మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…

మొన్న రిచర్డ్ ఫేన్మాన్ ఉపన్యాసాలు చదవటం పూర్తి చేసిన తరువాత దానిలోని విషయాల గురించి టపా వేద్దామనుకొన్నా. కానీ టైం లేక, వేయలేక పోయాను.
ఇవాళ ఆకాశరామన్న గారి ఉత్తరం చూస్తుంటే ఫేన్మాన్ చెప్పినవి గుర్తుకొచ్చాయి. అలానే అంతకు ముందు మతం గురించి చాలా వేడి వేడి చర్చలే నడిచాయి(కృష్ణ గారి టపా లో ).

వీటన్నిటి ప్రభావం తో ఆకాశ రామన్న గారి టపాలోకామెంటుదామనుకొంటే ఈ కింది చాట భారతం వచ్చింది.
ఇంత వచ్చింది కదా అని కొత్త టపా మొదలెట్టా. ఈ టపా మతానికి అనుకూలమూ కాదు,ప్రతికూలమూ కాదు. దీన్ని “గోడ మీది పిల్లి” టపా అనుకోండి. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీసేందుకు కూడా ఉద్దేశింపబడలేదు.

హమ్మయ్య డిస్-క్లెయిమర్లు అయ్యాయి కదా, ఇక నా ఆలోచనలు ఇక్కడ…
ఫేన్మాన్ గారి ఉపన్యాసం వలన నాకు అర్ధమైనది ఏమంటే మతమూ సైన్సూ రెండిటినీ కూడా మనిషి తన బాగు కోసమే అభివృధ్ధి చేసుకొన్నాడు. చూడండి మనిషి ఎంత స్వార్థ పరుడో! కాబట్టీ మనిషి కోసం మతమూ,సైన్సూ. మతమూ,సైన్స్ కోసం మనిషి కాదు. అలానే చివరికి మనిషి కోసం కమ్మ్యూనిజం, కాపిటలిజం మొదలైన సిధ్ధాంతాలు. సిధ్ధాంతాలు సిధ్ధాంతాలకోసం మాత్రం కాదు.
మతం సరైనదై మనిషి దారి తప్పినప్పుడు నాగరిక సమాజం మనిషిని ముందు దారిలోకి తేవాలి.
మతమూలేక సైన్స్ ఒక కత్తి అనుకొంటే, కత్తిని తయారు చేయటం లోనే మనిషికి స్వార్థం ఉంది. అది తన సర్వైవల్. అలాంటి మనిషి కత్తిని స్వార్థం కోసం ఉపయోగించడని గారంటీ ఏమీ లేదు. కత్తిని పొదలను నరికే మంచి పనికీ వాడవచ్చు. అలానే ఎదుటి వాడి గొంతు కోసే చెడ్డ పనికీ వాడ వచ్చు. ఈ రెండిటిలోనూ కత్తి తప్పు ఏమీ లేదు అది ఉపయోగించే మనిహి తప్పు. ఇక్కడి వరకూ సూటి గా ఉంది కదా. సమస్య కొన్ని తుప్పు పట్టిన కత్తులు మనిషి తమను ఎలా ఉపయోగించ గలడో తమ( కత్తుల) చేతుల్లోనే ఉంది అని భ్రమ కలిగించినపుడు…….

సైన్స్ అనేది ఈ ప్రపంచం ఎలా పని చేస్తుందో చెప్తుంది. కానీ మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో చెప్పలేదు. అలానే ప్రపంచం ఎందుకు పని చేస్తుంది? మనుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు సైన్స్ కి తెలియదు. మనుషులు ఏ దిక్కులో వెళ్ళాలో మతం చెప్తుంది. ఐతే ఒక్కోమతం ఒక్కో దిక్కు సూచిస్తుంది. దీని వలన హింస పెరుగుతుంది. అందుకే మానవ జాతి అంతటికీ ఆమోద యోగ్యమైన దారి కనపడే దాకా మనం మన మనసు ని అన్ని మార్గాలకూ తెరుచుకొని ఉంచటం మంచిది.

సైన్స్ పరిశీలనా ప్రధానమైనది. మతం ఇంగితం తో కూడుకొన్నది. సత్య శొధన కు పరిశీలన ఒక్కటే మార్గం కాదు. ఇంగితం కూడా ఒక మార్గమే. ఐతే ఈ మార్గం సైన్స్ లో పనికి రాదు. మతానికి ఇంగితమే (ఇన్ ట్యూషన్) ప్రధానం.

ఇది చదివిన తరువాత మతం యొక్క ఆవశ్యకత గురించి నాకు కొంత క్లారిటీ కలిగింది…
జంతువులకి మతం లేదు. మనిషికి మతం ఉంది. అంటే మనిషి జంతువుల నుంచీ పరిణామం చెంది ఆలోచనలో కొంత స్థాయి వచ్చిన తరువాత మతం వచ్చింది.మతం కంటే ముందే మనిషి లోని లక్షణాలనీ ఏర్పడ్డాయి. కాబట్టీ మనిషి చేసే వెధవ పనులన్నిటికీ మతానిది బాధ్యత కాదు.మతం ఆధీనం లో లేని అనేక విషయాలు మనిషి లో ఉన్నాయి.

అలానే పాపులర్ మతం చెప్పుకొంటున్నట్లు మతం సర్వ రోగ నివారిణి కాదు. మీరు ఎప్పుడైనా క్రీస్తు సువార్త సభలో, లేక కొందరు బాబాల సభలో వింటే వాళ్ళు “మతానికి సాధ్యం కానిది లేదు” అనే భ్రమ కలిగిస్తారు. మీరు మా దేవుడిని/మతాన్ని నమ్మండి ఏదైనా సంభవం అంటారు. బహుశా అసలైన మతాధీశులు (చంద్రసేఖర సరస్వతి వారు కానీ, శంకరాచార్యులు కానీ, లేక క్రీస్తు కానీ) ఇలంటి క్లెయింస్ ఎప్పుడూ చేయరనుకుంటా…! ఒక మతాన్ని నమ్మిన వాడు ఏదైనా నేరం చేయగానే “వాడు నిజం గా మావాడైతే అలా చేయడు. కాబట్టీ వాడు మా వాడే కాదు” అనటం అవకాశ వాదం. నేరం చేసేదాకా మా వాడే అన్నప్పుడు, నేరం చేసిన తరువాత కూడా మా వాడే అనాలి కదా.ఒక మతాన్ని నమ్మినంత మాత్రాన అతని వ్యక్తిత్వాన్ని మతం మార్చలేక పొయింది. ఒక
పెద్ద స్వామి  హిందూ మతానికి అత్యున్నతమైన పదవి లో ఉన్నారనుకొందాం. ఆయనకు తెలియని ధర్మం లేదు. కానీ ఇవన్నీ తెలియటం అనేది ఆయనను ఒక హత్య చేయించకుండా ఆపలేక పోయింది అనుకొందాం. హత్య చేయించాడు అని తెలిసిన వెంటనే “ఆయన హిందువే కాదు” అనటం సబబు కాదు. హత్య చేసిన తరువాత కూడా ఆయన హిందువే! కానీ హిందూ మతం తెలిసినంత మాత్రాన, వాటిలో కొన్ని పధ్ధతులు ఆచరించినంత మాత్రాన, మనిషి మంచి వాడైపోడు. అతని లో స్వతహా గా ఉన్న చెడ్డతనం ఎక్కడికీ పోలేదు.(అందరూ ఈ పెద్ద స్వామి లాంటి వారని కాదు. చాలా మంది మతావలంబకులలో మంచి వారే ఉంటారు. ఆ మంచి తనానికి కారణం ఒక్కోసారి మతమే అవుతుంది. ఒక్కోసారి కాదు కూడా.) పెద్ద స్వామి చెడు ఆలోచనని మతం హరించలేక పోయింది.ఈ విషయాన్ని అన్ని మతాలలోని అసలైన ప్రవక్తలు చెప్పినదే.కాక పోతే పాపులర్ మతాలు (బాబాలూ గట్రా) మతం అనేది సర్వ రోగ నివారిణి అని చెప్తాయి. అరచేతి లో వైకుంఠం చూపిస్తాయి.
మత గ్రంధాలు మార్గ దర్శకాలు మాత్రమే. కానీ మమూలు జనాల మూర్ఖత్వం/మూఢత్వం వలన అవి జీవితం లో ఫత్వా ల స్థాయికి దిగజారిపోయాయి.మార్గదర్శకాలు జీవితాన్ని శాసించవు. కానీ నిత్య జీవితం లొ మతాలు రాజకీయాల నుంచీ, ఆర్ధిక సమస్యల దాకా అన్నిటినీ శాసించే స్థాయి కి దిగ జారిపోయాయి. ఈ దిగజారుడు కి మతాని కన్నా జనాల మూర్ఖత్వాన్నే నిందించాలి.
పాపులర్ మతాల వలన కూడా కొన్ని లాభలున్నాయి..పాపభీతి, సమస్యలు వచ్చినప్పుడు దైవం పై ఆశ, నీతి, పధ్ధతి ఇవన్నీ మతం వలననే వచ్చాయి. ఇవిలేకుండా జీవితం ఇంకా దుర్భరమౌతుంది.
బందిపోటు దొంగకి భాగవతం వలన ఉపయోగం ఏమిటి? వాడికి భాగవతాన్ని ఇచ్చినా వాడు అది చదివి మారిపోడు. దాని వలన భాగవతం పనికి రానిది కాదు. అలానే భాగవతం రాసినాయన “బందిపోటు దొంగ భాగవతం చదివి ఆనందించి మారిపోతాడని” చెప్పటం కూడా సరి ఐనది కాదు. వాడికి భాగవతం ఉపయోగం లేనిది. అదే ఏ భక్తుడి చేతిలోనో పడితే అప్పుడు అది ఉపయోగపడుతుంది. అయితే ఈ భక్తులు మన సమాజం లో నానాటికీ తగ్గిపోతున్నారు.జనాలకు తోలు మందం ఎక్కువయ్యింది. అందువలనే ఇలాంటి జనాలని డీల్ చెయ్యటానికి మావోఇజం లాంటి కొత్త హింసాత్మక మార్గాలు పుట్టుకొస్తున్నాయి.
అలానే సైన్స్ కూడా…స్వర్గానికీ నరకానికీ ఒకే తాళం చెవి ఉంది. ఆ తాళం చెవి మనిషికి సైన్స్ ఇస్తుంది. మసిషి అ తాళం చెవి తో స్వర్గ ద్వారాలు తెరుస్తాడొ, లేక నరక ద్వారాలు తెరుస్తాడొ అతని చేతుల్లో ఉంది. మనిషి నరక ద్వారాలు తెరిస్తే అది సైన్స్ తప్పు కాదు. అలా అని స్వర్గ ద్వారాలు తెరిచినా అది సైన్స్ గొప్పదనం కాదు. సైన్స్ గొప్పదనం తాళపు చెవి ని తయారు చెయ్యటం వరకే! మనిషి స్వర్గ ద్వారాలు తెరవాలా లేక నరక ద్వారాలు తీయాలా అనే విషయమై కొంత మతం అతనికి సలహా ఇవ్వగలదు. కానీ మనిషి మతం సలహా ని పెడచెవిన పెట్టి నరక ద్వారాలు తెరిస్తే మతం చేయ గలిగింది ఏమీ లేదు.తాళపు చెవి తో నరక ద్వారం తెరిచే కంటే, తాళపు చెవి అసలు లేక పోవటమే మంచిది అనిపిస్తుంది, ఈ గ్లోబల్ వామింగ్ కాలం లో. అలానే మతంస్వర్గ ద్వారం తెరవరా నాయనా అంటే, మనిషి నరక ద్వారం తెరిచినప్పుడు కూడా, ఈ మతాలు లేకపోతే బాగుంటుంది కదా అనిపిస్తుంది. లేక పోతే మనిషి చేత స్వర్గ ద్వారం తెరిపించలేని ఈ మతాలెందుకు అనిపిస్తుంది.   సమస్య అంతాఈ మనిషి తోనే వచ్చింది అని తిట్టుకోవటం మన స్వప్రేమకు అడ్డు కదా! కానీ సమస్య అంతా మనిషి మానసికవ్యవస్థ తోనే వచ్చింది. ఈ వ్యవస్థ ని గాడిలో పెట్టనంత వరకూ మతానికి ప్రయోజకత్వం రాదు.

ఇక పోతే నాస్తికత్వం గురించి…నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే. ఎందుకంటే,మీరు ఒక నాస్తికుడిని “ఈ విశ్వం ఎక్కడినుంచీ వచ్చింది? దీనిని ఎవరు సృష్టించారు” అని అడిగితే, “నాకు తెలియదు కానీ దేవుడు మాత్రం లేడు”, అని చెప్తాడు. అంటే ఇదీ ఒక నమ్మకమే.కాబట్టీ మతం గురించి మనం పైన చెప్పుకొన్న వాటిలో నాస్తికత్వానికీ, కమ్యూనిజానికీ కూడా వర్తిస్తాయి. కాకపోతే నాస్తికుడికి, ఆస్తికుడిలా పెద్ద ప్రవర్తనా నియమావళి ఉండదు. నాస్తికుడికి పాప భీతీ దైవ భీతీ ఉండకపోవటం వలన వాడు అంతరాత్మ లేని వాడైతే వాడి వలన సమాజానికి చాలా నష్టం. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అని అడిగితే, “నాకు తెలియదు. అది నా ఊహ కు అందని విషయం” అనే వాడిని ఇంగ్లీష్ లో ఆగ్నోస్ట్ అంటారు.

మనిషికి ఈ కాలం లోకూడా చాలా వరకూ ఆచరణ శీలమైన విలువల వ్యవస్థ ల లో కుటుంబ వ్యవస్థ ఒకటి. మనిషి పరిణామ క్రమంలో జ్ఞాపక శక్తి, అంతశ్చేతన పెరగటం వలన జంతువుల నుంచీ వేరుపడ్డాడు. అందువలన ఈ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అమ్మా నాన్న అక్కా తమ్ముడూ అనే భావాలు  ఇలాంటివే. కాబట్టీ మనిషి భౌతికమైన, పరిణామ పరమైన అవసరాలకు అనుగుణం గా ఏదైనా విలువల వ్యవస్థ ఉంటేనే అది తట్టుకొని నిలబడుతుంది. “ఈ అవసరాలకు భిన్నం గా ఉన్న వ్యవస్థను” ఆచరించే వారు కరువౌతారు. అప్పుడు ఆ వ్యవస్థ మార్గదర్శకాలకూ, ఆ వ్యవస్థ లోని మనుషుల ప్రవర్తన కూ మధ్య అంతరమెక్కువౌతుంది.  ఆచరణ సాధ్యం కాని ఏ విలువల వ్యవస్థ ఐనా ఉపయోగం లేనిది గా తయారౌతుంది. కేవలం పుస్తకాలకే పరిమితమౌతుంది.  ఆచరణ లో పెట్టలేని గొప్ప విలువల వలన ఉపయోగం లేదు. అలాని ఏ బంది పోటు దొంగో తనకు అనుగుణం గా వ్యవస్థ లోని విలువలను దిగజార్చమనటం కూడా సరి కాదు. విలువలు ఉండాలి కానీ అవి ఆచరణాత్మకం గా, మానవాళి సమిష్టిమరియూ వ్యక్తిగత మనుగడ కిమంచి చేసేవి గా ఉండాలి. ఒక యుగంలో ఉన్న విలువలు వేరొక యుగం లో అవసరం లేనివి ఔతాయి కాబట్టీ ఈ విలువలు కూడా చలనశీలమైనవి. మంచి చెడులు చలనశీలమూ, సాపేక్షమూ ఐనట్లే సమాజపు విలువలు కూడా.

కొత్త వ్యవస్థ ఏదైన తీసుకొని వచ్చేటపుడు, అది ఉన్న వ్యవస్థ కంటే మెరుగైనది గా ఉండాలి. కొత్త వ్యవస్థ మెరుగైనదా కాదా అనే విషయం, కొత్త వ్యవస్థ ని పరిమితం గా ఒక ఊళ్ళొనో, ఒక జిల్లాలోనో ఒక ప్రొటో టైప్ లా ప్రవేశపెట్టి అది సాధ్యమా కదా,ఒక వేళ సాధ్యమైతేఅది పాత వ్యవస్థకన్నా మెరుగైనద లేదా అని చూడాలి. ఒక వేళ మెరుగైనదైతే, దానిని పరిమిత కాలం పాటు విస్తరించి చూడాలి. అప్పుడు కూడా కొత్త వ్యవస్థ లో లోపాలు కనబడితే దానిని వెనుకకు తీసుకొనేటందుకు సిధ్ధం గా ఉండాలి. చివరికి కొత్త వ్యవస్థే మెరుగైనదైతే దానిని కొన సాగించాలి. అంతే గానీ కమ్యూనిజం లా “కొండ నాలిక కి మందేస్తే ఉన్న నాలిక ఊడింది” అన్న చందాన ఉండకూడదు.

ఇంకా చాలా విషయాలున్నాయి కానీ..అవన్నీ మళ్ళీ ఇంకొక సారి…?(మీకు చదివే ఓపిక ఉంటే..)

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

24 thoughts on “మతమూ, సైన్సూ వాటి ఆవశ్యకత…”

 1. చక్కగా చెప్పారు. అసలు కిటుకంతా ఉండేది మనిషిలోనే, తను సక్రమంగా ఆలోచిస్తే మతములోని కొన్ని చెడు సూక్తులుగానీ, చెడు ఆచారాలు కానీ ఏమీ చేయలేవు.

  మెచ్చుకోండి

 2. నేరం చేసేదాకా మా వాడే అన్నప్పుడు, నేరం చేసిన తరువాత కూడా మా వాడే అనాలి కదా.
  _________________________________________________________

  మావాడే అనేది ఎవరు? కాదు అనేది ఎవరు? రెండుమాటలూ ఒకరే అంటే, అప్పుడది ఖచ్చితంగా తప్పే. కానీ వేరేవేరే వారంటే మాత్రం చర్చ మారుతుంది.

  కానీ హిందూ మతం తెలిసినంత మాత్రాన, వాటిలో కొన్ని పధ్ధతులు ఆచరించినంత మాత్రాన, మనిషి మంచి వాడైపోడు
  ___________________________________________________________

  You said it – “కొన్ని” is the key!

  Good post, by the way!

  మెచ్చుకోండి

 3. “మావాడే అనేది ఎవరు? కాదు అనేది ఎవరు? రెండుమాటలూ ఒకరే అంటే, అప్పుడది ఖచ్చితంగా తప్పే. కానీ వేరేవేరే వారంటే మాత్రం చర్చ మారుతుంది.”
  I agree with you

  మెచ్చుకోండి

 4. లేదు అని చెప్పేదాన్ని నిరూపించడమూ, నిర్వచించడం కూడా సాధ్యం కాదు. ఉన్నదనే చెప్పే వారే నిర్వచనం చెప్పాలి, నిరూపించాలి. ఇందుకోసం నా పోస్టుని చూడండి.

  మెచ్చుకోండి

 5. I have seen your site.
  ఎవరైనా దేవుడు అంటే ఈ ప్రపంచానికంతటికీ కారణభూతమైన ఒక శక్తి అంటే, నాస్తికుడి గా “అలాంటి శక్తి లేదు” అని మీరు అంటారా? ఒక వేళ అలా అంటే తరువాతి ప్రశ్న,”మరి ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?”
  మీరు “నాకు తెలియదు” అంటే మీతో నాకు పేచీ లేదు. ఎందుకంటే అప్పుడు మీరు నాస్తికులు కారు. మీరు ఆగ్నోస్ట్ (సందేహ వాది?) ఔతారు. నేను కూడా అదే.

  అలాకాకుండా “ఈ ప్రపంచానికి కారణం ఏమీ లేదు” అంటే అప్పుడు మీరు ఆస్తికుడా? కారణాలను అన్వేషించటం హేతువాదం లో ఒక భాగం. హేతువాది నాస్తికుడేనా? మీరు కారణం లేదు అనికూడా నాస్తికుడి గా ఉండగలరా? ఎందుకంటే కారణం లేదు అనటం ఎక్కడి నుంచో హఠాత్తుగా (బిగ్ బాంగ్ అప్పుడో, అంతకు ముందో) ఊడిపడింది అనే అర్ధాన్ని ఇస్తుంది.లేక పోతే ఈ ప్రపంచానికి ఒక ఆదీ అంతంలేదు అనే అర్దం కూడా వస్తుంది. ఈ ఊడిపడటం అనేది సాధారణం గా ఆస్థికులు చేసే వాదన. ప్రపంచాన్ని అంతా దేవుడు తయారు చేసేశాడు. దేవుడిని ఎవరూ చెయ్యలేదు. ఆయనకు ఆదీ అంతం లేవు. కాబట్టీ ఆయనకు కారణం లేదు. <—-మీరు కూడా ప్రపంచానికి కారణం లేదు అనటం లో ఇలానే వాదించినవారౌతారు.

  మెచ్చుకోండి

 6. *ఉదాహరణ కు {edit}హిందూ మతానికి అత్యున్నతమైన పదవి లో ఉన్నారు. ఆయనకు తెలియని ధర్మం లేదు. కానీ ఇవన్నె తెలియటం అనేది ఆయనను(?) హత్య చేయించకుండా ఆపలేక పోయింది. హత్య చేయించాడు ….*
  * అందరూ {edit}లాంటి వారని కాదు. చాలా మంది మతావలంబకులలో మంచి వారే ఉంటారు. ఆ మంచి తనానికి కారణం ఒక్కోసారి మతమే అవుతుంది. ఒక్కోసారి కాదు కూడా.) {edit}చెడు ఆలోచనని మతం హరించలేక పోయింది.*
  నేను పై వ్యాఖ్యను తీవ్రం గా ఖండిస్తున్నాను.ఆ కేసు మీద కనీసం ఇప్పటి వరకు కింద కోర్టులో కూడా తీర్పు ఇవ్వలేదు మరి మీరు ఆయనను తప్పేలా పడతారు? మీదగ్గర ఎమైనా సాక్ష్యాధారాలు ఉంటె చెప్పండి ? మీరు దేనిని ఆధారంగా చేసుకొని దీనిని రాశారో చెప్పాలి ? లేక పోతె దీనిని తక్షణమే తొలగించండి. మీకు చదవేస్తె ఉన్న మతి పోయిందనట్ట్లు తయారయ్యారు. బ్లగులో నిరంతరం ఒకరినొకరు వీమర్సించు కుంట్టూ స్వామి మీద ఇలా రాయటం ఎమీ బాగాలేదు.అంతె కాని నాలుగు సైన్స్ బుక్స్, రెండు అద్వైత పుస్తకాలు చదివి న జ్ణానం తో స్వాముల వారి మీద అభాండాలను మోపటం మర్యాదకాదు
  మీకంతా తెలుసు, నేను మంచి వాడిని ఇతరులకు ఎమీ తెలియదని మీరను కొంట్టున్నట్లు ఉన్నారు. అది చాలా పోరపాటు. మీకంతా తెలుసు, నేను మంచి వాడిని ఆయన చేడ్డావాడు అని మీఅభిప్రాయం లా ఉంది. I am really feeling very bad how can you write like this ? on what basis ? If govt & media calims will you belive?

  మెచ్చుకోండి

 7. ఇక్కడ {edit}ని తప్పుపట్టటం నా ఉద్దేశం కాదు. మతంలో పెద్ద స్థానాల్లోని వాళ్ళ మీదే ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఒక్కోసారి అవి నిజమని నిరూపణ అయ్యాయి కూడా.
  {edit} మీద కేస్ నిరూపణ కాలేదని నాకు తెలియదు.
  నేను నాకు తెగ తెలుసు అనుకోవటం లేదు. {edit}కి ధర్మం అంతా తెలుసు అనే నేను చెప్పింది.
  ఒక వేళ {edit}{edit} నేరం చేశాడని అన్నా మీరు నమ్మేటట్లు లేరు.
  మీరు నొచ్చులున్నట్లైతే సారీ! బ్లాగ్ ను సరి చేశాను.

  మెచ్చుకోండి

 8. @bondalapati

  ఈ ప్రపంచానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం ఒక కారణం ఉందనుకుంటే, మరి ఆ కారణానికి ఇంకో కారణం ఉండాలి. ఇలా ఒక అనంతమయిన సీరీస్ లో కారణాలు ఉండాలి.

  ఇక ఈ ప్రపంచానికి ఒక కారణం ఉంటే అది ఒక conscious, intelligent entity కావాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కాబట్టి ఈ first cause theory దేవుడి అస్తిత్వాన్ని నిరూపించలేదు.

  మెచ్చుకోండి

 9. Interesting post.

  “మతంలో పెద్ద స్థానాల్లోని వాళ్ళ మీదే ఆరోపణలు ఉన్నాయి. ”
  నిజమే మరి, మోపితే పెద్దవాళ్ళమీదే మోపాలి. నాలాంటి వాళ్ళ మీద మోపి ప్రయోజనమేముంది? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి 🙂

  మెచ్చుకోండి

 10. వ్యంగ్యం, నింద వగైరా లేకుండా మంచి వివరణ ఇచ్చారు.

  off the record- నేను విశ్వం బిగ్‌బ్యాంగ్‌ నుండి మొదలయ్యిందని నమ్ముతాను, అయితే ఆ బిగ్‌బ్యాంగ్ ఎందుకు జరిగిందో ‘నాకు తెలియదు’, బహుశా i am more or less agnostic than you…

  మెచ్చుకోండి

 11. “మోపితే పెద్దవాళ్ళమీదే మోపాలి” అవునండీ కొత్త పాళీ గారూ. అందుకే మీ పేరు మీద నకిలీ వ్యాఖ్యలు కూడా రాస్తున్నారు. దీనినిబట్టే మీరు పెద్ద వారని నాకు అర్ధమయ్యింది. 🙂

  మెచ్చుకోండి

 12. మీ పోస్ట్ ఎందుకో నాకు బాగా నచ్చింది. స్పష్టతగా వ్రాసినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా మతం గురించి.

  >>ఇది చదివిన తరువాత మతం యొక్క ఆవశ్యకత గురించి నాకు కొంత క్లారిటీ కలిగింది…
  జంతువులకి మతం లేదు. మనిషికి మతం ఉంది. అంటే మనిషి జంతువుల నుంచీ పరిణామం చెంది ఆలోచనలో కొంత స్థాయి వచ్చిన తరువాత మతం వచ్చింది.మతం కంటే ముందే మనిషి లోని లక్షణాలనీ ఏర్పడ్డాయి. కాబట్టీ మనిషి చేసే వెధవ పనులన్నిటికీ మతానిది బాధ్యత కాదు.మతం ఆధీనం లో లేని అనేక విషయాలు మనిషి లో ఉన్నాయి.

  బాగుంది. బాగా వ్రాశారు.

  మెచ్చుకోండి

 13. I request you to remove my comment as well as your replay also. Because I mentioned swamy’s name in my comment.
  —————————————————-
  *ఒక వేళ కోర్టు {edit} చేశాడని అన్నా మీరు నమ్మేటట్లు లేరు.*
  బొందలపాటి గారు,మీరు ఎప్పుడైనా {edit}కి వేళ్ళారా? స్వామి ప్రజలను కలుసుకునే చోటుని ఎప్పుడైనా చూశారా? నే నను కోవటం మీరు వేళ్ళలేదని. మీరె కనుక వేళ్ళి ఉంటె ఇలా రాయరు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. మన దేశం వరకు ఇంకా చెప్పాలంటె మన రాష్ట్రం లో రామదాసుని, అన్నమయ్యని,అలాగే హాథిరాం బాబా (తిరుమల) వీరందరు వివిధ కారణాల వల్ల నేరాలు మోపి జైలుకి వెళ్ళివచ్చిన చరిత్ర ఉన్నాయి. వీరి మీద వచ్చినవన్ని తరువాత కాలం లో ఎంత వరకు నిలచాయో అందరికి తెలిసినదే. అలాగే ఇది కూడాను. మీరు స్వామి ని పైవారి తో పోల్చటమా అని ప్రశ్నించకండి, ఎందుకంటె దానికి వివరణ ఇవ్వాలి అంటే సుమారు 10 టపాలు రాయలి. క్లుప్తం గా చేప్పాలి అంటె అదొక పెద్ద కుట్ర. కుట్ర ఉద్దేశం సాధ్యమైనంత వరకు ఎదుటి వారి పేరు ప్రఖ్యాతులను దేబ్బ తీయటం అంతే. కుట్రలో జరిగిన దోకటి అయితే బయటికి ఇంకొక విధంగా చూపించబడుతుంది. కుట్రలో నిజాలు ఎప్పుడు సామాన్య ప్రజలకు వెంటనే తెలియ జేయ బడవు.

  *మతంలో పెద్ద స్థానాల్లోని వాళ్ళ మీదే ఆరోపణలు ఉన్నాయి. విదేశాల్లో ఒక్కోసారి అవి నిజమని నిరూపణ అయ్యాయి కూడా.*
  మీరు విదేశాలలో వాటిని ఇక్కడి వాటితో పోల్చటం ఎనీ బాగా లేదు. అక్కడ సెక్యులరిజం పేరు చెప్పి బిన్నం గా వ్యవహరిస్తారు.

  Give ‘full freedom’ to proselytize while drafting the new constitution” – EU to Nepal

  French mission letter on Right to Conversion in Nepal annoys Kamal Thapa
  http://telegraphnepal.com/news_det.php?news_id=7691

  మెచ్చుకోండి

 14. శ్రీ బొందలపాటివారికి,నమస్కారములు.

  మీ వ్యాసం, దానిపై చర్చలు బాగున్నాయి. మీరు చెప్పిన “పెద్ద స్వామి” గురించి నాకు అసలు తెలియదు. “Malakpet Rowdy” గారు పేరు కొంచెం భయపెట్టేటట్లువున్నా, చాలావరకు ఆయన వ్యాఖ్యలు బాగుంటాయి. “సత్యాన్వేషి” గారి వ్యాఖ్యలు, వారి బ్లాగ్ చదివాను. భగవంతుడు గురించి నేను వ్రాసిన వ్యాసాలు నా బ్లాగులో “ఆధ్యాత్మిక వర్గం”లో వున్నాయి, (madhavarao.wordpress.com) వాటిని వీలుంటే, వారు చదవగలరు.

  ఇకపోతే, మీ వ్యాసం గురించి: మతం అనేది “అభిమతం” అన్న దానినుంచి వచ్చింది. ఒక వ్యక్తి, తన అభిమతాన్ని, పదిమందికి చెప్పినప్పుడు, ఆ పదిమంది, కలిసి, వాటిని తమ అభిమతంగా ఆమోదించినప్పుడు, అది ఒక మతంగా ఏర్పడుతుంది. అంటే, మతం అన్నది కొన్ని “నియమాలతో” కూడుకున్నది. ఈ నియమాలకి, కాలానుగుణంగా, మార్పులు, చేర్పులు వస్తుంటాయి. ఇకపోతే, “హిందూ మతం” గురించి. నిజంగా, “హిందూ మతం” అనేది ఎక్కడా, ఎప్పుడూ లేదు. ” హిందూ ధర్మం ” మాత్రమే మనకు వున్నది. దీనినే, వాడుకలో హిందూ మతం అని వ్యవహరిస్తున్నారు. “హిందూ ధర్మానికి” కొన్ని ఉదాహరణలు:

  సర్వే జనా సుఖినో భవంతు; సత్యాన్నే పలకాలి; మాత్రుదేవో భవ, పిత్రుదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిధి దేవో భవ మొదలైనవి.

  ఒక మతంలో మార్పులు రావచ్చోమోకానీ, ఒక ధర్మానికి మార్పులు రావు. అందుకనే, “ధర్మాన్ని రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది” అని సూక్తి. ఎపుడైతే, ధర్మం రక్షింపబడుతుందో, మొత్తం విశ్వం సుభిష్టంగా వుంటుంది. ఇప్పుడున్న అనేక మతాలికి, “హిందూ ధర్మానికి” ఇదే తేడా. దీనిని మనం గమనించాలి.

  భవదీయుడు,
  మాధవరావు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s