మనలో దాగున్న రేపిస్ట్

నాకు ఓ ఐదేళ్ళ వయసున్నపుడు, ఓ పల్లెటూరి సినిమా హాలు కి వెళ్ళే వాడిని. సినిమా లో, ఏ గిరిబాబో, సత్యనారాయణో హీరో గారి చెల్లిని రేప్ చెసే వాళ్ళు. రేప్ మొదలవ్వగానే హాల్ అంతా ఈలల తో మారు మోగేది. నాకు ఆ వయసు లో, జనాలు ఎందుకు ఈలలు వేస్తున్నారో అర్ధమయ్యేది కాదు. పాపం విలన్ హీరోయిన్ ని ఆ విధం గా హింసిస్తుంటే, ఈలలు వేసే జనాల మీద కోపం వచ్చేది. అదే జనం,  క్లైమాక్స్ లో విలన్ ని హీరో గారు చితక కొడుతుంటే కూడా ఈలలు వేసే వారు.
సెక్స్ కి ముఖం వాచిన జనాలు అలా చేసే వారా?
ఇంకో సంఘటన. ఓ ఐదేళ్ళ తరువాత ఏదో పట్నం నుంచీ వచ్చిన ఒకావిడ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని వెళ్తోంది. నాకు తెలిసిన పెద్ద వాళ్ళు ఆమె శీలం మీద కామెంట్ చేశారు. కానీ వారికి ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఏ మాత్రం తెలియదు.ఆ సమాజం లో అలాంటి జాకెట్ మామూలు ఆడవారు వేసుకోవక పోవటం వలన ఆ కామెంట్ వచ్చిందా?
ఓ ఇరవై యేళ్ళ కిందట మన సమాజం లో వయసొచ్చిన ఆడ  మగ మధ్య స్నేహాలు ఉండేవి కావు. ఇప్పటికీ పల్లెలలో వారికి ఆడ మగా మధ్య “ప్రణయ సంబంధం కాని స్నేహమంటే”, ఏమిటో తెలియదు. వారికి అటువంటి స్నేహం గురించి వివరిస్తే intellectual గా అర్ధం చేసుకోగలరేమో , కానీ అటువంటి స్నేహం లోని భావోద్వేగాల కు వారు relate చేసుకోలేరు. అది వారి తప్పు కాదు.

ఆడ మగా మధ్య interaction తక్కువ గా ఉండటం, ఇంట్లో ఆడ వారు తక్కువ గా ఉండటం వంటి కారణాల వలన, మగ వాళ్ళ కు ఆడ వారి ఆలోచనలూ, భావోద్వేగాలూ తక్కువ గా తెలిసి, ఆడ వారిని సెక్స్ పరం గా objectify చేయటం జరుగుతుంది. మన సినిమాలు కూడా ఒక ఆడ మగా మధ్య సంబంధం లో ఉండే, “పరిచయం, స్నేహం, భావోద్వేగ సంబంధాలూ” మొదలైన స్థాయి లను వదిలి, నేరు గా తడి చీరల పాటలను చూపెట్టటం వలన, ఆడవారిని objectify చేయటం మరింత పెరుగుతుంది.

మిస్సమ్మ సినిమా కాలం నుంచీ కూడా హీరో హీరోయిన్ ని టీజ్ చేస్తాడు. “ఆడ వారి మాటల కి అర్ధాలే వేరులే!”, అంటాడు. పాత కాలం లో స్త్రీల కి స్వాతంత్ర్యం లేనపుడు, మనసు లోని మాట పై కి నేరు గా వ్యక్తీకరించే వారు కాదేమో! కానీ నేడు ఓ ఆడ పిల్ల, “నో” అన్నదంటే, “కాదనే” అర్ధం. ఈ విషయాన్ని wishful thinking చేసే మగవాళ్ళ కు అర్ధమయ్యేలా చెప్పాలి.
రేప్ అనేది learned behavior అని ఈ మధ్య హిందూ లొ వచ్చిన ఈ ఆర్టికల్ చెప్తుంది:
http://www.thehindu.com/opinion/lead/the-danger-to-women-lurks-within-us/article4242142.ece?homepage=true

ఇది చాలా వరకూ కరక్ట్ కూడా. నేర్చుకొన్న ప్రవర్తనను సరిగ్గా educate చేయటం ద్వారా మార్చ వచ్చు. కానీ కొంతవరకూ రేప్ అనేది బయలాజికల్ గా సంక్రమించిన రోగం కూడా. అనేక జంతువులు రేప్ చేస్తాయి. అలానే కొందరి జీన్స్ లో హింసా, సెక్స్ ఎక్కువ గా ఉంటాయి. అలా అని రేప్ పాపం అలాంటి వారికి అంటకుండా పోదు. తాను బలవంతుడనని పక్క వాడిని కొడితే జైల్లో పెడతారు కదా!

మన దేశం లో “ఆడ మగా మధ్య interaction లేక పోవటం” రేప్ కి ఓ కారణం అయితే(మన దేశం లో ఆడపిల్లల తో మాట్లడ గలిగే సోషల్ స్కిల్ల్స్ ఉన్న మగ వాళ్ళు రేప్ కు తెగబడే అవకాశం తక్కువ), అమెరికా లాంటి దేశాలలో ఈ interaction ఎక్కువై, లవ్ లో రిజెక్ట్ కా బడ్డ వారు కూడా స్త్రీ ద్వేషులు గా మారి రేప్ లు చేస్తున్నారు. బూతు సినిమాలు చూసే వారి వలన కూడా రేప్ లు ఎక్కువవ్తాయని పాశ్చాత్య దేశాలలోని సర్వే లు బయటపెట్టాయి.ఏదేమైనా, ఈ విషయం లో సరైన ప్రవర్తన ఏమిటి (ఆడ మగా ఇరు వైపుల నుండీ) అనేదానికి విస్తృతమైన ప్రచారం కలిపించవలసిన అవసరం ఉంది. అలానే మీడియా, సినిమాలు ప్రచారం చేసే sexist myths లోని డొల్ల తనాన్ని బయట పెట్టాలి.

ఓ మగ వాడు, ఆడ వాళ్ళకి రేప్ గురించి జాగ్రత్తలు చెప్పటం లో ఓ ప్రమాదం ఉంది. ఆడ వారు ముందే అతని ఉద్దేశాలను అనుమానిస్తారు. నమ్మకం లేని చోట మంచి చెప్పినా చెడు అవుతుంది.అలానే మగ వారు కూడా, రేప్ చేసిన వాడిని వదిలేసి, ఆడ వారి దుస్తులనూ, ప్రవర్తననూ తప్పుపట్ట కూడదు.బహుశా అలాతప్పుపట్టటం, “తమ లో అంతర్లీనం గా ఉండే instincts ను రేపిస్టుల instincts తో ఇడెంటిఫై చేసుకోవటం వలన కూడా అవ్వవచ్చును”. ఆడవారికి జాగ్రత్తలు చెప్పే విషయం లో మగ వారి స్వరం, ఆడ వారి శ్రేయోభిలాషులు గా ఉంటే పరవాలేదు. “నే చెప్పింది విన్నారా? ఇప్పుడు అనుభవించండి”, అనే విధం గా ఉన్నపుడే సమస్య. రేప్ జరిగిన పరిస్థితుల కి అతీతం గా రేప్ శిక్షార్హమే! అందులో సందేహం లేదు. అయితే రేప్ కి మరణ శిక్ష వేయాలా వద్దా అనేది, అనేక పరిస్థితులనూ, మోటివ్స్ నీ పరిగణన లోకి తీసుకొని నిర్ణయించాలి.
రోడ్ మీద పోయే జనాలలో అన్ని రకాల వారూ ఉంటారు. అందులో మూర్ఖులు ఓ రకం. యువత డేటింగ్ చేయవచ్చు. కానీ public display of affection ని తగ్గించటం మంచిది. ఏ పల్లెటూరి బైతో, “అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో చూపించే playful behavior ని తన పై ఎందుకు చూపించదు?”, అనుకోవచ్చు. ఏ కరడు గట్టిన సాంప్రదాయ వాదికో వారి ప్రవర్తన చూసి ఒళ్ళు మండ వచ్చు. వారిలో ని విలువలు వారి లోని జంతుప్రవృత్తి  ని నియంత్రించినంత వరకూ పరవా లేదు. అలా కాకపోతే నే సమస్య. చేసే వెధవ పనుల పర్యవసానాన్ని గురించీ, చట్టమూ శిక్షల గురించీ ఆలోచించని మగవాళ్ళు చాలా మందే ఉంటారు. అందని ద్రాక్షల మీద కసి పెంచుకొనే వారు చాలామందే ఉంటారు. కసి అంటే గుర్తుకొచ్చింది, తెలుగు రొమాంటిక్ పాటలలో ఈ పదం చాలానే ఉపయోగిస్తారు. కానీ కసి అనే పదం లో హింస అనేది కూడా ఉందని ఆయా రచయితలకి తట్టిందో లేదో!

రేప్ ఎంత ఆటవికమో, జనాలు గుంపులు గుంపులు గా రోడ్ పైకి వచ్చి, రేపిస్టులని విచారణ లేకుండా ఉరి తీయాలనటం కూడా అంత ఆటవికమే. శిక్షించటానికి నిపుణులు ఉన్న న్యాయవ్యవస్థ ఉంది.వారే అన్ని విషయాలనూ పరిశీలించి సరైన నిర్ణయం తీసుకొంటారు. ఈ విషయం లో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్య సరైనదైతే, ఆయన కొడుకు చేసిన వ్యాఖ్య దానికి సరిగ్గా వ్యతిరేకమైనది. ప్రజల ఆందోళన చాలా వరకూ సమర్ధించతగ్గదే! అలా అని ఆందోళన కారులంతా holy cows కాదు.తమ లోని అరాచకాత్వాన్ని బయట పెట్టటానికి ఈ సంఘటనను ఓ సాకు గా ఉపయోగించుకొనే వారూ, vested interests, భోగస్ స్త్రీ వాదులు,సమస్య ల కోసం కాసుకొని కూర్చునే వామ పక్ష వాదులూ కూడా ఉండవచ్చు. ఏదేమైనా, ఈ ఆందోళనల వలన ప్రభుత్వమూ, అది నియమించిన కమీషన్ సరైన ప్రతిపాదనల తో ముందుకు వస్తుందని ఆశిద్దాం.

ఢిల్లీ ఘాతుకం లో మరణించిన ఆ యువతి ఆత్మ కి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..

ప్రకటనలు

13 thoughts on “మనలో దాగున్న రేపిస్ట్

  1. మీ లింక్ చూశాను.
   దేటింగ్ వలన సమాజానికి జరిగే మేలు అనే కోణం లోంచీ చూసి దానికి ఒక విలువ ఇవ్వాల్సి వస్తే, మీతో నేను ఏకీభవిస్తాను. డేటింగ్ కి విలువ లేదు.
   మీదృష్టి లో ఏది పవిత్రం? అబ్బాయీ అమ్మాయీ ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళిచేసుకొని సంసారం చేస్తే అది పవిత్రమా? నా దృష్టి లో అది నైతికం మాత్రమే. పవిత్రం కాదు.
   నైతికం గా సరైన వాటన్నిటికీ నేను గొప్ప విలువ ఇవ్వను. కొన్నిటికే ఇస్తాను.
   ఇక అమ్మాయి ఇష్టానికీ నైతికత కీ సంబంధం ఉందా లేదా? రేప్ అనేది అమ్మాయి ఇష్టం లేకుండా జరిగిన ఒక పని. దాని లో అనైతికత కీ ఆ అమ్మాయికీ సంబంధం లేదు.
   ఇక పది మంది తో డేటింగ్ చేసే అమ్మాయి కి కూడా సెక్సువల్ రైట్స్ ఉంటాయి. పది మంది తో డేటింగ్ చేసినంత మాత్రాన, ఆ అమ్మాయి ని పది మంది రేప్ చేస్తే పట్టించుకోనవసరం లేదా?మీకు ఎంత ఫ్రీ సెక్స్ ఇష్టమైనా, మీకు ఇష్టం లేకుండా ఏ కొజ్జా నో మీ మీద అఘాయిత్యం చేస్తే దానిని మీరు సమర్ధిస్తారా?
   ఇక శీలం గురించి.., శీలం కి విలువ ఇచ్చి నీతి గా ఉండే అమ్మాయి రేప్ చేయబడితే, అది, శీలం లేని తిరుగుబోతు అమ్మాయి రేప్ చేయబడిన దానికంటే, ఎక్కువ స్థాయి నేరమే! ఎందుకంటే శీలానికి విలువ ఇవ్వని అమ్మాయి విషయం లో జరిగినది కేవలం , violation of will at a physical level మాత్రమే!

   *****అనేక మంది తో డేటింగ్ చేస్తూ, శీలం గురించి పట్టించుకోని మహిళ కి, రేప్ గురించి, తమ శీలం పోయింది అనే ప్రాతిపదికన ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే, ఆ మహిళ కి శీలం మీద నమ్మకం లేదు . కానట్టీ రేప్ వలన ఆ మహిళ పోగొట్టుకొంది(శీలం) ఏమీ లేదు . ఇదే మీ ఆలోచనైతే నేను మీతో ఏకీభవిస్తున్నాను.*****
   (ఆ మహిళ పోగొట్టుకొంది(శీలం) ఏమీ లేదు: Some ifs and buts..సమాజం చూపించే రేప్ స్టిగ్మా ని discount చేస్తే, రేప్ వలన కలిగే సైకలాజికల్ Trauma ని discount చేస్తే.
   పరిమితి లేని డేటింగ్ ఒక స్టిగ్మా కాని సమాజానికి, రేప్ కూడా ఓ స్టిగ్మా అవ్వకూడదు.అలాంటి సమాజం రేప్ ని, స్టిగ్మా విషయం లో, violence తో సమానం గా చూడాలి.ఈ రోజుల్లో, పట్టణాలలో ఎవరికీ తెలియకుండా నే బతక వచ్చు)
   on a lighter note…ఎప్పుడూ పలాసా, విశాఖేనా, కొంచెం బెంగుళూరూ, హైదరాబాదూ కూడా తిరగండి..ఈ డేటింగులూ వాటికి అలవాటు పడతారు. అప్పుడు నైతికతకూ శీలానికీ విలువ ఇవ్వటం మానేస్తారు.
   నైతికతకీ(కట్టుబాటు కీ) సాంఘిక విలువ కీ పెద్ద సంబంధం లేక పోవచ్చు. కట్టుబాటు వలన సమాజం లో ఓ ఆర్డర్ ఉంటుంది. అంతే! వివాహేతర సంబంధాల గురించీ కట్టుబాట్ల గురించీ మార్క్సిజం వైఖరి ఏమిటి? Just curious.
   జనాలలో maturity ఉంటే, many2many సంబంధాల వలన సమాజానికి materialistic గా వచ్చే నష్టం ఏమీ లేదు. కుటుంబ వ్యవస్థ ఏర్పడక ముందు పరిష్తితి అలానే ఉండేది. మనిషి లో కొంత ego centric thinking వచ్చిన తరువాత, కుటుంబ వ్యవస్థ మొదలైంది. మార్క్సిజం వ్యక్తిగత స్వార్ధానికి వ్యతిరేకం కానట్టీ, నేను చెప్పిన many2many వ్యవస్థ కి మార్క్సిజం అనుకూలం గానే ఉండాలి. నేను రాసిన ఈ పైత్యం చూడండి, మీరు ఆల్రెడీ చూడక పోతే: : http://wp.me/pGX4s-wI

   మెచ్చుకోండి

   1. కాలేజ్‌లో పరిచయమైన ఒక అబ్బాయితో పది రోజులు డేటింగ్ చేసినప్పుడు గుర్తుకి రాని శీలం అదే కాలేజ్‌లో పరిచయమైన ఇంకొక అబ్బాయి పది నిముషాల పాటు రేప్ చేస్తే ఎందుకు గుర్తొస్తుంది? పది రోజుల చర్యకే లేని విలువ & పట్టింపు పది నిముషాల చర్యకి ఉంటుందా? ఆ విలువ అనేది ఇష్ట ప్రకారం జరగడం & ఇష్ట వ్యతిరేకంగా జరగడాన్ని బట్టి మారిపోతుందా?

    మెచ్చుకోండి

    1. *****అనేక మంది తో డేటింగ్ చేస్తూ, శీలం గురించి పట్టించుకోని మహిళ కి, రేప్ గురించి, తమ శీలం పోయింది అనే ప్రాతిపదికన ఫిర్యాదు చేసే హక్కు లేదు. ఎందుకంటే, ఆ మహిళ కి శీలం మీద నమ్మకం లేదు . కానట్టీ రేప్ వలన ఆ మహిళ పోగొట్టుకొంది ఏమీ లేదు . ఇదే మీ ఆలోచనైతే నేను మీతో ఏకీభవిస్తున్నాను.*****

     “ఆ విలువ అనేది ఇష్ట ప్రకారం జరగడం & ఇష్ట వ్యతిరేకంగా జరగడాన్ని బట్టి మారిపోతుందా?”
     మీరు మాట్లాడే విలువ శీలం అయితే, “మారదు”.
     కానీ ఈ విలువ మహిళ కి ఉన్న “స్వేఛ్ఛ (ఇష్టాఇష్టాలు)” అయితే, “మారుతుంది”. రేప్ విషయం లో ఈ స్వేఛ్ఛ అనే విలువకి విఘాతం ఏర్పడింది. కొందరి దృష్టి లో స్వేఛ్ఛ అనేది శీలం కంటే గొప్ప విలువ మరి.

     మీ ఆర్గ్యుమెంట్ నాకు ఓ విషయాన్ని గుర్తుకు తెస్తోంది. ఏదో సినిమా లో విలన్ శీలవంతురాలైన హీరోయిన్ ని రేప్ చేస్తాడు. రేప్ చేయబడిన హీరోయిన్ ని హీరో స్వీకరించి, రేప్ ఆమె ఇష్టం తో సంబంధం లేకుండా జరిగింది కబట్టీ ఆమె కు ఆ కళంకం అంటదని చెప్తాడు.

     మెచ్చుకోండి

     1. శీలాన్ని పూర్తిగా అనవసరమైన విషయంగా పరిగణిస్తే, పది నిముషాల పాటు జరిగిన రేప్ అనేది పది నిముషాల పాటు స్వేచ్ఛకి కలిగిన ఆటంకం మాత్రమే అవుతుంది కానీ శీలానికి కలిగిన ఆటంకం అవ్వదు. అటువంటప్పుడు రేప్ జరిగిన తరువాత తమ శీలం పోయిందని ఎందుకు బాధపడుతుంటారు?

      మెచ్చుకోండి

 1. శీలం గురించి నాకు తెలిసిన ఒక కథ చెబుతాను
  ఒక సారి ఏసుక్రీస్తు తన అనుచరులతో కలిసి వెళుతుంటే ఒక వేశ్య ఎదురవుతుంది. ఆమెను చూసి క్రీస్తు అనుచరులు అసహ్యించుకుని రాళ్ళతో కొట్టబోతుంటే
  ఆయన వారిని వారించి “మీలో ఎవరయితే ఇప్పటి వరకూ వేశ్య దగ్గరికి వెళ్ళలేదో వాళ్ళకి మాత్రమే ఆమెను శిక్షించే అధికారం ఉంది” అనగానే అందులో సగం మంది రాళ్ళు కింద పడేస్తారు. మిగిలిన వారిని కూడా మీలో ఎవరయితే మానసికంగా కూడా వ్యభిచారం చెయ్యలేదో వాళ్ళు మాత్రమే ఆమె మీద రాళ్ళు విసరండి అనగానే మిగిలిన వాళ్ళు కూడా రాళ్ళు కింద పడేస్తారు.
  శీలం అనేది మనసుకు సంబంధించినది. కేవలం శరీరానికే కాదు.

  మెచ్చుకోండి

 2. శ్రీ బొందలపాటివారికి, నమస్కారములు.

  వ్యాసం బాగుంది. జీవుల్లో, ముఖ్యంగా, మనుషుల్లో, మనిషికి రెండు రూపాలున్నాయి: ఒకటి మానసికం; రెండు భౌతికం. భౌతికంగా జరిపే చర్యలన్నింటికీ మనస్సు ప్రధానం, ప్రమాణం కూడా. `రేప్’ అనేది భౌతికమైనది అని అనుకున్నా ఇది మానసికమైనదే. “ మానసికంగా శీలం లేనివారే , మరొకరి శీలాన్ని దోచేస్తారు. శీలం లేకపోవటం నైతికత్వం లోపించటమే! నేటి సమాజంలోని పెద్దలు భావి తరాలవారికి ఈ నైతికతను నేర్పించాలి.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  మెచ్చుకోండి

  1. మాధవ రావు గారు,
   నమస్కారం. “ మానసికంగా శీలం లేనివారే , మరొకరి శీలాన్ని దోచేస్తారు.” –ఇంతకంటే బాగా చెప్పలేం! పురుషుడి కి కూడా శీలం ముఖ్యమైనదే!

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s