విశ్వం పుట్టుక కి కారణం లేదనటం హేతువాదమే!

బిగ్ బ్యాంగ్ తీరీ ప్రకారం, విశ్వం ఒక పెద్ద విస్ఫోటనం తో ప్రారంభమైంది. ఆ విస్ఫోటనం నుంచీ జరిగిన సంఘటనల ప్రవాహమే కాలం. అంటే విశ్వం తో పాటు కాలం కూడా పుట్టింది. కానీ, ఏ కారణం వలన బిగ్ బ్యాంగ్ పేలుడు జరిగింది?
బిగ్ బ్యాంగ్ కి ముందు అంతటా “ఏమీ లేని స్థితి” ఉండేది. ఆ స్థితి లో పదార్ధం లేదు, శక్తి లేదు,స్థలం లేదు. అనుభవించటానికి నువ్వూ నేనూ లేము. ఆ శూన్యం లో కాలం లేదు. కాలం ఉండటానికి ఏదో ఒక సంఘటన జరగాలి కదా! ఒక సంఘటన జరిగితే, ఆ సంఘటన నుంచీ సమయాన్ని లెక్కించవచ్చు. ఆ సంఘటన ముందు సమయాన్ని కొలవ వచ్చు. ఏ సంఘటనలూ జరగటానికి వీలులేని సందర్భం లో సహజంగానే సమయాన్ని ఊహించలేము. అది పరిపూర్ణమైన శూన్యం. దానిలో సాపేక్షత లేదు. అలానే అటువంటి శూన్యాన్ని నిర్వచించలేము (అన్ డిఫైన్డ్). కాబట్టీ విశ్వం పుట్టుకకి ముందు కాలం లేదు. కారణమూ ప్రభావమూ (కాజ్ అండ్ అఫెక్ట్) అనేవి కాలం లో జరిగే విషయాలు. కారణం ముందు జరిగి, తద్వారా దాని ప్రభావం పుడుతుంది. కాలం లేని చోట కారణమూ ప్రభావమూ ఉండవు. విశ్వం పుట్టుకతోనే కాలం ఏర్పడింది. పుట్టుకకు ముందు కాలం లేదు. కాలం లేని చోట కారణం కూడా ఉండదు. కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదు. ఇక ముందు,మన శాస్త్రవేత్తలు, కారణం లేని విషయాలని శోధించటానికి కూడా తమ పరిశోధనలను ఉపయోగించవలసి వస్తుంది.

universe

universe

ఆస్తికులు “ఈ విశ్వమే భగవంతుడు కనే ఒక కల లాంటిది” అని అంటారు. కల అనేది నిద్రలో ఉంటుంది. నిద్ర అనేది ఒక మనిషి శారీరక మానసిక పరిస్థితులవలన మొదలౌతుంది. ఎవరైనా మనకు కలలో జరిగే సంఘటనల కార్యకారణ సంబంధాలద్వారా, కల యొక్క పుట్టుక కారణాన్ని (మనిషి మానసిక, దైహిక పరిస్థితి, నిద్ర) కనిపెట్టాలంటే అది దాదాపు అసంభవం. అలానే ఈ విశ్వం లోని కార్య కారణ సంబంధాలతో విశ్వం పుట్టుక ముందు ఏమి ఉందో అన్వేషించటం కష్టమవ్వ వచ్చు. ఆస్తికుల విషయం లో, దేవుడు కనే కల లాంటిది ఈ విశ్వమైతే, మరి దేవుడిని ఎవరు సృష్టించారు? లేక, దేవుడు ఏదైన ఇంకా పెద్ద కలలోని వాడా? దీనికి సమాధానం, దేవుడు తను కనే కల(విశ్వం) లో భాగం కాదు.కాబట్టీ ఈ విశ్వం లోని సూత్రాలైన కార్య కారణ సంబంధాలను దేవుడికి అన్వయించలేము. దేవుడికి కారణం లేదు. మొత్తానికి సృష్టి జన్మ విషయానికి వచ్చేసరికి హేతువాదులూ, ఆస్తికులూ ఒకేరకమైన సమాధానాలు ఇస్తున్నారు. తేడా ఒక్కటే, ఆస్థికులు సృష్టి ఆదికి దేవుడి లో, ఒక మంచి లోక కల్యాణ కరమైన ఉద్దేశాన్ని (మోటివ్) చూస్తున్నారు. కానీ ఇక్కడ మనిషి, దేవుడిని మరీ తన రూపం లో ఊహించుకొంటున్నాడేమో! ఉద్దేశాలూ, ఇచ్చలూ మానవునికి ఉంటాయి. ఇవి అతనిలో జీవ పరిణామ పరం గా ఏర్పడతాయి. క్వార్క్లూ, పాజిట్రాన్లు ఏర్పడక ముందు జరిగిన బిగ్ బ్యాంగ్ కు భగవంతుడు కారకుడైతే, ఆయనకు జీవపరిణామం ద్వారా వచ్చిన “ఇఛ్ఛ” ను ఆపాదించటం సరి కాదేమో!ఇఛ్ఛ అనేది మనిషికి భౌతిక వాంఛల యొక్క పరిణామం వలన కలుగుతుంది కదా!

ఆస్తికత్వం దృష్టి తో చూసినా, నాస్తికత్వ దృష్టి తో చూసినా, మనం ఒక కారణం లేని మూలానికి వెళ్ళ వలసి వస్తోంది. కాబట్టీ, “ఈ విశ్వం పుట్టుక (లేక దేవుడు) కి కారణం లేదు”, అనటం హేతుబధ్ధమే!

About these ads

38 Comments (+add yours?)

 1. M.V.Ramanarao
  May 04, 2011 @ 10:21:21

  బిగ్ బ్యాంగ్ ఒక గోళం పేలుడువల్లఅందులో వున్నమహావిస్వమంతా విరజిమ్మబడి ఇప్పటికీ వ్యాకొచిస్తున్నదనిసైంటిస్టులు అంటారు. అంతకుముందు కాలం లేదు అన్నారు,నిజమే .కాని ఆ
  గోళం ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నమిగిలిపోతుంది. ఈ విశ్వమంతా ఎక్స్పాన్డాయి మళ్ళీ కల్పాంతంలో కాంట్రాక్టు అయిపోతుందట ,పురాణాల ప్రకారం. పోతనగారు రాసినట్లు
  “లోకంబులు ,లోకస్తులు ,లోకేశులు, తెగిన తుది నలోకంబగు పెంజీకటికావలవెలుగు “అనుకోవాలేమో .విశ్వం పుట్టుకకూ ,తరువాతకూడా కార్యకారణ సంబంధం ఉంది అనుకొంటాను.

  Reply

  • bondalapati
   May 04, 2011 @ 12:08:59

   @M.V.Ramanarao
   “గోళం ఎలా ఉద్భవించింది అనే ప్రశ్నమిగిలిపోతుంది.”
   సరిగ్గా ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వటం కోసమే నేను ఈ వ్యాసం రాసింది.
   ఈ గోళానికి కారణం లేదు. ఎందుకంటే,ఈ గోళం ఏర్పడటానికి ముందు కాలం లేదు, పదార్ధం లేదు, శక్తి లేదు.. కాలం లేనపుడు కారణమూ, కార్యమూ రెండూ ఉండవు. కార్యకారణ సంబంధాలు కాలం లోనే జరుగుతాయి.

   Reply

 2. Sravya V
  May 04, 2011 @ 10:46:37

  అసలు కారణం ఎందుకు ఉండాలి ? ఎలా ఏర్పడింది అనేది ప్రశ్న ఏమో కాని ఎందుకు ఉండాలి అనేది అవసరమా ?

  Reply

  • bondalapati
   May 04, 2011 @ 12:00:42

   @Sravya V
   “అసలు కారణం ఎందుకు ఉండాలి ?”
   మనం రోజు వారీ చూసే దృగ్విషయాల (ఫినామినా) కి కారణాలు ఉంటాయి. ఈ కారణాలు చూడటానికి అలవాటు పడిన మనం, విశ్వానికి కూడా ఒక కారణం కోసం వెతుకుతాం.
   “ఎలా ఏర్పడింది అనేది ప్రశ్న ఏమో కాని ఎందుకు ఉండాలి అనేది అవసరమా ?”
   “ఎలా ఏర్పడింది?” అనే ప్రశ్న కి సైన్స్ ఎలాగొలా తంటాలుపడి సమాధానం చెప్తుంది. ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ఎందుకు విశ్వం ఇలానే ఉంది? ఎందుకు వేరే సవా లక్ష విధాలుగా లేదు? గురుత్వాకర్షణ ఎందుకు ఉంది? ఎలెక్ట్రాన్లూ ప్రోటాన్లూ, న్యూట్రాన్లూ అలానే ఎందుకు ఉన్నాయి..? ఉదాహరణ కు న్యూట్రాన్లు ప్రోటాన్లచుట్టూ ఎందుకు తిరగవు..? మొదలైన ప్రశ్నలు ఈ “ఎందుకు?” ప్రశ్నలు. వీటన్నిటికి విశ్వం “ఎలా” మొదలైంది అన్న ప్రశ్న లో సమాధానం ఉండవచ్చు. ఒక స్థాయిలో “ఎందుకు?” అనే ప్రశ్నకు, ఇంకొక స్థాయి లో “ఎలా?” అనే ప్రశ్న సమాధానం ఇస్తుంది.
   “ఈ ప్రశ్నలు అవసరమా?”
   నాకు మీ ఉద్దేశం అర్ధం కాలేదు..దేని కోసం మీరు అనవసరం అనుకొంటున్నారు? మన జిజ్ఞాస తీర్చుకోవటానికి ఎలా, ఎందుకూ రెండూ అవసరమే! మీరు ఈ ప్రశ్నల వలన ఇంకా ఏమైనా లాభాలు ఉండాలి అని భావిస్తే నేను చెప్పలేను.

   Reply

 3. bondalapati
  May 04, 2011 @ 12:14:20

  ఎందుకు అనే ప్రశ్న ను విశ్వ జననానికి ఏదైనా మోటివ్ ను అన్వేషిస్తూ వేస్తే, అలా ప్రశ్న వేయటం సరి కాదు. ఎందుకంటే విశ్వానికి ఏ పర్పస్సూ ఉన్నట్లు కనపడదు. పరెపస్ అనేది ఉండేది కొంతవరకూ సాపేక్షం గా మనుషుల జీవితాలలో మాత్రమే.

  Reply

  • Sravya V
   May 04, 2011 @ 12:25:30

   హ్మ్ ! మీ వివరణ బావుంది ! నా ఉద్దేశ్యం ఎలా ఏర్పడింది అనేది తెలుసు కోవటానికి మనం రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాం , కాబట్టి ఎందుకు అనే ప్రశ్న ఉంటుందా అని !

   Reply

 4. Snkr
  May 04, 2011 @ 12:47:06

  /భగవంతుడు కారకుడైతే, ఆయనకు జీవపరిణామం ద్వారా వచ్చిన “ఇఛ్ఛ” ను ఆపాదించటం సరి కాదేమో!ఇఛ్ఛ అనేది మనిషికి భౌతిక వాంఛల యొక్క పరిణామం వలన కలుగుతుంది కదా!/

  జీవ పరిణామాన్ని భగవంతుని వరకూ పొడిగించవచ్చా? అంటే ఈ సిద్ధాంతాన్ని పొడిగించవచ్చా? లిమిటేషన్స్ లేని సిద్ధాంతమా?!

  “త్రిగుణాతీతుడైన వాడు పరమాత్మ. అట్టివాడు దేహాంతర్గుతుడైననూ కర్మలనాచరించువాడు కాడు” అని గీతలో చెప్పబడింది, ‘త్రిగుణాతీతుడు’ అన్నది పరిణామ సిద్ధాంత పరిధిలోకి వస్తుందా? మీరు విస్తరించ పరిశోధన చేస్తున్నారా? తెలియచేయగలరు.

  Reply

  • bondalapati
   May 04, 2011 @ 13:54:31

   త్రిగుణాతీతుడు అనేది జీవ పరిణామం పరిధి లోకి రాక పోవచ్చు. కానీ మనిషి ఇఛ్ఛలు పరిణామం పరిధి లోకి వస్తాయి. నేను ఈ ఆర్టికల్ రాసేటప్పుడు, భగవద్గీత ను దృష్టి లో పెట్టుకొనలేదు. సాధారణం గా ప్రజలు భగవంతుడిని మంచివాడు గా, విశ్వాన్ని నడిపించే వాడు గా చూస్తారు. అలా ఉండటానికి ఆయనకు ఒక “మోటివ్” అవసరమౌతుంది. అలాంటి మోటివ్ అవసరం లేని నాడు, దేవుడు అనేది ఒక మెకానిజం మాత్రమే (ఇష్టా ఇష్టాలకూ, రాగ ద్వేషాలకూ అతీతం గా నడిచే ఒక ప్రక్రియ). ఈ మెకానిజం సైంటిస్టులు చెప్పే ప్రక్రియలకు అంతగా విరుధ్ధమైనది కాదు. నా వ్యాసం ఒక వాలు కుర్చీ ఆలోచన మాత్రమే. కాస్మాలజీ గురించి మీడియా లో వచ్చిన ఆర్టికల్స్ ఫాలో అవుతూ ఉంటాను.

   Reply

   • Snkr
    May 04, 2011 @ 14:35:06

    దేవుణ్ణి సైన్సు దృష్టితో చూడటం, పురాణాల్లోని విషయాలకు సైన్స్ జోడించడం రెడూ నాకు అదోలా అనిపించే విషయాలు.

    Reply

 5. Snkr
  May 04, 2011 @ 15:45:31

  ఏమీ లేదు, మీరేమైనా దేవుడు లేడని సైన్స్ ద్వారా నిరూపిస్తారేమో అనే ఆశ! :)

  Reply

  • bondalapati
   May 04, 2011 @ 15:56:59

   నాకంత దృశ్యం లేదు. నేను ఏదో ఆం చెయిర్ టైప్.నేను నా అభిప్రాయాలు, నమ్మకాలను మాత్రమే ఇక్కడ రాశాను. ఉదాహరణకు “దేవుడి కి మోటివ్ ఉండదు” అనేది నా ఫీలింగ్ మాత్రమే.ఈ నా ఫీలింగ్ కి కారణం నాకు తెలిసిన సైన్స్. దీనిని నేను నిరూపించలేను.
   కానీ, ముందు గా మీరు దేవుడిని నిర్వచిస్తే, ఆ నిర్వచనాన్ని తప్పనో, ఒప్పనో, మాకు తెలీదు.. అది మా పరిధి కి ఆవల ఉన్న విషయం అనో, శాస్త్రజ్ఞులు ప్రయోగాలు చేసో / చేయకుండానో తేల్చగలరు.
   నిరూపించటం ఎప్పుడూ నాస్తికులే ఎందుకు చేయాలి? మీ లాంటి ఆస్తికులు కూడా దేవుడు ఉన్నాడని నిరూపిస్తే (నమ్మకం కాదు) బాగుంటుంది.

   Reply

   • Physicist
    May 04, 2011 @ 23:10:27

    భక్తిమార్గాన్ని అనుసరిస్తే నిరూపించే అవకాశముంటుంది. నాస్థికులు ఆ మార్గంలో ప్రయత్నించేదానికి ససేమిరా అంటే, ఎలా నిరూపితమౌతుంది? ప్రయోగం చేయడానికే సిద్ధంగా లేనప్పుడు నిరూపణ సైన్స్ మాత్రం ఎలా చేస్తుంది?

    Reply

    • bondalapati
     May 05, 2011 @ 04:00:45

     సైన్స్ జ్ఞాన మార్గం ద్వారా కృషి చేస్తుంది. ఇది కూదా ఒక మార్గమే కదా?
     నాకు తెలిసినంత లో భక్తి మార్గం ద్వారా ప్రయోగం చేయటం అంటే, కొన్ని వైయక్తిక అనుభవాలను పొందటం ద్వారా అది మొదలౌతుంది. సైన్స్ వైయక్తిక అనుభవాలను సత్య నిరూపణ కు ఆమోదించదు. వైయక్తికమైన అనుభవాలూ, నమ్మకాలూ సైన్స్ పరిధికి బయట ఉంటాయి.
     సైంటిస్టులలో కొంతమంది భక్తులు కూడా ఉంటారు. కానీ వారు తమ భక్తి ద్వారా భగవంతుడు ఉన్నాడు అని నిరూపించిన దాఖలాలు లేవు.వారు తమ భక్తినీ సైన్స్ నీ వేరు గానే ఉంచుతారు. భక్తిని “కష్టపడితే పైకి వస్తాం” లాంటి” ఒక కన్విక్షన్ గానే చూస్తారు. ఎందుకంటే వారి భక్తి వారి వైయక్తికం. వారు భగవంతుని గురించి ఆబ్జెక్టివ్ గా, అంటే వ్యక్తి ఉనికి తో సంబంధం లేకుండా ప్రూవ్ చేయలేరు.

     Reply

 6. krishna
  May 04, 2011 @ 17:03:00

  :)

  Reply

 7. ram
  Jun 09, 2011 @ 06:43:32

  నా ఉద్దేశం ప్రకారం కాలం విశ్వం పుట్టక ముందు ఉంది, పుట్టినప్పుడు ఉంది, తర్వాత ఉంది. కాలం, శూన్యం అనేవి ఆది, అంతము లేనివి.కాలాన్ని కొలవలేము అన్నంతమత్రాన కాలం లేదు అని నిర్థారణకు రాకూదు.

  Reply

  • bondalapati
   Jun 09, 2011 @ 10:40:30

   కొంత కాలం కింద నేనూ ఇలానే అనుకొన్నాను..విశ్వం పుట్టుకకి ముందు కాలం ఉందా లేదా అని ఆలోచించేటప్పుడు, ముందుగా కాలాన్ని నిర్వచించాలి.
   కాలం అనేది సంఘటనల ప్రవాహం. సంఘటనలు లేకుండా కాలం ఉండదు.ఈ సంఘటనలను మినహాయిస్తే కాలానికి వేరే అస్థిత్వం ఏమీ లేదు. విశ్వం పుట్టుకకు ముందు ఏ సంఘటనా జరుగలేదు కాబట్టీ కాలం కూడా ఉండదు.
   మనం రోజువారీ జీవితం లో కాలానికి అలవాటు పడిపోయి, కాలం లేకుండా ఉండే స్థితి ని ఊహించుకోలేము. దాని వలనే కాలం అనంతం గా ఉంది అనిపిస్తుంది. కానీ వాస్తవ ప్రపంచం లో ఏదీ అనంతం గా ఉండదు. అన్నీ లిమిటెడ్ గానే ఉంటాయి. విశ్వం పుట్టుకకి ముందు ఉన్న స్థితిని అనిర్వచనీయం (అన్-డిఫైండ్) అనవచ్చు.దీనినే మాత్స్ లో ఇన్-ఫినిటీ తో సూచిస్తారు. మీరు ఏ భౌతిక విషయాన్నైనా అనంతం లేక ఇన్-ఫినిటీ అన్నారంటే దాని అర్ధం “దాని యొక్క భౌతిక అస్తితానికి నీళ్ళొదులుతున్నారని”. మీరు కాలం, శూన్యం అనంతం అనటం, “భౌతికం గా అవి లేవు అనటం తో సమానం”.
   ఒక నదిని పోలిక గా తీసుకొంటే , నదిపుట్టుక స్థానం వరకూ నదిని డిఫైన్ చెయ్యొచ్చు. నదిలో ఎన్ని క్యూసెక్కుల నీళ్ళున్నాయి మొదలైనవి చెప్పొచ్చు. “నది పుట్టుక స్థానం తరువాత కూడా నదిలేక పోవటం ఏమిటి..నది అనంతం గా ఉంటుంది”, అనేవారిని నేను నా చిన్నప్పుడు పల్లెల లో చూశాను. వారి అనుభవం లోని నదికి మొదలు అంటూ ఉండదు కాబట్టీ నదికి మొదలును వారు ఊహించుకోలేక పోతున్నారు. వారిని మీరు “గోదావరి నాసిక్ లో పుట్టిందంటారు, మరి నాసిక్ కు ఎగువ ఏముంటుంది అని అడిగితే వారు “అక్కడ ఒక అనిర్వచనీయమైన నది ఉంది” అని చెప్తారేమో . ఎప్పుడైతే అనిర్వచనీయం వచ్చిందో అప్పుడే ఆ వస్తువు భౌతికం గా లేదు అనొచ్చు.
   కాలం లేని స్థితీ,కాలాన్ని కొలవలేని స్థితీ,కాలం అనిర్వచనీయమైన స్థితీ ఒకటే! కొలవ లేనిదేదైనా భౌతికం గా లేనట్లే, మానసికం గా కాన్సెప్ట్ పరం గా మనం ఊహించుకోవచ్చు. ఉదాహరణకు కాంతికి మించిన వేగం లేదు. అంతకు మించిన వేగమేదైనా మనం ఊహించుకొనేదే. మనసుకు అనంతమైన వేగం ఉంటుంది అంటారు. ఇప్పుడు సూర్యుడి దగర ఉండాలి అంటె, వెంటనే ఊహించుకోవచ్చు.కానీ ఆ వేగం భౌతికమైనది కాదు. అంటే నిజమైనది కాదు.ఆలోచించి చెప్పండి..

   Reply

  • bondalapati
   Jun 09, 2011 @ 11:15:50

   ఏ భౌతిక కారణమూ లేకుండా పుట్టే ఇంకొక వస్తువు ఎలక్ట్రాన్లు. క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఎలక్ట్రాన్లు అదృశ్యమైపోయి, మళ్ళీ ఏ భౌతిక కారణమూ లేకుండానే కొన్ని మిల్లీ సెకన్స్ కీ ప్రత్యక్షమౌతాయి.

   http://www.infidels.org/library/modern/theodore_schick/bigbang.html

   అలానే జీవులలో జన్యు మార్పులు యాదృచ్చికం (ర్యాండం) గా జరుగుతాయి. ఇక్కడ రాండం అంటే కారణం ఇంకా తెలియదు అనుకోవచ్చు.
   వీటన్నిటికీ భౌతికమైన కారణం మాత్రమే లేదు. అధిభౌతిక( మెట-ఫిజికల్) మైన కారణం ఉండవచ్చు.

   Reply

 8. SriRam
  Jun 09, 2011 @ 11:47:46

  మనుషులకు కాలం అనేది (నేను అనే/నాది ) అనుభవం లో భాగం. అనుభవం అనేది మనిషిలో జరిగే శారిరక మార్పుల వలన, నాలేడ్జ్ వలన కలుగుతూంటాయి. ఇక ప్రకృతి లో సూర్యోదయం,అస్తమయం లాంటివి, అమ్మవాస్య , పౌర్నమి మొదలైన సంఘటనలు ఒక పద్దతి ప్రకారం నిరంతరం జరుతుంటాయి. కొన్నివేల సంవత్సరాలనుంచి మనుషులు ప్రకృతిని పరిశిలిస్తూ ప్రకృతిలోని సూర్యోదయ, అస్తమయ సంఘటనలను తమ అనుభవ పరిధిలోకి తెచ్చుకొని వాటి నాధారం గా జీవిచటం మొదలు పెట్టారు. సూర్యోదయాం కావటం, నిద్దుర లేచీ వెలుగు లో పనులు చేసుకోవటం అస్తమయానికి నిద్దుర పోవటం. అలా కొంతకాలనికి అనుభావాలను ఆధారం గా చేసుకొని,దానిని జ్ఞానం గా మార్చారు. జ్ఞాణం పెరిగే కొద్ది ఒక సూర్యోదయ సూర్యాస్తమయాలను ఒక దినం గా పరిగణించటం. రోజును ఆధారం చేసుకొని నెల, సంవత్సరం అని కొలవటం ప్రారంభించారు. ఈ జ్ఞానానికి అనుగుణంగా తమ శరీరం లో జరిగే మార్పులను కూడా పోల్చుకోవటం మొదలు పెట్టారు. మగవాడికి మీసాలు రావటం సుమారుగా 14-16 సం|| కి మోదలౌతుందని పరిశీలనని నాలేడ్జ్ గా మార్చారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే మీరు” కాలం ” అనుకునేది మీ అనుభవం (నేను/నా లోని) భాగం. మనిషి అనుభవం సాపేక్షమైనది. .
  ———————————————————-
  *నా ఉద్దేశం ప్రకారం కాలం విశ్వం పుట్టక ముందు ఉంది, పుట్టినప్పుడు ఉంది, తర్వాత ఉంది. *
  నా ఉద్ద్దేశం అనే భావం లేకుండా ఒక సారి ఆలోచిస్తే ఎమీ ఉంది? నిరంతరం ప్రకృతిలో స్టాండర్డ్ గా జరిగే ప్రాసెస్ సుర్యోదయం ,అస్తమయం లాంటివి మాత్రమే ఉంట్టుంది. వాటికి ఆది అంతం అనేవి ఉందా అని తెలుసుకోవాలనుకొంటె మనం మళ్ళి అనుభవం మీద ఆధారపడాలి

  Reply

  • bondalapati
   Jun 09, 2011 @ 12:39:43

   మీరు సమయానికున్న మానసిక కోణం గురించి మాట్లాడుతున్నారు. మానవ జాతి లేక పోయినా భౌతికమైన సమయం ఉంటుంది..
   వీటి గురించి ఇక్కడ రాశాను:

   http://wp.me/pGX4s-as

   Reply

 9. ram
  Jun 10, 2011 @ 08:36:32

  కాలం అనేది సంఘటనల ప్రవాహం. సంఘటనలు లేకుండా కాలం ఉండదు………!!!!!!!!!!!!!!!!!!!!!!
  i am not agreing with u.
  అంటే మీరు కాలాన్ని సంఘటనల ద్వార కొలుస్థున్నారు.ఒక కొలమానం లేనంత మాత్రనా అది(శక్తి, కాలం, బరువు) లేనట్టు కాదు.సమయాన్ని మీ మానసిక దృక్కోణం నుంచి చూస్తున్నరు.నా దృష్టిలో కాలం మరియు శూన్యానికి ఉంది ఇంకొ డైమెన్షన్. కాలన్ని శూన్యన్ని వేరు వేరుగ చూడలెము.ఇవి రెందు అవిభక్త కవలలు లాంటివి.
  కానీ వాస్తవ ప్రపంచం లో ఏదీ అనంతం గా ఉండదు. అన్నీ లిమిటెడ్ గానే ఉంటాయి. not agreed.
  Leave the time. now you tell me 1 thing whether space is infinite or not.
  note:-All my theories are based on my imagination and logical reasoning. i did not read much physics books r my teachers are not explained that much.

  Reply

  • bondalapati
   Jun 10, 2011 @ 09:34:00

   కొలమానం లేనంత మాత్రాన ఒక విషయం లేనట్లు కాదు..అనేదానికి నేను అంగీకరిస్తాను..కానీ ఈ విషయం లో (విశ్వం ముందు ఉన్న్ పరిస్థ్తితి విషయం లో) కాలం లేకపోవటం వలననే కొలవటంలేక పోతున్నాము.కాలం,శక్తి విషయం లో కొలమానాలు ఉన్నాయి. ఐనా కొలవలేకపోతున్నాం. ఈ విశ్వం మొత్తం ఒక స్టిల్ కెమేరా లో లా ఫ్రీజ్ అయిపోయింది అనుకొందాం..అప్పుడు కాలం ఉనంట్లా? లేనట్లా?
   I read in some science magazine …Universe is a shpere with no “outside”..with this line of thought..there’s no space outside universe. This implies that space is also limited..again same issue..daily we see objects which are enclosed in some bigger frame of reference or some other bigger object. So we question..what is outside Universe? But there is no outside to this universe.

   http://www.physicspost.com/physicsforums/topic.asp-ARCHIVE=&TOPIC_ID=3393.htm

   Reply

 10. ram
  Jun 11, 2011 @ 03:31:38

  I read in some science magazine …Universe is a shpere with no “outside”..?????????????????????
  how did they proposed universe is a sphere?
  ఈ విశ్వం మొత్తం ఒక స్టిల్ కెమేరా లో లా ఫ్రీజ్ అయిపోయింది అనుకొందాం..అప్పుడు కాలం ఉనంట్లా? లేనట్లా?
  and again the universe returns to same state after some time? then tel me now whether the time is there are not at the freezed state of the Universe?

  Reply

 11. ram
  Jun 11, 2011 @ 03:47:38

  a———b e————f
  \ /
  \ /
  \ /
  c———-d
  observe the above graph, a & b are the point of states where universe is normal. c & d are the freezed states of universe. e & f resumed states of universe . now tell me whether time is there are not in CD states.

  Reply

 12. ram
  Jun 11, 2011 @ 03:50:47

  space will taken to one in the coments. than my graph:-(

  Reply

  • bondalapati
   Jun 11, 2011 @ 04:44:37

   I have not got your a..b example. I think it might be a bit untenable to discuss using these examples.
   To understand my point of view you can follow the discussion here (if you already haven’t read):

   http://www.physicspost.com/physicsforums/topic.asp-ARCHIVE=&TOPIC_ID=3393.htm

   There are lot more sites. you can google “universe no outside”
   It takes a bit of mental exercise to understand that Universe has no outside.
   Universe is not created in space.
   Space-time are part of the Universe. Without universe there’ll be no space-time.
   Before Universe what isthere?..undefinedstate..metaphysics..infinity..not known..but no physical cause can explain the creation.That’s why I said “విశ్వం పుట్టుక కి కారణం లేద” But before Universe definitely no space .. no time.

   Reply

 13. ram
  Jun 11, 2011 @ 05:07:01

  My brain gonna explode if i think too much on these topics.
  than q for ur links .i hav gone through it. anyway nice discussion. i am expecting more scientific fiction stories from you.

  Reply

 14. madhavaraopabbaraju
  Jun 22, 2011 @ 10:13:34

  శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.

  మీ వ్యాసం , దానిపై జరిగిన చర్చలు ఆసక్తికరంగా వున్నాయి. దీనిపై నా అభిప్రాయాలు వ్రాద్దామంటే, విషయం చాలా పెద్దగా వస్తున్నది. అందుకని, మరికొన్ని వివరణలతో , నా బ్లాగ్ లో “విశ్వరూపం – సైన్స్ & వేదాలు” అనే (http://madhavaraopabbaraju.wordpress.com/2011/06/22/%e2%80%9c-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b1%82%e0%b0%aa%e0%b0%82-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%bd-%e0%b0%b5%e0%b1%87%e0%b0%a6%e0%b0%be/) శీర్షికన ఒక వ్యాసం వ్రాశాను. దీనిని చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాల్ని తెలియచేయగలరు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  Reply

 15. Jawahar
  Jun 23, 2011 @ 17:14:31

  Bondalapati garu,

  Could you read this beautiful book ‘Vignana Veechikalu’ at

  http://saibharadwaja.org/books/readbook.aspx?book=3

  ? It may help your understanding.

  Best Regards,
  Jawahar

  Reply

 16. sam4christudheer
  Jul 24, 2011 @ 12:02:45

  Nothing produces nothing and something produces something; And that something which is capable of producing or creating ought to be superior and eternal

  Reply

 17. రాజశేఖర రాజు
  Aug 28, 2011 @ 18:08:32

  ప్రసాద్ గారూ,
  తెలుగులో సైన్స్ పట్ల చర్చ ఇలా జరగడం చాలా బాగుంది. చర్చ ఆస్తిక, నాస్తిక సమర్థనల వైపుగా కాకుండా విజ్ఞాన అన్వేషణ దిశగా సాగితే చాలా మంచిది. విశ్వం, కాలం, అవుటర్ స్పేస్, విశ్వానికి అవతల వంటి అంశాలపై చర్చ మరింత లోతుగా సాగడం అవసరం. చాలా మంచి విషయం. కాని ఇలాంటి విషయాలను చదువుతారో లేదో అని మీరు మరీ సంక్షిప్తీకరిస్తున్నారు. డా. శ్రీనివాస చక్రవర్తి గారు మరికొందరు మిత్రులు నిర్వహిస్తున్న శాస్త్రవిజ్ఞానము బ్లాగు చూడండి. ఎంత పెద్ద కథనాలు డెప్త్‌తో ప్రచురించబడుతున్నాయో… అస్తి నాస్తి విచికిత్సను సైన్స్ వ్యాసాల రూపంలో విస్తృతంగా చర్చించడం తెలుగులో అవసరం.

  అభినందనలు…

  Reply

  • bondalapati
   Aug 28, 2011 @ 18:14:19

   థాంక్స్ రాజు గారు!
   శాస్త్ర విజ్ఞానము బ్లాగ్ లింక్ కొంచెం ఇస్తారా?

   Reply

 18. రాజశేఖర రాజు
  Aug 29, 2011 @ 05:02:33

  ప్రసాద్ గారూ
  నా చందమామలు బ్లాగులో -blaagu.com/chandamamalu- తెలుగులో సైన్స్ అనే కేటగిరీలో సైన్స్ మీదే రాస్తున్న కొన్ని బ్లాగులను ప్రమోటే్ చేశాను చూడండి.

  http://scienceintelugu.blogspot.com/

  http://lolakam.blogspot.com/

  http://rohiniprasadkscience.blogspot.com/

  http://emitiendukuela.blogspot.com/2010/05/what-is-raman-effect.html

  ఇంకా డాక్టర్ శ్రీనివాస చక్రవర్తి గారు జనవిజ్ఞానవేదిక తరపున ప్రచురించిన వందకు పైగా సైన్స్ పుస్తకాలలో 40 పుస్తకాలను పీడీఎప్ రూపంలో నేను అంతర్జాలం నుంచి కాపీ చేసాను. మీవద్ద లేకపోతే వాటిని మీకు పంపిస్తాను. మీ జీమెయిల్ ఐడీని నాకు పంపండి. ఇది రాత్రికే మాత్రమే సాధ్యపడుతుంది.

  శ్రీనవాస చక్రవర్తి గారు తదితర మిత్రులు నడుపుతున్న పై తొలి సైన్స్ బ్లాగ్ సైన్స్‌ని కథలు, నవలలు చదువుతున్నంత రమణీయంగా, ఆహ్లాదకరంగా చెబుతోంది. సైన్స్ కి సంబంధించినంత వరకూ నిజంగా అపురూపమైన బ్లాగ్ ఇది.
  ధన్యవాదాలతో
  రాజు.
  krajasekhara@gmail.com
  rajasekhara.raju@chandamama.com

  ప్రసాద్ గారూ గత రాత్రి వరుసగా మీ బ్లాగ్లో సైన్స్ తదితర రచనలమీద చదువుతూ వ్యాఖ్య చేస్తూ పోయాను. వ్యాఖ్యలలో కాస్త రెచ్చగొట్టే ధోరణి ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని సీరియస్ గా తీసుకోవద్దని మనవి. ఇప్పటికే అరుణ్ చంద్ర గారికి ఈ విషయమై వివరించాను. మళ్లీ రాత్రికి కలుద్దాము.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 114 other followers

%d bloggers like this: