తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం

తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం.
1. హైదరాబాదు ముఖ్య పట్టణం గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడుతుంది. అదేసమయం లో హైదరాబాద్ కేంద్రపాలిత ప్రదేశం గా కూడా కొనసాగుతుంది. ఆంధ్రకు ముఖ్యపట్టణం నిర్మించేందుకు అవకాశం ఇస్తూ, తాత్కాలికం గా పది సంవత్సరాలవరకూ హైదరాబాద్ ఆంధ్ర కు కూడా ముఖ్య పట్టణం గా కొనసాగుతుంది.

2. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తరువాత హైదరాబాద్ కు వలస వచ్చిన హైదరాబాద్ లోని ఆంధ్ర ప్రాంతీయులకు నగర పాలనా సంస్థ ల లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడతాయి.

3.నదీ జలాల గురించిన ఎవరి వాటా ఎంత అనేదాని గురించిన సమగ్రమైన ఒప్పందాలు కుదుర్చుకోబడతాయి. వీటిని ఉల్లంఘించిన పక్షం లో ఉండే  రుసుము లు ముందు గానే నిర్దేశించబడతాయి..

4. హైదరాబాద్ లో ఆంధ్ర తెలంగాణ లోని పౌర ప్రముఖులతో  కూడిన సద్భావనా సమితి ఏర్పాటు చేయబడుతుంది. దీని లక్ష్యం మామూలు సమయాలలో ఇరు ప్రాంతాల మధ్య సౌహార్ద పూరిత వాతావరణం ఉండేటట్లు చూడటం. ఇరు పక్షాలకూ ఒకరి పై ఇంకొకరికి ఉన్న అనుమానాలను తొలగించటం.ఒక ప్రాంతం వారి దృక్పధాన్ని ఇంకొక ప్రాంతం వారికి అర్ధం అయ్యేవిధం గా చెప్పటం. భవిష్యత్తు లోని వివాదాల (ఉదా: నదీ జలాలు) సమయం లో ఇరు ప్రాంతాల ప్రజలూ న్యాయ పరమైన నిర్ణయాలకు కట్టు బడి ఉండేటట్లు ఒప్పించటం ద్వారా ఇరు ప్రాంతాల మధ్య స్నేహపూరిత వాతా వరణం కొనసాగేటట్లు చూడటం.  రాజకీయ నాయకులకు దీని లో ప్రవేశం ఉండదు.

4. పది సంవత్సరాల తరువాత ఆంధ్ర ప్రాంతం వారి రాజధాని అన్ని హంగులతో తయారౌతుంది. అప్పటి ప్రజాభిప్రాయం సమైక్య రాష్ట్రాన్ని కోరుతుందా లేక వేర్వేరు రాష్ట్రాల కొన సాగింపును కోరుతుందా అనే విషయాన్ని పౌర సద్భావనా సంస్థ ద్వారా తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగటం.ఒక వేళ ప్రజలు సమైక్య రాష్ట్రన్ని కోరుకొంటే కొత్తగా ఏర్పరచిన రాజధాని, మహరాష్ట్ర కు నాగపూర్ లా, సమైక్య రాష్ట్రానికి రెండవ రాజధాని అవుతుంది.ఈ రాజధాని అయ్యే ఖర్చు, ఈ పరిష్కారాన్ని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఈ పది సంవత్సరాల తరువాతి సమీక్ష వలన, ఇరవైకి పైగా ఉన్న ఇతర ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ ల ను తెలంగాణ డిమాండ్ తో ప్రస్తుతానికి  వేరు చేసి చూప వచ్చు. ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఈ విధమైన సమీక్షకు సిధ్ధం గా ఉండక పోవచ్చు. దీని వలన దేశ సమగ్రత కు చిన్న రాష్ట్ర డిమాండ్ ల వలన ముప్పు ఏర్పడుతుందేమోనన్న భయాన్ని తగ్గించ వచ్చు.  .రెండు మూడు జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరేవాళ్ళు, మళ్ళీ కలిసిపోవటం అనే ఆలోచనకు అనుకూలం గా ఉండరు. ఈ విధం గా తెలంగాణ లేక ఆంధ్ర ను ఇంకా చిన్న రాష్ట్రాలు గా విభజించాలి అనేవారిని కూడా నిలువరించవచ్చు. 

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

15 thoughts on “తెలంగాణ సమస్య కు అందరికీ ఆమోద యోగ్యమైన పరిష్కారం

   1. మీరు భలే వాళ్లండి తెచ్చిన అప్పులేమో ఖర్చు పెట్టింది హైదరాబాద్ చుట్టూ రోడ్లు , హైటెక్ సిటి సోకులుకు , ఇప్పుడు పంచేదేమో జనాబా ప్రాతిపదికనా 🙂

    మెచ్చుకోండి

    1. ఈ సమస్యకంతటికీ ఒక రకం గా కారణమైన కేంద్ర ప్రభుత్వం, సమానం గా ఖర్చు పెట్టి ఆంధ్ర రాజధాని ని కూడా అభివృధ్ధి చేస్తుంది మరి. 🙂

     మెచ్చుకోండి

 1. మీ రెండో పాయింట్ కొంచెం కష్టసాధ్యం అనుకుంటా ఎందుకంటే అసలు గొడవే ఆంధ్రావాళ్ళు వచ్చి దోచుకుపోతున్నారని అనికదా మళ్ళీ రిజర్వేషన్ అంటే అయ్యే పనికాదు.

  మెచ్చుకోండి

  1. తెలంగాణ రాష్ట్రం వస్తే రెండున్నర లక్షల ఆంధ్ర ఉద్యోగులను (గిర్గ్లానీ నివేదిక ప్రకారం) ఆంధ్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. జనాభా ప్రాతిపదికన హైదరాబాదు నగర సంస్థలలో (జీ హెచ్ ఎం సీ మొదలైనవి)ఆంధ్ర వాళ్ళకి వచ్చే ఉద్యోగాలు మహా అయితే ఓ 15000 వరకూ ఉంటాయి అంతే. ఇవి కూడా ఇవ్వక పోతే తెలంగాణా వాదులకు తెలంగాణా రావటం పై ఉన్న చిత్త శుధ్ధి ని శంకించాల్సివస్తుంది.

   మెచ్చుకోండి

 2. ఆర్యా క్షమించాలి,
  హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ సిటీ కి దరిదాపుల్లో అలాంటిదే మరో పట్టణం నిర్మించాలి అంటే ఇంచుమించు 30సంవత్సరాలు పైన పడుతుందనీ, ఆలోపు ఈ రెండు పట్టణాలూ ఒక దానికొకటి ఎదుగుదలని cannibalize చేసుకుంటాయనీ నిపుణులు చెప్తున్నారు.

  గత పదేళ్ళు గా మేము కట్టిన లక్షల రూపాయల ఇన్ కం టాక్సు లతో రోడ్లేసుకుని, ఫ్లై ఓవర్లు కట్టుకుని ఇప్పుడు మమంల్ని మరోచోటు వెతుక్కోమంటే వినడానికెవడూ సిద్ధం గా లేడు.

  ఈ ఉద్యమం వెనకాలున్న చిత్తశుద్ధి, రాజకీయ నిరుద్యోగత, నిష్క్రియత్వం ఈ యేడాది చివర్లో బయటపడక మానవు. యేరులా పారే రక్తాలూ, హోరుమని మోగే అంతర్యుద్ధాలూ, అడ్డూ అదుపూ లేని ప్రగల్భాలూ ఎవరిని ఎక్కడ నుంచో పెడతాయో కళ్ళారాచూస్తాం.

  మెచ్చుకోండి

 3. జైఆంధ్ర జైతెలంగాణాలకు విరుగుడుగా ఆరు సూత్రాల ప్రకారం రాష్ట్రంలో ఆరుజోనులు ఏర్పడ్డాయి.కానీ
  చాలా కీలక శాఖలకు పోలీసు శాఖలోలాగా జోనల్ ఆఫీసులు ఏర్పడనందున ప్రతి చిన్నపనికీ హైదరాబాదు వెళ్ళాల్సి వస్తోంది.వాస్తవానికి కోస్తా రాయలసీమలవారే దూరాభారాలతో కోట్లాది రూపాయల ప్రయాణ ఖర్చు(అనుత్పాదక ఖర్చు) ఎక్కువగా మోస్తున్నారు.1956 నుండి ఈ54 ఏళ్ళలో సీమాంధ్ర ప్రజలు రాజధాని నగరానికి చేసిన ప్రయాణ, సరుకురవాణా, లాడ్జి ఖర్చులతో రాజధాని నగరమే కట్టొచ్చేమో!

  హైకోర్టు గుంటూరునుండి తరలిపోయింది .కనీసం యాభైనాలుగేళ్ళకాలంలో బెంచి కూడా ఏర్పాటు చేయలేదు.

  విజయవాడ,రాజమండ్రి,,తిరుపతి,నంద్యాల,మంచిర్యాల,భద్రాచలం లాంటి కొత్తజిల్లాలు కూడా ఏర్పడలేదు.తెలంగాణ సీమాంధ్ర సరిహద్దుల్లో కొత్తజిల్లాలు ఏర్పాటుచేస్తే కొంతన్నా సమైక్యత నిలబడేది.

  రాజధాని నగరానికి తరలించి ఒకేచోట పోగుపెట్టిన అభివృద్ధి కేంద్రాలను ఇప్పటికైనా రాష్ట్రంలోని ఆరు జోన్లకూ తరలించాలి.

  యానాం ను మనరాష్ట్రం లో కలపాలని కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ చాలా కాలం క్రితమే తీర్మానించింది. అక్కడి ప్రముఖులు మల్లాడి,వాసిరెడ్డి,మాజేటి,మొదలైనవారంతా-” ఒక భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండటం”,లేదా “భౌగోళీకంగా సమీప ప్రాంతాలు ఒక రాష్ట్రంగా ఉండటం” అనే ఏదో ఒక ప్రాతిపధికను అంగీకరించాలి.

  మెచ్చుకోండి

 4. అయ్యా…వలస వచ్చిన వాళ్ళు అంటే ఎవరో కాస్త వివరించగలరు. అసలు వలస అంటే మీ అర్థం తెలంగాణా వలస లేక ప్రపంచమంతా అంగీకరించిన వలసా అని మాకు సందేహం. ఆంధ్ర ప్రాంతం నుండి వస్తేనే వలస….మరి ఇరాన్ నుండి వచ్చినవాళ్ళు, గుజరాతీలు, సిక్కులు, తమిళులు మిగిలినవారు మాత్రం తెలంగాణా పౌరులు, కదా? బాగుంది సర్………మీ లాంటి మేధావులు ఉండబట్టే ఈ అసంబద్ధ , అహేతుకమైన కుహనా ఉద్యమం ఇన్నాళ్ళు వర్ధిల్లుతుంది.

  మెచ్చుకోండి

 5. నయా ఆంధ్రోళ్ల రాజధాని కట్టే కాంట్రాక్టులు ఎవలికిస్తరు?
  అవి భీ మాగ్గావాలె, లేదంటే గీడల్కెల్లి సెగ పెడుతం, దిమ్మ తిరగాలె. భూకంపం సృష్టిస్తం.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s