కురచదైపోతున్న కాలం

కురచదైపోతున్న కాలం

————————–

నాకు ఒక ఏడెనిమిదేళ్ళ వయసున్నపుడు, నేను మా చుట్టాల ఊర్లో పెరిగాను. తరువాత మా ఊరు వచ్చేశాను.
నేను పెరిగి డిగ్రీ లోకి వచ్చిన తరువాత దాదాపు పదిహేనేళ్ళ కి మళ్ళీ మా చుట్టాల ఊరుకి వెళ్ళాను.
అక్కడ ఒక గమ్మత్తైన విషయం గమనించాను. అక్కడి పెరటి గోడలన్నీ  కురచవైపోయాయి. నా చిన్నప్పుడు దూరం గా ఉన్న ప్రదేశాలు దగ్గరగా జరిగాయి.
ఇదేంటబ్బా అని ఆలోచిస్తూ ఉండగానే నాకు విషయం అర్ధమైపోయింది. పెరటి గోడలు పొట్టివవ్వ లేదు, నేనే బారు పెరిగాను. దూరాలు దగ్గరవ్వలేదు నా కాలే బారు సాగింది.
మనపై కాలం కూడా ఇలాంటి కనికట్టునే చేస్తుంది.

నేను ఎనిమిదో తరగతి లో ఉన్నపుడు, మా నాన్న ని దీపావళి కి బారు లాగూ (పాంటు) కొనిపెట్టమని అడిగాను. దానికాయన,”అప్పుడే వీడికి పాంటు కావలసి వచ్చిందంట, వచ్చేదీపావళి కి కొనిపెడతాలేరా!”, అని విసుక్కొన్నాడు.
నేను, “అమ్మో! పాంటు కోసం ఏకం గా సంవత్సరం ఆగాలా నాన్నా?” అన్నాను.
ఆయన, ” సంవత్సరం ఎంత సేపట్లో వస్తుంది. ఇలా చూస్తూ ఉండగానే గిరుక్కున తిరి వస్తుంది”, అన్నారు.
చిన్నప్పుడు ఎంతో బారు గా అనిపించిన సంవత్సరం ఇప్పుడు నాకు కూడా చాలా కురచ అయిపోయింది. ఎందుకంటే, చిన్నపుడు పన్నెండు సంవత్సరాలు ఉన్న నా మనసు ఎత్తు ఇప్పుడు పెరిగి పోయింది. అది ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల ఎత్తుకు పెరిగింది. ఈ ఎత్తు ముందు,  సంవత్సరం అనే పెరటి గోడ కుంచించుకొని పిట్టగోడ లా అయిపోయింది.. ఇక నేను యాభై లలోకి అడుగు పెట్టటానికి.నా చిన్నప్పటి లెక్కలో చెబితే…, ఇంకా ఓక సంవత్సరం వ్యవధి కూడా లేదు. త్వరపడాలి లేక పోతే చూస్తూ ఉండగానే వార్ధక్యం లోకి అడుగుపెడతాను.

ప్రకటనలు

7 thoughts on “కురచదైపోతున్న కాలం”

 1. నేను పుట్టాను
  ఈ లోకం కురచై పోయింది
  నేను పెరిగాను
  ఈ లోకం కురచై పోయింది

  నేను గాయబ్
  ఈ లోకం గాయబ్ !

  నా కింకా లోకం లో కురచేముందీ ?

  చీర్స్
  జిలేబి.

  మెచ్చుకోండి

 2. బొందలపాటి గారు,
  కొంతకాలం క్రితం ఎవరో ఒకడు నన్ను మార్క్స్ అనే వాడివా? అది చదువు ఇది చదువు, పిలాసఫిని భూమార్గం పట్టిం చాడు. వంకాయమ్మ అనువాదం చదవమని మీకు సలహా ఇచ్చడు. ఆయన పేరు గుర్తుకు లేదు గాని ఎప్పుడైనా మీకు తగిల్తే కింద రాసిన దానిని చూపించండి. మార్క్స్ గారి గురించి ఎంతో తెలిసినా ఆ రోజు రాయటానికి ఓపిక లేక వదిలేశాను. ఇప్పుడు నాకు తెలిసిన దానినే మింట్ లో ప్రచూరించారు. అది కాపి పేస్ట్ వేస్తున్నా చదవండి. మార్క్స్ గారు ఊరు కదలకుండా, ఒక్క ఫాక్టరి మొహం చూడకుండా, ప్రపంచంలొ దేశాల ఆర్ధిక,సామజిక పర్తిస్థితులను విశ్లేషణ చేశారు. ఈ మధ్య నేను గన్స్ జెంస్ అండ్ స్టిల్ చదివాను. అది చదివితే అసమానతల వేనుక గల కారణాలను భౌగోళికం గా వీశ్లేషించారు. పులిట్జర్ అవార్డ వచ్చింది దానికి.
  http://www.livemint.com/articles/2011/11/25202043/Book-Review–Beautiful-minds.html

  The Industrial Revolution had shown glimpses of a better future, though there was little historical reason to believe that societies could escape the poverty trap. Karl Marx and Friedrich Engels predicted that capitalism would inevitably push workers into penury and the entire economic system would collapse in a heap. Engels comes across better than Marx in Nasar’s book. Marx, it seems, wrote about the horrors of industrial life without even once seeing the inside of a factory. He lived in London not too far away from two outstanding thinkers: Charles Darwin and George Eliot . He never bothered to either meet or correspond with them.
  _____________________________
  Well, now it appears that Marx wrote about the horrors of industrial life without even once seeing the inside of a factory!
  I’m not suggesting that visiting a factory can miraculously enlighten us. Far from it. There must be a solid prior basis of rigorous thought before one can ask the right questions and extract valuable information from the “factory visit”.

  But this does further indicate that Marx’s ignorance of the real workplace was quite profound, and casts grave doubt on his capabilities as a professional economist.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s