అవినీతిపై మంచుపల్లకీ గారి టపా-కొన్ని ఆలోచనలు

రాత్రి తెలుగు బ్లాగ్-సాగరం లో పడి ఈదుతూ ఉంటే మంచు పల్లకీ గారు అవినీతి గురించి రాసిన టపా కనపడింది. ఆ టపా లో ఆయన “మనమందరం మన పరిధులలో అవినీతిపరులమేనంటూ, ప్రక్షాళణ మన నుంచీ మొదలు కావాలని చెప్పారు.”
దాని గురించి ఆలోచిస్తూ ఉంటే నా బుర్రలో ఈ ఆలోచనలు కూడా వచ్చాయి…
అవినీతీ, పర్యావరణం మొదలైనవి మానవాళి మొత్తం ముందున్న సమస్యలు. వీటికి ఒక పౌరుడి గా మనవంతు బాధ్యత తప్పనిసరి గా ఉంటుంది. అయితే సమాజం లోని అందరికీ సమాన బాధ్యత ఉంటుందా?
ఒక వ్యవస్థ లో మనిషి అధికారమూ హోదా పెరిగితే అదే స్థాయి లో బాధ్యతలు పెరగాలి. మన రాజకీయ నాయకులకు మనకంటే ఎక్కువ హోదా, అధికారం ఉంటాయి. కాబట్టీ వారికి అదే స్థాయి లో ఈ సమస్యల పట్ల మనకంటే బాధ్యతకూడా ఎక్కువ గా ఉండాలి. కానీ, వారి బాధ్యత వారు నిర్వర్తిస్తున్నారా? చాలా వరకూ నిర్వర్తించకపోవటమే కాక, ఒక్కోసారి అసలు సమస్యనే వారు మొదలుపెడుతున్నారు.
మన ఆఫీస్ లో మనకు మన హోదాలో అనేక బాధ్యతలు ఉంటాయి. వాటిని నిర్వర్తించకపోతే మనకు అప్రైజల్ టైం లో మూడుతుందని తెలుసు. కాబట్టీ, మనం మన బాధ్యతలను నిర్వర్తించటానికే మొగ్గు చూపుతాం…మరి రాజకీయ నాయకుల అప్రైజల్ ఎవరు చేస్తారు? మనకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజలే ప్రభువులు. రాజకీయ నాయకుల అప్రైజల్ చేయటమే కాకుండా వారిని అపాయింట్ చేసేది కూడా ప్రజలే! కాబట్టీ మన వ్యవస్థ లో ప్రజలకు నాయకులను ఎన్నుకొనే హక్కుతో పాటు వారు వారి బాధ్యతలను సరిగా నిర్వర్తించేటట్లు చూసే బాధ్యత కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే వారిని తరువాతి ఎన్నికలలో శిక్షించాల్సిన బాధ్యత ప్రజలదే! అలానే అవినీతి చేయని నాయకుడిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ప్రజలదే!(ప్రజాస్వామ్యం లో ప్రజలకి బాధ్యతలు చాలా ఎక్కువ మరి! అధికారం ఉనంచోట ఎక్కదైనా బాధ్యతలూ కూడా ఎక్కువగానే ఉంటాయి కదా! )
కానీ ఈ బాధ్యత ఏ ఒక్కరిదో కాదు. ప్రజలందరి సమిష్టి బాధ్యత.
మనం మన వ్యక్తి గత పరిధి లో అవినీతి పనులు తగ్గించుకొనే నిర్ణయం తో పాటు, మన సమిష్టి బాధ్యత అయిన వోటు హక్కుని వ్యక్తిగత పరిధిలో విజ్ఞత తో ఉపయోగించుకొనే నిర్ణయం కూడా తీసుకోవాలి. వోటు వేయటం ఒక అధికారమూ బాధ్యతా కూడాను. వోటు హక్కుని సరిగా వినియోగించుకోవటానికి సరిపడా రాజకీయ జ్ఞానం సంపాదించటం, వీలయితే మన పరిధిలో నలుగురిని దీనిని గురించి చైతన్య పరచటం కూడా మన బాధ్యతే! ఉన్న నాయకులతో మనకు తృప్తిలేక పోతే, మన వ్యక్తిగత జీవితాలు ఆవిరికానంతవరకూ, రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం కూడా ప్రయత్నించాలి. అందరూ అరవింద్ కేజ్రీవాల్ లు కాక పోయినా కిరణ్ బేడీ స్థాయి లోనైనా కొంత మన వంతు బాధ్యత నిర్వర్తించాలి.

ఈ ఆలోచనల తరువాత నేను ఇంతకు ముందు రాజకీయ నాయకులను సమర్ధిస్తూ రాసిన టపా లోని నా అభిప్రాయాలను కొంతవరకూ సవరించుకోవలసిన అవసరం కనపడింది.

ప్రకటనలు

2 thoughts on “అవినీతిపై మంచుపల్లకీ గారి టపా-కొన్ని ఆలోచనలు

 1. టపా శీర్షిక మొదట చదవగానే ఇలా చదివాను.

  ‘అవినీతీ మంచుపల్లకీ’ గారి టపా – కొన్ని ఆలోచనలు 🙂 మంచు పల్లకీ గారి అవినీతా? మాంచి ఇంట్రెస్టింగా ఉందే అనుకున్నా 😀

  అవినీతిపై మంచుపల్లకీ గారి టపా-కొన్ని ఆలోచనలు అని ఉంటే బాగుండేదేమో?

  మెచ్చుకోండి

  1. బధ్ధకం ఎక్కువైపోయింది..ఎవరికి అనకండి..నాకు..మొత్తానికి సరిగా టపా శీర్షిక పెడితే మీరు నా టపా చూసేవారు కాదు కదా..ఇదే ఉంచెయ్యనా..! 🙂

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s