జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం మొదలైనవి..

ఈ టపా ఇంతకు ముందు నేను విశ్వం యొక్క కారణం,పుట్టుకా వగైరా ల గురించి రాసిన టపాలకు

http://wp.me/pGX4s-iR

http://wp.me/pGX4s-rB

) కొనసాగింపు.

1.ఈ భౌతిక ప్రపంచానికి ఆవల అధి భౌతిక ప్రపంచం (metaphysical world) ఉంటుంది.భౌతిక ప్రపంచం యొక్క నియమాలు పనిచేయటం మానివేసినచోటినుంచీ అధిబౌతిక ప్రపంచం ఉనికి మొదలౌతుంది.  ఈ భౌతిక ప్రపంచ మూలాలు ఆ అధి భౌతిక ప్రపంచం లో నే ఉంటాయి. అయితే ఈ అధి భౌతిక ప్రపంచం మన ఊహల కు అందనిది. దాని గురించి ఆలోచించాలంటే “కాలం లేకపోవటం, కారణం లేక పోవటం,ఐదూ లేక అంత కంటే ఎక్కువ కొలతలూ(డైమెన్షన్స్)” లాంటి భౌతిక ప్రపంచానికి ఉన్న మినహాయింపుల సహాయం తో ఆలోచించాలి. అయితే మన ఆలోచనా, ఊహా ఈ మినహాయింపులు అనే గోడ కి కొట్టుకొని ఆగిపోతాయి. ఈ గోడ ఆవల ఏమి ఉందో మన ఊహ కు అందదు. ఇక, దానిని అనుభవించటం కలలోని మాట.

అధిభౌతిక ప్రపంచం లో రెండు స్థాయిలు ఉంటాయి. ఐదూ లేక అంత కంటే ఎక్కువ కొలతల(డైమెన్షన్స్)  తో ఏర్పడిన మొదటి స్థాయి ఒకటీ, మనం చూసే భౌతిక ప్రపంచం లోని, మరియూ మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచం లోని విషయాలకు ఆవల ఉండే రెండవ స్థాయి అధి భౌతిక ప్రపంచం ఇంకొకటి. ఈ రెండవ స్థాయి అధి భౌతిక ప్రపంచం స్థల కాలాల కూ అన్ని కొలతలకూ అతీతమైనది.

2. మనకు తెలిసిన అనేక మంది మహానుభావులు, ఋషి సమానులు పరిపూర్ణ సత్యాన్ని ప్రత్యక్షం గా అనుభవించామని చెప్తారు. ఇలా అనుభవించటం “నేను” అనే దానిని వదులుకోవటం ద్వారా సాధ్యపడుతుందని చెప్తారు. ఉదాహరణ కి ఆధునిక కాలం లో జిడ్డు కృష్ణమూర్తి, యూ జీ కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి వారు ఇలాంటి అనుభవాలు పొందబడిన వారి గా నమ్మబడ్డారు. వీరు అహాన్ని అధిగమించటం ద్వారా మనం రోజు వారీ చూసే భౌతిక సత్యాన్నే విశిష్టమైన రూపం లో చూడగలిగారు అనిపిస్తుంది. వీరికి కలిగిన అనుభవాలను భవిష్యత్తు లో, వేరే పధ్ధతుల్లో, భౌతిక ప్రేరేపణల ద్వారా, అంటే, శస్త్ర చికిత్సల వలన నో, జన్యు మార్పులు చేయటం వలననో, లేక మందులు కనిపెట్టటం వలననో” సాధించవచ్చేమో!

3.నేను అనేది గడిచిన కాలం లోని ప్రతిబింబాల(images) తో చేయబడిన ఆలోచనల సమూహం. నేను లేనప్పుడు, భౌతికమైన వాస్తవాన్ని చూసేటపుడు, ఈ  ప్రతిబింబాలు అడ్డు రాని స్వఛ్ఛమైన భౌతిక వాస్తవికత అనుభవంలోకి వస్తుంది. నేను అనేది లేనపుడు భూత కాలమూ, భవిష్యత్ కాలమూ ఉండవు. కేవలం వర్తమానం మాత్రమే అనుభవం లోకి వస్తుంది. మన చేతన అనే టార్చ్ వెలుతురు లో వర్తమానానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. దీని వలన, ‘నేను లేని స్థితీ లో మానసిక మైన కాలం ఉండదు. ఐతే ఈ ‘నేను లేని స్థితీ లో కలిగిన అనుభవాలు అధిభౌతికమైనవి కావు. భౌతిక అనుభవాలే ఆలోచనల అడ్డులేకుండా కలుగుతాయి. దీని వలన ఆ భౌతిక అనుభవాలకు ఒక విశిష్టత చేకూరుతుంది.మనిషి మామూలు చేతన లో ఉండగా ఇటువంటి అనుభవాలు కలుగవు. మామూలు చేతన పరిధి విస్తరించినపుడే ఈ అనుభవాలు కలుగుతాయి. అందువలన మనం వీటిని అధి-చేతన అనుభవాలు అనవచ్చు.

4. ఈ మహానుభావులకు కలిగిన అబుభవాలు కారణం లేనివి (acausal) గా చెప్పబడతాయి (మన విశ్లేషణ లో “విశ్వమూ, క్వాంటం ఫ్లక్చ్యుయేషన్స్” మొదలైనవి కారణం లేనివి గా తేలినట్లు).  దీనిని బట్టి ఆ అనుభవాలు అధి భౌతికమైన కారణాల వలన కలిగాయనిపిస్తుంది. అయితే, ఇప్పటివరకూ తెలియని భౌతిక కారణాల వలన కూడా ఈ అనుభవాలు కలిగి ఉండవచ్చును. కానీ ఈ “‘నేను’ ని వదిలిన మహానుభావులు” వారి అనుభవానికి కారణమైన అధి భౌతిక ప్రపంచాన్ని చూడలేదేమో! ఎందుకంటే అధిభౌతిక ప్రపంచం లో కార్య కారణ సంబంధాలు (మనము అనుభవించే విధం గా) ఉండవు. కాలం ఉండదు. కానీ మనిషికి సంబంధించిన ప్రక్రియలైన చూడటం, అనుభవించటం, ఇంద్రియానుభవాలూ, చేతనా అన్నీ అధి భౌతికమైనవివి కాదు. అవి కార్య-కారణ సంబంధాల పరిధి లోనే ఉంటాయి. భౌతిక స్థాయి లో మనిషి అణువులూ, ఎలక్ట్రాన్లూ మొదలైన వాటి తో తయారు చేయబడ్డాడు. ఇవన్నీ భౌతికమైన కాలానికీ, కార్య కారణ సంబంధాలకు లోబడే ఉంటాయి. వాటిలో అధిభౌతికత లేదు.అధిభౌతిక మైన విషయాలు మన కాలానికి లోబడి ఉండవు. కా బట్టీ ఈ మహా పురుషుల అనుభవాలు అలౌకికమైనవీ, అసాధారణమైనవీ అయినా అధి-భౌతిక మైనవి కాక పోవచ్చు.కానీ ఈ అనుభవాలకు ప్రేరణ మాత్రం అధిబౌతిక ప్రపంచం లో ఉంటుంది.

5. ఈ అధి భౌతికమైన విషయాలను తన ప్రత్యక్ష ఇంద్రియానుభవం లోకి తెచ్చుకొనే అవకాశం మనిషి కి రాకపోవచ్చు. ఒక బాక్టీరియాకు కామం, మోహం, ప్రేమా వంటివి ఎప్పటికైనా తెలుస్తాయా?

6.ఈ ఋషులలో కొంత మంది అద్భుతాలను చేస్తారు. వీరికి అయిన సత్యదర్శనం లానే, ఈ అద్భుతాలకు కూడా ప్రేరణ అధిభౌతిక ప్రపంచం లోనే ఉండవచ్చు.ఈ అధి భౌతిక ప్రపంచం పైన చెప్పిన మొదటి స్థాయి అధిభౌతిక ప్రపంచం మాత్రమే. రెండవ స్థాయి అధిభౌతిక ప్రపంచాన్ని స్పృశించటం కూడా మానవులకు సాధ్యం కాదు.

ఇప్పటివరకూ తెలియని భౌతిక కారణాల వలన కూడా ఈ అనుభవాలు కలిగి ఉండవచ్చును. కానీ ఈ అద్భుతాలన్నీ (గాలి లో తేలటం, భవిష్యత్తును చెప్పటం మొదలైనవి) భౌతిక ప్రపంచం లో జరిగేవే. ఒకప్పుడు అద్భుతాలుగా కనిపించేవి, సైన్స్ వృధ్ధి చెందిన తరువాత మామూలు విషయాలయ్యాయి (ఉదా: గాలి లో ప్రయాణం చేయటం). అదే విధం గా, వచ్చే కాలం లో,సైన్స్ “ఇలాంటి వాటిని కూడా సంభవమే” అని నిరూపించవచ్చు.

కాబట్టీ శాస్త్ర విజ్ఞానం ఎంత అభివృధ్ధి చెందినా, ‘అధి-భౌతిక’ ప్రపంచాన్ని మనిషి అనుభవం పరిధి లోకి తీసుకొని రావటం సంభవం కాకపోవచ్చు. అలా అని శాస్త్ర విజ్ఞానం అంతా దండుగ అని కాదు. భౌతిక పరిధి లో ఉన్న అనేక విషయాలు శాస్త్ర విజ్ఞానం పెరిగే కొద్దీ మన దైనందిన అనుభవం లో అవగాహన లో కి వస్తాయి.

ప్రకటనలు

11 thoughts on “జ్ఞానోదయాలు, అధిభౌతిక ప్రపంచం (metaphysical world), పరిపూర్ణ సత్యం మొదలైనవి..

 1. * ఉదాహరణ కి ఆధునిక కాలం లో జిడ్డు కృష్ణమూర్తి, యూ జీ కృష్ణమూర్తి, రమణ మహర్షి వంటి వారు ఇలాంటి అనుభవాలు పొందబడిన వారి గా నమ్మబడ్డారు.*
  సత్యసాయి బాబా ని మీరు ఏ తరగతికి చెందిన వారుగా పేర్కొంటారు?

  మెచ్చుకోండి

  1. ఒక మనిషి యొక్క లౌకికమైన మంచితనానికీ అతని ఇ ఉండే ఆధ్యాత్మిక శక్తులకీ పెద్ద సంబంధం ఉండకపోవచ్చునేమోనని నా అనుమానం. కాబట్టీ సాయి బాబా ధనరాసులను దాచి ఉంచటానికీ ఆయన శక్తులకీ సంబంధం లేదేమో! అలానే జిడ్డు కృష్ణమూర్తి రాజగోపాల్ భార్య తో మొసం గ ప్రేమాయణం నడపటానికీ ఆయన సత్యదర్శనానికీ సంబంధం ఉండకపోవచ్చు.వారికి ఒక్కో సారి ఈ అనుభూతులు కలుగుతాయి. ఆధ్యాత్మిక అనుభూతులు లేని సమయం లో వారూ మామూలు మనుషులే!ఇలాంటి వారు చెప్పే “నేను” లేక పోవటం మానసిక స్థితి కే వర్తిస్తుందీంటారు. భౌతికం గా ఆలోచనా, నేనూ అవసరమేనంటారు. నిర్వికల్ప సమాధి పొందిన వారు ఈ రకమైన చెడ్డ తనానికి ఒక మినహయింపు కావచ్చు. ఎందుకంటే అలాంటి వారు అన్ని కాలాలలోనూ “నేను” ని అధిగమించిన స్థితి లోనే ఉంటారు. వారు భౌతికం గా కూడా “నేను” ని అధిగమించి గాలి కూడా పీల్చకుండా ఉంటారు. కాబట్టీ వారు చెడ్డ వారయ్యే అవకాశం లేదు. (ఉదా:ముమ్మిడివరం బాలయోగి)

   ఒక గొప్ప ఆట గాడి వ్యక్తిత్వం గొప్ప గా లేక పోవచ్చు కదా. అలానే సృజనాత్మకత అనేదానికి మూలాలు అధిభౌతిక ప్రపంచం లో ఉన్నాయంటారు. గొప్ప సృజనాతమకత ఉన్న సైంటిస్ట్లు నిజజీవితం లో అంత మంచి వారు కాక పోవచ్చు.
   కానీ సాయి బాబా గారు ఒక వాచీ ని తన అంగీ చేతులలోంచీ తీస్తుండగా ఒక కెమేరా కి చిక్కింది. దానిని బట్టి ఆయన చేసేది కనికట్టేమో అని నా అనుమానం. కనికట్టూ నిజమైన శక్తులూ కూడా ఉండవచ్చు. మొత్తానికి తెలియదు అనే చెప్పాలి.
   ఆయన సత్యదర్శన స్థితి కి చేరారా? మనకు తెలియదు కదా? మనం స్పెక్యులేషన్ మాత్రమే చేయగలం.నా ఊహ లో దాని సంభావ్యత 50% .
   శ్రీరాం గారూ,
   పరమహంస యోగానంద గురించి చదివారా? ఆయన చెప్పే విషయాలగురించి మీ అభిప్రాయం ఏమిటి?

   మెచ్చుకోండి

 2. బొందలపాటిగారు,
  సత్యసాయి బాబా గారిని ఇద్దరు కృష్ణమూర్తులతోను,రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి తోను పోల్చకుడదు. బాబా గారు తన ఇచ్చవలన మానవుడిగా పుట్టాలను కొని పుట్టిన తరగతికి చెందిన మాహాత్ముల కోవకు చెందుతారు. దత్తా త్రేయుడు మొద||. ఇక మనం చదివే మిగతావారందరు మానవుని గా పుట్టి జ్ణానోదయం అయినతరగతి కి చెందినవారు. వారి జీవిత చరిత్రలను చదివినపుడు అది మనలను ఆకర్షిస్తుంది. ఎందుకంటే వారు సాగించిన అన్వేషణ, సమకాలిన పరిస్థితులలో వారు ఏవిధంగా ప్రవర్తించారు అనేవి మనకు చాలా దగ్గరగా అనిపించి వారి చేత ఆకర్షించ బడుతాము. ఇక సత్య సాయిబాబా గారి జీవితాన్ని చూస్తే ఆయన తన 14వ సం|| నుంచే విద్య మానివేసి అవతార ప్రకటన చేశాడు. ఎక్కడా నాకు జ్ఞానోదయం అయిందని అనే మాటలేదు. అతను గురించి విన్నపుడు వెంటనే నమ్మ బుద్ది అవదు, కారణం ఎమీ ప్రయత్నం లేకుండా జ్ఞానోదయం ఎలా అయిందా అని సందేహాలు మొదలు అవుతాయి. పట్టి పట్టి చూసిన వారికి అందులోని మర్మం అర్థమౌతుంది. బాబా గారు ఎంతో మందిని యు జి దగ్గరకి పంపారు. అందులో ముఖ్యులు సత్యసాయి విద్యా సంస్థలను స్థాపించిన హిస్లాప్ గారు ఒకరు. ఇతను బాబా గారి మీద ఎన్నో పుస్తకాలు రాశారు. ఈ మధ్య ముకుంద్ రావు గారు రాసిన కొత్త పుస్తకంలో యు జి గారిని కేలామిటి తరువాత ఇంటర్వ్యూ చేసిన మొదటి వ్యక్తి హిస్లాప్ గారే! బాబా గారికి అందరు అనుకొనే విధంగా శిష్యులనుంచి డబ్బులు తీసుకొనే గురువైతే యు జి లాంటి వారిదగ్గరికి పంపరు కదా! రజనీష్ కి యు జి గారంటే పడేది కాదుకదా!

  A Visitor: These miracles that Swami does by moving His hand and out come very costly things from nowhere. Is there some explanation?
  SAI: Some objects Swami creates in just the same way that He created the material universe. Other objects, such as watches, are brought from existing supplies. There are no invisible beings helping Swami to bring things. His sankalpa, His divine will brings the object in a moment. Swami is everywhere.

  మెచ్చుకోండి

  1. బొందలపాటిగారు,
   ఆ వీడీయోనే కాదు, యుజి గారి ఆడియోలన్ని కూడా విన్నాను. ఆయన సత్య సాయిబాబా గారిని అలా అన్నాడని తెలుసు. వారినే కాదు ఆయన 1990 తరువాత రమణ మహర్షిని, రామకృష్ణ పరమహంసని కూడా విమర్శించాడు. మొదట్లో వీరి ఇద్దరిని ఎంతో గౌరవం తో సంభోదించిన యు.జి. చివరి దశలో అలా అనటానికి ఒక్కోక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకొంటారు.

   మెచ్చుకోండి

 3. *పరమహంస యోగానంద గురించి చదివారా? ఆయన చెప్పే విషయాలగురించి మీ అభిప్రాయం ఏమిటి?*
  బొందలపాటిగారు,
  ఒక యోగి కథ గురించే కదా మీరు అడిగేది. చిన్నపుడు చదివినపుడు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది కాని ఇప్పుడు ఎమీ ఆశ్చర్యం కలిగించదు. ఒక మనిషి రెండు చోట్ల ఉండటం లాంటివి, ఇవేవి పెద్ద విషయాలు కాదు. అవన్ని అతి మామూలు చిన్న, చిన్న విషయాలు. అన్నిటి కన్నా గొప్ప విషయం సాధారణ మానవుడిగా జీవించటం. అంటే భార్యా పిల్లలు ఉన్నవారు, ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించకుండా, బందుమిత్రులను, చేతనైతే ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఆనందంగా ఉండటం ఎంతో గొప్పవిషయం. దీనిని ఆచరించి చూపిన వారు శ్రీ ఎక్కిరాల భరద్వాజా గారు. ఇతనిని కలవక పోయినా వీరిగురించి నేట్ లో చదివినాను. గురు చరిత్ర ను తెలుగులో రాశారు. ఇతను గృహస్తులకు మంచి రోల్ మోడల్.

  మెచ్చుకోండి

  1. “ఒక మనిషి రెండు చోట్ల ఉండటం లాంటివి, ఇవేవి పెద్ద విషయాలు కాదు. అవన్ని అతి మామూలు చిన్న, చిన్న విషయాలు.”
   అయితే మీరు చేసి చూపించండి సార్! 🙂
   అన్నిటి కన్నా గొప్ప విషయం సాధారణ మానవుడిగా జీవించటం.
   మన ప్రజలలో చాల మంది చేసేది ఇదే కదా..!

   “అంటే భార్యా పిల్లలు ఉన్నవారు, ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించకుండా, బందుమిత్రులను, చేతనైతే ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఆనందంగా ఉండటం ఎంతో గొప్పవిషయం.”
   ఇప్పుడెమో గానీ, డెబ్బైలవరకూ ఎక్కువ మంది జనాలు ఇలానే బ్రతికే వారు.

   మెచ్చుకోండి

 4. *అయితే మీరు చేసి చూపించండి సార్!*
  దీనిని బట్టి చూస్తే మీకు ఇటువంటి విషయాల మీద చాలా క్యురియాసిటి ఉన్నాదని తెలుస్తున్నాది. ఈ క్యురియాసిటి పోతే మీరే అందరికి నాలుగు చోట్ల కనిపించారని మీకు తెలిసిన వాళ్ళు మీమీద పుస్తకాలు రాస్తారు :-). నేను చూపించాల్సిన అవసరమేలేదు. మీకే అర్థమైపోతుంది.

  మెచ్చుకోండి

 5. కాశ్మీరీ శైవిజం గురించి విట్టుమ్నప్పుడు, లక్షమణ జూ గారు చెప్పె స్థితికి యు జి గారు చెప్ప్తున్న స్థితికి గల సామ్యం అర్థం చేసుకోండి.
  Pratibimbavada – The theory of reflection – from Abhinavagupta’s Paramarthasara

  UG Krishnamurti

  మెచ్చుకోండి

 6. శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా సర్వత్రా సమత్వాన్ని చూసే యోగి అన్ని ప్రాణులలో తననీ, తనలో అన్ని ప్రాణులనూ చూస్తాడు.
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సు చంచలమైనది, భాధా కరమైనది, బలమైనదీ, గట్టిదీ గాలిని అణచడంలాగే దీనిని నిగ్రహించడం కూడా కష్టమని నేను భావిస్తాను.
  శ్రీ కృష్ణా భగవానుడు ఇలా అన్నాడు: అర్జునా- సందేహం లేదు. మనస్సుని నిగ్రహించడం చాలా కష్టం. అది చలిస్తుంది.
  శ్రీ కృష్ణా భగవానుడు ఇలా అన్నాడు: అర్జునా- ఒక్కడే సత్యం ఆత్మతత్త్వము భోదపడుతుంది. ప్రతీ హృదయంలో భగవానుడున్నాడు. ఎవరినీ కష్టపెట్టే మాటలు మాట్లాడకు. అంధకారబంధురమైన హృదయంలో దీపాన్ని వెలిగించి, అందు సదా ధ్వనించే ప్రణవనాదాన్ని ఆలకించు అని శ్రీ కృష్ణా భగవానుడు చెప్పియున్నాడు
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా ప్రశాంతమైన మనస్సుతో కూడి బ్రహ్మ స్వరూపుడైన యోగికి ఆత్మ సంబంధమైఅన ఉత్తమ సుఖం లభిస్తుంది.
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సుని(బాహ్య ప్రపంచమ్నుండి మళ్ళించి)శాంతింప చేయాలి. మనస్సుని ఆత్మలో నిలిపి తదితరమైనది ఏదీ తలచుకోకూడదు.

  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా ఆత్మను తెలుసుకోవాలి
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సునిలకడ లేని చంచలమైన మనస్సు ఏఎక్కడెక్కడికి పోతుందో, అక్కాడక్కడనుండి దానిని తీసుకు వచ్చి ఆత్మలో నిలబెట్టాలి.
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా సాధన ద్వారా నిగ్రహింప బడిన మనస్సు ఎక్కడ ఉపశమనము పొందుతుందో, ఎక్కడ తనలోతాను ఆత్మస్వరూపాన్ని చూస్తూ(యోగి) ఆనందిస్తాడో,
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సును నిగ్రహించి యోగి ఇలా ఎప్పుడూ సాధన లో మనస్సునిలిపి, నాలో ఉన్నదీ, మోక్షరూపమైనదీ అయిన మనస్సుశాంతిని పొందుతాడు
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సును ఏకాంతంలో ఉండి ఇంద్రియాలను నిగ్రహించి, ఆశాపరిగ్రహాలను విడిచి యోగి నిత్యం మనస్సుని ఆత్మలో లయం చేయాలి.
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా తన్ను తానే ఉద్ధరించుకోవాలి అధోగతికి జారనివ్వకూడదు. తనకు తానే బంధువు. తకుతానే శతృవు. స్వాధీనమైన మనస్సు అతని బంధువు. స్వాధీనంలో లేని మనస్సు అతనికి శతృవై శతృత్వంతో వర్తిస్తుంది మంచివాళ్ళు, మిత్రులు, శత్రువులు, తటస్తులు, మధ్యవర్తులు, ద్వేషించదగిన వారు బంధువులు, సజ్జనులు పాపులు అందరి పట్ల సమభావంతో ఉన్నవాడు
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సుసంకల్పం ఉన్నచోట మనస్సు ఉంటుంది.
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా తన్ను తానే ఉద్ధరించుకోవాలి ఆత్మానుభూతి
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా మనస్సు నిలవలేని మంద బుద్ధి ఇహపరాలు రెంటికీ భ్రష్టుడై చెదిరిన మేఘంలాగా నశించి పోడా?
  శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: అర్జునా ఈ ప్రపంచానికి సృష్టికర్త,భగవంతుడే. ఆయన సర్వవ్యాపి సర్వ శక్తి సమన్వితుడుమరియు సర్వ జ్ఞాని
  ఆయన్ని బ్రహ్మ ‘ఈశ్వర’ పరంబ్రహ్మభగవంతుడు ఆత్మ ఈ నిర్గుణ బ్రహ్మ అంటారు పేర్కొన్నమాట వాస్తవమే

  దైవ ప్రార్ధనలో తన స్వార్ధం విడచి జనహితాన్ని కోరుకోవాలి. జనహితంకోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి. మనస్సు, మాట, శరీరం, పని లోకహితార్ధమై వుండాలి. నేలమీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి – బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు వున్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించి నమస్కరించాలి.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s