ఇతరుల అభిప్రాయాలను ఎందుకు గౌరవించాలి?

తెలుగు అంతర్జాలం లో తెలంగాణా, స్త్రీ వాదం , కులం వంటి అనేక విషయాల మీద వాదోప వాదాలూ, చర్చలూ జరుగుతుంటాయి. ఈ చర్చలలో తరచూ అభిప్రాయాలే వాస్తవాలు గా చెలామణి అవుతున్నట్లని పిస్తుంది. ఎదుటి వారి అబిప్రాయాలను గౌరవించేవారి సంఖ్య చాలా తక్కువ.
స్టాటిస్టిక్స్ లో sampling theory అని ఒక సిధ్ధాంతం ఉంది. దానిని ఇక్కడ వివరిస్తాను కొంచెం ఓపిక పట్టండి.
ఒక పెద్ద బుట్టలో నాలుగు రంగుల గోళీలు , ఒక్కో రంగు గోళీలూ 1000 సంఖ్యలో ఉన్నాయనుకొందాం.బుట్టలోని ఈ అన్ని రంగుల గోళీలనూ కలగాపులగం గా కలిపేశామనుకొందాం. ఈ బుట్ట మన సమాజం వాస్తవం గా ఉన్న స్థితిని ప్రతిబింబిస్తుంది.గోళీల రంగులు సమాజం యొక్క లక్షణాలైన సమానతా, అధికారం, అభివృధ్ధీ మొదలైన లక్షణాలను ప్రతిబింబిస్తాయనుకొందాం.
మనం ఈ బుట్టలోంచీ ఒక గుప్పెడు గోళీలు తీస్తే ఆ గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉండవచ్చు. దీనిని మనం ఒక biased sample అంటాం.బుట్టలో అన్ని రంగుల గోళీలూ సమాన సంఖ్యలో ఉన్నప్పటికినీ మనం తీసిన గోళీలలో ఎరుపు రంగు గోళీలు ఎక్కువ ఉన్నాయి. మన గుప్పెడు గోళీలూ మన వ్యక్తి గత అనుభవాన్ని సూచిస్తాయి.అయితే ఈ అనుభవం లో కూడా patterns ఉంటాయి.నల్ల గోళీల బరువు మిగిలిన రంగు గోలీల బరువు కన్నా ఎక్కువ అనుకొందాం.  బుట్ట కిందికి నల్ల గోళీలు ఎక్కువ చేరుతాయి. తరువాత అక్కడ (బుట్ట అడుగు) నుంచీ తీసిన sample లో నల్ల గోళీలే ఎక్కువ ఉంటాయి. ఉదాహరణ కి, ఒక గ్రామీణ దళితుడి అనుభవం లో ‘కుల వివక్ష’ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మన పక్క వ్యక్తిని ఇంకో గుప్పెడు గోళీలు తీయమంటే అతని గుప్పెటకి తెలుపు రంగు గోళీలు ఎక్కువ రావచ్చు. అలానే ఒక పెద్ద గిన్నె తో గోళీలను తీసినట్లైతే ఆ గిన్నెలోని వివిధ రంగుల గోళీల సంఖ్య మధ్య అంతరం తగ్గుతుంది. అంటే sample పెద్దదయిన కొద్దీ అది వాస్తవ పరిస్థితికి దగ్గరవుతుందన్నమాట.  అంటే ఒక విషయం లో మన వ్యక్తిగత అనుభవం పెరిగే కొద్దీ, ఆ విషయం పై మనం వాస్తవానికి చేరువవుతున్నామన్నమాట.అయితే, ఒక attitude తొ మొదలుపెట్టి దానికి విరుధ్ధమైన విషయాలను తమ మది లోకి రాకుండా తిరస్కరిచే వారు, అ విరుధ్ధమైన విషయాలలో ముందుకు సాగరు. ఆ విషయాలలో వారికి అనుభవం ఉన్నా , ఆ విషయాలలో వారు ఎదగరు.

గుప్పెట తో గోళీల sample తీసెటపుడు, మనం తెలివిని ఉపయోగించనవసరం లేదు. కానీ అభిప్రాయాలను ఏర్పరచుకోవటానికి మన అనుభవాలను తెలివితో విశ్లేషించి more objective అభిప్రాయాలను ఏర్పరచుకోవచ్చు.

ఇక అంతర్జాల చర్చల విషయానికి వస్తే, అనేక మంది రాగద్వేషాలతో చర్చలు చేస్తుంటారు. విషయాన్ని అన్వేషిద్దాం అని కాక తమ వాదనే గెలవాలి అని వాదిస్తుంటారు.. ఒక విషయం పై ఎవరి అనుభవం ఎంతో మనకు తెలియదు. కొంతమంది wishful tinking తొ మాట్లాడుతారు.ఆదర్శాల , సిధ్ధాంతాల రంగు కళ్ళజోడులు పెట్టుకొని మాట్లాడుతారు.అనామకం గా దుర్బుధ్ధి తో దుర్భాషలాడతారు,వారి భౌతిక మనుగడ కి ముప్పు లేదు కా బట్టీ! వారి వారి వ్యక్తిత్వం, ఇష్టాఇష్టాలు బట్టి మాట్లాడుతారు.ఇంకొందరు వారికున్న ఇతరేతర లాభ నష్టాలను(vested interests) బట్టి, చర్చలలో వాదాలు లేవ నెత్తుతారు. ఒక మనిషికున్న ఇటువంటి బలహీనతలన్నిటినీ పక్కన పెడితే, మన అభిప్రాయం అనేది మన అనుభవం అనే biased sample నుండీ పుడుతుంది. అలానే ఎదుటి వారి అభిప్రాయాలు కూడా biased అయి ఉంటాయి. ఈ అభిప్రాయాలు వాస్తవాన్ని ఎంతవరకూ ప్రతిబింబిస్తాయి అనేదానికి ఒక కొలబద్ద లేదు.

కాబట్టీ, ఒక విషయం లో మన అభిప్రాయం ఎంత కరక్టో, ఎదుటి వారి అభిప్రాయం కూడా అంతే కరక్ట్.
శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే కొంత వాస్తవానికి దగ్గరగా రాగలవు. శాస్త్రం కూడా తన పరిశోధనల ఫలితాలలో కొంత bias ను అంగీకరిస్తుంది. అది వేరే విషయం.
అందుకే మనకు మన అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనిపించినా, అది కేవలం మన “అభిప్రాయం” మాత్రమే అని గుర్తెరిగి, ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించటం మంచిది.
ఈ పైన చెప్పింది నా అభిప్రాయం మాత్రమే 🙂 . మరి మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండేం..?

ప్రకటనలు

7 thoughts on “ఇతరుల అభిప్రాయాలను ఎందుకు గౌరవించాలి?

 1. ” వాదనలో పస లేనప్పుడు దానిని నిలబెట్టుకోవాలని వ్యక్తులు చిందులు తొక్కుతుంటారు ”
  సూక్తి కి సరిగ్గా అడ్డం పడుతున్నది మీ మహోన్నతవ్యాసం.
  Nice Statistics Sampling theory we must follow it.

  మెచ్చుకోండి

 2. ఉన్నది ఉన్నట్లు చూడగలిగే వారే ఉన్నది ఉన్నట్లుగా స్పందించగలరు
  అంతేకాని తమ స్వీయ దృక్పథం లో ఏవిధమైన శాస్త్రీయత లేని వైఖరి అవలంబిస్తే వారి అభిప్రాయం సత్య దూరమే అయి నిష్ప్రయోజనమై విలువ లేకుండా పోతుంది
  కనుక వాస్తవిక దృష్టి అల వరచుకోవలసిన ఆవశ్యకత నేటి కాలపు విమర్శకులకు ఎంతైనా ఉన్నది.
  మంచి ఆదర్శాన్ని ఉన్నత దృక్పథానికి పాటకులు బాటలు వేసేవిధంగా
  ఒక రకమైన ఆత్మ విమర్శా చేసుకునేల ఉన్నది తమరి వ్యాసంగం !!
  ధన్యోస్మి ఇవాళ మంచి విషయం తెలిసింది ….

  మెచ్చుకోండి

 3. వాస్తవిక దృక్పధంతోకాక రాగద్వేషాలతో చర్చకు దిగటం సాధారణవ్యక్తులు చేసేపనే. అయతే అంతర్జాలంలో వ్యాఖ్యానించే వార మేధావులే కావాలని నియంత్రించలేముకదా. నిజానికి మేధావులే అయినా రాగద్వేషాలకు లొంగరని నూటికి నూరుపాళ్ళూ నమ్మలేం. హెచ్చుమంది సంయమనంతో వ్యవహరిస్తారని ఆశించవచ్చు కాబట్టి అనేక మంది మేధావులు చర్చించినప్పుడు సరయిన అవగాహన యేర్పడుతుందని భావించవచ్చు. కాని అంతర్జాలంలో అపరిపక్వ మనస్కులే హెచ్చుగా వాదనలకి దిగుతారు కాబట్టి ఆవేశ కావేశాలు బాగా ధ్వనిస్తాయి కాని సదవగాహన తొందరగా యేర్పడదు. అదీ సంగతి.

  మెచ్చుకోండి

 4. బొందలపాటి గారూ, మీ లాజిక్ చదివాను. మీరు తీసుకున్న పోలిక ద్వారా విషయాన్ని వివరించిన తీరు బాగుంది.

  అయితే అన్ని అభిప్రాయాలు కరెక్టే అనడంలో యాంత్రికంగా అన్వయించినట్లు కనిపిస్తోంది. సామాజిక పరిస్ధితులపై తమ తమ అనుభవాలని బట్టి అభిప్రాయాలు ఏర్పడతయాన్నది నిజం. కాని ఏ ఒక్కరి అనుభవాలు సంపూర్ణం కానందున అందరి అభిప్రాయాలూ కరెక్టే అనడం సరికాదని నా అభిప్రాయం.

  మీరు చెప్పిన ఉదాహరణ కోణం నుండి చూస్తే… బుట్టలో ఉన్న మొత్తం గోలీలే అసలు నిజం తప్ప గుప్పిటలో ఉన్నవి మాత్రమే వాస్తవం కాదు. ఎవరి అనుభవం ఏదైనా, వాటితో నిమిత్తం లేకుండా సమాజం, అందులో వాస్తవాలు ఎప్పుడూ ఒకటే కదా.

  మెచ్చుకోండి

  1. ఈ ఉదాహరణ పని చేయని కొన్ని స్పెషల్ కేసులు కూడా ఉన్నాయి. బుట్టలో ఓ వంద నల్ల గోలీలూ, ఐదు తెల్ల గోలీలూ ఉన్నాయనుకొందాం నేను తీసిన గుప్పెట్లోకి బుట్టలో ఉన్న ఐదు తెల్ల గోళీలు మాత్రమే వచ్చాయనుకొందాం. నా అభిప్రాయం ప్రకారం బుట్టలో అన్నీ తెల్ల గోలీలే ఉండాలి. గొళీలు తీసిన తరువాతి బుట్టని చూస్తే అందులో అన్నీ నల్ల గోళీలే ఉంటాయి.
   కానీ సమాజమనే బుట్టలోంచీ మన అభిప్రాయమనే గోళీలను తీయటం వలన, బుట్టలో గోళీల సంఖ్య తగ్గదు. కాబట్టీ నేనిచ్చిన అన్వయానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి.బుట్టలోని గోళీలను సాంపిల్ తీసేముందు మాత్రమే పరిగణన లోకి తీసుకోవాలి.
   అలానే ఒక మనిషి ఆంధ్ర దేశం లో వేసవి కాలం లో మంచుకురుస్తుంది అనే అభిప్రాయం కలిగి ఉన్నాడనుకొందాం. అతని అభిప్రాయం నిస్సందేహం గా తప్పు. అలాంటి గోళీలు బుట్టలో ఉండే అవకాశం లేదు కాబట్టీ.

   మెచ్చుకోండి

 5. విశేఖర్ గారు,
  బుట్ట లో రంగు గోళీలు ఏ నిష్పత్తి లో ఉన్నాయో మనం తీసిన గుప్పెడు గోలీలలో కూడా రంగు గోళీలు అదే నిష్పత్తి లో ఉండే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు మన అనుభవం, వాస్తవం, ఒకటే అవుతాయి.
  అలానే కొందరి గుప్పెట్లోని గోళీల నిష్పత్తి బుట్టలోని నిష్పత్తి కి దగ్గరగా ఉంటే, ఇంకొన్రి గుప్పెట్లోని గోళీల నిష్పత్తి బుట్టలోని గోలీల నిష్పత్తి కి చాలా దూరం గా ఉంటుంది. కాబట్టీ ఒకరి అభిప్రాయం ఎంత నిజం (90% నిజమా 40% నిజమా?) అనే quantitative judgement కూదా అవసరమే. కానీ ఎవరి గుప్పెట బుట్టలోని గోళీల నిష్పత్తి కి దగ్గరగా ఉంది అనే విషయం లో, ఒక నిరూపణ (proof) అంటూ ఏమీ లేదు. ఆ నిరూపణ అనేది శాస్త్రీయమైన ప్రయోగాల వలననే సాధ్యం. కానీ సామాజిక రంగాలలో, ముఖ్యం గా మన దేశం లో ఇటువంటి ప్రయోగాలు తక్కువ. పాశ్చాత్య దేశాలలో మనం హాస్యాస్పదం అనుకొనే విషయల గురించి కూడా ప్రయోగాలు జరుగుతాయి. ఈ మధ్య రిసెషన్ దెబ్బకి డబ్బులు లేక కొంత వెనుకకి తగ్గుతున్నారు. ఈ ప్రయోగాలు కూడ అన్నీ బయాస్ కి అతీతం అని చెప్పలేం.
  మొత్తం మీద ఒక రి భిప్రాయం వేరొకరి అభిప్రాయం కంటే సరైనది అని నిరూపించే పధ్ధతులు లేనందున, అలా ప్రూవ్ అయ్యే వరకూ, అందరి అభిప్రాయాలూ సాపేక్షం గా సరైనవే అనుకోవటం మంచిది అని నేననుకొంటాను. సాపేక్షం గా మాత్రమే, పరిపూర్ణం గా కాదు.
  నేను ఈ స్పష్టతనూ, ఇంకొన్ని వివరణ ల నూ ఇచ్చినట్లైతే, యాంత్రికం గా అన్వయించినట్లు అనిపించేది కాదేమో!

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s