మేధావులూ వారి ఆదర్శ సమాజ సిధ్ధాంతాల పనికిరానితనం

సమాజం లోని మధ్య తరగతి మేధావులు కొంతమంది సమాజ తత్వం తో విసిగి, దానిని ఎదిరించలేక, కొత్త ఆదర్శ వాద సిధ్ధాంతాలను (సమ సమాజం వంటివి) లేవనెత్తుతారు. కానీ ఈ ఆదర్శాలనూ విలువలనూ వారే పాటించలేరు.(ఉదాహరణ కు వారు ఏ మార్క్సిస్టు లో అయి ఉంటారు. కానీ పచ్చి పెట్టుబడిదారు విదిల్చే పదికో పరక కో తమ సిధ్ధాంత రచనలు అమ్ముకొంటారు. కాపిటల్ కే వ్యతిరేకమైన వీరు తమ రచనలకు నాలుగు రాళ్ళు రావటంలేదని మూలుగుతారు)  చలం లాంటి వారు ఎక్కడో ఒకరు దీనికి అతీతులు. ఆయన తను ప్రతిపాదించిన విలువల ప్రకారం జీవించటానికి ప్రయత్నించారు. భౌతిక కారణాలకీ, సహజ స్వభావానికీ విరుధ్ధమైన ఏ ఆదర్శమైనా కొంత కాలం తరువాత వీగిపోతుంది.
ఈ మేధావుల స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ వీరి ఆదర్శాలకి విలువనిచ్చినట్లు కనిపించదు (వీరి కుటుంబ సభ్యులు, పిల్లలు ఏ అమెరికా లోనో ఉండి అప్పుడప్పుడూ బ్లాగుల్లో బావురు మంటుంటారు. సదరు ఎర్ర మేధావిని కదిలిస్తే, అలా శతృ దేశంలో ఉండటం వారి వ్యక్తి గతం అంటాడు. లేక పోతే తాను అమెరికా ప్రజలకి వ్యతిరేకం కాదనీ, అక్కడి పెట్టుబడిదారి వ్యవస్థ కి వ్యతిరేకమనీ, తన పిల్లలు చదువుకోసం మాత్రమే అమెరికా వెళ్ళారనీ ఏవో సాకులు చెప్పి తప్పించుకోచూస్తాడు..అక్కడికి చదువుకొన్న తరువాత ఆ పిల్లలు అక్కడి పెట్టుబడిదారి సంస్థలలో ఉద్యోగాలు చేయనట్లు, అక్కడి విశ్వవిద్యాలయాలలో అక్కడి పెట్టుబడిదారి కంపెనీల జోక్యం లేనట్లు..).అంటే ఈ మేధావులు తమ చుట్టూ ఉండే వారిని కూడా ప్రభావితం చేయలేక పోయారన్న మాట. దీనిని గురించి వారిని ప్రశ్నిస్తే, “సిధ్ధాంతం ప్రతిపాదించిన వాడి వ్యక్తిగత జీవితం అప్రస్తుతం, అతని ఆలోచనలూ సిధ్ధాంతం మాత్రమే ముఖ్యం”, అంటారు.  ఈ వాదన చూడటానికి బాగానే ఉన్నట్లు కనపడినా, దీనిలో ఒక లోపం ఉంది.

ఏవరైనా ఒక గడియారం తయారు చేశారనుకొందాం. అతను ఆ గడియారాన్ని అమ్ముదామనుకొంటున్నాడు. “ఈ గడియారం నా చేతికి పెట్టుకొంటే పని చేయదు, కానీ నీ చేతికి పని చేయ వచ్చు”, అని అమ్మే వ్యక్తి చెబితే , కొనే వ్యక్తి కొంటాడా? తనకే పని చేయని గడియారాన్ని ఇతరులు ఎందుకు కొనాలి?

చాలా సందర్భాలలో గడియారం వారి చేతికి పనిచేసినా కొన్న వారి చేతిలో పని చేయక పోవచ్చు.

కానీ ఈ మేధావులు ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని సమాజం మీదికి విసిరేసిన సిధ్ధాంతాలను పట్టుకొని వాటి సాధనకోసం నా నా ఇబ్బందులూ పడి తమ జీవితాలని నాశనం చేసుకొన్న వారు, ఉన్నారు, ఉంటారు. అటువంటి సిధ్ధాంతాల గురించి “తస్మాత్ జాగ్రత్త..!”.

ప్రకటనలు

16 thoughts on “మేధావులూ వారి ఆదర్శ సమాజ సిధ్ధాంతాల పనికిరానితనం”

 1. చలం గారు కూడా కొన్ని సార్లు జీవితంతో రాజీ పడడం జరిగింది. చలం గారు తన చిన్నప్పుడు వాళ్ళ పెదనాన్న గారి అమ్మాయి రమణని ప్రేమించారు. పెదనాన్న గారి కూతురిని పెళ్ళి చేసుకోవడానికి సంప్రదాయం ఒప్పుకోదు. మనవాళ్ళు నాన్న గారి చెల్లెలి పిల్లల్ని ఒకలాగ, నాన్న గారి తమ్ముని పిల్లల్ని ఇంకోలాగ చూస్తారు. రమణతో పెళ్ళికి తన తండ్రి ఒప్పుకోకపోవడంతో చలం గారు ఆ విషయంలో రాజీ పడిపోయారు. నేను మాత్రం నా జీవితంలో ఎన్నడూ రాజీ పడలేదు. మా మామయ్య గారి అమ్మాయి అరుణ నా కంటే వయసులో నాలుగేళ్ళు పెద్దది. కానీ నా ప్రేమని ఆమె అంగీకరించకపోవడం వల్ల మా పెళ్ళి జరగలేదు. ఆమె ఇప్పుడైనా నాతో వస్తానంటే ఆమెతో వెళ్ళడానికి నేను సిద్ధమే. నేను ఎన్నడూ జీవితంతో రాజీ పడే రకం కాదు.

  మెచ్చుకోండి

 2. కానీ అన్ని సందర్భాలలో రాజీ పడలేదు. మైదానం నవల లేచిపోవడాలని అడ్వొకేట్ చేసే నవల అని ఎన్ని విమర్శలు వచ్చినా ఆ నవలని నవలల పోటీలో రివ్యూ కోసమని ఆంధ్ర విశ్వ విద్యాలయానికి పంపారు. కానీ బహుమతి రాలేదు. జీవితంలో కొన్ని విషయాలలో మాత్రమే చలం గారు రాజీ పడినట్టు నాకు గుర్తు. వేశ్యలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఆ వృత్తి నుంచి బయటకి తీసుకురావాలని అనుకుని తరువాత ఏ కార్యక్రమం చేపట్టని రఘుపతి వెంకటరత్నం లాంటివాళ్ళే జీవితంలో నిజంగా రాజీ పడినట్టు.

  మెచ్చుకోండి

 3. “ఈ గడియారం నా చేతికి పెట్టుకొంటే పని చేయదు, కానీ నీ చేతికి పని చేయ వచ్చు”
  చచ్చుబడిన చేతికి ఆటోమేటిక్ గడియారం పనిచేయదు. కదలిక వున్న చేతికి ఆ గడియారం పని చేస్తుంది. చచ్చు ఎగ్జాంపుల్స్ చెబితే నాకసలే ఒళ్ళు మంట.

  మెచ్చుకోండి

 4. చూడబ్బాయ్ గిరీశం,
  చలం అనే ఆయన గురించి బొందలపాటి గారు చెబుతుంటే, మధ్యలో నీవు దూరి నీ ” నేను రాజీ పడను” అని స్వంత గంట వాయించడం ఏమన్నా బాగుందా? ఎవడిక్కావాలి నీ మేనమామ కూతురి విషయం? చలం గారు రాసిన మైదానానికి నీవు రాసే మైదాజిగురు లాంటి రచనలకీ తేడా లేదూ? ఓపన్ మైండెడ్ బొందలపాటి గారితో నీ వదిన కథ చదివించి, నీపై ఓ రీవ్యూ రాయించుకో. ఎవరుకాదన్నారు? ఓ ప్రముఖుడిపై చర్చిస్తున్నప్పుడు మధ్యలో నీ జీవితచరిత్ర నీవు చొప్పించడం దారుణం. దాన్ని సహించిన బొందలపాటి గారు చిరస్మరణీయులైతే కావచ్చేమో కాని, సమాజానికి ఆయన చేసిన ద్రోహం మరువరానిది.

  మెచ్చుకోండి

 5. ఆచరణ ఎందుకు సాధ్యం కాదు? రంగనాయకమ్మ గారు తన మొదటి భర్తని వదిలి తన కంటే వయసులో తొమ్మిదేళ్ళు చిన్నవాడైన గాంధీ గారితో కలిసి ఉంటున్నారు. రంగనాయకమ్మ గారు జన సాహితీ అనే సంస్థలో పని చేసే రోజుల్లో కొందరు జన సాహితీ పెద్దలు ఆవిడకి తెలియకుండా ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చెత్తగా మాట్లాడేవాళ్ళు. కొందరు జన సాహితీ సభ్యులు ఆ విషయాన్ని రంగనాయకమ్మ గారికి తెలియజేశారు. రంగనాయకమ్మ గారు జన సాహితీ పెద్దలని ఆ విషయం అడిగితే సమాధానం చెప్పలేదు. రంగనాయకమ్మ గారు పుస్తకాలలో ఒకలా వ్రాస్తూ నిజ జీవితంలో ఇంకోలా ఉండే రచయిత్రి కాదనడానికి ఆవిడ జీవితమే ఉదాహరణ. తాము రచనలలో వ్రాసిన వాటినే నిజ జీవితంలో ఆచరించినవారిలో రంగనాయకమ్మ గారే మొదటివారు. అందుకే రంగనాయకమ్మ గారిపై విమర్శలు ఎక్కువ.

  మెచ్చుకోండి

 6. ప్రవీణ్ రాసిన సగం కామెంట్ రిలవెంట్, సగం కాదు, అందుకే ఉంచేశా. ఒక్కోసారి, పోస్ట్ కి సంబంధం లేకపోయినా నాకు ఆసక్తికరమైనదైతే కామెంట్ ఉంచుతాను (కింద రంగ నాయకమ్మ గారి గురించి రాసిన విషయం లాంటివి)
  మోడరేషన్ పెట్టవచ్చు గానీ అది కొంచెం ఎక్కువ పని నాకు, అప్పుడప్పుడూ ఊళ్ళో ఉండను, అలాంటప్పుడు మోడరేషన్ అడ్డు వస్తుంది.

  మెచ్చుకోండి

 7. మీరు మరదలిని ప్రేమించారు. ఆయన చెల్లెలిని ప్రేమించారు.
  మరదలిని ప్రేమించి రాజీ పడలేదు అని రాస్తున్నారా? మీరు రాసిన దానికి అర్ఢం ఉందా?

  మెచ్చుకోండి

 8. jana hitham kankshinche kavi samajam kante mundu choopu kaligi vundali, kavi ante “kavayaha krantha darshanaha” aithe viplavam odidudukulatho vuntundi, avesam, avedana kalisi aya sthiti kaligisthai. siddhantha karthaloo manushule. aithe chalam, srisri, chittibabu, gopichand vunna sthithi ni edirinche avesanni ivvagalaru vyakthulaki, kani samajam aya alochanalani tanadaina reethilo acharana loki anumatistundi. sangham mundu vyakthi balaheenudu. kani adi sankaracharya, buddha, jesus, mohammad, guru nanak, aravindulu, ramakrishna paramahamsa vanti varu evolutional change ni prathi padinchatam, acharanaku sulabham mariyu sthiramaina marpu istundi ani.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s