పాపులర్ తెలుగు టపాలు రాయటం ఎలా? : కొన్ని సూత్రీకరణలు
31 డిసెం 2011 అభిప్రాయములు
in తెలుగు ట్యాగులు:how to write popular posts
ఈ కింది సూత్రీకరణలు మీకు ఇంతకు ముందే తెలిస్తే, ఈ టపా ని skip చేసేయండి. “చదవకుండా ఎలా తెలుస్తాయి?” అంటారా? తీరా చదివిన తరువాత..”అబ్బే! ఇవన్నీ మాకు ముందే తెలుసు”, అనొద్దు మరి.. ..
1. తెలుగు బ్లాగులను ఒక సీరియస్ సబ్జెక్ట్ లా చదివే వారు చాలా తక్కువ ఉంటారు. “ఆఫీస్ లో బోర్ కొట్టినపుడో, ఇంట్లో ఉబుసు పోకో, బ్లాగులు ఫాలో అవ్వటం అలవాటయ్యో, ఉద్యోగాలలోంచీ రిటైర్ అయ్యో, ప్రభుత్వోద్యోగాల్లో ఉండో, పెద్దతనం లో తమ పిల్లల తో పాటు అమెరికా చేరో,” ఈ బ్లాగులను చదివే వారే ఎక్కువ. సీరియస్ సబ్జెక్ట్ లు(ఫిలాసఫీ, సైన్సూ, టెక్నాలజీ, ఇంజినీరింగూ, సామాజిక శాస్త్రం, మన్నూమశానం.. ) నేర్చుకోవాలంటే అందుకు కాలేజీలూ, యూనివర్సిటీలూ ఉన్నాయి. బ్లాగులు దానికి వేదిక కాదు. కాబట్టీ, టపాలు సరదా గా వీలైనంత మందిని అలరించేవి గా, లైట్ రీడింగ్ కి ఉపయోగపడేవి గా , కాలక్షేపానికి పనికి వచ్చేవి గా ఉంటే ఎక్కువ మంది చదువుతారు.
ఒక వేళ ఏదైనా సీరియస్ విషయం చెప్పాల్సి వచ్చినా దానిని sugar coated pill లా సరదా గా చెప్పాలి.
2. ఏ భాషా బ్లాగులలో అయినా sex sells. నేరు గా సెక్స్ రాస్తే సంకలినులు బ్లాగులను పీకేస్తాయి. కాబట్టీ, ఇండైరెక్ట్ గా సెక్స్ “గురించి” రాసిన ఏ టపా ని అయినా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది.
3. controversial విషయాల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు. తెలుగు సమాజం లో caste అనేది ఒక incendiary thing. అలానే తెలంగాణా, రిజర్వేషన్లూ, హిందూత్వ ల గురించి రాస్తే ఎక్కువ మంది చదువుతారు.
4. నలుగురి imagination లోనూ నానుతున్న current event గురించి కూడా చదువుతారు. ఉదా: డర్టీ పిక్చర్.
5. ఎక్కువ మంది పాఠకుల కి సంబంధించిన విషయాలని కూడా పాఠకులు చూస్తారు. స్త్రీ పురుష సంబంధాలు సమాజం లో దాదాపు నూరు శాతం జనాలని కవర్ చేస్తాయి. కాబట్టీ వీటిని గురించి కూడా చదువుతారు.
6. పాపులర్ బ్లాగర్ గా పేరు తెచ్చుకొన్న వారి టపాలకి minimum guarantee ఉంటుంది, సూపర్ స్టార్ ల సినిమాల కి మినిమం కలెక్షన్లు వచ్చినట్లు గా (సూపర్ స్టార్ బ్లాగర్ ల కి , ఈ టపా లో చెప్పిన మెజారిటీ విషయాలను పాటించటం వలన ఆ స్టార్-డం వస్తుంది.)
7.తెలుగు బ్లాగ్లోకం అసలు తెలుగు లోకానికి ఒక sample లాంటిది. ఐతే, ఇక్కడ చదువు కొన్నవారు ఎక్కువ. కాబట్టీ, అసలు తెలుగు లోకం లో జనాదరణ ఉన్న చాలా విషయాలకి బ్లాగ్ లోకం లో కూడా జనాదరణ ఉండే అవకాశం ఎక్కువ. ఉదహరణకి సినిమా గాసిప్పులూ, క్రికెట్ కబుర్లూ,రాజకీయాలు. కాకపోతే, కొంచెం క్లాస్ సినిమాలూ, క్రికెట్ గురించి కొంచెంలోతైన విశ్లేషణలూ.
8. అసలు విషయం ఉన్న కథలూ, టపాలకి కూడా ఆదరణ ఎక్కువ.
9. రేటింగ్స్ ఎక్కువ వచ్చిన టపా కి కామెంట్సూ, హిట్సూ ఎక్కువ వస్తాయని చెప్పనవసరం లేదు కదా?
10. అమ్మాయిల బ్లాగులకి (వయసు మళ్ళిన అమ్మాయిలు కాదండీ) అబ్బాయిల బ్లాగుల కన్నా కొంచెం రద్దీ ఎక్కువ. ఎందుకో చెప్పనవసరం లేదు.
11. నాలా “వేసినటపానే జనాలు చదివే వరకూ మళ్ళీ వేయటం” వలన వాటిని ఎక్కువ మంది చదివే అవకాశం ఎక్కువ.
12. తెలుగు బ్లాగులు చదివే వారిలో చాలా మంది తమ సొంత బ్లాగులు కూడా నడుపుతారు. దీనిలో నాకు కొంత conflict of interest కనపడుతుంది. దీని వలన పక్కవాడి టపా బాగున్నపటికినీ, మన మొదటి అభినందన కొంత ఆలశ్యం అవ్వవచ్చు.
13. పై పాయింట్ వలన, ఒక్క సారి పక్కవాడి టపా ని మెచ్చుకొంటే, తరువాత అతను మన టపా ని మెచ్చుకొంటాడు. ఈ రకం గా పరస్పర గోకుడు ఎక్కువై వీళ్ళు గ్రూప్ లు గా ఏర్పడతారు. ఇక సామాజిక వర్గాల పరం గా, అభిప్రాయాలూ, సిధ్ధాంతాల పరం గా,లింగపరం గా, ప్రాంతపరం గా,ఊరి పరం గా,వయసు పరం గా ఏర్పడే గ్రూప్ ల సంగతి చెప్పనవసరం లేదు. ఈ గ్రూపుల్లో ఉంటే కామెంట్స్ వలన బ్లాగ్ పాపులారిటీ పెరుగుతుంది.
14.టపా వేసే టైం ని బట్టి కూడా టపా కి స్పందనలు ఉంటాయి. ఏ అర్ధ రాత్రో, సంకురాత్రి రోజో వేసే టపా ని ఎవరు చదువుతారు, చెప్పండి?
ఇక కామెంట్లూ, హిట్స్ విషయానికి వద్దాం.
1.టపా పేరు ఆసక్తికరం గా ఉంటే, హిట్స్ ఎక్కువగా ఉంటాయి.
2. టపా లో జనాలను ఆకట్టుకొనే విషయం ఉంటే కామెంట్స్ ఎక్కువ ఉంటాయి.
3. వారాంతాలలో కామెంట్స్ ఎక్కువ గా ఉండే అవకాశం ఉంది. పాఠకులకి తీరిక ఎక్కువ గా ఉండటం వలన అనుకొంటా!
4. ఇతరుల టపాలకి కామెంట్స్ పెట్టని వాళ్ళ టపాలకి కామెంట్స్ వచ్చే అవకాశం తక్కువ కదా!
5. కామెంట్స్ ఎక్కువ వచ్చిన టపాకి ఇంకా ఎక్కువ కామెంట్సూ, హిట్సూ వస్తాయి (courtesy: maalika,koodali comments section), హిట్ టాక్ వచ్చిన సినిమాకే ప్రేక్షకులు వెళ్ళినట్లు. (కాకి రెట్టేసినట్లు “good”, “interesting” అని కామెంటేసి మళ్ళీ తిరిగి చూడని వారి కామెంట్లు దీనికి మినహాయింపు.)
6. కొన్ని niche బ్లాగులు చదవటానికి ఆయా విషయాలలో పాండిత్యం అవసరం. వాటికి, సత్యజిత్ రే, సినిమాలకి ఉన్నట్లు, niche రీడర్స్ ఉంటారు.
7. కామెంట్లు రాసిన వారికి కొంచెం మర్యాద చేస్తే వాళ్ళు మళ్ళీ కామెంటుతారు. మీరు సెలబ్రిటీ బ్లాగ్ ల కు కామెంటే వారైతే, అది బ్లాక్ హోల్ లో పడిన కాంతి అని గుర్తుంచుకోండి. దానికి response రాదు. ఎందు కంటారు? బడుగు జీవుల మాటలను ఎవరైనా పట్టించుకొంటారా?
పైన చెప్పిన సూత్రాలు కాకుండా మీకు ఏమైనా తోస్తే, కామెంటండేం? పైన చెప్పిన విషయాలు తప్పయ్యే అవకాశం కూడా ఉంది. మీరు అలా భావిస్తే నిర్మొహమాటం గా చెప్పేయండి.
PS: బ్లాగు చర్చల్లోని అభిప్రాయాలనూ, వాదాలనూ, రాతలనూ, ఆవేశ కావేశాలనూ సీరియస్ గా తీసుకొను వాడు “దున్నపోతై పుట్టున్!”. ఎందుకంటారా? చూడుడు: ఈ టపా లో మొదటి పాయింట్.బ్లాగర్లకు రాజకీయ నాయకులకు ఉన్నంత విశ్వసనీయత కూడా ఉండదు.రాజకీయ నాయకులైతే వారి పేర్లు తెలుస్తాయి. వారి ఊరు ఏమిటో తెలుస్తుంది. దీని వలన వారు కొంచెం (చాలా కొంచెం)బాధ్యత గా ఉండాల్సి వస్తుంది. మారు పేర్ల వెనుక దాకునే ఊరు లేని బ్లాగర్లకి ఈ మాత్రం విశ్వసనీయత కూడా ఉండదు.

డిసెం 28, 2011 @ 21:32:56
మూడు విషయాలకు ముడు స్మయిలీలు
డిసెం 28, 2011 @ 21:50:27
నాగార్జున గారు,
మీ మూడు స్మయిలీలకూ నా మూడు స్మయిలీలు
డిసెం 28, 2011 @ 22:12:29
డిసెం 28, 2011 @ 22:48:09
కృష్ణప్రియ గారు,
ధన్యవాదాలు. రీడర్స్ తక్కువే గానీ, రీడర్స్ లో కామెంటే వారు ఎక్కువ నిష్పత్తి లో ఉంటారని నా అభిప్రాయం. నా టపాల విషయం లో ఇది కరెక్ట్. ఇతరుల టపాల విషయం లో తప్పు కావచ్చు కూడా.
డిసెం 28, 2011 @ 23:03:42
ఇంకొక ముఖ్యమైన పాయింట్ రాయటం మరచారు. అమ్మాయిలైతే కృష్ణుడి గురించో లేక రాధా కృష్ణుల ప్రేమను గురించి రాస్తే టపాకు ఆదరణ ఎక్కువగా ఉంట్టుంది. అలాగే అబ్బాయిలు మంచు గారిలా ప్రతి టపా ముందర “శ్రీరామ” మొదలు పెట్టి రాస్తే మహిళా పాఠకులు నుంచి మెప్పులు పొందవచ్చు. తమ బ్రాండ్ నేం ను పెంచుకోవచ్చు.
డిసెం 29, 2011 @ 00:48:40
“టపా ముందర “శ్రీరామ” మొదలు పెట్టి రాస్తే మహిళా పాఠకులు నుంచి మెప్పులు పొందవచ్చు”
పని లో పని గా మీ పేరు ని కూడా పాపులర్ చేసుకొనే సలహా ఇస్తున్నారు కదా!
డిసెం 28, 2011 @ 23:04:45
నాదీ కృష్ణప్రియ గారి మాటే! వీకెండ్లో వేసిన పోస్టులకి రీడర్షిప్ తక్కువ. ఆఫీసుల్లో పనులు చేసుకుంటూ మధ్య మధ్యలో బ్లాగులు చదివే వారు ఎక్కువనుకుంటా.. అంచేత వీకెండ్లో వేల్లందరూ బ్లాగ్స్ చూసే అవకాశం తక్కువేమో మరి!
డిసెం 29, 2011 @ 00:50:21
మధురవాణి గారు,
ధన్యవాదాలు. రీడర్స్ తక్కువే గానీ,రీడర్స్ లో కామెంటే వారు ఎక్కువ నిష్పత్తి లో ఉంటారని నా అభిప్రాయం. నా టపాల విషయం లో ఇది కరెక్ట్. ఇతరుల టపాల విషయం లో తప్పు కావచ్చు కూడా.
డిసెం 28, 2011 @ 23:16:44
మంచి సమాచారం !!! మీ విశ్లేషణ చక్కగా ఉంది.అభినందనలు
డిసెం 29, 2011 @ 00:52:02
వసంతం గారు,
ధన్యవాదాలు.మీకు దీని లో “సమాచారం” కూడా కనపడిందా!
డిసెం 29, 2011 @ 02:30:03
Hello Sir,
నా మెయిల్ ఎకౌంటు లో important అన్న folder ఒకటి create చేసుకున్నాను, మీ వ్యాసాన్ని పూర్తిగా ఒకటి కి రెండు మారులు చదివి అందులో భద్ర పరిచేసుకున్నాను, మొత్తానికి బ్లాగు జనుల నాది పట్టుకున్నారు సంతోషం!!
http://endukoemo.blogspot.com
డిసెం 29, 2011 @ 09:35:17
ఎందుకో ఏమో సారు,
మీ వ్యాఖ్య మొదట స్పాం లోకి వెళ్ళింది. లింక్ ఉండటం వలన అనుకొంటాను. thanks for the comment
డిసెం 29, 2011 @ 03:56:00
మీరు వ్రాసినవేవి నిజం కాదని చెప్పడానికి , య రమణ గారి ‘పని లేక ‘ బ్లాగు, ‘చందు S’ గారి బ్లాగు, ‘జాజిమల్లి’ గారి బ్లాగు చాలు
ఇక ‘డర్టీ పిక్చరు’ ఉదాహరణ కూడా తప్పే, ఎందు కంటే చాలా తక్కువ టపాలు వచ్చాయి, పాపులర్ టపాలు వ్రాయాలని తపన పడేవారు టచ్ చెయ్యలేని టాపిక్ ఇది
డిసెం 29, 2011 @ 07:01:44
మౌళి గారు,
చూడుడు: పాయింట్ 8, పాయింట్ 1 లాస్ట్ sentence
డిసెం 29, 2011 @ 14:11:28
హ హ , పాయింట్ 1 గురించి చెప్పాలంటే , ఈ లెక్క లో తెలుగు లో ఉన్న ఒక రకమైన సాహిత్యానికంతా వర్తిస్తుందేమో. ఇప్పుడు ఈ త్రండ్ రమణ గారి పుస్తకాలకు, మిట్టూరోడి పుస్తకాలకు, వంశీ కి బాగా ఎక్కువ గా ఉంది .(ఇంకా చాలా ఉన్నాయనుకోండి
)
మీ పాయింట్ 1 స్వయం ప్రకాశం లేని, కనీసం గజినీ మహమ్మద్ ఆస్తానం లోనన్నా చేరి ఆయన కి అండ గా ఉంటూ వ్రాసుకొని మురిసి పోయే స్త్రీ, పురుష బ్లాగర్ల కు మాత్రమె వర్తిస్తుంది.ఇది నిజం అండి
డిసెం 29, 2011 @ 14:59:30
“య రమణ” గారి పని లేక టపాలు sugar coated pills కిందకే వస్తాయి.
S chandu గారివి కొన్ని sugar coated pills, ఇంకొన్ని sugar like pearls.
జాజిమల్లి గారి కథలు నాకు బాగానే ఉంటాయి. మిగిలిన issues విషయం లో ఆవిడ దృక్పధం తో నాది కలవదనుకొంటా..!
Feb 06, 2012 @ 04:38:18
య రమణ గారు ఈ మధ్య షుగర్ డబ్బా వదేలిసినట్టున్నారండీ
చేదు మాత్రలు వరుసగా వస్తున్నాయి
జాజిమల్లి గారి అభిప్రాయాలలో మీకేవి ఏకీభావం లేవో చెపుతారా .. మనకి తెలీని కమ్యునిస్ట్ గొడవల పై చర్చల కన్నా ఇవి నయం అనుకుంటున్నాను
Feb 06, 2012 @ 06:29:07
సుగర్ కోటింగ్ అలానే ఉంది కానీ,అసలు మందు లో ఆయన వ్యక్తిగత bias అనే చేదు ఎక్కువైపోయింది. సుగర్ కోటింగ్ అలానే ఉంది కానీ,అసలు మందు లో ఆయన వ్యక్తిగత bias అనే చేదు ఎక్కువైపోయింది. ఆ చేదు తగ్గించటానికి అపుడప్పుడూ సుగర్-కోటింగ్ పెంచుతున్నారు కూడా. కానీ లాభం లేకుండా పోతూంది.
డిసెం 29, 2011 @ 03:57:26
ఆర్యా,
మీ వింశతి పాయింట్లను గమనిన్చితి. దీనికి తార్కాణము గ జిలేబి గారి బ్లాగుని కొలబద్ద గా పెట్టుకోనవచ్చును. ! సెల్ఫ్ డబ్బా !
బాగా ‘క్రోడీ కరిచారండీ బొందలపాటి గారు ! ఇప్పటికి సాఫ్ట్వేరు కథ రెండు మార్లు నాకు తెలిసి రిపీట్ అయ్యింది. ముచ్చట గా మూడో మారు ఎప్పుడు ? (కాకుంటే మూడో మారు కూడా వచ్చేసిందా ?)
చీర్స్
జిలేబి.
డిసెం 29, 2011 @ 07:04:11
zilebi garu,
మళ్ళీ పని లేనపుడు, మూడో సారి వేస్తాను.
డిసెం 29, 2011 @ 04:02:52
ఈ టపా తరువాయి టపా – మధుర వాణీ గారు వ్రాయవలె నని కోరుచున్నాను.
టపా పేరు – : పాపులర్ తెలుగు ‘ పాటలు’ రాయడం ఎలా ? కొన్ని సూత్రీకరణలు !”
ఏమంటారు మధుర వాణీ గారు ?
చీర్స్
జిలేబి.
డిసెం 29, 2011 @ 15:24:45
జిలేబీ గారూ,
పాటలు రాసేంత సీన్ మనకెక్కడండీ? ఏదో నచ్చిన పాటల గురించి రాస్కోడం మాత్రమే కదా నాకు తెల్సింది..
డిసెం 29, 2011 @ 20:02:56
మధురవాణి గారు, అదేమిటండి అలా అంటారు. గాయని పి.సుశీల పాడిన పాటల మీద మీరు రాసిన టపా చదివాను. చాలా చక్కగా, ఓపికగా రాశారు. బహుశా సుశీల గారి పిల్లలు కూడా, ఆమే పాడిన పాటల మీద రాయలేరేమో అనిపించింది. వీలైతే ఘంటశాల, పి.బి. శ్రీనివాస మొద|| వారి మీద రాయండి.
డిసెం 29, 2011 @ 07:01:57
హహహ బాగుంది మీ అనాలసిస్!
డిసెం 29, 2011 @ 07:33:14
రసజ్ఞ గారు,
ధన్య వాదాలు.
డిసెం 29, 2011 @ 07:25:42
పిల్లలు చదివే అవకాశం ఉన్న బ్లాగులు లాంటి వాటిలో సెక్స్ గురించి వ్రాయకూడదు కానీ కొంత మంది కాటెగరీ లేబెల్స్‌లో సెక్స్ అని టాగ్ పెట్టడం వల్ల నా అగ్రెగేటర్‌లో సెక్స్ గురించి ఉందనుకుని దాన్ని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ స్క్రీన్‌షాట్ చూడండి: http://teluguwebmedia.in/images/Screenshot.png
డిసెం 29, 2011 @ 07:34:52
ప్రవీణ్ గారు,
wordpress బ్లాగ్ సెర్చ్ టెరంస్ చూపిస్తుంది. ఇంకా అనేక చెత్త మాటలను వెతుక్కుంటూ కూడా బ్లాగు కి వస్తారు.
డిసెం 29, 2011 @ 08:16:32
సినిమా బ్లాగుల్లో కొన్నిటిని మాత్రమే అగ్రెగేటర్‌లో పెట్టాను. సినిమా బ్లాగులు పెట్టేవాళ్ళు సినిమా కబుర్ల పేరుతో సెక్స్ కబుర్లు వ్రాయడం జరుగుతుంది. వాటిని పిల్లలు చదివితే చెడిపోరని గ్యారంటీ లేదు. అందుకే నేను అగ్రెగేటర్‌లో సినిమా బ్లాగులకి లిమిటి పెట్టాను. అయినా బూతు పదాలు వెతుక్కుంటూ అగ్రెగేటర్‌కి వచ్చేవాళ్ళు ఉన్నారు.
డిసెం 29, 2011 @ 07:42:14
ప్రవీణూ అందులో విచిత్రమేముంది? నువ్వు నోరు విప్పితేనే బూతులు కదా?
డిసెం 29, 2011 @ 09:58:45
“మీరు సెలబ్రిటీ బ్లాగ్ ల కు కామెంటే వారైతే, అది బ్లాక్ హోల్ లో పడిన కాంతి అని గుర్తుంచుకోండి.”
నాకు ఈ విషయం తెలీదండీ. ఇక తప్పక గుర్తుంచుకుంటాను. “బ్లాక్ హోల్‌లో పడిన కాంతి”
అద్భుతమైన వ్యాఖ్య.
అన్నట్లు బ్లాక్ హోల్‌లో కాంతి ఎక్కడికి పోతుందో వివరంగా రాస్తే నేను మాత్రం ఖచ్చితంగా చదువుతాను. అందరిదీ చీకట్లో దేవులాటే కదా.. అందుకు….
డిసెం 29, 2011 @ 11:29:50
రాజు గారు,
బ్లాక్ హోల్ లో పడిన కాంతికి ఏమౌతుంది అనేదాని మీద శాస్త్రవేత్తల మధ్య ఒక నిశ్చితాభిప్రాయం ఉన్నట్లు కనపడదు. కానీ వెనక్కి మాత్రం తిరిగి రాదు.
డిసెం 29, 2011 @ 10:18:19
చాలా బాగా రాశారు..
ఒక్క వీకేండ్స్ లో వచ్చే టపాలకు ఆదరణ ఉంటుంది అనే పాయింటు తప్ప. అది నా బ్లాగు విషయములో కూడా నిజం కాదు. పరస్పర గోకుడు అయితే కేక (కానీ దానికి మీరు గోకుడు అని పేరెట్టీనందుకు హర్ట్ అయ్యాను
)
ఇంకో చిన్న పాయింటు… ఇది అన్నివేలలా నిజం కాదనుకోండి.. మార్క్సిజం గురించి రాసినా బాగానే చదువుతారు.
డిసెం 29, 2011 @ 11:35:09
Srikanth M garu,
“మార్క్సిజం గురించి రాసినా బాగానే చదువుతారు.”
jargan జోలికి పోకుండా రాస్తే చదువుతారనుకొంటా!అది కూడా ఒక కాలక్షేపం గానే చదువుతారు.
డిసెం 29, 2011 @ 10:45:32
13 తిరుగులేని నిజం అన్నది అసత్యము కాదని నా నమ్మకం. గోకుడు, పరస్పర గోకుడు పదాలు వింటూనే ఏదో అలౌకిక ఆనందం వేస్తోంది.
చచ్చు బ్లాగుల లక్షణాలు సోదాహరణముగా వివరింపుము – 20మార్కులు.
డిసెం 29, 2011 @ 11:43:01
మేస్టారు,
మీ బ్లాగ్ లింక్ ఏదైనా ఉంటే నాకు అర్జెంట్ గా ఇచ్చేయండి. నేను గోకుతాను. బ్లాగులందు గోకుడు బ్లాగులు వేరయా! .
డిసెం 29, 2011 @ 12:10:49
ఎంత చక్కటి మాట చెప్పావు అబ్బాయి, వీనుల్లో తేనె పోసినట్టుంది. చేయితిరిగిన రచయిత్రులు సామాన్యంగా గోకుడు గోష్టి నిర్వహిస్తుంటారని కుశాగ్ర బుద్ధిశాలివైన నీకు వేరే చెప్పనవసరంలేదు. నాకా ప్రావీణ్యమూ లేదు, ఓపికా లేదు, వయసూ సహరించదు. ఏదైనా బ్లాగు తెరిచాక మొదటి ఆహ్వానం నీదే నాయనా.
డిసెం 29, 2011 @ 14:57:32
బూతు సెర్చ్ టెర్మ్స్ సంగతి అటుంచితే నా అగ్రెగేటర్‌కి ఎక్కువగా వస్తోన్న సెర్చ్ టెర్మ్స్ వంటలు, ఆయుర్వేద మందులు, యోగాసనాలు వగైరా. శ్రీశైలం లాంటి పర్యాటక క్షేత్రాలని కూడా వెతుకుతూ సెర్చ్ టెర్మ్స్ వస్తుంటాయి.
డిసెం 29, 2011 @ 15:26:08
ప్రవీణ్ గారూ, మీరు అగ్రిగేటర్ నడుపుతున్నారని మీరు చెబితే తెలిసింది.
దాని వివరాలు దయచెసి చెప్పండి.
Feb 05, 2012 @ 23:03:23
పాయింట్ బాగా చెప్పారు. ” పరస్పర గోకుడు ఎక్కువై వీళ్ళు గ్రూప్ లు గా ఏర్పడతారు”. అది మానవ సహజం, దానిని మార్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు కాబోలు.
ఈ చిక్కంతా చదువుకు(కో)న్న వాళ్ళ వచిచచ్చింది.
Feb 05, 2012 @ 23:14:08
“దానిని మార్చడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు కాబోలు”
నిజమేనండీ రాం గారు!
Feb 06, 2012 @ 06:42:05
బొందలపాటి గారూ, నిజమే సుగర్ కోటింగ్ వేసి మీరు చాలా బాగా వ్రాస్తారు సుమా అన్నీను.
మీ బ్లాగులోనున్న PS ఈ కామెంట్ కు కూడా వర్తిస్తుంది.
Feb 06, 2012 @ 19:49:45
తిట్టారా? చురక వేశారా?