వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ

సామాజిక వ్యవస్థ వ్యక్తిని ప్రభావితం చేస్తే వ్యక్తి “సామాజిక వ్యవస్థ” ని ప్రభావితం చేస్తాడు. ఇవి ఇలా సైక్లికల్ గా కొనసాగుతాయనేది పాత చింత కాయ పచ్చడి. రష్యా లో కమ్యూనిజం పడిపోవటానికి కారణాల్లో అక్కడ అధికారం లో ఉన్న వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చెయ్యటం ఒకటి. “వారికి ప్రత్యేక మైన దుకాణాలు తెరవటం, తక్కువ రేట్లకి అమ్మటం”, జరిగిందనే విషయం ఆ కాలంలో అక్కడ ఉండి వచ్చిన వారు చెప్పారు.

ప్రజాస్వామ్యం లో అధికారం లో ఉన్న వారి తప్పులను ఎత్తి చూపటానికి ప్రతిపక్షపార్టీలు ఉంటాయి. ఏక పార్టీ పాలన లో, దిగువున ఉండే తమ పార్టీ సభ్యులకి కొన్ని తాయిలాలు వేస్తే తాము అధికారం లో ఉండవచ్చు. తరువాత వారిని ప్రశ్నించేవారే ఉండరు. వారి పైఅదుపు ఉండదు. వారికి బాధ్యతలూ , జవాబుదారీ తనమూ ఉండవు. అధికార స్థాయి లో నైతిక విలువలు లేని వారు ఉంటే దానిని దుర్వినియోగ పరుస్తారు. రష్యాలో కూడా ఇదే జరిగింది. విలువలు ఉన్న వారు అధికార స్థాయి లో కొన్ని వందల యేళ్ళు నిరాటంకం గా ఉంటే అప్పుడు సమాజ వ్యవస్థ (నా దృష్టి లో మంచిదైన కమ్యూనిస్టు వ్యవస్థ) కూడా వ్యక్తులందరినీ విలువలు కలవారి గా మార్చేదేమో! కానీ దురదృష్ట వశాత్తూ అలా జరుగలేదు.

వ్యక్తులలో విలువలు ఎలా పెరుగుతాయి? వ్యక్తులలో విలువలు అక్కడి సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక వ్యవస్థల వలన ప్రభావితం చేయబడతాయి. విద్యా వ్యవస్థ అన్ని రంగాలనుంచీ మంచి విలువలను గ్రహించి, వాటిని మనసులో నాటుతుంది. ఏవి మంచి విలువలు? సమాజ దీర్ఘకాలిక మనుగడ కి ఉపయోగ పడేవి మంచి విలువలు. విద్యా వ్యవస్థ నాటిన విలువలకి సమాజం లో రివార్డ్ ఉండేటట్లు అక్కడి రాజకీయ నాయకత్వం చూడాలి. ఈ విధం గా క్రమానుగతం గా మనుషుల నైతిక స్థాయి పెరగాలి. కొన్ని కొన్ని సార్లు తాత్కాలికం గా ఈ నైతిక స్థాయి తగ్గినా, దీర్ఘకాలికం గా ఈ నైతిక స్థాయి పెరగాలి. ఎందుకంటే, ఈ నైతిక విలువల మూలాలు మనుగడ లో ఉన్నాయి. ఒక వేళ వ్యక్తుల ఈ నైతిక విలువలు ఎక్కువ కాలం దిగజారుతూ పోతే, మనిషి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది.

మనుషులకి తగిన నైతిక స్థాయి రాకుండా, వారి భావజాలం లో ఔన్నత్యం రాకుండా, వారి కోపాన్నీ ద్వేషాన్నీ ఒక అస్త్రం గా ఉపయోగించుకొని, సోషలిస్టు వ్యవస్థని తీసుకొని వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు. ఒక సారి ఆ వ్యవస్థ శోష వచ్చి పడిపోయిందంటే, ప్రజలకి దాని మీద అపనమ్మకం ఏర్పడుతుంది. రష్యా పతనం తరువాత జరిగినది అదే! దీని వలన వారి ఆదర్శ రాజ్య స్థాపన మరింత వెనుకకి పోయింది. అది నెమ్మది గా పరిణామం చెందుతూ రావాలే కానీ, హింస తో బలవంతం గా రుద్దబడకూడదు.

ఇక ఈ టపా కి ప్రేరేపించినది శ్రీకాంత్ గారి బ్లాగు లో కుమార్ గారు ఇచ్చిన ఒక లింక్: http://www.telegraph.co.uk/news/politics/9061328/The-lessons-of-the-fall-of-communism-have-still-not-been-learnt.html

ఈ లింకు లో జానెట్ గారు ఏమి చెబుతోందంటే, “విలువలు అనేవి వ్యక్తులలో ఉంటాయి. అవి ఆర్ధిక వ్యవస్థలో ఉంటాయని కమ్యూనిజం తప్పుగా అనుకొంది. కమ్యూనిస్ట్ సమాజం లో (అధికారం లో ఉన్న వ్యక్తులకు విలువలు లేక పోవటం వలన అక్కడి వ్యవస్థ కుప్ప కూలింది”, అని. ఈ వాదన లో సగం నిజం ఉంది. అదేమిటంటే, విలువలు వ్యక్తుల ద్వారానే operate అవుతాయి, వ్యక్తుల విలువల లేమి వలన వ్యవస్థలు పడతాయి. అది కమ్యూనిజమైనా, కాపిటలిజమైనా సరే! కూలిన తరువాత అన్నివ్యవస్థలూ సమానమే! అందమైన బిల్డింగ్ కూలినా, మామూలు బిల్డింగ్ కూలినా,.. కూలిన తరువాత అంతా సమానమే కదా!

ఆవిడ వాదన లో లోపం “నైతికత అనేది వ్యవస్థలో లేదనుకోవటం” లో ఉంది. వ్యవస్థ యొక్క మెకానిజం లో కూడా నైతికత ఉంటుంది. “తయారు చేసిన దానిని లాభాపేక్ష లేకుండా పంచుకోవాలి”, అనే వ్యవస్థ తో పోలిస్తే, “డిమాండ్ పెరిగితే రేటు పెంచే వ్యవస్థ లో” నైతికత తక్కువే కదా? విలువలు ఉన్న వ్యవస్థ మేలిమి ఎప్పుడు తెలుస్తుంది?వ్యక్తులు అందరూ మంచి వారైనపుడు తెలుస్తుంది.

ఒక సమాజం లోని వ్యక్తులు దాదాపు అందరూ మంచి వారనుకొందాం. సగం మంది కాపిటలిజాన్ని నిజాయితీగా అమలు చేస్తున్నారనుకొందాం. ఇంకొక సగం నిజాయితీగా కమ్యూనిజాన్ని అమలు చేస్తున్నారనుకొందాం. అసలైన కాపిటలిజం లో కంపెనీలు డిమాండ్ ని బట్టి ధరను పెంచుతూ పోవచ్చు. వినియోగదారుడు భరించలేక కొనటం తగ్గించినపుడే ధరల పెరుగుదల అనేది తగ్గుతుంది. ఈ లోపు కంపెనీలు డబ్బు చాలా వెనుకేసుకొంటాయి. నష్టాలొస్తే కంపెనీ ని మూసివేస్తారు. లాభాలు వస్తే దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. కంపెనీ పెద్దదై “మోనోపొలీ” సాధిస్తుంది. చిన్న చిన్న కంపెనీలను కలుపుకొంటుంది. అసలు సిసలైన పెట్టుబడిదారీ లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు.రెగ్యులేషన్స్ ఉండవు. మార్కెట్ డైనమిక్సే ధరలని నిర్ణయిస్తాయి. కాబట్టీ “మోనోపొలీ” అనేది నేరం కాదు. డబ్బు సంపాదించిన కంపెనీలూ వ్యక్తులూ డబ్బు విరివి గా ఖర్చుపెట్టి ద్రవ్యోల్బణం పెంచుతారు. సామాన్య మానవుడి బతుకు కష్టమౌతుంది. కానీ నిజాయితీ గా కాపిటలిజాన్ని నమ్మి అమలు చేస్తున్న వ్యక్తులకు ఇందులో తప్పేమీ కనిపించదు.

నిజాయితీ పరులైన వ్యక్తులు కమ్యూనిజాన్ని అమలు చేస్తున్నపుడు, అక్కడ జనాల మౌలిక అవసరాలు తీరతాయి. ప్రజలు అవసరానికి మించి కష్టాలు పడనవసరం లేదు. కంపెనీలు పెట్టలేరు కాబట్టీ ఆవిధమైన దోపిడీ, ద్రవ్యోల్బణమూ ఉండవు. సమాజం లో డబ్బు చలామణి అవసరమైనంత వరకే ఉంటుంది. కష్టపడి పని చేసెవాడికి ఎక్కువ జీతం ఉంటుంది. కానీ వాడు డబ్బు కూడబెట్టి దానిని వారసులకి ఇవ్వలేడు. ఎందుకంటే వారసత్వం రద్దు చేయబడుతుంది. పరిపూర్ణ సమానత్వం ఉండదు. వృత్తిని బట్టి డబ్బులు ఎక్కువో తక్కువో వస్తాయి. కానీ సంపద ఒకే చోట కొండలు గా పోగుపడదు.

ఈ రెండూ పోల్చి చూసినపుడు, “వ్యవస్థ మెకానిజం” లో కూడ ఎక్కువ నీతివంతమైన వ్యవస్థలు ఉంటాయని బోధపడుతుంది. కమ్యూనిజం ఎక్కువ నైతిక మైనదని అర్ధమౌతుంది.

కొంతమంది కమ్యూనిస్టు వాదులు “కాపిటలిస్ట్ సమర్ధకులు కాపిటల్, మనిఫెస్టో చదవటం లేదు కాబట్టీ, కాపిటలిస్ట్ సమర్ధుకులకి కమ్యూనిజం సరిగా అర్ధం కాలేదు”, అంటారు. వెంటనే కాపిటలిస్టుల వాదన ఏమిటంటే, కమ్యూనిస్టు సమర్ధకులకు కాపిటలిజం అర్ధం కావటం లేదని. కానీ మార్క్స్ తన పుస్తకాలు రాసినది కాపిటలిస్ట్ వ్యవస్థలోనే. ఆయన పుస్తకాల నిండా కాపిటలిజం విశ్లేషణే ఉంటుంది. ఆయనకు కాపిటలిజంగురించి తెలియదని చెప్పటం సాహసమే!

కమ్యూనిజం ఒక మతం వంటిదే, అంటారు ఇంకొందరు. దానికి లేని గొప్పదనాన్ని ఎందుకు ఆపాదించాలి? నాకు అది సామాజిక రాజకీయ సిధ్ధాంతం మాత్రమే అనిపిస్తుంది. ఆ సిధ్ధాంతం లో తప్పులుండవచ్చు, ఒప్పులుండవచ్చు. అది వేరే విషయం.

శ్రీరాం గారు, “పాశ్చాత్య మేధావులకి, ఒకప్పుడు వారి ప్రభుత్వాలు మనలని దోచుకొన్నది గుర్తుకు రాలేదా?”, అని అడిగారు. ఒక్కసారి మానిఫెస్టో, లో india అని సెర్చ్ కొట్టంది, తెలుస్తుంది . ఆ చిన్న పుస్తకం లోనే “అక్కడి పెట్టుబడి దారులు మన దేశాలని దోచుకొంటున్నారని మార్క్స్ చెప్పాడు. ఇప్పుడు నన్ను ఎవరైనా, “నువ్వు అన్నీ మార్క్సిజం లోనే ఉన్నాయి అంటున్నావంటే”, ఇక నేను చెప్పేదేమీ లేదు!

అలానే స్పెషలైజేషన్ పెరిగే కొద్దీ,ఉద్యోగుల జీవితం సుఖప్రదమవ్వక పోగా, వారి కష్టాలు పెరుగుతాయనీ అన్నాడు. టెక్నాలజీ పెరిగినపుడు, సహజ వనరులను సంపద గా మార్చే ప్రక్రియ వేగవంతమై, మెజారిటీ జనాలు సుఖ పడాలి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యోగుల, జనాల కష్టాలు పెరుగుతున్నాయనేది నిజం. జీవన వ్యయం పెరిగి చాలా మంది మధ్య తరగతి లోంచీ దిగువ మధ్య తరగతికి తోసి వేయబడుతున్నారు (ఈ రోజుల్లో భార్యా భర్తలు ఇద్దరూ పని చేస్తున్నా కూడా!) అలానే “ఐటీ” రంగం లోని వారు అది వచ్చిన కొత్తలో ఎగువ మధ్య తరగతి లో ఉండే వారు. ఇప్పుడు మామూలు మధ్యతరగతి గా తయారయ్యారు.

శ్రీకాంత్ గారు, “రష్యా పతమమైనపుడు చాల చర్చలు జరిగాయి, ఇక ఇప్పుడు అనవసరం అన్నారు. “, అయితే, “చచ్చిన కుక్కను ఎందుకు తన్నుతున్నారు?”

చివరి గా నేనేమీ కమ్యూనిస్ట్ ని కాదు. “దానిలోని లోపాలు” అని నేననుకొన్న వాటిని గురించి చాలా టపాలలో రాశాను. అందుకనే నా మీదకి దండెత్తి రాకుండా, రాజు గారు చెప్పినట్లు, “వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ”, వచ్చేటట్లు చర్చిస్తే బాగుంటుంది. అసలు చర్చే అవసరం లేదంటారా, ఇక సెలవు!

Covert Powden: My primary value is “Truth as perceived by me”. At times if  the Truth  is  in favor of communism, I support communism. At some other time if the Truth is in favor of capitalism , then I do not hesitate to support capitalism. It’s my subjective Truth. I do not have access to absolute Truth, after all

ప్రకటనలు

50 thoughts on “వేడి తక్కువ గానూ, వెలుగు ఎక్కువ గానూ

 1. మంచివాదన. దీని లంకెని మా గుంపులో టపా చేస్తున్నాను. అయినా కొంచెం సమయం తీసుకుంది మొత్తం చూడడానికి !

  టపాని కాస్త గద్యలు (పేరాగ్రాఫులు) గా విడగొట్టి వ్రాయండని మనవి, ప్రస్తావనని బట్టి ! అప్పుడు పాఠకుడికి visual fatigue ఉండదు.

  మెచ్చుకోండి

  1. తాడేపల్లి గారు,
   నా బ్లాగు కి స్వాగతం! మీరు చెప్పిన మార్పులు చేశాను.
   పడుచు వారికి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవ్వటం కోసం పోటీ పడి, వైద్యం నిజం గా అవసరమైన వృధ్ధులకు ఇన్స్యూరెన్స్ అనగానే ఆమడ దూరం పారిపోయే కంపెనీలు కూడా ఈ పోస్ట్ రాయటానికి ఒక కారణం.

   మెచ్చుకోండి

 2. ఆర్యా ! ఈ విషయంలో నా అభిప్రాయం ఏంటంటే – మనం ఇతరవిషయాల్లో స్వేచ్ఛావిపణి విధానాల్ని సమర్థించినప్పటికీ విద్య , వైద్యం, పన్నుల వసూలు మొ||వి మాత్రం ప్రైవేటువాళ్ళ చేతుల్లో ఎప్పుడూ ఉండకూడదు. అవి సర్వదా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి. ఈ రంగాల్లో పైవేటు పాల్గోలు (లేదా ఔట్‌సోర్సింగు) ఏ దేశంలోనూ ఇంతవఱకూ సత్ఫలితాలివ్వలేదు. తద్ద్వారా ప్రజలందఱికీ న్యాయం జఱగలేదు. కనుక ఈ పూర్వానుభవాల దృష్ట్యా ప్రభుత్వమే ప్రతివారినుంచీ ఎంతో కొంత ప్రీమియమ్ వసూలు చేసి అవసరమైనప్పుడు అందఱికీ చికిత్స, మందులూ ఏర్పాటుచేయాలి.

  మెచ్చుకోండి

 3. please define “nithikatha” and nithikatha as per whom and who defines it. If a bunch of or majority people feel its right (nithikam) then will it be treated as nithikam for all.

  A honest communist is more dangerous than a corrupt communist.

  There will be no monopoly in Laisez free capitalism….as and when a product/service has demand, companies will compete to provide them. One has to provide a product/ service cheaper and of good quality to remain in the business.

  Inflation will not be there in capitalism. Inflation is result of interventionalism by governments in the form of federal/central banks. Federal/central banks have no role in capitalism

  మెచ్చుకోండి

  1. Personal Morality is different from the societal values.Personal morality may be dynamic and relative. But still there will be some thing called morality. Here I am talking about societal values.These are the values that uphold the long term survival of a society. They are not relative or dynamic. To be honest, To be not corrupt, Not to be tempted by money power..these are not relative values. The society should uphold them at all times, in all countries.

   “A honest communist is more dangerous than a corrupt communist.” What’s the logic behind this statement..except your hatred against Communism.

   One has to provide a product/ service cheaper and of good quality to remain in the business…continuing..one who remains in business gets the edge by economy of scale and expertise and could afford to provide cheaper and good quality goods. Thus he grows and occupies markets and gains monopoly.

   Monet printing by central banks is only one of the reasons of inflation. This too is triggered by loss of living standards by masses. There are other reasons like a section of population gaining ascendance in society at the cost of majority and splurging money..thus making goods costly (by demand supply principle, when the supply of money increases, the value of it decreases. The amount of goods it can buy decrease). Example is the recent real estate prices, due to buying by the IT crowd.

   మెచ్చుకోండి

   1. //Personal Morality is different from the societal values.Personal morality may be dynamic and relative. But still there will be some thing called morality. Here I am talking about societal values.These are the values that uphold the long term survival of a society. They are not relative or dynamic. To be honest, To be not corrupt, Not to be tempted by money power..these are not relative values. The society should uphold them at all times, in all countries.//

    Ok lets stick to societal values only…..honest in regard to what…corrupt in regards to what…….a person will be dishonest/corrupt in/for a society when government with its draconian/useless rules try to control individuals…….the problem lies in the useless rules. In any developed/ utopian society there is no way u can control human behavior….as long as there are controls there will be dishonesty and corruption.

    //“A honest communist is more dangerous than a corrupt communist.” What’s the logic behind this statement..except your hatred against Communism.//
    I said so becos if a rule/control is restricting me from doing something (which doesnt effect anyone) and taking away my liberty…I will have my way with a corrupt communist but not with a honest one…..to me he is more dangerous……

    //One has to provide a product/ service cheaper and of good quality to remain in the business…continuing..one who remains in business gets the edge by economy of scale and expertise and could afford to provide cheaper and good quality goods. Thus he grows and occupies markets and gains monopoly.//

    Lets take the example of walmart…..Lets say Walmart is a monopoly…….but its success mantra is providing goods to consumers at cheapest prices…..it can not afford to increase the prices becos it has no competition…..becos walmart knows once he increases the price there will be a competitor who will be providing the good/service at a cheaper price and it will be losing customers……..so who is getting benefited the public/consumer.

    //Monet printing by central banks is only one of the reasons of inflation. This too is triggered by loss of living standards by masses. There are other reasons like a section of population gaining ascendance in society at the cost of majority and splurging money..thus making goods costly (by demand supply principle, when the supply of money increases, the value of it decreases. The amount of goods it can buy decrease). Example is the recent real estate prices, due to buying by the IT crowd.//
    How would section of ppl gain ascendance at the cost of majority….its only your assumption. you are contradicting yourself you said inflation is a reult of central banks………money supply increases only if RBI starts printing notes without backing it up with a commodity……In normal scenario(no central banks) if some people are earning more means that they are in turn providing equal goods and services for the money they earn. All the bubbles are created by government intervention only……

    మెచ్చుకోండి

 4. బొడాలపతి గారు
  మీరు లెవనెత్తిన ప్రశ్నెలకు నెను అంశాలవారీగా సమాదానం
  మార్కిజం హింసను ప్రెరేపిస్తుంది
  మార్కిజం హిసను అంతం చెస్తుందా లెక ప్రెరేపిస్తుంద? పెట్టుబడిదారులను ఉత్పత్తి సాదనాలు మీవి కావు అవి కార్మిక వర్గానివి మీరు అబద్దపు హక్కును కల్గి వున్నారు అంటె ఇస్తుందా పొరాటం లెకుండా? అలాఇస్తె పొరాటం చెయ్యవలసిన అవసరం ఎముంది? (ఉత్పత్తి సాదనాలు కార్మిక వర్గానివి ఎలా అవుతాయొ ఇక్కడ చెప్పలెము) మరి మీకు పెట్టుబడిదారి సమాజంలొనూ అంతకు ముందు సమాజాలైన బానిస, ప్యుడల్ సమాజాలలొ కనపడలెదా ? మొదటి ప్రపంచ యుద్దంలొనూ రొడవ ప్రపంచ యుద్దంలొనూ కొట్లమంది సనిపొఇనారు లక్షలమంది అంగవైకల్యంతొ ఆహారం లెక చనిపొఇనారు దాని వలసలకొసం లభాలకొసం, మార్కెట్లకొసం ,వడ్డిలకొసం
  మార్కిజం గ్లొబరైజెషన్ కొత్తగా వచ్చెవాతికి ఏ సమాదానం చెపుతుంది అంటున్నారు
  పెట్టుబడిదారి సమాజంలొ వున్న వేల సమస్యలకు ఎమి సమాదానం చెప్పుతుందొ దానికీ అదె సమాదం చెప్పుతుంది (ఆ వేల సమస్యలకు పునాది ఒకటె) అదెమీ సున్యం లొనుంచి రాలెదు కద పెట్టుబడిదారుడు ఆహార ఉత్పత్తి కన్నా ఆయుదాలలొ ఎక్కువ లాభాలు వస్తె వాటినే ఉత్పత్తి చె ఇస్తాడు
  అది (రాజ్యస్తాపన) నెమ్మదిగా పరిణామం చెందుతూ రవాలే కాని హిసతొ భలవంతంగా రుద్దకూడదు
  పరిణామం నెమ్మదిగా జరిగె మాట నిజమే , కాని ఆ పరిణామం రూపంలొ మార్పె గాని గుణంలొ కాదు ఆ రూపం మార్పుకూడా వందల పొరాటాలు చెస్తెనే బనిస సమాజం నుంచి ప్యుడల్సమాజానికీ, అక్కడ నుంచి పెట్టుబడిదారీసమాజానికి పవర్తన చెందినాము కాని గుణం మాత్రం(శ్రమ దొపిడి) కొనసాగుతూనె వుంది పొరాటాలు అనెటి లెకపొతె మనం ఇంకా బానిసయుగంలొ వుండె వాళ్ళం మొన్నటి వరకు అమెరికాలొ బానిస వ్యాపారం జరిగింది
  మనిషి నైతికత పెరిగే స్తాయి పెరిగె మార్గం మన విద్యావ్యెవస్త నాయకత్వం చెతిలొ వుంటుంది విద్యా వ్యెవస్త ఉన్నతమైన విలువలు నెర్పితె రాజకీయనాయకత్వం ఆ విలువలు పాటించిన వారికి సమాజంలొ తగిన రివార్ద్ ఇచ్చెమార్గం వుండాలి
  సమాజం రొడు వర్గాలుగా విడిపొఇ వున్నప్పుడు అందరికీ ఒకె రమైన విలువలు ఎలా వుపయొగపడతాయి? విలువలు అంటె మీ ద్రుష్టిలొ ఎమివున్నయొ చెప్పండి సరె ఆ విలువలు ఎరాజకీయ వ్యెవస్తలొ వుండాలి పెట్టుబడిరాజకీయ వ్యెవస్తలొనా లెక కమ్మునిస్టు రజకీయ వ్యెవస్తలొనా? విలువలు మారడం పునాదిలొ జరగాలా? లెక ఉపరితలంలొనా ? ఏ దానిప్రభావం వల్ల ఏది మారుతుంది? మార్కిజం ప్రకారం ఐతె ముందు పునాదిలొ జరిగితెనే ఉపరితలలొ మార్పు వస్తుంది
  యవరైనా సరె మర్కిజం లొ తప్పులు ఉన్నాయని గాని లెక అది అశాస్రియం అనిగాని అనెవాల్లు ఒక్కటంటె ఒక్కటి నిరూ పించండి శాస్త్రీయమైన దాన్ని అంగీకరిచటానికి మార్కిస్టులు యల్లవెలల సిద్దం
  శ్రీరాం గారు వకాయమ్మ అని సంబొదించడాన్ని పట్టి అర్దం చెసుకొవచ్చు రంగనాయకమ్మ గారి పైన ఎంతటి ద్వ్యెషం వుందొ ఆమె చెసిన తప్పుఏంటి మార్కిజాన్ని తెలుగులొకి పరిచెయం చెయ్యటమా?

  మెచ్చుకోండి

  1. బొనపార్టిజం పేరు వినే ఉంటారు. వర్గాలుగా విడిపోయిన సమాజానికి ఒకే విలువలు బోధించి, అల్టిమేట్‌గా ఉన్నత వర్గానికే అనుకూలంగా వ్యవహరించడాన్ని నెపోలియన్ బొనపార్ట్ స్టైల్ అంటారు.

   మెచ్చుకోండి

  2. బొందలపాటి గారి వాదనలో చాలా లొసుగులు ఉన్నాయి. సహజ న్యాయమే కరెక్ట్ అనుకుంటే పులి జింకని తినడం కూడా తప్పు కాదు అనుకోవాలి అని ఓ సారి బొందలపాటి గారే అన్నారు. సహజ న్యాయం పేరుతో దోపిడీని సమర్థించలేము అని అప్పుడు బొందలపాటి గారు ఒప్పుకున్నట్టే కదా. కానీ తరువాత ఆయనే కమ్యూనిజం సాధ్యం కాదనీ, సహజ న్యాయమే ఉంటుందనీ వాదించారు.

   మెచ్చుకోండి

     1. సామ్యవాదం గురించి నాకు ఈ మధ్య వచ్చిన అవగాహన ఏమిటంటే అది పరిపూర్ణ సమానతని సమర్ధించదని. ఎవరి సామర్ధ్యాన్ని బట్టి వారు పని చేసి సంపాదించవచ్చు. అలానే ఒక వృత్తి లో కష్టం ఎక్కువగా ఉంటే వారికి ఎక్కువ ప్రతిఫలం ఇవ్వవచ్చు. నేను ఒకప్పుడు(ఓ సంవత్సరం కిందట) సామ్యవాదం అంటే పరిపూర్ణ సమానత అనే అపోహ లో ఉండేవాడిని (పరిపూర్ణ సమానత్వం అంటే అటెండర్ నుంచీ ప్రెసిడెంట్ వరకూ పని చేసినా చేయక పోయినా సమానం గా జీతాలనూ, అధికారాన్నీ కలిగి ఉండటం.) అప్పుడు మనిషి స్వభావం పరిపూర్ణ సమానత్వానికి వ్యతిరేకం అనే దృష్టి తో రాశాను. మానవ సమాజం లో , పులులు జింకలౌతాయి, జింకలు పులులఔతాయి. మనుషులు గా బలవంతుడు బలహీనుడిని అణచటాన్ని సమర్ధించలేము. కానీ అది ప్రకృతి సహజం. నెమ్మది గా దీర్ఘకాలం లో పరిస్థితి తేలిక అవ్వవచ్చునేమో! తేలిక మాత్రమే అవుతుంది. బానిస వ్యవస్థ లో ఉన్నంత అనచివేత ఈ రోజు లేదు. ఇప్పుడు ఉన్న అణచివేత, అసమానతలూ ఓ రెండొందల యేళ్ళ తరువాత ఉండవు. కానీ అణచివేత, అసమానతలూ subtle గా ఏదో ఒక రూపం లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అసలు అణచివేత లేకుండా ఉండాలంటే మనిషి లో అధికారం కోసం తపించే జీన్ పోవాలి. కాబట్టీ మనిషి లో మౌలిక మైన బయలాజికల్ మార్పులు వచ్చి ఆధిపత్యం, స్వార్ధం మొదలైన గుణాలు పోతే కానీ అసలైన సమానత్వం రాదు. ఆర్ధికం గా చూస్తే సామ్యవాద సమాజం లో కూడా బలవంతులూ బలహీనులూ ఉంటారు. కాకపోతే బలవంతుడి బలం తాను మెరుగు గా జీవించటానికి ఉపయోగ పడాలి, పక్క వాడి సంపద హరించటానికి కాదు.
      రాజకీయం గా చూసినపుడు సామ్యవాద వ్యవస్థ లో కూడా బలవంతులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి(చైర్మన్ మావో చేతిలో ఉన్న అధికారాలు, మామూలు కామ్రేడ్ చేతిలో ఉండవు కదా? ), బలహీనులను అణచివేసే అవకాశం ఉంది. రాజకీయ అణచివేత నుంచీ తరువాత ఆర్ధిక అణచివేత మొదలౌతుంది.
      అలానే సామ్యవాదం లో ఒకడు బాగా కష్టపడి ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బు ని ఉపయోగించి రాజకీయ అధికారం కూడా కొనవచ్చు (మనుషుల విలువల లో మార్పు రానంత కాలం).
      నలుగురి కంటే ముందుండాలనే కోరికా, అధికారం కోసం కోరికా, వ్యక్తిగత పరమార్ధం కోసం అన్వేషణా అనేవి మనుషుల బయలాజికల్ మూలాలలోంచీ వచ్చినవి. ఇవి సోషలిజం పరిధి లో కి రావు. ఇవన్నీ సోషలిజం కంటే పురాతనమైనవీ, మౌలికమైనవి. సోషలిజం వీటికి వ్యతిరేకం గా ఒక ఆదర్శాన్ని పతిపాదించి నెగ్గుకు రాలేదు.

      మెచ్చుకోండి

      1. చైనా చరిత్ర మీకు తెలియదని మీ మాటలలోనే తెలిసిపోతోంది. సోషలిజంలో ఒకే వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వడం ఎన్నడూ జరగదు. మావో బతికి ఉన్నప్పుడు కూడా పార్టీలోనే అతని విరోధి వర్గం ఉండేది.

       ఒక మనిషి సామర్థ్యాన్ని అతని ముఖం చూసి అంచనా వెయ్యలేము. బ్యాంక్ ప్రొమోషన్ పరీక్షలలో 100% మార్కులతో పాసైనవాడు కూడా మేనేజర్ అయిన తరువాత బ్యాంక్‌ని గొప్ప లాభాలతో నడిపిస్తాడని అనుకోలేము. ఎందుకంటే మేనేజర్‌కి బ్యాంక్ యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ & నియమాలు మాత్రమే తెలుస్తాయి. అతను మార్కెట్ పరిస్థితులకి అనుగుణంగా ఎవరికి లోన్ ఇవ్వాలి, ఎవరికి లోన్ ఇవ్వకూడదు అనే విషయంలో నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలడా, లేదా అనే విషయం అతని ముఖం చూసి గానీ, అతని మార్కులు చూసి గానీ ఎవరూ చెప్పలేరు.

       ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ గుమాస్తా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తాడు. గుమాస్తా ఉద్యోగం చెయ్యడానికి ఇంగ్లిష్, గణితం రెండూ వస్తే సరిపోతుంది. ఈ రెండూ వచ్చినవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఎవరి సామర్థ్యం ఎంతో అంచనా వెయ్యలేము అనుకున్న అధికారులు ప్రొఫెషన్‌తో సంబంధం లేని “వివి గిరి పూర్తి పేరు ఏమిటి?” లాంటి ప్రశ్నలు అడుగుతారు.

       పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చెయ్యడానికి పదో తరగతి చదివితే సరిపోతుంది. కానీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చెయ్యడానికి డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతారు. నిజానికి మనం చదివే డిగ్రీలకీ, ఇన్స్పెక్టర్ ఉద్యోగానికీ సంబంధం లేదు. చదువుని బట్టి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని అంచనా వెయ్యడం హాస్యాస్పదం కూడా. ఎందుకంటే జెకోస్లొవేకియా ఎక్కడ ఉందో పదో తరగతి విద్యార్థికి తెలిసినా డిగ్రీ చదివిన విద్యార్థికి తెలియకపోవచ్చు.

       మెచ్చుకోండి

  3. Rammohan garu,
   “కాని ఆ పరిణామం రూపంలొ మార్పె గాని గుణంలొ కాదు.”
   రష్యన్ విప్లవం గుణం లో దీర్ఘకాలికం గా ఏమైనా మార్పు తెచ్చిందంటారా? అలా తెస్తే అక్కడ వ్యవస్థ ఎందుకు కూలిపోయింది? పరిణామం వలన రూపం లో మాత్రమే మార్పు వస్తోంది (ఇప్పటి వరకూ) అన్న విషయం నిజం లానే అనిపిస్తోంది.
   You are telling there are spurts in evolution. These spurts are called struggles, agitations, revolutions etc.I feel you are correct. But the gradual evolution is also True.
   సమాజం వర్గాలుగా విడిపోయినా దానికి కొన్ని(అన్నీ కాదు) ఉమ్మడి విలువలు ఉంటాయి. ఉదహరణ టపాలోనే ఇచ్చాను. అధికార దుర్వినియోగానికి పాల్పడటం అనేది అన్ని వర్గాలకీ నచ్చని విషయమే కదా? అవినీతికి పాల్పడటం అనేది ఏ వర్గం ప్రకారమైనా తప్పే కదా!
   “మన ఆస్థిని ఎదుటివాడు అక్రమం గా అనుభవిస్తున్నపుడు కూడా మనిషి లాక్కున్న వాడితో శాంతియుతం గా మర్యాదగా ఎలా ప్రవర్తిస్తాడు?”,అంటారు మీరు.
   ఎదుటి వాడీ స్థితి లో మనం ఉన్నా అలానే చేస్తాము. కాబట్టీ, వాడిని చంపకుండా, మర్యాదగా చెప్పో, జనాలను కూడగట్టో, సంఘాలు గా ఏర్పడో, చట్టాలలో మార్పులు తెచ్చో ప్రయత్నించాలి అనుకొంటాను.But again I think I am fighting a loosing battle here. If courts and police of the existing society can punish whom they think are offenders, so can other groups and societies like communists. They can punish the usurpers of wealth. So, at a certain level violent clash is inevitable it seems.

   మెచ్చుకోండి

   1. రష్యాలో ఏర్పడినది post-revolutionary government మాత్రమే కానీ సోషలిస్ట్ ప్రభుత్వం కాదని ఇంతకు ముందే చెప్పాను. స్టాలిన్‌పై మావో వ్రాసిన విమర్శలు కూడా చదివాను. స్టాలిన్ “Socialism in one country” పేరుతో ఇతర దేశాలలోని విప్లవోద్యమాలకి మద్దతు ఇవ్వకుండా కేవలం రష్యన్ వ్యవహారాలపైనే దృష్టి కేంద్రీకరించాడు. ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా చైనా, ఉత్తర కొరియాలలో విప్లవ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. స్టాలిన్ చనిపోయిన తరువాత ఏమి జరిగింది? అంతర్జాతీయంగా సోషలిజంపై వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పి కృష్చేవ్ సోవియట్ సమాఖ్యని డిసాల్వ్ చేసే ప్రయత్నమే ఆరంభించాడు. విప్లవానంతర ప్రభుత్వం అంతర్జాతీయ వ్యవహారాలలో పాలుపంచుకోకపోతే ఇలాగే జరుగుతుంది.

    మెచ్చుకోండి

   2. వ్యక్తివాదానికి సామర్థ్యంతో సంబంధం లేదు. ఈ లింక్ చదవండి: http://stalin-mao.net.in/96402658
    సామర్థ్యం పేరు చెప్పి వ్యక్తివాదాన్ని నెత్తికెక్కించుకుంటే ఏమీ రాదు.

    మెచ్చుకోండి

  4. *శ్రీరాం గారు వంకాయమ్మ అని సంబొదించడాన్ని పట్టి అర్దం చెసుకొవచ్చు రంగనాయకమ్మ గారి పైన ఎంతటి ద్వ్యెషం వుందొ !*

   ఎర్ర సిద్దాంతాల పుస్తకాలను చదివే వారిని, నమ్మి ఆచరించే వారిని ఒక చిన్న మాట అంటే వారికి విపరీతమైన కోపం వస్తుంది. వారు దానిని ద్వేషం గా అర్థంచేసుకొంటారను కోవటానికి మీరు పైన రాసినది ఒక ఉదహరణగా చెప్పవచ్చు. అదే సదరు వంకలమ్మ గారు రాముడు తో మొదలు పెట్టి ,సత్య సాయిబాబా గారి వరకు తన వర్గ దృకోణం నుంచి మాత్రమే చూస్తూ, తెగ వీశ్లేషణలు రాసారు. ఇక వంకాయమ్మగారి పైన మీరు ఊహించుకొంట్టునట్లు నాకైతే ద్వేషం లేదు. ఆమే మార్క్సిజం మీద వంద పుస్తకాలు రాసుకొంటే పోయేది ఎమీలేదు. ఇక ఆవిడ పై నా అభిప్రాయం. స్వతహాగా మంచి రచయిత. శైలి బాగుంట్టుంది. మధ్యతరగతి వారిని దృష్ట్టిలో ఉంచుకొని రాస్తారు. జీవితంలో చాలా కష్ట్టాలు అనుభవించారు, కనుక వాటి ప్రభావం ఆమే రాసే రచనలపైన ఉంది. ఎందుకో ఆమే రాసిన పుస్తకాలు చదివితే (ఆ మార్క్సిజ వాదనను పక్కన పెడితే ) చార్లేస్ డికెన్శ్ గుర్తుకు వచ్చాడు. అతనికి చిన్నతనంలో తండ్రి చనిపోయిన కొన్ని రోజులకు, వాళ్ల అమ్మ రేండో పెళ్ళి చేసుకొన్న తరువాత, తాను పడిన కష్ట్టాలు డేవిడ్ కాపర్ ఫీల్డ్, గ్రేట్ యక్స్ పెక్టేషన్ అనే పుస్తకాలలో మనసుకు హత్తుకొనే లాగా రాస్తారు. ఇక వంకలమ్మ గారి లోపాలు. వాస్తవానికి కడు దూరం. కొండను తవ్వి ఎలుకను అనే వ్యాసం లో బాలగోపాల్ ను విమర్శించటం చూసి, వారి గురువు మార్క్స్ గారిని మరొక్క సారి గుర్తుకు తెచ్చింది.

   మెచ్చుకోండి

   1. బాలగోపాల్ గురించి మీకు తెలిసినట్టు లేదు. బాలగోపాల్ కొంత కాలం మార్క్సిస్ట్‌లాగ నటించి తరువాత అతను మార్క్సిజం మానవ స్వభావానికి వ్యతిరేకం అని వాదించాడు. బాలగోపాల్ వాదనలలో ఉన్న లొసుగులు బయటపెట్టడానికే రంగనాయకమ్మ గారు బాలగోపాల్‌ని విమర్శించారు. మనిషి యొక్క బిహేవియర్‌పై సమాజ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. నీతిగా బతికేవాళ్ళని సత్తెకాలపు సత్తెయ్యలు అని వెక్కిరించేవాళ్ళు ఎక్కువగా ఉన్న సమాజంలో మన పిల్లలు పెరిగితే మన పిల్లలు కూడా ఆ కుళ్ళు నీతినే నేర్చుకుంటారు. ఇలాంటి కుళ్ళు నీతిని నమ్మేవాళ్ళు ఇంత కంటే ఉన్నతమైన సమాజం సాధ్యమని చెపితే వాళ్ళు నమ్ముతారా? ఇటువంటి సామాజిక పరిస్థితులలో ఎక్కువ మంది మార్క్సిజాన్ని అంగీకరించకపోవడంలో విచిత్రం లేదు. కులం కట్టుబాట్లు బలంగా ఉన్న గ్రామానికి వెళ్ళి కులాలు లేని సమాజం సాధ్యం అని చెప్పినా అక్కడివాళ్ళు నమ్మరు. అలాగని కుల వ్యవస్థే ఎటర్నల్‌గా ఉండాలని ఒక అభ్యుదయవాది ఒప్పుకుంటాడా?

    మెచ్చుకోండి

    1. *బాలగోపాల్ కొంత కాలం మార్క్సిస్ట్‌లాగ నటించి తరువాత అతను *
     అసలికి బాలగోపాల్ లాంటి తెలివిగల వారికి, ఆ లోపభుయిష్ట్టమైన సిద్దాంతం నచ్చటమే అన్నిటికన్నా వింత. మార్క్సిజం పరిమితులు అర్థమయ్యి బయటపడితే, దానిని మీలాంటి వారు మార్క్సిస్ట్‌లాగ నటించి అనే పదాలు వాడుతూ, అక్కడికేదో ఆయన డబ్బులు, అధికారం సంపాదించి వెన్నుపోటు పొడిచి నట్లు మాట్లాడుతున్నారు

     మెచ్చుకోండి

     1. పెట్టుబడిదారీ వ్యవస్థలోనే పరిమితులు ఎక్కువ. హ్యారీ మెగ్డాఫ్ రచనలు చదివితే ఈ విషయం అర్థమవుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యక్తి ప్రయోజనాల కోసమే నిర్దేశించబడినది కానీ అది సామాజిక ప్రయోజనాల కోసం నిర్దేశించబడలేదు. ఒకవేళ సామాజిక ప్రయోజనాలే తమ లక్ష్యం అని చెప్పుకుంటే పెట్టుబడిదారులు తమ భోగ విలాసాలు తగ్గించుకోవలసి ఉంటుంది. కొంత కాలం పాటు వెల్ఫేర్ కేపిటలిజం పేరుతో కీనెసియన్ ఆర్థిక విధానాలు అవలంబించిన యూరోపియన్ దేశాలు 1960ల ఆర్థిక సంక్షోభాల తరువాత నెమ్మదినెమ్మదిగా కీనెసియన్ ఆర్థిక విధానాలని త్యజించాయి. తమకి వ్యక్తిగతంగా నష్టం వస్తుందనిపిస్తే ఏ పెట్టుబడిదారుడైనా అలాగే చేస్తాడు. హ్యారీ మెగ్డాఫ్ రచనలు ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి. అవి బయట పెడతాను.

      మెచ్చుకోండి

      1. అన్నాయ్ ఎప్పుడు చూసిన పుస్తకాలను కోట్ చేస్తూటాoవే, కమ్యునిజం అధికారంలో రావటానికి పోరాడేదెవరు? పుస్తకాలు చదువుతూ కూకొంటే దానిని ప్రజలలో కి తీస్క పోయేదేవరు? అధి ఎప్పటికి అధికారంలోకి రావాలే? అధికారంలోకి రాకపోతే ఆపార్టి వలన ప్రజలకు జరిగేమేలు ఎమీటీ?

       మెచ్చుకోండి

     2. ప్రవీణ్, బాల గోపాల్ గారిని “నటించి” అనటం సరి కాదని నేనూ భావిస్తున్నాను. మీ దగ్గర ఆ యన నటించినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?

      మెచ్చుకోండి

      1. బాలగోపాల్ ఒకప్పుడు మార్క్సిజాన్ని బహిరంగంగానే సమర్థించాడు. అతను వ్రాసిన “కమ్యూనిజానికి కాలం చెల్లిందా?” అనే వ్యాసంలో అతని ఇంక్లినేషన్స్ మార్క్సిజం వైపే కనిపిస్తాయి. మార్కెట్‌లో వస్తువుల ధరలు తగ్గిపోయి పెట్టుబడిదారులకి నష్టం వచ్చినప్పుడు పెట్టుబడిదారులు కార్మికులని ఉద్యోగాల నుంచి తొలిగించి డబ్బులు మిగుల్చుకుంటారు. అంగట్లో సంక్షోభం వస్తే కోట్లాది మందిని నిరుద్యోగులుగా మార్చే వ్యవస్థలో మనం బతకాలా అంటూ ఆ వ్యాసంలో ప్రశ్నించారు. చైనాలో వ్యవసాయానికి భూములు సరిపోకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నిర్దేశం కింద పని చేసిన రైతులు బంజరు భూములని సారవంతమైన భూములుగా ఉమ్మడి శ్రమతో ఎలా మార్చారో, చైనాలో ఫాక్టరీలు పెట్టడానికి ఉక్కు సరిపోకపోతే గ్రామస్తులు ఉక్కు కొలిములు పెట్టి చేతులు కాలేంత కష్టపడి ఎలా పని చేశారో కూడా బాలగోపాల్ ఉదయం పత్రికలో వ్యాసం వ్రాసాడు. ఈ విషయాలన్నీ తెలిసిన బాలగోపాల్ ఆ తరువాత మార్క్సిజంలో ఖాళీలు ఉన్నాయని అంటూ ఒక వ్యాసం వ్రాసాడు. ఆ వ్యాసాన్నే రంగనాయకమ్మ గారు విమర్శించారు.

       మెచ్చుకోండి

    2. ప్రవీణ్, బాలగోపాల్ గారు మార్క్సిజం మానవ స్వభావానికి వ్యతిరేకం అని వాదించడం తప్పు ఎలా అవుతుంది. మానవ స్వభావం ఎప్పుడు ఒకేలా ఉంటుందా?

     బాలగోపాల్ గారు నమ్మినది ఆచరించే వ్యక్తి, వారిని మీరు ‘నటించి’ అనే మాట అనడం తప్పు అవదా. కాదంటే మార్క్సిజం ని మళ్ళి మానవ స్వభావాన్ని సరిదిద్దేలా ఆచరించి చూపాలి కాని.

     మెచ్చుకోండి

 5. The telegraph link (whoever provided it) is full of anti communist rehtoric.

  She says “Communism’s fatal error was in thinking that morality resided in the mechanisms of an economic system rather than in the people who operated them”

  The economic system does define morality in the people. Why is it that all the advanced capitalist societies have very similar set of social or moral values ? . We can easily see the shift in the moral values in India in the past 100 years. Isnt it because of the change in the economic conditions of the people?. Markets cannot be moral or immoral but the economic conditions drive the morality of the people.
  For example, only someone who is rich and has lot of time in his/her hand can go around talking about animal rights(ofcourse the rich constantly need something to feel better about themselves. so they will be involved in such feel-good schemes)

  The so called western anti-communists talk about the atrocities of the communist regimes but keep their mouth shut when it comes to how the imperialist countries pillaged and raped countries like India. No “Communist atrocity” that I know of can be compared to the british atrocities in India (worst of all the artificially induced famines). She is cribbing about not sufficiently educating children about the communist atrocities. She doesnt talk about the atrocities under capitalist banner like the Vietnam war(the list is too huge to be even listed here).

  Aasaka ramanna garu,
  you said
  “There will be no monopoly in Laisez free capitalism….as and when a product/service has demand, companies will compete to provide them. One has to provide a product/ service cheaper and of good quality to remain in the business.

  How about the capital intensive businessess where commpetitors cannot easily provide the “cheap or good quality ” products. Anyone with an unfair advantage of having the capital can easily buy out these competitors and build a monopoly.

  మెచ్చుకోండి

 6. వర్గ పోరాటాలు లేకుండా మార్పు వచ్చిన సందర్భాలు చరిత్రలో లేవు. కొన్ని దేశాలలో మత నాయకుల నాయకత్వంలో విప్లవాలు వచ్చాయి. ఆ విప్లవాల తరువాత అధికారంలోకి వచ్చిన మత నాయకులు కూడా ప్రైవేట్ ఆస్తికే ప్రిఫరెన్స్ ఇచ్చి దోపిడీ వ్యవస్థనే కొనసాగించారు. ఉగాండాలో ఈదీ అమీన్ నాయకత్వంలో ఏమి జరిగినదో, ఇరాన్‌లో అయాతొల్లాహ్ ఖొమెయినీ ఏమి చేశాడో కూడా తెలిసినదే కదా.

  మెచ్చుకోండి

 7. నేను ఇంతకు ముందే ఒక విషయం వ్రాసాను. మనిషి యొక్క స్వభావంపై సామాజిక పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. తెల్ల చొక్కా వేసుకుని కార్‌లో తిరిగే IAS అధికారి మార్క్సిజాన్ని అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి సమాజంలో డబ్బుని బట్టి, హోదాని బట్టి గౌరవం ఉంటుంది కనుక ఆ గౌరవాన్ని వదులుకోవడానికి ఆ IAS అధికారి ఒప్పుకోడు. MNCలో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి రెండు కోట్లు సంపాదించే షేర్ హోల్డర్‌కి మార్క్సిజంపై వ్యతిరేకత అంత కంటే ఎక్కువే ఉంటుంది. కేవలం కంపెనీలలో పెట్టుబడులు పెట్టి శ్రమ లేకుండా బతికే షేర్ హోల్డర్ రేపు విప్లవం వస్తే తన పెట్టుబడులని వదులుకుని శ్రమ చేస్తూ బతకాల్సి వస్తుంది. ఆ పెట్టుబడిదారుడు డబ్బుని కేవలం ఉత్పత్తి కోసం వాడకుండా మల్టిప్లికేషన్ కోసం వాడుతున్నాడు. డబ్బుని మల్టిప్లై చెయ్యడం వల్ల అతనొక్కడికే ప్రయోజనం ఉంటుంది కానీ సమాజానికి కాదు. మార్క్సిజాన్ని వ్యతిరేకించే వర్గంవాళ్ళు కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటారు కానీ సామాజిక ప్రయోజనాలు చూడరు. అందుకే కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి రెండు కోట్లు సంపాదించడం ఒక MNC షేర్ హోల్డర్‌కి తప్పుగా కనిపించదు.

  మెచ్చుకోండి

 8. Hi Praveen,
  ఆ పెట్టుబడిదారుడు డబ్బుని కేవలం ఉత్పత్తి కోసం వాడకుండా మల్టిప్లికేషన్ కోసం వాడుతున్నాడు.
  I never understood how we can multiply money without multiplying human labour. From my understanding from Capital, money is nothing but a stored form of human labour. Money can never be multiplied without human labour being multiplied.

  మెచ్చుకోండి

 9. పెట్టుబడిదారుడు అమ్మే వస్తువు యొక్క ధర మార్కెట్‌లోని డిమాండ్ ఆధారంగా ఉంటుంది. ఆ వస్తువు అమ్మగా వచ్చిన లాభాలలో కార్మికులకి వాటా ఇస్తాడని చెప్పలేము. తనకి లాభాలు రాగా మిగిలిన డబ్బులు మాత్రమే కార్మికులకి జీతాలుగా ఇస్తాడు కానీ కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి వ్యాపారం చెయ్యడు. మార్కెట్‌లో వస్తువుకి డిమాండ్ పెరిగి ధర పెరిగినంతమాత్రాన కార్మికులకి జీతాలు పెరగవు కానీ డిమాండ్ తగ్గి ధర తగ్గితే కార్మికుల జీతాలు తగ్గుతాయి. అందుకే మార్కెట్ సంక్షోభాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారుల కంటే కార్మికులే ఎక్కువ నష్టపోతారు. మిత్తల్ కుటుంబాన్నే ఉదాహరణగా తీసుకుందాం. ఆ కుటుంబం ఒకప్పుడు రాజస్థాన్‌లోని పల్లెటూరిలో ఉండేది. ఆ కుటుంబం కలకత్తా దగ్గర ఒక చిన్న స్టీల్ మిల్ కొనేసి పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ కుటుంబం పెద్దపెద్ద స్టీల్ మిల్లులు ఉన్న ఒక బహుళజాతి కంపెనీలో ప్రధాన వాటాదారు. డబ్బు ఎన్నో రెట్లు మల్టిప్లికేషన్ జరగకపోతే ఒక చిన్న స్టీల్ మిల్ నుంచి పెద్దపెద్ద స్టీల్ మిల్లులు పెట్టే బహుళజాతి కంపెనీ స్థాయికి ఎదగడం జరగదు.

  మెచ్చుకోండి

 10. బొండాలపతి గారు
  ఒక విషయం గురించి యవరైనా విమర్శ చెయ్యదలుచుకున్న వారు ముందు చెయ్యలసింది కనీసంగానైన ఆ చెయ్యబొయె విషయం గురించి తెలిసి వుండాలి అంశాల వారీగా ఎత్తిచుపుతూ ఇక్కడ ఇలావుంది లేదా పలానా దగ్గర అబ్యంతరకరంగా వుంది లేదా అశాస్త్రియంగా వుందని నిరూపించాలి నీతి నిజాయతి గల వ్యెక్తులు యవరైనా చెయ్యవలసింది .అదే .దాన్ని యవరిమీదైతె విమర్శ వచ్చిందొ దాని వాళ్ళు వ్యెక్తిగత విమర్శగా తీసుకొకుండా అందులొ ఏ మైనా తప్పులు వుంటె అంగీకరించాలి .
  చలం గారి మీద యవరొ ఒక పత్రికకు విమర్శాగా రాస్తె దాన్ని ఆ దారంగా తీసుకొని వెంకటెస్వరావు అనే ఆయన యెకంగా ఒక పుస్తకమే రాశారు. చలం సాహిత్యం అంతా స్వొశాన సాహిత్యమే అంటూ .ఆయనకు మీకు యెమైనా తెడా వుందేమొ ఆలొచించుకొండి ఒక దానిపైన విమర్శ చెయ్యడం వెరు ప్రశ్నెనలు వెయ్యడం వేరు వాటి రొడింటికి తెడా తెలుసుకొండి .మర్కిజం గురించి నేను ఏమీ చదవలేదంటూనే విమర్శ ఏలాచెయ్యగలుగుతున్నారు?
  సమానత్వాన్ని మీరు శారీరక మానసిక సమానత్వంగా అర్దంచెసుకున్నారు ఇంత చిన్నవిషయాన్నె ఇంతభాగా అర్దంచెసుకున్నారు కమ్యునిజం దాకా పొనక్కరలేదు కమ్యునిజం అంటె మీ ద్రుష్టిలొ యవరొ ఒకరు రాజ్యాన్ని పిరిపాలిస్తారు మహా ఐతె అందరికి ఉద్యొగాలు వుంటాయి లేదా ధరలు తక్కువగా వుంటాయి ఇంకా ఆ రకమైన ఊహలుఏవొవున్నాయి మీ ద్రుష్టిలొ. ఇలాంటి కమ్యునిజాన్ని మార్కిజం చెప్పలేదు కమ్యునిజం అంటె విలువ లెక్కలు లేకుండా రాజ్యాంగ యంత్రం ఉనికిలొ లేకుండా దకా సాగాలి కమ్యునిస్టు నియంత్రుత్వం ఎర్పడిన వెంటనే ఆ మార్పులు వెంటవెంటనే జరిగిపొవు ఒక క్రమపద్దతిలొ జరుగుతాయి ఆ మార్పులు చెయ్యడానికి రశ్య , చైనాలు .ఒకటి రొండడుగులులు వెశాయి తర్వాత తిరొగమనం పట్టెయి .
  భలవంతుడు భలహీనుణ్ణి అనచటం మీకు ప్రక్రుతి సహజదర్మం లాగ కనపడుతున్నన్నమాట! ఒక పులి ఒక జింకను సంపి తినిందంటె అది ప్రక్రుతి దర్మం (జికను కాకపొతె ఇంకొదాన్ని ) లేకపొతె అదిజీవిచె అవకాశమే వుండదు ఒక మనిషిని ఇంకొకమనిషి దొసకపొతె లేదా అనచకపొతె జీవించె అవకాశమే లేదా? అది పక్రుతి దర్మమా?
  2 సామ్యవాదంలొ ఒకడు భాగా కస్టపడి డబ్బుసంపాడిస్తాడు ఆ డబ్బును ఉపయొగించి రాజకీయ అధికారం కొనుక్కొవచ్చు .
  సామ్యవాదం అంటె మీకు ఇలాగ అర్దమైదా సారూ . సారూ మీరు అక్కడక్కడ ఆర్దిక విశ్లేషణలు కుడా చెసారు పైపై ఊహలే సైన్సు కాదు ఇలాంటి ఊహలు నేను కుడా చానా చెసినాను మార్కిజం తెలియక ముందు .సమాజంలొ కులాలు మతాలు పొతె చాలు అన్ని సమస్యలు పొతాయనుకునేవాడిని అలాగేవున్నాయి మీ ఊహలు కుడా ,మీరు రాసినవాటిపైన రాయాలంటె చాలావున్నాయి కానీ ఇప్పటికే చలా రాసినట్టు వున్నాను

  మెచ్చుకోండి

 11. ఇక ఈ యనగురించి చెప్పాలంటె వ్యెక్తిగత దుషణలే పరమావదిగా పెట్టు కున్నాడు రాముడు నుంచి సాయిబాబా వరకు విమర్శిస్తె ఆమె లెవనెత్తిన ప్రశ్నెలకు మీకు చెతనైతె సమాదానం చెప్పండి అసమర్దులే వాదనలొ వున్న సత్యాన్ని అంగీకరించె దైర్యం లేక ఇలాగ వ్యెక్తిగత దుషణలకు దిగుతారు

  మెచ్చుకోండి

  1. *అసమర్దులే వాదనలొ వున్న సత్యాన్ని అంగీకరించె దైర్యం లేక ఇలాగ వ్యెక్తిగత దుషణలకు దిగుతారు.*
   సత్యాన్ని అంగికరించటానికి మార్క్సిజం సైన్స్/మాథ్స్ సంబందించిన సిద్దాంతం కాదు కదా! అది ఆర్ధిక రాజకీయ తత్వశాస్రం. అదికూడా, మార్క్స్ గారు మనకొరకు ఎంతో కష్ట్టపడి, తత్వ శాస్రాన్ని భూమార్గం పట్టించారు కదా! దాని నిరుపణా ఎక్కడ ఇప్పటివరకు పూర్తిగా జరిగినట్లు లేదు. వాదన వలన సత్యాన్ని అంగికరించటానికి భారత ప్రజలకి ఇంగిత జ్ణానం ఉంది. అయినా కొంతమంది మార్క్స్ గారు ఇచ్చిన సిద్దాంతాన్ని చదివి 150సం|| కలలు కంట్టునే ఉన్నారు. ఎన్ని తరాలు మారాయి. కలకు మాత్రం అవే. ఇక సమర్ధులైన వారంతా ఇక్కడ చేరి వాదనలు, వీశ్లేషణలు చేసె బదులుగా ముందుగా ఎర్ర పార్టివారిని అధికారంలోకి తీసుకొని రావచ్చు కదా! ఎవరైనా వద్దన్నారా?

   మెచ్చుకోండి

   1. వ్యక్తివాదం వల్ల అభివృద్ధి జరుగుతుందనడానికి ఒక్క ఋజువైనా చూపించలేరు కానీ వ్యక్తివాదం వల్ల జరిగిన నష్టాలకి బోలెడు ఋజువులు కనిపిస్తాయి. మతం లాంటి ఊహాజనిత నమ్మకాలని నమ్మేటప్పుడు ఎవరూ ఋజువులు అడగరు కానీ సామాజిక శాస్త్రమైన మార్క్సిజంకి మాత్రం ఋజువులు చూపించినా అంగీకరించరు. ఎందుకంటే సామాజిక ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం అనుకునేవాళ్ళకి ఋజువులతో పని లేదు.

    మెచ్చుకోండి

   2. మార్క్సిజాన్ని సైన్స్ అని నేనంటున్నాను కాదని మీరంటున్నారు ఎలాకాదొ మీరు వివరించండి . ఎదైనా ఒక విషయాన్ని ఏమి చెప్పెరొ చుస్తారు గాని ఎప్పుడు చెప్పేరొ చూడరు కాలంతొ పనేముంది? బానిస సమాజం నుంచి నేటి వరకు చరిత్రను చుడండి. ఎదైనా ఒక్క పొరాటంతొనే వాళ్ళ బానిస సంకెళ్ళు వదిలించుకొగలిగారా? వందలపొరాటాలు అవసరమైనాయి .ఇక ఈ కమ్యునిస్టు ముసుగు పార్టీల గురించి నేను గతంలొనే చెప్పేననుకుంటా ఆ పార్టీలకు మిగతా పార్టీలకు తేడా ఏమీ లేదు

    మెచ్చుకోండి

    1. ఇంతకు మునుపు ఈ బ్లాగులో సైన్స్ కాదని ఒకరు వివరించారు. మీరు వివరణ ఇస్తే చదివి మీ వాదన తెలుసుకొంటాను.
     *ఇక ఈ కమ్యునిస్టు ముసుగు పార్టిలు*

     ఏ పార్టిలో నాకు తెలియదు. మీకు ప్రస్తుతం ఉన్న పార్టిలు నచ్చవా? అడవిలో అన్నల పార్టి కూడానచ్చదా? ఆఫీసులో పని ఎక్కువగా ఉంది మునుపటిలాగా వెంటనే బదులు ఇవ్వలేను.

     మెచ్చుకోండి

     1. ఏ పార్టీయొ తెలియదా? కమ్యునిస్టు పార్టీలంటె సి.పి.యం., సి.పి.ఐ .ఇండియాలొ అవికాకుండా ఇంకేమైనా వున్నాయా? ప్రస్తుతం వున్న కమ్యునిస్టు ముసుగు పార్టీలు నచ్చడం నచ్చకపొవడం నా వ్యెక్తిగత విషయం కాదు వాటి ఆ చరణే అవి ఏ రకం పార్టీలొ అర్దం అవుతుంది మార్స్కిజం సైన్స్ కాదని చెప్పిన ఆలింకు యక్కడ వుందొ మీకు తెలిస్తె చెప్పండి చుస్తాము

      మెచ్చుకోండి

      1. ఇక్కడ మార్క్సిజంని విమర్శిస్తున్నవాళ్ళందరూ అమెరికాకి చెందిన ఒక అయన్ రాండ్ అభిమాని నడుపుతోన్న వికీపీడియా నుంచి మెటీరియల్‌ని కాపీ కొట్టేవాళ్ళే. వాళ్ళు తమ సొంత అభిప్రాయాలు వ్రాయరు. కాపీ & పేస్ట్ ఇన్ఫర్మేషనే వాళ్ళకి సోర్స్‌గా ఉంటుంది.

       మెచ్చుకోండి

 12. 1. అసలు అణచివెత లేకుండా పొవాలంటె మనిషిలొ అధికారం కొసం తఫిచె జీన్ పొవాలి కాబట్టి మనిషిలొ మౌలికమైన బయొలాజికల్ మార్పులువచ్చి ఆధిపత్యం, సార్దం మొదలైన గుణాలు పొతేగాని అసలైన సమానత్వం రాదు.
  ఇది యలావుందంటె ఒక మనిషి పులినిచూసి భయపడితె ఆ భయానికారణం పులి కాక నీ మెదడులొ ప్రత్కెమైన రసాయణ ప్రక్రియ వల్ల తప్ప ఆ పులి కారణం కాదు .ఇలావుంది మీ వాదన ఆ జీన్ ప్రక్రుతి సహజమైందా లేదా సామాజికమైందా ? ఏ దానిమీద ఏది ఆ దారపడి వుంది?. ముందు రాజ్యంగ యంత్రం వుంటెనే అదికారయంత్రంగం వుంటుంది. ధికార యంత్రాంగం వుండటం వల్ల రాజ్యాంగ యంత్రం వుండదు కూలిపని వుంటేనే శ్రమ దొపిడీ వుంటుంది శ్రమదొపిడీ వుండటం వల్ల కూలిపని వుండదు శ్వార్దం ,అధికారం ఇంకా జీన్ ఇవన్నీ ఉత్పత్తి సంబందాలవల్ల పుట్టుకువచ్చిన ఉపరితల అంశాలు విటితొ ఎంతపొరాడినా ఆ వర్గానికి పొయేదేమీ లేదు నీతి వాక్యాల వల్ల మనుషులు మారతారనుకుంటె అంతకన్నా బ్రమ మరొకటి లేదు

  మెచ్చుకోండి

  1. మనిషి ప్రవర్తనని మెదడులోని రసాయనాలే కారణమని ఎక్కడా ఋజువు కాలేదు. కొంత మంది సైంటిస్ట్‌లు ఆ ప్రొపోజల్ చేసినా ఇతర సైంటిస్ట్‌లు దాన్ని నమ్మలేదు. ప్రాచీన ఈజిప్ట్‌లో తల్లి-కొడుకులు పెళ్ళి చేసుకునే ఆచారం ఉండేది. అప్పటి నాగరికత ప్రకారం వాళ్ళకి అది తప్పు అనిపించలేదు కాబట్టి ఆ ఆచారాణ్ణి ఆచరించారు. ఇప్పుడు ఎవడైనా అలాంటి పెళ్ళిళ్ళని అడ్వొకేట్ చేస్తే అతన్ని పట్టుకుని తంతారు. ఇదంతా నాగరికతలో వచ్చిన పరిణామమే. ఎవడైనా మెదడులోని రసాయనాల వల్లే రక్త సంబంధాల విషయంలో మనుషుల ఆలోచనలూ, ఆచారాలూ మారాయని చెపితే నమ్మగలమా? ఒక సాధారణ పెట్టుబడిదారుని కంటే ఒక సామ్రాజ్యవాదికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగని పెట్టుబడిదారుని శరీరంలో స్వార్థాన్ని పెంచే జన్యువుల కంటే సామ్రాజ్యవాది శరీరంలో స్వార్థాన్ని పెంచే జన్యువులు ఎక్కువగా ఉంటాయని అనుకోగలమా?

   మెచ్చుకోండి

 13. శాస్త్రం అనే పదానికి నిర్వచనం ఏమిటి? ఇద్దరు వ్యక్తులు నిలబడి నాన్‌సెన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఎంతైనా మాత్లాడుకోవచ్చు అని ఎంగెల్స్ అన్నాడు. ఆ నాన్‌సెన్స్‌కి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధం ఉంటే అది చర్చా విషయమే.

  మెచ్చుకోండి

 14. కబుర్లు ఎందుకు? మీరు నిజంగా స్వార్థం మానవ స్వభావం అని నమ్మితే ఇంకొకడి జేబులో క్రెడిట్ కార్డ్ మీద చెయ్యి పెట్టి “నాలో ఉన్న జన్యువులే నీ క్రెడిట్ కార్డ్ తియ్యమని నాకు చెప్పాయి” అని చెప్పండి. అప్పుడు అతను నమ్ముతాడా?

  మెచ్చుకోండి

 15. మీరు వంద రూపాయల నోట్ మీద చెయ్యి పెట్టినా అతను నమ్మడు. క్రెడిట్ కార్డ్ మీద చెయ్యి పెడితే కాలర్ పట్టుకుని కొడతాడు. అదే తేడా.

  మెచ్చుకోండి

 16. *ఇక్కడ మార్క్సిజంని విమర్శిస్తున్నవాళ్ళందరూ అమెరికాకి చెందిన ఒక అయన్ రాండ్ అభిమాని *

  మాహానుభావా! నేను అయాన్ రాండ్ సిద్దాంతం చదివి ఇక్కడ మాట్లటంలేదు. నాకు ఆ అవసరం లేదు. ఆమేకి వంకలమ్మ కి పెద్ద తేడాలేదు. అయాన్ రాండ్ స్వంతం గా పెట్టి నడిపిన కార్పోరేట్ సంస్థలు లేకపోయినా కేపిటలిజానికి మద్దతుగా తెగ వాగుతుంది. ఈ తెల్ల వాళ్ళు తమకి తెలిసినది చిటికేడైనా, అంతా తెలిసినట్లు వాగుతారు. మొదట పుస్తకాలు రాసి పారేసి, ప్రతి మీటీంగ్ లో ఆథర్ ఆఫ్ సొ అండ్ సొ బుక్ అని తమని తాము పరిచయం చేసుకొంటారు. అది వారి వ్యాపారం. అంతకు మించి వారుచేసేది పెద్దగా ఉండదు. బ్రతికినన్ని రోజులు సేమినార్లు ఇచ్చుకొంట్టు, ఆ పుస్తకంలో ఉండే ముచ్చట్లు చెప్పుకొంట్టు ఎదో సాధించినట్లు మాట్లడుతూంటారు. వారు పోయిన తరువాత వాటిని (రాసిన సిద్దాంతాలను) పట్టించుకోనే వారు ఉండరు.

  మెచ్చుకోండి

 17. అయన్ రాండ్‌కి రంగనాయకమ్మ గారితో పోలిక అనవసరం. ఇక్కడ మార్క్సిజంని విమర్శించేవాళ్ళు వికీపీడియా నుంచి కాపీ కొట్టిన మేటర్ పేస్ట్ చేస్తోంటే అయన్ రాండ్ గుర్తొచ్చి ఆవిడ పేరు వ్రాసాను, అంతే. ఒకడు సెంట్రల్ బ్యాంక్‌లు అవసరం లేదని వ్రాస్తే అది అయన్ రాండ్ స్టైల్‌లాగ కనిపించి అతను వికీపీడియా నుంచి కాపీ కొట్టాడని అర్థమయ్యింది. సెంట్రల్ బ్యాంక్‌లు లేకపోతే ప్రైవేట్ ప్రెస్‌లు అవసరానికి మించి నోట్ల కట్టలు ప్రింట్ చేసి బ్లాక్ మనీ సర్క్యులేట్ చెయ్యగలవు అనే జ్ఞానం కూడా కలగలేదంటే అది ఖచ్చితంగా వికీపీడియా నుంచి కాపీ కొట్టిన మేటరేనని అర్థమయ్యింది.

  FYI, పెట్టుబడిదారులలో స్వయంగా కార్పొరేట్ కంపెనీలు నడపకుండా కేవలం షేర్‌లు కొనడం లాంటి రిస్కీ పనులు చేసి బతికేవాళ్ళు ఉన్నారు. అది రిస్కీ పని అయినా శ్రమ లేని పనే కనుక ఆ పని చేస్తూ బతికేవాళ్ళు కొందరైనా ఉంటారు. మార్కెట్ సంక్షోభం వచ్చి షేర్ల ధరలు పడిపోతే అప్పుడు లోతు ఎంతో వీళ్ళకి తెలుస్తుంది.

  మెచ్చుకోండి

 18. మనం ఈ రోజున అభివృద్ది అనేది ఏఅనుకొంట్టున్నామో అది శ్రమ చేయకుండా సంపద తద్వారా అధికారం ఎక్కువ గా సంపాదించాలనే వారివలన జరిగింది. ఇంట్లో కుచొని భార్యను, పిల్లలను ముద్దుగా చూసుకొంట్టు, మానవత్వ విలువల గురించి మాట్లాడుకొనే వారి వలన ఎక్కడైనా అభివృద్ది జరిగితే చెప్పేది.

  మెచ్చుకోండి

 19. శ్రమ చెయ్యకుండా బతికే వర్గం ద్వారా పెరిగేవి ఆర్థిక అసమానతలే. అసమతల అభివృద్ధిని నేను అభివృద్ధి అనుకోను. వైట్ కాలర్ లేబర్ (సైంటిస్ట్‌లు, ఇంజినీర్‌లు లాంటివాళ్ళు) చేసే పనిని కూడా శ్రమే. కానీ షేర్‌లు కొని లాభాలు పొందడం మాత్రం ఏ రకంగానూ శ్రమ కిందకి రాదు.

  మెచ్చుకోండి

 20. *శ్రమ చెయ్యకుండా బతికే వర్గం ద్వారా పెరిగేవి ఆర్థిక అసమానతలే. అసమతల అభివృద్ధిని నేను అభివృద్ధి అనుకోను.*

  నేను ఎంత సమాపాదించానో ఇతరులతో పోల్చుకోను. పోల్చుకోకపోతే ఆర్థిక అసమానతలు ఒక అసమానతే కాదు. నువ్వు, నీలాగా ఆలోచించే వారు అభివృద్ధి దానిని అభివృద్ది అనుకోకపోతే గమ్ముగా కూచోని ఉండవచ్చు గదా! దోపిడి చేసి అభివృద్ది చెందారని పుస్తకాలు రాయటమేందుకు? పోరాటాల గురించి మాట్లాడటమేందుకు? సమాజంలో మా వాట దక్కలేదని వాపోవటమేందుకు.
  శ్రమ చేయాలనే అంత దురద ఉంటే రోజు కత్తి/గొడ్డలి తో చెట్టు మండలు కొట్టి,వాటిని ఎండబేట్టుకొని పొయ్యిని ఉపయొగించి అన్నంవండుకొని తింటే సరి. శ్రమ చేసి తిన్నామన్న తృప్తి కలుగుతుంది 🙂

  మెచ్చుకోండి

 21. నేను కూడా వైట్ కాలర్ కుటుంబానికి చెందినవాణ్ణే నాయనా. మా జిల్లాలోని చాలా మందితో పోలిస్తే నేను డబ్బున్నవాణ్ణే. ఆర్థిక అసమానతల గురించి నిజాలు మాట్లాడితే మా కుటుంబ సంపాదన ఏమీ పెరగదు. బ్యాంక్ ఆఫీసర్ అయిన మా నాన్న గారు సిసి కెమెరాకి కనెక్ట్ చేసిన కంప్యూటర్ ముందు కూర్చుని కరెన్సీ చెస్ట్‌లో ఫ్రాడ్ జరుగుతోందో, లేదో అనేది మాత్రమే చూసేవారు. నిజానికి అది కూడా ఒక శ్రమే. Though it is abstract labor and not physical labor according to Marxism.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s