జాబ్ శాటిస్ఫాక్షన్ – మాస్లొవ్ నీడ్స్ హీరార్కీ.. ..రాజకీయాలూ, సిధ్ధాంతాలూ..

ఇటీవల ప్రైవేటు ఉద్యోగాలలో జీతాలు బాగా వస్తున్నాయి. కానీ జాబ్ శాటిస్ఫాక్షన్  (ఉద్యోగ సంతృప్తి?) తగ్గిపోతోంది. దీనికి కారణాల గురించి ఆలోచిస్తే అబ్రహాం మాస్లోవ్ గారి అవసరాల (Maslow’s hierarchy of needs) సిధ్ధాంతం గుర్తుకొచ్చింది. ఈ సిధ్ధాంతం గురించి నెట్ లో చాలా సమాచారం దొరుకుతుంది. కాబట్టీ దాని గురించి ఆఠే మాట్లాడి మీకు బోర్ కొట్టించను.

స్థూలం గా చూస్తే ఈ సిధ్ధాంతం ప్రకారం మనిషి కి భౌతికమైన అవసరాలూ, తన భవిష్యత్ భద్రత గురించిన అవసరాలూ, ప్రేమించబడటం వంటి భావోద్వేగపరమైన అవసరాలూ,  మర్యాదా మన్ననకు సంబంధిధించిన అవసరాలూ, చివరి గా ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ అవసరాలూ ఉంటాయి.
వీటిలో అన్నిటికన్నా కింది స్థాయి లో భౌతిక అవసరాలు ఉంటే,  అదే క్రమం లో ఆత్మ పరమైన అంశాలు పై స్థాయి లో ఉంటాయి. ఈ టపాలో నేను భావోద్వేగ అవసరాల గురించి మాట్లాడ దలచ లేదు. ఎందుకంటే,అవి ఉద్యోగ తృప్తి కి అంతగా సంబంధం ఉన్న అంశాలు కావు.

ఏ మనిషైనా, ముందు గా కింది స్థాయి లోని భౌతిక మైన అవసరాలు తీరిన తరువాతే, పై స్థాయి లోని భద్రత మొదలైన అవసరాల గురించి ఆలోచిస్తాడు. భౌతికమైన అవసరాలు తక్షణ మనుగడ కి సంబంధించిన విషయాలు. మనిషి ప్రస్తుతం ఆహారం లేక పోతే చనిపోతాడు. మనిషి రేపటి తన భద్రత గురించి అలోచించాలంటే, ఈ రోజు బ్రతికి ఉండాలి. ఈ రోజు బ్రతికి లేని మనిషి రేపు బ్రతికి ఉండలేడు కదా? ఇండియాలో చాలా మంది పేదలకు రెక్కాడితే గానీ డొక్కాడదు. వీరికి ఏ పది సంవత్సరాల తరువాతో ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికల ఫలితాల గురించి ఆలోచించే వెసులు బాటు ఉండదు. అందుకే ఎవరు తక్షణం నోటు ఇస్తారో వారికే వోట్ వేస్తారు. అలానే సిధ్ధాంత పరం గా కమిట్ అయ్యి దీర్ఘకాలం ఆలోచించే పార్టీలకి కూడా, ప్రస్తుత ఎన్నికలలో గెలవకపోతే మనుగడ ఉండదు. రేపు మనగలగాలంటే, ఇవాళ ఆ పార్టీలు బతికి బట్టకట్టాలి. అంటే మామూలు జనాల తక్షణావసరాలకి తగ్గట్టు గా తమ  విధానాలు ఉండాలి. భౌతిక అవసరాలు చాలా వరకూ తీరిన మధ్య తరగతి కి, టీవీ (లేక సిస్టం ) ముందు నుంచీ లేవకుండా వోటు-నోటు, జనాకర్షక రాజకీయాలను విమర్శించటం చాలా సులువు.  అర్ధం చేసుకోవటం కొంచెం కష్టం. దేశం లోని పేదరికం తగ్గి సంపద పెరిగితే కానీ జనాలు భవిష్యత్ భద్రత అవసరాల గురించి, దీర్ఘ కాలిక విధానాల కి మద్దతు ఇవ్వరు. కానీ హ్రస్వ దృష్టి తో చేసే జనాకర్షక విధానాల వలన దేశం లో సంపద స్థాయి పెరగదు. ఇదొక విష వలయం. ఈ విష వలయాన్ని ఉత్తరించటానికి జనామోదం గల నిజమైన  నాయకుడు కావాలి.
ఉద్యోగాల విషయం లో దిగువ తరగతి వారు పూట గడవటం కోసం నౌకరీలు చేస్తారు. వీరికి రేపటి గురించి ఎక్కువ గా ఆలోచించే లక్జరీ ఉండదు. మధ్య తరగతి వారు, అందులోనూ తెలుగు వారు ఉద్యోగాలని తమ భవిష్యత్ భద్రత కోసం చేస్తారు. వీరిలో చాలా మంది తమకు ఇష్టమైన, తమ సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ కి ఉపయోగ పడే ఉద్యోగాలు చేయరు. ఏ కొద్ది మంది అదృష్టవంతులో తమ ఇష్టమైన, మరియూ తమ భద్రతావసరాల ను తీర్చే ఉద్యోగాలు చేస్తారు.  ఈ ప్రైవేటు ఉద్యోగాలు చాలా వరకూ తమకు సంబంధించి మర్యాద పరమైన అవసరాలను తీర్చేవి గా ఉండవు. ఉదాహరణ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. ఉద్యోగాల ద్వారా సెక్యూరిటీ పరమైన అవసరాలను అధిగమించి, తమ సృజనాత్మక ఇఛ్ఛలకు  తృప్తి కలిగించే ఉద్యోగాలను పొందటం రాను రానూ కష్టమౌతూంది. దీనికి ముఖ్య కారణం మన కాపిటలిస్ట్ వ్యవస్థ లోని ద్రవ్యోల్బణం, అధిక ధరలూ. ఎవరైనా వచ్చే ఐదేళ్ళ లో తన రొటీన్ ఉద్యోగం ద్వారా తన భద్రతావసరాలకు సరిపడా సంపాదించి, తరువాత తన కు ఇష్టమైన వృత్తిలో కి మారుదామనుకొంటే , అలాంటి ప్లాన్స్ ని, అదుపులో లేని,  ఊహకందని ద్రవ్యోల్బణం తలకిందులు చేస్తుంది. ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగ భద్రతా లేమిని ఉద్యోగుల తో పని చేయించటనికి ఒక సాధనం గా వాడుతాయి. “తమకు అసక్తికరమైన విషయాలోని పాషన్ వలన, సకారాత్మకం గా మనుషులు పని చేయటం”, కాపిటలిస్ట్ వ్యవస్థ లో కొంచెం తక్కువే అని చెప్పాలి. (ముఖ్యం గా ఇండియా లోని మధ్య తరగతి ఉద్యోగాల విషయం లో).
ఏ సినిమా స్టార్ల , పొలిటిషియన్ల పిల్లల కో తమ కు ఇష్టమైన తమ సృజనాత్మకతకు అద్దం పట్టే రంగాలలో పని చేసే అదృష్టం దక్కుతుంది. ఎందుకంటే వారి సెక్యూరిటీ నీడ్స్ వారి పెద్దల సంపాదన వలన తీరిపోయి ఉంటాయి కాబట్టీ! కాపిటలిస్ట్ వ్యవస్థ లో మెజారిటీ మధ్య తరగతి ప్రజలు తమ భౌతిక, భద్రత అవసరాలను దాటి, తమ కు తృప్తి నిచ్చే రంగాలలో పని చేసుకోవటం కష్ట సాధ్యమైన, అరుదైన విషయం.
సోషలిస్ట్ వ్యవస్థ, “మనిషి భౌతిక, భద్రత అవసరాలను తన(వ్యవస్థ)కు వదిలి, మనిషి ని తన సెల్ఫ్ యాక్చ్యువలైజేషన్ నీడ్స్ మీద ధ్యాస పెట్టమంటుంది”. అందువలననే కాబోలు ఒకప్పుడు కళాకారులూ, రచయితలూ సోషలిజాన్ని ఎక్కువ గా సమర్ధించే వారు. కానీ, మౌలిక అవసరాలు తీరిన తరువాత, సిన్సియర్ గా పని చేసే వారు చాలా అరుదు గా కనపడతారు. రష్యా అనుభవం ద్వారా తెలిసేదేమంటే, వాస్తవం లో సొషలిస్ట్ వ్యవస్థ కూడా మనిషి కి ఇష్టమైన ఉద్యోగాలను చేసుకోనివ్వకుండా, వ్యవస్థ, తనకి  అవసరమైన ఉద్యోగాలను మనిషి చేత చేయిస్తుంది అని.ఇండియాలాంటి చోట్ల ఇష్టమైన రంగం లో ఉద్యోగం చేయమంటే 90% జనాలు క్రికెట్టూ, సినిమలూ ఎంచుకొంటారు. అప్పుడు మిగిలిన రంగాలలో పని చేయటానికి జనాలు మిగిలి ఉండరు. మనుషుల మెడ పై “జాబ్ ఇన్సెక్యూరిటీ” అనే కత్తి వేలాడక పోతే, రష్యా లో అయినట్లు గా,మనుషుల ఉత్పాదక తగ్గుతుందేమో!

ప్రకటనలు

14 thoughts on “జాబ్ శాటిస్ఫాక్షన్ – మాస్లొవ్ నీడ్స్ హీరార్కీ.. ..రాజకీయాలూ, సిధ్ధాంతాలూ..

 1. “అందువలననే కాబోలు ఒకప్పుడు కళాకారులూ, రచయితలూ సోషలిజాన్ని ఎక్కువ గా సమర్ధించే వారు”

  కళాకారులూ, రచయితలకి యమోషనల్ పాలు ఎక్కువగా ఉంట్టుంది. వాళ్ళు రాసే,ప్రదర్సించే కళాకృతులలో నవరసాలలో కథను బట్టి రెండు మూడూరసాల పైన ఫోకస్ చేస్తారు, యమోషనల్ గా వాళ్ళు ఫీలయ్యి ప్రేక్షకులను ఫీలయ్యేటట్లు చేస్తారు. ఇక సోషలిజం విషయానికి వస్తే స్వయంగా మార్క్స్ గారు కవి. ఆయన చదువుకొనే రోజుల్లో బాగా పోయట్రిని, యమోష్ నల్ గా రాసేవాడు. క్రైస్తవ మత ప్రభావం ఆయన పైన ఎక్కువ. ప్రతి మతం యమోషనల్ నీడ్స్ మీద, మనిషి ప్రవర్తన మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. తరువాత అర్థ శాస్త్రం చదివాడు. అతని గురించి మీకు చెప్పేదేముంది. కవి, యకనామిక్స్ చదివివాడు. ఆయనలోని కవి మంచి కాచి స్టేట్మెంట్స్ ఇవ్వటానికి ఉపయోగపడ్డాడు. పోరాడితే పోయేదేమిలేదు బానిసత్వం తప్ప అంటూ చాలా చిన్న స్టేటెమెంట్ లతో ప్రజలను ఆకట్టుకొవటానికి ఉపయోగపడ్డాడు. మార్క్స్ గారి ని భుజాన మోసేది కవులు, కళాకరులు. ఎకనామిస్ట్లు పెద్దగా ఎవరు ఆయన సిద్దాంతాన్ని పట్టించుకోరు.

  అర్థశాస్రంలో ప్రపంచంలో మొదట పుస్తకాలు రాసిన చాణ్యుక్యుడి లాంటివారు కాచి స్టేటెమంట్లు ఎక్కడా ఇవ్వలేదు. అదిగాక చాణ్యుక్యుడు చేసింది, చెప్పాడు. మార్క్స్ గారు ఒక విధానం ఊహించి ఇలాచేస్తే బాగుంట్టుంది, అలాచేస్తే బాగుంట్టుంది అని సలహాలు ఇచ్చాడు. ఒక కన్సల్టేంట్ లాగా.

  *ఏ సినిమా స్టార్ల , పొలిటిషియన్ల పిల్లల కో తమ కు ఇష్టమైన తమ సృజనాత్మకతకు అద్దం పట్టే రంగాలలో పని చేసే అదృష్టం దక్కుతుంది. ఎందుకంటే వారి సెక్యూరిటీ నీడ్స్ వారి పెద్దల సంపాదన వలన తీరిపోయి ఉంటాయి కాబట్టీ *
  ఇది మీ ఊహ. వారి పిల్లలు స్వేచ్చగా తమ కు ఇష్టమైన రంగాలను ఎంచుకొంటారని మనం అనుకోవల్సిందే.

  మెచ్చుకోండి

  1. సోషలిస్ట్ మేధావుల మాటలు ఎమోషనల్ నీడ్స్ ని తీరుస్తాయనేది కరెక్ట్. అందుకే కాబోలు వారి మాటలకి (భౌతిక అవసరాలు తీరిపోయిన) మధ్య తరగతి ప్రజలు ఎక్కువ గా ఆకర్షితులౌతారు. దిగువ తరగతి జనాలు సోషలిస్ట్ మేధావులను పట్టించుకోరు. వారి మాటలు పేద ప్రజలకు అర్ధం కావేమో కూడా!

   తమ రంగాలను స్వేచ్చ గా ఎన్నుకొనే “అవకాశం” సెలెబ్రిటీ ల పిల్లల కు ఉంటుంది. అలా ఎన్నుకొంటారా లేదా అనేది వేరే విషయం. వాళ్ళు కూడా వారి పక్క వారి సంపాదన తో పోల్చుకొని రాట్ రేస్ లో పడవచ్చు.

   మెచ్చుకోండి

 2. ఒక చేనేత కార్మికుడి కొడుకు, పదవ తరగతి కూడా చదవని అరుణాచలం మురుగనాథన్ విజయ గాధను ఈ క్రింది వీడీయో లో ఛూడండి. అతను ఎంతో మందికి ఇప్పుడు ఉద్యోగాలను సృష్ట్టిస్తున్నాడు. ఆఖరున అందరు అతనినికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
  నవ భారతదేశం నిర్మాతలు ఇటువంటివారే!

  మెచ్చుకోండి

  1. శ్రీరాం గారు, మీరు ఏ ఉద్దేశం తో పోస్ట్ చేసినా, వీడియో చాలా బాగుంది. మీరు అతను సృష్టించే ఉద్యోగాల గురించి చెబుతున్నారు. నేను ఆ ఉద్యోగాలలోని జాన్ శాటిస్ఫాక్షన్ గురించి ఈ టపా రాశాను.
   శానిటరీ నాప్కిన్స్ కోసం అతను చేసిన త్యాగాలు చేయటానికి ఎంత మంది సిధ్ధం గా ఉంటారు?

   మెచ్చుకోండి

   1. ఆ వీడియొ చూడటం నచ్చింది. మాలిక తెరవటం మీటపా కనిపించింది. మీతో పంచుకొన్నాను. దానికి ఇంకొక కారణం మన బ్లాగులలో ఇజాలమీద,వాదాల మీద చాలా చర్చలు జరుగుతూంటాయి. ఆ ఇజాల/వాదాల పుస్తకాలు చదివిన కారల్ మార్క్స్, స్రీ వాద మొద|| రచయితల వలననే సమాజంలో ఎంతో మార్పు వచ్చిందను కొంటారు. వాస్తవానికి వారికన్నా ఎక్కువ మార్పు సమస్యలకు కొత్త సొల్యుషన్ కనుక్కొనే వారివలన వస్తుంది. కాని ఈ ఇన్వెన్షన్ చేసిన వారి కృషిని ఎవరు గుర్తించినట్లు కనపడదు. వారికి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చినట్లు ఎక్కడా చూడం. ముల్క్ రాజ్ ఆనంద్ లాంటివారు అంటచబుల్స్ నవల లో టాయిలేట్ క్లీన్ చేసే వారి ఒక రోజు జీవితం గురించి రాశాడు. కాని ఆ వృత్తి, ఈ రోజు మాయం కావటానికి ప్రధాన కారణం, ప్రస్తుతం మనం వాడే టాయిలేట్ ఇన్వేంట్ చేసిన వాడివలననే కదా! మేధావులు ఆ వృత్తి గురించి జాలి గొలిపే పుస్తకాలు వంద రాసినా, ఆ ఇన్వేన్ షనే లేక పోతే పేద వాళ్ళు, ఇంకాకూడా ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నా ఆశ్చర్య పోనవసరంలేదు. విషయానికి వస్తే, కొత్త సొల్యుషన్ కష్టపడి కనుక్కొని, దానివలన ఉద్యోగాలు దిగువ మధ్యతరగతి లో సృష్టించిన ఇతని గురించి నలుగురికి తెలిసేలా అప్రిషియేట్ చేద్దామని, మీ బ్లాగును ఉపయోగించుకొన్నాను.

    మెచ్చుకోండి

    1. కష్టపడి కొత్త విషయాలు కనిపెట్టే వారి గురించిన మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. కొందరికి పేరు వస్తుంది. మరి కొందరు మరుగున పడిపోతారు.

     మెచ్చుకోండి

 3. ఈ తెల్లోళ్ళ సిద్ధంతాలు మన బతుకులకి నప్పవు. ఈ విషయం తెలీక పిల్లకాయలు ఈ సిద్ధంతాల్ని బట్టీకొట్టి ఎదవ రీజనింగులు సేత్తన్నారు.

  సాటిస్పాక్సను… జాబులో ఉండదు. మడిషిలో ఉంటాది. అట్టాంటి మడిసి మాస్లో పిరమిడ్ లో ఎక్కడున్నా యాపీగానే ఉంటాడు.

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  1. మెడిటేషన్ లాంటివి చేస్తే , మాస్లొవ్ పిరమిడ్ లో యాడున్నా యాపీ గానే ఉంటారు. కానీ, నే సెప్పేది ఓ పని చేసినప్పుడు వచ్చే తుత్తి గురించి. ఈ తుత్తీ, నువ్వు మాట్లాడే యాపీనెస్సూ వేరే వెరే అనుకొంటా బుల్లబ్బాయ్! ఈ తుత్తి మన కిస్ట పరమాత్మ చెప్పిన కర్మ యోగానికి సంబంధించినది. కాకపోతే కిట్టయ్య పలితాన్ని తనకి వదిలెయ్య మన్నాడు. కానీ అలా వదల గలిగే వాళ్ళు మన దేశం లో కూడా చాల అరుదు. ఇక మెడిటేషన్ కిట్టయ్య చెప్పిన భక్తి (ధ్యాన యోగానికి) యోగానికి దెగ్గిర్గా ఉంటంది.

   మెచ్చుకోండి

 4. శ్రీరాం గారు, మీరు పెట్టిన లింకులు చూశాను. ఈ మధ్య యుక్తేశ్వర్ గిరి (పరమ హంస యోగానంద గారి గురువు) గారు రాసిన ఒక పుస్తకం చదివాను. ఈ పుస్తకం చదవక ముందు, నేను సృష్టి గురించిన మన ప్రాచీన సాంప్రదాయవాదుల క్లెయింస్ ని అంత సీరియస్ గా పట్టించుకొనే వాడిని కాదు. కానీ ఈ పుస్తకం లో చెప్పిన కొన్ని విషయాలు ఆధునిక సైన్స్ సిధ్ధాంతాలకి చాలా దగ్గర గా ఉన్నాయి.
  ఉదాహరణ కు, అన్నిటికీ (లోకానికీ విశ్వానికీ మూలం గా) మూలం గా “ఓ తెలియని, తెలుసుకోలేని స్థితి” ని ఈ గిరి గారి పుస్తకం లోని శ్లోకాలు ప్రతి పాదించాయి. తరువాత స్లోకాలు ఈ విశ్వం ఓ ప్రణవం అనే వైబ్రేషన్ నుంచీ వచ్చిందని చెప్పాయి. ఈ విషయం “స్ట్రింగ్ తీరీ లోని “స్ట్రింగ్ అనేక డిగ్రీ ఆఫ్ ఫ్రీడం లో వైబ్రేట్ అయితే, అనేక డైమన్షన్ ల లొ వస్తువులు పుట్టాయి”, అని చెప్పిన దానికి దగ్గర గా ఉంది. తరువాత ఇదే పుస్తకం, స్పేస్, టైం (దేశ కాలాలు) తో ఈ విశ్వం చేయబడి ఉంది అని చెప్తోంది.ఒక మూల కణం, శక్తి నుంచీ ఏర్పశటం..క్వార్క్స్ కి సిమిలర్ గా ఉంది. ఈ ప్రపంచం దేశ కాలాల లో లేదు. వాటి తో తయారు చేయబడి ఉన్న ఓ కప్పు లాంటిది ఈ విశ్వం. ఇది కూడా ఐన్స్టీనుడి సాపేక్ష సిధ్ధాంతానికి దగ్గరగ ఉంది. అలానే సమయం యొక్క సాపేక్షత గురించి అప్పటికే వారికి ఒక అయిడియా ఉండటం కూడా ఆశ్చర్య కరమైన విషయం.
  అదే పుస్తకం లో అనేక అసంగతమైన విషయాలు కూడా ఉన్నాయి, సూర్యుడు విష్ణు నాభి చుట్టూ తిరగటం, దానిని బట్టి యుగాలు ఏర్ప్డటం. యుగాలుముందుకు పోతున్న కొద్దీ జనాల స్పిరిట్యువల్ కెపాసిటీ పెరగటమూ మొ||.
  ఈ పుస్తకాలలోని స్లోకాల సోర్స్ ఇవ్వబడలేదు. అవి నిజం గా వేద స్లోకాలే అయితే, నిర్ద్వందం గా అవి నన్ను ఆశ్చర్య పరిచాయి. “వాటిని ఆ కాలం లో ప్రయోగాల ద్వారా కాకుండా, ఏదైన ప్రత్యక్షనుభవం వలన తెలుసుకొన్నారా?”, అనే ఆలొచన నా మనసు లో మొదటి సారి గా ప్రవేశించింది. నా ప్రయాణం కొన సాగుతుంది..నేను ఇంకా ఏ అభిప్రాయాలూ ఏర్పరచుకోలేదు.
  ఈ చక్రాలూ గట్రా, శరీరం లో వాటి లొకేషన్, వాటి పర్పస్ వగైరా ల గురించి ఒక్కొకరూ ఒక్కో విధం గా చెప్తారు. పిరమిడ్ ధ్యానం వారిది ఒక కథైతే, క్రియా యోగం వారిది వేరొక కథ. ఏదేమైనా ఓ సారి దిగి చూస్తే కానీ లోతు తెలియదు.
  పారలొకిక అనుభవాలూ, మహత్తులూ, పునర్జన్మా వీటి గురించికూడా అనేక పరస్పర విరుధ్ధమైన స్టోరీలున్నాయి. ఇవి సైన్స్ పరిధికి బయట ఉన్నాయంటారు. ఆ ముక్క సైన్స్ చెబితే కానీ నాకు వీటి గురించి నమ్మ బుధ్ధి కాదు. సైన్స్ తనకు తెలియని విషయాలని, “ఇంకా తెలియదని” ఒప్పుకోవటానికి సిధ్ధం గానే ఉంది అని నమ్ముతాను.
  మనిషి బుర్రకి బయట “ఓ తెలివి ఉన్న చేతన ఉంది”, అని ఈ పుస్తకాలు చెబుతున్నాయి. కానీ నాకు ఇంకా నమ్మకం కుదరటం లేదు.
  ఇదే ఓ పోస్ట్ కి సరిపడా విషయం. వీలున్నపుడు రాయాలి.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s