ఈ టపా కొన్నాళ్ళ క్రితం నేను రాసిన ఆంగ్ల టపా కి ఆంధ్రీకరణ..కొంచెం విసుగు తెప్పించే అవకాశం ఉన్న విషయం..నా టపాలలో చాలా వరకూ ఇదే కోవకు వస్తాయని నాకు తెలుసు..ఈ టపా ఎందుకు విసుగు పుట్టిస్తుందో తెలుసుకోవాలంటే చదవండి మరి..
*********************
టపా సారాంశం:
“ప్రత్యక్ష” అనుభవాలను(revelations) పొందటం అనే విషయం మత వర్గాలలో చాలా ముఖ్యమైన విషయం గా భావిస్తారు.
ఈ వ్యాసం “ప్రత్యక్ష” అనుభవాలను భౌతిక విషయాల పరం గా వివరించటానికి ప్రయత్నిస్తుంది. ఈ వ్యాసం ఈ లోక అస్థిత్వాన్ని “తెలిసినది, తెలియనిది, తెలుసుకోలేనిది” అని మూడు రకాలు గా వర్గీకరిస్తుంది. ఈ రాతగాడు, “ఈ బ్రహ్మాండ అస్థిత్వం(existence) లో మనుషులు ఎప్పటికీ తెలుసుకోలేని విషయాలు ఉంటాయి”, అని వాదిస్తున్నాడు. వీటికి అతను “తెలుసుకోలేనివి” అనే పేరు తగిలించాడు.
ప్రత్యక్షం:
ప్రత్యక్ష అనుభవాలనే, సాక్షాత్కార అనుభవాలు(revelations) అని కూడా పిలుద్దాం. సాధారణం గా ఈ అనుభవాలు స్వార్ధం అసలే లేని ఒక స్థితి తో ముడి పడి ఉంటాయి. వీటన్నిటిలోనూ ఉమ్మడి గా ఉండే ఒక విషయమేమంటే, ” ‘నేను’ అనే వాడి మధ్యవర్తిత్వమూ, జోక్యమూ లేకుండా బాహ్య భౌతిక ప్రపంచం లోని వస్తువులతో ప్రత్యక్ష ఇంద్రియ సంపర్కం ఉండటం”. ఈ అనుభవం”వాస్తవం కంటే కూడా ఎక్కువ వాస్తవమైనది”, అని అంటారు. ఇక్కడ చెప్పిన ‘నేను’ అనే పదార్ధం, “మనిషి ఆలోచనల తో చేయబడిన ఆత్మస్పృహ ఉన్న ఒక కేంద్రం”. “నేను” అనేది మనిషి యొక్క అన్ని ఆలోచనలనూ, ఆచరణనూ పర్యవేక్షిస్తూ ఉంటుంది.
ఆలోచనల అమరిక:
“నేను” అనేది “ఆలోచన” అనే దారం తో చేయబడిన ఒక దారపు కండె లాంటిది. ఆలోచనేమో బాహ్య వస్తువుల(ఆ చెట్టూ, ఈ కొండా) యొక్క బౌధ్ధిక ప్రతినిధులైన మాటలూ, చిత్రాలూ వటివాటి తోనూ, స్పర్శ, వాసన, ధ్వని వంటి, వేడి వంటి ఇంద్రియ వినిమయాల తోనూ చేయబడి ఉంటుంది.
ఇంద్రియ వాసనలన్నీ బాహ్య వస్తువుల చిహ్నాలు, కానీ ఇంద్రియ వాసనలు బహ్య వస్తువులు మాత్రం కాదు. అవి కేవలం చిహ్నాలు! ఈ చిహ్నాలు, “బాహ్య ప్రపంచం తో మనిషికి అప్పటికే పూర్తి అయిన పరిచయం”, వలన ఏర్పడతాయి. ఈ చిహ్నాలు(symbols) గతించిన కాలానికి చెందినవి. కాబట్టీ ఆలోచనలు కూడా గత కాలపు చిహ్నాలతోనే చేయబడినాయి. “నేను” అనేది అలోచనల్తో చేయబడినప్పటికినీ తన సొంత అలోచనలను తన చేతన (consciousness) అనే తెర మీద చూడ గలుగుతుంది.
మనిషి చేతన అనేది ఒక గోడ మీద పడిన బాటరీ లైటు కాంతి లాంటిది. ఈ భౌతిక ప్రపంచం అనే పడవ లో కూర్చొని, చేతన, భౌతిక మైన కాలం అనే ప్రవాహం లో ప్రయాణిస్తూ ఉంటుంది, కాబట్టీ ఈ చేతన వర్తమానం లో మాత్రమే ఉంటుంది. అయితే దాని తెరమీద గత కాలపు ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ఈ చేతన అనే తెర పై వర్తమానానికి(present) చెందిన యదార్ధకాలపు (realtime) ఘటనలూ, గత కాలపు(past) ఆలోచనలూ, భవిష్యత్(future) కాలపు ఊహలూ, వీటికి సంబంధించిన చిత్రాలూ(images)..ఇవన్నీ జలిమి గా కదలాడుతూ ఉంటాయి.
మనిషి బుర్ర చిత్రాలు లేక బొమ్మలని తనలో పదిల పరచుకొనకపోతే, ఆలోచన అనేది ఏర్పడదు. ఆలోచన యొక్క విషయకోశం (database) లేకపోతే, “నేను” భవిష్యత్తు ని ఊహించుకోలేదు. అలాంటి సందర్భం లో మనిషి బుర్ర వర్తమానం లో మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు బుర్ర లో అన్నీ ఇప్పటి విషయాలే ఉంటాయి, ఎప్పటి విషయాలో ఉండవు. అలోచన సృష్టించిన భూత భవిష్యత్ వర్తమానాలు అనే హద్దులు చెరిగిపోతాయి. ఆలోచనలు మన జ్ఞాపకాలలో(memory) పదిల పరచబడి ఉంటాయి. మన ధారణ లో ఉన్న పదార్ధం (content) గతం గా పని చేస్తుంది. గతాన్ని పొడిగించి చూస్తే భవిష్యత్ కనపడుతుంది. మన జ్ఞాపకం పోతే గతం పోతుంది. గతం తో పాటు ఆలోచన కూడా అదృశ్యమౌతుంది. గతం అదృశ్యమైనపుడు, గతం యొక్క పొడిగింపైన భవిష్యత్ కూడా అదృశ్యమౌతుంది.
ఒక వ్యక్తి కోణం నుంచీ చూస్తే, ఆలోచన లేనపుడు, ఒక్క వర్తమానం మాత్రమే ఉంటుంది. కాబట్టీ వైయక్తికమైన సమయం మాయమైపోతుంది. మనిషి చేతన మాత్రం బాహ్యమైన భౌతిక ఘటనల ప్రవాహం తో పాటు ప్రయాణిస్తుంది. కాబట్టీ చేతన అనేది భౌతిక కాలం తో పాటు ప్రయాణిస్తుంది.
ఆలోచనల తయారీ:
..to continue

