సమానత్వం : తాత్విక దృష్టి కోణం

Disclaimer: ఈ టపా సమాజం లో ఉండే అనేక రకాల వివక్షలను సమర్దించటానికి కాదు.

“అహం బ్రహ్మాస్మి, తత్వమసి” అని మన పెద్దలు చెప్పారు. (ఈ సూక్తి మన వేదాలలో ఉందా, ఉపనిషత్తులలో ఉందా, శంకరుడు చెప్పాడా, లేక పురాణాలలో ఉందా అనేది నాకు తెలియదు. తెలిసిన వారు కొంచెం చెప్తారా?).
మనలో చాలా మంది మొదటి దైన “అహం బ్రహ్మాస్మి” అనే దానిని అమలు లో పెడతారు (In an egotistic way 🙂  ). మిగిలిన భాగం అమలు లో పెట్టటం చాలా కష్టం.
మనలో విద్యా వంతులైన వారు ఎదుటి మనిషి మన వంటి వాడే అనే విషయాన్ని బుధ్ధిపరం గా అర్ధం చేసుకోగలరు. కానీ practical గా అమలు చేయం.భావోద్వేగ పరం గా ఇతరుల భావోద్వేగాలు మన భావోద్వేగాలకి ఎప్పటికీ సమానం కావు. భావోద్వేగం అనేదే మన అస్థిత్వం నుంచీ పుడుతుంది. మన ఆలోచనలన్నీ మన లాభ నష్టాల చుట్టూనే తిరుగుతాయి. మన శారీరక భౌతిక అవసరాలు మనవి. ఎదిటి వాడి ఆకలి మనకు వేయదు కదా! ఎదుటి వాడి రోగం మనం ఫీలవ్వం. ఎదుటి వాడి ముసలితనం వాడిదే! మానసికం గా “నేను” అనే వస్తువే గతకాలపు జ్ఞాపకాల, ఆలోచనల , అనుభవాల సమాహారం.ఈ నేను కి ఎదురైన పరిస్థితులు దానిని మారుస్తూ ఉంటాయి.ఇతరులకి ఎదురైన పరిస్థితులు , నాకు ఎదురైన పరిస్థితులకు పూర్తి గా భిన్నమైనవి కావచ్చు. అలాంటి నేను ఎదుటి మనిషి తో ఆలోచనా పరం గా, భావోద్వేగ పరం గా, వ్యవహార పరం గా సమానత్వాన్ని ఎలా సాధిస్తుంది?తమ తమ అభిప్రాయాలకీ, భావోద్వేగాలకీ, ఆలోచనలకీ ప్రాముఖ్యతని ఇచ్చుకోని వ్యక్తులను మనమెక్కడైనా చూస్తామా? మన శరీరం కార్చే అనేక శరీర ద్రవాలూ మలినాలు అంటే మనకి అసహ్యం ఉండదు. అదే ఇతరుల ద్రవాలంటే మనకు జుగుప్స ఉంటుంది.
మన అస్థిత్వమే మన మనుగడ (survival) నుంచీ ఆవిర్భవించింది. కాబట్టీ, సర్వ మానవ సమానత్వం అనేది మన నుంచీ మొదలవ్వాలి. కానీ, ఒక్క మేధో పరం గా కాకుండా, ఏ ఇతర ప్లేన్ లో ( emotional, survival, practical, physical,psycological and thoughts) చూసినా మనం మనకు ఇచ్చుకున్న ప్రాముఖ్యతను ప్రపంచం లో వేరే ఎవరికీ ఇవ్వం.
ఇతరుల ఆలోచనలకీ , వారి అనుభవాలకీ మనకు access లేదు. వారి మానసిక ప్రపంచానికి వారికే access ఉంది. అందరి మనుషులకీ ఉమ్మడి గా ఉండే కొన్ని అనుభూతుల ద్వారానే మనం వారితో communicate చేయగలం. మనతో మసలే మన స్నేహితులూ, బంధువుల ఆలోచనలకి మనకు కొంతవరకూ access ఉంటుంది. కాబట్టీ మనం వారికిచ్చే weightage/priority లోకం లో ఇతరులకి ఇచ్చే విలువ కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇలాంటప్పుడు ఇతరులంటే మనకు కొంత మానవీయమైన సహానుభూతి ఉండవచ్చు, కానీ మానసిక మైన సమానత్వం మాత్రం రాదు. అది ఒక ఆచరణ లో పెట్టలేని ఆదర్శం మాత్రమే అనిపిస్తుంది.   We all are similar, but we are not identical  .

సర్వ మానవ సమానత్వమే ఇలా ఉంటే, ఇక సర్వ జీవ సమానత్వం సంగతి ఆలోచించాల్సిందే!

మనమంతా ఒకే శక్తితో, ఒకే ఎలక్ట్రాన్లూ, అణువులూ వగైరాలతో చేయబడి, ఒకే శూన్య మూలాల నుంచీ, భౌతిక-అధిభౌతిక కారణాలవలన వచ్చినప్పటికీ, వాస్తవం గా ఈ అసమానత్వం తప్పేటట్లు లేదు.

మన శరీరమూ,  మనసూ, రోబో ల తరహా లోమాస్ ప్రొడ్యూస్ అయితే తప్ప,  మనమందరం సమానం కామేమో! మాస్ ప్రొడ్యూస్ అయిన రోబో ల లో కూడా వాటి సామర్ధ్యాలలో తేడాలు ఉంటాయి!

ప్రకటనలు

11 thoughts on “సమానత్వం : తాత్విక దృష్టి కోణం

 1. ఏటుకూరి బలరామమూర్తి గారు వ్రాసిన భారతీయ తత్వశాస్త్రం పుస్తకంలో జీన్-పాల్ సార్ట్ర్ పై విమర్శలు చదవండి. సమానత కాంక్షకీ, అసమానత కాంక్షకీ మధ్య తేడా తెలుస్తుంది.

  మెచ్చుకోండి

   1. నాలుగు ముక్కల్లో చెపితే అర్థం క్లాదు కాబట్టి పుస్తకం చదవమన్నాను. ఆ పుస్తకం విశాలాంధ్ర బుక్ హౌస్‌లో దొరుకుతుంది.

    మెచ్చుకోండి

 2. కసి పురుష (పర్సన్ అఫ్ పవర్) ముందుగ మీకు నా నమోవాకాలు !

  ఎంచేతంటే “నేను నా ” అని ఆలోచిస్తూ ఉండటం లోనే నేటి సగటు మనిషి జీవితం గడచిపోతున్నది.

  అలాంటి ఇట్టి తరుణంలో మహనీయుడు శక పురుషుడు అయిన JESUS CHRIST తరహాలో
  “నీ వలె నీ పొరుగు వానిని ప్రేమించుము”
  అంటే నీ తోటి వారిని నీవుగా (నీతో సమంగా) భావిన్చినప్పుడే అలా చేయగలుగుతాము

  అదే జగద్గురు పరమ పూజ్య ఆది శంకరులు ఇంకా కాస్త స్థాయిని పెంచి
  జీవ జీవ అభిన్నత్వం మాత్రమె కాదు జీవేశ్వర జగత్తులు అభిన్నులు
  వీరు బ్రహ్మము కన్నా వేరు కారు అని వేదాంత భేరి మ్రోగించారు.
  “బ్రహ్మ సత్యం – జగన్మిధ్య – జీవో బ్రహ్మైవ నా పరః”

  ఇందులో భాగంగా ఈ జీవేశ్వరులు అభిన్నులు అని భావంలో గ్రహిస్తే ఆత్మ సాక్షాత్కారం,
  అనుభవ పూర్వకం గా గ్రహిస్తే ఆత్మానుభవం.
  ఈస్థితిలో (రమణ మహర్షి తరహాలో ) గురువు శిష్యుడ్ని” నీవెవరో తెలుసుకో!” మని బోధిస్తే శిష్యుని స్థితి అప్పటి దాకా “ప్రజ్ఞానం బ్రహ్మ ” గా ఉన్న అతడు దీనితో
  “అహం బ్రహ్మాస్మి” అనుభవమే కానీ ఆ అనుభవానికి చెందిన జ్ఞానం లేదు .
  అది “అహం బ్రహ్మస్మి” స్థితి అని అతనికి తెలియదు కనుక గురువే తెలియచేస్తాడు అతనికి.

  ఆ తరువాత గురువు శిష్యునికి చేసే బోధ “తత్వమసి” అంటే ” తత్ – అది , త్వం – నీవే , అసి – అయి ఉన్నావు” ఆ బ్రహ్మ పదార్ధం నీవే. ఇలా సాగుతుంది సాధనా విధి.
  ఈ స్థితి లోనే “బ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే ” అనే కీర్తన.

  అది లౌకికానికి తీసుకొస్తే “రాజు – బంటు” , “పండితుడు – ఛండాలుడు”
  “ఏనుగు – కుక్క” అంత సమానమని చెప్తారు (పారామర్ధిక దృష్ట్యా )
  http://www.ezeelyrics.com/2011/01/brahmamokkate-lyrics-annamayya.html

  సో మీ మాటల్లోని ఇక్కడ సర్వ మానవ సమానత్వము , సర్వ జీవ సమానత్వం దర్సనమిస్తాయి.

  ఇక పోతే మీరు అనుకుంటున్న సూక్తులుని మహావాక్యాలు అంటారు. అవి

  Prajnanam Brahma – “Consciousness is Brahman” – Aitareya Upanishad 3.3 of the Rig Veda
  Ayam Atma Brahma – “This Self (Atman) is Brahman” – Mandukya Upanishad 1.2 of the Atharva Veda
  Tat Tvam Asi – “Thou art That” – Chandogya Upanishad 6.8.7 of the Sama Veda
  Aham Brahmasmi – “I am Brahman” – Brhadaranyaka Upanishad 1.4.10 of the Yajur Veda

  మరి ఇదంతా పారమార్ధిక కోణం, సాధకులకు మాత్రమే! మరి సామాజికం కుడా చెప్పుకోవాలి కనుక …
  ఇక్కడ నిస్వర్డం ప్రేమ స్నేహం మొదలైన సద్గుణముల వలన సమత్వ భావన కొంత పరిధిలో సిద్ధిస్తుంది

  అయితే ఇంకా మానవుని బుద్ధి వికాసం చెందాల్సి ఉండి ఈ విషయం లో ….

  భగవంతుడు పుట్టుకలో అందరికి ఒకే విధమైన స్థితి ఇచాడు, అవయవ పరమగ ఇంద్రియ జ్ఞాన పరంగా …

  కాని సామాజిక అసమానతలు, ఆర్ధిక స్థితి గతులు, కుల వర్గ వివక్ష, భాష ప్రాంతీయ భేదాలు వగైరా …

  కలసి ఈ సమత్వ భావానికి ఉనికి లేకుండా చేస్తున్నాయి.

  విప్లవాత్మక మార్పు సంభవించటం అనేది ఉండదు మార్పు క్రమంగా రావాలి

  విద్య విజ్ఞానం అందుకు ఉపకరిస్తుంది, మీలాంటి వారు ఇలా ప్రశ్నిస్తూ ప్రేరణ ఇస్తుంటే ఆనతి కాలంలోనే

  యావత్ ప్రపంచం లో శాంతి సమతలు శోభిల్లుతాయి.

  ధన్యవాదాలు !!

  సర్వేజన సుఖినో భవంతు

  మెచ్చుకోండి

  1. నమస్తే!
   “కసి పురుష (పర్సన్ అఫ్ పవర్)”..ఒకే సారి పొగడటమూ, తిట్టటమూ మీకే చెల్లు..
   ““అహం బ్రహ్మాస్మి” అనుభవమే కానీ ఆ అనుభవానికి చెందిన జ్ఞానం లేదు .
   అది “అహం బ్రహ్మస్మి” స్థితి అని అతనికి తెలియదు ”
   యూ జీ కృష్ణమూర్తి గారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆయనకు అయిన అనుభవం కూడా ఇలాంటిదే అనుకొంటాను.

   సూక్తాల ఉపనిషద్ మూలాలను వివరించినందుకు ధన్యవాదాలు.

   మనం ఎన్నో ఉన్నత ఆదర్శాలను చెప్పవచ్చు, కానీ ఆచరణ లో సాధ్యమా? ఒక బ్లాగరు “సమానత్వం మాట్లాడటం ఈజీ, ఇంటికొచ్చిన పనిమనిషికి AC వేయండి చూద్దాం” అన్నాడు. ఆ కామెంటే ఈ టపాకి ప్రేరణ.

   మెచ్చుకోండి

 3. నేను అనేదే లేనపుడు నువ్వు అనేది ఎక్కడనుండి వస్తుంది… నేను లేకుండా, పక్క వాడి మీద సమ భావన ఎలా వస్తుంది.. అది కేవలం మన కాన్షియస్ మాత్రమే చేయాల్సిన పని.. ఆ సమ భావన తప్పక పరిధుల్లో ఉండాల్సిందే .. లేక పోతే మొదటికే(నేను కే) మోసం వస్తుంది.. పరిధుల్లో ఉన్న దాన్ని సంపూర్ణం అనలేం.. కాబట్టి.. సంపూర్ణ సమభావన కాని పని.. కేవలం.. భౌతిక ప్రపంచం లో స్వ, పర భేదాలు లేకుండా ప్రవర్తించగలిగితే అదే సమభావన అని నా ఉద్దేశ్యం..
  ఉన్నదాన్ని ఉన్నట్టు గా చూడటం మాత్రమే నిజమైన సమానత్వానికి దారి అని నా భావన..

  మెచ్చుకోండి

  1. “సంపూర్ణ సమభావన కాని పని..”
   I agree with you..Our existence itself is not based on others “thoughts, feelings,survival, instincts etc”. Our existence is based on our own “thoughts, feelings,survival, instincts”. The absolute equality is possible only if mankind is a single connected biological system…that means if your neighbor does not eat, you feel the hunger and vice versa..and so on.

   “భౌతిక ప్రపంచం లో స్వ, పర భేదాలు లేకుండా ప్రవర్తించగలిగితే అదే సమభావన అని నా ఉద్దేశ్యం.”
   ఇది కూడా చాలా కష్టం .

   మెచ్చుకోండి

 4. శ్రీ బొందలపాటి వారికి,నమస్కారములు.

  చక్కటి వ్యాసం చదివాను. `ఓం తత్ సత్ ‘పేరుతో వ్రాసిన వివరణ కూడా బాగుంది.
  ఇకపోతే, We are all similar but we are not identical అని అన్నారు. కానీ దీనిని నేను మరొక రకంగా చెబుతాను: We are all Identical but look dis-similarly (outwardly ). దీనికి ఒక ఉదా:- Identical అనే దానికి `మట్టి’ ని తీసుకోండి; dis-similar అనే దానికి `మట్టితో చేసిన అనేక రూపాలుగా పాత్రలని తీసుకోండి. ఇప్పుడు, పాత్రలు అనేక రూపాలుగా కనిపించినా, అన్నింటిలో వున్నది మట్టే గదా!! కాబట్టి, మనుషులను మట్టి పాత్రలుగా ; వారందరిలో వున్నది ఒకేఒక `చైతన్య పదార్ధమే !

  “నేను” అనేది ఆధ్యాత్మికంగా ` పరమాత్మ తత్త్వాన్ని’ సూచిస్తుంది. మనం చెప్పుకునే నేను అనే అర్ధాన్ని మరచి/వదలి వేదార్ధాన్ని తెలుసుకోమని పెద్దలు చెబుతున్నారు. `నేను ‘ అనేది ఎల్లప్పుడూ వుండేది. ఉదా:- నేను, ఒక నాటకంలో తండ్రి పాత్రను వేస్తున్నాను. నాటకం మొదలుకావటానికి ముందు, `నేను’ వున్నాను; నాటకంలో తండ్రి పాత్రలోనూ `నేను’ వున్నాను; నాటకం తరువాతకూడా `నేను’ వున్నాను. కనుక, ఈ విధంగా, నేను ని అర్ధం చేసుకోవాలి.

  `చైతన్యశక్తి’ ఒక్కటే అయినా (మట్టిలాగా), అనేక ప్రాణులుగా ఆవిష్కరింప బడుతూ వుంటుంది.

  సంకుచిత/limited అర్ధంలో మనం అనుకునే `నేను’ అనే స్థితిని (plane ) దాటి, అహం బ్రహ్మస్మి అనే ఉన్నత స్థితిని దర్శించమని ఋషులు చెప్పారు. అది నానుండి మొదలై, ఒక దీపం వెయ్యి దీపాల్ని వెలిగించి నట్లుగా, సమస్త జనానికి అర్ధమవుతే , సమానత్వం వస్తుంది.

  మెచ్చుకోండి

  1. నమస్కారములు మాధవ రావు గారు,
   చాలా రోజుల కి..
   అన్నీ మట్టితో చేయబడినా రూపాలు వేరుగా ఉన్నాయి కదా!మట్టితో చేసిన భగవంతుడి బొమ్మనీ అదే మట్టి తో చేసిన కల్లు ముంతనీ ఒకే విధం గా గౌరవించము కదా?! వస్తువులకి వాటికి ఉన్న ప్రయోజనాన్ని బట్టి విలువ ఇవ్వాల్సిందే కదా?

   మెచ్చుకోండి

 5. శ్రీ బొందలపాటి వారికి, నమస్కారములు.

  రూపాలు, విలువలు, గౌరవం, ప్రయోజనం మొదలైనవన్నీ మనం ఏర్పరచుకున్నవి. తెలివితేటలు కలిగిన మనిషి స్వార్ధం వలన అసమానతలు, అశాంతిని కొనితెచ్చుకున్నాడు కదా! తెలిసే చేతులారా చేసుకుంటున్నాడు. చేసిన తప్పులను సరిదిద్దుకొనే తెలివితేటలుకూడా మనిషికి వున్నాయి. “రూపాలు వెరైనా, అన్నీ మట్టితో చేసినవే అనే స్పృహని మనం కలిగించుకొన్నప్పుడు/కలిగినప్పుడు అన్నీ రూపాలలోనూ కేవలం మట్టిని మాత్రమే చూస్తామెకానీ, విలువలు….మొదలైనవి కనిపించవుకదా! అప్పుడు అంతటా సమానత్వమే కనిపిస్తుంది. ఇదే ఋషులు మనల్ని తెలుసుకొమంటున్నవి.

  కొంత నీటిని, రక,రకాల రూపం వున్న పాత్రలలో పోసినప్పుడు, నీటికి రూపం మారుతుంది. అంతమాత్రాన, నీరు వేరు,వేరుగా అయిపోయింది అనలేముకదా. అన్నింట్లో వున్నది నీరే. * రక,రకాల ఆకృతులలో ఆభరణాల్ని తయారుచేసినా, మనం చూడవలసింది అన్నింట్లో బంగారాన్ని మాత్రమే!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s