగులు వాడిని “శాక్ కొడుతుంది బాబూ” అని వారించాడు.
ఆ మధ్య వరకూ కాలవ మీద తాటి మాను ఉండేది. కాలవ దాటాలంటే ఆ తాటి మాను మీద గా జాగ్రత్త గా నడుచుకొని వెళ్ళవలసి వచ్చేది. ఎండకీ వాన కీ బుగిలి ఆ తాటి మాను కిందటి వారం విరిగి పోయింది.
నాగులు శ్రీధర్ ని ఎత్తుకుని భుజాలమీద కూర్చోబెట్టుకున్నాడు.నెమ్మది గా కాలవ నీళ్ళ లో నడుచుకుంటూ అవతలి ఒడ్డు చేరి వాణ్ణి నెమ్మది గా కిందికి దించాడు.
నేల మీద దిగుతూ నే శ్రిధర్ వేగంగా పరిగెత్తి,ఒంటి కాలి మీద ఒక సారి ముందుకి దూకి మళ్ళీ పరుగందుకొన్నాడు.
పొలం లో కృష్ణా రావు మరి ఇద్దరు కూలీ ల తో కలిసి కలుపు తీస్తున్నాడు. నాగులూ శ్రీధరూ పొలం గట్టు మీద నడుస్తూ ఉంటే, గట్ల పక్క బొరియల్లో కి పీతలు అడ్డం గా నడుచుకొంటూ పోతున్నాయి.
నాగులు కొడవలి తీసుకొని, గేదె ల కోసం గట్టు మీది గడ్డి కోయటం మొదలు పెట్టాడు.
అకస్మాత్తు గా కృష్ణా రావు తన కుడి చేతిని ఎడమ చేత్తో పట్టుకొని అరిచాడు, “ఒరేయ్ నాగులూ ఆ తుండు గుడ్డ ఇటివ్వరా..పాము కరిసింది” నాగులు చేతి లో కొడవలి కింద పడిపోయింది. వాడు పరిగెత్తుకొంటూ వచ్చి నెత్తి మీది తువ్వాలు తీసి ఆదరా బాదరా గా కృష్ణా రావు మణి కట్టు చుట్టూ కట్టాడు. కృష్ణా రావు తన చేతి పైన అయ్యిన గాయం నుంచీ నోటి తో రక్తాన్ని పీల్చి ఉమ్మేయసాగాడు. “గుమ్మడిత్తుల పింజేరి అనుకుంటా”, నాగులు తో అన్నాడు. ఆయనముఖం లో రంగులు మారసాగాయి. శ్రీధర్ పరిస్థితి చూసి ఏడుపు లంకించుకొన్నాడు.
నాగులు మిగతా కూలీ ల సాయం తో కృష్ణా రావు ని గట్టు మీద పడుకోబెట్టి,ఐదే ఐదు నిమిషాల్లో ఊళ్ళో కెళ్ళి శరభాచారి ని తీసుకొచ్చాడు. శరభాచారి పసరు వేసి పత్యం చెప్పాడు.
నాలుగు రోజులు పత్యం చేసిన తరవాత కృష్ణా రావు మామూలు గానే పొలం వెళ్ళటం మొదలు పెట్టాదు. అయితే శ్రీధర్ కి మాత్రం ప్రాణం మీదికి వస్తే ఎలా వుంటుందో తెలిసింది.
ఇంకా ఉంది ….
*************************
ఊరి అరుగుల మీద రాజకీయ చర్చ వాడి గా వేడి గా జరుగుతోంది.
“ఈ ‘రెండు రూపాయలకి కిలో బియ్యం’ మనచావుకొచ్చింది” అంటున్నాడు పెద పిచ్చయ్య గారి రత్తయ్య.
“ఈ పధకం రాక ముందు లేబరు నడుం వంచి పని చేశేవాళ్ళు.ఇది వచ్చినాక వీళ్ళకి వళ్ళొంగటం లేదు”, అంటున్నాడు ఇంకో తెల్ల మీసాలాయన.
“కూలి రేట్లు పెంచేశారు”, అంటున్నాడు మరో ఆయన గోచి సవరించుకొంటూ.
“ఏమైనామీ కమ్యూనిస్టు ల కంటే రామా రావే మెరుగు. రాజ గారి భూముల్ని పంచి పెట్టేశాడు” అంటున్నాడు ఈ మధ్యనే తెలుగు దేశం లో కి దూకిన లోకనాథం.
“చల్లపల్లి రాజా భూముల్ని లేబర్ కి పంచి పెడితే మన రైతులకి ఒరిగేదేముంది? ఈ లేబర్ ఇక మన మాట వినరు. ఇక రైతు వ్యవసాయం చేసినట్లే. రాజకీయ పార్తీ లు ఓట్ల కోసం ఏమైనా చేస్తాయి. ప్రజాస్వామ్యం తో వచ్చిన చిక్కే ఇది” అంటున్నాడు మొన్నే కాలేజీ లోంచీ బయతికొచ్చిన ఓ యువకుడు.
“ఓ పక్క సాయిబ్బులు దేశాన్ని దోచేస్తుంటే మనలో మనం కొట్టుకోవటం ఏమీ బాగా లేదు. సాయిబ్బుల జనాభా హిందువుల జనాభా కంటే నాలుగు రెట్లు వేగం గా పెరుగుతోంది”, అని అంటున్నాడు కరణం గారి చిన్నాడు.
“ఆ మీ ఆరెస్సెస్ వాళ్ళు చెప్పే మాట ఎవరు నమ్ముతారు. గోరంతలు కొండంతలు చేయటం లో మొనగాళ్ళు మీరు. శాఖ లో చేరే ముందు కౌగలించుకొంటారంట. కౌగలించుకొని వీపుమీద తడుముతారట,జంజప్పోగు ఉందో లేదో తెలుసుకోవటానికి” దానికి సమాధానం గా అంటిస్తున్నాడో కుల సంఘం పెద్ద.
“కరణం మునసబు ఉద్యోగాలు తీసేస్తున్నారంట. ఇంకా ఏమైనా ఉందా? ఊళ్ళలో అరాచకం రాజ్యమేలుతుంది” అంటున్నాడు మునసబు గారి ఏకైక సంతానం.
ఆ లోగా చిట పటా నాలుగు చినుకులు పదటం తో ఎవరిళ్ళకు వాళ్ళూఉ బయలుదేరారు. పక్క వూరి మైకు నుందీ చల్ల గాలిలో తేలి వస్తోంది చిరంజీవి పాట,”వానా వానా వందనం…”.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-5
11 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:cab, FM radio, naukri, onsite, performance, reckless driving, santosh reddy
మా తొమ్మిదో నంబర్ బస్సు లో ఎఫ్.ఎం రేడియో మంచి హుషారైన పాటల్ని పాడుతోంది. కానీ, బస్సు లో ఎవ్వరూ హుషారు గా లేరు. కొంతమంది ముందు సీటు పై మోచేతులానించి, చేతుల పై తలను ఆనించి నిద్ర పోయెందుకు ట్రై చేస్తున్నారు. మరి కొందరు ఈవెనింగ్ పేపర్ తిరగేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ యధావిధి గా రెక్ లెస్ గా డ్రైవ్ చేస్తున్నాడు. అందరి ముఖాల్లోనూ అలసట స్పష్టం గా కనపదుతోంది. కొంత మంది క్యాబ్ వెనక నాలుగు సీట్లు ఆక్రమించి కార్డ్స్ ఆడుతున్నారు. నేనూ వెంకట్ ముందు సీట్లో సెటిల్ అయ్యాం.
“మీ మానేజర్ యూఎస్ పంపిస్తానంటున్నాడా?” వెంకట్ ని కదిలించాను.
“ఆ పంపిస్తానంటుండు..కానీ మధ్య మధ్య లో “పెర్ఫార్మెన్సు ఇక్కడ ఇంప్రూవ్ చెయ్యాల అప్పుడే పంపిస్తా” అంటుండు. యూఎస్ పోయి ఒక సంవత్సరం పని చేసి మా వూరెల్లి హాపీ గా సెటిల్ అవుతా…”,అని ఒక్క క్షణం గాలి లోకి చూసి, మల్లీ నా వైపు చూసి తన మాటల్లో తన కే నమ్మకం లేనట్లు నవ్వసాగాదు వెంకట్. ఆ నవ్వు నా మనసు లో ఆలోచనల తేనె తుట్టె ని కదిలించింది.
నమ్మకం…అదొక్కటే లేదిక్కడ..ఇక్కడ లేనిదీ ఊళ్ళో ఉండేదీ ….మా మేనేజర్ మాట
మీద నిలబడతాడనే నమ్మకం లేదు. ఎంప్లాయీ పని చేస్తాడనే నమ్మకం లేదు..కంపెనీ వాడు చెప్పే ఏ మాట లోనూ నమ్మకం లేదు..
అన్నీ టెంపరరీ అరేంజిమెంట్స్ అయ్యినప్పుడు పక్క వాడు మనలను నమ్మక పోయినా పరవా లేదు. రేపు నువ్వెక్కడుంటావో..నీపక్క వాడెక్కడుంటాడో. కొత్తవాళ్ళతో మొహమాటమేమిటి?
వ్యాన్ బొమ్మనహళ్ళి వచ్చేసరికి పొట్టలో ఎలుకలు పరిగెత్తసాగాయి నాకు. ఆకలికి నీరసం వచ్చి, నీరసానికి చెమటలు పట్టాయి.కిందికి దిగి ఏమైనా కొనుక్కొని తిందామంటే, డ్రైవర్ వ్యాన్ మధ్యలో ఆపడు. జేబు లో డబ్బులుండి కూడా కొనుక్కొని ఆకలి తీర్చుకోలేని పరిస్థితి. నిద్రపోదామంటే నిద్రరాదు.
హోసూరు రోడ్డు పక్కనే బిల్ బోర్డు లు….రియల్ ఎస్టేట్ వాళ్ళవీ…బ్యాంకు ల వాళ్ళవీ…కార్ల కంపెనీలవీ…వీళ్ళందరికీ కస్టమర్స్ సాఫ్త్వేర్ జనాలే. అమెరికా నుంచీ,యూరోప్ నుంచీ, జపాన్ నుంచీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జేబుల్లో వచ్చి పడే డబ్బు ని బయటికి తీయడానికి ఈ కంపెనీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. సక్సెస్ అవుతున్నయి కూదా…కానీ దీని వలన ఇళ్ళ స్థలాల రేట్లూ..లోన్ల వడ్డీ రేట్లూ పెరుగుతున్నై. రేట్లు పెరగటం వలన సాఫ్ట్వేర్ ఉద్యోగులు మధ్య తరగతి ఉద్యోగులు గా మారుతున్నారు.మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ గా మారొతోంది. ఇదంతా ఒక క్లోస్డ్ ఎకానమీ. మనీ సర్కులేషన్ కొన్ని సర్కిల్స్ లో నే జరుగుతుంది.సాఫ్ట్వేర్ …రియల్ ఎస్టేట్….ఆటోమొబైల్స్…ఎయిర్లైన్స్…వీళ్ళందరి మధ్యే మనీ సర్కులేషన్ జరిగేది. ఈ సర్కులేషన్ జరిగే క్రమం లో పట్టణాల్లో ఉండే, పట్టణాలకు వలస వచ్చే కొందరు నిరుద్యోగులకి కొన్ని చిన్న చిన్న జాబ్స్ రావచ్చు. కానీ దీని వలన మిగతా సొసైటీ కి ఉపయోగం ఉంటుందా అన్నది సందేహాస్పదమే…!
సిల్క్ బోర్డ్ దగ్గర నౌకరీ జాబ్ సైట్ బిల్ బోర్ద్ లో, ఓ ఎంప్లాయీ కొత్త జాబ్ రాగానే పాత బాస్ ని అవమానిస్తున్నాడు. ఈ సాఫ్ట్వేర్ కంపనీలు రాజకీయ పా ర్టీల్లా కప్పల తక్కెడ లాంటివి. ఎంప్లాయీస్ ఒక కంపెనీ నుండీ వేరొక కంపెనీ కి కప్పల్లా దూకుతూ ఉంటారు.కిందటి నెల మా డివిజన్ లో అవినాష్ అనే వాడు రెజైన్ చేశాడు. వాడు రెజైన్ చేసినాక వరుస గా అదే నెలలో ఐదుగురు రెజైన్ చేశారు. ఇది చూస్తూంటే సాఫ్త్వేర్ జనాలు కప్పలే కాదు గొర్రెలు కూడా అనిపించక మానదు.
క్యాబ్ ఒక్కొక్క స్టాప్ లోనూ ఆగగానే, ఎవరి స్టాప్ లో వారు దిగిపోతున్నారు.దిగిపోయే ముందు బస్సులో వాళ్ళ కి బై చెబుతున్నారు. బయట రోడ్డు మీద పొల్యూషన్ తో ఊపిరాడటంలేదు.
సంతోష్ రెడ్డి హుషారు గా క్యాబ్ డ్రైవర్ తో తెలుగులో కబుర్లు చెప్తున్నడు. సంతోష్ ది చిత్తూరు జిల్లా లో ఓ పల్లెటూరు. డ్రైవరేమో తనకు తెలుగు రాదనీ, సంతోష్ మాట్లాడేది ఒక్క ముక్కా తనకు అర్ధం కావదం లేదనీ సంతోష్ తో కన్నడం లో చెప్తున్నాడు. డ్రైవర్ శివమొగ్గ నుంచీ వచ్చిన కన్నడిగుడు. అతనికి తెలుగు బొత్తిగా రాదు. కానీ సంతోష్ మాత్రం “బెంగలూరు లో ఉండే వాళ్ళందరికీ తెలుగు వచ్చు” అనే అపోహ లో ఉన్నాడు.
“ఏమప్పా శ్రీధరూ…దిగాలు గా కూర్చొనినావేమి?” సంతోష్ అంటున్నాడు నాతో.సంతోష్ తో మాట్లాడితే బెంగలూరు లో రాయలసీమ పల్లె కనపడినట్లే.
“నువ్వు డ్రైవర్ కి తెలుగు నేర్పుతున్నావు కదా, వింటున్నా”, అని అన్నను. సంతోష్ కి తెలుగూ ఇంగ్లీషూ తప్ప వేరే ఏ భాషా రాదు. చిన్నప్పటి నుంచీ గాలి వాటం గా తిరిగాడు. ఫ్యాక్షన్ లలో తిరిగాడు.చాలా మంది రాయలసీమ వాళ్ళ లాగా సంతోష్ కి స్థానిక రాజకీయాలన్నీ కొట్టిన పిండి. ” ఏ రాజకీయ నాయకుడు ఎంత కరప్షన్ చేశాడో, ఎవరికి ఎంతమంది కీప్ లు ఉన్నారో..ఏ హీరో తెర వెనక భాగోతం ఏమిటో ” అంతా తన కళ్ళ తో చూసినట్లు చెప్పగలడు సంతోష్. ఇప్పటి కీ వారం వారం వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడి ఫ్రెంద్స్ ని కలుసుకొని వస్తాదు.
చిన్నప్పుదు చిల్లర తిరుగుళ్ళు తిరిగిన సంతోష్ కి, డిగ్రీ లో కి వచ్చిన తరువాత బుద్ధి కుదిరి ఎం సీ ఎ చేశాడు.ఆపైన బెంగలూరు లో జాబ్ దొరికింది.
“ఈ వీకెండ్ ఊరు వెళ్తున్నావా?”, అడిగాను సంతోష్ ని.
“లేదప్పా, ఈ వారం పనిమనిషి రాలేదు. ఆయమ్మకి ఫీవర్. ఈ వీకెండ్ బట్టలు నేనే గుంజాల”
సంతోష్ తెచ్చిన తెలుగు పేపర్ లో రాజశెఖరరెడ్డి కి లెనిన్ వేషమేసిన బొమ్మ చూపించాను సంతోష్ కి.
“చూశావా, వై ఎస్ కి లెనిన్ వేషమేశాడు పేపర్ వాడు?” అన్నన్నేను.
“లెనిన్ ఎవురు? వాడో రాజు అనుకొంటా కదా?”,సంతోష్అడుగుతున్నాడు.
నాకు నవ్వా లో ఏడవాలో తెలియక చిరు నవ్వు నవ్వి ఊరుకొన్నాను. మా మాటల్లోనే వ్యాన్ మల్లేశ్వరం దాటి,మా ఇంటి దగ్గర్లో ఆగింది. వెంకట్ కీ సంతోష్ కీ బై చెప్పి మా ఇంటి వైపు నడవ సాగాను.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ- 6
12 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:dhaDel, gollem, lady teacher, paraare, talupu, teacher
శ్రీధర్ ఆ రోజు సెలవు కావడం తో ఆడుకోవడానికి “ధడేల్” గాడి ఇంటికి వెళ్ళాడు.ధడేల్ గాడు శ్రీధర్ కంటే నాల్గేళ్ళు పెద్ద వాడు. వాడి అసలు పేరు చంద్రమౌళి. వాడికి ధడేల్ అనే పేరు రావడానికి వెనుక పెద్ద కథే ఉంది.
వెంకటాపురం లో రవి ప్రసాద్ అని లెక్కల మాస్టరు ఒకాయన ఉండేవాడు. ఆయన ఆ ఊళ్ళోని జిల్లాపరిషత్ పాఠశాల లో పని చేస్తూ ఖాళీ సమయాల లో ట్యూషన్లు చెప్పుకొనే వాడు. అందుకే ఊళ్ళో ని అందరూ ఆయన్ని ప్రైవేటు మాస్టారని కూడా అనేవారు. ఆయనకు ఇద్దరు మగ పిల్లలూ ఒక భార్య! మాస్టారి భార్య కు గయ్యాళి అని పేరు. ఆమె పేరు సుకుమారి.
ఆ ఊళ్ళోనే యూ పీ స్కూల్లో జయమ్మ అని తెలుగుటీచర్ ఉండేది.ఆమెకు చిన్నతనం లో నే భర్త పోయాడు. తరవాత ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకో లేదు. తరువాత ఆమె కి పిల్లలు కలగ లేదు.
రవి ప్రసాద్ ఇల్లు ఆమె ఇంటికి దగ్గరే. అప్పుడప్పుడూ రవి ప్రసాద్ భార్యా పిల్లలూ ఆమె ఇంటి కి వచ్చే వారు. ఆమె కు కూడా పిల్లలంటే ఇష్టమవటం చేత రవి ప్రసాద్ పిల్లలను ఆమె బాగానే దగ్గర కు తీసేది.దీని తో రవి ప్రసాద్ భార్య, సుకుమారికీ ఆమె కూ ఉన్న అనుబంధం గట్టిపడింది.సుకుమారి కి జయమ్మ ఇంటి కి పోనిది ఉబుసు పోదు.
ఎప్పుడైనా ప్రైవేట్ మాస్టారు బడి నుండీ ఇంటికి వచ్చి, ఇంటికి తాళం వేసి ఉంటే సుకుమారి జయమ్మ ఇంట్లో ఉన్నట్టే లెక్క. సుకుమారి ని పిలుచుకు రావటానికి మాస్టారు కూడా జయమ్మ ఇంటికి వెళ్ళే వాడు.
జయమ్మ మాస్టారికీ భార్యకీ “టీ” పెట్టి ఇచ్చేది. కాసేపు జయమ్మా మాస్టారూ టీచర్ల జీతాలూ యూనియన్లూ అలవెన్సులూ గురించి మాట్లాడుకొన్న తరువాత, టీ ముగించి మాస్టారి కుటుంబం ఇంటి ముఖం పట్టేది. ఏ ఆదివారమో జయమ్మ కూడా మాస్టారి ఇంటికి వచ్చి సుకుమారి తో కబుర్లు చెప్పేది.
ధడేల్ గాడికి వయసు కి మించిన ఊహలు ఎక్కువ. ఓ రోజు వాడు జయమ్మ ఇంటి తలుపులు తీసుకొని మస్టారు ఒక్కడే బయటకు రావడం గనించాడు. దాంతో వాడు జయమ్మ ఇంటి తలుపుల మీద ఓ కన్నేసి ఉంచాడు. ఆ తరువాత వరుస గా నాల్రోజులు మాస్టారు ఒంటరిగా జయమ్మ ఇంట్లో కి వెళ్ళడం కూడా వాడి కంట పడింది. ధడేల్ గాడి పొట్ట ఈ విషయం కక్క లేక ఉబ్బి పోయింది. వాడు ప్రైవేట్ పిల్లల దగ్గరికి వచ్చి “మీకో వింత చూపిస్తా”నని చెప్పి,పిల్లలని వెంటబెట్టుకొని జయమ్మ ఇంటికి దారి తీశాడు.
పిల్లల్నందర్నీ పెరటి గోడ పక్కన నుంచోబెట్టి మూసి ఉన్న జయమ్మ ఇంటి తలుపుని గొళ్ళెం తో తట్టాడు వాడు. లోపల్నుంచీ సమాధానం రాలేదు. దాని తో వాడు కాలెత్తి తలుపు మీద “ధడేల్ ధడేల్” మని రెండు సార్లు తన్ని పరుగెత్తి గోడ చాటుకొచ్చి మిగతా పిల్లల తో పాటు దాక్కొన్నాడు.
మరోరెండు నిమిషాలకి జయమ్మ ఇంటి తలుపులు ఓర గా తెరుచుకొన్నయి. తలుపుల సందు లో నుంచీ మాస్టారు అనుమానం గా,చెమట గా,ఆందోళన గా బయటకు చూస్తున్నాడు. మాస్టారికి పైన చొక్కా లేదు.కింద తుండు గుడ్డ చుట్టుకొని ఉన్నాడు. బయట ఎవరూ కనపడక పోవడం తో మాస్టారు మళ్ళీ తలుపులు మూసి గడియ వేశాడు.
ఈసారి ధడేల్ గాడు రెట్టించిన ఉత్సాహం తో వెళ్ళి తలుపులను కాలితో బలం గా తన్ని మిగతా పిల్లల తో కలిసి వెనక్కి చూడకుండా పరారయ్యాడు.
అదండీ విషయం. అప్పటి నుంచీ వాడికి ధడేల్ గాడనే పేరు స్థిర పడి పోయింది.ఇది జరిగిన రెండ్రోజులకి మాస్టారి తో చనువు గా ఉండే మున్సబు కొడుకు వాడిని పిలిచి,”ఒరేయ్, అబ్బాయ్ నువ్వు వయసుకి మించిన పనులు చేస్తున్నావ్! జాగ్రత్త!” అని చెప్పాడు. మరుసటి రోజు పొద్దున్నే వాడు పక్క మీది నుంచీ లేవక ముందే వాడి ఒంటి మీద దెబ్బలు పడ్డాయి. దాని తో వాడికి మెలకువ వచ్చింది. ఎదురు గా చూస్తే వాడి నాన్న ఉన్నాడు బరికె పట్టుకొని. మునసబు కొడుకు వాళ్ళ నాన్న కి ఏమి చెప్పాడో తెలియదు కానీ ధడేల్గాడి వళ్ళు మాత్రం వాతలు తేరిపోయింది, వాళ్ళ నాన్న కొట్టిన కొట్టుడు కి.
ధడేల్ గాడి సాహస కృత్యం అ నోటా ఈ నోటా పడి మాస్టారి భార్య చెవిన పడటానికి ఓ రెండు నెలలు పట్టింది. అ పైన మాస్టారు ఆ ఊరి నుంచీ ట్రాన్స్ ఫర్ చేయించుకొని మరో వూరు వెళ్ళటానికి ఇంకో ఆరు నెలలు పట్టింది.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – 7
12 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:auto, central station, chennai, coffee, mdras, tamil
వ్యాను దిగిన తరవాత చూసుకుంటే ఐ డీ కార్డు ఇంకా మెడ లో నే ఉంది. దాన్ని తీసి జేబులో పెట్టాను. ఈ రోజు ఆగస్ట్ ఫిఫ్త్. ఈ రోజు కి ఆరున్నర సంవత్సరాలు కావస్తోంది, ఈ కంపెనీ ల ఐ డీ కార్డులు మెడ లో వేసుకొని తిరగటం మొదలు పెట్టి, కుక్క మెడ లో గొలుసు లా.
ఇంటి తాళం తీసి గీజర్ ఆన్ చేసి, స్టవ్ మీద కాఫీ కి నీళ్ళు పెట్టాను.కాసేపు పొద్దున వచ్చిన పేపర్ చదివి గీజర్ ఆఫ్ చేశాను. స్టౌ మీద కుక్కర్ పెట్టి కాఫీ కలిపి తాగటం మొదలు పెట్టాను. కాఫీ తాగుతూ ఉంటే ఆరున్నర సంవత్సరాల కిందట జాబ్ లో జాయిన్ అయినప్పటి ఆలోచనలు చుట్టుముట్టాయి. అప్పుడు కూడా మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో ఇలాగే పిల్టర్ కాపీ తాగి బయలు దేరాను మొదటి జాబ్ కి.
**************
ఆఫర్ లెటరూ లగేజీ పట్టుకొని చెన్నై స్టేషన్ లో దిగాను. కూలీ వాడు తమిళం కలిసిన తెలుగు లో నూరు రూపాయలు అడిగాడు, లగేజీ బయటకు తీసుకొనిపోవడానికి.దాంతో లగేజీ లాక్కుంటూ బయలు దేరాను. ఒక షాప్ దగ్గర ఆగి, కాఫీ తాగుతూ స్టేషన్ లో చుట్టుపక్కల ఉన్నవాళ్ళను గమనించ సాగాను.
ఆంధ్ర లో అమ్మాయిల యావరేజి కలరూ యావరేజి అందమూ పట్టణాలకు పోయేకొద్దీ పెరుగుతుంది. బందరు కంటే విజయవాడ అమ్మాయిలు బాగుంటారు. విజయవాడ అమ్మాయిల కంటే హైదరాబాదు అమ్మాయిలు బాగుంటారు. నీడ పట్టున ఉండటం వలన కావచ్చు, బ్యూటీ క్రీము ల వలన కావచ్చు, టౌనుల్లో ఉద్యోగాలు చేసే అబ్బాయిలు పెల్లెటూళ్ళళో ఉండే అందమైన అమ్మాయిలందరినీ పెళ్ళి చేసుకొని పట్టణాల్లో కాపురాలు పెట్టడం వలన కావచ్చు.ఈ నా అబ్సర్వేషన్ ప్రకారం చెన్నై లో అమ్మాయిలు హైదరాబాద్ అమ్మాయిల కంటే బాగుంటారు అనుకున్నాను. కానీ అలా అనుకోవటం కరెక్ట్ కాదు అని తెలిసింది, స్టేషన్ లో చుట్టుపక్కల అమ్మయిలను చూస్తుంటే.
“ఎక్స్ క్యూజ్ మీ. కెన్ ఐ చెక్ ద వెయిట్ ఆఫ్ యువర్ లగేజ్?” ఎవడో నల్లటి రైల్వే అఫీషియల్ ఆపాడు నన్ను. లగేజి చెక్ చేస్తే లిమిట్ కంటే పది కిలోలు ఎక్కువ గా ఉంది. “నువ్వు నాకు నచ్చావ్” సినిమా లో లా ఆ ఆఫీసర్ రెండొందలు ఫైన్ రాస్తానని భయపెట్టి, తరవాత యాభై రూపాయలు పట్టి నన్ను వదిలాడు.
లగేజి క్లోక్ రూం లో పెట్టి స్టేషన్ బయటికి రాగానే ఓ అడ్డబొట్టు ఆటో వాడు ఎక్కడి కి పోవాలని అడుగుతున్నాడు నన్ను తమిళం లో. తెలుగు లో చెప్పాను నేను. దానికి వాడు “పోలాం సర్” అన్నాడు. తెలుగు వాళ్ళకి తమిళం కిటికీ కర్టెన్ లా అనిపిస్తుంది. కర్టెన్ అవతల ఏముందో కనపడీ కనపడకుండా ఉంటుంది. అలానే తమిలం కూడాతెలుగు వాళ్ళకి అర్ధమయీ అర్ధమవకుండా ఉంటుంది.
“ఎంతవుతుంది” అడిగాన్నేను.
” ఫోర్ హండ్రడ్ సార్”, వాడు ఇంగ్లీష్ లో చెప్పాడు. నేను మీటర్ వేయమన్నాను. వాడు నన్ను పిచ్చోడిని చూసినట్లు చూశాడు.ఇక్కడ మీటర్ కాన్సెప్ట్ లేనట్లుంది. రైల్వే స్టేషన్ నుండీ కాస్త దూరం నడిచి, దారి లో పోయే అటో వాడ్ని ఒకణ్ణి ఆపి వాడిని వందరూపాయలకు ఒప్పించాను,టెక్నాలజీ పార్కు కు తీసుకొని పోవటానికి.
“సాధనా కంప్యూటర్స్ లో అక్కడి హెచ్ ఆర్ వాళ్ళని కలిశాను.వాళ్ళు నా ఆఫర్ లెటర్ తీసుకొని,సర్టిఫికెట్లు చెక్ చేసుకొని, అపాయింట్ మెంట్ లెటరూ, ఎంప్లాయీ నంబరూ ఇచ్చారు. ఐ డీ కార్డు రావటానికి ఓ రెండ్రోజులు పడుతుంది. ఈ లోపు గేటు దగ్గరసైన్ చేసి లోపలికి వెళ్ళాలి.
కూర్చోవటానికి ఓ ట్రైనింగ్ రూం చూపించారు హెచ్ ఆర్ వాళ్ళు. అక్కడ నా లా కాలేజీ ల క్యాంపస్ లో జాయిన్ అయిన వాళ్ళు నలుగురబ్బాయిలూ ఇద్దరమ్మాయిలూ ఉన్నారు. ఇంకా కాలేజీ లో ఉండే లేజీ తనం పోయినట్లు లేదు వాళ్ళకి, నాలానే. వాళ్ళు చెప్పారు ఇంగ్లీషు లో ఎల్లుండి నుంచీ ట్రైనింగ్ అని.
కంపెనీ గెస్ట్ హౌస్ లో రూం ఇచ్చారు,వారం రోజులకి. ఈ లోగా సొంత రూం వెతుక్కొని అక్కడికి మారాలి. క్యాంటీన్ లో సర్వర్ సాంబార్ ముందు పోసి కూరలు తరవాత వేయటం తో నాకు నేను ఇంకో సారి చెప్పుకున్నాను,”ఇది మద్రాసు రా!” అని.
ఒకప్పటి మద్రాసు తెలుగు సినిమా ల కూ,సాహిత్యానికీ కేంద్ర బిందువు గా ఉండేది.మద్రాస్ బాక్ డ్రాప్ తో చాలా నే సినిమా లూ నవలలూ వచ్చాయి,అప్పట్లో. అప్పుడు ఎలా ఉండేదో గానీ,ఇప్పుడు మాత్రం తెలుగు వాతావరనం అస్సలు లేదు మద్రాస్ లో. ఇప్పుడక్కడంతా తమిళమయం. అందుకేనేమో మద్రాస్ తన పేరు ని చెన్నై గా మార్చుకొంది..కాలేజీ ల నుంచీ ఉద్యోగాల కోసం వచ్చే మన ” మామ లూ , బాబాయ్ లూ” మాట్లాడే తెలుగు మాత్రం అప్పుడప్పుడూ వినపడుతుంది రోడ్డు మీద.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-8
13 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:accident, bank, games, jumping, krishna river, mango groove, motor, mythological, story, water
ధడేల్ గాడూ చిన్నూ గాడూ కలిసి ఆడుకొనేందుకు మరో ఇద్దరు ఊళ్ళో పిల్లలను వెంటబెట్టుకొని రేవు ఒడ్డున లంకల్లో ఉండే తోటలకు బయలు దేరారు. మామిడి తోటల్లో వాళ్ళకి కోతుల గుంపు ఒకటి కనిపించింది. వాటి పై రాళ్ళు రువ్వటం మొదలెట్టారు. చివరికి ఈ పిల్ల కోతుల గుంపుని తట్టుకో లేక ఆ అసలు కోతుల గుంపు పారిపోయింది. ధడేల్ గాడూ మిగిలిన ఇద్దరు పిల్లలూ మామిడి చెట్లెక్కి కొతి కొమ్మచ్చి ఆడటం ఆరంభించారు. పిల్లలు దూకుతుంటే ఒక్కోసారి పెళుసు గా ఉండే మామిడి కొమ్మలు విరుగుతున్నాయి. కొమ్మలతో పాటు వీళ్ళ కాళ్ళు కూడా బెణుకుతున్నాయి. తోట లో ఒక చిన్న గుడిసె ఉంది. చిన్నూ గుడిసె చూరు లో ఓ కథల పుస్తకం దాచి పెట్టుకొన్నాడు. చందమామ లో ప్రతి నెలా సీరియల్ గా వచ్చే రాజుల సీరీల్స్ ని కత్తిరించి ఒకటి గా కుట్టిన పుస్తకం అది. శ్రీధర్ ఏడో క్లాస్ కి ఫస్ట్ గా వచ్చినందుకు వాడి పిన్నమ్మ వాడికి ప్రజెంట్ చేసింది ఆ పుస్తకాన్ని. చిన్నూ పుస్తకం తీసి చదవటం మొదలు పెట్టాడు. నెమ్మది గా వాడికి ఆ తోట కథ లో ఉండే అరణ్యం లా అనిపించసాగింది. కథ లో అరణ్యం లో తిరిగే మాంత్రికులు ఏకాక్షీ చటుర్నేత్రుడూ ఆ తోట లో నే తిరుగాడుతున్నట్లు అనిపించసాగింది వాడికి.
కాసేపటికి పిల్లలు ముగ్గురూ ఆటలు కట్టిపెట్టి శ్రీధర్ ని పిలిచారు. మధ్యాహ్నమయి పోయింది. వాళ్ళకి ఆకలవుతోంది. తోట కంచె తో పాటు నేరేడు చెట్లూ, పెద్ద ఉసిరి చెట్లూ, వెలగ చెట్లూ అక్కడక్కడా ఉన్నాయి. పిల్లలు రాళ్ళతో నేరేడు కాయలు రాల గొట్టారు. ఒక ఎండు చెట్టు కొమ్మ తో వగరు గా ఉండే వెలగ కాయలు రాల్చారు. చిన్నూ మాత్రం రేగు కాయలు కోశాడు జాగ్రత్త గా, ముళ్ళు గుచ్చుకోకుండా. వీటికంటే తాజా కాయలు ఎక్కడ దొరుకుతాయి గనుక! పిల్లలు రాలగొట్టిన కాయలన్నింటినీ నాలుగు భాగాలు గా చేసి, సమానం గా పంచుకొని తిన్నారు. చివరి గా ఉసిరి కాయలు రాల కొట్టి తిన్నారు. మోటారు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగారు. నీళ్ళు తీయ గా అనిపించాయి.
నీళ్ళు తాగిన తరవాత పిల్లలు మోటారు బోదె లో స్నానానికి సిద్దమయ్యారు. ఇంతలో కృష్ణా రావు గారి కొత్త పాలేరు, సిద్దడు వచ్చి, “బాబూ, బోదె లో కి దిగితే మీ నాన్న గారు కోప్పడతారు”, అని వాడే శ్రీధర్ ని కోప్పడ్డాడు. ఈ కొత్త పాలేరు నల్ల గా ఉండటం వలన పిల్లలు వాడికి “నల్ల చింతపండు” అని పేరు పెట్టారు. పిల్లలు నల్ల చింతపండు గాణ్ణి “చెత్త చింతపండు గాడు” అని తిట్టుకొన్నారు . “ఇదే నాగులు అయితే ఆడుకోనిచ్చే వాడు”, అంటున్నాడు శ్రీధర్ పిల్లలతో.
పిల్లల కి నీళ్ళలో ఆడాలనే కోరిక తీరకపోవటం తో రేవు వైపుకి బయలుదేరారు, కరకట్ట మీద నుడుచుకొంటూ. సూర్యుడు పడమట అస్తమిచబోతున్నాడు. ధడేల్ గాడు ఆకాశం కేసి చెయ్యి చూపించి చిన్నూ గాడి తో, “అరేయ్, సూర్యుడి దగ్గరికి వెళ్దాం రా!” అన్నాడు.
“సూర్యుడికి ఎంత దూరం ఉంటుంది రా”, అన్నాడు చిన్నూ.
“అక్కడే! కరకట్ట చివర అనుకొంటాన్రా!”, అన్నాడు ధడేల్ గాడు.
“సూర్యుణ్ణి ఎంత దూరం వెళ్ళినా చేరుకోలేమనుకొంటా రా”, అన్నాడు వాళ్ళలో మూడో వాడు.
“సరే, చూద్దాం రా”, అని ధడేల్ గాడు పరి గెత్తతం మొదలెట్టాడు.
వాడితో పాటు మిగతా పిల్లలు కూడా పరిగెడుతున్నారు.
ఇంతలో ఎదురు గా వచ్చాడు గాంధీ మాస్టరు. ఆయన్ని చూసి మిగిలిన ఇద్దరు పిల్లలూ ఓ తాడి చెట్టు చాటు కి పోయి నక్కారు. ధడేల్ గాడు గాంధీ మాస్టర్ ని లెఖ్ఖచేయదలుచుకోలేదు. వాడితో పాటు చిన్నూ గాడు కూడా “నమస్తే సార్”, అనాడు. గాంధీ మాస్టర్ అలియాస్ రామారావు ఎప్పుడూ గాంధీ గారి సిద్దాంతాల గురించి ఉపన్యాసాలు ఇస్తాడు. అందుకే ఆయనకా పేరు. అయితే బూతులు మాత్రం ఎక్కువ మాట్లాడతాడు.
“ఈ కరకట్ట మీద ఎక్కడికి రా బయలు దేరారు, సాడదాని కొడకల్లారా?”, అన్నాడు గాంధీ మస్టరు.
“సూర్యుడి దగ్గరికి సార్”, అన్నాడు చిన్నూ గాడు.
” సూర్యుడి దగ్గరికేంటి రా. ఓహో ఈ బడుధ్ధాయి ఉన్నాడు గా”, అని ధడేల్ గాదికేసి చూశాడు. వాడి పేరు ప్రఖ్యాతులు అప్పతి కే మాస్టర్ చెవిన పడ్డాయి.”కూసే గాడిద వచ్చి మేసే గాడిద ని చెడ గొట్టిందట. అయినా ఎవరన్నా ఏమన్నా చెబితే నమ్మేయటమేనా. నిజమేదో తెలుసుకొనే పన్లే, నీ లాంటి వాడు కూడా” అని శ్రీధర్ కి చెప్పి, గాంధీ మాస్టరు సాగిపోయాడు. ఆయనకి శ్రీధర్ తెలివైన వాడని నమ్మకం.
సాయంత్రం కావస్తోంది. అయినా పిల్లలకేమీ ఆకలీ అలుపూ తెలియటం లేదు. వాళ్ళు తిన్న కాయల మహత్యమో, వాళ్ళ పసిమనసు ల మహత్యమో!. నది కంటే ముందు వాళ్ళని నది హోరు తాకింది. ఆ నది రొద లో పిల్లలు గొంతు పెంచి బిగ్గరగా అరుపుల తో మాట్లాడు కొంటున్నారు. కృష్ణా నది ఇసుక ఎక్కువ గా, నీళ్ళు తక్కువ గా నూ కనపడుతోంది. ఇదే నది వరద వస్తే పరవళ్ళూ తొక్కుతూ, కొట్టుకు వచ్చే చెట్ల తో నూ, పశువుల కళేబరాల తో నూ,సుడులు తిరిగే బురద రంగు నీటి తో నూ కరకట్ట ను తాకుతూ భీకరం గా ఉంటుంది.
అందరూ నది నీళ్ళ లో మునుగుతూ ఆట మొదలు పెట్టారు. “ఒరేయ్, ఎవరూ లోతు కు వెళ్ళకండి రా, మా తాత ఇక్కడే పడి కొట్టుకుపోయాడట. మా నాన్న చెప్పాడు”, శ్రీధర్ బిగ్గరగా చెప్తున్నాడు. పిల్లలంతా నీళ్ళలో మునిగి దాక్కునే ఆట ఆడుతున్నారు. ఆ క్రమం లో వాళ్ళకి తెలియ కుండానే నెమ్మది గా నది లోపలికి జరగ సాగారు.
శ్రీధర్ కాలి కింది బుసక కి హఠాత్తు గా డొల్ల పడి కిందికి దిగింది.. దాంతో వాడి తల నీళ్ళ కిందికి మునిగిపోయింది. కాసేపటి కి తల మళ్ళీ పైకి తేలింది. వెంటనే వాడు గాభరా గా కేకలు వేశాడు. మళ్ళీ నీళ్ళ అడుగుకి మునిగి పోయాడు. ధడేల్ గాడికి ఈత బాగానే వచ్చు. వాడు ఈదు కొంటూ చిన్నూ వెనకాల కి వచ్చి, వాడిని ఒడ్డు వైపుకు బలం గా నెట్టాడు.. దాంతో చిన్నూ తల నీటి పైకి వచ్చింది. వాడి కంగారు తగ్గింది. నీత్లో నడుచుకొంటూ ఒడ్డుకు చేరుకొన్నాడు. వాడి తో పాటు అందరూ ఒడ్డు కి చేరారు. “ఈ విషయం వాళ్ళ ఇళ్ళలో చెప్పబోమని” శ్రీధర్ మిగిలిన వాళ్ళ దగ్గర ప్రమాణాలు చేయించుకొన్నాడు. పిల్లలంతా ఇంటి ముఖం పట్టారు.
“అందర్నీ లోతుకెళ్ళొద్దని చెప్పి నువ్వెట్లా వెళ్ళావు రా? అందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితి లో పడ్డట్టుంది”, ధడేల్ గాడు శ్రీధర్ ని ఆట పట్టించసాగాడు.
“నేనేమీ లోపలికెళ్ళలేదు రా, కాలికింద ఇసుక కుంగింది”, శ్రీధర్ సమర్ధించుకున్నాడు.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
14 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:casino, cinema, compile error, coolie, creativity, identity, originality, purpose, tamil, telugu movies, warning
ట్రైనింగ్ మూడు నెలలూ చాలా ఫాస్ట్ గా గడిచాయి. ట్రైనింగ్ కాలేజ్ లైఫ్ కి ఓ ఎక్స్ టెన్షన్ లా అనిపించింది. అందరూ కుర్రకారే!
క్రాస్ కల్చరల్ ట్రైనింగ్ లో అమెరికన్ కల్చర్ కి ఎలా అడాప్ట్ అవ్వాలో చెప్పారు. బిజినెస్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ లొ ఫోన్ ఎటిక్వెట్ గురించీ,ఈ మెయిల్స్ రాయడం గురించీ చెప్పారు. ట్రైనింగ్ పూర్తయ్యేసరికి కొత్త వాళ్ళందరం బాగా కలిసిపోయాం.
కంపెనీ కి దగ్గర లో నే పది హేను వందల అద్దె కి ఒక రూం తీసుకున్నాను. నా మొదటి ప్రాజెక్ట్ మొదలయ్యింది. అమెరికా లో కాసినో ల కోసం సాఫ్ట్ వేర్ డెవలప్ చెయ్యాలి.వర్క్ బాగానే ఉంది కానీ పర్పస్సే నాకు నచ్చ లేదు. ఎందుకంటే అమెరికన్ కాసినో ఇండస్ట్రీ అనే గుడ్డిగుర్రానికి మేము పళ్ళు తోమాలి. కాక పొతే పళ్ళు తోమినందుకు నాలుగు రాళ్ళు వస్తాయి.
మా టీం మొత్తం ఎనిమిది మందిమి. ఆరుగురు తమిళియన్స్ ఒక హిందీ అతనూ నేనూ. ఏదైనా టీం మీటింగ్ పెడితే తమిళులంతా డిస్కషన్ తమిళం లో చేసేవారు. హిందీ వాడూ నేనూ ఏమీ అర్ధం కాక ఒకరి మొకం ఒకరు చూసుకొనే వాళ్ళం. తమిళులకు భాషాభిమానం కొంచం ఎక్కువే. అనేక రాజకీయ చారిత్రక కారణాల వలన తమిళులు హిందీ వ్యతిరేకులు కూడా. తమిళ్నాడు స్టేట్ స్కూల్స్ సిలబస్ లో హిందీ చదవవలసిన అవసరం లేదు. దీని తో చాలా మంది ఎడ్యుకేటెడ్ కూడా హిందీ అర్ధం చేసుకోలేరు.
అయితే ఈ హిందీ వ్యతిరేకత వలన తమిళ్ కల్చర్ డైల్యూట్ కాకుండా ఉందని నాకు అనిపించింది. తమిళ్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఉపయోగించే ఇంగ్లీష్ పదాలు తెలుగు వాళ్ళ తో పోలిస్తే చాలా తక్కువ. తమిళ కమర్షియల్ సినిమాలూ, మ్యూజిక్కూ ఇండియా లో మోస్ట్ క్రియేటివ్. మన తెలుగు సినిమా ఫీల్డ్ లో డబ్బూ ఆర్భాటం చెంచాగిరీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది మీడియా ని చూస్తే. తెలుగు సినిమా లు చాలా వరకు తమిళ మాతృకలకు రీమేక్ అయివుంటాయి.
ముప్పై రోజుల్లో తమిళం పుస్తకం కొని తమిళం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను.
**************
సాఫ్ట్ వేర్ మంచి బూం లో ఉంది. మా కంపెనీ తరపున వారానికో పార్టీ అన్నా జరుగుతోంది. పార్టీల్లో తాగేవాడికి తాగినంత,తినేవాడికి తినినంత…చాలా మంది కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకొంటున్నారు. ప్రాజెక్ట్ లు వస్తాయనే ఆశ తో అదనం గా కూడా జనాలను తీసుకొంటున్నారు. అప్పట్లో మా మధ్య ఓ ఈ మెయిల్ సర్క్యులేట్ అవుతూ ఉండేది.ఈ జోక్ మీకు తెలిసే ఉంటుంది.
“సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒకడు ట్రైన్ లో ఒక కూలి వాడిని కలుస్తాడు. కూలివాడు సాఫ్ట్ వేర్ మనిషిని లెక్క చేయకుండా అతని ఎదురు గా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. దీంతో వళ్ళు మండిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూలి వాడిని అడుగుతాడు,”రేయ్ కూలీ, నా జీతమెంతో తెలుసా? నెలకి ముప్పై వేలు. మరి నీ జీతం ఎంత?”
“నాకు నెలకు మూడు వేలొస్తే పండగ సార్”.
“నా మొబైల్ ఖరీదు పదిహేను వేలు. నీకు సెల్ ఫోన్ ఉందా?”
“లేదు బాబూ”
“లాప్ టాప్ అంటే ఏమిటో తెలుసా?”
“తెలవదండీ”
ఈలొగా ట్రైన్ ఒక స్టేషన్ లో ఆగుతుంది. కూలి వాడు తువ్వాలు తీసి దులిపి తలకు చుట్టుకొన్నాడు. తన తట్టా పారా పట్టుకొని,”నాకు పనుందయ్యా! తమరికి ఆఫీసు లో ఏమాత్రం పనుంటాదేటి?” అని ట్రైన్ దిగిపోయాడు.
****************
మా ఆఫీస్ లో సరళ అని ఓ అమ్మాయి ఉంది.మామూలు గా ఫ్రెండ్స్ తో తమిళం లో మాట్లాడుతుంది. ఈ రోజు, ఇంటినుంచీ అనుకుంటా, ఫోన్ వస్తే తెలుగు లో మాట్లాడుతోంది..తమిళ యాస లో.అడిగితే చెప్పింది,” మా కుడుంబం ఎల్లా తెలుగు వాళ్ళేనండీ. తమిళ్ నాట్ల చాల టైం వెనకాల సెట్టిల్ అయ్యాం”.
ఓ రోజు మా టీం మేట్ మనీషూ నేనూ మద్రాస్ ని కసి తీరా తిట్టుకొంటున్నాం. మద్రాసు ఎంత డర్టీ గా ఉంటుందో,తమిళియన్స్ ఎంత పారోకియల్ గా ఉంటారో అంటూ.
“ఇక్కడ హోటళ్ళ వాళ్ళూ ఎంగిలి ప్లేట్లు కడిగి ఆ నీళ్ళన్నీ రోడ్డు మీద పోస్తారు”, హిందీ లో అంటున్నాడు మనీష్. సరళ పక్కనుండీ మా మాటలు విన్నట్లుంది. మా దగ్గరకు స్పీడ్ గా నడుచుకొంటూ వచ్చి, ” అలా అయితే మీరు మీ ఊళ్ళలో నే ఉండలేక పోయారా? ఇక్కడికెందుకొచ్చారు?”అని వెళ్ళి పోయింది. సరళ స్వతహా గా తమిళ అమ్మాయి కాక పోయినా ఆమెకు కోపం ఎందుకొచ్చిందబ్బా!!?
****************
సరళ కు కంపైల్ ఎర్రర్ వస్తోంది. నన్ను పిలిచి చూడమంది.నేను మోనిటర్ వంక చూస్తూ లైన్ నంబర్ వేలితో చూపిస్తూ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని ఆమె మౌస్ మీద చెయ్యి వేశాను. కానీ అప్పటికే మౌస్ మీద ఆమె చెయ్యి ఉంది. నా చెయ్యి ఆమె చెయ్యి మీద పడింది. వెంటనే చెయ్యి వెనక్కి లాక్కుని “సారీ” అన్నాను.
“ఇట్స్ ఓకే”, అంది సరళ, తలతిప్పి చూడకుండా..
అంటే నేను చెయ్యి వేసినా పరవా లేదనా? ఛ.. అలా ఏమీ కాదు. టౌను పిల్ల ఈమాత్రానికే సిగ్గు పడదు కదా. వాళ్ళకి ఇవన్నీ మామూలే. నా పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్ వలన నాకు అలా అనిపిస్తోంది. అయినా దీనికి నేను లైన్ వెయ్యడం ఏమిటి? నల్ల గా,బక్క గా, ఫ్లాట్ గా..యాక్.
నేను ఈ ఆలోచనలలో ఉండగానే మా టీం లీడ్ వచ్చి, నాకు బెస్ట్ టీం మెంబర్ అవార్డ్ వచ్చిందని చెప్పాడు. సరళ వచ్చి నా హాండ్ షేక్ చేసి,”కంగ్రాట్స్..పార్టీ ఎప్పుడు?” అంది. ఒక అమ్మాయి నన్ను టచ్ చెయ్యటం అదే మొదలు.
నేను,”పార్టీ ముందు నువ్వే ఇవ్వాలి.నీ కంపైల్ ఎర్రర్ పోయింది కదా?” అన్నాను.
దానికి ఆమె, నా నెత్తి పై చిన్న గా ఒకటి మొట్టి,” మొస కుట్టి…లిటిల్ రాబిట్..తప్పించుకుంటున్నావ్!” అంది.
ఇదేంటబ్బా మనతో క్లోజ్ గా మూవ్ అవుతోంది? అందరి తో ఇలానే మూవ్ అవుతుందేమో?లేక పోతే ఈ సిటీ అమ్మాయిలకి ఇది మామూలేనేమో…నీతోనే క్లోజ్ గా మూవ్ అవ్వాలని నీకే మనసు లో ఉందేమో. “ఇంకెవ్వరితోనూ క్లోజ్ గా మూవ్ అవ్వదు .నాతో నే అవుతుంది”అనుకొంటున్నావ్. ఇది విష్ ఫుల్ థింకింగ్….
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
17 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:gudi, puraanam, rama charita manas, ramayan, tulsee das
గుళ్ళో ఆ సాయంత్రం పురాణ కాలక్షేపం ఉంది. కృష్ణా రావు గారి అమ్మ సీతమ్మ గారు శ్రీధర్ కి స్నానం చేయించి, పౌడర్ రాసి, తనూ స్నానం చేసి వాణ్ణి తీసుకొని శివాలయానికి బయలు దేరింది. గుళ్ళో రికార్డులు వేయడం మొదలు పెట్టారు. “శివం శంకరం శంభు నీశానమీనే..” ఆ సాయంత్రపు చల్ల గాలి లో భక్తి పాటలు హృదయానందకరం గా వినపడుతున్నాయి.
పురాణం చెఫ్ఫే స్వాముల వారు కొంచం లావు గా పొట్టి గా వున్నారు. తెల్లటి గడ్డం తో కావి బట్టల తో ప్రశాంతం గా ఉన్నాడాయన. పురాణం లో ఆ రోజు ఘట్టం “శ్రీ రామ పాదుకా పట్టాభిషేకం”. స్వాముల వారు ఉత్తరాది వెళ్ళినపుడు “రామ చరిత మానస్ చదవటం జరిగింది”.అప్పుడే స్వాముల వారికి తులసీ దాసు సృష్టించిన భక్తి రసాన్ని తెలుగు వారికి రుచి చూపించాలనే తలంపు కలిగింది.
శ్రోతలందరూ గుడి లో ని సిమెంట్ గచ్చు మీద కూర్చొని ఉన్నారు.పక్కనున్న మామిడి తోపుల మీది నుంచీ చల్ల గాలి వీస్తోంది. గుళ్ళోని కర్పూరపు వాసన హాయి గా అనిపిస్తోంది. చల్లటి సిమెంట్ గచ్చు మీద బాసింపట్టు వేసుకొని కూర్చున్న శ్రోతల కాలి పిక్కల మరకలు పడుతున్నాయి.
స్వాములవారు “రాముని పాదుకలను భరతుదు అడగటం” గురించి చెబుతున్నారు. ఆయన అవధీ భాష లోని పద్యాలు కమనీయం గా పాడి వాటి అర్ధాన్ని పారవశ్యం తో, తెలుగు లో తేనెల సోనలు గా జాలువారుస్తున్నారు. ఆయన మాటలు వింటుంటే శ్రీధర్ కి “త్రేతా యుగం లొకి వెళ్ళి, తాను కూడా ఆ పాదుకా పట్టాభిషేక సన్నివేశానికి ఒక సాక్షి గా నిలుచున్న”ట్లనిపించింది. మామిడి తొటలోంచీ మామిడి పూల వాసన తో వీచే మలయ మారుతం ప్రశాంతతనిస్తోంది.
అక్కడ ఉన్న శ్రోతలందరూ స్వాముల వారి వ్యాఖ్యానాన్ని వింటూ తనలాగే అనుభూతి ప్రపంచం లో విహరిస్తున్నారను కొంటున్నాడు శ్రీధర్. శీతా కాలం లో పొద్దున్నే అమ్మ స్నానం చేయిస్తూ నెత్తి మీద పోసిన గోరువెచ్చటి నీళ్ళ లా ఉంది స్వాముల వారి ప్రవచనం. శ్రీధర్ నెమ్మది గా గచ్చుమీద కి జారి నాయనమ్మ వడి లో తల పెట్టుకున్నడు. కొంచెం సేపట్లో నిద్రా దేవత వాడిని తన వడి లో కి తీసుకుంది.
వాడు మళ్ళీ కళ్ళు తెరిచే సరికి వాడికి వాళ్ళ మండువా ఇంటి పైకప్పు కనిపించింది.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
18 అక్టో 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:gajini, kiss, romance, tamil, tamil actor surya
ఒక రోజు “తమిళం రేకు డబ్బా లో గులక రాళ్ళు పోసి మోగించినట్లుంటుంది”, అన్నాను సరళ తో. దానికి ఆమె పెద్ద సీన్ క్రియేట్ చేసి నాతో మాట్లాడటం మానేసింది. రెండు రోజుల తరువాత సరళ లిఫ్ట్ లో ఒంటరి గా తగిలింది. ఆమె లిఫ్ట్ లో నాకు ఎదురు గా నిల్చొంది. నా కళ్ళు ఆ అమ్మాయి వైపుకు లాగుతున్నాయి. నేను తల తిప్పి అద్దం లోకి చూస్తున్నప్పటికీ, నా మనసు మాత్రం గుడ్లు మిటకరించి సరళ వైపే చూస్తోంది. నా చూపుల్ని ఆ అమ్మాయి గమనిస్తే బాగోదు. కనీ నాకు లోపల ఎక్కడో సందేహం, ఆమె కూడా నన్నే గమనిస్తోందని. నా మనోనేత్రం ముందు ఆ అమ్మాయి నన్ను గమనిస్తోన్న దృశ్యం కదలాడి, నేను “షై” గా అవుతున్నాను. కానీ ఆ అమ్మాయి నన్ను చూస్తోందో లేదో నిర్ధారించుకుందామంటే ఆ అమ్మాయి వంక చూడాలి..కానీ చూస్తే బాగోదు…ఒక వేళ నేను చూసిన టైం లో ఆ అమ్మాయి వేరే పక్కకు చూసి, నేను చూడనప్పుడు మాత్రమే నన్ను చూస్తే,నాకు ఎప్పటికీ తెలియదు ఆమె నన్ను చూస్తోందో లేదో. నా అటెన్షన్ మొత్తం ఆమె మీదే ఉంది కానీ నా చూపులు మాత్రం అద్దం వైపుకి ఉన్నాయి. ఆమె కూడా ఉండటం నాకు లోలోపల పరమానందం గా ఉంది. కానీ ఆ ఆనందం బయటపడకుండా దాచుకోవటం అసాధ్యమైపోతోంది నాకు.
ఆమె ఒక్కసారి గా నవ్వ సాగింది. నేను విస్తుపోయి ఆమె వైపుకి చూసే లోగా,ఆమె నా వైపుకు ఒక అడుగు వేసి,చేయి ముందుకి చాచి,”హాయ్,అయాం సరళా, అండ్ మీట్ మై ఫ్రెండ్
శ్రీధర్ అంది అద్దం లో నా బొమ్మ చూపిస్తూ. నేను అప్రయత్నం గా ఆమె చెయ్యి అందుకున్నాను. మాటలు ఆపేయటమూ ఆమె ఇష్టమే..మాటలు మొదలు పెట్టడమూ ఆమె ఇష్టమే..ఏంటో ఈ సిటీ అమ్మాయిలు ఎప్పటికీ నాకు అర్ధం కారు.
****************************
సరళ గురించి నాది ‘విష్ ఫుల్ థింకింగ్’ అవునో కాదో తేల్చుకోవాలనిపించింది. సరళ కి తమిళ యాక్టర్ సూర్య అంటే ఇష్టం అని నాకు తెలుసు. ఈ రోజు సూర్య నటించిన గజిని కి రెండు టిక్కెట్ లు తీసుకొన్నాను. అ సాయంత్రం సరళ తో చెప్పాను,”మా ఫ్రెండ్ ఒకతను వస్తాడనుకొంటే అతను రావటం కుదర లేదు. గజిని సినిమా కి వస్తావా?”.
సరళ చిన్న పిల్ల లా అరిచి గోల చేసి తన సంతోషం ప్రకటించింది. ఇక్కడే గనుక మా అమ్మ ఉంటే సరళ ను కసురు కొనేది.ఆడ పిల్లలు ఒద్దికగా ఉండాలమ్మా అని చెప్పేది సరళకి..
మళ్ళీ నాకు అనుమానం,”సినిమా కి సూర్య వలన వస్తోందా, నా వలన వస్తోందా?”
మేము ఒక థియేటర్ కి వెళ్ళే బస్సు పట్టుకున్నాం. బస్సు లో ఆడవాళ్ళ సీట్ ల లో ఒకే సీట్ ఖాళీ గా ఉంది. పల్లెటూరి తమిళ రైతు పెళ్ళాం లా ఉన్నామె కిటికీ పక్క సీట్ లో కూర్చొని ఉంది. ఆమె పక్క సీట్ ఖాళీ గా ఉంది. సరళ కి ఆ సీట్ చూపించి “కూర్చోవచ్చు కదా”, అన్నాను. ఆమె కూర్చో లేదు. బస్సు దిగిన తరవాత సరళ ని అడిగాను, “సీట్లో ఎందుకు కూర్చో లేదు?” అని.
” ఆ ఆడ మనిషి చాలా రిపల్సివ్ గా కనిపించింది. అందుకే కూర్చో లేదు”.
ఆ సినిమా లో కొన్ని టెన్స్ మూమెంట్స్ ఉన్నాయి. అప్పుడు సరళ నా మోకాలి మీద చెయ్యి వేస్తోంది. అలానే కాసేపు ఉంచి చెయ్యి తీసివేస్తోంది. కావాలని చెయ్యి వేస్తోందా, యధాలాపం గా వేస్తోందా? ఇప్పుడే తేలి పోవాలి.
సరళ చెయ్యి తీసి,మళ్ళీ ఇద్దరిమధ్యా ఉన్న సీట్ కోడు మీద వేసి సినిమా లో లీనమైపోయింది. నా గుండె చప్పుడు నాకు వినపడుతోంది.లబ్ డబ్…లబ్…డబ్..
నేను నెమ్మది గా నా చెయ్యి తీసి ఆమె చెయ్యిమీద వేశాను.సరళ చెయ్యి వెనక్కి తీసుకో లేదు….సినిమా లో లీనమై పట్టించుకోవడం లేదా?!
సరళ ముఖం లో కి చూశాను. ఆమె అటెన్షన్ సినిమా మీద లేదని అర్ధమైంది నాకు.నెమ్మది గా నా చెయ్యి ఆమె చేతి లోకి తీసుకొని మృదువు గా నొక్కింది. నా వైపు నవ్వు కళ్ళ తో చూస్తోంది.నేను ఆమె చేతిని పైకి తీసి నా గుండెల తో పాటు అదురుతున్న నా అధరాలకు ఆనించాను.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
19 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:erotic, intercourse, puberty, sexuality, start of puberty
చిన్నూ తొమ్మిదవ తరగతి లో కి వచ్చాడు. చిన్నూ వాళ్ళక్క కవితేమో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, మొవ్వ డిగ్రీ కాలేజ్ లో బి. కాం లో చేరింది. రోజూ ఆర్టీసీ బస్సు లో కాలేజీ కి వెళ్ళి వస్తోంది.
ప్రతి యేడూ మామిడి తోటల కి మోటారు తో నీళ్ళు పెడతారు. లేక పోతే వాటి కాపు సరిగా ఉండదు. కృష్ణా రావు కి పక్క ఊళ్ళో ఒక పెళ్ళికి వెళ్ళ వలసిన పనిబడింది. ఆయన వాళ్ళ నౌకరు చింతపండు కి తోట లో నీళ్ళు పెట్టమని చెప్పి పెళ్ళి కి బయలు దేరాడు. వెళ్తూ వెళ్తూ చిన్నూ ని పిలిచి,”మధ్య లో తోట లో కి వెళ్ళి నీరు ఎలా పారుతోందో చూడు”, అని చెప్పాడు. ఇదే నాగులు ఉన్నప్పుడు ఈ మాట చెప్పేవాడు కాదాయన.
శ్రీధర్, మధ్యాహ్నమయిన తరువాత తోట కి బయలుదేరాడు. అకాశం మబ్బులు పట్టి ఉంది. ఉక్క గా ఉంది. దారి మధ్య లో చినుకులు పడటం మొదలైంది. చిన్నూ దారి లోని ఒక చెట్టుకింద కూర్చొని వాన ఆగటం కోసం ఎదురు చూశాడు. అర గంట కి తగ్గింది వాన. వాన కడిగిన చెట్ల ఆకులు అప్పుడే పదిన నీరెండ కి తళ తళ లాడుతున్నాయి. వాన లో తడిచిన మట్టి వాసన గమ్మత్తు గా ఉంది. పక్షులు తడి రెక్కలు టప టప లాడించి ఎగరటం మొదలు పెట్టాయి,కిలకిల శబ్ధాల తో. తోట లో మోటారు శబ్దంవినపడటం లేదు. “కరెంటు పోయిందా ఏంటబ్బా?” అనుకొంటూ చిన్నూ మోటారు రూం వైపు అడుగేశాడు. ఎక్కడి నుండో గాజుల చప్పుడు వినపడుతోంది. అప్పుడప్పుడూ మెడ లో వేసుకొనే గొలుసు సవ్వడి….చిన్నూ మోటారు రూం వైపు త్వరగా అడుగులు వేసి ఒక్కసారిగా నిలబడి పోయాడు.
మోటారు రూం పై కప్పు నుండీ అప్పుడే ఆగిన వర్షపు నీరు బొట్టు బొట్టు గా కిందికి పడుతోంది. మోటారు రూం లో చిరు చీకటి గా ఉంది. ఆ చీకట్లో రెండు ఆకారాలు ఊగుతూ కనపడ్డాయి. పైన ఉన్న అకారం చింతపండు గాడి ది లా ఉంది …ఆ వాడే సందేహం లేదు. కింద పడుకొని ఓ మనిషి…కాదు ఆడ మనిషి ఉంది. ఆమె బట్టలు ఉండ వలసిన చోట లేవని ఆ చిరు చీకట్లో తెలుస్తోనే ఉంది. చింతపండు గాడికి చొక్కా లేదు. వాడు ఆమె పై పడుకొని ఊగుతున్నాడు. ఆమె చేతులు చింతపండు గాడి వీపు పై ఉన్నాయి. వాడు కదిలినప్పుడు ఆమె గాజులు మోగుతున్నయి, గొలుసు మోగుతోంది. మధ్య మధ్య లో ఆమె ఎడమ చేయి వాళ్ళిద్దరి మధ్య కీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమె నెమ్మది గా మూలగ సాగింది. శ్రీధర్ తల లో ఏవో పేలుళ్ళు జరుగుతున్నాయి.వాడి శ్వాస బరువై వళ్ళు వేడెక్కుతోంది. ఆ నిమిషం ఏం చెయ్యాలో తోచటం లేదు. ఆడ మనిషి మూలుగులు పెద్దవై కేకల స్థాయి కి చేరాయి. ఇంతలో అకస్మాత్తు గా కేకలు ఆగి పోయాయి. అంతా ఓ నిమిషం నిశ్శబ్దం. తరువాత మోటరు ఆన్ అయిన శబ్దం. రెండు ఆకారాలు నీడ గా బట్టలు సరి చేసుకొంటూ బయటకు పోతున్నాయి.
శ్రీధర్ కి వాళ్ళ కంట పడటానికి ఎందుకో సిగ్గేసింది. వాడు తోట లో ఓమూల కూర్చొన్నాడు. జరిగిన సంఘటన వాడి బుర్ర-తెర ముందు పదే పదే మెదల సగింది. వాడి గుండె దడ నెమ్మది గా తగ్గింది. వాడికి చింతపండు గాడి మీద ఏదో తెలియని అసహ్యం కలిగింది.
మరునాడు శ్రీధర్ కృష్ణా రావు దగ్గరికి వెళ్ళి,”నాన్నా,నాకు కట్ డ్రాయర్ కొని పెట్టు” అన్నాడు.
దానికాయన,”కట్ డ్రాయర్ ఎందుకు రా నీకు హఠాత్తు గా?”, అన్నాడు.
“మా క్లాస్ లో నా ఫ్రెండ్స్ అందరూ వేసుకొంటున్నారు”.
తరువాతిరోజునుంచీ శ్రీధర్ కూడా వాళ్ళ క్లాస్ లోని కట్ డ్రాయర్ ల క్లబ్బు లో జాయిన్ అయ్యాడు.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
20 అక్టో 2011 1 వ్యాఖ్య
in కథలు ట్యాగులు:apartment, flat, las angeles, onsite, profile, rent
సరళ తో నా పెళ్ళి కి రెండు పక్కలా పెద్ద వాళ్ళను ఒప్పించడానికి ఒక పెద్ద తపస్సే చేయవలసి వచ్చింది. మద్రాస్ లో జరిగిన మా పెళ్ళికి మా ఇద్దరి ఫ్రెండ్స్ కొందరు, నా వైపు నుండీ కొద్ది మందీ, సరళ వైపు నుండీ చాలా మందీ వచ్చారు. మా పెళ్ళైన రోజే నా ప్రాజెక్ట్ మేట్ మనీష్ పెళ్ళీ కూడా అయింది,బీహార్ లో. పెళ్ళయిన తరువాత హనీమూన్ కి ఊటీ వెళ్ళి వచ్చాం. పెళ్ళి కోసం పెట్టిన లీవ్ చాలా త్వరగా అయిపోయింది.
వడపళని లో ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకొని ఫామిలీ మొదలుపెట్టాం. అపార్ట్ మెంట్ రెంట్ నేను కట్టాలనీ మిగిలిన ఇంటి ఖర్చులు సరళ భరించాలనీ డిసైడ్ చేసుకున్నాం.
ఆఫీస్ కి లీవ్ నుంచీ తిరిగి వెళ్ళిన నాలుగు రోజులకి మా మేనేజర్ పిలిచాడు.
“యూ ఎస్ ఆన్ సైట్ ఆపర్ట్యునిటీ ఉంది. నీ ప్రొఫైల్ బెస్ట్ ఫిట్ అవుతుంది. డూ యూ హావ్ ఎనీ ప్రాబ్లం ఇన్ టేకింగ్ అప్ ద అస్సైన్మెంట్?” అన్నాడాయన. నాచిన్నప్పుడు అమెరికా వెళతానని కల లో కూడా అనుకో లేదు.ఇప్పుడు అవకాశం వచ్చింది. కానీ పెళ్ళైన వెంటనే.
మా మేనేజర్ని నా తో పాటు నా వైఫ్ ని కూడా తీసుకొని వెళ్ళ వచ్చునేమో అడిగాను.
దానికాయన, “నీకు బీ ఒన్ వీసా అప్ప్లై చేయాలి. ఆ వీసా తో వైఫ్ ని తీసుకొని వెళ్ళడం కుదరదు” అన్నాడు. “నీతో పాటు మనీష్ కూడా యూ ఎస్ వస్తున్నాడు. మనీష్ ది హెచ్ ఒన్. కాబట్టీ అతను వైఫ్ ని కూడా తీసుకొని వెళ్తున్నాడు” అని కూడా అన్నాడు.
సరళ తో ఫోన్ లో ఈ విషయం చెప్పి, “నాకు నువ్వు లేకుండా వెళ్ళాలని లేదు” అన్నాను. దానికామె,”కెరీర్ ముఖ్యం.ఏమీ ఆలోచించకుండా ఒప్పుకో. ఇదే నేనయితే ‘యెస్’ చెప్పేదానిని”, అంది.
ఆ రోజే మా మేనేజర్ కి ‘యెస్’ చెప్పి తరవాతి రోజు వీసా కి అప్ప్లై చెశాను. వీసా రావటానికి ఇరవై రోజులు పట్టవచ్చు. మూడు నెలలు ప్రాజెక్ట్ యూ ఎస్ లో, వెళ్ళవలసినది లాస్ ఎంజెలెస్. బీ ఒన్ వీసా మీద పని చేయకూడదు కాబట్టి, యూ ఎస్ లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో బిజినెస్ కోసం వెళ్తున్నానని అబద్దం చెప్పాలి అని బ్రీఫ్ చేశారు మా కంపనీ ‘హెచ్ ఆర్ మొబిలిటీ’ వాళ్ళు.
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
21 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:arm chair, communist, cricket, fight, ideology, lbw, match, paper cigaret, school gang
శ్రీధర్ వాళ్ళ క్లాస్ లో రెండు గ్యాంగ్ లు ఉన్నాయి. ఒకటి శ్రీహరి గ్యాంగ్, ఇంకోటి వేణు గ్యాంగ్. శ్రీధర్ వేణు గ్యాంగ్ లో మెంబర్. ఈరెండు గ్యాంగ్ లూ హై స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నాయి. బ్యాటూ వికెట్లూ కార్క్ బాలూ రెడీ అయ్యాయి. శ్రీహరి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయటానికి సిద్ధమైంది. అది లిమిటెడ్ ఓవర్ల మ్యాచ్. ఇరు జట్లూ ఇరవై ఓవర్లు బ్యాటింగ్ చేస్తాయి. శ్రీహరి వాళ్ళ అన్నయ్య అంపైర్. ధడేల్ గాడు స్కోరర్. వాడు ఈ మధ్య గోడ మీది నుంచీ దూకి మోకాలి చిప్ప ఊడగొట్టుకున్నాడు. కాబట్టీ ఆడటం లేదు.
వేణు టీం బ్యాటింగ్ కి వచ్చింది. వేణూ శ్రీధరూ ఓపెనర్లు గా వచ్చారు. శ్రీధర్ మంచి హిట్టర్. వేణు డిఫెన్సివ్ గా ఆడతాడు. శ్రీధర్ వరుస గా నాలుగు బౌండరీ లు కొట్టి ఆ ఓవర్ లాస్ట్ బాల్ కి సింగిల్ తీసి మళ్ళీ స్ట్రైక్ కి వచ్చాడు. బౌలర్ కొత్త వాడు. వాడు వేరే ఊరి నుంచీ ట్రాన్స్ఫర్ అయి వచ్చి స్కూల్లో ఆ ఏడే చేరాడు. బౌలర్ బాల్ ని ఆఫ్ స్టంప్ బయట వేశాడు. నేల మీద చిన్న చిన్న గుంటలు ఉన్నాయి.బాలు ఏదో గుంత లో పడి, టర్న్ అయ్యి శ్రీధర్ మోకాలు కి కొట్టుకుంది. శ్రీధర్ మొకాలుని చూస్తూ రుద్దుకుంటున్నాడు. ఒక్క సారిగా జనాల అరుపులు వినపడ్డయి వాడికి. తలెత్తి పైకి చూస్తే అంపైర్ వేలు పైకెత్తి ఉన్నాడు. శ్రీహరి టీం వాళ్ళు ఒకచోటకి చేరి సెలబ్రేట్ చేసుకొంటున్నారు. ధడేల్ గాడు స్కోర్ కార్డ్ కింద పడేసి టైం ఔట్ కి అడిగాడు. వాడు అంపైర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఎందుకు ఔట్ ఇచ్చావని అడిగాడు.అంపైర్ “ఎల్ బి డబ్ల్యూ” అన్నాడు. ధడేల్ గాడు,”నువ్వేమి అంపైర్ వి రా? నీకు క్రికెట్ అసలు తెలుసా?” అన్నాడు వీడేదో ఎక్స్ పర్ట్ అయ్యినట్లు.
అంపైర్ వాడిని చంపేసేట్లు చూస్తూ,”నువ్వు టీం లోనే లేవు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు రా. పోయి స్కోర్ వేసుకోరా”, అన్నాడు ఎగతాళి గా.
ధడేల్ గాడు, “కరెక్ట్ రా, నేను టీంలో లేను,నువ్వు మాత్రం అంపైర్ అయ్యివుండి కూడా, శ్రీహరి టీం లో ఉన్నట్లు మాట్లాడుతున్నావ్. వాళ్ళతో కలిసి తొండి చేస్తన్నావు రా”, అని అరిచాడు.
అంపైర్ ధడెల్ గాడి కాలర్ పట్టుకొని ఊపాడు. వాడి చొక్కా గుండీ కిందపడింది. వేణు టీం లో జనాలు పిచ్ మీదకి వచ్చేశారు. ఈ లోపు శ్రీహరి వేణు తో ఏదో మాట్లాడి సర్ది చెప్పాడు. ఆట మళ్ళీ మొదలైంది. వేణు జట్టు 68 పరుగులు చేసింది, ఇరవై ఓవర్లలో. శ్రీహరి టీం బ్యాటింగ్ ప్రారంభించింది. ఒక పక్క ధడేల్ గాడు స్కోర్ నోట్ చేస్తుంటే, శ్రీహరి టీం లోంచీ వేరొకడు స్కోర్ నోట్ చేస్తున్నాడు.
వేణు మంచి ఫీల్డర్. వాడి త్రో లు కరెక్ట్ గా ఉంటాయి. అప్పటికే శ్రీహరి టీం లోఇద్దరు రన్ ఔటయ్యారు వాడి త్రో ల కి.
ధడేల్ గాడు లేచి అరిచాడు, “లాస్ట్ ఓవర్, ట్వంటీ ఫైవ్ రన్స్ టు విన్!!”. శ్రీహరి వాళ్ళ టీం ఇది తప్పుడు స్కోరని అరిచారు. వాళ్ళ స్కోరర్ ప్రకారం గెలవటానికి ఇంకా పన్నెండు రన్సే కావాలి. రెండు టీం లూ వాదించుకోవటం మొదలెట్టాయి. వేణు టీం వాళ్ళు,”అంపైర్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం కదా. వాడు ఎల్ బీ దబ్ల్యూ ఔట్ ఇస్తే మేము ఎదురు చెప్పలేదు కదా! మీరు కూడా స్కోరర్ ధడేల్ గాడి మాట వినాలి” అన్నారు.
చివరికి శ్రీహరి జట్టు 25 రన్ల లక్ష్యానికి కి బాటింగ్ చేయటానికి ఒప్పుకుంది. ఆ చివరి ఓవర్ మొదట్లో ఒక ఫోరూ,ఒక సిక్సూపడ్డాయి. తరువాతి మూడు బాల్సూ డాట్ బాల్స్. లాస్ట్ బాల్ పడింది. బ్యాట్స్ మేన్ గట్టిగా కొట్టాడు. బాలు బౌండరీ లైన్ వైపు పరుగెట్టసాగింది. అక్కడ వేణు ఉన్నాడు. వాడు బాల్ ని వికెట్ కీపర్ చేతుల్లోకి చక్కగా త్రో చెసాడు. చివరి గా శ్రీహరి టీం, మాచ్ ని 15 రన్స్ తో ఓడిపోయింది. కానీ దాన్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ధడేల్ స్కోర్ సరిగా వేయలేదన్నారు వాళ్ళు. వేణు టీం వాళ్ళూ అంపైర్ తొండి చేసినా మేమే గెలిచామన్నారు. రెండు జట్లూఒకరిని ఒకరొ,”మోసం చేశారు”, అనుకుంటూ విడి పోయాయి.
గ్రౌండ్ లో పక్కనే వాలీ బాల్ గేం జరుగుతూ ఉండటం తో, శ్రీధర్ చూడటానికి వెళ్ళాడు. వాడి టీం లో మిగతా వాళ్ళు ఇళ్ళకు వెళ్ళిపోయారు. వాలీ బాల్ గేం అయిన తరువాత శ్రీధర్ ఇంటి ముఖం పట్టాడు. దారి లో వాడికి శ్రీహరి గ్యాంగ్ తగిలింది. వాళ్ళు వీడిని ఏడిపించటం మొదలు పెట్టారు. వాళ్ళలొ ఒకడన్నాడు, “వికెట్ కి కాళ్ళు అడ్డు పెడితే, ఎవరైనా సచిన్ లా బ్యాటింగ్ చెయ్యవచ్చు రా!”. “స్కోర్ లో మోసం చేస్తే ఎవరైనా గెలుస్తారు రా”,ఇంకొకడు అంటున్నాడు.గ్యాంగ్ అంతా నవ్వుతోంది. వాళ్ళు వాడి వైపుకి నెమ్మది గా నడుచుకు వస్తున్నారు. శ్రీధర్ కి వళ్ళు మండుతోంది వాళ్ళందరి పైనా. వాడు ఒక్క సారి గా వంగి, కింద నుంచీ ఒక రాయి తీసి విసిరేశాడు శ్రీహరి వైపుకి బలం గా. వెంటనే వెనక్కి తిరిగి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు వాడు. ఆ రాయి శ్రీహరి రొమ్ము మీడ బలం గా తగిలింది. గ్యాంగ్ లో వాళ్ళందరూ నిర్ఘాంతపోయారు. వాళ్ళు తేరుకొనే లొఫు శ్రీధర్ పారిపోయాడు.
మరుసటి రోజు హెడ్ మాస్టరు వేణు టీం ని పిలిచి అడిగాడు, “ఏంటి రా బళ్ళోగొడవలు మొదలెట్టారంట”, అని. తరవాత ఆయన శ్రీహరి గ్యాంగ్ ని కూడా పిలిచాడు. బళ్ళోని క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా పిలిపించాడు. వాళ్ళ చేతికి బెత్తాలిచ్చి,వాళ్ళ చేత రెండు గ్యాంగ్ ల లో వాళ్ళనీ, వాళ్ళ చేత కొట్టించాడు. ఆ పైన రెండు గ్యాంగ్ లనీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొమ్మన్నాడు. చివరి గా,” మళ్ళీ మీరు ఫైటింగ్స్ చేశారో, అందరినీ స్కూల్ నుంచీ డిబార్ చేస్తా”,అని హెచ్చరించి వదిలాడు.
********************
శ్రీధర్ ఆ మధ్య పేపర్ సిగరెట్లు కాల్చటం నేర్చుకొన్నాడు,ధడేల్ నుంచీ. వాడూ ధడేలూ ఎండిపోయిన తాటి పువ్వుని పేపర్ లో చుట్టి, శ్రీధర్ వాళ్ళ దొడ్లో తాగ సాగారు. శ్రీధర్ వాళ్ళ నాన్న దాన్ని చూశాడు. ఇద్దర్నీ పిలిచి అన్నాడు,”ఇది మంచి అలవాటు కాదు”.
హఠాత్తు గా శ్రీధర్ అన్నాడు, “మరి నువ్వు చుట్ట ఎందుకు కాలుస్తావ్?”
కృష్ణా రావుఏమి మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు.
ఆ సాయంత్రం కృష్ణా రావు శ్రీధర్ ని ఆయన గది లోకి పిలిచాడు.
“నేను చిన్నప్పుడు ఏదో సావాస దోషం వలన చుట్టకి అలవటు పడ్డాను.మానెయ్యటానికి చాలా సార్లు ప్రయత్నం చేశాను. కానీ కుదలేదు. పొగ తాగటం లో ఉండే నష్టాలేంటో నాకు తెలుసు. ఒక సారి మొదలైన తర్వాత మానటం కష్టం. నేను తాగినా,నువ్వు తాగటం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నువ్వు పొగతాగవద్దని చెప్తున్నా. అ తరవాత నీ ఇష్టం”, అన్నాడాయన.
ఆ తరువాత శ్రీధర్ ఎప్పుదూ పొగ తాగలేదు. అయితే ఈ సంఘటన తో వాడికో విషయం అర్ధమయ్యింది. ఒక నియమాన్ని పాటించని వ్యక్తులకి కూడా,ఆ నియమాన్ని పాటించమని చెప్పే అధికారముంటుంది. అయితే ఆ నియమం ఎదుటి వారి మేలు కోరి చెప్పినదై ఉండాలి. వ్యక్తిగతం గా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని పాటించ లేని వారికి, సమజానికి పాటించమని చెప్పే అధికారం ఉంటుంది, వాళ్ళు సమాజం మేలు కోరెవారైతే, ఆ పాటించకపోవటంలో వాళ్ళ స్వార్థం లేనట్లయితే. అయితే వాళ్ళ విమర్శకులు వాళ్ళని తప్పుపట్టవచ్చు. కానీ విమర్శకులు నీతులు చెప్పనంత మాత్రాన వారికి ఏ వెధవ పనైనా చేసే అధికారం ఉండదు. వారికి విర్శించే హక్కు కూడా ఉండదు. “ఆం చైర్ కమ్యూనిస్ట్” ల లో చాలా మంది కృష్ణా రావు వంటి వారనిపిస్తుంది.
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఒకటవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -రెండవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -మూడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -నాలుగవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఐదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ -ఆరవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఏడవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – ఎనిమిదవ భాగం
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-9
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-10
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-11
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-12
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-13
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-14
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-15
24 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:canyan, flight, grand canyon, helicopter, international flight, jiddu krishna murthi, las vegas
నాకు ఫ్లైట్ ఎక్కటం అదే మొదటి సారి..అదీ డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫ్లైట్..నేను అంతకు ముందెపుడూ డొమెస్టిక్ ఫ్లైట్ కూడా ఎక్క లేదు. ఫ్లైట్ ఎక్కటం తోనే ఏదో సాధించినట్లనిపించింది నాకు. మా ఫ్లైట్ సింగపూర్ నుంచీ లాసేంజెలిస్ వెళ్తుంది. మనీషూ అతని భార్యా కూడా అదే ఫ్లైట్ లో వచ్చారు. మనీష్ వైఫ్ చెన్నై లో ని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తుంది. వాళ్ళ ట్రిప్ లాంగ్ టర్మ్ అవ్వటం వలన ఆమె జాబ్ కి రిసైన్ చేసింది. ఫ్లైట్ లో వాళ్ళిద్దరూ చాలా సంతోషం గా కనిపించారు. వాళ్ళు చెన్నై లో వాళ్ళ ఇల్లు ఖాళీ చేశారు. వాళ్ళు అప్పుడే యూఎస్ లో ఏ ఏ ప్లేసులు చూడాలో ప్లాన్ చేసేసుకొంటున్నారు. ఒక మ్యాప్ చూస్తూ వెళ్ళవలసిన ప్లేస్ లన్నీ లెక్కపెట్టుకొంటున్నారు. యూనివర్సల్ స్టూడియో, న్యూ యార్క్, ఫ్లోరిడా..ఇలా చెప్పుకుంటున్నారు.
లాసేంజెలిస్ ఎయిర్ పోర్ట్ నాకు బాగా నచ్చింది. దాన్ని రెండు ఫ్లోర్స్ గా కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ అంతా అరైవల్స్ కి,ఫస్ట్ ఫ్లోర్ అంతా డిపార్చర్స్ కి. ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కే సపరేట్ గా రెండు లెవల్స్ లో సిటీ నుంచీ రోడ్లు ఉన్నాయి.
మా కంపనీ వాళ్ళు పాసడీనా లో ఒక అపార్ట్ మెంట్ తీసుకొని ఉంచారు. మనీష్ చెయ్యి ఊపి ఒక టాక్సీ ని ఆపాడు. అపార్ట్మెంట్ కి వెళ్ళే దారి లో అక్కడి రోడ్లూ, పార్కులూ బిల్డింగులూ చూస్తూ ఉంటే ఇది కలా నిజమా అనిపించింది. నన్ను గిల్లి చూసు కోవాలనే ప్రయత్నాన్ని ఆపుకొవాల్సి వచ్చింది. ఇంతకు ముందు సినిమాల లో తప్పిస్తే నేను ఎప్పుడూ ఫారిన్ లొకేషన్స్ చూడ లేదు.
బాలా అని మా కొలీగ్ ఒకతను నేను వెళ్ళేటప్పటికే ఉన్నాడు రూం లో. అతని తో నాకు ఈ మూడు నెలలూ రూం షేరింగ్. బాలా కి టీనేజ్ లో లవ్ ఫెయిల్ అయ్యినట్లు గ్రహించాను అతని మాటల వలన. బాలా కి ఓ కారుంది. రోజూ నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేసే వాడు. గ్యాస్ డబ్బులు షేరింగ్.
బాలా ఆఫీస్ పని లో ఉండనప్పుడల్లా ఒకే పని లో ఉండేవాడు. అది ” జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు చదవటం.” ఆయన టీచింగ్స్ ని ప్రాక్టీస్ చేయటం లేదా జీవించటం. బాలా తో పాటు నేను కూడా కొన్ని రోజులు జిడ్డు కృష్ణమూర్తి ని చదివే వాడిని. ఆయన చెప్పిన,” సత్యమనేది ఒక దారి లేని ప్రదేశం”, అనే సత్యం నాకు చాలా నచ్చింది. జిడ్డు కృష్ణమూర్తి నన్ను కూడా జిడ్డు లా పట్టుకున్నాడు.అయితే కొన్నాళ్ళు మాత్రమే.
********************
ఓ రోజు ఆఫీస్ లో నాకు మనీష్ కనిపించాడు. అతని ముఖం చాలా డల్ గా ఉంది. అతని ప్రాజెక్ట్ స్క్రాప్ అయ్యిందట. కస్టమర్ గాడి కస్టమర్ ఫండింగ్ తగ్గించాడు.అందువలన అతని ప్రాజెక్ట్ కి కోత పడింది. అతను ఫ్యామిలీ తో సహా ఆ వీకెండే ఇండియా వెళ్ళి పోవాలి. ఈ విషయమంతా మనీష్ నవ్వుతూ చెప్పటానికి ట్రై చేశాడు కనీ, అతని గొంతు మాత్రం నవ్వటం లేదు.
అతను అన్నాడు, “ఓహ్ మళ్ళీ మొదటికే ఒచ్చింది కథ. మళ్ళీ ఆ పొల్యూషన్..మళ్ళీ ఆ జనాలూ ..ఆ దుమ్మూ.. చెన్నై లో మళ్ళీ అపార్ట్ మెంట్ కోసం తిప్పలూ మళ్ళీ…
అక్కడి జనాలు ఎందుకు తిరిగి వచ్చావ్ అని అడుగుతారు…వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ఎక్స్ ప్లైన్ చెయ్యాలి ఆహ్..మళ్ళీ మా ఆవిడ ఉద్యోగం కోసం..ప్రయత్నాలు మొదలెట్టాలి”
అతను వేరే కన్సల్టంట్ దగ్గరికి జంప్ అవుదామని చూశాడట. కానీ షార్ట్ నోటీస్… అవటం వలన సాధ్యం కాలేదట. అమెరికా లో మార్కెట్ కూడా స్లో అవ్వుతోందట. అపార్ట్ మెంట్ రెంట్ కి ఇచ్చిన అడ్వాన్స్ ని అతను ఇప్పుడు వదులు కోవాలిట. కారు అప్పు ఎలా తీర్చాలో ఇంకా ఆలోచించలేదట. బహుశా కారు ఎయిర్ పోర్ట్ పార్కింగ్ లో వదిలిపోవాలేమో అంటున్నాడు.
********************
నాకు జిడ్డు కృష్ణమూర్తి బోర్ కొట్టడం మొదలెట్టాడు. అది నా మైండ్ కి ఉన్న లిమిటేషన్ వలన కావచ్చు. బాలా కి మట్టుకు అది ఒక పాషన్. బాలా లవ్ లో ఫెయిల్ అవ్వటం వలన ఆ పాషన్ ని జిడ్డు కృష్ణమూర్తి టీచింగ్స్ మీదికి అన్-కాన్షస్ గా మళ్ళించాడని నాలో నేను ఒక థియరీ కనిపెట్టాను. ఈ థియరీ మీద నా స్వభావం యొక్క ప్రభావం ఎంతో, ప్రభావం లేని సత్యమెంతో ఆ జిడ్డు కృష్ణ మూర్తి కే ఎరుక.
*********************
క్రిస్మస్ సెలవలు కావటం తో లాస్ వేగాస్ వెళ్దామన్నాను బాలా తో.
“లాస్ వేగాస్ లో నాకు టైం పాస్ కాదు”, అన్నాడతను. ఇంకా,”దట్స్ ఎ చైల్డిష్ సిటీ”, అని కూడా అన్నాడు. అయితే గ్రాండ్ కాన్యాన్ కైతే వస్తానన్నాడు బాలా. సరే రెండింటికీ వెళ్దామని బాలాని బయలదేర దీశాను.
బాలా కార్ లో మొదట గ్రాండ్ కాన్యాన్ కి వెళ్ళాం. మెకన్నాస్ గోల్డు లోనూ టక్కరి దొంగ లోనూ కనిపించే సైట్ ఇదే. ఎండకి ఇక్కడి కొండలు పొద్దునా సాయంత్రమూ బంగారు రంగు లో కనిపిస్తాయి..
గ్రాండ్ కేన్యాన్ చేరేటప్పటికి ఉదయం ఆరయ్యింది. అక్కడ పద్ద మంచు గడ్డలు అప్పుడే కరుగుతున్నాయి. నాకు మొదటి సారి గా జీవితం లో మంచు ఎలా ఉంటుందో తెలిసింది. జీవితంలో మొదటి సారి గా చలిని తట్టుకోలేక పోవటం అలా ఉంటుందో కూడ ఆక్కడే తెలిసింది. మొట్టమొదటి సారి మాటలకందని భావనలు ప్రకృతి ని చూస్తే కలుగుతాయనీ తెలిసింది.
గ్రాండ్ కేన్యన్ భూ ఉపరి తలానికి పడిన ఒక పాట్-హోల్ లా ఉంది. దాని అడుగున కొలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ భూ గోళం చరిత్ర అంతా ఒక్క సెకండ్ లో తెలిసింట్లుంటుంది.
బాలా ఆ కొండ రాళ్ళ మీద గ్రాండ్ కేన్యాన్ చేసే మ్యాజిక్ చూస్తూ చాలా సేపు కూర్చున్నాడు. అప్పుడు గ్రాండ్ కేన్యన్ గురించి జిడ్డు కృష్ణ మూర్తి ఏమన్నాడో చెప్పాడు బాలా. నాకు గుర్తు లేక పోవటం వలన ఇక్కడ కోట్ చేయలేకపోతున్నాను.
కొంచెం సేపటి తరువాత బాలా హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళాడు. నాకు ఆ రైడ్ కాస్ట్-లీ అనిపించింది. డాలర్లని రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తే అనిపించదా, మరి? నేను మాత్రం హెలికాప్టర్ రైడ్ కి వెళ్ళకుండా కార్లోనే కూర్చున్నాను.
బాలా హెలికాప్టర్ రైడ్ అయ్యాక హోటల్ రూం కి వెళ్ళి తిని పడుకున్నాం. మరుసటి రోజు కూడా గ్రాండ్ కెన్యాన్ మీదు గా కార్ లో వెళ్ళి, అక్కడి నుండీ లాస్ వేగాస్ వైపుకి బయలు దేరాం. కారు లో స్టీరియో పాడుతోంది,”ఆజ్ ఫిర్ జీనే కీ తమన్నా హై! ఆజ్ ఫిర్ మర్నే కా ఇరాదా హై!”
తను లాస్ వేగాస్ కి ఇష్టం లేక పోయినా వస్తున్నాడు కాబట్టి,నేను తరువాత అతనికి ఒహాయ్ లోని జిడ్డు కృష్ణమూర్తి రిట్రీట్ కి వెళ్ళటానికి కంపెనీ ఇవ్వాలని కండిషన్ పెట్టాడు బాలా.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-16
25 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:kamma, kapu, kulam, mla, paramilitary, vangaveeti ranga, vijayawada
విజయవాడ లో దుండగులు ఒక ‘ఎం ఎల్ యే’ ని హత్య చేశారు. దాని వలన కృష్ణా గుంటూరు జిల్లాల లోని రెండు సామాజిక వర్గాలు (కులాల ముద్దు పేరు) దాడికి దిగాయి. ఆ రెండు జిల్లాలూ ఓ రెండు రోజుల పటు అల్లర్ల తో అట్టుడికాయి.అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తెలుగు సమాజం లోని కుల స్పృహ ని ఈ దాడులు ఒక కొత్త ఎత్తు కి తీసుకెళ్ళాయి. ఆ గాయాలు మానడానికి కొన్ని తరాలు పట్టవచ్చు.
కుల తత్వ వాదులంతా ఒకే రకం గా ఆలోచిస్తారు. మీరు ఎవరైనా కుల గజ్జి గాడిని కదపండి (మన లోపల ఉండే వాడి తో సహా). వాడి నుంచీ ఇలాంటి భావాలు బయట పడతాయి.
నా కులం మిగిలిన కులాల కంటే గొప్పదీ లేదా ప్రత్యేకమైంది.
నా కులం పై మిగిలిన కులాల వాళ్ళు ఏడ్చి చస్తున్నారు.
మిగిలిన కులాలన్నీ మా కులాన్ని అణగదొక్కాలని చూస్తున్నాయి.
పలానా రాజకీయ నాయకుడు లేక సెలెబ్రిటీ మా కులమే.
మా కులం వాళ్ళు మిగతా కులాల లా ఒకళ్ళ కొకళ్ళు హెల్ప్ చేసుకోరు వెధవలు.
అదేంటొ గానీ, మా ఇంటి పక్క వాడికీ నాదీ ఒకటే కులం. కానీ సరిహద్దుల గురించి వాడికీ నాకూ రోజూ పోట్లాటే.
మా కులానికి ప్రభుత్వం ఇచ్చే సహాయమంతా పట్టణాలలో ఉండే వాళ్ళూ,డబ్బున్న వాళ్ళే ఎగరేసుకు పోతున్నారు.
పలానా రాజకీయ నాయకుడు బాగా అవినీతి పరుడు. అతనిది మా కులమే. కానీ మిగిలిన వాళ్ళతో పొలిస్తే చాలా బెటర్. అయినా ఈ రోజుల్లో లంచం తీసుకోని వాడు ఎక్కడ ఉన్నాడు. వచ్చే ఎలెక్షన్ ల లో ఆయనకి వోటు వెయ్యటం తప్పేటట్లు కనపడటం లేదు.
కులాన్ని మనం మతం తో, భాష తో లేక ప్రాంతం తో రీప్లేస్ చెయ్యవచ్చు. పైన చెప్పిన ఆలోచనలు వాటన్నిటికీ వర్తిస్తాయి. ఇవన్నీ ‘నేను’ అనే దాని నుంచీ మొదలయ్యే భావాలు. నా కులం,నా ప్రంతం, నా మతం, నా దేశం… మామూలు గా దేశం కంటే రాష్ట్రానికీ, రాష్ట్రం కంటే ప్రాంతానికీ,ప్రాంతం కంటే కులానికీ, కులంకంటే కుటుంబానికీ, కుటుంబం కంటే స్వార్థానికీ విలువ ఇచ్చేవాళ్ళే ఎక్కువ. మనం అన్నిటికంటే ఎక్కువ విలువ ఇచ్చే ఈ “నేను” అనేది ఒక పరస్పర విరుద్ధ భావాల సమాహారం.
కులం కంటే మానవత్వానికీ,సమాజానికీ విలువ నిచ్చే కాలం ఎప్పుడు వస్తుందో! సమాజం లో ఉండే అవలక్షణాలన్నీ మనిషి మనసు లోకి చొరబడతాయి. అలానే మనిషి మది లో ఉండేఅవలక్షణాలన్నీ సమాజం లో ప్రతిబింబిస్తాయి. ఇది ఒక విషవలయం.
కుల ప్రాతిపదికన రాజకీయాలూ, కులమాధారం గా సినిమా హీరో లకు అభిమానులూ, కులం అధారం గానే న్యాయాన్యాయాలూ రాజ్యాంగాలూ ఉన్నంత కాలం మన సమాజానికి మోక్షం లేదు.
చివరి గా,”మా కులంలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయి. వీటి నుంచీ మా కులస్తులంతా బయట పడాలి”, అనేవాడు కూడా కుల ప్రేమికుడే! ఇండియా లో కమ్యూనిజం, సోషలిజం లాంటివి మట్టి గొట్టుకొని పోవడానికి కుల వ్యవస్త కూడ ఒక కారణమే.
కులాలభిమానాన్ని ఇప్పట్లో ఎలానూ రూపు మాపలేము. కులాభిమానం అధారం గా సమాజానికి మేలు చేసే అవకాసం ఏమన్నా ఉందా? సెహ్వాగ్ సిక్సులు కొడుతూంటే నట్వర్ సింగ్ అన్నాడట,”ఒక జాట్ మత్రమే అలాంటి సిక్సులు కొట్టగలడు”,అని. అలానే, “వాడు మా కులం వాడు కాబట్టే అలా కాస్ట్ ఫీలింగ్ లేకుండా నిష్పక్షపాతం గా వ్యవహరించాడు” అని గర్వం గా చెప్పుకో గలిగే ఒక విలువల వ్యవస్థ ని మనం ఏర్పాటు చేసుకోగలిగితే, అది మన సామాజిక వ్యవస్థ లో ఒక సృజనాత్మక ఆవిష్కరణ అవుతుంది. అప్పుడు కులమే మన స్మాజనికి బలం అవుతుంది…అవుతుందా….? లేక.. దీనికి కూడా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు ఉన్నాయా…?.
సరే! ఈ చాదస్తపు మాటలు కట్టిపెట్టి అసలు విషయానికి వస్తే,అందరి ఊళ్ళలో లాగే శ్రీధర్ వాళ్ళ ఊరి లో కూడా కులాలు ఉన్నాయి.కాబట్టి అక్కడ కూడా కొంపలు తగలబడ్డాయి. పారా మిలిటరీ ని ఊళ్ళో మొహరించింది ప్రభుత్వం.
పారా మిలిటరీ వాళ్ళు మెయిన్ రోడ్డు లో ఫర్లాంగు కి ఒకరు చొప్పున కాపలా కాశారు. నాలుగైదు రోజులలో ఊరు సద్దుమణిగింది. పారా మిలిటరీ వాళ్ళు అంతా నార్త్ ఇండియన్స్. వాళ్ళలో ఎవరికీ ఒక్క ముక్క కూడా తెలుగు తెలియదు.ఊళ్ళో వాళ్ళకి హిందీ తెలియదు. వాళ్ళకి ఊరి పెద్దల ఇళ్ళ లో భోజనాలు ఏర్పాటయ్యాయి. హై స్కూళ్ళో అప్పుడే హిందీ నేర్చుకొంటూన్న పిల్లలు , వాళ్ళ హిందీ పాటవాన్ని, ఈ జవాన్ల ముందు ప్రదర్శించటానికి ఉబలాట పడేవాళ్ళు. అది తప్పితే జవాన్లకి కాలక్షేపం లేదు. అయితే ఆదివారం మాత్రం దీనికి మినహాయింపు.. ఆదివారం పొద్దున్నే టీవీ లో మహాభారత్ వస్తుంది, హిందీ లో. ఆ సమయానికి ఊళ్ళో వాళ్ళంతా పాల కేంద్రానికి చేరే వాళ్ళు. ఎందుకంటే ఊళ్ళో ఉండే నాలుగైదు టీవీ సెట్లలో ఒకటి అక్కడే ఉంది. జవానులు కూడా గస్తీ కట్టిపెట్టి టీవీ దగ్గరికి చేరుకొనేవారు. భారతం చూస్తూ ఆ సన్నివేశాల గురించి జవాన్లు ఊరి జనాలతో హిందీ లో ఏదో మాట్లడే వారు. ఊరి జనం వారికి తిరిగి తెలుగు లో సమాధానం ఇచ్చే వాళ్ళు.మహా భారతం వలన వాళ్ళు తమ మధ్యన ఉండే భాషావరోధాలను అధిగమించారు. అది తరతరాల వారసత్వం కదా.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-18
27 అక్టో 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:beating, family support, match box, venkatesh, victory venkatesh
శ్రీధరూ వాడి ఫ్రెండ్సూ ‘కలియుగ పాండవులు ‘ సినిమా కి వెళ్ళారు. ఆ సినిమా లో వెంకటేష్ అగ్గిపుల్ల గీసే పద్దతి వాడికి నచ్చింది. ఇంటికొచ్చిన తరువాత అలా గియ్యటం బాగా ప్రాక్టీస్ చేశాడు వాడు. వాడి ఫ్రెండ్స్ ని పిలిచి చూపించాడు గొప్పగా. తరవాత అందరూ కలిసి హై స్కూల్ గ్రౌండ్ కి వెళ్ళారు క్రికెట్ ఆడటానికి. ఆట మధ్య లో కృష్ణా రావు వచ్చి శ్రీధర్ ని ఇంటికి పిలుచుకొని పోయడు. మామూలు గా ఎంతో ప్రశాంతం గా ఉండే కృష్ణా రావు, అప్పుడు మాత్రం కోపం తో ఊగి పోతున్నాడు. చింత బరికె ఒకటి తీసుకొని చిన్నూ గాడి చెమడాలు ఊడగొట్టడం మొదలెట్టాడు. సీతమ్మ గారు వచ్చి ఆపే దాక వాడి వళ్ళు వాతలు దేలుతూ నే ఉంది.
“చిన్నపిల్లాడు, ఆణ్ణి ఆ రకం గా కొడితే ఎలా రా అబ్బాయ్?” అని అడిగిందామె కృష్ణా రావు ని.
“వడ్ల బస్తాలు మొత్తం కాలి పోయాయి. అగ్గిపుల్లలు గీసి అడాదు..చింతపండు గాడు చెప్పబట్టీ సరిపోయింది. లేక పోతే మొత్తం మసి అయ్యిపోయేది”
“అయితే మాత్రం చిన్నపిల్లాణ్ణి అట్టా బాదితే ఎలా?” అని కృష్ణా రావు ని గదిమిందామె.
కృష్ణా రావు,” ఆ… పిల్లాడు, బడితె లా పెరగగానే సరి కాదు.జ్ఞానం ఉండాలి” అన్నాడు.
దానికి సీతమ్మ గారు,” నువ్వు ఆడి వయసు లో ఇంకా ఉలిపి పనులు చాలానే చేశావు. కాస్తంత కోపంతగ్గించుకొని ఆలోచించుకో”, అంది.
శ్రీధర్ సీతమ్మ గారి మాటలను విని ఏడుపు మరింత పెంచాడు.
సీతమ్మ గారు,”నిప్పుతో ఆటలాడితే ఎట్టా రా నాయనా?” అంది.
దానికి వాడు,”ఇంకెప్పుడూ చెయ్యనే నాయనమ్మా” అంటూ రాగం తీశాడు.
“సరే సరే.., అన్నీ తాత పోలికలే, వెంటనే ఒప్పుకున్నావు..చాలు”,అని ముద్దు పెట్టుకొంది వాడిని.
*******************
శ్రీధర్ కి టెంత్ క్లాస్ మార్కులు బాగానే వచ్చాయి. విజయవాడ లో ని ఒక కార్పొరేట్ కాలేజీ వాళ్ళు తక్కువ ఫీజు కే శ్రీధర్ ని చేర్చుకొన్నారు. అప్పటి దాకా ఇల్లు వదలని శ్రీధర్ అక్కడ కొన్నాళ్ళు బెంగ పడ్డాడు. అక్కడి కాలేజీ లో పిల్లలు చేసే చేష్టలు వాళ్ళ వయసుకి మించినవి గా అనిపించాయి శ్రీధర్ కి. ఇదే వెంకటాపురం లో అయితే వాళ్ళను ముదుళ్ళు అనే వాళ్ళు. “బాబాయ్ జ్యోతీ టాకీస్ లో మంచి సీనులున్న సినిమా అడుతోంది. వస్తావా?” అని వాడిని ఎవడన్నా అడిగే వాడు. కానీ వాడికి అవన్నీ తన వయసుకి మించిన పనులు గా అనిపించాయి.
శ్రీధర్ అక్క కవిత కి డిగ్రీ పూర్తి చెయ్య గానే పెళ్ళి అయిపోయింది. పెళ్ళికొడుకు మహీధర్ ఉయ్యూరు లో లెక్చరర్ గా పని చేస్తాడు. కృష్ణా రావు పెళ్ళయ్యే ముందే కాబోయే అల్లుడి తో చెప్పాడు, “నాకు అమ్మాయయినా అబ్బాయయినా ఒకటే. నాకున్న దాంట్లో అమ్మాయికి సగం ఇస్తాను. మిగతాది నా తదనంతరం అబ్బాయికి వెళ్తుంది”
పెళ్ళి లో శ్రీధర్ కి బాగా బోర్ కొట్టింది. లేనినవ్వు ని మొఖానికి పులుముకుని, “బాగున్నారా? ఎలా ఉన్నారు?” అని మాట్లాడే వాళ్ళని చూస్తే వాడికి కాలింది.
శ్రీధర్ వాళ్ళ బావ వాళ్ళ అక్కని బాగానే చూసుకొనే వాడు. కొన్ని రోజుల తరువాత కవిత కి కూడా టీచర్ గా ఉద్యోగం వచ్చింది. కానీ ఇంట్లో ఆమె పని మాత్రం తగ్గలేదు. మహీధర్ కాలేజీ నుంచీ ఇంటికి వచ్చిన వెంటనే వాలు కుర్చీ వేసుకొని పొద్దున చదివిన పేపరే మళ్ళీ తిరగేస్తూ, “కవితా కాఫీ పెట్టవోయ్!” అనేవాడు. మన ఫెమినిస్టులు కొంచెం కిందకి దిగి కవిత లాంటి వాళ్ళ మీద దృష్టి పెడితే బాగుంటుంది.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-19
28 అక్టో 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:appraisal, busy life, cooking, customer, tired, work
నాకు ఆఫీస్ లో పని ఎక్కువవ్వసాగింది. రాత్రి ఇంటికొచ్చే సరికి పన్నెండు దాటుతోంది. సరళ ని ఆ టైం లో లేపటం ఇష్టం లేక నేనే నా దగ్గరున్న డూప్లికేట్ కీ తో తలుపు తెరుస్తాను. స్నానం చేసి భోజనం చేసి పడుకొనేటప్పటికి రాత్రి రెండవుతుంది. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాలి. ఒక్కో సారి వీకెండ్స్ లోకూడా ఆఫీస్ కి వెళ్ళవలసి వస్తోంది.
సరళా నేనూ ఇప్పుడు వేరే వేరే ప్రాజెక్టు ల లో పని చేస్తున్నాం. సరళ వాళ్ళ ప్రాజెక్టు లో పని తక్కువ. నేనెంత కష్టపడ్డా మా ప్రాజెక్టు పై కస్టమర్ నుంచీ కంప్లెయింట్స్ వచ్చాయి. దానితో ప్రాజెక్ట్ లో అందరికీ అప్రైజల్ లో రేటింగ్స్ తక్కువ వచ్చాయి. మా ప్రాజెక్ట్ సరళ వాళ్ళ ప్రాజెక్ట్ కంటే కష్టం అన్నది వేరే విషయం. సరళ కు మాత్రం మంచి రేటింగ్స్ వచ్చాయి. ఆమె కు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది.
సరళా నేనూ సాలిగ్రామం లో లోన్ మీద ఒక అపార్ట్ మెంట్ కొన్నాం. నెల కి పద్నాలుగు వేల ఈ ఎం ఐ. నా జీతం లోంచీ కట్ అవుతోంది. ఒక కారు కూడా కొన్నాం. దాని ఈ ఎం ఐ. సరళ జీతం లో నుంచీ కట్ అవుతోంది.
నేను నెమ్మది గా లావెక్కసాగాను. ఎక్సర్ సైజ్ చెయ్యటానికి టైం దొరకట్లేదు. వీకెండ్స్ లో ఆ ట్రాఫిక్ లో కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్ళే కంటే ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకోమని శరీరం మారాం చేస్తుంది. ఎప్పుడన్నా ఓ గంట బయటికి వెళ్తే ఆ దుమ్మూ పొగా ట్రాఫిక్ చెమట ల వలన ఇంటికొచ్చిన తరవాత పూర్తిగా అలిసిపోతున్నాం.
జీవితం రొటీన్ గా సాగిపోతోంది. మా ఇద్దరికీ జీవితం లో ఏదో వెలితి కనిపిస్తోంది. సరళ పిల్లల్ని కందాం అని సజెస్ట్ చేసింది. అందుకోసం ప్రయత్నం చేయటం మొదలుపెట్టాం. ఐదు నెలల తరవాత ఉపయోగం లేక ఒకగైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఆమె సరళ తో ఒంటరిగా మాట్లాడుతూ మధ్యలో నన్ను పిలిచి అడిగింది,”ఎన్ని సార్లు ఇంటర్ కోర్స్ చేసుకుంటారు?” అంది.
నేను ఎన్నిసార్లో చెప్పాను.
“అదేమిటి? ఈ వయసు లో ఇంటర్ కోర్స్ అంటే ఇష్టం లేక పోతే ఎలా?” అందామె.
“ఇంటరెస్ట్ లేక కాదు మేడం,రెస్ట్ లేక”, అని గునిశాను నేను.
“అదీ విషయం అని,ఏవో విటమిన్ టాబ్లెట్లు రాసిచ్చింది,ఆ టాబ్లెట్లవలన అలిసిపోము అన్నట్లు గా.
ఎప్పుడైన మా కొలీగ్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళం. అది కూడా తెలుగు కొలీగ్స్ ఇంటికి మాత్రమే. సిటీ లో అంతా టచ్ మీ నాట్ వ్యవహారం. ఎంత సేపూ రాజకీయల గురించో సినిమా ల గురించో మట్లాడుకొవటం తప్ప, జనాలు ఒకరి గురిచి ఒకరు మనసు విప్పి మాట్లాడుకొనేది తక్కువ.
వీక్ డేస్ లో చాలా వరకూ బయటి హోటల్ నుంచీ భోజనాలు తెచ్చుకొనే వాళ్ళం, సాయంత్రం వండుకొనే ఓపిక లేక. మధ్యాహ్నం ఆఫీస్ లోనే భోజనం. సరళ కి పెళ్ళి కి ముందు వంట చేసిన అనుభవం లేదు. ఆమె వంట ట్రై చేసేది, కానీ ఆమెకి కూరలు కుదిరేవి కావు.కానీ కూర వడ్డించిన వెంటనే అడిగేది “కూర ఎలా ఉంది?” అని. నేను ఉప్పుఎక్కువైంది అనో, కారం తక్కువైంది అనో అంటే ఆమె మొహం చిన్న పోయేది. ఇక తరవాతి నుంచీ సరళ ఎప్పుడడిగినా “బాగుంది” అని చెప్పడం నేర్చుకొన్నను. ఎప్పుడన్నా ఊర్లోని అమ్మ చేతి వంట గుర్తుకు చేసుకొంటే సరళ నిష్టూరాలడేది, “మరి పల్లెటూరి అమ్మాయినే చేసుకోలేక పోయావా? నన్ను ఇష్టపడి మరీ ఎందుకు చేసుకున్నావ్” అనేది.
నాకు డిగ్రీ రోజుల నుంచీ గరిట తిరగేసిన అనుభవం ఉండతం తో, అప్పుడప్పుడూ సరళకు వంట లో సహాయ పడుతున్నాను. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ కంపడటంలేదు.
సరళ తో సహజీవనం వలన నేను మాట్లడే భాష లో కొంచెం అరవ యాస వచ్చింది. అదే విధం గా సరళ తెలుగు వొకాబులరీ ఇంప్రూవ్ అయ్యింది. అయితే తెలుగు వంటలరుచి అరవ వంటలకి మాత్రం రాలేదు. కొళంబు కి గోంగూర రుచి ఎలా వస్తుంది. కొళంబు రుచే గొప్పగా అనిపించాలంటే మాత్రం నేను అరవాడిగా పుట్టాల్సిందే!
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-20
31 అక్టో 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:chandrahaas, infatuation, mandal commision, S.C.
శ్రీధర్ ఇంటర్మీడియేట్ పరీక్షల లో క్లాస్ ఫస్ట్ లేదా సెకండ్ గా వస్తున్నాడు. శ్రీధర్ కి పోటీగా క్లాస్ లో చంద్రహాస్ అనే కుర్రాడు ఒకతను ఉంటున్నాడు. అయితే వాళ్ళిద్దరికీ పోటీ చదువు విషయంలోనే. మిగిలిన అన్ని విషయాలలో వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్. చంద్రహాస్ ది విజయవాడే కావటం తో రోజూ ఇంటినుండే కాలేజీ కి వచ్చేవాడు. అప్పుడప్పుడూ శ్రీధర్ ని చంద్రహాస్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. చంద్రహాస్ వాళ్ళ అమ్మా నాన్నా గవర్నమెంట్ కాలేజీ లో లెక్చరర్లు. చంద్రహాస్ అన్న ఇంగినీరింగ్ సెకండ్ ఇయర్ లో ఉన్నాడు.
ఓ రోజు చంద్రహాస్ క్లాస్ లో ఉండగా కరస్పాండెంట్ అతనిని పిలిచాడు. చంద్రహాస్ తిరిగి క్లాస్ లోకి వచ్చిన తరవాత,”ఏంటి విషయం?” అని అడిగాడు శ్రీధర్. తనకి ‘ఎస్ సీ’ స్కాలర్ షిప్ వచ్చిందని చెప్పాడు చంద్రహాస్.
శ్రీధర్ వాళ్ళ క్లాస్ లో నే రామ్మూర్తి అనే అతను ఉండేవాడు. వాడు కూడా మెరిట్ స్తూడెంటే. వాడో రోజు శ్రీధర్ ని పిలిచి వాడి చేతి మీది పచ్చబొట్టు చూపించాడు. “సుస్మిత” అని ఇంగ్లీషు లో రాసి ఉంది, వాడి మణికట్టు కింద. సుస్మిత అంటే క్లాస్ లో కల్లా అందం గా ఉండే అమ్మాయి.
“ఎందుకు రా, ఆ అమ్మాయి పేరు రాయించుకున్నావ్?” అన్నాడు శ్రీధర్.
“సుస్మిత ని ప్రేమిస్తున్నా రా!”, అన్నాడు రామ్మూర్తి.
నిజ జీవితం లో “ఎవరైనా ప్రెమిస్తున్నాను” అని చెబితే వినటం అదే మొదటి సారి శ్రీధర్ కి.
ఆ రాత్రి స్టడీ అవర్ లో కాన్సంట్రేషన్ అస్సలు కుదర లేదు,శ్రీధర్ కి. వాడి మనోఫలకం మీద ‘సుస్మిత ను ప్రేమిస్తున్నాను ‘ అని రామ్మూర్తి చెప్పిన మాటలూ ఆ తర్వాత సుస్మిత మొహమూ రిపీట్ అవ్వసాగాయి. వాడికి ఆ క్షణం లో చదువుకోవాలని ఉంది. కానీ లోపల్నించీ ఏ శక్తో వాడిని డిస్టర్బ్ చేస్తోంది. శ్రీధర్ కి భయం వేసింది. రెండు రోజుల తరవాత పరీక్షలు. “ఈ డిస్టర్బన్స్ ఇలాగే కొనసాగితే..ఎక్జాంస్ లో కూడా కాన్సంట్రేషన్ కుదరక పోతే?” ఈ ఆలోచన వచ్చింది వాడి మైండ్ లో కి. ఈ ఆలోచన తో సుస్మిత గురించిన సంచలనం మరింత ఎక్కువైంది వాడి మైండ్ లో.
“ఏంటి?…సుస్మిత ని గానీ నేను కూడా ప్రేమిస్తున్నానా? “ఒరేయ్! పొరపాటున కూడా అలాంటి పని చెయ్యొద్దు. నువ్వు ప్రేమా దోమా అంటే చదువు చంకనాకి పోతుంది. ఇక ఎంసెట్ గురించి మర్చి పోవటమే. నాన్న నిన్ను కష్టపడి చదివిస్తున్నాడు. నాన్న నమ్మకాన్ని వమ్ముచేయొద్దు.”, తన కి తానే చెప్పుకొన్నాడు శ్రీధర్. “అయినా ప్రేమించి ఏమి చేస్తావు? పదిహేడేళ్ళ కే పెల్లిచేసుకోలేవు కదా? ఒక వేళ నాలుగైదేళ్ళు ఆగుదామను కొన్నా, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు?”,ఇలా మధన పడ్డాడు వాడు.
మరుసటి రోజు క్లాస్ కి వెళ్తే సుస్మితా రామ్మూర్తీ బాగానే ఉన్నారు,లెక్చరర్ చెప్పే లెసన్ వింటూ. వాడిని మాత్రం ఆలోచనలు చికాకు పరచ సగాయి, ప్రశాంతమైన చెరువు లో దుంగని ఎత్తి వేసినట్లు గా. దీంతో వాడికి తన మీద తనకే కోపం వచ్చింది. సుస్మితా రామ్మూర్తి ల మీద, వాళ్ళు ఏమీపట్టనట్లు గా లెసన్ వింటున్నందుకు, ఇంకా ఎక్కువ కోపం వచ్చింది.
ఈ ఆలోచనలతో కుస్తీ పడుతూనే వాడు పరీక్షలు రాశాడు. పరీక్షల్లో ఏకాగ్రత కుదర్లేదు వాడికి. కానీ తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది . క్లాస్ ఫస్ట్ మాత్రం ఈ సారికి చంద్రహాసే! సుస్మితను ప్రేమిస్తున్నాను అనే ఆలోచన వాడి బుర్రలోకి వచ్చినప్పుడు మాత్రం వాడి మనసూ శరీరమూ ఏకమై దూది పింజలా గాలి లో తేలియాడిన అనుభూతి కలిగేది.
పరీక్షలైన తరువాత, వాళ్ళ ఊరెళ్ళాడు శ్రీధర్. ఒక రోజు కాలవ లో ఈత కొట్టి వస్తుంటే,హఠాత్తు గా సుస్మిత గుర్తొచ్చింది. వెంటనే వాడికి ఇన్ని రోజులూ సుస్మిత గురించి మరిచిపోయిన విషయం కూడా అర్ధమైంది. దాంతో వాడు చాలా సంతోష పడ్డాడు, సుస్మిత తన మైండ్ లో నుంచీ వెళ్ళిపోయినందుకు. వాడికే గనుక ఒక ముప్పై యేళ్ళు వుండి వుంటే తెలిసేది, “తను ఇన్-ఫాట్యుయేషన్ నుంచీ బయట పడ్డానని”. వాడికి మనసు కి పట్టిన ముసురు తొలకరి కురియ కుండానే తొలగి పోయింది. దానికి కారణం వాడి అమ్మ ప్రేమ అనే చిరు గాలి కావచ్చు, వాడి నాన్న లో ప్రకాసించే ప్రశాంతత కావచ్చు.
సెలవలయ్యి కాలేజీ కి మళ్ళీ శ్రీధర్ వెళ్ళే సరికి, మండల్ కమీషన్ గొడవలు మొదలయ్యాయి. దేశం లో కుల రాజకీయాలు ఊపందుకున్నాయి.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-21
01 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:bangalore, madras to bangalore, new job, pollution, raghu, stream
కుక్కర్ సూయ్ మని మోగటం తో మళ్ళీ ఈ లోకంలో పడ్డాను నేను. వంటింట్లోకెళ్ళి, స్టవ్ ఆఫ్ చేసి వచ్చి కూర్చున్నాను. మద్రాసు నుండీ బెంగళూరు రావటం నా ప్రమేయం లేకుండా నే జరిగి పోయింది.
**************
మద్రాసు లో మా ఇంటి దగ్గర భార్యా భర్తలిద్దరు తెలుగు పిండివంటలు అమ్ముకొనే వాళ్ళు. ఆ వచ్చిన డబ్బు తో ఇద్దరు ముత్యాలలాంటి ఆడపిల్లలని చదివించుకొనే వాళ్ళు. రేట్లు తక్కువ గా ఉంటాయని, మేము వారం వారం వాళ్ళ దగ్గర ఏవో పిండి వంటలు కొంటూ ఉండే వాళ్ళం. అయితే ఒక వారం స్వీట్స్ కొనటానికి వెళ్తే కొట్టు మూసేసి ఉంది. పక్క షాప్ వాడిని అడిగితే వాళ్ళకు నష్టాలొచ్చాయనీ, వాళ్ళు షాప్ ఎత్తేసుకొని ఎక్కడి కో వెళ్ళిపోయారని చెప్పాడు. ఏమయ్యిందో వాళ్ళకి. ఏ నష్టాలొచ్చాయో! ఏ కష్టాలు పడతారో, ఆ ఆడ పిల్లలిద్దరితో! ఏదైనా జీవితపు అనిశ్చితి యొక్క కముకు దెబ్బ కి ఒక షాపు మూతపడింది.ఒక గూడు కదిలింది! దానికి కొంతవరకూ మేము కూడా కారణమే, రేట్లు తక్కువ గా వస్తాయని అక్కడే కొనే వాళ్ళం. వాళ్ళ కొచ్చిన నష్టం లో మా వలన కూడా కొంత వచ్చిఉంటుంది.
***********
మీకు మా కజిన్ రఘు గుర్తున్నాడా? వాడే… చిన్నప్పుడు నాతో పాటు మా ఊళ్ళో చెట్టులూ పుట్టల వెంట తిరిగాడు చూడండి…వాడు. చెప్పడం మరిచిపోయాను…వాడు “ఎం సీ ఏ” చేసి ఆ పైన “వై టూ కే” బూం లో అమెరికా చెక్కేసి, అక్కడే సెటిల్ అయిపోయాడు. వాడు మద్రాసు లో ఉండగా ఓ రోజు రాత్రి అమెరికా నుంచీ ఫోన్ చేశాడు..
కొంతమంది సంతోషం గా ఉండటాన్ని కూడా ఒక షో కేస్ చేసుకోవలసిన విషయం గా భావిస్తారు. లోపల జీవితం ఎలా ఉన్నదీ వేరే విషయం.
రఘు ని “ఇండియా వచ్చేస్తావా? అమెరికా లో నే ఉంటావా?” అని అడిగాను నేను.
దానికి వాడు, ” నో వే..ఇండియా లోఎంత రిచ్ ఫెలో అయినా సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొల్యూషన్ లోనూ దుమ్ములోనూ జీవితం గడపాలి. పొరపాటున కూడా ఇండియా రాను బాబోయ్!” అన్నాడు.
ఇండియా లో కొంతమంది పిల్లల పెంపకమే అమెరికా వెళ్ళటానికన్నట్లు ఉంటోంది. అటువంటి వాళ్ళకు అమెరికా, “చేప పిల్ల కి నీటి కొలను” లా ఉంటుంది. మళ్ళీ ఇండియా వస్తే వాళ్ళు వడ్డున పడ్డ చేప పిల్ల లా గిల గిల లాడి పోతారు.
మా వాడు, “నువ్వు కూడా అమెరికా రా రాదూ” అని ఓ ప్రశ్న వేశాడు. దానికి నేను,” డబ్బులు సంపాదించటానికైతే అమెరికా రావలసిందే.కానీ నాకు ప్రస్తుతానికి డబ్బులు సరిపోతున్నాయి. అమెరికా లో మనకి ఎదురయ్యే సోషల్,ఎమోషనల్ డిప్రైవేషన్ నాకు పడదు. నేను రాను”, అన్నాను. “అమ్మా నాన్న ల తో మాట్లాడే కాలాన్ని వారానికొక కాలింగ్ కార్డ్ తో కొనుక్కోవటం నాకు ఇష్టం ఉండదు”, అని కూడా అన్నాను .
దానికి వాడు, “డిస్టంట్ గ్రేప్స్ ఆర్ సోర్”, అని నవ్వసాగాడు.
ఈ మా సంభాషణ గురించి తరువాత ఆలోచిస్తే నాకిలా అనిపించింది. “జనాలు జీవిత ప్రవాహం లో కొట్టుకొని పోయి అనేక ప్రదేశాలలో తేలతారు. ఎక్కడ తేలుతారు అనేది వారి చేతుల్లో ఉండేది చాలా తక్కువ. ఏదో ఒక ప్రదేశం లో తేలిన తరువాత, తాము ఉండే ప్రదేశమే గొప్పది అనుకొంటారు. అలా అనుకోక పొతే జీవితం ఆనందం గా ఉండదు మరి. మనం పక్క వాళ్ళ కంటే ఏదో ఒక విషయం లో ఎక్కువ అనుకొంటేనే సంతోషం. ఏదో ఒక విలక్షణత ని మనలో మనం చూడకుండా ఉండలేం. పక్క వాళ్ళ కంటే మనం ఎప్పుడూ తక్కువే అను కొనే న్యూనతా భావం నాణానికి రెండోపక్క లాంటిది.”
మరుసటి రోజు బెంగళూరు లోని ఓ కంపనీ నుంచీ ఓ ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బెంగళూరు లో వేరే పని కూడా ఉండటం తో, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యి వచ్చాను. మా కంపనీ లో నా పొజిషన్ ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. సరళ కి మాత్రం టీం లీడ్ ఇచ్చారు.
బెంగళూరు లోని అవంటెక్ నుంచీ ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడున్న జీతం కంటే 50% ఎక్కువ ఇచ్చి,ప్రాజెక్ట్ లీడ్ గా ఆఫర్ ఇస్తున్నారు.
సరళెమో “నా కెరీర్ ఇక్కడే బాగుంది. నేను బెంగళూరు రాను అని చెప్పింది. ఐతే నా కెరీర్ కూడా ముఖ్యమే కాబట్టీ నేను బెంగళూరు వెళ్తే సరళకేమీ అభ్యంతరం లేదట. సో, బెంగళూరు నేను ఒక్కడినే వెళ్ళాలని నిర్ణయించబడినది.
బెంగళూరు వెళ్ళటానికి ప్రెపేర్ అవ్వసాగాను. నేను కూడా మా కజిన్ రఘు గాడి డైరెక్షన్ లోనే వెళ్తున్ననేమో అనిపించింది.ఇక పై సరళ తో మాట్లాడే టైం ని ఫోన్ లో కొనుక్కోవాలి.
సరళ నా కోసం ఒక కొత్త సెల్ ఫోన్, ఒక పుల్ మేన్, ఒక సూటూ కొని తెచ్చింది.
“ఇదంతా అనవసరమైన ఖర్చు”, అన్నాన్నేను సరళ తో.
“వేరే ఊరు వెళ్ళేటప్పుడు ఈ మాత్రం కొనుక్కోక పోతే ఎలా?” అందామె.
“ఇక్కడే సరళ కూ నాకూ తేడా వచ్చేది. సరళ కి అవసరాలు అనిపించేవి నాకు అనవసరమైన ఖర్చులు అనిపిస్తాయి.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-22
02 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:college, engineering, JNTU college of engineering, Kakinada, ragging, reservations.
శ్రీధర్ ఎంసెట్ బాగానే రాశాడు. వాడికి మూడొందల ఫైన ర్యాంక్ వచ్చింది. చంద్రహాస్ కీ మూడు వందలపైన వచ్చింది. కృష్ణా రావు ఎప్పుడూ హైదరాబాదు వెళ్ళిన మనిషి కాదు. ఆయనకు ఆ నగరం పోవాలంటే ఏదో తెలియని బెరుకు. చంద్రహాస్ వాళ్ళ నాన్న వాళ్ళిద్దర్నీ హైదరాబాద్ తీసుకొని వెళ్తానన్నాడు. శ్రీధర్ వాళ్ళ నాన్న కి చెప్తే ఆయన ఇందుకు ఒప్పుకున్నాడు.
శ్రీధర్ కి హైదరాబాద్ చాలా వింత గా అనిపించింది. తెలుగు రాష్ట్ర రాజధాని లో తెలుగు విస్తృతం గా వాడక పోవటం ఒక వింతైతే, ఆ తెలుగు తను మాట్లాడే తెలుగు కి పూర్తి భిన్నం గా ఉండటం ఇంకో వింత. తాను అప్పటి దాక నిజ జీవితం లో విన్న, సినిమాల్లో చూసిన, పుస్తకాల్లో చదివిన భాషకి అది చాలా భిన్నం గా ఉంది. దానితో శ్రీధర్ కి ఆ భాష తప్పనిపించింది. వాడి రిఫరన్స్ ప్లేన్ అనేది వాడి ఊరి భాష. ఆ భాష తో భిన్నం గా ఉన్నదంతా తప్పనిపించింది వాడికి. ఆ భాష మీద వాడికి తాత్కాలికమైన చిన్న చూపు ఏర్పడింది.
కౌన్సెలింగ్ లో శ్రీధర్ కి కాకినాడ ‘జే ఎన్ టీ యూ’లో ఎలెక్ట్రానిక్స్ దొరికితే చంద్రహాస్ కి వరంగల్లు ఆరీసీ లో కంప్యూటర్ సైన్స్ దొరికింది.
***********
ఎన్.టీ. రామా రావు ఎలెక్షన్లలో ఓడి పోయి, తెలుగు దేసం పార్టీ అధికారం లోంచీ దిగి పోయింది. కాంగ్రెస్ లో మొదటి కృష్ణుడు చెన్నా రెడ్డి ని దించటానికి పెద్ద కుట్రే జరిగింది. రెండో కృష్ణుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
**********
శ్రీధర్ ఇంజనీరింగ్ కాలేజీ లో అడ్మిషన్ కి కాకినాడ వెళ్ళాడు. మండల్ కమీషన్ గొడవలు జరిగి అప్పటికి ఎక్కువ కాలం అవ్వకపోవటం వలన, కాలేజీ లో రిజర్వేషన్ ఉన్న వాళ్ళకీ లేని వాళ్ళకీ గొడవలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కాలేజీ హాస్టల్లో ఉంటే, లేని వాళ్ళూ అద్దె ఇళ్ళలో ఉంటున్నారు. రిజర్వేషన్స్ ఉన్న సీనియర్స్ లేని ఫ్రెషర్స్ నీ, రిజర్వేషన్స్ లేని సీనియర్స్ ఉన్న ఫ్రెషర్స్ నీ రాగింగ్ చేస్తున్నారు. రిజర్వేషన్స్ ఉన్నా లేకపోయినా సీనియర్స్ జూనియర్స్ చేత బట్టలు విప్పించటం, బూతు పాటలు పాడించటం, అమ్మాయిలకు “ఐ లవ్ యూ” చెప్పించటం చేస్తున్నారు.
శ్రీధర్ కాకినాడ లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉండి రోజూ కాలేజీ కి వెళ్ళి రా సాగాడు. ఉదయంలేచి కాలేజీ కి వెళ్ళాలంటే హడల్ గా ఉండేది శ్రీధర్ కి, రాగింగ్ గుర్తుకొచ్చి.
కాలేజీ గురించి శ్రీధర్ కి నెమ్మది గా విషయాలు తెలియ సాగాయి. కాలేజీ లో గొడవలు ఎక్కువ. ఆ గొడవలు కులాల ఆధారం గా జరుగుతాయి. కాలేజీ లో వేర్వేరు కులాల విద్యార్ధులు వేర్వేరు ఫ్రెషర్స్ పార్టీ లు పుట్టుకొంటారు. కుల స్పృహ ని అధిగమించే చైతన్యం స్టూడెంట్స్ కి లేదు. ఎక్కడ నుంచీ వస్తుంది చైతన్యం? వాళ్ళ పెద్ద వాళ్ళ కి లేదు ఈ చైతన్యం. టీచర్స్, లెక్చరర్స్ కులాలకు అతీతం కాదు. క్లాసు లో చెప్పే పాఠాలూ, సినిమాలూ సమాజం లో కులమే లేనట్లు ఎస్కేపిస్టు గా ఉంటాయి. ఊరి లోని జీవితమూ కులాధారితమే. కాలేజీ లో కులాల గొడవలు తలలు పగల కొట్టుకొని పోలీసుల కేసుల వరకూ వెళ్తాయి. లెక్చరర్ ల కి గౌరవం ఇవ్వక పోగా, వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ స్కూటర్ సీట్ కవర్ కోయటం లాంటివి అసాధారణమేమీ కాదక్కడ.
శ్రీధర్ దసరా సెలవలకి ఊరెళ్ళినప్పుడు,”కాలేజీ ఎలా ఉంది రా”, అని అడిగాడు కృష్ణా రవు.
“కాలేజీ మానేస్తాను నాన్నా”, అని కాలేజీ వివరాలన్నీ చెప్పాడు శ్రీధర్.
అదంతా విని, తేలిక గా తీసుకొని నవ్వేసి,”అవన్నీ ఒక నెలలో సద్దుకొని పోతాయి. కాలేజీ మానటానికేనా నువ్వు కష్టపడి చదివి రాంకు తెచ్చుకున్నది?” అన్నాడు.
“ఏం చేస్తాం కాలేజీ లో రాగింగ్ అనే చేదు అనుభవం ఎదురైంది శ్రీధర్కి, కృష్ణా రావు కి కాదు గదా!.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-23
03 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:back to village, journey, pallekanneru pedutOndo
బెంగుళూరు కి మారే ముందు మా వూరెళ్ళి రావాలనిపించి బయలు దేరాను. పల్లెటూరు రావటం సరళ కి నచ్చదని తెలుసు. నేను ఒక్కడినే బయలు దేరాను.
విజయవాడ లో ట్రైన్ దిగి మా ఊరెళ్ళే బస్సెక్కాను. బస్సు కండక్టర్ తో అలవాటు ప్రకారం తమిళం లో మాట్లాడబోయి,చివరి నిమిషం లో తమాయించుకొని తెలుగు లో మాట్లాడాను, “వెంకటాపురంకి ఒక టికెట్”.
బస్సు రోడ్డు మీద కదులుతోంది..పచ్చటి పొలాలూ తమలపాకు తోటలూ చెరుకు తోట లమధ్య నుంచీ. చిన్నప్పటి నుంచీ ఆ ప్రదేశాలన్నీ చూసిన నాకు మొదటి సారి ఆ పొలాల్లోనూ తోటలలోనూ ఏదో తెలియని అందం కనపడుతోంది..పట్టణం లో కనపడని పచ్చదనం ఇక్కడ కనిపించినందు వలన కావచ్చు….వయసు నా లో తెచ్చిన మర్పుల వలన కావచ్చు. బస్సు లో ఊళ్ళకు పోయే పల్లెటూరి మనుషులు నాకు చాలా పరిచయం ఉన్న వాళ్ళ లా అనిపించారు..మా ఆఫీస్ లో తెచ్చిపెట్టుకున్న వెస్టర్న్ ఫార్మాలిటీ వెనకాల ఉండే అసలు మనుషులు ఎప్పటికీ పరిచయం కారు.
బస్సు దిగి గూడు రిక్షా లో మా ఇంటికి బయలు దేరాను. అక్కడక్కడా కొత్తగా ఆటో లు కూడా తిరుగుతున్నాయి. ఇంటికి వెళ్ళేటప్పటికి మా నాన్న బయట దొడ్లో తుండు చుట్టుకొని స్నానం చేస్తున్నాడు.రిక్షా చప్పుడు కి మా అమ్మ బయటికి వచ్చింది. మా నాయనమ్మ చనిపోయి రెండేళ్ళయింది. అప్పటి నుంచీ ఇల్లు బావురు మంటొంది. మా ఇంటి ఎదురు గా పక్షుల కిలకిలల తో సందడి గా ఉండే రావి చెట్టునొకదాన్ని కూడా ఈ మధ్యే కొట్టేశారు. దానితో వాకిలంతా ఏదో వెలితి గా ఉంది.
మా నాయనమ్మ పోయేటప్పుడు పెద్ద బాధపడకుండానే పోయింది. చివరి రోజుల్లో, “ఆ రాముడు నన్నెప్పుడు తీసుకెళ్తాడో” అనుకొనేది.
ఊరి అరుగుల మీద ఎవరూ కూర్చోవటం లేదంట, మా నాన్న చెబ్తే తెలిసింది. “ఎవరికి వాళ్ళు కేబుల్ టీవీ లో సినిమా లు చూడటం అలవాటైంది జనాలకి. “ఆ ఐనా ఊళ్ళో ఇంకా ఎవరున్నారు. మా బోటి ముసలీ ముతకా తప్పితే”, అన్నాడు నాన్న.
అమ్మ స్నానికి వేణ్ణీళ్ళు తోడింది. స్నానం చేశాక భోజనం వడ్డించింది నాన్నకూ నాకూ. అమ్మ చేతి వంట రుచే వేరు. భోజనం చేసి అలా ఊళ్ళో తిరిగొద్దామని బయలు దేరాను. హై స్కూల్ గ్రౌండు లో పిల్లలే కనపడ లా. పక్కనే ఇంగ్లీషు మీడీం కాన్వెంట్ లో మాత్రం పిల్లలు కోడి పిల్లల లా రైంస్ చెప్తున్నారు. ఊళ్ళో మనుషులే కాదు మనుషుల తో పాటు పసువులూ కోళ్ళూ పిచ్చికలూ కూడా మాయమయ్యాయి. ఎక్కడన్నా ఓ మనిషి సెల్ ఫోన్ లో మాట్లాడటం కనపడుతోంది. గోరటి వెంకన్న పాట,”పల్లె కన్నీరు పెట్టిందో”,నా మనసు చెవుల్లో మారు మోగుతోంది.
ఇంటికి వెళ్ళగానే ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తితే సరళ,”నీ సెల్ తీసికెళ్ళటం మరిచి పోయావు అంది.
నేను చెప్పాను,”మరిచి పోలేదు.కావాలనే తీసుకొని రాలేదు” అని. “ఊరు చేరిన వెంటనే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా చేరానని” అంది సరళ..
మా ఇంటి పక్కనే ఉండే రాఘవయ్య మాస్టారు వచ్చారు,”ఏమోయ్,అమెరికా వెళ్ళావు కదా, మళ్ళీ తిరిగి వచ్చేశావేంటి?” అంటూ.
“నేను అక్కడ ఉండటానికి వెళ్ళలేదు మాస్టారూ. నేను వెళ్ళిన ప్రాజెక్ట్ పని అయ్యిపోయింది. తిరిగి వచ్చాను”
“ఆ..నేను అమెరికా వెళ్ళేవాళ్ళను చూశా గానీ, తిరిగి వచ్చిన వాళ్ళను చూడలేదు”, అన్నడాయన.
పూర్వ కాలం సముద్రాలు దాటి విదేశాలు వెళ్తే వెలి వేసేవారట. రోజులు మారాయి. విదేశాల నుంచీ ఇండియా వస్తే వెలి వేసే రోజులు వచ్చాయి కాబోలు.
మా మాటలసందడి విని,పక్కింటి ప్రసూనాంబ అత్తయ్య వచ్చింది.
“నెకు జీతం బాగానే వస్తుందా నాయనా?” అడిగిందామె.
“బాగానే వస్తుందత్తయ్యా”
“ఏ మాత్రమొస్తుందేమిటి?”
“ఓ ముప్పై వేల దాకా వస్తుంది”
“ముప్పై వేలేనా. మా మనవడు అమెరికా వెళ్ళాడు. వాడికి రెండు లక్షలంట జీతం!”, అని మీ మొగుడూ పెళ్ళాలిద్దరూ ఉద్యోగమేగా. మీది మీకు సరిపోతుందేమోలే!”అందామె.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-24
04 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:capitalism, communism, discussion, engineering, ideology
దసరా సెలవల తరువాత కాలేజీ కి వెళ్ళిన శ్రీధర్ వాడి క్లాస్ మేట్ రమేష్ తో కలిసి ఒక రూం తీసుకొని దాంట్లోకి మారాడు.
శ్రీధర్ ఇంటర్మీడియేట్ వరకూ తనకున్న జ్ఞాపక శక్తి సహాయం తో క్లాసు లో మొదటి ర్యాంకు లో ఉండేవాడు. కానీ ఇంజినీరింగ్ లో వాడి జ్ఞాపక శక్తి వలన ఉపయోగం లేక పోయింది. ఇంజనీరింగ్ సరిగా చదవాలంటే అవగాహనా శక్తి ముఖ్యం. ఆలోచనా శక్తి కావాలి. కానీ శ్రీధర్ కి అకాడమిక్స్ లో వాటి అవసరం అప్పటి వరకూ పెద్ద గా రాలేదు. పైగా ఇంజనీరింగ్ అంతా ర్యాంక్ వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ ఉండటం తో వాడికి క్లాస్ టాప్ ర్యాంకుల్లో స్థానం లేకుండా పోయిని. దీంతో వాడి ఆత్మ విశ్వాసం కొంత దెబ్బ తిన్నది.
బయటి ప్రపంచానికి ఒక్కసారిగా ఎక్స్ పోజ్ అవ్వడం తో వాడికి చెడు తిరిగుళ్ళూ సినిమాలూ అలవాటయ్యాయి. వాడి ఫ్రెండ్స్ సర్కిల్ లో విలువల ప్రకారం, రిలీజైన సినిమా మొదటి వారం లోపల చూడక పోతే అది ఒక నామోషీ. వాడు అమ్మాయిల వెంట తిరగక పోయినా, గంటల తరబడి అమ్మాయిల గురించి హస్కు కొట్టడం అలవాటైంది. ఎం సెట్ లో ర్యాంకు వచ్చిన దగ్గరి నుండీ ఏదో సాధించేసిన భ్రమ వాడిని ఆవరించింది.వాడు తాత్కాలికం గా ఇంటి దగ్గరి ఆర్ధిక పరిస్థితి గురించి కూడా మరిచిపోయాడు. వాడి రూం మేట్ రమేష్ మాత్రం బుద్ధి గా చ్దువుకొనేవాడు.
శ్రీధర్ కి ఈమధ్య ఓ పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఇంటర్మీడియేట్ లో సుస్మిత గురించిన వాడి ఇన్-ఫాట్యుయేషన్ కి కొనసాగింపు లా అనిపిస్తుంది. ఓ రోజు వాడూ వాడి రూమ్మేట్ రమేషూ కలిసి కాలేజీ లైబ్రరీ కి వెళ్ళారు. రమేష్ ఎలెక్ట్రానిక్స్ సర్క్యూట్స్ పుస్తకం తీసి బుద్ధి గా చదువుకొంటుంటే, శ్రీధర్ మాత్రం లిటరేచర్ సెక్షన్ లోకి చొరబడి చెకోవ్ కథలూ,టాల్-స్టాయ్ కథలూ చదవటం మొదలు పెట్టాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కమ్యూనిస్ట్ మానిఫెస్టో తీసుకువెళ్ళాడు.
రూం లోకి వచ్చిన తరువాత వాడు రమేష్ ని అడిగాడు,”నువ్వు కమ్యూనిస్ట్ మానిఫెస్టో చదివావా?” అని.
“చదవ లేదు. చదవాలని కూడా అనుకోవటం లేదు. ఎందుకడిగావ్?” అన్నాడు రమేష్.
శ్రీధర్ రమేష్ మాట వినిపించుకోకుండా, “ఉన్న వాళ్ళందరూ లేని వాళ్ళను దోచుకొంటున్నారు ఈ లోకం లో. దీనికి కులమతాల తో ప్రసక్తి లేదు. ఈ సమాజం లో ఫండమెంటల్ గా మార్పు రావాలి”, అన్నాడు.
రమేష్ చాలా తక్కువ గా మాట్లాడుతాడు. అయితే శ్రీధర్ ఈ మాటలు కొంత కాలం గా అదే పని గా చెప్తున్నాడు. వాడి ఉపన్యాసాలకు ఒక ఫుల్ స్టాప్ పెడదామనిపించింది రమేష్ కి.
” నువ్వు చెప్పింది కరక్టే. నేను విన్నదానిని బట్టి చెప్తున్నాను. కాపిటలిజం గురించి మార్క్సిజం చేసిన అనాలసిస్ చాలా వరకూ కరక్టే. అయితే గమ్యం చేరటానికి మర్క్సిజం చెప్పిన మార్గం ఆచరణ యోగ్యం కాదు. ఒకప్పుడు డబ్బు లేని వాడు, డబ్బు సంపాదించి ఉన్న వాడు అవుతాడు. ఉన్నవాడు అయ్యిన తరువాత, వాడు ఉన్నవాడి లాగానే ప్రవర్తిస్తాడు. కాబట్టి సమస్య అంతా మనిషి స్వభావం తో నే ఉంది.” అన్నాడు రమేష్.
శ్రీధర్, “కానీ ఇది సిస్టం కి సంబంధించిన సమస్య. విప్లవం ద్వారా సోషలిస్ట్ సిస్టం వస్తుంది. ఒక సారి సోషలిస్ట్ సిస్టం వచ్చిన తరవాత అంతా సమానమే. ఇంకా లేని వాడు ఉన్నవాడయ్యే సమస్యే లేదు”, అన్నాడు.
” కానీ మనం సమానం గా లేని సమజం లో ఉన్నాం. ఈ సమాజాన్ని బలవతం గా చదును చేసినా, మనుషుల్లో సహజం గానూ, పెంపకం వలనా వచ్చిన నైపుణ్యాల లో తేడాల వలన మళ్ళీ ఈ సమాజం అసమానం ఐపోతుంది. సమానత్వం లేని చోట, సమానత్వాన్ని బలవంతం గా రుద్దాలనుకోనటమే ఒక పెద్ద అసమానత్వం అని ఎక్కడో చదివాను. మనుషుల వ్యక్తిత్వాలూ మనస్తత్వాలూ మార్క్సిజం చదివినంత మాత్రాన దానికి అనుగుణం గా మారిపోవు. అవి అప్పటి నిజజీవితంలోని పరిస్థితుల పై అధార పడి ఉంటాయి. ఎంత మంది మార్క్సిస్టు ఆదర్శ వాదులు తద్విరుద్ధమైన జీవితం గడపటంలేదు?” ఇంకా ఇలా అన్నాడు రమేష్,” నీ బుర్ర లో ఒక ఆదర్శ లోకం ఉంది. కానీ ఆ లోకం చేరే దారి మాత్రం నీ దగ్గర లేదని నేను నమ్ముతున్నాను. జనాల స్వభావాలను ఒక్క రోజు లో ఎలా మారుస్తావు?. మనుషుల స్వభావాలని ఏ మార్క్సో ప్లాన్ చెయ్యలేదు. మనుషులను ప్రభావితం చేసే పరిస్థితులను మార్చటం ద్వారా మనుషుల వ్యక్తిత్వాన్ని మారుద్దామంటే, ఆ పరిస్థితులే మనుషుల అవక తవక వ్యక్తిత్వాల వలన సృష్టించబడ్డాయాయే. మనుషులు మారకుండా వచ్చే విప్లవం ఓ విప్లవం కాదు. కమ్మ్యూనిజం ప్రపంచమంతా ఫెయిల్ అవ్వటానికి ఇదే మొదటి కారణం. మనుషులు మారక పోవటాకికి చాల గట్టి కారణాలే ఉండి ఉండాలి.. ప్రపంచం మొత్తాన్ని మార్చే ముందు, కమ్మ్యూనిస్టులు,ఒక జిల్లానో, మండలాన్నో తీసుకొని వాళ్ళ సిద్ధాంతాన్ని నిరూపించాలి. దాని వలన ఒక ప్రొటోటైప్ ప్రూవ్ అవుతుంది. ప్రపంచం లో చాలా హింస తప్పుతుంది. అప్పుడు మీ సిద్ధాంతాన్ని ప్రపంచం కూడా అంగీకరిస్తుంది. ఆ పై దాన్ని ప్రపంచం మొత్తానికీ విస్తరింపచేయ వచ్చు.”
శ్రీధర్ కి రమేష్ వాదన నచ్చలా. ” నువ్వొక బూర్జువా వి. నీకు మార్క్సిజం అర్ధంకాదు” అన్నాడు. వాడు ప్రస్తుతానికి విప్లవం తో ప్రేమ లో పడ్డాడు. అదే వాడి పాషన్. అది వాడి ఎమోషనల్ నీడ్స్ ని తీరుస్తోంది.
వాళ్ళ రూం దగ్గర్లో ఒక అడుక్కొనే వాడు కూర్చొని ఉంటే వాడిని చూపించి,” వాడిని చూస్తూంటే నీకు ఏమీ జాలి వేయటంలేదా? వాణ్ణి చూస్తూంటే నీకు ఏమీ దిగులు గా లేదా? ..నువ్వు వాడిని గురించి జాలి పడక పోవటం….హౌ డిప్రెసింగ్!!”,అన్నాడు.
“అది వాడి కి పట్టాల్సిన గతేనేమో! పరీక్షల్లో తప్పిన వాడి గురించి జాలి పడతామా? ఆ తప్పిన వాడు చదవకుండా అమ్మాయిల కి సైట్ కొడుతూ టైం వేస్ట్ చేశాడేమో.. అయినా నాకు జాలి వేస్తే వాడికో రూపాయి వేసి దానితో వాణ్ణి వదిలిపెట్టేస్తా. వాడి గురించి తెగ ఫీలయ్యి పోయి, వాణ్ణో ముడి పదర్ధం గా తీసుకొని కవిత్వాలు రాసే వాళ్ళ కంటే, నేను వేసిన రూపాయే వాడికి ఎక్కువ మేలు చేస్తుందేమో!”
“ఎక్జాం లో ఫెయిల్ అయ్యిన వాడు వాడి అశ్రధ్ధ వలన ఫెయిల్ అయితే వాడి మీద నేను జాలి చూపించను. కానీ వాడికున్న ఒక లోపం వలన ఫెయిల్ అయితే నేను జాలి చూపిస్తాను. వాడు తెలివైన వాడు కాకపోతే, వాడి గురించి కన్సిడరేట్ గా ఉంటాను”, అన్నాడు శ్రీధర్.
“నీ లాజిక్ ప్రకారం వాడి అశ్రధ్ధ కూడా పస్థితుల ప్రభావం వలన వచ్చింది. కాబట్టి వాడిని నువ్వు తప్పుపట్ట కూడదు కదా? నేను కోయిల పాట నిమెచ్చుకొని, కాకి గొంతుని నిరసిస్తే అది కాకి పట్ల వివక్ష చూపించింట్లవుతుందా?” రమేష్ అన్నాడు.
శ్రీధర్ అన్నాడు,”నేను కోయిల గొంతు విని సంతోషిస్తాను. కానీ కాకి కి మంచి గొంతు లేనందుకు దాని మీద జాలి చూపిస్తాను. దాన్ని చూస్తే నాకు దిగులు గా ఉంటుంది”
“ఆకాశం నీలి రంగు లో ఉంది,ఎర్ర గా లేదు అని నువ్వు బాధ పడతావా? ఐతే సమస్య నీ బ్రెయిన్ లో ఉండి ఉండాలి. నువ్వు వేరే ఏ కారణం చేతనో డిప్రెషన్ లో ఉన్నావని అనిపిస్తోంది.ఎవరైనా ఒక డాక్టర్ కి చూపించుకో”,అని రమేష్ ఇలా అన్నాడు,” మనం అసలు విషయం నుంచీ పక్కకు వెళ్తున్నాం. మనం మాట్లాడే విషయం కమ్యూనిజం. కమ్యూనిజం అనేది ఒక సామాజిక ఆర్ధిక సిధ్ధాంతం. అదేమీ సర్వ రోగ నివారిణి కాదు. దాన్ని కాకి కీ అకాశానికీ అన్వయించ కూడదని నేననుకొంటున్నాను. మ్యాథమెటిక్స్ లో ప్రతి థీరీ కీ ముందు కొన్ని ఇనీషియల్ కండిషన్స్ ఉంటాయి. ఆ థీరీ అప్ప్లై అవ్వాలంటె ఆ ఇనీషియల్ కండిషన్స్ నిజమవ్వాలి. ఆ థీరీ చెప్పిన వాడే ఇనీషియల్ కండిషన్స్ కూడా పెడతాడు. ఆ లిమిట్స్ మధ్య మాత్రమే ఆ సిధ్ధాంతం నిజమౌతుంది. ఆ లిమిట్స్ బయట సిధ్ధాంతాన్ని అప్ప్లై చేస్తే అది వీగి పోతుంది. కాబట్టీ కమ్యూనిజాన్ని కాకికి అప్ప్లై చెయ్యవద్దు. ఉదాహరణ కు,” గ్లోబల్ వార్మింగ్ గురించి కమ్యూనిజం వైఖరి ఏమిటి? చెప్పటంకష్టం. కమ్యూనిజం పుట్టినప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఒక సమస్య కాదు. కాబట్టి కమ్యూనిజం గ్లోబల్ వామింగ్ కి అప్ప్లై కాదు. అయినా వీటి గురించి చర్చించు కోవటం వలన సమయం వృధా. మనం మార్చేది ఏమీ లేదు ఇందులో. నువ్వు వేరేగా అనుకొంటే నీ జీవితాన్ని పేదవాళ్ళ కోసమంకితం చెయ్యి. పేద వాళ్ళ గురించిన నీ ఫీలింగ్స్ మాత్రమే సరిపోవు వాళ్ళని ఉధ్ధరించటానికి. నువ్వుఏమీ చెయ్యలేక పోతే గమ్ముగా ఉండు. ఎవరికీ క్లాసులు పీక మాక. నువ్వు ఏమీ చెయ్యనప్పుడు, వేరే వాళ్ళకి చెప్పే అర్హత నీకెక్కడుంది? వీటన్నింటి కంటే బాగా చదివి కెరీర్ లో సక్సెస్ అవ్వటం ముఖ్యం. ఈ విషయాల గురించి మనం చర్చించుకోవటమిదే చివరి సారి కావాలి”, అని వాడో క్లాసు పీకాడు రమేష్.
” కనీసం నేను ఫీల్ అవుతున్నాను రా. ఫీల్ అవ్వటం ఏదొ ఒకటి చెయ్యటానికి నాంది. నువ్వేమో ఫీల్ అవ్వటానికి నిరాకరిస్తున్నావ్. పైగా నన్ను ఏమీ చెయ్యవు అని నిందిస్తున్నావ్”, అని రమేష్ వైపు చూశాడు శ్రీధర్. కానీ వాడు అప్పటికే నెట్వర్క్ థీరీ బుక్ లో తలముంచి దాన్లో లీనమైపోయాడు.
“నువ్వు చాలా స్వార్థ పరుడివి రా రమేషూ”,అని శ్రీధర్ కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పుస్తకం తీసి చదవటమ్మొదలెట్టాడు. వాడికి ఆ పుస్తకం వాడి హృదయ రాగం లా తోచింది.
రాత్రి పదింటికి పుస్తకం మూసి ఏదో ఒక సెకండ్ షో సినిమా చూద్దామని బయలు దేరాడు. కానీ వెళ్ళాలనిపించలేదు. ఒక గమ్యం లేకుండా రోడ్ల మీద తిరగసాగాడు.భాను గుడి సెంటర్ కి వెళ్ళాడు. మంగీలాల్ స్వీట్స్.మర్వాడీ వాడు..వాడి మనసు లోంచీ అసహ్యం తన్నుకొస్తూంది..”ఈ వ్యాపారస్తులంతా స్వార్థపరులే…గ్రీడీ బాస్టర్డ్స్.. కాల్చి పారేయాలి……ఆ అమ్మాయిల్ని చూడు.ఆ షాప్ లో చుడీ దార్ల వైపు ఎలా చూస్తున్నారో..ఆపక్కనే వంటి మీద పుండ్ల తో చుట్టూ ఈగలు మూగుతూ…ఆ పిచ్చోడు..రోడ్డు మీద పడి ఉంటే..వాడి వంక చూడరేం? వాళ్ళ ఆలోచనలలో వాడికి స్థానం లేదా? సో డిప్రెసింగ్..” సడన్ గా వాడి ద్వేషం వాడి మీదికే మళ్ళీంది. ” వాళ్ళు ఎవరో సరే..ఇర్రెస్పాన్సిబుల్ బాస్టర్డ్స్..మరి నేనేమి చేశాను వాడికి? ఆ పిచ్చోడ్నినా రూంకి తీసుకొని పోయి వాడికి దుప్పటి కప్పి..రూం లో ఉన్న బ్రెడ్ ఎందుకు పెట్టవు రా నువ్వు శ్రీధర్ గా….యూ..బాస్టర్డ్..?..నేను ఒక్కడినే..ఈ ఈగలముష్టోడికి బ్రెడ్డు పెట్టానని లోకం బాగై పోతుందా?..కానీ నీ పరిధి లో నువ్వెందుకు చెయ్యవు….అలా ఐతే..అడవుల్లోకిపోయి..గన్ పట్టుకొని..పోరాడుతూ ఆ ప్రయత్నం లోనే నీ ప్రాణాలెందుకు అర్పించవు…? కానీ నా కెరీర్ ఏమై పోతుంది?..నా అమ్మా నాన్నలేమౌతారు? ఛా.. నా మీద నాకే అసహ్యంవేస్తోంది…నేను ఈ రోడ్డు మీద వాళ్ళందరికంటే నికృష్టుడిని..నేను సెల్ఫిష్..ఇది నా గురించిన నిజం..సమసమాజం నా ఆశయం..కానీ.. కానీ..స్వార్థం అనేది నా వ్యక్తిత్వాన్ని గురించిన నిజం..’ ఈ ఆలోచనల తో వాడు బాగా డీలా పడి పోయాడు. కళ్ళు తిరుగుతున్నాయి. తూలుకొంటూ వాడి రూంకి వెళ్ళి పరుపు మీద పడి పోయాడు.
మరుసటి రోజు పొద్దున్నే రమేష్ వాడిని లేపి ఓ డాక్టర్ దగ్గిరకి తీసుకొని పోయాడు. ఆ డాక్టర్ వాడికి “ఈ ఈఎ జీ” తీసి, వాడిని ఒక సైకియాట్రిస్టు దగ్గరికి పంపించాడు. ఆ సైకియాట్రిస్టు ఒక చీకటి రూంలో ఒక చిన్న సుత్తి పెట్టి వాడి మోకాళ్ళ మీదా..మోచేతులమీదా కొట్టి, ‘అంతా మైండ్ లోనే ఉంది”,అన్నాడు. కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ రాసిచ్చాడు వాడికి. పిల్లి కీ బిచ్చానికీ ఒకే మంత్రం.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-25
07 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:comparision, contemplation, thoughts, village visit
మా నాన్న వ్యవసాయం మానేసి, పొలం కౌలు కి ఇచ్చాడు. వ్యవసాయం రైతులకి గిట్టుబాటు కావటం లేదు.
“చంద్రబాబు నాయుడు రెండో సారి అధికారం లోకి వచ్చాక రైతు ల కష్టాలు పెరిగాయి”, అంటున్నాడు మా నాన్న.
నా చిన్నప్పటి ఫ్రెండ్ ధడేల్ గాడి గురించి అడిగాను మా నాన్న ని. ధడేల్ గాడే కాదు, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరూ లేరంట ఊళ్ళో. అందరూ భుక్తి కోసం హైదరాబాదో మద్రాసో వెళ్ళిపోయారు.
ధడేల్ గాడిని మొన్నే పండక్కి చూశాను అని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పిలుచుకొచ్చాడు నాన్న. ఈ ధడేల్ గాడి కీ, చిన్నప్పటి ధడేల్ గాడికీ పోలికే లేదు. ఆ రోజుల్లో వాడి కళ్ళలో కనిపించే అల్లరి ఏ మాత్రం కనపడటం లేదిప్పుడు. వాడి లో జీవితమంటే ఒక అనాసక్తి కనపడుతోంది. వాడు హైదరాబాద్ లో ఒక సినిమా స్టూడియో లో ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు.
కాసేపు మా పాత రోజులను గుర్తు తెచ్చుకున్నాం. రేవు లో కొట్టిన ఈతలూ,మామిడి తోటల్లో అల్లరీ అన్నీ. ఆ తరువాత వాడి కళ్ళలోకి కొంత కళ వచ్చింది. ఈ లోపు మా అమ్మ నిమ్మ కాయ నీళ్ళు తెచ్చి ఇచ్చింది మా ఇద్దరికీ.
ఊళ్ళోకాలువలు ఎండుతున్నాయి. అయితే కేబుల్ టీవీ లో మాత్రం అన్ని చానల్సూ వస్తున్నాయి. ఇంగ్లీషు,హిందీ,తమిళం..అన్నీ. అయితే ఈ చానల్స్ అన్నీ జనాలను మత్తు లోకి తీసుకెళ్ళే కాలువలే. అసలు కాలువల్లో మాత్రం చుక్క నీరు లేదు.
నన్ను పలకరిద్దామని ఊళ్ళో రైతు పెదబాబు వచ్చాడు. మాటల సందర్భం లో పెదబాబు అంటున్నాడు, “ఈ టీ వీ ఛానళ్ళ తో చావొచ్చిపడింది. రిజర్వాయర్లలో నీటిమట్టం అని రోజూ చూపిస్తాడు. దీన్ని చూసి తెలంగాణా వాళ్ళు నీటి కోసం కొట్లాడుతున్నారు”
నేను మాత్రం,”ఇది అందరి మంచికీ”, అన్నాను.
పెదబాబు,”జీతం ఏ మాత్రం ఇస్తారేంటి నీకు?”, అన్నాడు.
నేను,” ఏదో అక్కడి ఖర్చులకి సరి పోతుంది లే” అన్నాను. ” ఎక్కడుండే ఇబ్బందులు అక్కడ ఉంటాయి. కొన్ని విషయాలలో ఇక్కడే బాగుంటుంది” అన్నాను.
దానికి పెదబాబు,”ఆ ఇక్కడేమింది..పేడా పిడకలూ..నా మొహం..నూతి లో కప్పల్లా బతకతమే ఇక్కడుంటే!”, అన్నాడు.
**********************
ఆరు బయట మంచం వేసుకొని చుక్కల్ని చూస్తూ నెమ్మదిగా ఆలోచనలలో కి జారుకున్నాను. సాయంకాలపు పైర గాలి ఎప్పటి లానే మనసునీ శరీరాన్నీ తాకుతోంది.
ఒక విధం గా చూస్తే మా అమ్మా నాన్నలదే మెరుగైన జీవితం. నా జీవితం తో పోలిస్తే వాళ్ళే కుదురైన బతుకు బతికారనిపిస్తోంది. మా అమ్మ తెలివైనదేమీ కాదు. పైపెచ్చు మూర్ఛ రోగం ఉని. ఇది తెలిసి కూడా మా నాన్న అమ్మని పెళ్ళి చేసుకున్నాడు. అదే ఈ రోజులలో, ప్రత్యేకం గా పట్టణాలలో అయితే మా అమ్మ లాంటి ఆడ పిల్లలు చాలా కష్టపడవలసి వచ్చేది. మా అక్కనీ నన్నూ కన్న తరువాత మా అమ్మా నాన్నా జీవితాన్ని ఉన్నంత లోనే పొదుపు గా నింపాది గా గడిపారు. మా అమ్మా నాన్నలకి పెద్దవాళ్ళ సలహా ఎప్పుడూ ఉండేది. మా ఇద్దరి ముద్దూ ముచ్చటలు చూసుకోవటం లో వాళ్ళ జీవితం సంతోషం గానే సాగిపోయింది. ఆ పల్లె లో అందరి బతుకులూ దాదాపు ఇలానే గడిచి పోతాయి. కాబట్టీ వేరే వాళ్ళ తో పోల్చుకొని అసూయ పడే అవకాశం కూడా వాళ్ళకి లేదు.
మా నాన్న ఒకరిని చేయి సాచి అడగ లేదు. ఒకరి చేత మాట పడలేదు. మేం చిన్నప్పుడు తిండికి ఎప్పుడూ బాధ పడలేదు. పల్లెటూళ్ళలో ఉండేటువంటి ఆరోగ్యమైన తింది వేరే ఎక్కడ దొరుకుతుంది? అమెరికా లో కూడా దొరకదు. దీనికి నేను హామీ!
వెనటాపురం లోని విలువల వ్యవస్థ కూ మా అమ్మానాన్న ల విలువల వ్యవస్థ కూ ఘర్షణ లేదు. అందు వలన వాళ్ళు ఎటువంటి డైలమా ఎదుర్కొని ఉండరు.
పల్లెటూళ్ళో నమ్మకం ముఖ్యం. ఒక్కసారి నమ్మకం పోయిందంటే, వాడిని జీవితాంతం నమ్మరు. కాబట్టీ జనం సాధ్యమైనంతవరకూ సమాజం వారిపైన ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోరు. పల్లెటూళ్ళో అన్నీ శాశ్వత సంబంధాలే. సిటీ లోలా తాత్కాలిక సంబంధాలకు చోటు లేదిక్కద, కనీసం మా అమ్మా నాన్న ల తరం లో.
అదృష్టం కొద్దీ మా అమ్మా నాన్న లకు మామూలు ఆరోగ్యానికి ఏమీ కొదవ లేదు. ఇద్దరూ శ్రమ జీవులవటం వలన బీ పీ లూ, సుగర్లూ వాళ్ళ వద్దకి రావటానికి భయపడ్డాయేమో!
తరచి చూస్తే నా జీవితం కంటే వాళ్ళదే హాపీ లైఫ్ అనిపిస్తోంది. అనిపించటం మాత్రమేనా లేక నిజం గా హాపీ లైఫేనా? దీన్ని కొలవటానికి నా దగ్గర ఏ స్కేలో టేపో లేదు.
నేను చిన్నప్పటి నుంచీ అనేక టెంప్టేషన్లు తట్టుకొని, వళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకున్నదెందుకు? మా నాన్న నన్ను కష్టపడి చదివించిందెందుకు? ఆయనకంటే నాసి రకం జీవితం గడపటానికా? దీనిని గురించి తెలిస్తే ఆయన ఏమనుకొంటాడో?. ఏది ఏమైనా నా బతుకు లో క్వాలిటీ లోపించినట్లుంది.
***********
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-26
08 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:development, feudal system, quality of education, reservations., security
“యా బాబూ, బాగుండావా?” కోటేసు అడిగింది. కోటేసు వయసు అరవై ఏళ్ళ పైనే.
“ఇప్పుడెక్కడా ఉండేదీ?” మళ్ళీ కోటేసే.
ఎక్కడ వుంటున్నానో చెప్పి,”నీ ఆరోగ్యం ఎలా ఉంటోంది కోటేసూ?” అడిగాను.
“ఏమీ బాగోటల్లేదు బాబూ, ‘రగత పోటూ పెరిగిపోయింది”, చెప్పింది.
కోటేసు మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వచ్చి, మా అమ్మ కి చేదోడు వాదోడు గా ఉండేది. మా నాయనమ్మ కి చివర్లో ఆరోగ్యం సరిగా లేక పోతే కోటేసే సాయపడింది. ఇప్పుడు కోటేసు కే బాగోలేదు.
“మీ అబ్బాయి ఆస్పత్రి కి తీసుకెళ్ళటం లేదా నిన్ను?”
“అ ఏం అబ్బాయో! ఆడు పెళ్ళాం కొంగట్టుకు తిరుగుతాడు. నా నుంచీ వేరు పడ్డాడు. ఆ పెళ్ళాం కేంటో నేనంటే గిట్టదు. మా ఆయన అన్నా వుండి ఉంటే ఏ మందో మాకో ఇప్పించే వాడు నాకు…నాన్న గారు ఇయ్యాల బందరు తీస్కెల్లి పెద్ద డాట్టరు కి సూపిత్తానన్నాడు. అందుకే ఇట్టా వచ్చా”.
“కబుర్లు చెప్పింది చాలు గానీ, ఇక పదవే, బస్సు టైం అవుతాందీ”,అని మా నాన్న కోటేసు ని తొందర చేసి బయలుదేరదీశాడు. కోటేసును చూస్తే నాకు జాలి వేసింది. జాలి తో పాటు కొద్దిగా అసూయ గా కూడా అనిపించింది. పెట్టుబడి దారీ సంబంధాలలో కంటే ఫ్యూడల్ సంబంధాలలోనే కొంత మానవీయత ఉందేమో!
ఇంతలో నాగులు వచ్చాడు “ఎప్పుడొచ్చా బాబూ?” అంటూ. “సెంటర్లో నువ్వొచ్చావని చెప్తే చూద్దారని వచ్చాను”.
“అంతా కులాసా నా? నీ పిల్లలు ఏం చేస్తున్నారు?” అడిగాను.
” పెద్దాడు ఊళ్ళోనే రుచ్చా తొక్కుతున్నాడు. చిన్నాడు హైదరాబాదు లో అపాటుమెంటు వాచీమాను గా సేత్తన్నాడు”
వీళ్ళకి రిజర్వేషన్లు ఉన్నా వీళ్ళు పైకి రాలేదేమిటబ్బా అనుకొని, “ఏం నాగులూ పిల్లలకి సరిగా చదువు చెప్పించ లేదా” అన్నా.
“ఊళ్ళో గవుర్నమెంటు ఇస్కూల్లో సరిగా చదువు చెప్పరు బాబూ. మేస్టర్లు ఇస్కూలుకి వచ్చేదే తక్కువ. ప్రెవేటు స్కూల్లో ఫీజులెక్కువ. మా బోటోళ్ళు ఆ ఫీజులు కట్టలేరు. సదూ కోటం సదుంకొన్నారు ఇద్దరూ పదో తరగతి దాకా. తరవాత సదివించటం నా వల్ల కాలా. ఈ రోజుల్లో పదోతరగతి కి ఉద్యోగాలు ఎక్కడ్నుంచీ వస్తయ్యి?”
“మన హైస్కూల్లో నేను చదివినప్పుడు బాగానే చదువు చెప్పేవారే?”
“ఆ మాస్టార్లు వేరు, ఆ రోజులు వేరు బాబూ. ఆ మాస్టార్లందరూ ఎల్లిపోయారంట. ఇప్పుదంతా కొత్త మాస్టర్లు. ఇంట్లో ప్రెవేట్లు చెప్తారు. అక్కడికి పంపించాలంటే నా దగ్గిర డబ్బులేయి? ఇంటో చెబుదామంటే మాకా చదువు రాదు”
“ఎల్లొత్తా బాబూ”,అని నాగులు కింద వేసిన టవలు తీసి ఒక దులుపు దులిపి తలకు చుట్టుకొని బయలు దేరాడు.
*******************
మరుసటి రోజు మా అక్క కవిత ని చూడటానికి ఉయ్యూరు వెళ్ళా. కవిత కి ఇప్పుడు ఇద్దరు పిల్లలు.చింటూ మున్నీ. చింటూ గాడు ఐదు లో ఉంటే, మున్నీ ఏమో మూడు లో ఉంది. మొన్న కవిత ఫోన్లో చెప్పింది.
నన్ను చూస్తూనే కవిత మొఖం విప్పారింది
మా బావేమో, “శ్రీధరూ, మమ్మల్ని మర్చి పోయావనుకొంటున్నాం.పర్లేదు. గుర్తున్నాం” అన్నాడు.
చింటూ గాడూమున్నీ ఆ వాడ కట్టు లోని పిల్లల తో కోలాహలం గా ఆడుకొంటున్నారు, ఏడు పెంకులాట.
కవిత మామయ్యొచ్చాడని పిలవగానే వచ్చారు.
మున్నీ వచ్చి, “మరీ… నాకేం తెచ్చావ్?” అంది.
పిల్లలిద్దరికీ నేను తెచ్చిన కామిక్ పుస్తకాలు ఇచ్చాను.
“సరళ రాలేదేం?”, కవిత అడిగింది.
“తనకి ఒంట్లో బాగో లేదు”, అన్నాను.ఇంకా ఎన్ని సార్లు చెప్పవలసి వస్తుందో ఈ అబడ్దం.
మా అక్క పిల్లలిద్దరూ,మద్రాసు లోని పిల్లల కంటే ఉత్సాహం గా కనపడ్డారు. సిటీ పిల్లలలో లేని వైటాలిటీ ఏదో వాళ్ళలో ఉంది.లేదా ఉన్నట్లు నాకు అనిపించింది.
“ఈ సారి సెలవలకి మా ఇంటికి రండి” అని చెప్పి బయలుదేరాను.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-27
09 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:campus interview, chandra babu naidu, job
రోజులు చాలా వేగం గా దొర్లిపోతున్నాయి. ఫస్టియర్ ఫాస్ట్ గా అయిపోయింది. సెకండ్ ఇయర్ లో కోర్ సబ్జక్ట్ ల కు అలవాటు పడే సరికి గడిచిపోయింది. థర్డ్ ఇయర్, “ఇంజనీరింగ్ తరవాత ఏ కాంపిటిషన్ ఎక్జాం రాయాలా!” అని ఆలోచిస్తుండగానే మంచులా కరిగి పోయింది. ఇంజనీరింగ్ తరవాత ఏంచేయాలా అనేది ఫైనలియర్ కి వచ్చిన తరవాత కూడా తెగ లేదు శ్రీధర్ కి. రమేష్ మాత్రం ‘గేట్’ ఎంటెక్ ఎంట్రన్స్ లో మంచి పర్సంటైల్ తెచ్చుకొన్నాడు.
***********
రాష్ట్రం లో ఎన్నికలు జరగటం తో ముఖ్య మంత్రి గా విజయభాస్కర రెడ్డి దిగి పోయి, ఎన్ టీ రామా రావు వచ్చాడు. లక్ష్మీ పార్వతి తో కలిసి రామా రావు రాష్ట్ర రాజకీయాలను నా నా కంపూ చేయటం మొదలు పెట్టాడు.
***********
శ్రీధర్ ఫైనల్ ఇయర్ కి వచ్చే సరికి అత్తెసరు పర్సెంటేజి తో బీటెక్ పాసవుతాననే విషయం అర్ధమైపోయింది. ఓ రోజు చెన్నై కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ కంపేనీ క్యాంపస్ ఇంటర్వ్యూ కి వచ్చింది. వాళ్ళు బీటెక్ పర్సెంటేజ్ కనుక చూస్తే తనకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం లేదని శ్రీధర్ కి తెలుసు. క్యాజువల్ గా ఏ భయంలేకుండా అటెండ్ అవుదామనుకున్నాడు శ్రీధర్. కానీ ఇంటర్వ్యూ కి ముందు గుండె దడ ఎక్కువైంది. అరిచేతుల్లో చిరు చెమట లు పట్టసాగాయి.రెండు సార్లు రెస్ట్ రూం కి వెళ్ళవలసి వచ్చింది.
ఇంటర్వ్యూ లో మొదట శ్రీధర్ పెదాలు దాటటానికి మాటలు చాలా కష్ట పడవలసి వచ్చింది. శ్రీధర్ ప్రాబ్లం గమనించిన ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్ ఒకతను, శ్రీధర్ కి సాల్వ్ చెయ్యమని ఒక ప్రాబ్లం ఇచ్చి,తను బయటికి వెళ్ళాడు. కాసేపు ఏకగ్రత కుదర లా. మరి కాసేపటికి శ్రీధర్ మనసు కుదుట పడింది. చివరికి ఫోకస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగాడు శ్రీధర్.
శ్రీధర్ కి సాయంత్రం క్యాంటీన్ లో కాఫీ తాగుతూ ఉంటే రమేష్ వచ్చి కంగ్రాట్స్ చెప్పే వరకూ తెలియ లేదు,జాబ్ వచ్చినట్లు. ముందు శ్రీధర్ నమ్మ లేదు. కానీ నోటీస్ బోర్డ్ చూశాక నమ్మక తప్పింది కాదు.
శ్రీధర్ కి జాబ్ వచ్చేసరికి రాష్ట్రం లో చంద్రబాబు నాయుడు అధికారంలో పాతుకు పోయి ఉన్నాడు. రామా రావు చని పోవటం కూడా అతనికి కలిసొచ్చింది.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-28
10 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:en of one thread, jhalak, resign
బెంగళూరు లోని “అవంతీ కంప్యూటర్ సిస్టంస్” లో జాయిన్ అయ్యాను. ఒక సింగిల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ తీసుకొని దాంట్లో ఉంటున్నాను. ఆఫీస్ కి రోజూ క్యాబ్ లో వెళ్ళి వస్తున్నాను. నా రూం కి ఒక పని మనిషి వచ్చి రోజూ శుభ్రం చేస్తుంది.
రెండు వారాల కో సారి చెన్నై కి వెళ్ళి సరళ ను కలుసుకొని వస్తున్నాను. ఇప్పుడు సరళ వాళ్ళమ్మ కూడా సరళ కు తోడు గా ఉంటోంది.
మొదట్లో బెంగుళూరు నాకు చాలా నచ్చింది. బెంగుళూరు అంటే…
చల్ల గాలి
అనుకోని వర్షం
స్లీవ్ లెస్అమ్మాయిలు
రాజ్ కుమార్
ఎండ మబ్బుల దోబూచులాట.
బెంగుళూర్లోనే…
అవకాశం, అదృష్టం,పచ్చటి పార్కులు, భాషల కిచిడీ,అందమైన అమ్మాయిలూ, టక్ చేసిన మిడిల్ క్లాస్ ముసలి జెంటిల్ మెన్….ఉండేది.
కానీ బెంగుళూరు లో బతుకు నాణ్యత తగ్గొతోంది. ఇప్పుడు బెంగుళూరంటే,” ట్రాఫిక్ జాంలు, పొల్యూషన్, పెరిగే ఖర్చులు, హోటల్ లో తినే ఫామిలీ లూ”కూడా.
బెంగుళూరే స్వర్గం,బెంగుళూరే నరకం.
*************
ఆఫీస్ లో నాకు రిపోర్ట్ చేసే నిఖిల్ రిజైన్ చేశాడు. మా సీనియర్ మేనేజర్ ముత్తూ నేనూ కలిసినిఖిల్ తో మీటింగ్ లో కూర్చున్నాం. మా ఉద్దేశం,”నిఖిల్ రెజైన్ ఆలోచన ను వీలుంటే మానిపించటం”.
మా మేనేజర్ ముత్తు, నిఖిల్ కు, “మా కంపనీ ఎంత గొప్పదో చెప్పాడు. నిఖిల్ అవసరం మా కంపెనీ కి ఎంత ఉందో చెప్పాడు. మా కంపెనీ మాత్రమే నిఖిల్ కు ఎందుకు సరైనదో చెప్పాడు. కంపెనీ నిన్ను కావాలనుకొంటొంది.వేరే కంపేనీ అలా అనుకొంటుందో లేదో అన్నాడు. ఇతర కంపెనీ లు దూరపు కొండల లాంటివని అన్నాడు. నీకు జీతం పెంచి ప్రమోషన్ ఇస్తామని హింట్ వదిలాడు.
పక్కనే ఉండి ఆయన మాటలు వింటున్న నేను కూడా,”నిఖిల్ జాబ్ వదలటం సరైన నిర్ణయం కాదని కన్విన్స్ అయ్యిపోయాను”. ఇక నిఖిల్ కూడా కన్విన్స్ అయ్యి రెజిగ్నేషన్ వెనక్కి తీసుకొన్నాడు.
తరవాత ఓ వారం రోజులకి మా డివిజన్ లో అందరికీ ఓ మెయిల్ వచ్చ్చింది, మా డివిజన్ హెడ్డు నుంచీ. దాని సారాంశం ఏమిటంటే, ” సీనియర్ మేనేజర్ ముత్తు కి ఆ రోజే కంపెనీ లో చివరి రోజనీ, ముత్తు మూడు నెలల కిందటే రెజైన్ చేశాడనీ, అతనికి వేరే చొట్ల వేరే అవకాశాలు వచ్చాయనీ”.
“ఔరా ఏమి మాయ!” అనుకోక తప్పలేదు నాకు. నిఖిల్ ఇంకో సారి రిజైన్ చేస్తే ఆపే శక్తి మాత్రం ఈ సారి లేదు నాకు.
************
సరేనండీ! స్నానం చేసి రావాలి.. చాలా కధే చెప్పాను. అయితే ఇక నుంచీ నాకు ప్రాజెక్ట్ పనులు చాలా ఎక్కువైనాయి. చాలా బిజీ నేను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది,సాఫ్ట్ వేర్ ఇంజినీర్ జీవితం ఎంత బిజీ నో. ఇప్పటి దాకా నేను చెప్పిన కథ ని నా ఫ్రెండు ఒకడికి ఇచ్చాను. ఇకనుంచీ నా కథ వాడే చెబుతూ ఉంటాడు. సో, నా కథ ని వాడికి “ఔట్ సోర్స్” చేశానన్న మాట. ఈ మొత్తం కథ ను వాడే బ్లాగ్ చేస్తాడు. మీరు కాస్త విసుక్కోకుండా చదివి ఆనందించారో లేదో నాకు చెప్తూ ఉండంది.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-29
11 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:accident, andhra, bangalore, fake resume, hosur road, onsite, telugu
శ్రీధర్ వాళ్ళ కంపెనీ లో ఇంటర్వ్యూ లు జరుగుతున్నాయి. ఓ కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని కోసం ఇంటర్వ్యూలు. శ్రీధర్ కూడా ఇంటర్వ్యూ బోర్డు లో ఒక మెంబర్. రక రకాల క్యాండిడేట్లు వస్తున్నారు. ఒకతను కాలేజీ నుంచీ అప్పుడే పాసయ్యి వచ్చినట్లున్నాడు. “సార్ నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం. ప్లీజ్ సార్, దయచేసి ఇప్పించడి” అన్నాడు. ఆంధ్రా నుంచీ మెడ లో మోకు లాంటి ఒక బంగారపు గొలుసు వేసుకొని వచ్చిన ఓ సమరసింహా రెడ్డి సెలెక్ట్ కాలేదు. అతను ఇంటర్వ్యూ చేసినవాడిని పిలిచి “నీకు ఇంటర్వ్యూ చెయ్యటం రాదు, నేర్చుకో”, అని చెపుతున్నాడు.
ఒక ఇంటర్వ్యూ చేసే అతను క్యాండిడేట్ ని అడిగాడు, “నువ్వు నీ ముందు కంపెనీ మారటానికి కారణాలేమిటి?” అని.
క్యాండిడేట్ అడిగాడు, “మీరు 2003 నుంచీ ఆవంతి కంప్యూటర్ సిస్టం లో పని చేస్తూ ఉండి ఉంటారా?” అని.
ఇంటర్వ్యూ చేసే అతను ఒకింత ఆశ్చర్యపోయి, “ఎందుకూ?” అన్నాడు.
“ఏమీ లేదు ఊరికి నే. చెప్పండి”, అన్నాడు క్యాండిడేట్.
” 2002 నుంచీ” అన్నాడు ఇంటర్వ్యూ చేసే అతను.
“మరి మీరు అంతకు ముందు పనిచేసిన కంపేనీ నుంచీ ఎందుకు మారారు?” అన్నాడు క్యాండిడేట్. ఇంటర్వ్యూ చేసే అతని దగ్గర సమాధానం లేదు.
“ఓ క్యాండిడేట్కి ఆఫర్ ఇచ్చారు. అతను అక్కడే కూర్చొని సెల్ లో వేరే కంపెనీ వాళ్ళని కాల్ చేసి బేరమాడుతున్నాడు” !! ఇది ఉద్యోగమా? వ్యాపారమా?
‘హెచ్ ఆర్’ మేడం అంటూంది, “ఆంధ్రా నుంచీ వచ్చే రెస్యూం లలో ఫేక్ ఎక్కువ” అని. దానికి శ్రీధర్ ప్రొటెస్ట్ చేశాడు, “ఫేక్ వాళ్ళు అన్ని రాష్ట్రాలలోనూ ఉంటారు” అని.
దానికామె అంది, ” నీకు ర్యాండం స్యాంప్లింగ్ థీరీ తెలుసా?” అని. మళ్ళీఇలా అంది,”ఒక బుట్టలో రక రకా ల రంగు పూసలు కలగలిసి పోయి ఉన్నాయి అనుకొందాం. దాంట్లోంచీ నేను ఒక గుప్పెడు పూసలు తీస్తాను. అందులో నల్లవి ఎక్కువైతే, ఆ బుట్టలోకూడా నల్ల పూసలు ఎక్కువనుకొంటాను. అలానే నా ఎక్స్ పీరియన్స్ కూడా ఒక శాంపుల్ లాంటిది. అందులో ఎక్కువ గా నల్ల పూసలే ఉన్నాయి”, అంది.
ఇంటర్వ్యూ తరవాత శ్రీధర్ సిటీ బస్సు లో ఇంటికెళ్తుంటే ఎవరో తెలుగు బాబాయ్ సెల్ ఫోన్ లో అరుస్తున్నాడు,”ఆ..మావా రెస్యూం ప్రిపేర్ చేసేశాన్రా..ఒక ఇయర్ ఎక్స్ పీరియన్స్ ఉందనుకో..ఇంకో రెండేళ్ళు ఫేక్ పెట్టా…టెస్టింగ్ లో…ఆ..బ్యాక్ గ్రౌండ్ చెక్ వస్తే కొంచెం మానేజ్ చెయ్యాల్నువ్వు…సరే ఉంటా..”
అది విన్న తరవాత’ హెచ్ ఆర్’ ఆమె చెప్పింది నిజమేనేమో అనిపించింది శ్రీధర్ కి.ఏదేమైనా, మన తెలుగు వాళ్ళంతా ఆత్మ విమర్శ చేసుకోవలసిన విషయం ఇది.
శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి మొదలైంది.శ్రీధర్ ప్రాజెక్ట్ లీడ్. దానితో, క్యాబ్ లో కొంచెం ముందే బయలుదేరుతున్నాడు శ్రీధర్. ఈ మధ్య వెంకట్ క్యాబ్ లో రావటం లేదు. బైక్ కొనుక్కొని దాంట్లో వస్తున్నాడు. ఇప్పుడు వెంకట్ కూడా శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ లో చేరాడు. వెంకట్ నిజం గా టాప్ గ్రేడర్. అతనికి పని ఇస్తే దానిని గురించి శ్రీధర్ మరిచిపోవచ్చు. వెంకట్ కి ఆన్ సైట్ వెళ్ళా లని బాగా కోరిక ఉందని శ్రీధర్ కి తెలుసు. శ్రీధర్ కూడా పంపించే ఆలోచన లోనే ఉన్నాడు. ఇవాళొ రేపో క్లైంట్ కి చెప్పి,తరవాత వెంకట్ కి చెప్పాలనుకొంటున్నాడు శ్రీధర్.
శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ లో చాల భాషల వాళ్ళే ఉన్నారు. మనం తెలుగు వాళ్ళ గురించి చెప్పుకుందాం. వెంకట్ గురించి మీకు తెలుసు. ఇంకా సుబ్రమణ్యం, ఫణి, ముకుందు, రామా రావ్.
సుబ్రమణ్యం చాలా కష్టపడతాడు. రాత్రి పదీ పన్నెడు దాకా ఆఫీస్ లోనే ఉంటాడు. అంతకు ముందు ప్రాజెక్ట్ లీడ్ కూడా ‘అతను హార్డ్-వర్కర్’ అని చెప్పాడు. కానీ శ్రీధర్ ఒకటి గమనించాడు. సుబ్రమణ్యం కి ఐటీ కి సంబంధించిన కొన్ని సాధారణ విషయాలు కూడా తెలియదు. ఫోల్డర్ ని శ్రీధర్ లాగిన్ కి షేర్ చెయ్యమంటే అర్ధం కాలేదు అతనికి. అతనికిచ్చిన పని కూడా చాలా నెమ్మది గా అవుతుంది.
ఓ రోజు ‘హెచ్ ఆర్’ ఆమె పిలిచి చెప్పింది, “సుబ్రమణ్యం బ్యాక్ గ్రౌండ్ చెక్ నెగటివ్ గా వచ్చింది..ఫేక్ ఎక్స్ పీరియన్స్ పెట్టాడు. సో వెంటనే అతన్ని పీకేయాలి”, అని.
“ప్రాజెక్ట్ లో అతనిది చాలా ఇంపార్టంట్ రోల్ వెంటనే తీసేయాలంటే కష్టం”, అన్నాడు శ్రీధర్, సాటి తెలుగు వాడిని వెంటనే పీకటానికి శ్రీధర్ మనసు ఒప్పుకోలా. కానీ సీట్లోకి వచ్చి ఆలోచించుకొంటే అనిపించింది శ్రీధర్ కి, “ప్రాజెక్ట్ మొదట్లో ఉంది. తరవత ఐతే రిస్కు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పీకేయటమే కరెక్టు. లేక పోతే నేను ఇబ్బంది పడతాను”, అనుకొన్నాడు.
సుబ్రమణ్యం వెళ్ళే ముందు శ్రీధర్ ని కలుసుకొన్నాడు, “బయటికెళ్ళిన తరవాత ఏం చేస్తావ్?” అన్నాడు శ్రీధర్.
“వేరే కంపనీ నుంచీ ఆఫర్ ఉంది”, అన్నాడు సుబ్బు. మరి ఈ కొత్త ఆఫర్ ఫేక్ వలన వచ్చిందో, లేకుండా వచ్చిందో.
ఇక పోతే ఫణి ఎప్పుడూ నీరసం గా ఉంటాడు. ఓ రోజు అతని తో మాట్లాడుతుంటే తెలిసింది శ్రీధర్ కి. అతను అంతకు ముందు జావా లొ చేశాడని. శ్రీధర్ ప్రాజెక్ట్ ఏమో ఎంబెడెడ్. ఫణి కి ఎంబెడెడ్లో చెయ్యటం ఇష్టం లెదు. “ఏంటొ నా ఇష్టం తో పని లేకుండా నన్ను ఓ బాల్ లా తంతున్నరు ఒక ప్రాజెక్ట్ లోంచీ వేరే దాన్లో కి”, అంటాడు అతను.
సరే, ముకుందు సంగతి కొద్దాం. అతనిది ఒంగోలు దగ్గర ఓ పల్లెటూరు. ఇంగ్లీషు వీకు.కానీ టెక్నికల్ గా సౌండు. అతన్ని అర్ధం చేసుకోవడమే కష్టం వేరే భాషల వాళ్ళకి
రామా రావు ది హైదరాబాదు. కంపె నీ లో ఉండటమే కంపెనీ కి సేవ చెయ్యటం అనుకొంటాడు అతను. శ్రీధర్ కానీ, వాళ్ళ మానేజర్ కానీ ఇచ్చిన ఏ పని కీ అతను “నొ” చెప్పడు. కానీ, అతనికి ఇస్తే ఏ పనీ ముందుకు కదలదని తెలుసు శ్రీధర్ కి. ఇటువంటి వాళ్ళు ఉండే కంపెనీ ల గురించి మనం జాలి పడాలి.
శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళ గానే రిసెప్షనిస్ట్ నుంచీ ఫోన్ వచ్చింది.
ఆమె అడుగుతోంది, “మీ దగ్గర వెంకట్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నంబర్ ఉందా?”
“లేదు ఏమయ్యింది?”
“అతని బండి కి హోసూర్ రోడ్డు లో యాక్సిడెంట్ అయ్యింది. నారాయణా లో చేర్పించారు.”
” సీరియస్ గా ఉందా?” అన్నాడు.
“అవును”.
శ్రీధర్ హాస్పిటల్ కి వెళ్ళేసరికి అంతా అయ్యిపోయింది. చావు చాలా విచిత్రమైనది.
‘హెచ్ ఆర్’ అమ్మాయి కి ఫోన్ చెస్తే వెంకట్ వాళ్ళ పేరెంట్స్ పేర్లు చెప్పింది. వెంకట్ జేబు లోని సెల్ లో వాళ్ళ నాన్న ఫోన్ నంబర్ ఉంది. ఫోన్ చేశాడు శ్రీధర్. మోగుతోంది ఫోన్. ఏమి చెప్పాలి? “ఆన్ సైట్” “ఆన్ సైట్” అనే వాడు..తిరిగి రాని తీరాలకి ‘ఆన్ సైట్’ వెళ్ళిపోయాడనా?
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-30
12 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:appraisal, hardware, project, project lead, project manager, software
శ్రీధర్ ని కాన్ఫరెన్స్ రూం లో కి పిలిచి ఆశ్చర్యం గా అడిగాడు వాళ్ళ మానేజర్ ఆనంద్, ” టాస్క్ నంబర్ 18, పాతిక లైనులు ఉంటుందని ఎస్టిమేట్ చేశాం. దానికి ఏడు రోజులు ఎందు కు కావాలి?”
శ్రీధర్ స్థిరం గా అన్నాడు, “ఆనంద్, మనకి ఉన్నది ఒక పేజీ ఉన్న రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. ఇన్ ఫర్మేషన్ చాలా తక్కువ. ఈ టాస్క్ కి పాతిక లైన్ల కోడ్ మాత్రమే ఉండవచ్చు గానీ, ఆ కోడ్ రాయటం చాలా కష్టం. రియల్ టైం ప్రోగ్రామింగ్ లో టైమింగూ, సింక్రొనైజషన్ వంటి విషయాలు గమనించాలి. మన టీం మెంబర్స్ అంతా కొత్త వాళ్ళు. ఎవరికీ రియల్ టైం ప్రోగ్రామింగ్ లో పని చేసిన అనుభవం లేదు.”
ఆనంద్ శ్రీధర్ ముందుకి ఒక ఎక్సెల్ షీట్ ప్రింట్ ఔట్ తోశాడు,” ఇది మనీషా వేసిన ఎస్టిమేట్, అదే టాస్క్ కి. ఆమె చాలా తక్కువ ఇచ్చింది”.
“ఆమె ఇచ్చింది కరెక్ట్ అని నీకెలా తెలుసు?”.
“ఆమె ఇచ్చింది కరెక్టో కాదో తరవాత సంగతి. నువ్విచ్చిన ఎస్టిమేట్ తో కస్టమర్ మనకి ప్రాజెక్ట్ ఇవ్వడు”, అన్నాడు ఆనంద్.
శ్రీధర్ సీట్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనీషా ఎస్టిమేట్ తో ఆనంద్ కస్టమర్ కి పంపించిన మెయిల్ ఇన్ బాక్స్ లో ఉంది. “మరి అలాంటప్పుడు నన్నెందుకు ఎస్టిమేట్ అడిగాడు? అసలు ఆనందే ఎస్టిమేట్ చేసి కస్టమర్ కి పంపించాల్సింది. ఈ ఎస్టిమేట్ తో ఇప్పుడు జనాలు రాత్రింబవళ్ళు పని చేయాలి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయటానికి”.
ఈ లోపు రూపాలి వచ్చింది, ఆమె కేదో జావా డౌటు.
” రూపాలీ, నేను ఈ స్పెసిఫికేషన్ తో బిజీ గా ఉన్నాను. శరత్ కి ఇదే విషయం ఎక్స్ ప్లెయిన్ చేశాను. శరత్ ని అడుగు”.
రూపాలి పెదాలు బిగించి, “శరత్ కి నాకు చెప్పాలంటే ఇష్టం లేదు. అతను సాయంత్రం తొందర గా ఇంటికి వెళ్ళిపోతాడు. అదేమంటే “నేనూ పెళ్ళైన వాడిని, ఇంటి దగ్గర పిల్లలున్నారు” అంటాడు. నేనూ చెప్ప వచ్చు, “నేను అడ పిల్లని, రాత్రి ఎనిమిది తరవాత ఆఫీస్ లో ఉండకూడదు, గవర్న్మెంట్ రూల్స్ ప్రకారం”, అంది రూపాలి.
శ్రీధర్,”సరే నేను అతని తో తరవాత మాట్లాడతాను”,అని ఆమె కి ఆ డౌట్ క్లియర్ చేశాడు.
శరత్ కి రూపాలి కంటే ఎక్స్ పీరియన్స్ ఎక్కువ. అతను త్వరగా నేర్చుకొంటాడు కూడా. కాసేపటికి శ్రీధర్ శరత్ ని మీటింగ్ రూం లోకి పిలిచి అడిగాడు,”శరత్, నువ్వు దీపాలి కి ఎందుకు ఎక్స్ ప్లైన్ చెయ్యలేదు?”
“ఆమె నన్ను అడగ లేదు ఎక్స్ ప్లైన్ చెయ్యమని. అడిగితే ఎక్స్ ప్లైన్ చేసేవాడిని”
“నీకు తెలుసు రూపాలికి ఒక డౌట్ ఉందని. నువ్వు సీనియర్ వి.నువ్వే చొరవతీసుకొని ఎక్స్ ప్లైన్ చెయ్యాల్సింది కదా? ఇక నుంచీ నువ్వే ఈ టాస్క్ కి ఓనర్ వి. నీదే బాధ్యత”
తరవాత రోజు రూపాలి ని పిలిచి చెప్పాడు,”రూపాలి నీ పెర్ఫార్మన్స్ బాగుంది.అయాం హాపీ. నీకు ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలనుకొంటున్నాను. ఇక నుంచీ శరత్ నీకు చెప్పినా చెప్పక పోయినా, బాధ్యత నీదే అవుతుంది”,
రూపాలి అలానే అని, తలూపి వెళ్ళిపోయింది. ఈలోగా సంతోష్ రెడ్డి వచ్చాడు. “ఏమప్పా శ్రీధరూ.లంచికి పోదామా?” అన్నాడు సంతోష్. క్యాంటీన్ కి వెళ్ళే దారి లో, “నేను పేపర్లు పెట్టేసినానబ్బా. మా పులివెందుల బావ హైదరాబాదు లో ఒక పదెకరాలు కొనినాడు. రియల్ ఎస్టేట్ చేసుకుందాం రమ్మంటున్నాడు. వైఎస్సార్ గవుర్నమెంటు లో బాగా పలుకుబడి ఉంది లే మా బావ కి”, అంటున్నాడు సంతోష్.
*********************
ప్రాజెక్ట్ మంచి ఊపు లో ఉంది. శ్రీధర్ పది నెలలకి ఎస్టిమేట్ ఇస్తే, ఆనంద్ దానిని ఐదు నెలలు చేసి కస్టమర్ నుంచీ ప్రాజెక్ట్ తెచ్చాడు. శ్రీధర్ జనాలందరికీ పని ఇవ్వటం మొదలుపెట్టాడు. కస్టమర్ కి “వీక్లీ స్టేటస్ రిపోర్ట్” పంపించేటపుడు శ్రీధర్ ఇది గమనించాడు…… రూపాలి కీ శరత్ కీ ఉమ్మడి గా ఇచ్చిన టాస్కు ముందుకి కదల లేదు. శ్రీధర్ ఇద్దరినీ పిలిచి కారణం అడిగాడు. రూపాలి శరత్ ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకొన్నారు.
రూపాలి అంది,”శరత్ నాదగ్గరికి వచ్చి తనే ఓనర్ని అని చెప్పాడు. సో,నేను అతను చేస్తున్నాడు అనుకొన్నాను”
శరత్ అన్నాడు,” నువ్వు తరవాత రూపాలి కి తనే ఓనర్ అని చెప్పటం విన్నాను.నీ డెసిషన్ మార్చుకొన్నవేమోలే అని నేనూరుకొన్నాను. నేను వేరే టాస్క్ లు చూసుకొంటున్నాను”
శ్రీధర్ తనలో తను పెద్దగా అరుచుకొన్నాడు,” భగవంతుడా,నన్ను నువ్వే రక్షించు!”. తరవాత వాళ్ళిద్దరికీ వేరే వేరే టాస్కులు ఇచ్చాడు శ్రీధర్.
అప్రైజల్స్ స్టార్ట్ అయ్యాయి. రూపాలి కోపం గా ఉంది. ఆమె కిచ్చిన రేటింగ్స్ వలన ఆమె కి చాలా అసంతృప్తి కలిగింది. ఆమె శ్రీధర్ తో అంటూంది, “నేను రాత్రి పూట కూడా పని చేశాను. వీకెండ్స్ పని చేశాను. శరత్ ఎప్పుడూ యెర్లీ గా వెళ్ళిపోతాడు. అయినా అతనికి నాకంటే మంచి రేటింగ్స్ వచ్చాయి. అప్రైజల్ నిష్పక్షపాతం గా లేదు.”
శ్రీఎధర్ అన్నాడు, “అప్రైజల్ అనేది,ఒకమనిషి ఎంత పని చేశాడు అనో లేదా, ఆ మనిషి నో, అప్రైజ్ చెయ్యటం కాదు. చివరి గా ఆ మనిషి కంపెనీ కి తన వంతు గా ఎంత ఉపయోగ పడ్డడా అని చూడాలి. అయినా ఒకరి రేటింగ్స్ తో పోల్చుకోవద్దు”.
శ్రీధర్ సమాధానం రూపాలి కి తృప్తినివ్వలా. తరవాత ఓ వారం రోజులు అప్పుడప్పుడూ రూపాలి కాఫీ వెండింగ్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తన సెల్ లో నెమ్మది గా మాట్లాడటం విన్నాడు శ్రీధర్. ఓ నెల రోజుల తరువాత రూపాలి నుంచీ శ్రీధర్ కి రెజిగ్నేషన్ లెటర్ వచ్చింది.
***************
కిందటి వారం స్పెసిఫికేషల డాక్యుమెంట్ కస్టమర్ కి పంపించారు. కస్టమర్ చాలా రోజులు జవాబు ఇవ్వలా. చివరికి, ఓ రోజు “ఆక్సెప్టెడ్” అని ఒక ముక్క మెయిల్ ఇచ్చాడు. స్పెసిఫికేషల ఆధారం గా హై లెవెల్ డిసైన్ మొదల్య్యింది. ఇది ప్రణాళికాసామాగ్రి (సాఫ్ట్వేర్ ప్రొగ్రాం) తయారీ లో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు తీసుకొనేనిర్ణయాలు సరి గా లేక పోతే తరవాత చాలా ఇబ్బందులు పడాలి.
కస్టమర్ తో ఒక టెలిఫోన్ సమావేశం జరిగింది. ఆనందూ శ్రీధరూ ఇంకా జట్టు మొత్తం అటెండ్ అయ్యింది ఆ మీటింగ్ కి. శ్రీధర్ కి మీటింగుల్లో ఆనంద్ మాట్లాడే విధం నచ్చదు. ఒక యాంత్రిక మైన లయ (మెకానికల్ రిథం) తో మాట్లాడుతాడతను. అతను మాట్లాడటం చూస్తే చిన్నప్పుడు బందరు హోటల్లో సర్వర్ చదివిన టిఫిన్ల దండకం గుర్తుకు వస్తుంది శ్రీధర్ కి.
వినియోగదారుడు (కస్టమర్) డాటా ఫ్లో డయాగ్రం లో ఒక విషయం గురించి అడిగాడు. కానీ టీం లో ఎవరికీ దానిని గురించి తెలితదు. ఎవరైనా తెలియని విషయం అడిగినప్పుడు, దానికి సమాధానం ఇవ్వటానికి చాలా మార్గాలున్నాయి. శ్రీధర్ అయితే రిస్కు తీసుకొని, తనకి తోచిన ఒక సమాధానం చెప్పి ఉండే వాడు. ఆ సమాధానం సరైనదైతే అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ వివరణ తప్పు ఐతే కస్టమర్ కి శ్రీధర్ టీం గురించి తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుంది. “మేము తరవాత నీకు సమాధానం చెబుతాం”, అని చెప్పవచ్చు. కానీ అప్పటికే ఆ ట్రిక్ శ్రీధర్ చాలా సార్లు ఉపయోగించాడు. చివరికి శ్రీధర్, “దీనికి సమాధానం మాకు తెలియదు”,అని చెప్పాడు.
మీటింగ్ అయ్యిన తరువాత ఆనంద్, శ్రీధర్ నీ టీం నీ బయటకు పంపి కస్టమర్ తో ఒక్కడే మాట్లాడాడు. ఓ పది నిమిషాల తరవాత ఆనంద్ శ్రీధర్ ని తన రూం లోకి పిలిచాడు.
” కస్టమర్ కి నువ్వు చెప్పింది నచ్చలేదు.ఇక నుంచీ జాగ్రత్త గా ఉండు”, అన్నాడు.
శ్రీధర్ ఆనంద్ ని అడిగాడు, ” నేను ఏమి చెప్పి ఉండాల్సింది?”
శ్రీధర్ ప్రశ్న ఆనంద్ కి నచ్చలేదు. అయినా తనను తాను నియంత్రించుకొని (కంట్రోల్ చేసుకొని) చెప్పాడు ఆనంద్,”కస్టమర్ కి మనం చెప్పే సమాధానం, అతనికి మనమీద ఉన్న మంచి అభిప్రాయాని తగ్గించేది గా ఉండ కూడదు”
శ్రీధరేమీ మాట్లాడ లేదు కానీ ఇలా అనుకొన్నాడు,” కస్టమర్ మైండ్ లోఏముందో మనకేమి తెలుసు. ప్రాబ్లెం తెలియదు అని ముందే చెప్తే మంచిది. చివరి నిమిషం లో చెప్తే దీని వలన నష్టం ఎక్కువ అవుతుంది.బాస్ అనేవాడు సబార్డినేట్స్ చేసిన తెలివైన తప్పులని,కాలిక్యులేటెడ్ రిస్క్ నీ సపోర్ట్ చెయ్యాలి.లేక పోతే బాస్ సాదా సీదా ఫలితాలతో సరి పెట్టుకోవాలి”.
డిజైన్ డాక్యుమెంట్ పూర్తి అయ్యింది. కస్టమర్ కి ఆ డాక్యుమెంట్ పంపించుదామను కొంటుండగా శ్రీధర్ కి ఆనంద్ నుంచీ మెయిల్ వచ్చింది. కస్టమర్ రిక్వైర్మెంట్ మార్చాడు. ఇప్పుడు డిజైన్ డాక్యుమెంట్ మళ్ళీ మొదటి నుంచీ ప్రిపేర్ చెయ్యాలి. శ్రీధర్ కి వళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆనంద్ దగ్గరికి వెళ్ళి, “రెక్వైర్మెంట్ మారింది.దీని వలన షెడ్యూల్ మారుతుంది. ఇది చేంజ్ రిక్వెస్ట్. కాబట్టీ ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది” అన్నాడు.
” కాస్ట్ విషయం నాకు వదిలెయ్. షెడ్యూల్ మాత్రం పాతదే ఉంటుంది.నేను కస్టమర్ కి కమిట్ చేశాను.”
శ్రీధర్ కోపం కంట్రోల్ చేసుకొని, ప్రశాంతం గా అడిగాడు ఆనంద్ ని,” నువ్వు కస్టమర్ కి కమిట్ అయ్యే ముందు టీం తో డిస్కస్ చెయ్యాలి అనిపించలేదా?”
“శ్రీధర్, నేను ఏం చెయ్యాలి అనేది, నీకు సంబంధించిన విషయం కాదు. నీకు కావాలంటే ఇంకా ఎక్కువ మందిని ఇస్తాను.కానీ షెడ్యూల్ మారదు”.
“ఆనంద్, ఈ లెక్కలు అన్నిసార్లూ పని చెయ్యవ్. నువ్వు నాకు తొంభై రెట్లు జనాలను ఇస్తే ప్రాజెక్ట్ ను ఒక్క రోజులో అవ్వగొట్టగలమా?”
“చూడు శ్రీధర్, నేను పదిహేను సంవత్సరాల నుంచీ చూస్తున్నాను. ప్రాజెక్టులు పేపర్ మీద ఎలా నడిచినా, నిజ జీవితం లో ఇలానే నడుస్తాయి. టీం ని ఎక్కువ సేపు పని చెయ్యమను. మళ్ళీ ఎక్కువ సేపు పనిచెయ్యటం సరి కాదు అనవద్దు. జనాలు లేటు గా ఉండి చేసిన పనే సాఫ్ట్ వేర్ కంపెనీ ల లాభాలు గా మారుతుంది”.
***********
ఫణి శ్రీధర్ దగ్గరికి వచ్చి మళ్ళీ మొదలెట్టాడు. “నేను జావా లో పని చేశాను.జావా లో ఏమన్నా వర్క్ ఉంటే ఇవ్వు.లేకపోతే, పక్కన ఓ జావా ప్రాజెక్టు జరుగుతోంది. దానికి పంపించు”
ఆనంద్ తో మాట్లడితే అన్నాడు,” శ్రీ, వీళ్ళు ఇలానే అంటూ ఉంటారు. పని చేసే వాడికి జావా ఐనా ఒక్కటే, సీఎ ప్లస్ ప్లస్ అయినా ఒక్కటే. మనం ఫణి ని ఒక్కసారి పంపిస్తే, టీం లో మిగిలిన వాళ్ళు కూడా మొదలు పెడతారు, మార్చమని…అప్పుడు ఈ ప్రాజెక్ట్ రన్ చెయ్యటమే కష్టం అవుతుంది” కానీ శ్రీధర్ కి ఈ మాటలు నచ్చలా.
శ్రీధర్ కి సేల్స్ టీం పధ్ధతి కూడా నచ్చలా. కస్టమర్ హఠాత్తు గా పెర్ఫార్మన్స్ గురించి గొంతెమ్మ కోరికలు కోరటం మొదలు పెట్టాడు. ఏంటా అని ఆరా తీస్తే శ్రీధర్ కి తెలిసింది, శ్రీధర్ వాళ్ళ కంపెనీ సేల్స్ టీం వాళ్ళు కస్టమర్ కి, “మా వాళ్ళు వీరులూ, శూరులూ” అని చెప్పారని.
శ్రీధర్ “టీం అంతా ఒక పిక్నిక్ కి వెళ్దాం”, అని ప్రతిపాదించాడు. ఆనంద్ మూడ్ బాగున్నట్లుంది, వెంటనే ఓకే చేశాడు. ట్రెక్కింగ్ కి రామానగరం వెళ్ళారంతా. టీం లో వాళ్ళు చాలా వరకూ సిటీ జనాలవటం వలన, వాళ్ళ కి అదో వెరైటీ గా ఉంది. శ్రీధర్ ఇటువంటి ట్రెక్కింగ్ లు చాలానేచేశాడు చిన్నప్పుడు. కానీ ఈ మొత్తం విషయం లో ఒక సర్ ప్రైజ్ మనీషా. ఆమె శ్రీధర్ టీం లో లేదు. అయితే ఆనంద్ అడిగినట్లున్నాడు ఆమెను కూడా జాయిన్ అవ్వమని.
*************
కస్టమర్ హార్డ్ వేర్ పంపించాలి. కానీ అది రావటం ఓ రెండు వారాలు లేట్ అయ్యింది. ఈ విషయం శ్రీధర్ వీక్లీ స్టేటస్ రిపోర్ట్ లో రాశాడు. కస్టమర్ మానేజర్ పేరు లూసీ. ఆమె సాధారణం గా వీక్లీ స్తేటస్ రిపోర్ట్లు చదవదు. కానీ ఈ రిపోర్ట్ చదివింది. ఆమె ఆనంద్ కి కాల్ చేసింది. తరవాత ఆనంద్ శ్రీధర్ ని కాల్ చేశాడు. “చూడు శ్రీధర్, కస్టమర్ నీ గురించీ, ప్రాజెక్ట్ గురించీ హాపీ గా లేడు(దు). ఇలా అయితే కస్టమర్ కమ్మ్యూనికేషన్ విషయం లో ఒక కొత్త లీడ్ ని పెట్టాలి”
“ఏమిటి ప్రాబ్లం? నేను నా పని చేస్తున్నాను కదా?”
” ఏ కస్టమరూ తన వెండర్ యొక్క లీడ్ పనిమంతుడైతే వదులు కోవాలని అనుకోడు”.
ఆనంద్ మాటలు శ్రీధర్ లో ఆందోళన పెంచాయి. లూసీ చెడు గా చెప్పి ఉంటుందా తన గురించి? లేక పోతే నా మీద ఒత్తిడి పెంచి పని చేయించుకొనేటందుకు ఆనందే ఇలా చెప్తున్నాడా?”
కస్టమర్ కి ఒక ఇంటర్మీడీయేట్ వర్షన్ ని రెలీజ్ చేశారు. తరవాత లూసీ ఆనంద్ కి ఇలా ఇంగ్లీష్ లో మెయిల్ చేసింది, “ఈ వర్షన్ దిక్కుమాలినట్లుంది. మీరు మా సమయాన్నీ, దబ్బునీ వృధా చెయ్యటం లేదని ఆశిస్తాను”
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-31
14 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:audit, configuration manager, process, quality
ఇంకో రెండు రోజుల్లో క్వాలిటీ ఆడిట్ ఉంది. శ్రీధర్ కాన్-ఫిగరేషన్ మేనేజర్ తో కూర్చొన్నాడు. సర్వర్ లో ఉండాల్సిన డాక్యుమెంట్లు ఏమీ లేవు. కాన్-ఫిగరేషన్ మేనేజర్ మోహిత్ అన్నాడు, “నీకెందుకు శ్రీ ఆడిట్ టైం కి అన్ని డాక్యుమెంట్లూ ఉండేలా చేస్తాను కదా”.
శ్రీధర్ మోహిత్ తో మాట్లాడుతూ ఉండగానే ఆనంద్ పిలిచాడు. ఆనంద్ రూం లో మనీషా ఉంది. ఆమె “హాయ్ శ్రీ” అంది.
ఆనంద్ మొదలుపెట్టాడు,” శ్రీ, మన ప్రాజెక్ట్ లో కస్టమర్ తో మాట్లాడే విషయం లో కొన్ని సమస్యలున్నాయి. మనీషా ప్రాజెక్ట్ అయిపోవస్తోంది. ఆమె నీకు కస్టమర్ తో చర్చలు జరిగేటప్పుడు సహాయం చేస్తుంది. దీని వలన నీకు రోజువారీ ప్రాజెక్టు నడపటం మీద దృష్టి పెట్టటానికి కుదురుతుంది”.
శ్రీధర్ సన్నగా నవ్వి, మనీషా తో, “మా ప్రాజెక్ట్ కి స్వాగతం” అన్నాడు ఇంగ్లీషు లో. కానీ అతని మనసు మాత్రం నవ్వటం లేదు. అది అత్తిపత్తి ఆకు లాగా అనుమానాలతో ముడుచుకు పోయింది. “ఆనంద్ ఈమె ని ప్రాజెక్ట్ లోకి తేవటానికి అసలు కారణమేమిటి? ఆమె కస్టమర్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చెయ్యటానికి ఏమి చేస్తుంది?”
************
శ్రీధర్ కి పక్కనే ఒక ఇంటర్నల్ ప్రాజెక్ట్ నడుస్తోంది. జనాలు విసుగూ విరమం లేకుండా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ ఇంటర్నల్ ప్రాజెక్ట్ ల వలన సాధారణం గా ఒరిగేదేమీ ఉండదు. ఇంటర్నల్ ప్రాజెక్ట్ సీరియస్ గా నడవాలంటే, ఆ టీం లో వాళ్ళకి అది ఇంటర్నల్ ప్రాజెక్ట్ అని తెలియకూడదు. కానీ టీం లో వాళ్ళకు ఇంటర్నల్ ప్రాజెక్ట్ అని తెలియకుండా ఒక ప్రాజెక్ట్ నడపటం ఎలానో ఇంకా ఎవరూ కని పెట్టలేదు.
క్వాలిటీ ఆడిట్ రోజు రానే వచ్చింది. శ్రీధర్ ప్రాజెక్ట్ సర్వర్ లోంచీ డాక్యుమెంట్లు తీశాడు. ఆ డాక్యుమెంట్లన్నీ అతనికి ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లనిపించింది. కొంచెం చదివితే అర్ధమయ్యింది, అవి అతను అంతకు ముందు చేసిన ఒక ప్రాజెక్ట్ లో డాక్యుమెంట్లు. అయితే ఆ డాక్యుమెంట్లలోని ప్రాజెక్ట్ పేరు, ప్రాజెక్ట్ నంబరూ, తేదీ మాత్రం, శ్రీధర్ చేస్తున్న ప్రస్తుత ప్రాజెక్ట్ కి సంబంధించినవి. అంతే! ఇదంతా చూస్తే, “రాజకీయ నాయకుడి పర్యటన ముందు, రోడ్లు వేసి, శుభ్రం చేయటం” గుర్తుకు వచ్చింది శ్రీధర్ కి. మోహిత్ ని పిలిచి ఒక క్లాస్ పీకుదామనుకొన్నాడు శ్రీధర్. ఈలోపే ఆడిటర్ అక్కడున్నాడు.
ఆడిటర్ ఫేజ్ ల వారీ గా అన్ని డాక్యుమెంట్లనూ బయటికి తీశాడు. వాటిలో కొన్నిటిని ఓపెన్ చేసి చూశాడు. వాటిలో ఉన్న టెక్నికల్ విషయాలు అతనికి అర్ధం కావు. చివరి గా అతను శ్రీధర్ కేసి సీరియస్ గా చూసి, “ఆడిట్ రిసల్ట్స్ త్వరలో మెయిల్ చేస్తాను”,అన్నాడు. శ్రీధర్ కి టెన్షన్ పెరిగింది. అతను ఇప్పటికే కస్టమర్ వైపు నుంచీ కష్టాలలో ఉన్నాడు.ఇప్పుడు ప్రాసెస్ సైడ్ నుంచీ కూడా కష్టాలు వచ్చేటట్లున్నాయి.
మరుసటి రోజు ఆడిట్ రిసల్ట్స్ వచ్చాయి,” ఆశ్చర్యం, శ్రీధర్ ప్రాజెక్ట్ ఆడిట్ పాస్ అయ్యింది.
***********
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-32
15 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:heart attack, stoke, stress
మనీషా ప్రాజెక్ట్ లోకి వచ్చేసింది. మనీషా వాళ్ళ నాన్న ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఆమె ఇచ్చిన పనిని చాలా బాగా ఎక్జిక్యూట్ చేయించ గలదు.కానీ ఆమె మాత్రం పని చేయదు.
మనీషా గురించి ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలే ఉన్నాయి. అమె మొదటి జాబ్ డిల్లీ లో చేసింది. తరవాత బెంగుళూరు వచ్చింది. ఆమె డిల్లీ లో ఉన్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయింది. ఆమె బెంగుళూరు కి వచ్చిన ఒక సంవత్సరం తరవాత, పునీత్ అగర్వాల్ అని ఒక ముంబాయి అతనిని పెళ్ళి చేసుకొంది. పునీత్ ముంబాయి లోనే ఒక ఫిల్మ్ కంపనీ లో పని చేసేవాడు. వాళ్ళ పెళ్ళి బెంగుళూరు లోనేజరిగింది. కొలీగ్స్ చాలా మంది అటెండ్ అయ్యారు.
ఓ రోజు శ్రీధర్ మనీషా ని అడిగాడు,” ఏంటి? నువ్వు ఈ రోజు చాల డల్ గా కనిపిస్తున్నావు?”
మనీషా శ్రీధర్ వంక చుర చురా చూసి, కను బొమలు ఎగరేసి అంది, “థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. కానీ నీకెందుకీ విషయం?”
ఆమె పునీత్ అగర్వాల్ కి విడాకులిచ్చినట్లు రెండు రోజుల తరవాత తెలిసింది శ్రీధర్ కి. ఆ పైన ఓ నెల రోజులకి, రోహిత్ శ్రీ వాస్తవ అని పక్కనున్న ఐటీ కంపెనీ లో లొకేషన్ హెడ్, ఆమె ని తన కారు లో డ్రాప్ చెయ్యటం చూశాడు శ్రీధర్. శ్రీధర్ లో ని పల్లెటూరి బావ నిద్ర లేచాడు.మనీషా ని అడిగాడు,” మనీషా,నువ్వు క్యాబ్ లో రావటం లేదేమిటి? ఎవరో నిన్ను రోజూ కార్ లో డ్రాప్ చేస్తున్నట్లున్నారు? “
దానికి మనీషా, “చూడు శ్రీధర్,అది నా సొంత విషయం. నీ కెందుకు? నీ మంచి కోసమే చెప్తున్నా..తరవాత హెచ్ ఆర్ వాళ్ళ తో నీకు ప్రాబ్లం రావటం నాకు ఇష్టం లేదు” అంది. దానితో శ్రీధర్ నోరు మూత పడిపోయింది.
శ్రీధర్ వాళ్ళ ప్రాజెక్ట్ మంచి జోరు గా నడుస్తోంది. టీం మొత్తం టెన్షన్ గానూ,బిజీ గానూ ఉన్నారు. మనీషా కి పాత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ కి కస్టమర్ మంచి రేటింగ్సే ఇచ్చాడు.
శ్రీధర్ కి పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్ళాలంటే బద్ధకం గా ఉంటోంది. రాత్రి ఏ రెండింటికో రూం కి వస్తున్నాడు. డాక్టర్ కి చూపించుకొందామంటే టైం లేదు. టెన్షన్ వలన కూడా అతని ఆరోగ్యం దెబ్బ తింటోంది.
ఆ రోజు ఒక డెలివరీ ఉంది. ఆఫీస్ కి వెళ్దామంటే, ఉతికిన బట్టలు ఏమీ లేవు రూం లో. మాసిన బట్టలతో ఆఫీస్ కి ఏమి వెళ్తాం లే అనుకొని అతను బట్టలు గుంజటం మొదలు పెట్టాడు. పదకొండున్నర కి ఆఫీస్ నుంచీ ఒక కాల్ వచ్చింది. రిసెప్షనిస్ట్ అంది, ” సర్,మనీషా లైన్ లో ఉంది. కనెక్ట్ చేయనా?”.
మనీషా మాట్లాడుతోంది,” ఆనంద్ ప్రాజెక్ట్ రివ్యూ చేశాడు. అతను ప్రాజెక్ట్ ని నన్ను టేక్ ఓవర్ చెయ్యమన్నాడు. నువ్వు ఆఫీస్ కి ఎప్పుడు వస్తావు? నాకు కేటీ చేయి. ఇప్పటి దాకా జరిగింది అంతా చెప్పు”.
” ఎంత అవమానం. ఆనంద్ గాడు నన్ను ప్రాజెక్ట్ నుంచీ ఫైర్ చేశాడు. ఈ లెక్కన జాబ్ నుంచీ కూడా ఫైర్ చేసేస్తాడేమో? “, శ్రీధర్ గుండెదడ పెరిగింది. చాతీ లో ఎడమ వైపు సన్న గా నొప్పి మొదలైంది. అతనికి స్పృహ తప్పుతోంది.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-33
16 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:health, parents, split
శ్రీధర్ కి స్పృహ తప్పిన తరువాత,ఇల్లు శుభ్రం చేయటం కోసం పని మనిషి వచ్చింది.అతను కిందపడి ఉండటం చూసి ఇంటి ఓనర్ ని పిలిచింది. ఓనర్ దగ్గరే ఉన్న హాస్పిటల్ వాళ్ళని పిలిస్తే వాళ్ళు అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలించారు.
అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అ రోజు సాయంత్రానికి శ్రీధర్ మామూలు అయ్యాడు. సరళ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సరళ శ్రీధర్ అమ్మానాన్నలకి ఫోన్ చేసి చెప్పింది. మరుసటి రోజు శ్రీధర్ ని హాస్పిటల్ నుంచీ ఇంటికి పంపారు.
*********
శ్రీధర్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. పక్కనే కుర్చీ లో సరళ కూర్చొని ఉంది. శ్రీధర్ నాన్న కృష్ణా రావూ,అమ్మ చంద్రమ్మా పక్కనే సోఫా లో కూర్చొని ఉన్నారు. శ్రీధర్ సెల్ తీసుకొని ఆనంద్ కి కాల్ చేసి, “నాకు స్ట్రోక్ వచ్చింది,డాక్టర్ ఓ రెండు వారాలు రెస్ట్ తీసుకొమ్మన్నాడు” అని చెప్పాడు.
ఆనంద్, ” నో ప్రాబ్లం శ్రీ, మనీషా ఉంది కదా. ఆమె చూసుకొంటుంది. ఒక రెండు మూడు రోజుల్లో ఆమె నీకు కాల్ చేసి,నీ దగ్గరి నుంచీ ప్రాజెక్ట్ వివరాలు తెలుసు కొంటుంది” అన్నాడు.
“సరే నేనే ఆమె కి కాల్ చేసి చెప్తాన్లే”, అన్నాదు శ్రీధర్.
“నువ్వు ఆఫీస్ కి రావటం మొదలు పెట్టిన తరువాత,కొన్నాళ్ళు ఆమె కి సాయం చేయ వచ్చు. నువ్వు వచ్చాక మాట్లాడుదాం. టేక్ కేర్!” అని పెట్టేశాడు ఆనంద్.
ప్రాజెక్ట్ గురించిన ఆందోళన ఇంకా శ్రీధర్ మనసు లో ఏ మూలో ఉంది. “నేను ఆఫీస్ కి వెళ్ళిన తరువాత, ప్రాజెక్ట్ లో పని మళ్ళీ యధావిధి గా చెయ్యగలుగుతానా?” అనుకొన్నాడు.
సరళ అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ గ్లూకోస్ నీళ్ళు ఇచ్చింది. “నేను లాంగ్ లీవ్ పెట్టి, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాను” అంది.
చంద్రమ్మ అంది, “మేమున్నాం కదమ్మా చూసుకోవటానికి. మళ్ళీ నీ ఉద్యోగానికి ఎందుకు సెలవు పెట్టడం?”
సరళ ఏమీ సమాధానం చెప్పకుండా శ్రీధర్ వైపు చూసి,”నేను సోమ వారం నుంచీ సెలవు పెడుతున్నాను”,అంది.
***********
శ్రీధర్ త్వరగానే కోలుకొంటున్నాడు. కొంచెం సేద తీరినట్లు కనపడుతున్నాడు. అతనికి కావలసిన వాళ్ళంతా ఒక చోట ఉన్నారిప్పుడు మరి. శ్రీధర్ వాళ్ళ అమ్మ అతనికి ఇష్టమైన కూరలన్నీ చేసి పెడుతోంది, కానీ నూనె లేకుండా. ఓ రోజు సరళ, “దగ్గరే ఉన్న ఓ రెస్టారెంట్ కి వెళ్దాం” అంది. రెస్టారెంట్ లో, శ్రీధర్ ఎవరికి కావలసినవి వాళ్ళకు తెప్పించాడు.చివరిగా బిల్లు వచ్చింది. శ్రీధర్ బిల్లు కట్టి, ఓ రెండు పది నోట్లను ప్లేట్లో వదిలాడు. కృష్ణా రావు ఆ నోట్ల వంక చూసి శ్రీధర్ ని అడిగాడు, “బిల్ ఎంత అయ్యింది రా?”
“అబ్బ.. నీకెందుకు నాన్నా..?” అన్నాడు శ్రీధర్.
“చెప్పొచ్చు కదా..ఇక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో నాకు గూడా తెలుస్తుంది” అన్నాడాయన.
“ఓ ఏదొందల యాభై రూపాయలైంది”.
” బాగానే అయ్యిందే…ఖర్చులు తగ్గించుకో రా. అసలు ఇంతవుతుందని ముందే తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు. ఇదే ఇంట్లో వండుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఇదే ఖర్చు తో మన ఊళ్ళో ఒక కుటుంబం నెల మొత్తం బతుకుతుంది”
చంద్రమ్మ “మరే” నన్నట్లు గాతలూపింది.
శ్రీధర్ సరళ వంక చూశాడు. ఆమె మొహం లో ఏ భావమూ కనిపించటం లేదు. ఆమె కి ఏదైనా నచ్చక పోతే ఆమె తన మొహానికీ మనసుకీ మధ్య ఒక షట్టర్ వేసేస్తుంది.
ఇంటికొచ్చాక కృష్ణా రావు డీవీడీ లో కొన్ని పాత పాటలు పెట్టమన్నాడు శ్రీధర్ ని. “ఇది చాలా బాగుంది.మన ఇంట్లో టేప్ రికార్డర్ చెడిపోయింది”, అన్నాడాయన.
“నేను మీకు ఓ డీవీడీ ప్లేయర్ కొంటానులే” అన్నాడు శ్రీధర్.
సరళ పక్క రూం లోకి వెళ్ళీ తలుపు వేసుకొంది. చంద్రమ్మ అటు వైపు చూసి,”సరళ కి ఏమైందో చూడు”, అంది శ్రీధర్ తో.
శ్రీధర్ రూం లోకి వెళ్ళి అన్నాడు,”ఆర్ యూ ఓకే?”
సరళ అంది,” రెస్టారెంట్ లో డిన్నర్ కంటే, డీవీడీ ప్లేయర్ ఎక్కువ అవ్వుతుందనుకుంటా?” అంది.
ఆ మరుసటి రోజు,కృష్ణా రావూ చంద్రమ్మా వెంకటాపురం బయలుదేరి వెళ్ళారు. శ్రీధర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి పంపించి వచ్చాడు. వాళ్ళ కి ఒక డీవీడీ ప్లేయర్ కొనిచ్చాడు. సరళ తనకి తల నొప్పి అని రాలేదు.
ఇంటికొచ్చినాక సరళ అడిగింది, “డీవీడీ ప్లేయర్ ఎంత అయ్యింది?”
“ఎందుకు?”
” ఇలాంటివి కొనమని అడగటానికి ఇది సరైన సందర్భమేనా?” అందామె.
శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-34
17 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు:commitment, honesty, overtime, recession
శ్రీధర్ కీ, సరళ కీ గూడా కావలసిన విశ్రాంతి దొరికింది. వాళ్ళు దగ్గర లో ఉన్న పార్కులు అన్నీ చుట్టి వచ్చారు. డాక్టరు సలహా తీసుకొని ఆ తరువాత బెంగళూరు చుట్టు పక్కల ఉండే ప్రదేశాలు చూశారు. ఓ నాలుగు రోజులు కూర్గు వెళ్ళివచ్చారు.
శ్రీధర్ లీవ్ అయ్యేరోజు సరళ తన పీరియడ్స్ మిస్ అయ్యాయని చెప్పింది. టెస్ట్ చేయించుకొంటే ఆమె ప్రెగ్నెంట్ అని కన్ ఫం అయ్యింది.
శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళాడు. అతని మెయిల్ ఇన్ బాక్స్ అంతా నిండిపోయింది. ప్రాజెక్ట్ అయిపోవస్తూంది. మనీషా ప్రాజెక్ట్ ని బాగానే మానేజ్ చేసినట్లుంది. కస్టమర్ లూసీ నుంచీ మనీషా కి పొగుడుతూ వచ్చిన కొన్ని మెయిల్స్ చూశాడు శ్రీధర్. ఆనంద్ కూడా మనీషా గురించి హాపీ గానే ఉన్నాడు. శ్రీధర్ కి స్పెసిఫికేషన్స్ గురించి మంచి అవగాహన ఉండటం తో ఆనంద్ శ్రీధర్ ని ఫంక్షనల్ టెస్టింగ్ చూడమన్నాడు. శ్రీధర్ కూడా రిలాక్స్ అయ్యాడు తనని ప్రాజెక్ట్ లో నుంచీ తీసివెయ్యనందుకు. అతనికి స్ట్రోక్ వచ్చే ముందు సరళ మాట్లాడినప్పుడు, ఆనంద్ శ్రీధర్ ని టెక్నికల్ లీడ్ చేద్దామనుకొన్నాడు. శ్రీధర్ అనవసరం గా గాభరా పడ్డాడు.
సరళ మూడో నెలలో మద్రాస్ వాళ్ళ అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళీంది. శ్రీధర్ ది మళ్ళీ ఒంటరి బతుకైంది.
శ్రీధర్ అప్రైజల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆనంద్ అతనికి ఐదింటికి గాను రెండు రేటింగ్ ఇచ్చాడు. శ్రీధర్ కి ఇదేమీ నచ్చలా. “నాకు స్ట్రోక్ రావటం నా తప్పు కాదు. లేక పోతే నేను బాగా పని చేసేవాడిని” అని వాదించాడు.
ఆనంద్ అన్నాడు,”శ్రీధర్ నేను ప్రాజెక్ట్ కి నీ వంతు చేసిన పనిని మాత్రమే చూస్తాను. నీ వంతు తగ్గటానికి నీ అనారోగ్యం కారణం కావచ్చు. కానీ అది నేను పట్టించుకోను”,అన్నాడు. ఇంకా,”ముందు గా ప్రాజెక్ట్ గురించి కస్టమర్ హాపీ గా లేడు. మనీషా వచ్చిన తరవాత పరిస్థితి మెరుగయ్యింది.” అన్నాడు.
“ఏది ఏమైనా, నువ్వు ఒక మంచి టెక్నికల్ రిసోర్స్ వి అని నేను అనుకొంటున్నాను. మనం తరవాతి ప్రాజెక్ట్ లలో కూడా కలిసి పనిచేద్దాం. ఆల్ ద బెస్ట్!” అన్నాడు ఆనంద్.
శ్రీధర్ కి ఆనంద్ మాటలు రుచించలా.
*************
ఆర్ధిక మాంద్యం మొదలైంది. అమెరికా లో పేరాశ తో హెడ్జ్ ఫండ్స్ మొదలెట్టాయి ఈ పతనాన్ని. బాగా చదువుకున్న మా రాజులు ఒక సృజనాత్మకమైన సంక్షోభాన్ని సృష్టించారు. లీ మాన్ బ్రదర్స్ ని మూసేశారు. ఐటీ కుదేలైంది. లే ఆఫ్ లు మొదలయ్యాయి. చాలా కంపెనీలు వర్కింగ్ అవర్స్ ని తొమ్మిది గంటలకి పెంచాయి. మే డే రోజు అమెరికా లో కార్మికులు ఎప్పుడో ఎనిమిది గంటల పని సమయం సాధించుకొన్నారు అని చిన్నప్పుడు చదివాడు శ్రీధర్. అది కరెక్ట్ కాదా అని అనుమానమొచ్చింది శ్రీధర్ కి. మానేజర్లు ఉద్యోగులకి వీకెండ్స్ లో పని చెయ్యండి అని మెయిల్స్ పంపిస్తున్నారు. కస్టరమర్స్, ప్రపోజల్ లొ అంగీకరించిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ పని చేయించుకొంటున్నారు. పరిమితమైన డబ్బులకి అపరిమితమైన పని చేయటం అనేది ఫ్యూడల్ సమాజం లో ఉంటుందని శ్రీధర్ చదివాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఈ కస్టమర్లు నయా భూస్వాములులా అనిపిస్తున్నారు. దీని వలన ఉద్యోగులు రెండు మూడు రెట్లు పని చేయవలసి వస్తోంది. జీతాలేమో తగ్గించారు. ఏం చేద్దాం “టిరనీ ఆఫ్ క్యాపిటల్” అనుకొన్నాడు శ్రీధర్.
ఓ రోజు శ్రీధర్ ని రాత్రి లేట్ గా పని చెయ్యమన్నాడు ఆనంద్. శ్రీధర్, “నేను లేట్ గా ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ డబ్బులు రావు కదా!” అన్నాడు ఆనంద్ తో.
” శ్రీధర్! కంపెనీ కీ ఉద్యోగి కీ ఉండేది పరస్పరం సమానమైన సంబంధం కాదు. నువ్వు కంపెనీ లో జాయిన్ అయ్యేటప్పుడు సైన్ చేసిన అగ్రీమెంట్ ని పూర్తిగా చదివావా? చదువు తెలుస్తుంది. డబ్బు ఎవరి నుంచీ అయితే ఫ్లో అవుతుందో వాడిది ఎప్పటికీ పై చేయే. మార్కెట్ బూం లో ఉన్నప్పుడు,ఏదో జనాలను ఆకర్షించటానికి కంపెనీ ల వాళ్ళూ ప్రయత్నిస్తారు. అది వేరే విషయం. ఐటీ లో ఫ్రెషర్స్ ని వాళ్ళ జావా స్కిల్ కోసమో, సీ స్కిల్ కోసమో తీసుకొంటారు. కానీ లీడ్స్ నీ, మానేజర్లనీ వాళ్ళ కమిట్మెంట్ కోసం, ఇంటెగ్రిటీ కోసం తీసుకొంటారు. ఈ కమిట్మెంటూ, ఇంటెగ్రిటీ అనేవి మనకి కుటుంబ నేపధ్యం వలనా, సామాజిక నేపధ్యం వలనా వస్తాయి. ఒక రకం గా మనం మన కమిట్మెంట్ ని అమ్ముకొని ప్రతిఫలం గా జీతం తీసుకొంటున్నాం. మన వ్యక్తిగతమైన లక్ష్యాలకీ కంపెనీ లక్ష్యాలకీ ఏ విధమైన ఘర్షణ లేనప్పుడు, మనకి కమిట్మెంట్ చాలా సులభం గా వస్తుంది. సో, మన కమిట్మెంట్ వలన కంపెనీ కి డబ్బులు వస్తాయి. కానీ విచిత్రం గా ఆ డబ్బు సమాజం జనాలకిచ్చే కమిట్మెంటూ, హానెస్టీ వంటి లక్షణాలని నాశనం చేస్తుంది.ఒక రకం గా డబ్బు తన గోతిని తనే తవ్వుకుంటుంది. అందుకే అనేక సంస్థ లు దివాళా తీస్తున్నయి. టాపిక్ నుంచీ డైవర్ట్ అయ్యినట్లున్నాం.. సో… ఈరోజు రాత్రి పన్నెండయ్యేది,రెండయ్యేది నువ్వు కస్టమర్ కి డెలివరీ చేసి వెళ్తున్నావ్.అంతే”, అని క్లాస్ పీకాడు అనంద్.
“ఛీ వెధవ బతుకు. వీడి క్లాస్ వినేకంటే, రెండింటి దాకా ఉండి ఆ డెలివరీ ఏదో చేసి వెళ్ళటం నయం”,అనుకొన్నాడు శ్రీధర్.
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-35
18 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:childhood, comparison, ecology, greenary
శ్రీధర్ కి వాళ్ళ మామ గారి నుండీ ఫోన్ వచ్చింది. “సరళ కి లేబర్ పెయిన్స్ వచ్చాయి. ఆమె ను హాస్పిటల్లో జాయిన్ చేశాం.”
శ్రీధర్ లో ఆదుర్దా పెరిగింది. చెన్నై కి టికెట్లు బుక్ చేదామని బయలు దేరాడు. ఈ లోగా ఇంకో కాల్. మళ్ళీ మామ గారే,” కంగ్రాట్యులేషన్స్. సరళ మగ పిల్లాడిని ప్రసవించింది. నార్మల్ డెలివరీ నే. తల్లీ పిల్లాడూ ఇద్దరూ ఆరోగ్యం గా ఉన్నారు”.
శ్రీధర్ కి ఒక సహజమైన అవసరం తీరిన ఆనందం కలిగింది. రోజు వారి జీవితం లో లేనటువంటి ఒక గర్వం కలిగింది అతనికి. అతని ఆనందానికి ఏవో భౌతికమైన కారణాలు ఉండి ఉండాలి.
*************
ఇంకో ఆర్నెల్లకి సరళ కి బెంగుళూరు లో ఉద్యోగం వచ్చింది. బాబు తో సహా ఆమె బెంగళూరు కు వచ్చేసింది. చెన్నై లో ఉన్న వాళ్ళ ఇంటిని అద్దెకి ఇచ్చారు. వాళ్ళ తమిళ నాడు కారు ని నియమాల ప్రకారం చెల్లించవలసిన లంచాలు చెల్లించి బెంగళూరు కు తీసుకొని వచ్చారు. వాళ్ళ అపార్ట్ మెంట్ సరళ ఆఫీస్ కి దగ్గర గా ఉండేటట్లు తీసుకొన్నారు. దీని వలన శ్రీధర్ వాళ్ళ ఆఫీస్ ఇంటి నుంచీ బాగా దూరమైపోయింది. శ్రీధర్ పొద్దున్నే బయలుదేరేటప్పటికి బాబు లేవను కూడా లేవడు. మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి కనీసం రాత్రి తొమ్మిది అవుతుంది. అప్పటికి బాబు నిద్ర పోతూ ఉంటాడు. ఇక వాడి తో ఆడు కోవటం వీకెండ్స్ లో నే. అప్పుడు కూడా వీక్ డేస్ లో చాలని నిద్ర, దాడి చేయకుండా ఉంటే. పగలు సరళ ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆఫీస్ కి దగ్గర లో ఉన్న ‘క్రెష్’ లో బాబు ని వదిలి పెట్టి వెళ్తుంది. సాయంత్రం ఆఫీస్ నుంచీ వచ్చేటప్పుడు మళ్ళీ వాడిని తీసుకొచ్చుకొంటుంది.
వాళ్ళ అపార్ట్ మెంట్ సముదాయం పేరు “గ్రీన్ వాలీ.” అది చూడటానికి శుభ్రం గా లాండ్ స్కేపింగ్ తొ సహా నీటు గా ఉంటుంది. మొదట ఆ బిల్డర్ అక్కడ ఉన్న పచ్చని తోటలనూ, పొదలనూ వాటి మీద ఆధారపడి ఉండే జీవావరణాన్నీ ప్రొక్లైనర్ల తో తొలగింఛాడు. తరవాత అక్కడ ఒక కాంక్రీట్ వనాన్ని కట్టాడు. ఆ కాంక్రీట్ అడవి లో పేలికలలాగా చిన్న ప్రదేశాన్ని లాండ్ స్కేపింగ్ చేసి దానికి “గ్రీన్ వాలీ” అని పేరు పెట్టాడు. ఆ పైన వాటిని మతి పోయే లాభానికి మతి తప్పిన కోడ్ కూలీ లకి అమ్మాడు. బాంకుల దగ్గర అప్పులు తీసుకొని వాటిని కొన్న కోడ్ కూలీలు రిసెషన్ దెబ్బకి “ఈ ఎం ఐ ” లు కట్టగలమా అనే సందేహం లోపడ్డారు.
శ్రీధర్ వాళ్ళ కుటుంబంలో ఒక సాంప్రదాయం ఉంది. బిడ్డ పుట్టిన తరువాత బిడ్డ నాన్న ఊరిలో వాడికి అన్నప్రాసన చేయాలి. కానీ శ్రీధరూ సరళలకి సెలవలు దొరకలేదు. బాస్ కి ఇష్టం లేకుండా సెలవు పెట్టి వెళ్తే ఎక్కడ ఉద్యోగాలకు ఎసరు పెడతాడో అని భయం. చంద్రమ్మ ఫోన్ లో శ్రీధర్ తో అంది, “మన కుటుబం లో ఈ ఆచారాన్ని పాటించక పోవటం ఇదే మొదటి సారి. నీ చిన్నప్పుడు మీ నాన్న ఊరంతటినీ భోజనాలకి పిలిచారు. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసీ లాభంలేకుండా పోయింది.”
****************
బాబు కి అక్షయ్ అని పేరు పెట్టారు. వాడి మొదటి పుట్టిన రోజు ఘనం గా చేశాడు శ్రీధర్. బాబు తన చిన్న చేతులని ఊపినప్పుడల్లా శ్రీధర్ ఎదంతా ఏదో తెలియని గర్వం తో నిండిపోయేది. చంద్రమ్మా కృష్ణా రావూ రాలేదు.వాళ్ళకి కోపం వచ్చింది వాడి అన్నప్రాసన ఊళ్ళో చెయ్యలేదని. పైగా కృష్ణా రావు అననే అన్నాడు, “అన్నప్రాసన కి టైం లేదు కానీ, అదేదీ…ఆ.. బర్త డే కి టైం దొరికింది వీడికి” అని. ఫంక్షన్ లో ఎవరో అడిగారు సరళ ని మీ అత్తా మామలేరని, “వాళ్ళు రాలేదు” అందామె.మళ్ళీ ఆ అడిగిన వాళ్ళే అన్నారు,”ఎందుకు రాలేదు?”.
“ఏమో తెలియదు”, అని లోల్లోపల ఆ అడిగిన వాళ్ళ మీద చాలా గింజుకొంది సరళ.
అక్షయ్ చురుకు గానే ఉంటున్నాడు కానీ, శ్రీధర్ కి ఒక విషయం దిగులు గా ఉంది. వాడు ఇంకా చిన్న చిన్న మాటలు కూడా చెప్పటంలేదు. వాడిని పేడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు శ్రీధర్.
డాక్టర్ “బాబు రోజూ చేసే పనుల” గురించి అడిగాడు. శ్రీధర్ వాళ్ళమ్మ క్రెష్ ళొ ఒదిలిపెడుతుందని చెప్పాడు.
డాక్టర్ అన్నాడు, క్రెష్ లో ఏమి చేస్తారు?”
శ్రీధర్ కి తెలియదు. తరువాతి సోమ వారం సెలవు పెట్టి శ్రీధర్ క్రెష్ కు వెళ్ళాడు, బాబు ఏమి చేస్తున్నాడో చూడటానికి. క్రెష్ గేట్ తలుపులు తాళం వేసి ఉన్నాయి. ఒక పదిహేడేళ్ళ కుర్రాడు గేట్ తీశాడు. లోపల పిల్లలు బొమ్మలతో ఆడుతున్నారు. ఒక మధ్య వయసు ఉన్న ఆమె వచ్చి పిల్లలు బయటికి వెళ్ళకుండా గేట్ తాళం పెట్టాము అని చెప్పింది. గేట్ బయట వాహనాలన్నీ పొగలు కక్కుకొంటూ వెళ్తున్నాయి.
కొంతమంది పిల్లలు టీవీ లో కార్టూన్ మూవీ చూస్తున్నారు.
“అక్షయ్ క్రెష్ లో ఎలా ఉంటాడు?”,అని అడిగాడు శ్రీధర్ ఆ మధ్య వయసామెని.
“బాగానే ఉంటాడు సార్.ఒక్కొక్క సారి వాళ్ళ అమ్మ గురించి ఏడుస్తాడు. లేకపోతే పరవాలేదు”
అక్షయ్ ని తీసుకొని ఇంటికి వచ్చేశాడు శ్రీధర్. అపార్ట్మెంట్లో అందరూ వాళ్ళ ఆఫీస్ లకి వెళ్ళిపోయారు.నిర్మానుష్యం గా ఉంది. సాయంత్రమే మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చేది. మిగతా సమయమంతా మరుసటి రోజు కి తయారవ్వటం లోనే సరిపోతుంది వాళ్ళకి. వీకేండ్స్ వచ్చాయంటే,వీక్ డేస్ లో పడిన శ్రమ నుంచీ ఒత్తిడి నుంచీ రిలాక్స్ అవ్వటానికే సరిపోతుంది. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటానికి కూడా తీరిక ఉండదు.
శ్రీధర్ ఇంట్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. ఒక వార్తా చానల్లో నగరంలో కిడ్నాప్ అయ్యిన ఒక చిన్నమ్మాయి గురించి చూపిస్తున్నాడు. ఇంకోచానల్ లో వివిధ నగరాల లో ని పొల్యూషన్ లెవల్స్ గురించి చెప్తున్నాడు. అతనికి మొదటి సారిగా తన కొడుకు భవిష్యత్తు గురించి భయం వేసింది. వాడి రా బోయే రోజులు ఆనందం గా ఉండవేమో అనిపించింది శ్రీధర్ కి. శ్రీధర్ కి తన బాల్యం గుర్తుకు రాసాగింది. ” తన నాయనమ్మ చెప్పిన కధలూ..ఆ కధలు చెప్తూ ఆమె పాడిన పద్యాలూ…ఊళ్ళో ఏ భయమూ లేకుండా గాలికి తిరిన రోజులూ…చెరువు లో పట్టిన చేపలూ…వాటిని మళ్ళీ వదిలేసిన గుంటలూ…అప్పటి అమాయకత్వం…కాలువల్లో ఈతలూ…మామిడి తోటల్లో ఆటలూ…అభం శుభం తెలిసీ తెలియని వయసూ..”
శ్రీధర్ వాళ్ళ అమ్మా నాన్నా ఎప్పుడూ దిగులు పడలేదు ఊళ్ళొ వాడు క్షేమం గా ఉంటాడో లేదోనని. ముందు గా మనిషి ప్రకృతి లో భాగం గా ఉండి ఉంటాడు. తరువాత సమాజం ఏర్పడి,సమాజం వాడికి నీతి నియమాలని నేర్పి ఉంటుంది. దీని వలన మనిషి ప్రకృతి నుంచీ కొంత దూరం గా జరిగి సమాజనికి కొంత దగ్గరయ్యి ఉంటాడు. ఇప్పుడు ఈ ఆధునికత వచ్చి వ్యక్తిని సమాజం నుంచీ వేరు చేస్తున్నట్లుంది. ఈ ప్రక్రియ పాశ్చాత్య సమాజం లో ఇప్పటికే జరుగుతోంది. అక్కడ ప్రతి ఒక్కరూ సముద్రం లోఉన్న ఒక ద్వీపం లాంటి వారే.”
సరళా శ్రీధరూ బాగానే సంపాదిస్తున్నారు. కానీ శ్రీధర్ చిన్నప్పుడు అనుభవించిన బాల్యం ఇప్పుడు అతని కొడుకుకి ఇవ్వటానికి ఎంత ఖర్చవుతుంది? అతని కొడుకు బాల్యం చాలా చప్ప గా ఉండేటట్లుంది. ఇంట్లో వాడికి తోడు గా ఇంకొక చిన్న పిల్లాడో, పిల్లో ఉంటె వాడు కొంచెం సంతోషం గా పెరుగుతాడేమో.
ఆ రోజు రాత్రి శ్రీధర్ సరళ ని అడిగాడు,”మనం ఇంకొక బిడ్డ ని కందామా?” అని.
ఆమె అంది, “ఇక్కడికి వీణ్ణి పెంచటానికే మనం కష్ట పడ వలసి వస్తోంది. ఇంకొకరి ని ఎలా పెంచ గలం. ఒక్కడైతే మనకొచ్చేడబ్బులతో వీడికి ఏమీ కొదవ లేకుండా పెంచ వచ్చు. ఇద్దరిని మనం భరించ గలమా? ఐనా నేను ఇంకో కానుపుకి సిధ్ధం గా లేను. పిల్లల్ని కనటం అనేది చాలా ఒత్తిడి తో కూడుకొన్న పని. మీ మగాళ్ళకు ఈ విషయం చెప్పినా అర్ధం కాదు”
శ్రీధర్ అనుకొన్నాడు,”ఆశ్చర్యం గా ఉందే! మామ్మా నాన్నా సన్నకారు రైతులై ఉండీ మమ్ముల్ని ఇద్దర్ని సంతోషం గా పెంచారు. కానీ అధికాదాయం వచ్చే ఉద్యోగాలు చేస్తూ మేమిద్దరం ఇంకొకరిని పెంచలేక పోతున్నామే?”
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ-36
21 నవం 2011 వ్యాఖ్యానించండి
in కథలు ట్యాగులు:concern, illness, jobloss, the rift
శ్రీధర్ తన ఉద్యోగం గురించి తృప్తి గా లేడు. చాలా చాలా ఇంటర్వ్యూలు ల కి వెళ్ళిన తరవాత అతనికి ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ మారదామనుకొంటుండగా అతని కి వాళ్ళ అమ్మ దగ్గరి నుంచీ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆమె కృష్ణా రావు కి ఆరోగ్యం బాగా లేదని చెప్పింది. అతనికి వెన్ను నొప్పి వచ్చింది.
శ్రీధర్ అన్నాడు,”అమ్మా, నువ్వూ నాన్నా బెంగుళూరు వచ్చేయండి. నేను ఇక్కడ నాన్న గురించి జాగ్రత్త తీసుకొంటాను”.
“మేము అక్కడ ఒక వారం కంటే ఎక్కువ రోజులు ఉండలేము రా. కాలక్షేపం అవ్వదు మాకు. పైగా సరళ కి అనవసరమైన పని మా వలన”, అంది చంద్రమ్మ.
శ్రీధర్ వాళ్ళ ఊరెళ్ళి వాళ్ళ నాన్న కు వైద్యం చేయిద్దాం అనుకొన్నాడు. ఆఫీస్ లో ఆనంద్ ని లీవ్ అడిగాడు.
“ఇప్పుడు ప్రాజెక్ట్ చాలా కీలకమైన దశ లో ఉంది. ప్రాజెక్ట్ లో నీది ముఖ్యమైన పాత్ర అని నీకు తెలుసు. నీ లీవ్ ని వాయిదా వేసుకో”, అన్నాడు ఆనంద్ ఎప్పటిలానే.
“అనివార్య కారణాల వలన నేను నా సెలవు ని వాయిదా వేయలేక పోతున్నాను. అయినా నీకు మనీషా ఎప్పుడూ దన్ను గా ఉంటుంది కదా?”, అన్నాడు శ్రీధర్ వ్యంగ్యం గా.
సీట్ దగ్గరికొచ్చి, వ్యక్తిగతమైన కారణాలను చూపుతూ, ఆనంద్ కి రెజిగ్నేషన్ మెయిల్ పంపించాడు శ్రీధర్. శ్రీధర్ కి ఆనంద్ మీద ఉన్న కసి అంతా ఆ క్షణం లో తీరి పోయింది.
వాళ్ళ ఊరికి బయలు దేరాడు శ్రీధర్. వాళ్ళ నాన్న కి తగ్గిన తరవాత బెంగుళూరు వచ్చి కొత్త జాబ్ లో జాయిన్ అవుదామనుకొన్నాడు. వెళ్ళే ముందు సరళ వస్తుందేమో అడిగాడు.
దానికి సరళ,”నేను ఎప్పుడూ పల్లెటూరు వెళ్ళలేదు. పైపుల్లో నీళ్ళూ, అటాచ్ బాత్రూం లేని చోట కి నేను రాలేను”, అంది. వాళ్ళిద్దరి మధ్యా మొహమాటాలు చాలా త్వరగా తగ్గిపోతున్నాయి.
***********
కృష్ణా రావు వెన్ను నొప్పిని మందుల తో తగ్గించవచ్చని బందరు లో డాక్టర్ చెప్పాడు. ఓ వారం ఊళ్ళోనే ఉండి, వాళ్ళ నాన్న ని చూసుకొన్నాడు శ్రీధర్. కృష్ణా రావు కి కొంచెం మెరుగయ్యింది.
అక్షయ్ కోసం ఫోన్ చేశాడు శ్రీధర్ సరళ కి. అప్పుడు చెప్పింది సరళ. శ్రీధర్ చేరబోయే కంపెనీ నుంచీ ఈ మెయిల్ వచ్చిందట. శ్రీధర్ కి ఇచ్చిన ఆఫర్ ఓ ఆరు నెలలు ఆలస్యం చేశారంట. రిసెషన్ రోజులలో వాయిదా అంటే “జాబ్ ఇవ్వక పోవటానికి” ముద్దు పేరు. ఓ రోజల్లా ఏమీ తోచలేదు శ్రీధర్ కి. ఆనంద్ మీద రాయి విసిరి పారిపోదామను కొన్నాడు శ్రీధర్. రాయి విసరటమైతే విసిరాడు. కానీ పారిపోయేటప్పుడే గోతి లో పడ్డాడు, అదీతానే తవ్వుకొన్న దాంట్లో. ఆనంద్ తెరిచి ఉంచిన తలుపుని తానే మూసేసి వచ్చాడు.
తనకు జాబ్ పోయిన సంగతి శ్రీధర్ తన అమ్మా నాన్న లకి చెప్పలేదు. బెంగుళూరు ఆఘ మేఘాల మీద వచ్చేశాడు, వేరే జాబ్ వెతుక్కోవటానికి. ఇంటికెళ్ళగానే సరళ అడిగింది, “మీ నాన్న కి ఎలా ఉంది?”
” మా నాన్న కి ఎలా ఉంటే నీకేంటి? అంతగా ఆయన గురించి శ్రధ్ధ ఉంటే నాతో పాటు వచ్చి అయన గురించి జాగ్రత్త తీసుకోవాల్సింది”, అన్నాడు.
“అప్పుడు నేను కూడా నీ లాగే జాబ్ లేక ఈగలు తోలుకోవాల్సి వచ్చేది”, అందామె అగ్ని కి ఆజ్యం పోస్తూ.
ఆ ఆదివారం సరళ షాపింగ్ కి వెళ్ళాలనుకొంది. ఆమె కి తెలుసు శ్రీధర్ కి షాపింగ్ అంటే ఇష్టం లేదని. అందుకే తోడు రమ్మని అడగలేదు. ఇంట్లో ఉండి అక్షయ్ ని చూసుకోమని చెప్పిందామె శ్రీధర్ కి. శ్రీధర్ ఆమె ని అడిగాడు, “ఏమి కొనబోతున్నావ్?”
” ఇదీ అని ఏమీ లేదు. వెళ్ళి చూస్తాను. ఏదైనా ఇంటరెస్టింగ్ గా ఉంటే కొంటాను”
శ్రీధర్ అన్నాదు,”ముందు ఏమి కొనాలో కూడా తెలియకుండా, కొనటానికి వెళ్ళటం చాలా విచిత్రం గా ఉంది నాకు”
“శ్రీధర్, కొందామన్నా నీ దగ్గర డబ్బు లేదు. వేరే వాళ్ళని కూడా ఎందుకు అడ్డుకొంటావ్?”,అని విసురు గా వెళ్ళిపోయిందామె, అప్పటికే రెడీ గా ఉన్న ఆటో ఎక్కి.
శ్రీధర్ కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కానీ వాడి మనసు తిట్టింది, “మగాడివై ఏడవటానికి సిగ్గులేదూ?”. అతని మగ జన్మకి ఏడ్చే స్వేచ్చ లేదు.
ఇంతలోఫోన్ మోగింది…వాళ్ళ అమ్మ..”ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు. దానితో మన చేను మగతా కి తీసుకొన్న రంగా రావు మామయ్య డబ్బులు కూడా సరిగా ఇవ్వలేదు. మీ నాన్న మందుల ఖర్చులేమో పెరుగుతున్నాయి. మీ నాన్న గురించి నీకు తెలుసు. ఆయనకి అత్మాభిమానం ఎక్కువ. ఆయకి తెలియనివ్వకుండా …కొంచెం డబ్బు పంపిస్తే అవసరానికి ఉపయోగ పడుతుంది”
షాపింగ్ నుంచీ తిరిగి వచ్చిన తరవాత సరళ ని అడిగాడు,”ఓ ఇరవై వేలుంటే అప్పిస్తావా?”
“శ్రీధర్, ఇప్పుడు హౌస్ లోనూ “ఈ ఎం ఐ” కూడా నేనే కడుతున్నాను.ఇది నీకు తెలుసు. అద్దె నేనే కడుతున్నాను. నా దగ్గరా డబ్బు చాలా తక్కువే ఉంది. అక్షయ్ కోసం కొంత డబ్బు దాచి ఉంచాను. మనకు ఏమైనా అనుకోని ఖర్చులు వస్తే ఉంటాయని.” అని,” అయినా నీకు ఇప్పుడు ఇరవై వేలు ఎందుకు?” అందామె. శ్రీధర్ చెప్పాడు.
“నాల్రోజుల కిందట నువ్వే అన్నావు. నాకు మీ అమ్మా నాన్నలంటే పట్టదని.అవును కరెక్టే నేనెందుకు పట్టించుకోవాలి?”
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
ఇంకా ఉంది…
ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ- 37
22 నవం 2011 అభిప్రాయములు
in కథలు ట్యాగులు::-), climax, conclusion, new direction, suspense thriller
బస్సు వెంకటాపురం వెళ్తోంది. శ్రీధర్ బస్సులో తను మామూలు గా కూర్చొనే కిటికీ సీట్లో కూర్చొన్నాడు. అతని మనసు ఎక్కడో ఉంది. శూన్యం లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. దారి లో వచ్చే చెరుకు తోటలూ, తమలపాకు తోటలూ ఆహ్లాద పరచలేక పోతున్నాయి. పైగా వాటిని చూస్తూంటే అతనికేదో దిగులు కలుగుతోంది.
వాళ్ళ ఇంటి ముందు కొట్టేసిన రావి చెట్టు మొదలు చుట్టూ పిలకలు వస్తున్నాయి. ……………………………………………………………………………………………
……………………………………………………………………………………………
……………………………………………………………………………………………
……………………………………………………………………………………………
……………………………………………………………………………………………
……………………………………………………………………………………………
……………………………………………………………………………………………
…………………………………………………………………………………………..
……………………………………………………………………………………………
…………………………………………………………………………………………….
…………………………………………………………………………………………….
……………………………………………………………………………………………..
………………………………………………………………………………………………
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
……………………………………………………………………………………………..
అయిపోయింది
మీకు ఈ కథ నచ్చిందా? ఐతే మీకు పూర్తి కథ ఇక్కడ దొరుకుతుంది http://kinige.com/kbook.php?id=456
అయిపోయింది
Spiritual Speculation- Reality,Truth etc.
22 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:random thoughts
It is a cold country. It rained snow for ten months in a year there. The oceans, the rivers and the ponds are frozen. Children played skiing and ran ice scooters on the frozen ocean. The daytime in winter was a few minutes while the night-time in summer too lasted a few minutes. The dogs pulled carriages with people in it. They are called sledge carts. Entire farming comes to stand still and one does not venture out much. But for locals who are used to the snow and chill, it is business as usual. While walking on the snow outside, you don’t know what is beneath the white snowed surface. It’s all speculation.
*********************
As I started my first job my thoughts about the world entered a different plane. Following are the notes I wrote in those days.
What is reality?
What is subjective?
What is objective?
Is a completely objective thing real?
Now a days, rationality and scientific thinking are given much importance in our society.Many people believe rationality as flaw less and take it as a “plane of reference ” if there is a dilemma in the daily
life. Some people apply scientific thinking, which is the originator of science and rationality,
to the things that do not fall into the purview of human thinking. While scientific reasoning is the best
jewel in the crown of humanity, it has its own limitations too.
In the entire universe man is a living being on a very tiny particle called earth. His thinking is a product of
an evolutionary process and personal conditioning.
Physically, thought is nothing but an electromechanical action/reaction. It is supported by the daily sensual inputs one is getting through his senses.
As one can see, the entire process is heavily conditioned .
Now, we shall see what will happen when we try to capture things out side the domain of thought, with thought. It is just like human beings flying in the air. A man traveling in the space with the speed of light.
Subjects like God, absolute truth, absolute objectivity all fall beyond the domain of thought simply because
they are dealing with absolute things, and there is no convincing explanation with in the
field of thought. There’s nothing in the field of thought which is not conditioned by any thing, without a little borrowing of belief. Thought itself is
heavily conditioned by all the things mentioned above(chemical, evolution processes).
And the “notions of god, truth, absoluteness”, solutions and thought itself is created by thought which comes from
the very narrow background of society, values, beliefs.
Further, thought has the limitation of being driven by wishes wants desires and instincts. If et all a man is able to go
beyond thought, he may find altogether a new meaning for the above words(truth, God ) which is not in any way
related to the original meaning or word. This meaning can not be translated into the field of thought. The greatest he can do is to give a new word to his experience. This experience can not be understood by other people.
It is sort of “starting to find something and landing up in the contrary”. Thought and effort generate and perpetrate
each other. So, we can not try to go beyond thought as that effort it self is a product of thought. Without effort of some kind, thought can not exist.
I’ll give two example to get more clarity. If a person is excited either positively or negatively, it is difficult for him to get into sleep. In that situation if he tries to sleep he will never get sleep. Since “trying to sleep” is possible in conscious state only. So the trying or effort in that direction perpetuates conscious state. Because of this, he will not be able to enter the unconscious state of sleep. Similarly let’s think a person in front of his office system is trying hard to resist sleep. But in spite of the effort he falls asleep. In this case, the unconscious has occupied his conscious state in spite of his conscious efforts to over come sleep.
When a person is in deep sleep or unconscious due to anesthesia he is still alive. But nothing he undergoes in that state can be translated into conscious state. “What with in that state wakes him up into a conscious state”, is a mystery to me.
We think based on many assumptions.For example, take a steel knife of wooden handle. What is there at the meeting
point of wood and steel. Is it steel or wood or both or neither. If we tell it is wood then where from steel is beginning? and vice versa?
If we call it both two objects can not exist in the same place. If we tell neither, we are bringing some imaginary object
which we never have seen in the physical world and which is not defined in terms of physical object, like infinity. But simply because we have never seen in the world , we can not deny that there exists a border.
we have to make any measurement of the knife using its borders only. When borders themselves are not real,
and only notational all the measurements are also notational, based on some undefined imaginary thing.
But that does not mean that physical objects do not exist.
We are daily encountering them.Starting point, Ending point notations, which are based on our intuition
are not working here.
Finally we are measuring objects based on some thing not defined or imaginary, does not sound rational unless we
accept undefined things also as part of rationality.
If scientific measurements are not true , then how science is working and creating miracles. Generally science tries to give workable explanation for any phenomenon with a combination of observed facts and concepts(arrange ment of symbols in proper way
to achieve the goal). That is the reason for the workability of science and scientific thought.Mathematics quantifies the findings of science.
We do not know what is behind our senses.
We can understand any unknown thing up to the extent they can be explained in terms of the already known things.
All human minds can have some shared limitations, in the generation of concepts with in the limits of known things also as we all have some common conditionality.
The common image about rationality and science is they are crystal clear about anything. They have unshakeable basis
for their existence. My this exploration is to dispute this maxim. Of course it is useless to give more attention to the limitations of rationality,
as we can not transcend thought.
If a person tells us he has undergone an experience which is very extraordinary and which can not be translated into words,
how can we know whether he has experienced that or not?
We have to simply either believe or disbelieve him based on our psychological inclinations. We’ll never know the truth about his experience. Finally experiencing is different from understanding intellectually. A completely color blind person can understand what a color might be, using his intellect.But,he will never be able to experience or perceive the color. The mystics experience the reality beyond our senses. The scientists try to understand it intellectually. The aims of both of them are one and the same. But their paths never meet.
Our belief is a mental image. belief can have many reasons.
– Wishful thinking produces belief
– Extrapolation of things and incidents of which we do not have direct sensual experience produces belief or disbelief.
Direct sensual experience itself may not lead to the final truth.
The magic done by the magician should be real if we have to depend only on sensual experience for truth. But there, we apply
our intuition, which is nothing but a healthy disbelief to find out the truth, even though we do not know the trick behind his magic.
Similarly, all the things shown in films, virtual reality , multimedia are not truth. All our dreams give us a feeling of all five senses. But dreams are not true!!
Instead, if we rely on physical laws, at some point they are extrapolations and , simple concepts( based on sensual experience and mentally rearranged symbols).
In the computer programming, in a “for” loop if a final condition is never met , then it results in an infinite loop. Similarly if we try to find out something impossible and some thing beyond human perception and human experience(which is beyond mind and it’s conditionality), then we may land up in an experience which is still in the range of mind.
For some people, God or truth are nothing but a result of wishful thinking.It is like a switch to control their anxiety. They can be mentally more balanced if they beleive in what they
wish. Truthwise, wishful thinking may not be useful, or, it may be if the truth is all-inclusive.
a. Reality and the boundaries of perception
There are supposed to be certain things which are outside the boundaries of human thinking. As such, these boundaries are neither rigid nor concrete. For instance, all over the world, some persons are said to experience epiphanies. But they have difficulty putting these revelations in to words and thoughts. Those people attempt at framing some rules for those epiphanies. But we see those rules falling flat and degrading into obscure cults or extremisms.
I attempted at exploring the issues involved in the understanding of the world beyond human perception. It tries to explain about “the challenges to the human imagination and thinking” in dealing with extra-ordinary and metaphysical aspects of the world.
The telephone that I am seeing on my desk is a real object. My fingers typing these words are real. Let’s examine what the meaning of “reality” is, and what it is not also.
Let’s take the example of an object considered to be very real. That is the ‘telephone’ on my desk.
i. Verbal aspect
The meaning of the word reality is given by Meriam Webster online dictionary here..
http://www.merriam-webster.com/dictionary/reality
We’ll consider the meaning, “something that is neither derivative nor dependent but exists necessarily”. This meaning is relevant to the topic that we are going to discuss.
If something is neither derivative nor dependent but exists necessarily, then that object is deemed to be real. Telephone almost fits the description. So the grey telephone on my desk is real.
Let’s assume there is a kid in my room, who sees the telephone for the first time in his life. Let’s call him little Johnny. Now, we’ll look closely at the mechanism by which the Johnny’s mind identifies that there’s a real telephone on my desk.
- By looking at the real world object of telephone, an image is generated in the Johnny’s brain. This image is electrochemical in nature. This image is a lossy image. It does not represent the telephone exactly in his brain. Take Johnny out of the room and ask him, “How many buttons are there on the telephone?” He may not be able to come up with a correct number as an answer.How ever, he may tell roughly around how many buttons are there on the telephone.
- As the little Johnny has seen the telephone for the first time in his life, he would like to know what it’s called. He asks the intern there what it’s called. Or, the intern may himself volunteer to tell the kid about the telephone. Alternately Johnny may find in his nursery book that the object is called a telephone. This results in the initiation for linking the image in Johnny’s mind to the corresponding word.
- Then Johnny links the word/label/tag called ‘telephone’ to the image in his mind. He needs to simply activate this link when he comes across the object next time anywhere else.
- Now, hearing the word ‘telephone’, Johnny can retrieve the image in his brain and alternately by looking at the image of the telephone (internally in his mind or externally), he can retrieve the word ‘telephone’.
- However, given the image in his head he can not create the object/instrument telephone itself. (He wishes he could). This is because telephone instrument is “something that is neither derivative nor dependent but exists necessarily”. That is to say it is real.
- He can mix the image of the telephone in his mind, with the already existing images of other objects/ideas in his head. Then he can manipulate the real life telephone according to the image in his mind. For instance he may think the telephone looks like a bread packet and then put it to his mouth, ultimately finding it’s not possible.
Now let’s assume that little Johnny has grown up to be a handsome Mr Johnson. He uses the telephone daily in his office, especially to contact his girl friend.
When Johnson comes across a telephone here is how the events unroll.
- The object, telephone triggers its image in his brain.
- Then the link established between this image and the tag ‘telephone’ gets activated.
He automatically identifies the telephone. Given the word, he can retrieve the image and vice versa.
- However he can not retrieve the actual object called telephone. This makes the object real. It exists even if Johnson exits from this world. It’s not a creation of his mind. So it’s an objective reality.
- Now, the only event left is to dial his girl friend
ii. Subjectivity aspect
However, the shape, color and feel of the telephone are rendered by Johnson’s mind to some extent. If a cow sees the same telephone, it might not be able to identify that it’s a blue telephone because of its color blindness. If a dog listens to its ring, it will identify the infra-sonics, but not Johnson. Not any human being. So, the color of the phone etc are not as objective as they were thought to be. They vary, depending on whether a man has seen it or a cow has seen it.
Similarly, if Johnson looses all his senses, the telephone does not exist for him at that moment. But, he lost not the telephone alone, he lost the entire world. Other normal people will be able to see the telephone. Still, the cow will be able to see the black and white telephone.
If, the blind Mr Johnson believes more in measurements than senses, then he can get measured the mass and length of the phone and get satisfied that the phone is there indeed. The mass of the phone will be same for a cow also, if it knows what mass is. It will be same on Moon and Mars also. But, according to Einstein, the mass of the phone changes as it approaches the velocity of light. Still, it’s the mass of the same telephone. So, still telephone has existence objectively.
iii. The significance of the links
- If Johnson turns mad he can believe the telephone to be a jet plane and that is pretty much real from his point of view.
- In the case of this article, it is more of a word/image play to understand the thing called telephone. So, this article involves “rearrangement and manipulation of images”, abstractions and the attached tags to explore the meaning of reality of telephone.
- Concepts, scientific theories, arts, movies take the basic inputs (images or abstractions) from the real world objects and rearrange them towards an intended goal. To an engineer, this goal could be “to produce a car in the external world”. Some times it could be to know the nature of the real object in the world. Some times the product can be the result of manipulation of internal images (ex: a painting)
- In the case of engineering, the real world objects are rearranged based on the manipulation of the corresponding images in the mind.
- However the deductions of theoretical science should be verifiable by the real world objects/phenomena.
iv. How do you know the real object?
- The mechanism explained to elaborate the reality of a telephone applies to all the words used in the process of explanation. So, essentially these words belong to the same plane as the word/image ‘telephone’. The actual object/instrument telephone is the only physical/actual/real thing. This real thing is in a different plane. The rest are notional objects in human mind. So they are not equal to real objects. They can not be used to touch the real object, i.e. real telephone. Words and images interfere between the real object telephone and the real object of our being. You can hardly look at a telephone without invoking the word ‘telephone’ in your mind. For the mind to completely look at the real telephone, the mind needs to offload all the words and images from our being. If all the images are offloaded from the mind, the mind ceases to exist psychologically, as we know it. So, in what state will the mind be? The question is similar to a blind man (blind by birth) asking, “You are telling the rose is neither sweet nor sour! Is it red? What is red?”
How do you explain to the blind man about the color of the rose?
- Most of the human thoughts, feelings, and emotions occur in mind, involving only words or images. Hence psychological things can be deemed unfit to be real in the physical sense.
- In the above figures, if Johnson does not have the images generated in his mind, he will be in direct touch with the thing, telephone.
- So new born kids, animals are in better touch with reality (say telephone, tree) than grown ups.
- Why has been all the mankind into this image making? “Survival” could possibly offer an explanation. Usually, our ‘self’ is the centre that binds these disparate images and uses them for various purposes, out of which survival is the top most. For better survival/existance, some entity needs to continually supervise all the images that enter the mind. The survival instinct combined with this entity that supervises is nothing but the self, the ‘I’. That might be the reason the mystiques emphasize “transcending the self”, to realize the truth.
- Without the images the survival instinct is power less. Images represent past and future. With out images humans will respond to threats only in the particular moment of threat. Images make it possible to gain knowledge of past experiences and plan for future threats. But, with out images people might be close to nature and in harmony with it.
- The flip side of the images is, “they make the struggle for existence a planned affair”. So people bear this baggage of past. Plan revenge plots. Remember real or perceived historical injustices and plan future attacks.
- It will be good if people can use the fire power of the images, words and thinking when it’s relevant and necessary ( say for scientific analysis) and turn it off when it’s no good, in hatred, wars etc.
b. The boundaries of reality and senses – Some questions
What exists beyond the senses? If the man believes, “everything beyond his “senses and understanding” can not be pursued”, then all the progress made by man would not have been possible. All cows are limited by the color blindness. Similarly all humans might be limited by the senses, time etc. But man has gone beyond senses and discovered things like electronics,nuclear science and quantum theory.
All humans can not listen to ultrasonics, where as bats can. So ultrasonics are not part of our perceived world reality. Similarly traveling in time might be possible in future for some beings. But it’s not part of our reality. Truth or absolute Reality is not an object in the usual sense. The table there may have various colors depending on what kind of living being perceives it. The mass of the chair varies depending on its relative velocity. But the characteristics of the Truth are supposed to be not varying. Or do they vary?
Is reality an idea? If it is an idea, it exists only in our mind. It does not have a physical existence. A thing that does not have a physical existence can not be true. So, is reality an idea that embodies the basic physical and invariable nature objects. (The characteristics of these objects, like color, mass etc, may vary)? But, the subject of activity is physical objects?
c. Absolute truth might not exist?
One interesting characteristic attributed to real objects in their permanence. Reality might be a product of our imagination as result of having to interact with seemingly permanent things daily. Do we interact with objects which do not transform very fast, relative to human life, and then extrapolate the same nature of not transforming? Then, call it real?
d. Limitations of thought
People apply human thinking, which is the originator of science and rationality, to the things that do not fall into the purview of human thinking. While scientific reasoning is the best jewel in the crown of humanity, it has got its own limitations too. In the entire universe, man is a living being on a very, very tiny particle called earth. His thinking is a product of an evolutionary process and personal conditioning. Physically, thought is nothing but an electromechanical action/reaction. It is fed by the daily sensual inputs that one is gets through one’s senses. Considering the entire universe, the entire process is very conditioned and pertains to a small context. Now, we shall see, what happens when we try to capture things out side thoughts domain, with thought. It is just like human beings trying to fly in the air like birds using their wings.
Subjects like “God, absolute truth, absolute objectivity”, all fall beyond the domain of thought, simply because they are dealing with unconditioned things. With out a little borrowing of belief, there is no convincing explanation with in the field of thought. Scientific theories have their assumptions and hypothesis’.
We believe that gravity keeps the solar system the way it is. We believe gravity will keep on existing in the future. Similarly we conceive that electrons revolve around the atomic nucleus formed by protons and neutron and electrons and protons attract each other. Many theories and application are based on the belief that the electrons will keep on attracting the protons. What will happen if, on a fine day, electrons start repelling the ‘protons or neutrons?’. May be it’s, another way of asking “how do you know that the entire universe will not suddenly collapse one fine day, unless you believe to the contrary?”
Thought itself is heavily conditioned by all the things mentioned above (chemical, evolution etc). And the” notions of God, truth, absoluteness, solutions and thought itself is created by thought which comes from the very narrow background of society, values, beliefs etc. Further thought has got the limitation of being driven by wishes wants desires instincts.If et all a man is able to go beyond thought, he may find altogether a new meaning for the above words (truth, god etc). This new meaning may not, in any way, be related to the original meaning or word. So, he can not translate this new meaning into the field of thought. The maximum he can do is “to give a new word to his experience which others can not understand”.
Thought and effort generate and perpetrate each other. So, we can not try to go beyond thought as that effort it self is a product of thought. With out effort of some kind, thought can not be there. But thought is merely an image. Initiation should come from outside ones self, to go beyond thought. Most of the manifestations to spiritual people seem to be of this kind.
If there’s absolutely one thing (say God, or universe), then there should not be anything outside of it to think and imagine about the absolute thing, for, then it becomes relative. This means we are part of that absolute thing. There’s no way that we can come out of it and transcend it.
e. Concepts pointing un-known – some arguments
Take a steel knife with a wooden handle. What is there at the meeting point of wood and steel? Is it steel or wood or both or neither? If we tell it is wood, then where from steel is beginning, and vice versa? If we call it both, two objects can not exist in the same place. If we tell neither we are bringing some imaginary object which we never have seen in the physical world. This third object is not defined in terms of existing physical objects, like infinity. But simply because we could not prove, we can not deny that there exists a border. We have to make any measure meant of the knife using its borders only. When borders themselves are not real, and only notational all the measurements are also notational, based on some undefined imaginary thing. But that does not mean that physical objects do not exist. We daily encounter them. Starting point, Ending point notations, which are based on our intuition are not working here. But,this could be because of the limitation of the concept real numbers we learnt at school. There are infinite real numbers between any two real numbers. But, this is not so with real life objects. There’s some smallest possible particle called Atom (or some other sub atomic particle). If we measure the length of the knife’s wood in terms of number of atoms, the above paradox could be resolved.
The motion of objects is a paradox. If an object is moving between two locations, is it present at each and every point on the way to destination? If so, is it stationary or moving at each point?. If its stationary how can we tell that the object is moving. If it is moving how can we tell that it existed at so and so time at all points on the way to its final location?
As explained above, some times the physical phenomenon could not be measured because of the wrong concept used. If we use real numbers, since there are infinite real numbers between any two given real numbers, we may have difficulty in finding edges and starting points exactly. So, a different number system say, ‘integers’, will solve problem. Similar relation exists between cause and effect in time domain.
Similarly if a paradox could not be explained by two known things, it could be solved by the introduction of a new third thing (unknown till now).
Ask a person, “Give an example of an object with out a starting point and with out an ending point”.
He may ponder for some time and may argue there is no such object.
Then point him about any circular, ring like object and ask him to identify its starting point and ending point. This will make him realize that the starting point and ending point concept does not make a sense for circular objects. They are mere conceptual. So, the suggestion of the third object, the circular ring, could solve his paradox.
But usually, the difference with epiphanies is that the third object is not with in the field of human understanding. So the third object may bring another paradox into the picture.
If man has not tried to explore the unknown, many mysteries would not have been unraveled. Many of today’s unknown mysteries could be explained tomorrow because they are still with in the limits of human understanding. That should not prevent us from being open about the things beyond human understanding and effort.
Finally, the fact that we measure objects based on some thing abstract or imaginary, does not sound rational unless we accept undefined things also as part of rationality. If scientific measurements are not true, then how science is working and creating miracles? Generally, science tries to give workable explanation for any phenomenon with a combination of observed facts and concepts (arrangement of symbols in proper manner to achieve the goal). That is the reason for the workability of science and scientific thought. We do not know what is behind our senses.
Why do we search for the absolute thing? Is a relative thing not the real thing? Is absoluteness and reality a myth? Are they expectations triggered by our daily life, or they are real or there are cases to justify all these?
Now that we have pondered over reality, is a completely objective thing real? Is an imaginary thing not real?
What is objective? What is subjective?
According to Heisenberg’s uncertainty principle ‘the act of observing’, changes the observed thing (momentum or mass of electron in this case). So there’s no perfect objective thing either. We influence part of our so called objective observations.
f. Creativity -Randomness Vs Deterministic
Seemingly random events can have deterministic causes.
Let’s take the example of a football game. The time, at which ball hits the goal, looks random. It is almost impossible to predict how many times the ball hits the gaol on one side. Yet, we know that it will be a result of the game played by both sides of the players. So if we know the relative efficiencies and game plans of both sides the probability of guessing how many goals may hit the goal post increases. The probability of guessing goal increases as is the information about its cause increases. If we know in what direction the ball moves at each moment of the game in advance, we can predict about the goals that both sides will do. The number of goals may look random, but they can be calculated based on certain information.
Similarly an invention can be a result of seemingly random thoughts (similar to Brownian motion) striking correctly in the mind of the inventor. Alternately, it can also be a result of the external circumstances the inventor undergoes.
The trigger for creativity can be a chance event with in our understanding, like the trigger for goal that was scored.
The trigger can be from outside our understanding like the “flash out of a blue in a scientist’s mind”, which does not seem to originate from the thoughts in his mind.
g. Understanding
We can understand any unknown thing upto the extent they can be explained in terms of the already known things. In the “generation of concepts with in the known things”, all human minds can have some shared limitations, as we all have some common conditionality.
The conventional image about rationality is, “It is crystal clear about anything”. Rationality has got unshatterable basis. Of course, it is useless to give more attention to the limitations of rationality, as we can not transcend thought. If a person tells us he has undergone an experience which is very extraordinary and which can not be translated into words how can we know whether he has experienced that or not? We have to simply either believe or not beleive, based on our psycological inclinations. We’ll never know the truth about his experience.
Our beleif is a mental image. Beleif can have many reasons.
- Wishful thinking produces beleif
- Extrapolation of things and incidents of which we do not have direct sensual experience produces beleif or disbeleif.
h. Is direct perception true?
Direct sensual experience alone may not define truth. If we have to depend only on sensual experience to know truth, the magic done by the magician should be true. But there we apply our intution, which is nothing but a healthy belief to find out the truth, even though we do not know the trick behind his magic.
Similarly all the things shown in films, virtual reality, and multimedia are not truth. All our dreams give us a feeling of all five senses. But dreams are not true!!
Instead if we rely on physical laws, at some point they are extrapolations and, simple concepts (based on sensual experience and mentally rearranged concepts).
In the computer programming, in a “for” loop if a final condition is never met , then it results in an infinite loop. Similarly if we try to find out something impossible and some thing beyond human perception and human experience (which is beyond mind and its conditionality), then we may land up in an experience which is still in the range of mind.
In some people God or truth is nothing but a result of wishful thinking. It is like a switch to control their anxiety. They can be mentally more balanced if they beleive in what they wish. The product of wishful thinking may not be truth. In other words, it may be truth only if the truth is all inclusive, including illusions and hallucinations.
There seem to be certain boundaries to human perception. The sciences, arts, religion and philosophy focus on different aspects of the reality with in these boundaries. It may need a co-ordinated work with focus on these limits and beyond to know more about the facts. Then the elephant of reality may strike as shown in the parable here.
Four blind men were walking on a path in a Jungle. An elephant came across these four blind men. The four blind men were not aware that there was an elephant in front of them. They sensed that some thing is obstructing their path. One caught hold of its trunk and told it is like a ‘papaya tree’. The second person touched the elephant’s tail and told the thing looks like ‘a snake with a brush at its end’. The third blind man caught the elephants leg and told it is like a palm pole. The fourth man went around the elephant touching it’s feet, trunk and tail then declared it’s all. It’s four palm trunks, with a papaya tree between the front two palm trunks and one snake between the rear two palm trunks. They started arguing loudly about this. “ It’s a snake, it’s a palm pole, it’s the tree, no.. no..it’s all, no.. it’s none”.
The elephant got disturbed by the commotion of the blind men, it screamed and kicked its legs. Then it took the four men by its trunk one by one and has thrown them into the needled bushes at the side of the road. The four blind men got up from the bush crying with pain. The got together, and then they reached the consensus, “It’s none of the things we assume it to be”. “It’s the elephant after all, stupid!”.
…to continue
spiritual speculation-After death
20 మార్చి 2010 వ్యాఖ్యానించండి
in తత్వశాస్త్రం ట్యాగులు:death, start
That’s a serene valley. The sun is very gentle. The mist is lingering in the woods in pockets. There’s a foot ball match going on in the nearby school. The chirpy school kids never get tired of the game. Their energy is boundless.
It drizzled last night. The leaves of the fir trees look washed and fresh.There’s a stream gurgling near the school ground. It’s mixed with the sound of the woodpecker’s tweets.There was a huge land slide down the stream during the drizzle last night. Suddenly the stream has turned a waterfall where the land slide happened. A small but deep ditch is formed and the stream at once jumps into the ditch now.
The foot ball comes out of the ground and falls into the stream. A boy has begun chasing the ball in the stream.He is about to catch the ball. To his dismay suddenly there appeared the ditch formed due to the land slide. The fall fell into the ditch with water and is quickly carried away by the stream. The boy has to return back with empty hands.
*************
My friend Somu is no more. He is dead while trying to pick a lotus from a pond near the school. After the class prayed for him by observing silence for five minutes, the class teacher said, “For a student of fifth standard, his life ended quite young. Boys and girls! Please do not venture into the water bodies any where around the school”.
Somu is dead now. What does it mean? What happens if I am dead? Will the world go on as usual? These trees, the school, my classmates, the teacher…what happens to them. Will I be able see them once I am dead? If I’m dead, shall I go to heaven or hell? I don’t want to die even if I go to heaven. It’s very scary to imagine my death..why..life is like a dream song…death never entered my mind..and now..it’s like a sudden endless darkness..why am I frightened about death..?
What happens if my father dies? It’s even more scary..? Who looks after me, my loving mother, little sister. How do we get money..? Niket is calling for the game..I’ll ask him…”What will you do if you die tomorrow?”
He says, “It’ll not happen..come on.. it’s getting late…”.
Why am I worried suddenly about death and then life..?
…to continue
Spiritual Speculation-God and Universe
20 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:God, universe
The river is three kilometers wide. People take mechanized boats and travel upstream to visit the holy places. As the boat moves upstream dense hilly jungles come into picture on both the sides of the river. The river becomes narrower and deeper. Every year the river is on spate during rainy season. The hillocks on both sides bear the marks of the water when it was flooding. But,now the river is very calm and composed. In the jungles there are tribal hamlets. The only mode of transport for them is the country boat on the river. There were no roads to those habitations. No TV signals.. no cellular signals. Sparrows are still chirping around. After staying there for a couple of days and getting immersed in the quite tranquility, a man from the city begins to yearn for his staple diet of TV programs and radio channels. But the original inhabitants know nothing of either the beauty of the place or ruckus of the modern world.
Finally one reaches the birth place of the river. It’s small pond like body in the high mountains. Water collects from almost incessant rains and thus the river is formed. It has become a pilgrim place.
*********
As I entered my tenth standard, I started having many unanswered questions in my mind. Two most important of those questions are about God and the Universe.
Initially I believed in God due to my family environment. Soon there began murmurs in my mind. “Why did that train accident happen? What is wrong with all those thousands of people dead in the tsunami. If I am a bad person, is God,my creator, not responsible for my badness? Should one worship God? Is he a sycophant? Does he punish those who do not believe him? Is he so power-hungry? Should I believe in him to get access to the goodies given by him? If nobody created this world where from it has sprung up?”
Soon it has become difficult for me not to argue God is not there. At the same time it was hard for me not to believe in God..especially in the testing times of school examinations.
While being asked if God is there or not,why don’t people say,”I do not know”. Why do they always either believe or not believe? Usually one believes or disbelieves an object one has not seen or perceived. So, one should say one does not know. Of course,the person who has seen God is free to tell he has seen God. But I have not seen such a person so far. Some people say God is in their heart. This implies a belief and wishful thinking again. Imagination or hallucination can not be God.
The other day I asked my elder cousin who believes he was an omniscient, “Who created God?”.
He said,”Nobody created God.If somebody creates him, then he is not a God”.
Then I asked, “When has God’s existence started?”
He said,”There’s no start or end to God”.
This looks like an escape for me.Escape from agreeing, “I do not know”.
I asked him, “could there be such a thing that does not have starting or ending?”
He said,” Since we do not see any such things in our daily life, we can’t imagine such a thing with out a start or an end. But once we see such a thing it become easier for us to imagine a thing without start or end”
“Could you give an example of such a thing?”
He said, “I can give the example in a different field. Take any circular object. What’s the starting point and ending point of its circular body?”
These arguments between my cousin and me run long.
“What’s the origin of Universe?” I would ask him.
“I’ll give similar answers to those of God”
“What’s outside the Universe?”
“There’s no outside to the universe”
“How come it is possible? An object without an outside?” I would press on him.
“Similar explanation..since in your daily life you do not see any object without an outside..it’s difficult for you to imagine an object with out outside.”
“Before universe what was there?”
“Nothing”
“How come so big a universe has come from nothing?”
“Again..problem with your imagination”, then he posed a counter question,”negatively charged electrons revolve around positive nucleus that contains protons..right? That’s the story so far..but what is the guarantee that one fine day electrons do not become positively charged too…? Similarly what’s the guarantee that tomorrow, out of the blue, gravity disappears and all planets collapse in to Sun? Fundamentally our imagination is a results beliefs. These beliefs are due to long observed facts. But what’s the guarantee that facts do not change? Fact may not change in a million years.But it can change after two million years.”
“Is the belief in God necessary?”
“It depends. It gives a sense of control over the hardships in your life. If you think there’s nobody to take care of “things beyond your control”, you might become mentally more unstable”
His arguments leave me more confused and restless.
…to continue
Spiritual speculation-Self or I
22 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:I, self
They are on their trip to the famous gorge. On their way they have comeacross these not so famous mountains. From the feet of those mountains they saw the clouds kissing the peaks. They thought their road wouldsnake through the feet of the mountains and pass them. But, unexpectedly the road soon reached the peaks. Their car is now amid those clouds.
The sun has faded. Soon, the road has gone above the clouds and the clouds now appear like end less heaps of white cotton.
After a few hours of journey, they have reached the gorge they have set-in for. It’s an enormous valley dotted with mountains rocks with an ancient river flowing through it.The rays of setting sun make boulders look like golden hills. From the flat earth you could see miles of the valley and its magic. Soon the magic takes over your mind and you are no longer there…only the magic is there.
*********
My philosophy lecturer in the college told me to stand up and asked,
“Who are you?”.
I said, ” I am Chetan”.
“That’s your name..who are you?”
Then I thought for a while and said, “What is a bus? A bus is it’s engine, steering, seat wheels, body etc. All put together it’s a bus. Similarly I am a collection of my body, mind, heart, name etc”.
Then the lecturer asked immediately, “Who is the entity that has just now given this answer?”
“That’s my intelligence”
“If I put this question to a bus, it won’t answer, right. I am talking to that entity in you.I am talking about that entity who is self-conscious. This entity constantly tells you, “you are right here..you are wrong there..hey man!, your capability is not sufficient..work hard”…I am asking about that entity..who is that entity? This is a big mystery and illusion at the same time. What is “I” in you”.
Then he continued his explanation…
“A new-born kid is not able to distinguish between his self and the external world. If another kid cries he feels that as his own misery and he too starts crying. He can’t make out if that cradle from his hand. The cradle is part of him in the same way his hand is part of him. But slowly he finds the difference through sensations, touch,sound, looks and smells between his self and the non-self.
As he grows up he learns to associate sounds with the images in hismind. This is mom, that is chair. If he does not know the word for an object he stores it’s image in his brain. Now whenever he interacts with the real world the images, sounds and words interfere and mix with the sensory inputs he gets from the real world. So, his perception is colored with the stored images.And you know images are the building blocks of thought.
Do you know what is meant by Zombie? Zombie is a person controlled by some other master. In a way we are all Zombies. We are zombies controlled by our genes and conditioning by the society and environment.”
“But,unlike animals,man has something called “free will” between conditions and his actions.”, I protested.
He said, “At a primary level free will is not so free. Free will is again a product of conditioning.It’s merely the shape that conditioning has given to our instincts and drives. It’s not the content itself. Content is our physical urges needs etc…… You have decided to watch that movie. The umpteen subtle conditionings that you have undergone since your child hood decide your decision to watch a movie.
Similarly at a secondary level free will changes conditions. Gandhi’s will has changed the conditions for all of us and made India free. Man is like a cattle tied with an elastic rope to a poll. With in the confines of the ropes length he is free. He can pull and increase the length of the rope. He can try and learn something and push his limits to achieve things which hitherto are beyond his reach. But there is a limit set to the length of the rope by nature. An elastic rope breaks after the limit and sets the cattle free. But the rope given to us by nature never breaks. As the elastic limit is reached the rope is strengthened further.So in a way the saying, “Man is born free but is found every where in shackles” is true”
I interrupted him, “In man’s case also, I beleive the rope could be broken”
He laughed, “you are a young man”, and then he continued, “As to any other living organism, our selfishness is given to us by nature for the survival sake. This selfishness acquires the images, words, sensations from the world out there and stores in our memory. It makes these images in the memeory party of it and then becomes the “self” or “I”. So,the self is a recorded entity. It’s not a live entity. It does not exist in the present.It’s all past. The entity that exists in the present is our individual consciousness. I’ll talk to you about this in detail later.Finally you told you were Chetan(liveliness), but you are not Chetan..you are Achetan(unliviliness)…you are nothing but the dead past stored in memory”
…to continue
Spiritual Speculation-Physical Time, Mental Time
22 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:mental time, Physical time
That’s a volcano. It’s tip is a concave plateau. When it explodes, the lava jumps forth from its tip and washes everything on its path along with it. First it touches the rocks near the tip. Then burns the trees and uproots them. There are some habitations at the foot of the mountain. The houses are decimated and carried away by the lava.Theanimals are dead in a minute and carried away by the force of the emissions. It is impossible to reverse the direction of the lava and make it return back to the mouth of the volcano. There is a sea at the side of the volcano. The lava goes into the sea and cools down forming rocks and emitting fumes
*********
The philosophy lecturer was elaborating about time in my graduation class.
He was like a river on spate.
“consciousness is like the circular beam of a torch in a dark room. It lightens up the things in the room that it falls on. The objects around the circular beam are also shown in a dim light. It is like subconsciousness. The things consciousness selects to highlight depend on the nature of the self or ‘I’ and the external stimuli. The nature of the self is explained largely by the physical and psycological needs.
The self, which is is bundle of recorded images is able to look at the world and itself through consciousness. It divides the incidents happening before the contact of the consciousness with the world as “past”, during the duration as present, and after the duration as future. In this way, the past, present and future are created by the self. So, mental time if created by the self or thought.
Simultaneously there exists the physical time made of the sequence of events since the Universe was created either due to big bang or due to some other reason. All the objects of the universe, including humans float in this stream called “Physical Time”. The human individual consciousness, being part of the brain also floats in this physical time. Physical time is insurmountable and unidirectional. It always flows in one direction. It’s direction can’t be reversed. A person can’t go to the time of Moses, for he can’t exist both now and in the times of Moses.
There exists a theory proposing the entire universe in an expression or form of a universal consciousness. The individual conscious ness is like the sound played by the radio of the white noise that exists everywhere in the universe. The entire universe is like the AV/TV button. You press it once, you see the expressed side of the cosmic consciousness, that is the physical world. You press it again you see it in it’s unexpressed form, like the viewer sees the blank screen of the TV. Only some mystics have access to this unexpressed form of the consciousness. More about that later.”
…to continue
Spiritual speculation – Jiddu Krishnamurti
23 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:Jiddu Krishnamurti
That’s a remote village. You need to cross the river on a country boat. There’s the narrow curvy path through banana plantations. After you walk for sometime you come across mango and guava orchards. There is a placid pond covered with weeds at the start of the village. There’s the temple of the village diety and an empty ground. During the festive season cock fights are arranged in the ground. But now, the ground is empty, but for a few men playing cards lazily. Some pious people go into the river and take a dip during the holy season. At the side of the river, the washermen have spread their cloths to get dried in the sun. They collect the cloths once they dry and deliver it to the households in the village.
********** **********
A few months after I joined in my second job, I have come to know about Jiddu Krishnamurti. After reading his writings, at first I felt elated and felt “I got answers to many of my questions intuitively”.This elation was caused by my personality rather than by his writings. Once my initial euphoria subsided, I had a look at his writings with a skeptical bent of mind. Then it all became unclear.
There is quite a lot of information available on net and in books about his life and teachings. Rather than going into his thoughts, I’ll share my experiences and misgivings with his teachings here.
J Krishnamurti was brought up to be a world messaiah by theosophical society, but subsequently, after a spiritual breakthrough, he renounced that position and proclaimed “Organized religion and Guru’s can not touch the Truth”. “Truth is a pathless land”, he said. He is the first person to explore the mystic world with modern thought. He used to conduct discourses and talks. All his talks would finally end with Truth. It looked he suggested perceiving Truth as a panacea to all the human problems.While I beleive he might have had some spiritual revelation, he might have mistakenly or consciously suggested Truth as a solution to every thing.”Truth liberates”. He told Truth can not be realized by human effort. “To reach Truth one has to transcend the self. The self is made of thought. So thought is like a cloud in the sky of mind. It’s a polluting factor. To perceive Truth one has to go beyond thought. Human effort can’t realize Truth, as effort is in the realm of thought.”…so goes his teaching.
In my view, a person can undergo a spiritual revelation, but still his personality lingers there. His personality could be affected by the revelation, but not vice vera. This is because the revelation is touted as unconditional. I know a person whose body is magnetic. His body attracts small iron pieces. This is done without his efforts. It looks some accident with his genes has gifted him with this mysterious quality. Science is yet to understand his gift. His personality does not affect his magnetic capability. But his magnetic capability might affect his personality. He may feel he is different from others and may become arrogant. Similar argument may hold good for a mystic or a spiritual man.The ‘mystic revelation’ might be in a higher plane and more fundamental. That’s the only difference. UG Krishnamurti is one of the bitter critics of J Krishnamurti, though he some times acknowledged J Krishnamurti’s role in making people more mature. There’s quite some material found on internet about the tiff between these two Krishnamurtis. J Krishnamurti told Truth can not be realized by effort. This implies that either it is a random occurance, or some external force gives a person this gift, or one’s genes decide one’s access to Truth. But at the same time J Krishnamurti founded schools and taught about the way to live. Does this mean that a person with certain maturity is shortlisted for the realization of Truth? Then, the final selection becomes random? If so, his assertion that “Truth is a pathless land” is not completely correct. Has Krishnamurti implied “you can’t reach Truth by sheer force of will, but you need to realize the conditions necessary to perceive Truth first?” To box like Mike Tyson first you need to build the body. You can’t simply box with the strength of your will?
Krishnamurti was accused of not entertaining questions during his discourses and deflecting attention from questions to questioner’s personality, when faced with an uncomfortable question. He was also accused of shooting counter questions rather than answering questions. People like UG said, “He never gave up his position as world messaiah in his mind and did the necessary work to maintain his image as a Titan of spirituality”. Some people said, “He used commercial tricks to sell him. He was quite secretive about his personal life. He spoiled the life of the wife of his close friend Rajagopal by having an affair with her and having her aborted and so on”. But I think all these accusations do not affect his credentials of having revelations. That’s what matters about a mystic. We need to seperate his personality from his Truth.As he said, “The teaching is important, not the techer”. J Krishnamurti maintained, “Even if two persons perceive Truth, they both can not communicate and ascertain about it. This is because the Truth is beyon words”. UG Krishnamurti made some unjustified criticism about this issue about J Krishnamurti.
J Krishnamurti said, “You need not be an Edison to switch on a light.” This implies even though he invented the path, one need not reinvent the wheel again. They can use his teachings as an electric switch to get there. But, hardly anybody around J Krishnamurti reached there.I could relate to his statement like this. “If you teach a kid the alphabets, learning alphabets looks as an easy one step process to you, since you already mastered them years back. But, for the kid it’s a difficult process. Since Krishnamurti is already there it might have looked as simple as switching on a light. In fact al his talks express the same feeling. In addition, according to his own confession, J Krishnamurti is not a (learned)well read person. This might have acted as a limitation to translate his revelations into the intellectual jargon understood by common people. When J Krishnamurti, UG and Rajneesh were alive, the chemistry between these groups was not so healthy. J Krishnamurti did not exactly like Osho people to sit in the front rows of his gatherings. So did Rajneesh. UG was open in his criticism of both Rajneesh and K Krishnamurti. So, there were spiritual power tussles in those days. More about UG in the coming posts.
Modern spirituality looks like any other modern field finally. There is power, murky episodes, allegations, lack of honesty, commercialization and lack of openness. A person may seek solace in spirituality because of his personal crisis. If he enters this field unknowingly, there is a possibility that he will be entangled in more confusion and end up more bruised. Hope these thoughts of mine on the modern spiritual men will help such people before taking plunge into spirituality.
J krishnamurti was aware of people theorizing his teachings and wishfully beleiving they attained the Truth. Some people may attain a negative Outlook and suspect all action.That’s why he warned, “Don’t make a cage out of my teachings”.
If a person claims he has undergone a spiritual revelation. But he can’t explain it to you. The revelation is so extra-ordinary that he can not convert it into words. Then how do you know if he is genuine or fake? There seems no way. Either we believe what he says or not depending on our inclination. We can get his brain scanned with MRI and see if anything unusual is going on in his brain. That will be one way to verify. But if he claims “brain has nothing to do with his revelation. It’s purely external to him”,then we are in a soup. There’s no way to tell a hoax from a genuine seer.
…to continue
Spiritual Speculation- Supernatural powers
24 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:Super-natural powers
The paddy fields are vast. They are dotted on the peripheries with Palmyra trees and Casuarina. It is a scorching summer. But the kids know no summer. It’s a vacation time for them.Ignoring the reproaches from their parents they have started into the fields. One of them knows climbing the Palmyra trees. They zero in on a Palmyra tree. They debate if the tender Palmyra will be worthy of eating since they looked a bit off-color. He climbs and cut the bunches of Palmyras. They fall all around. The children feast on the kernels of the tender Palmyras and then move on to the next tree.Now they almost know about the quality of the tender Palmyras on this tree.
********
Many people including spiritual men are said to posses supernatural powers. According to Ko.Ku a Telugu writer, the ancient men used to posses these powers. But as man’s thinking power developed, these supernatural powers became defunct. So these powers were all natural once upon a time. Because of the current context, they look supernatural. Some of these powers are harmless. The spiritual healing, magnetic attraction are some harmless powers. Some are potentially harmful if they fall into the hands of selfish people. If a person knows future, assume a stock speculator using his powers to manipulate the market. Similarly reading other’s thoughts could be dangerous. But these powers seem not in control of the persons who posses them. Now they show these powers and tomorrow the powers are gone. If the person who possesses these powers is selfish, they pose danger to the world. The fact that “so far no such danger has materialized” indicates that either these powers are not in control of the person in which they exist or they materialize only in selfless saintly people. One can only get what is there in this world. So, these powers need not be mystified and should not be connected to the heavenly things. Scientists should investigate and find out the reasons behind these powers with open mind. Mystical philosophers make sweeping statements about the nature of thought and self. The statements of many such people look ridiculous in the light of subsequent scientific findings. God is there in details. So scientists and academic philosophers should collaborate and conduct experiments that go into the nitty-gritty of the claims and statements of spiritual men. All thought in not junk. If we think about our understanding about the nature before scientific and physical discoveries, the picture becomes clear.Despite all it’s shortcomings of being just in the realm of ideas, research in physics has resulted in better understanding of the world around us.
…to continue
Spiritual Speculation- Spirituality and society
24 మార్చి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం, సమాజం ట్యాగులు:Spirituality and Society
A number of buffalos gathered on the banks of the river. Some of them were drinking water. Some were grazing. A leopard jumped from a bush and all the buffalos dispersed in fear. The leopard targeted a buffalo and was chasing it. Another buffalo from the herd came and attacked the leopard. The leopard fell down. All the buffalos in the herd followed suit and started attacking leopard with their horns. The leopard gathered it’s wits and ran away quickly.
********
Man was initially part of the nature. Like animals he was mating with in blood relatives and parents and kids. As his memory and consciousness developed he remembered his maternal feelings while raising his kids. He could not overcome those maternal feelings later and that was the beginning of familial relations. Society was formed from the nature and it’s culture separated man from nature. Slowly the modernity has set in and now man is being separated from society into an individual. How is the mystical experience of a person useful to the collective good of a society? If the mystical experience could not make a man’s character flawless (What qualifies for a flaw is a different question) it is of not much use to the society. The mystical experience can not give food to a hungry man. If a person is flawless then it does not matter if the society is capitalistic or socialistic. But that is not the reality. So political leaders have to still struggle to bring up a social model, assuming man is not perfect. The social leaders like reformers should still try to create the education system that keeps on rectifying the flaws in a man. But if the fundamental selfish nature of a man is not changed (might be due to some random mutation), whatever the system be, it is susceptible to collapse. How should a man take the mystic experiences.? I think despite the existence of the experiences he should continue to perform his duties. That is what Bhagavad-Gita says.The pupose of life is to live it in the context handed over to us.
…to continue
Spiritual speculation- Natural,Artificial and Time
06 ఏప్రి 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:artificial, natural, the end
What is natural and what is unnatural? According to a theory, everything made by man is unnatural. Man being a product of nature, how can man-made objects be unnatural. But at the same time, if we think the deeds of man as natural, everything made by man including nuclear bomb, robots and rockets become natural.
Man does some natural actions like eating , sex etc. They are instinct driven. But some of his actions are driven by his higher self. His so-called free will takes action.Probably, the actions of man where deliberate thought process is involved,could be considered as artificial.
Is there something unknowable to man? Could the man know the cause of everything in the universe at all times and places.
Could he discover all the laws required to predict all the events in the universe always, past,present and future?
Suppose a closed container containing ten oxygen atoms and nothing else. By knowing the “velocity and direction of the atoms,the temperature of the chamber”, and by knowing the kinetic/thermodynamic laws that guide the atoms, one will be able to predict the position of the all the ten oxygen atoms at a given time.
In a similar fashion by knowing the causes,effects and all the laws governing the universe, will man be able to predict thefuture of the universe. In such a situation will man, by the cause and effect analysis, not be able to predict future,the thoughts in the minds of men in future? By knowing all causes in the universe,and then by doing a cause and effect analysis,at a higher plane he will know the future inventions to be made by future scientists at a lower level.This obviates the need for scientific inquiry by scientists at a lower level.
By knowing all the causes and effects in the universe man may be able to predict the future. But he will not be able to walk into future and be in future. He and his world is carried in a stream called time.
If we see at a microscopic subatomic level effect can never be separated from cause. Cause and effect are two sides of the same coin. Extending this logic to the universe and thinking the universe as a chain of causes and effects, all the chain of actions in the universe are not separate. They are one and the same.
Consider a film. If the role is played in the projector, the events in the movie are played in sequence.If the film role is reversed, the sequence of movie events will be reversed. If we take the film out from the projector and cut it into multiple parts and put them side by side in a room, then the sequence is lost. We could see all the events in the movie at one instance.There’s no sequences and no time,no earlier, no later of the movie.Everything is there at the moment spread all over.Do mystics experience a similar thing when they say they have gone beyond time?, or when they say time has collapsed.
There’s a problem with the analogy. The entire world is in the film role called time. There’s nothing ouside the film role. So we are part of the film role. Being part of the film role called time we’ll never be able to see the other parts of the film rome at a single moment.
Is time like a train that always goes in one direction? Are we like passengers in the sensory world called train coach? Is our consciousness like the only window in the coach though which we see the scenery out side.What ever we could see through the window is the present? Is there a similar train running in the opposite direction? If a man jumps from one train to the opposite train will he be able to reach the station that he has already seen in the previous train. In how many directions do these trains run? Is it possible to stand on the nearby hill and at once have a panoramic view of all these trains and the scenery they are showing?
There are a few differences of time with train analogy.
In the case of time there’s nothing in this world that’s outside time. So the entire world should be inside the train coach.There is no scenary out there. So, there is no station to be returned back to. The station and outside of the train simply does not exist.
Man and his intellect are unimaginably minuscule part of this universe.He is one of the trillions and zillions of possibilities in the universe. He has come from the universe. Is it possible for him to grasp and control the entire universe from with in the universe? Man is not standing on a pedestal apart from the universe. He is part of the universe and his mental and physical faculties are results of some very tiny set of reactions inside the universe. The question here is “Can the hair of its tail eat the lion?”. To put it in another way, “Can the tail wag the dog?”
The end
తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం
18 ఏప్రి 2010 అభిప్రాయములు
in తెలంగాణ ట్యాగులు:solution to telangaana problem
తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం.
1. హైదరాబాదు ముఖ్య పట్టణం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. అదేసమయం లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రదేశం గా కూడా కొనసాగుతుంది. ఆంధ్రకు ముఖ్యపట్టణం నిర్మించేందుకు అవకాశం ఇస్తూ, తాత్కాలికం గా పది సంవత్సరాలవరకూ హైదరాబాద్ ఆంధ్ర కు కూడా ముఖ్య పట్టణం గా కొనసాగుతుంది.
2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తరువాత హైదరాబాద్ కు వలస వచ్చిన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాంతీయులకు నగర పాలనా సంస్థ ల లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడతాయి.
3.నదీ జలాల గురించిన ఎవరి వాటా ఎంత అనేదాని గురించిన సమగ్రమైన ఒప్పందాలు కుదుర్చుకోబడతాయి. వీటిని ఉల్లంఘించిన పక్షం లో ఉండే రుసుము లు ముందు గానే నిర్దేశించబడతాయి..
4. హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణ లోని పౌర ప్రముఖులతో కూడిన సద్భావనా సమితి ఏర్పాటు చేయబడుతుంది. దీని లక్ష్యం మామూలు సమయాలలో ఇరు ప్రాంతాల మధ్య సౌహార్ద పూరిత వాతావరణం ఉండేటట్లు చూడటం. ఇరు పక్షాలకూ ఒకరి పై ఇంకొకరికి ఉన్న అనుమానాలను తొలగించటం.ఒక ప్రాంతం వారి దృక్పధాన్ని ఇంకొక ప్రాంతం వారికి అర్ధం అయ్యేవిధం గా చెప్పటం. భవిష్యత్తు లోని వివాదాల (ఉదా: నదీ జలాలు) సమయం లో ఇరు ప్రాంతాల ప్రజలూ న్యాయ పరమైన నిర్ణయాలకు కట్టు బడి ఉండేటట్లు ఒప్పించటం ద్వారా ఇరు ప్రాంతాల మధ్య స్నేహపూరిత వాతా వరణం కొనసాగేటట్లు చూడటం. రాజకీయ నాయకులకు దీని లో ప్రవేశం ఉండదు.
4. పది సంవత్సరాల తరువాత ఆంధ్ర ప్రాంతం వారి రాజధాని అన్ని హంగులతో తయారౌతుంది. అప్పటి ప్రజాభిప్రాయం సమైక్య రాష్ట్రాన్ని కోరుతుందా లేక వేర్వేరు రాష్ట్రాల కొన సాగింపును కోరుతుందా అనే విషయాన్ని పౌర సద్భావనా సంస్థ ద్వారా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగటం.ఒక వేళ ప్రజలు సమైక్య రాష్ట్రన్ని కోరుకొంటే కొత్తగా ఏర్పరచిన రాజధాని, మహరాష్ట్ర కు నాగపూర్ లా, సమైక్య రాష్ట్రానికి రెండవ రాజధాని అవుతుంది.ఈ రాజధాని అయ్యే ఖర్చు, ఈ పరిష్కారాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ఈ పది సంవత్సరాల తరువాతి సమీక్ష వలన, ఇరవైకి పైగా ఉన్న ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ల ను తెలంగాణ డిమాండ్ తో ప్రస్తుతానికి వేరు చేసి చూప వచ్చు. ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఈ విధమైన సమీక్షకు సిధ్ధం గా ఉండక పోవచ్చు. దీని వలన దేశ సమగ్రత కు చిన్న రాష్ట్ర డిమాండ్ ల వలన ముప్పు ఏర్పడుతుందేమోనన్న భయాన్ని తగ్గించ వచ్చు. .రెండు మూడు జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరేవాళ్ళు, మళ్ళీ కలిసిపోవటం అనే ఆలోచనకు అనుకూలం గా ఉండరు. ఈ విధం గా తెలంగాణ లేక ఆంధ్ర ను ఇంకా చిన్న రాష్ట్రాలు గా విభజించాలి అనేవారిని కూడా నిలువరించవచ్చు.
భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న
02 మే 2010 అభిప్రాయములు
in తత్వశాస్త్రం ట్యాగులు:nishkaamakarma
భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న:
శిష్యుడు: గురువు గారూ కృష్ణ భగవానుడు గీత లో “కర్మల ని ఆచరించు, కానీ ప్రతిఫలం ఆశించకు”,అన్నాడు. ఇదెలా సాధ్యం? నేను క్రికెట్ ఆడతాను. ఆ ఆడటంలోనాకు ఆనందముంది. కాబట్టీ,రేపు ఏ క్రికెట్ లో ఏ అవార్డో వస్తే నేను ఇంకా సంతోష పడతాను. మనం ప్రయాణం చేసే మార్గం లో నైనా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. లేక పోతే గమ్యం లోనైనా ప్రతిఫలం ఆశిస్తాం కదా!ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏ పని ఐనా మొదలు పెట్టటానికి ప్రేరణ ఏముంటుంది. మనకు నిత్యం బాధ కలిగించే పనిని మనం మొదలు పెట్టం కదా. సంఘాన్ని బాగు చేయ్యటం కోసం ఎన్నో కష్టాలను ఓర్చుకొన్న మహా మహులు కూడా ఆ పని వలన ప్రతిఫలాన్ని ఆత్మ సంతృప్తి రూపం లో పొందుతారు కదా? కాబట్టీ ప్రతిఫలాపేక్ష లేని కర్మ అనేది మన ఊహలలో మాత్రమే సాధ్యమనుకొంటా గురూ గారూ!”
గురువు: బాబూ! మన ఇంటిలో మొదలూ చివరా అంటూలేని వస్తువు ఏదైనా ఉందా?
శిష్యుడ్డు: లేదు గురూ గారూ! మొదలూ చివరా లేకుండా ఏ భౌతిక వస్తువైనా ఎలా ఉంటుంది?
గురువు: బాగా ఆలోచించు నాయనా..
శిష్యుడు: నా మనసు లోకి ఏమీ రావటంలేదండీ గురువు గారూ!
గురువు: సరే, ఆ పక్క గది లో నీ ఆట వస్తువులన్నీ ఉన్నాయి కదా. ఒక సారి వెళ్ళి చూసి రా నాయనా, ఏమైనా దొరుకుతాయేమో.
శిష్యుడు: (తన లో…గురువు గారు ఏదో మాయ చేస్తున్నారు..) ఆ ఇదిగో నండీ ఇక్కడ “టెన్నీ కాయిట్” రింగు దొరికినది. దీని చుట్టు కొలత వెంబడి పోతే దీనికి ఆదీ లేదు అంతమూ లేదు. మనం ఏక్క డ ఆది అనుకొంటామో అదే ఆది అవుతుంది..అయినా దీనికీ నిష్కామ కర్మ కీ ఏమి సంబంధం గురువు గారూ…??
గురువు గారు: బాబూ, ఐదు నిమిషాల ముందు “ఆదీ అంతం లేని విషయం అసంభవం” అన్నావు…గది లోకి వెళ్ళి వెతికిన తరువాత ఇప్పుడు ఒక వస్తువు ని కనుగొన్నావు. అప్పటికీ ఇప్పటికీ ఈ బాహ్య ప్రపంచం ఏమైనా మారిందా?…లేదు కదా…మార్పు నీ మనసు లోనే ఉంది. రింగ్ అప్పుడూ ఉంది..ఇప్పుడూ ఉంది. ఐతే ఇప్పుడు ఆ వస్తువుని చూడటం ద్వారా నీ మనసులో మొదలూ చివరా లేని వస్తువు సంభవించటం పై ఉన్న అపనమ్మకంపోయింది. అదే విధం గా నిష్కామ కర్మ అనేది ఒక ఊహ మాత్రమే అని నీకు అనిపించటానికి కారణం అలాంటి కర్మ నీకు వ్యక్తి గతం గా అనుభవం లోకి రాక పోవటమే. నిత్యం నీవు ప్రతిఫలం ఆశిస్తూ చేసే పనులలోనే ఏదో ఒక పనిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా చేయగలవు.అది ఏ పని అనేది నీకు వెంటనే తట్టకపోవచ్చును.అయితే ఆ పని ఏదో తెలుసుకోవటం కోసం నువ్వు వెతికి చూడాలి. ఒక సారి దానిని నీవు కనుగొన్న తరువాత అది సంభవమేనని నీకు తెలుస్తుంది.
అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన చిక్కులూ, మనిషి బుర్ర పరిమితులూ…
12 అక్టో 2011 అభిప్రాయములు
in రాజకీయం, సమాజం ట్యాగులు:dalit movement, feminism, regional movements
అస్తిత్వ (స్త్రీ,దళిత,ప్రాంతీయ) వాదాల తో వచ్చిన ఇబ్బందులూ, మనిషి బుర్ర పరిమితులూ…
మీరు ‘X’ అనబడే వర్గానికి చెందిన వారనుకొందాం. మీరు Y అనే వర్గం వారిలో చాలా మంది వలన మీకు నష్టం జరిగింది అనుకొంటున్నారు. మీరు ఇలా అనుకోవటం అనేది మీ ప్రత్యక్షానుభవం వలన కావచ్చు, లేక పుస్తకాలు చదవటం వలన కావచ్చు,లేక పెద్ద వాళ్ళు మీకు చెప్పటం వలన కావచ్చు లేక మీడియా వలన కావచ్చు. అయితే అదే సమయం లో Y వర్గం కి చెందిన వాళ్ళ లో కొందరి పట్ల మీకు మంచి అభిప్రాయం కూడా ఉంది.ఎందుకంటే వాళ్ళు మీకు మంచి చేశారు. Y వర్గం లోని ఆ కొంత మందికి, మీరు “Y వర్గం వాళ్ళకు ఉంటాయి” అనుకొన్న చెడు లక్షణాలు లేవు.
కానీ మన మనిషి బుర్ర ఒక విషయం గురించిన అన్ని వివరాలనూ( డీటెయిల్స్) వాటి కి చెందిన సంక్లిష్టత (కాంప్లెక్సిటీ) లనూ తనలో ఇముడ్చుకోలేదు. ఆ విషయానికి సంబంధించిన సారాన్ని (అబ్స్ట్రాక్ట్) మాత్రమే ఒక చిత్రం(ఇమేజ్) గా లేక ఒక మాట గా తన లోపల ప్రాతినిధ్యం(రిప్రజంటేషన్) కల్పిస్తూ దాచుకొంటుంది. ఉదాహరణకి ఒక కంప్యూటర్ ప్రోగ్రాం కి సంబంధించిన కోడ్ మొత్తం మన బుర్ర లో దాచుకోం..కానీ దాని డిజైన్ కి సంబంధించిన స్థూలమైన మోడల్స్ మాత్రం మన బుర్రలోఉంటాయి కదా.ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు,”Y వర్గం లో పుల్లయ్య మంచి వాడు..ఎల్లయ్య మంచివాడు కాదు…సీతమ్మ మంచిది…. “,అని చెప్పరు. అలానే”Y వర్గం మంచిదీ కాదు..చెడ్డదీ కాదు..అందులోనే మంచివాళ్ళూ..చెడ్డ వాళ్ళూ..మంచీ చేడూ కాని వాళ్ళూ అందరూ ఉన్నారు”, అనికూడా చెప్పరు.
కాబట్టీ, ఎవరైనా మిమ్మల్ని Y వర్గం గురించి అడిగినప్పుడు మీకు Y వర్గం వలన మొత్తం(రిసల్టెంట్) గా కలిగిన భావం మాత్రమే మీరు చెప్తారు. అంటే Y వర్గం వలన మీకు కలిగిన నష్టం లో నుంచీ,అదే వర్గం లోని తక్కువ మంది వలన మీకు కలిగిన లాభాన్ని తీసి వేస్తే మిగిలేది కొంచెం తక్కువగా నైనా నష్టమే. కాబట్టీ మీరు Y వర్గం అంటె చెడు భావాన్నే వ్యక్త పరుస్తారు. భావాలను వ్యక్త పరిచేటప్పుడు మనిషికి పెద్ద వెసులుబాటు లేదు. మీరు ఒక వర్గాన్ని ఇష్టబడతారు లేదా ద్వేషిస్తారు. వీటినే ద్వంద్వాలంటారు. ఈ రెండిటికీ మధ్య ప్రతిస్పందన మనిషికి ఈ విషయాలలో చేత కాదు. కాబట్టీ మీరు టొకున గంప గుత్త గా Y వర్గమంటే మీ అయిష్టాన్నీ ద్వేషాన్నీ వ్యక్తపరుస్తారు..అది రచనల ద్వారా కావచ్చు..చేతల ద్వారా కావచ్చు..మాటల ద్వారా కావచ్చు.
ఒక్క సారి మీ అయిష్టాన్ని విన్న తరువాత,అంతకు ముందు Y వర్గం లో మీకు మంచి చేసిన వాళ్ళూ, లేక మీరంటే ఇష్టమున్న వాళ్ళూ కూడా గాయపడతారు. వారు కూడా మీరు అంటే అయిష్టం పెంచుకొంటారు. మీ లాంటి వారు ఇంకొందరు Y వర్గాన్ని తిడితే, వీళ్ళ అయిష్టం మీ వర్గమైన X అంతటికీ విస్తరిస్తుంది. ముందు నుంచీ Y వర్గం లో మీకు అయిష్టమైన వాళ్ళూ ఎటు తిరిగీ ఆత్మ విమర్శ చేసుకొనే రకం కాదు. వాళ్ళూ ఎటుతిరిగీ మీ వర్గానికి వ్యతిరేకమే. ఇప్పుడు Y వర్గం నూరు శాతం మీకూ మీ వర్గానికీ వ్యతిరేకమయ్యింది. ఇలా పరస్పర ద్వేషం ఒక విష వలయం లా వర్ధిల్లుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఇక్కడ ముఖ్యమైన లోపం మనిషి బుర్రకి ఉన్న పరిమితులే అనిపిస్తుంది నాకు…
X వర్గాన్ని స్త్రీ, దళిత, ప్రాంతీయ వాదుల తో ప్రతిక్షేపించండి (సబ్స్టిట్యూట్).
Y వర్గాన్ని X వర్గం యొక్క ప్రత్యర్థి వర్గం తో ప్రతి క్షేపించండి.
అలా చేస్తే మన సమాజం లో ద్వేషం రోజు రోజు కీ ఎలా పెరుగుతోందో మీకు అర్ధమౌతుంది అని ఆశిస్తున్నాను.
ఒక్క సారి ఎదుటి వర్గాన్ని ద్వేషించటం మొదలు పెట్టిన తరువాత, వారు చెప్పే మంచి మాటలను కూడా మీరు అనుమానం తోనే చూస్తారు.ఒక సారి అనుమానం మొదలైన తరువాత,ఎదుటి వారి మాటలు ఎంత అర్ధవంతమైనవి ఐనా అవి వీరి చెవిన పడవు. ఒక వేళ పడినా అవి మెదడుని చేరవు.
కానీ X వర్గానికి చెందిన వాళ్ళు X వర్గాన్ని ద్వేషించటం చాలా చాలా తక్కువ. అలానే Y వర్గం కూడా. ఒక రకం గా వారి వారి వర్గాలపై వారికి ఉన్న ప్రేమే ఈ పర ద్వేషాలకు మూల కారణం. మళ్ళీ ఒకే వర్గం లోని వాళ్ళు వారి వారి స్వార్థ ప్రజోజనాలకు భంగం వచ్చినప్పుడు ఒకరినొకరు ద్వేషించుకొంటారు. శాంతి కోసం మనిషి ఎప్పుడూ ఎదుటి వాడినీ లేక ఎదుటి వర్గాన్ని మారమంటాడు. కానీ సమస్య తనలో కూడా ఉందని గుర్తించడు.
కాబట్టీ, మనిషి ఎదుటి వర్గం లోని వాడిని “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వమనటం తో పాటు తాను కూడా “డీ-కాస్ట్” లేక “డీ-సెల్ఫ్” అవ్వటం వలన్ ఈ సమస్యలన్నీ పోతాయి. ఇలా డీ-సెల్ఫ్ అవ్వటానికి వ్యక్తి గతం గా మనిషి తన మానసిక శక్తిని ధారపోయాలి. దానివలన మనిషి కి వ్యక్తిగతం గా ఒరిగేదేమీ ఉండదు. ఒకపల్లెటూరి కుల తత్వ వాది కష్టపడి కుల తత్వాన్ని అధిగమించి ఒక పాశ్చాత్యుడి లా ఆలోచిస్తే, సమాజానికి మంచిదేనేమో కానీ, వాడికి ఒరిగిందేమిటి?
***************************************
మీరు మెయిన్ రోడ్డు లో కారు తోలుకొంటూ పోతూ ఉంటారు. అప్పుడే పక్క రోడ్డు లో నుంచీ ఒకతను స్పీడ్ గా మెయిన్ రోడ్ మీదకు వస్తాడు. అతనిని మీరు, ” పక్క రోడ్ మీది నుంచీ వస్తున్నాడు కదా..నెమ్మది గా రావాలనే ఇంగితంలేదా వీడికి?” అని విసుక్కొంటారు.
కొంచెం ముందుకు పోయాక మీరు ఒక పక్క రోడ్ లోకి వేళ్తారు. కాసేపటికి పక్క రోడ్ లో నుంచీ మెయిన్ రోడ్ మీదికి వేళ్తుంటే,మెయిన్ రోడ్ మీద ఒక ఫర్లాంగ్ దూరం లో ఒక కారు మీ వైపుకి వస్తోంది. ఆ కారు ఇంకా చాలా దూరం లో ఉంది గదా అనుకొని మీరు మెయిన్ రోడ్ ఎక్కేస్తారు. మెయిన్ రోడ్ మీది కారు వాడు మిమ్మల్ని చూస్తూ కోపం గా హారన్ కొడతాడు… మీరు వాడిని లెక్క చేయరు.
కానీ మీరు చేయ వలసిన పని మెయిన్ రోడ్ లో ఉన్నా , పక్క రోడ్ లో ఉన్నా రెండు సందర్భాలలోని పరిస్థితి ని కూడా అర్ధం చేసుకొని ప్రతిస్పందించటం. కానీ అస్థిత్వ వాద కవిత్వం చెప్పే వారు ఈ పని చేయరు. వారి కవిత్వమూ ఆవేశమూ పాటలూ అన్నీ తాము ఎదుటి వారి పరిస్థితి లో ఉంటే ఏమి చేస్తామో అన్న స్పృహ తో ఉండవు. ఇంతకు ముందు ఎదుటి వారి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆయా కవిత్వాలు చెప్పిన వారు గొప్ప గా ఏమీ ప్రవర్తించి ఉండరు. ఎదుటి కార్ వాడిని ఏమాత్రం లెక్క పెట్టకుండా, వాడు చేసిన తప్పులే చేస్తూ వాడిని ఆవేశం గా తిట్టటమూ,తమని సమర్ధించుకోవటమూ ఈ అస్థిత్వ వాద కవులకే చెందింది. ఆత్మ స్థుతీ..పర నిందా.. తాము మాత్రం పొలిటికల్ కరెక్ట్ నెస్ ఇచ్చే రక్షణ తో విమర్శలకు అతీతులమనుకొంటూ కాలం గడిపేస్తారు.ఒకడిని తిట్టటం చాలా సులువు..వాడి పరిస్థితి లో మనము ఉంటే బాధ్యత తీసుకొని పని చేయటం చాల కష్టం.. .
********************************
కొందరు ఏదో ఒక వాదాన్ని భుజాన వేసుకొంటారు. భుజాన వేసుకొన్నాక ఆ వాదం వాళ్ళది అవుతుంది. దానితో ఒక వ్యక్తి గత సంబంధం ఏర్పడుతుంది. ఇష్టం ఏర్పడుతుంది. తరువాత ఆ వాదం లో ఉన్న లోపాలు తెలిసి వస్తాయి. కానీ అప్పటికే ఆ వాదం తనది ఐపోయింది. ఆ బంధాన్ని తెంపుకోవటం కష్టమౌతుంది. ఆ వాదం సహాయం తో లోకం లో పేరు ప్రతిష్టలు వచ్చేశాయి. ఇప్పుడు దానిని దింపుకోవటం కష్టమౌతుంది.
మరి కొంతమంది వాదం మొదలెట్టిన కొత్తలో నిజాయితీ గా మొదలెడతారు. కానీ వాదం తెచ్చిన పేరు ప్రతిష్టల వలన, అధికారం డబ్బుల వలన వారికి మొదట్లో ఉన్న పరిస్థితి ఉండదు. వారికి ఆ వాదం ఇంకెంత మాత్రం అవసరం లేదు కానీ జనాలను మభ్య పెట్టతం కోసం, స్వార్థం కోసం ఇంక ఆ వాదాన్ని వదల లేరు. వాదాల ముసుగు లో వ్యక్తి గత దాహాలను తీర్చుకొనే వారు ఇంకొందరు. “మీరు లేక పోయినా వాదాల కొచ్చిన ఇబ్బంది ఏమె లేదు కదా, మీరు తప్పుకోండి”, అని వీరిని అడగండి, వీరి బండారం బయట పడుతుంది.
మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా?
06 మే 2010 అభిప్రాయములు
in మేధోపరం, సమాజం ట్యాగులు:hypocrat, Sree Sree
మహా కవి శ్రీ శ్రీ ఒక హిపోక్రాటా? ఈ ప్రశ్న లోకి వెళ్ళే ముందు మనం హిపోక్రసీ ని నిర్వచించాలి. “హిపోక్రసీ అంటే ఒకటి చెప్పి, ఇంకొకటి చేయటం”. “హిపోక్రసీ అంటే వేరు వేరు మనుషులను వేరు వేరు దృష్టులతో చూడటం”.
హిపోక్రసీ ని నిర్వచించుతున్నాము కాబట్టీ ఈ నిర్వచనానికి ఉండే పరిమితు గురించి కూడా ఆలోచించుదాం. ఒక మనిషి చెల్లినీ చెలి నీ ఒకే దృష్టి తో చూడ లేడు కదా ఇది హిపోక్రసీ అవుతుందా? కానే కాదు. పైగా అలా చూడటం పర్వర్షన్ అవుతుంది. కాబట్టీ మానవ సంబంధాలకు ఈ హిపోక్రసీ వర్తించదు. అలానే ఒక వ్యక్తి జీవ హింస తగదు అని చెప్పాడు. కానీ రోజూ అతని శరీరం లో కొన్ని లక్షల కొద్దీ సూక్ష్మ జీవులు చంపబడుతున్నాయి. దీని వలన అతను హిపోక్రాట్ అవుతాడా? హిపోక్రాట్ అనిపించుకోకుండా ఉండటానికి అతను ఆత్మ హత్య చేసుకోవాలా? కాదు, హిపోక్రసీ అనేది వ్యక్తి లో ఉండే మానవ సామాజిక విలువలకు సంబంధించిన విషయం.అలానేచెట్లు నిజాయితీ గా పూలు పూస్తాయి, మేఘం నిజాయితీ గా వర్షిస్తుంది లేక కోయిల నిజాయితీగా పాడుతుంది అనే విషయాలు సరైనవే అవ్వవచ్చును గానీ మనం ఇప్పుడు వాటి జోలికి వెళ్ళనవసరం లేదు.
మనిషి వ్యక్తిత్వం అనేది అతని జీవితం లోని పరస్పర విరుధ్ధమైన పరిస్థితుల వలన ప్రభావితం ఔతుంది. కాబట్టీ, మనం మనిషి పరస్పర విరుధ్ధమైన ఆలోచనల ప్రతిరూపం అనే విషయం అంగీకరించాలి. కాబట్టీ మనిషి జీవితంలోని/వ్యక్తిత్వం లోని ఒక అంశం తో పోల్చిచూసినప్పుడు, అతని లో తద్విరుధ్ధమైన ఆలోచనలు, అంశాలు ఉండటం ఒక హిపోక్రసీ లా కనపడుతుంది. కానీ దీనికి అతీతులు చాలా తక్కువ గా ఉంటారు. మనిషి లోఉండే ఏ అంశానికి ఆ అంశం నిజాయితీ గా కనపడుతుంది. కానీ పక్క అంశం తో పాటు కలిపి చూసినప్పుడు ఆ రెండింటి మధ్యా వైరుధ్యా లుంటే అది హిపోక్రసీ.మొత్తం గా ఒక మనిషి జీవితం/వ్యక్తిత్వం సంపూర్ణం గా నిజాయితీ ఐనది అనటం లో అర్ధం లేదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వం లో పరస్పర విరుధ్ధ అంశాలు ఎంత తక్కువ గా ఉంటే ఆ వ్యక్తి అంత నిజాయితీ పరుడి గా కనపడతాడు.
శ్రీ శ్రీ ఆవేశం లో నిజాయితీ కనపడుతుంది…అంటే తనకొచ్చిన ఆవేశాన్ని సూటిగానే కవిత్వం రూపం లో వెళ్ళగ్రక్కాడాయన. అలానే ఒక ఆదర్శ లోకాన్ని చూసి, దాని గురించిన తన ఇష్టాన్నీ కవిత్వ రూపం లో చెప్పాడు. ఈ ఇష్టం లోనూ నిజాయితీ ఉంది. “ఆ ఆదర్శ లోకానికి మన వాస్తవ లోకం నుంచీ దారేమిటొ ఆయనకు తెలుసా?” అనేది వేరే ప్రశ్న.
త్రాగుడు దృక్కోణం లో చూసినప్పుడు, శ్రీ శ్రీ తాగుడు లోకూడా నిజాయితీ ఉంది.నిజాయితీ గానే తాగాడాయన. అలానే స్త్రీ లోలత్వం లో కూడా నిజాయితీ ఉంది. స్త్రీ వాంఛ వచ్చినప్పుడు తీర్చుకొన్నాడు. కానీ ఆ కవిత్వాన్ని ఆయన ప్రవర్తన పోల్చినప్పుడు ఆయన జీవితం హిపోక్రసీ అవుతుంది.
కానీ, ఆయన కవిత్వం లో ఉన్న ఆదర్శాల దృక్కోణం నుంచీ( కవిత్వాన్ని reference point గా చేసుకొని) తాగుడుని చూసినప్పుడు శ్రీ శ్రీ అనే వ్యక్తి హిపోక్రాట్ అవుతాడు.
అదే ఆయన కవిత్వం వలన ఉత్తేజం పొంది సాయుధ పోరాటం లోకి దిగిన వాళ్ళు (శ్రీ శ్రీ గారి ఊగరా ఊగరా కవిత, అలా చనిపోయిన ఒక వ్యక్తి గురించి) ఈ విషయం లో శ్రీ శ్రీ కంటే చాలా తక్కువ హిపోక్రాట్స్ అయిన వ్యక్తులు. ఆవేశం తెచ్చిపెట్టుకొని కాలిక్యులేటెడ్ గా ఉపన్యాసాలిచ్చే రాజకీయ నాయకులు శ్రీ శ్రీ కంటే చాలా చాలా పెద్ద హిపోక్రాట్స్.
ఏ ఆదర్శమూ చెప్పకుండా మేము దోపిడీ చేస్తున్నాము అని, అలానే చెప్పినట్లు గా దోపిడీ చేసే వ్యాపారులు తక్కువ హిపోక్రాట్స్ అవ్వవచ్చేమో కానీ, వారి వలన సమాజానికి ఎక్కువ నష్టం. కాబట్టీ వీరి విషయం లో “హిపోక్రాట్స్ కాకపోవటాన్ని” అంత సీరియస్ గా తీసుకోనవసరం లేదు. మనమంతా ఏదో ఒక విషయం లో హిపోక్రాట్స్ మే. ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకుంటేతెలుస్తుంది. శ్రీ శ్రీ హిపోక్రాట్ అవ్వకుండా ఉండటం ఆయనకు మరింత వన్నె తెచ్చేదేమో కానీ, ఆయన హిపొక్రాట్ అవ్వటం వలన ఆయన కవిత్వం లోని నిజాయితీకి ఏమీ మచ్చ లేదు. ఇక ఆయన వ్యక్తిత్వం దగ్గరికి వస్తే, మచ్చ పడనే పడింది.
****************************
చివరి గా……, ఒక చెడ్డ పని చేయవలసి వచ్చినప్పుడు మనలో అంతస్సంఘర్షణ జరుగుతుంది. మనలోని మంచి వాడు ఆ పని వద్దంటాడు. చెడ్డ వాడు చెయ్యమంటాడు.కానీ బయటి వారి దృష్టి లో నువ్వు ఒక్క మనిషివి. కాబట్టీ నువ్వు అప్పుడు చేసిన చెడ్డపని అంతకు చేసిన మంచి మాట కంటే విరుధ్ధమైనదైతే, బయటి వ్యక్తులు నిన్ను హిపోక్రాట్ అంటారు. కానీ నీకుముందు నుంచీ తెలుసు నీ లోనే మంచి మనిషీ చెడ్డ మనిషీ ఉన్నారని. వాళ్ళు ఇద్దరూ సమయాన్ని బట్టి బయట పడుతున్నారనీ. కాబట్టీ మన దృష్టి లో మనమే హిపోక్రాట్స్ అవ్వటం చాలా తక్కువ గా జరుగుతుంది. మనం రెండు నాల్కల తో మాట్లాడినా ఆ విషయం మన అంతరాత్మకు తెలుసు. మన ఆలోచనలన్నీ మన అందుబాటులోనే ఉంటాయి కదా. కాబట్టీ వైరుధ్యం ఉండదు. ఆలోచనలూ, చేతలూ, ప్రవర్తనా అన్నీ స్వార్థం (Reference point) కోసమే అని తెలిసినప్పుడు వైరుధ్యం పోతుంది కదా..ఇతరులకు అలా కాదు.
మనకు తెలియకుండా మనం హిపోక్రాట్స్ అవ్వవచ్చు గానీ, మనకు తెలిసీ మనం హిపోక్రాట్స్ అవ్వటం(మన దృష్టి లో-Self image) కష్టం. తాను సమాజందృష్టి లో హిపోక్రాట్నని తెలిసీ తన ఆలోచనలనీ,చేతలనీ, ప్రవర్తన నీ అవకాశాన్ని బట్టి వ్యూహాత్మకం గా వాడుకొనేవాడిని హిపోక్రాట్ అనాలా వద్దా? అన్నా అనక పోయినా అటువంటివాడి(గిరీశం టైపు?) వలన సమాజానికి నష్టంకాబట్టీ వాడికి సమాజం విలువ ఇవ్వనవసరం లేదు.
***************
నాకు తెలిన ఒక తత్వ వేత్త ప్రకారం మనిషి పనులూ,ఆలోచనలన్నీ తన భౌతిక,మానసిక, ఆధ్యత్మిక, భావోద్వేగ పరమైన స్వార్థం లేక సర్వైవల్ కోసం. కాబట్టీ మనిషి స్వార్థం దృష్టి తో చూస్తే మనిషి పనులలో, ఆలోచనలలో వైరుధ్యమే లేదు. అన్నీ స్వార్థం కోసమే. అంటే స్వార్థం దృష్టితో చూస్తే హిపోక్రసీ లేదా? మనిషి చేసే పనులన్నీ సర్వైవల్ కోసం అనేది కూడా నమ్మబుధ్ధి కాని ఒక అంశం. మనిషి స్వార్థానికి సంబంధం లేని అనేక ర్యాండం పనులు కూడా చేస్తాడెమోనిపిస్తుంది.
స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.
12 అక్టో 2011 అభిప్రాయములు
in మేధోపరం, రాజకీయం, సమాజం ట్యాగులు:disadvantages and limitations, feminism advantages
స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.
ఒక మనిషి ఆలోచనలనూ, ప్రవర్తననూ ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థ లోని భౌతికమైన కారణాలు ప్రభావితం చేస్తాయి. ఈ భౌతికమైన కారణాలు మారినప్పుడు ఆ మనిషి ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది.అదే విధం గా ఆలోచనల వలన వ్యవస్థ మారటం కూడా జరుగుతుంది. కానీ వ్యవస్థ అందుకు సిధ్ధం గా ఉన్నప్పుడే ఈ మార్పు జరుగుతుంది.
స్త్రీల మీది వివక్షకు కారణాలు మధ్య యుగాలలోని పరిస్థితులలో ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, సమాజం నిరంతర యుధ్ధాలలో మునిగి తేలుతుండటం, స్త్రీ కి శారీరకం గా సంతానాన్ని కనటం, రుతు క్రమం మొదలైనవి స్త్రీ మీది పురుషుల ఆధిపత్యానికి మూల కారణాలు.
(తెలుగు భాష మూలాలు మధ్య యుగాలలోనే ఉన్నాయి. ఆ రోజుల్లో స్త్రీ ని ఒక రక్షించుకొన వలసిన సంపద గా భావించే వారు. ఒక జంతువు నో, వస్తువునో, బండినో అన్నట్లు గానే స్త్రీ ని “వచ్చింది” అంటారు. అదే స్త్రీ ఏ రాజు గారి భార్యో అయితే సేవకుడు “వచ్చారు” అని పుం లింగం లొ పిలిచినట్లు గా పిలిచే వారు. ఇంగ్లీష్ లో ఈ మధ్య స్త్రీ వాదులు ఆక్ట్రెస్ అనే పదాన్ని వాడటం లేదు. వారు ఆడ వారిని ఆక్ట్రెస్ అని పిలవటం లింగ వివక్ష కు నిదర్శమ్నం అని అంటున్నారు.స్త్రీ ని కూడా ఆక్టర్ అని పిలవాలని అంటున్నారు. ఇక తెలుగు లో ఆడ వారిని కూడా “వచ్చాడు” అని పిలవమనే కాలం ఎంతో దూరం లో లేదనుకొంటా.)
ఇక అసలు విషయానికి వస్తే, భారతీయ సమాజం సమాజం లో రాజారామమోహన రాయలు, ఆంధ్ర సమాజం లో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారి సంస్కరణల వలన స్త్రీ విధ్య తో స్త్రీ జనోధ్ధరణ మొదలైంది. తరువాత వచ్చిన స్వతంత్రం వలన ప్రజాస్వామ్యమూ, వోటు హక్కూ స్త్రీలకు వచ్చాయి. మగాడు చేసే పని లో శారీరకమైన శ్రమ తగ్గిపోయింది. తెలివితో చేసే పని ఎక్కువయ్యింది. స్త్రీలు కూడా ఆ పని చేయటం లో ఏ విధం గానూ తక్కువ వారు కాదు.వీటన్నిటి పర్యవసానం గా స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం ఒనగూడింది.(స్త్రీలు ఉద్యోగాలు చేస్తే లేబర్ సప్లై ఎక్కువై, లేబర్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టీ కాపిటలిస్టు లు కూడా స్త్రీ సమానత్వాన్ని ప్రోత్సహించారు. స్త్రీ ఇంట్లో చేసే వంట ని కమర్షియలైజ్ చేసి, మెక్డోనాల్డ్స్ వంటి వాటి తో లాభలు పండించే అవకాశం వలన కూడా కాపిటలిస్ట్ ల కి ఉపయోగమే ! ) ఆర్దిక స్వాతంత్ర్యం లేకుండా స్త్రీ వాదాన్ని ఆచరణ లో పెట్టటం స్త్రీలకు కష్టమైన పని. గర్భనిరోధక సాధనాల వలన పిల్లలను కనటం మీద స్త్రీ కి అదుపు ఏర్పడింది. దీని వలన స్త్రీ కి తన ఉద్యోగం, జీవితం పై నియంత్రణ పెరిగింది.ఈ అన్ని కారణాల వలన స్త్రీ పురుష సమానత్వం అనేది సమాజం లో వచ్చిన ఒక పరిణామం.కానీ పాత అలవాట్లు అంత త్వరగా వదలవు కొంత మంది మగ వాళ్ళు ఇంకా మారిన పరిస్థితులను అర్ధం చేసుకోలేక పోవటం వలన,పాత అలవాట్లను ఒదులుకోలేక పోవటం వలన పురుషాధిక్య భావజాలాన్ని కలిగి ఉన్నారు. చాలా మంది మగ వాళ్ళూ స్త్రీ పురుష సమానత్వాన్ని స్వాగతించారు. మగ వారు సమానత్వాన్ని స్వాగతించకపోతే సమానత్వం అనేది ప్రస్థుత సమాజపు ఒక విలువ గా స్థిర పడేది కాదు.
పై చెప్పిన కారణాలన్నింటి వలనా మగ వారి తో సమానం గా విద్యావంతులైన ఆడవారు కొంత మంది మగ వాళ్ళ లో గూడు కట్టుకొన్న ఆధిపత్య భావన కు వ్యతిరేకం గా స్త్రీ వాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదే స్త్రీ వాదాన్ని ఏ మధ్య యుగాలలో నో ముందుకు తెచ్చే పరిస్థితి లేదు. ఒక వేళ ద్రౌపది వంటి ఏ స్త్రీ వాదో కొన్ని ప్రశ్నలు అడిగినా అది అప్పటి సమాజాన్ని ఎంత మార్చగలిగిందో మనకందరికీ తెలుసు. స్త్రీ వాదం లేక పోయినా ఈ సమాజం లోని ప్రజాస్వామ్య శక్తుల దృష్ట్యా, మారిన పని స్వభావం దృష్ట్యా స్త్రీ పురుష సమానత్వం వైపుకి మన సమాజం అడుగులు వేస్తోంది అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
స్త్రీ వాదం వివక్ష చూపించే పురుషుల పై పోరాటం జరిపి సమానత్వ సాధనను వేగ వంతం చేస్తుందనేదాంట్లో కూడా ఏ మాత్రం సందేహం లేదు.
కానీ స్త్రీ వాదులు రెండు గుంటలలో పడే ప్రమాదం ఎక్కువ గా కనిపిస్తోంది. ఒకటి పురుషుల నందరినీ స్త్రీ వ్యతిరేకులు గా అర్ధం చేసుకొని ఆ విధమైన ప్రచారం సాగించటం. రెండవది ఆధిపత్యం కోసం ప్రయత్నించటం. వీటి వలన స్త్రీ పురుష వర్గాల మధ్య ద్వేషపూరితమైన ఆధిపత్య పోరు మొదలై అసలుకే మోసం వచ్చి, మళ్ళీ సమాజాలు మధ్య యుగాలలోకి జారి పోయే ప్రమాదం ఉంది. స్త్రీ వాదం చాలా వరకూ పట్టణాల లోని ఉన్నత తరగతి స్త్రీ ల నుంచీ వస్తోంది. వీరు పురుషాధిపత్యం ఎక్కువ గా ఉన్న గ్రామాలలోకి తమ ఉద్యమాన్ని తీసుకొని అక్కడి ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి. కాని మన గ్రామాలలో స్త్రీ ల కు ఆర్ధిక స్వాతంత్ర్యం లేని కారణం గా వారి జీవితాలలో నయా స్త్రీ వాదం ఎంతవరకూ మేలు చేస్తుందో సందేహాస్పదం.
ఇక దళిత వాదం విషయానికి వస్తే, పోడు వ్యవసాయ వ్యవస్థలో ఎక్కువ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేసిన వాళ్ళూ భూస్వాములయ్యారు. వారికి ఎక్కువ కులం ఇచ్చి కుల వ్యవస్థ ఆదరించింది. అదేవిధం మొదటి నుంచీ ఇక్కడి వారైన దళితులు కూలీలు గా మిగిలి పోవలసి వచ్చింది. అప్పటి కుల వ్యవస్థ ను అప్పటి భాహ్మణులు రాజులూ సమర్ధించారు. కానీ ఈ వ్యవస్థ లో కూడా అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వలనా, ప్రజాస్వామ్యం వలనా అసమానతలు తగ్గాయి. కానీ ఇక్కడ చేయవలసింది చాలా ఉంది, ముఖ్యం గా గ్రామా ల లో భూమి లేని దళిత వ్యవసాయ కూలీ ల విషయం లో.
ఇక దళితవాదం ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవలసిందే. కానీ ఆ భావం లేని అగ్రకులస్థుడి దగ్గరికి వెళ్ళి వాడికులాన్నితిట్టడం తగదు. దీని వలన ఉద్యమమే కొంతమంది సమర్ధకులనూ, సానుభూతిపరులనూ కోల్పోతుంది. ఇది ఉద్యమానికే నష్టం.ఉద్యమకారులు పోరాటాల గురించిన నిర్ణయాలు తీసుకొనే ముందు, ఈ విధమైన నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకొంటే మంచిది.
ఇక స్త్రీ వాదులు కానీ దళిత వాదులు కానీ తమ పోరాటం ఆధిపత్య భావజాలం మీద కానీ వ్యక్తుల మీద కాదు అంటారు. కానీ ఆధిపత్య భావజాలం వ్యక్తుల బుర్రలలో ఉంటుంది. కాబట్టీ చివరికి వ్యక్తులను లక్ష్యం చేసుకోవటం ఒకానొక దశ లో తప్పదు.ఇలాంటి దశ లో పైన ఉండే సిధ్ధాంత కర్తలకు ఉన్న క్లారిటీ రోడ్డు పైనా, ఊళ్ళలోనూ పోరాటాలూండే సామాన్యులకు ఇది అర్ధమయ్యే అవకాశం తక్కువ. దీనివలన క్షేత్ర స్థాయి లో ఉద్యమ లక్ష్యాలకు విరుధ్ధమైన హింస చోటుచేసుకోవచ్చు.
అదే విధం గా ఆధిపత్య పోరాటాల వలన ఒనకూడే ప్రయోజనం సున్నా. వీటి వలన ఎదుటి వారు అంతా ఏకమయ్యి మళ్ళీ తిరోగమనానికి దారి తీయవచ్చు.
రిచర్డ్ ఫేన్మేన్ మతం,సైన్స్ గురించి ఇచ్చిన ఉపన్యాసాలు
20 మే 2010 అభిప్రాయములు
in సైన్స్ ట్యాగులు:Richard Feynman's lectures
రిచర్డ్ ఫేన్మేన్ ప్రపంచ ప్రసిధ్ధ భౌతిక శాస్త్రవేత్త. ఆయన 1965 లో భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గెలుచుకొన్నారు.
ఆయన సైన్స్, మతం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు ఇక్కడ ఉన్నాయి ఆంగ్లం లో. ఇది కొంచెం పెద్ద డాక్యుమెంట్. తీరిక చేసుకొని అప్పూడప్పుడూ చదవ వచ్చు.
మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…
24 మే 2010 అభిప్రాయములు
మొన్న రిచర్డ్ ఫేన్మాన్ ఉపన్యాసాలు చదవటం పూర్తి చేసిన తరువాత దానిలోని విషయాల గురించి టపా వేద్దామనుకొన్నా. కానీ టైం లేక, వేయలేక పోయాను.
ఇవాళ ఆకాశరామన్న గారి ఉత్తరం చూస్తుంటే ఫేన్మాన్ చెప్పినవి గుర్తుకొచ్చాయి. అలానే అంతకు ముందు మతం గురించి చాలా వేడి వేడి చర్చలే నడిచాయి(కృష్ణ గారి టపా లో ).
వీటన్నిటి ప్రభావం తో ఆకాశ రామన్న గారి టపాలోకామెంటుదామనుకొంటే ఈ కింది చాట భారతం వచ్చింది.
ఇంత వచ్చింది కదా అని కొత్త టపా మొదలెట్టా. ఈ టపా మతానికి అనుకూలమూ కాదు,ప్రతికూలమూ కాదు. దీన్ని “గోడ మీది పిల్లి” టపా అనుకోండి. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కూడా ఉద్దేశింపబడలేదు.
హమ్మయ్య డిస్-క్లెయిమర్లు అయ్యాయి కదా, ఇక నా ఆలోచనలు ఇక్కడ…
ఫేన్మాన్ గారి ఉపన్యాసం వలన నాకు అర్ధమైనది ఏమంటే మతమూ సైన్సూ రెండిటినీ కూడా మనిషి తన బాగు కోసమే అభివృధ్ధి చేసుకొన్నాడు. చూడండి మనిషి ఎంత స్వార్థ పరుడో! కాబట్టీ మనిషి కోసం మతమూ,సైన్సూ. మతమూ,సైన్స్ కోసం మనిషి కాదు. అలానే చివరికి మనిషి కోసం కమ్మ్యూనిజం, కాపిటలిజం మొదలైన సిధ్ధాంతాలు. సిధ్ధాంతాలు సిధ్ధాంతాలకోసం మాత్రం కాదు.
మతం సరైనదై మనిషి దారి తప్పినప్పుడు నాగరిక సమాజం మనిషిని ముందు దారిలోకి తేవాలి.
మతమూలేక సైన్స్ ఒక కత్తి అనుకొంటే, కత్తిని తయారు చేయటం లోనే మనిషికి స్వార్థం ఉంది. అది తన సర్వైవల్. అలాంటి మనిషి కత్తిని స్వార్థం కోసం ఉపయోగించడని గారంటీ ఏమీ లేదు. కత్తిని పొదలను నరికే మంచి పనికీ వాడవచ్చు. అలానే ఎదుటి వాడి గొంతు కోసే చెడ్డ పనికీ వాడ వచ్చు. ఈ రెండిటిలోనూ కత్తి తప్పు ఏమీ లేదు అది ఉపయోగించే మనిహి తప్పు. ఇక్కడి వరకూ సూటి గా ఉంది కదా. సమస్య కొన్ని తుప్పు పట్టిన కత్తులు మనిషి తమను ఎలా ఉపయోగించ గలడో తమ( కత్తుల) చేతుల్లోనే ఉంది అని భ్రమ కలిగించినపుడు…….
సైన్స్ అనేది ఈ ప్రపంచం ఎలా పని చేస్తుందో చెప్తుంది. కానీ మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో చెప్పలేదు. అలానే ప్రపంచం ఎందుకు పని చేస్తుంది? మనుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు సైన్స్ కి తెలియదు. మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో మతం చెప్తుంది. ఐతే ఒక్కోమతం ఒక్కో దిక్కు సూచిస్తుంది. దీని వలన హింస పెరుగుతుంది. అందుకే మానవ జాతి అంతటికీ ఆమోద యోగ్యమైన దారి కనపడే దాకా మనం మన మనసు ని అన్ని మార్గాలకూ తెరుచుకొని ఉంచటం మంచిది.
సైన్స్ పరిశీలనా ప్రధానమైనది. మతం ఇంగితం తో కూడుకొన్నది. సత్య శొధన కు పరిశీలన ఒక్కటే మార్గం కాదు. ఇంగితం కూడా ఒక మార్గమే. ఐతే ఈ మార్గం సైన్స్ లో పనికి రాదు. మతానికి ఇంగితమే (ఇన్ ట్యూషన్) ప్రధానం.
ఇది చదివిన తరువాత మతం యొక్క ఆవశ్యకత గురించి నాకు కొంత క్లారిటీ కలిగింది…
జంతువులకి మతం లేదు. మనిషికి మతం ఉంది. అంటే మనిషి జంతువుల నుంచీ పరిణామం చెంది ఆలోచనలో కొంత స్థాయి వచ్చిన తరువాత మతం వచ్చింది.మతం కంటే ముందే మనిషి లోని లక్షణాలనీ ఏర్పడ్డాయి. కాబట్టీ మనిషి చేసే వెధవ పనులన్నిటికీ మతానిది బాధ్యత కాదు.మతం ఆధీనం లో లేని అనేక విషయాలు మనిషి లో ఉన్నాయి.
అలానే పాపులర్ మతం చెప్పుకొంటున్నట్లు మతం సర్వ రోగ నివారిణి కాదు. మీరు ఎప్పుడైనా క్రీస్తు సువార్త సభలో, లేక కొందరు బాబాల సభలో వింటే వాళ్ళు “మతానికి సాధ్యం కానిది లేదు” అనే భ్రమ కలిగిస్తారు. మీరు మా దేవుడిని/మతాన్ని నమ్మండి ఏదైనా సంభవం అంటారు. బహుశా అసలైన మతాధీశులు (చంద్రసేఖర సరస్వతి వారు కానీ, శంకరాచార్యులు కానీ, లేక క్రీస్తు కానీ) ఇలంటి క్లెయింస్ ఎప్పుడూ చేయరనుకుంటా…! ఒక మతాన్ని నమ్మిన వాడు ఏదైనా నేరం చేయగానే “వాడు నిజం గా మావాడైతే అలా చేయడు. కాబట్టీ వాడు మా వాడే కాదు” అనటం అవకాశ వాదం. నేరం చేసేదాకా మా వాడే అన్నప్పుడు, నేరం చేసిన తరువాత కూడా మా వాడే అనాలి కదా.ఒక మతాన్ని నమ్మినంత మాత్రాన అతని వ్యక్తిత్వాన్ని మతం మార్చలేక పొయింది. ఒక
పెద్ద స్వామి హిందూ మతానికి అత్యున్నతమైన పదవి లో ఉన్నారనుకొందాం. ఆయనకు తెలియని ధర్మం లేదు. కానీ ఇవన్నీ తెలియటం అనేది ఆయనను ఒక హత్య చేయించకుండా ఆపలేక పోయింది అనుకొందాం. హత్య చేయించాడు అని తెలిసిన వెంటనే “ఆయన హిందువే కాదు” అనటం సబబు కాదు. హత్య చేసిన తరువాత కూడా ఆయన హిందువే! కానీ హిందూ మతం తెలిసినంత మాత్రాన, వాటిలో కొన్ని పధ్ధతులు ఆచరించినంత మాత్రాన, మనిషి మంచి వాడైపోడు. అతని లో స్వతహా గా ఉన్న చెడ్డతనం ఎక్కడికీ పోలేదు.(అందరూ ఈ పెద్ద స్వామి లాంటి వారని కాదు. చాలా మంది మతావలంబకులలో మంచి వారే ఉంటారు. ఆ మంచి తనానికి కారణం ఒక్కోసారి మతమే అవుతుంది. ఒక్కోసారి కాదు కూడా.) పెద్ద స్వామి చెడు ఆలోచనని మతం హరించలేక పోయింది.ఈ విషయాన్ని అన్ని మతాలలోని అసలైన ప్రవక్తలు చెప్పినదే.కాక పోతే పాపులర్ మతాలు (బాబాలూ గట్రా) మతం అనేది సర్వ రోగ నివారిణి అని చెప్తాయి. అరచేతి లో వైకుంఠం చూపిస్తాయి.
మత గ్రంధాలు మార్గ దర్శకాలు మాత్రమే. కానీ మమూలు జనాల మూర్ఖత్వం/మూఢత్వం వలన అవి జీవితం లో ఫత్వా ల స్థాయికి దిగజారిపోయాయి.మార్గదర్శకాలు జీవితాన్ని శాసించవు. కానీ నిత్య జీవితం లొ మతాలు రాజకీయాల నుంచీ, ఆర్ధిక సమస్యల దాకా అన్నిటినీ శాసించే స్థాయి కి దిగ జారిపోయాయి. ఈ దిగజారుడు కి మతాని కన్నా జనాల మూర్ఖత్వాన్నే నిందించాలి.
పాపులర్ మతాల వలన కూడా కొన్ని లాభలున్నాయి..పాపభీతి, సమస్యలు వచ్చినప్పుడు దైవం పై ఆశ, నీతి, పధ్ధతి ఇవన్నీ మతం వలననే వచ్చాయి. ఇవిలేకుండా జీవితం ఇంకా దుర్భరమౌతుంది.
బందిపోటు దొంగకి భాగవతం వలన ఉపయోగం ఏమిటి? వాడికి భాగవతాన్ని ఇచ్చినా వాడు అది చదివి మారిపోడు. దాని వలన భాగవతం పనికి రానిది కాదు. అలానే భాగవతం రాసినాయన “బందిపోటు దొంగ భాగవతం చదివి ఆనందించి మారిపోతాడని” చెప్పటం కూడా సరి ఐనది కాదు. వాడికి భాగవతం ఉపయోగం లేనిది. అదే ఏ భక్తుడి చేతిలోనో పడితే అప్పుడు అది ఉపయోగపడుతుంది. అయితే ఈ భక్తులు మన సమాజం లో నానాటికీ తగ్గిపోతున్నారు.జనాలకు తోలు మందం ఎక్కువయ్యింది. అందువలనే ఇలాంటి జనాలని డీల్ చెయ్యటానికి మావోఇజం లాంటి కొత్త హింసాత్మక మార్గాలు పుట్టుకొస్తున్నాయి.
అలానే సైన్స్ కూడా…స్వర్గానికీ నరకానికీ ఒకే తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి మనిషికి సైన్స్ ఇస్తుంది. మసిషి అ తాళం చెవి తో స్వర్గ ద్వారాలు తెరుస్తాడొ, లేక నరక ద్వారాలు తెరుస్తాడొ అతని చేతుల్లో ఉంది. మనిషి నరక ద్వారాలు తెరిస్తే అది సైన్స్ తప్పు కాదు. అలా అని స్వర్గ ద్వారాలు తెరిచినా అది సైన్స్ గొప్పదనం కాదు. సైన్స్ గొప్పదనం తాళపు చెవి ని తయారు చెయ్యటం వరకే! మనిషి స్వర్గ ద్వారాలు తెరవాలా లేక నరక ద్వారాలు తీయాలా అనే విషయమై కొంత మతం అతనికి సలహా ఇవ్వగలదు. కానీ మనిషి మతం సలహా ని పెడచెవిన పెట్టి నరక ద్వారాలు తెరిస్తే మతం చేయ గలిగింది ఏమీ లేదు.తాళపు చెవి తో నరక ద్వారం తెరిచే కంటే, తాళపు చెవి అసలు లేక పోవటమే మంచిది అనిపిస్తుంది, ఈ గ్లోబల్ వామింగ్ కాలం లో. అలానే మతంస్వర్గ ద్వారం తెరవరా నాయనా అంటే, మనిషి నరక ద్వారం తెరిచినప్పుడు కూడా, ఈ మతాలు లేకపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లేక పోతే మనిషి చేత స్వర్గ ద్వారం తెరిపించలేని ఈ మతాలెందుకు అనిపిస్తుంది. సమస్య అంతాఈ మనిషి తోనే వచ్చింది అని తిట్టుకోవటం మన స్వప్రేమకు అడ్డు కదా! కానీ సమస్య అంతా మనిషి మానసికవ్యవస్థ తోనే వచ్చింది. ఈ వ్యవస్థ ని గాడిలో పెట్టనంత వరకూ మతానికి ప్రయోజకత్వం రాదు.
ఇక పోతే నాస్తికత్వం గురించి…నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే. ఎందుకంటే,మీరు ఒక నాస్తికుడిని “ఈ విశ్వం ఎక్కడినుంచీ వచ్చింది? దీనిని ఎవరు సృష్టించారు” అని అడిగితే, “నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం లేడు”, అని చెప్తాడు. అంటే ఇదీ ఒక నమ్మకమే.కాబట్టీ మతం గురించి మనం పైన చెప్పుకొన్న వాటిలో నాస్తికత్వానికీ, కమ్యూనిజానికీ కూడా వర్తిస్తాయి. కాకపోతే నాస్తికుడికి, ఆస్తికుడిలా పెద్ద ప్రవర్తనా నియమావళి ఉండదు. నాస్తికుడికి పాప భీతీ దైవ భీతీ ఉండకపోవటం వలన వాడు అంతరాత్మ లేని వాడైతే వాడి వలన సమాజానికి చాలా నష్టం. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అని అడిగితే, “నాకు తెలియదు. అది నా ఊహ కు అందని విషయం” అనే వాడిని ఇంగ్లీష్ లో ఆగ్నోస్ట్ అంటారు.
మనిషికి ఈ కాలం లోకూడా చాలా వరకూ ఆచరణ శీలమైన విలువల వ్యవస్థ ల లో కుటుంబ వ్యవస్థ ఒకటి. మనిషి పరిణామ క్రమంలో జ్ఞాపక శక్తి, అంతశ్చేతన పెరగటం వలన జంతువుల నుంచీ వేరుపడ్డాడు. అందువలన ఈ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అమ్మా నాన్న అక్కా తమ్ముడూ అనే భావాలు ఇలాంటివే. కాబట్టీ మనిషి భౌతికమైన, పరిణామ పరమైన అవసరాలకు అనుగుణం గా ఏదైనా విలువల వ్యవస్థ ఉంటేనే అది తట్టుకొని నిలబడుతుంది. “ఈ అవసరాలకు భిన్నం గా ఉన్న వ్యవస్థను” ఆచరించే వారు కరువౌతారు. అప్పుడు ఆ వ్యవస్థ మార్గదర్శకాలకూ, ఆ వ్యవస్థ లోని మనుషుల ప్రవర్తన కూ మధ్య అంతరమెక్కువౌతుంది. ఆచరణ సాధ్యం కాని ఏ విలువల వ్యవస్థ ఐనా ఉపయోగం లేనిది గా తయారౌతుంది. కేవలం పుస్తకాలకే పరిమితమౌతుంది. ఆచరణ లో పెట్టలేని గొప్ప విలువల వలన ఉపయోగం లేదు. అలాని ఏ బంది పోటు దొంగో తనకు అనుగుణం గా వ్యవస్థ లోని విలువలను దిగజార్చమనటం కూడా సరి కాదు. విలువలు ఉండాలి కానీ అవి ఆచరణాత్మకం గా, మానవాళి సమిష్టిమరియూ వ్యక్తిగత మనుగడ కిమంచి చేసేవి గా ఉండాలి. ఒక యుగంలో ఉన్న విలువలు వేరొక యుగం లో అవసరం లేనివి ఔతాయి కాబట్టీ ఈ విలువలు కూడా చలనశీలమైనవి. మంచి చెడులు చలనశీలమూ, సాపేక్షమూ ఐనట్లే సమాజపు విలువలు కూడా.
కొత్త వ్యవస్థ ఏదైన తీసుకొని వచ్చేటపుడు, అది ఉన్న వ్యవస్థ కంటే మెరుగైనది గా ఉండాలి. కొత్త వ్యవస్థ మెరుగైనదా కాదా అనే విషయం, కొత్త వ్యవస్థ ని పరిమితం గా ఒక ఊళ్ళొనో, ఒక జిల్లాలోనో ఒక ప్రొటో టైప్ లా ప్రవేశపెట్టి అది సాధ్యమా కదా,ఒక వేళ సాధ్యమైతేఅది పాత వ్యవస్థకన్నా మెరుగైనద లేదా అని చూడాలి. ఒక వేళ మెరుగైనదైతే, దానిని పరిమిత కాలం పాటు విస్తరించి చూడాలి. అప్పుడు కూడా కొత్త వ్యవస్థ లో లోపాలు కనబడితే దానిని వెనుకకు తీసుకొనేటందుకు సిధ్ధం గా ఉండాలి. చివరికి కొత్త వ్యవస్థే మెరుగైనదైతే దానిని కొన సాగించాలి. అంతే గానీ కమ్యూనిజం లా “కొండ నాలిక కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది” అన్న చందాన ఉండకూడదు.
ఇంకా చాలా విషయాలున్నాయి కానీ..అవన్నీ మళ్ళీ ఇంకొక సారి…?(మీకు చదివే ఓపిక ఉంటే..)
ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…
25 మే 2010 అభిప్రాయములు
in సమాజం
ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…
హర్యానా లో ఖాప్ పంచాయితీ లు ఒకే గోత్రం లో వివాహాలకి అడ్డు చెప్తున్నాయి. దీని గురించి సో కాల్డ్ స్త్రీ వాదులూ, “ఎన్ జీ ఓ లూ”, కోర్ట్ లూ చాలా గందర గోళం చేస్తున్నారు.
ఇదే విషయం మన రాష్ట్రం లో తీసుకొంటే, ఒకే కులంలో, ఒకే ఇంటి పేరు లేక గోత్రం కల స్త్రీ పురుషులు వరుసకు అన్నా చెల్లెళ్ళు కానీ, అక్కా తమ్ముళ్ళు కానీ అవుతారు. మరి అలాంటి వారి మధ్య వివాహ సంబంధాన్ని మనం ఆమోదిస్తామా? ఇప్పుడు ఇలాంటి సంబంధాలను ఆమోదిస్తే తరువాత కుటుంబ వ్యవస్థ గతేమిటి. అప్పుడు ఇన్సెస్ట్ తో కూడిన సంబంధాలను కూడా ఆమోదించవలసి వస్తుంది కదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలేమిటి?
మైనారిటీలకే నా మద్దతు…
08 జూన్ 2010 అభిప్రాయములు
in కవితా గోస
మైనారిటీలకే నా మద్దతు…
రిజర్వేషన్లు లేని అగ్రకుల పేదలకూ,
రిజర్వేషన్లు అందని పల్లెటూరి దళితులకూ,
కోడళ్ళ నిరాదరణ కు గురైన ముసలి దంపతులకూ,
గృహహింస చట్టం కింద చిత్రహింస అనుభవిస్తున్న పురుషులకూ,
ఇంట్లో వంటా, ఆఫీస్ లో ఒత్తిడీ తప్పని ఉద్యోగిణులకూ,
నాగరికత దెబ్బకి ఆడంగులౌతున్న మగాళ్ళకూ,
ఇంట్లోకే ప్రవేశించిన వ్యవస్థ వివక్ష కు రోదిస్తున్న మగపిల్లలకూ,
సంఖ్యాబలం లేని సమస్త కులాలకూ ,
తెలంగాణలోని సమైక్య వాదులకూ,
సకల ఉద్యమాల పీడితులకూ,
రాజకీయ సవ్యత పేరుతో నలిగిపోతున్న వర్గాలకూ,
నమ్మకం కోల్పోని, నమ్మకముంచే మనుషులకూ,
ప్రజా స్వామ్యం చేసే మెజారిటీ సంఖ్యల దంధా కి కుములుతున్న జనాలకూ,
న్యాయం పేరుతో చలామణి అవుతున్న అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళకూ,
వ్యాపార విలువలకు వలువలూడ దీసే వాళ్ళకూ,
డబ్బు కి దాసోహం కాని వాళ్ళకూ,
స్వార్ధాన్ని సామర్ధ్యం గా భ్రమించని వాళ్ళకూ,
కులం కంటే గుణం మంచిదని నమ్మే వాళ్ళకూ,
వేలం వెర్రుల ప్రవాహం లో పడి కొట్టుకుపోని వాళ్ళకూ,
ప్రకృతి ని నాశనం చేసే దిశ లో పోని వాళ్ళకూ,
మైనారిటీలకే నా మద్దతు…
వ్యసనాలు..కొన్ని ఆలోచనలు..
15 డిసెం 2010 అభిప్రాయములు
in మేధోపరం ట్యాగులు:వ్యసనాలు, happiness More stats
Some additions…if you’ve already read ..never mind
నాకు తెలిసిన ఒక స్నేహితుడు అతని ఉద్యోగంలో చాలా పైకి ఎదిగాడు. ఓ రోజు, అతని తో పిచ్చాపాటీ మాట్లాడుతున్నప్పుడు, అతను, “జీవితం లో ఇప్పటి కంటే డబ్బు లేనప్పుడే సంతోషం గా ఉండేదబ్బా..!” అన్నాడు.
కానీ, నాకనిపించిందేమిటంటే, అతను తన ఎదుగుదల (సక్సెస్) కి అలవాటుపడి పోయాడు. అతను ఉద్యోగం లేని రోజులలో కంటే ఇప్పుడు సంతోషం గా ఉన్నప్పటికీ, ఇప్పటి సంతోషానికి ‘అలవాటు’ పడిపోయాడు. అంతకు ముందు పడిన కష్టాలను తాత్కాలికం గా మరిచిపోయాడు. క్రితం లో ఉన్న జీవితమే బాగుంటే, అతను తన ఉద్యోగాన్ని విడిచి పెట్టాలి కదా? కానీ అలా చేయటంలేదంటే అంతకు ముందు జీవితంకంటే ఇప్పటి జీవితమే బాగుంది.కానీ పూర్వం అతనికి కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు అతను చాలా సంతోషపడటం నాకు గుర్తు. అతను ఇప్పుడు ఆ సంతోషాన్ని అనుభవించటంలేదంటే, మనిషి సంతోషాన్ని తన జీవితం లోని సుఖం యొక్క స్థాయి పెరిగినప్పుడు మాత్రమే అనుభవిస్తాడనుకొంటా! కొత్త గా వచ్చిన సుఖం స్థాయికి తరువాత క్రమేణా అలవాటు పడి, మనిషి చేతన లో నుంచీ సంతోషం మరుగుపడుతుంది అనిపిస్తుంది.
నా స్నేహితునికి మళ్ళీ సంతోషం రావాలంటే మళ్ళీ ఉద్యోగం లోఏదో ఒక పదోన్నతి రావాలి. సంతోషం కోసం మళ్ళీ జీవితంలో ఒక స్థాయి పైకి ఎదగాలి. ఈ విధమైన మెట్లు ఎక్కే ప్రక్రియ కి అంతంలేదు. అలానే, రాజకీయ నాయకులకు ఒక పదవి వచ్చిన తరువాత ఇంకొక పదవి పైకి దృష్టి మళ్ళుతుంది. దీనికీ అంతం లేదు.
మనిషి కోరిక కి అంతంలేక పోవటం అంటే ఇదేనేమో! ఈ విధమైన ప్రక్రియ అంతటినీ వ్యసనం అనవచ్చు. దీనికీ మాదక ద్రవ్యాలకి అలవాటు పడటానికీ సాంకేతికం గా పెద్ద తేడాలేదు.
తాగుడు కి అలవాటు పడితే శరీరం గుల్ల అవుతుంది. ఇదిఒక నష్టం.సమాజంలో గౌరవం పోతుంది. సక్సెస్ కీ, అధికారానికీ అలవాటు పడితే దాని వలన వ్యక్తికి నష్టం లేదు. పైగా చాలా ఇతర లాభాలు ఉన్నాయి. సమాజం లో పేరు రావటం, చుట్టూజనాలు చేరటం, భార్యా పిల్లల దగ్గరా చుట్టాలలో గౌరవం పెరగటం, వగైరా. మనిషి అధికార దాహం వలన సమాజానికి నష్టం అనేది వేరే విషయం.
కొందరికి సినిమాలు వ్యసనమైతే,మరి కొందరికి టీవీ సీరియళ్ళు వ్యసనం. ఈ వ్యసనాల వలన నేరు గా పెద్ద నష్టాలు లేవు. కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. జీవితం లో ఉద్యోగం, కుటుంబం, ఆటలూ,స్నేహితులూ,సాంస్కృతిక కార్యక్రమాలూ మొదలైన వాటి మధ్య ఒక సమతూకం ఉండాలి. ఒక పని చేయటం వలన వలన వచ్చే ఆనందాన్ని ఇంకొక పని వలన వచ్చే ఆనందం భర్తీ చేయలేదు. ఉదాహరణ కి తినటంవలన వచ్చే ఆనందాన్ని, మైధునం వలన వచ్చే ఆనందం భర్తీ చెయ్యలేదు. అలానే స్నేహితుల తో సరదా గడపటం వలన వచ్చే ఆనందాన్ని, ఉద్యోగం లో వచ్చే ఆనందం రీప్లేస్ చెయ్యలేదు. కాబట్టీ మనిషి టీవీ చూడటంలాంటి ఒక నిరపాయకరమైన విషయానికి అడిక్ట్ అయ్యినప్పటికీ, అతను జీవితం లో మిగిలిన ఆనందాలను కోల్పోతున్నాడనే చెప్పాలి. ఒక్కోసారి మిగిలిన వాటిని నిర్లక్ష్యం చేయటం వలన కష్టాలు కూడా రావచ్చు. టీవీ సీరియళ్ళకు అడిక్ట్ అయ్యిన గృహిణి భర్త సాన్నిహిత్యాన్నీ ఆప్యాయతనూ కోల్పోయే ప్రమాదముంది.
అలానే బూతు సినిమాలు చూడటానికి అలవాటు పడటం వలన సమాజం లో చులకన అవ్వటమే కాకుండా, ఉద్యోగం చదువూ ఇతర రంగాలలో వెనుకపడి జీవితం లో దెభ్భ తినే అవకాశం ఉంది..తను చేసే పని నైతికం గా తప్పు అనే న్యూనత ఎలానూ ఉంటుంది.
బూతు సినిమాలలాంటివి పరిమితం గా అదుపు (కంట్రోల్) లో ఉంటూ చూడ వచ్చా..? ‘కంట్రోల్’ అనేది జీవితం లో ఇతర రంగాల నుంచీ ఆనందం పొందుతున్న వారికి సాధ్యం. అలానే, ఒక మనిషి కి ఒక పని వలన ఎనలేని ఆనందం వస్తున్నప్పుడు,మిగిలివ పనుల వలన పెద్ద సంతోషం లేనప్పుడు, ఎక్కువ ఆనందం వచ్చే పనికి అతను అడిక్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రేమ లో విఫలమయ్యిన వాళ్ళు తాగుడుకి బానిస అయ్యినట్లు.
సినిమా నటుడు ప్రకాష్ రాజ్ చిన్నప్పుడు తన తండ్రి వలన పొందలేక పోయిన ప్రేమని తరువాత ప్రేక్షకుల ప్రశంశల ద్వారా పూడ్చుకొన్నట్లు చెప్పాడు. ఇలాంటి కొన్ని భావోద్వేగ విషయాల్లో ఒక రకమైన ఆనందాన్ని ఇంకొక రకమైన ఆనందం రీప్లేస్ చెయ్యగలదు. పిల్లలు పుట్టినతరువాత తల్లికి భర్త మీది నుంచీ దృష్టి పిల్లల మీదికి మళ్ళటం సహజమైనట్లు..
ఇక పోతే, “తినగ తినగ వేము తియ్యగుండు..” అన్నాడు వేమన..
కానీ “పాడిందే పాట రా పాసి పళ్ళ దాసరా” అనికూడా అంటారు.
ఒకే పనిని పదే పదే చెయ్యటం వలన దానికి అడిక్ట్ అవ్వుతారా?, లేక, దానితో విసుగు చెందుతారా? ఆ పని చేదుదైతే దానిలోని చేదు పోతుంది. కానీ తీయనిదైతే వెగటుపుడుతుంది కదా!
ఒక వ్యసనానికి అడిక్ట్ అయ్యిన వాళ్ళు, ముందు దాని వలన ఎక్కువ సంతోషం పొందుతారు.తరువాత సుఖం నెమ్మదిగా తగ్గుతుంది. కానీ అలవాటు వలన, ఆ వ్యసనాన్ని వదిలిపెట్టినప్పుడు మానసిక వ్యధపెరుగుతుంది. వెంటనే మళ్ళీ మామూలు గా అవ్వటానికి వ్యసనాన్నే ఆశ్రయించాల్సి వస్తుంది.
మనకిష్టమైన పాట మొదటిసారి విన్నప్పుడు సంతోషం గా ఉంటుంది.మళ్ళీ వెంటనే వింటే సంతోషం తగ్గుతుంది. ఇలా నాలుగైదు సార్లు వెంటనే వింటే అది విసుగు పుడుతుంది. మనని ఎవరైనా కట్టేసి అదే పాటని వంద సార్లు వినిపిస్తే అదే పాట నరకమౌతుంది. ఇక్కడ మన మెదడు లో భావోద్వేగాలు కల్పించే న్యూరో ట్రాన్స్మిటర్లు మొదటి సారి బాగానే పని చేస్తాయి. తరువాత వాటి సరుకు నిండుకుంటుంది. మనకు ఎప్పుడైతే బోర్ కొట్టిందో అప్పుడు మన ఆనందం నెగటివ్ లోకి వెళ్ళిందన్నమాట. అప్పుడు పాటని కట్టివేస్తాం. మళ్ళీ తరువాత ఏ రెండు నెలలకో అదే పాటని విని ఆనందించగలం, మొట్టమొదటి సారి అంతకాక పోయినా…అలానే భావోద్వేగాల విషయం లో న్యూరోట్రాన్స్మిటర్లు చేసిన పనిని సెక్స్ విషయం లో హార్మోన్లుచేస్తాయి. కానీ, అడిక్షన్ విషయం లో అలా కాదు. మొదటి సారి తాగిన కిక్ తరువాత తగ్గుతుంది… కానీపాట విషయంలోఅయ్యినట్లు అది బాధించే బోర్ గా తయారవ్వదు. ఆ కిక్ ఒక తటస్థ (న్యూట్రల్) స్థాయి లో ఉండి, అది లేనిదే బతకలేని విధం గా తయారవుతాం.
మనం భోజనం రోజూ చేస్తాం అయితే భోజనానికి మనం అడిక్ట్ ఎందుకు అవ్వం? తిండి తినటం అనేది ఒక అంతం లేని చక్ర భ్రమణ ప్రక్రియ (సైక్లికల్ ప్రాసెస్). ఆకలీ …తిండి..ఆకలీ తిండీ..ఇది ఒక భౌతిక ప్రక్రియ..నాలుగు రోజులు అన్నంలేకుండా మాడబెట్టి,తరువాత అన్నం ముందు పెట్టి, నిన్ను కంట్రోల్ చేసుకో అంటే ఎవరికీ సాధ్యంకాని పని. అప్పుడు ఎవరికైనా తినాలనే యావ (కంపల్షన్) కలుగుతుంది. అలాంటి కంపల్షనే అడిక్ట్ అయ్యిన వారికీ ఉంటుంది. జంతువులలో తినటం ఒకభౌతిక ప్రక్రియ మాత్రమే..కానీ మనుషులలో దీనికి మానసిక కోణం కూడా ఉంది.
జీవితంలో మొట్టమొదటి అనుభవాలు సాటిలేని ఆనందాన్ని ఇస్తాయి. అలానే సాటిలేని దుఖాన్ని కూడా మిగులుస్తాయి.నాకు జీవితంలో మొట్ట మొదటి సారి కూల్ డ్రింక్ తాగిన అనుభవం ఇంకా గుర్తుంది. మొదటి మామిడి కాయ తిన్నప్పుడు చాలా బాగుంటుంది. తరువాత తిన్నప్పుడు మొట్ట మొదటి సారి తిన్నంత మజా ఉండదు. మొదటి సారి తాగిన జ్ఞాపకం మెదడులోనమోదయ్యి, రెండవసారి తాగిన అనుభవానికి అడ్డుపడటం వలన, రెండవ సారి మన ఆనందంలో ఉండే వ్యత్యాసం (డిఫరెన్షియల్ వాల్యూ) తగ్గిపోతుంది.
ఒక మనిషి ఒక విషయానికి అలవాటు పడిన తరువాత, దానికి సంబధించిన కోరిక అతని చేతనావస్థ (కాన్-షస్-నెస్) నుంచీ కలగటం తగ్గుతుంది. మెదడులోని కణాలు మార్పుకి లోనవ్వుతాయి. దీని వలన, అది అతని అంతశ్చేతన (అన్-కాన్-షస్) లో భాగమౌతుంది. అప్పుడు అతనికి ఏదో తెలియని శక్తి తనని అడిక్షన్ వైపుకి లాక్కుపోతున్నట్లు అనిపిస్తుంది. సిగరెట్ తాగేవాళ్ళకి, సిగరెట్ గుర్తు రాని వాతావరణం లో కూడా సడన్ గా సిగరెట్ తాగాలనిపించటం ఇందుకు ఒక ఉదాహరణ.
చివరిగా, వ్యసనం అంటే స్థూలం గా ఏదైనా ఒక విషయానికి జీవితంలోని సమతౌల్యాన్ని దెబ్బతీసే విధం గా,మితిమీరి అలవాటుపడటం. ఒక్కో వ్యసనం వలన నష్టాలు ప్రత్యక్షం గా ఉంటే ఇంకో వ్యసనం వలన పరోక్షంగా ఉంటాయి.ఒక్కొ వ్యసనం వలన తక్కువ నష్టాలుంటే వేరొక దానివలన ఎక్కువ నష్టాలుంటాయి. జీవితం లో ఆనందించటానికి అనేక మార్గాలున్న వ్యక్తి వ్యసనాలబారిన పడే అవకాశం తక్కువ. వ్యసనాలబారిన పడికూడా జీవిత సమతౌల్యత దెబ్బతిన కుండా ఉండాలంటే ఆవ్యక్తి చాలా ‘ప్రతిభ’ కలవాడై ఉండాలి. కాబట్టీ జీవితం లో సమతౌల్యత ముఖ్యం. చిన్న మోతాదులో మందు అయ్యినది పెద్దమోతాదులో విషం అవ్వటం వ్యసనాలకి బాగా వర్తిస్తుంది.
మనిషి మెదడు కీ, శరీరానికీ ఉన్న పరిమితుల వలన శాశ్వతమైన ఆనందం అనేది కుదరని విషయం. తృప్తి పడటం కూడా మనిషి జీవన చర్య లో ఒక భాగం కావాలి. కొంత మంది ఎప్పుడు చూసినా ఉల్లాసం గా కనిపిస్తారు. మానసికం గా, శారీరకం గా ఆరోగ్యకరమైన సమతౌల్యమైన జీవితాన్ని గడపటం ద్వారా మనిషి తన లో ఉన్న ఆనందపు స్థాయి ని పెంచుకోవచ్చు.
“పరిమిత మోతాదు లో అయితే మందు”, అనే సూత్రానికి మాదక ద్రవ్యాలూ, అంతర్జాల శృంగారం (డ్రగ్స్, సైబర్ సెక్స్) మినహాయింపులు. ఎందుకంటే, వీటి విషయం లో, చిన్న మోతాదులో పుచ్చుకున్నది కొంత కోరిక ని తీర్చినా, అదే సమయం లో మరింత కోరిక ని కలిగిస్తుంది. అప్పుడు మన సంకల్పం మన అదుపులో ఉండదు. కాబట్టీ డ్రగ్స్ వంటి వాటికి పూర్తిగా దూరం గా ఉండటం మంచిది. వీటి విషయం లో “అడుసు తొక్కనేల?, కాలు కడుగనేల?” అనే సామెత వర్తిస్తుంది.
కొంతమంది కవిత్వం పట్లో, క్రికెట్ పట్లో లేక తమ ప్రియురాలి పట్లో ఒక తపన తో (పాషనేట్ గా) ఉంటారు. మరి పాషన్ కూడా ఒక అడిక్షనేనా?
సాంకేతికం గా చూస్తే, ” ‘అంతరాత్మ అనుమతీ,సమాజం అనుమతీ ఉన్న అడిక్షన్ ‘ నే పాషన్ అంటారు”, అనిపిస్తుంది.
సమాజంలో మెజారిటీ వ్యక్తులకి సాధారణమైన ప్రతిభ ఉంటుంది. అసాధారణమైన ప్రతిభ ఏ కొద్దిమందికో ఉంటుంది. సాధారణమైన టాలెంటూ, తెలివీ కల వ్యక్తులు ఏదైనా ఒక రంగం లో పేరు సంపాదించాలంటే, వారు ఆ రంగం లో చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే, వారి సమయం లో హెచ్చు భాగాన్ని ఆ రంగానికి కేటాయించాలి. దీని వలన వారి జీవితం లోని మిగిలిన పార్శ్వాలు నిర్లక్ష్యం చేయబడతాయి.ఇది కూడా ఒక విధమైన వ్యసనమే! అసాధారణమైన ప్రతిభ కలవారు మాత్రం ఏ రంగం లోనూ అతి శ్రమ పెట్టకుండా సమ తూకం పాటించగలరు.
మనం ప్రస్తుతం అనేక విషయాలకు బానిసలమయ్యి ఉంటాం. ఇవి కూడా వ్యసనాలే. కానీ మనకు మనం ఒక వ్యసనం లో ఉన్నాం అనే విషయం తెలియదు. వ్యసనానికి అంతరాయం కలిగినపుడు కదా వ్యసనం లో ఉన్నాం అని తెలిసేది! ఉదాహరణకి మనం విద్యుత్ (కరెంటు) కి దానితో పని చేసే ఉపకరణాలకీ అలవాటు పడి ఉన్నాం. ఏదైనా కరెంటు లేని పల్లెటూరికి వెళ్ళినప్పుడు, కరెంటు లేని పరిస్థితి లోని ఇబ్బంది కారణం గా మన ఈ వ్యసనం బయట పడుతుంది.
అలవాటు లన్నీ వ్యసనాలేనా? మనం ఏ అలవాటు మీద ఆధారపడి, అవిలేకుండా చాలా ఇబ్బంది పడతామో అవన్నీ వ్యసనాలే. వ్యసనం లో ఆధారపడటం (డిపెండెన్సీ ) ఉంటుంది.మంచి అలవాటు లో డిపెండెన్సీ ఉండదు. వ్యసనం కుంటివాళ్ళు వాడే ఊత కర్రలాంటిదైతే, అలవాటు పొద్దున్నే నడక కి వెళ్ళేటపుడు ఏ కుక్క నో కొట్టడానికి మనం దగ్గరుంచుకొనే పొన్ను కర్ర (వాకింగ్ స్టిక్) లాంటిది.
మరి పిల్లలమీద ప్రేమా, భార్య మీద ప్రేమా,స్నేహితుడి మీది అభిమానం ఇవన్నీ వ్యసనాలా? ఎందుకంటే ఒక్కోసారి మనం భార్య లేకుండా ఉండలేం. ఒక్కోసారి పిల్లలు లేకుండా “జీవితం ఎంత దుర్భరమో కదా!” అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకమైన డిపెండెన్సీ నే కదా?
భావోద్వేగపరమైన మానవ సంబంధాలలో “మానసికం గా ఆధారపడటం” అనేది ఒక సకారాత్మక (పాజిటివ్) అంశం. కానీ ఈ అధారపడటం అనేదానికి సమాజంకొన్ని పరిమితులు విధించింది. ఇక్కడ వ్యసనాన్ని సమాజం దృష్టి నుంచీ చూడాల్సి వస్తుంది.అలానే, ఆధారపడటం వలన జీవితం లోని ఇతర పార్శ్వాలు కుంచించుకుపోకుండా ఉంటే అప్పుడు మనం ఆధారపడిన విషయం వ్యసనం అవ్వదు.
ఈ ప్రకారం చూస్తే, పిల్లల పై ధృతరాష్ట్రుడి కి ఉన్న ప్రేమ లాంటి ప్రేమ నిస్సందేహం గా వ్యసనమే. అలానే కైక పై దశరధుడికి ఉన్న ప్రేమ కూడా వ్యసనమే.
సమాజం సమర్ధించే వ్యసనాలు కూడా ఉన్నాయి. అతి ప్రేమ, అతి మంచితనం మొదలైన వాటిని సమాజం పాజిటివ్ గా చూస్తుంది. తన భర్త చనిపోయాడని ఆత్మ హత్య చేసుకోబోయిన స్త్రీ గురించి జనాలు “భర్తంటే ఎంత ప్రేమా” అని ఎంతో గొప్ప గా చెప్పుకోవటం నేను విన్నాను. ఒక కమ్యూనిస్టు నాయకుడు తనకున్న ఆస్తినంతటినీ కూలీలకీ , పార్టీ కి రాసిచ్చి, చివరికి సొంత ఇల్లుకూడా లేక, పార్టీ ఆఫీసు లో నే పడుకొని నానా కష్టాలు పడటం గురించి కూడా ప్రజలు గొప్ప గా చెప్పుకోవటం నేను విన్నాను.కొందరి వ్యసనాల వలన సమాజానికి ఎన లేని మేలు జరుగుతుంది. గాంధీ గారు, పటేల్ వంటి నాయకులు దేశ ప్రజలకోసం, దేశ భవిత కోసం తమ జీవితాలనే ధారబోశారు. కానీ వ్యక్తి గతం గా గాంధీ గారి కొడుకే ఆయన ఒక “గొప్ప నాయకుడే కానీ, గొప్ప నాన్న కాదు”, అని చెప్పాడు. ఆయా నాయకులంతా తమ యావత్సమయాన్నీ ప్రజా జీవితానికే కేటాయించటం వలన, కుటుంబం తో గడిపే సమయం తక్కువైన వారే!
నా మిత్రునితో ఈ వ్యాసం గురించి చర్చిస్తుంటే ఇలా అన్నాడు: “వ్యసనాలని వదిలించుకోవాలని ప్రయత్నించడమూ ఒక వ్యసనమే!”.
నా మిత్రుని వాదాన్ని కొనసాగిస్తే ఈ “వ్యసనాన్ని వదిలించుకొవాలనే వ్యసనాన్ని” వదిలించుకోవాలనుకోవటమొక వ్యసనం…ఇలా అంతం లేకుండా, ఒక ఇన్-ఫినిట్ లూప్ లో చెప్పుకుపోవచ్చు. కానీ ఇదంతా వాదనాపరమైనదే (తీరిటికల్). క్రియాత్మకం (ప్రాక్టికల్) గా వ్యసనం ఒకరి జీవితం లో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాలి,దాని మీద డిపెండెన్సీ ఉండాలి, దాని వలన మిగిలిన జీవిత భాగాలు నిర్లక్ష్యం చేయబడాలి. ఈ లక్షణాలన్నీ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకొనే కోరిక కి ఉంటే ఆ కోరిక కూడా వ్యసనమే!
గుండె ఎలా పనిచేస్తుందో తెలిసిన వాడికి గుండె జబ్బు రాకుండా పోదు కదా..? అలానే నాకు ఈ వ్యాసాన్ని రా…రా…స్తూపోవటం ఒక వ్యసనమయ్యినట్లుంది. ఇక ఉంటా!
స్వేఛ్ఛాఇఛ్ఛ, లేక ఫ్రీ విల్, ఉందా..లేదా..?
19 డిసెం 2010 అభిప్రాయములు
in మేధోపరం
ఒక ఆకలి గా ఉన్న కుక్క కి మాంసం ముక్క దొరికిందనుకోండి, అది వెంటనే ఆ ముక్కని తినేస్తుంది. దాని కోరిక కు తినాలా వద్దా అనే ఛాయిస్ లేదు. అంటే దాని విల్ ఆకలి కి బానిస.
ఆ మాంసం ముక్క పక్కన ఎవరైనా ఒక దుడ్డు కర్ర పట్టుకొని నిలబడితే, కుక్క కి భయం వేస్తుంది. కానీ ఆకలి వలన తినాలని కూడా అనిపిస్తుంది. కుక్క ఆ మాంసం ముక్క ని తింటుందా లేదా అనేది ఆ క్షణం లో ఆ కుక్క భయం యొక్క మరియూ ఆకలి యొక్క ఉమ్మడి ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. కుక్క కి ఆకలి మరీ ఎక్కువైతే తన్నులను లెక్క చేయకుండా ముక్క తినటానికి ప్రయత్నిస్తుంది. దానికి తన్నుల భయం ఎక్కువైతే బ్రతికుంటే తరువాత తినవచ్చులే అన్నట్లు గా అక్కడి నుంచీ జారుకొంటుంది. ఈ సంఘటన లో కుక్క కి ఉన్న ఆప్షన్లు పెరిగాయి. విల్ కి ఉన్న డిగ్రీ ఆఫ్ ఫ్రీడంపెరిగింది.
మనిషి కుక్క కంటే చాలా సంక్లిష్టమైన జీవి. మీరు మధ్య యుగాల నాటి ఒక రాజు అనుకోండి. మిమ్మల్ని వేరొక రాజు యుధ్ధం లో ఓడించి కటకటాలలో పెట్టి, నాలుగు రోజులు భోజనం లేకుండా మాడ్చి, అప్పుడు ఒక అన్నం గిన్నె మీ ముందుకు తోశాడనుకొందాం. మీరు అభిమాన ధనులైతే అన్నం తినరు. ఆన్నం తినకుండా చనిపోవటానికి కూడా రెడీ. మీకు ఆకలి ఎక్కువైతే అభిమానాన్ని పక్కన పెట్టి అన్నం తింటారు. ఇక్కడ కూడా మీ కోరిక ముందు ఉన్న ఆప్షన్లు పెరిగాయి.
మీరు మళ్ళీ ఒక చక్రవర్తి అయ్యారు…ఊరికే…అనుకోండి. శతృ దేశపు రాజు మీ మీదికి దండెత్తి వచ్చి మీకు మూడు ఆప్షన్స్ ఇచ్చాడు.
1. ఓడిపోయినట్టు ఒప్పుకొని రాజ్యాన్ని స్వాధీన పరచి మీరు సామంత రాజులు గా మారటం.
2.ఆయనకు కొన్ని ధన కనక వాహనాదులు సమర్పించి సంధి చేసుకోవటం.
3. యుధ్ధానికి సిధ్ధపడటం.
కానీ మనిషి గా మీరు బుధ్ధి జీవి. ఆలోచనలు ఉన్నాయి. మీకు అనుభవం కల మంత్రులు ఉన్నారు. వారికి ముందు మూడు తరాల చరిత్ర తెలుసు. ఇక ముందు రెండు తరాల లో ఏమి జరుగ బోతోందో ఊహించి చెప్ప గల దిట్టలు ఆ మంత్రులు. అప్పుడు మీరు ఆ మంత్రులను సమావేశ పరిచి, సమాలోచనలు జరిపి, శత్రు రాజు ఇచ్చిన ఆప్షన్ ల తో పాటు మీకు వేరే ఏ ఏ ఆప్షన్లు ఉన్నాయో కనుక్కొంటారు. తరువాత మీకూ ప్రజలకూ ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకొంటారు. ఇక్కడ మీరు తీసుకొన్న నిర్ణయం కూడా శత్రు రాజు ఇచ్చిన ఆప్షన్లు,మంత్రులు ఇచ్చిన సల హాలూ, వారి తెలివి తేటలూ,మీదృష్టి లో ప్రజలకి ఏది మేలు చేస్తుంది.. మొదలైన కారణాలకి లోబడి ఉంటుంది. ఒక్క సారి ఒక నిర్ణయం తీసుకొన్న తరువాత, ఆ నిర్ణయం అమలు చేయటం మీ చేతులలో పని. కానీ ఆ నిర్ణయం వలన వచ్చే ఫలితం మీ చేతులలో ఉండదు. ఒక వేళ యుధ్ధం చేయాలని నిర్ణయించుకొంటే,యుధ్ధం లో గెలవగలగటం పూర్తిగా మీ చేతులలో ఉండదు. కానీ యుధ్ధం చేయాలని నిర్ణయం తీసుకున్న వెంటనే యుధ్ధం మొదలు పెట్టటం మీ చేతులలోనే ఉంది. ఒకవేళ మీరు తిక్కల రాజు అయ్యి ఉండి ఒక ర్యాండం డెసిషన్ తీసుకున్నా కూడా,ఆ డెసిషన్ వెనుక ఏవో కొన్ని సైకలాజికల్ డైనమిక్స్ కారణం గా ఉంటాయి. ఇక్కడ మనిషి ఇఛ్ఛ కి డిగ్రీ ఆఫ్ ఫ్రీడం పెరగటం మనం చూస్తాం. ఇది చాలా వరకూ మనిషి ఆలోచనా శక్తి వలన.విల్ కి ఉన్న డిగ్రీ ఆఫ్ ఫ్రీడం మరింత పెరిగింది. కానీ మనిషి ఇఛ్ఛ ఇంకా కొన్ని కారణాల వలన పుట్టి,కొన్ని పరిమితులకి లోబడే ఉంది.
ఫ్రీ విల్ అంటే ఏమిటి? మనిషి కోరిక కి కారణాలు లేకుండా ఉండటమా? లేక మనిషి ఏ నిర్ణయమైనా తీసుకోగలగటమా? మనిషి కోరిక కి కారణాల నుంచీ మినహాయింపులేదు. ప్రతి కోరికకీ ఏవో కొన్ని కారణాలు ఉంటాయి. ప్రతి నిర్ణయం వెనుకా ఏవో కొన్నిశక్తుల కలయిక ఉంటుంది. మనిషి ముందున్న ఆప్షన్లలో దేనిని ఎంపిక చేసుకొంటాడూ అనేది కూడా అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుంది. ఈకారణాలలో మనిషి వ్యక్తిత్వం కూడా ఒకటి. పిరికి వ్యక్తిత్వం కలవాడు యుధ్ధం చేయాలనే నిర్ణయం తీసుకోలేదు.కాబట్టీ పిరికి వాడికి యుధ్ధం విషయం లో ఫ్రీ విల్ పని చేయనట్లే.మనిషి వ్యక్తిత్వమే అనేక కారణాల సమాహారం. మనిషి జీవితం లో అతని ఇఛ్ఛ మీద అధారపడని అనేక అంశాలు కూడా ఉంటాయి. ఒక సారి తాజ్ మహల్ చూసిన వాడు తాజ్ మహల్ ను మరిచిపోవాలనుకొన్నా మరిచి పోగలడా? ఇక చేతులతో కొండలని పిండి చేయటం లాంటి అనేక విషయాలు మనిషి ఇఛ్ఛ కి వెలుపల ఉన్నవే.
ఇఛ్ఛకీ ప్రయత్నానికీ కల సంబంధం ఏమిటి?పరిస్థితుల వలన మన ఇఛ్ఛ ఏర్పడితుంది. కానీ మన ఇఛ్ఛ కి కూడా పరిస్థితులని మార్చేశక్తి ఉంది. నాకు కారు డ్రైవ్ చేయటం రాదు. కానీ, డ్రైవ్ చేయాలనే ఇఛ్ఛ ఉంది. ఇఛ్ఛ కలిగిన వెంటనే ఒక కారు బయటకి తీసి డ్రైవ్ చేయలేను. ఒక మనిషి సహాయం తో డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ నేర్చుకొని ఆ రిఫ్లెక్సెస్ మన అంతశ్చేతనలో భాగమయ్యాక మనకు డ్రైవింగ్ వచ్చేసినట్లే. అప్పుడు డ్రైవ్ చెయ్యాలనిపిచిందే తడవు గా కారు బయటికి తీసి డ్రైవ్ చేయవచ్చును. అంటే మన విల్ వలన ముందు గా ఉన్న పరిస్థితిని, అంటే డ్రైవింగ్ రాకపోవటాన్ని అధిగమించి, డ్రైవింగ్ వచ్చే స్థితి లోకి చేరాం. ఈ పరిస్థితి కి కారణం మనం చేసిన ప్రయత్నం . ఇప్పుడు డైవ్ చేయటం మన విల్ పరిధి లోనిది అయ్యింది.
ఫ్రీ విల్ అనేది . ఒక కట్టుగొయ్యకి కట్టబడిన గేదె లాంటిది అంటారు. దాని స్వేఛ్ఛ తాడు పొడవు కి లోబడి ఉంటుంది. ఇక్కడతాడు పొడవు అనేది పరిస్థితులను సూచిస్తుంది. మనిషికి తన ఇఛ్ఛ యొక్క కారణలైన పరిస్థితులను అధిగమించి స్వేఛ్ఛ సంపాదించే శక్తి లేదు అని ఈ కట్టుగొయ్య ఉదహరణ భావం. కానీ దీనికి మనం ఒక విషయాన్ని అదనం గా చేరచవచ్చు. అదేమిటంటే ఆ తాడు రబ్బర్ లా సాగే ఎలాస్టిక్ తాడు. దాని పొడవుని మన యొక్క విల్ పవర్ లేక ప్రయత్నం వలన పెంచ వచ్చును. “కారు తోలే శక్తి” మొదట కారు నేర్చుకోనక పూర్వం మన తక్షణ ఇఛ్ఛ పరిధికి బయట ఉంది. కానీ మన ప్రయత్నం వలన అది మన ఇఛ్ఛ పరిధి లోకి వచ్చేసింది. అంటే తాడు పొడవు పెరిగినట్లే. అయితే ఎలాస్టిక్ తాడు కొంత పొడవు తరువాత మరి సాగదు. అలానే ప్రయత్నం వలన సాధించే విషయాలకూ ఒక పరిధి ఉంటుంది. ఎవరైన కదిలే రైలుని ఎప్పటికైనా తమ చిటికెన వేలు తో ఆపగలం అనుకొంటే అది అమాయకత్వమే కదా…
అలానే, ఒక్క సారి డ్రైవింగ్ నేర్చుకొన్న తరువాత ఆ రిఫ్లెక్సెస్ మనలో భాగమౌతాయి. తరువాత వాటిని వదిలించుకోవటమనేది మన విల్ పరిధిలో లేని అంశం.
మొత్తం మీద చూసినట్లైతే, ఫ్రీ విల్ అనేది మౌలికం గా పరిస్థుతుల తో ఏర్పడిన ఒక ఆకృతి మత్రమే. మనం చిన్న చిన్న మేకులతో నేల మీద ఒక పక్షి ఆకారం వచ్చేలా అమర్చామనుకోండి. అక్కడ పక్షి ఉన్నట్లా లేనట్లా? పక్షి అనేది ఒక ఆకారం గా మాత్రమే ఉన్నది. కానీ భౌతికం గా అక్కడ ఉన్నది మేకులు మాత్రమే. అలానే, ఫ్రీ విల్ అనేది ఫ్రీ గా కనిపిస్తుంది. ఒక మనిషి ఏ క్షణం లోనైనా ఒక నిర్ణయం తీసుకొన్నాడంటే దాని వెనుక తెలిసింటువంటీ, మరియూ తెలియనటువంటీ అనేక భౌతిక, మానసిక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని అంతర్గత కారణాలైతే, కొన్ని బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాలు. ఈ కారణాలను అధిగమించి, ఏ కారణం వలనా కాకుండా, మనిషి ఏదైన నిర్ణయం తీసుకొంటే అది ఫ్రీ విల్ అవుతుంది. కానీ, మన నిర్ణయాలమీద బిగ్ బ్యాంగ్ నుంచీ జీవ పరిణామం వరకూ అనేక విషయాల ప్రత్యక్ష,పరోక్ష ప్రభావం ఉంటుంది. ఈ కారణాలు కనపడేవి కావు. మనిషి నిర్ణయమే కనపడుతుంది. మనిషి నిర్ణయం వెనుక కారణం కనపడనంత మాత్రాన కారణం అసలు లేనట్లు కాదుకదా.
ఈ ప్రపంచం మొత్తం ఒక పరుగెట్టే రైలు బండి లాంటిదైతే, అందులో ఉన్నఒక ప్రయాణికుడి లాంటిదే ఫ్రీ విల్. ఆ ప్రయాణికుడి కి రైలు భోగీ లో ఏ మూలకైనా పోయే స్వేఛ్ఛ ఉంది. కానీ రైలు బండి ప్రయణిచే దిక్కుని బట్టే ఈ ప్రయాణికుడు ప్రయాణించే దిక్కు ఉంటుంది.
జనాల మీదకి బూమరాంగ్ కా బోతున్న జనాలతీర్పు
22 డిసెం 2010 అభిప్రాయములు
in రాజకీయం ట్యాగులు:politics andhra
ఈ మధ్య నితీష్ కుమార్ బిహార్ ఎన్నికల్లో గెలవటం గురించి మీడియా “ఇది అభివృధ్ధికి ప్రజలు వేసిన వోటు” అని ఊదరకొట్టింది. కానీ నాకు నమ్మబుధ్ధి కాలేదు.
మన రాష్ట్రం లోనే ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే …
చంద్ర బాబు ఎన్నికల్లో గెలిచి రెండవ సారి అధికారం లోకి వచ్చాడు. అప్పుడు కూడా మీడియా ఇలానే అభివృధ్ధి కీ వోటు అని చెప్పింది.
తరువాత చంద్ర బాబు నా దృష్టి లో మంచివైన రెండు విషయాలలో సరిగా వ్యవహరించాడు.
1. దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవటం…. విద్యుత్ సంస్కరణల విషయం లో కానీ, …అనేక కార్పొరేట్ సంస్థలను రాష్ట్రానికి తీసుకొని రావటం లో కానీ చంద్ర బాబు చేసినది సరైనదే అనుకొంటాను
2. ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిష్పాక్షికత: కొంతవరకూ, పార్టీ కీ వంది మాగధులకూ ప్రభుత్వం లో ప్రాబల్యాన్ని తగ్గించటం.దీని వలన దిగువ స్థాయి లో అవినీతి ని తగ్గింది.
కానీ తరువాతి ఎన్నికలలో ఈ రెండు పధ్ధతులూ చంద్ర బాబుకి వ్యతిరేకం గా పని చేసి అతన్ని మట్టిగరిపించాయి. వై ఎస్ ఆర్ ఉచిత విద్యుత్తూ, ఇతర వరాలూ, సామాజిక, రాజకీయ సమీకరణ లూ అతన్ని ముఖ్యమంత్రిని చేశాయి.
వై ఎస్ ఆర్ చంద్ర బాబు కి పూర్తి భిన్నం గా వ్యవహరించి అస్మదీయులకు పట్టం గట్టారు. అనేక ప్రజాకర్షక పధకాలు ప్రవేశ పెట్టి రెండవ సారి కూడా అధికారం లోకి రాగలిగాడు.
ఈ సమయం లో చంద్ర బబు తన గుణపాఠాలను నేర్చుకొన్నట్లు కనపడుతోంది. ఆయన రైతుల పేరు తో దీక్షలు చేస్తున్నారు.ఉచిత వాగ్దానాలు చేస్తున్నారు. వీటన్నిటితోనూ జనాలలో ఆవేశ కావేశాలను రెచ్చగొట్టి మళ్ళీ వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన మళ్ళీ అధికారం లోకి వస్తే ఇక దీర్ఘ కాలిక విధానాలకు ఇంతకు ముందు ఇచ్చిన ప్రాముఖ్యత ఇవ్వక పోవచ్చు. అలానే అస్మదీయులను ప్రభుత్వ కార్యకలాపాల నుంచీ దూరం గా పెట్టేతప్పు? చేయక పోవచ్చు.
ప్రజాస్వామ్యం లో ఉన్న ఒక లొసుగు ఏమిటంటే “జనాలకు తగ్గ పాలకులు” వస్తారు. యధా ప్రజా తధా రాజా. అలానే జనాలు తీసుకొనే అనాలోచిత నిర్ణయాలకు చివరికి జనాలే బలవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు జనాల ను ఎలా మభ్య పెట్టి అధికారం లోకి రావాలా అని చూస్తాయి. అందుకే జనాల తీర్పు జనాలమీదికే బూమర్యాంగ్ అవుతుంది.
ఈ కథ లో ఒక లోపం ఉంది..ఏమిటో కనిపెట్టండి చూద్దాం..!
11 Feb 2011 అభిప్రాయములు
in కథలు
ఈ కథ లో ఒక లోపం ఉంది అది ఏమిటో కనిపెట్టండి చూద్దాం..!
బాగుపడిన మనుషులు…కథ……………………
కొత్తగా కట్టిన వంతెన పక్క బస్సు దిగి, ఎడమ వైపుకి నడవ సాగాడు రామారావు. రేవు మీది నుంచీ తేమ గాలి సాగింది. సులాబీ దిగితే అన్నీపూల మొక్కల నర్సరీలే. హైదరాబాదు మురికి వాయువులు అలవాటైన రామారావు కి, మొక్కల గాలి తగిలి ప్రాణం లేచి వచ్చింది. ఆ గాలికి, మనసుకూ ఇంద్రియాలకూ శరీరానికీ ఒక స్వస్థత చేకూరుతుంది. అతని మనసు చుట్టూ ఉన్న వాతావరణానికి అంతకుముందులేని సున్నితత్వంతో స్పందించసాగింది.
నీటిపారుదల శాఖ బంగళాలనూ వాటి ముందున్న ఫిరంగిబొమ్మనీ దాటుకొని, పాడుబడిన ఎత్తిపోతల పధకాన్ని దాటుకొని, ముందుకు వెళ్తే వచ్చింది చిన్నప్పటి బడి. అతను వెంటనే బడి లోనికి వెళ్ళకుండా కాసేపు చుట్టూ కలియ తిరిగాడు. బడి పక్కనే కరకట్ట. దాని అవతల కృష్ణమ్మ, తెల్లటి ఇసుక మధ్య మధ్య న సన్న సన్నటి నీటి పాయలతో, చిక్కి శల్యమైపోయింది. పైన, అక్కడక్కడా ఉన్న మబ్బులకి రేవు లో కొంత ఇసుక చలవ గా సేదతీరుతోంటే, మరికొంత వేడి గా మెరుస్తోంది.స్కూలు మునుపటిలాలేదు..చాలా మార్పు వచ్చింది.. స్కూలు మెయిన్ బిల్డింగ్ పక్కన అదనం గా రెండు భవనాలు వచ్చాయి. పిల్లలు మాత్రం తక్కువ గా కనపడుతున్నారు. గ్రౌండ్ లో వాలీ బాల్ కోర్ట్ లో పిచ్చి మొక్కలు మొలిచాయి.
బళ్ళో కి వెళ్ళి హెడ్ మాస్టరుకు పరిచయం చేసుకొని వాకబు చేస్తే అభిరాం గాడు ఇంకా రాలేదని తేలింది. హెడ్మాస్టర్ అటెండర్ ని పిలిచి రామారావు బ్యాగ్ ని తీసుకెళ్ళి రూం లో పెట్టమన్నాడు.
హైదరాబాదు నుంచీ అతను త్వరగానే రాగలిగాడు.అభిరాం బెంగుళూరు నుంచీ చేరటానికి సమయం పడుతుందికదా..! చిన్నప్పుడు ఇదే స్కూల్లో చదువుకున్నా కాలప్రవాహంలో పడి, అభిరాం బెజవాడ లో ‘సీ యే’ చేస్తే, రామారావు వైజాగులో ఇంజినీరింగు చేశాడు. తరువాత ఉద్యోగాన్వేషణలో అభిరాం బెంగుళూరుకీ రామారావు హైదరాబాదుకీ చేరారు. ఐతే, అన్ని ప్రవాహాలూ సముద్రంలోకే అన్నట్లు ఇద్దరూ ‘ఐ టీ’ రంగం లోనే స్థిర పడ్డారు.
వారిద్దరికీ స్కూల్లోనే రెండు గదులు ఏర్పాటు చేశామని చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు.రామారావు స్కూల్లో రెండు కంప్యూటర్లకి డబ్బులిస్తే, అభిరాం స్కూలు లైబ్రరీ భవనానికి విరాళమిచ్చాడు. “ఆమేరకి హెడ్మాస్టర్ నా పై శ్రధ్ధ చూపిస్తున్నాడులే” అనుకొన్నాడు రామారావు.
ఆటెండర్ కి వయసు మీద పడింది. అతను బ్యాగు ని ఎత్త లేక అవస్థ పడుతుంటే, “నే పట్టుకుంటానులే తాతా!” అని రామారావు తీసుకొన్నాడు.
“అటెండర్ ని ఎక్కడో చూసినట్లేఉంది..ఆ… ఇతని పేరు ఆశీర్వాదం కాదూ..,అప్పుడే ఎంత ముసలాడయిపోయాడు! చిన్నప్పుడు బాస్కెట్ బాలు కోర్ట్ పర్యవేక్షణ చూసుకొనేవాడు. అప్పుడప్పుడూ తను కూడా తమ ఆటలోఓచెయ్యి వేసి, “ఇలా చులాగ్గా ఎగిరి..అలా వొదిలెయ్యాలి బాబూ!” అని చూపించేవాడు”.
“ఏం అశీర్వాదం బాగున్నావా?”
“ఆ..ఏదో..బాగున్నాను బాబూ” అని “మీరు ఏ బాచీ బాబూ?” అని అడిగాడు.
“నీకు అభిరాం గుర్తుండాలే..నేను వాడి బాచే… “ఇంతకీ స్కూలెలా ఉంది ఆశీర్వాదం?”, రామా రావు భోగట్టా చేశాడు..
“ఎనకటి కన్నా చానా తగ్గిపోలా..! ఊళ్ళో పిల్లలందరూ ప్రైవేటు కాన్వెంటులకి పోతున్నారు..మీరున్నప్పుడు సందడి వేరు.అప్పుడున్న మేస్టర్లెవరూ ఇప్పుడ్లేరు. చానా వరకూ రిటైర్ అయ్యిపోయారు..కొంతమంది ట్రాన్సిఫరయ్యిపోయారు.”.
రామారావు ఆలోచనల లో పడిపోయాడు…. “నిజమే స్కూల్ మారిపోయింది..ఆశీర్వాదం మారిపోయాడు నేను మారిపోయాను. కానీ స్కూలును చూస్తే గతం లోకి వెళ్ళి మళ్ళీ ఆ జీవితాన్ని గడిపిన అనుభూతి. ..కానీ ఇది అనుభూతే…! మారిన స్కూలుని చూసినందువలన..మారిన నాలో పెల్లుబికిన జ్ఞాపకాల ప్రభావం…నేను స్కూలులో చదివినప్పటి వాస్తవం ఎప్పుడో కాల గర్భంలో కలిసి పోయింది. అది మళ్ళీ రావటం అసంభవం…!”
అశీర్వాదం గది తలుపు తెరిచి వెళ్ళిపోయాడు. క్లాస్ రూం లో బల్లలన్నీ ఒక పక్కకు నెట్టి దాన్ని ఒక గది లా చేయించినట్లున్నాడు ప్రధానోపాధ్యాయుడు. పక్కనే ఎక్కడి నుంచో రెండు మంచాలు తెచ్చి వేశారు.
రామా రావు ఎడమ పక్క ఉన్న మంచం మీద వెల్లకిలా పడుకొంటే పాత జ్ఞాపకాలు కమ్ముకొన్నాయి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
అభిరామూ రామారావూ ఇదే స్కూల్లో పదో తరగతి వరకూ చిదివారు. అభిరాం డాడీ ‘పీడబ్ల్యూడీ’ లో ఇంజనీరు. వాళ్ళు సులాబీ పక్కన క్వార్టర్లో ఉండేవాళ్ళు . వాడి నాన్న జీపులో తిరిగేవాడు. ఆయన ఎప్పుడూ ధీమాగా, ప్రశాంతం గా ఉండే వాడు. ఆయనకి పై రాబడి ఎక్కువని రామారావు కి వాళ్ళ రైతుల ఇళ్ళలో అనుకోవటం ఆ వయసులోనే గుర్తు. అభిరాం అమ్మ చాలా నైసు గా ఉండి చాలా తక్కువ గా మాట్లాడేది. ఆమె కి ఊళ్ళో ఏవరి తోనూ పరిచయాలు ఉన్న దాఖలాలు తక్కువ. ఆ గ్రామం లో ఉండే రైతు కుటుంబాల ఆడవాళ్ళ తో పరిచయాల కోసం ఆమె కి ఏమంత ఆసక్తి కూడా ఉండేది కాదనుకొంటాను.
రామారావు నాన్న ఓ చిన్న రైతు. వాళ్ళ అమ్మ ఇంటి పనులు చూసుకొనేది.
స్వభావం లో అభీ ఉత్తర ధృవమైతే రాము దక్షిణ ధృవం. అభీ కి ఆటలూ సరదాలూ ఎక్కువ. స్కూల్లో నలుగురిని వేసుకొని అల్లరి చెయ్యటం చెట్లెక్కటం మెండు. రాము మాత్రం నిశ్శబ్దం గా అతని పనేదో చేసుకొనే వాడు. ఇంకా సమయముంటే లైబ్రరీకి వెళ్ళి పత్రికలూ కథలూ చదివేవాడు. అభీ క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూడటం వలన వాడికి రాము నోట్సులతో పని బడేది. అభీ అర్ధం కానిది చెప్పించుకోవడానికి ఒక్కోసారి “కలిసి చదువుకుందాం” అని వాళ్ళింటికి రాము ని పిలిచేవాడు. రాము క్లాసు ఫస్ట్ అని తెలిసో ఏమో అభీ వాళ్ళ అమ్మ నాన్నా కూడా ఏమీ అభ్యంతర పెట్టేవారు కాదు.
అభీని క్లాస్ లీడర్ గా నియమించింది క్లాస్ టీచర్. అందరి దగ్గరా హోంవర్క్ పుస్తకాలు సేకరించి టీచర్ కి ఇవ్వటం. టీచర్ బయటికి వెళ్ళినప్పుడు క్లాస్ గలభా చెయ్యకుండా చూడటం వాడి బాధ్యతలు. ఎవరైనా వాడితో పోట్లాట పెట్టుకుంటే అలాంటి వాడి మీద టీచర్ కి చాడీలు చెప్పటం అభీ గాడి హక్కు. టీచర్ ముందు మాత్రం అభీ గాడు చాలా వినయం గా ఉండే వాడు. ఆమె చెప్పిన పని తూ.చ. తప్పకుండా అమలు చేసే వాడు. దాంతో క్లాస్ లో పిల్లలందరూ అభీ గాడంటే కొంచెం అదుపులో ఉండే వారు.
అభీ గాడి నాన్న కి వెస్పా స్కూటర్ కూడా ఉండేది. ఏడో తరగతికి వచ్చేటప్పటికి అభీ గాడు ఆ స్కూటర్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు. అప్పుడప్పుడూ రాము ని కూడా ఎక్కించుకొని ఇంటిదగ్గర దింపేవాడు.
ఓ రోజు అభీ రాము ని సెకండ్ షో సినిమాకి లాక్కు పోయాడు. ఆ రోజు లెక్కల మాస్టరిచ్చిన హోంవర్క్ ఇంక అవ్వలా. రాము సినిమా చూస్తున్నా అతని మనసు హోం వర్క్ చెయ్యలేదన్న టెన్షన్ లో పడింది. సినిమా లో రాజేంద్రప్రసాదు జోకులకి పైకి అందరితో పాటు ఇకిలించాడేకానీ, లోపల గుండె పీచు పీచు మని పీకుతోనే ఉంది. ఆ రాత్రి ఒంటి గంటకి ఇంటికొచ్చిన తరువాత దీపపు వెలుగులో కూర్చొని లెక్కల మాస్టరు ఇంటికిచ్చిన లెక్కలు చేశాడు. అయితే, మరసటి రోజు అభీ గాడు మాత్రం ఏ మాత్రం తొణకకుండా, “నిన్న రాత్రి మా డాడీ మమ్మల్ని పెళ్ళికి తీసుకు పోయారు సార్..హోంవర్క్ చెయ్యటం కుదర్లేదు..” అని చెప్పి తప్పించుకున్నాడు.
అభీ గాడు లెక్కలమాస్టర్ని తేలికగా ఏమార్చాడు. కానీ,హెడ్ మాస్టర్ని మాత్రం ఏమార్చలేక పోయాడు. ఆయనకసలే చండ శాసనుడని పేరుండేది. మనిషి చూడటానికి పొట్టిగా ఉన్నా, ఆకతాయి కుర్రాళ్ళని మాత్రం గట్టి దెబ్బలే కొట్టేవాడు.అందుకే ఆయనంటే స్కూలందరికీ హడల్.
స్కూల్లో అభీ గాడికి ఒక బాచీ ఉండేది. అభీ గాడు రామూ కి ఉన్న ఒకే సూర్య గ్రహమైతే, అభీ గాడి చుట్టూ ఉండేసవాలక్ష గ్రహాల్లో రామూ ఒక బోడి గ్రహం.
ఒక రోజు అభీ గాడి బాచీ వాళ్ళు పదో తరగతి బాచీ వాడినొకడిని కబడ్డీ లో కుమ్మేశారు. ఈ విషయాన్ని పదోతరగతి బాచీ వాళ్ళు హెడ్మాస్టర్ కి కంప్లయింట్ చేశారు. దాంతో హెడ్ మాస్టర్ కోపం తో ఊగిపోతూ క్లాస్ కి వచ్చి, “అభీ గాడంటే ఎవర్రా..?” అని అడిగాడు. అభీగాడు కనపడినవెంటనే ఆశీర్వాదాన్ని పిలిచి,”నా రూం లో ఈత బెత్తాలున్నాయి తీసుకొని రా..!”,అన్నాడు.
తరువాత ఈత బెత్తాలన్నీ తుక్కయ్యేటట్లు అభీ గాణ్ణి కొట్టి, క్లాస్ లో మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ పారేశాడు, “ఇక ముందెవరన్నా పిచ్చి పిచ్చి గలాటాల్లోకి దిగారంటే మీకు గూడా ఇదే గతి!” అని. క్లాస్ లోఆడ పిల్లకాయలైతే బిక్క చచ్చి పోయి ఓ రెండు రోజులు మాటలు ఆపేశారు. కానీ మరో రెండు రోజుల తరువాత వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టినాక తెలిసింది, ‘ఆడ పిల్లలలో అభీ గాడికి సానుభూతి పెరిగి పోయింది!’. తరవాతి ఆదివారం అభీ గాడు క్లాసుమేట్ దుర్గ ని తన స్కూటరెక్కించుకొని మంగినపూడి బీచికి తీసుకెళ్ళాడని రాము కి తెలిసింది. రాము వాడిని ఒంటరి గా ఉన్నప్పుడు ‘ఈ మాట నిజమేనా!’ అనడిగాడు. వాడు ముందు బుకాయించి తరువాత,”నీకు గాబట్టీ చెప్తున్నా, ఇంకెవరికీ చెప్పొద్దు”, అని..”నేను దాన్ని బీచి దగ్గర ఇంగ్లీషు ముద్దు కూడా పెట్టుకున్నాను”, అని చెప్పాడు.
తొమ్మిదో తరగతి లో ఉండగా ఓ సారి అభీ రామూ కలిసి స్కూటర్ మీద పోతున్నారు. హై స్కూల్ గేట్ దగ్గర పదో తరగతి వాళ్ళు స్కూటర్ని అటకాయించారు. అభీ స్కూటర్ దిగి స్టాండ్ వేసే లోపు వాళ్ళు మీద పడి వాడిని పిడి గుద్దులు గుద్ద సాగారు. రాము కి భయమేసి ఏమి చేయాలో తోచలేదు. కాసేపటికి గుండె చిక్కపట్టుకొని పెద్ద గా అరిచాడు. “అడిగో హెడ్ మాస్టర్..! అడిగో హెడ్ మాస్టర్..! పారిపొండి…!పారిపొండి!” దాంతో పదో తరగతి వాళ్ళంతా చెల్లా చెదురయ్యారు..రాము అభీ ని లేపి, కూర్చోబెట్టి, పక్క బడ్డీ కొట్టులో ఒక గోళీ సొడా తెచ్చి తాగించాడు. ఇక అప్పటి నుంచీ అభీ కి రాము అంటే మంచి గురి ఏర్పడి పోయింది.
పదో తరగతి లో అభీ ‘ఎస్పీ ఎల్ ” గా పోటీ చేసినప్పుడు,వాడికి రాము కరపత్రాలన్నీ రాసి పెట్టాడు. ఎలక్షన్లలో అభి గాడు ఊరి ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఆ ఊరి వాళ్ళందరూ అభి గాడికి ప్రత్యర్ధి గా నుంచున్న సీను గాడికి ఓట్లు వెయ్యకూడదన్నాడు. ఎందుకంటే సీను గాడి ఊరు పక్కనున్న తుమ్మలపాలెం. వాళ్ళ ఊళ్ళో స్కూల్ లేక, వాడు ఈ ఊరి హై స్కూల్లో చదువుకొంటున్నాడు. కానీ ఎలక్షన్లలో అభీ గాడి ‘ఊరి ఫీలింగ్’ కిటుకు పని చెయ్యలా. సీను గాడే గెలిచాడు. అభీ గాడు ఓడిపోవటం తో రాము చాలా డీలా పడిపోయాడు. కానీ, అభీ మాత్రం మరుసటి రోజుకల్లా మామూలు మనిషైపోయి, “పదరా, చిరంజీవి సినిమా పసివాడి ప్రాణం ఆడుతోందంటా!” అన్నాడు.
పదో తరగతికి వచ్చిన తరువాత రాము డిటెక్టివ్ నవలలూ సస్పెన్స్ నవలలూ మాని కొంచెం ఉత్తమసాహిత్యం చదవటం మొదలెట్టాడు. అభీ మాత్రం మసాల సినిమాలు మానలేదు. ఎప్పుడన్నా సస్పెన్స్ నవల ఉంటే చదివే వాడు. వాడికి సినిమా లో గానీ నవల లో కానీ మజా కావాలి.
టెంత్ క్లాస్ మధ్యలో అభీ నాన్న కి విజయవాడ ట్రాన్స్ ఫర్ అయ్యింది. వాళ్ళమ్మ మాత్రంక్వార్టర్ లోనే ఉండేది. రాము ప్రతి రోజూ సాయంత్రం అభీ ఇంటికెళ్ళే వాడు. అక్కడినుంచీ ఇద్దరూ ఏదో ఓ సినిమాకి చెక్కేసే వాళ్ళు. సాధారణం గా రాము కి నచ్చిన సినిమా అభీ కి నచ్చేది కాదు. సినిమా అయ్యిపోయినాక దాని గురించి వాదులాడుకొనే వాళ్ళు.”అబ్బే.. ఇదేం సినిమా..? మరీ నెమ్మదిగా ఉంది..సినిమా అంటే కిక్ ఇవ్వాలి”, అనేవాడు అభీ. సాధారణం వాళ్ళ ఇద్దరి అభిరుచులూ దేంట్లోనూ కలిసేవి కాదు.
అభీ కి వాలీ బాల్ చాలా ఇష్టమైతే రాము కి చెస్ ఇష్టం. “చెస్ కూడా ఒక ఆటా…! కదలకుండా ఇంట్లో ఫర్నీచర్లా ఆడేది ఏదీ ఒక ఆట కాదు” అనే వాడు అభీ.
రాము పది మాటలు మాటలు మాట్లాడితే అందుకు అభీ ఓ రెండు ముక్కల్లో సమాధానం ఇచ్చేవాడు. అభీ తన కుటుంబ విషయాలు ఎప్పుడూ చెప్పే వాడు కాదు. రామూ మాత్రం అభీ అడగక పోయినా తన ఇంటి దగ్గర విషయాలు ఏకరువు పెట్టే వాడు.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
స్కూల్లో రూం బయట కారు వచ్చిన శబ్దమై రాము వెళ్ళి తలుపు తెరిచాడు. బ్లూ బ్లేజర్ వేసుకొని,కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని,నిల్చొన్నాడు అభీ. అతను మంచి అందగాడి గా తయారయ్యాడు. డ్రైవర్ కి , “కారు పక్కన పార్క్ చేసుకో, రాత్రి ‘టెన్ ఓ క్లాక్’ కి మళ్ళీ రిటర్న్ జర్నీ”, అని చెప్పి రూం వైపుకి అడుగులేశాడు.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
“చాలా రోజులైపోయింది మనిద్దరం కలిసి.. త్రీ ఇయర్స్ అవ్వలా?..బెంగుళూరు సెమినార్ లో లాస్ట్ టైం మీట్ అయ్యామనుకొంటా..” అన్నాడు అభి ఓ కుర్చీ దగ్గరికి లాక్కుని కూర్చొని మంచమ్మీద కాళ్ళు పెట్టుకొంటూ..
చిన్నప్పటి తో పోలిస్తే అభి భాష చాలా మారిపోయింది. అతను మాట్లాడే దాంట్లో తెలుగు పదాల కంటే ఇంగ్లీషు పదాలు ఎక్కువైనాయి. ఇదే రాము అభి తో అంటే , “మనిషి అడాప్ట్ అయ్యిపోవాలి రా..వి నీడ్ టు బి లైక్ ఎ రోమన్ ఇన్ రోం. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని వినలా..? ” అన్నాడు అభి.
“సర్వైవ్ అయ్యే పిచ్చి తో నన్ను నేను పోల్చుకోలేని విధం గా తయారవ్వటం నాకు ఇష్టం లేదు రా..అయినా.. డార్విన్ థీరీ ‘ప్రకృతి లోని పరిస్థితులకి ప్రాణుల లో ర్యాండం గా కలిగే జన్యు మార్పులు సరిపడక పొతే ఆ ప్రాణులు అంతరిస్తాయి’ అని చెప్తుంది. దానికీ, స్వ ప్రయోజనమే పరమార్ధం గా ఉండే కార్పొరేట్ ప్రపంచానికీ, చాలా తేడా ఉంది రా..డార్విన్ థీరీ ని ఇక్కడ అన్వయించలేం.”, అన్నాడు రాము.
“మనమందరం మారతాం..అంటే చిన్నప్పుడు ఏర్పడిన మన వ్యక్తిత్వం లోని కోర్ అలానే ఉంటుంది అనుకో..కానీ మనలో మిగిలినదంతా మారేదే…. నీ లాగా… ఏట్లో బండ రాయి లా ఉంటే ఎలా?”
రామారావు మాత్రం,”అసలు డార్విన్ థీరీ ప్రాణులలో ఏ ఏ లక్షణాలను ప్రకృతి లోని మార్పులు….” అని ఇంకేదో చెప్పబోయాడు.
అభీ మధ్యలోనే అందుకొని, “ఒరేయ్ రామూ, నువ్వేమీ మారలేదు రా. నీ ఆలోచనలు ఇంకా భూమ్మీదకి రాలేదు…అంతా కాన్సెప్ట్యువల్ థింకింగ్..నేనేదో అడాఫ్ట్ అవ్వాలి అని బుధ్ధి తక్కువై అన్నానే అనుకో..నువ్వు ఎక్కడికో జన్యు మార్పుల లోకి వెళ్తే ఎలా రా..? నువ్వు ప్రజెంట్ లోకి వచ్చెయ్. ఎవరికున్న పరిస్థితులలో వాళ్ళు బతకాలి రా” అని నవ్వసాగాడు.
“కాన్సెప్ట్యువల్ థింకింగ్ నుంచే సృజనాత్మక ఆవిష్కరణలు జరుగుతాయోయ్..దాన్ని తీసిపారేయకు”
వాళ్ళిద్దరూ మొదటి నుంచీ ఇంతే.ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి వాదులాడుకుంటూనే ఉంటారు.
“అహా…అయితేఈ గది లో కూర్చొని..నీ బుర్ర తో మాత్రమే ఆలోచించి సైన్సూ, మెడిసినూ, ఇంజినీరింగూ, పెయింటింగూ, ఫుట్ బాలూ,హాకీ అన్నీ నేర్చేసుకో రా నువ్వు”, అని, “మనిషి బుర్రకున్న తెలివి చాలా పరిమితమైనది రా.. ముందు ప్రపంచం లో పడి ఇన్-ఫర్మేషన్ పట్టుకుంటే గానీ, తరువాత ఆ పట్టుకున్న ఇన్-ఫర్మేషన్ మీద ఆపరేట్ చెయ్యటం కుదరదు మన బుర్రకి….సరే…ఈ వాదాలకేం గానీ..భారతీ,పాపా ఎలా ఉన్నారు”,అని రామూ భార్యా కూతుళ్ళ గురించి అడిగాడు అభీ.
అభీకింకా పెళ్ళి కాలా. పెళ్ళి కాకుండానే అతను ఓ కంపెనీలో డెలివరీ డిపార్ట్ మెంట్ కి హెడ్ అయ్యాడు. నేరు గా “సీ ఈ ఓ” కే రిపోర్ట్ చేయటం. రాము చిన్నప్పుడు అభీకన్నా చదువు లో చాలా ముందున్నప్పటికీ, ఉద్యోగ పరం గా అతని కంటే చాలా వెనకబడిపోయాడు. ఓ చిన్న కంపెనీ లో టీం లీడ్ గా చేస్తున్నాడు.
ఇద్దరూ ఒకరి ఉద్యోగం గురించి వేరొకరు అడిగి తెలుసుకొన్నారు. అభీ, “మోర్ దేన్ హాపీ..” అన్నాడు.
రామారావు కి తన ఉద్యోగం ఏమాత్రం నచ్చటంలా. ఉద్యోగం లో చేరిన మొదట్లో ఒక ప్రాజెక్ట్ నుంచీ వేరొక ప్రాజెక్ట్ కి విసిరేసే వాళ్ళు..ఐనా ఏమీ అనలేని తన నిస్సహాత్వానికి తన మీదే తనకు చాలా కోపంగా ఉండేది. ఫాలో అప్ పేరు మీద వాళ్ళ టీం లీడ్ గంటకో సారి అతని సీట్ దగ్గరికి వచ్చి “హౌజ్ ఇట్ గోయింగ్?” అంటూ ఉంటే”, వాడిని ముక్కుమీద గుద్దాలనిపించేది. జీతం గురించి అడగొద్దు..బఠాణీ గింజల జీతం…
వాళ్ళ టీం లీడ్ తిట్టినప్పుడు తనది తప్పు ఉందని తెలిసినా, వాడి మీద కసి తో పని చేయాలనిపించేది కాదు. తన మనసుని కష్టపెట్టటానికి వాడెవడు? వాడు దానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే…
తీరా రామూ టీం లీడ్ ని అయ్యాడా….బతుకంతా ఒకటే టెన్షన్ అయ్యిపోయింది..జీతం పెరిగింది..కానీ దానితో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. …ఇక ప్రమోషన్ వచ్చి మానేజర్ గా అయితే ఇంకెంత టెన్షన్ ఉంటుందో..?ఓ రోజు క్లయింట్ మీటింగ్ లో తనేదో తప్పు మాట్లాడితే మానేజర్ గాడు తరువాత తనను ఒంటరిగా వాడి గది లోకి పిలిచి, “యు రేర్లీ ఓపెన్ యువర్ మౌత్. బట్ వెనెవర్ యు ఓపెన్ ఇట్, యు పుట్ యువర్ ఫూట్ ఇంటు ఇట్” అన్నాడు. వాణ్ణి చాచి పెట్టి లెంప పగులకొడదామనిపించింది..కానీ అసలే రిసెషన్ రోజులు..ఉద్యోగం ఊడుతుందని ఊరుకొన్నాడు..ఇప్పుడు ఆలోచిస్తే టీం మెంబర్ గానే తను హాయి గా ఏ బరువూ బాధ్యతా లేకుండా ఉన్నాడేమో అనిపిస్తుంది..కాకపోతే డబ్బులు తక్కువ వస్తాయి.
అభీ కి ఈ గొడవంతా చెప్పకపోయినా, కొంత చెప్పాడు రాము.
అభీ చిద్విలాసం గా నవ్వి,”నీకు ఈ ఫీల్డ్ సరిపడదనుకొంటారా..ఏ బడి పంతులు ఉద్యోగమో చేసుకోరాదూ?” అన్నాడు.
“అప్పుడు డబ్బులు సరిపోవేమో రా..?”
“మరి ఒకటి కావాలంటే వేరొకటి వదులుకోవాలి బాబూ..నీకు డబ్బూ కావాలి..టెన్షన్ లేని బతుకూ కావాలి..మళ్ళీ ఎవడూ నీ మీద అధికారమూ చెలాయించకూడదు. ఇవన్నీ ఒకే సారి ఎలా సాధ్యం ? ఏ సినిమా స్టార్లలాంటి వాళ్ళో కొందరు అదృష్టవంతులు ఉంటారు.వాళ్ళకి అన్నీ అవే వస్తాయి…ఐనా వాళ్ళకి కూడా ఏదోఒక పర్సనల్ ట్రాజెడీ ఉండనే ఉంటుంది…అవునూ… స్కూల్ యానివర్సరీ ఈవెనింగ్ సిక్స్ కి కదా..మనమిచ్చిన డొనేషన్ కి, హెడ్మాస్టర్ మన చేతులమీదుగా పిల్లలకి ప్రజంటేషన్లు ఇప్పిస్తాడట. రెడీ గా ఉండు”, అన్నాడు అభీ.
“ఫంక్షన్ అయ్యాక ఊళ్ళోకి వెళ్ళి రావాలి..మాదూరపు చుట్టాలు కొందరు ఇంకా ఊళ్ళోనే ఉంటున్నారు” అన్నాడు రాము.
“సరేరా, నువ్వెళ్ళు. నేను నీ కోసం ఆగను. రాత్రి టెన్ కి బయలు దేరాలి”, అన్నాడు అభీ.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
అభిరాం ఆఫీస్ నుంచీ రావటం ఎప్పటిలాగే బాగా లేటయ్యింది. అతని ఫ్లాట్ మేట్ సంజయ్ అప్పటికీ మెలుకువ గానే ఉన్నాడు. అభిరాం డోర్ తీసుకొని లోపలికి వచ్చేసరికి సంజయ్ ఇంటర్నెట్ లో బూతు సినిమాలు చూసుకొంటున్నాడు. ఒక బొమ్మ మీద నొక్కితే వెయ్య బొమ్మలు వస్తాయి ఆ వెయ్యి బొమ్మాల్లో ఒక్కో బొమ్మా మళ్ళీ వెయ్యి బొమ్మల కిటికీలని తెరుస్తుంది..అలా అలా..వెయ్యి బొమ్మలలో కొన్నైనా నచ్చుతాయి…ఈ బొమ్మల తతంగానికి అంతే ఉండదు. అభీ స్నానం చేసి భోజనం చేసి వచ్చేసరికి తెల్లారి రెండైపోయింది. కానీసంజయ్ ఇంటర్నెట్ వదలట్లేదు.ఒక బొమ్మ రెచ్చగొడుతుంది..రెచ్చిపోయిన తరువాత మరోబొమ్మ కావాలని పిస్తుంది….”దీని మొహమ్మీది ఫీలింగ్ చూడు ..ఫీలింగ్ ..కీ ఎమోషన్ కీ సెక్సు కీ ఏదో సంబంధం ఉందబ్బా..అసలు సెక్సే ఓక ఎమోషన్..సెక్సు లోనే ఎమోషనల్ శాటిస్ఫాక్షన్ ఉంది…ఈ గుంట చూడు…షి లుక్స్ ..క్యూట్…ఈ సీన్ చూడు..ఆ డిం లైటింగూ అదీ..భలే సెన్సువస్ గా ఉంది కదా…” అంటున్నాడు అతను. అభీ అందుకొని…
“బాబూ సంజయ్..నీ లెక్చర్ వినలేక చస్తున్నాం నాయనా…..! నువ్వు దీనికి ఎడిక్ట్ అయ్యిపోతున్నావు…కాదు..కాదు ఎడిక్ట్ అయ్యిపోయావు…రేపు పొద్దున్నే ఎప్పుడు లేస్తావూ ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తావు..?ఆఫీస్ లో పని అంతా ఖరాబు చేస్తావనుకొంటా..మళ్ళీ తరవాత అప్రైజల్ లో తక్కువ రేటింగ్ ఇచ్చాడంటావు…” అన్నాడు.
సంజయ్..”ఒక్కొక్కడికీ ఒక్కో ఎడిక్షన్ బాబూ..నీకు వర్క్ ఎడిక్షన్…ఇంకొకడికి క్రికెట్ ఎడిక్షన్..నాకు ఈ బొమ్మలు ఎడిక్షన్..నువ్వు చిన్నప్పుడు చిరంజీవి సినిమాలకు ఎడిక్ట్ అయ్యావని నువ్వే చెప్పావు కదా..?” అన్నాడు.
“ఆ ఎడిక్షన్ వేరు ఇది వేరు..దీంట్లో దిగజారుడుతనం ఉంది. పైగా ఇంటనెట్ సైట్ల వాళ్ళు నీ బలహీనత ఆధారం గా ఎక్స్-ప్లాయిట్ చేస్తున్నారు” అన్నాడు అభి.
“వాడెవడో నన్ను ఎక్స్-ప్లాయిట్ చెయ్యటం ఏమిటి? నాకు ఇష్టమై నేను చూస్తున్నా..నేను ఎంజాయ్ చేస్తున్నా..అయినా దీనికీ తిండి తినటానికీ పెద్ద తేడా ఏముంది? ఆకలైతే తిండి తింటాం..కోరిక కలిగితే బొమ్మలు చూస్తాం” సంజయ్ తిప్పికొట్టాడు.
“ఒరేయ్ అబ్బాయ్..ఆకలేస్తే హాయిగా తిండి తింటాము…అంతేగానీ…తిండిని ఫొటో తీసి దానిని చూసి మనలని మనం ఊరించుకొంటూ తృప్తి పడంకదా..నువ్వు చేస్తున్న పని అలాంటిదే..తిండి తినటం అన్నది భౌతికావసరం..కానీ నువ్వు చేస్తున్నదాంట్లో మానసికమైన వ్యసనం చాలా ఉన్నది బాబూ..ఎవరో ఒక అమ్మాయిని చూసుకో..”
“అసలు తిండి దొరకక పోతే ఏమి చేస్తాము మామా..? తిండిని ఫొటోలు తీసి చూసి తృప్తి పడాల్సిందే..నీకైతే ఎవరో ఒక గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతూనే ఉంటారు బాబూ..నీ ‘గర్ల్ ఫ్రెండ్స్ ని రూం కి తెచ్చినప్పుడు నన్ను ప్రకాష్ గాడి రూం కి తోలతావు… మరి నా సంగతి అలా కాదే! ఈ ముఖానికి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు పడతారు చెప్పు..? కాబట్టీ… ఒక్కోసారి తిండి కంటే తినేపదార్ధాల ఫొటోలే బాగుంటాయి..తిండి చేదుగా..వెగటుగా ఉండవచ్చు.ఫొటోలతోఆ బాధ లేదు. ఇది మానసిక జాఢ్యం అంటున్నావు గానీ ఏది మానసిక జాఢ్యం కాదు…? ఇవాళ నెలకి లక్ష జీతం వచ్చేవాడు,ఆ లక్ష జీతం వస్తుండగానే, రెండు లక్షల ఉద్యోగం వస్తుందేమోనని చూస్తాడు. ఆ రెండు లక్షల జీతమిచ్చేఉద్యోగం రాగానే కొంత కాలానికి వాడికి అందులో ఉండే ఆనందం పోతుంది..మళ్ళీ మూడులక్షల ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు..అలానే రాజకీయ నాయకుడు…ముందు ఎమెల్యే అవ్వాలనుకుంటాడు…ఎమెల్యే ఐన తరువాత, మంత్రి కాలేదనే బాధ పట్టుకొంటుంది..అంటే వాడు డబ్బుకీ, వీడు పవర్ కీ ఎడిక్ట్ ఐపోయారన్న మాటే కదా..? జీవితం లో ఒక మెట్టు పైకెక్కినప్పుడల్లా వచ్చే కిక్ కి ఎడిక్ట్ ఐపోతున్నారు జనం. జంతువులే నయం. ఆహారం తింటాయి తిన్న తరువాత అది అరిగిపోయి, మళ్ళీ ఆకలి పుడితే గానీ మళ్ళీ ఆహారం గురించి ఆలోచించవు. మనిషికి లక్ష ఉండగానే కోటి కావాలి,కోటి ఉండగానే పది కోట్లు కావాలి…మనిషికున్న ఈ దురాశ వలనే గ్లోబల్ వామింగ్ మొదలయ్యింది………. “
అభి సంజయ్ కి దండం పెట్టి, “నిన్ను డిస్టర్బ్ చేయనులే నాయనా.. ఇంకొంచెంసేపాగితే బిగ్ బ్యాంగ్ కీ, పోర్న్ ఎడిక్షన్ కీ ముడిపెట్టేటట్లున్నావు..ఇక చూసుకో…నాకెందుకు..?” అని బెడ్ రూం లోకెళ్ళి పడుకున్నాడు .
%%%%%%%%%%%%%%%%%%%%%%
యంగ్ ఎంటర్-ప్రెన్యూర్స్ మీట్ కి అభిరాం వాళ్ళ బాసుకి పాసులు వచ్చాయి. బాస్ అభి-రాం కి కూడా ఒక పాస్ ఇచ్చాడు. ఆ మీట్ లో నిషా మల్-హోత్రా అని ఓ ముప్పై ఏళ్ళ ఉత్తర భారత సుందరి తత్తర బిత్తర ఏ మాత్రం పడకుండా మాట్లాడింది. ఆమె మాటలూ, ఒళ్ళూ కూడా అభిరాం కి బాగా నచ్చేశాయి. బుర్రలోనూ బుర్రకిందా సరుకున్న వాళ్ళు కొంచెం అరుదు గా తారస పడతారు. అభిరాంకి ఇంతకు ముందు ఒక నలుగురు అమ్మాయిలతో ఐనా సుఖ పరిచయాలున్నాయి. కానీ ఏ అమ్మాయీ అతని గుండె స్పీడు ని ఇంతగా పెంచలా. అభి ఆమె వేదిక కిందికి దిగిన తరువాత వెళ్ళి తనను తాను పరిచయం చేసుకొన్నాడు.
అభిరాం ఏం మాయ చేశాడో ఏమో తెలియదు గానీ తరువాత సరిగ్గా ఆరు నెలలకి నిషా, సంజయ్ లేని అభిరాం ఫ్లాట్లో మంచమ్మీద అతని చాతి మీది వెంట్రుకలు వేలితో మెలితిప్పుతూ వాళ్ళ బతుకు బిజినెస్ కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేసింది. ఆ చర్చల మధ్య లో స్వర్గం అంచులకీ, మళ్ళీ అక్కడి నుంచీ డిస్కషన్ కి మంచం అంచులకీ తిరిగి వచ్చారు వాళ్ళిద్దరూ.
అభిరాం ఆమెకు “పెళ్ళీ చేసుకొందాం” అని ప్రపోజ్ చేశాడు.
నిషా,”తనకి అబధ్ధాలు చెప్పటం ఇష్టం లేదన్నది”, తనకి తన ఇండస్ట్రీ అంటే పాషన్ అంట…దానికే తన సమయం అంతా సరిపోతుందంట…ఆమె ఫ్రెండ్ ఒక ఆడ “సీ ఈ వో” ఉందంట. ఆమె తన పిల్లలను ఆయా కి అప్పచెప్పి, తను ఆఫీసు పనులలో బిజీ గా ఉంటుందట..పిల్లలకి ఆమె ఫ్రెండ్ కంటే ఆయా అంటేనే చనువు ఎక్కువంట.ఆమె భర్త ని అందరిముందూ ఎంతో గౌరవం గానూ, లోపల ఇంట్లోనేమో వాళ్ళ కుక్క టామీ గానూ చూస్తుందట. అతను ఊళ్ళో ఉన్న రెడ్ లైట్ యేరియా లో అప్పుడప్పుడూ సేదతీరుతాడట. ఏ “సీ ఎన్ బీ సీ టీ వీ” వాళ్ళో ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం,”తాను ఒక తల్లి గా,భార్య గా కోడలిగా, ‘సీ ఈ వో’ గా అనేక పాత్రలను తెగ బాలన్స్ చేసినట్లు ఫోజు కొడుతుందట.
తనకు మొదటి ఇష్టం తన కంపెనీ కాబట్టీ, తనకు తన ఆడ ఫ్రెండ్ లా అబధ్ధాలు చెప్పటం ఇష్టం లేదు కాబట్టీ, తను అభిరాం మేలు కోరేది కాబట్టీ, అభి రాం కి తనను పెళ్ళాడవద్దని సలహా ఇస్తుందట.
ఈ సంఘటన జరిగిన ఓ రెండు నెలలకి నిషా కి ఓ బిలియన్ డాలర్లకంపెనీ ఓనర్ కొడుకు తో డెస్టినేషన్ మారేజ్ మాలిబూ లో జరిగింది. దానితో అభిరాం కి పెళ్ళంటే కొంచెం తాత్కాలికం గా విరక్తి కలిగింది. అయితే మాలిబూ లో నిషా పెళ్ళి కి వెళ్ళి నిషా తో ఆమె భర్తని పరిచయం చేయించుకోవటం మాత్రం మరిచిపోలేదు అభిరాం.
ఓ సంవత్సరానికి, తనున్న కంపెనీకి రాజీనామా చేసి, నిషా భర్త సపోర్ట్ తో తానే ఓ ‘సోలార్ సెల్ లు తయారు చేసే కంపెనీ’ పెట్టాడు అభిరాం..
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
ప్లేన్ ఒసాకా ఎయిర్ పోర్ట్ లో దిగింది. ఒసాకా ఎయిర్ పోర్ట్ సముద్రం లోని దిబ్బ మీద కట్టారు. “జపాన్ వాడి టెక్నాలజీ బాగానే ఉందే…!” అనుకొన్నాడు అభీ. తన కంపెనీ కి జపనీస్ పార్ట్ నర్ ని వెతకటం కోసం జపాన్ వచ్చాడు అభి. ఫ్లైట్ నుంచీ బయటకు రాగానే ఒకటే చెమటలు కారసాగాయి. అంతా తేమ గా ఉంది. ఎయిర్ పోర్ట్ బయట ఒక జపనీస్ అతను అభి పేరున్న ప్లకార్డ్ పట్టుకొని నిల్చొన్నాడు. అతను అభి కి గౌరవసూచకం ముందుకు వంగి జపనీస్ పధ్ధతి లో బౌ చేసి “మై నేం ఈజ్ యమనకా.. యువర్ ఇంటర్-ప్రెటర్” అన్నాడు. అభి చెయ్యి అందించి షేక్ హ్యండ్ ఇచ్చాడు. అతను అభీ సంతకం తీసుకొని ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్ లో యెన్స్ తెచ్చి పెట్టాడు. బయట లిమోసిన్ కార్ ఉంది . యమనకా డ్రైవ్ చేయసాగాడు. “ఎయిర్ పోర్ట్ నుంచీ ట్రెయినూ బస్సూ రెండూ ఉన్నాయి కానీ..ఈ కార్ అయితే అభీ కి కంఫర్టబుల్ గా ఉంటుందని తెచ్చాను” అని చెప్పాడు యమనకా సాన్. దారిలో కనిపించిన అపార్ట్మెంట్లలో ఇండియాలో లానే బాల్కనీల లో బట్టలు ఆరేసి ఉన్నాయి. కారు ‘షి ఒసాకా’ దాటి ‘నిషి నకజిమా’ చేరింది. ఎక్కడ చూసినా ఫు ట్పాత్ లపై వెండింగ్ మెషీన్ లు ఉన్నాయి. జపాన్ లో దొంగతనం, క్రైం అసలు ఉన్నట్లే లేవు. జపాన్ అమ్మాయిలు ఒంటి మీద ఏమాత్రం నూగు వెంట్రులు కూడా లేకుండా లైఫ్ సైజ్ బొమ్మల్లా కనపడుతున్నారు.
హోటల్ లో రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు అభీ. రెస్ట్ రూం లోని కమ్మోడ్ లు కూడా ఆటోమాటిక్ వి ఉన్నాయి. యమనకా సాన్ “లంచ్ కి ఇండియన్ రెస్టారెంట్ వెళ్దామా?” అన్నాడు. కానీ అభీ కి కొత్త కొత్త ఫుడ్స్ ట్రై చెయ్యటం ఇష్టం. జపనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళమన్నాడు అభి. యమనకా సాన్ దగ్గరే ఉన్న ఒక జపనీస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. అది కొంచెం ఖరీదైన రెస్టారెంట్ లానే ఉంది. మన పల్లెలలో ఉండే నేల పీటల కంటే కొంచెం ఎత్తులో పీటలు ఉన్నాయి ఆ రెస్టారెంట్ లో. పీటల మీద కూర్చొని పీటలముందున్న గొయ్యి లోకాళ్ళు పెట్టుకోవాలి. చాలా మంది జపాన్ వాళ్ళ లా కాకుండా, యమనకా సాన్ మంచి మాటకారి. ఎప్పుడూ ఏదో ఒక సమాచారమిస్తూనే ఉంటాడు. మెనూ లో ఐటంస్ ఎడమ నుంచీ కుడి కి కాక పై నుంచీ కిందికి రాసి ఉన్నాయి. చాలా ఫిష్ ఐటంస్ ఉన్నాయి. మెనూ లోబీఫ్ కూడా ఉంది. “రెండో ప్రపంచ యుధ్ధానికి ముందు జపాన్ లో బీఫ్ తినేవారు కాదు. కానీ తరువాత ఇక్కడ అమెరికా సైన్యాలు పాగా వేశాయి. వాళ్ళ ప్రభావం తో ఇక్కడ కూడా బీఫ్ అలవాటయ్యింది” అని చెప్పాడు యమనకా సాన్.
“భారతీయ సంస్కృతిమీద కూడా అమెరికా ప్రభావం ఈ మధ్య బాగా పెరుగుతోంది. చాలా మంది ఇండియన్స్ ఇంగ్లీష్ మాటలు లేకుండా తమ తమ భాషలలో మాట్లాడలేరు” అన్నాడు అభీ.
” జపాన్ లోకూడా అంతే…ఇంగ్లీష్ మాట వాడకుండా జపనీస్ మాట్లాడటం క్రమేపీ తగ్గుతోంది.ఇన్ ఫాక్ట్…”జపాన్ దేశం “యూ ఎస్” లో యాభై ఒకటవ రాష్ట్రం అయిపోయింది”, అని ఒక జోక్ ప్రచారం లో ఉందిక్కడ.
యమనకా సాన్ అభీ కి సుషీ తినమని సజెస్ట్ చేశాడు. అది చేపా, వరి తో చేసిన ఒక వంటకం. దాని తరువాత పచ్చి చేపని ఆర్డర్ చేశాడు, తరువాత ఆక్టోపస్ సూపు.
యమనకా సాన్ ఒక జపనీస్ కర్రీ పేరు చెప్పి,”అభీ సాన్, దిస్ ఈజ్ ద స్పైసియెస్ట్ డిష్ ఇన్ జపాన్ అన్నాడు. అభీ ఆ కర్రీ తెప్పించుకొని తిన్నాడు. అది మన పచ్చడి కంటే చాలా తక్కువ కారం గా ఉంది. కానీ యమనకా సాన్ నోరు వెళ్ళ బెట్టి, వెంటనే తన అమెరికన్ భార్య కి ఫోన్ చేసి “జస్ నౌ ఐ హావ్ సీన్ స మాన్ హూ హాస్ ఈటెన్ స స్పైసియెస్ట్ డిష్ ఇన్ జపాన్!” అని జపనీస్ ఆక్సెంట్ లో చెప్పాడు. అతనికి అభీ,”మా ఇండియాకి వస్తే నువ్వు దీనికి పదింతలు కారం తినే వాళ్ళని చూడ వచ్చు”, అని చెప్పాడు. తర్వాత యమనకా రైస్ నుంచీ తీసిన జపనీస్ బీర్ ని ఆర్డర్ చేశాడు. లంచ్ అయిన తరువాత యమనకా బిల్లు లో తన వంతు మాత్రమే చెల్లించాడు. జపాన్ లో ఎవరి బిల్లు వారే చెల్లించుతారు మరి!
యమనకా “తినటం తాగటం అయిపోయింది..ఇంకా ఒకటే మిగిలి ఉంది”, అని దగ్గరే ఉన్న ఒక నైట్ క్లబ్ కి అభీ ని తీసుకొని పోయాడు. అక్కడబొమ్మల లాంటి జపనీస్ అమ్మాయిలు అభీ కి విస్కీ పోసి పక్కనే కూర్చొని తాగించారు. యమనకా సాన్ దుబాసీ గా వారి తో కొంచెం మాట్లాడాడు. ఒకమ్మాయి తాను జాగ్రఫీ స్టూడెంట్ ని అని చెప్పింది. వెంటనే అభీ ఆమె ని “ఇండియా పేరు విన్నావా?” అని అడిగాడు.
“ఆఫ్రికా లో ఉంటుంది కదా..?”
ఓహ్ ..ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళీనా ఈ నైట్ క్లబ్బులో ఉండే అమ్మాయిలు ఇలానే ఉంటారు.
వాళ్ళు అభీ కి వాళ్ళ విసిటింగ్ కార్డులిచ్చి” వెళ్ళారు.
యమనకా సాన్,”వీళ్ళందరికీ మసాజ్ పార్లర్లు ఉంటాయి. ఇక్కడ మసాజ్ పార్లర్ ముసుగు లోప్రాస్టిట్యూషన్ జరుగుతుంది. నీకు ఆసక్తి ఉంటే చెప్పు “,అన్నాడు.
ఆరోజు రెస్ట్ తీసుకొని మరుసటి రోజు యమనకా సాన్ తో పాటు ఊరి బయట ఉన్న సోలార్ సెల్ ఫాక్టరీ కి బయలు దేరాడు అభీ. దారి లో వరి పొలాలున్నాయి. యమనకా సాన్ చెప్పిన దాని ప్రకారం వాటి ఉత్పాదకత ఇండియా పొలాలతో పోల్చితే రెండు రెట్లుంటుంది.
యమనకా సాన్ హఠాత్తు గా “ప్రజలు ఎడ్యుకేటెడ్ అవ్వటం వలన డబ్బులు ఎక్కువ సంపాదించ వచ్చు అంటారు కానీ అది కరెక్ట్ కాదు”,అన్నాడు.
“ఎందుకూ!?”
“నేను చిన్నప్పుడు ఈ ఊళ్ళోనే ఉండే వాడిని. అప్పుడు వరికోత కోసే మెషీన్లు ఉండేవి కావు. ఊళ్ళో ధనికులైన రైతుల దగ్గర మిగిలిన వాళ్ళందరూ పని చేసే వారు. కానీ నెమ్మది గా మెషీన్ లు రావటం తో ఊళ్ళోని కుర్రాళ్ళు చాలా మంది ఒకేషనల్ కోర్సు లోచేరి హార్వెస్టింగ్ మెషీన్ నడపటం నేర్చుకొన్నారు. ముందు నేర్చుకొన్న వారికి ఊళ్ళో పని దొరికింది. వారికి జీతాలు కూడా ఎక్కువే ఇచ్చేవారు. కానీ నెమ్మది గా ఊళ్ళో అందరూ మెషీన్ నడపటం నేర్చుకొన్నారు. దానితో లేబర్ సప్లై ఎక్కువై, డిమాండ్ పడిపోయింది. ఊళ్ళో ఉన్న మొత్తం పొలాలు ఓ నాలుగు వందల ఎకరాలే! కాబట్టీ నెమ్మది గా లేబర్ చార్జీలు మెషీన్లు రాక ముందు కాలానికి పడిపోయాయి. జపాన్ ఆర్ధిక వ్యవస్థ తొంభైలలో మాంద్యం లో పడటం వలన పరిస్థితి ఇంకా దిగజారింది. మెషీన్లు రాక ముందు ఊరి అందరికీ తక్కువ జీతాలొచ్చేవి. కానీ ఇప్పుడు ఊళ్ళో పది శాతం మందికి మాత్రమే తక్కువ జీతాలు వస్తున్నాయి. మిగిలిన వారికి పనే లేదు. ఎందుకంటే ఒక హార్వెస్టింగ్ మెషీన్ పదిమది చేసే పని చెయ్యగలదు. ఈ విధం గా మా వ్యవసాయం ఉత్పాదకత పెరిగింది, కానీ ఉద్యోగాలు ఊడాయి”, అన్నాడు యమనకా సాన్.
“మరి పల్లెటూళ్ళో ఉండే నువ్వు ఈ సోలార్ కపెనీ లో పార్ట్ నర్ గా ఎలా కాగలిగావు?” అని అడిగాడు అభి.
“మా నాన్న పల్లెటూళ్ళో ఉండే భూస్వామి. రిసెషన్ టైం లో నేను ఈ కంపెనీ షేర్లు చవక గా కొన్నాను”,అని చెప్పాడు యమనకా.
కారు కొండల గుండా ప్రయాణం సాగించింది..కొండల్లో ఎక్కడికక్కడ చెక్ డాంలు పకడ్బందీ గా కట్టి వాన నీరు వృధా కాకుండా చూస్తున్నారు. చివరికి అభీ ఫ్యాక్టరీ లో చూస్తే టెక్నాలజీ మన దేశం లో కంటే ఓ పదేళ్ళైనా ముందుంటుందనిపించింది. దానితో అగ్రీమెంట్ కుదుర్చుకోవటానికి సిధ్ధమైపోయాడు అభి.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
“ఎం ఓయూ” సైన్ చేసిన రాత్రి అభి యమనకా సాన్ తో మసాజ్ అమ్మాయికి ఫోన్ చేయించాడు. “తనకి బాగోలేదని ఇంకో అమ్మాయిని పంపిస్తున్నానని”, చెప్పింది మొదటి అమ్మాయి.
వచ్చిన అమ్మాయి ఇంగ్లీషు కొంచెం బాగానే మాట్లాడుతోంది. ఆ అమ్మాయిని, “నువ్వు చేసే పనికి ఎప్పుడైనా గిల్టీ గా ఫీలయ్యావా?” అని అడిగాడు అభీ.
“గిల్టీ ఎందుకు? సమాజంలో నీ లాంటి వాళ్ళకు మేము సేఫ్టీ వాల్వ్ లాంటి వాళ్ళం..ఐనా ఈ రోజు తప్పైనది రేపు తప్పు కాకపోవచ్చు. అలానే ఇక్కడ తప్పైనది..కొన్ని దేశాలలో తప్పుకాదు…కొన్నాళ్ళకి సెక్స్ కూడా భోజనం చేయటమంత సాధారణం కావచ్చు..”,అంది.
“పరవా లేదే, వీళ్ళకి కూడా, కొంతమందికైనా, బుర్ర ఉంది”, అనుకొని, “నీ దృష్టి లో ఇది తప్పు కాక పోయినా దేవుడి దృష్టి లో ఇది పాపం కదా?” అన్నాడు.
“జపాన్ లోని మెజారిటీ ప్రజలలానే నేను కూడా నాస్తికురాలిని”
“నీది ఏ మతం..?”
“మా అమ్మది బుధ్ధిజం..మ నాన్న ది షింటోయిజం…కానీ నేను బుధ్ధిజాన్ని ఫాలో అవుతాను”
“షింటో ఇజం అంటే..?”
“రాజు ని దేవుని ప్రతినిధి గా భావించే ఒక మతం..నీకు జెన్ గురించి తెలుసా..?” అంది.
“ఎక్కడో విన్నాను కానీ సరిగా తెలియదు..”
“జెన్ అంటే అది ఒక ధ్యానం. ఇది మీ ఇండియా నుంచే వచ్చింది…సంస్కృత శబ్దం ధ్యాన్ నుంచీ వచ్చింది..నేను ఒక జెన్ గురువు దగ్గరకి వెళ్తూ ఉంటాను”
“నీకు అక్కడ ఏమి దొరుకుతుంది?”
“మనశ్శాంతి…”
“అరే … సరిగ్గా నా మనసు లో ఉన్న మాట చెప్పావ్..ఈ మధ్య నాకు మనశ్శాంతి కూడా కావాలనిపిస్తోంది..”
“ఐతే రేపు నాతో పాటు మా గురువు దగ్గరికి రా”
%%%%%%%%%%%%%%%%%%%%%%%%
రామారావు జాబ్ కష్టాలు ఎక్కువ అవ్వసాగాయి. టెన్షన్లు పెరగసాగాయి. యోగా నేర్చుకొంటే టెన్షన్ తగ్గుతుందని ఎవరో చెప్పారు. హైదరాబాదు లో రాజయోగి బాబా గారు యోగా నేర్పుతారు. ‘టీ వీ’ లోనూ కాసెట్లలోనూ చూసి నేర్చుకోవచ్చు గానీ,ఒక తెలిసిన గురువు ఉండటం మెరుగని బాబా గారి క్లాసులకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. బాబా గారు ఈ ప్రోగ్రాం తరువాత ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహిస్తారు. ఆయన ఈ రెండింటికీ వేరు వేరు గా చార్జ్ చేస్తారు. రాము యోగా క్లాస్ లో మాత్రమే జాయిన్ అయ్యాడు.
యోగా వలన టెన్షన్ తగ్గుతుంది. కానీ అది “అడుగున లీకైన పడవలో నుంచీ నీళ్ళు తోడటం లాంటిది. మళ్ళీ చిల్లు లో నుంచీ నీరు వస్తూనే ఉంటుంది. ఆందోళన చెందే వ్యక్తి యోగా ద్వారా తాత్కాలికం గా తన టెన్షన్ని తగ్గించు కోవచ్చు. కానీ మళ్ళీ ఆందోళన అతని వ్యక్తిత్వం లోని చిల్లు లోంచీ అతని మనసులోకి ప్రవేశిస్తూనే ఉంటుంది.ఒక రోజు రాము క్లాస్ ఐనాక బయటికి వస్తుంటే,కాషాయ వస్త్రాలలో అభిరాం లా ఉన్న వ్యక్తి కనిపించాడు. “అభిరాం ని పోలిన వ్యక్తి ఎవరా !” అని పరిశీలన గా చూస్తే అభిరామే,వేరే ఎవరో కాదు.
తను బాబా గారి ప్రసంగానికి వెళ్తున్నాడట..అంతకుముందు చాలా రోజులనుంచీ బాబా గారిని ఫాలో అవుతున్నాడంట.
“జపాన్ వాళ్ళతో పార్ట్ నర్ షిప్ పెట్టుకున్నాక, నీ కంపెనీకి గవర్నమెంట్ ఆర్డర్లు బాగా వచ్చాయి కదా, మరి ఇంతలోనే దివాలా తీసిందా ఏమిటి సన్యాసం లో చేరావు?”,రాము పరాచికమాడాడు.
“అదేమీ కాదు..కంపెనీ ని అమ్మేశాను..బాగానే లాభం వచ్చింది.”
అభీ తో ఇదే బాధ… ఎంత లాభం వచ్చిందో చెప్పడు..అంతా గుంభన..అదే రాము ఐతే ఎంత లాభం వచ్చిందో చెప్పే దాకా నిద్రపోడు.
“అయ్యో, నీ కంపెనీ లో ఏదైనా జాబ్ ఇప్పించమని అడుగుదామనుకొన్నానే..మరి ఇంకో కంపెనీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా?”
“ఈ కంపెనీ ల తో బోర్ కొట్టేసింది.జపాన్ నుంచీ బిజినెస్ పార్ట్ నర్ తో పాటు జెన్ ని కూడా వెంటపెట్టుకొని వచ్చాను. జెన్ గురించి తెలుసుకొన్నాక ఆధ్యాత్మికత అంటే ఇంటరెస్ట్ పెరిగింది. ఆధ్యాత్మికత లో పడిపోయాను”
“అంటే నువ్వు సంపాదించిన డబ్బంతా జనాలకు దానం చేసే ఆలోచన ఉందా? అలా ఉంటే నాకో కోటి పడెయ్య రా బాబూ..”
“అది చాలా ఇమ్మెచ్యూర్ ఆలోచన. నా డబ్బంతా నీకు రాసిస్తే నీకు సాధించటానికి ఏమీ ఉండదు..అంటే డబ్బు రాక తో పాటే నీకు సుఖాన్ని సాధించే అవకాశం పోయిందన్నమాట “,అని నవ్వాడు అభి.
“నాకు ఇప్పుడు అర్ధమయ్యింది..నీకు డబ్బు లో కిక్ పోయింది…ఆధ్యాత్మికత లో కిక్ వెతుకుకొంటున్నావ్”
అభి ఓ చిరునవ్వు పడేసి,”అంతే అనుకో..” అన్నాడు.
“ఇంతకీ బాబా గారు ఏమి చెప్తాడేమిటి?”
“దేవుడూ…మోక్షమూ..పరమార్ధమూ..ఆధ్యాత్మిక అనుభవమూ.సమాధి స్థితీ..జీవిత పరమార్ధం..బ్లా బ్లా…”,ఇలాంటివి అని “ఏం? నువ్వు కూడా వస్తావా..నా దగ్గర ఒక కాంప్లిమెంటరీ పాస్ ఉంది”, అని..రాము చేతి లో ఒక చీటీ పెట్టాడు.
“నాది ఓ అమాయకమైన ప్రశ్న, “చిన్నప్పుడు మన ఊళ్ళో పూనకం వచ్చి డొల్లిగింతలు పెట్టే వాళ్ళని చూశాను. వాళ్ళు ఒక ట్రాన్స్ లాంటి స్థితి లో ఉన్నట్లు అనిపించేది. వాళ్ళకు ఏదైనా నార్కోటిక్ ఇచ్చినా అలా ప్రవర్తిస్తారేమో అనిపించేది..అలానే సమాధి స్థితి కూడా ఏదైనా డ్రగ్ ఇస్తే రావచ్చేమో?”
“ఇంత వరకూ కనిపెట్టలేదు..ఇక ముందు రావచ్చేమో…మెదడుకు ఏదైనా ఆపరేషన్ చేసి కూడా ఆ స్థితి కలిగించ వచ్చేమో..”"
“అంటే మన బుర్ర బయటి నుంచీ ఏ శక్తీ పని గట్టుకొని,మన అర్హత ని బట్టి ఆ స్థితి కలిగించటం లేదంటావా?”
“బయట ఏదో ఉందనే అనిపిస్తుంది…ఇలాంటి ప్రశ్నలకి బాబా గారు …నేతి..నేతి అని ఒక ఎక్జాంపుల్ చెప్తారు. మన ప్రయత్నం వలన ఆ స్థితి చేరలేమంటారు ఆయన. అంటే మన బయట నుంచీ ఎవరో నడిపిస్తున్నట్లే కదా..”,అన్నాడు అభి.
“ఆ… అలా అనేముంది..మనం రోజూ చేసే పనులలో నే చాలా మన ప్రయత్నం వలన సాధించలేం. నేను ఉన్నపాటున సచిన్ టెండుల్కర్ అయిపోవాలంటే అవ్వగలనా..ఇప్పటికిప్పుడు నిద్రపోవాలంటే వస్తుందా..అలానే కారు నేర్చుకోవటానికి ప్రయత్నం కావాలి…ఒక్కసారి నేర్చుకొన్న తరువాత..మన ప్రమేయం లేకుండానే రిఫ్లెక్స్ తో కారు నడిపేస్తాం..అలా అని ప్రయత్నం నిరుపయోగం అని కాదు.మనంచేరాలన్న స్థితి కి కావలసిన పరిస్థితులను కలిపించుకొన టానికి ప్రయత్నం చేయాలి. ఆ పరిస్థితులను కలిపించుకొంటే మనకు కావలసిన స్థితి అదే వస్తుంది…ఇల్లు కట్టాలంటే మట్ట కొట్టాలి కదా? నేను మనసు తో అదే పని గా ప్రయత్నిస్తాను అంటే ఇల్లు ప్రత్యక్షం కాదు. అలానే ఇప్పటి కిప్పుడు నేను సంతోషం గా అవ్వలంటే కాలేను కదా.. నేను సంతోషం గా ఉండటానికి ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చుకొంటే సంతోషం అదే వస్తుంది. సంతోషం మనం ఉండే పరిస్థితులకి మన రెస్పాన్స్ మాత్రమే.”
“నాకు ఏపని చేసినా సంతోషం కలగట్లేదు..అలాంటప్పుడు సంతోషమే ఒక లక్ష్యం అవుతుంది, ఇల్లు కట్టటమో..కల్లు తాగటమో కాదు”
“ఇంతకీ ఆ సమాధి స్థితి కి చేరటానికి ఏ పరిస్థితులను కల్పించాలి?” అడిగాడు రామారావు.
“అది ‘కండిషన్ లెస్ స్టేట్’..ఏ పరిస్థితుల వలనా ఆ స్థితి కి చేరలేం”
“ఇది మరీ చోద్యం, అంటే బాబా గారు కేవలం అదృష్టం వలన ఆ స్థితి కి చేరారా? మిగిలిన వారు ఆ స్థితి కి చేరతారో లేదో ఆయనకే తెలియదు..ఇంకా ఈ సమావేశాలు ఎందుకు..ఈ టికెట్లు ఎందుకు? అది సరే… ఈ ప్రపంచం ఎలా పుట్టిందీ…సమయం ఎలా పుట్టిందీ…ప్రపంచం పుట్టకముందు ఏమి ఉందీ..ఇలాంటి ప్రశ్నలకు ఆయన దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా..? నాకు ఇలాంటి విషయాలంటే మా చెడ్డ ఆసక్తి రా”
“ఆయన ఎప్పుడూ సమయం లేని అనుభూతుల గురించి మాట్లాడుతారు..అయినా నీకు ఇంటలెక్ట్యువల్ ఆన్సర్స్ కావాలి..ఆయన ఇచ్చేవి మిస్టికల్ ఆన్సర్స్..”
“ఇంతకీ జీవిత పరమార్ధం ఏమని చెప్పారే బాబా గారు?”
“అది మనిషిని బట్టి మారుతుంది..అందరికీ కామన్ గా ఉండే పరమార్ధం జీవితాన్ని జీవించటమే. బిగ్ పిక్చర్ చూస్తే అంతే మరి. ఎందుకంటే అందరమూ చావవలసిన వాళ్ళమే. చివరికి జీవితం నుంచీ ఏమీ ఆశించలేం. మనం సంపాదించామనుకొనే డబ్బూ, పేరూ, పలుకుబడీ అన్నీ కాలగర్భం లో కలిసిపోయేవే. కొన్ని లక్షల ఏళ్ళ తరువాత..అప్పటికి ఇంకా మానవ జాతి మనుగడ సాగిస్తూ ఉంటే..జనాలు గాంధీ మహాత్ముడి పేరు కూడా మర్చి పోతారు గదా..! అందుకే కృష్ణ భగవానుడు నిష్కామ కర్మ గురించి చెప్పింది.” అన్నాడు అభి.
“ఏంటో రా నాయనా, నావన్నీ చిన్న చిన్న కోరికలు..అవి కూడా తీర్చడు భగవంతుడు”.
“నిజం చెప్పాలంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి రా..నీకు ప్రయత్నిచటానికి చాలా మిగిలి ఉంది..ఐనా సక్సెస్ అనేది సబ్జెక్టివ్..నా దృష్టి లో నువ్వే సక్సెస్ ఫుల్..చక్క గా భార్యా పిల్లలతో కాలం గడుపుతున్నావు..నాకు చూడు ఏమి చేసినా సంతోషం రాదు..కాబట్టీ ఒరేయ్ రామూ ‘బీ హాపీ’”, అని బాబా గారి ప్రసంగం హాల్లోకి దూరాడు అభీ .
రాము బాబా గారి ప్రసంగం పాస్ ‘డస్ట్ బిన్’ లో వేసి, ఇంటి దారి పట్టాడు.
అయిపోయింది
మానవ జాతి పయనం ఎటు వైపుకి?
21 ఏప్రి 2011 1 వ్యాఖ్య
in సమాజం
ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.
ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.
ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.
మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి. మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను గుర్తు చేసుకోవటం మంచిది.
విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!
04 మే 2011 అభిప్రాయములు
బిగ్ బ్యాంగ్ తీరీ ప్రకారం, విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం తో ప్రారంభమైంది. ఆ విస్ఫోటనం నుంచీ జరిగిన సంఘటనల ప్రవాహమే కాలం. అంటే విశ్వం తో పాటు కాలం కూడా పుట్టింది. కానీ, ఏ కారణం వలన బిగ్ బ్యాంగ్ పేలుడు జరిగింది?
బిగ్ బ్యాంగ్ కి ముందు అంతటా “ఏమీ లేని స్థితి” ఉండేది. ఆ స్థితి లో పదార్ధం లేదు, శక్తి లేదు,స్థలం లేదు. అనుభవించటానికి నువ్వూ నేనూ లేము. ఆ శూన్యం లో కాలం లేదు. కాలం ఉండటానికి ఏదో ఒక సంఘటన జరగాలి కదా! ఒక సంఘటన జరిగితే, ఆ సంఘటన నుంచీ సమయాన్ని లెక్కించవచ్చు. ఆ సంఘటన ముందు సమయాన్ని కొలవ వచ్చు. ఏ సంఘటనలూ జరగటానికి వీలులేని సందర్భం లో సహజంగానే సమయాన్ని ఊహించలేము. అది పరిపూర్ణమైన శూన్యం. దానిలో సాపేక్షత లేదు. అలానే అటువంటి శూన్యాన్ని నిర్వచించలేము (అన్ డిఫైన్డ్). కాబట్టీ విశ్వం పుట్టుకకి ముందు కాలం లేదు. కారణమూ ప్రభావమూ (కాజ్ అండ్ అఫెక్ట్) అనేవి కాలం లో జరిగే విషయాలు. కారణం ముందు జరిగి, తద్వారా దాని ప్రభావం పుడుతుంది. కాలం లేని చోట కారణమూ ప్రభావమూ ఉండవు. విశ్వం పుట్టుకతోనే కాలం ఏర్పడింది. పుట్టుకకు ముందు కాలం లేదు. కాలం లేని చోట కారణం కూడా ఉండదు. కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదు. ఇక ముందు,మన శాస్త్రవేత్తలు, కారణం లేని విషయాలని శోధించటానికి కూడా తమ పరిశోధనలను ఉపయోగించవలసి వస్తుంది.
ఆస్తికులు “ఈ విశ్వమే భగవంతుడు కనే ఒక కల లాంటిది” అని అంటారు. కల అనేది నిద్రలో ఉంటుంది. నిద్ర అనేది ఒక మనిషి శారీరక మానసిక పరిస్థితులవలన మొదలౌతుంది. ఎవరైనా మనకు కలలో జరిగే సంఘటనల కార్యకారణ సంబంధాలద్వారా, కల యొక్క పుట్టుక కారణాన్ని (మనిషి మానసిక, దైహిక పరిస్థితి, నిద్ర) కనిపెట్టాలంటే అది దాదాపు అసంభవం. అలానే ఈ విశ్వం లోని కార్య కారణ సంబంధాలతో విశ్వం పుట్టుక ముందు ఏమి ఉందో అన్వేషించటం కష్టమవ్వ వచ్చు. ఆస్తికుల విషయం లో, దేవుడు కనే కల లాంటిది ఈ విశ్వమైతే, మరి దేవుడిని ఎవరు సృష్టించారు? లేక, దేవుడు ఏదైన ఇంకా పెద్ద కలలోని వాడా? దీనికి సమాధానం, దేవుడు తను కనే కల(విశ్వం) లో భాగం కాదు.కాబట్టీ ఈ విశ్వం లోని సూత్రాలైన కార్య కారణ సంబంధాలను దేవుడికి అన్వయించలేము. దేవుడికి కారణం లేదు. మొత్తానికి సృష్టి జన్మ విషయానికి వచ్చేసరికి హేతువాదులూ, ఆస్తికులూ ఒకేరకమైన సమాధానాలు ఇస్తున్నారు. తేడా ఒక్కటే, ఆస్థికులు సృష్టి ఆదికి దేవుడి లో, ఒక మంచి లోక కల్యాణ కరమైన ఉద్దేశాన్ని (మోటివ్) చూస్తున్నారు. కానీ ఇక్కడ మనిషి, దేవుడిని మరీ తన రూపం లో ఊహించుకొంటున్నాడేమో! ఉద్దేశాలూ, ఇచ్చలూ మానవునికి ఉంటాయి. ఇవి అతనిలో జీవ పరిణామ పరం గా ఏర్పడతాయి. క్వార్క్లూ, పాజిట్రాన్లు ఏర్పడక ముందు జరిగిన బిగ్ బ్యాంగ్ కు భగవంతుడు కారకుడైతే, ఆయనకు జీవపరిణామం ద్వారా వచ్చిన “ఇఛ్ఛ” ను ఆపాదించటం సరి కాదేమో!ఇఛ్ఛ అనేది మనిషికి భౌతిక వాంఛల యొక్క పరిణామం వలన కలుగుతుంది కదా!
ఆస్తికత్వం దృష్టి తో చూసినా, నాస్తికత్వ దృష్టి తో చూసినా, మనం ఒక కారణం లేని మూలానికి వెళ్ళ వలసి వస్తోంది. కాబట్టీ, “ఈ విశ్వం పుట్టుక (లేక దేవుడు) కి కారణం లేదు”, అనటం హేతుబధ్ధమే!
మన రాజకీయ నాయకులను సమర్ధిస్తూ..
13 మే 2011 అభిప్రాయములు
in రాజకీయం
రాజకీయ నాయకులు నిజ జీవితం లో జరిగే సంఘటనలకు ఆలోచించుకొనే వ్యవధి లేకుండా వెంటనే ప్రతిస్పందించాలి. రాజకీయ నాయకుడు కావటానికి రిస్క్ తీసుకొనే మనస్థత్వం తో పాటు, ఒత్తిడి కి లోనవ్వకుండా ఉండటం చాలా అవసరం. ప్రత్యర్ధులు చేసే ఆరోపణలు ఎదుర్కొనటానికి కొంత తోలు మందం కూడా అవసరం.ఏదైనా దుర్ఘటన జరిగినపుడు మిగిలిన జనాలంతా తమ కడుపు లో చల్ల కదల కుండా ఇంట్లో టీవీ ల ముందు కూర్చుంటే, రాజకీయ నాయకుడు సంఘటనా స్థలానికి వెళ్ళి జనాలకి ధైర్యం కలిగించాల్సి ఉంటుంది.
ఇంట్లో కూర్చొని ఒక కథ రాయటానికి కొంత తెలివి కావాలి. చదరంగం ఆడటానికి దీనికంటే కొంచెం ఎక్కువ తెలివే కావాలి. ఎందుకంటే చెస్ ఆడటానికి స్పాంటేనిటీ కావాలి. కథ రాసేటప్పటి లా తీరిక గా కూర్చొని ఆలోచించుకొని రాస్తానంటే కుదరదు. అంతే కాక ప్రత్యర్ధి ఎప్పుడూ మన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటాడు. అతనిని ఓడించే విధం గా మనం ఆలోచించాలి. రాజకీయాలకు చెస్ ఆడే టప్పటి కన్నా చురుకైన తెలివి కావాలి. ఎందుకంటే ఇక్కడ సమాజం లోని అనేక పరిమితులకి లోబడి ఎత్తులు వేయాలి. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణం గా మాట్లాడాలి.
మనం ఆఫీసు క్యాంటీన్ లో కబుర్లు చెప్పుకొనేటప్పుడూ, స్నేహితులతో పిచ్చాపాటీ మాట్లాడే టప్పుడూ, “దేశాన్ని రాజకీయ నాయకులు ఎంతగా దోచేస్తున్నారో!”, అని వాపోవచ్చు. కానీ మనలో చాలా మంది మన మన పరిధులలో రాజకీయ నాయకులమే! మనం గృహ రాజకీయాలు చేస్తాం. ఆఫీసు రాజకీయాలు చేస్తాం. ఆదర్శాల గురించి మాట్లాడే రచయితలూ, ప్రజలను బ్రతికించాల్సిన డాక్టర్లూ వారి వారి పరిధులలో రాజకీయాలు చేసే వారే. అన్ని వృత్తులలానే, మానవ స్వభావం నుంచే రాజకీయాలు పుట్టాయి.ప్రపంచం లో అన్ని వృత్తుల వారూ రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాజకీయ నాయకులు తమ వృత్తే అయిన రాజకీయాలు చేయటం లో తప్పేముంది?
మనలో,ఆఫీసులలో మెడికల్ అలవెన్స్ కి దొంగ బిల్లులు పెట్టని వారు ఎంత మంది? ఇల్లు అమ్మే లావాదేవీ లలో నల్ల ధనం తీసుకోని వారు ఎంత మంది? సమాజం మొత్తం అవినీతి మయమైనపుడు, కొంత లాభదాయకమైన పదవులలో ఉన్న రాజకీయ నాయకులు ఎలా చేతులు ముడుచుకొని కూర్చొంటారు? మనలో చాలా మంది ఆ పదవులలో ఉంటే, అంత కంటే అవినీతి పరులయ్యే వారు. రాజకీయుల అక్రమ సంపాదన గురించిన మన ఆగ్రహం లో అసూయ పాలు ఎంతో, మనం ఆత్మ విమర్శ చేసుకొంటే తెలుస్తుంది.మనం చేసే అవినీతి, మనకున్న పరిమితమైన పరిధి వలన ప్రాచుర్యం లోకి రాదు. రాజకీయ నాయకుల అవినీతి వారికున్న పేరు వలన నలుగురికీ తెలిసి, ప్రత్యర్ధుల ఆరోపణలతో మీడియా ద్వారా పబ్లిక్ షో గా మారుతుంది. రాజకీయ నాయకులంతా అవినీతిపరులని ప్రజలు భావించే ఈ కాలం లో, ఎవరైనా నాయకుడు నిజాయితీ గా ఉన్నా అతని పై బురద జల్లటం ఈజీ. “అతను పలానా అవినీతి చేశాడు” అంటే వాస్తవం గా అతను చేయక పోయినా ప్రజలు నమ్మే స్థితి ఉందీవేళ దేశం లో.
మనకు అవకాశం లేకో,డబ్బులేకో, రిస్క్ తీసుకొనే ధైర్యం లేకో, సరైన పరిచయాలు లేకో, నాయకత్వ లక్షణాలూ తెలివీ లేకో, మనం రాజకీయ నాయకులం అవ్వలేదనేది వేరే విషయం.చిన్న చిన్న ఆఫీసు రాజకీయాలకు ఇవేమీ అవసరం లేదు కాబట్టీ, మనం అక్కడ రాజకీయాలు చేస్తాం. రాజకీయుల మీదికి రాళ్ళు విసరటానికి మనలో చాలా మందికి అర్హత ఉండదు. ఎందుకంటే, ఏ పాపం చేయని వాడే ఆ రాళ్ళు విసరాలి కాబట్టీ!
రాజకీయ నాయకులు వెధవలైనపుడు,రాజకీయం సులువైతే, రాజ కీయం లాభసాటి అయ్యినపుడు, మనమే ఎందుకు రాజకీయాలలోకి ప్రవేశించకూడదు? లేక పోతే, మన పిల్లలను ఎందుకు రాజకీయాలలోకి ప్రోత్సహించకూడదు? మనం ప్రోత్సహించం..ఎందుకంటే దానిలో ఉన్న రిస్క్ మనకు తెలుసు కాబట్టీ..రాజకీయాలలో విజయం సాధించాలంటే దానికి అవకాశం వెయ్యి లో ఒకటి కూడా ఉండదు కాబట్టీ. అక్కడ సక్సీడ్ అయ్యే లోగా మనకున్న కొంత డబ్బూ పోగొట్టుకొనే అవకాశం ఎక్కువ కాబట్టీ. కడుపులో చల్ల కదలకుండా కబుర్లు చెప్పుకొనే అవకాశం అక్కడ ఉండదు కాబట్టీ.
ఇక పోతే, రాజకీయ పార్టీల విధానాల గురించీ, వాటి సిధ్ధాంత లేమి గురించీ, వచ్చే ఎన్నికలను దాటి చూడలేని హ్రస్వదృష్టి గురించీ మనం చాలా విమర్శలను పత్రికా సంపాదకత్వాలలో చదువుతూ ఉంటాం.(అదే పత్రికా సంపాదకుడు తనకు ఎదురు తిరిగిన కింది ఉద్యోగిని రాజకీయాలు చేసి అణగదొక్కుతాడనేది గమనించవలసిన విషయం.) వాలు కుర్చీ లో కూర్చొని విమర్శలు చేయటం చాలా సులువు. రాజకీయాలు “సాధ్యమయ్యే విషయాల గురించిన ఒక కళ” అని ఒక నానుడి ఉంది. దీర్ఘ కాలికం గా సిధ్ధాంతం మన గలగాలంటే, ఆ సిధ్ధాంతాన్ని మోసే పార్టీ “ఇవాళ” బతికి బట్ట కట్టాలి. “ఇవాళ” పార్టీ బతకాలంటే, మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో, ఆ పార్టీ ఎన్నికలలో గెలవాలి. కమ్యూనిస్టులు ఒక సారి కాంగ్రెస్ తోనూ, ఇంకొక సారి తెలుగు దేశం తోనూ పొత్తు పెట్టుకొంటున్నారంటే, దానికి కారణం సిధ్ధాంతాన్ని ఒదిలేయటం కాదు. “దీర్ఘకాలికం గా వర్గ రహిత సమాజం సాధించటానికి, స్వల్పకాలికం గా కొన్ని రాజీలు చేసుకొంటున్నాం”, అనే ఆత్మ వంచన. ఇది ఆత్మ వంచన ఎందుకౌతుందంటే, “ఇప్పటి నుంచీ ఒక పదేళ్ళ తరువాత కూడా మన కమ్యూనిష్టులు ఇలాంటి స్వల్పకాలిక వ్యూహాలే అనుసరిస్తూ ఉంటారు”, కాబట్టీ. వారి రాజీ కి అంతు లేదు. వారి దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు లో పెట్టే రోజు ఎప్పటికీ రాదు. సమైక్య వాద పార్టీ అయిన తెలుగు దేశం, ప్రత్యేక తెలంగాణా కి అనుకూలం గా మారటం కూడా ఇలాంటి కారణాల వలననే. ప్రత్యేక వాదానికి మద్దతునివ్వకుంటే “ఇవాళ” తెలంగాణ లో తెలుగు దేశం పార్టీ కి మనుగడ లేదు. “ఇవాళ” బతికి బయట పడక పోతే ఆ పార్టీ కి “రేపు” ఎలా ఉంటుంది? రేపు లేని పార్టీకి, “ఒక దీర్ఘ కాలిక ఆదర్శం అయిన సమైక్య వాదం”, ఉండి కూడా ఉపయోగం లేదు. రాజకీయ పార్టీలు “పార్టీ కి సిధ్ధాంతమే ముఖ్యం, సిధ్ధాంతం ఉండేది వోట్ల కోసం కాదు, వోట్లు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి” అనుకొంటే, మన వ్యవస్థ లో అలాంటి పార్టీ ల కథ మూణ్ణాళ్ళ ముచ్చటే అవుతుంది. గిరీశం చెప్పినట్లు, “అప్పుడప్పుడూ మాట మారుస్తూ ఉంటేనే”, రాజకీయ పార్టీలు తమ మనుగడ సాగిస్తాయి.
డబ్బు తీసుకొని ఓట్లు వేసే జనాలు ఉన్నప్పుడు, ఆ డబ్బును పంచే రాజకీయ పక్షాలను తప్పుపట్టటం, కుల మత ప్రాంతాలను చూసి రెచ్చిపోయి కొట్టుకొనే జనాలు ఉన్నప్పుడు, వాటిని ఉపయోగించుకొనే పార్టీలను తప్పుపట్టటం, తాగిన వాడిని కాక అమ్మిన వాడిని కొట్టినట్లు ఉంటుంది.
ఆంధ్ర లో కులాల గురించిన ఒక కథ..కొంచెం పెద్దది
15 మే 2011 అభిప్రాయములు
in కథలు, రాజకీయం, సమాజం ట్యాగులు:కులం, caste, kulam
ఓ అమెరికా వాడి రైలు బండి ప్రయాణం
ఉదయం ఎనిమిది గంటలు.చెన్నై సెంట్రల్ స్టేషన్ లో ఉన్న పెద్ద టీవీ తెర ముందు కూర్చొని, తీరికగా ఒక ఇంగ్లీష్ నవల పేజీలు తిప్పుతున్నాడు హారీ. పక్క సీట్ లో ఉన్నతన లాప్ టాప్ బ్యాగ్ వైపు అప్పుడప్పుడూ చూస్తున్నాడు.
“ఇండియా లో దొంగతనాలెక్కువ. జాగ్రత్త గా ఉండాలి”, అని చెప్పాడు హారీ అనబడే హరికృష్ణ కి వాళ్ళ ‘డాడ్ అనబడే నాన్న’. ఆయన అమెరికా లోని కాలిఫోర్నియా లో ఉంటాడు.
“ఎక్స్ క్యూజ్ మీ..కెన్ ఐ సిట్ హియర్?”, ఎవరో అంటే తలెత్తి చూశాడు హారీ. ఓ వ్యక్తి పక్క సీట్లో ఉన్న హారీ లాప్ టాప్ వైపు చెయ్యి చూపిస్తూ అడుగుతున్నాడు.
“హౌ కెన్ ఐ టెల్ ఇఫ్ యు కెన్ సిట్ ఆర్ నాట్..ఇఫ్ యువర్ బాక్ ఈజ్ నాట్ స్ప్రేయిండ్ యు షుడ్ బి ఏబుల్ టు సిట్” అని పెద్దగా నవ్వేశాడు హారీ.
తన లాప్ టాప్ తీసుకొని ఒళ్ళో పెట్టుకొని పక్క సీట్ వైపుకి చేత్తో చూపిస్తూ, “అయాం కిడ్డింగ్…ప్లీజ్ సిట్” అన్నాడు ఆ మనిషి తో. “ఇండియన్ ఇంగ్లీష్ ఈజ్ ఫన్నీ యు నో. సం టైంస్ వి అమెరికన్స్ గెట్ ఇట్ రాంగ్” అన్నాడు అమెరికన్ ఆక్సెంట్ లో.
“మీరు అమెరికనా?” ఇంగ్లీష్ లో అన్నాడా వచ్చిన వ్యక్తి, పక్క సీట్లో కూర్చొంటూ.
“మా నాన్న డెబ్భై ల లో అమెరికా లో సెటిల్ అయాడు. నేను అక్కడే పుట్టి పెరిగాను. కాబట్టీ నేను ఖచ్చితం గా అమెరికన్ నే”, అన్నాడు హారీ ఒకింత గర్వం గా . .
సంభాషణ ఇంగ్లీష్ లోనే కొనసాగుతోంది..
“నా పేరు సుబ్బారావు”, అని చేయి చాపాడు వచ్చినతను.“హారీ …హరికృష్ణ..” అని చెయ్యి కలిపాడు హారీ.
“మీరు ఎక్కడికి వెళ్తున్నారు?”
“హైదరాబాద్”.
“ఓ..! నేనూ అక్కడికే..నేను విజయవాడ వరకూ నవజీవన్ లో వెళ్ళి అక్కడి నుంచీ కోణార్క్ పట్టుకుంటాను..మరి మీరు?” అడిగాడు సుబ్బారావు
“నేనూ అంతే “
“పగలు ప్రయాణం పెట్టుకున్నారేమిటి సార్?అయినా మీరు ట్రైన్ లో వస్తున్నారేంటండీ..ఫ్లైట్ టిక్కెట్లుదొరకలేదా?”
హారీ, “వీడికెందుకు, నోసీ ఇండియన్”, అని మనసులో అనుకొని, ఇలా అన్నాడు, “హైదరాబాద్ నుంచీ వచ్చేటప్పుడు ప్లేన్ లోనే వచ్చాను. ఇక్కడి అమెరికన్ కాన్సులేట్లో పని ఉండి వచ్చాను. కానీ ఇప్పుడు ట్రైన్ లో వెళ్తున్నాను. దీనికి ఓ కారణం ఉంది. నేను ఒక ‘ఇండో అమెరికన్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం’ లో రీసెర్చ్ చేయటానికి అమెరికా నుంచీ హైదరాబాద్ వచ్చాను. ‘ద సోషల్ గ్రూప్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’ అనే విషయం మీద పరిశోధన చేస్తున్నాను. మా నాన్న చెప్పాడు, “ఆంధ్ర లో ఉండే వివిధ వర్గాల ప్రజల గురించి కొంచెం ప్రాక్టికల్ గా తెలుసు కోవాలంటే ఓ సారి సెకండ్ క్లాస్ లో ట్రెయిన్ ప్రయాణం చెయ్యి” అని. దీనికి పగలు ప్రయాణం అయితేనే మెరుగు…కాస్త జనాలతో మాట్లాడవచ్చు.. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.”
“మీరు జెనరల్ క్లాస్ లో వెళ్తే మీకు జనాల గురించి ఇంకా విపులం గా అర్ధమౌతుంది…కానీ మీరు జెనరల్ లో ప్రయాణం చెయ్యలేరులెండి….ఇంతకీ.. మీకు తెలుగు వచ్చా?”
“తెల్గూ అర్ధమౌతుంది..కొంచెం నెమ్మది గా మాట్లాడ గలుగుతాను”,
“కానీ మీరు ఇక్కడి సామాన్య జనాలతో మాట్లాడటం చాలా కష్టం కదా…!మీ అమెరికన్ ఆక్సెంటూ..మీ తెలుగూ వాళ్ళకి అర్ధం కాదు”,సందేహం వెలిబుచ్చాడు సుబ్బారావు.
“చెన్నై లో ఉండే తెలుగు ఫ్రెండ్ ఒకతను నా కూడా వస్తానన్నాడు.చివరి నిమిషం లో ఫోన్ చేసి రానని చెప్పాడు”, అని వాటర్ బాటిల్ ఎత్తి నీళ్ళు తాగి,”మీరేం చేస్తారు?” అన్నాడు హారీ.
“నేను గ్రాడ్యుయేట్ అయ్యింది కామర్స్ లో. ఓ ప్రైవేట్ బాంక్ లో మానేజర్ గా పని చేశాను..దాదాపు ఆంధ్రా అంతా తిరిగాను.. ఓ సంవత్సరం కిందట రిజైన్ చేసి హైదరాబాద్ లో సొంత వ్యాపారం ఒకటి పెట్టాను”, అని, “అవునూ మీరు ఆంధ్రా లోని జాతుల గురించి అధ్యయనం చేస్తున్నారు కదా, మీ కులమేదో మీకు తెలుసా?”
“వీడేంటబ్బా..! ఇవ్వక పోయినా చనువు తీసేసుకొంటున్నాడు!”, అని మనసు లోనే అనుకొని, “నా మాతృభాష తెలుగు అని తెలుసు…ఇండియా లో కులాలు అని ఉంటాయి అని తెలుసు…కొన్ని పై కులాలు..కొన్ని కింది కులాలు…కానీ నా కులం నాకు తెలీదు…బహుశా మా డాడ్ కి తెలిసి ఉంటుంది. ఈ సారి నాన్న తో చాట్ చేసినప్పుడు అడగాలి” అన్నాడు. ఒక్క క్షణమాగి, “మీ కులమేమిటి?” అనడిగాడు.
“నాకూ నా కులం తెలియదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ హైదరబాదు లోని ఓ అనాధాశ్రమం లోపెరిగాను. వార్డెన్ నా పేరు సుబ్బారావు అని పెట్టాడు. అది కామన్ గా ఉండే పేరు కదా? నేను నల్లగా ఉన్నాను కాబట్టీ నా ఇంటి పేరు నల్లతోలు అని రిజిస్టర్ లో రాశాడు. సో, నా పేరు నల్ల తోలు సుబ్బారావు అయ్యింది”
హారీ, “ఏమి కథలు చెప్తున్నాడు..!” అనుకొని..”ఏమైనా ఇండియన్స్ తో జాగ్రత్త గా ఉండాలి..డాడ్ చెప్పనే చెప్పాడు”, అనుకొన్నాడు.
” మీకు ఇండియా ఎలా అనిపిస్తోంది సార్ ?”
“ఇండియా నాకు కొత్తేమీ కాదు. మా డాడ్ తో పాటు వస్తూ ఉండే వాడిని..కానీ ఈ రైల్వే స్టేషన్ లో ఈ జనాలను చూసిన తరువాత ఈ ప్రయాణం ఎలా చేయగలనా అనిపిస్తోంది. దానితో పాటు జనాల తో మాట్లాడాలి..నా ఫ్రెండేమో రాలేదు.”
“మీ రీసెర్చ్ కోసం దానికి సంబనిధించిన పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది కదా? మీరు ఈ ట్రెయిన్ ప్రయాణం ఎందుకు మొదలుపెట్టారో నాకు ఇంకా అర్ధం కావటం లేదు”
“పుస్తకాలు ఒక విషయం గురించి లాంగ్ వ్యూ ని ఇస్తాయి. అడవి లో ఉన్న ఒక కొండ ఎక్కి కిందకి చుట్టూ చూశామనుకోండి, దూరం గా పచ్చటి చెట్లు గుబురు గా కనపడతాయి. కానీ ఆ చెట్లకింద ఏమి ఉందో కనపడదు. ఏ చెట్టు ది ఏ కాయో తెలియదు. ఇదంతా తెలియాలంటే అడవి లోకి వెళ్ళి చెట్ల కింద చూడాల్సిందే కదా?”
దానికి సుబ్బారావు, “నా బ్రతుకు అంతా ఈ ఆంధ్రప్రదేశ్ అనే అడవి లో చెట్లకిందే గడిచింది. ఏ చెట్టు ఏ జాతిదో, ఏ చెట్టు కింద ఏ మొక్క పెరుగుతుందో ఇట్టే కని పెట్టేస్తాను.ఏ చెట్టు కి ఏ కాయ కాస్తుందో..ఆ కాయ రుచి ఏమిటో కూడా చెట్టుని చూసి కనిపెట్టేస్తాను. మీకు ఏమైనా సందేహాలుంటే నన్నడగండి” అన్నాడు సుబ్బారావు.
“వీడేంటబ్బా అందిస్తే అల్లుకు పోయే వాడిలా ఉన్నాడు!”, అని తనలోనే అనుకొని, “చూడండి మిస్టర్ రావ్, నాకు ఈ ఆంధ్రా లో ఉన్న సమాజం అనేది మీరు కాలేజీ లో చదివిన అకౌంటెన్సీ లాంటి ఒక సబ్జెక్ట్ లాంటిది. దీని గురించి నేను కొండ మీది నుంచీ చూసి నా బుధ్ధి మాత్రం ఉపయోగించి తెలుసుకొంటున్నాను. దీనికి నా భావావేశాలతో ఏ మాత్రం సంబంధం లేదు. నా అంచనా ప్రకారం మీ భావావేశాలకూ లంకెలేదు. ఇక్కడి సాంఘిక వ్యవస్థ కి మీరు కూడా ఒక బయటి వ్యక్తే . కానీ మీరు ఇక్కడి పరిణామాలన్నింటినీ దగ్గర గా చూశారు. “నిజమైన వ్యక్తులూ, ఈ సమాజిక వ్యవస్థ లో వారి సాధక బాధకాలూ, ఆవేశ కావేశాలూ. ఈ ఆంధ్ర లో ఒక దళితుడి మనో భావాలేమిటి…ఒక ముస్లిం ఫీలింగ్స్ ఏమిటి…ఒక అగ్ర కులస్థుడి పరిస్థితి ఏమిటి? ఒక తెలంగాణా వాది ఆవేశం ఎందుకు?”,… ఇదీ నాకు కావలసినది. మీరు మంచి కలుపు గోలు వ్యక్తి లా ఉన్నారు. ఈ ప్రయాణం లో మీరు నాకు మామూలు జనాలతో ఒక యాంకర్ లా పనిచేస్తారా? దానికి మీకు కొంత డబ్బు కూడా ఇస్తాను” హారీ మైండ్ కి రైల్లో జనాలతో మాట్లాడటానికి ఇంతకంటే మంచి తోవ కనపడలా.“సరే”, అనేశాడు సుబ్బారావు.”మీ సీట్ నంబర్ ఎంత సార్?” అని హారీ దగ్గరినుంచీ టికెట్ తీసుకొని చూసి,”ఓ కే సార్ టీ సీకి చెప్పి, నా సీట్ కూడా మీ సీట్ దగ్గరికి మార్పించుకొంటాను”, అన్నాడు సుబ్బారావు.
ఈ లోగా వాళ్ళ ట్రైన్ బయలుదేరుతున్నట్లు అనౌన్స్ అయ్యింది. ఇద్దరూ లేచి ట్రైన్ వైపు నడక సాగించారు.
*************************
తమిళుడి లాగా అడ్డపంచె చుట్టి , ఓ చేతి లో సిగరెట్ పట్టి, ఇంకో చేతిలో క్యాష్ బాగ్ తో ప్లాట్ ఫారం మీదికొచ్చాడు మాగుంట దయాకర రెడ్డి. జుట్టు అక్కడక్కడా తెల్లబడింది. ఆయనకో నలభై ఐదు ఏళ్ళు ఉండవచ్చు. తొంభయ్యవ దశకం మొదట్లో రొయ్యల చెరువులేసి బాగానే సంపాదించాడు. మెడలో బంగారు గొలుసూ చేతిలో నాలుగు వేళ్ళకీ ఉంగరాలు.
ప్లాట్ ఫాం మీద నాటు గా ఉన్న ఓ పల్లెటూరి పడుచు కనపడింది. ఆమె ను చూస్తే కావలి లో ఉన్న తన కీప్ గుర్తుకొచ్చింది దయాకర్ రెడ్డి కి. “దీని గుడ్డలూడ దీస్తే బ్రమ్మాండం గా ఉంటది”, అనుకొన్నాడు మనసులో. ఆయన రిజర్వేషన్ చేయించుకోలేదు కానీ, “టీ సీ కి ఓ యాభయ్యో వందో కొడితే ఫైను రాసేస్తాడుగదా.. . దానికేమీ భయపడ బళ్ళా” అనుకొని కదులుతూ ఉన్నసెకండ్ క్లాస్ భోగీ లోకి ఎక్కాడు. హారీ, సుబ్బారావూ అక్కడ కూర్చొని ఉన్నారు. దయాకర రెడ్డి సిగరెట్ బయటికి విసిరేసి బాగ్ లోంచీ ఆ రోజు సాక్షి పేపర్ తీశాడు.
సుబ్బారావు ఆయన్ని చూసి, “ఎక్కడికెళ్తున్నారు సార్?” అన్నాడు.
“నెల్లూరు పోవాల”,అన్నాడు రెడ్డి. “మరి మీరు?” అని ఇద్దర్నీ చూశాడు. వాళ్ళు చెప్పారు.
“నెల్లూరంటే రొయ్యల చెరువులకి ప్రసిధ్ధి కదా. ఇప్పుడెలా ఉన్నాయి సార్?”
“బాగానే ఉండాయి..కానీ ఈ మధ్య కౌంటు తగ్గుతాంది…రేటూ తగ్గింది..”, అని బాగ్ లోంచీ సాక్షి పేపర్ తీశాడు.ట్రయిన్లో మిడ్డీ వేసుకొన్న ఓ టీనేజ్ అమ్మాయి పోతోంది. ఆ అమ్మాయి వైపు అసహనం గా చూసి, “మాధవి లా చక్క గా చుడీదార్ లు వేసుకోవచ్చు కదా..!”, అనుకొన్నాడు తన కూతుర్ని గుర్తు తెచ్చుకొంటూ. పేపర్ లో హెడింగ్స్ చదవటం మొదలెట్టాడు.
సుబ్బారావు పేపర్ లో రెండు షీట్లు అడిగి తీసుకొని చదువుతూ..”సార్, రాజశేఖర రెడ్డి చావు వెనక కుట్ర ఉందంటున్నారే ..నిజమేనంటారా..?” అన్నాడు.
వెంటనే దయాకర రెడ్డి, “నిజమేనండీ, పెద్ద లెవల్లోనే ఏదో కుట్ర జరిగి ఉంటుంది”, అన్నాడు.
అది విని, “ఈయన రెడ్డి లాగా ఉన్నాడే..అయినా కన్ ఫం చేసుకొందాం..”, అనుకొని, “నా పేరు చెప్పనే లేదు..అయాం సుబ్బారావు..ఈయన హరి కృష్ణ..అమెరికా నుంచీ వచ్చారు”, అన్నాడు.
“నా పేరు దయాకర రెడ్డి”, అని హారీ వైపుకు తిరిగి “మీరు ఏం చేస్తారండీ” అన్నాడు దయాకర రెడ్డి.
హారీ వచ్చీ రాని తెలుగు లో ఏదో చెప్పాడు.
రెడ్డి, “సార్ మీరు మాట్లాడింది ఒక్క ముక్కా అర్ధం కాలా”, అంటూ నవ్వేశాడు.
“ఏదేమైనా ‘వైఎస్సార్ ‘గొప్ప నాయకుడు సార్. ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తోంది. రాష్ట్రమంతా గొడవలుగా ఉన్నాయి. అతను ఉండి ఉంటే ఈ గలటా లు వచ్చేవి కావు” అన్నాడు సుబ్బారావు.
“కరక్టే! గట్టోడే!”
“కానీ ఆయన హయాం లో కరప్షన్ కూడా ఎక్కువ గానే జరిగినట్లుంది సార్..! “
“తినేటప్పుడు తిన్నాడు, చేసే టప్పుడు చేశాడు. ఈ రోజులలో తినకుండా ఎవరు చేస్తాండారు?”, అన్నాడు దయ.
“వాళ్ళ కొడుకు జగన్ కి మైనింగ్ కుంభకోణం తో సంబంధాలున్నాయంటున్నారు కదా సార్?”
“ఆ ..,అదంతా అపోజిషనోడు చేసే గోల. కరక్టు కాదు. కుర్రోడు వాళ్ళ నాన్న లాగే స్టఫ్ఫున్నోడు”, అన్నాడు దయ.
“మీకు జగన్ వ్యక్తిగతం గా తెలుసా?” అన్నడు హారీ.
దానిని సుబ్బారావు తెలుగు లోంచీ తెలుగు లోకి అనువదించి రెడ్డి ని అడిగాడు.
“అబ్బే…, వాళ్ళెక్కడ, మనమెక్కడ సార్..! “
” మరి ఆయన స్టఫ్ ఉన్నోడని ఈయనకెలా తెలిసిందభ్భా..!” అనుకొని, “మీకు వై ఎస్సార్ వలన వ్యక్తి గతం గా ఏమన్నా లాభం కలిగిందా?” అన్నాడు హారీ.
“నాకేమి లాభం? …..లేదు”.
“ఈ ఇండియన్స్ అంతా ఒట్టి క్లానిస్టిక్ ట్రైబల్ వెధవల్లా ఉన్నారు”, అనుకొన్నాడు హారీ.
“మద్రాస్ లో మీకు ఏం పని సార్?”, అన్నాడు సుబ్బారావు.
“లాయర్ తో పనిబడింది. నా పార్ట్ నర్ లోకేశ్వర రెడ్డి ఉళ్ళా, వాడు మొన్నటి దాకా బాగనే ఉండేవోడు. ఈమద్దెన వాడికీ నాకూ ఓ విషయం లో గలాటా అయ్యి విడిపడ్డాము. దాని గురించిన వ్యవహారాలు మాట్లాడటానికి లాయర్ దగ్గిరికి పోయినా”.
ఇంతలో దయాకర రెడ్డి టాయ్ లెట్ కి వెళ్ళాడు.
సుబ్బారావు హారీ తో, “సార్ మనం ఇలానే వచ్చే వాళ్ళతో మాట్లాడి తే సరి పోతుందా? లేక పోతే ట్రైను అంతా తిరిగి ఫ్రాంక్ గా సార్ కి ఇంటర్వ్యూ కావాలని చెప్పి జనాలతో మాట్లాడదామా?”,అన్నాడు.
“ఇంటర్వ్యూ అయితే జనాలను సహజమైన మూడ్ లో చూడ లేము. మనం తక్కువ మందిని కలుసుకో గలిగినా ఈ పధ్ధతే మెరుగు అన్నాడు”, హారీ.దయాకర్ రెడ్డి తిరిగి వచ్చి, “ఏం సార్, పాపం అమెరికా అంతా అదేంటో రిసెషన్ లో పడినదంటే! ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఆడ?” అన్నాడు హారీ తో.
” ‘యూ ఎస్ ఏ’ కి ఏమీ పరవాలేదు..ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ సూన్..” అన్నాడు హారీ ఒకింత గర్వం గా.
సుబ్బారావు లోపల్లోపల, “ఈ అమెరికా మనిషి కి కూడా కుల పిచ్చి ఉంది..ఈయన కులం పేరు అమెరికా కులం” అనుకొని, “, “అమెరికా మీద జాలి చూపించొద్దు. సార్ కి కోపమొస్తుంది. ఆయన అమెరికా వాడే కదా”, అన్నాడు.
ఈ విషయం దయాకర రెడ్డి కి అస్సలు అర్ధం కాలా, ” సార్ అమెరికా వాడు ఎలా అవుతాడు? వాళ్ళ నాన్న… కాదు..వాళ్ళ తాతల నుంచీ అమెరికా లో ఉన్నా, సారు ఇండియనే”, అన్నాడు.ట్రెయిన్ ఓ దళిత బస్తీ గుండా పోతోంది. అంబేద్కర్ విగ్రహం ఒకటి కనపడుతోంది. హారీ అన్నాడు, “ఐ గెస్ థట్స్ ది బస్ట్ ఆఫ్ అంబేద్కర్. ఆయన భారత రజ్యాంగ నిర్మాత కదా?”
రెడ్డి, “అందుకొని.ఆయనే రిజర్వేషన్లు పెట్టాడు. ఈ రిజర్వేషన్ల వలన మా లాంటి వాళ్ళకి చానా నష్టం. చాలా వరకు మాలా మాదిగలు వాటి వలన బాగు పడ్డారు” అన్నాడు.
సుబ్బారావు,”ఏం బాగు పడటం లే సార్. ఇంకా చాలా చోట్ల అణచివేత కు గురౌతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న చుండూరు సంఘటనే ఒక రుజువు”,అని కీ ఇచ్చాడు.
రెడ్డి కి ఆవేశం వచ్చింది. ఆయన ఆలోచనలు ఆవేశాన్ని ఫాలో అవ్వసాగాయి. “ఆడ వాళ్ళని అల్లరి చేస్తే ఎందుకు కొట్టరు? మొన్నటి దాకా మా మోచేతి నీళ్ళూ తాగే వాళ్ళు మా ఆడ వాళ్ళని అల్లరి పెడతారా..?”, అన్నాడు.
సుబ్బారావు, “కొట్టటం కాదు సార్..చంపారు కదా?”, అన్నాడు.
దానికి రెడ్డి,”వాళ్ళూ తరవాత చంపారు కదా?”, అన్నాడు.రెడ్డి ఆవేశం చూస్తే ఒక సంఘటన గుర్తుకొచ్చింది హారీ కి. అతను రీసెర్చ్ మొదలు పెట్టటానికి ముందు అమెరికా లో ఒక చిన్న ఐ టీ ఉద్యోగం చేశాడు. ఒక సారి హారీ, వాళ్ళ బాస్ చేసిన డిజైన్ లో ఒక లోపాన్ని కొంచెం హార్ష్ గా విమర్శించి, ఆ డిజైన్ తో ముందుకు పోవటానికి నిరాకరించాడు. తరువాతి రోజు హారీ ని వాళ్ళ బాసు ఫైర్ చేశాడు.ఒక చిన్న ధిక్కారానికి హారీ పెద్ద మూల్యం చెల్లించుకో వలసి వచ్చింది. పవర్ ఈక్వేషన్స్ అలా ఉంటాయి మరి.
సుబ్బారావు ఇచ్చిన కీ దయాకరరెడ్డికి ఏమాత్రం నచ్చలా.మనసులోసుబ్బారావుని, “లేబర్ నాకొడుకు”, అని తిట్టుకొన్నాడు. ఈలోగా ‘టీ సీ’ వచ్చి టికెట్లు చెక్ చేయటం మొదలు పెట్టాడు. రెడ్డి నుంచీ ఓ యాభై నొక్కి, ఆయనకు పక్క భోగీ లో వేరే సీట్ చూపించి, అక్కడ కూర్చోమని చెప్పి,వెళ్ళిపోయాడు. రెడ్డి పేపర్ లో షీట్స్ అక్కడే మర్చిపోయి పక్క భోగీ లోకి వెళ్ళిపోయాడు.
************************
ట్రెయిన్ నెల్లూరు స్టేషన్ కి వచ్చింది. హారీ సుబ్బారావు ని అడిగాడు, “మీకు పెళ్ళి అయిందా?”.
“లేదు సార్, కుటుంబ నేపధ్యమూ కులమూ మతమూ లేని వాడికి పిల్లనెవరు ఇస్తారు? నాకేమో ఆడ పిల్లలతో మాట్లాడే కలుపుగోలు తనం లేదు”
జనాలు సందడి గా ట్రెయిన్ ఎక్కుతున్నారు.
షేక్ మస్తాన్ వలి తన పద్దెనిమిదేళ్ళ కూతురు రజియా తో కలిసి భోగీ ఎక్కాడు. వచ్చి సుబ్బారావు పక్కన కూర్చొని,”ఆడ కూర్చోమ్మా”,అని చెయ్యి చూపించి కూతుర్ని కూర్చోమన్నాడు.
“ఎక్కడి వరకూ సార్”, అన్నాడు సుబ్బారావు మస్తాన్ తో.
“ఓంగోలు దాకా సార్. కసునూరు దర్గా కి వచ్చినాము. అమ్మాయి ఎంసెట్ రాస్తా ఉంది, ఇంజనీరింగ్ కి. బాగా రాయాలని దర్గా కి పోయి వస్తన్నాము”, అన్నాడు మస్తాన్ వలి.
సుబ్బారావు తన లో, “తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు..దూదేకుల సాయిబ్బేమో…!”, అనుకొని, ఆ అమ్మాయి వంక చూసి..”బాగానే ఉంది… బురకా వేస్కోలేదేమిటో…!” అనుకొన్నాడు.
సుబ్బారావు కి తను చదువుకొనేటప్పుడు తన దోస్తు అనే ఒక మాట గుర్తుకొచ్చింది, “తులం బంగారమిచ్చి అయినా సరే తురకమ్మాయి పక్క కి చేరాలి…”,నవ్వుకొన్నాడు సుబ్బారావు. మస్తాన్ వలీ వైపు చూశాడు. ” ఆ గెడ్డం ఎందుకో వీడికి..! మీసాలు మాత్రం లేవు..వీడి గడ్డం తరగా..నెత్తి మీద ఆ కాప్ ఎందుకు?నేనే ముస్లిం నని పెద్ద బడాయి..జన జీవనం లో కలిసి పోవచ్చు కదా…?”
ఇంత లో ఓ ముస్లిం కొలీగ్ చెప్పింది గుర్తుకు వచ్చింది సుబ్బారావు కి. …దాని ప్రకారం..”గెడ్డం పెట్టుకొంటే ఎక్కువ పుణ్యం లాంటిది వస్తుందట…”సాయిబ్బుల గడ్డాన్ని, ఒక హిందువు బొట్టు పెట్టుకోవటం తో సమానం గా చూడు భాయీ”, అన్నాడు వాడు సుబ్బారావు తో.
సుబ్బారావు ఆలోచనల పరంపర కొన సాగుతోంది, “అయినా నాకెందుకు వీడి మీద అసహనం…? నేను కూడా ఒక సాయిబ్బు గా పుట్టానేమో ఎవరికి తెలుసు? పెరగటం మాత్రం హిందూ పధ్ధతికి దగ్గరగా పెరిగాను..ఒక వేళ ముస్లిం గా పెరిగితే ఇతనిలానే గడ్డం పెంచుకొనే వాడినేమో…! నేను అనాధని. నాకు సాంస్కృతికం గా వంశపారంపర్యం గా వచ్చింది ఏమీ లేదు”, అనుకొంటూ హారీ వైపుకి చూశాడు. ట్రెయిన్ కదిలి ఊరి బయటకు వచ్చింది. హరీ పొలాల వైపుకు చూస్తున్నాడు. సుబ్బారావు, “ఇతను కూడా సాంప్రదాయ పరం గా ఒక అనాధే.ఇతని తాతల పధ్ధతుల గురించి ఇతనికి ఏ మాత్రం అయిడియా ఉంటుంది?”, అనుకొని, “సార్ మీకు రామాయణ భారతాలు తెలుసా?”, అన్నాడు హారీ తో.
దానికి హారీ, “మా నాన్న కి భారతీయ సాంప్రదాయం అంటే ఇష్టం. నా చేత అన్ని పురాణాలూ చదివించారు.నేను అమెరికన్ అవ్వటానికి ఎంత గర్వ పడతానో నా హిందూ మూలాల గురించి అంతే గర్వ పడతాను. మా అమ్మ అయితే ఇంకా చీరలే కడుతుంది”
సుబ్బారావు కి హఠాత్తు గా వెలిగింది మస్తాన్ వలీ గడ్డమూ నెత్తి మీదటోపీ ఎందుకు పెట్టుకున్నాడో.
“ఇక అసలు పని లోకి దిగాలి అనుకొని”, సుబ్బారావు మస్తాన్ వలీ తో పరిచయాలు చేసుకొని మాటలు మొదలెట్టాడు.
“మీరు ఏమి చేస్తారండీ?”
“ఓంగోలు స్కూల్లో సైన్స్ టీచర్ ని”, అన్నాడు మస్తాన్ వలీ.
“మీ అమ్మాయికి ఇంజనీరింగ్ లో సీట్ వస్తే తరవాత పై చదువులకి అమెరికా పంపిస్తారా?”
మస్తాన్ వలీ అవునని తలూపాడు.
“ఆశ్చర్యమే. మీ మతం ఆడ పిల్లలకి విద్య ని ఆమోదించదు కదా?”, అన్నాడు సుబ్బారావు.
“అవన్నీ మూఢ విశ్వాసాలు సార్. ఏ మతం లో అయినా అసలైన విశ్వాసాలు కొన్ని ఉంటే..సామాన్య ప్రజలు ఆచరించే మూఢ విశ్వాసాలు కొన్ని ఉంటాయి”,అని..ఇంకా ఇలా అన్నాడు,”మత స్థాపకులకు సత్య దర్శనమౌతుంది..ఆ సత్యాన్ని మిగిలిన సాధారణ మానవులు చూడటానికి వారు కొన్ని సులువైన సూత్రాలను పొందు పరుస్తారు. కొందరు స్థాపకులు ఈ సూత్రాలను మార్చే విషయం లో ఉదారం గా ఉంటే మరి కొందరు కఠినం గా ఉంటారు. రెండు విధానాల లోనూ లాభ నష్టాలున్నాయి. మత సూత్రాలను సులువు గా మార్చ గలిగితే, స్థాపకుడి తరువాత వచ్చే సత్య దర్శనం కాని అనుచరులు వక్ర భాష్యం చెప్పటానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మత స్థాపకుడి మూల సూత్రాల సారం కల్తీ కాబడుతుంది. అందుకనే మా ప్రవక్త మూల సూత్రాల విషయం లో చాలా స్థిరం గా ఉన్నాడు. అయితే దీని వలన ఒక నష్టం ఉంది. మూల సూత్రాల లో కొన్ని సామాజిక నియమాలకి సంబంధించిన సూచనలు స్థాపకుడి కాలానికి సంబంధించినవి. అవి కాలం తో పాటు మారాలి. ఇస్లాం యొక్క స్థిరమైన విధానం వలన ఈ మార వలసిన విషయాలు కూడా మారలేదు. వీటిని ఎవరికి వారు వ్యక్తిగతమైన స్థాయి లో అన్వయించుకోవాలి. “” “మీరు దర్గా కి పోయి వస్తున్నాను”, అంటున్నారు..దర్గా ల కి పోవటం అసలైన ఇస్లాం ప్రకారం సరి కాదు గదా?
“ఆ..ఏదో మా ఆవిడ పోరు భరించలేక వెళ్ళి వస్తున్నాం..”
“ఏదేమైనా మీ మత విషయాల గురించి తెలుగు లో నాతో ఇలా విపులం గా చెప్పిన వాళ్ళు లేరు సార్”, అన్నాడు సుబ్బారావు.
“అక్కడే ఉంది సమస్య..ఇస్లాం గురించిన సాహిత్యం మన తెలుగు లో చాలా తక్కువ. ఎవరైనా పూనుకొని తెలుగులో రాయాలి”, అన్నాడు మస్తాన్.హారీ కల్పించుకొని, “అమెరికా గురించి మీ అభిప్రాయమేమిటి?”, అన్నాడు మస్తాన్ తో… .
“నాకు అమెరికా జనాల గురించి ఎటువంటి ద్వేషం లేదు సార్. ఇస్లాం ద్వేషానికి వ్యతిరేకం..ఇస్లాం అంటేనే శాంతి అని కదా అర్ధం..నా ప్రాబ్లం బుష్ సమయం లో అమెరికా విదేశీ విధానాల గురించే. ఇప్పుడు పరిస్థితి మెరుగయ్యింది…ఇప్పుడు అమెరికా అధ్యక్షుడే ఒక ముసల్మాన్ కి పుట్టిన వాడు కదా?”కాసేపాగి మస్తాన్ నమాజుకు లేచాడు. మస్తాన్ నుదుటి మీద అడ్డం గా నల్ల గీత పడి ఉంది. అది చూసి, “అబ్బో సాయిబ్బు గారు భక్తుడే, కోస్తా ముస్లిం ల లో సాధారణం గా ఇంత భక్తి ఉండదే..!”, అనుకొన్నాడు సుబ్బారావు. ఇంతలో అతనికి ఒక సందేహం కలిగింది. “మీరు మక్కా వైపుకి తిరిగి నమాజ్ చేయాలి కదా..ట్రెయినేమో అన్ని దిక్కులలోకీ తిరుగుతూ ప్రయాణం చేస్తోంది..మరి మీకు మక్కా దిశ ఎలా తెలుస్తుంది…ఒక్కో సారి మీరు అదిగో ఆ కనిపించే గుడి లో దేవుడి కి నమాజ్ చేసినట్లు అవుతుంది కదా..?”
మస్తాన్ కి సుబ్బారావు ఎగతాళి చేస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. “నేను వీళ్ళ బొమ్మలకీ..రాళ్ళకీ రప్పలకీ మొక్కడమేమిటి…?”,అనుకొన్నాడు. పైకి మాత్రం,”దిక్కు అనేది రయిల్లో ఉన్నప్పుడు సాధ్యం కాదు. కానీ మనసు లో మక్కా ని పెట్టుకొంటే చాలు…అయినా మీ హిందువులు లింగానికి మొక్కడం కంటే ఇది అన్యాయం కాదు కదా అన్నాడు”.
సుబ్బారావు కి పరిస్థితి సజావు గా లేదనిపించి మౌనం వహించి ఓంగోలు కోసం ఎదురు చూడ సాగాడు.
********************
మస్తాన్ నమాజ్ అయ్యేటప్పటికి ఒంగోలు వచ్చేసింది. కూతురి తో సహా ఆయన దిగి వెళ్ళిపోయాడు. మస్తాన్ వెళ్ళిన తరువాత సుబ్బారావు హరీ తో, “దయాకర రెడ్డీ, మస్తాన్ వలీ కేసుల వలన నాకొకటి అర్ధమయ్యింది. జనాల నిజ స్వరూపం తెలుసుకోవాలంటే ప్రైవసీ లిమిట్స్ దాటి వాళ్ళని కెలకాలి. అలా కెలికితే వాళ్ళకు చిరాకు పుట్టి కొట్టినా కొడతారు. కాబట్టీ మిస్టర్ హారీ, ఈ జనాల వలన నాకు కన్నో కాలో పొతే మీదే బాధ్యత. మీరే నష్ట పరిహారం ఇవ్వాలి” అన్నాడు.
దానికి హారీ హాయిగా నవ్వేసి,” మీకు దేహశుధ్ధి జరగకుండా చివరి నిమిషం లో తప్పించుకొనే నేర్పు ఉందని నాకు తెలుసు మిత్రమా. అందుకే ఈ పని మీకు ఇచ్చాను”,అన్నాడు.
ఇంతలో ఒకతను వచ్చి టికెట్ చేతి లో పట్టుకొని, సీట్ నంబర్ల కోసం కిందా పైనా చూస్తున్నాడు. అతని మెడలో సిలువ వేలాడుతోంది. సుబ్బారావు, “మీ సీట్ నంబర్ ఎంతమాస్టారూ?”, అన్నాడు. అతను చెప్పాడు. అతనికి సుబ్బారావు సీట్ చూపించి, “కూర్చోండి” అన్నాడు.
ఆ వచ్చినతను చొక్కా పై రెండు గుండీలూ విప్పదీసి, “అబ్బా..ఏమి ఎండ?” అనుకొంటున్నాడు.
సుబ్బారావు హారీ కేసి తిరిగి, “ఇక్కడ ఉన్న మాకే చాలా వేడి గా ఉంది..అమెరికా నుండీ వచ్చారు..మీకు చాలా ఇబ్బంది గా ఉండి ఉంటుంది”, అన్నాడు.
దీనికి హారీ స్పందించేలోగానే, “ఏమిటి సార్ మీరు అమెరికా నుంచీ వచ్చారా..!”,అన్నాడు ఆ వచ్చినతను, ఆశ్చర్యం గా.
హారీ నవ్వుతూ కిందికీ పైకీ తలూపాడు. సుబ్బారావు అందుకొని హారీ ని పరిచయం చేశాడు.
హారీ షేక్ హాండ్ ఇచ్చాడు. ఆ వచ్చినతను లేచి నుంచొని షేక్ హండ్ ఇస్తూ, “నా పేరు వెంకటరమణ సార్”, అన్నడు.
సుబ్బారావు ఆశ్చర్యం గా, “అరే మీ పేరు ఏ శామ్యూలో..డేవిడో అనుకొన్నానే..!”,అన్నాడు.
దానికి వెంకటరమణ, సుబ్బారావు మాటల వెనుక మర్మం తెలిసినట్లు నవ్వి
, ” మేము అసలు క్రిస్టియన్స్ మే నండీ. మ నాన్న గారు ‘ఎస్ సీ’ రిజర్వేషన్ రాదని,మాకు అలా పేర్లు పెట్టారు” అన్నాడు.
సుబ్బా రావు లోపల,”ఇతను చాలా నిజాయితీ పరుడల్లే ఉన్నాడే!”,అనుకొన్నాడు.
“మీరు ఏమి చేస్తారండీ”, అన్నాడు సుబ్బా రావు.
“హై స్కూల్లో టీచర్నండీ !”,అన్నాడు. “విజయవాడ లో పని ఉండి వెళ్తున్నాను”.హారీ స్తేషన్లో దిగి బ్రెడ్డూ జామూ వాటర్ బాటిలూ తెచ్చుకున్నాడు. సుబ్బా రావు కి ఇడ్లీ వడా తెచ్చాడు.రైలు కదిలింది.
సుబ్బా రావు, “ఈయన ఎస్ సీ లో ఏ కులమో తెలియ లేదే..!”,అనుకొని, “పేపర్ లో ఒక న్యూస్ ఐటం చూపించి, సార్ ఈ మధ్య ఎస్ సీ వర్గీకరణ అని ఏవో గొడవలు జరుతున్నాయి కద సార్. దేని గురించి ఈ గలాటా…!”, అన్నాడు.
దానికి రమణ, ” ఆ… అనవసరమైన గొడవలు సార్…అంబేద్కర్ గారు ఎస్ సీ లందరికీ రిజర్వేషన్లు ఇచ్చారు..కొద్దో గొప్పో అందరూ ముందుకు పోతున్నాము..ఇవ్వాళ వెంకట రమణ టీచర్ అయినా ఇంకో మాయావతి సీ ఎం అయినా ఆయన చలవే…ఆయన లేక పొతే ఈ రోజు వెంకట రమణ అనే టీచర్ లేడు..ఆయన దేవుడు…ఇప్పుడు దానిలోనే విభజనలు ఎందుకు సార్..ఇది అంతా అగ్రకుల రాజకీయులు ఎస్ సీ లని చీల్చటానికి చేసిన ఒక కుట్ర”, అన్నాడు.
సుబ్బా రావు, “కానీ రిజర్వేషన్లు పెట్టినప్పుడు….,అగ్రకులాల వాళ్ళు కూడా, ఇలానే… “దేశాన్ని కులాల ఆధారం గా విడగొడుతున్నారు” అనుకొని ఉంటారు కదండీ”, అన్నాడు.
రమణ, “వీడెవడో పక్కా అగ్రకులస్థుడి లా ఉన్నాడు”, అనుకొని.
సుబ్బా రావు తో ఇలా అన్నాడు, “అది వేరండీ .. చారిత్రకం గా దళితులు అణగద్రొక్కబడ్డారన్నది తిరస్కరించలేని నిజం..దానిని సరి చేయటానికే దళితులకు ఈ రక్షణలు కల్పించారు..దళితులను పాలకులు గా నిలబెట్టాలి..”
సుబ్బా రావు మధ్య లోనే అందుకొని,” ముస్లింలు హిందువులని చాలా కాలం పాలించారు..బీ జే పీ వాళ్ళు ఇప్పుడు హిందువులు పునర్వైభవం పొందాలి అంటున్నారు. దీనిని మిగిలిన వారు నాజీయిజం అంటున్నారు..బీ జే పీ ది నాజీయిజం అయితే, మీరు చెప్పే దళితుల పాలన కూడా నాజీయిజం అవుతుంది కదా..?” అన్నాడు.
దీనికి రమణ కు చిర్రెత్తుకొచ్చింది. అతను కోపం గా, “ఈ రెండింటికీ చాలా తేడా ఉందండీ..దళితులు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు..రేపు దళితులు కూడా వాళ్ళ జనాభా కి తగినట్లు గా ఉద్యోగాలలో ఉంటే, రిజర్వేషన్లు ఎత్తేయటం వలన అగ్ర కులాలకి వచ్చే లాభం ఏమిటి..? బీ జే పీ ది మొత్తం గా వేరే వాదం. అది మైనారిటీల మీద నరమేధాలు చేస్తోంది”, అన్నాడు వెంకట రమణ.ఇంతలో హారీ కల్పించుకొని, “ఆర్ధిక ప్రాతిపదికన రిజర్వేషలు ఇవ్వటం కరక్టు అనుకొంటా..!”,అన్నాడు.
దానికి వెంకటరమణ, “ఇది కొంతవరకూ సరియైనదే..కానీ సామాజికం గా వెనుక పడటం అనేది ఒకటి ఉంది…నెలకు ఐదు వేలు ఆదాయం ఉండే దళితుడి కొడుకు ఒక దళిత వాడ లో ఉన్నాడను కొందాం..అలానే ఐదు వేలు ఆదాయం వచ్చే బ్రాహ్మణుడి కొడుకు ఒక అగ్రహారం లో ఉన్నాడనుకొందాం.. బ్రాహ్మణుడికి అగ్రహారం లో ఉండే విలువల దృష్ట్యా..అక్కడ ఉన్న వాతావరణం..చుట్టాలూ…స్నేహితులూ..పరిచయాల దృష్ట్యా అడ్వాంటేజ్ ఉంటుంది అనటం లో సందేహం లేదు కదా..? అలానే దళితులా ఆది వాసీ ల జీవన విధానం ఆధునిక జీవన విధానం కంటే వేరు గా ఉంటుంది..అది వారికి ఒక డిజేడ్వాంటేజ్. మీరు అమెరికన్ జీవన విధానం లో పెరిగారు. మిమ్మల్ని ఒక ఆదివాసీ గూడెం లోని మనిషి తో వడిసెలు విసరటం లో పోటీ పడమంటే, మీకు ఎలా ఉంటుంది? అలానే ఆదివాసీ ని “జీ ఆర్ ఈ” రాసి అమెరికా పోవచ్చు కదా అన్నా అంతే అన్యాయం కదా..?” అన్నాడు.
అప్పటికే ట్రెయిన్ లో జనాలు ఆవేశం గా మాట్లాడుతున్న వెకటరమణ ను గమనించటం చూసి….”సార్ ఈ విషయాలు ఒక ట్రెయిన్ ప్రయాణం లో మాట్లాడుకొనేవి..కాదు…చెప్పండి సార్..అమెరికా లోజనాలు ఎలా ఉంటారు..ఇండియన్స్ అంటే ఎలాంటి అభిప్రాయం వాళ్ళకి..?”అన్నాడు.
సుబ్బారావు, “మీరు ఒంగోలు లో దళిత వాడలో ఉంటారా..లేక వేరే ఉంటారా..?”,అన్నాడు.
“లేదు సార్,అక్కడ సౌకర్యాలుండవు..హై స్కూలు దగ్గర్లోనే ఒక ఇంట్లో ఉంటున్నాను. స్కూలు కి దగ్గర కదా..సౌకర్యం గా ఉంటుంది”
దయాకర రెడ్డి నీ మస్తాన్ వలీ నీ ఇప్పుడు వెంకట రమణ నీ చూసిన హారీ మనసు లో ఒక సత్యం రూపు దిద్దుకో సాగింది….
**********************
ట్రెయిన్ చీరాల లో ఆగగానే పంచుమర్తి రామారావు బట్టలమూట భోగీ లో పెట్టి తనూ ఎక్కాడు. ఆయనకు ఓ యాభై యేళ్ళు ఉంటాయి. ట్రెయిన్ కదులుతూనే వచ్చి సుబ్బారావు పక్కన కూర్చొన్నాడు.
సుబ్బారావు బట్టలను మూటని చూసి “చేనేత లా ఉందే”, అన్నాడు.
రామారావు దానికి, “కాదండీ మర మగ్గం తోనే నేశాం”,అన్నాడు.
సుబ్బారావు,”ఎక్కడికి తీసుకొని పోతున్నారు ఈ బట్టలని?”, అన్నాడు.
“విజయవాడ లో బట్టల కొట్టుకి అమ్మటానికి తీసుకెళ్తున్నా”
“చేనేత రంగం లో సంక్షోభం తగ్గినట్లేనాండీ..?”, అన్నాడు సుబ్బారావు.
“ఏమి తగ్గటమో సార్. మర మగ్గాలైతే ఇచ్చారు ..కానీ ఈ మగ్గాలు బాంబే మిల్లుల తో పోలిస్తే ఏ పాటి? పైగా వీటికి రిపేర్ లు ఎక్కువ. ఒక్క సారి రిపేర్ కి వచ్చిందంటే ఖర్చు ఎక్కువ”
హారీ ట్రెయిన్ విండో కి చేరగిలబడి సుబ్బారావు తో, “పారిశ్రామికీకరణ ఆర్ధిక సరళీకరణ ల నేపధ్యం లో కుల వృత్తుల, చేతి వృత్తుల వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసు కోవాలని నాకు ఆసక్తి గా ఉంది”, అన్నాడు ఇంగ్లీషు లో..
నల్ల తోలు సుబ్బారావు పంచుమర్తి రామారావు తో ఇలా అన్నాడు, ” ఈ సార్ అమెరికా నుంచీ వచ్చి ఏదో రీసెర్చ్ చేస్తున్నాడట..ఈ మధ్య మన చేతి వృత్తుల వారి స్థితి గతులు ఎలా ఉన్నాయి అంటున్నాడు”.
“ఆ ఏముంది సార్..ఎవరికైనా పట్నాలకు వలస పోతేనే కొద్దో గొప్పో పోషణ…కాక పోతే దీనిలోనే కొంచెం తరుగూ మెరుగూ..కుమ్మరి వాళ్ళపని ఎక్కడా బాగా లేదు..కుండలు ఎవరు కొంటున్నారు..కమ్మరి వాళ్ళ పనీ అంతే..పోతే వడ్రంగి వాళ్ళకి టౌన్ కి పోతే బాగానే పని ఉంది. దీనికి కారణం ఇళ్ళ నిర్మాణం. దర్జీలు కూడా పట్టణాలలో పరవాలేదు..వాళ్ళు టెక్స్ టైల్
పార్కుల్లో దూరి పోవచ్చు..ఇక పోతే మంగలి,చాకలి వారికి పట్టణాలలో పరవా లేదు..ఇస్త్రీనో డ్రై క్లీనింగో చేసుకుంటున్నారు..సెలూన్లు పెట్టుకొంటున్నారు..గొల్లలూ గవళ్ళూ వ్యవసాయం వైపుకి మళ్ళుతున్నారు..పల్లెటూళ్ళ నుంచీ వెళ్ళే అగ్రకులాల భూమిని వీళ్ళే కొని, వ్యవసాయాన్ని బ్రతికిస్తున్నారు. చేనేత పనివారికి మాత్రం గడ్డు కాలమే..! మేము నేసే బట్టల కంటే చాలా చౌకగా పైనుంచీ బట్టలువచ్చి పడుతున్నాయి..ఈ రాజకీయ నాయకులకేమో గుద్దులాడుకోవటానికే టైం చాలటల్లా..మా జనాభానేమో తక్కువ.. వోట్లు లేనిదే రాజకీయ నాయకుడెక్కడ మాట వింటాడు..?ఈ కులాలన్నీ కలిస్తే బాగానే ఉంటుంది..కానీ ఈ కులాలలోనే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు.”
హారీ ఇక్కడ ఒక ప్రశ్న అడిగాడు, “ఎన్నికలలో ఒక అగ్ర కులస్థుడూ ఒక దళితుడూ నిల్చొంటే ఎవరికి వోటేస్తాడు ఇతను?”
సుబ్బా రావు ఈ ప్రశ్న ను అనువదించి రామారావు ని అడిగాడు.
రామా రావు ఆలోచించి, “ముందు క్యాండిడేటు ఎలాంటి వాడో చూస్తాం సార్. ఇద్దరూ ఒకే తరహా వాళ్ళైతే నేనైతే అగ్రకులస్థుడికే వేస్తా. నేనే కాదు మాలో చాలా మంది అలానే చెయ్యవచ్చు”.ఇదంతా నిశ్శబ్దం గా వింటున్న వెంకటరమణ తను కూర్చున్న చోటనే ఇబ్బంది గా కదిలాడు.
“అగ్ర కులాల కు ఆంధ్ర రాజకీయాలలో పట్టు ఉండటానికి ఇది కూడా ఒక కారణమనుకొంటా..ఆంధ్ర లో హిందూ సామాజిక వ్యవస్థ స్వరూపం అగ్ర కులాల వైపుకి మొగ్గి ఉన్నట్లు గా ఉంది”, అన్నాడు హారీ.
సుబ్బారావు, “ఇది నాకు ఇంతకు ముందు ఎప్పుడూ ఎందుకు తట్టలేదబ్బా.”,.అనుకొని. “హారీ బయటి వాడవ్వటం వలనే అతనికి ఇది అర్ధమై ఉండవచ్చు..అతనిలా మన వ్యవస్థ ని కొండ మీదెక్కి విహంగ వీక్షణం చేసే అవకాశం నాకు లేదు కదా”, అనుకొన్నాడు.
రామా రావు హారీ కూర్చొన్న తీరు చూసి, “బాగా బలిసిన వాడిలాగున్నాడు..నేను చెప్పినదంతా ఒక వినోదంలా కులాసా గా వింటున్నాడు..నాలాంటి రెక్కాడితేగానీ డొక్కాడనోడి పరిస్థితి ఇతనికి ఏమి అర్ధమౌతుంది?” అనుకొన్నాడు.
*************************
వీరమాచనేని వెంకట కృష్ణ ప్రసాద్ తెనాలి లో కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు. అతనికి నలభై యేళ్ళు ఉంటాయి.అతనికి విజయవాడ లో ఒక చిన్న బిజినెస్ ఉంది. తెలుగు దేశం పార్టీ వచ్చిన కొత్తలో ఆవేశం గా పార్టీ జెండామోసి దానివలన ఊళ్ళో మోతుబరులకే తప్ప తనకేమీ లాభం లేదని తెలుసుకొన్నాడు. దరిమిలా ఊళ్ళో జరిగిన గొడవలతో, “కమ్మ వారి మీటింగులు కాలువలొచ్చేవరకే!” అన్న నానుడి అనుభవం లోకి వచ్చిందతనికి…అప్పటి నుంచీ రివర్స్ గేర్ లో పడ్డాడు.
పదేళ్ళకిందట ఊళ్ళో ఒకతను రెండు లక్షలిచ్చి పిల్లనిచ్చి పెళ్ళిచేస్తానంటే, “మన వాళ్ళలోమగాడిగా పుడితే మినిమం ఐదు లక్షలు కట్నం కదా?”,అన్నాడు. దానితో ఆ సంబంధం తప్పిపోయింది. తరవాత మహిళా రిజర్వేషన్ల పుణ్యమా అని ఆడ పిల్లలు చదువులలో పైకి పోవటం, కట్నాలు కిందికి దిగటం జరిగిపోయి, కృష్ణ ప్రసాదు కి అప్పటి నుంచీ ఇప్పటి దాకా పెళ్ళి కాలేదు.
అతను వచ్చి హారీ పక్కన కూర్చొన్నాడు.
హారీ వేసుకొన్న బూట్లు చూసి “ఈ షూ అమెరికా లో మాత్రమే దొరుకుతాయి కదండీ? !”, అన్నాడు.
సుబ్బారావు,”చచ్చింది గొర్రె, దొరికింది బర్రె” అనుకొని, కృష్ణ ప్రసాద్ తో, “అవునండీ, ఈ సార్ వచ్చింది అమెరికా నుంచే కదా”అన్నాడు.
సుబ్బారావు మళ్ళీ అందుకొని, “మీకు ఇవి అమెరికా లో మాత్రమే ఉండే బ్రాండు అని ఎలా తెలిసింది”,అన్నాడు.
కృష్ణ ప్రసాదు, “మా పెదనాన్న గారి అబ్బాయి ఒకతను అమెరికా లో ఉన్నాడు లెండి. అతను ఇండియా వచ్చినపుడు చూశాను”, అన్నాడు.
రెడ్డి గారు వదిలేసిన పేపర్ చూస్తూ సుబ్బారావు, “ఏంటి సార్? ఈ చంద్ర బాబు తెలంగాణ గురించి ఏమీ తేల్చి చెప్పేటట్లు లేడు”, అన్నాడు.
“ఉపయోగం లేని మనిషి సార్. మా వాడైనా మా వాళ్ళకి చేసింది ఏమీ లేదు”,అన్నాడు.
సుబ్బారావు, “అదేంటి సార్,అలా అంటున్నారు?”,అని ఆశ్చర్యం నటించాడు.
“రాజశేఖర రెడ్డి చూడండి రెడ్లకి ఎలా దోచి పెట్టాడో..! మా రాజ కీయ నాయకుల వలన మా లో ఉన్న పేదోల్లకి నష్టమే ఎక్కువ జరిగింది” అన్నాడు కృష్ణ ప్రసాద్.
సుబ్బారావు: “అదెలా సార్? కాస్త వివరం గా చెప్పండి” అన్నాడు.
“ఎన్ టీ రామారావు రాజకీయాలలో కి రాక ముందు కమ్మ వాళ్ళంటే గోదావరి జిల్లాల్లో రాజుల్లా గుట్టు గా తమ పనేదో తాము చేసుకొనే వారు. రామారావు వచ్చిన తరువాత రోడ్డు మీద పడ్డారు. ఆయన ప్రవేశ పెట్టిన “రెండు రూపాయలకు కిలో బియ్యం” పధకం వలన ఊళ్ళలో లేబర్ మా మాట వినటం మానేశారు. మిగిలిన కులాలన్నీ మమ్మల్ని చూసి ఏడుస్తున్నాయి. పెద్ద వాళ్ళు చెసే వెధవ పనుల వలన..మా లో ‘లేని వారికి’ కూడా చెడ్డ పేరు వచ్చింది. మాలో ఉన్న వాళ్ళ ఐశ్వర్యం చూసి అందరూ ఉన్న వాళ్ళే అనుకొంటున్నారు. కానీ మాలో లేని వాళ్ళకి ప్రభుత్వ పరం గా ఒక రిజర్వేషను ఇవ్వలేదు..ఒకరాయితీ ఇవ్వలేదు..ఇస్తే మా రాజకీయ నాయకులకు ప్రజలు కులతత్వమంట గడతారేమోనని భయం.”
ఇది విని హారీ,” సో ..,ఇక్కడముఖ్య సమస్య పేదరికం కదా..మీరు దళితులలో,బీ సీ ల లో ఉన్న గ్రామీణ పేదలతో కలిసి మీ హక్కుల కోసం ఉద్యమించవచ్చు గదా?”, అన్నాడు అమాయకం గా.వెంటనే కృష్ణ ప్రసాద్, “వాళ్ళతో మేమెలా కలుస్తాం..?” అన్నాడు తనని అవమానించినట్లు గా.ఈ మాట విని రమణా రామారావూ చెరొక కిటికీ లోంచీ బయటికి చూడటం మొదలు పెట్టారు.
సుబ్బారావు కృష్ణ ప్రసాదు కి ఒక చిన్న పరీక్ష పెడదాం అనుకొని, “ఏదేమైనా, ఒకటి నిజమే సార్, చంద్ర బాబు అంత జిత్తుల మారి నాయకుడు ఎవరూ లేరు” అన్నాడు.
కృష్ణ ప్రసాద్ తమాయించుకొని,”అందరు రాజకీయ నాయకులూ అలాంటి వాళ్ళే సార్. ఉన్నంతలో బాబే బాగా చేశాడు”, అన్నాడు.
సుబ్బారావు తన లో,” ఓర్నీ, నీ కులం వాళ్ళని తిట్టాలన్నా నువ్వే తిట్టాలా…!ఇతరులు మాత్రం తిట్టకూడదా..?” అనుకొన్నాడు.
********************
విజయవాడ ఇంకా పదినిమిషాలలో వస్తుంది. ట్రెయిన్ నెమ్మదిగా నడుస్తోంది. ఓ కుర్రాడు చెవికి ఐ-పోడ్ పెట్టుకొని హారీ ఉన్న సీట్ ను దాటి గేట్ లో నిల్చొని బయటి పచ్చటి దృశ్యాలు చూస్తున్నాడు. ఆ కుర్రాడిని చూసి హారీ ఇతనిది ఏ కులమై ఉంటుందబ్బా అనుకొని మళ్ళీ,”కులమంటే తెలియని నేను కూడా కుల స్పృహ లో పడి పోయానే!” అనుకొన్నాడు.
ఇంతలోహఠాత్తు గా, “అయ్యో ! అయ్యో! పడిపోయాడు..పడిపోయాడు..ట్రెయిన్ ఆపండి…ఆపండి!”, అన్న అరుపులు వినపడ్డాయి..సుబ్బారావు ఒక్క ఉదుటున లేచి చెయిన్ లాగాడు. ఒక ముసలామె వాష్ బేసిన్ దగ్గర నిలబడి చెప్తోంది..”ఎవరో కుర్రాడు చల్ల గాలి కొసం డోర్ దగ్గర నిలబడ్డాడు. ట్రెయిన్ కుదుపుకి డోర్ వచ్చి అతనికి గట్టిగా కొట్టుకొని కింద పడి పోయాడు..”
సుబ్బారావు, కృష్ణ ప్రసాద్, రామా రావు, రమణ తో సహా భోగీ లోని కుర్రాళ్ళు కొందరు కిందకి దిగారు. ట్రెయిన్ గేట్ దగ్గరే నిల్చొన్నాడు హారీ. కింద పొదల్లో కనపడ్డాడు ఆ కుర్ర వాడు. మూలుగుతూ ఉన్నాడు. ముళ్ళు గీరుకు పోయి రక్తం వస్తొంది. లేవలేక పోతున్నాడు..తలొక చేయీ వేసి కుర్రాణ్ణి బయటికి లాగారు. భొగీ లోకి ఎక్కించారు. రక్తం చూసి హారీ ఆ కుర్రాడి దగ్గరకే పోలేదు. “అతని రక్తం వలన ఏమి ఇన్ ఫెక్షన్స్ వస్తాయో ఏమిటో”, అనుకొన్నాడు తనలో. ముళ్ళపొదల వలన కుర్రాడికి పెద్ద గా దెబ్బలు తగలలేదు. ట్రెయిన్ నెమ్మది గా కదిలింది..కృష్ణా నది ని దాటి స్టేషన్ లో కి చేరింది. ప్రయాణికులంతా ఎవరి దారిన వారు పోతున్నారు.
సుబ్బారావు హారీ తో,”సార్,కోణార్క్ కి ఇంకా టైం ఉంది..దగ్గర్లో ఏదైనా హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేద్దామా?”, అన్నాడు.
“టిఫిన్ చెయ్యటమంటే..ఏమిటి..?”, హారీ అన్నాడు.
“అదే… ఇండియన్ స్నాక్స్ తిందాము”.
రైల్వే స్టేషన్ బయటికి రాగానే ఆటో వాళ్ళంతా ఆటో సార్..ఆటో సార్ అనటం మొదలు పెట్టారు…ఒక ఆటో వాడు మాత్రం పది అడుగులు వీళ్ళతోనే నడిచి..”సార్ లాడ్జ్ కావాలా..?” అన్నాడు సుబ్బారావు తో.
“మేము హైదరాబాద్ వెళ్తున్నాం..మాకు లాడ్జ్ ఎందుకు?”, అన్నాడు సుబ్బారావు. ఇంక ఆ ఆటో వాడు వెళ్ళిపోతాడేమో అనుకొన్నాడు సుబ్బారావు. కానీ వాడు వదలకుండా,”సార్, మంచి అమ్మాయి సార్ రండి సార్” అన్నాడు.
సుబ్బారావు కోపం గా వాణ్ణి కసరటం తో వాడు వెళ్ళిపోయాడు.
ఇద్దరూ కలిసి రైల్వే స్టేషన్ దగ్గర్లో ఉన్న ఒక హోటల్ కి వెళ్ళారు. హోటల్ బిజీ గా ఉంది. ఓ టేబుల్ దగ్గర రెండు సీట్లు ఖాళీ గా ఉంటే వెళ్ళి కూర్చొన్నారు.
ఎదురు గా, వేదుల రామకృష్ణ శాస్త్రి కూర్చొని కాఫీ తాగుతున్నాడు. ఆయన లెక్చరర్ గా చేసి రిటైర్ అయ్యాడు. సత్యనారాయణ పురం లో పెద్దల నాటి ఒక ఇల్లు ఉంది. ఈ మధ్య ఆయన ఆలోచనలన్నీ ఒకే విషయం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. అది తన ముప్పై రెండేళ్ళ కూతురు శాంభవి కి పెళ్ళి చేయటం.
ఎర్రగా బుర్రగా ఉన్న హారీ ని చూసి శాస్త్రి, “కుర్ర వాడు బ్రామ్మలలానే ఉన్నాడు..వైదీకులో…నియోగులో…ఆ… ఈ కాలం లో ఎవరైతే ఏముందిలే”, అనుకొన్నాడు.
నల్ల తోలు సుబ్బారావు ని చూసి శాస్త్రి, “అతనెవరో నిమ్న కులస్థుడి లానే ఉన్నాడు…కొంచెం తెలివి తక్కువైనా వీళ్ళు కూడా ఈ మధ్య బాగానే చదువుతున్నారు…ఏదేమైనా శూద్రస్య శుభం నాస్తి…అయినా చూద్దాం”,అని కూడా అనుకొన్నాడు.
హరీ సుబ్బారావుని, “కోణార్క్ రైట్ టైం ఎంత?”, అని అడిగాడు. సుబ్బారావు మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా రామకృష్ణ శాస్త్రి అందుకొని, “ఐదింటికండీ”,అని, “మిమ్మల్ని ఎక్కడో చూసి నట్లుంది..బై ఎనీ చాన్స్ మీ ఇల్లు సత్యనారాయణ పురం లో ఉందా..?”,అన్నాడు హారీ తో.
హారీ కి శాస్త్రి మాట్లడిన దాంట్లో ఒక్క ముక్కా అర్ధం కాలేదు. సుబ్బారావే కల్పించుకొని హారీ కి శాస్త్రి ప్రశ్న ను వివరించి, శాస్త్రి కి హారీ గురించి చెప్పాడు. శాస్త్రి కి తన సందేహం తీరే మార్గం కనపడలా.అతనికి సుబ్బారావు ఒక దుశ్శకునం లా కనపడ్డాడు. తన కాఫీ అయ్యిపోవటం తో లేచి వెళ్ళిపోయాదు.
************
కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో చాలామంది ఒరియా వాళ్ళు ఉన్నారు. చాలా వరకూ బాంబే వెళ్తున్నారు. హారీ సీట్ పక్క ఓ పాతికేళ్ళ కుర్రాడు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఒక కాల్ అయిన వెంటనే ఇంకొక కాల్ వస్తోంది. సుబ్బారావు ‘టీ సీ’ తో చెప్పి సీట్ మార్పించుకొని వచ్చాడు. ఆ కుర్రాడికి మళ్ళీ కాల్ వచ్చింది. “కొడితే కొట్టలిరా సిక్సు కొట్టాలి”, అని మొబైల్ కాలర్ ట్యూన్ ని పాడింది.
కుర్రాడు,”ఆయ్ …విజాడ వచ్చేహిందండీ..ఇంకో పది నిమిషాలలో బయల్దేరతందండీ..” అన్నాడు. ఈ కాల్ అయిన తర్వాత కుర్రాడే మళ్ళీ ఇంకో కాల్ చేసి,”ఆ.. సత్నానా…నేను ఆకుల చిట్టిబాబున్రా..అరే కొబ్బరి తోటల్కి నీళ్ళు పెట్టించావా..పెట్టించలేదా..మా అన్నియ్య కొట్టీగలడు..ఆర్యా2 మామూలు జనాలకి ఎక్కదు గానీ డాన్సులు సూపర్రా..అదర గొట్టీహాడ్రా అర్జునూ”, అని ఇంకేదో మాట్లాడుతున్నాడు. చివరికి ఎప్పటికో చిట్టిబాబు ఫోన్ కి విశ్రాంతి దొరికింది. ఫోన్ జేబులోపెట్టాడు. ఫోన్ స్క్రీన్ లో సుబ్బారావు కి పవన్ కళ్యాణ్ వాల్ పేపర్ కనపడింది.
సుబ్బారావు అతనితో సడన్ గా,”మీరు రాం చరణ్ ఫ్యాన్ కదండీ..”, అన్నాడు.
చిట్టిబాబు,”అయ్ బాబోయ్..ఎలా కని పెట్టీసీరండీ..మగ ధీర సూపర్ హిట్టుకదండీ…నాకు ముందే తెలుసండీ..”, అని సుబ్బారావు కి రాం చరణ్ నెక్స్ట్ సినిమా గురించిన విశేషాలు చెప్పనారంభించాడి చిట్టి బాబు.
“చిరంజీవి కి వోట్లేయలేదేమిటండీ మీ గోదావరి వాళ్ళు కూడానీ..”, అన్నాడు సుబ్బారావు చిట్టి బాబు ని అనుకరిస్తూ.
“కర్ణుడి చావు కి ఎన్ని కారణాలో దీనికీ అన్ని కారణాలండీ”,అన్నాడు చిట్టి బాబు.
“ఏదైనా చిరంజీవి ‘ఎన్ టీ ఆర్’ కాదుగదండీ”, అన్నాడు సుబ్బారావు.
“పెద్ద ‘ఎన్ టీ ఆర్’ వచ్చినా ఈ రోజుల్లో గెలవటం కష్టమండీ..ఆ రోజులు వేరు..ఈరోజులు వేరు..ఏమైనా లక్కు ఉండాలి లెండీ”,అన్నాడు చిట్టి.
ట్రెయిన్ బయలు దేరింది. ట్రెయిన్ లో జనాలు చాలా వరకూ “కొంచెం క్లాస్” గా ఉన్నారు.
“వీళ్ళ తో సంభాషణ కష్టం లానే ఉంది. ఇటువంటి వాళ్ళు బుర్ర లో ఉండే ఆలోచన నోటిలో మాట గా మారటానికి ముందు చాలా విషయాలు సరి చూసుకొంటారు. అందు వలన వీళ్ళతో సంభాషణ లో స్పాంటేనిటీ తక్కువ గా ఉంటుంది”, అనుకొన్నాడు సుబ్బారావు.
***********************
హారీ జేబులో మొబైల్ మోగింది. దాన్ని పట్టుకొని..”యా..డాడ్..” అని అమెరికన్ ఇంగ్లీష్ కలిసిన తెలుగు లో ఏవో వ్యక్తిగత విషయాలు బెక బెక లాడ సాగాడు.
సుబ్బారావు ఏమీ తోచక అటూ ఇటూ తిరిగే జనాలను చూస్తున్నాడు.తెలుగు వాళ్ళు చాలా మంది హైదరాబాదు లో దిగిపోయేవాళ్ళ లా కనపడుతున్నారు. సుబ్బారావు ఆలోచనల లో పడ్డాడు “ఏమైనా హైదరాబాద్ వాళ్ళు ఈ కోస్తా వాళ్ళ కంటే కొంచెం విశాల హృదయులు. కులం మతం ఏమీ పట్టించుకోరు. నా అపార్ట్ మెంట్ లో ఇంతవరకూ నా కులం గురించి ఎవరూ అడగలేదు కదా….అడిగితే నా పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్పాల్సి వచ్చేది….”
ఇంతలో హారీ,”హెయ్ డాడ్,మన కాస్ట్ ఏమిటి?…ఆ అదేఇండియాలో ఉంటాయి కదా కులం అని…ఏమిటి?”,అని అడిగి, “వాట్ వెలామా…ఓకే..ఓకే వెలమ…రైట్.ఓ కే..ఓ కే..బై డాడ్”అని పెట్టేశాడు.
సుబ్బారావు హారీ చివరి మాటలు వినేసి, ట్రెయిన్ లో అయిన అలవాటు తో హారీ ని ఒక సారి గోకి చూద్దాం అనుకొన్నాడు.
“మీరు వెలమ నా సార్..వెలమ దొరలు చాలా పొగరుబోతులు సార్..కే సీ ఆర్ కూడా వెలమే కదా..!” అన్నాడు.
దానికి హారీ, “నేను ఆ కాస్ట్ కి చెందినవాడిని కాదు..ఆ కాస్టే నాకు కొత్త గా వచ్చి చేరిన ఒక ట్యాగ్ లాంటిది”,అని తన బాగ్ కి ఉన్న ట్యాగ్ ని చూపించి, “కాస్ట్ అనేది అలాంటి ఒక ట్యాగ్ నాకు..ఆ ట్యాగ్ నీకు నచ్చినా నచ్చక పోయినా నాకేమీ పరవాలేదు. అయినా ఇక్కడ ఈ ట్యాగ్ లకి ఎందుకు ఇంత విలువ ఇస్తారో నాకు ఇంకా అర్ధంకాలేదు దానిని అర్ధంచేసుకోవటం కోసమే ఈ ట్రెయిన్ ప్రయాణం” అన్నాడు.
“నాకు అర్ధమయ్యింది సార్ ఇప్పుడు…పల్లెటూళ్ళో ఉండేవాళ్ళు కులాల పరమైన సమూహ జీవనం గడుపుతారు…హైదరాబాద్ లాంటి చోట్ల నేనుండే అపాట్మెంట్లలో అలాంటిది ఉండదు..అన్ని కులాలూ ఉంటాయి..మతాలూ ఉంటాయి..అదే అమెరికా లో ఇక చెప్పనవసరం లేదు…కులాలు కు మారు గా వేరే కులాలు ఉంటాయి..మా అపార్ట్మెంటులో ఖరీదైన కారు ఉన్నోడిది ఓ కులం..అలానే బాంబే నుంచీ వచ్చిన వాళ్ళందరిదీ ఒక కులం…అమెరికా లో అయితే..అమెరికన్లదంతా ఒక కులం..”
హారీ అడ్డు తగిలి,”మీ పల్లెల లో ఉండే వాళ్ళు కులాన్ని నా లాగా ట్రీట్ చేసేటట్లు వాళ్ళని ఏడ్యుకేట్ చెయ్యవచ్చు కదా..?”, అన్నాడు.
దానికి సుబ్బారావు, ” జీవితం ముఖ్యం సార్..వాళ్ళు బతికే బతుకు లో, సమాజం లో లేని దాన్ని మనం చెప్పినా పాటించటం కష్టం..ఒక వేళ చెప్పినా, వాళ్ళు చాలా మానసిక శ్రమ పడి కుల భావనని అధిగమించాల్సి వస్తుంది. దాని వలన వాళ్ళకు ఒరిగేది ఏమిటి? మీకు కుల స్పృహ లేక పోవటం సహజం గా వచ్చింది..వాళ్ళకు అలా కాదు.”
“కానీ కులాల వలన కొట్లాటలు ఎక్కువ అవుతాయి కదా..”,అన్నాడు హారీ.
“కులాల వలన అనే కంటే డెమోక్రసీ వలన ఎక్కువ అయ్యాయి..దేశం లో వోట్లు లేనప్పుడు ప్రతి వాడికీ తన కులం పై అభిమానమూ గౌరవమూ ఉండేవి…ఈ రాజకీయ నాయకుల వలన కుల స్పర్ధలు పెరిగాయి..ఎదుటి కులాల పై అసహ్యం పెరిగింది..అయినా కులాన్ని మంచికి కూడా ఉపయోగించవచ్చు.. ఇది మన మిలిటరీ లో చూస్తూంటాం..జాట్ రెజిమెంట్ అనీ, రాజ్ పుతానా రైఫిల్స్ అనీ.ప్రజలు కూడా ఒక రెడ్డే అంత నిస్వార్ధం గా ఉండగలడు..లేక ఒక వెలమే ఇంత నిజాయితీ గా ఉండగలడు అనుకోగలిగితే దాని వలన జాతికీ సమాజానికీ ప్రయోజనమే” అన్నాడు సుబ్బు.
హారీ కరక్టే అన్నట్లు తల ఊపి, తన ల్యాప్-టాప్ తీసి ఏవో నోట్స్ రాసుకోసాగాడు.
***********
ట్రెయిన్ కదులుతూ ఉండగా ఝాన్సీ పక్క కంపార్ట్ మెంట్ లోకి ఎక్కేసింది. జీన్స్ పాంటు వేసుకోవటం వలన పడకుండా నిల దొక్కుకుంది. ఆమె ఒక ఆడ్ కంపెనీ లో పని చేస్తోంది. పెళ్ళి అయ్యి ఓ రెండేళ్ళయ్యింది..విడాకులిచ్చి ఓ సంవత్సరం అయ్యింది. ఝాన్సి కాలేజీ రోజుల నుంచీ ఫెమినిజం పేరుతో పురుష ద్వేషాన్ని అలవరుచుకొంది. ఆమె మాజీ భర్త రఘు రాం పాత కాలపు మనిషి. ఎలానో కష్టపడి ఝాన్సీ ని ఒప్పించి, ఇద్దరికీ విజయవాడ లో అరేంజిడ్ మారేజీ చేశారు వాళ్ళ పెద్ద వాళ్ళు. ఇద్దరి ఉద్యో గాలూ హైదరాబాద్ లోనే.
శోభనం రాత్రి రఘు రాం, “ఇలా రావే” అంటే, ఝాన్సి “రాను, పోరా!”,అంది. ఈ పరిస్థితి పెళ్ళైన నాలుగు నెలలకీ మారక పోయేసరికి రఘు రాం ఆమె ఫ్రిజిడ్ అని నిర్ధారణకి వచ్చేశాడు. డాక్టర్ కి చూపిద్దాం అంటే,”నువ్వే చూపించుకోపో..మంచం మీద అసహ్యమైన పనులన్నీ చెయ్యమంటావ్”,అంది.
ప్రతి రోజూ “సమాజమూ వ్యవస్థా ఆడవాళ్ళకి చేస్తున్న అన్యాయం” అని రఘు రాం కి ఓ గంటైనా క్లాస్ పీకేది ఝాన్సి. మధ్యాహ్నం ఇద్దరూ ఆఫీస్ల లో భోజనం చేసే వాళ్ళు. రాత్రి రఘురాం బయటి నుంచీ తెచ్చే వాడు. ఒక రోజు రాత్రి రఘురాం ఝాన్సి ని అన్నం వండమంటే, “నువ్వే వండ రాదూ..నేనే ఎందుకు వండాలీ ఆడదాన్నని అలుసు కాక పోతే. ఈ వ్యవస్థే ఆడదాన్ని దాసీ గా పడి ఉండమంటుంది?”,అంది.
రఘురాం,” ప్రపంచం లో రెండు రకాల న్యాయాలున్నాయి..ఒకటి సహజ న్యాయం, రెండు సామాజిక పరమైన న్యాయం. సహజ న్యాయం ప్రకారం మగాడు రక్షణ,పోషణ బాధ్యత తీసుకొంటే ఆడది సంసారాన్ని చక్క దిద్దుకోవాలి. ఈ న్యాయం లో మగాడు బలవంతుడు కాబట్టీ అతని మాటలను ఆడది వినవలసి వచ్చేది..అలానే శారీరకం గా బలవంతుడైన మగాడి మాట బలహీనుడైన మగాడు వినవలసి వచ్చేది. తరువాత వ్యవస్థ మారి మనిషి సాంఘిక న్యాయాన్ని ఏర్పరుచుకొన్నాడు. మగాడు ఆడదానికి శతృవు ఐతే,ఆడ దానిని సమానం గా చూసే చట్టాలు ఎక్కడి నుంచీ వచ్చినై..ఆడ వాళ్ళని గౌరవించే విలువలు ఎక్కడి నుంచీ వచ్చినై. ఇవన్నీ మగాడి సహకారంలేకుండా రావు కదా. ముందు రాజ్యమంతా మగాడిదే..మగాడి అనుకూలత లేకుండా వ్యవస్థ ఇలా మారదు కదా. కాబట్టీ మగాడు ఆడదానికి శతృవు అనే ఆలోచన మానుకో”,అన్నాడు
“ఆ చెప్పావులే వెధవ కబుర్లు..ఇవన్నీ మగ పందులు కూసే కూతలే. ఆడ వాళ్ళు పోరాడి సాధించుకొంటేనే ఈ స్వేచ్చలన్నీ వచ్చాయి”, అని దుప్పటి ముసుగెట్టింది ఝాన్సి.
రఘు రాం కి కాలి దుప్పటి లాగి, ఇంటి తలుపులు మూసి,”ఇప్పుడు మనమిద్దరమే ఉన్నాము..ఈ పురుషాధిక్య సమాజం లేదు..వ్యవస్థా లేదు..మనమిద్దరమూ అంటే ఆడా మగా మాత్రమే ఉన్నాము. నీ ప్రకారం మనిద్దరమూ శతృవులం”, అని ఝాన్సి కింద పడే దాకా పెడీ పెడీ కొట్టాడు.
ఝాన్సి లేచి, “ఆడ దానిని కొట్టేవాడివి నువ్వూ ఒక మగాడివేనా?”, అని అతని మొహం మీద ఊసింది.
రఘురాం, “ఏం ఆడదేమన్నా దిగి వచ్చిందా..ఆడ దానిని కొట్టగూడదన్న నియమం కూడా ఈ పురుషాధిక్య వ్యవస్థే పెట్టింది. ఆ నియమం ఆడదాన్ని అవమానించినట్లే కదా. ఈ నియమం ప్రకారం ఆడది తక్కువ అని అంగీకరించినట్లేగా”, అని మళ్ళీ పిచ్చి గా కొట్టటమ్మొదలు పెట్టాడు.
కాసేపటికి దెబ్బలు కొట్టి రఘు రాం, తిని ఝాన్సీ అలిసి నిద్ర పోయారు.
మరుసటి రోజు రఘురాం ఏమీ జరగనట్లు గానే స్నానం చేసి ఆఫీస్ కి వెళ్ళి పోయాడు.
లంచ్ అయ్యిన తరువాత ఎవరో పోలీస్ ఇన్స్ పెక్టర్ వచ్చాడని తెలిస్తే బయటికి వచ్చాడు రఘు రాం. ఇన్స్పెక్టర్ నాన్ బెయిలబుల్ గృహ హింస కేసు కింద రఘు రాం ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. పాపం రఘు రాం, పెళ్ళాన్ని తన్నే ఆవేశం లో సమ కాలీన వ్యవస్థ లోని నియమాలని కొద్ది సేపు మరిచిపోయినందుకు తగిన శిక్ష అనుభవించాడు.
పక్క కంపార్ట్మెంట్ లోంచీ నడిచి ఝాన్సి వచ్చి హారీ కి ఎదురు గా కూర్చొంది.
*****************************
ఝాన్సి పక్కనే ఉన్న సుబ్బారావు ని మనసు లో పురుగును చూసినట్లు చూసి, పైకి మాత్రం,”కొంచెం దూరం గా జరుగుతారా?” అంది.
చిట్టి బాబు ఝాన్సి వైపు చూసి, “కాజల్ అగర్వాల్ లా మంచి ఫిగరేనే”, అనుకొన్నాడు.
సుబ్బారావు ఝాన్సి ని, ” మీరు హైదరాబాదు కా ముంబై కా అన్నాడు”
ఝాన్సి, “ఆ రెండు చోట్లకీ కాదు..అమెరికా కి..ఏ మీరు కూడా వస్తారా?”,అంది వెటకారం గా.
సుబ్బారావు,హారీ వైపు చూపించి, “ఈ సార్ అమెరికా నుంచీ వచ్చారు. అమెరికా మొత్తం తెలుసు ఆయన కి. మీకు కావాలంటే అమెరికా మొత్తంచూపిం చేస్తాడు”, అన్నాడు వెకిలి గా.హారీ వీళ్ళ సంభాషణ లోని లో గుట్టు అర్ధం కాక, ఝన్సి వైపుకి చేయి సాచి,”హాయ్ అయాం హారీ..అయాం ఫ్రం కాలిఫోర్నియా”, అన్నాడు.
ఝాన్సి హారీ ని ఒక్క సారి చూసి అతని ఆక్సెంట్ విని అతను నిజం గా అమెరికా వాడే అని నిర్ధారించుకొంది. ఝాన్సి కూడా అతనికి షేక్ హాండిచ్చి తనను పరిచయం చేసుకొంది. ఝాన్సి కి ఇండియన్ మగాళ్ళంటే ద్వేషమే కానీ అమెరికన్ మగాళ్ళంటే ద్వేషంలేదు, పైగా అభిమానం కుడా. హారీ కిటికీ లోంచీ చెట్టూ పుట్టా గొడ్డూ గోదా చేలూ పొదలూ చూస్తూంటే, ఝాన్సి మాత్రం అప్పుడప్పుడూ హారీ ని దొంగ చూపులు చూస్తోంది.అలా చూడనప్పుడు మాత్రం హారీ తననే చూస్తున్నడని అనుకొని సిగ్గుపడుతోంది.
మధ్య మధ్య లో తాను ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కి అమెరికా వెళ్ళినట్లూ. తన కాలేజీ కి హారీ వచ్చినట్లూ..ఇద్దరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళినట్లూ అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేసినట్లూ ఏదేదో ఊహించుకొంటూంది. ఇంతలో రఘు రాం గుర్తుకొచ్చాడు..”ఛీ… ఆ మగ పంది ఇప్పుడెందుకు గుర్తుకొచ్చాడు?..మూడ్ పాడు చేశాడు వెధవ..నిజ జీవితం లోనూ వాడి వలన సుఖం లేదు ఊహా జీవితం లోకి కూడా వస్తున్నాడు”, అనుకొని స్టేషన్ లో తను కొన్న ఫెమినా తీసి చదవ సాగింది.
***********
ట్రెయిన్ ఖమ్మం లో ఆగింది. అరవై ఐదేళ్ళ విస్సంసెట్టి నరసింహ మూర్తి ఆప సోపాలు పడుతూ ఎక్కాడు ట్రెయిన్. వచ్చి చిట్టి బాబు పక్కన కూర్చున్నాడు.
సుబ్బారావు మూర్తి ని, “ట్రెయిన్ ఖమ్మం నుంచీ సికిందరాబాదు చేరటానికి ఎంత టైం పడుతుందండీ?”, అన్నాడు.
మూర్తి, “ఏమో తెలియదు భై, మూడు గంటలుండొచ్చు”,అన్నాడు.
“మా కమ్యూనిస్టుల కంచుకోట ఖమ్మం లో తెలంగాణా ఉద్యమం ఎలా జరుగుతోంది?”, అన్నాడు సుబ్బారావు.
మూర్తి అసలు ప్రశ్నను వదిలేసి, “ఆ ఏం కమ్యూనిస్టుల్లే..ప్రపంచం ల ఎక్కడైనా కమ్యూనిజం వస్తదేమో గానీ ఇండియాల మాత్రం రాదు”,అన్నాడు.
“అయ్యో ఒక్క సారి అలా అనేశారేంటి..!నేనసలే కమ్యూనిస్ట్ సానుభూతిపరుణ్ణి”
“ఇక్కడ చాలా విషయాలు ఉన్నై..కులాలూ..మతాలూ..ప్రాంతాలూ..ఒక పేద వాడున్నడనుకొందాం..వాడి కులంలోనే ఒకడు బాగా రిచ్ వాడు ఉన్నడనుకొందం..ఈ పేద వాడు ఆ ఉన్న వాడ్ని శతృవు గా చూస్తడా..లేక ఆరాధనా భావం తో చూస్తడా..నూటికి నూరు పాళ్ళూ అభిమానిస్తడు..మా కులపోడే అంత పైకి పోయిండని..ఖేల్ ఖతం…ఇంక కమ్యూనిజం ఎలా వస్తది”, అన్నాడు మూర్తి.
హారీ కల్పించుకొని,”అయితే ఇండియా కు కమ్యూనిజం వచ్చే రిస్కు లేదన్న మాట!”
సుబ్బారావు, “కమ్యూనిజం అయితే ఇప్పట్లో రాదు..ఇక అది రిస్కా లేక వరమా లేక శాపమా అనేది మీరు కమ్యూనిస్టులా కాపిటలిస్టులా అనేదాని మీద ఆధారపడి ఉంటుంది”,అన్నాడు.
చిట్టి బాబు కి వీళ్ళేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్కా అర్ధం కావటం లా. తన మొబైల్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని “ఆర్యా” పాటలు వినటం లో మునిగి పోయాడు. ఝాన్సి ఫెమినా లోకి దించిన తల ఎత్తలేదు.
***********************
“మీదే ఊరండీ?”,సుబ్బా రావు అడిగాడు నరసింహ మూర్తి ని.
“మాది ఖమ్మం దగ్గర వైరా. నాకు అక్కడ భూములున్నాయి అవి చూసుకొని వస్తున్నా”,అని జేబులోంచీ ఏదో మాత్ర తీసి నీళ్ళ కోసం చూశాడు..ఎవరి దగ్గరా నీళ్ళ బాటిల్ లేదు..హారీ నీళ్ళు కూడా అయ్యిపోయాయి.మళ్ళీ టాబ్లెట్ జేబులో పెట్టుకొన్నాడు మూర్తి.
“మీ ఫామిలీ ఎంత మందండీ?”అన్నాడు సుబ్బా రావు.
“నా భార్య ఉంటుండె.ఇప్పుడు ఆమె చని పోయింది..ఉండుడు హైద్రవాద్ లోనే..ఓక పనిమనిషి వండి పెడుతుంది. నాకు ఒక్కడే కొడుకు వాడు “శానోసే” ల ఉంటడు”
“మీరు మరి మీ అబ్బాయి దగ్గరే ఉండక పోయారా?”
“అక్కడ మనకు బాతాఖానీ కి ఎవరు? దొరుకుతరు.హైద్రావాద్ లో నా ఆల్విన్ కొలీగ్స్ ఉంటరు..మా ఫ్రెండ్స్ మస్తున్నరు..వాల్లతో టైం పాస్ ఐతది..ఐనా వాడూ రమ్మంటుండు..అక్కడికి పోయేవాల్లు తోడు దొరికితే పోతా..”,అన్నాడు మూర్తి.
సుబ్బా రావు యధా విధి గా హారీ ని చూపించి, “ఈయన కూడా కాలిఫోర్నియా లో నే ఉండేది..మీకు తోడొస్తారేమో..”, అన్నాడు.
హారీ పెదాలు బిగించి మూర్తి తో చేయి కలిపి, “యా స్యూర్..ఎనీ టైం..ఐ విల్ హెల్ప్ యూ..”,అన్నాడు.
హారీ మూర్తిని, “తెలంగాణా గురించి ఈ మధ్య చాలా గొడవ జరుగుతోంది కదా మీ అభిప్రాయమేమిటి?”, అని అడిగాడు.
మూర్తి చేతులు ముకుళించి ,”దాని గురించి తప్ప దేని గురించైనా మాట్లాడు బాబు”,అన్నాడు.
హారీ సుబ్బా రావు వైపుకి తిరిగి, “ఈయన సిగ్గుపడుతున్నాడు..నువ్వే తెలంగాణ గురించి ఒక చర్చ ఎందుకు మొదలు పెట్టకూడదు? “, అన్నాడు.
సుబ్బా రావు, “అదో పెద్ద విషయం..దాని గురించి మొదలుపెడితే ఇప్పుడు తేలే విషయం కాదు..ఈ సమైక్యాంధ్రా తెలంగాణా వాదనల్లో రెండు పక్షాల వాళ్ళూ తమ చెవులు మూసుకొని ఎదుటి వాళ్ళతో వాదిస్తున్నారు. ఏదైనా ఒక విషయం చర్చించాలంటే చర్చించే వాళ్ళు ఇద్దరూ కొన్ని విషయాల గురించి అంగీకరించాలి..చర్చ ప్రయోజనాలేమిటి? ఇద్దరూ ఏ విలువలనూ కొలమానాలనూ అంగీకరిస్తారు…? మొదలైనవి. అలానే ఇద్దరూ ఓపెన్ మైండ్ తో చర్చ లోకి వెళ్ళాలి..ఒక వేళ ముందే ఒప్పుకున్న విలువల ప్రకారం తమ వాదనా లేక పాయింట్ తప్పయ్యితే ఒప్పుకోవటానికి సిధ్ధం గా ఉండాలి..అవతలి వారి మీద గెలవాలి అనే ఉద్దేశ్యం తో చర్చకు ఉపక్రమించ కూడదు. అలానే చర్చ అనేది నాకు తెలియని విషయాలు తెలుసుకొంటాను అనే సత్యన్వేషణా స్ఫూర్తి తో చేయాలి. చర్చించేటప్పుడు ఎదుటివాళ్ళు చెప్పిన లెక్కలని విశ్వసించాలి..తమ లెక్కల గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలి…కానీ తెలంగాణా విషయం లో ఇరు వర్గాల చర్చల లో ఇది లోపించింది..భావోద్వేగాలు ఎక్కువైనాయి. ఈ భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు మనిషి ఆలోచన భావోద్వేగాలకు దాస్యం చేస్తుంది..భావోద్వేగాలను బలపరచటానికే ఆలోచన ఉపయోగ పడుతుంది… కాబట్టీ ఈ చర్చల వలన ఉపయోగం ఉండదు. కొన్ని సార్లు చర్చలలో సరైన పరిష్కారం అనేది ఏదీ ఉండకపోవచ్చు..ఎందుకంటే అది చర్చల లో పాల్గొనే వారి వ్యక్తి గత ఇష్టా ఇష్టాలను బట్టి ఉంటుంది..నాకు నేను గొప్ప మీకు మీరు గొప్ప. ఇద్దరూ ఎంతసేపు వాదించుకొన్నా ఎవరో ఒకరు గొప్ప వారు అని నిర్ణయించలేము కదా..అలా వాదించుకొనే కంటే ఇద్దరూ ముష్టి యుధ్ధానికి దిగటం సరైనది…”
హారీ అడ్డు తగిలి, “హేయ్..నేను చర్చ మొదలు పెట్టమంటే నువ్వు చర్చను గురించి మోనొలోగ్ మొదలు పెట్టావు. తెలంగాణా విషయం గురించి నీకు ఇంత భయముందని నాకు చెప్పలేదే..ఏమైనా నీకు నేను డబ్బులిచ్చేది జనాలను మాట్లాడించేందుకు..కానీ ఇప్పుడు నువ్వు చర్చలకు వ్యతిరేకం గా మాట్లాడుతున్నావు. కాబట్టీ నీ పేమెంట్ లోకొంత కట్..” అన్నాడు.
సుబ్బా రావు,”తెలంగాణా గురించి చర్చించటం కంటే అది వెయ్యి రెట్లు బెటర్”, అన్నాడు.
****************
రైలు బండి వరంగల్ స్టేషన్ చేరింది..ఈ స్టేషన్ లో ’సుబ్బారావు అండ్ కంపెనీ’ కి ఎవరూ తోడవ్వలేదు.
ఝాన్సీ ఫెమినా మూసి అప్పుడప్పుడూ హారీ తో మాత్రమే మాట్లాడుతోంది..అమెరికా లో యూనివర్సిటీలు ఎలా ఉంటాయి…అక్కడ స్త్రీ స్వేచ్చ చాలా ఎక్కువ కదా…వగైరాలు అడుగుతోంది.
చిట్టి బాబు కి ఆర్య సాంగ్స్ వినీ వినీ బోర్ కొట్టినట్లుంది, సుబ్బారావు తో తానెప్పటికీ కొనలేని కార్ బ్రాండ్ల గురించి చర్చ మొదలు పట్టాడు.మూర్తి గారు చేరగిలపడి నిద్రపోతున్నారు. కాజీ పేట్ కూడా వచ్చి వెళ్ళింది.
చిట్టి బాబు ని వదిలించుకొని సుబ్బారావు హారీ తో అన్నాడు. “మన ప్రయాణం ఇంకో గంటన్నర లో అయిపోతుంది. దీని వలన మీరు ఏమైనా ప్రయోజనం కలిగిందా ?”
జవాబు గా హారీ తన లాప్-టాప్ సుబ్బారావు కి ఇచ్చాడు, చదవమంటున్నట్లు గా.
సుబ్బా-రావు చదవ సాగాడు…
“1. నేను ఈ ప్రయాణం మొదలు పెట్టింది నా రీసెర్చ్ కోసం ఏమైనా లోతైన విషయలు తెలుస్తాయేమో నని. కానీ రీసెర్చ్ కంటే నాకు వ్యక్తి గతం గా ఈ ప్రయాణం చాలా ఉపయోగపడింది. దీనికి ముందు ‘ఈ భారతీయ సమాజం ఇలా ఎందుకు చీలికలు పేలికలు గా ఉందా?’ అనుకొనే వాడిని. ఇప్పుడు నాకొకటి అర్ధమైంది. సమాజమనేది మన అంతర్గత ప్రపంచానికి ఒక ప్రతి-బింబం లాంటిది..సమాజం లోని ద్వేషం, అవినీతీ, ఓర్వలేనితనం… ఇవన్నీ మన మనసులలోంచీ పుట్టినవే! అలానే మన అంతర్గత ప్రపంచం కూడా సమాజం వలన ప్రభావితమౌతుంది.
2. ఈర్ష్యా, అసూయా, ప్రేమా, ద్వేషం, స్నేహం ఇవన్నీ మన మానసిక గుణాలు. వీటన్నిటికీ ‘నేను’ లేక అహం అనేది కేంద్రం. ఈ ‘నేను’ కి జాతీ మతం కులం దేశం మొదలైనవి అడ్రస్ లాంటివి. ఒక మనిషికి ఊరు వీధి లాంటి భౌతికమైన అడ్రస్ లు ఉన్నట్లే, అతని లో ఉండే మానసిక మైన వ్యక్తిత్వానికి అస్థిత్వపరమైన అడ్రస్ కూడా ఉంటుంది. ‘నేను’ యొక్క అభిప్రాయాలూ ప్రవర్తనా ఈ అడ్రస్ కి అనుగుణం గా ఉంటాయి. నువ్వు అమెరికన్ ఐతే నీ అస్తిత్వ అడ్రస్ లోని పంక్తుల సంఖ్య తక్కువ గా ఉంటుంది. అదే, నువ్వు ఇండియా లో పుట్టిపెరిగితే,ఇక్కడి చారిత్రక, సామాజిక కారణాల వలన, నీ అస్తిత్వ అడ్రస్ లో కులమూ, మతమూ, భాషా, ప్రాంతమూ ఇవన్నీ కలిసి నీ అడ్రస్ చాలా పొడవు సాగుతుంది అంతే తేడా!అస్తిత్వ అడ్రస్ లేకుండా ఏ మనిషైనా భూమి మీది కొన్ని కోట్ల గుంపులో ఒకడిగా ఫీలయ్యి, తాను ఒక పనికి రాని దుమ్ము కణం గా భావిస్తాడు. అస్థిత్వాలు మనిషి పరిధిని అతని సమూహ పరిధికి పెంచి, అనంతమైన ఈ మానవ జాతి లో అతనికి ఒక స్థానాన్నీ, ప్రాముఖ్యతనీ ఇస్తాయి.
3. అయితే ఒకే మనిషి కి పరస్పర విరుధ్ధమైన రెండు అడ్రస్ లు ఉండ వచ్చు. ఉదాహరణ కు పేదవారిని అణగదొక్కటాన్ని వ్యతిరేకించే మనిషి ఆడ వారిని అణగ దొక్కటాన్ని సమర్ధించ వచ్చు. ఇది అతని అడ్రస్ లో ఉండే మగాడు అనే విషయం వలన. వ్యక్తిగత విషయాలలో ఈ వైరుధ్యం వలన నష్టం లేదు. భార్య నీ చెల్లి నీ ఒకే దృష్టి తో చూడలేము కదా! కానీ సమాజం లో ఇది తప్పు. ప్రభుత్వం తెలంగాణ నూ ఆంధ్ర నూ ఒకే దృష్టి తో చూడాలి కదా! సమాజం లో ఉండే అధికారం, ధనం, పేరు ప్రతిష్టలూ అనేవి పరిమితమైన వనరులు. ఈ వనరులకోసం, ఈ అడ్రస్ ల ను తలలోకి ఎక్కించుకొన్న మనమందరం పోటీ పడతాం. ఈ పోటీ వలన, ఈ అడ్రస్ లు ప్రాతినిధ్యం వహించే దేశాల, మతాల, కులాల మధ్య ఘర్షణ తప్పదు.
ఇక పోతే,నా డియర్ ఫ్రెండ్ సుబ్బా రావ్ చెట్టు కింద పొదలూ చెట్టు కాయల రుచీ కూడా చూశానన్నాడు.
నాకు కూడా ఆ రుచి తెలిసింది. ఒక సమాజాన్ని అధ్యయనం చేయాలంటే దాని సూక్ష్మ దృష్టి లోనూ స్థూల దృష్టి తోనూ కూడా చూడాలి. ఈ రైలు ప్రయాణం వలన నాకు సూక్ష్మ దృష్టి ఏమిటో తెలిసింది. అలానే అమెరికన్స్ ఎక్కువగా బుధ్ధి ఉపయోగించి ఆ ప్లేన్ లో ఆలోచిస్తారు. ఇండియన్స్ భావోద్వేగాలు ఉపయోగించి ఎమోషనల్ ప్లేన్ లో ఆలోచిస్తారు. ఆలోచించేటప్పుడు హృదయాన్ని కూడా ఉపయోగించాలని కూడా ఈ ప్రయాణం నాకు చెప్పింది”
….సుబ్బా రావు లాప్-టాప్ మూసి హారీకిచ్చి,”బాగున్నాయి సార్, మీ నోట్స్..!” అన్నాడు.
హారీ వాలెట్ తీసి, “నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా..ఎంత ఇవ్వమంటావు?” అన్నాడు
“ఈ ప్రయాణం వలన నాకు కూడా లాభం కలిగింది. కాబట్టీ మీరు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు”
“ఏమి లాభం?”
“మనిషి కి కులం కంటే మతంకంటే స్వార్థం అనేది ముఖ్యం అని తెలిసింది. ఈ స్వార్థమూ మీరు చెప్పిన నేను అనే కేంద్రమూఒక్కటే. కానీ ఈ కేంద్రం హైదరాబాద్ ట్రాఫిక్ లా చాలా గందర గోళమైనది. ఈ స్వార్ధం లో మనిషిని వివిధమైన దిక్కులలో కి లాగే పరస్పర విరుధ్ధమైన అనేక శక్తులు ఉంటాయి. నిజాన్ని తెలుసుకోవాలంటే వీటన్నిటినీ అధిగమించ గలగాలి. ఇదీ నా పాఠం”,అన్నాడు సుబ్బారావు.
హారీ ,”నాకు అందరి కులాలూ మతాలూ జాతులూ తెలిశాయి. కానీ, ఇవన్నీ నాకు తెలియటానికి కారణమైన నీ కులం మాత్రం నాకు తెలియ లేదు” అన్నాడు సుబ్బారావు తో.
“నాకూ ఒక కులముంది సార్…అదే మనిషి కులం!”, అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.
“నాది కూడా అదే కులం”,అన్నాడు హారీ సీరియస్ గా.
సీట్లో నిద్ర పోతున్న మూర్తి గారు సీట్ మీదికి ఒరిగి పడి పోయాడు. సుబ్బారావు చెయ్యి పట్టుకుంటే చల్ల గా తగిలింది. హారీ, ఝాన్సీ, చిట్టి బాబు లేచి దగ్గరకు వెళ్ళారు. భోగీ లో మిగిలిన ప్రయాణికులు కూడా వచ్చి గుమి కూడారు. ఇంతలో ప్రయణికులలో ఒక డాక్టర్ లా ఉన్నాడు, అతను వచ్చి మూర్తి గారి చెయ్యి చూసి ముక్కు దగ్గిర చెయ్యి పెట్టి పెదవి విరిచి, “హి ఈజ్ డెడ్!!”, అన్నాడు.
సుబ్బారావు మూర్తి గారిని బెర్త్ మీద సరిగా పడుకోబెట్టాడు. చిట్టి బాబు ఇంకా షాక్ నుంచీ తేరుకోలేదు. అతను చూసిన మొదటి మరణం ఇదేలా ఉంది. హారీ మూర్తి జేబు లోంచీ మొబైల్ బయటికి తీశాడు. దాంట్లో రెండే నంబర్లు ఉన్నాయి. మొదటి నంబర్ డయల్ చేశాడు.అమెరికా నంబర్ అది. అవతలి మనిషి లేడు. వాయిస్ మెయిల్ బాక్స్ లోకి వెళ్ళింది.
రెండో నంబర్ డయల్ చేశాడు.
“గుడ్ హెవెన్స్ ఎలక్ట్రిక్ క్రెమటోరియం”…
హారీ ఫోన్ సుబ్బారావు కి ఇచ్చాడు. సుబ్బారావు కాసేపు మాట్లాడి చెప్పాడు. మూర్తి గారు ముందు గానే క్రెమటోరియం కి డబ్బులు ఇచ్చి, ఆయన స్నేహితుల ఫోన్ నంబర్ల లిస్టు ఇచ్చారంట. వాళ్ళు స్టేషన్ కి వాన్ పంపిస్తారట..అలానే మూర్తి గారి అబ్బాయి ఫోన్ కూడా వాళ్ళ దగ్గర ఉందట..వాళ్ళు ఫోన్ చేస్తామంటున్నారు..తన దహన క్రియల గురించి వివరమైన సూచనలు ఇచ్చారంట వాళ్ళకి”, అని చెప్పాడు.
మూర్తి దేహం పై ఈగలు వాలసాగాయి. ఝాన్సీ తన బాగ్ లోంచీ షాల్ తీసి కప్పింది మూర్తి పై.
“చావు లో మనుషులందరూ ఒక్కటౌతారు కాబోలు!!”, అనుకొన్నాడు హారీ.
అయిపోయింది
ఆదర్శాలూ వగైరాల గురించి నేను రాయబోయే నవల ప్లాట్..
23 మే 2011 అభిప్రాయములు
ఆదర్శాలూ వగైరాల గురించి నేను ఒక నవల రాద్దామనుకొంటున్నాను..ఆ నవలని ఇక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను.దాని ప్లాట్ ని కింద ఇచ్చాను. దీని గురించి మీ అభిప్రాయాలూ సలహాలూ తెలియ చేయండి.
—————————————————————————–
ఇది ఆదర్శ రావు కథ. పేరుకు తగ్గట్టు ఆదర్శ రావు కి ఆదర్శాలు ఎక్కువ. సమాజ వ్యవస్థ లో అనేక లోపాలున్నాయి. ఈ లోపాల కారణం గానూ, ఈ లోపాలను అధిగమించాలనే ఆదర్శరావు కోరిక వలనా ఆదర్శరావు “సమసమాజం” అనే ఒక ఆశయాన్ని ఏర్పరచుకొన్నాడు. అతను ఈ ఆశయం ఏర్పరచుకోవటానికి కారణం సమాజ అసమానతల్లో ఉంది. అలానే సమాజం మారాలనే అతని వ్యక్తిగతమైన కోరిక లో కూడా అతని ఆశయానికి మూలాలు ఉన్నాయి. అతని కోరిక అతని వ్యక్తిత్వం నుంచీ వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచీ అతను పెరిగిన పరిస్థితుల ప్రభావం వలన ఆ కోరిక అతనికి కలిగింది. కానీ, అతని వ్యక్తిత్వం లో అతని కోరిక తో పాటు గా వాస్తవ సమాజం లో ఉన్న అనేక దుర్లక్షణాలు కూడ ఉంటాయి. ఎందుకంటే అతను ఈ ప్రస్తుత సమాజం లోనే బతుకుతున్నాడు. ఏ అడవి లోనో బతకటం లేదు కదా? రోడ్డు పక్క ఈగలు ముసిరిన ముసలి బిచ్చగాడిని చూసి ” ఈ సమాజం ఎంత దయాహీనమైనది!!” అనుకొంటాడు, కానీ తన జేబులోంచీ ఓ రెండు రూకలు తీసేటప్పూడు మాత్రం “ఆ..నేను ఈ రెండు రూపాయలు వేసినంత మాత్రాన ఈ సమస్య సమసి పోతుందా” అనుకొంటాడు. ఒక్కోసారి ఆ రెండు రూపాయలనూ జేబులోకే తోసేస్తాడు. ఒక్కోసారి..”ఇలా దేశం లోని బిచ్చగాళ్ళందరికీ దానం చేస్తే నేనూ ఒక రోజు బిచ్చగాడి గా మారిపోతాను తప్ప ఈ దానం వలన ఉపయోగం లేదు” అనుకొంటాడు. అతను రచనలు చేస్తాడు. కానీ, ఆ రచనలలో అతని ఆశయం తో పాటు,సమాజంలోని దుర్లక్షణాలు కూడా ఉంటాయి. తన రచనలలో కూడా రిక్షా వాడిని రిక్షా వాడనే అంటాడు. “రిక్షా ఆయన” అని అనడు. సమాజం నుంచీ వచ్చిన అలవాట్లు తొందరగా వదలవు కదా? అతని ఆదర్శం వలన అతని భావోద్వేగ పరమైన అవసరాలు కూడా కొన్ని తీరాయి.
ఆదర్శరావు, అతని సహచరుడు ఒకడి తో తన సమ సమాజ ఆదర్శాల గురించి చెప్పాడు.ఆ సహచరుడు వడ్డీ వ్యాపారం చేస్తూ డబ్బుకి గడ్డి తినే రకం మనిషి. ఆ సహచరుడు వెంటనే ఆదర్శరావు ని,”ఊళ్ళో నీకెంత పొలముందీ..?” అని అడిగాడు.
ఆదర్శ రావు ఎంత పొలం ఉందో చెప్పాడు. దానికి ఆదర్శరావు సహచరుడు, “ఐతే ఆ మూడు ఎకరాలు నువ్వు ఊళ్ళో రైతు కూలీలకు పంచెయ్యి..తరువాత నాకు ఆదర్శాలు చెప్పు”,అన్నాడు. ఈ విధం గా ఆదర్శ రావు ఆదర్శాలు చెప్పటం వలన తన కంటె అన్ని రకాలు గా నీచుడైన ఒక సహచరుడి కి లోకువై పోయాడు.
ఆదర్శ రావు సహచరుడు అతని వ్యక్తిత్వాన్ని అతని ఆదర్శాలలోంచీ చూసి, “గొప్ప మాటలు చెప్పటానికి ఆదర్శరావు అప్పటికే ఆదర్శం పాటించే వ్యక్తిత్వం కలవాడు అయ్యి ఉండా”లనుకొన్నాడు.
ఇక్కడే మనం ఆదర్శరావు కి ఉన్న ఇంకొక స్నేహితుడు సుబ్బారావు గురించి చెప్పుకోవాలి……..
సుబ్బారావు క్రికెట్ ఒక మాదిరి గా ఆడతాడు. కానీ అతనికి తన ఆట తో సంతృప్తి గా లేదు. సచిన్ టెండుల్కర్ లా షాట్ లు కొట్టాలని కోరిక అతనికి. ఇక్కడ సుబ్బా రావు ఆశయం టెండుల్కర్ లా షాట్ లు కొట్టటం. ఈ ఆశయం అనేది తన యొక్క వాస్తవ పరిస్థితి (టెండుల్కర్ లా షాట్లు కొట్టలేక పోవటం) నుండీ, ఇంకా
టెండుల్కర్ లా షాట్లు కొట్టాలనే కోరిక నుంచీ వచ్చింది. సుబ్బా రావు ఒక రెండు మూడేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేసి టెండుల్కర్ లా షాట్లు కొట్ట వచ్చు. కానీ దాని వలన ఆట లో సుబ్బా రావు వ్యక్తిత్వం టెండుల్కర్ వ్యక్తిత్వానికి సమానమవ్వదు. ఎందుకంటే టెండుల్కర్ కి షాట్లు కొట్టటం అనాయాసం గా చిన్నప్పటినుంచీ అలవడిన ఒక విద్య. సుబ్బా రావు చాలా శ్రమ పెట్టి నేర్చుకొన్న ఒక కళ. ఐతే సుబ్బా రావు తాను అనుకొన్న ఫలితం సాధించాడు. ఫలితాన్ని మాత్రమే చూసినట్లైతే సుబ్బా రావు ని టెండుల్కర్ తో సమానం గా చూడ వలసిందే
సుబ్బారావు క్రికేట్ సరిగా రాకుండా టెండుల్కర్ లా బాటింగ్ చేయాలనుకొన్నప్పుడు అందు లో జనాలకు వైరుధ్యం ఏమీ కనపడదు. అదే సుబ్బారావు తనకు బాటింగ్ సరిగా రాకుండానే పక్క వాడితో,”టెండుల్కర్ లా బాటింగ్ చెయ్యాలోయ్…. అది అంత కష్టమేమీ కాదు” అని చెప్పకూడదు కదా! ఆదర్శ రావు తన వరకూ తన ఆదర్శాలను పాటించటానికి ప్రయత్నిస్తే అతని సహచరుడి కి ఏమీ వైరుధ్యం కనపడేది కాదు. ఎప్పుడైతే ఆదర్శ రావు తనకి చెప్పటం ప్రారంభించాడో, అప్పుడు అతని సహచరుడు ఆదర్శ రావు విశ్వసనీయత ని డిమాండ్ చేశాడు. ఆ సహచరుడు తనకున్న వడ్డీ వ్యాపారం మాని ఆదర్శాలను పాటించటానికి సిధ్ధం గా లేడనేది వేరే విషయం.
ఈ స్థితి లో ఆదర్శ రావు కి ఏ ఆదర్శాన్నైతే తాను భుజాన వేసుకొన్నాడో, ఆ ఆదర్శానికి అనుగుణం గా తన వ్యక్తిత్వమూ, చేతలూ, ఒక్కోసారి మాటలూ కూడా లేవు అని అర్ధమయ్యింది. తన ఆదర్శ భావాలను వదలకుండానే, తన సహచరుడి లాంటి వాళ్ళ కు లోకువ కాకుండాఉండటానికి, ఆదర్శరావు కి రెండు మార్గాలున్నాయి. ఒకటి తను పూర్తి గా వ్యక్తిత్వ విప్లవాన్ని సాధించి అడవుల్లోకి పోయి ఈ సమాజం మీద పోరాడటం. ఈ పోరాటమూ దాని నైతికత గురించి తరువాత చెప్పుకొందాము.
ఇక రెండో మార్గం, తాను కూడా అందరి లాంటి వ్యక్తిత్వం కలవాడే అని అంగీకరించి,సమాజం లోని మిగిలిన వారితో, “మనలో,మన సమాజము లో ఇలాంటి లోపాలున్నాయి, వాటిని మనం ఇలా మార్చుకొంటే బాగుంటుంది” అనే స్వరంలో చెప్పటమే. ఇదే “సిగరెట్లు కాల్చే కొడుకుకి, సిగరెట్లు కాల్చే తండ్రి చెప్పే” స్వరం అన్నమాట.
కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన వ్యక్తిత్వాన్ని తన ఆదర్శాలకు అనుగుణం గా మార్చుకొనే ప్రక్రియ లో అడవుల్లోకి వెళ్ళి సాయుధ పోరు బాట పట్టాడు. అక్కడ చాల మంది యువకులను పోగేశాడు ఈ యువకుల వ్యక్తిత్వాలు ఇంకా ఆదర్శ రావు సమసమాజ ఆదర్శాలకు అనుగుణం గా ఇంకా మార లేదు. కానీ ఆదర్శ రావుకు తన ఆదర్శం గురించిన అవగాహన బాగానే ఉంది.
సమాజ వ్యవస్థ లో అసమానతలున్నాయి. దీని లో వ్యక్తుల పై ఆదర్శ రావు కి కోపం లేదు. కానీ వ్యవస్థ కి ప్రతినిధులు వ్యక్తులే. ఈ వ్యవస్థ అనేది వారి బుర్రలలోని ఆలోచనల లోనే ఉంది. డబ్బున్న వారు ఆ డబ్బుని వదులుకోలేరు. మంచి గా చెప్తే, అధికారం ఉన్న వారు ఆ అధికారాన్ని వదులు కోరు సరి కదా, ఆదర్శ రావు పైకి పోలీసులని పంపిస్తారు. కాబట్టీ అసమానతలు తొలగించాలంటే అసమానతలు ఉన్నచోట చదును చేయక తప్పదు. కాబట్టీ ధనిక వర్గాన్ని మట్టుబెట్టక తప్పదు.
ఆదర్శరావు తో ఉన్న కుర్రాళ్ళ లో ఈ స్పష్టత లేదు. వాళ్ళు “తమ ఊళ్ళోని ఖామందుల పై ద్వేషం తోనో, నిరుద్యోగం తో నో ఆదర్శరావు ఉద్యమం లో చేరిన వాళ్ళు”. ఆదర్శ రావు వాళ్ళ ఆవేశాన్ని ఒక పనిముట్టు లా వాడుకొని, ఉన్న వ్యవస్థ ని కూల్చి, కొత్త వ్యవస్థని పై నుంచీ ఇంపోజ్ చేద్దామనుకొన్నాడు. కొన్నాళ్ళకి ఆదర్శ రావు తన ఉద్యమ కారుల సహయం తో కొంతమంది భూస్వాములను చంపి కొంత ప్రాంతాన్ని ఉద్యమ ఆధీనం లోకి తెచ్చుకొన్నాడు. ఈ భూస్వాములను చంపేటప్పుడు కొందరు మంచి భూస్వాములు కూడా చనిపోయారు.మంచి భూస్వాములంటే పేదవాళ్ళ కష్టాల పై సానుభూతి ఉన్నవాళ్ళు. మంచి భూస్వాములను చంపకపోతే ఉద్యమ నినాదాలను సంక్లిష్టం చేయవలసి వస్తుంది. “భూస్వాములను మట్టుబెట్టండి” అని కాకుండా “చెడ్డ భూస్వాములను చంపండి” అని అంటే ఉద్యమం లోని భావోధృతి తగ్గుతుంది. భూస్వాములలో కూడా మంచివారున్నారని అంగీకరించినట్లౌతుంది. ఇది సామాన్య జనాల దృష్టి లో ఉద్యమ లక్ష్యాలకు భిన్నం గా ఉన్న నినాదం గా కనపడుతుంది. ఆదర్శ రావుకు ఉద్యమ ఉధృతి తగ్గటం ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే అతను, మంచి భూస్వాములు ఉన్నారని తెలిసినా వారిని చంపే సమయం లో మిన్నకున్నాడు. ఆదర్శ రావు తన అనుచరులను సిధ్ధం చేసేటప్పుడు వాళ్ళ కి ఆవేశాన్నైతే ఇవ్వగలిగాడు కానీ తన కున్న అవగాహనను వాళ్ళకి బదిలీ చేయలేక పోయాడు. అందు వలన అతని అనుచరులు మంచీ చెడూ చూడ కుండా భూస్వాముల నందరినీ మట్టుబెట్టారు. ఈ పోరాటం లో చనిపోయిన ఆదర్శ రావు అనుచరులను అమరవీరులు గా కీర్తించి వారికి స్థూపాలు కట్టారు. పోరాటం లో ఆదర్శ రావు గెలిచాడు కాబట్టీ సరిపోయింది. ఓడి పోతే చనిపోయిన ఆదర్శరావు అనుచరులను” తరువాత గుర్తు పెట్టుకొనే వారే ఉండేవారు కాదు. ఆదర్శ రావు కి “పేద వాళ్ళు భూస్వాముల స్థితి లో ఉంటే వారి లానే ప్రవర్తిస్తారు” అనే విషయం లో ఏ మాత్రం సందేహం లేదు. ఆ విధం గా చూస్తే “భూస్వాములకంటే వ్యక్తి గతం గా ఏ మాత్రం ఉన్నతులు కాని ఆదర్శ రావు సైన్యం భూస్వాములను చంపటం” నైతికం గా సరి కాదనేది ఆదర్శ రావు కి కూడా తెలియలేదు. కొత్త వ్యవస్థ రావటం కోసం పాత వ్యవస్థ లో లబ్ది పొందిన “భూ స్వాములు ఆ మాత్రం మూల్యం చెల్లించాలి” అనుకొన్నాడు ఆదర్శ రావు.
ఆదర్శ రావు కలలు కన్న సమ సమాజం వచ్చేసింది. పై నుంచీ వ్యవస్థ లో వచ్చిన మార్పులవలన,డబ్బు పై మనుషులు ఆధార పడవలసిన అవసరం లేక పోవటం వలనా,మనుషులకు కనీసావసరాలైనా కూడూ గుడ్డా అందటం వలన, మనుషులలో చాలా వరకూ సమాజ పరమైన అవలక్షణాలైన మోసం, నేరం తగ్గాయి. కానీ మనుషుల్లో ఆదర్శ రావు స్థాపించిన వ్యవస్థ పరిధి లోకి రాని అవలక్షణాలు చాలానే ఉన్నాయి. అధికారం కోసం తపన, పక్క మనిషి మీది అసూయా ఎక్కడికీ పోలేదు. వ్యక్తిగత లాభమూ, వైవిధ్యమూ,వ్యక్తి గత పరమార్దమూ తన జీవితం లో మనిషి వెతుకుతూనే ఉన్నాడు. వ్యక్తి గత అర్దానికి ప్రయోజనం
లేక పోవటం వలన మనుషులు కష్టించి పని చేయటం తగ్గించారు. వీటన్నిటి వలనా, మరియూ ప్రకృతి సిధ్ధమైన ప్రతిభా పాటవాలలోని తేడాల వలనా మళ్ళీ అసమానతలు పుట్టుకొచ్చాయి. ఆదర్శ రావు తన లో సమ సమాజానికి అనుగుణం గా లేని అవలక్షణాలను అధిగమించ గలిగినా, అతని అనుచరులు అలా అధిగమించిన వారు కాదు. ఏ స్థానిక భూస్వామి మీది ప్రతీకారేచ్చ తో నో వారు ఆదర్శ రావు తో కలిశారు. ఆదర్శ రావు కి ఈ విషయం తెలుసు కనుక వారిని సరైన దారి లో పెడుతూ వచ్చాడు.
ఆదర్శరావు కి వయసు పైబడ సాగింది. ఆదర్శరావు లోని భావోద్వేగ పరమైన అవసరాలు తగ్గాయి.అప్పటి దాకా ఆ అవసరాలను తీర్చిన అతని ఆదర్శాలు ఇప్పుడు అతనికి అంత ఆకర్షణీయం గా కనపడటంలేదు. అతనికి వయసు పెరిగే కొద్దీ తను స్థాపించిన వ్యవస్థ యొక్క తాత్కాలికతా, దానిలోని లొసుగులూ అర్ధమవ్వసాగాయి. కానీ అప్పటికే ఆ వ్యవస్థను స్థాపించిన వాడిగా లోకం ఆదర్శ రావు ని దేవుడి గా కీర్తించసాగింది. తాను స్థాపించిన వ్యవస్థ అంత గొప్పదేమీ కాదని చెప్తే ఆదర్శ రావు తన తప్పు అంగీకరించినట్లే. అందువలన అతను జనాలకి తన పట్ల ఉన్న గౌరవాన్ని కోల్పోవటమే కాకుండా, తనని ఏ ఆదర్శమైతే గొప్పది చేసిందో ఆ ఆదర్శాన్నే మట్టుబెట్టిన వాడౌతాడు. అందుకనే ఆదర్శ రావు తను తీసుకొని వచ్చిన వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపించలేకపోయాడు.
ముసలి వాడైపోయిన ఆదర్శ రావు, ఒక రోజు హఠాత్తు గా గుండె పోటు తో చనిపోయాడు. ఆదర్శరావు స్థాపించిన ఆదర్శ సమాజానికి ఏమై ఉంటుందో మీరే ఊహించి చెప్పండి… ఇంతకీ ఆదర్శ రావు ఆశయాల వలన సమాజానికి మంచి జరిగిందా? చెడు జరిగిందా?
అదృశ్యమైన అంకినీడు..ఒక చిన్న కథ..
27 మే 2011 అభిప్రాయములు
in కథలు
భుజం మీదినుంచీ పైపంచె తీసి, బల్లమీది లేని దుమ్ము దులిపి, పంచె పైకి లాగి కూర్చున్నాడు అంకినీడు.
“అమ్మాయ్..! అంకినీడొచ్చాడు రొండు మినపట్లు పెట్టు”, అంది ఆదెమ్మ కోడలితో.
“ఆ..ఊళ్ళో వాళ్ళందరికీ తేర గా పెట్టటానికి ఉందిక్కడ!”, కోడలు గొణుక్కొంది లోలోపల.
ఐదు మిముషాలయ్యింది..పదినిముషాలయ్యింది..పావు గంటయ్యింది..ఆ రెండు మినపట్లూ రాలేదు.
ఆదెమ్మ మళ్ళీ కేకేసింది, “సరితా, మినపట్లు”.
“ఆ మినపట్లంట తగలెయ్యవే!”, అని భార్యను కసిరాడు పక్కనే మంగలి తో గడ్డం చేయించుకొంటున్న చెరువు కాడి చిన్ని గారి వెంకయ్య .
అంకినీడు విసురు గా లేచి పై పంచె దులిపి భుజం మీద వేసుకొని నెమ్మదిగా బయటికి నడవ సాగాడు. ముందు విసురుగానే నడుద్దామనుకొన్నాడు. కానీ కాళ్ళు పట్టివ్వటం లేదు ఈ మధ్య.
ఆదెమ్మ, “అంకినీడూ ఆగయ్యా..!, ఒరే.. ఎంకన్నా..చెప్పేది సరిగా చెప్పొచ్చు గా..మాట పడటం మా కంఠంనీడారి లో అసలు లేదు.” అంది.
“ఆ..లేదు..లేదు..మీ కంఠంనేనారి ముఠా గురించి ఎవరికి తెలవదు..? అయినా ఇన్నేళ్లయినా పుట్టింటాళ్ళ మీద బెమత పోలేదమ్మా నీకు!”
మొత్తానికి అంకినీడు బల్ల మీద కూర్చొని మినపట్లు తిని కాఫీ తాగేదాకా ఊరుకోలేదు ఆదెమ్మ.
******************
అంకినీడు నెమ్మది గా వీధిలోకి వచ్చే సరికి పొద్దెక్కిపొయింది. చెప్పుల్లేని కాళ్ళు ఎండకి కాలుతున్నాయి.వెళ్ళి ఊరి అరుగుల దగ్గర కూర్చొన్నాడు.
“నాలుగు నెల్లు గా మెడ నరాలు ఒకటే పీకటం. కణతలు అదురుతున్నాయి. డాక్టర్ దగ్గరికి పోదామంటే చేతిలో చిల్లి గవ్వకూడా లేదాయే..”
మచ్చల పిల్లి ఒకటి నీడ లో మాగన్ను గా నిద్ర పోతోంది.పక్కనే ఓ దొడ్లో కాకి కుడితి తొట్టి అంచు మీద కూర్చొని ఎండకి నీళ్ళు కతుకుతోంది.
పది రోజుల గడ్డం తెల్ల గా మాసి ఉంది. మంగలి నాగరత్నం పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. అంకినీడు మాసిన గడ్డాన్ని వేళ్ళతో నిమురుకొని,”ఇదుగో నాగరత్నం..కాత్తి గెడ్డం గీత్తా..? చేయించుకొని పది రోజులయ్యింది..”, అన్నాడు.
“మా వాడు సెంటర్లో షాప్ పెట్టాడు అక్కడ గీయించుకో”, సైకిల్ మీద గబ గబా వెళ్ళిపోయాడు నాగరత్నం.
అంకినీడు ఒకప్పుడు బాగానే బతికాడు. నాన్న అంజయ్య. ఆయన ఆదెమ్మ పెదనాన్న కొడుకు. అంకినీడు చిన్నప్పుడే చనిపోయాడాయన. అమ్మ శేషమ్మ, ఆదెమ్మ కంటే పదిహేనేళ్ళు పెద్దది. అంకినీడు పట్నం పిల్లని పెళ్ళి చేసుకొన్నాడు. కానీ శేషమ్మకు కోడలు తీరు ఏమాత్రం నచ్చలా. “పని తక్కువ షోకులెక్కువ”, అనుకొంది శేషమ్మ.
కోడలికి శేషమ్మ తనని రాచి రంపాన పెడుతున్నట్లనిపించింది.ఊళ్ళోవాళ్ళందరూ, “శేషమ్మ కోడల్ని చెర కట్టనీయదు”, అనుకొన్నారు.
పిల్లాడినెత్తుకొని పుట్టింటి నుంచీ వచ్చిన వెంటనే కోడలికి పనులు పురమాయించటం మొదలు పెట్టింది శేషమ్మ. అంకినీడు కూడా అమ్మని సమర్ధించాడు. దానితో తన తండ్రికి రహస్యం గా ఉత్తరం రాసి, రమ్మంది కోడలు. పిల్లాడిని తీసుకొని, తండ్రితో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది. తండ్రి తో వెళ్ళిన ఆమె తరువాత మళ్ళీ రానేలేదు. అంకినీడూ ఆమె దగ్గరికి పోలేదు.కంఠంనేని వారి అభిమానం అడ్డొచ్చింది అంకినీడు కి. ఊళ్ళో వాళ్ళెవరో అనుకొంటుంటే విన్నాడు, తన భార్య కొడుకుని బాగా చదివించి ప్రయోజకుడిని చేసిందని, ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తున్నాడనీ.
శేషమ్మ ఉన్నంతకాలం అంకినీడుకి ఇంత ఉడకేసిపెట్టింది. శేషమ్మ పోయేనాటికి పెరిగిన ధరలకి ఉన్న ఎకరం చెక్కా తుడిచిపెట్టుకొని పోయింది. కూలికెళ్దామంటే అప్పటికే వేళ్ళు పట్టివ్వటం మానేశాయి. కాళ్ళు కదలటం లేదు. ఇక అప్పటి నుంచీ ఊళ్ళో అయిన వాళ్ళ దగ్గర తింటూ ఎలాగో రోజులు గడిపేస్తున్నాడు.
బుచ్చియ్య గారి దామోదర రావు చేతి వాచీ చూసుకొంటూ అరుగుల దగ్గరికి వచ్చాడు. అంకినీడు కి ఈ మధ్య చూపు ఆనటం లేదు. కళ్ళు పువ్వులేసినై. కళ్ళపై నుదుటికడ్డం గా చేయ్యి పెట్టి , కళ్ళు చికిలించి పళ్ళు బయటపెట్టి చూశాడు దామోదర రావు వచ్చిన వైపు కి. దామోదర రావు అంకినీడు ని చూసి ఒక నవ్వు నవ్వి, “ఏం.. పలారం అయ్యిందా..?” అన్నాడు, చేతి వేళ్ళు ఒకటి చేసి నోటి దగ్గర ఊపుతూ.
దామోదర రావు పిల్లలందరూ అమెరికా లో ఉన్నారు. ఇక్కడ ఓ యాభై యెకరాలు ఉంది. అయినా, హైదరాబాదు నుంచీ రావటానికి, కొబ్బరి బొండాల తిరుగు లారీ లో ఫ్రీ గా వస్తాడని చెప్పుకొంటారు ఊళ్ళో జనాలు.
అయిందంటూ తలూపాడు అంకినీడు. “ఎందాకా…?”, దామోదర రావు ని అడిగాడు.
“ఇక్కడకే కొట్టుకి ..మజ్జానం మా ఇంటికి రా రాదూ?”, అన్నాడు దామోదర రావు.
అంకినీడు ని అన్నానికి రమ్మని, ముందు ఆ పనీ ఈ పనీ చేయించుకొని, తరవాత రాత్రి మిగిలిన కూడూ ఇంత పచ్చడీ వేయించటం దామోదర రావుకి అలవాటు. మొదట్లో చెప్పింది చేసేవాడు, కానీ,ఇప్పుడు తన కాళ్ళూ చేతులూ తన మాట వినటం లేదు.
పిల్లి నెమ్మది గా లేచి జారుకో సాగింది. అంకినీడు దానికేసి చూపించి, “దాన్ని అడుగు ..వస్తందేమో..!”, అన్నాడు దామోదర రావు తో.
“నీకు ఇంకా గీర్వాణం వదలలా..మీ కంఠంనేని వారి ముఠా లోనే ఉందీ టెక్కు”, అని కొట్టు వైపుకి ఏదో కొనటానికి వెళ్ళాడు.
“పొద్దున్నే ఆదెమ్మ మహా తల్లి ఆదుకుంది..ఇక ఈ మజ్జానం ఎట్టా గడుత్తుందో!” అనుకొంటూ పై పంచె భుజం మీద వేసుకొన్నాడు. ఆ పై పంచె కి చిరుగులు పడిఉన్నాయి. ఐనా అంకినీడు దానిని వదలడు. “రైతన్నతరవాత పైపంచె లేకండా ఎలా?”.
నెమ్మది గా కాళ్ళీడ్చుకొంటూ, కాలువ వైపుకి బయలు దేరాడు. ఎండ నెత్తిని మాడ్చేస్తోంది. “కాత్త ఆ కాలవ కాడైనా చల్ల గా ఉంటంది” అనుకొన్నాడు.
**********
పైన ఎండగా ఉన్నా కాలువ గట్టు మీద చెట్టు కింద చల్ల గానే ఉంది. నీరు స్థిమితం గా పారుతోంది. కాలువకడ్డం గా తాటి మాను ఒకటి వేసి ఉంది. కాలువ గట్టు పచ్చిక తో పిచ్చి మొక్కల తో పచ్చగా ఉంది.
“తన చిన్నప్పటి నుంచీ ఈ కాలవ మాత్రం మారలా..అప్పుట్నుంచీ ఇప్పుది దాకా ఎంత నీరు పారి ఉంటంది దీంట్లో..అయినా ఈ కాలవ మాత్రం మారలా! చిన్నప్పుడు తను అక్కడే తోటి వాళ్ళ తో కలిసి ఈతలు కొట్టాడు. తన తోటి వాళ్ళు అందరూ చాలా వరకూ పై చదువులకెళ్ళారు. తానొక్కడే తన తల్లి శేషమ్మ గారం వలన చెడి పోయాడు. ఏదైనా తన కి ఆయుష్షు ఎక్కువ. తన స్నేహితులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నాళ్ళు కూడ చాలా మంది కాలం చేశారు..తను మాత్రం మిగిలున్నాడు..ఇలా…”
“ఆ మజ్జ, డాబా రాఘవయ్య గారి అబ్బాయి పెళ్ళి కి పెద్ద కారేత్తే ఎల్లాడు తను బెజవాడ. అక్కడంతా దిక్కులేనాళ్ళు రోడ్డు పక్కన పడుకోవటమే..తను ఊళ్ళో నే ఉండటం వలన తనకా గతి పట్టలేదు..ఏదో పూరిల్లైనా రేత్రి పడుకోవటానికో ఇల్లుంది తనకు… సరే, పెళ్ళి కెళ్ళాడా.. ఆ పెళ్ళి లో కనపడింది తన పెళ్ళాం. పక్కనే ఉన్నాడు తన కొడుకు. అంతా తన పోలికే! తన బార్యా, తనని చూసి కూడా చూడనట్టే మొగం చాటేసింది. కొడుకుకి చెప్పినట్టు కూడ లేదు…తన్ని విడిచి పెట్టి పోయినపుడు పిల్లాడికి ఉహ కూడా తెలియదు..ఇంకా పిల్లాడు తనని ఎట్టా గుర్తు పడతాడు? తనకి మాత్రం అనిపించింది..ఆడి దగ్గిరికి ఎల్లి “ఒరే! నేను మీ నాన్నని రా!”, అని గుండెలకి అదుంకోవాలని.”
నెమ్మది గా వెళ్ళి తాటి మాను ఎక్కాడు.కంటి కి మాను సరిగా ఆనటం లేదు. పాదం ముందు పాదం పెడుతూ కాలువ మధ్యకి చేరుకొన్నాడు. మాను మీద గొంతుకు కూర్చొని నీళ్ళలోకి చూశాడు. నీళ్ళలో చచ్చిన పావురమొకటి కొట్టుకు పోతున్నట్లుంది. ఛాతి లో సన్న గా నొప్పి మొదలయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చట్ మని నీళ్ళు శబ్దం చేశాయి. ఆ సాయంత్రానికి ఊరి చివర లాకుల దగ్గర కనపడింది ఊళ్ళో వాళ్ళకి అంకినీడు శవం.
కాజా దేవేందర్ రెడ్డి గార్డెన్స్ అను “శృతి ఆకలి కథ”
31 మే 2011 వ్యాఖ్యానించండి
in కథలు
శృతి ‘లిప్-స్టిక్’ వేసుకొని పెదాలు దగ్గర పెట్టి అద్దం లో చూసుకొంది. రక్తం కారుతున్నట్లు ఎర్రగా ఉన్నాయి పెదాలు. “పెదాలు ఎంత ఎర్ర గా ఉంటే అంత మంచిదట”, తన సూపర్వైజర్ చెప్పింది. తన యూనిఫాం చీర కుచ్చిళ్ళు దోపి చూసుకొంది. బొడ్డు కింది కి రాక పోతే సూపర్వైజర్ రమ ఊరుకోదు.
శృతి ఒక “ఈవెంట్ మానేజ్మెంట్” కంపెనీ లో పని చేస్తోంది. ఆ రోజు సాయంత్రం ఒక మంత్రి గారి బావమరిది కూతురు పెళ్ళి రిసెప్షన్ ఫంక్షన్ జరుగుతోంది. ఆ ఫంక్షన్ ని శృతి వాళ్ళ కంపెనీ ఆర్గనైజ్ చేస్తోంది.
శృతి సూర్యాపేట నుంచీ ఐదు గంటలకి వచ్చింది. అక్కడ వాళ్ళ నాన్న రంగయ్య కి ఏమీ బాగోలేదు. రంగయ్య దర్జీ పని చేసి, తల్లి లేని లోటు తెలియకుండా, ఎలానో శృతి ని బీయే వరకూ చదివించాడు. ఈ మధ్య డాక్టర్లు అతనికి మూత్ర పిండాల వ్యాధి అని చెప్పారు.
తమ్ముడు నగేష్ పదో తరగతి లో ఉన్నాడు. వాడు చదువు లో మంచి మెరిక. శృతికి వాడంటే ప్రాణం.వాడిని ఎలాగైనా గొప్ప చదువు చదివించి ఏ అమెరికా నో పంపించాలని శృతి ఆశ. గవర్నమెంట్ కాలేజీ లో తెలుగు మీడియం లో బీయే చేసిన శృతి కి ఏమి ఉద్యోగం దొరుకుతుంది? అందుకే ఆ ఈవెంట్ మానేజ్మెంట్ కంపెనీ లో అతిధులకి సత్కారాలు చేసే ఆ చిన్న ఉద్యోగం లో చేరి పోయింది.అదైనా తను కాస్త తెల్ల గా ఉంటుంది కాబట్టీ ఇచ్చారు. వారానికొక సారి సూర్యా పేట వెళ్ళి తన తండ్రినీ తమ్ముడినీ చూసి వస్తూ ఉంటుంది.ఈ రోజు ప్రయాణం లో భోజనం చేయటం కుదరలేదు..శృతి కడుపు లో ఎలుకలు పరుగెడుతున్నాయి.రూం కి వచ్చే సరికే సాయంత్రం ఐదైపోయింది..ఇప్పుడు త్వరగా ఫంక్షన్ కి వెళ్ళాలి..
వ్యాన్ హారన్ విని ఈ లోకం లోకి వచ్చింది శృతి. డ్రైవర్ అరుస్తున్నాడు, “టైమైపోతోంది..జల్దీ..జల్దీ”
వ్యాన్ లో ఆమె తో పాటు పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా అతిధులకి సత్కారాలు చేసే వారే. అందరూ నార్త్ ఇండియన్స్. వాళ్ళలో షబ్నం కూడా ఉంది. అది “నార్త్ ఈస్ట్” వాడి కీ బెంగాలీ ఆమె కీ పుట్టిన అందగత్తె. దానికి పక్క వేషాలు చాలా ఉన్నాయి.
*******************
వ్యాన్ వాళ్ళని తీసుకెళ్ళి కాజా దేవేందర్ రెడ్డి గార్డెన్స్ దగ్గర దిగ బెట్టింది.ఫంక్షన్ హాల్ చాలా విశాలం గా, ఇరుకు సిటీ లొ బృందావనం లా ఉంది. దాని అలంకరణ కి మూడు క్వింటాళ్ళ పువ్వులన్నా ఖర్చుపెట్టి ఉంటారు.
అతిధులు ఒక్కరొక్కరే రాసాగారు. దాదాపు అందరూ ఖరీదైన కార్లలో వస్తున్నారు. మొకమంతా నవ్వు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు “బాగున్నారా?”, “హౌ ఆర్ యూ?” అంటూ కరచాలనాలు చేసుకొంటూ పలుకరిస్తున్నారు. ఆడవాళ్ళకి మగవాళ్ళూ “నమస్తే” అని చేతులు జోడిస్తున్నారు.మగ వాళ్ళు బంద్ గలా సూట్లూ, షేర్వాణీలూ,లాల్చీ పైజమాల్లో డాబు గా దిగుతున్నారు.అందం గా ఉన్న స్త్రీల డబ్బు ,వారి మేకప్ లో కనిపిస్తుంటే, అందం లేని స్త్రీల డబ్బు, వారి నగలలో కనిపిస్తోంది. కొందరు కల వారి పిల్లలు చాలా సింపుల్ గా, జీన్స్ టీ షర్ట్ లో ఉన్నారు. వారికి మేకప్ అంటే ఇష్టం ఉన్నట్లు లేదు. కానీ వారి చేతులకి డైమండ్ రింగ్స్ ఒకటో రెండో సింపుల్ గా మెరుస్తున్నాయి.
ఫంక్షన్ హాల్ లో క్లోజ్-సర్క్యూట్ టీవీ, జెయింట్ “ఎల్ సీ డీ” స్క్రీన్ ల మీద, వచ్చే అతిధులని వారి వారి హోదా ని బట్టి దగ్గర గా నో, దూరం గా నో , ఎక్కువ సేపో, తక్కువ సేపో, చూపిస్తోంది.వధూ వరుల తల్లి తండ్రులు వచ్చిన వాళ్ళతో వారి వారి హోదా ని బట్టి ఎక్కువ నవ్వుతూ నో,తక్కువ నవ్వుతూ నో పలుకరిస్తున్నారు.
టీవీ లో అంతకు ముందు రోజు వధువూ వరుడూ డ్యాన్స్ చేసిన ఒక సినిమా పాటని చూపిస్తున్నారు. వేదిక దగ్గర ఒక సినిమా క్రేన్ వచ్చే వాళ్ళని షూట్ చేస్తోంది. స్టేజీ పక్కన ఆంధ్రుల అభిమాన గాయకుడొకాయన తన గానామృతం తో అతిధులను అలరిస్తున్నాడు.
ఎం పీలు, ఎంఎల్యే లూ, సినిమా నటులూ, పారిశ్రామిక వేత్తలూ,మహిళా సంఘం సభ్యులూ,ప్రతి పక్షం వారూ, అధికార పక్షం వారూ, తెలంగాణా వాదులూ, సమైక్య వాదులూ… రోజు వారి టీవీ వార్తలలో కనపడే పెద్దలంతా వస్తున్నారు..వెళ్తున్నారు.
శృతి సర్వర్స్ ని పిలిచి వచ్చేవారికి ముందు మంచి నీళ్ళ బాటిల్ ఇప్పిస్తోంది… తరువాత వారికి ఒక సీట్ చూపిస్తోంది.చిరు నవ్వుతో వారికి ఏమి కావాలో కనుక్కొంటూంది….కడుపులో ఆకలి మాత్రం నవ్వుతున్న పెదాలను వంకర తిప్పుతోంది.
హాల్ నిండా రక రకాల వంటకాలు ఉన్నాయి, ఒక వైపు నార్త్ ఇండియన్ వంటలు, ఒక వైపు సౌత్ ఇండియన్ వంటలు…ఒక చోట టిఫిన్ మాత్రమే చేసే వారికి టిఫిన్లు..ఇంకొక చోట ఛాట్స్, పళ్ళు, అయిస్ క్రీంలు, ఇంకొక స్టాల్ లో ఇరానీ వంటలు,వేరొక స్టాల్ లో ఆఫ్ఘన్ పదార్ధాలు,చవులూరించే చైనీస్ నూడుల్సూ, సలాడ్లు, స్వీట్లు..అక్కడ ఉన్న తినుబండారాలతో ఒక ఊరిని ఒక సంవత్సరం పాటు పోషించవచ్చు. పక్కనే నాన్ వెజ్ సెక్షన్.అక్కడ చికెన్, మటన్, కోస్తా రొయ్యలూ, గోదావరి చేపలూ, పీతలూ సకల తినదగిన ప్రాణులూ.
పక్కనే మందు బాబుల కోసం ఒక సెక్షన్, అక్కడ్ ఖరీదైన కాక్ టైల్సూ, నిషా ఎక్కని మాక్ టైల్సూ..
వచ్చిన వాళ్ళు వడ్డించే వాళ్ళతో “అంత వద్దు.అంత వద్దు తక్కువ..చాలు”, అంటున్నారు. పక్క వాళ్ళతో “తిండి తగ్గిపోయింది నాకు బీపీ…నాకు సుగర్..”, అని చెప్తున్నారు. కొంత మంది అన్నిపదార్ధాలలో ఏది తినాలో తెలియక, అన్నీ పెట్టుకొని, అన్నీ పక్క నున్న చెత్త బుట్టలో పడ వేస్తున్నారు.పిల్లలు అయిస్ క్రీం పెట్టుకొని సగం కింద పోగొడుతున్నారు. మందు బాబులు ముందే ఔటైపోయి కుర్చీలకి చేరగిల బడుతున్నారు.
కానీ..శృతి కడుపులో ఎలుకల జోరెక్కువైంది. ఎవడో ఒక టీ షర్ట్ యువకుడు శృతి దగ్గరికి వచ్చి ఏదో ఇరానీ ఐటం గురించి మొదట తెలుగు లో అడిగి, ఆపై ఇంగ్లీషు లో దడ దడా ఏమిటో మాట్లాడుతున్నాడు. వాడి స్పీడు అందుకోవటం శృతికి గగనం అయిపోయింది. శృతి తోటి మర్యాద గత్తెలు,ఫంక్షన్ కి వచ్చిన తెలుగు జనాల కి హిందీ లో మర్యాద చేస్తున్నారు.”అబ్బా..!కడుపులో ఎలుకలు..” ఇంతలో, ఒక మధుబాబు కొంచెం తూలుకొంటూ శృతి దగ్గరికి వచ్చి, “ఆప్ కా ఫోన్ నంబర్ క్యా హై?”అని అడుగుతున్నాడు. శృతి మనసు లో “ఈ జాబ్ చేసే వాళ్ళంటే ప్రతి వెధవకీ అలుసే !” అనుకొని, షబ్నం ని చూపించి,”ఆప్ కో షాయద్ వో మదద్ కర్ సక్తీ హై”అంది. వాడు ఓ వంకర నవ్వు నవ్వి షబ్నం తో ఏదో మాట్లాడాడు. చేతిలో పెన్నుతో ఏదో రాసుకొంటూ పోయాడు.
శృతి ఆకలి బాధ తీరలేదు..కడుపు లో ఇప్పుడు రైళ్ళు పరిగెడుతున్నాయి. ఆమె కి “బీ యే” లో ఇంగ్లీష్ లెక్చరర్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి, “వాటర్ వాటర్ ఎవిరీవేర్, బట్ నో డ్రాప్ టు డ్రింక్”. ఓ అతిథి సర్వర్ మీద అరుస్తున్నాడు, “నేను చెప్పింది చెయ్యి…నాకు సలహాలు ఇవ్వ వద్దు”.
చిన్న పిల్లాడొకడు ఐస్ క్రీం కింద పడేసుకొంటూ తింటున్నాడు. వాళ్ళమ్మ, పట్టు చీర కట్టుకొన్న మధ్య వయసామె, వచ్చి, “కొంచెం ఆ ఐస్ క్రీం తినిపిస్తా అమ్మా?, అంది.
శృతి వాడికి ఐస్ క్రీం తినిపించసాగింది. ఆమె కి నోట్లో నీళ్ళూరుతున్నాయి..పక్క డస్బిన్ లో ఊసి వచ్చింది.
*********
నెమ్మది గా జనాలు తగ్గారు. రాత్రి పదకొండున్నర కి రిసెప్షన్ అయిపోయింది. కార్లు వెళ్ళిపోయాయి. వాటి తో పాటు పట్టు చీరలు వెళ్ళి పోయాయి. శృతికి ఆకలి అప్పటికే చచ్చిపోయింది. తల నొప్పి గా ఉంది. ఆమె కి కళ్ళు తిరుగుతున్నాయి. ..రక రకాల వంటకాలు..ఏది తినాలి..! తనకిష్టమైన గుత్తి వంకాయ కూర పెట్టుకొంది..ముద్ద కలుపుకొని ఆబగా రెండు ముద్దలు తింది..ఎక్కిళ్ళు వచ్చాయి..నీళ్ళు..నీళ్ళేవి..?..
“నీళ్ళ బాటిళ్ళు అయిపోయాయి” ఎవరో చెప్పారు. ఇంకొ రెండు ముద్దలు లోపలికి తోసింది.. అంగిట్లో తిరిగింది..వాంతి అయేటట్లుంది..కింద పడితే సూపర్వైజర్ ఊరుకోదు..పరుగెత్తింది వాష్ బేసిన్ దగ్గరికి..మధ్య లో నే ఆపలేక పోయింది.
సూపర్వైజర్ వచ్చి తిడుతోంది..ఆ మాటలన్నీ ఎక్కడో నూతిలోంచీ వినపడుతున్నత్లు ఉన్నాయి,”కస్టమర్ ప్లేస్ ని ఖరాబు చేయకూడదు..!నీ బోనస్ తగ్గించాల్సి వస్తుంది..!”
ఫంక్షన్ హాల్ వెనుక వదిలేసిన పదార్ధాలు గుట్ట గా ఒక కొండలా పేరుకొని పోయాయి. ఉదయానికి అవి కంపుకొడ్తాయి. వాటిని శుభ్రం చేయటం మునిసిపల్ ఉద్యోగుల విధి.
తెలుగమ్మాయిల గురించి కొన్ని పరిశీలనలు..పక్షపాతాలూ..
03 జూన్ 2011 అభిప్రాయములు
in అమ్మాయిలు
బెంగుళూరు లొ మా ఆఫీసు లో ఒక తెలుగమ్మాయి కొత్తగా చేరితే, ఆమె తెలుగమ్మాయని నోరు తెరవక ముందే కనిపెట్టేస్తాం. మొదటి రోజు తెలుగమ్మాయి సాధారణం గా ఎవరినో ఒకరిని వెంటపెట్టుకొని (మగ వాళ్ళని) వస్తుంది.
తెలుగమ్మాయి పని, ఆమెది తప్ప మిగతా టీం అందరి పనీ. ఒక రోజు పనిని రెండు రోజుల తరువాత మళ్ళీ అసైన్ చేసినవాడికే ఇచ్చి, వాడిదే తప్పు అని చెప్పటం కూడా తెలుగమ్మాయిలకే చెల్లుతుంది.
ఇదంతా తెలుగమ్మాయిలు సాధారణం గా ప్రొటెక్టివ్ వాతావరణం లో పెరగటం, వాళ్ళని పెద్ద వాళ్ళు అతి గారం చెయ్యటం (ప్రభుత్వం కూడా వాళ్ళని గారం చేస్తుంది ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చి) వలన కావచ్చు.
తెలుగమ్మాయికి లోక జ్ఞానం తక్కువా,గారం మాటలు ఎక్కువా. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒంటి మీద నగలు దిగవేసుకొనే వాళ్ళలో తెలుగమ్మాయిలు ముందు ఉంటారు. నార్త్ అమ్మాయిల మేక్ అప్ ఖర్చు గురించి చెప్పక్కర లేదు. అమ్మాయిలందరికీ అటెన్షన్ కావాలనుకొంటా.. కాస్త అందం గా ఉన్న అమ్మాయిలు మేకప్ వేసుకొని తమ హిట్ రేట్ ని పెంచుకొంటే, అంత అందం గా లేని వాళ్ళు నగలు దిగేసుకొని..ఇవిగో చూస్కో నా నగలు అంటారు.
ఇకపోతే ఏ సంవత్సరానికో ఒక సారి కట్టే పట్టు చీరలు కొనటం లో మన ఆడ వాళ్ళు ముందుంటారు. తరవాత ఏ నాలుగేళ్ళకో ఆ చీర ని సగం ధరకి ఎక్స్చేంజ్ ఆఫర్ లో అమ్మేస్తారు.
మన తెలుగు అమ్మాయిలలో ఇంకొక అర్ధం కాని విషయం, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంటి వారు జాకెట్ ముక్కలు పెట్టటం. అమ్మాయిల ఇళ్ళలో ఆ జాకెట్ ముక్కలు కుప్పలు గా పెరుగుతాయి. అందరూ చుడీదార్ వేసుకొనే వారే..ఎప్పుడో పండగకో పబ్బానికో తప్ప. ఇంకా..జాకెట్ ముక్కల అవసరం ఏమిటి? వాటిని పెట్టటం అనేది ఒక కాలం చెల్లిన ఆచారం. ఒక ఆమె కి వేరొక ఆమె ఇచ్చిన జాకెట్ ముక్క, మరొకామె తన ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేస్తుంది. ఈ విధం గా ఎవరూ కుట్టించుకోకుండానే జాకెట్ ముక్కల సర్క్యులేషన్ మొదలౌతుంది.
ఆ… ఐనా మగాడికి నాకన్నీ ఎందుకులే ఇవన్నీ..
మనమందరం ఇలా ఉంటే బాగుంటుంది..
07 జూన్ 2011 అభిప్రాయములు
in కవితా గోస
ఎవరికి వారు పక్క వాడి కళ్ళతో వాడి బాధల్ని చూడ గలిగితే..
దళితుల అణిచివేత ను పైకులాలు అర్ధం చేసుకొంటే ..
పైకులాల-సామాన్యుని దళితులు ఆదరిస్తే..
తెలంగాణ వారి అస్థిత్వ వేదనను ఆంధ్రులు పడితే…
ఆంధ్ర వారి ఐక్యతా భావనను తెలంగాణ స్పృశించగలిగితే..
లేని వాడి లేమిని ఉన్నవాడు అనుభవిస్తే..
“బాగుపడినాక చేసేపని” లేని వాడి మదిలోకొస్తే..
సొంత వ్యాపారం లోని కష్టం కామ్రేడ్ కి తెలిస్తే..
తన జీతం లోని “శ్రమ” , “సీ ఈ ఓ” గారికి తెలిస్తే ..
ఆడవారి ఇష్టాన్ని మగవారు గౌరవిస్తే..
మగవారి అభిమానాన్ని ఆడవారు అర్ధం చేసుకొంటే..
సాయిబ్బు గడ్డం నామాలాయన కిష్టమైతే..
నామాల ముఖం సాయిబ్బుకింపైతే..
ఎవరికి వారు తమలోకి తొంగి చూసుకొంటే..
బాగుంటుంది…
కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకొంటున్నాను..ఏమీ అనుకోవద్దండీ..!
15 జూన్ 2011 1 వ్యాఖ్య
in కథలు
నా కథ ఒకటి, కథా జగత్ లో ఇక్కడ పబ్లిష్ అయ్యింది..చదివి కామెంట్ పెట్టకపోయారో మీ తల…వెయ్యి… అవుతుంది..
: http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/anandanvesana—ram-bondalapati-bondalapati-sitaramaprasad
“ఆల్-ఇన్-వన్ రచయిత” అనబడు లిఖిత్ ప్రయత్నాల పోరాటాల కథ
17 జూన్ 2011 వ్యాఖ్యానించండి
in కథలు
లిఖిత్ ఆనందానికి పట్ట పగ్గాల్లేకుండా పోయాయి. తన తండ్రి తనకిచ్చిన పాత డొక్కు బజాజ్ చేతక్ ని అధిరోహించి, దాన్ని కొంచెం అదిలించి,“గాల్లో తేలుతున్నట్లుందే..” ట్యూన్ ని ఈల వేద్దామనుకొన్నాడు. కానీ, ఎదురు గా నడుచుకొంటూ శంకర్ గాడు రావటం తో ఆగిపోయాడు. శంకర్, వీడి బుధ్ధి కొంచెం వంకర!
“ఏరా లిఖిత్, నీ కథ ఏదో ఆ “సాహిత్యం” పత్రిక లో అచ్చయ్యిందంట కదా? పార్టీ ఇచ్చేయ్!”
“కథ అచ్చైతే అయ్యింది కానీ, పత్రిక వాడు కాసులేమీ పంప లేదు రా. ఓ రెండు నెలలు ఆగు, నా నవల ఒకటి ‘రాగం’ పత్రిక లో రాబోతోంది. అప్పుడు వచ్చిన డబ్బుల తో నీకు పార్టీ ఇచ్చేస్తా!”
“ఏమి నవల రా అది?”
“గొప్ప గొప్ప భావాలనూ, ఆదర్శాలనూ విరజిమ్మే పాపులర్ నవల రా. పేద వాడి ఆకలి గురించీ, మధ్య తరగతి మంద హాసం గురించీ,తెలుగు వారి హిపోక్రసీ గురించీ, జనరంజకం గా రాస్తున్నా. ఎప్పటికైనా వీరేంద్రనాథ్ అంత పాపులరూ, శ్రీ శ్రీ అంత ఆదర్శవంతమూ ఐన రచనలను రాసేస్తా చూడు..ఒక్కసారి పాపులారిటీ వచ్చిన తరువాత డబ్బులే డబ్బులు!అప్పుడు ఒక వోక్స్ వాగన్ కారు కొనాలి . బుజ్జి ముండ అదంటే నాకెంతో ఇష్టం!”
“బాబూ..తెలుగు లో నే రాస్తున్నావా ? ఐతే ఇది రచనలకు కాలం కాదు.అందులోనూ ఆదర్శ రచనలు రాసి డబ్బు సంపాదిస్తాననటం, “తివిరి ఇసుమున తైలం తీయటం” లాంటిది.
“ఆ ఏదో నేనంటే నీకు కుళ్ళు లేవోయ్! సౌదీ లో ఇసుక నుంచీ చమురు తీయటం లేదా..నేనూ అలానే తెలుగు పాఠక లోకం నుంచీ కాసుల నిధిని సంపాదిస్తాను.!”
“సరే, నీ నిధిని అప్పుడప్పుడూ నాకు కూడా కాస్త విదిలిస్తూ ఉండు” అని శంకర్ మెల్లగా జారుకొన్నాడు అక్కడి నుంచీ.
****************
లిఖిత్ సొంత అడ్రెస్ కవర్ తో పాటు తన నవలని పోస్ట్ చేసి వచ్చి పక్కనే ఉన్న పార్క్ లో కూర్చొన్నాడు.
“హమ్మయ్య! తన సాహితీ విజయ యాత్ర కి తొలి అంకం ఇది..ఓ గొప్ప రచయిత అయ్యే లక్షణాలు చిన్నప్పటి నుంచీ ఉన్నాయి తన లో. అందుకే తన తండ్రి ఇంజినీరింగ్ చదవమంటే తను బియ్యే లో చేరాడు. తన తండ్రి ఒట్టి అజ్ఞాని.”ఈ కథలూ కాకర కాయలూ కూడు పెడతాయా!?” అంటాడు. ఎప్పుడూ కూటి గురించిన యావే! ఆయన బాగానే సంపాదించాడా! నగరం లో ఓ రెండు ఇళ్ళూ మూడు సైట్లూ ఉన్నాయా!..అయినా,”కోటి విద్యలూ కూటి కోసమే రా!”అంటాడాయన”.
“తను ఒక్క సారి ప్రసిధ్ధ రచయిత అయ్యాడంటే, అభిమానుల్నించీ ఒకటే ఉత్తరాలు…ఆడ ఫాన్స్ లో ఒక ఇద్దర్నో, ముగ్గుర్నో ఎంచుకొని వారి తో ఇంచక్కా రొమాన్స్ చేయవచ్చు”.
పార్కులో బెంచీ పైన పక్కనే ఒకాయన కూర్చొని ఏదో రాసుకొంటున్నాడు.
“ఏమండీ కథ రాస్తునట్లున్నారు, మీరు రచయితా?”ఆరా తీశాడు లిఖిత్.
“నేను రచయితనే కానీ, ప్రస్తుతం నా ఇంటి వెచ్చాల పద్దులు రాస్తున్నాను”
సాటి రచయితని చూడగానే లిఖిత్ మనసు ఎగిరి గంతేసింది.
“నేను కాబొయే పాపులర్ రచయిత లిఖిత్ ని సార్!”
“నువ్వు విహారి పేరు వినే ఉంటావ్ కదా! అది నా కలం పేరు. మా ఆవిడ, “అనవసరం గా స్టాంప్ ల కీ, కవర్లకీ డబ్బు తగలెడుతున్నారు. అవి కొనక పోతే పౌడర్ డబ్బాలన్నా కొనవచ్చు” అని పోరటం తో నా రచనా వ్యాసంగం మాని వేసి స్కూల్లో పని చేస్తున్నాను.”
“స్టాంపులు దండగని రచనలు మానేయటమేంటి సార్? ఈ సమాజమనే స్టాంప్ మీద మన ముద్ర ను బలం గా గుద్దాలి.కొంచెం నా కథలు చదివి, మీ అభిప్రాయం చెప్తారా?”
విహారి “కొత్త బిచ్చగాడు పొద్దెరగడు”, అనుకొని, తేలుకుట్టిన వాడిలా మొహం పెట్టి, “ప్రస్తుతానికి సమయం లేదు. తరువాత ఎప్పుడైనా..”,అన్నాడు.
“సరే, అన్నట్లు, మీకు తెలిసిన ఎడిటర్ ఎవరన్నా ఉంటే పరిచయం చేయండి సార్.”
**********
లిఖిత్ నవలను రాగం పత్రిక ప్రచురించ లేదు సరి కదా, రాత ప్రతి ని తిరిగి పంపను కూడా లేదు. అయినా అతను పట్టు వదలని విక్రమారుడి లా పత్రికలకు కథలు పంపుతూనే ఉన్నాడు. కానీ అవన్నీ బ్లాక్ హోల్ లో పడిన కాంతిలా అజా పజా లేకుండా పోయాయి. రచనలు పంపేటప్పుడు స్టాంపులంటించిన సొంత అడ్రెస్ కవర్ పంపటం మానుకొన్నాడు లిఖిత్. అదొక దండగ!
ఓ రోజు విహారి పార్కులో మళ్ళీ కనపడితే,ఆయన్ను లిఖిత్ బలవంత పెట్టి, ఒక ఎడిటర్ ని పరిచయం చేయమని తీసుకెళ్ళాడు. విహారి వెనుక సీట్లో కూర్చుంటే లిఖిత్ తన స్కూటర్ ని తిన్నగా నడప సాగాడు. రోడ్డు రణరంగం లా ఉంది. వాహనాలను గజి బిజి గా, ఒకరికొకరు అడ్డు పడుతూ డ్రైవ్ చేస్తున్నారు. విహారి, “రోడ్డు మీద ప్రవర్తనే మన సమాజం లో ప్రతిఫలిస్తుంది… స్వార్థం పెరిగిపోతోంది..డబ్బు యావ పెరిగిపోతోంది. ఈ వ్యాపార తత్వం వలనన కూడా నేను రాయటం మానుకొన్నాను” అన్నాడు.
లిఖిత్ గడుసు గా నవ్వుతూ, “మీరు చాలా నిస్వార్ధ మైన వారి లా ఉన్నారు. నాకు మీ ‘ఏ టీ ఎం’ కార్డూ, పిన్ నంబరూ ఇచ్చేయండి సార్” అన్నాడు.
విహారి పెద్దగా నవ్వేసి, లిఖిత్ భుజం మీద తట్టి, “నువ్వు భలే తమాషా మనిషివోయ్!”, అని, మనసులో, “వీడో తింగరి వెధవ లా ఉన్నాడే!” అనుకొన్నాడు.
ఎడిటర్ ‘ఏకాం’బరం గారి ముందు బల్ల కింద దొంతరలు గా వచ్చిన కవర్లు ఉన్నాయి.ఏకాంబరం అనేది ఆయన అసలు పేరు కాదు. పూర్వం ఒక దిన పత్రిక లో ప్రభుత్వాన్ని ఏకుతూ వ్యాసాలు రాసి ప్రసిధ్ధుడయ్యాడాయన. ఆవిధం గా వచ్చింది ఆయనకు ‘ఏకాం’బరం అనే పేరు. తరువాత ప్రభుత్వం ఆ దిన పత్రిక యాజమాన్యం మీద ‘ఇన్ కం ట్యాక్స్’ శాఖ ద్వారా వత్తిడి తెచ్చి ఏకాంబరాన్ని పీకించేసింది. ఇక అప్పటి నుంచీ బుధ్ధి తెచ్చుకొని పెద్ద వారికి అనుకూలం గా నడుచుకొంటూ కాలం నెట్టుకొస్తున్నాడు ఏకాంబరం.
ఏకాంబరం లిఖిత్ ని కూర్చోమనైనా అనకుండా కిందా మీదా చూసి, “మీరు దేని గురించి రాస్తారు?”, అన్నాడు.
“ఆదర్శాలూ, పేదరికం,ప్రేమా, విలువలూ, సంస్కృతీ.. ..”
ఏకాంబరంఒక్కసారి కుష్టు వ్యాధిగ్రస్తుడిని చూసినట్లు ఉలిక్కిపడి, లిఖిత్ ని మధ్య లోనే ఆపేసి, “బాబ్బాబూ, నా ఉద్యోగం ఊడగొట్టకు. మనకు కావలసినవి పత్రిక సర్క్యులేషన్ పెంచే కథలు. అసలే ఈ టీవీ ఛానళ్ళూ, ఇంటర్నెట్టూ వలన సర్క్యులేషన్ పడిపోతూంటే, నీ ఆదర్శాల ఆకలి కథలు వేసుకొంటే, ఈ పత్రిక మూత పడుతుంది. నా ఉద్యోగం ఊడుతుంది.”, అన్నాడు.
“అంటే మీకు మసాలా కథలు కావాలన్న మాట. మీరు కథలని ఎలా సెలక్ట్ చేసుకొంటారండీ?”
“కథ లో పట్టూ, కథనం లో బిగీ ఉండాలి. చదివించే గుణం ఉండాలి.ఈ ఆధునిక కాలం లో, బిజీ జీవితాలలో పాఠకులకి కథలు చదివే తీరిక ఎక్కడుంటుంది? కాబట్టీ కథలు టీవీ యాడ్స్ లా చిన్న గా, పాఠకుడి దృష్టిని కట్టిపడేసేలా ఉండాలి. సింగిల్ కాలం కథలూ, ఒక పేజి కథలూ..ఇలా రాయాలి..చాట భారతాలు రాయకూడదు. .. పాపులర్ కావాలంటే పాప్ కార్న్ సాహిత్యం రాయాలి మరి“, అని ఏకాంబరం తన ముందున్న కవర్ల దొంతరను ఒక్క సారి కదిలించాడు. దాని నుంచీ ఒక పోస్ట్ కార్డ్ బయట కొచ్చి కింద పడింది. “ఈ రాత గాడెవడో తెలివైనవాడు . క్లుప్తం గా ఓ పోస్ట్ కార్డ్ మీద కథ రాసి పారేశాడు. “ఈ వారం కథ” శీర్షిక లో ఈ సారి కి ఇతని కథ ప్రచురిద్దాం”, అని “పోస్టల్ స్టాంప్ ల పై కథలు రాసే రోజులు కూడా వస్తాయి,” అని ముక్తాయించాడాయన.
ఏకాంబరం మాటలు విని అముదం తాగిన మొఖం పెట్టాడు లిఖిత్.
లిఖిత్ ని చూసి ఏకాంబరం,”అలా అని నువ్వేమీ అధైర్య పడ వద్దు బాబూ,మేము అప్పుడప్పుడూ కథల పోటీలు పెడతాం..కానీ ఒక కండిషన్..ఆ పోటీ లకి సరిగ్గా నాలుగు పేజీల పది లైన్ల మూడు మాటలు ఉండే కథలను మత్రమే అనుమతిస్తాం.మాకు పత్రిక లో ఉండే నిడివీ, ప్రకటనల దృష్ట్యా ఇలాంటి కండిషన్లు తప్పని సరి. నువ్వు ఆ పోటీ లో నీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. నీ కథ కి బహుమతి వచ్చినా, నువ్వు రాసినది యధా తధం గా మేము ప్రచురించక పోవచ్చు.సుబ్బి సుబ్బమ్మ అయినట్లు, కొన్ని మార్పులూ చేర్పులూ చేస్తాం.” అన్నాడు. ఏకాంబరం కాసేపాగి, తనలో ఏదో ఆలోచించుకొని, కుర్చీ కి చేరగిలబడి, “ఐనా, సాయంత్రం ఏడు గంటల కి నీ కథల ప్రతులు చూపించు. అప్పుడు నేను సికిందరాబాద్ క్లబ్బులో ఉంటాను. అక్కడికి పట్టుకొని రా, చూద్దాం”,అన్నాడు.
బయటికొచ్చినాక విహారి లిఖిత్ తో, “సాయంత్రం క్లబ్బు లో ఆయనకు ఓ రెండు డ్రింకులు స్పాన్సర్ చెయ్యి..అలా చేయకే నేను దెబ్బ తిన్నాను”, అన్నాడు.
లిఖిత్, “అలా అయితే నేను క్లబ్బుకే వెళ్ళను సార్. ఆంధ్రుల అభిమాన రచయితను అవ్వాలంటే గమ్యమే కాదు, మార్గం కూడా స్వచ్చం గా ఉండాలి”, అన్నాడు.
విహారి, “నీ ఇష్టం. ఏదో కుర్ర వాడివని నాకు తోచిన సలహా చెప్పాను”, అన్నాడు.
**********
లిఖిత్ ఇంటి ముందు సైకిల్ దిగిన శంకర్ లోపలికి వచ్చాడు. “ఏమండీ “ఆంధ్రుల ఆల్-ఇన్ వన్” రచయిత గారూ, నాకు ఇవ్వాల్సిన పార్టీ మాటేమిటి?ఈ పాటికి బాగానే సంపాదించి ఉంటావే!”, అన్నాడు లిఖిత్ గది లోకొచ్చిన శంకర్ వ్యంగ్యం గా.
“ఏం సంపాదించటం లే! కాయితాలు వృధా! కథలు పంపే కవర్ల డబ్బులు కూడా వృధా! అందుకే ఆ డబ్బులైనా పొదుపు చేద్దామని ఇప్పుడు ఇంటర్నెట్ బ్లాగ్ ల లో కథలు రాస్తున్నా.కానీ, నెట్ లో కూడా చదివే వాళ్ళ కంటే రాసే వాళ్ళు ఎక్కువైపోయారు”, అన్నాడు లిఖిత్.
“ఇలా కాదు రా బాబూ, కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. నాకు తెలిసిన పబ్లిషర్ ఒకడున్నాడు. నీ రచనల మీద నీకు నమ్మకముంటే, అతని ని కలుద్దాం”
లిఖిత్ తన పాత నవల ప్రతి ఒకటి పట్టుకొని, శంకర్ తో పాటు పబ్లిషర్ పరాంకుశాన్ని కలవటానికి బయలుదేరాడు.
పరాంకుశం ఓ నాలుగు పేజీలు తిరగేసి,”వేద్దాం సార్, ఈ నవల వేద్దాం.ఓ ఐదు వందల కాపీలు వదులుదాం… పదిహేను వేలు ఓకే నా?” అన్నాడు.
లిఖిత్ గుండె ఒక్క సారి ఎగిరి గంతేసిది. కళ్ళ ముందు పదిహేను వేల పారితోషికం కనపడింది. “ఎన్నాళ్ళో వేచిన ఉదయం..”, అని పెద్ద గా పాడబోయాడు.
పరాంకుశం లిఖిత్ ని “రేపు ఐదు వేలు అడ్వాన్స్ ఇవ్వ గలుగుతారా?శంకర్ గారికి ఓ మూడు వందలు కమీషన్ పోతుంది లెండి”అన్నాడు.
“అంటే..ఛీ..వెధవ బతుకు..నా పుస్తకాన్ని నేనే డబ్బు పెట్టి అచ్చు వేసుకోవాలన్న మాట!”
దానికి పరాంకుశం, “లేక పోతే నాకెందుకు సార్ దూల? ఈ రోజుల్లో పుస్తకాలను ఊరికే ఇచ్చినా ఎవరూ కొనటం లేదు. అలాంటిది, ఊరూ పేరూ లేని మీ లాంటి రచయితల పుస్తకాలు ఎవరు కొంటారు? త్వరలో పుస్తకాలు రాయటం అనేది, శిల్పాలు చెక్కటం వంటి ఒక ప్రాచీన కళ అయిపోతుంది. కాబట్టీ, మీ పుస్తకాలను నా డబ్బులతో పబ్లిష్ చేస్తే, చివరికి నా చేతికి వస్తుంది ఒక చిప్ప!” అన్నాడు.
“ఎంత అవమానం..? ఈ “ఆంధ్రుల ఆల్ ఇన్ వన్ రచయిత”కేనా ఈ పరాభవం? నా కెపాసిటీ తెలియక భ్రమ పడుతున్నాడు ఈ పబ్లిషరాధముడు.”
శంకర్ భరోసా గా, “ఏమీ పర్లేదు లే, మీ నాన్న కొనిచ్చిన స్కూటర్ ఉందిగా! అది అమ్మేయ్!”, అన్నాడు.
**************
పాత స్కూటర్ అమ్మి అచ్చు వేయించిన నవల పది కాపీ లు కూడా అమ్ముడు పోక పోవటం తో,మిగిలిన కాపీలని లిఖిత్ సైకిల్ మీద పెట్టుకొని దానిని తన ఫ్రెండ్స్ కి దానం చేయవలసి వచ్చింది. లిఖిత్ ఫ్రెండ్స్ ఆ నవలని పాత న్యూస్ పేపర్ తో పాటు తూకం ప్రకారం అమ్మి సిగరెట్ ఖర్చులకు వాడుకొన్నారు.
తన పబ్లిషింగ్ ప్లాన్ బెడిసి కొట్టటం తో,లిఖిత్ కి ఏమీ తోచక మళ్ళీ శంకర్ ని ఆశ్రయించాడు. “వాడికైతే అయిడియాలు బాగా తడుతాయి”.
శంకర్ తన ఇంటి ముందు స్కూటర్ స్టాండ్ వేసి, సీట్ పై కూర్చొని, సాలోచన గా శూన్యం లోకి చూచి తల పంకించి, “నువ్వే ఒక పత్రిక పెట్ట రాదూ? దాని నిండా నీ రచనలే వేసుకొని, నువ్వు పాపులర్ అయిపోవచ్చు. ఒక్క సారి పాపులర్ అయిన తరువాత, కుక్కని కొట్టినా డబ్బు రాలుతుంది”
“నాకు కుక్క ని కొడితే రాలే డబ్బు వద్దు. జనాలు నా పుస్తకాల పేజీలు తిప్పితే రాలే డబ్బు కావాలి. నీ అయిడియా బాగానే ఉంది.కానీ ఒక చిన్న లోపం! పత్రిక లో పడే మన రచన పాపులర్ కావాలంటే ముందు పత్రిక పాపులర్ కావాలి. మరి పత్రిక ని పాపులర్ చేయటం ఎలా?”
“అహా.. ఇన్నాళ్ళకి నీ బుర్ర పాదరసం లా పని చేస్తొంది..ఇక ఖచ్చితం గా విజయం నీదే! పత్రిక ను పాపులర్ చేయటానికి పత్రిక పెట్టే ముందుగానే వీర పబ్లిసిటీ ఇస్తే సరి.”
“వీర పబ్లిసిటీ ఎలా ఇస్తారేం..?”
“ఆ ఏముందీ ముందు మన ఫ్రెండ్స్ లో నోటి మాట గా చెబ్దాం..తరువాత..టీవీ లో, ఇంటర్నెట్ లో, హోర్డింగ్సూ గట్రా..”
“అబ్బో ఇదంతా తడిసి మోపెడవుతుంది..ఏమైనా “ఆంధ్రుల ఆల్ ఇన్ వన్ రచయిత” అవ్వాలంటే ఇలాంటి చిన్న ఖర్చులూ కష్టాలూ తప్పేటట్లు లేవు. ఇదంతా నా భవిష్యత్ కి ఒక ఇన్వెస్ట్-మెంట్ లాంటిది. పైగా ఈ పత్రికల వాళ్ళూ తానా అంటే తందానా అనటం తప్పుతుంది…ఒక కథను హాయిగా మనకిష్టమైనన్ని పేజీలు రాసుకోవచ్చు. మనం రాసిన కథను మార్చే వాడే ఉండడు.”
“సరిగ్గా నా నోట్లో మాట చెప్పావు..కాక పోతే ఓ పది లక్షలు కావాలి. మీ నాన్న ని ఆ ఊరి బయటి సైటు తనది కాదనుకొనమను ”
“అబ్బో.. ఆ పాత డొక్కు స్కూటర్ అమ్మినందుకే మా నాన్న నా మీద గుర్రు గా ఉన్నాడు రా. అయినా,ఒక్క సారి మా నాన్న తో మాట్లాడతా!” “సరే రా, మీ నాన్న తో మాట్లాడి, రేపు నాతో చెప్పు.ఈ మధ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ లోబిజీ గా ఉంటున్నాను.వస్తా మరి“
*********
లిఖిత్ వాళ్ళ నాన్న అహోబల రావు కి వాడి మాటలు విని అరికాలి మంట నోట్లో కొచ్చింది.
“స్కూటర్ ని అమ్మింది కాక, సైట్ అమ్ముతానంటావా? తోలు తీస్తా వెధవా..అయినా కోటి విద్యలూ కూటి కోసమేనోయ్..కథలూ కాకరకాయలూ….”
“..కూడు పెట్టవు..ఇంకా ఆపు నాన్నా, ఈ డయలాగ్ వినీ వినీ బోర్ కొట్టింది”
“కూడు అంటే అన్నం మెతుకులు మాత్రమే కాదు రా బడుధ్ధాయ్..! కూడు అంటే డబ్బూ..దర్పమూ..మీ ఫ్రెండ్ శంకర్ ని చూసి బుధ్ధి తెచ్చుకోరా..మొన్నటి దాకా స్లిప్పర్ లు వేసుకొని, కాళ్ళీడ్చుకొంటూ తిరిగేవాడు..ఇప్పుడు స్కూటర్ కూడా కొనేశాడు.నువ్వూ ఉన్నావ్ ఎందుకు? బంగారమంటి బజాజ్ స్కూటర్ ని అమ్మేశావ్! ఇక పుస్తకాలూ, రచనలూ అన్నావంటే కాళ్ళు విరిచి గాస్ పొయ్యి లో పెడతా. నా స్నేహితుడొకడికి కోఠీ లో బిజినెస్ ఉంది. వాడు దాంట్లో ఓ సూపర్వైజర్ ఉద్యోగం ఇవ్వటానికి ఒప్పుకొన్నాడు.బుధ్ధి గా వెళ్ళి రేపటి నుంచీ ఉద్యోగం చేసుకో. లేక పోతే ఇంట్లో నుంచీ బయటికి నడువ్”, అని హెచ్చరించాడు అహోబల రావు.
“నాన్నా..తరువాత ‘వాసు’ సినిమా లో వెంకటేష్ తండ్రి లా నీ తప్పు నువ్వు తెలుసుకొంటావు..ఎప్పటికైనా ఆంధ్రుల ఆరాధ్య రచయిత ను కాక పోను”, అనుకొన్నాడు లిఖిత్.
*************
“ఒరేయ్ శంకర్, పత్రిక పెట్టటం మనవల్ల కాదు రా! సైట్ అమ్మమంటే, మా నాన్న నాకు బాగా మడ్డి కూడు పెట్టాడు”.
“ఏమీ దిగాలు పడకు రా. ఆ..ఒక అయిడియా..నువ్వే ఓ వెయ్యి పోస్టర్లు అచ్చు వేయించి నగరం అంతా అంటించెయ్ రా! “
“ఎక్కడ అచ్చేయిద్దాం..?”
“ఇంకెక్కడా..! నా ఫ్రెండ్ నరేష్ గాడికి ఒక ప్రెస్ ఉంది లే..మనకైతే తక్కువకే వేస్తాడు. మహా ఐతే ఆరేడు వందలు అవుతాయి..నే మాట్లాడతాలే!ఓ వంద అడ్వాన్స్ కొట్టు ముందు”
“ఒరే.., నువ్వు కమీషన్ నొక్కేయటం లేదు కదా?”
“చ..భలే వాడివి..ఆ పరాంకుశం గాడు ఏదో అన్నాడని..నువ్వు నమ్మేయటమేనా?”
*************
రోడ్ పక్కన, లిఖిత్ తన రాబోయే పత్రిక “అక్షరం” గురించి పోస్టర్ అంటించుకొంటున్నాడు.పక్కనే ఫస్ట్ షో జనాలు ఇళ్ళకు పోతున్నారు. ఇంత లో వెనుక గా ఎవరో కార్ హారన్ మోగించిన చప్పుడు వినపడించి. లిఖిత్ తల తిప్పి చూశాడు. కార్ లో శంకర్ ఉన్నాడు. “పోస్టర్ ల కు బాగానే మైదా పెడుతున్నావే..రాయి రాయి..”కష్టే ఫలి”,పాపులర్ రచయితవవ్వాలంటే ఇవన్నీ తప్పవు మరి. అన్నట్లు ఈ నెల పదిన నా పెళ్ళి..నువ్వు తప్పకుండా రావాలి”, అని శుభలేఖ లిఖిత్ చేతి కందించి రయ్యిన తన కారు లో బిజీ గా వెళ్ళిపోయారు శంకర్ గారు.
వెనుక గా అతని సైకిల్ స్టాండ్ పై పోస్టర్లు దొంతర గా ఉన్నాయి. ఎన్నిచోట్ల అంటించినా అవి తరగటం లేదు.
“ఈ పత్రిక మాటేమిటో కానీ, ఇవి అంటించలేక తల ప్రాణం తోకకి వస్తోంది”, అనుకొన్నాడు.
“బాబూ ఒక్క సారి ఇలా వస్తా..చిన్న పని.. మా డైరక్టర్ గారు రమ్మంటున్నారు”,ఓ అరవై యేళ్ళ ముసలాయన పిలిచాడు.
“ఏమైన రాసి పెట్టాలా?”
“ఆ అదే అనుకొంటా..”
ముసలాయన సినిమా హాలు ఓనర్ దగ్గరికి తీసుకెళ్ళాడు.
“మా పోస్టర్లు అతికించే కుర్రాడు మానేశాడు..పోస్టర్లకు మైదా రాసే పని ఉంది.కిటికీ లోంచీ చూశా.బాగానే రాస్తున్నావ్.రేపట్నుంచీ వచ్చి పని లో చేరిపో”
లిఖిత్ కి కళ్ళు తిరగ సాగినయ్. వడి వడి గా వచ్చి, పోస్టర్ల దొంతర లాగి పారేసి, సైకిల్ ఎక్కి ఇంటికి పోనిచ్చాడు.
“నాన్నా..రేపు ఆ సూపర్-వైజర్ జాబ్ లో చేరిపోతున్నాను. మీ ఫ్రెండ్ కి చెప్పేయ్”, అన్నాడు లిఖిత్ అహోబల రావు తో.
ఆ విధం గా ఆంధ్ర దేశం ఒక కాబోయే “ఆల్-ఇన్-వన్ రచయిత” ని కోల్పోయింది
దేవుడూ, సృష్టి జననం, కాలం యొక్క అంతం మొదలైన ప్రశ్నలు..
24 జూన్ 2011 అభిప్రాయములు
నా టపా “విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!” (http://wp.me/pGX4s-iR) కి వచ్చిన ప్రశ్నలకు స్పందిస్తూ ఈ టపా రాస్తున్నాను.
సృష్టి మొదలూ, దేవుడూ మొదలైన వాటి గురించి మాట్లాడే వారి లో కొందరిని ఈ కింది విధం గా వర్గీకరించ వచ్చు:
1. దేవుడిని నమ్మే వారు. వీరు తమ ఇష్టమైనది నమ్మవచ్చు. కానీ వీరికి దేవుడి గురించిన ఎటువంటి ప్రత్యక్ష అనుభవాలూ ఉండవు.వీరు, భౌతిక నియమాలను లెక్కచేయకుండా దేవుడిని తమ ఇష్టమైనట్లు ఊహించుకొంటారు .ఈ ఊహలు వీరి మన్సులో మాత్రమే ఉంటాయి. బయట ఎక్కడా ఉండవు. ఉదాహరణకు రెక్కల దేవదూతలూ, సింహం తల కలిగిన పక్షి దేవుళ్ళూ వీరి ఊహల్లోనే ఉంటాయి.వీరిలో కొంతమంది తమ నమ్మకాన్ని బలపరుచుకోవటానికి తమకు తెలిసిన సైన్స్ ని ఒక వాదన గా ఉపయోగించుకొంటారు.
2. ‘సంపూర్ణ సత్యం’ లేక ‘దేవుడు’ తమ ప్రత్యక్ష అనుభవం లోకి వచ్చాడనే వారు. వీరి అనుభవాలు సాధారణం గా ఆధ్యాత్మికమైనవి అయి ఉంటాయి. గొప్ప గొప్ప యోగులూ, ఋషులూ ఈ అనుభవాలను పొందినట్లు చెప్తారు. కానీ ఈ అనుభవాలు మానవ మేధ పరిధికి బయట జరిగి ఉంటాయి. మేధో పరం గా వీరి అనుభవాలను పరీక్షించటం కుదరదు.ఎందుకంటే అవి కాలానికి బయట జరిగిన అనిర్వచనీయమైన అనుభవాలు. మామూలు మనుషులకు ఈ అనుభవాలు “నిజమైనవా, కానివా?” అని తేల్చుకోవటం కూడా కష్టం.ఈ అనుభవాలు ఐన ఇద్దరు మనుషులు కూడా, వాటి గురించి చర్చించుకొని, వారు “ఒకే విషయాన్ని అనుభవించార”ని చెప్పటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే, ఇద్దరు మనుషులు చర్చించుకోవాలంటే మాటలు కావాలి. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు సాధారణం గా మాటలకు అందనివై ఉంటాయి.
3. ఇక మూడో రకం మేధోపరం గా సృష్టి గురించి పరిశోధించే వారు. వీరు చెప్పిన వాటిని పరీక్షించి నిగ్గుతేల్చవచ్చు. భౌతిక శాస్త్రవేత్తలు ఈ కోవలోని వారే! వీరు కాలానికి ఆవల నున్న విషయాలను ప్రత్యక్షం గా అనుభవించలేక పోయినప్పటికినీ, ఆ విషయాలను మేధోపరం గా తమ సమీకరణాలతో అర్ధం చేసుకొని,వాటిని ఆ సమీకరణాలతో ప్రాతినిధ్యం వహింపచేస్తారు. వీరు చెప్పిన సిధ్ధాంతాలను భౌతిక ప్రపంచం లో నిరూపణకు పెట్టవచ్చు. వీరి తో చిక్కల్లా వీరు పరిశోధించే విషయం భౌతిక పరిధి దాటిపోయినప్పుడు వస్తుంది. ఉదహరణ కు “ఈ విశ్వం రక రకాల నియమాలతో, స్థల కాలాలతో ఇలా ఎందుకు ఏర్పడి ఉన్నది?” అనే ప్రశ్న భౌతికత కి ఆవల ఉన్నది. ఇది అధి భౌతికమైనది. ఈ ప్రశ్నకు భౌతిక నిరూపణలతో సమాధానం ఇవ్వటం సాధ్యపడక పోవచ్చు. అప్పుడు కొందరు శాస్త్ర వేత్తలు “సైధ్ధాంతిక కల్పనల (conceptual fantasy)” లోకి దిగుతారు. ఈ కల్పనలు అన్నీ నిజం కావు. ఏదో ఒక కల్పన మాత్రమే నిజమౌతుంది. అనంత విశ్వాలు ఉన్నాయి అనటమూ, అనంతమైన కొలత (Dimension) లు ఉన్నాయి అనటమూ, ఐదో కొలత లో ఈ సృష్టి జరిగింది అనటమూ ఇలాంటి కల్పన లే.అయితే వీరి కల్పన లన్నీ భౌతిక నియమాలకూ, భౌతిక దృగ్విషయాలకూ భిన్నం గా ఉండవు. ఇవి భౌతిక నియమాల ఆవల ఉంటాయి . వీరి కల్పనలు మనిషి బయట ఉన్న భౌతిక వస్తువు శోధనలో, భౌతికత పరిధిని దాటి, అధి-భౌతిక విషయాలలోకి వెళ్ళటం వలన వచ్చినవి.
శాస్త్రవేత్తలకున్న ఇంకొక పరిమితి,విశ్వ చరిత్రని శోధించి విశ్వం గురించిన నియమాలను మాత్రమే వారు కనుగొన గలరు. “ఆ నియమాలతో కూడిన విశ్వం ఎందుకు ఆవిర్భవించింది” అనేది వారి పరిధి లో లేని విషయం.యోగులకు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలకు అధి-భౌతిక విషయాల గురించిన ఇంద్రియానుభవం ఉండదు.
ఇక పోతే సృష్టికి కారణం లేదనే వాదనకి మూలం ఐన్-స్టీన్ మహాశయుడు ప్రతిపాదించిన సాపేక్ష సిధ్ధాంతం లో ఉంది. ఈ సిధ్ధాంతం ప్రకారం సమయం సాపేక్షమే! విశ్వం మొత్తానికి ”భారతీయ ప్రామాణిక సమయం(Indian Standard Time)” లా ఒకే సమయం లేదు. భూమిని ఆధారం
(reference) గా తీసుకొంటే మిగిలిన ఖగోళ వస్తువుల (గ్రహాలూ నక్షత్రాలూ)మీద కాలం నెమ్మదిగానో, వేగం గానో,( భూమితో ఆయా ఖగోళ వస్తువుల సాపేక్ష వేగాన్ని బట్టీ, ఆయా వస్తువుల గురుత్వాకత్షణను బట్టీ) ఉంటుంది. సాపేక్ష సిధ్ధాంతాన్ని సూర్యగ్రహణం సమయం లో స్థల-కాలం(Space-Time) వంపు తిరిగింది అని తెలుసుకోవటం ద్వారా నిరూపించారు. కాబట్టీ కాలం నెమ్మది గానూ, వేగం గానూ నడవటం పై సందేహాలు అవసరం లేదు. “ఈ విశ్వం లో అనేక కాల ప్రవాహాలు ఉండటం” పై కూడా సందేహాలు అనవసరం.
స్థల-కాలం(Space-Time) అనేది విశ్వం తో పాటు పుట్టి ఉబ్బుతోంది. స్థల-కాలం వంపుతిరిగి, భూమి ఉపరి తలం లా తన పైకి తాను ముడుచుకొని పోయి ఉన్నదని ఐన్-స్టీనుడి ఉవాచ. గోళాకార ఉపరితలం లా ఉన్న కాలానికి “మొదలు” ఎలా ఉంటుంది?(Ref: Hawkings proposed quantum theory of gravity) ఒక వృత్తం గీస్తే, ఆ వృత్తం వెంబడి ఏది మొదలూ ఏది చివరా? అలానే భూమి మీద ప్రయాణం మొదలు పెట్టి ఉత్తర ధృవం చేరుకున్న తరువాత భూమి అంతమౌతుందా? కాదు కదా? ఉత్తర ధృవం తరువాత కూడా భూమే ఉంటుంది. కాకపోతే ఈ సారి మన ప్రయాణం ఉత్తర ధృవానికి దక్షిణం గా సాగుతుంది. అలానే కాలం పరిమితమైనది. కాబట్టీ, విశ్వం కాలం లో పుట్టలేదు. కాలం లో పుట్టని దానికి కారణం ఉండదు. ఎందుకంటే కార్య కారణ సంబంధాలు కాలం లోనే జరుగుతాయి.
భౌతిక శాస్త్రం ప్రకారం ఇలా కారణం లేకుండా పుట్టేవి అనేకం ఉన్నాయి. గుళిక సిధ్ధాంతం (quantum theory) ప్రకారం శూన్యం నుంచీ ఎలక్ట్రాలు ఏ కారణం లేకుండానే పుట్టి మళ్ళీ అంతరిస్తాయి. దీనినే శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations) అంటారు. ఇది సాయి బాబా శూన్యం నుంచీ విభూతి పుట్టించటం లాంటిది. కానీ, ఈ రెండూ ఒకటి కాదు. శాస్త్రం(science) ప్రయోగాల ద్వారా ధృవీకరించిన విషయమే శాస్త్ర నియమమౌతుంది . శాస్త్రం , శూన్యంలోంచీ ఎలక్ట్రాన్లు పుట్టటాన్ని ధృవీకరించి దాన్ని ఒక నియమం గా ఏర్పరిచింది కనుక, అది శాస్త్రీయమే. సాయి బాబా ఏ మోసమూ లేకుండా ప్రయోగశాల లో విభూతి పుట్టించినట్లైతే, శాస్త్రం ఒక సాయి బాబా నియమాన్ని కూడా ప్రతిపాదించేదేమో!
ఇంకొక విషయం..విశ్వానికి “బయట” అనేది లేదు. “బయట” ఉండాలంటే స్థలం ఉండాలి. కానీ, స్థలం అంతా విశ్వం తో పాటు పుట్టి విశ్వం లోనే ఉంది. మరి విశ్వం ఎక్కడికి వ్యాకోచిస్తూంది? ఎక్కడికీ వ్యాకొచించటం లేదు. ఉన్న స్థలకాలానికి మరింత స్థ- కాలం కలుపబడుతోంది. విశ్వం “బయట” ఏముంది? ఏమీ లేదు. దక్షిణ ధృవానికి దక్షిణం గా ఏముంది? ఏమీ ఉండదు కదా? “బయట” లేని విశ్వాన్ని ఊహించుకోవటం లో కొన్ని పరిమితులున్నాయి. ఒక బుట్ట లో ఐదు మామిడి పళ్ళున్నాయి అనుకొందాం. ఆ ఐదు పళ్ళనూ బయటికి తీస్తే బుట్టలో ఏముందీ అంటే, ‘శూన్యం ఉంది’ అని చెప్పవచ్చు. కానీ విశ్వం “బయట” స్థలం కూడా లేదు. స్థలం లేని స్థితి ని ఊహించుకోవటం మనకు చేతకాదు. ఎందుకంటే, మన రోజువారీ జీవితం లో మనం అలాంటి స్థితి ని చూసి ఉండం.అనంతం కాని కాలాన్ని ఊహించుకోలేకపోవటం కూడా ఈ కారణం వలననే! మనం విశ్వానికి మొదలు వెతకటం కూడా ఇదే కోవలోకి వస్తుంది. మన జీవితం లో అన్ని విషయాలకీ మొదలూ చివరా ఉంటాయి. కాబట్టీ, మనం విశ్వానికి కూడా మొదలును వెతుకుతాం. కాకపొతే, అదృష్టం కొద్దీ విశ్వానికి మొదలు ఉంది.కానీ కాలం లో ఈ మొదలు దాటి ముందుకు పోతే (ఉత్తర ధృవం దాటి ముందుకు పోతే దక్షిణం వచ్చినట్లు) మళ్ళీ తరువాతి కాలం వస్తుంది.
కారణం లేకుండానే ఎలక్ట్రాన్లూ, విశ్వమూ మొదలైనవి పుట్టటాన్ని మనం ఇంకొక కొలత (Dimension) ప్రవేశ పెట్టటం ద్వారా కారణం పరిధిలోకి తీసుకొని రా వచ్చును.అయితే ఈ కొత్త కారణం మనం దైనందీన జీవితం లో చూసే కారణాలవంటిది కాదు. ఇది మన బౌతిక కాలం లో జరిగేది కాదు.అధిభౌతిక కాలం లో జరిగేది. సినిమా తెర మీది రెండు కొలతల బొమ్మలకు తెలివి ఉందనుకొందాం. తెరమీద మనం ఒక టార్చీ లైటు ఫోకస్ చేసినప్పుడు, తెరమీద బొమ్మలు ఆ టార్చి లైట్ వెలుగు కి కార్య కారణ నియమాన్ని ఆపాదిస్తే, ఆ వెలుగు ఏ కారణం లేకుండానే వచ్చినట్లు తేలుతుంది. ఎందుకంటే ఆ బొమ్మలు మూడవ కొలతలో ఉన్న మనలను కనిపెట్టలేవు కాబట్టీ. అలానే ఈ విశ్వ సృష్టి ఐదవ కొలత లోజరిగితే, అప్పుడు ఆ సృష్టి నాలుగు కొలత (కాలం తో కలిపి నాలుగు డైమన్షన్లు) ల లో ఉన్న మనకు, కారణం లేనిది గా కనపడుతుంది. కానీ ఐదవ కొలత అనేది అధి-భౌతికం. దీనిని మన నాలుగు కొలత ల ప్రపంచం లోని విషయాల సహాయం తో నిరూపించటం కష్టం. దీనినే సైధ్ధాంతిక కల్పన(conceptual fantasy) అనవచ్చు. ఈ ఐదవ కొలత ఏ భౌతిక నియమాన్నీ ఉల్లంఘించ లేదు . కానీ ఈ ఐదవ కొలత మన ఊహ లోని ఒక విషయమే!ఐతే దీనికీ, కేవలం ఊహా గానాలైన “భూమిని సృష్టించే రెక్కల దేవతలకీ, తాబేళ్ళకీ” తేడా గమనించవచ్చు.కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదన్నప్పుడు,దాని అర్ధం, మనం ఉన్న నాలుగు డైమన్షన్లలోనూ, విశ్వం పుట్టుకకి కారణం దొరకలేదనే! ఐదో కొలతలోనో, పన్నేండో కొలతలోనో దానికి కారణం ఉండవచ్చు. కానీ ఇలా ఎన్ని కొలతలని ఊహించుకొంటాం అనేది వేరే ప్రశ్న.
విశ్వం లో కారణాలు లేనివీ (ఉదా: శూన్యత ఒడిదుడుకులు (vacuum fluctuations)), కారణాలు తెలియనివీ (ఉదా: జీవులలో జన్యు మార్పులు), కారణాలు ఎప్పటికీ తెలుసుకోలేనివి (విశ్వం యొక్క ప్రయోజనం, ఐదవ కొలత, పదవ కొలత లాంటివి), కారణాలను ఖచ్చితం గా కొలవలేనివీ (హైజెన్-బర్గ్ అనిశ్చితి సిధ్ధాంతం(Heisenberg’s Uncertainity principle) ప్రకారం, ఎలక్ట్రాన్ వేగాన్నీ, స్థానాన్నీ ఒకే సమయం లో ఖచ్చితం గా ఎప్పటికీ తెలుసుకోలేము) ఉన్నాయి. వీటి మధ్య గల తేడాలను తెలుసుకోవటం కూడా ముఖ్యమైన విషయమే!
వేదాలూ, భగవద్గీతా, ఇతర మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర వేత్తలూ, మాట్లాడే దానిలో కొంత సారూప్యత ఉంటుంది. ఎందుకంటే అవి ఒకే విషయం, సృష్టి యొక్క జననం, సృష్టి కి కారణం గురించి మాట్లాడుతున్నాయి. ఈ విశ్వం లాంటి విషయాల్లో సమాధానాలు చాలా తక్కువ ఆప్షన్స్ తో ఉంటాయి. సృష్టి పరిమితం, లేక అనంతం. దీనికి కారణం ఉంది, లేక లేదు.లేక ఉండీ ఉండకుండా ఉంది. దీనికి బయట ఉంది లేక లేదు.లేక ఈ మధ్య లో ఉంది. సృష్టికి కారకుడు ఉన్నాడు లేక లేదు.లేక ఈ మధ్య లో ఉన్నాడు. ఇలా ఆప్షన్స్ అన్నీ రెండు లేక మూడు మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక మత గ్రంధం చెప్పేదానికీ, సైన్స్ చెప్పిన ఫలితానికీ పోలిక ఉండటం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. కాబట్టీ, “మతాల గ్రంధాలూ, బౌతిక శాస్త్ర పరిశొధనలూ, ఈ సృష్టి రహస్యాల గురించి ఏకీభవిస్తున్నాయి”, అనటం అప్పుడే సరి కాదు అనుకొంటాను.
పాపం మగాళ్ళు! ఎలా ఉండే వాళ్ళు ఎలా తయారయ్యారు!
30 జూన్ 2011 అభిప్రాయములు
in సమాజం
ఒకప్పుడు:
———
వాళ్ళు మగ మహారాజులు. వీరులూ ధీరులూ. యుధ్ధాలు చేసే వారు. తెగించే వారు. సాహసాలు చేసే వారు.తరుణులను గెలిచే వారు.పొగరు గా, పౌరుషం గా, ఆప్యాయం గా, స్నేహం గా,దుడుకు గా, పెద్ద మన్సుతో ఉండే వారు.
నచ్చిన వనితలను వలచి వలపించుకొనే వారు.
కుటుంబాలు ఏర్పడటం మొదలయ్యాక, ఇంట్లో వీరి మాటకి తిరుగే లేదు.
నిన్న:
——
నెచ్చెలి గురించి ఎక్కువగా ఊహలలో కాలక్షేపం చేసే వాడు. ఇష్టమైన అమ్మాయిని కాక, పెద్దలు చూసిన “కన్య” ని వివాహమాడిన వాడు. ఊరిలో సగం ఆడ వాళ్ళయినా, వారితో మాట్లాడటానికి కూడా స్వేచ్చ, అవకాశం లేక తన మగ స్నేహితులతో కాలక్షేపం చేసే వాడు. పస లేని గుమాస్తా ఉద్యొగాలు చేసే వాడు.గానుగెద్దు జీవితం!
అధికారం తో పాటు బాధ్యతలు పైన పడిన వాడు. కుటుంబానికి యజమాని ..కానీ కుటుంబ భారం మోసే వాడు..భర్త.ఇంట్లో నచ్చిన వంటలు చేయించుకొని నచ్చకపోయినా తినేవాడు.ఆడవారినీ పిల్లలనూ రక్షించే వాడు..అతనికి రక్షణ ఉందా లేదా అనేది వేరే విషయం. ఇంట్లో పిల్లి అయినా వీధిలో పులి.
నేడు:
—–
ఒక అమ్మాయి దయ కోసం పది మంది మగ వాళ్ళు అలమటించే స్థితి. బిక్కు బిక్కు మంటూ ప్రేమించాలి.ఏమైనా తేడా వస్తే నాన్-బెయిలబుల్ కేసు కింద కట కటాలలోకి పోవాలి. లేకపోతే ప్రభుత్వమే పైకి పంపిస్తుంది.
వళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో బాబూ, నీకు 33 శాతం రిజర్వేషన్లు లేవు!
ఆఫీసు లో తేడా వచ్చిందా సెక్సువల్ హరాస్మెంట్ కేస్ కి సిధ్ధం కావాలి కాబట్టీ, ఆడ పిల్లలతో జాగ్రత్త గా ఉండాలి.
పెళ్ళయినాక, గృహ హింస కేసు ఉంది నాయనా, పెళ్ళాం కొడితే మూసుకొని కూర్చో!ముల్లు అరిటాకు మీద పడినా అరిటాకు ముల్లు మీద పడిన అరిటాకు కే నష్టం. బాసు గారు నీ కొలీగ్ ని “మేడం కొంచెం ఈ పని చేస్తారా?” అంటారు, నిన్ను మాత్రం, “ఈ పని ఇంకో అరగంట లో చెయ్”, అంటారు.
మహిళా మణులు,బాసు చెప్పిన పని ఇష్టం లేక పోయినా చేస్తారు. మరి అది డబ్బు తో సంబంధమున్న విషయం కదా! నువ్వు వారి మంచికోరి చెప్పినదైనా, చెయ్యరు. చేస్తే స్త్రీ స్వేచ్చ కి భంగం. ఆత్మ గౌరవానికి వ్యతిరేకం.
నీ భార్యకి వంట తెలవదు కదా నువ్వే కాస్త వంట నేర్చుకో నాయనా. లేక పోతే హోటల్ బిల్లు పేలుతుంది. పెళ్ళాం వస్తాదు తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ముందు నడుస్తుంటే, నువ్వు అణకువగా పిల్లల్ని ఎత్తుకొని వెనుక నిలబడు.లేకపోతే నీకు సంస్కారం లేనట్లే! కారు డ్రైవర్ పని చేయి, పచారీ పని చేయి.
ఆడ వారి హక్కుల గురించీ మగ వారి బాధ్యతల గురించీ తోటి మగ వాళ్ళతో సహా బ్రెయిన్ వాష్ చేయబడిన వాడా!
బజారు లో కురచ బట్టల కుర్రదాన్ని చూసి, తన నోట్లో మాట తనే నొక్కేసుకోవటమే నాగరికత అనుకొనే వాడా.. !కుటుంబ చట్రం లో పడి కునారిల్లుతున్న వాడా!రోజు రోజు కీ సహజ స్వభావాన్ని వీడుతున్న వాడా!!రేపు లోకం ఎలాఉంటుందో అని భయపడే వాడా!చచ్చి పోయిన “మగాడా”!, నీ స్మృతికి ఇదే నా నమస్సుమాంజలి!
పీ వీ నరసింహా రావు గొప్పతనం గురించి స్వామినాథన్ అయ్యర్.
30 జూన్ 2011 అభిప్రాయములు
in రాజకీయం
మన వాడు, తెలుగు వాడు, తెలంగాణ వాడు ఐన మాజీ ప్రధాని పీ వీ నరసింహా రావు నిరాడంబరుడే కాక, పెద్ద పేరు కోరుకొనకుండా తన పని తాను చేసుకొని పోయిన కర్మ యోగి.ఆర్భాటం లేని నిరాడంబరుడు. దేశ గతిని మలుపు తిప్పిన వాడు. దేశానికి “ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్”, చేసిన వాడు.
దేశ రహస్యాలు కొన్ని తనతోనే పోతాయని (అణు పరీక్షల వ్యవహారం లో), బయటికి చెప్పని దేశ భక్తుడు.
స్వామినాథన్ అయ్యర్, గుంపు పోకడకు వ్యతిరేకం గా ఒక కౌంటర్ పాయింట్ ని బలం గా వినిపించే పాత్రికేయుడు. తన అంచనా తప్పు అయితే నిజాయితీ గా ఒప్పుకొనే ధైర్యవంతుడు.తగినంత అధ్యయనం చేసి రాసే వ్యక్తి. నేను గౌరవించే మేధావి. అటువంటి స్వామినాథన్ అయ్యర్ మన పీ వీ కి ఘటించిన స్మృత్యంజలి ..ఇక్కడ..:ఎకనమిక్ టైంస్ లో:
జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం మొదలైనవి..
19 జూలై 2011 అభిప్రాయములు
in తత్వశాస్త్రం, విశ్వమూ దేవుడూ
ఈ టపా ఇంతకు ముందు నేను విశ్వం యొక్క కారణం,పుట్టుకా వగైరా ల గురించి రాసిన టపాలకు
) కొనసాగింపు.
1.ఈ భౌతిక ప్రపంచానికి ఆవల అధి భౌతిక ప్రపంచం (metaphysical world) ఉంటుంది.భౌతిక ప్రపంచం యొక్క నియమాలు పనిచేయటం మానివేసినచోటినుంచీ అధిబౌతిక ప్రపంచం ఉనికి మొదలౌతుంది. ఈ భౌతిక ప్రపంచ మూలాలు ఆ అధి భౌతిక ప్రపంచం లో నే ఉంటాయి. అయితే ఈ అధి భౌతిక ప్రపంచం మన ఊహల కు అందనిది. దాని గురించి ఆలోచించాలంటే “కాలం లేకపోవటం, కారణం లేక పోవటం,ఐదూ లేక అంత కంటే ఎక్కువ కొలతలూ(డైమెన్షన్స్)” లాంటి భౌతిక ప్రపంచానికి ఉన్న మినహాయింపుల సహాయం తో ఆలోచించాలి. అయితే మన ఆలోచనా, ఊహా ఈ మినహాయింపులు అనే గోడ కి కొట్టుకొని ఆగిపోతాయి. ఈ గోడ ఆవల ఏమి ఉందో మన ఊహ కు అందదు. ఇక, దానిని అనుభవించటం కలలోని మాట.
అధిభౌతిక ప్రపంచం లో రెండు స్థాయిలు ఉంటాయి. ఐదూ లేక అంత కంటే ఎక్కువ కొలతల(డైమెన్షన్స్) తో ఏర్పడిన మొదటి స్థాయి ఒకటీ, మనం చూసే భౌతిక ప్రపంచం లోని, మరియూ మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచం లోని విషయాలకు ఆవల ఉండే రెండవ స్థాయి అధి భౌతిక ప్రపంచం ఇంకొకటి. ఈ రెండవ స్థాయి అధి భౌతిక ప్రపంచం స్థల కాలాల కూ అన్ని కొలతలకూ అతీతమైనది.
2. మనకు తెలిసిన అనేక మంది మహానుభావులు, ఋషి సమానులు పరిపూర్ణ సత్యాన్ని ప్రత్యక్షం గా అనుభవించామని చెప్తారు. ఇలా అనుభవించటం “నేను” అనే దానిని వదులుకోవటం ద్వారా సాధ్యపడుతుందని చెప్తారు. ఉదాహరణ కి ఆధునిక కాలం లో జిడ్డు కృష్ణమూర్తి, యూ జీ కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి వారు ఇలాంటి అనుభవాలు పొందబడిన వారి గా నమ్మబడ్డారు. వీరు అహాన్ని అధిగమించటం ద్వారా మనం రోజు వారీ చూసే భౌతిక సత్యాన్నే విశిష్టమైన రూపం లో చూడగలిగారు అనిపిస్తుంది. వీరికి కలిగిన అనుభవాలను భవిష్యత్తు లో, వేరే పధ్ధతుల్లో, భౌతిక ప్రేరేపణల ద్వారా, అంటే, శస్త్ర చికిత్సల వలన నో, జన్యు మార్పులు చేయటం వలననో, లేక మందులు కనిపెట్టటం వలననో” సాధించవచ్చేమో!
3.నేను అనేది గడిచిన కాలం లోని ప్రతిబింబాల(images) తో చేయబడిన ఆలోచనల సమూహం. నేను లేనప్పుడు, భౌతికమైన వాస్తవాన్ని చూసేటపుడు, ఈ ప్రతిబింబాలు అడ్డు రాని స్వఛ్ఛమైన భౌతిక వాస్తవికత అనుభవంలోకి వస్తుంది. నేను అనేది లేనపుడు భూత కాలమూ, భవిష్యత్ కాలమూ ఉండవు. కేవలం వర్తమానం మాత్రమే అనుభవం లోకి వస్తుంది. మన చేతన అనే టార్చ్ వెలుతురు లో వర్తమానానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. దీని వలన, ‘నేను లేని స్థితీ లో మానసిక మైన కాలం ఉండదు. ఐతే ఈ ‘నేను లేని స్థితీ లో కలిగిన అనుభవాలు అధిభౌతికమైనవి కావు. భౌతిక అనుభవాలే ఆలోచనల అడ్డులేకుండా కలుగుతాయి. దీని వలన ఆ భౌతిక అనుభవాలకు ఒక విశిష్టత చేకూరుతుంది.మనిషి మామూలు చేతన లో ఉండగా ఇటువంటి అనుభవాలు కలుగవు. మామూలు చేతన పరిధి విస్తరించినపుడే ఈ అనుభవాలు కలుగుతాయి. అందువలన మనం వీటిని అధి-చేతన అనుభవాలు అనవచ్చు.
4. ఈ మహానుభావులకు కలిగిన అబుభవాలు కారణం లేనివి (acausal) గా చెప్పబడతాయి (మన విశ్లేషణ లో “విశ్వమూ, క్వాంటం ఫ్లక్చ్యుయేషన్స్” మొదలైనవి కారణం లేనివి గా తేలినట్లు). దీనిని బట్టి ఆ అనుభవాలు అధి భౌతికమైన కారణాల వలన కలిగాయనిపిస్తుంది. అయితే, ఇప్పటివరకూ తెలియని భౌతిక కారణాల వలన కూడా ఈ అనుభవాలు కలిగి ఉండవచ్చును. కానీ ఈ “‘నేను’ ని వదిలిన మహానుభావులు” వారి అనుభవానికి కారణమైన అధి భౌతిక ప్రపంచాన్ని చూడలేదేమో! ఎందుకంటే అధిభౌతిక ప్రపంచం లో కార్య కారణ సంబంధాలు (మనము అనుభవించే విధం గా) ఉండవు. కాలం ఉండదు. కానీ మనిషికి సంబంధించిన ప్రక్రియలైన చూడటం, అనుభవించటం, ఇంద్రియానుభవాలూ, చేతనా అన్నీ అధి భౌతికమైనవివి కాదు. అవి కార్య-కారణ సంబంధాల పరిధి లోనే ఉంటాయి. భౌతిక స్థాయి లో మనిషి అణువులూ, ఎలక్ట్రాన్లూ మొదలైన వాటి తో తయారు చేయబడ్డాడు. ఇవన్నీ భౌతికమైన కాలానికీ, కార్య కారణ సంబంధాలకు లోబడే ఉంటాయి. వాటిలో అధిభౌతికత లేదు.అధిభౌతిక మైన విషయాలు మన కాలానికి లోబడి ఉండవు. కా బట్టీ ఈ మహా పురుషుల అనుభవాలు అలౌకికమైనవీ, అసాధారణమైనవీ అయినా అధి-భౌతిక మైనవి కాక పోవచ్చు.కానీ ఈ అనుభవాలకు ప్రేరణ మాత్రం అధిబౌతిక ప్రపంచం లో ఉంటుంది.
5. ఈ అధి భౌతికమైన విషయాలను తన ప్రత్యక్ష ఇంద్రియానుభవం లోకి తెచ్చుకొనే అవకాశం మనిషి కి రాకపోవచ్చు. ఒక బాక్టీరియాకు కామం, మోహం, ప్రేమా వంటివి ఎప్పటికైనా తెలుస్తాయా?
6.ఈ ఋషులలో కొంత మంది అద్భుతాలను చేస్తారు. వీరికి అయిన సత్యదర్శనం లానే, ఈ అద్భుతాలకు కూడా ప్రేరణ అధిభౌతిక ప్రపంచం లోనే ఉండవచ్చు.ఈ అధి భౌతిక ప్రపంచం పైన చెప్పిన మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచం మాత్రమే. రెండవ స్థాయి అధిభౌతిక ప్రపంచాన్ని స్పృశించటం కూడా మానవులకు సాధ్యం కాదు.
ఇప్పటివరకూ తెలియని భౌతిక కారణాల వలన కూడా ఈ అనుభవాలు కలిగి ఉండవచ్చును. కానీ ఈ అద్భుతాలన్నీ (గాలి లో తేలటం, భవిష్యత్తును చెప్పటం మొదలైనవి) భౌతిక ప్రపంచం లో జరిగేవే. ఒకప్పుడు అద్భుతాలుగా కనిపించేవి, సైన్స్ వృధ్ధి చెందిన తరువాత మామూలు విషయాలయ్యాయి (ఉదా: గాలి లో ప్రయాణం చేయటం). అదే విధం గా, వచ్చే కాలం లో,సైన్స్ “ఇలాంటి వాటిని కూడా సంభవమే” అని నిరూపించవచ్చు.
కాబట్టీ శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృధ్ధి చెందినా, ‘అధి-భౌతిక’ ప్రపంచాన్ని మనిషి అనుభవం పరిధి లోకి తీసుకొని రావటం సంభవం కాకపోవచ్చు. అలా అని శాస్త్ర విజ్ఞానం అంతా దండుగ అని కాదు. భౌతిక పరిధి లో ఉన్న అనేక విషయాలు శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ మన దైనందిన అనుభవం లో అవగాహన లో కి వస్తాయి.
తెలంగాణ వాదానికి రూట్ కాజ్..తెలంగాణ వాదానికి మూల కారణం?
18 ఆగ 2011 అభిప్రాయములు
మధ్య కోస్తా లో ఉన్న మా ఊరి లో మా ఇంటి పక్కన ఒక కుటుంబం ఉండేది. మా చిన్నప్పుడు వాళ్ళ పిల్లలతో నేనూ మా తమ్ముడూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మా రెండు కుటుంబాల మధ్యా మంచి స్నేహమే ఉండేది. నాకు ఓ పదేళ్ళు ఉన్నపుడు మా పొరుగు కుటంబం నెల్లూరుకు వలస వెళ్ళారు. అక్కడ ఒక ఐదేళ్ళు గడిపాక, వరస కుదరక మళ్ళీ మా ఊళ్ళోని వాళ్ళ ఇంటికే వచ్చేశారు. తిరిగి వచ్చిన తరువాత వాళ్ళ కి చాలా వరకూ నెల్లూరు యాస వచ్చేసింది. అప్పటికి పదిహేనేళ్ళున్న మా తమ్ముడికి అది వింతగా అనిపించటమే కాక, తప్పుగా అనిపించింది. “ఊరంతా ఒక భాషైఏ వీళ్ళది వేరే యాసా..ఎచ్చులు పోవటం కాకపోతే!” అని వాళ్ళ పిల్లలని వెక్కిరించేవాడు. వాళ్ళూ నెల్లూరు వెళ్ళిన ఐదేళ్ళ లోనూ మా నాన్న పూరిల్లు తీసి డాబా వేశాడు. వెక్కిరించిన మా తమ్ముడికి అవతలి వాళ్ళూ దానిని ఈజీ గా తీసుకోవాలని ఉడేది. కానీ వాళ్ళు దానిని సహజం గానే పెద్ద అవమానం గా భావించేవారు. మా తమ్ముడు వెక్కిరించటం వలన మా పక్క వాళ్ళ పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా నెమ్మదిగా మా పై అసంతృప్తి పెంచుకోసాగారు. కొన్నాళ్ళకి మేము ఏ పని చేసిన వాళ్ళకి చెడ్డ గా కనిపించేది.
రాను రానూ వాళ్ళ ధొరణి చాలా అసఖ్యం గా మారింది. మా అమ్మ ఒక సారి పక్క వాళ్ళ అమ్మాయికి జామ పళ్ళు ఇవ్వబోతే, ఆ అమ్మాయి “మా అమ్మ తీసుకోవద్దని చెప్పింది”, అంది. ఇంకోసారి ఏదో పూజకి వాళ్ళని పిలిస్తే, వాళ్ళు,”పూజకి పిలిచి మమల్ని సరిగా పలకరించలేదు” అని ఎవరితోనో చెప్పారు. కొన్ని నెలలకి మా డాబా గోడలపైన అంట్లు కడిగిన నీళ్ళూ పొయ్యటం, మా వైపు చెత్త వెయ్యటం మొదలయ్యింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు ఈ చిన్న చిన గొడవలు ఇరు కుటుంబాలకీ మధ్య సరిహద్దు తగాదాలకి దారితీసింది. ఈ తగాదాలలోకి ఊళ్ళోని రెండు ముఠాల నాయకులూ ప్రవేశించారు. మా పక్క వాడి ప్రవర్తన ఏ మాత్రం క్షమార్హం కాదని మా నాన్న ని సపోర్ట్ చేసిన నాయకుడు చెప్పాడు. మా నాన్న చేత కోర్ట్ కేసులు వేయించాడు. తరువాతి పంచాయతీ ఎన్నికలలో మా కుటుంబం యావత్తూ ఆ నాయకుడికే ఓట్లు వేశాం.ఈ లోపల కోర్ట్ కేసుల్లో డబ్బు వదిలి, ఓ రెండు సెక్షన్లు తెలిసి వచ్చాక మా పక్కింటి వాళ్ళూ మేమూ కాంప్రమైజ్ అయ్యాం..అలా అవటం రెండు పక్షాల నాయకులకీ ఇష్టం లేకపోయినా కూడా! అప్పటికి మా పక్కింటాయన కూడా డాబా ఇల్లు కట్టాడు. వాళ్ళ భాష మళ్ళీ మా ఊరి భాష కి మారిపోయింది.
అదే విధంగా..
యాభైలలో ఉభయ పక్షాలలోనూ, ముఖ్యం గా కమ్యూనిస్ట్లలో విశాలాంధ్ర భావన బలం గా ఉండేది. అయితే,
ఈ రాష్ట్రం ఏర్పడటానికి వ్యవహార పరం గా కారణం “తెలుగు వారందరికీ ఒకే రాష్ట్రం ఉండాలి”, అని కాదు. ఆ రోజుల్లో తెలంగాన లో కమ్యూనిస్ట్ ల ప్రాబల్యం ఎక్కువ గా ఉండేది. ఆంధ్ర లో కాంగ్రెస్ గెలిచింది. కమ్యూనిస్ట్ల ప్రాబల్యానికి గండి కొట్టాలనుకొన్న నెహ్రూ ఆంధ్ర తెలంగాన ని కలపటం ద్వారా అది సాధిద్దామనుకొనటమే ఈ రాష్ట్రం ఏర్పడ్టానికి ప్రాక్టికల్ గా ముఖ్య కారణం.
ముస్లిం పరిపాలకుల కాలం లో తెలంగాణ ప్రాంతపు భాషా, సంస్కృతీ చాలా వరకూ ప్రత్యేకత సంతరించుకొన్నాయి. ఒకే రాష్ట్రం గా ఏర్పడినపుడు , ఆంధ్ర సమాజం చదువులోనూ, ప్రసార ప్రచార సాధనాలలోనూ,రాజకీయ సామాజిక వ్యవస్థలలొనూ కొంత ముందు ఉంది. ఆయా రంగాలలో వారి ఆధిపత్యం వలన, తమ భాషే సరైనది అనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. ఒక వేళ నిజాం తన రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతం కంటే ముందుకు ప్రగతి పధం లో నడిపించినట్లైతే, తెలంగాన ప్రాంతపు భాషా, సంస్కృతే నిజమైనవి గా చెలామణి అయ్యేవి. ఉదాహరణకు కేరళలోని తిరువంకూరు (ట్రావంకోర్), కర్నాటక లోని మైసూరు సంస్థానాల భాషే అసలైనది గా అక్కడ చెలామణి అవుతోంది(ఆయా రాష్ట్రాలలో బ్రిటిష్ వారు ఏలిన ప్రాంతాలతో పోలిస్తే). ఆయా రాజులు వారి కాలం లో తమ రాజ్యాలలో చేసిన అభివృధ్ధి వలన అది సాధ్యమయింది.
నిజాం ఏలుబడి లో దొరల కింద రైతు పని చేసినా, భూస్వాములు అంతటినీ కబళించే సంస్కృతి ఉండేది. దాని వలన రైతులు “పని చేయటం వలన ఏమి ఉపయోగం?”, అనుకొని నిరాసక్తం గా ఉండేవారు. ఇది అక్కడి సంస్కృతి లో ఒక భాగమైంది. కానీ ఈ ఆధునిక యుగం లో తెలంగాణ లోని యువకులు ఎంతో సమర్ధవంతం గా అని రంగాలలో దూసుకొని పోతున్నారు. ఈ సంస్కృతి వారికి వర్తించదు.
పైకి వెళ్ళిన పక్క వాడిని చూసి అసూయ నో ఈర్ష్యనో కలిగి ఉండటం మానవ సమూహాల్లో సహజం (ఈ విషయాన్ని ఆయా మనుషులలోని సంస్కారం ఒప్పుకోక పోయినప్పటికినీ). ఒక ఎకరమో అరో అమ్ముకొని హైదరాబాదు కి చేరి ఇక్కడ ఓ సైటు కొనుక్కొని, హడావిడి చేసే ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణ వారి లో కూడా ఇలాంటి భావావేశాలను రేకెత్తించటం కూడా అంతే సహజం.హడావిడీ, అజమాయిషీ చేసే వారికి అలా చేయటం చిన్న విషయమే. కానీ అజమాయిషీ చేయించుకొన్న వారికి (తెలంగాణ వారికి) అది సహజం గా సహించరాని విషయం, అనేదానిని ఆంధ్ర వారు గమనించలేదు.
తొంభై ల మధ్య నుంచీ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం లో వచ్చిన మార్పులు, రాష్ట్ర రాజకీయ నాయకత్వం లో తెలంగాణ వారి స్థానాన్ని గణనీయం గా తగ్గించి వేశాయి. ఒక పార్టీ ముఖ్యమంత్రులను తరచుగా మార్చే విధానానికి స్వస్తి చెప్తే, ఇంకొక పార్టీ ఏక కుటుంబ పాలన కు పరిమితమై పోయింది. దీని వలన తెలంగాన లోని నాయకులు గ్లాస్ సీలింగ్ కు గుద్దుకోవలసి వచ్చింది. కానీ ఈ అంశం మూల కారణాలలో ఒకటి కాదు.
ఈ మూల కారణాల వలన రాష్ట్రం ఏర్పడిన కొత్తలో “మనము” గా ఉన్న భావన అనతి కాలం లోనే “మీరు”, “మేము” గా విడిపోయింది. తెలంగాణ వాదానికి మూల కారణం ఇదే. ఒక్కసారి ఈ వేరు భావన ఏర్పడిన తరువాత ప్రతి విషయాన్నీ అదే ధోరణి లో అనుమానం తో చూడటం వలన (అలా చూడవలసిన పరిస్థితి లేక పోయిన విషయాలలో కూడా) ఎక్కువయింది.ఒక సమయం లో తెలంగాణ ప్రాంతీయులకి జరిగిన పొరపాట్లు (అన్యాయాలు కావు..ఎందుకంటేఅవి కావాలని ద్వేషం తో చేసినవి కావు.అలానే ఆయా పనుల పర్యవసానం దృష్టి లో పెట్టుకొని చేసినవి కావు) వేరొక సమయం లో ఆంధ్ర ప్రాంతానికీ జరిగాయి. కాకపోతే ప్రస్థుతం సమైక్యం అంటున్న ఆంధ్ర ప్రాంతీయులు ఆ పొరపాట్లను పైకి చెప్పటం లేదు. అలా చెప్పితే వాటిని భూతద్దం లో చూపించే ప్రత్యేక వాద రా.నా లు అక్కడా ఉన్నారు. ఈ విబేధాలు మొదట్లో ప్రజలలో నామ మాత్రం గా ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం కోరేంత బలం గా లేవు. కానీ అవకాశం కోసం కాచుకొని కూర్చొన “దుర్బుధ్ధి రాజకీయ నాయకులు” విబేధాలకు కారణమైన విషయాలను భూతద్దం తో చూపించి తమ రాజకీయభవిష్యత్తుకు పునాది గా ఉపయోగించుకొన్నారు.మన కు అన్యాయం జరిగిపోతోంది అని మనవాడు గట్టిగా చెప్పినపుడు మనం వెంటనే ఉత్సాహం తో నమ్మేస్తాం. అన్యాయం జరుగలేదు అని పక్కన ఉన్న ‘మనవాడు కాని వ్యక్తి, నిరూపించాలంటే వాడు దానికి రక రకాల ప్రూఫ్ లు చూపించినా మనం నమ్మం. వాడి ప్రూఫ్ లను అనుమానం గానే చూస్తాం. కానీ మనవాడికి మాత్రం నమ్మకమనే కన్సెషన్ ఇస్తాం. అందుకనే తెలంగాన లోని విష నాయకులు చెప్పిన దోపిడీ అబధ్ధాలని అక్కడి ప్రజలు ముందూ వెనుకా చూడకుండా వెంటనే నమ్మి ఆవేశం తెచ్చుకొన్నారు. స్వప్రేమా పరద్వేషం మనిషి లక్షణమనుకొంటా!అలానే తెలంగాణ వస్తే స్వర్గం ఊడిపడుతుంది అన్న అక్కడి నేతల మాటలను కూడా ప్రజలు నమ్మినట్లు కనపడుతోంది. ఇక ఆత్మ గౌరవం వంటి మాటల సంగతి చెప్పనక్కర లేదు.
కర్నాటక, మహరాష్ట్ర ల లో ఊపందుకోని ప్రత్యేక భావనలు మన రాష్ట్రం లో ఊపందుకొనటానికి ప్రధాన కారణం, తెలంగాణ పది జిల్లాలతో పెద్దది కావటమే! మన రాష్ట్రం లో లా, ప్రాంతీయ పరమైన అనేక రాయితీలూ ఆరక్షణలూ మహారాష్ట్ర, కర్నాటకలలో లేవు. అయినా అక్కడ వేర్పాటు వాదం తలెత్తక పోవటానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న పరిమితమైన నైజాం జిల్లాలే!
నేను బెంగళూరు లో ఉన్నప్పుడు కన్నడ చానెళ్ళ లో కొన్ని సీరియళ్ళు వచ్చేవి. అవి అల్ప సంఖ్యాకులైన, వెనుకబడిన ఉత్తర కన్నడ జిల్లాల వారి సంస్కృతిని ప్రతిబింబించేవి గా ఉండేవి. అక్కడి పెద్దలు కన్నడ భావాన్ని సజీవం గా ఉంచేందుకు అటువంటి ఇముడ్చుకు పోయే తత్వాన్ని అవలంబించారని అనిపించేది. మనకు ఉన్న మీడియా చానెళ్ళ లో తెలంగాన సంస్కృతి ప్రతిబింబించేవిధం గా ఉన్న ఒక్క సీరియల్ ను కూడా చూసిన గుర్తు లేదు (ఉద్యమం ఉధృతం గా ఉన్నపుడు కూడా). ఆంధ్ర ప్రాంతపు ఆధిపత్య వర్గాల ఈ విధమైన తోలు మందం మనస్థత్వం కూడా తెలంగాన ప్రజలలో ఉన్న అసంతృప్తికి కారణం కావచ్చు. తెలంగాన ఉద్యమ సందర్భం గా కొన్ని ప్రధాన చానళ్ళు,ప్రత్యేక ఉద్యమ కారులు ఎక్కడ తమపై గురి పెడతారో అని తమ విశ్లేషణ ను మాత్రం బంద్ చేశాయి.అంటే వీరు అందరి మంచి కోసం, కలుపుకొనిపోయే, మన సోదరుల సంస్కృతిని చూపించే పాజిటివ్ మనస్థత్వాన్ని కాక, తమ ఆస్థులను రక్షించుకొనే సంకుచితమైన వ్యూహాన్ని అనుసరిస్తారు.
ఇక ఈ విషయం లో ఆంధ్ర ప్రాంతపు రా.నా. లు తక్కువ తినలేదు. ఒక సైధ్ధాంతిక మైన స్టాండ్ తీసుకోవక పోవటం, స్వల్పకాలిక ప్రయోజనాలూ, వోట్లూ ఆశించి తాము ప్రత్యేక వాదానికి అనుకూలమని ప్రకటించుకోవటం, అస్పష్ట విధానాలతో (రెండు కళ్ళ సిధ్ధాంతం) జనాల జీవితాలతో ఆడుకొని ఆత్మహత్యల పాపాన్ని కొంతైనా మూటగట్టొకోవటం వీరి పాపాలు. ప్రత్యేక వాదం తలెత్తిన నాడే, దానికి ధీటుగా, సమైక్య వాదాన్ని ప్రజల లో జాగరూకత చేయకపోవటం,అన్యాయమేదైనా ఉంటే సరి దిద్దటం, సో కాల్డ్ సమైక్య వాదుల లోపం.ప్రత్యేక వాదులు అబధ్ధాలు చెప్పారని, తాము కూడా అబధ్ధాలు చెప్పటం (“దేశ సమగ్రత కు ముప్పు”, లాంటివి) ఇంకో చిల్లర పని. వాళ్ళు నాలుకలు కోస్తాం అంటే, మేము ఆత్మాహుతి చేస్తాం అనటం కూడా భావ్యం కాదు.ప్రత్యేక వాద నాయకులు చేసినట్లుగా, సమైక్య నాయకులు తమా సమైక్య వాదానికి మేధోపరమైన సపోర్ట్ ని కూడగట్టటం లో విఫలమయ్యారు. సమైక్య స్టాండ్ ని తీసుకోవటమే గత్యంతరం లేని పరిస్థితులలో తీసుకొన్నారు.
ఒక్కసారి అనుమానం ఏర్పడితే, ప్రతి విషయాన్నీ అనుమానం గానే చూస్తాం,. నీటి దొంగలూ, దోపిడీదారులూ, గుంటనక్కలూ ఇలాంటి ఆత్మ విమర్శ లేని ఆలోచనలన్నీ “మొదట చెడిన నమ్మకం” పునాదిగా పుడతాయి.ఇక్కడ దోపిడీ దారులనే వారు అలా అనటాన్ని ఒక చిన్నవిషయం గా చూసినా, అనిపించుకునే వారిని అది తీవ్రం గా బాధించే విషయమే! అనే వారు “మీరు దోపిడీ చేశారు కాబట్టీ, మేము అనటం లో తప్పేమిటి?” అంటారు.
అనిపించుకొన్న వారు, “మేము దోపిడీ చేయలేదు కాబట్టీ మీరు అనటం తప్పు ” అంటారు.
ఎవరైనా శ్రీకృష్ణ లాంటి మధ్యవర్తి నచ్చచెప్ప చూసినా, “అనుమానం భూతం” ముందు, అవగాహన పలాయన మంత్రం పఠించాలిసిందే! ఇక చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసే రాజకీయ నాయకులు ఎలానూ ఉన్నారు.
ఇంతకీ ఈ ప్రత్యేక వాదం భవిష్యత్తు ఏమంటారా? ఏమో దేవుడికి ఎరుక..నాకైతే మేమూ, మా పక్కింటి వాళ్ళ విషయం లో లానే ప్రత్యేకం విషయం లోకూడా అవుతుందనిపిస్తుంది.
ఇక భాష విషయం..తెలుగు భాష నెమ్మది గా ఒక కలగాపులగమైన భాష గా అవతరించబోతోంది. ఇది అన్ని ప్రాంతాల భాషవిషయం లోనూ నిజం. హిందీ ఇంగ్లీషుని కలుపుకొని, అన్ని ప్రాంతాల పదాలూ చేర్చుకొని, మీడియా సహాయంతో ఈ భాష విస్తరిస్తుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలలోని ముఖ్యమైన పట్టణాలలో నూ యువతరం టీవీ చానళ్ళ భాషనూ, సినిమాల భాషనూ ఇంచుమించు గా ఉపయోగిస్తున్నారు. ఇది హైదరాబాదు లో గత యాభై యేళ్ళు గా పుట్టి పెరిగిన నాజూకు భాష. తెలంగాణ వారు “బాబాయ్” అన్నా, కేక రా అన్నా, వెళ్తున్నారా అన్నా ఈ భాష పుణ్యమే! అలానే ఆంధ్ర ప్రాంతం వారు, “టీ వీ బంద్ చెయ్” అన్నా, షాస్త్రం అన్నా, అనునాసికాలు లేకుండా “వం షం”, అన్నా, ఈ భాష ప్రభావమే! ఈ ప్రభావాన్ని తెలంగాణ ఏర్పడినా ఆపలేరు.
ప్ర: కేంద్ర ప్రభుత్వం లేక చిదంబరం అన్నదమ్ముల వంటి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారా?
జ : మనకు సిగ్గు లేక కీచులాడుకొని, పై వాడి దగ్గరికి పరిగెత్తితే, వాడి దృష్టి లో తేలిక అవమా? మనలో మనం సిగ్గులేకుండా తన్నుకొని పై వాడిని నిందించటం సరి కాదు.
ఒక సమాజాం మొత్తానికి సంబంధించిన ఉద్యమం జరుగుతున్నపుడు, ఆ ఉద్యమంలో అన్ని రకాల జనాలూ చేరుతారు. నిజాయితీ పరులూ, స్వార్థపరులూ, ఆవేశ పరులూ, కుహనా మేధావులూ, స్వార్థ నేతలూ,బూతులనే కవితలనే కవులూ, తమ బుధ్ధిని మొత్తం తమ విద్వేషాన్ని సమర్ధించటానికే ఉపయోగించే మేధావులూ,అందరూ ఉంటారు. ఏవరో కొందరు వెధవలు కారు కూతలు కూస్తారు. ఆ ఉద్యమానికి వ్యతిరేకం గా ఉన్న వారు ఆ కూతలు కూసిన వారిని చూపించి ఉద్యమం మొత్తాన్నీ తిడతారు. దానితో ఉద్యమం లో ఉన్న మంచివారికి కూడా కారు కూతలను సమర్ధించవలసిన ఆగత్యం ఏర్పడుతుంది. అప్పుడు కారు కూతలు కూసిన వాడి కూతలే ఉద్యమానికి ఒక చిహ్నమౌతాయి. ఉద్యమం లోని చెడ్డ వారిని ప్రతి సారీ పేరుపేరునా వేలెత్తి చూపటం కుదరదు . చెడ్డ వారి గురించి చేసిన వ్యాఖ్యలు, మంచి వారు కూడా తమను ఉద్దేశించే అనుకొంటారు. దానితో మంచి వారి మనస్థత్వాలు కూడా బిగిసిపోయి విషపూరితమౌతాయి. ఈ ఎస్కలేషన్ ప్రక్రియ ఇంటర్నెట్ లో చాలా వేగం గా పని చేస్తుంది.అలానే తమ వాదానికి సంబంధించిన నెగటివ్ విషయాలను మరుగు పరుస్తూ లేక తేలిక పరుస్తూ, పాజిటివ్ విషయాలను పెద్దవి చేస్తూ మాట్లాడుతారు. అంటే వీరికి కావలసినది తమ ఉద్యమ వాదం గెలవటం. వాస్తవం గెలవటం కాదు. కానీ ఏ చర్చ లోనైనా వాస్తవం గెలవాలి..! ఇది సమైక్య, ప్రత్యేక ఉద్యమాల రెండిడిటికీ వర్తిస్తుంది. కాబట్టీ ఇంటర్నెట్ చర్చల్లో, కొన్ని అభిప్రాయాలూ ద్వేషాలతో, తామే కరక్ట్ అని నిరూపించుకోవటానికో కాకుండా, “చర్చిద్దాం,విభేదిద్దాం, మాది తప్పు అయితే ఒప్పుకొంటాం, ఇరువురం కలిసి ఒక పరిష్కారం కనుగొందాం” అనే స్ఫూర్తి తో సాగితే మంచిది.
అతీంద్రియ శక్తులు : నా అనుభవాలూ, ఆలోచనలూ, వైఖరి.
28 ఆగ 2011 అభిప్రాయములు
in ఆధ్యాత్మికం
ఒక బాబా గారు గాల్లోంచీ అరటి పండు తీసి చేతి లో పెడతాడు. వేరొక బాబా ఇతరుల బుర్ర లోని ఆలోచనలను చెబుతాడు. దీనిని మనం నమ్మాలా? కనికట్టు అని కొట్టి పారేయాలా? నమ్మకూడదా? లేక బాబా గారిని మన యూనివర్సిటీ లాబ్ లో అదే అద్భుతం చేయమని సవాలు చేయాలా? ఇలాంటి మహిమల్ని నమ్మితే, అది శాస్త్రీయ దృష్టి అవుతుందా?
నా చిన్నతనం లో మా అత్తగారి ఊరి లో ఉండేవాడిని. ఓక రోజు “లవకుశ” సినిమా చూస్తున్నట్లుగా ఓ కల వచ్చింది. వాస్తవం లో అంతకు ముందు ఆ సినిమా ను నేను చూసి ఉండలేదు. ఆ మరుసటి రోజు మా నాన్న మా ఊరినుంచీ వచ్చి, నన్ను మా ఊరు తీసికెళ్ళి, అక్కడ ఆడుతున్న లవకుశ సినిమా చూపించారు. సినిమాలంటేనే గిట్టని మా నాన్న నాకు జీవితం లో చూపించిన ఒకే ఒక్క సినిమా అది! తరువాత ఈ అనుభవం గురించి ఆలోచించుకొని, “ఆ..కాకతాళీయం అయి ఉంటుంది లే!”, అని కొట్టి పారేశాను. ఈ సంఘటన లో భవిష్యత్తు గురించి చెప్పే విద్య నాకు తెలియదని చెప్పక్కర్లేదు.
పెద్దయ్యాక కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన తాత్విక వ్యాసాలు కొన్ని చదివాను. వాటిలో ఆయన మానవాతీత శక్తులు ఉండవచ్చుననీ, మనం ఈ విషయాన్ని శాస్త్రీయ దృక్పధం తో, ఓపెన్ మైండ్ తో చూడాలనీ రాశారు. ఆయన తనకు జరిగిన ఒకటిరెండు అసాధారణ అనుభవాలను కూడా పంచుకొన్నారు.(ఆయన కు కలిగిన అనుభవాల లో Out of body experience ఒకటి ఉంది . తరువాతి కాలం లో సైంటిస్ట్ లు దీనికి శాస్త్రీయం గా వివరణ ఇవ్వగలిగారు.)
ఆయన లాంటి హేతువాదీ, మార్కిస్టూ వెలిబుచ్చిన అభిప్రాయాలతో, నేను అలౌకిక అనుభవాల గురించి సందేహం లో పడ్డాను. ఆయన “యూరీ గెల్లర్” అనుభవాల గురించీ, మరణానంతర జీవితం గురించిన కొన్ని అమెరికన్ వార్తా వ్యాఖ్యల గురించి కూడా రాశారు. అయితే అమెరికన్ పత్రికల వ్యాపారీకరణ తెలిందే కాబట్టీ నేను ఆ కథనాల కి పెద్ద విలువ ఇవ్వలేదు. పత్రిక అమ్ముకోవటం కోసం రాసిన కట్టుకథలు గానే వాటిని చూశాను. కుటుంబరావు గారి ప్రకారం…
“ఈ విశ్వం స్థల కాలాల నాలుగు కొలత (డైమన్షన్) లతో పాటు, బుధ్ధి కొలతలో కూడా పరిణామం చెందింది. అంటే బయట విశ్వం లొ ఎక్కడో ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది. ఈ బుధ్ధి లేక ఇంటెలిజెన్స్ విశ్వం తో పాటు పరిణామం చెందుతూ వస్తోంది. మొదట్లో జీవపరిణామం లో,ఆదిమ దశ లో ఉన్న మానవుడికి ఈ బుధ్ధి నేరు గా సహాయం చేసేది. ఆ సహాయం అతీంద్రియ శక్తుల రూపం లో ఉండేది. కాబట్టీ ఆ రోజుల్లో అతీత శక్తులు చాల సాధారణం గా ఉండేవి. తరువాత మనిషి మేధ పెరిగే కొద్దీ, వాటి అవసరం మనిషికి తీరిపోయింది. మనిషి కి ఈ అతీత శక్తుల మీద అదుపు లేనట్లు కనిపిస్తుంది. అవి కావాలనుకొంటే ఓ మనిషిలో ప్రత్యక్షమౌతాయి..లేకపోతే లేదు.”
కుటుంబ రావు గారి బుధ్ధి కొలత ప్రతిపాదన ఆ రోజులలో విమర్శలను ఎదుర్కొంది. ఆయన హేతు వాద మరియూ మార్క్సిస్ట్ అర్హతల పైన కొందరు సందేహాలు వెలిబుచ్చారు. అయితే ఆయనది కేవలం ప్రతిపాదన మాత్రమే. అది శాస్త్రీయ సిధ్ధాంతం గా అంగీకరించబడాలంటే దానిని ప్రపంచం లో మనం పరిశీలించదగిన ఒక విషయం లో నిరూపించాలి. ఆయన అలా చేయలేక పోయారు. తన ప్రతిపాదనని ఆయన అమెరికా లో ఉండే తన స్నేహితులైన కొందరు భౌతిక శాస్త్రవేత్తలతో కూడా పంచుకొని, దాని నిరూపణ కి ఏదైనా ఒక ప్రాతిపదిక దొరుకుతుందేమో అడిగారు. ఆయన ప్రతిపాదన ఇప్పటి క్రియేషనిస్ట్ సిధ్ధాంతానికి దగ్గర గా ఉన్నట్లు నాకు తరువాత అనిపించింది.
అప్పుడప్పుడూ మన కు తారస పడే, మాధ్యమాలలో కనిపించే, మహిమలు నాకు ఒక ద్వైధీ భావాన్ని కలిగించ సాగాయి. వాటిని మూఢనమ్మకాలని కొట్టి పారేయాలా? లేక వాటి గురించి శాస్త్రీయం గా పరిశోధించి తెలుసుకోవాలా? లేక పోతే నిప్పులేకుండా పొగ రాదని వాటిని నమ్మాలా?
మనం వింటూ ఉండే అతీత శక్తులలో కొన్ని: “ఎదుటి వారి ఆలోచనలను తెలుసు కోవటం, వస్తువులను చూపులతో వంచటం, శరీరం ఇనుప వస్తువులను ఆకర్షించటం, గాలిలో తేలటం, భవిష్యత్తు గురించి చెప్పటం, మరణానంతర జీవితం అనుభవం లోకి రావటం, చనిపోయిన వారిని బతికించటం, శూన్యం లోంచీ వస్తువులను సృష్టించటం, ఇవి కొన్ని మాత్రమే!”
అయితే వీటిలో కొన్నిటిని చేయటానికి భౌతిక ప్రాతిపదిక ఉండవచ్చు. సైన్స్ ఇంకా వీటి మెకానిజం ని కనిపెట్టి ఉండక పోవచ్చు. ఉదాహరణ కి ఎదుటి వారి ఆలోచనలు తెలుసుకోవటం గురించి…
మన ఆలోచనలకు విద్యుతయస్కాంత గుణం ఉంటుంది. మామూలు మనిషిలో ఆలోచన లు గజి బిజి గా ఉంటాయి. కొందరు యోగులు ధ్యానం ద్వారా తమ ఆలోచనలను క్రమబధ్ధీకరించి, వాటి ఇంటెన్సిటీని పెంచుకోగలరు. అలానే వారిమనసు ప్రశాంతం గా ఉన్నపుడు ఎదుటి వారి ఆలోచనల సున్నితమైన తరంగాలని గ్రహించగలరు. అది ఒక పధ్ధతి. కానీ ఇది నిరూపించబడలేదు.భవిష్యత్తు లో సైన్స్ దీనిని నిరూపిస్తుందేమో!
అలానే శరీరం తో ఇనుప వస్తువులను ఆకర్షించటం అనేది నాకు తెలిసిన ఒక వ్యక్తి చేస్తాడు. శాస్త్రజ్ఞులు దీనిని ఇంకా అర్ధం చేసుకోవలసి ఉంది.
ఈ మధ్య “మన భౌతిక ప్రపంచం అవతల మన సైన్స్ ఎప్పటికీ చేరలేని అధిభౌతిక ప్రపంచం ఉంటుంది”, అని నేను విశ్వసించటం ప్రారంభించాను. దీనికి రెండు కారణాలు.
1. ఈ విశ్వం అనేది కారణ రహితమైన ఒక స్థితి నుంచీ పుట్టిందని శాస్త్రజ్ఞుల మధ్య ఉన్న ఒక అభిప్రాయం. విశ్వానికి ఐదో కొలతో , ఆరో కొలతో ఉన్నట్లైతే దానిని మన సైన్స్ ఎప్పటికీ నిరూపించలేదు. అలాంటి ఐదో కొలత గురించి సైన్స్ కేవలం ఊహాగానం మాత్రమే చేయగలదు. అలానే విశ్వ సృష్టి స్థల కాలాల ఆవల జరిగిందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. స్థల కాలాలు లేకుండా జరిగిన విశ్వసృష్టిని శాస్త్రీయ నిరూపణ ల పరిధి లోకి లాక్కు రావటాన్ని ఊహించటం కష్టం.
2. ఇక రెండవ కారణం, క్వాంటం తీరీ లాంటివి, కారణ రహితమైన “వాక్యూం ఫ్లచుయేషన్” వంటి వాటిని అంగీకరిస్తున్నాయి. దీని ప్రకారం ఎలక్ట్రాన్ లాంటి కణాలు ఏ కారణం లేకుండానే శూన్యం లోంచీ పుట్టి, మళ్ళీ శూన్యం లోనే కలిసిపోతాయి, బాబా గారు శూన్యం లోంచీ విభూతి తీసినట్లు. ఇలాంటి విషయాలను “ఐదో డైమన్షన్” లేకుండా వివరించటం సాధ్యం కాదు. కానీ ఐదో డైమన్షన్ లోకి మనిషి కి ప్రవేశం లేదు. కాబట్టీ వీటిని నిరూపించటం మనిషికి సాధ్యపడక పోవచ్చు.కాబట్టీ మనిషి ఎప్పటికీ అనుభవించలేని అధి భౌతిక జగత్తు ఒకటి ఉంటుంది. ((ఐతే ఈ అధి భౌతిక జగత్తు గురించి ఎవరేమి చెప్పినా నమ్మేయాలా? ఈ అధి భౌతిక ప్రపంచం లోనే దేవుడు ఉండి సృష్టిని శాసిస్తున్నాడంటే నమ్మేయాలా? అధి భౌతిక ప్రపంచ నియమాలు భౌతిక ప్రపంచ నియమాల లా ఉంటే , “అలా నమ్మ కూడదు”. కానీ సైన్స్ దీనిని నిరూపించలేదు. ఎందుకంటే మనిషికి అక్కడ ప్రవేశం లేదు.స్థల కాలాలే లేని చోట దేవుడు ఒక మోటివేషన్ తో ఉంటాడా?ఆయన ఎలక్ట్రాన్లూ, పాజిట్రాన్లూ వంటి చిన్న కణాలను సృష్టించే విషయం లో మాత్రమే ఎందుకు జోక్యం చేసుకొంటాడు. మిగిలి విశ్వమంతా మనకు తెలిసిన రూల్స్ ప్రకారమే ఎందుకు నడుస్తుంది?))
అలానే, ఎలక్ట్రాన్లు ఒక చోట మాయమై, కొంచెం దూరంలో ప్రత్యక్షమౌతాయి. దీనినే క్వాంటం జంప్ అంటారు. క్వాంటం తీరీ చదివితే ఈ విశ్వమంత ఒక మాయ అనిపిస్తుంది. మౌలిక కణాలన్నీ(పదార్ధం అంతా) , శక్తి తో చేయబడి ఉన్నాయి. ప్రస్థుతం ఒక కణం ఉందా లేదా అనేది ఆ కణం యొక్క భూత భవిష్యత్ స్థితుల పై ఆధారపడి ఉంటుంది.
సరేనండీ, నేను అధిభౌతిక ప్రపంచం గురించి నమ్మటం మొదలు పెట్టాను. అయితే ఏమిటంట? నిజజీవితం లో చూపబడే మహిమలన్నీ మోసాలే అవ్వనక్కరలేదు. వాటిలో కొన్నిటికి మూలాలు ఈ అధిభౌతిక ప్రపంచం లో ఉండవచ్చు. ఉదాహరణకి శూన్యంలోంచీ వస్తువులను తీయటం, శూన్యం లోంచీ ఎలక్ట్రాన్లు పుట్టవచ్చు అని సైన్స్ చెప్పిన దానికి దగ్గరగానే ఉంది కదా!
ఇక ఈ మధ్య నేను పరమహంస యోగానంద గారు రాసిన, “ఒక యోగి ఆత్మ కథ” అనే పుస్తకం చదివాను. ఆ పుస్తకం నిండా నేను పైన చెప్పిన అనేక మహిమలు ఉన్నాయి. అందులో యోగానంద గారు ఆ మహిమలకు సైన్స్ పరమైన సమర్ధన కూడ ఇచ్చారు. వాటిని వివరించటం లో ఆయన స్వరం చాలా నమ్మదగినదిగా ఉంది. దానితో నేను, “ఏమో ఈ మహిమలు కూడా నిజమేనేమో”, అనే స్థితి కి చేరాను.”ఆ మహిమలకు భౌతికం గా ఇంకా కని పెట్టబడని కారణం ఉండవచ్చునేమో. లేకపోతే, ఈ మహిమల మూలాలు అధిభౌతిక జగత్తులో ఉండ వచ్చునేమో?! “గొప్ప యోగులు అధిభౌతిక జగత్ లోని నియమాల ద్వారా మహిమలను చూపించగలరేమో!
కొన్ని రోజుల తరువాత ఇంటర్నెట్ లో యోగానంద గారి గురించి ఒక కెనడియన్ రాసిన ఒక పుస్తకం లోని విషయాలు చదివాను. ఆయన యోగానంద గారి గురించి పూర్తి నెగటివ్ ధోరణి లో రాశారు. మొత్తానికి యోగానంద గారు చెప్పినవి చాల వరకూ తప్పులూ లేక అబధ్ధాలు అన్నట్లు గా రాశాడు. అది చదివిన తరువాత నాకు కొన్ని వ్యతిరేక ఆలోచనలు రావటం మొదలయ్యాయి. “గాలిలోంచీ వస్తువులు సృష్టించేవారు, మానవులందరికీ సరిపడా ఆహారం ఎందుకు సృష్టించరు?అలా అయితే ఎంతమందో అన్నార్తులకి ఆకలి బాధ తప్పించిన వారవుతారు కదా? అలానే భవిష్యత్తు గురించి చెప్పేవారు,భూకంపాలగురించి ఎందుకు చెప్పరు?ఎదుటి వారి ఆలోచనలనూ, భవిష్యత్తునూ తెలుసుకొనగలిగిన వారు, రాబోయే తరాల సైంటిస్ట్ ల మెదళ్ళలోని సిధ్ధాంతాలను పసిగట్టి, ముందుగానే శాస్త్రీయఆవిష్కారాలు ఎందుకు చేయరు? అంటే ఈ విద్యలన్నీ కేవలం మాజిక్కేనా? మోసమేనా?
ఈ ఆలోచనల తరువాత, నాకనిపించిందేమంటే..
–ఎవరైనా మహిమలను ప్రదర్శిస్తే వాటిని వెంటనే కొట్టిపారేయవలసిన అవసరం లేదు. అలా అని వెంటనే నమ్మవలసిన అవసరం లేదు. ఆ మహిమను అంగీకరించటానికి కొలబద్ద సైన్సే. ప్రయోగ శాల పరిస్థితులలో వారు అ మహిమను చూపించగలిగితే, సైన్స్ అది ఇంకా తెలుసుకోబడని విషయం గా అంగీకరించటనికి సిధ్ధం గానే ఉంటుంది. తమ శక్తుల మీద తమకు అదుపు లేని వారు, ఆ శక్తులు తమకు ఉన్నపుడే చూపించవచ్చు. నాకు తెలిసిన ఒక మనిషికి అయస్కాంత శక్తి ఉంది అని చెప్పాను కదా? ఆ మనిషిని శాస్త్రజ్ఞులు పరిశీలించి, అతని శక్తి కి కారణం తెలియలేదనీ. దాని పై ఇంకా పరిశోధనలు చేయాలనీ ఒప్పుకొన్నారు. కారణం లేకుండా జనించిన ఎలక్ట్రాన్లనే ఒప్పుకొన్న సైన్స్, పరిశోధనల తరువాత అతని అయస్కాంత శక్తికి కారణం తెలియకపోతే, ఆ విషయాన్ని కూడా ఒప్పుకొంటుంది. చివరికి చెప్పవలసిన విషయమేమిటంటే, మహిమల గురించి ప్రధమం గా నమ్మ క పోవటమే మంచిది. అలా నమ్మకపోవటం అనేది నిజానికి దగ్గర గా ఉంటుంది. ఏ కోటికో, ఒక మహిమ నిజమైనా, దానిని సరిగా నిరూపించబడిన తరువాతే నమ్మటం మంచిది.
ఎలక్ట్రాన్లు శూన్యం లోంచీ పుడతాయంటే నమ్ముతాను. శూన్యం లోంచీ అరటి పండు తీశాడంటే, ముందు నమ్మను. ఒక వేళ అదే పనిని ప్రయోగశాల లో చేసి చూపిస్తే అప్పుడు నమ్ముతాను.
మానవ జాతి పయనం ఎటు వైపుకి?
30 ఆగ 2011 అభిప్రాయములు
in సమాజం
ఒక పది సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు అవినీతి పెరిగిపోయింది. సమాజం లో స్వార్ధం ఎక్కువయ్యింది. కళలలో వ్యాపారీకరణ ప్రబలి పోయింది. విద్యా వైద్యం మొదలుకొని అనేక రంగాలలో డబ్బే పరమావధి గా మారిపోయి, సమాజం గుల్లబారిపోతోంది. మనిషి లో మానవత్వ విలువలు తగ్గి, బోలు గా మారాడు.స్వార్థం పెరిగిపొతోంది.
ఈ మార్పులన్నీ రాబోయే రోజులలో, ఇదే దిశ లో మరింత వేగవంతమౌతాయి. ఇవి మెరుగయ్యే పరిస్థితి కనపడటం లేదు. మనిషి పర్యావరణాన్ని దెబ్బతీసి, తన తోటి జీవులకు ఒక పెను ముప్పు గా మారాడు. ఇవన్నీ ఆలోచించినప్పుడు, “అసలు మానవ జాతి మనుగడ ఏమిటి?” అన్న ప్రశ్న మనసు లో తలెత్తటం సహజం.
ప్రస్తుత పరిజ్ఞానం ప్రకారం, “బిగ్ బ్యాంగ్” విస్ఫోటనం తో మొదలైన విశ్వం లో మనిషి ఒక అణు మాత్రుడు. విశ్వం లో జరిగే పరిణామాల వలనో, ఏదో ఒక ఖగోళ ప్రమాదం వలననో (ఏ తోక చుక్కో భూమిని ఢీ కొట్టటం) కూడా మానవ జాతి అంతరించి పోవచ్చు. అలాంటి సందర్భం లో మనిషి చేతి లో ఉన్నది చాలా తక్కువ. ప్రస్తుతం, “శాస్త్రజ్ఞులు అంతరిక్షం లో జరిగే ప్రమాదాలను ఎన్ని సంవత్సరాల ముందు పసిగట్ట గలరు?” అనే ప్రశ్న కు సరైన సమాధానం లేదు.
ఇక మానవ సమాజం విషయానికి వస్తే..
జీవ పరిణామ క్రమం లో ఆలోచనా శక్తి గల మానవుడు పుట్టాడు. జీవులలో కాకతాళీయం గా కలిగే జన్యు మార్పులు, పరిసరాలలో కలిగే మార్పులను తట్టుకోగలిగేందుకు ఉపకరించినప్పుడు, ఆ జాతి వృధ్ధి చెందుతుంది. మనిషి తో పాటు చింపాంజీ లాంటి జంతువులకి కూడా ఆలోచనా శక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే మనిషిలో చేతన (కాన్షస్-నెస్) ఏర్పడి, తన ఆలోచనలను తానే చూసుకోగల ఒక అంతరాత్మ ఏర్పడటం అనేది జరిగింది. ఇతర జంతువులలో ఇది జరగలేదు. ఇలాంటి చేతన వలన మనిషి లో “నేను” అనే ఒక మానసిక కేంద్రం ఏర్పడింది.
ఈ “నేను” మనిషి యొక్క వ్యక్తి గత మనుగడ కి చాలా మేలు చేసిందనే చెప్పాలి. మనిషి తన ఆలోచనా శక్తి తోనూ, తన చేతన తోనూ, భవిష్యత్తు గురించి ఆలోచించి, దానికి తగ్గట్లు ఆహారాన్ని ముందే సమకూర్చుకోవటం, ముందు రోజులలో తన జీవిత భద్రత గురించి ఆలోచించటం చేస్తున్నాడు. అదే సమయం లో నేను అనేది స్వార్ధం గా కూడా పరిణమించింది.
ఈ చేతన వలన మానవ సమాజమే అనేక పరిణామాలను చవి చూసింది. రాజకీయం గా …
రాజరికాలు,భూస్వామ్య వ్యవస్థా పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. సామాజికం గా..కుటుంబ వ్యవస్థా, వావి వరసలూ ఏర్పడ్డాయి. ఆర్ధికం గా… బానిస వ్యవస్థా, భూస్వామ్య వ్యవస్థా పోయి, పెట్టుబడిదారీ వ్యవస్థ బలం గా వేళ్ళూనుకొంది. చాలా మంది పెట్టుబడిదారి వ్యవస్థ లోని పోటీ తత్వాన్ని(కాంపిటిషన్ ని), జీవ పరిణామ సిధ్ధాంతం లోని “మనుగడ కోసం పోరాటం” తో పోలుస్తారు. అయితే,పెట్టుబదీ దారి వ్యవస్థ లో ఉండే కాంపిటిషన్ కీ, జీవ జాతుల పరిణామం లోని “మనుగడ కోసం పోరాటం” కీ సంబంధం లేదు.
జీవ పరిణామం లో జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం గా జరుగుతాయి. ఈ మార్పులు ఎవరో కావాలని రూపకల్పన చేసినవి కావు. అవి పరిసరాల లోని మార్పులను తట్టుకొనేవైతే ఆ జీవులు మనుగడ సాగిస్తాయి. పెట్టుబడి దారి వ్యవస్థలో, వ్యక్తులూ సంస్థలూ గెలవటానికి తగిన మెలకువలను నేర్చుకొంటారు. విజయాలకు పధకాలను వేసి, ప్రణాళికా రూపకల్పన చేస్తారు.
పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.
ఈ విషయం లో శకుని కథ గుర్తుకొస్తుంది. శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు. ఇక్కడ మనుగడ కోసం ఒక్కరికే ఆహారం దక్కేటట్లు చూడటం, పెట్టుబడిదారీ పధ్ధతి కి దగ్గర గా ఉన్నట్లు అనిపిస్తుంది. పరిస్థితులని బట్టి, సామ్య వాద పధ్ధతి నో, పెట్టుబడి దారీ పధ్ధతి నో మానవ జాతి తన మనుగడ కోసం అవలంబించాల్సి రావచ్చు. నలుగురికి సరిపడే ఆహారం ఉన్న చోట్ల, ఒక్క బలవంతుడే మిగిలిన వారి దగ్గర ఆహారాన్ని లాక్కొని తిన్నట్లైతే, మిగిలిన వారు చనిపోతారు. కొన్నాళ్ళకి ఆ బలవంతుడు ఒక్కడే మిగులుతాడు. కానీ తన సమాజం అంతరించిపోయినప్పుడు, ఆ బలవంతుని వ్యక్తి గత మనుగడ కూడా ప్రమాదం లో పడుతుంది (గాలివాన కి కొట్టుకు పోయిన తన ఇల్లు మళ్ళీ కట్టుకోవటానికి అతనికి ఇతరుల సహాయం కావాలి కదా?) సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”.
ఏదైనా జీవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించటానికి, ఆ జాతి లో వైవిధ్యం ఉండటం చాలా ముఖ్యం. ఉదాహరణ కు, అడవులలో పెరిగే లేళ్ళలో మూడు జాతులు ఉన్నాయనుకొందాం. మొదటి ‘లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీ కరువు పరిస్థితులను తట్టుకోలేదు అనుకొందాం. కరువు వస్తే ఆ జాతి మొత్తం తుడిచి పెట్టుకొని పోతుంది. ‘రెండో లేడి జాతి’ లోని లేళ్ళు అన్నీచలిని తట్టుకొనలేవనుకొంటే, బాగా చలి పెరిగిన సంవత్సరం లో ఆ జాతి మొత్తం చనిపోతుంది. అలా కాకుండా, మూడవ లేడి జాతి లో సగం చలిని తట్టుకొన లేని లేళ్ళూ, సగం కరువును తట్టుకొనలేని లేళ్ళూ ఉన్నాయనుకొంటే, కరువు వచ్చినప్పుడు, చలి లేళ్ళు బతుకుతాయి. మంచు పడినప్పుడు కరువు లేళ్ళు బతుకుతాయి. మొత్తానికి మూడవ జాతి మిగిలిన రెండు జాతుల కంటే ఎక్కువ కాలం మనగలుగుతుంది.
మానవజాతి లో కూడా ఈ వైవిధ్యం ముఖ్యం. ఒక సమాజం లో అందరూ త్యాగమూర్తులే ఉంటే, ఆ సమాజం లో వ్యక్తి గత స్థాయి లో అందరూ నష్ట పోతారు..చివరికి చనిపోతారు. అప్పుడు మొత్తం సమాజమే నాశనమైపోతుంది. శకునికి ఇచ్చిన ఆహారాన్ని శకుని కూడా త్యాగం చేసి, అతని అన్న దమ్ములలో ఎవరూ ఆ ఆహారాన్ని ముట్టకుండా ఉంటే, శకుని వంశం మొత్తం నాశనమయ్యేది. అన్ని జీవజాతులలోనూ ఈ రకం త్యాగ మూర్తులు ఉంటాయి. ఉదాహరణ కి దుప్పులలో కొన్ని దుప్పులు, పులి వెంటపడి నప్పుడు, గుంపులోని మిగిలిన దుప్పుల కంటే కావాలని వెనకపడి, పులి నోట పడి, త్యాగం చేస్తాయి.
అలానే ఒక సమాజం లో అందరూ తమ వ్యక్తి గత స్వార్ధం చూసుకొనే వారైతే, ఆ సమాజం నాశనమైపోతుంది. తరువాత సమాజం లేని వ్యక్తి కూడా అంతరిస్తాడు.
కాబట్టీ, మానవ జీవ జాతి మనుగడకి, స్వార్థ పరులతో పాటు, త్యాగ జీవులు కూడా సమపాళ్ళలో కావాలి. కానీ, మనిషి లో ఏర్పడిన చేతన లేక నేను అనే కేంద్రం వలన, వ్యక్తి గత మనుగడ చూసుకొనే వారు ఎక్కువైతే, మానవజాతి అంతరించిపోతుంది. అంటే మనిషి లో ఈ అంతశ్చేతనను ఏర్పరిచిన జన్యు మార్పు, తాతకాలికం గా అతని వ్యక్తి గత మనుగడ కు ఉపయోగ పడినా, దీర్ఘ కాలం లో అతని సామూహిక మనుగడకి చేటు తెచ్చినట్లు భావించాలి. మనిషి అత్యాశ వలన మానవ జాతి మనుగడకే కాక, ఇతర జీవ జాతుల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది. సమాజం లేని వ్యక్తి లేనట్లే, ఇతర జీవ జాతులు లేని మానవ జాతి కూడా ఇంకా వేగం గా అంతరించి పోతుంది.
మానవ జాతి కష్టాలన్నీ మనిషి చేసే కృత్రిమమైన పనుల వలననే అనే ఒక వాదం ఉంది. కానీ మనిషి ప్రకృతి లో ఒక భాగం. మానవ జాతి పుట్టమూ, అంతరించటమూ కూడా ఈ విశ్వ పరిణామం లో ఒక భాగమే.విశ్వ పరిణామం లో భాగమైనదంతా సహజమైనదే! కాబట్టీ మానవ జాతి అంతం కూడా సహజమైనదే (రాక్షస బల్లుల అంతం సహజమైనది కాదా?) మనిషి ఆలోచనలన్నీ సహజమైనవే. వాటిలో కొన్నిటి వలన వినాశనం కలగవచ్చు. జీవ పరిణామ క్రమంలో, పక్షులు ఏర్పడక ముందు, జీవులు ఎగిరేవి కావు. పక్షులు ఏర్పడిన తరువాత, అప్పట్లో జీవులు ఎగరటం అసహజం గా అనిపించి ఉండవచ్చు. కానీ, ఈరోజు, ఎగిరే పక్షులు సహజమైనవే. అలానే,ఇప్పటి వరకూ మరే జీవీ చేయనట్లు, తన స్వార్థం కోసం నిత్యం ఆలోచించే మానవుడూ సహజమైనవాడే! అతను ఎంత కాలం మనుగడ సాగిస్తాడనేది వేరే ప్రశ్న.
మనిషి వ్యక్తిగత మనుగడ, సమాజం యొక్క దీర్ఘ కాలిక మనుగడ ను బలపరిచే దిశ లో ఉండాలి. అలానే, సమాజం మనుగడ, మనిషి వ్యక్తిగత మనుగడను వృధ్ధి చేసేది గా ఉండాలి. ఈ రెండు రకాల మనుగడలు పరస్పర విరుధ్ధమైన దిశలలో ఉన్న నాడు మానవ జీవ సమాజం అంతరిచే దిశలో పయనిస్తుందనుకోవాలి. మొత్తం మీద, సమాజ మనుగడా, వ్యక్తి గత మనుగడా కూడా మానవ జీవ జాతి మనుగడ కి దోహదం చేసే విధం గా తగు పాళ్ళలో లేని నాడు (ఈ లోపు మనిషిలో ఏవైన సకారాత్మకమైన జన్యు మార్పులు జరిగితే తప్ప) మానవజాతి అంతరిస్తుంది.మనిషి సాంకేతికం గా ఎంత అభివృధ్ధి చెందినా, చివరికి తన జాతి శ్రేయస్సును దృష్టి లో పెట్టుకొనక పోతే అంతరించిపోవటానికి సిధ్ధం గా ఉండాలి. రాకెట్లూ, రోబొట్లూ మొదలైన మనిషి చేసుకొన్న ఆట బొమ్మలేవీ చివరికి అతనిని రక్షించలేవు. ఈ సందర్భం లో “ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు” అనే మహాకవి పలుకులను గుర్తు చేసుకోవటం మంచిది.
విశ్వపరిణామం లో నియమాలు, శాస్త్రవేత్తల దేవుడు
02 సెప్టెం 2011 అభిప్రాయములు
in తత్వశాస్త్రం, విశ్వమూ దేవుడూ
“ఐన్ స్టీన్” మహాశయుడు “హైజెన్ బర్గ్” యొక్క అనిశ్చితి సిధ్ధాంతం గురించి, “దేవుడు పాచికలు వేయడు”, అని అన్నట్లు చెబుతారు. ఇక్కడ “ఐన్ స్టీన్” మాట్లాడేది ఆస్తికుల దేవుడి గురించి కాదనీ, విశ్వం లోని నియమాలనే ఐన్ స్టీన్ దేవుడి గా పరిగణిస్తున్నాడనీ తరువాత ఆయన వ్యాఖ్య కు భాష్యం చెప్పడమైనది.
విశ్వ నియమాల సంగతి కొస్తే..
విశ్వం యొక్క రహస్యాల గురించి ఆలోచించే వారు అడిగే రెండు ప్రశ్నలు
1.”ఫలానా విషయం ఎలా జరుగుతుంది?”
2.”ఫలానా విషయం ఎందుకు జరుగుతుంది?”
ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రక్రియ లో శాస్త్రవేత్తలు ప్రకృతి ని పరిశీలించి పరిశోధిస్తారు. ఈ పరిశోధనలో విశ్వం పని తీరుని తెలిపే అనేక సూత్రాలూ, నియమాలూ పుడతాయి. ఇవన్నీ విశ్వం యొక్క స్వభావాన్ని విశదీకరించేవే.
“ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్న కి సైన్స్ ఎలాగొలా తంటాలుపడి సమాధానం చెప్తుంది. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం.(ఇక్కడ ఎందుకు అంటే “ప్రయోజనం లేక పర్ పస్ ఏమిటి?” అని కాదు. ప్రయోజనాలు మనుషులకూ జీవులకూ ఉంటాయి. ఏ వ్యక్తిత్వమూ లేని విశ్వానికి ఒక పర్పస్ ఉండదు).
ఎందుకు విశ్వం ఇలానే ఉంది? ఎందుకు వేరే సవా లక్ష విధాలుగా లేదు? గురుత్వాకర్షణ ఎందుకు ఉంది? ఎలెక్ట్రాన్లూ ప్రోటాన్లూ, న్యూట్రాన్లూ అలానే ఎందుకు ఉన్నాయి..? ఉదాహరణ కు న్యూట్రాన్లు ప్రోటాన్లచుట్టూ ఎందుకు తిరగవు..? మొదలైన ప్రశ్నలు ఈ “ఎందుకు?” ప్రశ్నలు. వీటన్నిటికి విశ్వం “ఎలా” మొదలైంది అన్న ప్రశ్న లో సమాధానం ఉండవచ్చు. ప్రాధమిక స్థాయిలో “ఎందుకు?” అనే ప్రశ్నకు, ఉన్నత స్థాయి లో “ఎలా?” అనే ప్రశ్న సమాధానం ఇస్తుంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషిస్తూ, శాస్త్రవేత్తలు ప్రాధమిక స్థాయిలో ఒక నియమాన్ని కనిపెడతారు. తరువాత ఈ నియమం ఎందుకు అలానే పని చేస్తుంది అన్న ఒక ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి సమాధానం గా ఉన్నత స్థాయి లో ఎక్కువ సార్వజనీన మైన ఇంకొక నియమం వెలుగులోకి వస్తుంది. ఈ నియమాల స్థాయి పెరుగుతూ పోయి ఏ బిగ్ బాంగ్ అనబడే ఎయిర్ పోకెట్ కో కొట్టుకొని ఆగిపోతాయి.
ఈ విషయాన్ని ఒక ఉదాహరణ ద్వారా చెబితే బాగా అర్ధమవ్వ వచ్చు..
“మనిషి కి ఆలోచనా శక్తి ఎందుకు ఉంది?” అనేది ఒక ప్రాధమిక ప్రశ్న.
“జీవపరిణామం లో భాగం గా ఏర్పడింది”- జవాబు.
“జీవపరిణామం ఎందుకు జరిగింది?”
“అనేక కారణాలు..క్లుప్తం గా..యాదృచ్చిక జన్యమార్పుల వలన జరిగింది”
“జన్యు మార్పులు ఎందుకు జరుగుతాయి?”
“అనేక విధాలు..సూర్య రశ్మి లోని అతి నీలలోహిత కిరణాలు జన్యు పదార్ధాన్ని ప్రభావితం చేయటంవలన జన్యు మార్పులు జరుగుతాయి”
“సూర్య రశ్మి వలన జన్యువులు ఎందుకు మారుతాయి?”
“స్థిరత్వం కోసం. స్థిరత్వం అనేది ఈ విశ్వ నియమం కదా!”
“స్థిరత్వమే ఎందుకు ఈ విశ్వ నియమం అయింది. అస్థిరత్వం ఎందుకు ఈ విశ్వ నియమం కాలేదు?”
“నీ తలకాయ! అడ్డగోలు గా మాట్లడకు. నీ చొప్పదంటు ప్రశ్నలూ..నువ్వూ..!”.
పైన ప్రశ్నలన్నీ “ఎందుకు” ప్రశ్నలే. ఈ ఉదాహరణ లో, దిగువ స్థాయి లో ఎందుకు ప్రశ్నలకి పై స్థాయి లో “ఎలా పనిచేస్తుందో చెప్పటం” ద్వార జవాబు ఇవ్వటం గమనించ వచ్చు. “సృష్టి అలానే ఎందుకు ఉంది?, ఇంకా అనేక విధాలుగా ఎందుకు లేదు?” అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం రావటం లేదు. “సృష్టికి సంబంధించిన పై స్థాయి నియమం సృష్టి ఇతరమైన అనేక విధాలు గా ప్రవర్తించటాన్ని నిరోధిస్తోంది”, అనే ఒక విషయం మాత్రం పరోక్షం గా అర్ధమౌతోంది. కాబట్టీ ఈ “ఎందుకు?” కి అసలైన సమాధానం కోసం మనం “మనిషి తెలివి” నుంచీ బిగ్ బ్యాంగ్ వరకూ పోవలసి వచ్చింది. కానీ “ఈ ప్రపంచం ఈ నియమాల ద్వారానే ఎందుకు నడుస్తోంది?”, అన్న ప్రశ్న కు సమాధానం దొరక్లేదు. కొంచెం పై స్థాయి లో చూస్తే, ఈ నియమాలన్నీ విశ్వాన్ని కొంచెం మెరుగు గా వర్ణించే వివరణలే! ఈ విశ్వం ఎందుకు ఉంది అనే ప్రశ్నకు సమాధానాలు కావు. “ఈ నియమాల ప్రకారమే విశ్వం ఎందుకు పని చేయాలి?”, అనే ప్రశ్నకు సమాధానాలు అసలే కావు.చివరికి ఏ నియమాలూ పని చేయని సింగులారిటీ(బిగ్ బ్యాంగ్ ఆది స్థితి) కి చేరుకోవలసి వస్తుంది!
చివరిగా, “విశ్వం ఏమీలేని స్థితి నుంచీ పుట్టింది” అని ఈ మధ్య కాలం లోని కొందరు శాస్త్రవేత్తల వాదన. ఎందుకంటే “సం థింగ్” అనేది “న థింగ్ కంటే” స్థిరమైనది అట. ఏమీ లేని “న థింగ్” లో స్థిరత్వం అనే నియమం మాత్రం ఎందుకు ఉంటుంది? ఒక వేళ అటువంటి నియమం ఉంటే, అది ఎందుకు ఉంది ( ఎవరో ఆ నియమాన్ని శాసనం చేసినట్లు)? ఏమీ లేని స్థితి లో, “స్థిరత్వం నుంచీ ఇంకా అస్థిరత్వం వైపుకి పోవచ్చు కదా?” ఏమీ లేని స్థితి స్థిరమైనది ఎందుకు కాదో, ఏదో ఉన్న స్థితి ఎందుకు స్థిరమైనదో ఈ శాస్త్రవేత్తలు చెప్పరు. “తాడు దొరికింది గేదేను కొనమన్నట్లు”, స్థిరత్వ సిధ్ధాంతం ఉంది కాబట్టీ దానిని సృష్టి జననానికి అన్వయించినట్లుంది.
నాకు వచ్చిన ఈ సందేహాలలో కొన్నైనా తప్పు అయే అవకాశం ఉంది. తప్పు అయితే అదేమిటో వివరిస్తారు కదా?
ఈ నాటి కుటుంబ వ్యవస్థ మగవాళ్ళ కి వరమా? శాపమా?
06 అక్టో 2011 అభిప్రాయములు
కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలంటే దాని మూలాల లోకి పోవాలి. కాబట్టీ కొంచెం ఓపిక పట్టండి..
మనిషి ప్రాచీన కాలం లో జంతువులాగానే జీవించే వాడు. మందలు మందలు గా ఉండే జంతువుల లా నే మనుషులు కూడా గుంపులు గుంపులు గా జీవించే వారు.మనిషి కోతి జాతినుంచీ పరిణామం చెందాడనేది జీవ పరిణామ సిధ్ధాంతం ప్రకారం తెలిసిన విషయం. జంతువు ల లో స్త్రీ పురుష సంబంధాలు many to many గా ఉండేవి. ఒక ఆడ జంతువు అనేక మగ జంతువు ల తో మైధునం జరిపేది. అలానే ఒక మగ జంతువు అనేక ఆడ జంతువుల తో! వాటికి వావి వరుసలు ఉండేవి కాదు. క్షీరదాలన్నీ తమకు పుట్టిన జంతువులతో మైధునం జరుపుతాయి. అలానే ఒకే జంతువు కి పుట్టిన ఆడ మగా జంతువుల మధ్య కూడా మైధునం జరిగేది. మైధునం విషయం లో ఆడ మగా మధ్య ఒక తేడా ఉండేది. ఆడ జంతువు కొన్ని కాలాల లో మాత్రమే పరిమితమైన మగ జంతువుల తో మైధునం జరిపేది. దానికి అండం విడుదల ఆ కాలం లో మాత్రమే జరిగేది. కాబట్టీ, అది తన అండాన్ని, మగ జంతువులలో తనకోసం పోటీ పడి గెలిచిన జంతువు కి సమర్పించుకోవలసి వచ్చేది. అంటే మగ జంతువులలో powerful జంతువు మాత్రమే మైధునానికి అర్హత పొందేది. ఈ ప్రవర్తన క్రమం గా జన్యువులలో నిక్షిప్తమై rule of attraction గా తయారయింది. మనుషులలో కూడా ఆడవారు హోదా డబ్బూ ఉన్న వారిని ఇష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం!
మనిషి homosepian గా మారే దశ లో రెండు ముఖ్యమైన జన్యు మార్పులు జరిగాయి. ఒకటి మనిషిలో selfish gene ఏర్పడటం. దీని వలన మనిషికి “ఆలోచనలూ, జ్ఞాపకమూ, అంతరాత్మ ” ల తో కూడిన ఒక centre ఏర్పడింది. ఈ centre నే నేను లేక అహం అన్నారు. రెండవ జన్యు మార్పు “మనిషి లో ఇతర మనుషుల తో భావోద్వేగ సంబంధాలను పటిష్టపరిచే భావోద్వేగ సున్నితత్వం” ఏర్పడటం.
ఈ రెండు మార్పుల వలనా మానవ సంబంధాలలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. ఒక జంతువు తనకు పుట్టిన పిల్ల జంతువు ని maternal instinct తో సాకుతుంది. కానీ ఆ పిల్ల జంతువు పెద్దదైన తరువాత, దాని తల్లికీ , దానికీ ఏ విధమైన మాతృత్వ సంబంధమూ ఉండదు. ఆ రెండూ మైధునం కూడా చేస్తాయి. జంతువు ల లో మాతృత్వం అనేది ఎక్కువ గా instinct గానూ, తక్కువ గా భావోద్వేగపరం గానూ ఉంటుంది. పై పెచ్చు వాటి లో జ్ఞాపకమూ, ఆలోచన, చేతనా, అంతరత్మా లేక నేను అనేవి ఉండవు. కాబట్టీ పిల్ల జంతువు పెద్దది అయినపుడు దానిలో దాని తల్లి జంతువు కి వేరొక, “వయసు లో ఉన్న జంతువే” కనపడుతుంది కానీ, తన మాతృత్వపు భావోద్వేగపరమైన బిడ్డ కనిపించదు..
కానీ మనిషి లో బిడ్డను పెంచిన చిన్నప్పటి తీవ్రమైన మాతృత్వపు భావోద్వేగాలు జ్ఞాపకం లో భాగమౌతాయి. తద్వారా మనిషి యొక్క “నేను” లోనూ, మనిషి వ్యక్తిత్వం లోనూ భాగమౌతాయి. మనిషి ఈ భావోద్వేగాలనుండీ బయటపడి తన బిడ్డను, వేరొక వయసొచ్చిన మనిషి గా చూడలేదు. దీని వలన మనిషి తన వారసులనూ, బిడ్డలనూ పెద్దయిన తరువాత కూడా బిడ్డలు గా పెంచటం నేర్చుకొన్నాడు.
గుంపులు గా కలిసి ఉన్న మనుషులలో ఈ విధం గా వారసులను పెంచటం మొదలవ్వటమే కాక వారిని తమ ఉనికికీ, తమ జాతికీ extensions గా గుర్తించటం మొదలయింది. ఇదే సమయం లో స్త్రీల రుతు చక్రం దాని seasonality ని కోల్పోయి periodic గా మారింది. దీని వలన స్త్రీలకి జంతువు ల లో కంటే మగవారి తో సంబంధాల విషయం లో degree of freedom పెరిగింది.
బిడ్డల విషయం లో జంతువుల నుంచీ మనిషి వరకూ జరిగిన పరిణామమే, ఒకేతల్లి బిడ్డల విషయం లోనూ జరిగింది. ఈ విధం గా పెద్ద వారికీ బిడ్డలకీ, ఒకే తల్లి బిడ్డలకీ మధ్య దాంపత్య సంబంధాలు నిషిధ్ధమయ్యాయి. “జన్యుపరం గా ఒకే రక్తం లో సంబంధాలు నాసి రకమైన పిల్లలను కలిగించటం వలనకూడా ఈ దాంపత్య సంబంధాలను వివిధ సంస్కృతులు నిషేధించాయి”, అనే వాదన ఒకటి ఉంది. కానీ సంస్కృతులు “జన్యు పరం గా నష్ట దాయక మైన మేనరికం”, మొదలైన సంబంధాలను ఆమోదించాయి. కాబట్టీ ప్రాచీన సంస్కృతికి, “ఈ నష్టాలను దృష్టి లోఉంచుకొని, ఆయా సంబంధాలను నిషేధించే విజ్ఞానం ఉంది” అనిపించదు.
మొదట ఒక్కో ఆడదీ అనేక మగవారికి బిడ్డలను కనేది. మగవారు తమ బిడ్డలు ఎవరో కూడా పట్టించుకొనే స్థితి ఉండేది కాదు. అమ్మ యొక్క అన్న కానీ తమ్ముడు కానీ బిడ్డలను సాకేవాడు. ఎందుకంటే ఒక ఆడ దానికి అనేక మగవాళ్ళు బిడ్డలను కనే వారు. అదే మగవాళ్ళు మిగిలిన ఆడవారికి కూడా బిడ్డలను కనే వారు. అందుకే anthropology ప్రకారం “మేన మామ” అనేది నాన్న అనే దానికన్నా పురాతన మైన సంబంధం.
మనుషుల అంతశ్చేతన ఏర్పడి “తన” అన్న భావన కలగటం మొదలుపెట్టిన తరువాత, మనిషి “తన” పిల్లలను కూడా గుర్తించటం మొదలు పెట్టాడు. అయితే ఒక్కోసారి తన పిల్లలను కూడా గుర్తు పట్టటం కష్టం కావచ్చు. పిల్లల పోలికలన్నీ తల్లివే అయి ఉండవచ్చు. దీని వలన వేరే మగ వాడి పిల్లలను కూడా తన పిల్లలే అనే భ్రమ లో ఉండవచ్చు. పైగా తన పిల్లలను మిగిలిన పిల్లలతో కలిపి ఆదది పెంచటం వలన వారి మనుగడ కి నష్టం ఉండవచ్చు. వీటన్నిటి దృష్ట్యా మగవాడు ఆడ దానితో కలిసి కుటుంబం అనే ఒక వ్యవస్థ ని ప్రారంభించాడు.
ఆడ వారు ప్రకృతి స్వభావ రీత్యా తమ అండాన్ని ఒక short listed mate తోనే పంచుకోవాలి. కాబట్టీ ఆడవారు ఒకే సమయం లో అనేక సంబంధాలు కలిగి ఉండే వారు కాదు. కానీ మగవాడికి ఉన్న అపరిమితమైన వీర్య కణాల దృష్ట్యా అతను కుటుంబం లోనే ఉంటూ అనేక ఆడ వారి తో సంబంధాలు కలిగి ఉండేవాడు.
సమాజం లోని అధికార సంబంధాలకు (power equations) అతీతం గా ఇది జరిగేది. కాలమాన పరిస్థితులని బట్టి మానవ సమాజాల్లో ‘మాతృస్వామ్యం’ లేదా ‘పితృ స్వామ్యం’ ఉంటూ ఉండేది. సాధారణం గా యుధ్ధాలు లేని స్థిరమైన సమాజాలలో మగవాడి అవసరం అంతగా ఉండేది కాదు. అలాంటి సమాజాలలో, పిల్లలను కనటానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా మాతృస్వామ్యం అమలు లో ఉండేది. యుధ్ధాలు ఉండే అస్థిర సమాజం లో మగ వారి దేహ దార్ఢ్యానికి ఉండే ప్రాముఖ్యత దృష్ట్యా, ఆడు వారికి ఉండే రుతు చక్రం, గర్భదారణలనే పరిమితుల దృష్ట్యా పితృస్వామ్యం అమలులో ఉండేది.
వ్యవస్థ మాతృస్వామ్యమైనా, పితృస్వామ్యమైనా మగవారు ఒకే సమయం లో అనేక ఆడ వాళ్ళ తో సంబంధాలు కలిగిఉండే వారు.ఆడవారు ఒకే సమయం లో ఒకే సంబంధం కలిగి ఉండే వారు. ఇది ఆడ మగా ప్రకృతులలోని వైరుధ్యం వలన జరిగేది. ఒకప్పటి కేరళ వంటి మాతృస్వామ్య సమాజం లో కూడా మగ వారు బహు భార్యత్వం కలిగి ఉండేవారు.
పాతకాలం లో ఆడవారిలో మైధున ప్రక్రియ కీ గర్భధారణకీ విడదీయ రాని సంబంధం ఉండేది. ఇక ఆధునిక కాలానికి వస్తే contraceptives వలన మైధునానికీ, గర్భధారణకీ ఉన్న సంబంధం తెగిపోయింది. దీని వలన ఆడ వారు sensual pleasure ని కొత్త కోణం నుంచీ కొత్త attitude తో చూసే అవకాశం మొదలయింది. పాత కాలం నుంచీ ఆడవారి లో సెక్స్ కీ భావోద్వేగ అవసరాలకూ ఉన్న లంకె క్రమం గా తెగిపోతోంది. ఆధునిక ఉద్యోగాలలో ఆడవారు కూడా మగవారికి ధీటుగా మనగలగటం వలన, ఆడ వారికి ఉండే dependency లాంటి లక్షణాలు తగ్గి, తద్వారా కూడా సెక్స్ కీ భావోద్వేగానికీ ఉన్న లింక్ నెమ్మదిగా బలహీన పడుతోంది. మనం పాశ్చాత్య దేశాలలో ఈ trend ని బాగా చూడ వచ్చు. మన దేశం లో కూడా ఈ trend అనతి కాలం లోనే వస్తుంది.అయితే మగా ఆడా నైజాలలో ఉన్న జన్యుపరమైన తేడాలు మాత్రం మార లేదు. ఉదాహరణ కి మగవారి సెక్సువాలిటీ ఎక్కువ గా దృశ్య సంబంధమైనది. ఆడ వారి సెక్సువాలిటీ దృశ్యసంబంధమైనది గా ఇంకా మారలేదు. అలా మారాలంటే, ఆడవారి లో యాదృచ్చిక జన్యు మార్పులు జరగాలి.
ఇక మన చట్టాల విషయానికి వస్తే, భారత దేశం లో, సమతూకం ఉన్న, అన్ని nuances నీ పరిగణన లోకి తీసుకొని చేసే, చట్టాలు చాలా తక్కువ. దుర్వినియోగ పరచటానికి అవకాశం ఉన్న చట్టాలు ఎక్కువ. మన బండ చట్టాల వలన స్త్రీలకి రిజర్వేషన్ లతో పాటు, నిరంకుశమైన చట్టాల అండ దొరుకుతోంది. గృహ హింస లాంటి చట్టాల వలన భార్య తో సఖ్యత లేని మగాడు బిక్కు బిక్కు మంటూ బతక వలసిన పరిస్థితి
రాబోయే రోజులలో స్త్రీ లు కేంద్రం గా ఒక ఆధిపత్య వర్గం ఏర్పడబోతోంది. ఇక ఆఫీసులలో sexual harrasment rules గురించి చెప్పనవసరం లేదు.
మన న్యాయ వ్యవస్థ ఆడది వివాహేతర సంబంధం కలిగి ఉంటే, దాని బాధ్యత ను మగవాడి సమర్ధత మీదకి తోస్తుంది. అదే మగ వాడు వివాహేతర సంబంధం కలిగి ఉంటే విడాకులివ్వ వచ్చునంటుంది!
ఒకప్పుడూ ధైర్యమూ, సాహసమూ ఆభరణాలు గా కల మగవాడు, ఇప్పుడు ఇంటికీ, నౌకరీకీ పరిమితమవ్వాల్సి వస్తోంది. అనేక సంబంధాలు కలిగి ఉండటం అనేది మగాడి ప్రకృతి సిధ్ధమైన లక్షణం. కుటుంబ వ్యవస్థ ఆ లక్షణాన్ని అణగదొక్కి మగ వాడిని కుడేలయ్యేటట్లు చేసింది. నేటి కుటుంబ వ్యవస్థ లోని ఏక పత్నీత్వం లాంటి రూల్స్ పూర్తిగా ఆడవారి స్వభావానికి అనుకూలమైనవే! అదేమంటే “ఆడ వారూ వేరే మగ వాళ్ళ తొ తిరిగితే?” అనే ప్రశ్న వస్తుంది. కానీ ఈ ప్రశ్న రావటానికి మూల కారణం ఆడా మగా సమానత్వం అన్న ఊహ. ఆడ వారి నైజమూ మగవారి నైజమూ ఒకటి కావు. కాబట్టీ ప్రవర్తన లో ఇద్దరి మధ్య సమానత్వాన్ని ఆశించకూడదు. ప్లేటొ చెప్పినట్లు,” సహజం గా సమానత్వం లేని చోట దానిని రుద్దటమే అన్నిటికన్న పెద్దదైన అసమానత్వం”. అయితే, దీని అర్ధం “సమాజం ఆడా మగా ఇద్దరికీ సమానమైన గౌరవం ఇవ్వకూడదని కాదు”.సెక్స్ పట్ల మారుతున్న స్త్రీల attitude కి అనుగునం గా వారు కూడా భావోద్వేగ ఝంజాటం లేని అనేక సంబంధాలను (no strings attached relations) కోరుకోవచ్చు. అడ్డు చెప్పటానికి ఎవరికీ అధికారం లేదు.
ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి fail అవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు (ఈ వావి వరుసలు ప్రకృతి పరం గా ఎలా ఏర్పడ్డాయో ఈ వ్యాసం లో ముందు చర్చించాం) కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని తీసుకొంటే master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది. ఒక system లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది. కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది. సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.
ఒక పెళ్ళాం, ఒకరో ఇద్దరో పిల్లలూ. సంసారం లోని ఆనందం తగ్గినతరువాత కూడా మగవారు అందులోనే కునారిల్ల వలసి రావటం వలన కుటుంబాలు నిరాసక్తం గా నిస్సారం గా తయారయ్యాయి. ఈ కుటుంబ వ్యవస్థ మగ వారి సహజ స్వభావాని కి విరుధ్ధమైన అనేక డిమాంద్స్ ని చేస్తోందీనాడు. ఇంటిపనీ, బయటి పనీ అన్నీ మగవాడే చూసుకోవలసిన పరిస్థితి! అన్ని పనులూ చేసినా ఇంట్లో గౌరవం లేని దుస్థితి. “నేనూ ఉద్యోగాలు చేసి సాధించగలను”, అనే ఆడవాళ్ళ ego కి మగవాళ్ళు బలికావలసి వస్తోంది. ఆడవాళ్ళ మధ్య ఉద్యోగాల విషయం లో ఉండే peer pressure కి మగ వాళ్ళు మూల్యం చెల్లించాలి! పిల్లలను తాత, బామ్మల దగ్గర వదిలేయటం, creche ల లో పారేయటం వంటి మాతృత్వ స్వభావ విరుధ్ధమైన అనేక పనులను ఈ రోజు ఆడవారు చేస్తున్నారు! పైగా కుటుంబ జీవితానికీ, ఉద్యోగానికీ తెగ న్యాయం చేస్తూ రెండింటినీ తెగ balance చేస్తున్నామంటూ ఫోజులు!
కానీ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మగవాడే సర్దుకుపోవలసి వస్తోంది.
పాశ్చాత్య దేశాలలో లా అనేక విడాకులూ అనేక పెళ్ళిల్లూ (ఏక కాలం లో కాదు) చేసుకొనటం వలన సమస్య పెద్దవాళ్ళ స్థాయి లో తగ్గవచ్చేమో కానీ, పిల్లలు అన్యాయమైపోతారు. ఒకే కుటుంబం లో ఉంటూనే భార్యా భర్తా ఎవరి సంబంధాలు వారు వెతుక్కోవటం ఉంది. కానీ దీనిలోనూ అనేక భావోద్వేగ పరమైన సమస్యలూ, అసూయా ద్వేషాలూ ఉన్నాయని పడమటి దేశాల అనుభవాలు తెలుపుతున్నాయి. కుటుంబమే లేక పోతే పిల్లల మనుగడా, తద్వారా మానవ జాతి మనుగడా ప్రశ్నార్ధకం.అలా అని,( మనిషికి పెరిగిన నాగరికతా, ఆలోచనల దృష్ట్యా,) కుటుంబాలు లేని ఆది మానవుల స్థితికి వెనక్కి వెళ్ళటమూ అసంభవమే!
పెళ్ళి చేసుకోని వ్యక్తుల జీవితాలలోని ఒంటరి తనం తెలిసిందే!
ఏదేమైనా రాబోయే తరాలలో ని మగ వారికి నేనిచ్చే సలహా పెళ్ళి చేసుకోవద్దనే. దానికంటే చాలా స్వేచ్చకలిగి ఉండి, అడపా దడపా ఉండే ఒంటరి తనాన్ని మేనేజ్ చేయటం చాల ఈజీ! వారసులు లేరనే బెంగ మాటంటారా? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి పోతోంది! పెట్టుబడి దారీ వ్యవస్థ మరణ శయ్య మీద ఉన్నా, ఆ వ్యవస్థ కి ప్రత్యామ్నాయం కనుచూపు మేర లో కనపడటం లేదు.అంటే ఈ వ్యవస్థ ఖర్చులను ఇలానే పెంచుతూ పోతుంది. ప్రపంచం లో పర్యావరణం దెబ్బ తింటోంది. అంటే, కొన్నేళ్ళ తరువాత గ్రీన్ టాక్సుల వడ్డన మొదలౌతుంది. మన ఇండియాలాంటి దేశాలలో ఉన్న బండ చట్టాల వలన ఆడ మహారాజులూ, ఆడ ఆధిపత్య వర్గాలూ ఏర్పడతాయి. రా బోయే తరాల మధ్యతరగతి వారు పిల్లలని కని, తద్వారా వారిని సరిగా పోషించలేని దిగువ తరగతులలోకి దిగజారే అవకాశాలు స్పష్టం గా కనపడుతున్నాయి. అలాంటి దుస్థితి కి పిల్లలని గురి చేసే కంటే, పెళ్ళి చేసుకొనక పోవటమే మంచిది.ఇలాంటి పరిస్థితి పడమటి దేశాలలోఆల్రెడీ ఉంది. నాకు తెలిసిన ఒక తెల్లామె ఆమె బాయ్ ఫ్రెండ్ కి ఉన్న కమిట్మెంట్ ఫోబియా గురించి తెగ వాపోతుంది! కమిట్ కాక పోతే మగాడు అనేక అందాలను ఆస్వాదించే తన సహజ గుణాన్ని వదులుకోవలసిన అవసరం ఉండదు.ఇక ముసలి వాళ్ళమైనాక ఎలా అంటారా? come on! మన తరమే పెద్ద వాళ్ళను నానా ఇబ్బందులూ పెడుతోంది. ఇక మన పిల్లల తరం మనని చూస్తుందా?(అందుట్లోనూ మనతో creche ల లో పెట్టించుకొని మన నిరాదరణ కు గురైన తరం). సోలో గా ఉంటే కాసిన్ని డబ్బులు మిగుల్చుకొని, వయసైనాక ఆ డబ్బులతో హాయిగా ఏ వృధ్ధాశ్రమం లోనో చేర వచ్చు. అందుకే,”సోలో బతుకే సో బెటరూ!”
సెక్స్ యొక్క వ్యాపారీకరణ లో కుటుంబ వ్యవస్థ పాత్ర
07 అక్టో 2011 అభిప్రాయములు
యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ఒక నవలలో హీరో ఒక క్యాపిటలిస్టు. అతను మొదట “మీసాలూ గడ్డాలూ పర్మనంట్ గా తీసేసే ఒక లోషన్ ని మార్కెట్ లోకి వదిలి ఉచితం గా అమ్ముతాడు. అదే సమయం లో ఓ వందమంది కుర్రాళ్ళ తో ఆ లోషన్ వాడకుండా ఎగ్రీమెంట్ రాయించుకొంటాడు.
ఉచితం కాబట్టీ ఊళ్ళో కుర్రాళ్ళందరూ ఆ లోషన్ వాడి గడ్డాలూ మీసాలూ ఊడగొట్టుకొంటారు. కొత్త కాబట్టీ వాళ్ళకి అది ఒక ఫాషన్ గా అనిపిస్తుంది. ఊళ్ళో కుర్రాళ్ళందరూ మొహం మీద వెంట్రుకలు కోల్పోయిన తరువాత కొన్ని సంవత్సరాలకి, తాను ఎగ్రీమెంట్ రాయించుకొన్న మీసాలూ గడ్డాలూ ఉన్న కుర్రవాళ్ళని ఊళ్ళో తిప్పుతాడు హీరో.
మిగిలిన కుర్రాళ్ళకి కూడా ఈ ఎగ్రిమెంట్ కుర్రాళ్ళ లా గడ్డాలూ మీసాలూ కావాలనిపిస్తుంది. అప్పుడు హీరో ఊళ్ళో కుర్రాళ్ళ మీదకి వెంట్రుకలు మొలిపించే లోషన్ ఒకటి వదులుతాడు. వాళ్ళ దాన్ని హాట్ కేకుల్లాగా కొనుక్కొంటారు.
ఇక్కడ హీరో వ్యాపార రహస్యమేమంటే, “కొరత ఉన్న వస్తువుకి డిమాండ్ ఉంటుంది”. కాబట్టీ మంచి వ్యాపారి కొరతని కృత్రిమంగా నైనా సృష్టించి సొమ్ము చేసుకొంటాడు.
కుటుంబ వ్యవస్థ లేని పాత మంచి రోజులలో, గాలీ నీరు లానే సెక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ , ఎప్పుడుపడితే అప్పుడు దొరికేది.సెక్స్ చేసేటప్పుడు తప్పితే జనాలు దానిని గురించి పట్టించుకొనవలసిన అవసరం ఉండేది కాదు.
కుటుంబ వ్యవస్థ రావటం తో సెక్స్ కి ఈ వ్యవస్థ బయట కొరత ఏర్పడింది. వ్యవస్థ లో కొంత కాలం ఉండి బోర్ కొట్టిన వాళ్ళకీ, వ్యవస్థ తో అసంతృప్తులకీ ఒక సేఫ్టీ వాల్వ్ లా దేవదాసీ సిస్టమూ, భోగం వాళ్ళూ బయలు దేరారు. మనిషికి కావల్సిన, కొరత ఉన్న, ఏ వస్తువుకైనా ఒక రేటు ఉంటుంది. అలానే వీరికీ ఒక రేటు ఉంది. ఈ విధం గా చాలా తక్కువ స్థాయి లో వ్యాపారమైన సెక్స్, పాశ్చాత్యుల రాక తో, వారి విలువల తో మరీ రోడ్ సైడ్ బిజినెస్ గా మారింది.
కుటుంబ వ్యవస్థా, కుల వ్యవస్థా కలిపి 90% ప్రేమలు విఫలమయ్యేటట్లు చేశాయి. మన సమాజం లో అధిక భాగం ఒకానొక సమయం లో unrequitted love తో బాధ పడిన వారేననటం లో అతిశయోక్తి లేదు. సెక్స్ అందకుండా పోవటం వలన దానికి ఒక ఊరించే స్వభావం వచ్చి, యువత తన సమయాన్ని దాని గురించి ఆలోచించటంలోనే వృధా చేసుకొంటోంది. కొంత మంది యువకులు చేసే యాసిడ్ దాడులలో ఈ “సెక్స్ కొరత” పాత్ర కాదనలేనిది.
అమెరికా, జపాన్ లాంటి దేశాలలో కొన్ని బార్స్ లో అమ్మాయి కబుర్లు చెబితే ఒక రేటు, మందుపోస్తే ఒక రేటు, ముట్టుకోనిస్తే ఒక రేటు ఉంటాయి. ఫోన్ లో మాట్లాడితే వేరొక రేటు. మొత్తానికి, “గాలిపీల్చటం లా, నిద్రపోవటం లా ఎంతో సహజమైన సెక్స్”, ని ఒక మ్యూజియం లో వస్తువు లా చేసి దానికి రుసుము వసూలు చేస్తున్నారన్న మాట. ఇక వ్యాపార ప్రకటనల లో సెక్స్ ఉపయోగించే సంగతి అందరికీ తెలిసిందే.
సినిమాలూ, నెట్టూ, టీవీ ల లో సెక్స్ అమ్మకం సంగతి చెప్పనక్కరలేదు.సినిమాలలో నటీమణులు పిక్క చూపించటానికో రేటు, జబ్బ చూపించటానికింకో రేటు, సంపదలు చూపించటానికిక్నో రేటు. శరీరసౌష్టవం ఉన్న కొంత మంది తారలు, తాము అంతా చూపించటానికి ఇంత రేటు అని అంటారు, పశువుల మార్కెట్లో పొదుగుని బట్టి గేదే ని కొన్నట్లు. వర్తమానం లోనే కాక వారి అంగాలకి భవిష్యత్తులో కూడా రేటు కట్టే ఇన్స్యూరెన్సులు పశువుల మార్కెట్ కి కూడా అందనంత నీచం గా ఉంటాయి.
సెక్స్ బొమ్మలూ, ఉపకరణాలూ మొదలైన వాటి మార్కెట్ కొన్ని బిలియన్ డాలర్లలో ఉంటుంది. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే, పడమట్లో కొందరు కుర్రాళ్ళూ పెళ్ళి కంటే ఈ చూసే సెక్సే బాగుందని పెళ్ళి చేసుకోరంట!
జీవకోటి కి దేవుడి వరమైన, ఎంతో సహజమైన, సెక్స్, మనిషి పెట్టుకొన్న వ్యవస్థల వలన ఇప్పుడు మనిషిని ఒక ఆట బొమ్మను చేసి ఆడిస్తోందన్న మాట! ఒకప్పుడు మనిషి ఆలోచనలలో చాలా తక్కువ చోటు ఉన్న సెక్స్ కి ఇప్పుడు మనిషి ప్రతి పది నిముషాలకీ (?) దానిని గురించి ఆలోచించకుండా ఉండ లేనంత ప్రాముఖ్యత(?) వచ్చింది.
జంతువులు సెక్స్ గురించీ, సెక్స్ సామర్ధ్యం గురించీ టెన్షన్ పడతాయంటేనె మనకి నవ్వు వస్తుంది. కానీ మనిషి తన సామర్ధ్యం గురించి పడే టెన్షన్ అంతా ఇంతా కాదు . ప్రధానం గా దీనిని సొమ్ము చేసుకొనేటందుకు సెక్సాలజిస్టులు బయలుదేరారు. సెక్స్ సామర్ధ్యం గురించి జనాలలో “బెంచ్ మార్క్స్” సృష్టించి వారిలో “నేను ఆనందించటం లేదేమో
!” అనే అనుమానాలను రేకెత్తించి, మళ్ళీ పోగొట్టటం మొదలెట్టారు
. అనుమానం రేకెత్తించేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు..పోగొట్టేటప్పుడూ డబ్బు చేసుకోవచ్చు.జబ్బుల పేరుతో డబ్బులు గుంజవచ్చు.
పాత తరాల లో ఒక వయసు అయిన తరువాత వారు graceful గా తమ వయసును అంగీకరించి ఆధ్యాత్మిక విషయాలపై మనసు మరల్చే వారు. ముసలివారు అవటం చాలా సహజ మైన విషయం కదా! కానీ వ్యాపారం దాన్ని కూడా సొమ్ముచేసుకొంటుంది. ఇప్పుడు, వయాగరాల వంటి మాత్రలు మనుషులు తమ పై బడ్డ వయసును అంగీకరిచకుండా చేస్తున్నాయి. ఎంత కాలమైనా పడుచువాడిగా ఉండి, తమ మగతనానికి కూడా, “తలకి హయిర్ డై వేసినట్లు”, పూతలు పూస్తున్నారు!మహిళల సౌందర్య సాధనాల పిచ్చి కూడా ఈ పరిధిలోకే వస్తుంది.
మానవ సంబంధాల లో కూడా సెక్స్ పరోక్షం గా కమర్షియలైజ్ అయింది. ఒకతని గర్ల్ ఫ్రెండ్ ఆమెకి ఖరీదైన గిఫ్ట్ లు ఇస్తే కానీ సంతోషం గా ఉండదు. ఆమె సంతోషపడితే గానీ ఆమెపక్కకి చేరి మురిపెం తీర్చొకోవటానికి కుదరదు.
మొత్తానికి కుటుంబ వ్యవస్థా, వ్యాపారమూ కలిసి, ఎక్కడ చూసినా అందమైన అమ్మాయిలూ అబ్బాయిలూ ఉన్న మన సమాజాన్ని,నడి సముద్రం లోని నావికుని లా, “water water everywhere, but no drop to drink” అని అనిపించేటట్లు చేశారు!
అయితే ఈ సెక్స్ యొక్క వ్యాపారీకరణ కు పరిష్కారమేమిటి అంటారా? చాలా సింపుల్…మనం అర్జంట్ గా ఆది మానవులు గా మారిపోవటమే!
సమానత్వం (స్త్రీ పురుష) : కొన్ని నా ర్యాండం థాట్స్
14 అక్టో 2011 అభిప్రాయములు
సమానత్వం గురించి (ముఖ్యం గా స్త్రీ పురుష సమానత్వం) కొన్ని నా ర్యాండం థాట్స్:
ఇండియా లో స్త్రీలు పాత విలువల వ్యవస్థ నుంచీ కొత్త విలువల వ్యవస్థ కి అయ్యే transition సమయం లో ఉన్నారు. మగ వారి కోణం నుంచీ విషాదమేమిటంటే, స్త్రీలకు కొత్త వ్యవస్థ లోని హక్కులూ సమానత్వమూ కావాలి, పాత వ్యవస్థలోని care రక్షణా కావాలి. కాబట్టీ మగవారు తమ హక్కులను వదులుకోవాలి. కానీ పాత వ్యవస్థ ప్రకారం వచ్చే బాధ్యతలను (కుటుంబ రక్షణ, ఆడ వారి care) మోయాలి. మన స్త్రీలు మగవారే తమ ట్రాన్స్ఫర్ లంటి వ్యవహారాలను, రికమండేషన్లను తేవటం వంటి వ్యవహారాలను చూడాలనుకొంటారు. అదే సమయం లో మగవాడితో సమానత్వం విషయం లో ఏ మాత్రమూ వెనుకకు తగ్గరు. తమ జీతం తమదే! మగవాడి జీతం కుటుంబం అంతటిదీ! ఒక పాత సామెత గుర్తుకొస్తుంది..”దున్నేటప్పుడు దూడలలోనూ, మేసేటప్పుడు దున్నలలోనూ కట్టెయటం”. చాలా మంది మగవారు ఈ బేధాలను కనిపెట్టకుండా గానుగెద్దులలా అన్నిటినీ కోల్పోతూ పని చేస్తున్నారు!
వెస్టర్న్ దేశాలలో ఆడవారు తమ జీవిత బాధ్యతను తామే తీసుకొంటారు, అలానే సమానత్వమూ ఉంటుంది. ఏడెనిమిది నెలల గర్భం తో ఉన్న వారు కూడా తమ కారు తమే నడుపుతూ ఆఫీసు కు వస్తారు. మన ఆడ వారిని అలా చేయమంటే మగవారి పై ఎన్ని అభాండాలు వేస్తారో ఊహించండి.
మన వ్యవస్థ లో అనాది గా అసమానత్వానికి కొన్ని కారణాలు…..
1.బలవంతుడెప్పుడూ బలహీన వర్గాన్ని ఆక్రమించి వాళ్ళకు బండ పనులూ, అశుభ్రమైన పనులూ, ప్రమాదకరమైన పనులూ ఇస్తాడు. ఆ పనులు చేసే వారు లేకపోతే సమాజానికి చాలా నష్టం. కానీ అణిచిపెట్టబడ్డ వారికి, అణచివేత వల్లా, పొట్టకూటి కోసం ఆ పనులు చేయక తప్పదు, ఈ రోజుల్లో మధ్య తరగతి తమ కంపెనీలను తిట్టుకొంటూ కూడా పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేస్తున్నట్లు.
2. సమాజం మరియూ వ్యక్తుల అవసరాలను బట్టి కొన్ని పనులకి ఎక్కువ విలువ ఉంటుంది. మూఢనమ్మకాలున్న సమాజం లో కుహనా మత పెద్దలకి విలువ ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులున్న పాత సమాజం లో వైద్యుడికి ఉన్న విలువ మంగలికి ఉండదు.
సమానత్వాన్ని ఒక ఆదర్శం గా తీసుకొంటే, అనేక రకాల సమానతలున్నాయి.
అమెరికన్ కంపెనీలలో “సీ ఈ ఓ” ని మరుగుదొడ్డికడిగేవాడు కూడా పేరుపెట్టి ఏకవచనం తో పిలవ వచ్చు. ఈ సమానత్వం కేవలం formality మాత్రమే! “సీ ఈ ఓ” జీతం మిగిలిన ఉద్యోగుల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టీ ఇక్కడ సమానమైన విలువ లేదు. సమాన విలువ లేనప్పుడు సమాన సంబోధనకు పెద్ద ఉపయోగం లేదు.
2.ఒకప్పటి రష్యా వంటి దేశాలలో factory లలో పై అధికారులూ , కింది అధికారులూ, పని వారూ ఉండేవారు. కానీ అందరికీ సమాన విలువ ఉండేది. ఇది అసలైన సమానత్వం. వాళ్ళ జీతం స్కేల్స్, కాపిటలిస్ట్ దేశాలలో లా సంస్థ కు వచ్చే లాభాలకు వారి contribution ని బట్టి కాక, వారు చేసే పనిని బట్టి ఉండేవి. ఒక కార్మికుడు రోజుకు నలభై వస్తువులు ఎక్కువ తయారు చేస్తే అతనికి బోనస్ ఉంటే, ఒక జెనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి నలభై truck loads of goods ఎక్కువ ఉత్పత్తి చేయిస్తే అతనికి అంతే బోనస్ ఉంటుంది. అలానే ఒక క్వాలిటీ నిపుణుదు, క్వాలిటీ ని పెంచిన దానిని బట్టి అతనికి సమానమైన amounts లో బోనస్ ఉంటుంది. ఇది అసలైన సమానత్వం.
3. ఈ అసలైన సమానత్వం లో కూడా functional equality (చేసే పని లో సమానత్వం)అనేది సాధ్యం కాదు. మానేజర్ లెవల్ లో ని వారు నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది, కార్మికులు అమలు పరచ వలసి వస్తుంది. మానేజర్ నిర్ణయాలు తీసుకొంటాడు కదా అని అతనికి ఎక్కువ విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు. కార్మికుని పని కార్మికుడు చేస్తున్నాడు.కానీ నిర్ణయాలు తీసుకొనటం అనేది అమలు పరచటం కంటే మేధోపరం గా ఎక్కువ స్థాయి పని. మొదట్లో ఈ రెండు పనులనూ కృత్రిమం గా ఒకే స్తాయిలో పెట్టినా, కొన్నాళ్ళకి నిర్ణయాలు తీసుకొనేవారి ఆధిపత్యాన్ని ఆపటం కష్టం అవుతుంది.
సోషలిస్ట్ వ్యవస్థ ఏవరికి ఆసక్తి ఉన్న ఉద్యోగం వారు చేసుకొనేటట్లు గా వ్యవస్థ ఇద్దరికీ పుట్టుక నుంచీ సమాన అవకాశాలను కల్పించింది. కాపిటలిస్ట్ వ్యవస్థ లో లా “ఒక పని చేసే వారు తక్కువ ఉన్నారు కాబట్టీ,ఆ పని నేర్చుకొని, ఆ చదువులు చదివిన వారికి ఎక్కువ జీతం ఉండదు”.
సామ్యవాద వ్యవస్థ లో కూడా అన్ని పనులూ సమానం కాలేవు. ఒక శాస్త్రవేత్త అవ్వటానికి కి కొన్ని సంవత్సరాల విద్యా శిక్షణా కావాలి. దానికి మేధోపరమైన స్థాయి కావాలి. శ్రమ చేయాలి. శాస్త్రవేత్త అయిన తరువాత ఉండే పని కూడా ఎక్కువ గానే ఉంటుంది. ఐతే ఈ శ్రమ మేధోపరమైన శ్రమ. అదే ఒక రిసెప్షనిస్ట్ పని తేలిక గా ఉంటుంది. దానిని పెద్ద training లేకుండానే ఎవరైనా తేలిక గా చేయగలరు. అటువంటప్పుడు సామ్యవాద రష్యాలోనైనా శాస్త్ర వేత్తకి ఎక్కువ విలువ ఉంటుంది. అతనికి ఎక్కువ ప్రతిఫలం ఉండాల్సిందే! అలానే ఎక్కువ కష్టపడే వారినీ తక్కువ కష్టపడె వారినీ సామ్యవాద వ్యవస్థ అయినా సమానం గా చూడలేదుకదా! సోమరిపోతుతనానికి కారణాలు అన్ని వ్యవస్థలలోనూ ఉంటాయి.
స్త్రీ వాదులతో వచ్చిన చిక్కేమిటంటే వారు functional equality ని ఆశిస్తారు. సమానత్వమంటే functional equality అనుకొంటారు. కానీ functional equality తో వ్యవస్థ పని చేయదు. కొన్నాళ్ళకి అది కుప్ప కూలుతుంది.
ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి failఅవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది. ఒక system లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది. కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది. సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, ప్రస్థుత కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.
సమాజం లో విప్లవాలు రాత్రికి రాత్రి రావు. సమాజ స్థూల పరిస్థితుల (శాస్తవిజ్ఞానాభివృధ్ధీ, సాంకేతికతా, విద్యా మొదలైనవి) లోని పరిణామం వలన ఒకానొక దశలో ఇవి వెల్లువెత్తుతాయి.
పూర్తిగా అణిచివేయబడిన వర్గానికి మొదట్లో తాము అణిచివేయబడ్డామనే స్పృహ కూడా ఉండదు. వారి లో కొందరు అణచివేత పరిస్థితులలోంచీ దూరం గా వేళ్ళటం వలనో, లేదా వారి ఆలోచనలు మిగిలిన వారికంటే ముందుకు వెళ్ళటం వలననో అణచివేతని ప్రశ్నించటం ప్రారంభమౌతుంది. ముందు గా అణచివేసే వర్గం లోని కొందరు మానవత్వం కలవారు అణిచివేయబడిన వర్గాన్ని సమభావం(మానవ ప్రేమ) తో జాగృతం చేయటం వలన కూడా అణిచివేయబడిన వర్గం లోని చైతన్యానికి కారణమౌతుంది.
ఐతే ఈ విప్లవాల వలన సమానత ఏర్పడుతుంది అనుకోలేం. అసమానతలు తారు మారవుతాయి.అధికార బదిలీ జరుగుతుంది. అంతకు ముందు పాలకులు గా ఉన్న వారు పాలితులవుతారు, పాలితులు పాలకులౌతారు. సమాజం లోని కొత్త స్థూల పరిస్థితుల ఆధారం గా సరి కొత్త అసమ సమాజం బయలుదేరుతుంది.
అధికారాలను కోల్పోవటం అలా కోల్పోయే వారికి ఒక బాధాకరమైన ప్రక్రియ.ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు((చిన్నపిల్లలు) ఉన్నారనుకొందాం. వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్స్ కొని ఫ్రిజ్ లొ పెట్టారనుకొందాం. పెద్ద వాడు ముందు వెళ్ళి ఆ నాలుగు చాక్లెట్లూ తీసేసుకొంటే, చిన్న వాడు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా రెండు చాక్లెట్స్ ఇవ్వటం పెద్ద వాడికి బాధాకరం గానే ఉంటుంది. అప్పుడు పెద్దవాడికి వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్లూ కబ్జా చేయటం ఎందుకు చెడ్డ విషయమో, చిన్న వాడికి రెండు చాక్లెట్స్ ఇవ్వటం ఎందుకు మంచి విషయమో చెప్పాలి. చిన్న వాడికి చాక్లెట్స్ ఇచ్చినపుడు పెద్ద వాడిని మెచ్చుకోవాలి.చిన్న వాడి చేత థాంక్స్ చెప్పించాలి.కానీ, మన సమాజం లో అమ్మ లా పెద్దవాడి మంచి ప్రవర్తన ని మెచ్చుకొనే వారూ లేరు…చిన్నవాడి చేత థాంక్స్ చెప్పించేవారూ లేరు. చిన్న వాడు, అన్న దగ్గర ఉన్న నాలుగు చాక్లెట్సూ నాకు కావాలి అని పట్టుపట్టవచ్చు. అప్పుడు చిన్నవాడికి కూడా వాళ్ళ అమ్మ పెద్ద వాడికి చెప్పినట్లే చెప్పాలి. ఇక్కడ అమ్మ పాత్రని ఒకప్పుడు మన సమాజం లో పెద్ద వారు పోషించేవారు. వారు పూర్తిగా నిష్పక్షపాతం గా లేకపోయినా, వారి presence ఒక stabilizing influence ని కలిగి ఉండేది. పెద్ద వారిని పట్టించు కోని ఈ కాలం లో వారి మధ్యవర్తిత్వాన్ని ఆమోదించేదెవరు?
మనం రాబోయే నాలుగువందల సంవత్సరాలలో మానవ జాతి సరైన దిశలో ఉండే నిర్ణయాలు తీసుకోవాలంటే,ఒక నాలుగైదు తరాలవారిని ఒక చోట కూర్చోబెట్టి పరిష్కరిస్తే గానీ ఆ సమస్యలు విడిపోవు. కానీ నాలుగైదు తరాల పాటు బ్రతికి ఉండే వ్యక్తి ఏవరు?కాబట్టీ సమాజం long term లో ఒక అదుపు లేకుండా, మనుషులు ఒక జీవిత కాలం లో చేసే short term పనులతో గజి బిజి గా సాగుతూనే ఉంటుంది. ఒక తరానికి నేర్పబడిన పాఠాలు, మరొక తరానికి మళ్ళీ నేర్పాల్సి వస్తుంది. తప్పులు పునరావృతమౌతాయి. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఈ long term continuity ని కొంత కాలం నిలబెట్టగలిగినా, ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది.
సమానత్వమే అత్యున్నత విలువా? కానే కాదు. కుటుంబం యొక్కా, తద్వారా సమాజం యొక్క greater good కి సమానత్వాన్ని త్యాగం చేయవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా కుటుంబం కోసం తక్కువ స్థాయిని ఆమోదించటం లో తప్పేమీ లేదు.తద్వారా ముందు కొంత తక్కువతనాన్ని అనుభవించినా, కుటుంబం యొక్క ఆరోగ్యం, తద్వారా వచ్చే ఆనందం ద్వారా దానిని పూడ్చుకోవచ్చు. పురుషులు దీనికి ఈ మధ్యే అలవాటుపడుతున్నారు. స్త్రీలు కొత్తగా దొరికిన కొబ్బరి చిప్పైన సమానత్వాన్ని అంత తొందరగా వదిలే సూచనలు కనపడటం లేదు.
సమానత్వం : తాత్విక దృష్టి కోణం
21 అక్టో 2011 అభిప్రాయములు
in ఆధ్యాత్మికం, సమాజం
Disclaimer: ఈ టపా సమాజం లో ఉండే అనేక రకాల వివక్షలను సమర్దించటానికి కాదు.
“అహం బ్రహ్మాస్మి, తత్వమసి” అని మన పెద్దలు చెప్పారు. (ఈ సూక్తి మన వేదాలలో ఉందా, ఉపనిషత్తులలో ఉందా, శంకరుడు చెప్పాడా, లేక పురాణాలలో ఉందా అనేది నాకు తెలియదు. తెలిసిన వారు కొంచెం చెప్తారా?).
మనలో చాలా మంది మొదటి దైన “అహం బ్రహ్మాస్మి” అనే దానిని అమలు లో పెడతారు (In an egotistic way :-) ). మిగిలిన భాగం అమలు లో పెట్టటం చాలా కష్టం.
మనలో విద్యా వంతులైన వారు ఎదుటి మనిషి మన వంటి వాడే అనే విషయాన్ని బుధ్ధిపరం గా అర్ధం చేసుకోగలరు. కానీ practical గా అమలు చేయం.భావోద్వేగ పరం గా ఇతరుల భావోద్వేగాలు మన భావోద్వేగాలకి ఎప్పటికీ సమానం కావు. భావోద్వేగం అనేదే మన అస్థిత్వం నుంచీ పుడుతుంది. మన ఆలోచనలన్నీ మన లాభ నష్టాల చుట్టూనే తిరుగుతాయి. మన శారీరక భౌతిక అవసరాలు మనవి. ఎదిటి వాడి ఆకలి మనకు వేయదు కదా! ఎదుటి వాడి రోగం మనం ఫీలవ్వం. ఎదుటి వాడి ముసలితనం వాడిదే! మానసికం గా “నేను” అనే వస్తువే గతకాలపు జ్ఞాపకాల, ఆలోచనల , అనుభవాల సమాహారం.ఈ నేను కి ఎదురైన పరిస్థితులు దానిని మారుస్తూ ఉంటాయి.ఇతరులకి ఎదురైన పరిస్థితులు , నాకు ఎదురైన పరిస్థితులకు పూర్తి గా భిన్నమైనవి కావచ్చు. అలాంటి నేను ఎదుటి మనిషి తో ఆలోచనా పరం గా, భావోద్వేగ పరం గా, వ్యవహార పరం గా సమానత్వాన్ని ఎలా సాధిస్తుంది?తమ తమ అభిప్రాయాలకీ, భావోద్వేగాలకీ, ఆలోచనలకీ ప్రాముఖ్యతని ఇచ్చుకోని వ్యక్తులను మనమెక్కడైనా చూస్తామా? మన శరీరం కార్చే అనేక శరీర ద్రవాలూ మలినాలు అంటే మనకి అసహ్యం ఉండదు. అదే ఇతరుల ద్రవాలంటే మనకు జుగుప్స ఉంటుంది.
మన అస్థిత్వమే మన మనుగడ (survival) నుంచీ ఆవిర్భవించింది. కాబట్టీ, సర్వ మానవ సమానత్వం అనేది మన నుంచీ మొదలవ్వాలి. కానీ, ఒక్క మేధో పరం గా కాకుండా, ఏ ఇతర ప్లేన్ లో ( emotional, survival, practical, physical,psycological and thoughts) చూసినా మనం మనకు ఇచ్చుకున్న ప్రాముఖ్యతను ప్రపంచం లో వేరే ఎవరికీ ఇవ్వం.
ఇతరుల ఆలోచనలకీ , వారి అనుభవాలకీ మనకు access లేదు. వారి మానసిక ప్రపంచానికి వారికే access ఉంది. అందరి మనుషులకీ ఉమ్మడి గా ఉండే కొన్ని అనుభూతుల ద్వారానే మనం వారితో communicate చేయగలం. మనతో మసలే మన స్నేహితులూ, బంధువుల ఆలోచనలకి మనకు కొంతవరకూ access ఉంటుంది. కాబట్టీ మనం వారికిచ్చే weightage/priority లోకం లో ఇతరులకి ఇచ్చే విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటప్పుడు ఇతరులంటే మనకు కొంత మానవీయమైన సహానుభూతి ఉండవచ్చు, కానీ మానసిక మైన సమానత్వం మాత్రం రాదు. అది ఒక ఆచరణ లో పెట్టలేని ఆదర్శం మాత్రమే అనిపిస్తుంది. We all are similar, but we are not identical .
సర్వ మానవ సమానత్వమే ఇలా ఉంటే, ఇక సర్వ జీవ సమానత్వం సంగతి ఆలోచించాల్సిందే!
మనమంతా ఒకే శక్తితో, ఒకే ఎలక్ట్రాన్లూ, అణువులూ వగైరాలతో చేయబడి, ఒకే శూన్య మూలాల నుంచీ, భౌతిక-అధిభౌతిక కారణాలవలన వచ్చినప్పటికీ, వాస్తవం గా ఈ అసమానత్వం తప్పేటట్లు లేదు.
మన శరీరమూ, మనసూ, రోబో ల తరహా లోమాస్ ప్రొడ్యూస్ అయితే తప్ప, మనమందరం సమానం కామేమో! మాస్ ప్రొడ్యూస్ అయిన రోబో ల లో కూడా వాటి సామర్ధ్యాలలో తేడాలు ఉంటాయి!
ఇందుమూలం గా సకల మహాజనులకూ సవినయం గా తెలియజేయునదేమనగా…
22 అక్టో 2011 అభిప్రాయములు
in అవర్గీకృతం ట్యాగులు:ad, advertisement, commercial
ఇందుమూలం గా సకల మహాజనులకూ సవినయం గా తెలియజేయునదేమనగా…
నా “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ” ఇప్పుడు కినిగె లో మీకు దొరుకుతుందహో…! http://kinige.com/kbook.php?id=456
మేధావులూ వారి ఆదర్శ సమాజ సిధ్ధాంతాల పనికిరానితనం
22 అక్టో 2011 అభిప్రాయములు
in అవర్గీకృతం
సమాజం లోని మధ్య తరగతి మేధావులు కొంతమంది సమాజ తత్వం తో విసిగి, దానిని ఎదిరించలేక, కొత్త ఆదర్శ వాద సిధ్ధాంతాలను (సమ సమాజం వంటివి) లేవనెత్తుతారు. కానీ ఈ ఆదర్శాలనూ విలువలనూ వారే పాటించలేరు.(ఉదాహరణ కు వారు ఏ మార్క్సిస్టు లో అయి ఉంటారు. కానీ పచ్చి పెట్టుబడిదారు విదిల్చే పదికో పరక కో తమ సిధ్ధాంత రచనలు అమ్ముకొంటారు. కాపిటల్ కే వ్యతిరేకమైన వీరు తమ రచనలకు నాలుగు రాళ్ళు రావటంలేదని మూలుగుతారు) చలం లాంటి వారు ఎక్కడో ఒకరు దీనికి అతీతులు. ఆయన తను ప్రతిపాదించిన విలువల ప్రకారం జీవించటానికి ప్రయత్నించారు. భౌతిక కారణాలకీ, సహజ స్వభావానికీ విరుధ్ధమైన ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది.
ఈ మేధావుల స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరి ఆదర్శాలకి విలువనిచ్చినట్లు కనిపించదు (వీరి కుటుంబ సభ్యులు, పిల్లలు ఏ అమెరికా లోనో ఉండి అప్పుడప్పుడూ బ్లాగుల్లో బావురు మంటుంటారు. సదరు ఎర్ర మేధావిని కదిలిస్తే, అలా శతృ దేశంలో ఉండటం వారి వ్యక్తి గతం అంటాడు. లేక పోతే తాను అమెరికా ప్రజలకి వ్యతిరేకం కాదనీ, అక్కడి పెట్టుబడిదారి వ్యవస్థ కి వ్యతిరేకమనీ, తన పిల్లలు చదువుకోసం మాత్రమే అమెరికా వెళ్ళారనీ ఏవో సాకులు చెప్పి తప్పించుకోచూస్తాడు..అక్కడికి చదువుకొన్న తరువాత ఆ పిల్లలు అక్కడి పెట్టుబడిదారి సంస్థలలో ఉద్యోగాలు చేయనట్లు, అక్కడి విశ్వవిద్యాలయాలలో అక్కడి పెట్టుబడిదారి కంపెనీల జోక్యం లేనట్లు..).అంటే ఈ మేధావులు తమ చుట్టూ ఉండే వారిని కూడా ప్రభావితం చేయలేక పోయారన్న మాట. దీనిని గురించి వారిని ప్రశ్నిస్తే, “సిధ్ధాంతం ప్రతిపాదించిన వాడి వ్యక్తిగత జీవితం అప్రస్తుతం, అతని ఆలోచనలూ సిధ్ధాంతం మాత్రమే ముఖ్యం”, అంటారు. ఈ వాదన చూడటానికి బాగానే ఉన్నట్లు కనపడినా, దీనిలో ఒక లోపం ఉంది.
ఏవరైనా ఒక గడియారం తయారు చేశారనుకొందాం. అతను ఆ గడియారాన్ని అమ్ముదామనుకొంటున్నాడు. “ఈ గడియారం నా చేతికి పెట్టుకొంటే పని చేయదు, కానీ నీ చేతికి పని చేయ వచ్చు”, అని అమ్మే వ్యక్తి చెబితే , కొనే వ్యక్తి కొంటాడా? తనకే పని చేయని గడియారాన్ని ఇతరులు ఎందుకు కొనాలి?
చాలా సందర్భాలలో గడియారం వారి చేతికి పనిచేసినా కొన్న వారి చేతిలో పని చేయక పోవచ్చు.
కానీ ఈ మేధావులు ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని సమాజం మీదికి విసిరేసిన సిధ్ధాంతాలను పట్టుకొని వాటి సాధనకోసం నా నా ఇబ్బందులూ పడి తమ జీవితాలని నాశనం చేసుకొన్న వారు, ఉన్నారు, ఉంటారు. అటువంటి సిధ్ధాంతాల గురించి “తస్మాత్ జాగ్రత్త..!”.
సమాజ సేవా? కుటుంబ సేవా? స్వార్ధమా? సమానత్వమా?
23 అక్టో 2011 అభిప్రాయములు
in అవర్గీకృతం
మన లో చాలా మందికి సమాజానికి మంచి చేయాలన్న మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ మనకు అనేక పరిమితులు ఉంటాయి. ఒక పారిశ్రామిక వేత్త, “ముందు నన్ను ఓ 500 కోట్లు సంపాదించనియ్, తరువాత ఇక సమాజ సేవ లో కి దూకేస్తాను,” అంటాడు.
ఇంకొక రాజకీయుడు “పలానా పదవి వస్తే, తరువాత నా శేష జీవితాన్ని సమాజ సేవ లో ప్రశాంతం గా గడుపుతాను” అంటాడు,
ఇంకో మధ్య తరగతి జీవి, “నాకు ఓ భద్రమైన ఉద్యోగం కుదిరితే, నా ఫ్రీ టైం అంతా సమాజ సేవ కే ” అనవచ్చు.
పైన చెప్పిన అన్ని కేసుల్లోనూ సేవ చేయాలనే కోరికకీ వ్యక్తిగత లక్ష్యాలకీ ఉన్న స్పర్ధ ని గమనించ వచ్చు.
కాబట్టీ సమాజ సేవ కోసం వ్యక్తి గత లక్ష్యాలను కొన్నిటిని వదులుకోవాలా? అలా వదులుకొంటే ఎంతవరకూ వదులు కో వచ్చు? ఎంత వరకూ వ్యక్తి గత లక్ష్యాలను వదులుకోవచ్చు అనేది చాలా వరకూ subjective decision. కానీ సమాజ సేవ అనేది negative terrain లోకి వెళ్ళే కొన్ని బోర్డర్ కేసులు ఉంటాయి. అంటే ఒక పరిధికి మించి లోక సేవ చేయటం మంచిది కాదు. అది వ్యక్తి గతమైన బలహీనతో, లేక మానసిక రోగమో అవుతుంది.
ఒక వ్యక్తి బాల కార్మిక సమస్య కి వ్యతిరేకం గా పోరాడుతున్నాడనుకొందాం. అతను ఆ పని లో నిద్రాహారాలు మాని, అనేక వత్తిడులకి లోనయి తే, నిస్సందేహం గా అతని సమాజ సేవ ఒక ప్రమాద కరమైన (బలహీనత/అడిక్షన్/అబ్సెషన్/మానసిక రోగం) స్థాయికి చేరుకున్నదనటానికి ఒక సంకేతం గా భావించవలసి వస్తుంది. అతని సేవా కార్యక్రమం వలన ముందు అతని ఆరోగ్యం దెబ్బతింటుంది.అతని కుటుంబ జీవితానికి సమయం తగ్గి కుటుంబం లో కలతలు వచ్చే అవకాశం కూడా లేక పోలేదు. తద్వారా అతని సేవా కార్యక్రమం కూడా ఆగిపోతుంది కదా! అదే , అతను తన గురించీ, తన కుటుంబం గురించీ తగు శ్రధ్ధపెడితే తన సేవా కార్యక్రమాన్ని దీర్ఘకాలం నాణ్యమైన పనితీరు తో నడిపించవచ్చు.
విమానాలలో ప్రయాణించే టప్పుడు, ఆక్సిజన్ మాస్క్ వేసు కోవటానికి సూచనలు ఇస్తారు. “ఏదైనా ప్రమాదం జరిగి మాస్క్ వాడవలసి వస్తే, మీ పక్కన ఉండే పిల్లలకు కాక, ముందు మీరు మాస్క్ వేసుకోవాలి”, అని చెప్తారు. మీరే మాస్క్ వేసుకొనక పోతే, పిల్లలను రక్షించలేరు కదా! కాబట్టీ, అదండీ మన వ్యక్తి గత జీవితానికీ సమాజ సేవా జీవితానికీ మనం పాటించవలసిన సమతూకం! ఇక సమానత్వం సంగతి అంటారా..ఇక్కడ సమానత్వం వలన నష్టం వస్తుంది, గమనించారా! మనమూ మన పక్క కూర్చొన్న చిన్న పిల్లా సమానమని భావించి ఇద్దరికీ ఒకే సమయం లో మాస్కులు తొడిగితే, చివరికి ఎవరికీ మాస్కులు తొడగలేక అసలుకే మోసం వస్తుంది.
“ఆ బోడి చెప్పొచ్చావులే, ఈ కాలం లో సమాజ సేవ చేయాలని ఎవరికి ఉంటుంది అంటారా?”, కరక్టే నండీ..నా బ్లాగు ద్వారా ఏదో ఒకటి వాగటం నా బలహీనత అనుకొంటా..! ఇక ఉంటా..బై!
ఇతరుల అభిప్రాయాలను ఎందుకు గౌరవించాలి?
25 అక్టో 2011 అభిప్రాయములు
in మేధోపరం, సమాజం ట్యాగులు:opinion
తెలుగు అంతర్జాలం లో తెలంగాణా, స్త్రీ వాదం , కులం వంటి అనేక విషయాల మీద వాదోప వాదాలూ, చర్చలూ జరుగుతుంటాయి. ఈ చర్చలలో తరచూ అభిప్రాయాలే వాస్తవాలు గా చెలామణి అవుతున్నట్లని పిస్తుంది. ఎదుటి వారి అబిప్రాయాలను గౌరవించేవారి సంఖ్య చాలా తక్కువ.
స్టాటిస్టిక్స్ లో sampling theory అని ఒక సిధ్ధాంతం ఉంది. దానిని ఇక్కడ వివరిస్తాను కొంచెం ఓపిక పట్టండి.
ఒక పెద్ద బుట్టలో నాలుగు రంగుల గోళీలు , ఒక్కో రంగు గోళీలూ 1000 సంఖ్యలో ఉన్నాయనుకొందాం.బుట్టలోని ఈ అన్ని రంగుల గోళీలనూ కలగాపులగం గా కలిపేశామనుకొందాం. ఈ బుట్ట మన సమాజం వాస్తవం గా ఉన్న స్థితిని ప్రతిబింబిస్తుంది.గోళీల రంగులు సమాజం యొక్క లక్షణాలైన సమానతా, అధికారం, అభివృధ్ధీ మొదలైన లక్షణాలను ప్రతిబింబిస్తాయనుకొందాం.
మనం ఈ బుట్టలోంచీ ఒక గుప్పెడు గోళీలు తీస్తే ఆ గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉండవచ్చు. దీనిని మనం ఒక biased sample అంటాం.బుట్టలో అన్ని రంగుల గోళీలూ సమాన సంఖ్యలో ఉన్నప్పటికినీ మనం తీసిన గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉన్నాయి. మన గుప్పెడు గోళీలూ మన వ్యక్తి గత అనుభవాన్ని సూచిస్తాయి.అయితే ఈ అనుభవం లో కూడా patterns ఉంటాయి.నల్ల గోళీల బరువు మిగిలిన రంగు గోలీల బరువు కన్నా ఎక్కువ అనుకొందాం. బుట్ట కిందికి నల్ల గోళీలు ఎక్కువ చేరుతాయి. తరువాత అక్కడ (బుట్ట అడుగు) నుంచీ తీసిన sample లో నల్ల గోళీలే ఎక్కువ ఉంటాయి. ఉదాహరణ కి, ఒక గ్రామీణ దళితుడి అనుభవం లో ‘కుల వివక్ష’ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మన పక్క వ్యక్తిని ఇంకో గుప్పెడు గోళీలు తీయమంటే అతని గుప్పెటకి తెలుపు రంగు గోళీలు ఎక్కువ రావచ్చు. అలానే ఒక పెద్ద గిన్నె తో గోళీలను తీసినట్లైతే ఆ గిన్నెలోని వివిధ రంగుల గోళీల సంఖ్య మధ్య అంతరం తగ్గుతుంది. అంటే sample పెద్దదయిన కొద్దీ అది వాస్తవ పరిస్థితికి దగ్గరవుతుందన్నమాట. అంటే ఒక విషయం లో మన వ్యక్తిగత అనుభవం పెరిగే కొద్దీ, ఆ విషయం పై మనం వాస్తవానికి చేరువవుతున్నామన్నమాట.అయితే, ఒక attitude తొ మొదలుపెట్టి దానికి విరుధ్ధమైన విషయాలను తమ మది లోకి రాకుండా తిరస్కరిచే వారు, అ విరుధ్ధమైన విషయాలలో ముందుకు సాగరు. ఆ విషయాలలో వారికి అనుభవం ఉన్నా , ఆ విషయాలలో వారు ఎదగరు.
గుప్పెట తో గోళీల sample తీసెటపుడు, మనం తెలివిని ఉపయోగించనవసరం లేదు. కానీ అభిప్రాయాలను ఏర్పరచుకోవటానికి మన అనుభవాలను తెలివితో విశ్లేషించి more objective అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.
ఇక అంతర్జాల చర్చల విషయానికి వస్తే, అనేక మంది రాగద్వేషాలతో చర్చలు చేస్తుంటారు. విషయాన్ని అన్వేషిద్దాం అని కాక తమ వాదనే గెలవాలి అని వాదిస్తుంటారు.. ఒక విషయం పై ఎవరి అనుభవం ఎంతో మనకు తెలియదు. కొంతమంది wishful tinking తొ మాట్లాడుతారు.ఆదర్శాల , సిధ్ధాంతాల రంగు కళ్ళజోడులు పెట్టుకొని మాట్లాడుతారు.అనామకం గా దుర్బుధ్ధి తో దుర్భాషలాడతారు,వారి భౌతిక మనుగడ కి ముప్పు లేదు కా బట్టీ! వారి వారి వ్యక్తిత్వం, ఇష్టాఇష్టాలు బట్టి మాట్లాడుతారు.ఇంకొందరు వారికున్న ఇతరేతర లాభ నష్టాలను(vested interests) బట్టి, చర్చలలో వాదాలు లేవ నెత్తుతారు. ఒక మనిషికున్న ఇటువంటి బలహీనతలన్నిటినీ పక్కన పెడితే, మన అభిప్రాయం అనేది మన అనుభవం అనే biased sample నుండీ పుడుతుంది. అలానే ఎదుటి వారి అభిప్రాయాలు కూడా biased అయి ఉంటాయి. ఈ అభిప్రాయాలు వాస్తవాన్ని ఎంతవరకూ ప్రతిబింబిస్తాయి అనేదానికి ఒక కొలబద్ద లేదు.
కాబట్టీ, ఒక విషయం లో మన అభిప్రాయం ఎంత కరక్టో, ఎదుటి వారి అభిప్రాయం కూడా అంతే కరక్ట్.
శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే కొంత వాస్తవానికి దగ్గరగా రాగలవు. శాస్త్రం కూడా తన పరిశోధనల ఫలితాలలో కొంత bias ను అంగీకరిస్తుంది. అది వేరే విషయం.
అందుకే మనకు మన అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనిపించినా, అది కేవలం మన “అభిప్రాయం” మాత్రమే అని గుర్తెరిగి, ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించటం మంచిది.
ఈ పైన చెప్పింది నా అభిప్రాయం మాత్రమే
. మరి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండేం..?
చదువుల వలన సృజనాత్మకత తగ్గుతుందా?
28 అక్టో 2011 వ్యాఖ్యానించండి
in సైన్స్ ట్యాగులు:creativity
ఈ మధ్య పత్రికలలో ఒక విషయాన్ని పదే పదే చెప్తున్నారు….. బిల్ గేట్స్ చదువుకోలేదు, న్యూటన్, ఎడిసన్ వంటి శాస్త్రవేత్తలకు చదువు (formal education) లేదు. వికీ లీక్స్ సృష్టికర్త అసాంజ్ కి కూడా చదువు లేదు. కాబట్టీ చదువులు చదవని వారి సృజనాత్మకత ఎక్కువ…. ఈ దృష్టాంతాలను చూపించి మామూలు చదువుల ఉపయోగాన్నీ, ఉత్పాదకతనీ కొందరు పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారు. సంచలనాల కోసం చూసే మాధ్యమాలకి దీనివలన కొంచెం మేత దొరక వచ్చు గానీ, దీనిని ఇంకొంచెం దగ్గర గా మనం పరిశీలిద్దాం..
మనలో చాలా మంది పల్లెల లో మూలాలు ఉన్న వారే. మన తో పాటు చిన్నప్పటి స్నేహితులలో కొంత మంది బడి ఎగ్గొట్టి పొలాల వెంబడీ, కాలువలూ చెట్లూ పుట్టలూ పట్టుకొని తిరిగిన వారు ఉంటారు. వారు తరువాత జీవితం లో సృజనాత్మక ఆవిష్కరణలు ఏమాత్రం చేస్తారో మనం ఎరిగిన విషయమే.వారు ఏ గొడ్ల కాపరులు గానో మారుతారు. కాబట్టీ మామూలు చదువులు చదవని వారంతా సృజనాత్మకులైపోరు. చదువులు చదవనంత మాత్రాన సృజనాత్మకత ఉట్టిపడదు. వారు వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాక పోయి ఉండవచ్చు. అయినా అందులో సృజనాత్మకత ఏమీ లేదు. చదువుకొంటే కనీసం వారు మామూలు ఉద్యోగాలు అయినా చేసుకొనేవారు.
ఒక ప్రతిభావంతుడైన వ్యక్తి, చదువు లేకుండా పరిశోధన మొదలు పెడితే, ఈ రోజులలో “గురుత్వాకర్షణ సిధ్ధాంతాన్ని”, మళ్ళీ కనిపెడతాడు. ఎందుకంటే, చదువుకోక పోవటం వలన, అతనికి ఆ సిధ్ధాంతం ఇప్పటికే కనిపట్టబడింది అనే విషయం తెలియదు. చదువు వలన ఇప్పటికే సమాధానం దొరికిన సమస్యల గురించి తెలుస్తుంది.
వ్యవస్థీకృత విద్య వలన మనుషుల ఆలోచనా ధోరణులు (thought patterns ) ప్రభావితం(condition) అయ్యే మాట నిజమే! ఏదైనా ఒక కొత్త విషయాన్ని అన్వేషిస్తూ పరిశోధన జరిగినపుడు ,అనేకమైన పరిష్కార మార్గాలను పరిగణించాలి. అవి ఇప్పటికే ప్రయత్నించబడనివి అయి ఉండాలి. కానీ ఈ పరిష్కార మార్గాలలో ఇప్పటికే శాస్త్రపరిజ్ఞానం కొట్టి పారేసినవీ, పని చేయనివీ చాలావరకూ ఉంటాయి.కొన్ని పరిష్కారాలు అప్పటికే వ్యవస్తీకృత విద్యకు తెలిసినవై ఉంటాయి. కొన్ని మాత్రం పని చేసే సరి కొత్త పరిష్కారాలు ఉంటాయి. ఈ కొన్ని పరిష్కారాల విషయం లో వ్యవస్థీకృత విద్య అర్జించిన వారి అలోచనా ధోరణి, అప్పటికే ఉన్న వ్యవస్థ (అప్పటికే ఉన్న పరిష్కారాల) వలన ప్రభావితమై ఉంటుంది. దరిమిలా, వారి ఆలోచనలకు ఈ కొత్త విషయాలలో ఉండే స్వేఛ్ఛ (degree of freedom) తక్కువ గా ఉండే అవకాశం ఉంటుంది. వారు ఈ ప్రభావాల నుండీ బయట పడి(unlearning), స్వేఛ్ఛ గా ఆలోచించటం వీరి ముందున్న ఒక సవాల్. అయితే, రిచర్డ్ ఫేన్మాన్ వంటి చాలా మంది శాస్త్ర వేత్తలు వివిధ రంగాలలో పని చేయటం ద్వారా ఈ పరిమితిని అధిగమించటానికి ప్రయత్నించారు. దీని వలన ఒక రంగం లోఉన్న పరిభావన (concept) ను వేరొక రంగం లో అన్వయించటానికి కుదురుతుంది.
ఇక చదువు లేని కొందరి లో, వారి ఆలోచనా విధానం వ్యవస్థీకృత విద్య వలన ప్రభావితం కాకపోవటం వలన, కొత్త పరిష్కారాలను అన్వేషించటానికి వారికి ఉండే స్వేఛ్ఛ పెరుగుతుందనటం లో సందేహంలేదు. (రాజు గారికి బట్టలు లేవని చిన్న పిల్ల వాడు చెప్పినట్లు).
మనం చిన్న పిల్లల ఆలోచనలలో ఈ వైవిధ్యాన్ని చూడవచ్చు. ఉదాహరణ కి ఒక మొబైల్ ఫోన్ ఒక చిన్న పిల్లవాడికిస్తే వాడు దానిలో మనం అన్వేషించని అనేక విషయాలను ప్రయత్నించి చివరికి దానిని మనకి అర్ధం కాని ఏదో ఒక స్థితికి తీసుకొని వెళ్తాడు. ఈ వైవిధ్యమైన ఆలోచనలలో అన్నీ పనికి రాకపోయినా, కొన్నిటివలన ఉపయోగం ఉంటుంది.అలానే, చదువుకోని వారి కి కూడా ఇటువంటి స్వేఛ్ఛ ఉంటుంది. కానీ అన్ని సమయాలలోనూ ఇటువంటి స్వేఛ్ఛ వలన ఉపయోగం ఉండకపోవచ్చు. ఉపయోగం ఉండే స్థాయిలో ఫలితాలను ఇవ్వగల మేధావులు చాలా అరుదు గానే ఉంటారు.
చదువు వలన ఆలోచనల స్వేఛ్ఛ కొంతవరకూ తగ్గినా, ఆలోచనలకు పదును పెట్టే అనేక పరికరాలు(tools) అప్పటికే ఉన్న సిధ్ధాంతాల, ఆవిష్కరణల రూపం లో దొరుకుతాయి. కాబట్టీ, పిల్లలను చదువులకు దూరం గా ఉంచటం కాక, చదువుకుంటూనే వారు తమ open mindedness ని కోల్పోకుండా ఉంచటం అనేది ఒక చాలెంజ్. వ్యవస్థీకృత విద్య పొందిన అనేక మంది కూడా సృజనాత్మక ఆవిష్కరణలు ఎన్నో చేశారు కదా!
భావోద్వేగాలు ఎన్నిరకాలు?
27 అక్టో 2011 అభిప్రాయములు
in అవర్గీకృతం
భావోద్వేగాల గురించి నెట్ లో వెతుకుతూ ఉంటే, నాకు కనపడిన ఒక interesting document(English) కింద నుంచీ దించుకోండి. .
నేను శోధించిన ప్రశ్న: “భావోద్వేగాలు మన జ్ఞాపకాల(memory)లో స్టోర్ అవుతాయా?”
సమాధానం: కావు. భావోద్వేగాలు వర్తమానం లోని సంఘటనలకి మన మనస్సూ శరీరం చేసే ప్రతిక్రియ మాత్రమే. అయితే భావోద్వేగాలకు సంబంధించిన సమాచారం (information) మాత్రం మన జ్ఞాపకాలలో నిక్షిప్తం(store) అవుతుంది. అంటే అది ఏ రకమైన భావోద్వేగం..కోపమా, భయమా, సిగ్గా మొదలైన గుర్తులు (symbols) మాత్రం మన మెమరీ లో ఉంటాయి. భావోద్వేగాలు కూడా మన జ్ఞాపకం లో భాగమైతే అప్పుడు జరిగిన సంఘటనల గురించి మన మానసిక అనుభవం(జ్ఞాపకం తెచ్చుకోవటం) “వీడియో ప్లే బ్యాక్” లా ఉంటుంది. అంటే ఆటే సమాచారం మిస్ కాదు. మళ్ళీ మనకు పాత అనుభవం మానసికం గా యధాతధం గా అవుతుంది.
కొన్ని కులాల ప్రాధమిక విలువలు..
04 నవం 2011 అభిప్రాయములు
in సమాజం ట్యాగులు:primary values of castes
నేను “ఒక అమెరికా వాడి రైలు బండి ప్రయాణం” కథ రాసిన తరువాత నాలో update అయిన అవగాహన ఇది.
మానవ సమూహాలన్నిటికీ ఉన్నట్లే, కులాలకు కూడా ప్రాధమిక విలువలు(primary values) ఉంటాయి. ఐరోపా ఖండం లో యూదులను “చాలా ప్రతిభ కల వారి గానూ”,” జిత్తుల మారి వారి” గానూ చూసేవారు. ఇది ఒక మూస గుద్దుడు వ్యవహారం (stereo type) కావచ్చు. కానీ ఈ మూస లో కూడా కొంత సత్యం ఉంటుంది. నిప్పులేనిదే పొగ రాదని అంటారు కదా!
మానవ సమూహాలనంటికీ ఉన్నట్లు గానే, కులాలకీ ప్రాధమిక విలువలు ఉంటాయి. ఒక కులానికి సంబంధించిన ప్రాధమిక విలువ ఆ కులం లోని ప్రసిధ్ధులూ, పెద్దల ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలు ఆ కులం వారి వృత్తి మీద కూడా ఆధాపడి ఉంటాయి. ఆయా కులాలకు మిగిలిన విలువలు ఉండవని కాదు. వారి మిగిలిన విలువలనన్నిటినీ కూడా చివరికి ఈ ప్రాధమిక విలువలలోకి convert చేయవలసిందే! వారికి మిగిలిన విలువలని వారి ప్రాధమిక విలువలోకి మార్చి చెప్తేనే వారు దానిని మెరుగ్గా appreciate చేయగలరు.ఒక కులం లోని అందరు వ్యక్తులకీ ఈ ప్రాధమిక విలువలు వర్తించక పోవచ్చు.
ఈ ప్రాధమిక విలువలు ఆయా కులాలలో కూడా స్థలాన్ని బట్టీ , కాలాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. అలానే ఒకే కులం లోని దిగువ తరగతి వారి విలువలూ , ఎగువ తరగతి వారి విలువలూ ఒకే విధం గా ఉండవు.
మనం మధ్య తరగతిని మాత్రమే పరిశీలిద్దాం. మీరు పెళ్ళి కుమారుడి తరపున ఒక పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారనుకోండి. మీ కులం ఏ కులం వ్యక్తి తో మాట్లాడేటపుడు ఆ కులం గా ఊహించుకోండి.
ఒక బ్రాహ్మణ కులం కి చెందిన వ్యక్తి తో మీరు “పలానా వాళ్ళ అబ్బాయి కి పది లక్షల సంపాదన ఉందట ” అన్నారనుకోండి, అప్పుడు అతను, “అలానా! ఆ అబ్బాయి ఏమి చదివాడు? ఏ ఉద్యోగం చేస్తున్నాడు” అని అడిగే అవకాశం ఉంది. దీని వలన మనకు ఈ కులం ప్రాధమిక విలువ “విద్య, ఉద్యోగం” అని అర్ధమౌతుంది.
ఒక కమ్మ కులం కి చెందిన వ్యక్తి తో, “పలాన కుర్రాడికి పలానా పెద్ద qualification ఉందట”, అంటే, “మంచిది, ఎంత సంపాదిస్తాడంటాడు?” అనే ప్రశ్న తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ డబ్బు అని చెప్పనక్కరలేదు కదా!
అలానే ఒక రెడ్డి గారి ముందు, కుర్రవాడి డబ్బు ప్రస్తావన తెస్తే, “అతని హోదా (rank) గురించి” అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ సమాజం లోని rank.
గోదావరి జిల్లాల నాయుడు గారు కట్నం గురించిమాట్లాడేటపుడు, “ఎన్ని ఎకరాల కొబ్బరి తోట లేక వరి పొలం?”, అని మాట్లాడే అవకాశం ఉంది. ప్రాధమిక విలువ “భూమి”.
ఒక S.C వర్గానికి చెందిన వ్యక్తి పెళ్ళి కుమారుడి చుట్టాల లో ఎవరు పెద్ద ప్రభుత్వ అధికారులో తెలుసుకొని సంతోషించే చాన్స్ ఉంది. ప్రాధమిక విలువ,”వ్యవస్థీకృత అధికారం”
వైశ్యులు, “కుర్రవాడు నేర్పుగా జాగ్రత్త గా ఉండి, పొదుపు స్వభావం కలవాడా?” అనే విషయం చూడవచ్చు. కుర్ర వాడు ఉద్యోగి అయితే, అతనికి ఎంత మిగులుతుంది అని చూడవచ్చు. “నికర లాభం”, ప్రాధమిక విలువ.
ఈ ప్రాధమిక విలువలు అన్ని కాలాలలోనూ ఒకే విధం గా ఉండవు. ఒకప్పుడు “పెద్ద ప్రభుత్వోద్యోగులై ఉండటం” అనేది, బ్రాహ్మణ వర్గం లో ఒక విలువ. నేడు ఆ విలువ SC వర్గానికి బదిలీ అవుతున్నట్లున్నది.
ఈ ప్రాధమిక విలువల లో ఏ కులం విలువా ఇతర కులాల విలువల కంటే గొప్పదీ కాదు, తక్కువా కాదు. కాక పోతే ఒక వర్గానికి చెందిన విలువ ఇంకొక వర్గానికి నచ్చదు. ఏ వర్గానికి చెందిన విలువ ఆ వర్గానికి సరైనది గా కనిపించవచ్చు. ఇతర వర్గాలపై మన అయిష్టాన్ని వ్యక్తం చేయటానికి ఆ వర్గం విలువలను తప్పుపడతాం.మన కులం గురించి ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, మన కులపు ప్రాధమిక విలువ చెడ్డది గా కనపడటం కూడా జరుగుతుందనుకోండి!ఈ ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, వెరే కులాలలో మనం నిరసించిన విలువని, మన వర్గం మాత్రం సాధించాలని వాదించటం కూడా కద్దు.
ఇంతకు ముందు ఓ టపా లో చెప్పినట్లు, పైన చెప్పినవి “కేవలం నా అభిప్రాయాలే“, మీ అభిప్రాయాలు భిన్నం గా ఉండవచ్చు.
ఈ నాటి ఆర్ధిక వ్యవస్థ లో కుల వ్యవస్థ వలన లాభం
10 నవం 2011 అభిప్రాయములు
in సమాజం ట్యాగులు:The new caste system
కుల వ్యవస్థ ఆచరణ లోని లోపాలూ నష్టాలగురించి అభ్యుదయ వాదులను కానీ, దళిత వాదులను కానీ అడిగితే వారు దానిలోని వివక్ష గురించీ, మానవత్వ లేమి గురించీ చెబుతారు. వారు చెప్పేవి చాలావరకూ సమంజసమైనవే కూడా! కానీ, ఈ నాటి మన ఆర్ధిక వ్యవస్థను చూస్తుంటే నాకు కుల వ్యవస్థ లో ఒక మంచి లక్షణం కూడా కనిపించింది.
ఈ రోజుల్లో సమయాన్ని బట్టి మొదట ఏదో ఒక ఉద్యోగానికి మంచి గిరాకీ ఉంటుంది. ఉదాహరణ కు “ఐ టీ”,లేక పోతే “ఐ టీ లో SAP”. ఎందుకంటే ఆ ఉద్యోగం లో డబ్బులు బాగా వస్తాయి. ఇక దానితో సమాజం లోని అన్ని వర్గాలవారూ, అన్ని చదువుల వారూ పోలో మని ఐటీ ఉద్యోగాల కోసం ఎగబడతారు. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం, ఆ ఉద్యోగాలకోసం వచ్చేవారి సంఖ్య ఎక్కువ అవటం తో సప్లై ఎక్కువ అవుతుంది. సప్లై ఎక్కువ అయిన వస్తువు ధర (ఉద్యోగి జీతం) తగ్గిపోతుంది.లేక పోతే ధర కొన్నేళ్ళ పాటు నిలకడ గా ఉంటుంది. ద్రవ్యోల్బణం ని లెక్క లోకి తీసుకొంటే ఇది వారి జీతం తగ్గటం తో సమానం. ఆ విధం గా ఆయా ఉద్యోగాలలోని జీతాలు తగ్గు ముఖం పడతాయి. ఉద్యోగాలు పరిమిత సంఖ్య లో ఉంటాయి. కానీ అభ్యర్ధులు అపరిమితం గా ఉంటారు. అంటే కొందరు అభ్యర్ధులకు ఎప్పటికీ ఉద్యోగాలు రావు. కానీ ఇతర రంగాలను వదిలి పెట్టి ఈ రంగానికి వచ్చిన ఆ అభ్యర్ధులు దీపం చుట్టూ పురుగుల్లా ఈ ఉద్యోగాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వ్యక్తిత్వ వికాసం అంటూ కోచింగ్ సెంటర్ లు పుట్టుకు వస్తాయి అందరూ వాటిలో చేరి గొప్ప వ్యక్తిత్వం సాధిస్తే, ఎవరికీ మిగిలిన వారి మీద ఆధిక్యత ఉండదు. మళ్ళీ అందరూ సమానమే! కానీ ఉద్యోగాల సంఖ్య పరిమితం. ఈ విధం గా నిరుద్యోగం పెరిగిపోతుంది. మిగిలిన రంగాలు విద్యా, వైద్యం వంటివి, నిర్లక్ష్యానికి గురవుతాయి. మళ్ళీ కొంత కాలానికి ఆ రంగాలలో జనాల కొరత కారణం గా మంచి రోజులు వస్తాయి. ఈ మొత్తం సైకిల్ మళ్ళీ ఆయా రంగాలలో రిపీట్ అవుతుంది.ఈ మధ్య నిర్మాణ రంగం లో సివిల్ ఇంజనీర్లకి గిరాకీ పెరిగినట్లు.
వ్యవసాయం వంటి రంగాల నుంచీ ఐటీ వంటి ఉద్యోగాలకు వచ్చిన వారు ఉంటారు. కొన్నేళ్ళకి వ్యవసాయం చేసే వారు ఎవరూ లేక మళ్ళీ ఆ రంగం గిట్టుబాటు కావటం మొదలౌతుంది. కానీ, అప్పటికి కార్పొరేట్లు భూములన్నీ కొనేసి ఆ లాభాన్ని తన్నుకొని పోతాయి.
డబ్బుకోసం పెట్టే ఈ పరుగులో మొత్తానికి నష్టపోయేది మధ్యతరగతి కుటుంబ రావులే!
కుల వ్యవస్థ ఉన్నపుడు, సమాజం లోని వివిధ కులాల వారు వంశపారంపర్యం గా తమ కుల వృత్తినే చేయ వలసి వచ్చేది. డిమాండ్ ని బట్టీ, డబ్బుని బట్టీ వేరే రంగానికి పరుగులు తీసే అవకాశం ఉండేది కాదు. కాబట్టీ సమాజానికి అవసరమైన అన్ని రంగాల్లోనూ నైపుణ్యాల కొరత, (లేక అధికమైన సప్లై) ఉండేది కాదు. డిమాండ్ కీ సప్లై కీ మధ్య సమతూకం ఉండేది.
అలానే, ఒకప్పుడు అమలు లో ఉన్న వస్తుమార్పిడి విధానం లో కూడా, డబ్బులా వస్తువులను అపరిమితం గా కూడబెట్టటానికి అవకాశం ఉండేది కాదు. కొంతవరకూ భూమిని కూడబెట్టే వారు. కానీ భూమిని ఎంతవరకూ కూడబెట్టగలరు?ఎంతవరకూ నిలువ బెట్టవచ్చు? డబ్బు ని అంతులేకుండా కూడబెట్టవచ్చు.దాయవచ్చు. నిలువబెట్టవచ్చు. డబ్బు మొదలయిన నాటి నుంచీ అసమానతలు విపరీతం గా పెరిగిపోయాయి.
ఈ ఆధునికకాలం లో కొత్త కులాలు ఉంటే బాగుంటుందనిపిస్తుంది. సమాజానికి అవసరమైన అన్ని వృత్తులూ..ఉదాహరణ కి ఇంజినీర్ల కులం, వైద్యుల కులం, పోలీసుల కులం, న్యాయవాదుల కులం ఇలా..
ఏ కులమూ ఇతర కులాల కంటే ఎక్కువ కాదు. అలానే అందరి జీతాలూ, ఆర్ధిక వ్యవస్థ లోని డిమాండ్ మీద ఆధార పడకుండా, సమానమైన స్కేళ్ళలో ఉంటే బాగుంటుంది. ఒక కులం లోకి ప్రవేశించాలంటే, ఆ వృత్తి పై ఉన్న ఆసక్తే (వృత్తిలోని డబ్బు పైన కాదు) అర్హత కావాలి. ఎలా ఉందంటారు నా కుల తత్వం..?
అవినీతిపై మంచుపల్లకీ గారి టపా-కొన్ని ఆలోచనలు
12 నవం 2011 అభిప్రాయములు
in సమాజం
రాత్రి తెలుగు బ్లాగ్-సాగరం లో పడి ఈదుతూ ఉంటే మంచు పల్లకీ గారు అవినీతి గురించి రాసిన టపా కనపడింది. ఆ టపా లో ఆయన “మనమందరం మన పరిధులలో అవినీతిపరులమేనంటూ, ప్రక్షాళణ మన నుంచీ మొదలు కావాలని చెప్పారు.”
దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నా బుర్రలో ఈ ఆలోచనలు కూడా వచ్చాయి…
అవినీతీ, పర్యావరణం మొదలైనవి మానవాళి మొత్తం ముందున్న సమస్యలు. వీటికి ఒక పౌరుడి గా మనవంతు బాధ్యత తప్పనిసరి గా ఉంటుంది. అయితే సమాజం లోని అందరికీ సమాన బాధ్యత ఉంటుందా?
ఒక వ్యవస్థ లో మనిషి అధికారమూ హోదా పెరిగితే అదే స్థాయి లో బాధ్యతలు పెరగాలి. మన రాజకీయ నాయకులకు మనకంటే ఎక్కువ హోదా, అధికారం ఉంటాయి. కాబట్టీ వారికి అదే స్థాయి లో ఈ సమస్యల పట్ల మనకంటే బాధ్యతకూడా ఎక్కువ గా ఉండాలి. కానీ, వారి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారా? చాలా వరకూ నిర్వర్తించకపోవటమే కాక, ఒక్కోసారి అసలు సమస్యనే వారు మొదలుపెడుతున్నారు.
మన ఆఫీస్ లో మనకు మన హోదాలో అనేక బాధ్యతలు ఉంటాయి. వాటిని నిర్వర్తించకపోతే మనకు అప్రైజల్ టైం లో మూడుతుందని తెలుసు. కాబట్టీ, మనం మన బాధ్యతలను నిర్వర్తించటానికే మొగ్గు చూపుతాం…మరి రాజకీయ నాయకుల అప్రైజల్ ఎవరు చేస్తారు? మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలే ప్రభువులు. రాజకీయ నాయకుల అప్రైజల్ చేయటమే కాకుండా వారిని అపాయింట్ చేసేది కూడా ప్రజలే! కాబట్టీ మన వ్యవస్థ లో ప్రజలకు నాయకులను ఎన్నుకొనే హక్కుతో పాటు వారు వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించేటట్లు చూసే బాధ్యత కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే వారిని తరువాతి ఎన్నికలలో శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే! అలానే అవినీతి చేయని నాయకుడిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలదే!(ప్రజాస్వామ్యం లో ప్రజలకి బాధ్యతలు చాలా ఎక్కువ మరి! అధికారం ఉనంచోట ఎక్కదైనా బాధ్యతలూ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా! )
కానీ ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. ప్రజలందరి సమిష్టి బాధ్యత.
మనం మన వ్యక్తి గత పరిధి లో అవినీతి పనులు తగ్గించుకొనే నిర్ణయం తో పాటు, మన సమిష్టి బాధ్యత అయిన వోటు హక్కుని వ్యక్తిగత పరిధిలో విజ్ఞత తో ఉపయోగించుకొనే నిర్ణయం కూడా తీసుకోవాలి. వోటు వేయటం ఒక అధికారమూ బాధ్యతా కూడాను. వోటు హక్కుని సరిగా వినియోగించుకోవటానికి సరిపడా రాజకీయ జ్ఞానం సంపాదించటం, వీలయితే మన పరిధిలో నలుగురిని దీనిని గురించి చైతన్య పరచటం కూడా మన బాధ్యతే! ఉన్న నాయకులతో మనకు తృప్తిలేక పోతే, మన వ్యక్తిగత జీవితాలు ఆవిరికానంతవరకూ, రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం కూడా ప్రయత్నించాలి. అందరూ అరవింద్ కేజ్రీవాల్ లు కాక పోయినా కిరణ్ బేడీ స్థాయి లోనైనా కొంత మన వంతు బాధ్యత నిర్వర్తించాలి.
ఈ ఆలోచనల తరువాత నేను ఇంతకు ముందు రాజకీయ నాయకులను సమర్ధిస్తూ రాసిన టపా లోని నా అభిప్రాయాలను కొంతవరకూ సవరించుకోవలసిన అవసరం కనపడింది.
నేరమూ శిక్షా, చట్టాల పరిధులూ పరిమితులూ
28 నవం 2011 అభిప్రాయములు
in సమాజం ట్యాగులు:Crime and punishment
అప్పట్లో న్యాయస్థానం రాజీవ్ గాంధీ హంతకులకు శిక్షలు విధించింది. గుంటూరు శేషేంద్ర శర్మ గారు,”భగవద్గీతను ఉటంకిస్తూ, భగవంతుని ప్రమేయం లేకుండా ఏమీ జరుగదు. రాజీవ్ హంతకులు కూడా భగవంతుని ప్రమేయం తోనే హత్య చేసి ఉంటారు. కాబట్టీ ఆ హత్య లో వారు దోషులు కారు. వారిని శిక్షించ కూడదు.”, అని వాదిస్తూ ఒక వ్యాసం రాశారు. దానికి ఆయనను చాలా మంది విమర్శించారు.
అప్పట్లో నాకు ఆయన వాదన నిజమే కదా! అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే దానికి కౌంటర్ గా ఇలా వాదించవచ్చు అనిపిస్తుంది. “న్యాయస్థానాలు కూడా భగవంతుడు సృష్టించిన జీవ కోటి నుంచీ పుట్టిన మానవ సమాజం లోనివే. భగవంతుని ఇఛ్ఛానుసారమే ఆ వ్యవస్థ కూడా నేరస్థులను అదుపులో పెట్టటానికి శిక్షలను అమలు చేస్తాయి. కాబట్టీ, ఆశిక్షలు కూడా భగవంతునికి వ్యతిరేకం కాదు.”
భగవంతుని విషయాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి ఆలోచిద్దాం.
న్యాయాన్ని మానవ సమాజం తన దీర్ఘకాలిక మనుగద కోసం, సమాజం లో ఒక క్రమ పధ్ధతీ శాంతీ ఉండటం కోసం ఏర్పాటు చేసుకొంది. అయితే ఈ న్యాయస్థానాలు నైతికమైన విషయాలలో తీర్పులు ఇస్తాయి. ఒక సమాజం లో అనేక నీతులు ఉంటాయి. నీతి ఒక్కోసారి వ్యక్తిగతం గా ఉంటుంది. మనిషి మనిషి కీ మారుతుంటుంది. మరి న్యాయస్థానాలు అమలు పరిచే నీతి ఎవరి నీతి? అది అధిక సంఖ్యాకుల నీతి. ఒక్కోసారి అది బలవంతుల నీతి. ఒక సమాజం “ఒక్కరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం” నేరం అంటుంది.అదే సమాజం లో పెరిగిన వ్యక్తికి ఈ నియమం తెలుసు కాబట్టీ, అతను ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి దగ్గరగా వచ్చినపుడు, గిల్టీ గా ఫీలవుతాడు.అంటే ఇక్కడ, అతని అంతరాత్మ యొక్క నీతీ, సమాజం నీతీ, న్యాయపరమైన నీతీ ఒక్కటే.తరువాత అతనిని న్యాయస్థానం శిక్షించినా, అది సబబే అని అతనికి అనిపిస్తుంది.
ఇస్లామిక్ దేశాలలో ఒకరు కంటే ఎక్కువ భార్యలను కలిగి ఉండటం నేరం కాదు. అక్కడ పెరిగిన వ్యక్తి ముగ్గురిని పెళ్ళి చేసుకొని కూడా గిల్టీ గా ఫీలవడు. అతనిని అమెరికా చట్టం ప్రకారం శిక్షిస్తే, ఆ చట్టం చేసింది సరి అయినది అని అతను ఫీలవకపోవచ్చు. అలానే, ఆదిమ, పురాణ పురుషులను ఇప్పటి సమాజ, న్యాయ విలువల తో తూచటం సరి కాదు. శ్రీకృష్ణుడు తన అనేక భార్యల గురించి గిల్టీ గా ఫీలవాలనుకోవటం సరి కాదు కదా!
“మనం మన విలువల తోనే అంచనా వేస్తాం! ఇంకెవరి విలువల తోనో మనం ఎలా అంచనా వేస్తాం?”, అని ఎవరైనా అడగవచ్చు.
మన కాలానికీ ఆ కాలానికీ ఉమ్మడిగా కొన్ని సార్వజనీనమైన మానవ విలువలు ఉంటాయి. ఆ విలువల ప్రకారం వారిని అర్ధం చేసుకోవాలి.తన బాణం వేటుకి ఒంటరైన పక్షిని చూసి బోయవాడైన వాల్మీకి శోకించటం ఇలాంటి సార్వజనీనమైన మానవ విలువే!
సమాజం లోని కట్టుబాట్లూ విలువలూ తగ్గుతూ ఉంటే జనాలు న్యాయస్థానాల దగ్గరికి పరుగులు తీయటం ఎక్కువౌతుంది. ఇంకా సమాజ విలువలు కొద్దో గొప్పో ఉన్న మన గ్రామాలలో జనాలు కోర్టులకి వెళ్ళటం తక్కువ గా కనపడుతుంది. అలానే మానవీయ విలువలు తగ్గిన సమాజం లో కట్టుబాట్లు దురాచారాల రూపం లో బిగుసుకొనిపోతాయి. అప్పుడే మానవీయ విలువలు ఉన్న సంఘ సంస్కర్తలు సమాజ నీతిని ఎదిరించైనా ఒక మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తారు. ఈ సంస్కర్తలు చేసే పనులు మొదట సమాజం దృష్టి లో న్యాయ వ్యవస్థ దృష్టిలో నేరాలౌతాయి (రాజా రామ మోహన రాయల వంటి వారు మొదట సమాజం ఆక్షేపణ కు గురైనవారే). కానీ వీరి విలువలు సమాజ, న్యాయ విలువల కన్నా ఉన్నతమైనవి. వారికి తమ మానవ విలువల లో ఉన్న నమ్మకం కూడా అచంచలమైనది.క్రమం గా సమాజమూ, న్యాయమూ తమ తప్పు తెలుసుకొని సంస్కర్తల విలువలను అంగీకరిస్తాయి. తరువాత వీరి విలువలే సమాజ, న్యాయ విలువలు గా మారుతాయి. కాలం చలన శీలమైనది. కాలచక్ర గమనం తో పాటు ఈ సంస్కర్తలు తెచ్చిన విలువలు కూడా బూజుపట్టి ప్రగతి నిరోధకాలై, మళ్ళీ కొత్త విలువలకు వేదిక తయారు చేస్తాయి. ఈ చక్ర భ్రమణం అనంతం.
ఒక్కోసారి మన వ్యక్తి గత విలువలు సమాజ విలువలకి విరుధ్ధం గా ఉండవచ్చు. అప్పుడు మనం సమాజ విలువలను అంగీకరించం. ఆ విలువలను ప్రశ్నిస్తాం. అలా అని మన వ్యక్తిగత విలువలు సమాజ విలువల కంటే ఉన్నతమైనవని చెప్పలేం. ఈ సందర్భం లో సమాజ విలువలకి వ్యతిరేకం గా ఆలోచించటానికి మనం గిల్టీ గా ఫీల్ కాము. చలం తన పెద నాన్న కూతురిని పెళ్ళి చేసుకోవటానికి శృంగేరి పీఠాధిపతి అనుమతి కోరటం ఈ కోవలోకే వస్తుంది.
మన వ్యక్తి గత విలువలు న్యాయస్థానాల విలువల తో విబేధించినా, మన విలువలు న్యాయస్థానాల విలువల కనా ఉన్నతమైనవి అయినా కూడా చివరికి మనం న్యాయస్థానాల విలువలనే అంగీకరించాలి. లేకపోతే న్యాయస్థానం మనలని శిక్షిస్తుంది. న్యాయస్థానాలు నిరంకుశమైనవి మరి. మనకి “లా” ఏమి చెబుతోందో తెలియక పోయినా, దానిని ఉల్లంఘించినట్లైతే అది మనని శిక్షిస్తుంది. చూడండి న్యాయస్థానాల అన్యాయం!ఈ మాట పై కి అంటే, మళ్ళీ మనని contempt of court కింద శిక్షిస్తాయి
. ఎంచక్కా మన పెజాస్వామ్యం లో రాజకీయ నాయకులనైతే నోరారా తిట్టుకోవచ్చు. అప్పుడప్పుడూ చెంపదెబ్బలు కూడా కొట్టుకోవచ్చు
. (మనం వోట్ వేయం. వేసేవాళ్ళు డబ్బు తీసుకొని వేస్తారు. చివరికి తిట్టటానికి మాత్రం రా.నా. లను తిట్టుకోవచ్చు..ఎంచక్కా..)
కానీ, ప్రతి వాడూ తన సొంత విలువలను ప్రతిపాదిస్తే ఇక న్యాయస్థానాల మాట వినేవాడెవడు? అందుకే న్యాయస్థానాలు నిరంకుశం గా ఉండక తప్పదనుకొంటా! అలానే, న్యాయస్థానాలు “లా” తెలియని వారిని క్షమించేటట్లైతే, నేరస్తులు “లా” తెలిసినా, అది ఏం చెబుతోందో తనకు తెలియదని శిక్ష తప్పించుకొంటారు కదా! అప్పుడు న్యాయవాదులతో పనే ఉండదు.”లా” తెలుసుకోని వారికి శిక్ష నుంచీ exemption ఇస్తే, అందరూ “లా” ని తెలుసుకోకుండా ఉండేందుకు పోటీ పడతారనుకొంటా!
న్యాయ స్థానాల తీర్పులను ఫిర్యాదీలు విమర్శించటం మొదలు పెడితే వాటి తీర్పులను ఎవరూ నమ్మరు. తరువాత వాటి దగ్గరికి న్యాయం కోసం ఎవరూ వెళ్ళరు. న్యాయస్థానాన్ని విమర్శించటం అంటే, న్యాయస్థానం చెప్పే తీర్పుని అంగీకరించకపోవటం. అటువంటి వారు న్యాయం దొరుకుతుందన్న నమ్మకం తో మొదట న్యాయస్థానాన్ని ఎందుకు ఆశ్రయించారన్న ప్రశ్న వస్తుంది. తనకు అనుకూలం గా తీర్పు వస్తేనే తీర్పును అంగీకరిస్తాననటం సరి కాదు. తీర్పు తమకు అనుకూలం గా వచ్చినపుడు కూడా ఆ తీర్పును విమర్శించేవారు ఉండరు కదా? కాబట్టీ న్యాయస్థానాన్ని విమర్శించటానికి ముఖ్య కారణం తీర్పు వలన తమకు వచ్చిన నష్టం అయి ఉంటుంది. న్యాయస్థానం యొక్క పక్షపాతం అయ్యే అవకాశం తక్కువ. న్యాయస్థానాలు అన్నివేళల్లోనూ నిష్పాక్షికం గా వ్యవహరించవనుకోండి. వాటికి ఉండే biases, ప్రలోభాలు వాటికి ఉంటాయి. అది వేరే విషయం.అప్పుడు పై న్యాయస్థానాలకు అప్పీలు చేసుకొంటూ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళవచ్చు. కానీ సుప్రీం కోర్ట్ మీద ఎవరికి అప్పీలు చేయాలి?
క్రిమినల్ కేసుల్లో కేసు ఓడిపోయిన వ్యక్తి యొక్క న్యాయవాది అబధ్ధాలు చెప్పినట్లు కదా!(ఇదే లాజిక్ ప్రకారం ఎగువ కోర్ట్ లో వేరే గా తీర్పు వస్తే దిగువ కోర్ట్ జడ్జ్ గారు అబధ్ధం ఆడినట్లా? ) మరి ఆ న్యాయవాదిని ఎందుకు న్యాయస్థానం శిక్షించదు? అబధ్ధాలు చెప్పటం అతని “వృత్తి” కాబట్టీ నా? లేక అతను చెప్పిన అబధ్ధాల వల్లే సత్యం వెలుగులోకి వచ్చిందనా? ఒక న్యాయవాదిని జైల్లో పెడితే, తరువాత ఎవరూ కేసులు వాదించరనా?
ఇప్పుడు ఊరి నిండా న్యాయవాదులు ఉన్నా వారికి ఫీజు చెల్లించలేని మామూలు జనానికి వారి వలన ఏమి లాభం. కాబట్టీ పరిస్థితి ఇప్పుడు కూడా న్యాయవాదులు లేనట్లు గానే ఉండి. న్యాయ వ్యవస్థ ఖరీదైనదవ్వటం వలన మెజారిటీ జనాలకు అది అందుబాటులో లేదు. అంటే జనసామాన్యానికి అది ఉన్నా లేనట్లే. అది వారి కోసం రూల్స్ పెట్టటం మినహా, వారికి అవసరమైనపుడు అందుబాటు లో ఉండదు. దాని వలన వారికి మేలు జరుగదు. డబ్బు ఖర్చు పెట్టగల వారికి మన నత్త నడక న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సమయమూ, ఓపికా ఉండవు.
న్యాయస్థానాలు పిచ్చి వారూ, మానసిక వ్యాధి గ్రస్తులూ చేసిన నేరాలకు వారిని ఎందుకు శిక్షించవు? వారి నేరాల వలన కూడా ఇతరులు ఇబ్బంది పడతారు కదా? న్యాయ స్థానాలు ముందు “నేరం చేసే ఉద్దేశాన్ని(మోటివ్) చూస్తాయి. ఆ ఉద్దేశం ఉన్న వారిని శిక్షించటం ద్వారా ఇక ముందు వారి నేరం చేయాలనే కోరిక ను తగ్గిస్తాయి. అప్పుడప్పుడూ మనిషి నేర ఇఛ్ఛ కు కారణాలూ పరిస్థితులను పరిగణన లోకి తీసుకొంటాయి . కానీ ఈ కారణాలూ పరిస్థితులూన్యాయస్థానాల పరిధిలోనివి కాదు.న్యాయ స్థానాలు ఆ పరిస్థితులను మార్చలేవు. వాటిని గురించిన కొన్ని పరిశీలనలను తమ తీర్పులో పొందుపరచటం మినహా ఏమీ చేయలేవు. మొత్తానికి మనిషి నేర ఇఛ్ఛకి పరిస్థితులు కారణం అయినా, లేక దేవుడు ప్రసాదించిన స్వేఛ్ఛా సంకల్పం( ఫ్రీ విల్) కారణం అయినా, లేక పరోక్షం గా దేవుడే కారణం అయినా న్యాయస్థానాలు నేరం చేసే ఉద్దేశం నిరూపించబడినపుడు అసలే శిక్ష వేయకుండా ఉండవు. ఇది మామూలు వ్యక్తుల విషయం.
ఇక పిచ్చివాళ్ళ, మానసిక వ్యాధి గ్రస్తుల విషయానికి వస్తే,..వారి ఉద్దేశాలకీ, వారి వ్యక్తిత్వానికీ మధ్య సంబంధం అసాధారణం గా, అస్పష్టం గా ఉంటుంది. ఉదాహరణకి obsessive compulsive disorder ఉన్నవాళ్ళు సరిగ్గా తమ కోరిక కి విరుధ్ధం గా ప్రవర్తిస్తారు. వారికి అలా ప్రవర్తించే విషయం లో స్వేఛ్ఛ ఏమాత్రం ఉండదు. They are compelled to behave in that way. . అలానే schizophrenia ఉన్న వారు violent గా ప్రవర్తించే అవకాశం ఉంది. అలా ప్రవర్తించకుండా నిగ్రహించుకొనే సంకల్పం వారి మెదడులోకానీ, శరీరం లో కానీ ఉండదు. కాబట్టీ వారి ప్రవర్తనకు నేరం వారి రోగానిది. కుంటి వారి వైకల్యం పైకి కనపడుతుంది. కానీ వీరి వైకల్యం పైకి కనపడదు.కోర్ట్లు , అలాంటి వారిని శిక్షించటం ద్వారా, వారు తరువాత నేరాలను చేయటాన్ని తగ్గించటం కుదరదు.వ్యాధి ఉన్నంత వరకూ వారు నేరాలు చేయటానికే అవకాశం ఉంటుంది. అందుకే వారిని ఏ శరణాలయాలలోనో చేర్చమని న్యాయస్థానాలు సలహా ఇస్తాయి.
















