ఏది సరైన తెలుగు?

ఏది సరైన తెలుగు?
సీ పీ బ్రౌన్ ప్రకారం తెలుగు ఒక ద్రావిడ భాష. ప్రాచీన తమిళం స్థానిక పదాల తో కలిసి రూపాంతరం చెంది తెలుగు గా ఏర్పడింది. ఆ తెలుగు లో, తమిళం లో లా, ఇరవై అరు అక్షరాలు మాత్రమే ఉండేవి. వత్తులు (ఖ, భ, ఛ వగైరా లు ఉండేవి కాదు). ఆ భాష లో సంస్కృత పదాలు లేవు. అది అచ్చ తెలుగు. సరైన తెలుగు. కానీ ఆ తెలుగు ను ఇప్పుడు మనం మాట్లాడ లేము సంస్కృత పదాలు లేకుండా తెలుగు మాట్లాడటం ఊహించుకోండి..చాలా కష్టం!!
తరువాతి దశ, అచ్చ తెలుగు సంస్కృతం తో మిళితమవ్వటం వలన నచ్చింది. ఇందు లో స్థూలం గా రెండు రకాలు. ఒకటి మధ్య కోస్తా బ్రాహ్మణులు మాట్లాడే తెలుగు (ఉత్తరాంధ్ర బ్రాహ్మణులు మాట్లాడేతెలుగూ..గోదావరి బ్రాహ్మణుల తెలుగూ..ఎట్ సెట్రా  వీటిని సింప్లిసిటీ కోసం ప్రస్థుతానికి వదిలేద్దాం). ఇదీ గ్రాంధిక తెలుగు ఇంచుమించు ఒకే రకం గా ఉంటాయి. ఇందులో సంస్కృతాధారమైన వత్తులన్నీ పాటించబడతాయి. పాత సినిమా ల లో ని తెలుగూ ఇదే. ఇక రెండొది సామాన్య జనాల తెలుగు. దీని యాస ప్రాంతాన్ని బట్టీ కులాన్ని బట్టీ మారుతూ ఉంటుంది. అయితే వీటన్నిట్లో ఉమ్మడి లక్షణం వత్తులు పలకకపోవటం. సంస్కృఅత పదాలు రూపాంతరం చెందటం తమిళ జనాభా “ఈ స్థితి లో ఉన్న తమిళాన్ని వారి భాష గా అంగీకరించింది”. అందుకే తమిళంలో వత్తులుండవ్. పరుషాలు తక్కువ. కానీ రూపాంతరం చెందిన సంస్కృఅత పదాలు చాలానే ఉంటాయి.
మధ్య కోస్తాంధ్రుల తెలుగు మీద ఇతర భాషల ప్రభావం తక్కువ (ఒక్క సంస్కృతం మినహా). భౌగోళికం గా వారు తెలుగు ప్రాంతాం నడి బొడ్డు లో ఉండటం వలన కావచ్చు. అందు వలన గ్రాంధిక తెలుగు కి అది మిగిలిన తెలుగు ల కంటే దగ్గరి గా ఉంటుంది. ఐతే ఇందులో బ్రహ్మణులు మాట్లాడే తెలుగే ప్రామాణికమైనది గా గుర్తించటమైనది. దీనికి కారణం వారే పుస్తకాలు ఎక్కువగా రాయటం వలన కావచ్చు.  తమిళం విషయం లో సంస్కృతం కలిసిన వత్తులూ పరుషాలూ లేని భాష ని ప్రామాణికం గా గుర్తించారు. దీని లో సంస్కృతం తక్కువా…తమిళం ఎక్కువా..అదే తెలుగు విషయం లో సంస్కృతం ఎక్కువా అచ్చ తెలుగు తక్కువ. తమిలం విషయం లో మదురై ప్రాంతం లో మాట్లాడేతమిళాన్ని ప్రామాణికం గా గుర్తించారు. అలానే కన్నడం లో మైసూరు కన్నడం ప్రామాణికం గా గుర్తించారు.
మరి తెలుగు విషయం లో ఎవరి ఆధిపత్యం లేకుండాలంటే అచ్చ తెలుగు ను ప్రామాణికం గా గుర్తించాలి. కానీ అచ్చతెలుగు లో ఇప్పుడు మనమెవరమూ మాట్లాడలేం. మధ్య కోస్తాంధ తెలుగు ప్రామాణికమైనది అనుకొంటేమిగతా వారికి కోపం వస్తూంది.
ఇక్కడ ఒక విషయం మధ్య కోస్తాంధ్ర తెలుగు ను ప్రామాణికం గా గుర్తించినంత మాత్రాన అది వారి ఆధిపత్యాన్ని మిగిలిన వారు అంగీకరిఉంచినట్లు కాదు. చారిత్రిక, భౌ గోళిక కారణాల వ కారణాల వలన మాత్రమే అలాజరిగింది. దీనిని మధ్య కోస్తాంధ్ర వాళ్ళూమిగిలిన వాళ్ళూ గుర్తెరగి ప్రవర్తించాలి. ఐతే ఇది చాలా కష్టం. ఒక మనిషిని నీ సంస్కృఅతి గొప్పది, నీ వంశం గొప్పది, నీ తాతలు వీరాగ్రేసరులు, నీ పుట్టుక మేలిమి అని..ఆపైన “నీ చరిత్రా..నీ పుట్టుకా..నీ ప్రతిభా ఇవేమీ నీ చేతిలోలేవు. అవి నీకు వారసత్వం గా అన్నా వచ్చాయి లేక పరిస్థితుల ప్రభావం వలన వచ్చాయి. కాబట్టీ నువ్వు నీ నేపధ్యం గురించి గర్వ పడరాదు. అలా గర్వ పడితే నీ తోటి వాళ్ళకి సహజం గానే నీ పైన అసూయా ద్వేషాలు కలుగు తాయి” అనటం కూడా సరియైనది కాదు. ఒక వేళ ఎవరైనా అలా అంటే, ఆ వ్యక్తి పైకి మాత్రం వినయం గా నటించి..లోలోన అందుకు విరుధ్ధం గా ప్రవర్తిస్తాడు.
కాభట్టీ ఒకరి భాష ప్రామాణికమంటే వేరొకరికి కోపం వస్తుంది. అన్ని భాషలనూ యాసలనూ ప్రామాణికం గా గుర్తించటం వీలు పడుతుందా అనేది ఆలోచించాలి.
ప్రామాణిక తెలుగు లో ఇంగ్లీషు పదాల స్థానం ఏమిటి అనేదు ఇంకొక ప్రశ్న..దాని గురించి తరువాత…

ప్రకటనలు

11 thoughts on “ఏది సరైన తెలుగు?

 1. 🙂 ఇంకొంచెం ముందుకు రాగలరేమో వేచి చూస్తాను. ప్లీజ్ కంటిన్యూ.

  ఒక్క మాట:
  Don’t get obsessed with History. In reality, history is nothing but a reconstructed story to make meaningful linear narration of some known random events of the past, in light of the information obtained subsequently. And thus, it is nearer to fiction than to truth.In a way, it is true even for one’s own life stories.

  మరొక్క మాట:
  నాకు తెలిసి – అన్నింటిని ప్రామాణికంగా ’గుర్తించలేము’. వ్యావహరికంగా ’వాడు’కోగలము. అలా వాడబడినవి, తదనంతర ప్రాచుర్యంలో, జనవ్యవహారంలో ’ప్రామాణికం’ కాగలవు. ఈ తేడాని ఎంత తొందరగా అర్ధం చేసుకుంటే, అంత తొందరగా తెలుగుకు ప్రాణవాయువు సరఫరా ఎక్కడ అడ్డగించబడుతోందో తెలుసుకోగలరు. అటుపిమ్మట ఏం చెయ్యవలెనో యోచించగలరు 🙂

  మెచ్చుకోండి

 2. ప్రసాద్ గారూ,
  చిన్న కథనం అయినా మంచి విషయాన్ని ప్రస్తావించారు. కొంత వివరణ.

  పాతికేళ్ల క్రితమే ఎస్వీయూనివర్శిటీలో తెలుగు ఎం.ఎలో భాగంగా లింగ్విస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదువుకున్నాను. దీని నేపధ్యంలో తెలుగు భాషా చరిత్ర, ప్రపంచ భాషల పరిణామం గురించి బాగా ఆసక్తి ఏర్పడింది. భద్రిరాజు కృష్ణమూర్తి గారు, చేకూరి రామారావు గారు, డాక్టర్ ఎమినో వంటి సుప్రసిద్ద ద్రావిడ భాషా పరిశోధకుల రచనలతో పరిచయం కూడా ఏర్పడింది.

  బ్రౌన్ ప్రకారం ఇప్పుడు ద్రావిడభాషలను చూస్తే కష్టమనుకుంటాను. గత 175 సంవత్సరాల కాలంలో ద్రావిడ భాషల మూలం గురించి చాలా విస్తృత పరిశోధన జరిగింది.

  “సీ పీ బ్రౌన్ ప్రకారం తెలుగు ఒక ద్రావిడ భాష. ప్రాచీన తమిళం స్థానిక పదాల తో కలిసి రూపాంతరం చెంది తెలుగు గా ఏర్పడింది.”

  ఇది ఖచ్చితంగా వివాదాస్పదమైన విషయమే. ప్రాచీన తమిళం అని మీరంటున్నది తమిళం కాదు. మూల ద్రావిడ భాష -ప్రోటో ద్రవిడియన్- దీంట్లోంచే తమిళం,. మలయాళం, తెలుగు, కన్నడ, తుళు, తదితర 24 పైగా ద్రావిడ భాషలు ప్రపంచంలోని పలు దేశాలలో ఉనికిలో ఉన్నాయి. ఇప్పటికే తమిళ భాషా దురహంకారం హద్దులు మీరి ప్రవరిస్తోంది. మనం కనుక ప్రాచీన తమిళంలోంచి తెలుగు ఏర్పడింది అంటే చాలా ప్రాబ్లమ్. పైగా ఇది భాషా చరిత్రకు భిన్నంకూడా. ద్రావిడ భాషల్లో అతి ప్రాచీన భాష తమిళమే అయినప్పటికీ మూల ద్రావిడ భాష నుంచి మొట్టమొదటగా విడిపోయిన బాష ఉత్తర ద్రావిడ బాషా కుటుంబానికి చెందిన బ్రాహుయీ భాష అని ప్రస్తుతం భాషా శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు. సాహిత్య రహిత భాషగా గుర్తించబడిన బ్రాహుయీ భాష ప్రస్తుతం పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, ఇరాన్ కొండ జాతి ప్రజల్లో మాత్రమే ఉనికిలో ఉంటోంది. కాబట్టి తమిళానికి లేనిపోని ప్రాధాన్యతను మనం కల్పించడం భాషా చరిత్రకు భిన్నం కూడా.

  మీరు భాషా శాస్త్రం గురించి అధ్యయనం చేసి ఉంటారనుకుంటాను. భద్రిరాజు కృష్ణమూర్తి, చేకూరి రామారావు గారు వంటివారు రాసిన ప్రామాణిక గ్రంధాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయో లేదో కాని “తెలుగు భాషా చరిత్ర” పేరిట ఆంధ్రవిశ్వకళా పరిషత్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వెలమల సిమ్మన్న గారు రాసిన బృహత్ గ్రంథం ఇప్పటికీ అందుబాటులో ఉంది. మీరు చదవక పోతే తప్పక తెప్పించుకోండి. దాదాపు 700 పేజీలు ఈ పుస్తకం ఇండో ఆర్యన్, ద్రవిడియన్ భాషా కుటుంబాల గురించి చాలా వివరణాత్మక సమాచారాన్ని అందిస్తోంది.

  మీరు భాష గురించి గతంలో ఏవైనా వ్యాసాలు రాశారా? అయితే వాటి లింకులను తప్పక నాకు పంపించగలరు. ఎందుకంటే ఆన్ లైన్‌లో తెలుగు బాషకు లభ్యమవుతున్న సమాచార లింకులను అన్నింటినీ సేకరించాలనుకుంటున్నాను.

  “బ్రాహ్మణులు మాట్లాడే తెలుగే ప్రామాణికమైనది గా గుర్తించటమైనది. దీనికి కారణం వారే పుస్తకాలు ఎక్కువగా రాయటం వలన కావచ్చు.” ప్రామాణిక తెలుగు అని నేడు గుర్తిస్తున్న భాషలో ఏ ప్రమాణమూ లేదు. అది తెలుగు మాండలికాలను, యాసలను, ఆయా ప్రాంతాల భాషా సంప్రదాయాలను తృణీకరిస్తున్న పరమ కృతక భాష. వెయ్యేళ్లు సంస్కృతానికి తెలుగును లోబర్చిన, ఊడిగం చేసిన చరిత్రలోంచి మాత్రమే అది పుట్టుకొచ్చింది.

  “అచ్చతెలుగు లో ఇప్పుడు మనమెవరమూ మాట్లాడలేం.” మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. సంస్కృతానికి, ఉర్దూకు, ఇంగ్లీషుకు, ఏ నాగరికి భాషల ప్రభావానికి లోను కాని భాష మన రాష్ట్రంలోని వివిధ భూభాగాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వాడకంలో ఉంది. పుస్తక భాష ప్రభావానికి ఏ మాత్రం గురికాని అసలు తెలుగు భాష సౌందర్యాన్ని మనం చూడాలంటే గ్రామం మన పరిశోధనా కేంద్రంగా మారాలి. నిజమైన తెలుగు భాషను, దాని ద్రావిడ భాషా కుటుంబ సంప్రదాయాన్ని వెయ్యేళ్లపాటు తొక్కి ఉంచిన చరిత్రలోంచే ప్రామాణిక తెలుగు అనేది పుట్టుకొచ్చింది. ఇతర ప్రాంతాల వారికి కోపం వస్తుందేమో అని మనం ఎంత బ్యాలెన్సెడ్‌గా ఉండాలనుకున్నప్పటికీ ప్రామాణిక తెలుగును తడిమితే తేనెతుట్టెను మనం చూస్తూ చూస్తూ కదిలించినట్లే అవుతుంది.

  మధ్య కోస్తాంధ్ర తెలుగు ప్రామాణిక తెలుగుగా మారటానికి చారిత్రక, భౌగోళిక కారణాలు మాత్రమే తోడయ్యాయా? 150 ఏళ్ల క్రితం తెలుగుకు ప్రామాణిక భాష అనేది ఎక్కడ ఏడ్చింది? మీరన్న మధ్యకోస్తాంధ్ర బ్రాహ్మణ భాష పక్కా నాగరిక భాష. తెలుగు గ్రామీణ సహజ భాషా సంప్రదాయాలకు భిన్నమైన భాష ఇది. గడచిన 150 ఏళ్ల క్రమంలో తెలుగు ప్రాంతంలో రాజకీయ, ఆర్థిక కారణాల ప్రభావ ఫలితంగా మాత్రమే ప్రామాణిక తెలుగు భాష అనే ముద్ర మనందరిమీదా రుద్దబడింది. చరిత్రక్రమంలో తమిళం సాధించిన గొప్ప విజయం ఇక్కడే ఉంది. తమిళంలో మాట్లాడే భాష, పుస్తక భాష అంటూ మనకున్నంత తేడా లేదనుకుంటాను. అందుకే వాళ్లు నూటికి 99 పదాలను తమిళీకరిస్తున్నారు. ప్రతి ఇంగ్లీషు పదాన్ని వాళ్లు వెంటనే తమిళంలోకి మార్చడమే కాక దాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకు వస్తున్నారు. మనం అందరం డీలక్స్ బస్సు అనేదాన్ని వాళ్లు చాలా సింపుల్‌గా ‘సొగసుబండి’ అని పేరెట్టేసి వాడుకలోకి తెచ్చేసుకున్నారు కూడా. తమిళం అంత సులభంగా ఉండటానికి, అంతగా వ్యాప్తి కావడానికి అది తమిళంగా ఉండటమే. తెలుగుకు, తమిళానికి ఉన్న తేడా అదే. తెలుగు తెలుగుగా లేదు. అది సంస్కృతంగా, ఉర్దూగా, ఇంగ్లీషుగా కలగలిసిపోయింది. అన్ని రంగాల్లో మనకు బాషకు సంబంధించి ఒక విజన్ అంటూ లేకుండా పోయింది. మన సకల దౌర్భాగ్యాలన్నింటికి ఇదే కారణం అనుకుంటున్నాను. ఆకాశవాణిలో -రేడియో- వాడే తెలుగు పదాలు నూటికి అరవై వరకు వ్యవసాయ ప్రాంతాల వారికి అర్థం కావడం లేదని 20 ఏళ్ల క్రితమే పరిశోధనలో తేలిపోయింది.

  మీ కథనానికి మించి నా వ్యాఖ్య తయారైపోయింది. మీ స్పేస్ తింటున్నందుకు క్షమించాలి. ఇంత పెద్ద వ్యాఖ్యను మీ కామెంట్ బాక్స్ అంగీరిస్తుందో లేదో తెలీదు. వీలయితే మీ ఈమెయిల్ ఐడీ ఇవ్వండి.

  ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికను రెగ్యులర్‌గా చూస్తున్నారా… అసలు సిసలు తెలుగు గ్రామీణ పదాలను సామల రమేష్ గారు తమిళనాడు కర్నాటక గ్రామీణ మూలాల్లోంచి వెలికి తీస్తున్నారు. వీళ్ల దృక్పధంతో పూర్తిగా ఏకీభవించకపోయినా, తెలుగు భాషా పదాలు, వాడుకలపై చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు వీళ్లు.
  రాజు.
  krajasekhara@gmail.com
  rajasekhara.raju@chandamama.com

  NB: బ్రాహ్మణ నాగరిక, ప్రామాణిక భాషను వ్యతిరేకిస్తున్నంత మాత్రాన బ్రాహ్మణులకు వ్యతిరేకిస్తున్నట్లు కాదు కదా.. ప్రస్తుత తెలుగు సామాజిక రాజకీయ నేపథ్యంలో ఏది రాయాలన్నా ముందుగానో లేదా చివర్లోనో ఇలా నమస్కార బాణంతోనే మొదలు పెట్టవలసివస్తోంది. ఖర్మ.

  మెచ్చుకోండి

  1. రాజశేఖర రాజు గారూ,
   ధన్యవాదాలు. నేను తెలుగు భాష గురించిన స్కాలర్ ని కాదు. అక్కడక్కడా మీడియాలో చదివిన విషయాలను బట్టి ఏర్పరుచుకొన్న నా అభిప్రాయాలను ఇక్కడ ప్రస్తావించాను. మీ కామెంట్ ద్వారా నాకు తెలియని విషయాలు చాలా తెలిశాయి. మన పల్లెలలోని రైతుల భాషలో, కూలీల భాషలో సంస్కృతం తక్కువగా ఉంటుందనేది నిజమే. కానీ అసలు సంస్కృతాధారిత మాటలే లేకుండా వారు మాట్లాడుతున్నారంటారా?
   కొంత మంది తెలుగు భాష కి ఏమీ ఢోకా లేదు అంటారు. ఇంకొంత మంది తెలుగు దాదాపు మృత భాష కిందే లెక్క అంటారు. ఇంగ్లీష్ తో కలిపిన కలగాపులగం భాష మాట్లాడటం పెద్ద గా అభ్యంతరం లేని వాళ్ళ కి, “ఇప్పుడు తెలుగు కి వచ్చిన ఢోకా ఏమిటి?” అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో ఇరవై ఏళ్ళ తరువాత 80% ఇంగ్లీష్ పదాలతో మాట్లాడే తెలుగు తో కూడా వారికి ఏమీ పేచీ ఉండదు. కానీ మంచి తెలుగు మాట్లాడే వారికి తెలుగు తగ్గిపోతోందన్న ఆవేదన ఉంటుంది. తెలుగు బతకాలంటే తెలుగు ద్వారా బతికే అవకాశం ప్రజలకు ప్రభుత్వాలు కలిగించాలి. ప్రస్తుతానికి తెలుగు కి మొదటి శతృవు, జీవిక లేక పోవటం, తరువాతి శతృవు ఇంగ్లీషు. ఇంగ్లీషు లేని ఏ తెలుగైనా నాకు ఆమోదమే. అది సంస్కృత తెలుగు కానీయండి, ఉర్దూ కలగలిపిన తెలుగు కానీయండి.

   మెచ్చుకోండి

 3. ఇంగ్లీషు లేని ఏ తెలుగైనా నాకు ఆమోదమే. అది సంస్కృత తెలుగు కానీయండి, ఉర్దూ కలగలిపిన తెలుగు కానీయండి.
  ———-
  ఇంగ్లీషు మీద అంత అసహ్యం ఎందుకో అర్ధం కావటల్లేదు..

  మెచ్చుకోండి

  1. అసహ్యం కాదండీ, ఒక సిమ్హం వచ్చి మనంపెంచుకొన్న లేడి పిల్లను తినివేస్తుంటే, సిమ్హాన్ని చంపుతామా లేదా? మనం ఇప్పటికే ఇంగ్లీషులో ఆలోచించటానికి అలవాటు పడిపోయాం.(సంస్కృతం లోనో, ఉర్దూ లోనో ఆలోచించేటంత గా ఆ భాషలు తెలుగును ప్రభావితం చేయలేదు). ఇది తెలుగు ఒక మృత భాష అవబోతోందనేదానికి ఒక సూచన. అలాంటప్పుడు, “ఇంగ్లీషు కూడా నేర్చు కొందాం . అది ప్రపంచానికి ఒక కిటికీ వంటిది”, అనటం సరి కాదు. తెలుగు రక్షనే మన ప్రాధాన్యం అయినపుడు, ఇంగ్లీషును అంతం చేయాల్సిందే. లేక పోతే తెలుగు అంతాన్ని చూడటానికి సిధ్ధం గా ఉండాలి! ఇంకా పరవాలేదు ఇంగ్లీషును నేర్చుకొందాం అంటే, తెలుగు మనుగడ కోసం మనకున్న చిత్తశుధ్ధినన్నా శంకించాలి (మన మనుగడ కోసం తెలుగు మనుగడ ను చూసీ చూడనట్లు పోతాం మరి!), లేక మన అవగాహననన్నా శంకించాలి.

   మెచ్చుకోండి

 4. సంస్కృత పదాలూ, ఉర్దూ పదాలూ తెలుగులో విడతీయలేనంతగా కలిసిపోయిన తరువాత కూడా తెలుగు మనుగడ సుస్థిరంగా ఉన్నప్పుడు, ఇంకొక భాష (ఇంగ్లీషు) నుండి పదములు కలిస్తే మనుగడ పోతున్దనుకోవటం సబబేనా అని. నా ఉద్దేశంలో పదాలు కలిస్తే తెలుగు ఇంకా వృద్ది చెందుతుంది కానీ నశించదు.

  మెచ్చుకోండి

  1. పదాలు కలిస్తే పరవాలేదు. కానీ మనలో చాలా మంది ముందు ఇంగ్లీష్ వాక్యాలతో ఆలోచించి, తరువాత వాటికి తెలుగులో అనువాదాలను వెతూకోవలసిన పరిస్థితి ఉంది. అంటే సంస్కృతం యొక్క ప్రభావాన్ని దాటి ఇంగ్లీష్ ప్రభావం చాలా ముందుకు వెళ్ళింది. ఈ పరిస్థితి మన జన సామాన్యానికి సంస్కృతం విషయం లో తలెత్తలేదు. (చాలా కొద్ది మంది పండితులు ముందు సంస్కృతం లో ఆలోచించే వారేమో తెలియదు.) ఒక జాతి ఆలోచన పరాయి భాష లో మొదలై, ఆ భాషలో జరుగుతున్నదంటే, సొంత భాషకు ప్రమాద ఘంటికలు మోగినట్లే!

   మెచ్చుకోండి

 5. నాకు తెలిసిన విస్తృత సమాచారం మేరకు యూరప్ ఖండంలోని పురోగామి దేశాల్లో నేటికీ షాపింగ్ మాల్స్‌లో కూడా వారి మాతృభాషలోనే వ్యాపార వ్యవహారాలు చేస్తారట. సోవియట్ రష్యా ఉనికిలో ఉన్నంతవరకు సమస్త శాస్త్ర రంగాలూ రష్యన్ లోనే జరిగేవి. ఇది నమ్మలేని నిజం. రాజకీయ దార్శనికత, భాషా,సాంస్కృతిక దార్శనికత అనేది మన దేశ నాయకత్వానికి ఏడ్చి ఉంటే మనకు పరాయి భాషలో ఆలోచిస్తూ, పరాయి పదాలను కలుపుకోవడమే బతుకుకు మార్గంగా భావిస్తూ గడిపే పరిస్తితి వుండేది కాదు. 175 ఏళ్ల తర్వాత కూడా మనం మెకాలే విధించిన క్లరికల్ మనస్తత్వం నుంచి బయటపడటం లేదు. మన సమస్త చదువు ప్రస్తుతం పాశ్చాత్య సరుకులను నాజూగ్గా, భారీగా అమ్మడానికి, వారికి లాభాలు పంపడానికి అనుకూలంగా ఉంటూ నో స్పీక్ తెలుగు పలకలు మెడలో ధరిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు బట్టకడుతుందని భావించవలసిన అవసరం లేదు. ఇంగ్లీష్ చదివితే తప్ప, ఇంట్లో అమ్మ నాన్నలతో కూడా ఇంగ్లీషులో మాట్లాడితే తప్ప బతుకు లేదనే భయాలు గూడుకట్టుకున్న చోట దీన్ని వ్యక్తుల తప్పుగా భావించలేము. నిజంగా ఇది జాతి దౌర్భాగ్యం. దేశ రాజకీయ వ్యవస్త సక్రమంగా ఉండి ఉంటే భాష, సంస్కృతి వంటి ప్రాణాధార అంశాలు ఇంత బలహీనంగా కునారిల్లుతూ ఉండేవి కావు. తెలుగు దేశంలో ఒక తండ్రి ముప్పై ఏళ్ల పాటు ఇంట్లో తన కొడుకులతో ఒక్కసారి కూడా తెలుగులో మాట్లాడలేదట. పైగా గర్వంగా కూడా చెప్పుకున్నాడట తను. ఇది ఆ నిర్దిష్ట వ్యక్తి దౌర్భాగ్యమూ, మన మొత్తం జాతి దౌర్భాగ్యమూ కూడా.. మనం ఈ విషయంలో తమిళ ప్రజలను నిజంగా గౌరవించాలి. పూజించాలి. మిగతావేవీ సరిగా ఉన్నా లేకున్నా తమిళ భాష పునాదులను చెక్కు చెదరనీకుండా చేస్తున్నారు వీళ్లు. దేశం మొత్తం మీద ఒక్క ఇంగ్లీషు భాష కూడా లేకుండా తమిళం మాత్రమే 24 గంటలూ ప్రసారాలు నిర్వహించ గల టీవీ ఛానెల్ -మక్కల్ టీవీ- తమిళ ప్రజలకే సాధ్యమైంది. తమిళులకు సాధ్యం అయినప్పుడు మనకెందుకు సాధ్యం కాలేదు. వాళ్లు సంస్కృత, ఉర్దూ, ఆంగ్ల పునాదులను పక్కన పెట్టి తమ పునాదులను కాపాడుకుంటున్నారు. మనకూ వారికీ తేడా అదే. పోతే, ఇతర భాషల నుంచి పదాలను స్వీకరించడంలో ఎలాంటి తప్పూ లేదు. కాని తెలుగును ఇంట్లో, సమాజంలో మాట్లాడటమూ, వ్యవహరించడమూ కూడా తప్పుగా భావించేంత ఘోరంగా ఈ స్వీకారం ఉండకూడదు. ప్రస్తుతం జరుగుతున్న విపత్తు ఇదే. భాష, సంస్కృతికి సంబంధించి మన సమాజం మొత్తానికి విజన్ -దార్శనికత- లోపించింది. దీన్ని రాజకీయ కోణంలోంచి మాత్రమే పరిష్కరించగలం. కాని మన రాజకీయ వ్యవస్థనుంచి దీన్ని ఆశించలేము. సోవియట్ యూనియన్‌లో, రష్యాలో, యూరప్ లో చాలా దేశాల్లో సాధ్యమవుతున్నది మనకెందుకు సాధ్యపడదు అనే ప్రశ్నకు ఇక్కడ జవాబు దొరకదు. శాస్త్ర పదాలకు గత 50 ఏళ్లకు పైగా సంస్కృత తత్సమాలను వాడటం ద్వారా కూడా కొన్ని తరాలు నష్టపోతున్నాయి. ఉదాహరణకు నకశేరుకములు, అకశేరుకములు.. దీన్ని తెలుగు పదాలు అనే అనవచ్చా.. ఇలాంటివి చూసే గ్రామీణ విద్యార్థులు నాడూ నేడూ కూడా సైన్స్, గణితం అంటేనే ఆమడ దూరం పరుగెడుతున్నారు. భాష విషయంలో జరుగుతున్న ఈ అత్యాచారాలను చూసి భరించడం కంటే ఇంగ్లీషులోనే చదువుకుంటే పోలా అనిపిస్తుంది ఒకోసారి.

  మెచ్చుకోండి

  1. రాజు గారూ,
   మాతృ భాషని ప్రేమించాల్సిందే! కానీ మనకున్న సర్వీస్ ఎకానమీ రంగం మనం ఇంగ్లీష్ నేర్చుకోవటం వలననే మనదేశానికి వచ్చింది. అప్పట్లో చైనా ఇంగ్లీష్ నేర్చుకోవకపోవటం వలన అక్కడికి వెళ్ళలేదు. కాబట్టీ మనకు ఇంగ్లీష్ ఈ మధ్య కాలం లో ఒక రకం గా “తిండి పెడుతోంది”. బజరులోని కొట్లలో అన్ని వస్తువులకు అచ్చ తెలుగు పేర్లు ఉండి, అన్ని లావాదేవీలూఒ తెలుగులో జరిగి, అక్కడి వస్తువులలో ఒక్క దానిని కొనటానికి కూడా మన జేబులలో కాసులు లేని పరిస్థితి ఊహించుకోండి. ఎంత మాతృభాష అయినా, ఆ పరిస్థితి కంటే, కాస్త జేబులో డబ్బులు ఉండి, ఇంగ్లీషును చూసీ చూడక పోయే పరిస్థితే నయం గా అనిపిస్తుంది. కాబట్టీ మన ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని పట్టువిడుపులతో కొన్ని మినహాయింపులు ఇచ్చి, తక్కిన అన్ని రంగాలలోనూ తెలుగును అమలుపరచాలి. ప్రస్తుతానికి మనకు పక్కన ఉన్న తమిళ నాడును అనుసరించవచ్చు.

   మెచ్చుకోండి

 6. kondharu antuvuntaru, e neti abivrudhi samajamlo ,aglam nerchukokunte manaku sariaina jivana vupadhi ledhu ani……..
  anthe kakunda mana paripalakulu kuda dhani vaipe moggu chuputhunnaru.. dhaniki miru ela spandhistu, telugu bhashaki nyayam chesthunnaru……….. miru. a prabhavam konnasaga kunnda mana thelugu bhashani mannam rakshinchalema, dhaniki prathi okkari bhaDHATHA EMITAND….

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s