మల్లాది వెంకట కృష్ణ మూర్తి, “నా సాహితీ జీవనం లో జరిగిన కథ”-నా ఆలోచనలు

కౌముది.నెట్ లో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తన సాహితీ జీవితం లోని సంఘటనలూ వ్యక్తుల గురించి “జరిగిన కథ”, అని రాస్తున్నారు. ఇది చాలా వరకూ నిజాయితీ గా రాసినట్లు గా అనిపిస్తుంది. మల్లాది గారు తన సాహిత్య యానం లో తెలిసిన వ్యక్తులూ వారి లోటు పాట్లనే కాక, తన లోటు పాట్లను కూడా ఆత్మ విమర్శ చేసుకొంటూ రాస్తున్నట్లు అనిపిస్తుంది. ఆయన దృక్కోణం లోని లోటు పాట్లది వేరే సంగతి. ఎవరి దృక్కోణం లో లోపాలు వారికి తెలియవు కదా!
ప్రస్తుతం తెలుగులో కమర్షియల్ సాహిత్యం అబ్సొలీట్ అయిపోవటం, మల్లాది గారు అంతగా ఈ రోజుల్లో రాయక పోవటం వలన, ఇప్పుడు ఆయన నిజాయితీగా రాసినా ఆయనకు ప్రాపంచికం గా వచ్చే నష్టం పెద్ద గా లేదు. పైగా ఆయన ప్రస్తావించే వ్యక్తులు చనిపోవటం లేదా అంతకు ముందు ఉన్న అధికార స్థానాల్లో ఉండక పోవటం కూడా ఆయన నిజాయితీ గా రాయటానికి ఒక కారణం అయ్యి ఉండవచ్చు. ఈ ఆత్మ కథ వలన మనకు తెలుగు సాహితీ లోకం లోని నిన్నటి ప్రచురణ కర్తలు, సంపాదకులూ, రచయితలూ మొదలైన వారి వాస్తవ స్వరూపం కొంతవరకూ తెలుస్తుంది. అలానే వారి మధ్య ఉండే మానవ సంబంధాలలోని ఈర్ష్యలూ, ఇగోలూ, స్వార్ధాలూ కూడా అవగతమౌతాయి.
నేను ఎనభై ల చివరిలో మల్లాది గారి, యండమూరి మొదలైన వారి సాహిత్యాన్ని వదలకుండా చదివే వాడిని. అప్పటి కి టీనేజ్ లో ఉన్న నాకు వాళ్ళ నవలల లోని పాత్రలూ, స్వభావాలూ విపరీతం గా నచ్చేవి. ఒక్కోసారి ఆయా పాత్రలను అనుకరించటానికి ప్రయత్నించే వాడిని. ఒక పల్లెటూర్లో చిన్న రైతు కొడుకునైన నేను, ఈ కమర్షియల్ నవలలు చదవటం వలన చదువు లో వెనుకబడి తరువాత కష్టాలు పడవలసి వచ్చింది.

మల్లాది గారు తన ‘జరిగిన కథ ‘ లో  “తమ పత్రికల సర్క్యులేషన్ కోసం ఎడిటర్లు ఎలాంటి అబధ్ధపు రాతలు రాయిస్తారో, అలానే రచయితలు తమ పారితోషికం కోసం ఎలా బేరాలాడతారో, తమ నవలను ఎడిటర్ల ఇష్టానుసారం ఎలా సాగదీస్తారో” చెప్పినప్పుడు, “ఔరా! మనం బకరాలం అయ్యాం కదా, వాళ్ళ డబ్బుకోసం, కెరీర్ కోసం వాళ్ళు ఏవో జిమ్మిక్కులు చేస్తే, మనం అనవసరం గా మన చదువు పాడు చేసుకొని నష్టపోయాం కదా!”, అని అనిపించక మానదు. అలానే సాధారణ పాఠకుడి పై ఎడిటర్లకూ, రచయితలకూ ఉన్న తక్కువ అభిప్రాయం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. (ఆ మోసపోయే పాఠకుల నుంచే వారి మనుగడ కు అవసరమైన డబ్బు వస్తుందనేది గమనించవలసిన విషయం). వీరి రాతలూ, పత్రికలూ డబ్బుకోసమే. సాహిత్యం కేవలం ఒక బై-ప్రొడక్ట్.

ఈ పాఠకులు మోస పోవటం అనేది కమర్షియల్ రచయితల తోనే కాదు. అనేక మంది రచయితలు ఆదర్శాల గురించిన భావాలతో రచనలు చేస్తారు. కానీ ఈ ఆదర్శాలు మనకు వారి రాతల్లో కనపడినంత గా వారి జీవితాలలో కనపడవు. కానీ, వారి రచనల ద్వారా వారి ఆదర్శ భావాలు జనాలలోకి ముందుగా విరచిమ్మ బడతాయి. సగటు పాఠకుడికి తరువాత ఎప్పుడో వారి జీవితం గురించి తెలుస్తుంది. వారి జీవితాలలో వారు చెప్పిన ఆదర్శాలను ఆచరించ లేదని తెలుస్తుంది.డబ్బే పరమావధి కాదని చెప్పే వీరి రచనలు, డబ్బే పరమావధి గా నడిచే పత్రికలలో ప్రచురింపబడేవి. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. వారు చెప్పిన ఆదర్శాలు విని ఆవేశం తెచ్చుకొని ఏ నక్సలైటల్లోనోఈ చేరిన వారు, అప్పటికే జరిగిన నష్టాన్ని ఎలా తప్పించుకొంటారు? ఆ రచయితల సంతానం మాత్రం ఏ అమెరికాలోనో హాయిగా గడుపుతూ ఉంటారు. ఈ సంతానం దృష్టి లో వారి పెద్ద వాళ్ళు ప్రచారం చేసిన విలువలకి సానుభూతి అయినా కనిపించదు.

ఈ రోజులలో ఆర్ధిక సరళీకరణ, ఇంటర్నెట్, మీడియా ఛానెళ్ళ ప్రభావం వలన ఇలాంటి కాన్ రచయితలు, ఎడిటర్లకు కాలం చెల్లి పోయింది. యువత తమ కెరీర్ పై దృష్టి పెడుతోంది. యువతరం ఇలాంటి కాన్ రైటలూ, ఎడిటర్ల కాకమ్మ కథల బారిన పడే దురదృష్టాన్నుంచీ తప్పించుకొంది. ఇప్పటి యూత్ కావాలనుకొంటే ఇలాంటి మేధావులకే కొంత జ్ఞానోపదేశం చేయగల స్థాయి లో ఉండటం సంతోషం గా ఉంది.

ప్రకటనలు

9 thoughts on “మల్లాది వెంకట కృష్ణ మూర్తి, “నా సాహితీ జీవనం లో జరిగిన కథ”-నా ఆలోచనలు”

 1. చాలా మంది ఇటువంటి కమర్షియల్ సాహిత్యం ( రచయితల )పుస్తకాలు చదివి ఎదో ప్రపంచ జ్ణానం వారి రచనలు చదవటం వలన తెలుస్తున్నాది అనే భ్రమలో ఉంటారు. వాస్తవానికి ఆ జ్ణానం సామాన్యులు కొరి డబ్బులు పోసి కొనుకున్న అజ్ఞానం. నిజజీవితం లో పైసా ఉపయోగం లేదు. ఇంటర్ చదివే వయసులో మధ్యతరగతి వాళ్ళు, ఆ ఒక్కటి అడక్కు సినేమాలో రాజేంద్ర ప్రసాద్ లా పిచ్చి పిచ్చి కలలు కంట్టుంటారు. ఈ పుస్తకాల వల్ల కలలు ఎక్కువ అవుతాయి, నిజజీవితం లో వాస్తవాన్ని భరించటం కష్ట్టమౌతుంది. కనుక సాహిత్యం చదివి ఎదో ఉపయోగం ఉంట్టుందనేది ఒక పెద్ద భ్రమ. కాని రచయితకు అదే జీవనాధారం కనుక ఆ భ్రమను (ఉపయోగం ఉంట్టుంది అనే)పెంచి పోషిస్తూ ఉంటాడు. యండమూరి,మల్లాది మొద|| మధ్య మధ్యలో సైన్స్ కి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ, వాటిపై వివరణలిస్తూ ఆరోజులలో కొంచెం పాఠకులను భ్రమతో ఉబ్బేశారు.
  ————————————
  ఇక పాత వారైన చలం, కొ.కు. లాంటి వారి రచనలు చదివి ఎంత మంది బాగు పడ్డారో తెలియదు. ప్రజలు అనుకొన్నంత మార్పు రాలేదని ఆయన(కొ.కు.) బాధ పడ్డారని వారి అబ్బాయి రోహిణి ప్రసాద్ గారు ఒకసారి రాశారు. మనుషుల స్వభావం ఒక పని చేస్తే తమ దగ్గర ఉన్నదానిని పోగోట్టుకోకుండా, ఎదైనా అదనం గా పొందాలను కొంటాడు. చదవటం అనేది కూడాఒక పనే ఎందుకంటే డబ్బు పెట్టి పుస్తకం కొని, ఎంతో సమయం వెచ్చించి దానిని చదువుతాం. ఈ సీరియస్ సాహిత్యం లోని ఆదర్శభావాలు నిజజీవితం లో అనుసరించటం అంటే మనం చాలా కోల్పోవలసి వస్తుంది. వాస్తవం గా మనుషులు స్టేటస్కో ను మైంటైన్ చేయాలను కొంటారేకాని కోల్పోవటానికి ఇష్టపడరు. కనుక ఈ సాహిత్యం చదివి ఎవ్వరు పెద్దగా మారరు. ఇతరులకు నీతులు చెప్పటం, రివ్యూలు రాయటం చేస్తుంటారు. కాని ఎదైనా వాద ప్రతివాదాలు జరిగినపుడు కోట్ చేయటానికి మటుకు ఉపయోగ పడుతుంది. ఉదా|| ఎదో పుస్తకంలో కొ.కు. విష్ణువును చిల్లర దేవుడన్నాడని ఒక బ్లాగరు కాపి పేస్ట్ వేసేవారు.
  రాయటమనేది రచయిత బలహీనత. చదవటమనేది పాఠకుల బలహీనత. సృజన చేయలేని వారు, పేరు ప్రఖ్యాతులు కావలను కొనేవారు విమర్శకుల అవతారమేత్తి పుస్తకాల మీద అభిప్రాయలు రాస్తూంటారు. రచయిత కి, విమర్శకుడికి పేరు, గుర్తింపు లభిస్తాయి. పాఠకుడు అజ్ణాతం లో ఉండి (చదవటం వలన పేరు ప్రఖ్యాతులు రావు కదా) పబ్లిషర్ డబ్బులు చేసుకోవటానికి ఉపయోగపడతాడు. చదవటమనేది ఒక వ్యసనం. ఎందుకంటే పుస్తకాలు చదవటం అలవాటు లేని వారిచేత ఒక్క పేజీ చదివించలేం. ఈ వ్యసనం ఉన్న వారు మాత్రమే పుస్తకాలు కొని చదువుతారు. పాఠకుడు ఆ వ్యసనాన్ని మానలేడు. ఒకరు రాస్తూంటారు ఇంకొకరు చదువుతూంటారు. ఈ పుస్తకం చదివే వ్యసనానికి అలవాటు పడ్డ వారు ఖాలీగా ఉండలేక పుస్తకం.నేట్ లాంటి వాటిని మొదలుపెట్టి, అంతర్జాలంలో మిగతా వ్యసనపరులని గాలం వేసి ఆకర్షించి తమ భవాలాను, అనుభవాలను పంచుకొంట్టునంటారు. మీరు ఒకసారి ఆసైట్కేల్లి చూస్తే ఎన్ని రోజులైన ఈ వ్యసనపరుల సంఖ్య పెద్దగా పెరగదు. ఆ రాసె పదిమందే రివ్యూలు రాసుకొని, ఒకరు రాసిన రివ్యూకి మిగతా 9మంది వ్యాఖ్యలు రాసుకొంట్టుంటారు.
  —————————————-
  పైన చెప్పిన వారు కాకుండ సినేమా కవులు వేటురిలాంటి కొంతమంది రచయితలు ఉంటారు. సామాన్య మానవులకు అంతో ఇంతో ఉపయోగపడెది ఆయన రాసిన పాటలే. వేటూరి రాసిన మంచి ద్వంద అర్థాల పాటను వింట్టూ సినేమా చూస్తే వచ్చే ఆనందమే వేరు.
  1. పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు
  2. పాలకొల్లు పాపా నీ పైట జారేనేలా
  3. ఆరేసు కోబోయి పారేసుకున్నాను హరి హరి
  4. వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా
  5. ఆకుచాటు పిందే తడిస్తే కోక మాటు పిల్ల తడిస్తే

  మెచ్చుకోండి

 2. మోరల్ ఆఫ్ ది స్టొరి :

  పుస్తకాలు చదవటమనేడి పెద్దగా ఉపయోగం లేని పని. వాదనకు తప్ప ఎందుకు పనికి రావు. చదవంగా తెలిసే యింఫర్మేషన్ తో అందరిని అనాలిసి చేయటం మొదలు పేట్టి, ఒక చిన్న విషయం మీద యాక్ట్ చేయాలంటె ఎంతో ఆలోచిస్తూ నిర్ణయించుకోలేక, ఫైనల్ గా సైకాల్జిస్ట్టూ సేటిలవుతారు. పుస్తకాలు అతి తక్కువ చదివిన వారే మంచి సక్సేఫుల్ గా జీవితం గడపగలడు. ఎందుకంటే చదువుతూ, కలలు కంట్టూ,వాదోప వాదనలు చేసుకొంట్టూ టైం వేస్ట్ చేయడు. యువనేత జగన్ లాగా ఎప్పుడు యాక్షన్లో ఉన్న వారికే విజయం లభిస్తుంది.

  మెచ్చుకోండి

 3. ఇక సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు , హార్వర్డ్ బిజినెస్ రివ్యూ లాంటి పుస్తకాలు ఉంటాయి, వాటిని ఈ రోజులలో దాదాపు అందరుకొని చదువుతారు. అందులో చెప్పె కిటుకులు అందరికి తెలుసు. ఆ పుస్తకం చదవటం వలన కిటుకులు అందరికి తెలిసిన తరువాత వాటిని ఎక్కడా ప్రయోగించలేము. కారణం కొన్నిసార్లు అవతలి వారు ఇట్టే మనం చేయబోయే పనిని పట్టెస్తారు. వారు ఆపుస్తకాలు చదివి ఉండటం మూలాన. కనుక ఆపుస్తకాలు చదవటం వలన మన ప్రత్యెకత పెద్దగా ఎమీ ఉండదు. జీవితంలో విజయం సాధించాలంటే ఎప్పుడు యాక్షన్ లో ఉండాలి. కొన్నిసార్లు ఎంత యాక్షన్లో ఉన్నా పైకి ఎదగలేకపోతే యువనేత లా గా పార్టి నుంచి బయట పడాలి. లేక పోతే బాబు గారిలా మామ గారి దగ్గర నుంచి వ్యూహత్మకంగా, బలవంతంగా అధికారం చెప్పట్టినట్టు చెప్పటాలి. ఈ రెండు చేతకాక పోతే భగవద్గీత ప్రకారం కర్మలను ఆచరిస్తూ, వచ్చిన జీతం తో తృప్తిగా జీవితం గడుపుతూ, కుటుంభం తో కలసిమేలసి ఉంట్టూ కాలం వేళ్ళదీయాలి. ఇటువంటి వారు తమప్రతిభా పాటవాలను పదును పెట్టుకొంట్టునే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైన దేవుడో లేక ప్రకృతి లో ఎదైనా శక్తి ఉంటే ఇటువంటి వారి నిజాయితిని గమనించి జీవితకాలంలో ఒక వరం ఇవ్వటానికి చాలా అస్కారాలు ఉన్నాయి. ఉదాహరణకు తట్టాబుట్టా సర్దుకొని హైదరాబాద్ కి బయలుదేరుతున్న తరుణంలో పి వి గారికి ప్రధాని పదవి వరించి వచ్చినట్టు . అలా అకస్మాత్తుగా వచ్చిన అదృష్ట్టాన్ని నిలబెట్టుకోవలంటే ముందరగా ఎంతో కృషి చేసి ఉండినపుడు మాత్రమే నిలబెట్టుకోగలరు.
  ——————————
  నేను సరదాగా రాశాను. ఎందుకంటే నేను సిగరేట్ తాగటం అలవాటు కూడా మనుకొన్నాను, కాని పుస్తకాలు చదివే వ్యసన్నాని మానుకోలేక పోయాను. అప్పుడప్పుడు ఈ పుస్తకాలు చదవటం వలన ఎమైనా లాభం ఉంట్టుందా? అని నన్ను ప్రశ్నించుకొన్నపుడు నాకు వచ్చిన ఆలోచనలు ఇక్కడ రాశాను. మీకు నచ్చక నా కమేంట్ పొతే డిలీట్ చేసేయండి.

  మెచ్చుకోండి

 4. రచయితలు వారి జీవితం లోని ఒక్కో దశ లో వేరు వేరు ఆదర్శాలని చెప్తారు. పెరిగే వయసు తో పాటు వారి లో పరిపక్వత వస్తుంది. వయసులో ఉన్నప్పుడు చెప్పిన ఆదర్శాలలోని తప్పుని పెద్దవారైన తరువాత తెలుసుకొని, అంతకు ముందు తాము చెప్పినవి తప్పు అని గ్రహిస్తారు. అప్పుడు తమ లోపాలు సవరించుకొంటూ, కొత్త ఆలోచనలు చెప్తారు. కానీ పాఠకుడు రచయితల ముందు వచ్చిన రచనలను చదివి, అవే కరక్ట్ అనుకొంటాడు. పాఠకుడు రచయిత జీవితం లోని అన్ని దశలనూ పరిశొధించి, వారు పెద్దయిన తరువాతి అభిప్రాయాలను తెలుసుకోలేడు. చదువరులు ఎక్కడో ఏదో షాపు లో రాండం గా ఒక పుస్తకం కొని చదువుతాడు. ఉదాహరణకు చలం తను వయసు లో ఉండగా చెప్పిన ఆదర్శాలను చాలా వాటిని, తను ఆధ్యాత్మికం లో పడిన తరువాత వ్యతిరేకించాడు. వాటిలోని లోపాలను గుర్తించాడు. కానీ ఆయన మొదటి రచనలు చదివిన వారికి ఇవేమీ తెలియదు. వారు ఆ రచనలూ వాటిలోని లోపాలతో ప్రభావితం అవుతూనే ఉంటారు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s