బురదగుంట – రేప్ ప్రపంచం..

ఢిల్లీ రేప్ సంఘటన సమాజం లో కావలసిన కదలికనే తెచ్చింది. రేపిస్టులను శిక్షించాల్సిందే. బురదగుంటలొంచీ దోమ వచ్చి కుడితే వెంటనే చంపేస్తాం కదా! అయితే ఆ సంఘటన గురించి ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న మీడియా, రాజకీయ ప్రముఖులను చూస్తే మాత్రం చిరాకు వేస్తుంది.
ఆ బురద గుంత ఏర్పడటానికి ఓ ముఖ్య కారణమే ఈ మీడియా, సామాజిక ప్రముఖులు. రేప్ కి సంబంధించిన behavior patterns సమాజం లొ బలపడటానికి ఈ ప్రముఖులు కూడా ఓ కారణం.
ఈ బురద గుంట కి ప్రముఖుల కాంట్రిబ్యూషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలైంది?

తెలుగు లో “ఓలమ్మీ తిమ్మిరెక్కిందా? అని హీరోయిన్ పిల్ల పిర్ర మీద ఓటిచ్చినపుడు” దానితో మొదలైందేమో!

లేకపోతే,”లే లే లే..నా రాజా!” తో మొదలైందేమో! లేక ఇంకా ముందే మొదలైందేమో! నాకు తెలియదు.
“ఓ సీన్ లో ఆకతాయిల కు క్లాస్ పీకి, మరో ఐదు నిమిషాలలో హీరో గారు బూతు పాటలు పాడినపుడు”, ఈ బురద గుంట కంపు అందరికీ అలవాటైపోయి, వాసన గుర్తు తెలీటం లేదని తెలిసింది.
“హీరోయిన్ ని సినిమా మొత్తం, రేప్ చేయటం మినహా, అన్నిరకాల వేధింపులూ చేసిన హీరో గారు”, మాస్ రాజా అయినపుడు, ఈ గుంటకి జనామోదం కూడా లభించిందని తెలిసింది.

సినిమా ఫంక్షన్లలో,”అర్ధ నగ్న ఐటం డాన్సర్ చుట్టూ, పది మంది మగ డాన్సర్లు చొంగ కారుస్తుంటే”, వేదిక కింద కూర్చొన్న హీరో గారు నిర్వికారం గా చప్పట్లు కొడితే తెలిసింది, “మురుగు గుంట ఓ అభినందించవలసిన విషయం” అని

“సినిమాలు చూసి ఎవరూ చెడిపోరు”, అని ఓ డైరెక్టర్ గారు బుకాయిస్తూంటే తెలిసింది, మురికి గుంట చాలా నిరపాయకరం అని. 

“దిగి దిగు నాగా..” వంటి పాటలు ప్రొడ్యూస్ చేసిన వారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్ద్లు లభించినపుడు, ఈ మురికి గుంటకి మానసరోవరం గా అధికారిక శాంక్షన్ కూడా వచ్చేసింది.

ముందు పేజీలలో తాము ఎడమపక్క పత్రికలమని కోడై కూసే పత్రికలు, వెనుక పేజీలలో సీ గ్రేడ్ సినిమా యాడ్స్ వేసుకొన్నపుడు, మురికి గుంట కంపు పూదోట కంపుని మింగేసింది.

మెరుగైన సమాజం కోసం పాటుపడే చానళ్ళు, బూతు సినిమాల పై ప్రత్యేక కార్య క్రమాలను ప్రసారం చేసినపుడు, మెరుగైన సమాజం బురద గుంట ఉండగానే వస్తుందని తెలిసింది.

“బూతుసినిమాలూ, సైట్లూ సాధారణమని”, డోకు భాష తార పిల్ల చెప్పినపుడు, “ఓ, మురికి వాసన చూసినపుడు, వమనం చేసికోకూడదని”, తెలిసింది.

రాష్ట్ర స్థాయి నాయకుడు అధినేత్రి మైకం లో, “ఇదో చిన్నవిషయం” అన్నప్పుడు, కొన్నాళ్ళకి మురికి గుంటలో పొర్లిన వాడే నాయకత్వానికి అర్హుడేమో అన్న సందేహం వచ్చింది. అప్పుడు “అదో పెద్ద విషయం” అవుతుంది.

ఊళ్ళోని పెద్ద పెద్ద ఇళ్ళలోంచీ డబ్బు అనే పిల్ల కాలువల ద్వారా ఈ మురుగు గుంట నింపబడుతోంది. జీవిక కోసం ఈ పిల్ల కాలువలను నిర్వహించే చిన్న చిన్న ఉద్యోగాలు చాలా మందిమి చేస్తాం. జీవిక కోసం మనం మౌనం గా ఉంటాం. ఈ మురికి గుంటని పూడ్చి వేయాలని గట్టి గా అడగం. అడిగితే మన జీవిక పోతుంది.

కాబట్టీ ప్రముఖులారా, ధర్మాగ్రహం వ్యక్తం చేయకండి. మీరిచ్చే వినోదం వలన కలిగిన సైడ్ ఎఫెక్ట్ ని సెలబ్రేట్ చేసుకోండి.

ప్రకటనలు

13 thoughts on “బురదగుంట – రేప్ ప్రపంచం..”

 1. ఆ రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యాలు ఈ రోజు దాదాపు అన్ని పేపర్లలోనూ వచ్చాయి. వాటి ఆన్ లైన్ ఎడిషన్స్ లో (ముఖ్యం గా “ఈనాడు” లో) వచ్చిన కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవించటం తప్ప నేనీమీ మాట్లాడలేకపోతున్నాను.

  మెచ్చుకోండి

 2. బొందలపాటి గారు బాగుంది. నీతి తప్పిన వాళ్ళే ఇప్పుడు నీతులు చెప్పడం ఎక్కువయింది. అయితే సినిమా వాళ్ళలో అందరు అలంటి వల్లే కాదు ఒకరిద్దరు నిజంగా ఆవేదన చెందుతున్న వాళ్ళు ఉన్నారు

  మెచ్చుకోండి

 3. మురళి గారు,
  సినిమా, మీడియా ఇవన్నీ ఎప్పుడైతే బిజినెస్ గా రూపాంతరం చెందాయో అప్పుడే, డబ్బు కోసం కళనీ, తెగనమ్మటం మొదలైంది. .ఇక్కడ మీడియా రెలవెంట్. ఇతర విషయాలలో, అందరమూ అదే గొంగట్లో తింటున్నామేమో!

  మెచ్చుకోండి

 4. చూస్తున్నారు కాబట్టే తీస్తున్నామెహే. ఇందులో మాది తప్పేముంది? చూస్తున్నారు కాబట్టే హీరోయిన్లు చూపిస్తున్నారు. అందులో వాళ్ళ తప్పేముంది?

  మెచ్చుకోండి

 5. అందర్నీ ఏకారు. ఓ రెండు సినిమాలు ఫ్లాపైతే తట్టుకోలేక, మూడో సినిమాలో అత్త పైనే అఘాయిత్యం చేసినట్లు చూపిన, గౌరవనీయులైన, సౌమ్యుడైన కేంద్ర మంత్రి గారి కంట్రిబ్యూషన్ మర్చి పోయినట్లున్నారు!

  మెచ్చుకోండి

 6. మీకు నేనింకొక ఇంట్రస్టింగు విషయం చెప్పనా? మీరెవరైనా తెలుగు వార పత్రికలు చూస్తారా? నవ్య లాటి వీక్లీల ముఖ చిత్రాలూ, లోపలి పేజీల్లో వుండే సినిమా నటీమణుల ఫోటోలూ, ఆ ఫోటోలకి వుండే వ్యాఖ్యలని చూస్తారా?
  ఏదైనా మంచి విశేషాలో, కథలో చదువుకుందామని పత్రిక కొని ఇంటికి తెచ్చి, తెరిచి చూస్తే తమన్నా, ఇలియానా, అనూష్కల నిలువెత్తు నగ్న చిత్రాలు. ఇంట్లో నాన్న గారో, అన్నో తమ్ముడో వుంటే పుస్తకం ఇంట్లో వున్నందుకే ఇబ్బంది పడతాం.
  అలాటి చిత్రాలనీ, ఆ వ్యాఖ్యానాలనీ కలకాలం దాచుకోవాల్సిన పుస్తకాల్లో కూడా అనుమతించినప్పుడే ఒప్పుకున్నప్పుడే మన నైతిక పతనం మొదలయిందా?

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s