పాపం మగాళ్ళు! ఎలా ఉండే వాళ్ళు ఎలా తయారయ్యారు!

ఒకప్పుడు:
———
వాళ్ళు మగ మహారాజులు. వీరులూ ధీరులూ. యుధ్ధాలు చేసే వారు. తెగించే వారు. సాహసాలు చేసే వారు.తరుణులను గెలిచే వారు.పొగరు గా, పౌరుషం గా, ఆప్యాయం గా, స్నేహం గా,దుడుకు గా, పెద్ద మన్సుతో ఉండే వారు.
నచ్చిన వనితలను వలచి వలపించుకొనే వారు.
కుటుంబాలు ఏర్పడటం మొదలయ్యాక, ఇంట్లో వీరి మాటకి తిరుగే లేదు.

నిన్న:
——
నెచ్చెలి గురించి ఎక్కువగా ఊహలలో కాలక్షేపం చేసే వాడు. ఇష్టమైన అమ్మాయిని కాక, పెద్దలు చూసిన “కన్య” ని వివాహమాడిన వాడు. ఊరిలో సగం ఆడ వాళ్ళయినా, వారితో మాట్లాడటానికి కూడా స్వేచ్చ, అవకాశం లేక తన మగ స్నేహితులతో కాలక్షేపం చేసే వాడు. పస లేని గుమాస్తా ఉద్యొగాలు చేసే వాడు.గానుగెద్దు జీవితం!
అధికారం తో పాటు బాధ్యతలు పైన పడిన వాడు. కుటుంబానికి యజమాని ..కానీ కుటుంబ భారం మోసే వాడు..భర్త.ఇంట్లో నచ్చిన వంటలు చేయించుకొని నచ్చకపోయినా తినేవాడు.ఆడవారినీ పిల్లలనూ రక్షించే వాడు..అతనికి రక్షణ ఉందా లేదా అనేది వేరే విషయం. ఇంట్లో పిల్లి అయినా వీధిలో పులి.

నేడు:
—–
ఒక అమ్మాయి దయ కోసం పది మంది మగ వాళ్ళు అలమటించే స్థితి. బిక్కు బిక్కు మంటూ ప్రేమించాలి.ఏమైనా తేడా వస్తే నాన్-బెయిలబుల్ కేసు కింద కట కటాలలోకి పోవాలి. లేకపోతే ప్రభుత్వమే పైకి పంపిస్తుంది.
వళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో బాబూ, నీకు 33 శాతం రిజర్వేషన్లు లేవు!
ఆఫీసు లో తేడా వచ్చిందా సెక్సువల్ హరాస్మెంట్ కేస్ కి సిధ్ధం కావాలి కాబట్టీ, ఆడ పిల్లలతో జాగ్రత్త గా ఉండాలి.
పెళ్ళయినాక, గృహ హింస కేసు ఉంది నాయనా, పెళ్ళాం కొడితే మూసుకొని కూర్చో!ముల్లు అరిటాకు మీద పడినా అరిటాకు ముల్లు మీద పడిన అరిటాకు కే నష్టం. బాసు గారు నీ కొలీగ్ ని “మేడం కొంచెం ఈ పని చేస్తారా?” అంటారు, నిన్ను మాత్రం, “ఈ పని ఇంకో అరగంట లో చెయ్”, అంటారు.
మహిళా మణులు,బాసు చెప్పిన పని ఇష్టం లేక పోయినా చేస్తారు. మరి అది డబ్బు తో సంబంధమున్న విషయం కదా! నువ్వు వారి మంచికోరి చెప్పినదైనా, చెయ్యరు. చేస్తే స్త్రీ స్వేచ్చ కి భంగం. ఆత్మ గౌరవానికి వ్యతిరేకం.
నీ భార్యకి వంట తెలవదు కదా నువ్వే కాస్త వంట నేర్చుకో నాయనా. లేక పోతే హోటల్ బిల్లు పేలుతుంది. పెళ్ళాం వస్తాదు తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ముందు నడుస్తుంటే, నువ్వు అణకువగా పిల్లల్ని ఎత్తుకొని వెనుక నిలబడు.లేకపోతే నీకు సంస్కారం లేనట్లే! కారు డ్రైవర్ పని చేయి, పచారీ పని చేయి.
ఆడ వారి హక్కుల గురించీ మగ వారి బాధ్యతల గురించీ తోటి మగ వాళ్ళతో సహా బ్రెయిన్ వాష్ చేయబడిన వాడా!
బజారు లో కురచ బట్టల కుర్రదాన్ని చూసి, తన నోట్లో మాట తనే నొక్కేసుకోవటమే నాగరికత అనుకొనే వాడా.. !కుటుంబ చట్రం లో పడి కునారిల్లుతున్న వాడా!రోజు రోజు కీ సహజ స్వభావాన్ని వీడుతున్న వాడా!!రేపు లోకం ఎలాఉంటుందో అని భయపడే వాడా!చచ్చి పోయిన “మగాడా”!, నీ స్మృతికి ఇదే నా నమస్సుమాంజలి!

ప్రకటనలు

5 thoughts on “పాపం మగాళ్ళు! ఎలా ఉండే వాళ్ళు ఎలా తయారయ్యారు!”

 1. బొందలపాటి గారు మీరు మగవారి గురించి చాలా తక్కువ అంచనా వేస్తూ రాస్తున్నారండి. రానున్న రోజుల్లో మళ్ళీ పురుషులదే/కే భవిషత్! దానికి తల్లి దీవెనలు కూడా తోడవుతాయి. అధైర్య పడకండి అని పురుష సిం హాలకు బ్లాగు ద్వారా విజ్ణప్తి.

  మగ వారు వేనుకబడటమంటే కార్పోరేట్ కంపేని వ్యాపారం మానుకొంట్టున్నటు, ఇప్పటికిప్పుడు ప్రజాస్వామ్యం పోయి కొత్త వ్యవస్థ వచ్చినట్టు. డబ్బుకి, అధికారానికి కాలం చెల్లినట్టు అని అర్థం. కొత్త వ్యవస్థ రావటం అంత సులభమా, అసలికి సంభవమా? ప్రపంచంలో సూర్య చంద్రులు ఉన్నంత వరకు వరకు డబ్బులు, అధికారం తమ విలువను కోల్పోతాయా? ఇవేవి జరిగే పని కాదు. మగవాడు డల్ అవ్వడం తాత్కాలికం, భవిషత్ లో డబుల్ యనర్జితో ముందుకు ఎలా దూసుకు వస్తాడో! మీరే చూస్తారు.
  నేను వాస్తవికత కు దగ్గరగా ఒక పెద్ద వ్యాఖ్య “మళ్ళి” రాస్తాను.

  మెచ్చుకోండి

 2. తాడేపల్లి గారు రాసిన స్త్రీల కేసుల్లో లోతు చూడాలి అనే ఈ క్రింది మూడు వ్యాసాలు చదివేది.
  http://kalagooragampa.blogspot.com/2011/06/1_25.html
  http://kalagooragampa.blogspot.com/2011/06/2_29.html
  http://kalagooragampa.blogspot.com/2011/06/3.html

  మెచ్చుకోండి

 3. మీరు చెప్పినది నీజమే. ఆయనకి మంచి ధైర్యం కూడా ఉంది. రాసినదాని మీద ఎప్పుడు తన మాటలను వెనకకు తీసుకొనట్టుగా చూడాలేదు. స్పష్ట్టమైన అవగాహనతో రాస్తాడు. చాలా మంది ఆయన లా అన్నికోణాలలో ఆలోచించి బ్లాగులలో రాయరు కనుక ఆయనని చాలా మంది తప్పుగా అర్థం చేసుకొని, ఎమోష్నల్ గా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించుతారు.
  అసలు విషయానికి వస్తే ఆయన కన్సర్వేటివ్ అని అనుకోను. అలా అనిపిస్తాడు. అంతే. కాకపోతే కుంచెం గురువు,దేవుడు,దైవం మరియు భారత దేశ ప్రాచీన సంస్కృతి అనేవాటి గురించి ఆయనకు స్పష్ట్టమైన అవగాహన ఉంది. బ్లాగులోకం లో, ఇంకా చెప్పాలి అంటే తెలుగు రచయితలలో నేను అభిమానించే అతి కొద్ది మంది మేధావులలో ఆయన ఒకరు. బ్లాగులో ఆయన మేధ స్థాయిని చాలా మంది అందుకోలేక, ఎదో తన తెలివిని ప్రదర్శిస్తున్నాడను కొంటారు. అతనిని తెలుగు పాత్రికేయ రంగంలో ఆంధ్ర భూమి ఏడిటర్ యం.వి.యర్. శాస్త్రి, యం.బి.యస్. ప్రసాద్ (గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ లో కాలంస్ రాసే) వంటి వారి సరసన చేర్చవచ్చు. వారిద్దరికి దేవుడు, ఆధ్యాత్మిక నాలేడ్జ్ ఎంత ఉందో తెలియదు కాని తాడేపల్లి గారిదగ్గర మటుకు చాలా ఉంది.
  సమకాలీనులు ఎప్పుడు వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకొంటారు, తక్కువచేసి మాట్లాడుతారు. అందువలన భవిషత్ లో ఆయన రాసినది చదివేవారు, ఆయన ఇప్పుడు రాసే ఊహలు రానున్న రోజులలో వాస్తవాలు అయ్యిఉంటాయి కనుక భావితరాల వారు అతనిని ఎంతో గౌరవించవచ్చు. ఇంఫోసిస్ నారాయణ మూర్తి లాగా అతను సరి అయిన సమయం లో సరి అయిన నిర్ణయం తీసుకొన్నారు. అలాగే తాడేపల్లి గారు తనకు నచ్చిన రచనా వ్యాసంగాన్ని బ్లాగుల లో రాస్తూ మంచి కీర్తి ప్రతిష్ట్టలు రానున్న రోజులలో సంపాదించుకొంటారు. అతని గురించి రానున్న కాలమే నిర్ణయిస్తుంది.
  కాకపోతే ఒక్క విషయం లో ఆయనతో విభేదిస్తాను. నేను ఆంధ్రావాడిని అయినా నాకు తెలంగాణా ఇస్తే తప్పేమి లేదని పిస్తుంది. కాని ఆయన సమైఖ్యావాది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s