కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )

ఈ మధ్య మన బ్లాగులలో కమ్యూనిస్టులకీ, వాళ్ళని వ్యతిరేకించే వారికీ మధ్య వాగ్యుధ్ధాలూ, దూషణ, భూషణ , తిరస్కారములూ నడుస్తున్నాయి. వాటిని చూసినప్పుడు, కాసేపు ఆవేశం గా కమ్మీ భాయీలని చీల్చి చెండాడుదాం అనిపిస్తుంది. కానీ, ఇంతలోనే వారి వాదనలో అసలు సబబు లేకుండా పోలేదు కదా అనిపిస్తుంది. ఇంకాసేపు వారి వ్యతిరేక వర్గాన్ని విమర్శించుదాం అనిపిస్తుంది. కానీ వారి విమర్శలు కొన్ని కూడా సహేతుకమే కదా అనిపిస్తుంది. ఆ.. మనకెందుకు లే “గో.పి” లా కూర్చుందాం అని మరి కొంత సేపు అనిపిస్తుంది.
మొత్తానికి ఈ పీకులాట లో నా స్థానం ఏమిటో చెప్పేస్తే పోలా, ఈ రోజు కొంచెం టైం చిక్కింది కదా అని,ఈ టపా వేస్తున్నాను.

1.తప్పదు. విశ్లేషణ మొదలు పెట్టటానికి జంతువుల దగ్గరికి వెళ్ళి ఆ గెడ్డపాయన డార్విన్ ని లాక్కొని రావలసిందే! (ఏమిటో ఖర్మ, నాకు అందరూ గెడ్డపాళ్ళే దొరుకుతారు). గుంపులు గుంపులు గా ఉండే క్షీరదాలైన జంతువులలోంచీ మనిషి జాతి పరిణామం చెందింది అని ఆయన చెప్పాడు. మనిషి జంతువు స్థితి లో ఉన్నపుడు సమాజం ఉండేది. అంటే సమాజం సహజమైనదే. ఇక్కడ సహజమైనది అంటే, మనిషి తన ఆలోచన తో “నిర్మించనిది”. (డార్వినిజం పై నాది “నమ్మకం” మాత్రమే! డార్విన్ గారి సిధ్ధాంతాలని నేను వ్యక్తిగతం గా నిరూపించి నిగ్గు తేల్చుకోలేదు 🙂 )
2. జంతువు నుంచీ మనిషి గా మారే క్రమం లో మనిషి లో మొదటి గా “నేను” అనే ఒక self-conscious center ఏర్పడింది. ఇది ఆలోచనల తో చేయబడిన ఒక దారబ్బంతి లాంటిది. ఆలోచనలు అంటే, ఈ నేను అనేది గడచి పోయిన కాలం తో చేయబడినది. memories తో చేయబడినది. ఇది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. భౌతికం గా చూస్తే, చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. కానీ సిస్టం ఆన్ చేస్తే దీనిదే హవా!
3. ఆలోచనల తో కూడిన “నేను” చింపాంజీల లాంటి జంతువులలో కూడా ఉంటుంది కానీ, ప్రస్తుతానికి దానిని పక్కన పెడదాం. ఈ “నేను” ఏర్పడక ముందు మనిషి “ఆ క్షణం” లో జీవించేవాడు. పరిస్థితులూ, తన instincts మొదలైనవి ఆడించినట్లు ఆడే వాడు. జీవితం చాలా simple గా ఉండేది.
4.”నేను” గారు ఏర్పడటం మనిషి మనుగడ లో పెద్ద మైలు రాయి. ఎందుకంటే, అంతకు ముందు వ్యక్తి గత స్థాయి లో మనిషి మనుగడ గురించి plan చేసి, పట్టించుకొనే పదార్ధం లేదు. “నేను” గారు, “వచ్చే వేసవి కాలం లో food ఎలా దొరుకుతుంది?” వంటి అనేక సమస్యల గురించి ఆలోచించి, దానికి ప్లాన్ చేయటం మొదలు పట్టారు.(The selfish gene అని ఓ అమెరికా ఆయన ఒక పుస్తకం రాసుళ్ళా! )
అలానే, అనేక వైజ్ఞానిక మైన ఆవిష్కరణలూ, సాంకేతిక ఉపకరణాలు కనిపెట్టబడటానికి కూడా ఈ “నేను” గారూ, ఆయనకి ఉన్న అతిశయమే కారణం.
5. ఈ “నేను” గారి వలన మనిషికి “సాఫ్ట్ వేర్” ఒకటి ఏర్పడి, తద్వారా మానసిక ప్రపంచం అనేది ఒకటి సృష్టించబడింది.  మనిషి చేసే “భోంచేయటం”, వంటి చిన్న చిన్న పనుల నుంచీ, పట్టణ అభివృధ్ధి కోసం వేసే ప్లాన్ ల దాకా, ఈ మానసిక ప్రపంచం పరిధి లోనే జరుగుతాయి.నేను గారి జననం తో పాటు మనిషి లో భావోద్వేగాలు పదునెక్కి నిశితమైనాయి. నేను గారు ఏర్పడిన తరువాత కొంత (ఎంత అని అడగకండి) కాలానికి కుటుంబ వ్యవస్థా, వావి వరుసలూ ఏర్పడినాయి. ఎందుకంటే నేను గారికి memory ఉంది. జంతువులలో లా కాకుండా, మనుషులకి, “యాభై యేళ్ళు వచ్చిన కొడుకు కూడా” పిల్ల వాడిలా కనపడటానికి కారణం, “ఈ నేను గారికి ఉన్న మెమొరీ,  భావోద్వేగాలను record చేసి అట్టే పెట్టుకోవటం “.
6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది.  కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
7. ముందు భూస్వామ్య వ్యవస్థా, తరువాత పెట్టుబడి దారీ ఏర్పడటం ఈ క్రమం లోనివే. మార్క్స్ అనే గెడ్డపాయన కూడా, ఏంగెల్స్ అనబడే ఇంకొక గెడ్డపాయన తో కలిసి చెప్పింది ఏమిటంటే, ఈ పరిణామ క్రమం లో తరువాత ఏర్పడబోయేది, సామ్య వాద వ్యవస్థ అని. అయితే, ఈ వ్యవస్థ ఏర్పాటును త్వరితం చేయటానికి “కమ్యూనిస్ట్ పార్టీ” ఏర్పాటు అనేది, విప్లవం రూపం లో “రసాయనిక చర్యను త్వరితం చేయటానికి catalyst ను కలపటం”, లాంటిది.  .
8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు.  ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.

ఆస్తికులైనా నాస్తికులైనా తర్కం ద్వారా అన్వేషణ జరిపితే, ఒక తెలియని ప్రాంతాన్ని (realm)  దర్శించాల్సిందే! “ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు?” అని నాస్తికుడిని అడగండి. “ఇంకా తెలియదు” అని సమాధానం వస్తుంది.
దేవుడిని నిర్వచించండి అని ఒక ఆస్తికుడిని అడగండి, “నిర్వచనాలకి అందని వాడు”, అన్న సమాధానం ఇవ్వకపోతే ఆస్తికుడి వాదం ఆటే నిలవదు.
9. ఇక పోతే, సమాజం గురించి… వ్యక్తులతో కూడిన వ్యవస్థ నే సమాజం అంటాం. ఒక సైకిల్ లో ఉన్న చిన్న చిన్న భాగాలని వ్యక్తులు అనుకొంటే, ఆ భాగాల అమరిక నే సామాజిక వ్యవస్థ అనుకోవచ్చు. సైకిల్ బిగించే వాడు సీట్ బిగించే చోట కారేజీ బిగిస్తే సైకిల్ ఉపయోగ పడకుండా పోతుంది. అలానే, సైకిల్ బిగించే టపుడు బ్రేకులు గాఠ్ఠిగా బిగిస్తే, అవితొందరగ అరిగి పోతాయి. ఇక్కడ మనం చూస్తున్నది, ఒక frame work ఉంటుందనీ, అలానే చిన్న చిన్న భాగాలనే వ్యక్తులు ఉంటారనీ. frame work ని సరి గా అమర్చక పోతే, దాని ప్రభావం component పై పడి అవి త్వరగా అరిగిపోతాయి. అలానే, చెత్త components వేస్తే (చెత్త ట్యూబ్) framework దెబ్బతింటుంది.
కమ్యూనిజం అనేది సామాజికం గా ఒక మెరుగైన frame work కావచ్చు. ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition  లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత  నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.

10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.

ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
మనిషి కి ఉన్న ఈ లక్షణాలు, సామ్యవాద చట్రం పరిఘి లోనివి కావు. కాబట్టీ ఈ లక్షణాలున్న వ్యక్తి (component), చివరికి చట్రాన్ని (framework),  తుప్పు పట్టిస్తాడు. సామ్యవాద వ్యవస్థ లు కొన్ని కూలటానికి  కారణం ఇదే కావచ్చు.
సామ్యవాద వ్యవస్థలు, social engineering ద్వారా నిలబడవేమో!  వ్యక్తులు  కూడా ఆ దిశలో కొంత పరిపక్వత సాధించిన తరువాతే, సామ్యవాద చట్రం నిలబడవచ్చు. సమాజం లోని వ్యక్తులలో అధిక భాగానికి సుందరయ్య, నంబూదిరి వంటి వారికున్న నిస్వార్ధతలో సగం ఉన్నా, సామ్యవాద చట్రం నిలబడుతుందేమో! కానీ ఆ వ్యక్తిగత పరిపక్వత పరిణామం ద్వారానే రావాలి. అది సామ్యవాద చట్రం ఇచ్చేది కాదు. ఒక రకం గా ఈ పరిపక్వత కు కారణం కూడా ఒక enlightened selfishness అనవచ్చు.  నా సిధ్ధాంతం గెలవాలి, నా సమాజం బాగుండాలి, అనే ఒక స్వార్ధం. కానీ అటువంటి స్వార్ధాన్ని ప్రస్థుత పరిస్థుతులలో ఆహ్వానించ వచ్చుననుకొంటా!

అందరూ మహనుభావులైనపుడు ఏ ఆదర్శమైనా పని చేస్తుంది. ఒక సిధ్ధాంతం పని చేయటానికి మనుషుల వ్యక్తిత్వ స్థాయి పెరగాలంటే, ఆ సిధ్ధాంతం, తాను పుట్టిన పరిస్థితులలో విఫలమైనట్లే లెక్క!ఎందుకంటే, సామాజిక సిధ్ధాంతం వ్యవస్థ స్థాయి లో framework ని fix చేయాలి. సిధ్దాంతం యొక్క success మనుషుల వ్యక్తిత్వ ఔన్నత్యం యొక్క దయాదాక్షిణాలపై ఆధారపడ కూడదు.

10.పరిపూర్ణ సమానత్వం అనేది ఒక ” సాధ్యం కాని విషయం”. ఈ నా టపా చూడండి.
స్త్రీ పురుష సమానత్వం లో కొంత డొల్ల తనముంది. ఇంతకుముందు ఈ టపాలో చెప్పాను.

డబ్బు వలన అసమానత్వం పెరుగుతుందనేది కాదనలేని సత్యం. ప్రభుత్వ విధానాలు ఈ అసమానత్వ అగ్నికి ఆజ్యం పోస్తాయి.
డబ్బు లేని సమాజాన్ని ఊహించుకోండి. అప్పుడు డబ్బుని అపరిమితం గా కూడబెట్టటానికి వీలుండదు. వస్తువులూ  ఆహారం మొ. అన్నీ కొంత కాలం తరువాత నశించేవే. భూమిని కూడబెట్టినా దానిని అదుపు చేయటం కష్టం. అలానే జనాల నుంచీ డబ్బుని బొట్టూ బొట్టూ పిండినట్లు వస్తువులని పిండటానికి కుదరదు.  డబ్బు లేక పోతే అనేక రకాలైన ద్రవ్యోల్బణాలు  ఉండవు.
డబ్బు ని ఎలా మానేజ్ చేయటం అనే expertise తెలుసుకొని సంపాదించటం(manipulate చేయటం) అసలే కుదరదు.డబ్బులేక పోతే, ఒక్క గుండు సూది కూడా ఉత్పత్తి చేయని speculative markets కూడా ఉండవు. తద్వారా వాటి దోపిడీ ఉండదు.
కానీ డబ్బు వలన అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి. సులువు గా  కదలటం, వ్యవహారిక మైన సదుపాయాలూ, బ్యాకింగ్ రంగమూ మొ||. కాబట్టీ డబ్బు ని బ్యాన్ చేయటం కుదరదు. దానిని నియంత్రించటమొక్కటే మార్గం.

11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).

12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి  సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.

13. “మార్క్స్ ఏ ఫాక్టరీ లోకీ వెళ్ళి అధ్యయనం చేసి తన సిధ్ధాంతాన్ని ప్రవచించలేదు”, అని చెప్తున్నారు. మార్క్స్ అలాంటి అధ్యయనం చేసి ఉంటే , ఆయన సిధ్ధాంతానికి మరింత విశ్వస నీయత చేకూరేదేమో! కానీ ఆయన ఒక సామాజిక శాస్త్ర వేత్త మాత్రమే. ఐన్-స్టీన్ లాంటి, Theoretical physicists ల్యాబ్ లో ప్రయోగాలు చేయరు. అంతరిక్షం లోకి వెళ్ళరు. కానీ వారిని ఎవరూ, అలా చేయమని అడగరు కదా! అలాంటిదే, మార్క్సిస్ట్ తీరీ కూడా.
మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది.  ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?

అయితే, వ్యక్తిగత పరిమితుల వలన ఒక సిధ్ధాంతాన్ని పాటించలేని వారికి, సమాజం హితం కోరి సిధ్ధాంతాన్ని చెప్పే హక్కు ఇందుకు మినహాయింపు. (ఒక కాన్సర్ రోగి దీర్ఘ కాలం ఆసుపత్రి లో ఉండవలసి రావచ్చు. అతను వర్గ పోరాటం చేయలేక పోవచ్చు. కానీ ఇతరులను ఉత్తేజ పరచవచ్చు.)
“మార్క్స్ చెప్పాడని ఎవరైనా ఒక విషయాన్ని అంగీకరించ వలసిన అవసరం లేదు”, అనే విషయం మార్క్సిస్టులు గుర్తించాలి. “మార్క్స్ అంతటి వాడు చెప్పిన దానిని ప్రశ్నిస్తావా?”,అనేది సరైన స్పందన కాదు.

కాయలున్న చెట్లకే రాళ్ళ దెబ్బలనట్లు, ఆదర్శాలు చెప్పే వారికే అతిక్రమణల ఆరోపణలు ఎదురౌతాయి. అలా అని ఏ ఆదర్శాలూ చెప్పని వారు ఏ వెధవ పనైనా చేయటానికి లైసెన్స్ ఉందనుకొంటే పొరపాటే!

14. అలానే మార్క్సిస్ట్ ల ను విమర్శించేవారు, …. “పలానా లింక్ లో పలానా చోట మార్క్స్, ఈ నాటి పరిస్థితులకి  సరిపోయే వ్యాఖ్యానం చేశాడు”, అని చెప్తే, ఆ లింక్ ని చూడను కూడా చూడ కుండా,
“ఆ మార్క్సిజం అంతా పిడి వాద మతం!” అని తీసివేయటం కూడా సరి కాదు. అలానే, “ఏది సరైన కమ్యూనిజం, మావోదా?మార్క్స్ దా? CPI, CPM వాళ్ళదా?, మవోయిస్టులదా?”, అని గదమాయించి, అసలు మార్క్సిజం గురించి చదవకుండా తప్పించుకోవటం కూడా మంచిది కాదు.
అవన్నీ అధ్యయనం చేసి, వాటిలో దేని వలన convince అవుతారో, దేని వలన కారో వ్యక్తులు నిర్ణయించుకోవాలి. ఏదీ చదవకుండానే (ఆ టైం , ఓపికా లేక పోతే ఒప్పుకోవచ్చు కదా?) రోడ్డు మీది పిచ్చివాడి మీద, “అందరూ వేస్తున్నారు, మనం కూడా వేసి చూద్దాం”, అన్నట్లు నాలుగు రాళ్ళు వేయటం, గేలి చేయటం అనేది మంచిది కాదు. ఇంటర్నెట్లో దొరికే అవగాహన లేని పిల్లల తో దెబ్బలాటలు పెట్టుకొని, మార్క్సిజం అంటే “అంతా చెత్త”, అనుకోవటం మంచిది కాదు. ఒక వేళ చర్చించటానికి తగిన స్థాయి కల మార్క్సిస్టులు దొరకక పోతే, చర్చలనుంచీ దూరం గా ఉండటం మంచిది.  అన్ని సిధ్ధాంతాలను సమర్ధించే వారి లోనూ, అన్ని రకాల వారూ (తెలివైనవారు, జోకర్లూ, మంచివారూ, చెడ్డవారూ) ఉంటారని మరిచిపో వద్దు.

మార్క్సిస్టులు “అన్నీ మా మార్క్స్ చెప్పాడట,(ఇదొక వ్యక్తి పూజ)” అనటం సహించలేని ప్రత్యర్ధులు, “అన్నీ మన వేదాలలోనే ఉన్నాయిష”, వాదాలను మళ్ళీ నిలబెట్టాలని చూడటాన్ని, “భౌతిక మైన నిరూపణల కంటే, తమ జీవనపధ్ధతుల వలన ఏర్పరచుకొన్న వ్యక్తిగత నమ్మకాలకు మద్దతు కూడగట్టటం ద్వారా పై చేయి సంపాదించాలని ప్రయత్నించటం”, గానే అర్ధం చేసుకోవచ్చు.

15. పెట్టుబడి దారి వ్యవస్థా, సామ్యవాద వ్యవస్థా కూడా మనుగడ కోసం మానవ జీవ సమాజం చెందిన పరిణామం లోని భాగాలే.సామ్యవాదం, పెట్టుబడి దారీ వ్యవస్థలు “వ్యక్తి గత మనుగడనూ మరియూ సమూహం యొక్క మనుగడనూ వివిధ పాళ్ళలో పరిస్థితులను బట్టి మేళవించటం” వలన ఏర్పడతాయి. ఈ రెండు వ్యవస్థల అంతిమ లక్ష్యం మాత్రం “మానవ జీవ జాతి మనుగడ”. సంబంధిత టపా.

16. సామ్యవాద సిధ్ధాంతం పాతబడి పోయిందనేది ఒక వాదన. కానీ, కమ్యూనిస్ట్ మానిఫెస్టో కానీ కాపిటల్ కానీ చదివిన వారికి, ఇప్పటి సమాజ పరిణామాలు చాలా వరకూ ఆ సిధ్ధాంతం పరిధి లోకే వస్తాయనే విషయం అవగతమౌతుంది. కొత్త కొత్త గా వస్తున్న global warming వంటి విషయాలపై సామ్యవాదం యొక్క వైఖరి ఏమిటొ స్పష్తం గా లేదు.  సహజ వనరులు తక్కువ గా ఉన్నపుడూ, త్వరగా తగ్గి పోతున్నపుడూ వాటిని సమానం గా పంచుకోవటం మరీ చెడ్డ విషయం కాదేమో!
global warming ని తగ్గించటానికి మనమందరం మధ్య యుగాలలోని, పచ్చి ఆహారం తినే స్థితికి వెళ్ళటానికి సిధ్ధం గా లేమనేది స్పష్టం. దీనికి, emissions ని క్రమం గా తగ్గిస్తూ, ఒక balanced state కి వెళ్ళటమొక్కటే మార్గం.
అయితే ప్రస్తుతం ఉన్న పెట్టుబడి దారీ వ్యవస్థ పరిధిలోనే దీనికి సమాధానం దొరక వచ్చు. ప్రభుత్వాలు తమ regulations ద్వారా, కాలుష్యాన్ని తగ్గించటాన్ని ఒక లాభ దాయకమైన వ్యాపారం గా మలచాలి. దీని కోసం ప్రభుత్వాలపై ప్రజాస్వామికమైన ఒత్తిడి అవసరం.

17. పెట్టుబడి దారీ వ్యవస్థ అనేక సంక్షోభాలను ఎదుర్కోంటున్న నేటి స్థితి లో, ఏది సరైన పరిష్కారం? ఉత్తర ఐరోపా దేశాల లా , మనుషుల కనీస అవసరాలు తీరేంత వరకూ సామ్యవాద విధానాలూ, తరువాత పెట్టుబడి దారీ పోటీ విధానాలూ అవలంబించటం ఒక సమాధానం.
ఉద్యోగుల యాజమాన్యం ఉన్న కో-ఆపరేటివ్ లు ఇంకొక ప్రత్యామ్నాయం. వినియోగ దారుల కో-ఆపరేటివ్లూ, ఉత్పతి దారుల కోఆపరేటివ్ లూ (మహా రాష్ట్ర లో చక్కెర ఫాక్టరీలూ, మన రాష్ట్రం లో రైతుల కో-ఆపరేటివ్ లూ)  ఇవన్నీ మన దేశం లో ప్రయత్నించి చూసినవే! (ప్రజలందరి కో-ఆపరేటివ్ నే సామ్యవాద సమాజం అంటారనుకోండి. అది మరీ పాత చింతకాయ కదా! అందుకే కొత్త సీసా లో పాత సారా పోద్దామని ఈ కో-ఆపరేటివ్ ల proposal. class less society, withering of state ల కి కొత్త ముసుగేస్తే, ఈ co-operative వాదం వస్తుంది. )

18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన  ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.

మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి.

19. ప్రజల బాధల పట్ల సానుభూతి తో వారితో భుజం కలపటం వేరు,  ప్రజల ఆక్రోశాన్నీ, కోపాన్నీ ఒక ఆయుధం గా వ్యూహాత్మకం గా ఉపయోగించుకొని అధికారం లోకి రావటం వేరు అని మన కమ్మీ పార్టీలు గుర్తించాలి.
అలానే కమ్యూనిస్ట్లు దేనికోసమైతే పోరాడుతున్నారో ఆ ఆదర్శ సమాజం వచ్చేస్తే, తరువాత వారి అస్థిత్వం ఏమిటి? ఆదర్శ సమాజాన్ని రక్షించటమా? ఆదర్శ సమాజం స్థిరపడి పోయింది అనుకొందాం. మరి అప్పుడు కమ్యూనిస్టుల పని ఏమిటి? అప్పుడు పని ఏమీ ఉండదు. కాబట్టీ, ప్రజలు కష్టాలలో ఉంటేనే కమ్యూనిస్టుల ప్రభావానికి మంచిదా?

ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా?  OK . Then, have a nice weekend.

55 thoughts on “కమ్యూనిజం, కాపిటలిజం, బొందలపాటి వాదం.. (seriously :-) )”

  1. బొందల పాటి వారు,

    బొంది లో ప్రాణం వున్నంత వరకు ఆ డార్విన్ గద్దపోడు మనకు చేసిన బొందన్యాయం మరిచి పోలేనిది. బొందో బొందస్య ఇండియా బొందే బొందః!

    లెనిను, మార్క్సు వాళ్ళ వూళ్ళో నే బాల్చీ కట్టినా మన దేశం లో ఇంకా కిక్కింగు !

    అన్ని వాదాలూ , అదేమీ చోద్యమో గాని, మన దేశం వచ్చి సెట్టేల్ అయిపోతవి. ఆ పై అవి మరో ప్రపంచం పిలిచింది అనేస్తూ వుంటాయి! మనం చానా పాత వాల్లమేమో చాదస్తం కాస్త ఎక్కువే ! దేన్నీ వదలం వేదం తో చేర్చి!

    చీర్స్
    జిలేబి.

    మెచ్చుకోండి

  2. “..ఆ డార్విన్ గద్దపోడు మనకు చేసిన బొందన్యాయం మరిచి పోలేనిది.”
    నిజమే..లేక పోతే, మనం జంతువుల నుంచీ వచ్చాం అంటాడా..? ఎంతవమానం..!

    “లెనిను, మార్క్సు వాళ్ళ వూళ్ళో నే బాల్చీ కట్టినా మన దేశం లో ఇంకా కిక్కింగు !
    అన్ని వాదాలూ , అదేమీ చోద్యమో గాని, మన దేశం వచ్చి సెట్టేల్ అయిపోతవి.”
    “వాళ్ళు వాళ్ళ వాదాలూ ఎక్కడ బాల్చీ కట్టినై/కొట్టినై”, అని కాదు అన్నాయ్/అక్కాయ్, “వాళ్ళు చెప్పినదాంట్లో పస ఉందాలేదా?”, అనేదే ముఖ్యం.
    ఇక్కడ , “మనవాళ్ళుత్త వెధవాయిలోయ్! “, అప్ప్లై అవుతుందనుకొంటాను.
    లేక మన హృదయం చాలా విశాలమా?

    ఇట్లు,
    “bond” a la “paati”.
    జస్టు కిడ్డింగు 🙂

    మెచ్చుకోండి

  3. అతడు సిన్మా లో సునీల్ లా, కన్ఫ్యుసన్ గా ఉన్నా అర్ధం అయినట్లు ఉంది 🙂

    Lol కొ-ఆపరేటివ్ సంస్కృతి ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో బలపడుతోన్నది. ఆ సామ్యవాదం గట్రా అంటే సరిగా తెలిదు కాని 🙂

    మెచ్చుకోండి

  4. మానవతా వాదం తో సమస్య మానవ లక్షణాలలోని మంచి లక్షణాలని తీసుకోవటంలో ఉంది. ఏది మంచి లక్షణం, ఏది చెడు లక్షణం అనేది చాలా సాపేక్షమైన, స్థిరత్వం లేని, చలనశీలమైన వ్యహారం. మానవ లక్షణాలైన అసూయా, అధికార దాహం, హింస మొదలైనవి మానవత్వ లక్షణాలు కావు. కానీ మానవత్వ లక్షణాలూ ఈ చెడు లక్షణాలూ కలిసిమెలిసి జంటగా ఉంటాయి.ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. ఒక్కొసారి హింస లోనే మానత్వం ఉండవచ్చు. అలానే ఒక్కోసారి మంచి కోసం మోసం చేయవచ్చు. కానీ ఈ మంచిని నిర్వచించలేము.

    మెచ్చుకోండి

  5. బొందలపాటిగారు. చాలా మంచి చర్చ.

    ముందుముందు ప్రపంచం సామ్యవాదం దిశగా వెళ్ళడం సాధ్యపడవచ్చు. కంప్యూటర్ ప్రపంచంలో “Opensource initiative” అటువంటిదే. అలాగే “Open patent initiative” కూడా కొంతమంది శాస్త్రవేత్తలు మున్ముందు మొదలు పెట్టొచ్చు. తద్వారా Monopolyలు తగ్గవచ్చు.

    కమ్యూనిజాన్ని కృత్రిమంగా చొప్పించడం కన్నా, సమాజంలో మార్పు దానంత అదిగా రావడమే మంచిదనుకుంటాను. అయినప్పటికీ అప్పటివరకైనా కాపిటలిస్టుల శృతిమీరిన స్వార్థాన్ని నివారించడానికి కమ్యూనిస్టుల Resistence ఉండడం కూడా అవసరమేనేమో?

    మెచ్చుకోండి

  6. హరి గారు,
    ఓపెన్ సోర్స్ గురించి ఆసక్తికరమైన సామ్యం చెప్పారు. సమాజం లో వైవిధ్యం ఎక్కువైతే అది మెరుగు గా మనగలుగుతుంది. ఈ వైవిధ్యం లో సామ్యవాద దృక్కోణానికి కూడా స్థానం ఉంది. ఒక దేశం లో ప్రైవేటు సంస్థలూ, పబ్లిక్ సంస్థలూ రెండూ ఉన్నాయను కొందాం. ప్రైవేటు సంస్థలు అన్నీ ఫెయిలైన సందర్భం లో (may be because of taking too much risk), “పబ్లిక్” యాజమాన్యం అక్కరకు వస్తుంది. అలానే పబ్లిక్ సంస్థ అలసత్వాన్నితగ్గించతం లో ప్రైవేటు సంస్థలు పాత్ర పోషిస్తాయి. ప్రైవేట్ , పబ్లిక్ సంస్థలు mutually complimentary గా పని చేసేటట్లు వాటి మధ్య ఒక creative relation ship, allotment of portfolio ఏర్పాటు చేయవలసిన బాధ్యత policy makers కు ఉంటుంది.
    ప్రైవేట్ సంస్థలే ఉన్న దేశాలు , they are more vulnerable and long term survival may be at stake. .

    మెచ్చుకోండి

  7. భూమి గుండ్రంగాఉంది కాబట్టి ప్రపంచం కూడ ఎన్ని చుట్లు తిరిగినా, తిరిగి తిరిగి బయలు దేరిన చోటికే చేరాలనే వాదమొకటి ఉందిగదా! డార్విన్ మహాశయుడు కనిపెట్టినట్లు మనిషి జంతువునుంచి పుట్టాడ కాబట్టి, మని
    షినుంచి మరో వింతజంతువు త్వరలోనే పుట్టే అవకాశం ఉన్నట్లు కన్పిస్తోంది నాకైతే.

    మెచ్చుకోండి

  8. “ఎలా ఉంది నా వాదం? ఆ నీ బొంద లో బొందలపాటి వాదం అంటారా?”

    ఏమో! వర్గశతృవులను తుదముట్టించాక గాని ఏ వాదం గొప్పదో తేలదు.

    మెచ్చుకోండి

  9. బొన్లలపాటి గారు
    ఎదైనా ఒక దానిగురించి లెదా వ్యెక్తి గురించి మనం ముందుగానే ఒక అభిప్రాయం ఎర్పర్చుకుంటె ఆ అభిప్రాయాలకు అనుగునంగానే మన ఆలొచనలు మనప్రవర్తన వుంటాయి అలాగె మీరు దానిగురించి ఒ నా మ హా లు కుడా తెలియదు ఈవిషయం మీ బ్లాగుల సమాచారం చుస్తె తెలుస్తుంది తెలియకుండానే కమ్మునిజం గురించి ఒక అభిప్రాయాన్ని ఎర్పర్చు కున్నారు కాభట్టి మీరు ఆచట్రం లొనే ఆలొచిస్తారు నేను కమ్మునిస్టు ప్రాణాలిక చదివినాను కదా అని మీరు అడగవచ్చు కాని అదిచదివినా కుడా పై పై విషయాలు తప్ప ఎమీ అర్దం కాదు ఎలా చెప్పవచ్చునంటె ప్రణాళిక పెట్టుబడిదారై సమాజం అంటున్న మనయుగానికి బానిస ప్యుడ సమాజాలకు జరిగిన పరివర్తనలు చెప్పరు అంతెగాని ఎలా ఏంటి అనె విషయం చెప్పలెదు అదికాక అందులొ కొన్నివిషయాలు 1948 కి మాత్రమే వర్తిస్తాయి ఈ విషయాలు ప్రాణాళికలొ మార్క్స్ ఎంగెల్స్ {మీ బాషలొ గడ్డపాయనలు} చాలా స్వస్టంగా చెప్పారు ప్రాణాళిక రాసెసమయాని మార్క్స్ అప్పటికి అదనపు విలువ కనిపెట్టలెదు ఉదాహరణకు చెతివ్రుత్తులను పారిశ్రామిక అభివ్రుద్ది వల్ల నాశనమై పొతాయి అన్నారు కదా ఎందుకు నాశనమై పొతాయొ అక్కడ వివరన లెదు అలాగె సంక్షొభాలు వస్తాయన్నారు అది గత సమాజాలలొ లెదు ఎందుకు లెదు దాని పర్యవ సానాలు కార్మిక వర్గం పై ఎలావుంతుంది పెట్టుబడిదారి వర్గంపై ఎలావుంతుంది అలాగె నిరుద్వొగం పెట్టు బడిదారి సమాజానికే ప్రతెకం ఎందువల్ల ? ప్రాణాళికలొ ఒక సమాజాని మరొకసమాజాని ఘటనలు మాత్రమే చెప్పభడింది ఎలా ఎందుకు అనే వివరణ లెదు అది తెలియాలంటె కాపిటల్ చుడాలి
    కాపిట చదవాలనే మిమ్మల్ని యవరూ భలవంతపెట్టరు అలాగ యవరికై హక్కు వుందదు చదువుతారా లెదా అనెది అది మీ ఇస్టం మీ వ్యెక్తి గతం సంభాషణ ప్రారంభమై నప్పుడు మీ సందెహాలకు మీకు రాని సందెహాలకు కాపిటల్ ని చూసించి వుంటారు
    ఇకపొతె మార్క్స్ వ్యెక్తిగత జీవితం గురించి మార్క్స్ సమాది వద్ద ఎంగెల్స్ ప్రసంగ పాటాన్ని చూడవచ్చు ఆయన వ్యెక్తిగత జీవితంలొ సిద్దాంతపరమైన భెదాభిప్రాయాలు వ్యెక్తి గత శెత్రువులు ఒక్కరంటె ఒక్కరు కూడా లెరు ఆయన ఎంతటి విప్లవకారుడొ అంతటి ఆచరణవాది మార్కిజం అనెది అంతర్జాతియ సిదాంతం దాని శెత్రువులు అంతలక్కడా వుంటారు సిద్దాంతపరంగా ఎదుర్కొనప్పుడు వ్యెక్తి గతజీవితంపై దాడికి దిగుతారు ఆవిషం ముక్యంగా మీలాంటి వారిపైన భాగాపని చెస్తుంది ఊగీసలాడె వారిపైన.
    చలం గారు అన్నాట్టు మన ఎదుట చిరునవ్వు చిందించి పక్కన మిత్రులదగ్గర విషం కక్కె స్నెహితుడు కన్నా మనల్ని చుస్తానే కొపంతొ పట పట పళ్ళు కొరికె శెత్రువు ఎన్నొరెట్లు నయం
    కమ్మునిస్టు పార్టి అని పెరు పెట్టుకొని ఆచరణలొ తుగలొ తొక్కెవారికన్నా మీరెనయం

    మెచ్చుకోండి

  10. రామమోహన్ గారు,
    నాకు కమ్యూనిజం గురించి చాలా తెలుసని నేను ఎప్పుడూ చెప్పలేదు (మీకంటే నాకు ఎక్కువ తెలియక పోవచ్చు ).దాని గురించి నిలకడైన అధ్యయనం కూడా చేయలేదు. అలానే నాకు అసలు ఏమీ తెలియదు అని మీరనటం కూడా సరి కాదు.నాకు కమ్యూనిజం మీద ద్వేషం లేదు. నేను ఓపెన్ మైండ్ తోనే దానిని చూస్తాను. కమ్యూనిజం ని గుడ్డి గా వ్యతిరేకించే వారిని ఉద్దేశించి ఈ టపా లోనే కొన్ని విమర్శలు చేశాను.
    కమ్యూనిజం గురించి ప్రశ్నలు వేయటానికి తప్పని సరిగా కాపిటల్ చదివి ఉండాలని నేను అనుకోవటం లేదు.
    మీకు కమ్యూనిజం గురించిన మంచి అవగాహన ఉన్నట్లుంది. మీరే ఈ తరపు కుర్ర కారు అపోహలను తొలగిస్తూ ఒక బ్లాగ్ ఎందుకు మొదలు పెట్టకూడదు?

    మెచ్చుకోండి

  11. కేవలం బ్లాగుల్లో చదివే దాని ప్రకారం విశ్లేషణలు వ్రాస్తే మీరు అసలు విషయం అర్థం కాదు. ఇక్కడ బ్లాగర్లు తాము కేవలం హిందూ మత పరిరక్షణ కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కమ్యూనిజానికి వ్యతిరేకమైన వైయుక్తికవాదం అనే సిద్ధాంతం ఉంది. వాళ్ళు వ్యక్తి సమాజానికి అతీతుడనీ, సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తి ప్రయోజనాలే ముఖ్యమనీ నమ్ముతారు. వివరంగా చెప్పే సమయం నాకు లేదు. జీన్‌పాల్ సార్ట్ర్, మార్టిన్ హీడెగ్గర్‌లపై ఏటుకూరి బలరామమూర్తి గారి విమర్శలు చదవండి. ఒక్క విషయం మాత్రం ఇక్కడ చెపుతున్నాను. తెలుగు బ్లాగుల్లో కమ్యూనిజాన్ని విమర్శిస్తూ వ్రాసేవాళ్ళకి కమ్యూనిజం గురించి ఏమీ తెలియదు. పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి కూడా ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసినవి రెండే రెండు ముక్కలు “కమ్యూనిజం స్వేచ్ఛని హరించును, ఫ్రీ మార్కెట్ వ్యవస్థలో మాత్రమే స్వేచ్ఛ ఉండును” అనేవే ఆ ముక్కలు.

    మెచ్చుకోండి

  12. బొందలపాటి గారు, మీరు మార్క్సిజం పూర్తిగా చదివిన తరువాతే విశ్లేషణలు వ్రాయండి. కేవలం బ్లాగుల్లో చదివిన వాటి ఆధారంగా వ్రాస్తే అది అజ్ఞానమే అవుతుంది. ఎందుకు చెపుతున్నానంటే ఈ బ్లాగర్లు కేవలం “ఊహాజనితమైన మతం” కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకోవడం నమ్మశక్యంగా లేదు. సమాజాన్ని అన్నిటికంటే డబ్బే ఎక్కువ ప్రభావితం చేస్తుంది కానీ మతం అంతగా ప్రభావితం చెయ్యదు అనేది మార్క్సిస్ట్‌లందరికీ తెలిసిన విషయమే. మతాన్ని నమ్మేవాళ్ళలోనే ఒకడు paganismని నమ్ముతాడు, ఇంకొకడు deismని నమ్ముతాడు, ఇంకొకడు క్రైస్తవ మతాన్ని నమ్ముతాడు, ఇంకొకడు ఇస్లాం మతాన్ని నమ్ముతాడు. అసలు మతాన్ని నమ్మడం లేదా నమ్మకపోవడం అనేది పెద్ద సమస్య కాదు కానీ బ్లాగుల్లో ఎక్కువగా మతం గురించి చర్చ జరగడమే హాస్యాస్పదంగా ఉంది. సద్దాం హుస్సేన్, రొనాల్డ్ రీగన్ లాంటి కరడుగట్టిన anti-communists అందరూ తాము ప్రైవేట్ ఆస్తి కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకున్నారు కానీ కేవలం ఊహాజనితమైన మతం కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నవాళ్ళని ఈ బ్లాగుల్లో మాత్రమే చూస్తున్నాను.

    మెచ్చుకోండి

  13. పూర్తిగా చదివిన తరువాత రాయాలంటే ఎప్పటికీ రాయలేం. తెలిసిన వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎవరైనా తార్కికం గా చెప్తే నేర్చుకోవచ్చు. దేవుడి పై నమ్మకం ఆధారం గా కమ్యూనిజాన్ని అవలంబించటం లేక అవలంబించకపోవటం చేయనక్కర లేదు అనుకొంటా.! దేవుడినీ వేదాలనూ నమ్మి కూడా కమ్యూనిజాన్ని నమ్మిన వారున్నారు. తెలుగు నాట దాశరధి రంగాచార్య, రా.వి. శాస్త్రి ఇందుకు ఉదాహరణలు.

    మెచ్చుకోండి

  14. హిందువులలో రెండు వర్గాలవాళ్ళు ఉన్నారు. Those who believe RSS ideology are inclined towards virulent anti-communistic tendency. Arya Samajiks are reformists. Though they are not communists in sense, they are not virulent in ideology like RSS. Swami Agnivesh acted as spokesman of Maoist party for peace talks though Maoists made open criticisms on Hinduism during the rule of BJP. మతం మొదటి నుంచి ఊహాజనితంగానే ఉంది. వాస్తవ ప్రపంచంలో మనిషి మతాన్ని ఆచరించే సందర్భాలు తక్కువ. అందుకే ఈ బ్లాగర్లు కేవలం మతం కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకోవడం నమ్మశక్యంగా లేదు అని అంటున్నాను.

    మెచ్చుకోండి

  15. నాస్థికుడిని కాబట్టే కమ్యూనిస్టుని అని చెప్పుకునే దివాళా కోరులు బ్లాగుల్లో నలుగురైదుగురికన్నా ఎక్కువలేరు.

    మెచ్చుకోండి

  16. బొందలపాటి గారూ నాకర్థమయినదాని ప్రకారం ఇక్కడ విషయం కమ్యూనిజం vs మతం కన్నా కమ్యూనిజం పేరుతో ఒకరి మతానిపై విషం చిమ్మటం.

    మెచ్చుకోండి

  17. వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
    మనుషుల నైతిక స్థాయి లో వచ్చే సకారాత్మక పరిణామం వలన ఒక మనిషి మరొక మనిషిని దోచుకోవటాన్ని స్వఛ్ఛందం గా తగ్గిస్తాడు. కానీ మనిషి కి knowledge పెరిగే కొద్దీ దానిని ఒక పదునైన కత్తిలా స్వార్ధానికే ఉపయోగిస్తున్నాడు. (సబ్-ప్రైం సంక్షోభానికి ఇలాంటి ఫైనన్స్ ప్రొఫెషనల్స్ కూడా ఒక కారణం కదా?). మనిషి నైతిక స్థాయి పెరిగే మార్గం మన విద్యా వ్యవస్థ, నాయకత్వం చేతిలో ఉంటుంది. విద్యా వ్యవస్థ ఉన్నతమైన విలువలు నేర్పితే, రాజకీయ నాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజం లో తగిన రివార్డ్ వచ్చే వ్యవస్థ ని కల్పించాలి. కానీ, ఇక్కడ కూడా, It seems we are fighting a loosing battle.

    మనుషుల నైతిక విలువలకి అతీతం గా., as more and more people become aware of their rights and demand their due share, Eqaulity can be ushered in through democratic means also.అందుకనే నాకు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీలు electoral politics లో పాల్గొనటం సరైన నిర్ణయమే అనిపిస్తుంది(Eventhough undiluted marxism does not support this.I feel Indian commy decision is correct here.Once commy parties follow democracy, they need to forget about proletariat dictator ship and all that ensues) కాకపోతే మన సమాజం లోని కుల మతాల మాయనుంచీ ప్రజలను బయటపడేసి, వారిని కన్విన్స్ చేయటం లో మన కమ్యూనిస్ట్ పార్టీలు విఫలమై, మిగిలిన రాజకీయ పార్టీల లానే తయారవుతున్నాయి. అలానే అధికారం లో ఉన్న పార్టీల తో పొత్తుపెట్టుకొనే socalled short term వ్యూహాత్మక నిర్ణయాలు, వాళ్ళను ఎప్పటికీ ఆ తరహా విధానాలకు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. This is my opinion.

    మెచ్చుకోండి

  18. *హిందూ మత పరిరక్షణ కోసం కమ్యూనిజాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు*
    నేను కమ్యూనిజాన్ని వ్యతిరేకించేది, హిందూ మత పరిరక్షణ కోసం కాదు, నా కామన్సెన్స్ పరిరక్షణ కోసం.
    * మీరు మార్క్సిజం పూర్తిగా చదివిన తరువాతే విశ్లేషణలు …*
    ప్రస్తుతం రాస్తున్నాది కదా ఒక వంకాయమ్మ. ఇంకా అందరు ఆపుస్తకాలు చదివి బుర్ర పాడుచేసుకోవాలా? అందరూ చదువుతూ కూర్చొంటే అమలు చేసేవారు ఎవ్వరు? పుస్తకాలు చదివి ఎవరికి నచ్చిన అనాలసిస్ వారు చేసుకొని, నాది సరి అయినదంటె నా అనాలిసిస్ సరి అయినదని, ఈ మొడలే అమలు జరపాలని కొట్టుకొని చస్తారు.

    మెచ్చుకోండి

  19. శ్రీరాం గారు,
    కంపెనీలలో ఓ ప్రాజెక్ట్ చేయాలంటేనే దానికి నాలుగైదు అప్రోచ్ లని చర్చిస్తారు. అలానే ఇక్కడ కూడా మోడళ్ళ గురించి కొట్టుకొంటారు. కాకపోతే కంపెనీలో నిర్ణయం తీసుకొనే వాడు ఒకడుంటాదు. ఇక్కడ ఉండడు, కాబట్టీ వీళ్ళలో వీళ్ళు కొట్టుకొంటారు.
    వంకాయమ్మ? ఎవరు? మీకు చాలా ఇష్టమైన దాని లా ఉందే? 🙂

    మెచ్చుకోండి

  20. My last night’s valid point is not seen here. I condemn supressing of free-expression here. It may resembled someone’s life here and was unintended. Interview with Gavarayya is true to the best of my knowledge and belief.

    I condemn , I condemn Icondemn.

    మెచ్చుకోండి

  21. Hello bondalapati garu,
    It is a very good analysis. I have a few comments on this.

    6. “నేను” ఏర్పడిన తరువాత ఏర్పడిన పరిణామాలన్నీ మనిషి యొక్క స్వార్ధాన్ని బలపరిచే దిశలోనే జరుగుతున్నాయి. అది ఏ వాదమైనా, మనిషి యొక్క వ్యక్తి పరమైన హక్కుల రూపం లో, ఈ “నేను” ని బల పరిచే దిశ లోనే అభివృధ్ధి జరుగుతోంది.ఈ దిశ ని మళ్ళీ వెనుక కు మళ్ళించి, మనిషి ని సహజమైన దిశ వైపుకి మళ్ళించటం అసాధ్యం లా కనిపిస్తుంది. కాబట్టీ వచ్చే కాలం లో మనిషి తన greediness నడిపించిన దిశలోనే నడుస్తాడని చెప్పవచ్చును.ఏ సిధ్ధాంతాన్నైనా మనుషులు buy చేయాలంటే, దానిలో వారి స్వార్ధానికి ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడే అంశం ఉండాలి.
    Even if we think from a “selfishness” point of view, socialism makes more sense. (Like you mentioned englightened selfishness). Individuals can be safe and happy only if majority of the people are safe and happy. A rich individual cannot be safe if a section of the society is very restless. I personally would prefer my children to grow up in a drug free and crime free environment. I would like to live in a traffic free, pollution free and stress free environment, which I think is not possible in a capitalist society.

    8. కమ్యూనిస్ట్ ల ని వ్యతిరేకించే వారు వారిని నాస్తికత్వం గురించి తరచూ విమర్శిస్తారు. అయితే, నాస్తికత్వం అనేది కమ్యూనిజం కి ఒక central point కాదు. ఈ సృష్టి కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తుంది. ఆ సూత్రాల వెనుక దేవుడు ఉన్నాడా లేడా అనేది, వ్యక్తి గతమైన నమ్మకం. కానీ ఆ సూత్రాలు మాత్రం మారవు. అలానే మనిషి కి తనదైన సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు ఇచ్చాడా లేదా అనేది వేరే విషయం. కాబట్టీ, మనిషి తన సంకల్ప బలాన్ని ఉపయోగించి, ఆ సూత్రబధ్ధమైన ప్రపంచం లో విప్లవాల ద్వారా మార్పు తీసుకొని రావటానికి ప్రయత్నిస్తాడనే, కమ్యూనిజం చెబుతుంది.
    Communists are not against religion. They are against organized religion which is being used as a tool of oppression for hundreds of years. I agree that religion is never the central point of Marx’s theories. Marx said “ Religion is the sigh of the oppressed creature, heart of the heartless world, soul of the soulless conditions. It is the opium of the people”.
    He said that it is the “heart” of the heartless world. This shows that he was sympathetic to why people embraced religion and wanted to remove the miserable conditions which lead people to find solace in religion.
    I think Communists should never get into argument whether GOD exists or not. They should just fight against the religious beliefs which are against social equality and justice – like the devadasi system, caste system , supersitions etc

    . ఒకప్పటి సామ్యవాద దేశాలలో “మానవాభివృధ్ధి సూచికలూ, తక్కువ గా ఉన్న నేరాల స్థాయీ”, ఈ విషయాన్ని ధృవ పరుస్తాయి. (రష్యా లో మెరుగైన, తక్కువ ఖరీదైన మౌలిక సదుపాయాల గురించి భండారు శ్రీనివాస రావు గారు, transition లో ఉన్న రష్యా లో నివశించి, తన అనుభవాలను టపాలు గా వేశారు. ఆయన కమ్యూనిస్ట్ కాదు. ఆయన టపాలు చదివిన తరువాత నా అభిప్రాయలను ధృవ పరచుకొన్నాను. ఇప్పుడు ఆయన తన బ్లాగ్ template మార్చటం వలన ఆ టపా ల కు లింక్ ఇవ్వలేక పోతున్నాను.) ఒకప్పటి సామ్య వాద, గ్రామీణ భారతం లో కూడా ఈ నేరాలు తక్కువ. డబ్బు లేని చోట డబ్బు గురించి జరిగే నేరాలు తక్కువ కదా! అలానే కనీసావసరాలు అన్నీ తీరుతున్నపుడు, వాటి కోసం నేరాలు చేయవలసిన అవసరం ఉండదు.
    Russia was not socialist. It was state capitalist. Crime could be low under any “benevolent” dictator. The crime rate in Singapore, which is a non socialist country is low .
    India was never socialist. Our villages were feudalist and not socialist. Indian farmers would rather commit suicide than commit a crime. That doesn’t mean crime was low in villages because their needs are met.
    10. మనుషుల లో అనాది గా వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణ ఉంటూనే ఉంది. అలానే మనిషి కోరికలు ఒక పట్టాన తీరేవి కాదు. మనిషి తన సుఖం యొక్క level పైకి జరిగినపుడు మాత్రమే, ఆనందం పొందుతాడు. అంటే మనిషి ఒక విజయం పాతబడిన తరువాత , తరువాతి విజయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త విజయాలు వచ్చినపుడల్లా ఆనందపడుతూనే ఉంటాడు. ఈ cycle కి అంతం లేదు. ఇది మనిషి పరిణామ పరం గా ఏర్పడిన మానసిక వ్యవస్థ (సాఫ్ట్ వేర్) యొక్క పరిమితి. మానసిక వ్యవస్థ లేని జంతువులు ఆకలివేసినపుడు తింటాయి. లేకపోతే లేదు. కానీ మనిషి, ఒక ఆనందాన్ని గుర్తు పెట్టుకొని, దానిని మళ్ళీ మళ్ళీ పొందటానికి ప్రయత్నిస్తాడు.మనిషి లో పక్క వాడి కంటే తాను ముందుండాలనే కోరిక కూడా ఉంటుంది.ఈ లక్షణం మనిషికి జంతువు ల నుంచీ వారసత్వం గా వచ్చింది.
    ఈ లక్షణాలనీ పెట్టుబడి దారి వ్యవస్థకి చోదకాలైతే, సామ్యవాద వ్యవస్థ కి ప్రతి బంధకాలు.
    The definition of “success” or “happiness” may differ in both socialist and capitalist societies but I don’t agree the a socialist society wouldn’t allow a person to increase his “level” of happiness. For example, if in a capitalist society a person can find more happiness in procuring a bigger home or a bigger car, in a socialist society he might find his happiness by inventing something new etc or doing his job better than the rest.
    11. మార్క్సిస్ట్ మేధావులనూ, ఇంకా అనేక ఇజాల(దళిత వాదం, స్త్రీ వాదం, తె. వాదం) మేధావులనూ, కొన్ని సూటి ప్రశ్నలు అడిగినపుడు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించకుండా, “నువ్వు కేపిటల్ చదివావా??, లేక అదేదో గ్రంధం చదివావా?”, అంటూ తప్పించుకోచూడటం సరైనది కాదు. పైగా ఇదొక కొత్త వివక్షా కులాన్ని తయారు చేయటం లాంటిది (“గ్రంధాలు అన్నీ చదివిన వాడి కులం” Vs “చదవని వాడి కులం”).
    I think they might be asking that question because people criticize Marx without even reading a single work of his. If they criticize his work , like logically pointing out to the flaws in his thinking, it is understandable but how can they criticize something which you haven’t even read? \
    I have read some of Marx’s works and I think they are extremely logical and he is a great original thinker. His writings definitely sharpened my brain

    మార్క్స్ తన సిధ్ధాంతాలకి విరుధ్ధమైన వ్యక్తిగత ప్రవర్తన కలిగి ఉన్నాడనేది ఇంకొక అభియోగం. ఇది నిజమైన పక్షం లో మనం, “ఎదుటి వారికి చెప్పేటందుకే ఆదర్శాలున్నాయి!”, అనుకోవాల్సిందే!మార్క్స్ వ్యక్తిగతం గా చెడ్డవాడే అనుకొందాం. అతనికి తాను పాటించని ఆదర్శాలు చెప్పే హక్కు లేదు. సరే!కానీ ఆదర్శాలు చెప్పేశాడు. ఆ పని అయిపోయింది. ఇప్పుడు మనం అతను చెప్పిన విషయాలలోని సత్యాన్ని గ్రహించవచ్చు కదా? ఒక వెధవ చెప్పిన మంచి మాటలలోంచీ మంచిని ఎందుకు గ్రహించకూడదు?
    I totally agree with you on this
    I doubt the credibility of the allegation that he had an affair with someone. But even if he did, it is his personal choice. Nothing against his principles. Marx lived in poverty most of his life. He lived on the money his friends provided him or the remittances from his writing. Overall, he led a down to earth and noble life.
    Marx MIGHT have had some personal flaws but we can’t discredit his work based on some flaws in his personality
    12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.
    I think in human evolution, 100 years is a very short span to test Marx’s theories. Marx said that we will see socialism in advanced capitalist societies first. I think the advanced capitalist societies are moving towards socialism (inspite of their economic imperialism).
    They are progressing towards social equality . They are progressing towards equal rights for women, gay rights(gay marriages are legal in some western countries) , aboriginal rights, children’s rights etc. Economic equality could be the next step -very high tax rates for the rich public health care are already in place in many western countries. A few of the super rich like Warren Buffet and Bill Gates are donating most of their wealth towards charities.
    18.వర్గ శత్రువులని అంతమొందించటం నైతికం గా తప్పని నా అభిప్రాయం.(వర్గ శతృవులని అంతమొందించటమే ఆదర్శం గా కల వారు, చర్చల లో మాత్రం తమ తో సున్నితం గా వాదించాలనటం నాకు అంతు చిక్కదు. ) ఎందుకంటే, వర్గ శత్రువు స్థానం లో విప్లవ కారుడు ఉన్నా, అతని లా డబ్బు కూడేసి దోపిడీ చేసేవాడే. (ఒక వేళ అలా చేయక పోయినా, ఎదుటి మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికీ ఉండదు). కమ్యూనిజం లోని హింస నాకు నచ్చలేదు. కానీ సమాజ వ్యవస్థ కూడా హింస ని అమలు చేస్తుంది అనేది కూడా నిజం. అయితే ఈ హింస subtle గానూ, polished and spread out గానూ ఉంటుంది. కమ్యూనిస్టులు సమాజ హింస కి ప్రతి హింస మాత్రమే చేస్తున్నమని చెప్పినా, అది నైతికం గా సమాజ స్థాయి కంటే ఉన్నతమైనది అవ్వదు.(మేము మెరుగైన సమాజం కోసం హింస చేస్తున్నామని కమ్యూనిస్ట్ లు సమర్ధించుకోచూసినా సరే!) తార్కికం గా మాత్రమే హింస కి ప్రతి హింస కి ఒక justification అవ్వ వచ్చు.
    The most non violent person Gandhi himself said “Poverty is the words form of violence”. A violent fight against poverty is not unethical in my view. Do you think the people in power would give up just like that without putting up a fight?

    మెచ్చుకోండి

  22. I don’t think that religion is the reason for anti-communism. Even the Saddam Hussein (one of the most hardcore anti-communists) was not the strong believer of religion, though he chanted about god and prophet when the court imposed death sentence to him. Saddam Hussein even killed his own kin for power. I don’t think that such people have much regard on religion.

    దేవుణ్ణి విశ్వసించడం, విశ్వసించకపోవడం అనేది పెద్ద విషయం కాదు. రంగనాయకమ్మ గారు వ్రాసిన “నీడతో యుద్ధం” పుస్తకం చదివాను. అందులో కార్ల్ మార్క్స్ కోట్ ఒకటి వ్రాసారు. “చర్చ్ తాను ఏర్పరుచుకున్న 28 సూత్రాలపై ఎన్ని విమర్శలు చేసినా చర్చ్ అధికారులు భయపడరు. కానీ ఆస్తి సంబంధాల గురించి మాట్లాడితే చర్చ్ అధికారులు కదులుతారు.” సమాజంలో ఎవరైనా దేవుడు, దెయ్యం లాంటి విశ్వాసాల కంటే డబ్బుకీ, ఆస్తికీ అధిక ప్రాధాన్యత ఇస్తారనే కదా దీని అర్థం. చర్చ్ అధికారులైనా సరే ఊహాజనితమైన మతం కంటే భౌతికమైన డబ్బుకీ & ఆస్తికే అధిక ప్రాధాన్యత ఇస్తారు.

    మెచ్చుకోండి

  23. Bondalapati wrote:
    >>>>>
    12. మార్క్సిజం శాస్తీయమైనదని, ఆ వాద సమర్ధకులు చేసే ఇంకొక వాదన. శాస్త్రీయమైనదేదైనా, భౌతిక నిరూపణలకు లోబడాలి. సామ్యవాదం ఇప్పటి వరకూ నిరూపించబడలేక పోయింది అనే విషయాన్ని మరువ కూడదు. సామాజిక సిధ్ధాంతాల విషయం లో భౌతిక నిరూపణ చేయటం ఎంత అసంగతమో కూడా మార్క్సిస్టులు ఆలోచించాలి. “సైంటిస్టులకి సామాజిక స్పృహ లేనంత (అర్ధం కానంత) మాత్రాన వారు సైంటిస్టులు కాకుండా పోరు”, అని నేను నమ్ముతాను.
    >>>>>

    వైయుక్తికవాదం మార్క్సిజానికి వ్యతిరేకం అనేది తెలిసిన విషయమే. సామాజిక స్వేచ్ఛ కంటే వ్యక్తి స్వేచ్ఛే గొప్పదని వాదించే వైయుక్తికవాదులు తమ వాదానికి భౌతిక నిరూపణ ఇవ్వగలరా? మార్క్సిజాన్ని విమర్శించే వైయుక్తికవాదులకి తమ వాదానికి భౌతిక నిరూపణలు చూపించే బాధ్యత లేదా? మనిషికీ, సమాజానికీ మధ్య ఉన్న సంబంధం గురించి కార్ల్ మార్క్స్ తాను ఫోయెర్‌బాఖ్‌ని విమర్శిస్తోన్న సమయంలోనే చెప్పాడు. మార్క్సిజం చదవకుండా మార్క్సిజాన్ని విమర్శిస్తే ఆ విమర్శలలో సమగ్రత ఉండదు కాబట్టే మార్క్సిజం చదివిన తరువాతే విమర్శలు వ్రాయమని సూచించాను.

    మెచ్చుకోండి

  24. మార్క్సిజాన్ని వ్యతిరేకించే చంద్రభాన్ ప్రసాద్ అనే రచయిత రచనలు చదివాను. మార్క్స్ ఏమి వ్రాసాడో చంధ్రబాన్ ప్రసాద్ ఎన్నడూ ఉదహరించలేదు కానీ లెనిన్ వ్రాసిన కొన్ని విషయాలు మాత్రం ఒక వ్యాసంలో ఉదహరించాడు. అతను పెట్టుబడి వల్ల ఇంత అభివృద్ధి జరిగిందనీ, అంత అభివృద్ధి జరిగిందనీ గొప్పలు చెపుతాడు. చైనాలోని డెంగ్ సియావోపింగ్ ఆర్థిక విధానాలని కూడా పొగుడుతాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక అసమానతలు ఉంటాయని అతను ఒప్పుకునా ఆ అసమానతలు సహజమేనని వాదిస్తాడు. అతని వాదనలలో అనేక లోపాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి వ్రాసే సమయం నాకు లేదు. అయితే తెలుగు బ్లాగుల్లో కమ్యూనిజాన్ని విమర్శిస్తూ వ్రాసే వాళ్ళకి పెట్టుబడి గురించి కూడా ఏమీ తెలియదని ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళకి చంద్రభాన్ ప్రసాద్‌కి తెలిసిన విషయాలు కూడా తెలియవు. మార్క్సిస్ట్‌లు తమ మతం మీద పడి ఏడుస్తున్నారంటూ వాళ్ళు మార్క్సిస్ట్‌లని తిడతారు (మతం ఊహాజనితం అని తెలిసినా). ఆ విమర్శలు పని చెయ్యకపోతే మార్క్సిజం కూడా మతం లాగే ఊహాజనితం అనీ, అందుకే అది రష్యాలో విఫలమైనదనీ వాదిస్తారు. రష్యాలో స్టాలిన్ కాలంలో ఉన్నది transitional government మాత్రమే కానీ కమ్యూనిజం కాదు అనే విషయం వాళ్ళకి తెలియదు. ఆ transitionని కృష్చేవ్ కావాలనే నిలిపివేశాడు అనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఈ విషయాలు ఏమీ తెలియకుండా పైన చెప్పిన రెండు రకాల విమర్శలనే అరిగిపోయిన రికార్డ్‌లలాగ తిప్పుతారు.

    మెచ్చుకోండి

  25. స్వప్న గారు,
    Thank you!
    ఈ కింది పాయింట్ల గురించి నేను మాట్లాడుతాను. అంటే, మిగిలిన పాయింట్ల విషయం లో నేను మీతో అంగీకరిస్తాను.
    /*Russia was not socialist. It was state capitalist. Crime could be low under any “benevolent” dictator. The crime rate in Singapore, which is a non socialist country is low .
    India was never socialist. Our villages were feudalist and not socialist. Indian farmers would rather commit suicide than commit a crime. That doesn’t mean crime was low in villages because their needs are met.**/

    నేరాలు తక్కువ ఉన్నవన్నీ సామ్యవాద సమాజాలు కానక్కర లేదు. గల్ఫ్ దేశాలలో కూడా నేరాలు తక్కువే కదా? మన పాత ఇండియా ఇప్పతి తో పోలిస్తే సాపేక్షం గా సోషలిస్ట్ అని నా అభిప్రాయం. పూర్తి గా సోషలిస్ట్ కాదని నేను అంగీకరిస్తాను. గ్రామీణ భారతం ఫ్యూడల్ కూడా. అయినా డబ్బు సర్క్యులేషన్ తక్కువ గా ఉండటం వలన , పాత ఇండియా లో డబ్బుకు సంబంధించిన నేరాలు తక్కువ అనుకొంటున్నాను.(ఫ్యూడల్ నేరాలు పాత కాలం లోనే ఎక్కువ అనేది నిజం) ఇప్పుడు డబ్బు ఉన్నా చాలా వర్గాల purchasing power దిగ జారిపోయింది. ఇప్పుడు దిగువ మధ్య తరగతి పట్టణాల్లో ఇళ్ళు కొనుక్కో లేరు. వారు ఎలాగొలా డబ్బు సంపాదించటానికి ఏ చిట్ఫండ్ కంపెనీలలోనో పెట్టుబడి పెడతారు. వాడు బిచాణా ఎత్తేస్తాడు. ఇలాంటి నేరాలు డబ్బు సర్క్యులేషన్ తక్కువ గా ఉన్నపుడు, తక్కువ స్థాయి లో జరిగేవి.
    రష్యా state capitalist అనేది నాకు ఒక కొత్త వార్త. ఆలోచిస్తే మీరు నిజమేనేమో అనిపిస్తుంది. కానీ దానిని విశ్లేషించటానికి సరిపోయే ground realities న వద్ద లేవు.
    /*in a socialist society he might find his happiness by inventing something new etc or doing his job better than the rest.*/
    ఒక మనిషి ఇతరుల కంటే పనిని బాగా చేసినపుడు అతనికి ప్రతిఫలం ఎక్కువ ముట్టాలి కదా? సోషలిస్త్ వ్యవస్థ అలా చేస్తే మళ్ళీ కొంత కాలానికి అసమానతలు మొదలౌతాయి. నా assuption ఏమిటంటే సోషలిస్ట్ వ్యవస్థ అందరినీ సమానం గా ఉంచటానికి ప్రయత్నిస్తుంది (ఇది తప్పయితే చెప్పండి). కానీ మనిషి ఎప్పుడూ పక్కవడి కంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తాడు. మీరు చెప్పినట్లు గా సోషలిస్ట్ వ్యవస్థ లో కూడా మనిషి సంతోషాన్ని pursue చేయవచ్చని నేను అంగీకరిస్తాను.
    /*Marx MIGHT have had some personal flaws but we can’t discredit his work based on some flaws in his personality*/
    ఒక మనిషి తనకే పని చేయని మందుని మిగిలిన వారికి అమ్మజూపటం ఎలా సమర్ధనీయం?
    వ్యక్తిగత జీవితాన్నీ సామజిక జీవితాన్నీ ఎందుకు విడదీసి చూడాలి? రెండూ పరస్పరాధారితాలు కవా?
    /*They are progressing towards social equality . They are progressing towards equal rights for women, gay rights(gay marriages are legal in some western countries) , aboriginal rights, children’s rights etc. Economic equality could be the next step -very high tax rates for the rich public health care are already in place in many western countries.*/
    అంటే సోషలిస్ట్ వ్యవస్థ పరిణామం ద్వారా ఏర్పడవచ్చు అని కద? మరి వర్గ పోరాటాలూ, విప్లవలూ ఎందుకు? అది వచ్చినపుడు వస్తుంది at it’s own pace.
    /*Do you think the people in power would give up just like that without putting up a fight?*/
    రావి శాస్త్రి గారు పులీ లేడీ అంటూ ఉదాహరణ లు ఇచ్చే వారు . కానీ ఈ ఉదాహరణ ల కి ఒక పరిమితి ఉంది. మనుషుల విషయం లో ఒకప్పటి పులులే లేళ్ళు గా మారుతారు(ఆర్ధికం గా దెబ్బ తిని). అలానే లేళ్ళే తరువాత పులులు గా మారుతాయి. జంతువులలో ఉన్నట్లు పులులు ఎప్పటికీ పులులు గా ఉండ జాలవు.
    నేను నైతికం గా “చంపటానికి” హక్కు లేదంటున్నాను. మిగిలిన fighting forms అన్నీ OK. యూనియన్లూ, సమ్మెలూ, పెట్టుబడి దారుల అన్యాయాన్ని (అది ఉన్న చోట) ప్రతి ఘటించే అనేక ఇతర పధ్ధతులు పూర్తిగా తప్పని అనలేం!
    BTW, తెలుగు సమాజపు సామజిక వాస్తవాన్ని, వామపక్ష రచయితలు చూపించినంత దగ్గర గా, నగ్నం గా ఇంకెవరూ చూపించలేదని నేను అనుకొంటాను. కానీ దాని వలన ఉపయోగం ఏమిటి?

    మెచ్చుకోండి

  26. మీరు ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. మన పల్లెటూర్లలో మూఢనమ్మకాలు ఎక్కువ. మన పల్లెటూర్లవాళ్ళు తమకి లక్ష రూపాయలు వస్తే పెళ్ళిళ్ళకీ, శ్రాద్ధ కర్మలకీ డబ్బులు ఖర్చు పెడతారు కానీ వాషింగ్ మెషీన్‌లూ, కూలర్లు లాంటి ఖరీదైన వస్తువులు కొనుక్కోరు. ఉత్పత్తి సంబంధాలలో మనం ఇంకా primitive stageలోనే ఉన్నాము. వ్యవసాయంలో నష్టపోయి ఏమీ మిగలని రైతు ఆత్మహత్య చేసుకుంటాడు కానీ దొంగతనాలు ఎందుకు చెయ్యడు అనే ప్రశ్నకి ఇక్కడే సమాధానం దొరుకుతుంది. ఒకవేళ రైతు దొంగగా మారినా ఆ పల్లె ప్రాంతంలో దొంగిలించడానికి వాషింగ్ మెషీన్‌లు, కూలర్లు లాంటి ఖరీదైన వస్తువులు దొరుకుతాయా? ఒకవేళ నగలు లాంటివి దొంగిలించడానికి ప్రయత్నించినా ఊరివాళ్ళందరూ కలిసి అతన్ని పట్టుకుని బొమికలు విరగగొడతారు. టౌన్‌లో అలా కాదు కదా. పక్కింటిలో దొంగతనం జరిగినా, మన ఇంటిలో దొంగతనం జరగలేదు కనుక మనం సేఫ్‌గా ఉన్నట్టేనని వైయుక్తికంగా ఆలోచిస్తారు.

    మెచ్చుకోండి

  27. మార్క్సిజం వ్యక్తికీ, సమాజానికీ మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వైయుక్తికవాదులు వ్యక్తి అభివృద్ధి చెందితే చాలు, సమాజం అభివృద్ధి చెందినట్టేనని వాదిస్తారు.

    మెచ్చుకోండి

  28. bondalapati garu,
    .
    ఒక మనిషి ఇతరుల కంటే పనిని బాగా చేసినపుడు అతనికి ప్రతిఫలం ఎక్కువ ముట్టాలి కదా? సోషలిస్త్ వ్యవస్థ అలా చేస్తే మళ్ళీ కొంత కాలానికి అసమానతలు మొదలౌతాయి. నా assuption ఏమిటంటే సోషలిస్ట్ వ్యవస్థ అందరినీ సమానం గా ఉంచటానికి ప్రయత్నిస్తుంది (ఇది తప్పయితే చెప్పండి). కానీ మనిషి ఎప్పుడూ పక్కవడి కంటే ముందు ఉండాలని ప్రయత్నిస్తాడు. మీరు చెప్పినట్లు గా సోషలిస్ట్ వ్యవస్థ లో కూడా మనిషి సంతోషాన్ని pursue చేయవచ్చని నేను అంగీకరిస్తాను

    From each according to his ability, to each according to his deeds.
    From my understanding, Private property still exsists in socialism and people will be rewarded for their work. The means of production would be in the hands of the workers rather than the capitalists. The capitalists will lose their unfair advantage of their capital -making more and more money with the capital. This will eventually end the huge economic disparities in people.

    ఒక మనిషి తనకే పని చేయని మందుని మిగిలిన వారికి అమ్మజూపటం ఎలా సమర్ధనీయం?
    వ్యక్తిగత జీవితాన్నీ సామజిక జీవితాన్నీ ఎందుకు విడదీసి చూడాలి? రెండూ పరస్పరాధారితాలు కవా?

    Marx was a political economist. He was not the leader of a country like Stalin or Mao. His writings inspired people and helped them think and fight against their living conditions. I think thats the reason we shouldn’t pay attention to his personal life.

    I also do not agree that Marx didn’t live upto what he wrote. Marx was never after money. He lived in abject poverty. He lost a few of his children because he was unable to provide them the basic necessities. With his intelligence, he would have easily made money but he was always with the working class. He choose to not live in luxuries. His only source of income was they money Engels donated to him or his remittances. Marx never did something which could be considered counter revlutionary.

    I dont think Marx’s extramarital affair needs criticism. We dont know the circumstances which led to him sleeping with another woman than his wife. Since it is consensual, there is nothing to talk about it.

    Again if leaders like Stalin had personal flaws, the should definitely be criticized for things like them faling for women much younger than they are.It is anti-feminist because they used their power to lure younger women.

    అంటే సోషలిస్ట్ వ్యవస్థ పరిణామం ద్వారా ఏర్పడవచ్చు అని కద? మరి వర్గ పోరాటాలూ, విప్లవలూ ఎందుకు? అది వచ్చినపుడు వస్తుంది at it’s own pace.
    It could take a few hundred years and why should people suffer in silence. They can organize and fight themselves to have a better future. When I compare the working conditions during Marx’s time and ours, I am quite surprised how much we achieved and all of this was possible through class struggles and revolutions. Many people lost their lives to give me an 8 hour working day which I enjoy now.

    మెచ్చుకోండి

  29. బొందలపాటికి అంతగా తెలియదు…. మార్తాండకి అస్సలు తెలీదు.. ఇక ఆ వోపెన్ సోర్స్ ని కమ్యూనిజం అనుకుంటున్నోల్లకి కమ్యూనిజం కాదుకదా కనీసం వోపెన్ సోర్స్ గురించి ఏమి తెలీదు!

    కమ్యూనిజం, ఎక్సిస్టన్షియలిజం చంక నాకి పోయి సానా యేల్లయ్యింది. ఇక వాటిని నమ్ముకున్న అన్నలు అడవుల పాలైతే, మార్తాండ లాంటి తమ్మాయ్ లు అడవులెంట ఫుటోలు తీస్కుంటా తిరుగుతున్నారు.

    ఆ పైన వోపెన్ సోర్స్ కామెంటెట్టినాయన కావాలంటే మన మార్తాండ ంబాయకత్వం లో ఒక కంప్యూటర్ కమ్మూనిస్ట్ కార్మిక సంఘం ఎట్టుకోమను!

    మెచ్చుకోండి

  30. వ్యక్తులు తగినంత mature కాకుండా, వేగం గా సమ సమాజం తేవటానికి ప్రయత్నిస్తే, రష్యా తో సహా చాలా చోట్ల జరిగినట్లు అది వికటించే ప్రమాదం ఉంది. వ్యక్తులలో maturity ఒక్కసారిగా వచ్చేది కాదు. అది క్రమం గా రావలసినదే! అదే… 8 గంటల పని దినం తప్పితే, ఇంకేమి సాధించినది? so called కమ్యూనిస్ట్ వ్యవస్థలు పడిపోవటం వలన జనాలలో కమ్యూనిజం అంటే అపనమ్మకం పెరిగి కమ్యూనిజానికి అపకారమే ఎక్కువ జరిగింది. మనుషులు పరిపక్వం అవ్వకుండానే సమ సమాజం కోసం ప్రయత్నిస్తే, ముందుకు పోదామనుకొన్న వాడి పంచె కి పట్టుకొన్న ముల్లు లానే, ఉంటుంది.

    మెచ్చుకోండి

  31. బుల్లబ్బాయో,
    నేను నీ యెత్తిగత దాడులని కండిత్తాన్నా. ఆ ఓపెన్ సోర్స్ కామెంటెట్టినాయన మల్లీ సూడొచ్చాడంటా..? ఈ సెర్చల్ని నువ్వు మరీ సీర్యసు గా తీసుకోమాక! ఏదొ సాయంకాలానికి ఓ సుట్ట ముక్క పీక్కుంటా ఊరి అరుగుల మీద కూసొని పిచ్చాపాటీ మాట్టాడుకుంటామే..అట్టా తీసుకో..!

    మెచ్చుకోండి

  32. Individualismని తెలుగులో వైయుక్తికవాదం అనే అంటారు. నేను కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదివాను. మొదట్లో తెలుగు అనువాదాలలో ఏమి వ్రాయాలో తెలియక వ్యక్తిగతవాదం అని ట్రాన్స్‌లేట్ చేసేవాణ్ణి. విశాలాంధ్ర, ప్రజాశక్తి బుక్ హౌస్‌లలో నేను తెలుగు పుస్తకాలు కొంటుంటాను కానీ భుబనేశ్వర్‌లో నేను కొనేవి ఇంగ్లిష్ పుస్తకాలే.

    మెచ్చుకోండి

  33. Stalin lead class struggle against kulaks(rich peasants) with the support of masses when attempts for collectivisation were going on. And the collectivisation was successful. The transitional government was back-stabbed by traitors like Krushchev and Beria but not by the masses. Remember that Stalin never agreed the truth that there will be enemies who stand near our right hand. So, Khrushchev was able to restore market in USSR after the death of Stalin.

    Presently, I am translating Mario Sousa’s book on “Lies concerning the history of USSR”. That book was written to debunk Conquest’s and Solzhenitsyn’s anti-communist propaganda and it also contains information about the process of collectivisation.

    And also read Mario Sousa’s another article about collectivisation:
    http://www.mariosousa.se/TheclassstruggleduringthethirtiesintheSovietUnion050801.html

    మెచ్చుకోండి

  34. ఇంగ్లిష్ మీడియంలో చదివినవాళ్ళు ఎవరికైనా తెలుగులోకి ట్రాన్స్‌లేషన్స్ వ్రాయడం కష్టమే. అందుకే నేను ఇంగ్లిష్‌లో చదివిన పుస్తకాలకి తెలుగులో ట్రాన్స్‌లేషన్స్ వ్రాయలేకపోతుంటాను. రష్యన్ భాష నుంచి తెలుగులోకి అనువదించబడిన పుస్తకంలో “వైయుక్తిక” అనే పదం చదివాను. అప్పుడు అర్థమైంది “individualismని తెలుగులో వైయుక్తికవాదం అని అంటారు” అని. కేవలం తత్వశాస్త్రం చదవడానికైతే ఇంగ్లిష్‌లో చదివినా అర్థమైపోతుంది. తెలుగులోకి అనువదించాలంటేనే తెలుగు పాండిత్యం ఉండాలి. తెలుగు సరిగా రాకే సంస్కృత పదాలు కలిపి అనువాదాలు వ్రాస్తుంటాను.

    మెచ్చుకోండి

  35. బొందలపాటి గారు,
    దాదాపు నెలరోజుల తర్వాత మీ బ్లాగులోకి తొంగి చూశాను.
    ఈ చర్చలో పాల్గొని ఉంటే నాకూ మేలయ్యేది. కాని ఈ కథనం మొత్తంగా నా తదుపరి అధ్యయనం, పరిశీలనకోసం కాపీ చేసుకుంటున్నాను.
    మొత్తానికి అనుకూలురను, ప్రతికూలురను ఒక చోటికి చేర్చి ఏదో ఒకరకమైన చర్చ సాగేలా చేయడంలో మీరు విజయం సాధిస్తున్నట్లే.

    పరిమిత స్థాయిలో చర్చ జరిగినా కొన్ని చక్కటి ఉపయోగకరమైన అంశాలు చర్చలో వచ్చాయి ముఖ్యంగా స్వప్న గారి అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాగే ప్రవీణ్… ఏలాంటి రెచ్చగొట్టు ధోరణులకు పోకుండా వీలైనంత సంయమనంగా తను కొన్ని విలువైన అంశాలు ప్రతిపాదించారు. వాటిని అందరూ ఆమోదించకపోవచ్చు ఆమోదించలేకపోవచ్చు.. కాని తను ఇలాగే కొనసాగితే అందరికీ మంచి జరుగుతుంది.

    వర్గ శత్రు నిర్మూలన సమర్థకులు తమ పట్ల అందరూ సౌమ్యంగా వ్యవహరించాలనుకోవడం ఏమిటీ అని ఆక్షేపించారు మీరు. సమయం లేకపోవడం వల్ల దీనిలోతుల్లోకి నేను పోలేకపోతున్నాను. కాని వర్గ శత్రు నిర్మూలన అనేది కమ్యూనిస్టులు కాయిన్ చేసిన పదబంధం కాదు.

    చరిత్రలో భిన్న ప్రయోజనాలు కలిగి వాటిని కాపాడుకోవడం కోసం ఘర్షణలు మొదలైనప్పటినుంచి మానవ సమాజంలో వర్గ శత్రు నిర్మూలన భిన్న బిన్న రూపాల్లో కొనసాగుతూ వచ్చిందని నా అభిప్రాయం.

    పాలక వర్గ ప్రయోజనాల ఘర్షణల క్రమంలో అక్షౌహిణుల సైన్యాన్ని ఊచకోత కోయించిన మహాభారత యుద్ధం నుంచి చరిత్రలో జరిగిన ప్రతి మానవ హనన చర్యా వర్ఘ ఘర్షణల్లోంచే వచ్చాయనుకుంటున్నాను.

    మనిషి మనిషిని, ప్రకృతిని కూడా చంపకూడదని,నిర్మూలించకూడదనే భావం మానవ సమాజ పరిణామక్రమంలోనే ఒక అత్యున్నతమైన విలువ.మిగతా అన్ని మానవ, సామాజిక విలువలూ దీనికి లోబడవలిసినవే. సమాజంలోంచి ఇది అదృశ్యం కావాలంటే అన్ని దేశాల్లో, వ్యవస్థల్లో రాజ్య వ్యవస్త అనే అత్యంత సంఘటిత హింసా చట్రం అదృశ్యం కావలిసిందే. భౌతిక హింసలూ, మానసిక హింసలూ, దురాక్రమణ హింసలూ అన్నీ పోవాలంటే ఇంతవరకూ జరిగిన, జరుగుతూ వస్తున్న అన్ని ఘర్షణలు వాటి అంతిమ పర్యవసానాలకు చేరవలసిందే.

    ఇంతకు మించి సమయం కేటాయించలేకపోతున్నందుకు మన్నించాలి.

    మళ్లీ కలుద్దాము.

    మెచ్చుకోండి

  36. ప్రవీణ్ గారూ,
    మీరు ఈ చర్చలో భాగంగా ఇచ్చిన లింకు లోని ప్రధాన వ్యాసం చాలా ఉపయుక్తంగా ఉంది.

    The class struggle during the thirties in the Soviet Union.

    రష్యాలో వర్గ పోరాటాల గురించిన లోతైన విశ్లేషణను గతంలో చార్లెస్ బెతెల్‌హామ్ రచనల్లో -క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ సోవియట్ యూనియన్- చదివాను. మళ్లీ మెదడుకు మేత పెట్టారు.

    మన సమీప గతంలోని చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇలాంటి వ్యాసాలు ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాలి. మీరిలాగే సాగిపోండి..

    కృతజ్ఞతలు.

    మెచ్చుకోండి

  37. రాజు గారు.
    కమ్యూనిజన్ని వ్యతిరేకించేవారు ఇలాంటివి చదివి ఆ పై చర్చిస్తాఏ బాగుంటుంది. అలానే కమ్యూనిస్టులు కూడా యూ ట్యూబ్ లో ఉన్న అనేక కమ్యూనిస్టు వ్యతిరేక వీడియో ల ని కూడా చూసి వాటి పై చర్చిస్తే బాగుంటుంది. కానీ ఈ రెండూ జరగని విషయాలని నా అనుభవం తో తెలుసుకొన్నాను.

    మెచ్చుకోండి

  38. బొందలపాటి గారూ,
    పైకి అంటే బాగుండదు కాని, మీరన్నది నూటికి నూరుపాళ్లు నిఖార్సయిన మాట. భావజాలాల మధ్య ఘర్షణ, చర్చ ఏదైనా కానివ్వండి అది మౌలికంగా పోరాట ప్రతిఫలనమే. కాని పైకి ఎవరూ దీన్ని ఒప్పుకోరు.
    చర్చలు వర్గపోరాటానికి కొనసాగింపు.. కాని, మీరు చెప్పే భౌతిక దాడుల రూపంలో కాదు లెండి.

    మీ స్మైలీలు బలే బాగుంటాయి. బాగా కొట్టేసుకుని తర్వాత హాయిగా నవ్వేసేలాగా..

    మెచ్చుకోండి

  39. నిజమే.. ఎవరిది వారు గోక్కోవడానికే సరిపోతూన్నట్లుంది. మధ్యలో జీవిక పోరాటం ఒకటి తగులుతూనే ఉంటుంది కదా.. తమాషాకే లెండి.

    అన్నట్లు మర్చిపోయాను. స్వప్న గారు మీ ఈ కథనంలో తను చదివిన భండారు శ్రీనివాసరావుగారి “మార్పు చూసిన కళ్లు” కథనాల లింకులు ఇవ్వడం కుదరలేదని అన్నారు. నేను నిన్ననే అరగంట కష్టపడి నా నెలవంక బ్లాగులో -kanthisena.blogspot.com- ఆయన రాసిన 17 కథనాల లింకులు ఒకే టపాగా పోస్ట్ చేసేశాను. ఇప్పుడు గుర్తొస్తోంది.

    సోవియట్ రష్యాలో జీవితంపై అరుదైన కథనాలు
    http://kanthisena.blogspot.in/2012/02/blog-post.html

    మెచ్చుకోండి

  40. కొంచెం ఆలస్యంగానే అయినా… చాలా మంచి వ్యాసం చదివాను. ఇదొక అంతు లేని కథ అనుకోవచ్చేమో. మీరు సరదాగా గోడ మీద పిల్లి వాటం అన్నా… కమ్నిజం వైపు ఒకింత మొగ్గుతో రెండు వాదాలనూ సంతులనం చేసే ప్రయత్నం చేసినట్టు అర్ధమవుతోంది, ఈ పరిశీలనలో నైతికతను కూడా తీసుకోవలసిందేమో!

    అతివాద వామపక్ష భావజాలాన్ని దాదాపు సమర్థించిన వడ్డెర చండీదాస్… వైయక్తిక వాదాన్నీ… అదే సమయంలో సంప్రదాయిక జీవన విధానాన్నీ కూడా సమర్థించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ సైద్ధాంతిక భావజాలాలను అధ్యయనం చేయగల అవకాశాలు కష్టమైన నేపథ్యంలో… ఎంతో కొంత వరకూ ఎవరో ఒకరిని విశ్వసించక తప్పదేమో. ఆ ఎవరో ఒకరు ఎవరన్నది ఎంచుకోడానికి కారణాలు వ్యక్తిని బట్టి మారిపోతుంటాయి.

    మొత్తం మీద… ఒకే యాబ్సొల్యూట్ ట్రూత్‌కి ఇంటర్‌ప్రిటేషన్‌లు మారుతూ ఉంటాయి అని భావించాలేమో. మరో రకంగా చెప్పాలంటే… ఏకం సత్ విప్రా బహుధా వదంతి.

    మెచ్చుకోండి

  41. అంతేనండీ దృక్కోణాలు మారుతుంటాయి. కానీ కొన్ని దృక్కోణాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. తెలుగు సినిమా కథల్కంటే, రావి శాస్త్రి కథలు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు.

    మెచ్చుకోండి

Leave a reply to bondalapati