విశ్లేషణలు అక్కరలేని సందర్భాలు..

మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిచ్చాపాటీ మాట్లాడుతూ కూర్చొన్నాం.
హఠాత్తుగా మా స్నేహితుడి నాలుగేళ్ళ చిన్న క్యూట్ పాప “షేం, షేం” అంది.
తల తిప్పి చూస్తే ఆ పాప తన చూపుడు వేలూ మధ్య వేలూ కలిపి టీవీ వైపు చూపిస్తూ మళ్ళీ అంది, “షేం షేం”.
టీవీ లో ఏమి వస్తుందా అని చూస్తే అక్కడ ఒక న్యూస్ చానల్ లో డర్టీ పిక్చర్ గురించి విద్యా బాలన్ ఎక్స్-పోజింగ్ చూపించే ప్రోగ్రాం నడుస్తోంది.
 ఏది సభ్యత, ఏది అసభ్యత,అసభ్యత చూసే వాళ్ళ కళ్ళలో ఉందా? చేసే వాళ్ళ చేష్టలలో ఉందా? అని పెద్ద పెద్ద విశ్లేషణలు అవసరమా? 
************

నా చిన్నపుడు..మా పల్లెటూరి స్కూల్ కి ఫర్నీచర్ సప్లై చేయటానికి హైదరాబాద్ నుంచీ ఓ ఇద్దరు వచ్చారు. ఒకాయన పూల పూల చొక్కా వేసుకొని, దాని మీదకి చిల్లులు ఉన్న జీన్స్ వేసుకొన్నాడు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొన్నాడు. పిల్లి గడ్డం కూడా ఉంది. .
అతనిని చూసి,”ఏందబ్బా పగటి వేషగాడిలా ఉన్నాడు. మన ఊరి కుక్కలు చూస్తే వెంటబడతాయి”, అన్నాడు  నా ఫ్రెండ్.
అది ఆ సాయంత్రానికి కన్-ఫం అయింది. మా ఊరి ధర్మాసుపత్రికి కుక్క కాటు వైద్యం కోసం ఆ “ఒకాయన” వచ్చాడని అక్కడ పని చేసే ఆ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ద్వారా తెలిసింది. 

********************

ఆ రోజుల్లో ఉత్తర భారతం లోని ఒక కాలేజీ హాస్టల్లో ఉండే వాళ్ళం. హాస్టల్ మెస్ లో రోటీలు పెట్టేవారు. ఆ రోటీలు చాలా చెత్తగా ఉంటున్నాయనీ. మెస్ సెక్రటరీ వార్డెనూ కలిసి డబ్బులు మింగి కల్తీ రొట్టెలు పెడుతున్నారనీ విద్యార్ధులందరం సమ్మె చేశాం.
వార్డెన్ మా అందరినీ చర్చలకు పిలిచాడు.

“రోటీల క్వాలిటీ బాగోలేదని ఎలా చెప్పగలరు? మనం ఏవిషయాన్నైనా సాపేక్షం గా చూడాలి. ఒక కోణం నుంచీ చూస్తే అవి చాలా మంచి రొట్టెలు. ఈ రొట్టెలు లేకే దేశం లో చాలా మంది బాధ పడుతున్నారు”, అని తన “చాతుర్రిం” చూపటం మొదలు పెట్టాడు వార్డెన్. చర్చల సందర్భం లొ మాటా మాటా పెరిగి మా లో ఒకతను “మెస్ లో పెట్టే రొట్టె లను కుక్కలు కూడా ముట్టవు “, అన్నాడు.దానికి మెస్ సెక్రటరీ ఆవేశం గా, “మరీ అన్యాయం గా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కుక్కలకు రొట్టెలు వేసి చూద్దాం”, అన్నాడు.
సరే అంటే సరే అన్నారంతా. మెస్ కుర్రాడిని పిలిపించి, మా క్యాంపస్ లో విరివి గా ఉండే కుక్కల చెట్టుకింది కుక్కలకి ఆ ఉదయం చేసిన రొటీ లు వేయించారు. అవి, ఆ రోటీలను మూచూసి, వెనక్కి తిరిగి, వెనక కాళ్ళ తో ఆ రొట్టెల పై కి దుమ్ము చిమ్మి కప్పి పెట్టాయి. దానితో వాదనలు బంద్! రోటీలు మాత్రం మెరుగయ్యాయి.

**********

చట్ట సభలలో ప్రభుత్వాలు అనేక పధకాల గురించిన చర్చలు చేస్తాయి. విశ్లేషణలూ వాదోపవాదాలకు కొదవ లేదు. రాజు గారికి బట్టలు లేవని ఒక చిన్న పిల్ల వాడు చెప్పవలసి వచ్చింది.
మన నాయకులూ,అధికారులూ రచించే పధకాలు ఉపయోగ పడ్డాయా లేదా అనేది, “విశ్లేషణలూ, మేధావిత్వాలూ లేని సామాన్య మానవుడు”, “తన రిపేరు కి నోచుకోని ఏ సైకిల్నో” చూపించి క్షణం లో తేల్చేస్తాడు, నాయకుల హామీలకి సంబంధించిన బట్టలు అసలు లేనే లేవని. ఈ లోపు మేతావులూ, నాయకులూ మల్ల గుల్లాలు పడుతూనే ఉంటారు “మనం వెనక్కి పోతున్నామా.., ముందుకు పోతున్నామా?”, అని.

అభిప్రాయములు (+add yours?)

  1. Indian Minerva
    డిసెం 30, 2011 @ 15:29:54

    :D

    జవాబు

    • bondalapati
      డిసెం 30, 2011 @ 16:45:28

      :-)

      జవాబు

  2. Praveen Sarma
    డిసెం 30, 2011 @ 16:32:31

    సినిమాలలో చూపించేది కేవలం రొమాన్స్ కానీ నిజం కాదు అని నటుడు & నిర్మాత మోహన్ బాబు కొడుకే అన్నాడు. అయినా అవి నిజాలని నమ్మేసి ఆ సినిమాలు తెగ చూసేవాళ్ళని ఏమనుకోవాలి? సినిమాలలో మరదలు ఓణీ విప్పేసి బావగారితో పట్ట పగలే సరసాలు ఆడుతుంది. బావగారు మాత్రం చొక్కా గుండీ కూడా విప్పడు. నిజ జీవితంలో ఎక్కడా మరదలు బావగారితో పట్టపగలు సరసాలు ఆడడం కనిపించదు. కానీ సినిమాలలో ఇలాంటివి చూపిస్తే మాస్ సన్నివేశాలనుకుని చూసేస్తారు వెర్రి జనం. కాకపోతే డర్టీ పిక్చర్ సిల్క్ స్మిత జీవిత చరిత్ర అని నిర్మాతలు డబ్బా కొట్టుకోవడంటో టివి చానెళ్ళు నడిపే కంచర గాడిదలకి మేత దొరికింది. (బరువులు మోసే కంచర గాడిదలని తిట్టినందుకు క్షమించాలి).

    జవాబు

    • bondalapati
      డిసెం 30, 2011 @ 16:44:43

      వాళ్ళకి కావలసినది పాపులారిటీ రేటింగ్స్,
      ఘటం చిద్యాత్,
      పటం బిద్యాత్,
      ఏనకేప్రకారేణ,
      ప్రసిధ్ధహ పురుషా భవేత్.

      జవాబు

  3. Praveen Sarma
    డిసెం 30, 2011 @ 16:58:00

    సినిమాలలో చూపించేది కేవలం రొమాన్స్ అని అజయ్ దేవ్‌గన్ కూడా అన్నాడు. అది కేవలం రొమాన్స్ అని సినిమా నిర్మాతలు & నటులే చెప్పుకుంటున్నా అవి నిజాలనుకుని వాటికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళ మెంటాలిటీ ఎవరికీ అర్థం కాదు. చిరంజీవి నటించిన సినిమాలలో రిక్షావాడు మంత్రి కూతురిని లేవదీసుకుపోతాడు. కానీ చిరంజీవి నిజ జీవితంలో అతని కూతురు లాయర్ కొడుకుని పెళ్ళి చేసుకుంటేనే ఆమెకి ఆస్తి ఇవ్వను అని భయపెట్టి అతని అల్లుడు మీద కోర్ట్‌లో కట్నం కేస్ వెయ్యించాడు. అయినా చిరంజీవి అతని అభిమానులకి రియల్ లైఫ్ హీరోనే. కళ్ళ ముందు కనిపించే నిజాలు విశ్లేషణల కంటే ఎక్కువే కదా.

    జవాబు

  4. Praveen Sarma
    డిసెం 30, 2011 @ 17:10:53

    పాత్రల దాక ఎందుకు కానీ టైటిల్స్ కూడా రొమాంటిక్‌గా ఉంటాయి. శంకర్ దాదా, గుడుంబా శంకర్ వగైరా. నిజ జీవితంలో రౌడీలెవ్వరూ సమాజ సేవ కోసం రౌడీయిజం చెయ్యరు. పేదరికం, ఆర్థిక అసమానతల వల్ల రౌడీలుగా మారుతారు. పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తే పోలీస్ స్టేషన్‌లలో హిస్టరీ షీట్లు తెరుస్తారు. రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్‌లలో వాళ్ళ ఫొటోలు చూసి గుర్తుంచుకుని వాళ్ళని పట్టుకుని వాళ్ళని తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. నిజ జీవితంలో జరిగేది ఇది. కానీ సినిమాలలో రౌడీలని మాస్ హీరోలుగా చూపిస్తారు. ధూళిపేటలో ఉన్న ప్రజలు, మలకపేటలో ఉన్న జనాలూ అతన్ని దైవంలా ఆరాధిస్తున్నట్టు చూపిస్తారు.

    గళ్ళ ప్యాంట్ వేసుకుని వచ్చాడన్నారు. ఆ ఫాషన్ సినిమాలలో కూడా చూసినట్టు లేదు.

    జవాబు

  5. SHANKAR.S
    డిసెం 30, 2011 @ 17:17:26

    “పాత్రల దాక ఎందుకు కానీ టైటిల్స్ కూడా రొమాంటిక్‌గా ఉంటాయి. శంకర్ దాదా, గుడుంబా శంకర్ వగైరా. ”

    ఈ టైటిళ్ళు రొమాంటిక్ టైటిళ్ళు గా నీకు ఎలా అనిపించాయో నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు ప్రవీణూ. ఈ మధ్య ఓ చోట “రొమాంటిక్ పీపుల్ ” అంటే నిర్వచనం చూశాలే. నువ్వు కూడా ఆ తానులో ముక్కవే అని నిరూపించావ్.

    జవాబు

    • Praveen Sarma
      డిసెం 30, 2011 @ 18:07:27

      విలన్‌ల పేర్లు హీరోలకి పెట్టి వాటినే టైటిల్స్‌గా పెడితే అలాగే కనిపిస్తాయి. నిజ జీవితంలో రౌడీలు ఎవరూ ప్రజా సేవ చెయ్యరు అనేది తెలిసినదే కదా. టూరిస్ట్ రిసార్ట్ అయిన వైజాగ్‌లో రౌడీయిజం లేదు కానీ మురికివాడలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో రౌడీయిజం ఎక్కువగా ఉందంటే పేదవాళ్ళు ఉద్యోగం దొరక్క రౌడీలుగా మారుతారనే కదా దాని అర్థం. ఇక్కడ రౌడీలు హీరోలు అనుకోవడానికి ఏముంది?

      జవాబు

  6. రాజశేఖర రాజు
    డిసెం 30, 2011 @ 17:36:56

    చిన్ని సందర్భాలు.. కాని విలువైన వ్యాఖ్యానాలు.

    జవాబు

  7. రాజశేఖర రాజు
    డిసెం 30, 2011 @ 17:46:29

    ఒక్కమాట. మీరు చెప్పిన రెండో, మూడవ సందర్భాలు కాని సినిమా వాళ్లు చూశారంటే అమాంతం లాగించేస్తారు. అంత సెటైరికల్‌గా ఉన్నాయవి.

    నాలుగోది మరీ బాగుంది. కాని సామాన్యుడి పక్షం నుంచి చూసే “చూపు” ఎక్కడుంది? ఎవరికుంది? అలాంటిది ఉందని ఏమాత్రం పసిగట్టినా ఎన్‌కౌంటర్ అయిపోయే ప్రమాదం పొంచి ఉన్న రోజుల్లో..

    జవాబు

  8. Praveen Sarma
    డిసెం 30, 2011 @ 18:08:52

    రోటీలు కుక్కలు కూడా తినవన్నారు కదా. పురుగులు పట్టిన గోధుమ పిండితో చేసిన రోటీలు కుక్కలు ఎలా తింటాయి?

    జవాబు

  9. SHANKAR.S
    డిసెం 30, 2011 @ 19:56:00

    “పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తే పోలీస్ స్టేషన్‌లలో హిస్టరీ షీట్లు తెరుస్తారు. రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్‌లలో వాళ్ళ ఫొటోలు చూసి గుర్తుంచుకుని వాళ్ళని పట్టుకుని వాళ్ళని తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. నిజ జీవితంలో జరిగేది ఇది.”

    ఓహో రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్లని రౌడీ రిక్రూట్ మెంట్ క్యాంపస్ లుగా
    ఉపయోగించుకుంటారా?

    జవాబు

  10. SHANKAR.S
    డిసెం 30, 2011 @ 19:59:51

    “టూరిస్ట్ రిసార్ట్ అయిన వైజాగ్‌లో రౌడీయిజం లేదు కానీ మురికివాడలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లో రౌడీయిజం ఎక్కువగా ఉందంటే పేదవాళ్ళు ఉద్యోగం దొరక్క రౌడీలుగా మారుతారనే కదా దాని అర్థం.”

    వైజాగ్ టూరిస్ట్ రిసార్టా?????. సరేలే ఆ విషయం పక్కనపెడితే, అంటే మార్తాండా వైజాగ్ లో రౌడీయిజం లేదంటావు. ఏ ఒక్కరి మీదా రౌడీషీట్ లు లేవంటావు. అంతేనా. ఈ ముక్క పాపం అక్కడ ఎస్పీకి చెప్పు బాబూ. ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు.

    జవాబు

  11. Praveen Sarma
    డిసెం 30, 2011 @ 20:11:37

    వైజాగ్‌లో రౌడీలు తిరగడం గురించి నేను ఎక్కడా వినలేదు. పేదవాళ్ళు ఉండే గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా రౌడీలు తిరగడం గురించి వినలేదు. చేపలు పట్టేవాళ్ళు ఉండే జోడుగుళ్ళపాలెం లాంటి ప్రాంతాలలో కూడా రౌడీయిజం గురించి వినలేదు. కానీ రియల్ ఎస్టేట్స్ గొడవల వల్ల హత్యలు జరుగుతాయనే భయంతో ఆయుధాల లైసెన్స్‌లు తీసుకునేవాళ్ళని మాత్రం చూశాను.

    జవాబు

  12. Praveen Sarma
    డిసెం 30, 2011 @ 20:15:56

    వైజాగ్‌కి కేవలం వంద కిలో మీటర్ల దూరంలో ఉండే నాకు వైజాగ్ గురించి తెలియదా? ఒకప్పుడు మాకు విశాఖపట్నం జిల్లా పెందుర్తి దగ్గర భూములు ఉండేవి. అవి అమ్మేశాం. మా బంధువులు కొంత మంది ఇప్పటికీ వైజాగ్‌లోనే ఉంటున్నారు. వైజాగ్‌లో ఆర్గనైజ్డ్ రౌడీయిజం అనేది లేదు. రియల్ ఎస్టేట్స్ మాఫియా అయితే ఉంది కానీ పొట్టకూటి కోసం వీధి రౌడీలుగా మారేవాళ్ళని మాత్రం చూడలేదు.

    జవాబు

  13. Zilebi
    డిసెం 30, 2011 @ 23:34:06

    ఇక్కడ ప్రవీణుడున్నాదు,

    మా లక్కు పేట రౌడీ గారు ఇంకా రాలేదిమిటి చెప్మా?

    చీర్స్

    జిలేబి.

    జవాబు

  14. Mauli
    డిసెం 31, 2011 @ 06:52:44

    /అసభ్యత చూసే వాళ్ళ కళ్ళలో ఉందా? చేసే వాళ్ళ చేష్టలలో ఉందా? అని పెద్ద పెద్ద విశ్లేషణలు అవసరమా? /

    సినిమాలను(అలాంటి కాదు :) ) ఆదరించే జనం లో నే ఉంది ముమ్మాటికీ

    విశ్లేషణ అవసరమే, అవే ముఖ్యం అని వాదిస్తున్న వాళ్ళు ఉన్నంత వరకు

    జవాబు

  15. bondalapati
    డిసెం 31, 2011 @ 10:51:03

    వార్నీ, ఓ పూట ఇంట్లో ఇంటర్నెట్ పని చేయక పోతే, మాంఛి విశ్లేషణలే చేసేశారే అంతా కలిసి :-) . On a serious note,thank you all

    జవాబు

  16. Praveen Sarma
    డిసెం 31, 2011 @ 14:51:52

    వర్షం పడి BSNL కేబుల్స్ తెగిపోయాయా? నాది కూడా BSNL కనెక్షన్ పని చెయ్యడం లేదు. సెల్‌ఫోన్‌లో సెట్టింగ్స్ మార్చి దాని ఇంటర్నెట్ కనెక్షన్‌ని కంప్యూటర్‌కి షేర్ చేశాను.

    http://teluguwebmedia.in మీకు నూతన సంవత్సర స్వాగతం పలుకుతోంది.
    – ప్రవీణ్ శర్మ

    జవాబు

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.

Join 33 other followers