నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ టపాకి ప్రేరణ

సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ, సామ్యవాద ఆశయాలు…ఒక పరిశీలన.. టపాకి ప్రేరణ
అవి యండమూరి, మల్లాదీ కమర్షియల్ రచయితలు గా కాలమేలుతున్న రోజులు. మా వూరి లైబ్రరీ నుంచీ నేను నవలలూ గట్రా తెచ్చి చదువుతూ ఉండే వాడిని. కొన్నాళ్ళకి కొడవటిగంటి కుటుంబ రావు కథలు చదవటం జరిగింది. ఒక సారి ఆయన కథలు చదివిన తరువాత మళ్ళీ కమర్షియల్ నవలలు ముట్టబుధ్ధికాలేదు. ఇక అప్పటి నుంచీ కొ.కు, రావి శాస్త్రి, బీనా దేవి ల కథలు చదవటం మొదలు పెట్టాను.
మా నాన్న గారు ఒక చిన్న రైతు. ఆయన పెద్ద వాళ్ళు ఆయన విధ్యాభ్యాసాన్ని సపోర్ట్ చెయ్యలేదు. ఆయన స్నేహితులలో చాలా మంది చదివి హాయిగా ఉద్యోగాలు చేసుకొంటుంటే, తాను ఎదుగూ బొదుగూ లేని వ్యవసాయం చేయ వలసి వచ్చిందనేది ఆరోజుల్లో ఆయన బాధ.
నేను కథలూ సాహిత్యమూ చదువుతున్నప్పుడల్లా ఆయన, చూసి,”ఈ కతలూ కాకర కాయలూ అన్నం పెట్టవు. బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో” అని చెప్పే వారు.
నేను వెంటనే, “ఇదేమీ చెత్త సాహిత్యం కాదు.ఇది సమాజం లో వాస్తవ పరిస్థితి గురించి చెబుతుంది. చాలా ఆదర్శవంతమైన రచనలు”, అనే వాడిని.
దానికి ఆయన, “అనుభవం మీద చెబుతున్నాను తెలుసుకో. నాకు తెలిసిన వాళ్ళూ చాలా మందే ఈ ఆదర్శాలూ, ఆకులు పట్టుకోవటాలూ అని మట్టిగొట్టుకొని పోయారు. తరువాత ఎందుకు ఆదర్శాల జోలికి పోయామా అని నా దగ్గర బాధ పడిన వాళ్ళున్నారు. కానీ పైకి సమాజం లో మాత్రం చెప్పుకోరు. ఇక పోతే ఆదర్శాలు చెప్పే వాళ్ళ జీవితాలు ఆ ఆదర్శాల ప్రకారం ఉంటాయి అని చెప్పలేం, ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులూంటాయి అని అంటారు కదా! నా స్నేహితుడొకడు ఇప్పుడు ఒక ప్రసిధ్ధ సామాజిక స్పృహ చెప్పే రచయిత. కానీ వాడి అసలు బతుకేమిటో నాకు తెలుసు. కాబట్టీ ఒరే, నువ్వు బుధ్ధిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో..నాకు ఈ మట్టి పిసకటం కొంతన్నా తప్పుతుంది…చివరికి కోటి విద్యలూ కూటి కోసమే. ఆ పైన టైం ఉంటే అప్పుడు ఆదర్శాలూ గట్రా చెప్పే పుస్తకాలు రాసుకో”, అని నాకు ఒక క్లాస్ పీకారు.
నాకు అప్పట్లో మా నాన్న మాటలు ఛాదస్తం గా కనపడినా,ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోక పోతే ఈయన ఊరుకొనేలా లేడు అని ఎలాగొలా చదువు సాగరం ఈదేసి ఒక ఉద్యోగం లో ఇరికేశా. ఈ మధ్య లో నా తో చదువుకున్న వాళ్ళు లో కొంతమంది ఉద్యమాలలోకి వెళ్ళి వ్యక్తిగతం గా నష్టపోయి, దానిని నా దగ్గర వ్యక్త పరచిన వాళ్ళున్నారు.
ఇవన్నీ చూసుకొంటే ఇప్పుడు నేను కొంచెమన్నా ఆర్ధిక ఇబ్బందుల్లో లేకుండా ఉన్నానంటే అది మా నాన్న స్వానుభవం తో వచ్చిన ఇంగితం తో అప్పుడు నన్ను చదువు లోకి తొయ్యటమే కారణం అనిపిస్తుంది. మా నాన్న లానే నాకు కూడా ఇప్పుడు ఎవరైనా ఆదర్శాలు చెప్తే వాళ్ళకి, “బాబూ ముందు నీ సర్వైవల్ గురించి ఆలోచించుకో”, అని చెప్పాలని పిస్తుంది.
మా నాన్న ఆ రోజుల్లో చెప్పిన మాటలే నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ, సామ్యవాద ఆశయాలు…ఒక పరిశీలన.. టపాకి ప్రేరణ.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

2 thoughts on “నా సమాజమూ, వ్యక్తీ, ఆదర్శాలూ టపాకి ప్రేరణ

  1. చదువుకోవటం అభ్యుదయమే. అది రేపటి భుక్తికి వుపకరించేది కవచ్చు, పక్కాగా సామాజికపరమయింది కావచ్చు. మీ నాన్న కూడా అదే బోభించారు, కాకపోతే పరోక్షంగా. ఒక పల్లెటూరి అలా చెప్పటం అభ్యుదయమే. ఉన్నత చదువరి అయిన మీరు గందరగొళంలో వున్నట్లుంది. విద్యార్ఠిగా చదువు ప్రధానం. ఆటలు, పాటలు, సామాజిక పరిశీలన, పోరాటాలు ఇలా సమయాన్నిబట్టి చేయటమే మానవుడి విధి. ఈ రెండిట్లో యేది లేకపోయినా అసంపూర్ణమే. యేదో ఒకటే చేసి తర్వాత తీరిగ్గా యేదో తప్పు చేశామని వాపోవడం అశాస్త్రీయం తప్ప మరొకటి కాదు.
    venkata subba rao kavuri, edumudi.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s