స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.

స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.

ఒక మనిషి ఆలోచనలనూ, ప్రవర్తననూ ఆ మనిషి జీవించే సమాజ వ్యవస్థ లోని భౌతికమైన కారణాలు ప్రభావితం చేస్తాయి. ఈ భౌతికమైన కారణాలు మారినప్పుడు ఆ మనిషి ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది.అదే విధం గా ఆలోచనల వలన వ్యవస్థ మారటం కూడా జరుగుతుంది. కానీ వ్యవస్థ అందుకు సిధ్ధం గా ఉన్నప్పుడే ఈ మార్పు జరుగుతుంది.

స్త్రీల మీది వివక్షకు కారణాలు మధ్య యుగాలలోని పరిస్థితులలో ఉన్నాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటం, సమాజం నిరంతర యుధ్ధాలలో మునిగి తేలుతుండటం, స్త్రీ కి శారీరకం గా సంతానాన్ని కనటం, రుతు క్రమం  మొదలైనవి స్త్రీ మీది పురుషుల ఆధిపత్యానికి మూల కారణాలు.
(తెలుగు భాష మూలాలు మధ్య యుగాలలోనే ఉన్నాయి. ఆ రోజుల్లో స్త్రీ ని ఒక రక్షించుకొన వలసిన సంపద గా భావించే వారు. ఒక జంతువు నో, వస్తువునో, బండినో అన్నట్లు గానే స్త్రీ ని “వచ్చింది” అంటారు. అదే స్త్రీ ఏ రాజు గారి భార్యో అయితే సేవకుడు “వచ్చారు” అని పుం లింగం లొ పిలిచినట్లు గా పిలిచే వారు. ఇంగ్లీష్ లో ఈ మధ్య స్త్రీ వాదులు ఆక్ట్రెస్ అనే పదాన్ని వాడటం లేదు. వారు ఆడ వారిని ఆక్ట్రెస్  అని పిలవటం లింగ వివక్ష కు నిదర్శమ్నం అని అంటున్నారు.స్త్రీ ని కూడా ఆక్టర్ అని పిలవాలని అంటున్నారు. ఇక తెలుగు లో ఆడ వారిని కూడా “వచ్చాడు” అని పిలవమనే కాలం ఎంతో దూరం లో లేదనుకొంటా.)
ఇక అసలు విషయానికి వస్తే, భారతీయ సమాజం సమాజం లో  రాజారామమోహన రాయలు, ఆంధ్ర సమాజం లో కందుకూరి వీరేశలింగం పంతులు మొదలైన వారి సంస్కరణల వలన స్త్రీ విధ్య తో స్త్రీ జనోధ్ధరణ మొదలైంది. తరువాత వచ్చిన స్వతంత్రం వలన ప్రజాస్వామ్యమూ, వోటు హక్కూ స్త్రీలకు వచ్చాయి.  మగాడు చేసే పని లో శారీరకమైన శ్రమ తగ్గిపోయింది. తెలివితో చేసే పని ఎక్కువయ్యింది. స్త్రీలు కూడా ఆ పని చేయటం లో ఏ విధం గానూ తక్కువ వారు కాదు.వీటన్నిటి పర్యవసానం గా స్త్రీ కి ఆర్ధిక స్వాతంత్ర్యం ఒనగూడింది.(స్త్రీలు ఉద్యోగాలు చేస్తే లేబర్ సప్లై ఎక్కువై, లేబర్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టీ కాపిటలిస్టు లు కూడా స్త్రీ సమానత్వాన్ని ప్రోత్సహించారు. స్త్రీ ఇంట్లో చేసే వంట ని కమర్షియలైజ్ చేసి, మెక్డోనాల్డ్స్ వంటి వాటి తో లాభలు పండించే అవకాశం వలన కూడా కాపిటలిస్ట్ ల కి ఉపయోగమే ! )  ఆర్దిక స్వాతంత్ర్యం లేకుండా స్త్రీ వాదాన్ని ఆచరణ లో పెట్టటం స్త్రీలకు కష్టమైన పని. గర్భనిరోధక సాధనాల వలన పిల్లలను కనటం మీద స్త్రీ కి అదుపు ఏర్పడింది. దీని వలన స్త్రీ కి తన ఉద్యోగం, జీవితం పై నియంత్రణ పెరిగింది.ఈ అన్ని కారణాల వలన స్త్రీ పురుష సమానత్వం అనేది సమాజం లో వచ్చిన ఒక పరిణామం.కానీ పాత అలవాట్లు అంత త్వరగా వదలవు కొంత మంది మగ వాళ్ళు ఇంకా మారిన పరిస్థితులను అర్ధం చేసుకోలేక పోవటం వలన,పాత అలవాట్లను ఒదులుకోలేక పోవటం వలన పురుషాధిక్య భావజాలాన్ని కలిగి ఉన్నారు. చాలా మంది మగ వాళ్ళూ స్త్రీ పురుష సమానత్వాన్ని స్వాగతించారు. మగ వారు సమానత్వాన్ని స్వాగతించకపోతే సమానత్వం అనేది ప్రస్థుత సమాజపు ఒక విలువ గా స్థిర పడేది కాదు.
పై చెప్పిన కారణాలన్నింటి వలనా మగ వారి తో  సమానం గా విద్యావంతులైన ఆడవారు కొంత మంది మగ వాళ్ళ లో గూడు కట్టుకొన్న ఆధిపత్య భావన కు వ్యతిరేకం గా స్త్రీ వాదాన్ని ముందుకు తెచ్చారు. ఇదే స్త్రీ వాదాన్ని ఏ మధ్య యుగాలలో నో ముందుకు తెచ్చే పరిస్థితి లేదు. ఒక వేళ ద్రౌపది వంటి ఏ స్త్రీ వాదో కొన్ని ప్రశ్నలు అడిగినా అది అప్పటి సమాజాన్ని ఎంత మార్చగలిగిందో మనకందరికీ తెలుసు. స్త్రీ వాదం లేక పోయినా ఈ సమాజం లోని ప్రజాస్వామ్య శక్తుల దృష్ట్యా, మారిన పని స్వభావం దృష్ట్యా స్త్రీ పురుష సమానత్వం వైపుకి మన సమాజం అడుగులు వేస్తోంది అనటం లో ఏ మాత్రం సందేహం లేదు.
స్త్రీ వాదం వివక్ష చూపించే పురుషుల పై పోరాటం జరిపి సమానత్వ సాధనను వేగ వంతం చేస్తుందనేదాంట్లో కూడా ఏ మాత్రం సందేహం లేదు.
కానీ స్త్రీ వాదులు రెండు గుంటలలో పడే ప్రమాదం ఎక్కువ గా కనిపిస్తోంది. ఒకటి పురుషుల నందరినీ స్త్రీ వ్యతిరేకులు గా అర్ధం చేసుకొని ఆ విధమైన ప్రచారం సాగించటం. రెండవది ఆధిపత్యం కోసం ప్రయత్నించటం. వీటి వలన స్త్రీ పురుష వర్గాల మధ్య ద్వేషపూరితమైన ఆధిపత్య పోరు మొదలై అసలుకే మోసం వచ్చి, మళ్ళీ సమాజాలు మధ్య యుగాలలోకి జారి పోయే ప్రమాదం ఉంది. స్త్రీ వాదం చాలా వరకూ పట్టణాల లోని ఉన్నత తరగతి స్త్రీ ల నుంచీ వస్తోంది. వీరు పురుషాధిపత్యం ఎక్కువ గా ఉన్న గ్రామాలలోకి తమ ఉద్యమాన్ని తీసుకొని అక్కడి ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి. కాని మన గ్రామాలలో స్త్రీ ల కు ఆర్ధిక స్వాతంత్ర్యం లేని కారణం గా వారి జీవితాలలో నయా స్త్రీ వాదం ఎంతవరకూ మేలు చేస్తుందో సందేహాస్పదం.
ఇక దళిత వాదం విషయానికి వస్తే,  పోడు వ్యవసాయ వ్యవస్థలో ఎక్కువ భూమిని ఆక్రమించి వ్యవసాయం చేసిన వాళ్ళూ భూస్వాములయ్యారు. వారికి ఎక్కువ కులం ఇచ్చి కుల వ్యవస్థ ఆదరించింది. అదేవిధం మొదటి నుంచీ ఇక్కడి వారైన దళితులు కూలీలు గా మిగిలి పోవలసి వచ్చింది. అప్పటి కుల వ్యవస్థ ను అప్పటి భాహ్మణులు రాజులూ సమర్ధించారు. కానీ ఈ వ్యవస్థ లో కూడా అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వలనా, ప్రజాస్వామ్యం వలనా అసమానతలు తగ్గాయి. కానీ ఇక్కడ చేయవలసింది చాలా ఉంది, ముఖ్యం గా గ్రామా ల లో భూమి లేని దళిత వ్యవసాయ కూలీ ల విషయం లో.
ఇక దళితవాదం ఆధిపత్య భావజాలాన్ని ఎదుర్కోవలసిందే. కానీ ఆ భావం లేని అగ్రకులస్థుడి  దగ్గరికి వెళ్ళి వాడికులాన్నితిట్టడం తగదు. దీని వలన ఉద్యమమే కొంతమంది సమర్ధకులనూ, సానుభూతిపరులనూ కోల్పోతుంది. ఇది ఉద్యమానికే నష్టం.ఉద్యమకారులు పోరాటాల గురించిన నిర్ణయాలు తీసుకొనే ముందు, ఈ విధమైన నష్టాన్ని కూడా పరిగణన లోకి తీసుకొంటే మంచిది.
ఇక స్త్రీ వాదులు కానీ దళిత వాదులు కానీ తమ పోరాటం ఆధిపత్య భావజాలం మీద కానీ వ్యక్తుల మీద కాదు అంటారు. కానీ ఆధిపత్య భావజాలం వ్యక్తుల బుర్రలలో ఉంటుంది. కాబట్టీ చివరికి వ్యక్తులను లక్ష్యం చేసుకోవటం ఒకానొక దశ లో తప్పదు.ఇలాంటి దశ లో పైన ఉండే సిధ్ధాంత కర్తలకు ఉన్న క్లారిటీ రోడ్డు పైనా, ఊళ్ళలోనూ పోరాటాలూండే సామాన్యులకు ఇది అర్ధమయ్యే అవకాశం తక్కువ. దీనివలన క్షేత్ర స్థాయి లో ఉద్యమ లక్ష్యాలకు విరుధ్ధమైన హింస చోటుచేసుకోవచ్చు.
అదే విధం గా ఆధిపత్య పోరాటాల వలన ఒనకూడే ప్రయోజనం సున్నా. వీటి వలన ఎదుటి వారు అంతా ఏకమయ్యి మళ్ళీ తిరోగమనానికి దారి తీయవచ్చు.

ఓ అమెరికా వాడి రైలు బండి

ఒక ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ

ప్రకటనలు

29 thoughts on “స్త్రీ, దళిత వాదాల ప్రయోజనాలూ,నష్టాలూ పరిమితులు.”

 1. *ఈ వ్యవస్థ లో కూడా అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ల వలనా, ప్రజాస్వామ్యం వలనా అసమానతలు తగ్గాయి*
  Reservations were not introduced by అంబేద్కర్. Nehru introduced it. Upper caste leadres did not say one word against it when it was introduced. They reposed faith on Nehrus decision. But credit was taken అంబేద్కర్.

  మెచ్చుకోండి

 2. I think in the first part of the comment you wereright. But, abedkar was also a legal luminary. Whether he was a dalit or not,whether some uppercastes supported him in his education or not he was a competent intellectual. By that time, he had gone to Newyork and studied the race problem there.

  So, Ambedkar also, as the head of the constitution committe deserves some credit.

  మెచ్చుకోండి

 3. బొందలపాటి గారు,
  చక్కటి వివరణ. Reverse discrimination అనేది ఇంతవరకూ సంపాదించిన దాన్ని పోగొడుతుందే తప్ప ఉద్యమానికి మేలు చేకూర్చదు. ఎందుకంటే ఇక్కడ ఆడ మగా కలిసి బతకవలసిన వాల్లు, యుద్దం చేసుకునే ఇద్దరు శత్రువులు కాదు.

  మెచ్చుకోండి

 4. Now a days dalits started praising Ambedkar too much. Now a days when it comes to reservations they are attributing entire credit to him. But it was not so at that time.
  I do agree with your above comments. Please read this book Worshipping False Gods – Arun Shourie

  మెచ్చుకోండి

 5. I read some article about this book long back. I’ll see if I could get a copy.
  Recently I happen to read some work of Ambedkar. He was completely against the reservations in the present form. He was more progressive than many Dalit intellectuals today. Ofcourse the seeing things only from dalit viewpoint is always there in his writings

  మెచ్చుకోండి

 6. రాజ్యాంగం రాసింది అంబేడ్కర్ కాదు. అదొక దళితప్రచారం. రిజర్వేషన్లు ఇచ్చింది కూడా అంబేడ్కర్ కాదు. రాజ్యాంగరచన అయిపోతూన్న చిట్టచివరి దశలో అంబేడ్కర్ ఆ కమిటీలోకి రంగప్రవెశం చేశాడు. ఒరిజినల్‌గా రాజ్యాంగం రాసింది రాజ్యాంగసభలో సభ్యులైన అప్పటి బ్రాహ్మణ బారిష్టర్లు. వాళ్ళు అంతా కలిపి 150 మంది కంటే ఎక్కువే ఉంటారు. వాళ్ళు ఆనాటి రాజసంస్థానాల్లో దివాన్‌లు (ప్రధానమంత్రులు) గా ఉండి తమ యజమానుల (భారతీయ రాజుల) అనుమతితో రాజ్యాంగసభలో సభ్యత్వం పొందారు. అయితే వాళ్ళంతా ఇంగ్లీషు చదువులు చదువుకొన్న అభ్యుదయవాదులు, ఉదారవాదులు కావడం వల్ల మనకిప్పుడు ఈ రూపంలో రాజ్యాంగం సిద్ధించింది. ఈ రిజర్వేషన్లు ఇచ్చింది కూడా ఆ బ్రాహ్మణులే. అంబేడ్కర్ కి క్రెడిట్ ఇవ్వడమ్ వేస్ట్.

  మెచ్చుకోండి

 7. అయ్యా ఓబుల్ రెడ్డిగారూ,
  రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మెన్/అధ్యక్షుడు అంబేద్కర్. ఎంత మంది మెంబర్లు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నా క్రెడిట్ ఎప్పుడూ అధ్యక్షుడికే వస్తుంది. అంబేద్కర్ కమిటీని చెయిర్ చెయ్యడంతోపాటూ constituent assembly చర్చల్లో డ్రాఫ్ట్ లోని ప్రతిపదాన్నీ ప్రతి వాక్యాన్నీ విశదపరిచి చర్చించాడు. He led the entire session that lasted for 166 days.

  మీ వాదన బ్రాహ్మణులకు “మాత్రమే” క్రెడిట్ ఇవ్వడమే అయితే, let me inform you that more than 30 dalit members were there in the committee.

  అంబేద్కర్ దేశభక్తుడేకాదు ఒక జాతికి నాయకుడు . కొన్ని వేల సంవత్సరాలు సామాజికంగా,ఆర్ధికంగా,రాజకీయంగా అణగదొక్కబడిన జాతికి ఒక ఆశని, కొత్త శ్వాసని కల్పించిన నాయకుడు. మేధావి, రిఫార్మర్, ఒక ఐకాన్. Before passing judgments on such an individual please get you facts right.

  మెచ్చుకోండి

 8. ఓబుల్ రెడ్డి gaaru,
  రిజర్వేషన్లకు క్రెడిట్ అంబేద్కర్ కు ఇవ్వక పోతే, “ఈ రిజర్వేషన్ల సమస్య అంతటికీ కారణం అంబేద్కర్”, అని నిందించటం సరి కాదు. అప్పుడు “ఈ రిజర్వేషన్లకంతటికీ ఆ 150 మంది బ్రాహ్మణులు కారణం అనో, లేక నెహ్రూ కారణం అనో” నిందించాలి.

  మెచ్చుకోండి

 9. “రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మెన్/అధ్యక్షుడు అంబేద్కర్. ఎంత మంది మెంబర్లు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నా క్రెడిట్ ఎప్పుడూ అధ్యక్షుడికే వస్తుంది. ”

  అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి మాత్రమే ఛైర్మన్. రాజ్యంగసభకు అధ్యక్షుడు డా. బాబు రాజేంద్రప్రసాద్. ఆ లెక్కన చూస్తే అంబేడ్కర్ కు ఇవ్వాల్సిన క్రెడిట్ బాబు రాజేంద్రప్రసాద్ కే దక్కాలి.

  మెచ్చుకోండి

 10. నేను దళితవాదం కంటే స్త్రీవాదాన్నే బలంగా నమ్ముతాను. మనిషి జీవితంలో కులం, మతం కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తాడు కాబట్టి కులం నా దృష్టిలో పెద్ద సమస్య కాదు. స్త్రీవాదం అనేది complexed issue. దాని గురించి చర్చించాలంటే చాలా ఉంది. అందుకే నేను స్త్రీవాదం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ పెట్టుకున్నాను. దళితవాదం మాత్రం పెద్ద ఇష్యూ కాదనే నమ్ముతాను. కానీ కొంత మంది దళితవాదం విషయంలో నా వాదనకి అభ్యంతరం చెప్పొచ్చు. కులాంతర వివాహాలు ఇప్పుడు కూడా జరగడం లేదంటారు. ఒకే కులంలోని డబ్బున్నవాళ్ళు పేదవాళ్ళని పెళ్ళి చేసుకుంటారా? అలా చేస్తే తమ ఆస్తి మీద పెళ్ళి చేసుకోబోయే వ్యక్తికి హక్కు వస్తుందని ఆస్తిలో భాగం ఇవ్వడం ఇష్టం లేక కావచ్చు లేదా సమాజంలో స్టేటస్ మెయింటెయిన్ చెయ్యడానికైనా కావచ్చు. ఏమైనా మనిషి కులం, మతం కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇవ్వడం కనిపిస్తోంది. ఒకే కులంవాళ్ళు ఉండే monocaste villages లేదా monocaste streets సంగతి అటుంచితే ఇతర గ్రామాలు లేదా పట్టణాలలో కులం పేరు పైకి చెప్పుకుంటేనే తెలుస్తుంది కానీ చెప్పుకోకపోతే తెలియదు కదా. మనిషి తన జీవితంలోని చాలా సందర్భాలలో కులంతో సంబంధం లేకుండానే బతుకుతాడు. కనుక కులం పెద్ద ఇష్యూ కాదు.

  మెచ్చుకోండి

 11. దళితవాదం అనేది చాలా విషయాలలో పరిమిత వలయాలు ఉన్నది. అగ్రకుల భూస్వామి పొలంలో దళితుడు పాలేరు(కంబారి)గా పని చేసే పరిస్థితి ఉండకూడదు, నిజమే. కానీ అగ్రకులంవాడు తన కులానికి చెందిన పేదవాణ్ణి కూడా పాలేరుగా పెట్టుకోగలడు. భూస్వామ్య లేదా అర్థభూస్వామ్య వ్యవస్థ (feudal or semi-feudal system)ఉన్నంత వరకు ఒకరి పొలంలో ఇంకొకరు పాలేరుగా పని చేసే పరిస్థితి ఉంటుంది. దళితుడు ఎన్నికలలో గెలిచి సర్పంచ్ అయ్యి డబ్బు సంపాదించాడనుకుందాం. అప్పుడు ఆ దళిత సర్పంచ్ కూడా తన పొలంలో పాలేర్లని పెట్టుకుని పని చెయ్యించుకుంటాడు. కుల సంబంధాలు కొంచెం మారుతాయి కానీ దోపిడీ సంబంధాలు మారవు, అంతే.

  మెచ్చుకోండి

 12. ఆ నా పోస్టులని చదివేవారు ఎవరు ఉంటారు లే అనుకొన్నాను. చదివినా ఎవరికి గుర్తు ఉంటుంది లే అనుకొన్నాను. 🙂
  ఇంతకుముందు టపా ని మళ్ళీ పోస్ట్ చేయటం రాదు. ఇప్పుడు వచ్చింది.
  అస్తిత్వ వాదాల గురించిన టపాలు ఈ మధ్య స్త్రీ వాదం గురించి చర్చ నడిచిన నా ఇంకొక టపా కి రెలవంట్ గా ఉంది అనిపించి, ఇవాళ మళ్ళీ పోస్ట్ చేశాను.
  సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ రాసింది నా బ్లాగ్ పెట్టిన కొత్తలో (2 సంవత్సరాల కిందట). అప్పట్లో ఒక్కోటపా కీ ఓ 50-100 హిట్స్ మించి రాలేదు.చాలా భాగాలకి కామెంట్స్ రాలేదు. ఇప్పుడు బ్లాగ్లోకం లో నా పేరు కొంచెం తెలుసు కనుక, ఎక్కువ మంది చదువుతారేమో అనే వీక్నెస్ తో దాన్ని పోస్ట్ చేస్తున్నాను. ఏమైనా ఉపయోగపడే కామెంట్స్ వస్తాయేమో, ఎవరైనా పొగుడుతారేమో అనే వీక్నెస్ కూడా ఉంది. ఆ కథని ఒక పత్రిక అతను సీరియల్ గా వేయటానికి ఎంచుకొన్నాడు. అయితే ఈ మధ్య జరిగిన కొన్ని సూచనల వలన ఈ కథని ఆ పత్రిక సీరియల్ క్యూ లోంచీ తీసి వేసినట్లు గా నాకర్ధమయింది. సరే అలాంటప్పుడు ఇంకోసారి పోస్ట్ చేద్దాం అనుకొన్నాను. ఒక నవల ప్రింటింగ్ కి ఇస్తే ఒక వెయ్యి కాపీలతో మొదలు పెడతాం. ఈ కథని కూడా ఆన్లైన్ లో ఒక వెయ్యిమంది చదివితే సరిపోతుంది కదా అన్న ఒక చిన్న స్వార్ధం కూడా ఒకటి.
  రీపోస్ట్ చెయ్యటం కొంత బేసిక్ డీసెన్సీ కి విరుధ్ధమని తెలుసు. కానీ పైన చెప్పిన బలహీనతలతో మళ్ళీ పోస్ట్ చెయ్యాలనిపించింది.

  మెచ్చుకోండి

 13. నా షాప్‌లో ఒక అమ్మాయి పని చేసేది. ఆమె అగ్రకులానికి చెందిన అమ్మాయే. ఆమెని ఓ ప్రశ్న అడిగాను “పక్కనే ఉన్నది రెల్లి వీధి, అది దళితవాడ. మీరు రోడ్ ఫుట్ పాత్ మీద నిలబడి బస్ కోసం చూస్తున్నప్పుడు మీ పక్కన ఒక వ్యక్తి నిలబడ్డాడనుకుందాం, అతను దళితుడని తెలిస్తే మీరు పక్కకి తప్పుకుంటారా?” అని. అప్పుడు ఆమె ఇలా సమాధానం చెప్పింది “కులం పేరు అనేది చెప్పుకుంటేనే తెలుస్తుంది కదా, రోడ్ దళితవాడ మీదుగా పోయినా రోడ్ మీద నడిచేవాడు దళితుడో, అగ్రకులంవాడో అనేది ఎలా తెలుస్తుంది?” అని. కులానికే ప్రాధాన్యత ఇస్తే చాలా పనులు జరగవు. అందుకే అగ్రకులాలవాళ్ళు కూడా చాలా సందర్భాలలో కులాన్ని పక్కన పెడుతుంటారు. దళితవాదం అనేది ఆర్థిక కోణంలో ఉంటే దానితో దళితులకి ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక అంశాల గురించి పట్టించుకోకుండా కేవలం అంటరానితనం నిర్మూలనే అజెండాగా పెట్టుకుంటే దళితులకి ఒరిగేది ఏమీ ఉండదు.

  మెచ్చుకోండి

 14. ఆ రెండు కథలను ప్రచురణకు తేవాలనుకుంటే ఓసారి ‘కినిగె’ వారిని సంప్రదించండి కాకపోతే ఈ-పుస్తకంగా వస్తుంది. వివరాలకు రెహ్మానుద్దీన్ (nani1only@gmail.com ) అడగండి. తను మీకేమైనా సుచించగలడు 🙂

  మెచ్చుకోండి

 15. నేను చాలా సార్లు ఓ విషయం చెప్పాను “నేను గిరిజన జాతి నుంచి వచ్చాను” అని. మేము గిరిజనులమనే విషయం మా వీధిలో ఎవరికీ తెలియదు. అటువంటప్పుడు నన్ను కులం పేరుతో ఎవరు దూషిస్తారు? ఎప్పుడో 1975 టైమ్‌లో మా తాతయ్య గారు (అమ్మవాళ్ళ నాన్నగారు) పార్వతీపురం నియోజక వర్గానికి ఎం.పి.గా పని చేశారు. ఆ తరువాత కొత్తూరు నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 1990 తరువాత తిరిగి ఎన్నికలలో గెలవలేదు. అప్పటి నుంచి ఆయన మాజీగానే ఉన్నారు. ఫలానా మాజీ ఎం.పి.గారి మనవడు అంటే కొంత మందైనా నన్ను గుర్తు పడతారు కానీ ఫలానా కులంవాళ్ళ అబ్బాయి అంటే మా వీధిలో నన్ను ఎవరూ గుర్తు పట్టరు. సామాజిక వెనుకబాటుతనం అంటారా? మా తాతయ్య గారు నివసించిన గ్రామంలో మూడు గిరిజన కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. రెండు ధనిక గిరిజన కుటుంబాలు, ఒకటి ఆ రెండు కుటుంబాల వంటవాడి కుటుంబం. ఆ గ్రామంలో ఎక్కువ మంది OBCలు. కానీ ఆ OBCలు ఒకప్పుడు గిరిజనుల కింద పాలేర్లుగా పని చేసేవాళ్ళంటే నమ్ముతారా? మీరు నమ్మకపోయినా అది నిజం. కింది కులంవాళ్ళు పై కులంవాళ్ళని దోచుకోగలరు అని నిరూపించడానికి ఈ విషయం చెపుతున్నాను, అంతే. ఆ గ్రామం చుట్టూ ఒకప్పుడు 1500 ఎకరాలు మొఖాసా భూమి ఉండేది. ఆ మొఖాసా భూమి బ్రిటిష్‌వాళ్ళ మోచేతి నీళ్ళు తాగిన బాడంగి శృంగారరాయుడు అనే గిరిజనుడిది. అతను పిల్లలు పుట్టకముందే చనిపోతే అతని ఇద్దరు మేనల్లుళ్ళు ఒరిస్సా నుంచి వచ్చి అక్కడ స్థిరపడి భూములు పంచుకున్నారు. 1972లో ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చిన తరువాత వీళ్ళలో ఒక్కొక్కడూ 18 ఎకరాల మాగాణీ, 55 ఎకరాల మెట్ట ఉంచుకుని మిగితా భూమినంతా ప్రభుత్వానికి అప్పగించాల్సి వచ్చింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని OBCలకి పంచడం జరిగింది. దాంతో ఆ ఊర్లోని చాలా మంది OBCలు పాలేరుతనం నుంచి విముక్తులయ్యారు. OBCలు పాలేరుతనం నుంచి విముక్తులైనా మాలోళ్ళు ఇంకా పాలేర్లుగానే పని చేశారు. రోజు కష్టం చేసుకుని బతికేవాళ్ళకి కులం గురించి ఆలోచించే టైమ్ ఉండది. కష్టపడకుండా బతికేవానికి కులం గురించి ఆలోచించడానికి టైమ్ ఉన్నా డబ్బు గురించే అంత కంటే ఎక్కువగా ఆలోచిస్తాడు.

  మెచ్చుకోండి

 16. సామాజిక న్యాయం అంటూ రాజకీయాలలో అరిగిపోయిన రికార్డ్‌లా మాట్లాడుతున్నారు. వాళ్ళ దృష్టిలో సామాజిక న్యాయం అంటే వెనుకబడిన కులాలలోని కొద్ది మంది డబ్బున్నవాళ్ళకి అగ్రకులాల ధనికులతో సమానంగా అవకాశాలు ఇచ్చి మిగిలిన పేదవాళ్ళు (వాళ్ళు ఏ కులంవాళ్ళైనా) గుడిసెలలో ఉండేలా చెయ్యడం, వాళ్ళు ఆ పరిస్థితి నుంచి పైకి ఎదగలేకపోవడం, అంతే కదా.

  మెచ్చుకోండి

 17. actually in this country the reservation system formed to help the people who are living under the poverty line & to reform the society with equality and also a non communal.But now a days the politicians are using the reservation system as vote bank of religious aspect so please try to tell that to the normal people. And in the same way there is no chance to get the reservation for sc,st, bc those who converted to other than hindu what about that.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s