భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న

భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న:

శిష్యుడు: గురువు గారూ కృష్ణ భగవానుడు గీత లో “కర్మల ని ఆచరించు, కానీ ప్రతిఫలం ఆశించకు”,అన్నాడు. ఇదెలా సాధ్యం? నేను క్రికెట్ ఆడతాను. ఆ ఆడటంలోనాకు ఆనందముంది.  కాబట్టీ,రేపు ఏ క్రికెట్ లో ఏ అవార్డో వస్తే నేను ఇంకా సంతోష పడతాను. మనం ప్రయాణం చేసే మార్గం లో నైనా ప్రతిఫలాన్ని ఆశిస్తాం. లేక పోతే గమ్యం లోనైనా ప్రతిఫలం ఆశిస్తాం కదా!ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించకుండా ఏ పని ఐనా మొదలు పెట్టటానికి ప్రేరణ ఏముంటుంది. మనకు నిత్యం బాధ కలిగించే పనిని మనం మొదలు పెట్టం కదా. సంఘాన్ని బాగు చేయ్యటం కోసం ఎన్నో కష్టాలను ఓర్చుకొన్న మహా మహులు కూడా ఆ పని వలన ప్రతిఫలాన్ని ఆత్మ సంతృప్తి రూపం లో పొందుతారు కదా?  కాబట్టీ ప్రతిఫలాపేక్ష లేని కర్మ అనేది మన ఊహలలో మాత్రమే సాధ్యమనుకొంటా గురూ గారూ!”

గురువు: బాబూ! మన ఇంటిలో మొదలూ చివరా అంటూలేని వస్తువు ఏదైనా ఉందా?

శిష్యుడ్డు: లేదు గురూ గారూ! మొదలూ చివరా లేకుండా ఏ భౌతిక వస్తువైనా ఎలా ఉంటుంది?

గురువు: బాగా ఆలోచించు నాయనా..

శిష్యుడు: నా మనసు లోకి ఏమీ రావటంలేదండీ గురువు గారూ!

గురువు: సరే, ఆ పక్క గది లో నీ ఆట వస్తువులన్నీ ఉన్నాయి కదా. ఒక సారి వెళ్ళి చూసి రా నాయనా, ఏమైనా దొరుకుతాయేమో.

శిష్యుడు: (తన లో…గురువు గారు ఏదో మాయ చేస్తున్నారు..) ఆ ఇదిగో నండీ ఇక్కడ “టెన్నీ కాయిట్” రింగు దొరికినది. దీని చుట్టు కొలత వెంబడి పోతే దీనికి ఆదీ లేదు అంతమూ లేదు. మనం ఏక్క డ ఆది అనుకొంటామో అదే ఆది అవుతుంది..అయినా దీనికీ నిష్కామ కర్మ కీ ఏమి సంబంధం గురువు గారూ…??

గురువు గారు: బాబూ, ఐదు నిమిషాల ముందు “ఆదీ అంతం లేని విషయం అసంభవం” అన్నావు…గది లోకి వెళ్ళి వెతికిన తరువాత ఇప్పుడు ఒక వస్తువు ని కనుగొన్నావు. అప్పటికీ ఇప్పటికీ ఈ బాహ్య ప్రపంచం ఏమైనా మారిందా?…లేదు కదా…మార్పు నీ మనసు లోనే ఉంది. రింగ్ అప్పుడూ ఉంది..ఇప్పుడూ ఉంది. ఐతే ఇప్పుడు ఆ వస్తువుని చూడటం ద్వారా నీ మనసులో మొదలూ చివరా లేని వస్తువు సంభవించటం పై ఉన్న అపనమ్మకంపోయింది.  అదే విధం గా నిష్కామ కర్మ అనేది ఒక ఊహ మాత్రమే అని నీకు అనిపించటానికి కారణం అలాంటి కర్మ నీకు వ్యక్తి గతం గా అనుభవం లోకి రాక పోవటమే. నిత్యం నీవు ప్రతిఫలం ఆశిస్తూ చేసే పనులలోనే ఏదో ఒక పనిని నువ్వు ప్రతిఫలాపేక్ష లేకుండా కూడా చేయగలవు.అది ఏ పని అనేది నీకు వెంటనే తట్టకపోవచ్చును.అయితే ఆ పని  ఏదో తెలుసుకోవటం కోసం నువ్వు వెతికి చూడాలి. ఒక సారి దానిని నీవు కనుగొన్న తరువాత అది సంభవమేనని నీకు తెలుస్తుంది.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

10 thoughts on “భగవద్గీతా, ఆధునిక తత్వశాస్త్ర ప్రశ్న

 1. బాగుంది. మంచి విషయం. నాకొకటి అనిపిస్తోంది టపా వ్రాయడమేగాని కామెంట్స్ అనే ప్రతిఫలం గురించి ఆలోచించకూడదన్నమాట.

  మరొకటి ఏమనుకోక “బ్లాగ్ థీం” మార్చండి లేదా ఫాంట్ సైజ్ పెంచండి. చదవడం కొంచెం కష్టంగా ఉంది.

  మెచ్చుకోండి

  1. “నాకొకటి అనిపిస్తోంది టపా వ్రాయడమేగాని కామెంట్స్ అనే ప్రతిఫలం గురించి ఆలోచించకూడదన్నమాట.”
   హా…హా…హా …భలే అన్వయించేశారు కదండీ…థీం మార్చాలి ఎదో బధ్ధకం గా ఉంది..

   మెచ్చుకోండి

 2. బొందలపాటిగారు, మంచి విషయం చెప్పారు. కాని నాకనిపించేదేమిటంటె ఒక మోతాదులో ప్రతిఫలాపేక్ష, గుర్తింపు కోసం తపన వుంటే మన ప్రయత్నం మరింత బాగుంటుందని. అనుకున్న ఫలితం రాకపోతే కుంగిపోకూడదని మన పెద్దలు వేదాంతం చెప్పారనుకుంటా!
  on a lighter way అసలు కామెంట్లు అక్కరలేదు అనుకుంటే మనం బాగా రాద్దామని ప్రయత్నించమేమో? just kidding:-)

  మెచ్చుకోండి

  1. కృష్ణ గారు,
   ప్రతిఫలాపేక్ష లేని పని కంటే ఉన్న పనే మనం బాగా చేస్తాం అంటున్నారు కదా మీరు….ప్రతిఫలాపేక్ష అంటూలేని పనులు ఆధ్యాత్మికమై పోతాయి. అందువలన లాభాలూ(ఆనందం) ఉండవు, నష్టాలూ ఉండవు ( ఫ్రస్ట్రేషన్). ప్రతిఫలాపేక్ష లేని పనులు వేరే ఒక ప్లేన్ లో ఉంటాయంటారు. పనులను అలా చేయటం వలన పరి పూర్ణ సత్యం అవగతమౌతుందని పెద్దల ఉవాచ. సృజనాత్మకత అనేది అలాంటి ఇంపర్సనల్ స్థితి నుంచీ వస్తుంది అనేది ఇంకొక తీరీ. కాబట్టీ, కామెంట్లు వస్తూ ఉంటే మనం ఇంకొంచెం బాగా రాస్తాం…కరెక్టే..కానీ మనం ఏదన్నా కొత్తది సృష్టించాలంటే మాత్రం మనని మనం మరచిపోయిన ఒక ఇంపర్సొనల్ స్టేట్ కి వెళ్తేనే సాధ్యం అంటారు జే కే లు గట్రా వంటి వాళ్ళు. ఈ స్థితి కి ప్రయత్నం వల్ల చేరలేమనేది ఇంకొక ఆలోచన. ఎందుకంటే ఈ స్థితి ఇంపర్సనల్..అంటే మానసికం గా వ్యక్తి మాయమైపోతాడు…వ్యక్తి మాయమైనప్పుడు ఇంకా ప్రయత్న మెక్కడిది…? …? మనిషి కనిపెట్టిన ఆవిష్కరణ లన్నీ మనిషి బుర్ర బయటి నుంచీ వచ్చినవని ఒక మాట కూడా ఇలాంటి చోట్లే ఎక్కడొ నేను చదివాను.
   ఈ సందర్భం గా నాకు పోతన “రాసెడిది భాగవతమట..రాయించెడు వాడు రామ భద్రుండట” అనటం గుర్తుకొస్తుంది.

   మెచ్చుకోండి

 3. నేను నిజం గా నిష్కామ కర్మ అనేది దైనందిన జీవితం లో ఉందా అని నా చిన్నప్పుడు ఆలోచించాను. నాకు తెలిసిన నిష్కామ కర్మ ఎమిటంటె ఇంట్లొ దేవుడి పూజ చేయటం. అదేలా అంటె దీపారాధన, సంధ్య వందనం, పూజా,తరువాత మహానైవేద్య్హం ప్రతీరోజు ఉదయం నిర్ణీత సమయాం లో చేయాలి ఆలా చేసేటప్పుడు ఇతర కుటుంబ సబ్యుల సహయాం మనాము తీసు కోకుడదు. మనం చేసె పూజ గురించి ఎవరితో చెప్పకూడదు. ఆలా ఒక సం|| చేసిన తరువాత మీకు కలిగె భావన /feeling నిష్కామకర్మకు దగ్గర గా ఉంట్టుంది. other than that I did not find any నిష్కామ కర్మ work in this world.

  మెచ్చుకోండి

 4. శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.

  మీ వ్యాసం బాగుంది. మీరు వ్రాసిన దాంట్లో ఇలా చెప్పారు:
  “ప్రతిఫలాపేక్ష లేని పనులు వేరే ఒక ప్లేన్ లో ఉంటాయంటారు. పనులను అలా చేయటం వలన పరి పూర్ణ సత్యం అవగతమౌతుందని పెద్దల ఉవాచ.”

  పై విషయంలో, ప్రతిఫలాపేక్ష గురించి భగవద్గీత, రెండవ అధ్యాయంలో, 47 & 48 శ్లోకాల్లో చెప్పబడింది. కొంచెం కష్టమైనప్పటికీ, అందరూ ఆచరించగలదగ్గదే ఇది. “ప్రతిఫలాపేక్ష” లేకుండా అనే పదంలో అనేక “నిర్దేశికాలు” వున్నాయి. ఉదాహరణకి:- నేను వైద్యుడుని కావాలనుకున్నాను; వైద్యశాస్త్రాన్ని చదివాను. చదువుతున్నప్పుడే, వైద్యుడిని అయినతరువాత నాకు పెద్ద జీతంతో ఉద్యోగము వస్తుంది; గొప్ప పేరు వస్తుంది అని అలోచిస్తూ చదివితే, చదువు వంటబట్టదు; అంటే, ఒక పని చేస్తున్నపుడు ఆ పనిమీదనే ధ్యాస వుంచాలి(దీనినే ZEN THEORY – ZEN cars are named after this Japanese name) , దీనినే “ఏకలవ్యుని పాఠం” అంటారుకూడా. తరువాత, చదువు అయిపోయి, వైద్యుడిగా పట్టా తీసుకున్నతరువాత నేను అనుకున్న స్థాయిలో జీతం రాకపోతే, మానసికంగా క్రుంగిపోవటం జరుగుతుంది. అట్టి స్థితిలో నా జీవితము ఎట్లా వుంటుందో ఊహించుకుంటే, జీవితం శూన్యంగా వుంటుంది. అందుకనే, ఫలాపేక్షలేకుండా కర్మలను చేయమని గీతలో సలహ ఇవ్వబడింది.

  భవదీయుడు,
  మాధవరావు.

  మెచ్చుకోండి

  1. మాధవ రావు గారూ, నమస్కారం,
   కానీ వైద్య విద్య చదివేటప్పుడు కూడా దానిని ఆనందిస్తూ చదవ వచ్చు. భగవానుడు ఈ ఆనందాన్ని కూడా ఆశించవద్దు అంటున్నాడనుకొంటాను.. అందుకే ఉద్యోగం పొందటం ఒక లక్ష్యమైతే, వైద్య విద్యనభ్యసించటం ఒక మార్గం. మార్గం లో కానీ గమ్యం లో కానీ ప్రతి ఫలాన్ని ఆశించవద్దు అంటాడు భగవానుడు. ఇది కొంచెం కష్ట సాధ్యమైన విషయమే. మనము మార్గం లోని ప్రయాణాన్ని ఆనందించ గలిగినట్లైతే, గమ్యం లో ఫలాపేక్ష లేకుండా పనులు చేయటం అంత కష్టమేమీ కాదు. జీవితమనేది ఒక గమ్యం లేని ప్రయాణం. ప్రయానం చేయటమే దాని గమ్యం.జీవన ప్రయాణానికి గమ్యం లో ప్రత్ఫలం ఆశించవద్దు అంటున్నాడేమో భగవంతుడు. ఎందుకంటే గమ్యమే లేనప్పుడు గమ్యం నుంచీ పతిఫలం ఆశించలేము కదా! ఒక వేళ ఆశించినా లేని దాన్ని ఎలా పొందగలం?
   జీవితమే ఒక వైద్య విద్య ను అభ్యసించటం లాంటిదైతే,దీనికి చివరిగా చేసే ఉద్యోగం ఏమీ లేదు. చావు తో మన వైద్య విద్య ముగుస్తుంది.

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s