సమానత్వం (స్త్రీ పురుష) : కొన్ని నా ర్యాండం థాట్స్

సమానత్వం గురించి (ముఖ్యం గా స్త్రీ పురుష సమానత్వం) కొన్ని నా ర్యాండం థాట్స్:

ఇండియా లో స్త్రీలు పాత విలువల వ్యవస్థ నుంచీ కొత్త విలువల వ్యవస్థ కి అయ్యే transition సమయం లో ఉన్నారు. మగ వారి కోణం నుంచీ విషాదమేమిటంటే, స్త్రీలకు కొత్త వ్యవస్థ లోని హక్కులూ సమానత్వమూ కావాలి, పాత వ్యవస్థలోని care రక్షణా కావాలి. కాబట్టీ మగవారు తమ హక్కులను వదులుకోవాలి. కానీ పాత వ్యవస్థ ప్రకారం వచ్చే బాధ్యతలను (కుటుంబ రక్షణ, ఆడ వారి care) మోయాలి. మన స్త్రీలు మగవారే తమ ట్రాన్స్ఫర్ లంటి వ్యవహారాలను, రికమండేషన్లను తేవటం వంటి వ్యవహారాలను చూడాలనుకొంటారు. అదే సమయం లో మగవాడితో సమానత్వం విషయం లో ఏ మాత్రమూ వెనుకకు తగ్గరు. తమ జీతం తమదే! మగవాడి జీతం కుటుంబం అంతటిదీ! ఒక పాత సామెత గుర్తుకొస్తుంది..”దున్నేటప్పుడు దూడలలోనూ, మేసేటప్పుడు దున్నలలోనూ కట్టెయటం”. చాలా మంది మగవారు ఈ బేధాలను కనిపెట్టకుండా గానుగెద్దులలా అన్నిటినీ కోల్పోతూ పని చేస్తున్నారు!
వెస్టర్న్ దేశాలలో ఆడవారు తమ జీవిత బాధ్యతను తామే తీసుకొంటారు, అలానే సమానత్వమూ ఉంటుంది. ఏడెనిమిది నెలల గర్భం తో ఉన్న వారు కూడా తమ కారు తమే నడుపుతూ ఆఫీసు కు వస్తారు. మన ఆడ వారిని అలా చేయమంటే మగవారి పై ఎన్ని అభాండాలు వేస్తారో ఊహించండి.

మన వ్యవస్థ లో అనాది గా అసమానత్వానికి కొన్ని కారణాలు…..
1.బలవంతుడెప్పుడూ బలహీన వర్గాన్ని ఆక్రమించి వాళ్ళకు బండ పనులూ, అశుభ్రమైన పనులూ, ప్రమాదకరమైన పనులూ ఇస్తాడు. ఆ పనులు చేసే వారు లేకపోతే సమాజానికి చాలా నష్టం. కానీ అణిచిపెట్టబడ్డ వారికి, అణచివేత వల్లా, పొట్టకూటి కోసం ఆ పనులు చేయక తప్పదు, ఈ రోజుల్లో మధ్య తరగతి తమ కంపెనీలను తిట్టుకొంటూ కూడా పొట్ట కూటి కోసం ఉద్యోగాలు చేస్తున్నట్లు.
2. సమాజం మరియూ వ్యక్తుల అవసరాలను బట్టి కొన్ని పనులకి ఎక్కువ విలువ ఉంటుంది. మూఢనమ్మకాలున్న సమాజం లో కుహనా మత పెద్దలకి విలువ ఉంటుంది. ప్రాణాంతక వ్యాధులున్న పాత సమాజం లో వైద్యుడికి ఉన్న విలువ మంగలికి ఉండదు.

సమానత్వాన్ని ఒక ఆదర్శం  గా తీసుకొంటే, అనేక రకాల సమానతలున్నాయి.

అమెరికన్ కంపెనీలలో “సీ ఈ ఓ” ని మరుగుదొడ్డికడిగేవాడు కూడా పేరుపెట్టి ఏకవచనం తో పిలవ వచ్చు. ఈ సమానత్వం కేవలం formality మాత్రమే! “సీ ఈ ఓ” జీతం మిగిలిన ఉద్యోగుల జీతం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టీ ఇక్కడ సమానమైన విలువ లేదు. సమాన విలువ లేనప్పుడు సమాన సంబోధనకు పెద్ద ఉపయోగం లేదు.
2.ఒకప్పటి రష్యా వంటి దేశాలలో factory లలో పై అధికారులూ , కింది అధికారులూ, పని వారూ ఉండేవారు. కానీ అందరికీ సమాన విలువ ఉండేది. ఇది అసలైన సమానత్వం. వాళ్ళ జీతం స్కేల్స్, కాపిటలిస్ట్ దేశాలలో లా సంస్థ కు వచ్చే లాభాలకు వారి contribution ని బట్టి కాక, వారు చేసే పనిని బట్టి ఉండేవి. ఒక కార్మికుడు రోజుకు నలభై వస్తువులు ఎక్కువ తయారు చేస్తే అతనికి బోనస్ ఉంటే, ఒక జెనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తి నలభై truck loads of goods ఎక్కువ ఉత్పత్తి చేయిస్తే అతనికి అంతే బోనస్ ఉంటుంది. అలానే ఒక క్వాలిటీ నిపుణుదు, క్వాలిటీ ని పెంచిన దానిని బట్టి అతనికి సమానమైన amounts లో బోనస్ ఉంటుంది. ఇది అసలైన సమానత్వం.
3. ఈ అసలైన సమానత్వం లో కూడా functional equality (చేసే పని లో సమానత్వం)అనేది సాధ్యం కాదు. మానేజర్ లెవల్ లో ని వారు నిర్ణయాలు తీసుకొనవలసి వస్తుంది, కార్మికులు అమలు పరచ వలసి వస్తుంది. మానేజర్ నిర్ణయాలు తీసుకొంటాడు కదా అని అతనికి ఎక్కువ విలువ ఏమీ ఉండదు. ఎందుకంటే అతని పని అతను చేస్తున్నాడు. కార్మికుని పని కార్మికుడు చేస్తున్నాడు.కానీ నిర్ణయాలు తీసుకొనటం అనేది అమలు పరచటం కంటే మేధోపరం గా ఎక్కువ స్థాయి పని. మొదట్లో ఈ రెండు పనులనూ కృత్రిమం గా ఒకే స్తాయిలో పెట్టినా, కొన్నాళ్ళకి నిర్ణయాలు తీసుకొనేవారి ఆధిపత్యాన్ని ఆపటం కష్టం అవుతుంది.
సోషలిస్ట్ వ్యవస్థ ఏవరికి ఆసక్తి ఉన్న ఉద్యోగం వారు చేసుకొనేటట్లు గా వ్యవస్థ ఇద్దరికీ పుట్టుక నుంచీ సమాన అవకాశాలను కల్పించింది. కాపిటలిస్ట్ వ్యవస్థ లో లా “ఒక పని చేసే వారు తక్కువ ఉన్నారు కాబట్టీ,ఆ పని నేర్చుకొని, ఆ చదువులు చదివిన వారికి ఎక్కువ జీతం ఉండదు”.
సామ్యవాద వ్యవస్థ లో కూడా అన్ని పనులూ సమానం కాలేవు. ఒక శాస్త్రవేత్త అవ్వటానికి కి కొన్ని సంవత్సరాల విద్యా శిక్షణా కావాలి. దానికి మేధోపరమైన స్థాయి కావాలి. శ్రమ చేయాలి. శాస్త్రవేత్త అయిన తరువాత ఉండే పని కూడా ఎక్కువ గానే ఉంటుంది. ఐతే ఈ శ్రమ మేధోపరమైన శ్రమ. అదే ఒక రిసెప్షనిస్ట్ పని తేలిక గా ఉంటుంది. దానిని పెద్ద training లేకుండానే ఎవరైనా తేలిక గా చేయగలరు. అటువంటప్పుడు సామ్యవాద రష్యాలోనైనా శాస్త్ర వేత్తకి ఎక్కువ విలువ ఉంటుంది. అతనికి ఎక్కువ ప్రతిఫలం ఉండాల్సిందే! అలానే ఎక్కువ కష్టపడే వారినీ తక్కువ కష్టపడె వారినీ సామ్యవాద వ్యవస్థ అయినా సమానం గా చూడలేదుకదా! సోమరిపోతుతనానికి కారణాలు అన్ని వ్యవస్థలలోనూ ఉంటాయి.

స్త్రీ వాదులతో వచ్చిన చిక్కేమిటంటే వారు functional equality ని ఆశిస్తారు. సమానత్వమంటే functional equality అనుకొంటారు. కానీ  functional equality తో వ్యవస్థ పని చేయదు. కొన్నాళ్ళకి అది కుప్ప కూలుతుంది.
ప్రకృతి అసమానత ని సపోర్ట్ చేస్తుంది. మన సమాజమూ, సం స్కృతీ సమానత్వం అనే ఆదర్శాన్ని ప్రతిపాదిస్తాయి. ఈ సమానత్వ సిధ్ధాంతానికి మూలం మన లోకం లో ఉన్న అసమానతలో ఉంది. fundamental గా ప్రకృతి సపోర్ట్ చేయని ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది. సమాజమూ, సంస్కృతీ ప్రతిపాదించే ఆదర్శాలు ప్రకృతి విరుధ్ధమైనవైతే అవి కూడా కొంత కాలానికి failఅవుతాయి.ప్రకృతి మద్దతు ఉన్న వావి వరుసలూ మొదలైన కుటుంబ విలువలు  కాల పరీక్షకి నిలబడ్డాయి.కుటుంబ వ్యవస్థ లో (సమాజం లో కూడా) కాల పరీక్షకి నిలబడలేని విలువ “సమానత్వం”.
ఏదైనా ఒక electronic system ని master and slave అనే components ఉంటాయి. మాస్టర్ నిర్ణయాలు తీసుకొంటుంది. స్లేవ్ అమలు పరుస్తుంది.  ఒక system  లొ అన్ని కాంపొనెంట్సూ మాస్టర్లైతే, ఆ సిస్టం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు నిర్ణయాలను అమలుపరిచే components ఉండవు. అన్ని components  స్లేవ్స్ అయినా సిస్టెం పని చేయదు. అలానే ప్రజాస్వామ్యం లో అందరూ సమానమే అయినప్పటికీ, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనే ఒక పాలకుడిని ఎన్నుకొంటారు. కాబట్టీ ఇక్కడ కూడా మాస్టర్, స్లేవ్ విధానం ఉంది. అందరూ సమానమనే సామ్యవాదం దానిని ఆచరణ లో చూపించలేక కూలిపోయింది. కుటుంబం లో కూడా మాస్టర్ అండ్ స్లేవ్ లు తప్పని సరి. ఒక్కో కాలం లో , వ్యవస్థ లో ఆడవారు మాస్టర్స్ గా ఉంటే (మాతృస్వామ్యం), వేరే కాలాలలో మగవారు మాస్టర్స్ గా ఉన్నారు. కానీ ఆధునిక కుటుంబ వ్యవస్థ ఆడా మగా సమానమంటుంది.  కానీ దీనివలన నిర్ణయాలు తీసుకోవటం లో స్పర్ధలు వస్తాయి. వ్యవస్థ ముందుకు పోదు. కొన్ని విషయాలలో భర్త మాస్టర్ అనుకొని, ఇంకొన్ని విషయాలలో భార్య మాస్టర్ అనుకొన్నా, ఏ విషయం లో ఎవరు మాస్టరో చెప్పేది ఎవరు? ఒకే విషయం లో భార్యా భర్తా మాస్టర్ కావాలనుకొంటే దానిని పరిష్కరించేది ఎవరు, ముఖ్యం గా పెద్దల మాట వినని ఈ కాలం లో? కాబట్టీ సమానత్వ ఆదర్శం కుటుంబ వ్యవస్థ యొక్క executive efficiency  ని దెబ్బ తీస్తోంది. చివరికి ఇది కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవటానికి దారి తీస్తుంది.  సమానత్వం కాకుండా మళ్ళీ మాతృస్వామ్యం వస్తే, మగవాళ్ళు ఏడ్చినా, ప్రస్థుత కుటుంబ వ్యవస్థ ఆయుర్ధాయం కొంత పెరగవచ్చు.

సమాజం లో విప్లవాలు రాత్రికి రాత్రి రావు. సమాజ స్థూల పరిస్థితుల (శాస్తవిజ్ఞానాభివృధ్ధీ, సాంకేతికతా, విద్యా మొదలైనవి) లోని పరిణామం వలన ఒకానొక దశలో ఇవి వెల్లువెత్తుతాయి.
పూర్తిగా అణిచివేయబడిన వర్గానికి మొదట్లో తాము అణిచివేయబడ్డామనే స్పృహ కూడా ఉండదు. వారి లో కొందరు అణచివేత పరిస్థితులలోంచీ దూరం గా వేళ్ళటం వలనో, లేదా వారి ఆలోచనలు మిగిలిన వారికంటే ముందుకు వెళ్ళటం వలననో అణచివేతని ప్రశ్నించటం ప్రారంభమౌతుంది. ముందు గా అణచివేసే వర్గం లోని కొందరు మానవత్వం కలవారు అణిచివేయబడిన వర్గాన్ని సమభావం(మానవ ప్రేమ) తో జాగృతం చేయటం వలన కూడా అణిచివేయబడిన వర్గం లోని చైతన్యానికి కారణమౌతుంది.
ఐతే ఈ విప్లవాల వలన సమానత ఏర్పడుతుంది అనుకోలేం. అసమానతలు తారు మారవుతాయి.అధికార బదిలీ జరుగుతుంది. అంతకు ముందు పాలకులు గా ఉన్న వారు పాలితులవుతారు, పాలితులు పాలకులౌతారు. సమాజం లోని కొత్త  స్థూల పరిస్థితుల ఆధారం గా సరి కొత్త అసమ సమాజం బయలుదేరుతుంది.

అధికారాలను కోల్పోవటం అలా కోల్పోయే వారికి ఒక బాధాకరమైన ప్రక్రియ.ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు((చిన్నపిల్లలు) ఉన్నారనుకొందాం. వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్స్ కొని ఫ్రిజ్ లొ పెట్టారనుకొందాం. పెద్ద వాడు ముందు వెళ్ళి ఆ నాలుగు చాక్లెట్లూ తీసేసుకొంటే, చిన్న వాడు ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినా రెండు చాక్లెట్స్ ఇవ్వటం పెద్ద వాడికి బాధాకరం గానే ఉంటుంది. అప్పుడు పెద్దవాడికి వాళ్ళ అమ్మ నాలుగు చాక్లెట్లూ కబ్జా చేయటం ఎందుకు చెడ్డ విషయమో, చిన్న వాడికి రెండు చాక్లెట్స్ ఇవ్వటం ఎందుకు మంచి విషయమో చెప్పాలి. చిన్న వాడికి చాక్లెట్స్ ఇచ్చినపుడు పెద్ద వాడిని మెచ్చుకోవాలి.చిన్న వాడి చేత థాంక్స్ చెప్పించాలి.కానీ, మన సమాజం లో అమ్మ లా పెద్దవాడి మంచి ప్రవర్తన ని మెచ్చుకొనే వారూ లేరు…చిన్నవాడి చేత థాంక్స్ చెప్పించేవారూ లేరు. చిన్న వాడు, అన్న దగ్గర ఉన్న నాలుగు చాక్లెట్సూ నాకు కావాలి అని పట్టుపట్టవచ్చు. అప్పుడు చిన్నవాడికి కూడా వాళ్ళ అమ్మ పెద్ద వాడికి చెప్పినట్లే చెప్పాలి. ఇక్కడ అమ్మ పాత్రని ఒకప్పుడు మన సమాజం లో పెద్ద వారు పోషించేవారు. వారు పూర్తిగా నిష్పక్షపాతం గా లేకపోయినా, వారి presence ఒక stabilizing influence ని కలిగి ఉండేది. పెద్ద వారిని పట్టించు కోని ఈ కాలం లో వారి మధ్యవర్తిత్వాన్ని ఆమోదించేదెవరు?
మనం రాబోయే నాలుగువందల సంవత్సరాలలో మానవ జాతి సరైన దిశలో ఉండే నిర్ణయాలు తీసుకోవాలంటే,ఒక నాలుగైదు తరాలవారిని ఒక చోట కూర్చోబెట్టి పరిష్కరిస్తే గానీ ఆ సమస్యలు విడిపోవు. కానీ నాలుగైదు తరాల పాటు బ్రతికి ఉండే వ్యక్తి ఏవరు?కాబట్టీ సమాజం long term లో ఒక అదుపు లేకుండా, మనుషులు ఒక జీవిత కాలం లో చేసే short term పనులతో గజి బిజి గా సాగుతూనే ఉంటుంది. ఒక తరానికి నేర్పబడిన పాఠాలు, మరొక తరానికి మళ్ళీ నేర్పాల్సి వస్తుంది. తప్పులు పునరావృతమౌతాయి. మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు ఈ long term continuity ని కొంత కాలం నిలబెట్టగలిగినా, ఇప్పుడు పరిస్థితి చేయిదాటి పోయింది.

సమానత్వమే అత్యున్నత విలువా? కానే కాదు. కుటుంబం యొక్కా, తద్వారా సమాజం యొక్క greater good కి సమానత్వాన్ని త్యాగం చేయవచ్చు. స్త్రీలైనా, పురుషులైనా కుటుంబం కోసం తక్కువ స్థాయిని ఆమోదించటం లో తప్పేమీ లేదు.తద్వారా ముందు కొంత తక్కువతనాన్ని అనుభవించినా, కుటుంబం యొక్క ఆరోగ్యం, తద్వారా వచ్చే ఆనందం ద్వారా దానిని పూడ్చుకోవచ్చు. పురుషులు దీనికి ఈ మధ్యే అలవాటుపడుతున్నారు. స్త్రీలు కొత్తగా దొరికిన కొబ్బరి చిప్పైన సమానత్వాన్ని అంత తొందరగా వదిలే సూచనలు కనపడటం లేదు.

ప్రకటనలు

15 thoughts on “సమానత్వం (స్త్రీ పురుష) : కొన్ని నా ర్యాండం థాట్స్

 1. Oh god, Now India is also going the same wrong route as US. Women who support all these so called “Modern Thinking” will be the ones who will be affected badly by these Same Values. Today more than 50% of marriages in US ends up in Divorce because of these Feministic values. Now women are very very sad and depressed when compared to previous generations. The same will result in India also if we allow these Feminist values.

  Feminism is the cause of downfall of communism and soon the entire Western world (including US). India must not follow this path. It is not correct one.

  మెచ్చుకోండి

 2. *స్త్రీ వాదులతో వచ్చిన చిక్కేమిటంటే వారు ఫంక్షనల్ ఈక్వాలిటి ని ఆశిస్తారు*

  ఒక కుటుంబంలో,ఆఫీసులో వీరు ఆశించే ఫంక్షనల్ ఈక్వాలిటి ఎలా ఉండవచ్చు? ఉదా|| తల్లిగా, తోబుట్టువుగా, భార్యగా, ఆఫీసులో సహ ఉద్యోగిగా ఎలా ఉండవచ్చు? సోదాహరణతో వివరించ గలరా?

  మెచ్చుకోండి

  1. స్త్రీ పురుష సంబంధాల గురించి కాబట్టీ, “భార్య గా” గురించి చర్చిద్దాం..
   మగ వాడికి నైజానికి “మొనోగమీ” అంటే పడదు. మోనోగమీ అనే ఆదర్శం స్త్రీలను రక్షించటానికి ఏర్పడిన కుటుంబ వ్యవస్థ మగవాడి పై రుద్దిన ఒక విలువ. ఒక భర్త ఒక వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనుకొందాం. అప్పుడు “అతని భార్య కూడా వివాహేతర సంబంధం ఎందుకు కలిగి ఉండకూడదు?” అని వాదించటం ఈ ఫంక్షనల్ ఈక్వాలిటీ ని రుద్దటం కిందికే వస్తుంది. ప్రకృతి పరం గా స్త్రీ ఒకే సమయం లొ అనేక సంబంధాలను కోరుకోదు. కానీ, “పురుషుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టీ, తను కూడా కలిగి ఉండ వచ్చు” అనటం ఈ కోవకే వస్తుంది. అలానే తను తన భర్త కు మాత్రమే పరిమితమయింది కాబట్టీ తన భర్త కూడా తనకు మాత్రమే పరిమితమవ్వాలి అనే వాదన కూడా ఇలాంటిదే.
   ఇక్కడ సమానత్వం అనేది స్త్రీ పురుష నైజాల(functionality)కి వ్యతిరేకం గా, వారి అధికార సంబంధాల వలన (power equations) మాత్రమే ఉనికి లోకి వచ్చింది. మామూలు గా అయితే, చేసే పనుల యొక్క స్వభావం వలన అధికార సంబంధాలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఉల్టా అయింది.

   మెచ్చుకోండి

    1. పిల్లల ఆలనా పాలనా చూడటం లో మగ వారు ఆడవారికి ఎప్పటికీ సాటి రాలేరు. కానీ ఈ తరం లో ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నారు. దీనిలో నేను మాత్రం ఉద్యోగం ఎందుకు చేయకూడదు అనే భావమూ, ఇతర ఆడవాళ్ళ నుంచీ peer pressure ఉన్నాయి. ఉద్యోగాలకు న్యాయం చేస్తూ పిల్లల పెంపకానికి న్యాయం చేయటం కుదరని పని (ఉద్యోగం చేయని గృహిణులతో పోలిస్తే). కానీ చాల మంది మహిళా executives కుటుంబ జీవితాన్నీ, ఉద్యోగాన్నీ balance చేస్తున్నట్లు చెప్తారు. I take this statement with a pinch of salt అలానే మగవారి domain అయిన వ్యావహారిక విషయాలలో (resolving disputes and conflicts) ఆడ వారు ఎప్పటికీ సమానం కా లేరు(అదే స్థాయి లో ఉన్న మగవారి తో, కింది స్థాయి వారితో కాదు ). కానీ ఆడవారు ఈ విషయాలలో వేలు పెట్టి కాల్చుకొంటూ ఉన్నారు.

     మెచ్చుకోండి

     1. True. ఒక పెద్ద బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్ కొనటానికి మగ వారి సహాయం లేకుండా, ఆడవారు ప్రయత్నిస్తే, సమాజం లో వారి అసలి స్థానం అర్థమౌతుంది. మా బంధువులలో ఒక ఆవిడ తన కష్ట్టాలను ఏకరువు పెట్టేది. మగవారు (భర్తో/అన్నో/నాన్నో) పక్కన లేకుం డా పోతే వాళ్లు కనీసం లెక్క కూడా చేయరు. వాళ్ళు మాట్లడక పోయినా,పక్కన ఉంటే చాలు మన మాటకి విలువ లేకపోతే మనమేంత కొట్టుకున్నా అవతలి వారు పట్టించుకోరు. మనమెంత పోసిషన్లో ఉన్నా వారికి లేక్కే ఉండదు అని చెప్పేది.

      మెచ్చుకోండి

  1. ఆ రాసేది ఏమైనా ఉంటె ఇప్పుడే రాయవచ్చు కదా! సమయం వచ్చినప్పుడు రాస్తాను అని చెప్ప వలసిన అవసరమేమిటి? మిమ్మల్ని ఎవరైనా అడిగారా? శ్రీనివాస్ పేరుతో కామేంట్ పెట్టటం లో ఉద్దేశం అర్థమౌతూనే ఉన్నాది.

   మెచ్చుకోండి

  2. బొందలపాటి గారు,
   అపరిపక్వ ఆలోచనలు ఉన్నాయంట్టు రాసిన ఈ వ్యాఖ్యను తొలగించడి. మీరు రాసినది చదివిన తరువాత, క్రింద ఈ వ్యాఖ్యను చదివితే, వారు ఈ వ్యాసన్ని తక్కువ చేసి చూస్తారు. వారికి అంత పరిపక్వ ఆలోచనలు ఉంటే బ్లాగు పెట్టుకొని రాసుకొమ్మనండి. అసలికి ప్రపంచంలో ఎక్కడైనా పరిపక్వ ఆలోచనలు ఉన్నాయా?

   మెచ్చుకోండి

   1. శ్రిరాం గారు, ,
    thanks for the support. ఆయన మళ్ళీ నా అపరిపక్వ ఆలోచనల్ను చూపుతూ ఒక కామెంట్ రాస్తారేమో నని ఇది అట్టే పెట్టాను. ఆయన మళ్ళీ రాకపోతే, ఆ విషయం చదివే వారికి అర్ధమౌతుంది కద!

    మెచ్చుకోండి

 3. Magavadu pakana lekapote, aadadaniki viluva ivadam ledu.
  Ante magavalaki aadavalante enduku anta chulakana. aadavaru kuda saati manushule kada, enduku anta chinna chupu. aadavaru korukune samanatwam, “thoti magavadiki ichina maryada, aadavariki kuda ivandi”.
  Amma ki, akkaki ichina maryada aaliki enduku ivaru?

  మెచ్చుకోండి

  1. సాటి మనుషులను ఎవ్వరు గౌరవించరు, గౌరవించాలి అని చెప్పటమే కాని. మీ ఇంట్లొ పని చేసే పనివారు మధ్యాహ్నం , పనికి వస్తే మనుషులంతా ఒకటే అని ఎండాకాలం లో ఎ.సి .వేస్తారా? ఇక్కడ చేరి ప్రశ్నలు వేయటం కాదు, మొదట నువ్వు ఆచరించి చూపు.

   మెచ్చుకోండి

   1. Nenu ac vestanu. Nenu acharincheve cheptanu. Nenu meelaga evariki salahalu ivanu. Naku manchidi anipinchinadi nenu chestanu, edutivaru kuda nalage undali aasinchanu. Naa abiprayalanu everimeeda rudde alavatu naku ledu.

    Samanatwam anedi a stage lo undo, just oka example cheppanu, anthe.

    Sri gaaru, I am just sharing my views, i am not questioning anybody, especially “mimalni”.
    Mee manasakshiki meeru javabu chepukunte chalu, everiki chepakarledu.
    <<మొదట నువ్వు ఆచరించి చూపు.
    meeru edutivariki enta respect istaro mee sambodanalone telustundi.
    <<సాటి మనుషులను ఎవ్వరు గౌరవించరు, గౌరవించాలి అని చెప్పటమే కాని
    Chepevalle kani, chesevallu leru ani meeru ela decide chestaru. Chesevallu kuda unnaru. Manam cheyadamledu kadaa ani, everu cheyaru anukukovadam murkathwam.

    మెచ్చుకోండి

 4. నేను ఎవ్వరిని గౌరవించను. నేను మూర్ఖుడిని. అంతేకాదు అహంకారిని కూడా, నన్ను ఎవ్వరు మార్చ లేరు, నేను మారను, ఆ దేవుడు దిగివచ్చినా సరే, ఎవ్వరి మాట వినను. మంచి వారి మంచితనాన్ని అసలికి పట్టించుకోను. నన్ను మార్చాలి అంటే ఎదైనా విప్లవం రావాలి.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s