సమాజ సేవా? కుటుంబ సేవా? స్వార్ధమా? సమానత్వమా?

మన లో చాలా మందికి సమాజానికి మంచి చేయాలన్న  మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ మనకు అనేక పరిమితులు ఉంటాయి. ఒక పారిశ్రామిక వేత్త,  “ముందు నన్ను ఓ 500 కోట్లు సంపాదించనియ్, తరువాత ఇక సమాజ సేవ లో కి దూకేస్తాను,” అంటాడు.
ఇంకొక రాజకీయుడు “పలానా పదవి వస్తే, తరువాత నా శేష జీవితాన్ని సమాజ సేవ లో ప్రశాంతం గా గడుపుతాను” అంటాడు,
ఇంకో మధ్య తరగతి జీవి, “నాకు ఓ భద్రమైన ఉద్యోగం కుదిరితే, నా ఫ్రీ టైం అంతా సమాజ సేవ కే ” అనవచ్చు.
పైన చెప్పిన అన్ని కేసుల్లోనూ సేవ చేయాలనే కోరికకీ వ్యక్తిగత లక్ష్యాలకీ ఉన్న స్పర్ధ ని గమనించ వచ్చు.
కాబట్టీ సమాజ సేవ కోసం వ్యక్తి గత లక్ష్యాలను కొన్నిటిని వదులుకోవాలా? అలా వదులుకొంటే ఎంతవరకూ వదులు కో వచ్చు? ఎంత వరకూ వ్యక్తి గత లక్ష్యాలను వదులుకోవచ్చు అనేది చాలా వరకూ subjective decision. కానీ సమాజ సేవ అనేది negative terrain లోకి వెళ్ళే కొన్ని బోర్డర్ కేసులు ఉంటాయి. అంటే ఒక పరిధికి మించి లోక సేవ చేయటం మంచిది కాదు. అది వ్యక్తి గతమైన బలహీనతో, లేక మానసిక రోగమో అవుతుంది.
ఒక వ్యక్తి బాల కార్మిక సమస్య కి వ్యతిరేకం గా పోరాడుతున్నాడనుకొందాం. అతను ఆ పని లో నిద్రాహారాలు మాని, అనేక వత్తిడులకి లోనయి తే, నిస్సందేహం గా అతని సమాజ సేవ ఒక ప్రమాద కరమైన (బలహీనత/అడిక్షన్/అబ్సెషన్/మానసిక రోగం) స్థాయికి చేరుకున్నదనటానికి ఒక సంకేతం గా భావించవలసి వస్తుంది.  అతని సేవా కార్యక్రమం వలన ముందు అతని ఆరోగ్యం దెబ్బతింటుంది.అతని కుటుంబ జీవితానికి సమయం తగ్గి కుటుంబం లో కలతలు వచ్చే అవకాశం కూడా లేక పోలేదు. తద్వారా అతని సేవా కార్యక్రమం కూడా ఆగిపోతుంది కదా! అదే , అతను తన గురించీ, తన కుటుంబం గురించీ తగు శ్రధ్ధపెడితే తన సేవా కార్యక్రమాన్ని దీర్ఘకాలం నాణ్యమైన పనితీరు తో నడిపించవచ్చు.
విమానాలలో ప్రయాణించే టప్పుడు, ఆక్సిజన్ మాస్క్ వేసు కోవటానికి సూచనలు ఇస్తారు. “ఏదైనా ప్రమాదం జరిగి మాస్క్ వాడవలసి వస్తే, మీ పక్కన ఉండే పిల్లలకు కాక, ముందు మీరు మాస్క్ వేసుకోవాలి”, అని చెప్తారు. మీరే మాస్క్ వేసుకొనక పోతే, పిల్లలను రక్షించలేరు కదా! కాబట్టీ, అదండీ మన వ్యక్తి గత జీవితానికీ సమాజ సేవా జీవితానికీ మనం పాటించవలసిన సమతూకం! ఇక సమానత్వం సంగతి అంటారా..ఇక్కడ సమానత్వం వలన నష్టం వస్తుంది, గమనించారా! మనమూ మన పక్క కూర్చొన్న చిన్న పిల్లా సమానమని భావించి ఇద్దరికీ ఒకే సమయం లో మాస్కులు తొడిగితే, చివరికి ఎవరికీ మాస్కులు తొడగలేక అసలుకే మోసం వస్తుంది.
“ఆ బోడి చెప్పొచ్చావులే, ఈ కాలం లో సమాజ సేవ చేయాలని ఎవరికి ఉంటుంది అంటారా?”, కరక్టే నండీ..నా బ్లాగు ద్వారా ఏదో ఒకటి వాగటం నా బలహీనత అనుకొంటా..! ఇక ఉంటా..బై!

ప్రకటనలు

11 thoughts on “సమాజ సేవా? కుటుంబ సేవా? స్వార్ధమా? సమానత్వమా?”

 1. వ్యక్తి గత శ్రేయస్సే సమాజ శ్రేయస్సు అని ఊరకనే అన్నారా ? అంచేత మనకు అవకాసం ఉన్నంత మేరకు సహాయం చేయాలి, ఇందులో మితి ఉంటుంది కనుక అతి కి పోకూడదు, ఎవరిపని వారు సక్రమంగా చేస్తే వ్యవస్థ బావుంటుంది, రోడ్ పైన మనం మాత్రం జాగ్రతలు పాటిస్తే చాలదు అందరు care తీసుకోవల్సినదే ఎవరికీ వారు సరిగ్గా వెళ్తుంటే అందరు బావుంటారు ఎ ఒక్కరు పొరపాటు చేసిన ఫలితం ఎంత మంది చేత అనుభవించవలసి ఉంటుందో ఆ ప్రమాద గ్రస్తుల ప్రారబ్ధ శక్తే నిర్ణయిస్తుంది. కానీ అందు నిమిత్తం మనం ఏమి చేయగలం ? మన వరకు మనం జాగ్రత్తగా వెళ్తూ అవతలి వారు WRONG రూట్ లో వెళ్తుంటే Horn మ్రోగించి హెచ్చరించటం తప్ప …. ఇక్కడ జీవితం లో అంత కన్నా చేయగలిగినది లేదు, మితికి మించి చేయాల్సిన పని లేదు…
  విశ్వ కుటుంబం లో మనది అనుకుంటున్నా కుటుంబం ఒక భాగం, మన కుటుంబం యొక్క సమిస్టే ఈ చరాచర వసుధైక కుటుంబం …..

  so నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో “జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది” అనుకోవటమే తారక మంత్రం.

  మెచ్చుకోండి

  1. *అంచేత మనకు అవకాసం ఉన్నంత మేరకు సహాయం చేయాలి, ఇందులో మితి ఉంటుంది కనుక అతి కి పోకూడదు.*
   ఓం తత్ సత్తు గారు మిరు నిన్న రాసిన దానిని చదివిన కళ్ళతో పైన లైన్ చదివితే చాలా ఆశ్చర్య మేసింది. నిన్న అన్ని మతాల కోటేషన్స్ అవలీలగా రాశారు. మీరు లిమిట్ లోనే వుండాలనుకొనేటప్పుడు, వాటి అవసరం ఎమీటి. ప్రశ్నించుకోవలసిన అవసరం ఎమీటి?

   మెచ్చుకోండి

 2. వనరులు అందుబాటులో ఉన్నవాళ్ళకే వ్యక్తిగత శ్రేయస్సు ఉంటుంది. అవి లేనివాళ్ళకి ఎవరో ఒకరు సహాయం చెయ్యాలి కదా. అవి ఉన్నవాళ్ళు సహాయం చెయ్యకపోతే వాళ్ళకి ఎలా అందుతాయి?

  మెచ్చుకోండి

  1. ఉన్న వాళ్ళు సహాయం చేయాలి. కానీ అలా సహాయం చేసే ప్రక్రియ లో వారు లేని వారు కాకూడదు. అలానే ఉన్నవారు ఆరోగ్యం గా ఉంటేనే లేని వారికి చాలా కాలం సహాయం చేయగలరు. కాబట్టీ ఉన్నవారు తాము చేసే సహాయం తమనే హరించి వేయకుండా చూసుకోవాలి.

   మెచ్చుకోండి

 3. బొందలపాటి గారూ,
  సమాజములో వ్యక్తులు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటేనే వ్యక్తులకు భద్రత ఉంటుంది. ఇవి రెండు ఎంత పరస్పరాధారముగా ఉంటాయో అంతే ఎడమొహం పెడమొహంగానూ ఉంటాయి.
  ఇక సమానత్వం అనేది జీవిలోని జీవానికే కాని జీవి జీవనానికి వర్తించదనేది నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

  1. సరిగా చెప్పారు అచంగ గారు. రెండూ పరస్పరాధారితాలూ మరియూ చక్రసంక్రమణం (cyclical) గా ఉంటాయి. మీరు అనేది జీవుడు సమానం గానీ, జీవించటానికి చేసే పనులలో, జీవన పరిస్థితులలో సమానత్వం ఉండదనేనా? దీని కోసం జీవం లేక ఆత్మ అనే వాటిని నమ్మవలసి వస్తుందనుకొంటా..

   మెచ్చుకోండి

   1. “మీరు అనేది జీవుడు సమానం గానీ, జీవించటానికి చేసే పనులలో, జీవన పరిస్థితులలో సమానత్వం ఉండదనేనా? దీని కోసం జీవం లేక ఆత్మ అనే వాటిని నమ్మవలసి వస్తుందనుకొంటా..”

    అవునండీ. ఆ అభిప్రాయాన్నే నేను వ్యక్తపరచింది. ఇక జీవం (దీన్నే ప్రాణం అని కూడా అంటాను) లేకుంటే జీవి లేదు. నావరకూ జీవమే ఆత్మ, ఆత్మే జీవమూ. ఇది కేవలం పదాల మాయాజాలమే. మిగిలినవి వ్యక్తుల నమ్మకాలు.

    మెచ్చుకోండి

 4. బొందలపాటి గారు

  సాఫ్ట్వెర్ కథల తరువాత ఇలా సంఘం మీద పడ్డారేమిటి మీరు ? తప్పండి – సాఫ్ట్ వేర్ వాళ్ళు సంఘం లో పాత్రలు కాకూడదండి. అలా సమాజాన్ని ఓ చూపు చూసేసి , సైలెంటు అయిపొవాలండీ మరి !

  మెచ్చుకోండి

  1. మీలానే ఎవరో అన్నారు, సాఫ్ట్ వేర్ వాళ్ళు సమాజం నుంచీ isolate అయి ఉంటారని. కొంచెం introspect చేసుకొంటే అది నిజమే అనిపించటమే కాక, అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకి సమాధానం కోసం ఆలో”చించుతూ”, నాకు సమాధానం దొరికింది అని అనిపించినపుడల్లా ఇలా ఓ టపా రాస్తున్నాను.

   మెచ్చుకోండి

 5. తప్పండి , అలా రూట్ మార్చ కూడదండీ, సినీమా వాళ్ళని చూసారా ? ఎప్పుడైనా నేల దిగారా వాళ్ళెప్పుడైనా? ఐ టీ వాళ్ళు ‘సంఘం’ సమ సమాజం ఇట్లా అంటూ పొతే , దేశానికి ముఫత్ గా ఎవరు టేక్సులు కట్టి ఉద్దరిస్తారు చెప్పండి మరీ? కాబట్టీ నెను చెప్పొచ్చెది ఏమిటంటే…….

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s