తెలుగమ్మాయిల గురించి కొన్ని పరిశీలనలు..పక్షపాతాలూ..

బెంగుళూరు లొ మా ఆఫీసు లో ఒక తెలుగమ్మాయి కొత్తగా చేరితే, ఆమె తెలుగమ్మాయని నోరు తెరవక ముందే కనిపెట్టేస్తాం. మొదటి రోజు తెలుగమ్మాయి సాధారణం గా ఎవరినో ఒకరిని వెంటపెట్టుకొని (మగ వాళ్ళని) వస్తుంది.
తెలుగమ్మాయి పని, ఆమెది తప్ప మిగతా టీం అందరి పనీ. ఒక రోజు పనిని రెండు రోజుల తరువాత మళ్ళీ అసైన్ చేసినవాడికే ఇచ్చి, వాడిదే తప్పు అని చెప్పటం కూడా తెలుగమ్మాయిలకే చెల్లుతుంది.
ఇదంతా తెలుగమ్మాయిలు సాధారణం గా ప్రొటెక్టివ్ వాతావరణం లో పెరగటం, వాళ్ళని పెద్ద వాళ్ళు అతి గారం చెయ్యటం (ప్రభుత్వం కూడా వాళ్ళని గారం చేస్తుంది ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చి) వలన కావచ్చు.

తెలుగమ్మాయికి లోక జ్ఞానం తక్కువా,గారం మాటలు ఎక్కువా. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఒంటి మీద నగలు దిగవేసుకొనే వాళ్ళలో తెలుగమ్మాయిలు ముందు ఉంటారు. నార్త్ అమ్మాయిల మేక్ అప్ ఖర్చు గురించి చెప్పక్కర లేదు. అమ్మాయిలందరికీ అటెన్షన్ కావాలనుకొంటా.. కాస్త అందం గా ఉన్న అమ్మాయిలు మేకప్ వేసుకొని తమ హిట్ రేట్ ని పెంచుకొంటే, అంత అందం గా లేని వాళ్ళు నగలు దిగేసుకొని..ఇవిగో చూస్కో నా నగలు అంటారు.

ఇకపోతే ఏ సంవత్సరానికో ఒక సారి కట్టే పట్టు చీరలు కొనటం లో మన ఆడ వాళ్ళు ముందుంటారు. తరవాత ఏ నాలుగేళ్ళకో ఆ చీర ని సగం ధరకి ఎక్స్చేంజ్ ఆఫర్ లో అమ్మేస్తారు.
మన తెలుగు అమ్మాయిలలో ఇంకొక అర్ధం కాని విషయం, ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు, ఆ ఇంటి వారు జాకెట్ ముక్కలు పెట్టటం. అమ్మాయిల ఇళ్ళలో ఆ జాకెట్ ముక్కలు కుప్పలు గా పెరుగుతాయి. అందరూ చుడీదార్ వేసుకొనే వారే..ఎప్పుడో పండగకో పబ్బానికో తప్ప. ఇంకా..జాకెట్ ముక్కల అవసరం ఏమిటి? వాటిని పెట్టటం అనేది ఒక కాలం చెల్లిన ఆచారం. ఒక ఆమె కి వేరొక ఆమె ఇచ్చిన జాకెట్ ముక్క, మరొకామె తన ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చేస్తుంది. ఈ విధం గా ఎవరూ కుట్టించుకోకుండానే జాకెట్ ముక్కల సర్క్యులేషన్ మొదలౌతుంది.

ఆ… ఐనా మగాడికి నాకన్నీ ఎందుకులే ఇవన్నీ..

 

ప్రకటనలు

29 thoughts on “తెలుగమ్మాయిల గురించి కొన్ని పరిశీలనలు..పక్షపాతాలూ..

 1. *తెలుగమ్మాయికి లోక జ్ఞానం తక్కువా,గారం మాటలు ఎక్కువా.*
  మీరు రాసేటప్పుడు మరీ మొహమాట పడినట్లు గారం మాటలతో పాటుగా సినేమా జ్ణానం ఎక్కువ.
  ఇక అమ్మాయిలతో పని చేయటం అంత తలకాయ నొప్పి పని ఇంకొకటి ఉండదు. వారితో మాట్లాడెటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలలో మేజారిటి భాగం వారి కి ఒక ప్రత్యేకమైన ట్రిట్ మెంట్ ఇవ్వాలని ఆశిస్తారు. వారు ఉద్యోగం చేస్తున్నదుకు మనం ఆనందించి వారి పని కూడా చేయలనుకొనే విధం గాఉనంట్టుంది కొంతమంది ప్రవర్తన.
  ఇక పెళ్ళి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటె వారితో చాలా జగ్రత్తగా ఉండాలి. కంపెనిలో చాలా మంది అబ్బాయిలు, వీరికి లైన్ వేసి పెళ్ళి చేస్కొంటే జీవితం సేటిల్ అవుతుందనే మూడ్లో ఉంటారు. వారు రోజు వీరిని కాకా పడుతు ఉంటారు. ఇటువంటి వారికి మీరు బాస్ గా ఉండి పని చేయటం లేదని అన్నారే అనుకొండి. మీ మీద లేని పోనివి కలిపించి ఆఫీసంతా చాటింపు వేస్తారు. ఇక ఆమే మగ మిత్రులకి మీరు పరమశత్రువులు గా కనిపిస్తారు. ఆమేకు తారాసపడే వారంతా పొగిడేవాళ్ళు, వీలైతే పెళ్ళిచేసుకొందామనుకొని దరఖాస్తు పెట్టుకొనే వాళ్ళు. ఇంటికి పోతే అమ్మానాన్నలు వారి అమ్మయి మంచి ఉద్యోగం వచ్చిందని పొంగిపోయేవారు. వీరందరిని చూసిన కళ్ళతో బాసు ను చూస్తే వారికి రాక్షసుడిలా కనిపిస్తాడు. ఇక పెళ్ళి ఐన తరువాత శెలవులు తీసుకొంట్టూ బాసు గారికి పని ఎక్కువ చేస్తారు. పిల్లలు పుట్టటం మేటర్నిటి లీవ్ మొదలైనవి బాగా వాడుకొని, కొంచెం పిల్ల వాడు పెద్దకావటం సాఫ్ట్వేర్ రంగం లో యక్స్పిరియన్స్ను పెరగటం తో ఒకానొక రోజు ఎక్కువ జీతానికి పక్క కంపెనికి జంప్ అవుతారు.
  ——————————–
  కెరీర్ లో పైకి పోవాలనుకునే అమ్మయిలు ఉన్న టిం లో పని చేయటానికి ఉత్సాహం చూపకొడదు. వారి పనిని మనం చేసి, వారిని పొగుడుతూ, నెమ్మదిగా మాట్లాడి (లేకపోతే టిం అంతా మన గురించి చెడ్డగా ప్రచారం మొదట SMS తో మొదలౌతుంది. వారికి ఎవోవో సింబల్స్ ఉంటాయి. వాటిని పంపుకొని మనలని ఆటపట్టిస్తారు), మనమే ఒక అభినందన లేఖ పంపి జిందాబద్ కొట్టుకోవటంతో సరి పోతుంది. కాని ఒక 30% మంది అమ్మాయిలు ఎంతో తెలివి, ఓపిక గల వారు తగులుతారు. వారితో కలసి పనిచేస్తే బాగుంట్టుంది.

  మెచ్చుకోండి

  1. శ్రీరాం గారూ,
   మీకు ఈ విషయం గురించి మంచి అనుభవం ఉన్నట్లుంది..నా పోస్ట్ కంటే మీ కామెంటే పెద్దగానూ బాగానూ ఉంది. దీని గురించి మీరే ఒక పోస్ట్ రాయండి.

   మెచ్చుకోండి

   1. @బొందలపాటి గారు,
    ఏముందండి కొంతమంది గురించి మనమెప్పుడు చాలా పెద్ద హృదయం చూపుతూండాలి. పోని నిజంగా పెద్ద మనసుతో ఉంటే కార్పోరేట్ ప్రపంచం లో కాంపిటేటివ్ గా లేడు అని అనుకొంటారు. ఎవరు మనతో ఎక్కువ రోజులు కలసి పని చేయరు, కంపేనిలు మారుతూ, పనిని ఇతరుల మీదకు తోసి ఇంటర్వ్యులకు జవాబులు మాత్రం నేర్చుకొనేవారిని నేను చాలా మందిని చూశాను. పని చేయటం కన్నా సబ్జేక్ట్ బాగా నేర్చుకొంట్టే పక్క కంపెనికి సులభంగా జంప్ కావచ్చు. పని కంపేని డిపేండెంట్ సబ్జేక్ట్ అనేది నిన్ను ఇండిపేండేంట్ గా (కంపెని మీద ఆధరపడ కుండా) చేస్తుంది. ఇదొక వ్యుహం.
    —————————————————————————–
    ఇక ఆడవారి జాబ్ లైఫ్ సైకిల్ చూస్తే ఇలానే ఉంట్టుంది. పబ్లిక్ సేక్టర్ లో మరి ఘోరం గా పని చేస్తారు. కావాలంటే బాతాకాని ఫణి గారిని అడగండి. ఆయన అనుభవాలు చెపుతారు. నేను రెండూ చూసాను కనుక ఇది చెప్పాను. మీరు చూడండి ఈ నాటి ఆడవారికి జాబ్ అనెది చాలా మందికి ఒక ఆప్షన్, వారికి చాలా పెద్ద మనసు ఉందనుకొంటారు కాని పెళ్లి చేసుకొనేటపుడు వారిలో దాదాపు అందరు ఎక్కువ జీతం ఉన్న మగ వారిని చేసుకొంటారు. బోర్ కొట్టిందనుకొండి జాబ్ వదిలేస్తారు. మీరే ఏ ఐ.టి. కంపెనీలోని స్టాట్స్ చూసినా తెలుస్తుంది 34 సం|| తరువాత చాలా మంది జాబ్ రిజైన్ చేస్తారని చెపుతారు. ఎవరో కొంతమంది పై పోసిషన్ లో ఉంటారు. వారిని కంపెని మహిళలను మానేజ్మేంట్ బోర్డ్లో ఉండాలని యంకరేజ్ చేస్తునంటారు. వారు కొనసాగుతుంటారు. అంతే.
    ఇక రానున్న కాలం లో ఐ.టి. లో పెద్ద జీతాలు ఉండవు. నా ఉద్దేశం ఒకప్పటి చార్మ్ ఉండదు, అదేకాలంలో ఎవరికైన స్వంత ఇల్లు వాకిలి ఉంటే వారి ఆస్థి ఎమీ చేయకపోయినా పెరిగి పోతుంట్టుంది. కనుక ఆడవారు ఈ ఉద్యోగాలలో చేరే వారి సంఖ్య తగ్గవచ్చు కూడాను.
    నేను ఇవ్వన్ని మీ బ్లాగులో రాయటానికి కారణం మీరు చేసే రచనలకి ఎప్పుడొకప్పుడు ఉపయోగ పడుతుందేమో అని రాస్తున్నాను. నాకు బ్లాగు పెట్టి రాయాలని కోరిక లేదు.

    మెచ్చుకోండి

    1. పని చేయటం కన్నా సబ్జేక్ట్ బాగా నేర్చుకొంట్టే పక్క కంపెనికి సులభంగా జంప్ కావచ్చు.
     మీరు చూడండి ఈ నాటి ఆడవారికి జాబ్ అనెది చాలా మందికి ఒక ఆప్షన్
     –నా మనసు లో ,మాట మళ్ళీ చెప్పారు.

     కథలూ కాకర కాయలూ రాయటం గురించి నా బులపాటం తగ్గిపోతోంది.కాస్తంత పేరేమైనా వచ్చే దారీ కనపడటం లేదు..మనసులో ఉంది ఆల్రెడీ కక్కేశాను..సో ఆత్మ సంతృప్తీ ఇక కలగటం లేదు..డబ్బు అసలే రాదు..ఓ పత్రిక వాడు నా “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ ” ని వేసుకొంటాను అన్నాడు. ఊరికే ఇస్తేనే..కనీసం కాంప్లిమెంటరీ కాపీ కూడా పంపడు..కాబట్టీ ఎవరికో పుట్టిన బిడ్డ ఎక్కెక్కి ఏడ్చిందని..ఎవరెట్లా పోతే మనకేం..మనమెందుకు రాయాలి..అందులోనూ ఎవరూ పట్టించుకోనపుడు…

     మెచ్చుకోండి

 2. boys meeku eevishayamlo chala experianc vunda emti?
  oari bhadaa ,ammayila kashtaalu ami thelusu?
  padhi mandi matladithe vallalo avaritho ami ante ami avuthundo thelieka vallu vesukune protective kavachamera innocent face.
  vallu nijamga true face chopithe meeku akasamlo sagame kadhu aamie ami migaladhu .
  not even half in 33/
  got it.

  మెచ్చుకోండి

 3. హ్మ్ ! అవుట్ అఫ్ మై క్యూరియాసిటీ , అమ్మాయిలు అందరు తెలివైన వాళ్ళు , కొందరు అతి తెలివి తో రోజులు గడిపేవాళ్ళు ఉంటారు . మరి మగవాళ్ళ సంగతి ఏంటి ? అందరు పనిమంతులేనా , తెలివైనా వారేనా ? బాస్ కి మస్కా కొట్టి పని ఎగ్గొట్టే వాళ్ళు , మాటలు తో కోటలు కట్టి పనులు ఎగ్గొట్టే వాళ్ళు లేరా , వాళ్లకు నచ్చక పొతే లేదా వాళ్ళని పట్టించోకొని వాళ్ళ మీద నానా రకాల ప్రచారాలు చేసేవాళ్ళు లేరా ?

  మెచ్చుకోండి

  1. “మరి మగవాళ్ళ సంగతి ఏంటి ? అందరు పనిమంతులేనా ,”
   కాదు
   “తెలివైనా వారేనా ?”
   కాదు
   “బాస్ కి మస్కా కొట్టి పని ఎగ్గొట్టే వాళ్ళు , మాటలు తో కోటలు కట్టి పనులు ఎగ్గొట్టే వాళ్ళు లేరా ,”
   ఉన్నారు
   “వాళ్లకు నచ్చక పొతే లేదా వాళ్ళని పట్టించోకొని వాళ్ళ మీద నానా రకాల ప్రచారాలు చేసేవాళ్ళు లేరా ?”
   “ఉన్నారు”

   ఈ పోస్ట్ తెలుగు అమ్మాయిల ప్రత్యేక గుణాల గురించి మాత్రమే! అబ్బాయిల గుణాల గురించి తీరిక ఉన్నప్పుడు ఇంకొక పోస్ట్ రాస్తాను. మీకు పోస్ట్లు రాసే సమయం ఉంటే మీరే రాయండి.

   మెచ్చుకోండి

   1. మీకు పోస్ట్లు రాసే సమయం ఉంటే మీరే రాయండి.
    —————–
    నాకు అంత ఓపిక లేదులెండి, పైగా ఏదోక గ్రూప్ కట్టి లక్షణాలను జనరైజ్ చేసి రాసే ఓపిక అంతకన్నా లేదు :)))))))

    మెచ్చుకోండి

  2. శ్రావ్యా,

   మీరు చెప్పిన గుణాలు మగ వారికి ఉన్నాయని అనుకొంటె, అటువంటి వారికి ముఖ్యం గా ఆడవారి మద్దతు ఉండదు. అదే అమ్మాయిల విషయానికి వస్తే వారు పేళ్ళి కాని వారైతే వారిని పెళ్ళిచేసుకోవటానికి వెంటబడేవారి సంఖ్య చాలా ఉంట్టుంది. వీరు ఉదయం బ్రేఖ్ ఫాస్ట్ కి , మధ్యాహ్నం భోజనానికి , సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మూడు పూటలా హాజరు వేసుకొని అమ్మాయి చెప్పే అప్డేట్ విని బాసు గారిని కొర కొర/ఒక విధమైన చూపులతో చూస్తూ ఆమే మనసును శాంతింప చేయాలని చూస్తాడు. ఇది ఆడవారు తమ బాయ్ ఫ్రెండ్ కోసం చేస్తారా?

   మెచ్చుకోండి

   1. శ్రావ్యా,
    ఇక్కడే మీరు మనుషుల ను మైండ్ తో కాకుండా కొంచేం మనసుతో అర్థం చేసుకోవాలి. మగ వారికి అటువంటి సలహాలు ఇస్తే లేక వారిని మైండ్ ని బ్రైన్ వాష్ చేస్తే ఇక మగ వారికి ఆడ వారిపై అట్రాక్షన్ కూడా ఉండదు. మగ వారికి ఆ ఫీలింగ్స్ అనేవి ప్రకృతి పరంగా వచ్చినవి, అంతే కాని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయి వలలో పడి పై వారితో తగువు పెట్టుకొంటావా అని అడగటం సమంజసం కాదు.జీవితం లో ఎప్పుడు ఎదో ఒక మాయలో (ఆకర్షణలో)పడి లేస్తుంటే ఆనందంగా ఉంట్టుంది. అందువలన నేనైతే మగ వారి ఆకర్షణని దెబ్బతీసె జ్ణాన భోదలు చేయను.

    మెచ్చుకోండి

  1. Sravya gaaroo… “నాకు అంత ఓపిక లేదులెండి, పైగా ఏదోక గ్రూప్ కట్టి లక్షణాలను జనరైజ్ చేసి రాసే ఓపిక అంతకన్నా లేదు ))))))
   ” anio raasaru.
   evarinaa abbaayini adagandi. Raasi pedataaru. Ade kada ammaayilu chesedi.
   Just kidding. 😉

   Chandu

   మెచ్చుకోండి

 4. ఈ పరిశీలన అంతా సాధారణం గా కనిపించే లక్షణాల గురించి అని మనవి..ఈ లక్షణాలకి అతీతం గా ఉండే తెలుగు అమ్మాయిలూ కొంత మంది ఉంటారు.

  మెచ్చుకోండి

  1. హ హ అర్ధం అయ్యింది లెండి మీ పోస్ట్లు నేను కంటిన్యు గా చదువుతా కాబట్టి ఏ టోన్లో రాసారో అర్ధం అయ్యింది . కాకపొతే కొన్ని కామెంట్లు చూసి అంతే:))))

   మెచ్చుకోండి

 5. బొందలపాటి గారూ,
  “ఎవరికో పుట్టిన” బాగా చెప్పారు. అంతేకదా మరి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. మన దూల తీరే వరకు రాసిపారేయటం, ఆపై వదిలేయటం అంతే.

  శ్రీరాం గారూ,
  మగవాడి ఆకర్షణ, వేషాలు అన్నీ ఆకాస్త ఆయ్యేవరకే. అది ప్రకృతి నియమం. స్త్రీవాదులు నామీద పడిపోవచ్చు గానీ, అది అయ్యేవరకు మగవాడికీ, అయ్యాక ఆడదానికీ తిప్పలు తప్పవు.

  మెచ్చుకోండి

  1. “మన దూల తీరే వరకు రాసిపారేయటం, ఆపై వదిలేయటం అంతే.”
   అంతే..!మనిషి స్వభావమే అంత. 🙂
   ఏ సైన్స్ మాగజైన్లోనో చదివాను..ఆడదానికి నెలకి ఒక అండం మాత్రమే విదుదలౌతుంది. కాబట్టీ ఆమె దానిని ఎవరికి ఇవ్వాలో షార్ట్ లిస్ట్ చేసుకొంటుంది. సాధారణం ఇది పవర్ లో ఉన్నవాడినీ, బలం కలవాడినీ సెలక్ట్ చేసుకొంటుంది.సెలక్ట్ చేసుకొనే ముందు మగవాడిని అట్రాక్ట్ చేసి (మనం జాబ్ కోసం రెస్యూం లు పంపినట్లు) తరువాత వచ్చిన ఆఫర్ లని బట్టి మంచి కంపెనీ ఆఫర్ ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. అమ్మాయి రెస్యూం పంపి , తరువాత తమ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయకపోతే కొందరు మగ వాళ్ళు ఆమె మీద యాసిడ్ పోస్తారు. ఎందుకంటే మగ వాడి దృష్టి లో అమ్మాయి నుంచీ రెస్యూం వచ్చిందంటే, అది తన ఆఫర్ ని యాక్సెప్ట్ చేయటానికి సిధ్ధం కావటం అన్న మాట. మగవాడికి వీర్య కణాలు ఎన్నిపడితే అన్ని ఎప్పుడు పడితే అప్పుడు. మగాళ్ళు ఆడ వాళ్ళ చుట్టూ తిరగటం ఈ లాజిక్ వలనే. కానీ అమ్మాయి దృష్టి లో గేం అప్పుడే మొదలైంది.
   ఇదంతా జీవ పరిణామ సిధ్ధాంతం ప్రకారం, మన జాతిని ఎక్కువ కాలం మన గలిగేలా చేసేందుకు, ఏర్పడిన స్వభావాలు.
   గర్భనిరోధకాల వలన స్త్రీ అండం విడుదలైనా కూడా లేనట్లే. వీటి వలన స్త్రీ కి సహజం గా వచ్చే సెలెక్ట్ చేసుకొనే స్వభావం మారి పురుషుడి లానే ప్రవర్తించవచ్చు. ప్రస్తుతానికి పాత అలవాట్లు పోక స్త్రీలు కొంత ప్రవర్తిస్తున్నారు..కానీ భవిష్యత్ లో స్త్రీల స్వభావానికీ పురుషుల స్వభావానికీ ఈ విషయాల్లో(స్త్రీ పురుష సంబంధాల విషయాల్లో) పెద్ద తేడా ఉండదు. దీనిని మనం ఆల్రెడీ, పాశ్చాత్య దేశాలలో చూడవచ్చు.

   మెచ్చుకోండి

 6. * స్త్రీ కి సహజం గా వచ్చే సెలెక్ట్ చేసుకొనే స్వభావం మారి పురుషుడి లానే ప్రవర్తించవచ్చు.*
  అంటే కాదల్ కోట్టయ్ సినేమాలో హీర, అజిత్ వెంటపడినట్లు గా, రానున్న రోజులలో వారు మగ వారి వెంటపడతారేమో! 🙂
  ———————————————————–
  నేను కూడా చాలా సైన్స్ పుస్తకాలు చదివాను మీరు రాసినది చదివిన తరువాత ఒక విషయం గుర్తుకు వచ్చింది. అందులో ఒక పుస్తకంలో నలుగురు మగవారు ఒక స్రీ తో గడిపితే ఆమేకి ఎవరిద్వారా సంతానం కలగాలను కొంట్టుందో అతని వీర్యకణం మాత్రమే అండం తో ఫలదికరణ జరుగుతుందని , స్రీ మనసులో అనుకొన్న సంకల్పం బిడ్డలు పుట్టటానికి కారణమౌతుంది అని రాశారు.
  మీరు ఒక్కసారి ఊహించండి నలుగురు మనుషులలోని ఎన్నో లక్షల వీర్య కణాలలో ఒక్క మనిషి కి సంబందించిన వీర్య కణాలకి ఆమే సంకల్పం ఒక మేసేజ్ లాగా వేళ్లి , అందులో ఒకటి పోయి కలవటం అనేది. ఈ ప్రొసెస్ అంత మైన్యుట్ లేవెల్ జరగటం ఎంతో ఆశ్చర్యం గా అనిపించింది.
  అది చదివిన తరువాతా ఉపనిషత్ లలో చెప్పినది గుర్తుకు వచ్చింది. ఈ ప్రపంచం ఎలా సృష్ట్టించ బడినదని అడిగితే ఉపనిషత్ లో అది సృష్ట్టి కర్త సంకల్పం. సంకల్పం వలననే ఈ ప్రపంచం సృటించబడినది అని చెపుతారు. ప్రపంచం లో విల్ మరియు డేసిషన్/చాయిస్ చాలా ముఖ్యమైనవి.

  మెచ్చుకోండి

  1. “ఆమేకి ఎవరిద్వారా సంతానం కలగాలను కొంట్టుందో అతని వీర్యకణం మాత్రమే అండం తో ఫలదికరణ జరుగుతుందని ”

   శ్రీరాం గారూ,
   ఇది ఎందుకో నమ్మలేక పోతున్నాను. ఇలా అయితే, రేప్ చేయబడిన స్త్రీ కి ఆ రేప్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉండకూడదు..కానీ రేప్ అవ్వబడ్డ స్త్రీలకి ఆ రేప్ వలన పిల్లలు పుట్టటం ప్రపంచం లో మనం చూస్తూనే ఉన్నాం…ఒక్కొకసారి ఇది పొలిటికల్ ఇస్యూ కూడా అవుతుంది (చైనా లో రెండవ ప్రపంచ యుధ్ధ కాలం లో జపాన్ మిలిటరీ చేత రేప్ చెయటం ద్వారా కలిగిన పిల్లలు ఉన్నారు)

   మెచ్చుకోండి

 7. బొ0దలపాటి గారు, నేను ఒకప్పుడు చాలా సైన్స్ పుస్తకాలు, వీడీయోలు చూసేవాడిని ఒక చోట ప్రెగ్నేసి- పిల్లలు పుట్టాటం మీద చదివినపుడు నేను ఇది చదవటం జరిగింది. మీకోసం అది చూపించాలి అంటె ప్రస్తుతం వీలు పడదు. ఎప్పుడైనా నాకు ఆ విషయం మళ్లి దొరికితే ఆ వ్యాసం/వీడియో మీతో పంచుకొంటాను.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s