మైనారిటీలకే నా మద్దతు…

మైనారిటీలకే నా మద్దతు…

రిజర్వేషన్లు లేని అగ్రకుల పేదలకూ,
రిజర్వేషన్లు అందని పల్లెటూరి దళితులకూ,
కోడళ్ళ నిరాదరణ కు గురైన ముసలి దంపతులకూ,
గృహహింస చట్టం కింద చిత్రహింస అనుభవిస్తున్న పురుషులకూ,

ఇంట్లో వంటా, ఆఫీస్ లో ఒత్తిడీ తప్పని ఉద్యోగిణులకూ,
నాగరికత దెబ్బకి ఆడంగులౌతున్న మగాళ్ళకూ,
ఇంట్లోకే ప్రవేశించిన వ్యవస్థ వివక్ష కు రోదిస్తున్న మగపిల్లలకూ,
సంఖ్యాబలం లేని సమస్త కులాలకూ ,

తెలంగాణలోని సమైక్య వాదులకూ,
సకల ఉద్యమాల పీడితులకూ,
రాజకీయ సవ్యత పేరుతో నలిగిపోతున్న వర్గాలకూ,
నమ్మకం కోల్పోని, నమ్మకముంచే మనుషులకూ,

ప్రజా స్వామ్యం చేసే మెజారిటీ సంఖ్యల దంధా కి కుములుతున్న జనాలకూ,
న్యాయం పేరుతో చలామణి అవుతున్న అన్యాయాన్ని  ఎదిరించే వాళ్ళకూ,
వ్యాపార విలువలకు వలువలూడ దీసే వాళ్ళకూ,
డబ్బు కి దాసోహం కాని వాళ్ళకూ,

స్వార్ధాన్ని  సామర్ధ్యం గా భ్రమించని వాళ్ళకూ,
కులం కంటే గుణం మంచిదని నమ్మే వాళ్ళకూ,
వేలం వెర్రుల ప్రవాహం లో పడి కొట్టుకుపోని వాళ్ళకూ,
ప్రకృతి ని నాశనం చేసే దిశ లో పోని వాళ్ళకూ,  

మైనారిటీలకే నా మద్దతు…

ప్రకటనలు

16 thoughts on “మైనారిటీలకే నా మద్దతు…”

 1. “నాగరికత దెబ్బకి ఆడంగులౌతున్న మగాళ్ళకూ”………..దీనితోనే అర్థమయిపోతోంది మీకు ఆడవాళ్ళంటే ఎంత చులకనో.

  ఇంట్లోకే ప్రవేశించిన వ్యవస్థ వివక్ష కు రోదిస్తున్నమగపిల్లలకూ”……ఇది నాకు నిజంగా అర్థం కాలేదు.

  మెచ్చుకోండి

 2. “నాగరికత దెబ్బకి ఆడంగులౌతున్న మగాళ్ళకూ”………..దీనితోనే అర్థమయిపోతోంది మీకు ఆడవాళ్ళంటే ఎంత చులకనో.

  సౌమ్య గారూ…తొందర పడ వద్దు… మగాడికి తెగువ, సాహసం, వ్యవహార దక్షతా, ఆత్మాభిమానం ఉండాలి. ఆడవాళ్ళకు సౌకుమార్యం, సున్నితత్వం ఉంటాయి. కానీ ఇప్పట్లో నైన్ టూ ఫైవ్ జాబులు చేసీ చేసీ మగ వాళ్ళు కూడా సుకుమారం గా, నంగి గా తయారవుతున్నారని నా బాధ.వారికి నా మద్దతు అంటున్నాను. దీనిలో ఆడ వాళ్ళంటే చులకన లేదు. అలా చులకన ఉంటే అదే వరుస లో, “ఇంట్లో వంటా, ఆఫీస్ లో ఒత్తిడీ తప్పని ఉద్యోగిణులకూ” అని అనగలిగేవాడిని కాదు.
  మగాడి తో సమానం గా తయారవ్వాలనుకొని,ఆ ప్రక్రియ లో ఆత్మ వంచన చేసుకొనే ఆడవారికి కూడా నా మద్దతు. అటు ఉద్యోగానికీ, ఇటు కుటుంబానికీ న్యాయం చేయలేక, పైకి మాత్రం అన్నిటినీ బాలన్స్ చేసేస్తున్నాం అని చెప్పుకొనే స్త్రీలకి నా సానుభూతి. పిల్లల్ని తాతా బామ్మల కు వదిలి, ఆ తాతా బామ్మల కు ఇల్లొదలని జైలు జీవితం ఇచ్చి.. పిల్లల్ని మంద వేసే క్రష్ ల కొదిలి …
  ఇక పోతే..
  “ఇంట్లోకే ప్రవేశించిన వ్యవస్థ వివక్ష కు రోదిస్తున్న మగపిల్లలకూ…”
  చాలా మధ్య తరగతి ఇళ్ళలో ఆడపిల్లకీ మగపిల్ల వాడికీ విద్య విషయం లో వివక్ష చూపే రోజులు పోయాయి. కానీ ఒకే ఇంట్లో పెరిగిన అక్కకు పదిహేను వేల రాంకుకి సీటు వస్తుంది, తమ్ముడికి మూడు వేలకూ కీ సీటు రాంకు రాదు.ఇవాళ ఆంధ్ర లో మహిళా రిజర్వేషన్ల వలన వచ్చిన పరిస్థితి ఇది… అప్పుడు వాడేమి చేయాలి నిశ్శబ్దం గా ఏడవటం తప్ప.? అలానే పొలిటికల్ కరెక్ట్నెస్ పేరు తో వచ్చే మహిళా రిజర్వేషన్లూ…

  మెచ్చుకోండి

 3. నేను చూస్తున్న జీవితం వలనా….చాలా రోజులనుంచీ కక్కాలనుకొంటున్నాను…కక్కేశాను..హమ్మయ్య..ఇంకా ఎవరేమనుకున్నా పరవాలేదు…

  మెచ్చుకోండి

 4. మీ జవాబు విన్నాక మీకు ఆడవాళ్ళ పట్ల ఉన్న తక్కువ భావం మరింత బాగా అర్థమయింది.

  “మగాడికి తెగువ, సాహసం, వ్యవహార దక్షతా, ఆత్మాభిమానం ఉండాలి. ఆడవాళ్ళకు సౌకుమార్యం, సున్నితత్వం ఉంటాయి.”….ఎవరు నిర్దేశించారు ఇలా అని? ఏం ఆడవాళ్ళకి తెగువ, సాహసం, వ్యవహార దక్షతా, ఆత్మాభిమానం ఉండవా, ఉందకూడదా? సౌకుమార్యం, సున్నితత్వం మగవాళ్ళకి ఉండవా?

  “కానీ ఒకే ఇంట్లో పెరిగిన అక్కకు పదిహేను వేల రాంకుకి సీటు వస్తుంది, తమ్ముడికి మూడు వేలకూ కీ సీటు రాంకు రాదు.”…….ఎన్నో వేల సంవత్సరాలుగా ఆడవాళ్ళు మౌనంగా ఏడవలేదూ, అప్పుడు ఇలాంటి కవితలు ఎందుకు పుట్టుకు రాలేదు?

  మెచ్చుకోండి

 5. “ఏం ఆడవాళ్ళకి తెగువ, సాహసం, వ్యవహార దక్షతా, ఆత్మాభిమానం ఉండవా, ఉందకూడదా? సౌకుమార్యం, సున్నితత్వం మగవాళ్ళకి ఉండవా?”

  ఉండొచ్చు. ఇక్కడ “ప్రస్తుతానికి” ఎవరు కోల్పోతున్నారు..ఎవరు లాభపడుతున్నారు అనే దాని మీద నా సానుభూతి ఆధారపడి ఉంటుంది.మగ వాళ్ళు ఈ లక్షణాలను కోల్పోతుంటే ఆడ వాళ్ళూ పొందుతున్నారు. ఆడ వాళ్ళు లాభపడుతున్నారు అని నేను ఏడవటం లేదు.మగ వాళ్ళూ ఒకప్పుడు ఈ లక్షణాలు కలిగి ఉండే వారు. ఇప్పుడు కోల్పోతున్నారేమిటా అనే ఆవేదన ని మాత్రమే వ్యక్త పరిచాను. దీనిని స్త్రీ పురుషుల మధ్య యుధ్ధం గా చూడ వద్దు.మీరు నా కవిత(?) ని ఏ ముక్కకు ఆ ముక్క గా చూస్తే దాని స్పిరిట్ అర్ధం కాదు. మొత్తం గా చూడండి.

  ఉండవా?

  “కానీ ఒకే ఇంట్లో పెరిగిన అక్కకు పదిహేను వేల రాంకుకి సీటు వస్తుంది, తమ్ముడికి మూడు వేలకూ కీ సీటు రాంకు రాదు.”…….ఎన్నో వేల సంవత్సరాలుగా ఆడవాళ్ళు మౌనంగా ఏడవలేదూ, అప్పుడు ఇలాంటి కవితలు ఎందుకు పుట్టుకు రాలేదు? ”

  నేను ఆ కాలం లో ఆడ దానినైతే అలానే పుట్టుకొచ్చేవేమో! కానీ నేను ఈ కాలం లో మగాడి గా స్పందిస్తున్నాను.
  వేల సంవత్సరాలుగా ఆడ వాళ్ళు మౌనం గా ఏదిస్తే, దానికి ఇవాళ ఇంట్లో ఉన్న 18 ఏళ్ళ ప్రసాద్ గాడు ఏమి చేస్తాడు? గతం లో జరిగిన ఆడ వాళ్ళ మీది అన్యాయాన్ని మళ్ళీ దానికి కారణం కాని మగ వాళ్ళ మీద అదే అన్యాయం చేయటం మోరల్ గా సరి కాదు. సబబు కాదు…ఏమైనా నేను “ఇవాళ్టి” వ్యవస్థ లో నష్ట పోతున్న వాళ్ళ గురించి నా భావాలను చెప్పాను.ఈ నష్టం ఆపక పోతే కొన్నాళ్ళకు మగాళ్ళు కూడా ఒకప్పటి ఆడ వాళ్ళ లా కన్నీటి కథలు చెప్పుకోవాలి. గతం లో నష్ట పోయిన వారికి ఎప్పుడూ నా సాను భూతి ఉంటుంది (దాని వలన ఏమి ఉపయోగం అనేది వేరే సంగతి).
  ఆడ వాళ్ళు స్త్రీ వాదం పేరిట కన్నీరు కారిస్తే లేనిది, ఒక మగ వాడు కొంచెం “నా మద్దతు” అని రాస్తే ఇంత అసహనమెందుకు?

  మెచ్చుకోండి

 6. మైనారిటీస్ అంటే చాలు ముస్లిమ్స్ మాత్రమే గుర్తుకు వచ్చే నా లాంటి వారికి అసలు సిసలు అర్థం చెప్పారు.
  బాగుంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s