కొన్ని కులాల ప్రాధమిక విలువలు..

నేను “ఒక అమెరికా వాడి రైలు బండి ప్రయాణం” కథ రాసిన తరువాత నాలో update అయిన అవగాహన ఇది.
మానవ సమూహాలన్నిటికీ ఉన్నట్లే, కులాలకు కూడా ప్రాధమిక విలువలు(primary values) ఉంటాయి. ఐరోపా ఖండం లో యూదులను “చాలా ప్రతిభ కల వారి గానూ”,” జిత్తుల మారి వారి” గానూ చూసేవారు. ఇది ఒక మూస గుద్దుడు వ్యవహారం (stereo type) కావచ్చు. కానీ ఈ మూస లో కూడా కొంత సత్యం ఉంటుంది. నిప్పులేనిదే పొగ రాదని అంటారు కదా!
మానవ సమూహాలనంటికీ ఉన్నట్లు గానే, కులాలకీ ప్రాధమిక విలువలు ఉంటాయి. ఒక కులానికి సంబంధించిన ప్రాధమిక విలువ  ఆ కులం లోని ప్రసిధ్ధులూ, పెద్దల ప్రవర్తన పై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలు ఆ కులం వారి వృత్తి మీద కూడా ఆధాపడి ఉంటాయి. ఆయా కులాలకు మిగిలిన విలువలు ఉండవని కాదు. వారి మిగిలిన విలువలనన్నిటినీ కూడా చివరికి ఈ ప్రాధమిక విలువలలోకి convert చేయవలసిందే! వారికి మిగిలిన విలువలని వారి ప్రాధమిక విలువలోకి మార్చి చెప్తేనే వారు దానిని మెరుగ్గా appreciate చేయగలరు.ఒక కులం లోని అందరు వ్యక్తులకీ ఈ ప్రాధమిక విలువలు వర్తించక పోవచ్చు.

ఈ ప్రాధమిక విలువలు ఆయా కులాలలో కూడా స్థలాన్ని బట్టీ , కాలాన్ని బట్టీ మారుతూ ఉంటాయి. అలానే ఒకే కులం లోని దిగువ తరగతి వారి విలువలూ , ఎగువ తరగతి వారి విలువలూ ఒకే విధం గా ఉండవు.

మనం మధ్య తరగతిని మాత్రమే పరిశీలిద్దాం. మీరు పెళ్ళి కుమారుడి తరపున ఒక పెళ్ళి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారనుకోండి. మీ కులం ఏ కులం వ్యక్తి తో మాట్లాడేటపుడు ఆ కులం గా ఊహించుకోండి.

ఒక బ్రాహ్మణ కులం కి చెందిన వ్యక్తి తో మీరు “పలానా వాళ్ళ అబ్బాయి కి పది లక్షల సంపాదన ఉందట ” అన్నారనుకోండి, అప్పుడు అతను, “అలానా! ఆ అబ్బాయి ఏమి చదివాడు? ఏ ఉద్యోగం చేస్తున్నాడు” అని అడిగే అవకాశం ఉంది.    దీని వలన మనకు ఈ కులం ప్రాధమిక విలువ “విద్య, ఉద్యోగం” అని అర్ధమౌతుంది.
ఒక కమ్మ కులం కి చెందిన వ్యక్తి తో, “పలాన కుర్రాడికి పలానా పెద్ద qualification ఉందట”, అంటే,  “మంచిది, ఎంత సంపాదిస్తాడంటాడు?” అనే ప్రశ్న తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ డబ్బు అని చెప్పనక్కరలేదు కదా!

అలానే ఒక రెడ్డి గారి ముందు, కుర్రవాడి డబ్బు ప్రస్తావన తెస్తే, “అతని హోదా (rank) గురించి” అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ప్రాధమిక విలువ సమాజం లోని rank.

గోదావరి జిల్లాల నాయుడు గారు కట్నం గురించిమాట్లాడేటపుడు, “ఎన్ని ఎకరాల కొబ్బరి తోట లేక వరి పొలం?”, అని మాట్లాడే అవకాశం ఉంది. ప్రాధమిక విలువ “భూమి”.

ఒక S.C వర్గానికి చెందిన వ్యక్తి పెళ్ళి కుమారుడి చుట్టాల లో ఎవరు పెద్ద ప్రభుత్వ అధికారులో తెలుసుకొని సంతోషించే చాన్స్ ఉంది. ప్రాధమిక విలువ,”వ్యవస్థీకృత అధికారం”

వైశ్యులు, “కుర్రవాడు నేర్పుగా జాగ్రత్త గా ఉండి, పొదుపు స్వభావం కలవాడా?” అనే విషయం చూడవచ్చు. కుర్ర వాడు ఉద్యోగి అయితే, అతనికి ఎంత మిగులుతుంది అని చూడవచ్చు. “నికర లాభం”, ప్రాధమిక విలువ.

ఈ ప్రాధమిక విలువలు అన్ని కాలాలలోనూ ఒకే విధం గా ఉండవు. ఒకప్పుడు “పెద్ద ప్రభుత్వోద్యోగులై ఉండటం” అనేది, బ్రాహ్మణ వర్గం లో ఒక విలువ. నేడు ఆ విలువ SC వర్గానికి బదిలీ అవుతున్నట్లున్నది.

ఈ ప్రాధమిక విలువల లో ఏ కులం విలువా ఇతర కులాల విలువల కంటే గొప్పదీ కాదు, తక్కువా కాదు. కాక పోతే ఒక వర్గానికి చెందిన విలువ ఇంకొక వర్గానికి నచ్చదు. ఏ వర్గానికి చెందిన విలువ ఆ వర్గానికి సరైనది గా కనిపించవచ్చు. ఇతర వర్గాలపై మన అయిష్టాన్ని వ్యక్తం చేయటానికి ఆ వర్గం విలువలను తప్పుపడతాం.మన కులం గురించి ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, మన కులపు ప్రాధమిక విలువ చెడ్డది గా కనపడటం కూడా జరుగుతుందనుకోండి!ఈ ఆత్మ విమర్శ చేసుకొనేటపుడు, వెరే కులాలలో మనం నిరసించిన విలువని, మన వర్గం మాత్రం సాధించాలని వాదించటం కూడా కద్దు.

ఇంతకు ముందు ఓ టపా లో చెప్పినట్లు, పైన చెప్పినవి “కేవలం నా అభిప్రాయాలే“, మీ అభిప్రాయాలు భిన్నం గా ఉండవచ్చు.

ప్రకటనలు

9 thoughts on “కొన్ని కులాల ప్రాధమిక విలువలు..”

  1. బహుశా ఒకే కులపు వాళ్ళు కొన్ని తరాల నుండి పెళ్లిళ్ళు చేసుకోవడము వలన కొన్ని లక్షణాలు జీన్స్ ద్వారా వస్తాయి అనుకుంటాను . అందుకే ఒకే కులపు వారి ఆలోచనలు, కొన్ని మంచి అలవాట్లు కొన్ని చెడ్డ అలవాట్లు ఒకేలా ఉంటాయి .

    మెచ్చుకోండి

  2. నేనో రెడ్డి ని… నేనైతె నిజం గా ఎంత పెద్దమనిషి అనేదే చూస్తా.. పెద్దరికం చేసినపుడు నాకొచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.. బయట పడననుకోండి…

    మెచ్చుకోండి

  3. రెడ్ల గురించి మీ అభిప్రాయం నిజం. ఆంధ్ర లో చంద్ర బాబు నాయుడు పదేళ్ళు అధికారం లో లేకున్నా, కమ్మలు అతన్ని వదల లేదు. రెడ్లు జగన్ని రెండేళ్ళ లోనే వదిలిపెడుతున్నారు, చంద్ర బాబు ఇచ్చే పదవుల కోసం.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s