బ్లాగుల లో కొత్త వారి తో ఎందుకు కబుర్లు చెప్తాం?

ప్ర: మనం రోడ్డు మీద నడుస్తున్నామనుకోండి, ఎదురు గా ఒక కొత్త మనిషి వస్తే అతని తో మాట్లాడం. మరి బ్లాగుల్లో కొత్త మనుషుల తో ఎందుకు మాట్లాడుతాం?
జ: రోడ్డు మీద పోయే ఎదుటి మనిషి ఆలోచనలు మనకు తెలియవు కనుకా, బ్లాగుల్లో బ్లాగరులు తమ ఆలోచనలను చెప్తారు కనుకా..
ప్ర: RF ID ల ద్వారా షాపింగ్ బుట్ట లో వస్తువుల విషయాలు తెలిసినట్లు గా, రోడ్ మీద పోయే వ్యక్తి ఆలోచనలు తెలీపతీ  ద్వారా తెలిసినవనుకోండి, అప్పుడు వెళ్ళి రోడ్ మీది వ్యక్తి తో గల గలా మాట్లాడేస్తామా?
జ: బ్లాగ్ రాసిన వ్యక్తి, లేక కామెంటిన వ్యక్తీ నలుగురూ తను రాసినది చదివి తనకి సమాధానం చెప్పాలని రాస్తాడు. రోడ్డు మీద పోయే వ్యక్తి నిన్నేమైనా బొట్టూ కాటుక పెట్టి తనతో మాట్లాడ మన్నాడా?
ప్ర: అంటే, సదరు బ్లాగ్ స్వంత దారులు దారే పోయే వారిని బొట్టు పెట్టి పిలిచి మాట్లాడిస్తున్నారా?  బ్లాగులు రాసే వారు మాట్లాడే వారి కోసం మొఖం వాచిపోయి ఉన్నారా?
జ: ఒక రకం గా అంతే! నిజ జీవితం లో హాయి గా జనాల్తో కబుర్లు చెప్పుకొంటూ సంతోషం గా ఉన్న వాడికి (ఆ స్టేజ్ లో), బ్లాగులు రాయటానికి ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఒక పల్లెటూరి అరుగులపై ఊళ్ళోవారి తో హాయిగా కబుర్లు చెప్పుకొనే వ్యక్తి ని బ్లాగులు రాయమనండి. “అదేంటబ్బాయ్, కొత్తోళ్ళ తో ఆలోచన ఎలా చేస్తాం?”, అని అనకపోతే నన్నడగండి. నిజ జీవితం లో కబుర్లు చెప్పుకోవటానికీ, తమ ఆలోచనలు పంచుకోవటానికీ అవకాశం లేని వారూ, గుర్తింపు కరువైన వారు బ్లాగులు రాసే అవకాశం మెండు.
ప్ర: మరి సెలబ్రిటీలు గుర్తింపు కోసం మొఖం వాచి పోయి ఉన్నారంటావా? వాళ్ళెందుకు బ్లాగుతారు?
జ: వాళ్ళు రాసేది మామూలు గుర్తింపు కోసం కాదు. ఒకటి తమ ఆలోచనలని జనాల మీదికి వదలటానికి, రెండు తమ ఆలోచనలు గుర్తింపు పొందటానికి. ఒక నటుడి గా గుర్తింపు తెచ్చుకొన్న వాడి ఆలోచనలకి గుర్తింపు ఉండక పోవచ్చు. బ్లాగుల ద్వారా ఆ లోపం తీరుతుంది. అక్కడ కూడా కమ్యూనికేషన్ అనేది one sided గా ఉంటుంది. చదువరుల అమోదం కోసం సెలబ్రిటీ లు ఎదురు చూడరు.వారికి ఆ ఆమోదం అప్పటికే తమ తమ రంగాలలో వచ్చి ఉంటుంది. చదువరుల స్పందన కోసం అసలే పట్టించుకోరు. కామెంటరుల కామెంట్లకి సెలబ్రిటీలు స్పందించటం చాలా తక్కువ. కారణం, ఒకటి, కామెంటిన వారు తమ గోటికి సరి కారనే పరోక్ష భావం (inherent attitude) అయితే, రెండోది తమ గుర్తింపు కోరిక అప్పటికే తీరి పోయి ఉండటం.  ఇక సెలబ్రిటీ బ్లాగ్ లకి ఎక్కువ గా కామెంట్స్ రావటం వలన అందరి కామెంట్ల కీ స్పందించటం కుదరదు కూడా!
ప్ర: మొత్తానికి బ్లాగులు రాయటం ఒక ఆధునిక లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి అంటావ్?
జ: అంతే! సైకాలజిస్టుల కాడినుంచీ మారేజ్ కౌన్సిలర్ల దాకా అందరూ ఈ కోవలోకే వస్తారు. బ్లాగుల ద్వారా వ్యక్తి గత జీవితం గురించి రాసే వారికి వాటి అవసరం ఎక్కువ.ఆ లోపాన్ని బ్లాగులు తీరుస్తున్నాయి.  రోడ్డున పోయే వాడి తో తమ వ్యక్తి గత జీవితం గురించి చర్చించే వాడిని ఏమనాలి?
ప్ర: మరీ కోస్తున్నావ్. నిజ జీవితానికీ బ్లాగు జీవితానికీ తేడా లేదా? నిజ జీవితం లో అలా చర్చిస్తే చాలా రిస్కు కదా. కొత్త వారు మన జీవితాలతో ఆడుకొంటారు. బ్లాగుల్లో ఊరూ పేరూ లేకుండా చర్చిస్తే మనకొచ్చే నష్టమేమిటి? ఊరూ పేరూ తెలిసినా, ఎక్కడెక్కడో ఉండే బ్లాగరులు చేయగలిగేదేమిటి?ఓ.., తెగ చెప్పటం కాదు. మరి, నువ్వు బ్లాగు ఎందుకు నడుపుతున్నా..?
జ: నేనూ ఇప్పటి దాకా చెప్పిన వాటికి అతీతుడిని కాదు. అయిన నా గుర్తింపు కుతి కొంతవరకూ తీరిపోయినట్లుంది, పైగా చెప్పటానికి బుర్రలో ఏమీ మిగల లా..అప్పుడప్పుడూ పనిలేక బోర్ పోవటం కోసం రాస్తున్నా.ఇక,దుకాణం మూసేద్దా మనుకొంటున్నా..

ప్ర: అందరూ నీ లాంటి పనిలేని వాళ్ళు కాదు. ఏదో ఒక ఆశయం తో, లేక ఒక ఐడియాలజీ కోసమో సైట్లు నడిపే వారూ ఉంటారు. ప్రత్యేక మైన ఆడియన్స్ కోసం, రైతులకోసం, సైన్స్ కోసం ఇలా ఒక కారణం కోసం బ్లాగులు నడిపే వారు ఉంటారు.ఒక ఊరి విషయాలు తెలుపుతూ, సినిమా విషయాల కోసం ఇలా నడిపే వారూ ఉంటారు. మరి వారిని గురించి ఏమంటావు?
జ: వారు ధన్య జీవులు. వారిని నడిపించమంటాను.

ప్రకటనలు

17 thoughts on “బ్లాగుల లో కొత్త వారి తో ఎందుకు కబుర్లు చెప్తాం?

 1. నిజ జీవితం లో కబుర్లు చెప్పుకోవటానికీ, తమ ఆలోచనలు పంచుకోవటానికీ అవకాశం లేని వారూ, గుర్తింపు కరువైన వారు బ్లాగులు రాసే అవకాశం మెండు.

  మీరు చెప్పిన ఈ విషయంతో మాత్రం నేను ఏకీభవిస్తాను ఎందుకంటే.. నేను ఆ కారణం వల్లనే బ్లాగింగ్ మెదలు పెట్టాను…

  చాలా బాగా రాసారు…సూపర్

  మెచ్చుకోండి

  1. సాయి గారు,
   “మీరు చెప్పిన ఈ విషయంతో మాత్రం నేను ఏకీభవిస్తాను”
   నేను ఆ విషయం మాత్రమే చెప్పానండీ. ఇంకా వేరే ఏ విషయం చెప్పాను ఈ టపా లో?

   మెచ్చుకోండి

 2. ఇంకా చాల ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి. అది సరే మీరీ టపా ఎందుకు వ్రాసారో చెప్పమంటారా 😉

  హ హ ..చెప్పడం ఎందుకు లెండి, ఎవరికీ కావలసినట్లు వాళ్ళు ఇప్పటికే ఊహించేసుకొని ఉంటారు . 🙂
  దుకాణం మూసేస్తే, బోలెడన్ని శాపాలు తగులుతాయ్ మీకు, బొందలపాటి గారు సెలెబ్రిటీ గా టపాలు వ్రాసి పడెయ్యొచ్చు ఇప్పటినుండి 🙂

  మెచ్చుకోండి

  1. “దుకాణం మూసేస్తే, బోలెడన్ని శాపాలు తగులుతాయ్ మీకు, బొందలపాటి గారు సెలెబ్రిటీ గా టపాలు వ్రాసి పడెయ్యొచ్చు ఇప్పటినుండి 🙂 ”
   అర్ధం కాలేదండీ మౌళి గారు.
   నేను ఈ టపా వేసిన కారణం టపా చివర్లో అంత స్పష్టం గా చెబితే, ఇంకా ఇతరులు ఊహించుకోవటానికి అవకాశం ఎక్కడిది?

   మెచ్చుకోండి

 3. ఎస్వీరంగారవు లాగా ఏకపాత్రాభినయం చేసేశారు. పోస్ట్ బాగుంది.

  >>పనిలేక బోర్ పోవటం కోసం రాస్తున్నా.

  నేనూ అందుకే రాస్తున్నా.

  >>ఇక,దుకాణం మూసేద్దా మనుకొంటున్నా..

  మిమ్మల్నంత వీజీగా ముయ్యనియ్యం లేండి. ఎన్నో విషయాల మీద అద్భుతంగా రాస్తూ.. మధ్యలో ఈ అస్త్రసన్యాస ప్రస్తావన ఏంటండి!

  మెచ్చుకోండి

  1. రమణ గారు,
   మొదట్లో వద్దన్నా చేతిలోకి అస్త్రాలు వచ్చేవండీ! ఇప్పుడు అస్త్రాలన్నీ ఖాళీ అయిపోయినట్లున్నాయి, ఓ రెండు గంటలు బోర్ కొట్టిన తరువాత, ఒక గంట తడుముకొంటే గానీ ఒక పూచిక పుల్ల దొరకటం లేదు.
   నేను అద్భుతం గా రాస్తానంటే, నా బుధ్ధి ఆ విషయం నిజమా కాదా అని ఆలోచించేలోపలే నా మనసు సంతోషపడిపోతుంది. మనసును ఆపలేక బుధ్ధి సైలెంట్ అయిపోతుంది. బ్లాగులు రాయటంవలన రాతగాడి గా నా పరిమితులు అనేకం తెలిసివచ్చాయండీ!

   మెచ్చుకోండి

 4. మీ పోస్ట్ చదివిన దగ్గర్నుండీ ఆలోచిస్తున్నా, నేనెందుకు రాస్తున్నానా అని.

  ఏమీ తోచక and to cope up with monotony in the profession
  ఇంకా పైనున్న వారు కూడా నేను బ్లాగు రాయడానికి ఓ కారణం.

  మెచ్చుకోండి

  1. శైలజాచందు గారు,
   మొనాటనీ నుంచీ తప్పించుకోవటానికి అలవోక గా కథలు రాయగలగటం అందరికీ చేతనైన పని కాదు ! కాబట్టీ మేమంతా మీ మొనాటనీకీ, పై వారి పనిలేని స్థితి కీ ఋణ పడి ఉండాలి 🙂
   నేను తెలుగు బ్లాగులు గిలకటం మొదలు పెట్టినపుడు “తెలుగు రాతగాళ్ళు/రాతగత్తెలూ వస్తువూ, పరిభావనల విషయం లో ఇంకా ఓ రెండు దశబ్ధాల వెనుకటి అయిడియాలను తలకెత్తుకొంటున్నారు”, అనుకొని, నేనేదో పొడిచేద్దాం అనుకొని ఆవేశపడిపోయేవాడిని. మీవీ, ఇంకా కొందరి మహిళా బ్లాగరుల రచనలను నేను కనుక్కొన్న తరువాత, “ఆ లోటేమీ లేదు, నేను గమ్మున కూర్చొంటే, నష్టం కన్నా మేలు ఎక్కువ జరుగుతుంది”, అని తెలిసింది.
   జెనరల్ గా మట్లాడుతున్నాను…”ఎంత ఇష్టమైన రంగమైనా కొంత కాలానికి బోర్ కొడుతుంది. అప్పుడు వేరే విషయాలమీద దృష్టి సారించటం సహజం. అయితే మనకున్న వ్యవస్థ లో కథలు రాయటం వంటి రంగాల నుంచీ జీవిక పొందలేక పోవటం ఒక చేదు నిజం.”

   మెచ్చుకోండి

 5. ప్రసాద్ గారూ,
  ఈ అస్త్ర సన్యాస ప్రకటనా.. ఈ నిరాశావాద వైకబ్ల్యమూ ఏమిటి మీలో.. నాకు తెలిసి వ్యక్తిగత ప్రతిష్టకోసం, ప్రచారం కోసమూ మీరు ఏదీ రాసినట్లు లేరు. మీనుంచి ఇంకా వైవిధ్యపూరితమైన రచనలు చాలా ఆశిస్తున్న తరుణంలో ఇలా సందిగ్ధ అసందిగ్ధ మహా అవ్యవస్థలోకి జారిపోవడం ఏంటి?

  ఈ అసందర్భ అస్త్రసన్యాసాన్ని మా యావన్మంది అభిమానులమూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి చింతిస్తున్నామధ్యక్షా…!

  మెచ్చుకోండి

  1. రాజు గారు,
   నేను రాసినదే వ్యక్తిగత గుర్తింపు కోసం. తమ టపా డ్రాఫ్ట్ పూర్తి అయిన తరువాత పబ్లిష్ బటన్ నొక్కిన ప్రతి ఒక్కరూ ఇతరుల కళ్ళ లో పడటం కోసం తమ టపా ని రాసినట్లే!

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s