మనమందరం ఇలా ఉంటే బాగుంటుంది..

ఎవరికి వారు పక్క వాడి కళ్ళతో వాడి బాధల్ని చూడ గలిగితే..

దళితుల అణిచివేత ను పైకులాలు అర్ధం చేసుకొంటే ..
పైకులాల-సామాన్యుని దళితులు ఆదరిస్తే..

తెలంగాణ వారి అస్థిత్వ వేదనను ఆంధ్రులు పడితే…
ఆంధ్ర వారి ఐక్యతా భావనను తెలంగాణ స్పృశించగలిగితే..

లేని వాడి లేమిని ఉన్నవాడు అనుభవిస్తే..
“బాగుపడినాక చేసేపని” లేని వాడి మదిలోకొస్తే..

సొంత వ్యాపారం లోని కష్టం కామ్రేడ్ కి తెలిస్తే..
తన జీతం లోని “శ్రమ” , “సీ ఈ ఓ” గారికి తెలిస్తే ..

ఆడవారి ఇష్టాన్ని మగవారు గౌరవిస్తే..
మగవారి అభిమానాన్ని ఆడవారు అర్ధం చేసుకొంటే..

సాయిబ్బు గడ్డం నామాలాయన కిష్టమైతే..
నామాల ముఖం సాయిబ్బుకింపైతే..

ఎవరికి వారు తమలోకి తొంగి చూసుకొంటే..
బాగుంటుంది…

ప్రకటనలు

4 thoughts on “మనమందరం ఇలా ఉంటే బాగుంటుంది..

 1. శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.

  చక్కటి భావన. సప్త వర్ణాలని గబగబా తిప్పినప్పుడు, అని రంగులు మాయమాయి, ఒకేఒక తెల్లని రంగు కనిపిస్తుంది. మీ భావనలన్నీ నిజమైతే, స్వచ్ఛమైన మనసు కనిపిస్తుంది అందిరిలో, అందరికీ.
  మీ స్నేహశీలి,
  ]మాధవరావు.

  మెచ్చుకోండి

 2. మనస్సు,నిలిపి కనురెప్పపాట్లు సూక్ష్మాతి సూక్ష్మమైన సమాధి తెలుసుకున్నారు మనస్సు,నిలిపి తపస్సు చేసిన ఈ దశలో. తమ గురువుల ద్వారా వేద సారం ఆత్మానుభవము అని తెలుసుకున్నారు సూక్ష్మా బుద్ది మార్గము సాధన మనస్సు ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు యోగులు ఋషులూ తెలుసుకున్నారు సూక్ష్మాతి అతీతుడై యుండును. తపస్సుల కన్నను, జ్ఞానుల కన్నను, కామ్యకర్ముల కన్నను యోగి అధికుడైనందున నీవు తప్పక యోగివి కమ్ము. గురువుగా బోధి ధర్మ ఈనాటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆయన చైనాకు ఈ జ్ఞానాన్ని అందించటం వల్ల ఎన్ని వేల మంది జిజ్ఞాసులు సంసార సాగరాన్ని దాటి బుద్ధత్వాన్ని పొందారో లెక్కలేదు. ప్రపంచానికి గొప్ప మేలు చేసిన వారిలో తప్పక ఈయన పేరు ఉంటుంది.

  మెచ్చుకోండి

 3. మౌనం ఓ మహ తపస్సులాంటిది. నీవు మౌనం దాలిస్తే, అంతులేని ఆకాశం; ఎత్తైన పర్వతాలు; లొతైన లోయలు; గంభీరమైన సముద్రుడు; అంతులేని సహనంగల భూమాత నీముందు మోకరిల్లుతయి; నక్షత్రాలు పువ్వులై ఈ నేలపై విరుస్తాయి; ఆకాశవాణి నీ పలుకై పలుకుతుంది. అంతటి ఉన్నతోత్తమైన ఓ మనసా!! బాహ్య ప్రాపంచిక సుడిగుండాల్లో పడకు; అఃతర్ముఖివై, అంతరాత్మను తెలుసుకో!! నీ ఒంటరితనాన్ని పోగొట్టుకో, చైతన్యాన్ని పొదువుకో. స్వస్తి. ప్రపంచంలోని ప్రాణుల్లో ఒకరైన మానవులు అత్యంత ఉన్నతమైన శ్రేణికి చెందినవారు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s