ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…

ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…
హర్యానా లో ఖాప్ పంచాయితీ లు ఒకే గోత్రం లో వివాహాలకి అడ్డు చెప్తున్నాయి. దీని గురించి సో కాల్డ్ స్త్రీ వాదులూ, “ఎన్ జీ ఓ లూ”, కోర్ట్ లూ చాలా గందర గోళం చేస్తున్నారు.
ఇదే విషయం మన రాష్ట్రం లో తీసుకొంటే, ఒకే కులంలో, ఒకే ఇంటి పేరు లేక గోత్రం కల స్త్రీ పురుషులు వరుసకు అన్నా చెల్లెళ్ళు కానీ, అక్కా తమ్ముళ్ళు కానీ అవుతారు. మరి అలాంటి వారి మధ్య వివాహ సంబంధాన్ని మనం ఆమోదిస్తామా? ఇప్పుడు ఇలాంటి సంబంధాలను ఆమోదిస్తే తరువాత కుటుంబ వ్యవస్థ గతేమిటి. అప్పుడు ఇన్సెస్ట్ తో కూడిన సంబంధాలను కూడా ఆమోదించవలసి వస్తుంది కదా? ఈ విషయంపై మీ అభిప్రాయాలేమిటి?

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

35 thoughts on “ఒకే గోత్రం లో వివాహాలు..ఒకే ఇంటి పేరు గల వారి మధ్య వివాహాలు…

 1. గోత్రానికి, వంశానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో నాకు అర్థం కాదు. ఉత్తరాంధ్రలోని పోలినాటి వెలమ కులస్తులలో ఎక్కువ మంది రెండే గోత్రాలకు చెందినవారు. అవి నాగేశ్వర గోత్రం & కాశ్యప గోత్రం. ఇవే గోత్రాలు ఇతర కులాలలో కూడా ఉన్నాయి.

  మెచ్చుకోండి

 2. గోత్రం అన్నారు కాబట్టి హిందూ సమాజానికి ఫిక్సయి చెప్తున్నా…, ఒకే గోత్రమయినంత మాత్రాన ఎప్పుడో తరాల, వందల ఏళ్ళముందు వేరుపడి ముక్కూమొహం తెలీకుండావుంటే పట్టింపు అవసరంలేదని నా అభిప్రాయం. అలాకాకుండా ఒకరి కుటుంబాలు ఒకరికి ఎరుకైనపుడు అక్కడివాళ్ల స్థానిక ఆచారాలను బట్టి చెప్పాల్సొస్తుంది.
  అంతెందుకు మన యస్.పి. బాలు గారు తన గోత్రం అమ్మాయినే కదా పెళ్ళిచేసుకుంది.

  ఇకపోతే ‘ఇన్సెస్ట్’అనేదానికి సరైన నిర్వచనం ఇవ్వలేదు మీరు…కొన్నిచోట్ల ఒకే కుటుంబ సభ్యులమధ్య intercourseను మాత్రమే, ఇంకన్నిచోట్ల కజిన్స్ మధ్య intercourseను ఇన్సె‌స్ట్ అంటారు. మీరు అడగదలచుకున్నదేది?

  మెచ్చుకోండి

  1. హిందూ వివాహ చట్టం ప్రకారం నాలుగు తరాలుగా దగ్గర బంధుత్వం ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం నేరం కానీ ఒకే గోత్రం ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం నేరం కాదు. హర్యాణాలో ఒకే గోత్రం గల దంపతులకి అనుకూలంగా కోర్టులు తీర్పులు ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ స్వగోత్ర వివాహాలకి సామాజిక ఆమోదం లేదు.

   మెచ్చుకోండి

 3. ఇంగ్లిష్ లో ఇన్సెస్ట్ అంటే అపవిత్ర సంబంధం అని అర్థం. యూరోపియన్ దేశాలలో క్రాస్ కజిన్స్ (మేనత్త పిల్లలు)ని పెళ్ళి చేసుకోవడం కూడా నిషిద్ధం. అక్కడ అలాంటి పెళ్ళిళ్ళని ఇన్సెస్ట్ అంటారు. అరబ్ దేశాలలో కజిన్ మేరేజెస్ నిషిద్ధం కాదు. సద్దాం హుస్సేన్ ని కూడా అతని కజిన్ కే ఇచ్చి పెళ్ళి చేశారు. కజిన్ మేరేజెస్ ని నేను వ్యతిరేకిస్తాను కానీ గోత్రం ఒకటైనంతమాత్రాన బంధుత్వం ఉన్నట్టు భావించడం మాత్రం అమాయకత్వమే.

  మెచ్చుకోండి

 4. @bondalapati
  మీరు సరిగా అర్థం చేసుకోలేదని పిస్తోంది. నిజానికి వారి దృష్టిలో ఒకే గోత్రం అంటే ఏమిటొ గమనించండీ. ఒకే గ్రామములో ఉండేవాల్ల మధ్య కూడా వారు సంభందాలను నిషేదించారు, ఎందుకంటే వారు కూడా అన్నా చెల్లేల్లవుతారంట. అంతే కాదు, ఒకగ్రామానికి మరో గ్రామముతో సోదర భావాలు ఉన్నాయని నమ్మే గ్రామాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఆ రెండు గ్రామాల మధ్య కూడా సంబంధాలు నిషేదించారు. అంతే కాదు, ఒక వేల వారు నిజంగానే ఒకే గోత్రీకుల మధ్య జరిగిన సంబంధాలను వ్యతిరేకించినా, వారిని చంపమని తీర్పులు ఇవ్వడం ఏమిటి, వారికి ఎవరిచ్చారు ఆ హక్కు?

  వీల్లు మినీ తాలిబన్లాలా వ్యవహిస్తున్నారని చెప్పడానికి చాలా సాక్షాధారాలు ఉన్నాయి. దీని గురించి ఆధారాలల్తో సహా నేను రాసిన టపా ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది.

  కుల పంచాయితీల అకృత్యాలు – పరువు హత్యలు

  మెచ్చుకోండి

  1. మీ టపా వలన కొంత క్లారిటీ వచ్చింది. ఈ విషయాలను కేస్ బై కేస్ బేసిస్ పరిష్కరించాలి అనుకొంటాను. వారి రూల్స్ ని ఫోర్స్ చేయటం సమర్ధనీయం కాదు.

   మెచ్చుకోండి

 5. శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.

  గోత్రముల గురించి మనకు ప్రత్యేక గ్రంధాలు వున్నాయి. సగోత్రీయుల మధ్య వివాహం కూడదని శాస్త్రములు చెబుతున్నాయి. “genetic science” లొ మనిషి యొక్క పరిణామదశలు, మానవ జాతి అభివృద్ధి గురించి చెబుతూ, “ఆదిమ మానవుని మూలాలు ప్రపంచమంతటా వున్నాయి” అని వివరిస్తూ, మొదలుగా ఆఫ్రికా ఖండమునుంచి మానవుని సంచారము మొదలై, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలలోకూడా విస్తరించింది అని చెప్పారు. అక్కడకూడా ఆదిమ మానవుని జన్యు మూలాలు గుర్తించారు. ఈ ప్రస్తావన ఎందుకంటే, ” ఆదిమజాతి స్త్రీలు, వివాహము చేసుకున్న తరువాత, తమ పిల్లల వివాహ సమయానికి, తమ వంశములోనివారితోనే తమ పిల్లలికి వివాహము చేయకుండా, అనేక దూర దేశాలు తిరిగి, తమవారికంటే బలమైనవారిని వెతికి, తమ పిల్లలికి వివాహం చేసేవారు” అని చెప్పటం జరిగింది. దీనికి కారణం తమ జాతి ముందు తరంవాళ్ళు “ఆరోగ్యవంతులుగా; బలవంతులుగా; తెలివిగలవారుగా ” పుట్టాలని. genetic science పుస్తకాలు చదివి దీనిని ధృవీకరించుకోవచ్చు.

  ఈ పై నేపథ్యంలో, మన ప్రాచీన గ్రంధాల్ని పరిశీలిస్తే, “నవ బ్రహ్మలు లేదా నవ ప్రజాపతులు అనబడేవారు బ్రహ్మచేత సృష్టింపబడ్డారు. వీరిలో కొందరు: మరీచి, అత్రి, అంగిరసుడు, వశిష్టుడు మొదలైనవారు. వీరు, తమ,తమ భార్యలతో, భూమిపైన ప్రజా-సృష్టి చేయాలని బ్రహ్మ ఆదేశం. ఒక ఉదాహరణ తీసుకుంటే: అత్రి ప్రజాపతికి పుట్టిన సంతానం, వారిలోవారే వివాహం చేసుకుంటే వంశాభివృద్ధి (జన్యు పరంగా) సరిగా జరగదని సశాస్త్రీయంగా ఆలోచించి, మన పెద్దలు “స్వగోత్రీయులు” వివాహం చేసుకోరాదు అని చెప్పటం జరిగింది. అదే విధంగా, ఇతర గోత్రీయులు. ఇకపోతే, మన హిందూ ధర్మం “నాలుగు వర్ణాలనే” గుర్తించిందేకానీ, ఇప్పటి కులాలను గుర్తించలేదు. “ఒకే గోత్రమయినంత మాత్రాన ఎప్పుడో తరాల, వందల ఏళ్ళముందు వేరుపడి ముక్కూమొహం తెలీకుండావుంటే పట్టింపు అవసరంలేదని నా అభిప్రాయం.” అని శ్రీ నాగార్జునగారు అన్నారు. ఈ అభిప్రాయం సరి అయినది కాకపొవచ్చు. ఎందుకంటే, ఉదాహరణకి: 100 గ్రాముల గ్లూకోజుకి, 100 గ్రాముల నీళ్ళని కలిపాము అనుకోండి. ఆ ద్రవం చిక్కగా, తియ్యగా వుంటుంది. అదే ద్రవానికి, 1,000 గ్రాముల నీటిని కలిపాము అనుకోండి, గ్లూకోజ్ పలుచన అయిపోతుంది. స్వగోత్రీయ వివాహ ప్రక్రియలోకూడా ఇదే జరుగుతుంది. అయితే, ఈ విషయంలో నాకు పూర్తి జ్ఞానం మాత్రం లేదు. నాకు తెలిసినతవరకు మాత్రమే మీకు తెలియచేస్తున్నాను.

  భవదీయుడు,
  మాధవరావు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

 6. దగ్గరి బంధువులు పెళ్ళి చేసుకుంటే genetic disorderతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ. దూరపు బంధువులు పెళ్ళి చేసుకున్నప్పుడు, ఒకే కులంలో తెలిసిన బంధుత్వం లేనివాళ్ళు పెళ్ళి చేసుకున్నప్పుడు genetic disorderతో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. గోత్ర నామాలు వందల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉండొచ్చు, ఒకే గోత్రం గల వారి మధ్య ఎన్నో తరాల దూరపు బంధుత్వం ఉండొచ్చు. చట్టం ప్రకారం నాలుగు తరాల దగ్గరి బంధుత్వం ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం నేరం కానీ ఎన్నో తరాలు దూరపు బంధుత్వం ఉన్న సగోత్రీయులు పెళ్ళి చేసుకోవడం నేరం కాదు.

  మెచ్చుకోండి

 7. గోత్రం నమ్మకం కాదు. అది వాస్తవం. సగోత్రీకులందరూ ఏదో ఒక రకంగా ఒకరికొకరు రక్తసంబంధీకులే. అందువల్ల సగోత్ర స్త్రీపురుషులు ఖచ్చితంగా అన్నాచెల్లెళ్ళే అవుతారు. ఈ మధ్య పాశ్చాత్యులు చేసిన పరిశోధనలో ఒకే ఇంటిపేరున్నవాళ్ళ మధ్య కూడా ఈ సోదరసంబంధం ఉంటుందని తేలింది. అందువల్లనే మన పూర్వీకులు అటువంటి వివాహాల్ని మానుకోమని మరీమరీ చెప్పారు. తప్పేముంది ? మన దేశంలో గత కొద్దితరాల నుంచి ఒక పాశ్చాత్యవ్యామోహపు ధోరణి ప్రబలింది. ఇంగ్లీషువాళ్ళకి ఏవైతే లేవో అవి మనక్కూడా ఎందుకుండాలి ? అని అడుగుతున్నవాళ్ళెక్కువవుతున్నారు. ఏ జాతి విస్తరణ/ వికాస విధానమూ ఇంకో జాతితో పోల్చదగినది కాదని అలాంటివాళ్ళు గుర్తిస్తే బావుంటుంది. కనీసం ఇప్పటికైనా సగోత్ర వివాహల్ని నిషేధిస్తూ ఒక చట్టం రావాల్సిన అవసరం ఉంది.

  మెచ్చుకోండి

 8. పెళ్ళీ తరువాత స్త్రీ గోత్రము మారుతుంది అన్న ఒక్క విషయాన్ని పక్కన బెడితే, కొంత కాలానికి ఎవ్వరికీ పెళ్ళిల్లు అవవు అన్నది నా అభిప్రాయం. సగోత్రీయుల మధ్య వివాహ సంబంధాల విషయములో నేను కొత్తగా రాసిన టపాను ఒక సారి చదివండి.
  పెళ్ళి కావాలా ? అయితే గోత్రం గురించి ఎక్కువాలోచించకండి!!

  మెచ్చుకోండి

 9. దూరపు బంధువులు పెళ్ళి చేసుకుంటే genetic disorderతో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ. ఒకే గోత్రం గల వారి మధ్య ఎన్నో తరాల (కొన్ని వందల సంవత్సరాల) దూరపు బంధుత్వం ఉండొచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక కులం రెండు కులాలుగా విడిపోయినప్పుడు ఆ రెండు కులాలవారి మధ్య కూడా దూరపు బంధుత్వం ఉంటుంది. అంత దూరపు బంధుత్వం ఉన్నవాళ్ళు పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు. ఈ లింక్ వీక్షించండి: http://blogzine.sahityaavalokanam.gen.in/2010/05/4.html

  మెచ్చుకోండి

 10. ఈ విషయం పైన నాక్కూడా పెద్దగా పరిజ్ఞానంలేదు. చదివినదానిని బట్టి తెలిసిందేంటంటే ‘గోత్రం’ అనేది జన్మననుసరించేకాకుండా ఒక వ్యక్తి తన ఇష్టప్రకారం మార్చుకొనవచ్చు ఉదా: తన రాజును/యజమానిని/గురువును తండ్రిగా స్వీకరించి అతని గోత్రాన్ని స్వీరించవచ్చునట. పైపెచ్చు ముందు తరాల వాళ్ళకి గోత్రం బదిలీ అవ్వడంకూడా వేరువేరుగా వున్నాయి. అంటే ఒకచోట పిల్లలకు తండ్రి గోత్రం బదిలీ అవ్వడమూ, ఒకచోట తల్లి గోత్రం బదిలీ అవ్వడమూ….ఇలా. ఈలెక్కన ఒకే గోత్రం ఉన్నాకూడా అబ్బాయి-అమ్మాయి ఒకరికి ఒకరు బావా-మరదళ్ళవచ్చు, ఒకే గోత్రం కానప్పటికి అన్నా-చెల్లెలవచ్చు అసలు ఒకరికొకరు ఏమి అవకపోవచ్చు (పైన చెప్పిన ఉదా ప్రకారం). అలాంటప్పుడు సగోత్రియ వివాహా విషయంలో పరస్పర చర్చ అవసరం

  ఇంటిపేరు ఒకటే అయినంతమాత్రాన వాళ్లమధ్య ఏదో బంధుత్వం ఉండాలనిలేదుగా. వెర్వేరు కులాలైనప్పటికీ ఒకే ఇంటిపేరు కలిగువుండడం common కదా. అపుడు ఒకేఇంటిపేరు కలవారి మధ్యవివాహం అభ్యంతరకరం కాకపోవచ్చు.

  Family members మధ్య శృంగారాన్ని తప్పుగా, నిషిద్దంగా చూడవచ్చునని నా అభిప్రాయం. ఎటొచ్చి ఈ కజిన్స్ మధ్యే అది ఆమోదించదగిందా లేదానేది confusingగా వుంది.

  మెచ్చుకోండి

  1. అసలు బావ-మరదలు అంటే ఏమిటి? యూరోప్ లో అమ్మగారి అన్న (maternal uncle) గారి పిల్లలనైనా, పెదనాన్న (paternal uncle) గారి పిల్లలనైనా కజిన్స్ అనే అంటారు. యూరోప్ లో ఏ రకమైన కజిన్స్ నైనా పెళ్ళి చేసుకోవడం నిషిద్ధం. భార్య యొక్క అక్కని లేదా చెల్లెలిని వదిన/మరదలు (sister-in-law) అంటారు, అన్న లేద తమ్ముని భార్యని కూడా వదిన/మరదలు అంటారు. భర్త యొక్క అన్నని, తమ్ముడిని బావ/మరిది (brother-in-law) అంటారు, అక్క లేదా చెల్లెలి భర్తని కూడా బావ/మరిది అంటారు. భార్య లేదా భర్త చనిపోయినప్పుడు in-lawsని పెళ్ళి చేసుకోవచ్చు. in-lawsని పెళ్ళి చేసుకోవడాన్ని ఎవరూ ఇన్సెస్ట్ గా పరిగణించరు. Uncle, aunt, వాళ్ళ పిల్లలని పెళ్ళి చేసుకోవడం మాత్రమే నిషిద్ధం. వాళ్ళు maternal uncle గారి పిల్లలని వదిన/మరదలు, బావ/మరిది వరసలు పెట్టి పిలవరు. ఎందుకంటే అక్కడ maternal uncle గారి పిల్లలు కూడా కజిన్స్ గానే పరిగణించబడతారు.

   మెచ్చుకోండి

 11. గోత్రం పేరు మార్చుకోవచ్చు. ఈ విషయం ఒక బ్రాహ్మణుడే చెప్పాడు. గోత్రం పేరు తెలియని శూద్రులు కశ్యప లాంటి ఋషుల పేర్లని గోత్ర నామాలుగా పెట్టుకోవచ్చు.

  మెచ్చుకోండి

 12. తెలంగాణా జిల్లాల్లో మున్నూరుకాపు కులస్థులున్నారు. వారిది పసునూటి గోత్రం. దీన్నే పసుపునూరి, పసునూరి అనే పేళ్ళతో పిలుస్తారు. కొన్ని ఇతర కులాల వాళ్ళు, కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్ళు మున్నూరుకాపు కులస్థులమని చెప్పుకోవడం సాధారణ విషయం. మున్నూరుకాపుల్లో 99 శాతం వివాహాలు సగోత్రికుల మధ్యే జరుగుతాయి. పసునూటి గోత్రం తప్ప మరోగోత్రం పేరు చెప్పే మున్నూరుకాపులను మిగతావారు కాస్త అనుమానంగా చూస్తుంటారు. నాకు తెలిసినంత వరకు కేవలం మున్నూరుకాపుల్లోనే సగోత్రికుల మధ్య వివాహాలు జరుగుతుంటాయి. ఇది ఎన్నో తరాలుగా జరుగుతున్నది.

  మెచ్చుకోండి

 13. కమ్మ,వెలమ,రెడ్డి,కాపు,ఒకే కులం

  * కాపులు రెడ్లు వేరువేరు కులాలు వారుకాదు.వారిద్దరూ ఒకేకులస్తులు.రెడ్లు ఇప్పటికీ తమకులం కాపు అని పేర్కొంటారు అని చేగొండి హరిరామ జోగయ్య సమాచార శాఖా మంత్రిగా ఉన్నరోజుల్లో అన్నారు.”నిజాం రాజ్యంలో కులాలు తెగలు” అనే గ్రంధంలో(1920) సయ్యద్ సిరాజుల్ హసన్ కాపుల గురించి వివరంగా రాశారు:
  * కాపు,కుంబి,రెడ్డి-ద్రావిడ జాతికి చెందిన వ్యవసాయదారుల కులం.ఆదిరెడ్డికి పుట్టిన ఏడుగురు కొడుకులలోంచి పుట్టిన కాపులు 10 ఉప కులాలుగా విడిపోయారు.1.పంచరెడ్లు(మోటాటి,గోదాటి,పాకనాటి,గిట్టాపు,గోనెగండ్లు) 2.యాయ 3.కమ్మ 4.పత్తి 5.పడకంటి 6.శాఖమారి 7.వక్లిగర్ లింగాయతు 8.రెడ్డి 9.పెంట 10.వెలమ.
  * మోటాటి రెడ్లు మోటాటి కాపుల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకుంటారు.చిట్టాపుకాపులు మాసం మద్యం ముట్టరు.గోడాటికాపుస్త్రీలు పైట కుడివైపుకు వేస్తారు.వారిలో వితంతువివాహాలున్నాయి.గోనెకాపుల్లో వితంతువివాహాలు నిషిద్ధం.
  * కమ్మకాపుల్లో ఇల్లో చెల్లమ్మకమ్మ,గంపకమ్మ రెండుతెగలు.ఇల్లో చెల్లమ్మకమ్మస్త్రీలు పరదా పాటిస్తారు.గంపకమ్మస్త్రీలు పరదా పాటించరు.
  * లింగాయతు కాపులకు జంగాలు గురువులు.వారు బ్రాహ్మణులను పిలవరు.వడకంటి కాపులు వధువుకు నల్లపూసలతాడు బదులు పసుపు తాడు కట్టిస్తారు.లింగాయతు కాపు తన భార్య బ్రతికి ఉండగానే ఆమె చెల్లెలిని చేసుకోవచ్చుకాని ఆమె అక్కను చేసుకోకూడదు.
  * రెడ్డి కాపుల్లో విడాకులకు అనుమతిస్తారు.కులపంచాయితీ ముందు గడ్డిపరకను తుంచాలి.నామధారులు అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తే,విభూతిధారులు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.వైష్ణవరెడ్లు సాతాని అయ్యరు ద్వారా శవాలను దహనం చేస్తే,శైవరెడ్లు జంగందేవరలతో శవాన్ని పూడ్పిస్తారు.
  * కమ్మ,వెలమ,రెడ్డి,కాపులు అందరిలో ఒకేవిధంగా ఉన్నఆచారాలు: నిశ్చితార్ధం,వరనిశ్చయం,పోచమ్మకొలువు,ప్రధానం,అయిరేనికుండలు,లగ్నం,పదఘట్టనం,జీరగూడం,కన్యాదానం,పుస్తె మట్టెలు,తలంబ్రాలు,బ్రహ్మముడి,అరుంధతీ దర్శనం,నాగవేలి,పానుపు,వప్పగింత.

  మెచ్చుకోండి

 14. కొంత మంది శూద్రులకి గోత్రాల పేర్లు తెలియవు. మరి వాళ్ళ వివాహాల సంగతి ఏమిటి? గోత్రాల పేర్లు తెలియని శూద్రులకి కశ్యప లాంటి ఋషుల పేర్లని గోత్రాలుగా పెట్టుకోమని బ్రాహ్మణులు సలహాలిస్తుంటారు. గోత్ర నామాలు లేనివాళ్ళు ఇప్పుడు కూడా కొంత మంది ఉన్నారు.

  మెచ్చుకోండి

 15. మీ గొత్రానుమానాలకి అద్భుతమైన సమాధానం నాకు ఇక్కడ దొరికింది…
  http://www.hitxp.com/articles/veda/science-genetics-vedic-hindu-gotra-y-chromosome-male-lineage-extinction/

  ఇక,
  “తెలంగాణాలో రెడ్లు ఇప్పుడు కూడా తాము కాపులమనే చెప్పుకుంటారు.”

  ఎవరు చెప్పింది తెలంగాణాలో రెడ్డి కాపు అని చెప్పుకుంటాడని… మా దగ్గర అందరం గొత్రం, అసలు రెడ్డేనా, మొఠాఠి నా, పాకనాఠి నా.. వెరేనా అంటూ కూలం కషం గా ఆరా తీస్తం.. ఎవడో ఏదో చెప్పాడని అదే నిజమని ప్రచారం చేసుడు మానుకోండి… ఈ మద్య మా వోడు ఒకడు ఆంధ్రా రెడ్డి పిల్ల ని ప్రేమ అంటూ తిరిగితే .. దేహ శుద్ధి చేసి మానిపించాం.. తెలంగాణ రెడ్డి లు భూస్వాములుగా ఎట్లా బతికిండ్రో చరిత్ర తెలుసుకోండి.. గట్లాంటోళ్ళం బయటోళ్ళని మా కులస్థులు అని ఎట్లా ఒప్పుకుంటం.. మీ అంధ్రా రెడ్డి లకు మాకు పోలికే లేదు.. మీరెప్పుడో బ్రిటిష్ వాడి సదువుకు అలవాటు పడి ఖాందాన్ వదిలేసిండ్రు …

  మెచ్చుకోండి

 16. Thanks for the link..Good link..chromosomes and the explanation is good.
  “ఈ మద్య మా వోడు ఒకడు ఆంధ్రా రెడ్డి పిల్ల ని ప్రేమ అంటూ తిరిగితే .. దేహ శుద్ధి చేసి మానిపించాం..” This is too barbaric in this age, if it is True 🙂

  మెచ్చుకోండి

 17. కొడితే వాడు వింటడా కని.. మా దోస్త్ కాబట్టి ఊకె ఏదొ ఒకటి అంటుండె… అంధ్రా అల్లుడా.. చహ్ అంధ్రా రెడ్డి నా…తెలంగాణ రెడ్డి పిల్ల అయితే మంచిగుండు కదర బై అనుకుంట ఆడుకుంటుండె…

  మెచ్చుకోండి

 18. చాలా బాగుంది గాని
  మేమే గొప్ప అన్న చెడు అభిప్రాయములో ఉన్నట్టు అనిపిస్తుంది
  ఇక్కడ మనము అందరము ఒకటి అర్దము చేసుకో వాలి, అది ఏమిటంటే మనకు కులము, మతము, గోత్రము అనేవి ఎందుకు పెట్టారో అర్ధం చేసుకో వాలి. నేను, మేము అని అనడం సరికాదని నా ఉద్దేశం, మనది ప్రాచీన నాగరికత గల దేశం, అందువలన ఒక తరం నుండి ఇంకొక్క తరానికి మద్యన అనుభవ పూరకమైన శాస్త్రీయ శాశనాల పరంపర ఇది, ఆ అనుభవాల సారాంశము మనకు తరతరాలుగా సంక్రమించింది, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరిది,
  తెలివి అనెది మోసం తో ప్రదర్శిస్తే అది తన వాళ్లన్ని తనను ధహిస్తుంది ఇప్పుడు అగ్రకూలాలని చూస్తునాంగా
  తెలివిని మంచికోసం వినియోగిస్తే మానవాలికి మంచి జరగుతుంది
  అని
  నా అభిప్రాయము
  తప్పయితే మన్నించండి
  వీలైతే అనుసరించండి

  మెచ్చుకోండి

 19. భారత్ మాట్రిమోనీలో పరిచయమైన ఒక అమ్మాయి ఫేస్‌బుక్‌లో తగిలింది. పెళ్ళి సంబంధం గురించి మాట్లాడబోతే సెక్స్ చాట్ అనుకుని తన వ్యక్తిగత వివరాలు చెప్పింది. తమ్ముడు వరసైన అబ్బాయితో సెక్స్ చాటింగ్ చెయ్యొచ్చు కానీ పెళ్ళి మాత్రం చేసుకోకూడదు అని అనుకుంది. ఈ స్క్రీన్‌షాట్ చూడండి, విషయం అర్థమవుతుంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s