అసభ్యతా, మన సమాజం యొక్క average tolerance

డీ జీ పీ దినేష్ రెడ్డి, “స్త్రీల అసభ్య వస్త్ర ధారణ వలన రేప్ లు పెరుగుతున్నాయని”,  కామెంట్ చేసి, మళ్ళీ నా బుర్రలోని విశ్లేషణ సాఫ్ట్వేర్ ని activate చేశాడు. యధావిధి గా మన short sighted మీడియా మళ్ళీ గగ్గోలు మొదలు పెట్టింది.
మనిషి ఆది మానవుడిగా ఉన్న రోజులలో బట్టలు కట్టే వాడు కాదు. తరువాత ఎండా చలి నుంచీ అవి ఇచ్చే రక్షణ గురించి తెలిసిన తరువాత ఆకులతో, నారలతో బట్టలు కుట్టి వేసుకోవటం మొదలు పెట్టాడు.
సభ్యత అంటే సభ్యుడు కావటానికి తగిన ప్రవర్తన. ఒక గుంపు లొ సమాజం లో సభ్యుడు కావటానికి తగిన ప్రవర్తన. అంటే ఆ గుంపూ లేక సమూహానికి అప్పటికి ఉన్న విలువలను ఆమోదించి వాటికి conform అయేటట్లు ప్రవర్తించటం.
మనుషులు ఆది మానవులు గా ఉన్నపుడు, మొట్టమొదట బట్టలు వేసుకొన్న వాడి ప్రవర్తన మిగిలిన వారికి చాలా అసభ్యం గా కనిపించి ఉంటుంది. కానీ తరువాత బట్టలు వేసుకోవటం లోని లాభాలను గుర్తించి మిగిలిన వారు కూడా బట్టలు వేసుకోవటం మొదలు పెట్టి ఉంటారు.
బట్టలు వేసుకోవటం లో అప్పటి మనుషులకి అందాన్ని ఇనుమడించే గుణం కూడా కనపడి ఉండవచ్చు.
ఇక సమాజం లో కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడిన తరువాత, మనిషి కి ఉండే అనేక ఆలోచనలను బహిరంగ పరచటం నిషిధ్ధమైంది. మన మనసులోని ఆలోచనలను మన మొహం తరువాత ఎక్కువ గా బహిరంగ పరిచే అవయవమేదో అందరికీ తెలుసు. పక్క వాడి భార్య పై కలిగిన కామోద్రేకాన్ని మొహం లో కనపడనీయకుండా దాచవచ్చు. కానీ ఆ అవయవం జనాలను మోసం చేయదు.
కొన్నాళ్ళకి కామ సంబంధమైన భావాలే నిషిధ్ధమైన అంశాలైనాయి. అప్పుడు కామోద్రేకం, తన భార్య లేక భర్త మీద కలిగినదైనా, బహిరంగ పరచటం నిషిధ్ధమైంది. (ఆడం, ఈవ్, యాపిల్ కథ ని కాసేపు పక్కన పెడదాం)
ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత శరీరాన్ని కొంచెం చూపించీ, కొంచెం చూపించకుండానూ ఉండటం లో ఆకర్షణ ఉందని జనాలు గుర్తించారు. అసలు బట్టలు వేసుకోని ఆదిమానవుడికి ఈ ఆకర్షణ అర్ధం కాదు. ఈ ఆకర్షణ బట్టలు వేసుకొనే స్టేజీ నుంచీ వచ్చిందే.
ఈ కొంచెం చూపించటం లో, అన్ని విషయాలలో లానే, పాశ్చాత్య దేశాలు ముందున్నాయి. అక్కడ కూడా ఏ క్రికెట్ మాచ్ లోనో, రోడ్ పైనో ఎవరైనా బట్టలు అసలు వేసుకోకుండా కనపడితే వాళ్ళను జైల్లో పెట్టి public nudity కింద కేసు బుక్ చేస్తారు. మరి కొన్నాళ్ళకి అక్కడ మళ్ళీ ఆది మానవుల స్థాయి నగ్నత్వానికి వెళ్తారేమో తెలియదు. ఇప్పటికే, nudist society లు అక్కడ కొన్ని ఉంటాయి.
మొత్తం మీద పదిమందీ ఆమోదించే స్థాయి కి భిన్నం గా ఉన్న వస్త్ర ధారణే  “అసభ్య వస్త్ర ధారణ”.
ఇంకా మన పల్లెల లోని స్త్రీలు కాలి పిక్కలు కనపడే వస్త్రాలను కూడా వేసుకొనే స్థాయి లో లేరు. అంటే మన సమాజం యొక్క యావరేజ్ tolerance limit అనేది కొంచెం conservative గా ఉంటుంది. అయితే ఈ లిమిట్, కొంచెం ధైర్యం గా ఎక్స్-పోజింగ్ చేసే వారి వలన రోజు రోజు కీ రిలాక్స్ వుతోందనేది నిజం.
ఒక పల్లెటూరి నుంచీ వచ్చే వాడికి, ఒంట్లో సగం కనపడేటట్లు బట్టలు వేసుకొన్న స్త్రీ సెక్స్ కి ఆహ్వానించి నట్లు గా కనపడటం లో ఆశ్చర్యం లేదు.అలా అని పల్లెటూరి నుంచీ వచ్చిన ప్రతి ఒకడూ రేప్ లు చేస్తాడని కాదు.
ఇక్కడే సెక్స్ ని చూపించి డబ్బు చేసుకొనే మీడియా, అలా చూపించటం లో ఆనందం పొందే వారూ అనేక సంబంధం లేని ప్రశ్నలు వేస్తారు.
-ఒక పదేళ్ళ పాప రేప్ కి గురయింది. మరి ఇక్కడ అసభ్యత లేదు కదా?
obviously దినేష్ రెడ్డి మాట్లాడుతుంది ఇలాంటి కేస్ ల గురించి కాదు.
-సంప్రదాయకం గా డ్రెస్ చేసుకొన్న వారు రేప్ కి గురి కావటం లేదా?
అవుతున్నారు. again, ఆయన ఈ కేస్ గురించి మాట్లాడటం లేదు.
- పాశ్చాత్య దేశాలలో నాలుగో వంతే బట్టలు వేసుకొన్నా, అక్కడ రేప్ లు జరగవు. ఇక్కడ ఎందుకు రేప్లు జరుగుతున్నాయి?
మన సమాజం యొక్క average tolerance ఇంకా ఆ స్థాయి కి చేర లేదు. ప్రస్థుతం ఎక్స్పోజింగ్ చేసే వారు , ఇంకా చాలా మందిని inspire చేస్తే, త్వరలోనే మనమూ ఆ స్టేజ్ కి చేరతాం.
- స్త్రీల ఎక్స్పోజింగ్ పై బాధ్యతను తోసివేయటం ద్వారా, పోలీసులు మీ బాధ్యతను తప్పించుకొంటున్నారు.

పోలీసులు రేప్ ని సమర్ధించటం లేదు. చేసినవాడిని పట్టుకొని కటకటాల వెనుకకి పంపాల్సిందే! కానీ పోలీసులు ఒక preventive measure చెప్తున్నారు.modest గా dress చేసుకొంటే మంచిదని. అత్యచారాలు జరగటం లో ఎక్స్పోజింగ్ బాధ్యత అసలు లేదనటం, స్త్రీలు తమ బాధ్యత నుంచీ తప్పించుకోవటానికి చేసే బుకాయింపు మాత్రమే!
- మా ఇష్టమైన బట్టలు మేము వేసుకొంటాం. అది అసభ్యత ఎలా అవుతుంది?
అసలు బట్టలు వేసుకోకుండా ఉన్నా మాకు పరవా లేదు. western countries లో కూడా అలాంటి వారి పై ఓ దుప్పటి కప్పి లాకప్ సెల్ లో పడేస్తారు.  నలుగురు ఆడవాళ్ళు ఉన్న చోట ఒక మగ వాడు బూతు మాట అంటేనే అది immodesty కిందికి వస్తుంది. మరి, రోడ్ మీదా, పబ్లిక్ ప్లేసుల్లోనూ మన సమాజ పధ్ధతి ప్రకారం దాచుకోవలసిన శరీర భాగాలను బయటకు చూపించటం immodesty కదా? మీకు ఇష్టమైన బట్టలు మీరు వేసుకొంటే, మగ వారికి ఇష్టమైన “మిర్రి చూపులూ, తమలో తాము చేసుకొనే కామెంట్లూ”, ఆపటానికి మీరెవరు?

మొత్తం మీద దినేష్ రెడ్డి చెబుతున్నది, “సగం బట్టలు వేసుకొని, ఆ విధం గా మగ వాళ్ళ నుంచీ వచ్చే అటెన్షన్ ని ఎంజాయ్ చేస్తూ, వాళ్ళతో కలిసి ఏ ఫాం హౌస్ కో మందు పార్టీలకి పోయి, అక్కడ మద్యం మత్తులో ఎవడొ ఒక మగ వాడు శృతి మీరితే, దానిని గురించి అమాయకం గా వాపోయే వారిని గురించి”, మాత్రమే!

Follow

Get every new post delivered to your Inbox.

Join 36 other followers