మగ వారి ఫిర్యాదులు..కొన్ని సరదాగా..కొన్ని నిజంగా..

ఈ ఫిర్యాదులు అందరి మగవారివీ కావండీ. నాలాంటి మధ్య తరగతి,లేక ఎగువ మధ్య తరగతి కుటుంబ రావులవీ, అందులోనూ పట్టణాలలో ఉండే వారివీ..

1.కుటుంబ రావు ఈ మధ్యే ఉద్యోగం మారాడు. హాఫ్ హ్యండ్స్ షర్ట్ వేసుకొని,మొదటి రోజు కొత్త గా మారిన ఆఫీసులోకి ఎంటరవబోయాడు. సెక్యూరిటీ వాడు కు.రా ని ఆపి “డ్రెస్ కోడ్ వయొలేషన్”, అని ఒక పుస్తకం లో కు.రా, చేత సంతకం చేయించాడు. కు. రా జీతం లోంచీ అప్పుడే కొంత కోత పడిపోయింది. పక్కనుంచే స్లీవ్-లెస్ లు వేసుకొన్న అమ్మాయిలు తమ లో తాము జోకులేసుకొంటూ నిరాటంకం గా ఆఫీసు లోకి వెళ్తున్నారు.

2.కుటుంబ రావు ని ఆఫీసులో బాసు పిలిచాడు. కుటుంబ రావు తో పాటు అతని సహోద్యోగిని అయిన వనిత ను కూడా పిలిచాడు.బాసు కి ఇద్దరి తోనూ పెద్ద చనువు లేదు. కుటుంబ రావు తో,” ఆ ప్రాజెక్ట్ పని ఎంతవరకూ వచ్చిందోయ్ కుటుంబ రావ్?”, అన్నాడు. అదే వనిత తో మాత్రం, “ఆ చెప్పండి “మేడం”, స్టేటస్ ఏమిటి?”, అన్నాడు. …మగ పురుషులారా, ఈ వివక్షని ఖండించండి. ఆడ స్త్రీలు కూడా ఖండిస్తే సంతోషిస్తాం.

3.కుటుంబ రావ్ సాయంత్రం ఇంటికి వచ్చి తెలుగు పేపర్ తిరగవేయటం మొదలుపెట్టాడు.”రేప్ చేసిన మగ పశువు”, హెడింగ్.
యాసిడ్ పోసిన, “మృగాడు”.  రాసిన రిపోర్టర్ మగాడే… పేరు..రామా రావు.
పేజీ తిప్పాడు కుటుంబ రావు. ఒకామె తన ప్రియుడి తో కలిసి తన భర్త ని హత మార్చింది. ఆమె పేరుని శోభా దేవి గానే రాశాడు సదరు రిపోర్టర్. “ఆడ *%$” అని రాయలేదు.

4.కు.రా కొడుకు యశ్వంత్ గదిలోంచీ బయట కి రావటం లేదు. కు.రా తెలుసుకొంటే తేలిందేమంటే,”వారం రోజుల కిందటి ఎంసెట్ సీట్ రాని షాక్ నుంచీ వాడింకా తేరుకోలేదు.” కు.రావు గది లోకి వెళ్ళి కొడుకు తో అన్నాడు, “ఎంసెట్ రాక పోతే ఎడ్-సెట్ రాద్దువు గాని లే!”.
దానికి వాడు,” కిందటి సంవత్సరం అక్క కి నాకంటే నాలుగు వేలు పైన నాసి రాంకు వచ్చింది.మరి అక్కకెందుకు సీట్ వచ్చింది?”.
కు.రా తన కి తెలిసి చదివించటం లో కూతురి పట్ల ఎన్నడూ వివక్ష చూపించలేదు.పై గా కురా కి సహజం గా తండ్రి కి కూతురి పట్ల ఉండే ప్రేమ ఎక్కువ.

5.కు.రావు స్నేహితుడి కూతురు కి అమెరికా సంబంధం కుదిరి, పెళ్ళయాక డిపెండెంట్ వీసా మీద టెక్సాస్ వెళ్ళిపోయింది. భర్త ఆఫీసు కి వెళ్తే, తను ఇండియా లో తల్లితండ్రుల తో ఫోన్ లో కబుర్లు చెబుతూ, ఇంటర్నెట్లో ఫ్రెండ్స్ తో కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసేది.భర్త కి ఏదో ఓ మాదిరి కంపెనీ లో కాంట్రక్టర్ గా ఉద్యోగం. అక్కడికి వెళ్ళిన నెలరోజుల నుంచీ జంట మధ్య తేడాలు మొదలయ్యాయి. కు.రావు ఫ్రెండు వాళ్ళింటికెళ్ళినపుడు, ఫ్రెండూ భార్యా జరిగిన కథ చెప్పటం మొదలుపట్టారు.”ఆ అబ్బాయి ఒట్టి పీనాసి వాడండీ. రెస్టారెంట్ కి తీసుకెళ్ళడంట. ఇంట్లోనే వండమంటాడంట!”
“అమెరికా లో ప్రతి రోజూ రెస్టారెంటంటే చాలా ఖర్చవుతుంది అనుకొంటా..ఇంట్లో వండక తప్పదేమో!”, అన్నాడు సందేహం గా కు రావు.
“అమ్మాయికి వంట రాదు. కాలేజీ రోజుల్లో హాస్టల్లోనే ఉండేది. ఇంకా మా చిన్నూ గాడైనా చదువుకొనే తపుడు రూముల్లో ఉండి చెయ్యి కాల్చుకొన్నాడు, కానీ అమ్మాయికి అసలు అలవాటు లేదు. మా ఆవిడ కూడా దాని చేత ఎప్పుడూ వంట చేయించలేదు”, అన్నాడు కు.రా. మిత్రుడు.
కురా కి ఏమి సలహా ఇవాలో అర్ధం కాక ఉండిపోయాడు.

6.కురావు పక్కింటాయన బాల్కనీ లో కూర్చొని పేపర్ ముందేసుకొని ఆవేశం తో ఊగి పోతున్నాడు, ” ఈ జంతువులని ఉరి తీసేయాలి. వీళ్ళకి కోర్ట్లూ, విచారణా అనవసరం!”.
“మీరు ఢిల్లీ రేపిస్టుల గురించి ఆవేశపడుతున్నారనుకొంటా!?”, అన్నాడు, కు రా.
“అలాంటి వెధవలు లక్షల్లో ఒకరు ఉంటారు. ఇలాంటి దుస్సంఘటనలు జరిగినపుడల్లా మగవాళ్ళ కి వ్యతిరేకం గా వ్యవస్థీకృతమైన చట్టాల పదును పెంచుతూ పోతే, నా లాంటి అమాయకుల కి ముందు ముందు ఏమౌతుందో. ఓ రకం గా,టెర్రరిస్ట్ దాడులు జరిగినపుడల్లా పాకిస్తాన్ అనే కర్ర తో ఇండియన్ ముస్లిం ల ని కొడుతున్నారు. అలానే హై ప్రొఫైల్ అత్యాచారాలు జరిగినపుడల్లా, వాటిని సాకు గా చూపించి ఇండియన్ మేల్ ని చట్టాలనే కర్ర తో కొడుతున్నారు.”, అనుకొన్నాడు కు.రావు.

7.కురావు కుర్రాడిగా ఉన్నపుడు గృహ హింస గురించీ, వరకంట్న చావు ల గురించీ పత్రిక ల కి వ్యాసాలు ఆవేశం గా రాసేవాడు. కానీ ఈ మధ్య కురావు అనుభవం లోనే ఆ రెండు చట్టాలూ దుర్వినియోగం మూడు సార్లు తటస్థించింది.ఒక కేసు లో బంధువు ల అబ్బాయి జెయిలుకి పోవలసి వస్తే, ఇంకో కేసు లో సహోద్యోగి ని అరెస్ట్ చేయటానికి పోలీసులు ఆఫీస్ కే నేరు గా వచ్చారు. ఇంకో కేసు స్నేహితుడి బంధువుది. మూడు కేసులూ తప్పుడు కేసులేనని కు.రావు కి ఖచ్చితం గా తెలుసు. మూడు కేసులలోనూ డబ్బు గుంజటం అనేది ప్రధాన ఉద్దేశం. కురావు పేపరు చదవటం తగ్గించి, మారిన సమాజాన్ని అనుమానం గా చూడటం మొదలు పెట్టాదు.

8.కురావూ అతని భార్యా ఇద్దరూ ఉద్యోగస్తులే. కు.రావు భార్య, ఫెమినాలూ గట్రా చదివి ఈకెండు బయటే ఒటేళ్ళలో తిందామని మొరాయించింది. ఈక్-డేస్ ఎలానూ కర్రీ పాయింట్ల కర్రీల తో కడుపు చెడి పో ఉన్న కు.రా.,
తను కూడా మొరాయించాడు, “ఈకెండ్లలో డ్రైవింగ్ చేయననీ, వెచ్చాలు పట్రాననీ, బిల్లులు కట్టననీ”.
కొన్నాళ్ళ కి కురా భార్య కి వేరే ఊరు ట్రాన్స్-ఫర్ అయింది, కురా స్నేహితులు “పలానా మంత్రి గారిని కలవక పోయావా? ట్రాన్స్-ఫర్ ఆపుతారు.”, అని ఉచిత సలహాలు పారేయటం మొదలు పెట్టారు.
కురా,” ఎవరి ట్రాన్స్-ఫర్ వారే ఆపుకోవాలి”, అన్నాడు.
స్నేహితులు, “అదేమిటి? మగ వాళ్ళ పని ఆడ వాళ్ళు ఎలా చేస్తారు?”, అన్నారు.
“పనులలో ఆడ పనులనీ, మగ పనులనీ ఉండవు”, అన్నాడు కురా.

9. సిటీ లో పోష్ ఏరియాలో ఫ్రెండ్ తో కలిసి రోడ్డు పై నడుస్తూంటే, “పక్కనే ఓ యాభై యేళ్ళావిడ బట్టలు తక్కువ గానూ, లిప్-స్టిక్ ఎక్కువ గానూ నడుస్తోంది. కురా గుడ్లు మిటకరించి ఆమె వైపుకి చూశాడు. కురా ఫ్రెండ్, “అలా చూస్తావేమిటి? సంస్కారం లేకుండా!”, అన్నాడు.”
“సంస్కారం లేకుండా బట్టలు వేసుకొంటే లేదు గానీ, చూస్తే తప్పా!”, అన్నాడు కురా.

10.పిల్లలు బయటికి వెళ్ళిన సమయం చూసి, ఇంట్లో ఫ్యాషన్ టీవీ పెట్టాడు కురా. పక్క గది లో,చీరలూనగలూ,అప్పటికే ఎన్నో సార్లు మురిపెం గా ధరించి చూసుకొన్న తన నగలని బీరువా లో పెట్టి, హాల్ లోకి వచ్చింది కురా భార్య.
కురా ఫ్యాషన్ టీవీ చూడటం గమనించి, “చీ, చాలా వల్గర్ గా ఉంది, చానల్ మార్చు”, అంది కురా భార్య.
“ఇప్పటి దాకా నీకు ఇష్టమైన పని నీవు చేశావు, నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను, తప్పేమిటి?”, అన్నాదు కురా.
“ఇంట్లో ఇలాంటివి చేస్తారా ఎక్కడైనా?” అందామె.
“ఎవరికి నచ్చింది వారు  చేయకూడదంటే, ఇంటి విలువలలోనే పక్షపాతముందన్న మాట!”, అన్నాడు కురా.

11.  కురా కంటే అతని భార్యకే జీతం ఎక్కువ వస్తుంది. వారికి ఏ ఇతర ఆస్తులూ పెద్ద గా లేవు.ఓ సుముహూర్తాన కురా ఉద్యోగం ఊడింది. అప్పటి నుంచీ భార్యాభర్త ల మధ్య కీచులాటలు ఎక్కువయాయి. అప్పటిదాకా కురా ఫ్యామిలీ కోసం పెట్టిన ఖర్చును తను పెట్టటానికి కురా భార్య నిరాకరించింది. చిలికి చిలికి గాలి వాన అయినట్లు, ఇరువురూ విడాకుల వైపుకి ఆలోచించటం మొదలుపట్టారు. ఈలోపు కురా మళ్ళీ ఓ చిన్న ఉద్యోగం లో మునుపటి కంటే బాగా తక్కువ జీతానికి కుదురుకొన్నాడు.విడాకుల గురించి కురా ఓ లాయర్ ని సంప్రదిస్తే, “భార్య కి భరణం ఎంత ఇవ్వాలో చెప్పాడు”, లాయర్. “ఓరి నాయనా, మూలిగే నక్క మీద తాటి పండు పడింది!”

12. కురా కొడుకు కి ఓ గర్ల్-ఫ్రెండ్ ఉంది. ఆమె వాడిని చేతుల తో సున్నితం గా కొడుతూ మురిపెం గా, “స్టుపిడ్”, అని పిలుస్తుంది. ఓ రోజు వాళ్ళిద్దరూ పోట్లాడుకొన్నారు. అదేసమయం లో వాడి మగ ఫ్రెండ్స్ కొందరు వచ్చారు. వారి లో ఒకడు, “ఏంట్రా మూడ్ బాగున్నట్లు లేదు, నిన్ను మళ్ళీ మూడ్లోకి తెస్తా చూడు!”, అని ఓ “Off the color jOke”, చెప్పాడు. కొంచెం దూరం లో ఉండి ఆ జోక్ విన్న ఉన్న వాడి గర్ల్-ఫ్రెండ్ ప్రిన్సిపాల్ కి కంప్లెయింట్ చేసింది, “వాడూ వాడి , మిత్ర బృందం తనను హరాస్ చేస్తున్నారని”. ప్రిన్సిపాల్ ఓ సీరియస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలేశాడు.

13.కురా అక్క కొడుకు ఈ మధ్యే పెళ్ళి అయింది.అతనూ, అతని భార్య ఫామిలీ ప్లానింగ్ కొంతకాలం పాటించి తరువాత పిల్లలను కనాలని నిర్ణయించుకొన్నారు. అతని భార్య కి మూడో నెల ఉన్నపుడు అతని తో గొడవ పడింది. తరువాత అతని తో చెప్పకుండా అబార్షన్ చేయించుకొంది.అతని బాధ కి అవధులు లేవు. తాళాలు ఎవరి దగ్గర ఉంటే వారే గదిని మూస్తారు. గర్భధారణ ప్రకృతి ఇచ్చిన ఓ కష్టమైన విషయమైనా, ఆధునిక వైద్యం వలన అది ఓ ఆడవారికే పరిమితమైన హక్కుగా మారింది.

ప్రకటనలు

52 thoughts on “మగ వారి ఫిర్యాదులు..కొన్ని సరదాగా..కొన్ని నిజంగా..

  1. దేనికి రివెంజని మీరంటున్నారో నాకు అర్ధం కాలేదు. అప్పుడప్పుడూ నేను observe చేసిన విషయాలు, కొన్ని విన్నవీ, కురా ద్వారా చెప్పించాను.

   మెచ్చుకోండి

 1. ఇందులో కొన్ని మరీ అంత బాధ పడాల్సినవి కావు. మరి కొన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిందె. కానీ, అలా పరిగణించేది ఎవరు? మగవారిలో ఎంత మందికి ఈ స్పృహ ఉంది? చాలా మందికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తే అర్థం అవడం లేదు. తప్పు తాను చేసి తెలుసుకోవడం కాదు, ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవాలి అని అర్థం కావడం లేదు వారికి.

  మెచ్చుకోండి

  1. అవును. జోక్ ఏమిటంటే, ఎవరైనా ఓ సలహా గా చెప్పినా, చాలా మంది వారి traditional stance గురించి ఎంత proud గా ఉంటున్నారంటే, వారికి మన సలహా పై చాలా కోపం వస్తుంది. ఓ పదేళ్ళైన తరువాత తెలుస్తుందేమో!

   మెచ్చుకోండి

 2. ఈ మగ పురుషులు ఆడ స్త్రీలు ఏమిటండీ బాబు !

  మహిళాభ్యుదయ సంఘాలు ఎక్కడున్నా వెంటనే వచ్చి బొందల పాటి వారి ని ఘెరావ్ చేయ్యాలహో !

  ఐటీ రంగం లో ఆడ వారే పురుషులన్నీను, మగ వారే ‘స్త్రీ’ లనిన్నూ మా మనవడనే వాడు ! ఏమో మీరూ అదే నంటూ న్నారేమో కూడాను !

  జిలేబి!

  మెచ్చుకోండి

  1. “ఐటీ రంగం లో ఆడ వారే పురుషులన్నీను, మగ వారే ‘స్త్రీ’ లనిన్నూ మా మనవడనే వాడు !”
   గొడ్డు చాకిరీ చేసే వారు మాత్రం నిస్సందేహం గా పురుషులే! గొడ్డు చాకిరీ చేయటమే పురుష లక్షణమైతే మీరనేది కరక్టే!
   పట్టణ మధ్య తరగతి జనాల లింగ వ్యవహారాల లో తేడా వచ్చింది. ఓ పదేళ్ళ కిందట రై స్టేషన్ల లో చిన్న పిల్లలను ఎత్తుకొని ఆడ వారు ఎక్కువ గా కనపడే వారు. మగ వాడు పక్కన ఏ పేపర్ చదువు తూ నో, సిగరెట్ కాలుస్తూనో ఉండేవాడు. ఇప్పుడు ఆడవారు చేతి లో బ్యాగ్ తో కబుర్లు చెబుతూ ఉంటే, మగవారు పిల్లలని ఎత్తుకొని కనపడుతున్నారు.

   మెచ్చుకోండి

  1. జనాలకి మగ పిల్ల వాడిని గౌరవిస్తూ పెంచటం ఎలానో చెప్పాలి. మగ పిల్ల వాడిని, “రా..రా, పోరా!” అంటారు, అదే ఆడ పిల్లని మాత్రం, “అదమ్మా!, ఇదమ్మా!”, అంటారు. అదేవిధం గా ఓ షాపుకి వెళ్తే అక్కడ పని చేసే అమ్మాయిలను, “అమ్మా, ఈ వస్తువెక్కడుంది?”, అని అడుగుతారు. అదే మగ ఉద్యోగులని, “ఆ వస్తువు ఎక్కడుందో చూడు, ఈ వస్తువు చూడు”, అంటారు.
   అలానే మగపిల్లలను పెంచేటపుడు వారు పెద్దయ్యాక, male hostile system లో పెరగబోతున్నారనే ఎరుక తో పెంచాలి. ఆడ పిల్లల తోటి స్నేహాల గురించిన pitfalls గురించి వివరించాలి. రిజర్వేషన్లు లేని కారణం గా వారికి ఎలాంటి సమస్యలు ఎదురవ్వ వచ్చో చెప్పాలి.
   hazardous activities కి మగ పిల్లల కి పురి ఎక్కించి ముందుకు తోసే పద్దతికి స్వస్తి చెప్పాలి. ఇంట్లో చెల్లెళ్ళి కో అక్కకో సెక్యూరిటీ లా పని చేసి(ostensibly to protect family honor) దెబ్బలు తినటం వంటి రిస్కులు తీసుకోవటం మానాలి.ఏ విధమైన రివార్డూ లేని చోట రిస్క్ ఎందుకు చేయాలి.
   మగ వారిని ఉబ్బ బెట్టి ఎక్కువ బాధ్యతలు తీసుకొనేటట్లు చేసే సందర్భాల గురించి జాగ్రత్త గా ఉండాలి, ఆడా మగా సమానమైనపుడు, మగ వారు ఎక్కువ బాధ్యతలు ఎందుకు తీసుకోవాలి?

   మెచ్చుకోండి

 3. మీరు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. నాకు తెలిసిన కొన్ని ఉదాహరణలు ఇస్తాను.
  1. మా బంధువుల్లో ఒక జంట ఉంది. భర్తకు సరైన ఉద్యోగం లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. జీతం కూడా భార్యజీతంలో అయిదో వంతు కూడా ఉండదు. ఆయన ఉద్యోగం చేసిన రోజుల కంటే నిరుద్యోగిగా ఉన్న రోజులే రెట్టింపు కన్నా ఎక్కువగా ఉంటాయి. అయితే వారిద్దరి దాంపత్యం సాంప్రదాయిక భార్యాభర్తల సంబంధంలానే ఉంటుంది. నలుగురిలోనూ ఆయన భార్య మీద కేకలేస్తూ ఉంటాడు. ఏమైనా మాట్లాడితే నీ మొహం నీకేం తెలుసు అంటాడు. పాతకాలం ఆడవాళ్ళలానే భార్య నోరెత్తదు. పైగా ఆయన బూట్లు కూడా తనే తుడుస్తుంది. భోజనం చేసేటప్పుడు బతిమాలుతూ కొసరి కొసరి మరీ తినిపిస్తూ ఉంటుంది. భార్య finances ను భర్తే మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఆర్థిక నిర్ణయాలు తనే తీసుకుంటూ ఉంటాడు.
  2. నాకు తెలిసిన ఇంకో జంట. అమ్మాయి ఎం.సీ.ఏ చేసింది. అబ్బాయి ఎం.టెక్ చేశాడు. పెళ్లి నాటికి అమ్మాయి, అబ్బాయి ఇండియా లో ఉద్యోగం చేసుకుంటున్నారు. పెళ్లి మాటలప్పుడు, మాకు ఒక్కతే అమ్మాయనీ, యూ.ఎస్. లో ఉద్యోగం చేసే అబ్బాయికి ఇవ్వాలనుకోవడం లేదనీ అమ్మాయి పేరెంట్స్ చెప్పారు. మా అబ్బాయికి కూడా యూ.ఎస్ వెళ్లాలని లేదనీ, ఇక్కడే ఉంటాడనీ అబ్బాయి పేరెంట్స్ చెప్పారు. కట్నంతో పెళ్లయింది. పెళ్ళయిన మూడు నెలలకే అబ్బాయి యూ. ఎస్ వెళ్ళాడు. అమ్మాయి కూడా వెళ్లింది. ఒక అబ్బాయి కలిగాడు. అమ్మాయి తీవ్ర అస్వస్తురాలైంది. ఒంటరిగా ఇండియా పంపించారు. కూతురుని రిసీవ్ చేసుకోడానికి పేరెంట్స్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళినప్పడు నడవలేని స్థితిలో పసిబిడ్డను ఒళ్లో పెట్టుకుని వీల్ చెయిర్ లో వస్తున్న అమ్మాయిని చూడగానే పేరెంట్స్ గొల్లుమన్నారు. అయిదేళ్లుగా భార్య ఇండియాలో, భర్త యూ.ఎస్. లో, కేసు కోర్టులో.
  3. ఉద్యోగం చేసే భార్య ఉన్న మగాళ్లలో చాలా కాలంగా నేనొక ట్రెండ్ గమనిస్తున్నాను. అది, ఉద్యోగం నుంచి స్వేచ్చ పొందడం. చేస్తున్న ఉద్యోగం వదిలేసి వేరే ఆసక్తుల వెంటపడడం, రికామీగా తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేయడం, ఏళ్ల తరబడి ఏ పనీ లేకుండా గడపడం,
  భార్యా, భర్త సంబంధాన్ని బాహ్య పరిణామాలు ప్రభావితం చేసే మాట నిజమే. అదే సమయంలో వాళ్లమధ్య భౌతిక, మానసిక ఆకర్షణలు; వారిని పరస్పరం దగ్గర చేసే కొన్ని రకాల కెమిస్ట్రీలూ కూడా దాంపత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. స్టీరియో టైపులు సృష్టించడం కష్టం.

  మెచ్చుకోండి

  1. మీరు చెప్పిన కేసులు కూడా చాలానే ఉంటాయండీ. కానీ ఈ టపా మగ వారి ఫిర్యాదుల గురించి. మగవారి లోటుపాట్ల గురించి introspective గా మరో టపా రాస్తాను.

   మెచ్చుకోండి

 4. భార్యా, భర్త సంబంధాన్ని బాహ్య పరిణామాలు ప్రభావితం చేసే మాట నిజమే. అదే సమయంలో వాళ్లమధ్య భౌతిక, మానసిక ఆకర్షణలు; వారిని పరస్పరం దగ్గర చేసే కొన్ని రకాల కెమిస్ట్రీలూ కూడా దాంపత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. స్టీరియో టైపులు సృష్టించడం కష్టం.

  స్టీరియో టైపులు సృష్టిచడం కష్టం అని మీరంటున్నారు. కానీ, మహా గొప్పగా సృష్టించేస్తున్నారు మిగిలిన చోట. అందుకే, నాణేనికున్న మరో వైపును కూడా ప్రెసెంట్ చేయాల్సిన అవసరం ఉంది.

  మెచ్చుకోండి

 5. @9. సిటీ లో పోష్ ఏరియాలో ఫ్రెండ్ తో కలిసి రోడ్డు పై నడుస్తూంటే, “పక్కనే ఓ యాభై యేళ్ళావిడ బట్టలు తక్కువ గానూ, లిప్-స్టిక్ ఎక్కువ గానూ నడుస్తోంది. కురా గుడ్లు మిటకరించి ఆమె వైపుకి చూశాడు. కురా ఫ్రెండ్, “అలా చూస్తావేమిటి? సంస్కారం లేకుండా!”, అన్నాడు.”
  “సంస్కారం లేకుండా బట్టలు వేసుకొంటే లేదు గానీ, చూస్తే తప్పా!”, అన్నాడు కురా.

  అందమైన భాష లో వ్రాసిన వికారమైన భావాలు.

  మెచ్చుకోండి

  1. నేను నావి అందమైన భావాలు అని అనుకోలేదు. అందమూ వికారమూ అనేవి ఈ టపా విషయం లో irrelavant కూడా..anyways.. మీకు వికారమైన భావాలు గా అనిపించింది ఎందుకో చెబితే బాగుండేది. ఏవిషయం మీకు వికారం గా అనిపించింది. మీకు ఏవి అందమైన భావాలు?

   మెచ్చుకోండి

   1. మీవి అయినా, కాకున్నా ఈ పార్ట్ లొ వికారభావాలున్నాయి కదా. మీరు స్వయంగా చూసాను అన్నవి కూడా నిజానికి irrelavant , మీరు నమ్మిన భావం లో నుండే చూసారు కాబట్టి 🙂

    మెచ్చుకోండి

    1. నాకు వికారం గా గానీ, అందం గా గానీ ఈ టపా లో ఏమీ కనపడలేదు. కురా భావాలు గానీ, నా భావాలు గానీ కేవలం కొన్ని impressions మాత్రమే. ఒక్కోసారి వాస్తవ దూరం కావచ్చు..మరో సారి అవి వాస్తవం కావచ్చు. I failed to see any vikaaram in this post your honor. వికారం గా ఉన్నాయి అంటున్నారు కాబట్టీ, ఎక్కడ, ఎందుద్కు, ఎలా వికారం గా ఉన్నాయో చెబ్తే, నాకు కొంచెమైనా తెలుస్తుందని అడిగాను. మన కళ్ళను మనమే చూసుకోలేం. ఎదుటి వారు నీ కళ్ళు ఇలా ఉన్నాయి అని చెబితే అన్నా తెలుస్తుందని..
     చాలా సార్లు మనం మనకు నచ్చని దాన్ని వికారం గా ఉందనో, లేక vulgar గా ఉందనో అనుకొంటాం. ఉదాహరణ కు రాజకీయనాయకుల ఇంట్లోని ఖరీదైన పెళ్ళిళ్ళ లో చాలా మంది మధ్య తరగతి వారికి vulgarity కనపడుతుంది. అదే మధ్యతరగతి వారు పెట్టే ఖర్చులలో దిగువ తరగతి వారికి vulgarity కనపడుతుంది. రానా ఇంట్లో పెళ్ళి లోని vulgarity రానా ల కి కనపడదు. ఒక వేళ మధ్య తరగతి వారు డబ్బు సంపాదించిన తరువాత, తమ ఇళ్ళ లోని పెళ్ళిళ్ళ లో vulgarity కనపడటం మానేస్తుంది.

     మెచ్చుకోండి

   2. బొందలపాటి గారు,
    ఆలోచనలను వివరంగా రాసేంత అనుభవం లేక అలా పొట్టి కామెంట్ పెట్టాను. పోస్ట్ చదివిన తరువాత నాకు వచ్చిన మొదటి ఆలోచన అదే. వికారం అంటే అంద వికారం అని తెలియదు. నాకు నచ్చలేదు అనే అర్థం లోనే ‘వికారం’ అని రాసాను అనుకుంటా.
    వేసుకున్న బట్టల్లో మనిషి సంస్కారం ఎలా ఉంటుందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. బట్టలు వేసుకోవడం అవసరాలను బట్టి, తాహతు ను బట్టి, అభిరుచులను బట్టి ఉంటుంది అనుకుంటున్నాను. అలాంటి బట్టలు వేసుకోవడం ఆమె చేసే ఉద్యోగానికి అవసరమేమో? మనకు అప్పటి వరకు కనీసం ముఖ పరిచయం అయినా లేని వ్యక్తి కి సంస్కారం లేదు అని, ఉరికే అలా బట్టల వైపు చూసి అనుకోవడం న్యాయమా?

    మెచ్చుకోండి

     1. ఉద్యోగానికి అవసరమైన బట్టలు పొట్టిగా ఉండటం నాకు తెలిసి తక్కువ. సినిమా హీరోయిన్లనబడే వాంప్-లకు అవసరమేమో. వారు కూడా నిజ జీవితం లో నిండా బట్టలు కప్పుకొంటారు.
      సంస్కారానికి నిర్వచనం అందరికీ ఒకటే ఉండదు. సంస్కారం అంటే ఏమిటి అనేదాని గురించి ఒక్కొక్కరి ఆలోచనా ఒక్కో విధం గా ఉంటుంది. క్రికెట్ లో సెంచురీ అంటే వంద పరుగులు అన్నట్లు సంస్కారానికి మనుషులందరికీ ఉమ్మడి నిర్వచనం లేదు. వస్త్ర ధారణ కీ నేను సంస్కారం అనుకొనేదానికీ లింక్ ఉంది. మీ దృష్టి లో “ఇతరుల పట్ల గౌరవం గా ఉండటం, ఇతరులకు చిన్న చిన్న సాయాలు చేయటం, ఇతరుల అవసరాల పట్ల వారి కోణం లోంచీ ఆలోచించే అవగాహన కలిగి ఉండటం”, మొదలైనవి సంస్కారం కావచ్చు. వీటన్నిటితో పాటు, నా దృష్టి లో ఇతరులకు ఎబ్బెట్టు గా ఉండకుండ వారి అభిప్రాయాలనుఊ ఇబ్బందినీ పరిగణన లోకి తీసుకొని దుద్తులు ధరించటం కూడా సంస్కారమే. అలానే సమయానికీ సందర్భానికీ తగ్గట్టు వస్త్రధారణ ఉండాలి. పొట్టి దుస్తులు ఇంట్లో వేసుకోవచ్చు. స్విం సూట్ బీచ్ లో వేసుకొంటే బాగుంటుంది. కోర్ట్ హాల్ లో వేసుకొంటే, ఎలా ఉంటుంది? అది సంస్కారమా? రోడ్ మీద అనేక మంది దృష్టిని ఆకర్షిస్తాం కాబట్టీ, వారి పట్ల కొంత concern చూపించటం సంస్కారమే! నా బట్టలు, నా ఇష్టం అని విప్పుకు తిరుతాను అంటే, అప్పుడు రోడ్ మీది వారు కూడా నా ఇష్టం అన్న రీతి లో ప్రవర్తిస్తారు. చట్టం కూడా కురచ దుస్తులని కొంత వరకూ చూడనట్లు పోతుంది. పాశ్చాత్య దేశాలలో కూడా రోడ్ మీద స్విం సూట్ వేసుకొనే వారినీ, స్టీకింగ్ చేసే వారినీ తీసుకెళ్ళి జైల్ లో పెడతారు.

      మెచ్చుకోండి

    1. అసలు సినిమా హీరోయిన్లనబడే వాంప్ లకి మాత్రం బట్టలు పొట్టిగా ఉండడం ఎందుకు అవసరం? అంటే మీరు మీక్కావలసింది ఉండాలని నిర్దేశిస్తున్నారా, లేక వ్యక్తులను బట్టి బట్టల స్థాయి నిర్ణయించడం కి తెగబడుతున్నారా? ఇలా జడ్జ్ చెయ్యడానికి మీకున్న అర్హత, స్థాయి ఏంటి? అన్న ప్రశ్నలు రాకుండా మానవు.

     ఉద్యోగానికి అవసరమైన దుస్తులు ఏంటి అన్నది ఆ కంపెనీ బిజినెస్ మోడల్ బట్టి ఉంటుంది. ఇందులో అవసరాలే కాని హక్కులు ఉండవు. డ్రెస్కోడ్ పాటించనవసరం లేని ఎంప్లాయర్స్ చాలా మంది ఉన్నారు, కాని కు.రా లకు గుంపులో గోవిందయ్య లాంటి చోట పనిచెయ్యడమే లాభం.

     సంస్కారం గురించి మీరు ఈ టపా లో పెట్టడం,దానిపై మీ సమాధానాల వల్ల.. ఒక అస్పష్టతను తొలగించిన వారయ్యారు. అదేంటి అంటే మీకు పాతికేళ్ళ వాళ్ళ లో కుసంస్కారం కనిపించలేదు యాభై ఏళ్ళ వాళ్ళలో కనిపించింది. అదేవిధమైన టపాలు బ్లాగుల్లో ఇంతకుముందు మగవారు మరియు ఆడవారు కూడా వ్రాసారు. బహుసా వారు ఈ యాభై గ్రూప్ కి చెందిన వారు. కానైతే వారు ఈ ఇరవై, పాతిక మరియు ముప్పై వయ్యస్సువారు అలా ధరిస్తే కుసంస్కారంగా వర్ణించారు. అంటే మీ వయస్సును బట్టి మీకొకటి అనిపిస్తే, వారి వయస్సును బట్టి వారికి పూర్తి వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఈ చూసే వారికి వాళ్ళ వాళ్ళ వయస్సును బట్టి ఆలోచనల్లో ఒక పాటర్న్ ఉంది అంతే కదా?

     (కొంతమంది మంది రోజు మార్చి రోజు చికెన్, మటన్ ని భోజనం లో తింటారు, అలా తినలేని, తినడం చాతకాని వారు వీళ్ళపై పడి తిట్టడం , కొంతమందికి స్తోమత లేనందున వీరు కూడా తగ్గించాలనడం ఆదర్శాలకు సరిపోతుందేమో.)

     సంస్కారం అంటే చెపుతూ , మీరు ‘ఇతరులు’ అన్నారు. కాని ‘ఇతరులు’ కి పరిమితి చెప్పలేదు.అందరికే ఒకే ఇతరులు ఉండరు. పాతిక సంవత్సరాల వారి గురించి మీకు అనిపించని ఎబ్బెట్టు ఇంకొకరికి అనిపిస్తుంది.ఈ రెండురకాలు వారినీ ఎందుకు పట్టించుకోవాలి?

     స్విమ్ సూట్స్ బయట వేసికొని ఎవరు తిరుగుతున్నారు? అది ఒక చేతకాని, చెత్త ఉదాహరణ. సరే ఇంట్లో మాత్రమె పొట్టి బట్టలు వేసికోవచ్చు అన్నారు. ఇంట్లో మాత్రం ఎందుకు అనుమతిస్తున్నారో చెప్పగలరా. “మీరు” దయతో ఇంట్లో అనుమతించిన తరువాత, పరిణామ క్రమం అనే పదాన్ని అదే కోణం లో నిర్వచిన్చాల్సి వస్తుందని తెలియదా?

     రోడ్డు మీద వెళ్ళే వాడికి పక్క వాళ్ళ బట్టలపై అంత ఆసక్తి ఎందుకు అసలు? వున్నవి ధరిస్తే , విప్పుకు తిరిగారనడం ఏ సంఘం నీతి ?
     సరే భారత దేశం లో రోడ్డు పై స్విమ్ సూట్ వేసికొని వెళ్ళే వాళ్ళని చూసి పోలిస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేరు ?

     ఏదేమైనా మీ టపాను డా.శైలజగారి టపాకి రివెంజు గా పరిగణించి క్షమించి వదిలేస్తున్నాము 😉

     మెచ్చుకోండి

     1. మీ ఈ కామెంట్లో మిగిలిన విషయాలు చాలా పాతవి. చాలా మంది ఉధ్ధండులు వాటి గురించి చర్చోప చర్చలు చేసి ఉన్నారు. వాటిని గురించి చర్చ కొనదాగించటానికి నాకు ఆసక్తి లేదు.
      శైలజ గారు నా అభిమాన వర్ధమాన రచయిత్రి. అందుకే నా బ్లాగ్ లో ఆవిడ బ్లాగ్ కి లింక్ ఎప్పటి నుంచో ఉంటుంది. ఆవీద కథ(కళ్ళజోడు) నాకు నచ్చింది. ఈ కథ కు నాయకుడు, భాస్కరం గారు పైన ఉదహరించిన కోవ కి చెందుతాడు. ఈ కోవలోని వారు కూడా చాలా మందే ఉంటారు. వారి పై నాకు సానుచూతిలేదు.
      That story is noway the trigger/reason for this post

      మెచ్చుకోండి

 6. ఈ పార్ట్ అంటే నా ఉద్దేశ్యం, పైన వ్యాఖ్యాత రిఫర్ చేసిన పార్ట్ అన్నమాట.అది ఒక వికారమైనా అందంగా చెప్పారు అని. ఒకవేళ అది మీకు కాంప్లిమెంట్ అవ్వచ్చు. మీరెందుకు అది అర్ధం చేసికోవడం లేదు ?

  మెచ్చుకోండి

  1. ఓ..అలా అంటారా? ఓ పాతికేళ్ళ వయసున్న అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ కొంచెం కురచ బట్టలు వేసుకొన్నా నాకు దాంట్లో సంస్కార లేమి పెద్దగా కనిపించదు. కానీ యాభై యేళ్ళ వయసు వారికి ఎటువంటి బట్టలు ధరించాలో అనుభవం ద్వారా తెలియాలి. యాభై వయసు వారు సరిగా బట్టలు వేసుకోక పోతే అందులో ఏదో సంస్కార రాహిత్యం కనపడుతుంది నాకు. ఇది నా వ్యక్తిగత అయిష్టం మాత్రమే!

   మెచ్చుకోండి

  2. మీరు అభిమాని అని అందరికీ తెలుసు, మీరు కాని శైలజ గారు కాని ఈ వ్యాఖ్యను సరదాగానే తీసికొంటారని ఆ పెద్ద వ్యాఖ్యని లైట్ చెయ్యడానికి చెప్పాను. ముందే నాకీ చర్చ పట్ల ఆసక్తి లేదు. అందుకే సరదాగా రివెంజా అని అడిగి వదిలేసాను. కళ్ళజోడు టపాని , ఇంకెక్కడో కూడా గుర్తు చేసికొన్నాను 🙂

   మెచ్చుకోండి

 7. @ యాభై వయసు వారు సరిగా బట్టలు వేసుకోక పోతే అందులో ఏదో సంస్కార రాహిత్యం

  మీకలా అనిపించడానికి కారణం ఆలోచించలేదా? మీకు కనిపించేది సంస్కార రాహిత్యమా, లేక హ్మ్ , ఎలా అడగాలో తెలియడం లేదు 🙂

  మెచ్చుకోండి

 8. సరదాగా

  1. కు.రా ఉద్యోగం చేసే చోట మగవాళ్ళు ఎక్కువ సంఖ్యలోనూ, ఆడవారు కొద్ది సంఖ్యలోనూ ఉండి ఉండాలి. ఉన్న కొద్ది మందినీ డ్రెస్ కోడ్ అని విసిగిస్తే, వాళ్ళూ ఉండరు, కంపెనీ ఉండదు.

  2. డిట్టో , ఏదో ఆ మాత్రం మర్యాదగా ఉండకపోతే ఉన్న నలుగురు పోతారు. .

  3. రోజూ మామూలుగా జరిగే వాటికి ఆ మాత్రం మర్యాద మిగిలే ఉందా 🙂

  4. 1,2 పాయింట్స్ లిస్టు లో ఉండాలంటే ఈ మాత్రం సర్దుబాట్లు ఉండాలి 🙂

  5. కర్రీ పాయింట్స్ అన్నీ అబ్బాయిలతో కిటకిట లాడుతుంటే చేయి కాల్చుకొంటున్నారా?

  పెళ్ళి తర్వాత ఎలాగూ తప్పని ఖర్మ అని ఆడపిల్లలకి వంట నేర్పించడం మానేస్తున్నారు, ఇది కూడా పాపమా .ఎలాగు వారెవ్వా ఉందిగా ?

  6. పాకిస్తాన్ తో పోల్చే స్థాయికి ఎదిగిపోయారా 🙂

  7. కు.రా కి అసలే ఆవేశం ఎక్కువ కదా..ఏదో పై పైన మాటలు విని అభిప్రాయాలు ఏర్పరుచుకునే/మార్చుకునే రకం 🙂

  8. కర్రీ పాయింట్ చుట్టూ తిరగడం మానేసి కు .రా వంట చక్కగా చేస్తాడని విన్నానే ?

  10. స్మార్ట్ కు.రా 🙂

  11. అసలు నిజం అడిగితె కు.రా మాత్రం చెపుతాడా ?

  12. స్టుపిడ్ అనడం “Off the color jOke” కన్నా బాడ్ అన్నమాట.

  13. ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యతో భర్త గొడవ పడితే? అన్న పుస్తకం కి మంచి మార్కెటింగ్ ఉందన్న మాట.

  మెచ్చుకోండి

 9. సరదాగా

  1. కు.రా ఉద్యోగం చేసే చోట మగవాళ్ళు ఎక్కువ సంఖ్యలోనూ, ఆడవారు కొద్ది సంఖ్యలోనూ ఉండి ఉండాలి. ఉన్న కొద్ది మందినీ డ్రెస్ కోడ్ అని విసిగిస్తే, వాళ్ళూ ఉండరు, కంపెనీ ఉండదు.

  2. డిట్టో , ఏదో ఆ మాత్రం మర్యాదగా ఉండకపోతే ఉన్న నలుగురు పోతారు. .

  3. రోజూ మామూలుగా జరిగే వాటికి ఆ మాత్రం మర్యాద మిగిలే ఉందా

  4. 1,2 పాయింట్స్ లిస్టు లో ఉండాలంటే ఈ మాత్రం సర్దుబాట్లు ఉండాలి

  5. కర్రీ పాయింట్స్ అన్నీ అబ్బాయిలతో కిటకిట లాడుతుంటే చేయి కాల్చుకొంటున్నారా?

  పెళ్ళి తర్వాత ఎలాగూ తప్పని ఖర్మ అని ఆడపిల్లలకి వంట నేర్పించడం మానేస్తున్నారు, ఇది కూడా పాపమా .ఎలాగు వారెవ్వా ఉందిగా ?

  6. పాకిస్తాన్ తో పోల్చే స్థాయికి ఎదిగిపోయారా

  7. కు.రా కి అసలే ఆవేశం ఎక్కువ కదా..ఏదో పై పైన మాటలు విని అభిప్రాయాలు ఏర్పరుచుకునే/మార్చుకునే రకం

  8. కర్రీ పాయింట్ చుట్టూ తిరగడం మానేసి కు .రా వంట చక్కగా చేస్తాడని విన్నానే ?

  10. స్మార్ట్ కు.రా

  11. అసలు నిజం అడిగితె కు.రా మాత్రం చెపుతాడా ?

  12. స్టుపిడ్ అనడం “Off the color jOke” కన్నా బాడ్ అన్నమాట.

  13. ప్రెగ్నెంట్ గా ఉన్న భార్యతో భర్త గొడవ పడితే? అన్న పుస్తకం కి మంచి మార్కెటింగ్ ఉందన్న మాట.

  మెచ్చుకోండి

 10. సీరియస్ గానే…

  1. డ్రెస్ విషయం పైవారి దృష్టికి తీసుకు వెలితే మార్పుంటుంది. కు.రా లు మనకెందుకులే అన్నట్లుగా కాక కాస్త యాక్టివుగా ఉండి ప్రొటెస్ట్ చేయాలి. గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటె … సెక్సిజం అనిపించిన దాన్ని వ్యతిరేకించములో ఆలస్యం చేయకూడదు. తక్కువ మంది స్త్రీలున్నారని మొహమాట పడడాలు గట్రా … కంపెనీలకు ఉండవు. కంపెనీలు వారిని ఫ్రీగా తీసుకోవడం లేదు, నెల నెలా జీతాలిస్తున్నారు. వారు కాకపోతే మరొకరు. ఇలాంటి సందర్భాలలో ఆంక్షలు పెట్టడం కన్నా అందరినీ ఫ్రీగా వదిలేసే దానికే అవకాశం ఎక్కువ. కాబట్టి, కు.రా లకు కూడా స్వేచ్ఛ దొరుకుతుంది.

  2. ఈ సారి మేనేజరుగా ఏ స్త్రీయో రావాలి గాట్టిగా కోరుకోవడం తప్ప మరేం చేయలేం ఇక్కడ. అసలు వర్క్ ఎన్విరాన్ మెంటులో లేడీ బాసులుండడం వలన ఉన్న అడ్వాంటేజీలలో ఇదొకటి. అమ్మాయిల ముందు వంకర్లు తిరిగే బాసులకన్నా వీరు బెటర్. మగవారి విషయానికి వస్తే … ఎవ్వరైనా ఒక్కటే, వారితో మాట్లాడే పద్దతి ఫిక్సుడు లేడీ బాసైనా సరే, మగ బాసైనా సరే.

  3.మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇంకో విషయం … వారికి కొన్ని పరిమితులు కూడా ఉంటాయి స్త్రీలపై వార్తలు రాసే విషయములో. అవి చట్టాల వలన కావచ్చు, లేకపోతే బయట సమాజం ఆమోదించదన్న భయం కావచ్చు. ఉదా: అత్యాచారానికి గురైన స్త్రీ ఐడెంటిటీ ఏరకంగానూ బయట పడకూడదు. కానీ, దురదృష్టవ శాత్తూ మగవారికి అలాంటిది ఏమీలేదు. అందుకే పేరు నిరభ్యంతరంగా రాసేస్తుంటారు. కొంత కాలం క్రితం ఓ 10వ తరగతి కుర్రాడు పరీక్షలు రాస్తున్నప్పుడు, ఓ లేడీ ఇన్విజిలేటర్ కాపీ కొడుతున్నాడన్న అనుమానం మీద మొత్తం బట్టలన్నీ ఊడదీసి నగ్నంగా కూచోబెట్టింది. ఆ అబ్బాయి పేరూ గట్రా అన్నీ పబ్లిషయ్యాయి. సదరు మానవ హక్కుల వారు దీన్ని ఖండించారు కానీ, బాదితుని పేరు ఎందుకు బయట పెట్టారు అని నిలదీసిన పాపాన పోలేదు. అలా ఉంటుంది వారి తెలివి. విషయమేమిటంటే … స్త్రీ కాబట్టీ, ఆ అఘాయిత్యానికి పాల్పడ్డ ఆమె టీచర్ పేరు ఎక్కడా బయట పెట్టలేదు. బహుషా వారికి అలా బయటపెట్టడం వలన సమస్యలు వస్తాయోమో తెలీదు. అదే నిజమైతే ముందు వాటిని ఎదుర్కోవాలి. దానికి బోలెడన్ని పోరాటాలు కావాలి. ప్రజల్లో (ముఖ్యంగా మగవారిలో) చైతన్యం కావాలి. కాబట్టి మనం దీన్ని మర్చిపోవచ్చు.

  4. దీని గురించి బాదపడడం వలన టైము వేస్టు తప్ప మరొకటి ఉండదు. రిజర్వేషన్లు అనేవి కొంత కాలం వరకూ భరించక తప్పదు. ఎలానూ కొన్ని రోజుల తరువాత చాలా చోట్ల అమ్మాయిలే ఎక్కువ మంది అవుతారు, అప్పుడు ఖచ్ఛితంగా తీసేస్తారు. ఇటీవలి వచ్చిన వార్తలేమిటంటె, డిళ్ళీ యూనివర్సిటి, JNU లాంటి చోట్ల క్లాసులో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారట. అవేవీ వారు రిజవేషన్లతో సాధించినవి కావు. మంచి మార్కులు తెచ్చుకునే సాధించారు. రీసెంటుగా ఏదో క్రిష్టియన్ కాలేజీలో (very famous) అబ్బాయిలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రపోజల్ పెడితే ఫ్యాకల్టీ అభ్యంతరం చెప్పారని పేపర్లో న్యూసు. అబ్బాయిలు కాస్త జాగ్రత్త పడాలి లేకపోతే ఇంతే సంగతులు.

  5.సానుభూతి చూపడం తప్ప ఏమీ చేయలేం. వీలైతే వంట మనిషిని పెట్టుకోవాలి. విదేశాలలో అది అంత సులువు కాదు. ఆ అమ్మాయికే వంట చేయడం ఎలానో క్లాసులు పెట్టి అయినా నేర్పించాలి. మరీ నేను వంట చేయను అని గిరి గీసుకు కూర్చునే అమ్మాయిలు అరుదు. కాబట్టి కొన్ని రోజులకి తానే చేయడం నేర్చుకుంటుంది. అదీ కుదరకపోతే ఎలానూ ఉండనే ఉన్నాయిగా విడాకులు..!!

  మెచ్చుకోండి

 11. సూపర్ పోస్ట్ బొందలపాటిగారు, ముమ్మాటికీ నిజం మీరు చెప్పినవన్ని. నాకొక సందేహం –
  అమ్మాయిల ముందు వెకిలి చేష్టలు చేసే అబ్బాయిలను చెప్పుతో కొట్టాలి అంటారు కానీ అబ్బాయిల ముందు వెకిలిగా వస్త్రధారణ చేసుకొని ఎక్స్‌పోజింగ్ చేసే అమ్మాయిలను చెప్పుతో కొట్టమని చెప్పడం లేదు మన మహిళా సంఘాలు.. ఎందుకో??!!

  మెచ్చుకోండి

  1. “అబ్బాయిల ముందు వెకిలిగా వస్త్రధారణ చేసుకొని ఎక్స్‌పోజింగ్ చేసే అమ్మాయిలను చెప్పుతో కొట్టమని చెప్పడం లేదు మన మహిళా సంఘాలు.. ఎందుకో??!!”
   దున్నేటపుడు దూడల్లోనూ, మేసేటప్పుడు దున్నల్లోనూ కట్టేయ్యటం అంటారు.All the rights movements, (women rights, x rights, y rights, z rights) are the offshoot of overt commercialization. As their names indicate, they want only rights, no responsibilities. They want best of both worlds, ..traditional world and modern world. అందుకే విడాకులు కావాలి, thet want alimony, సెక్దువల్ ఫ్రీడం కావాలి, డబ్బులు కావాలి, అదే సమయం లో మగ వాళ్ళిచ్చే protection కావాలి, సమాజం ఇచ్చే security కావాలి, రేప్ చేసిన వాడిని వెంటనే ఉరి తీసేయాలి, వాళ్ళతో పధ్ధతి గా మాట్లాడాలి.
   ఫెమినా లాంటి పత్రికలలో ఈ కొత్త లైఫ్ స్టైల్ కి కావలసిన అన్ని మెటీరియలిస్ట్ చెత్తా, అమ్మకాల ప్రకటనలు వస్తాయి.

   మెచ్చుకోండి

 12. 6. ఇది చాలా తీవ్రమైన విషయం. డిళ్ళీ అత్యాచారం జరిగిన తరువాత మగవారిని రాక్షసీకరించడం మొదలయ్యింది. అది మన దేశములోనే కాదు, ఇతర దేశాలలో కూడా. ఒక్కసారి టెలీగ్రాఫ్ లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి.

  The Delhi rape is being used to demonise Indian men

  దీనికికారణం ఆ అత్యాచారం తీవ్రతైతే, వాటికి కొంత రాజకీయం, మరికొంత … కొన్ని చట్టాలను ప్రభుత్వం పెండింగులో ఉంచడం జత కలిశాయి. సహజంగా ఇలాంటివి జరిగినప్పుడు, అప్పటి వరకూ అభ్యంతరాలు చెప్పి పక్కన పెట్టిన చట్టాలను … Push చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. పనిచేసే చోట అత్యాచారాలకు సంబందించిన చట్టం, వీధుల్లో జరిగే హరాస్ మెంటుకు చెందిన చట్టం, మ్యారిటల్ రేప్ లాంటివి డిమాండ్లు చాలా కాలం గా పెండింగులో పడి ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో మ్యారిటల్ రేప్ కు చెందినవి తప్ప మిగిలినవన్నీ ఆమోదం పొందాయి, పెద్దగా చర్చలు లేకుండా..!!

  కాకపోతే ప్రభుత్వం ఈసారి కాస్త రెసిస్టన్సును ప్రదర్శించింది. గుడ్డిగా మహిళా సంఘాల మాటకు తలూపకుండా, పనిచేసే చోట అత్యాచారాలను నిరోధించడానికి చేసిన చట్టములో … తప్పుడు కేసులు పెడితే చర్యలు తీసుకోవచ్చని సూచించారు (అంత తీవ్రమైనవి కాకపోయినా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా). మ్యారిటల్ రేప్ ను రేప్ గా గుర్తించడానికి నిరాకరించడం జరిగింది. దానితో మహిళా సంఘాల వారు ఏకంగా ఈ ఆర్డినెన్సుపై సైన్ చేయకండి అని రాష్ట్రపతికి విన్న వించుకునే దాకా వెల్లాయి. కానీ, రాష్ట్ర పతి నిర్మొహమాటంగా సైన్ చేయడం జరిగింది. గుడ్డిలో మెల్ల అని సరిపుచ్చుకోవడం తప్ప మగవారు ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు.

  7. అసలు SIFF కు వచ్చే వారిలో 99% మంది ఇలాంటి కు.రా లే. తమదాకా వచ్చినప్పుడు కాని వారికి బయట పేపర్లలో వస్తున్నవన్నీ నిజాలు కావని అర్థమవుతుంటుంది అని SIFF మెంబర్ల ఉవాచ.

  11.పనులలో మగ పనులూ ఆడ పనులూ ఉండవనే వారు భరణం విషయములో, అలాంటివి పాటించరు. కుటుంబాన్ని పోషించాల్సింది మగవాడే, అది అతని పనే అని నిర్మొహ మాటంగా చెబుతారు. సరే, భార్యకూ పిల్లలకూ వేరే అధారం లేనప్పుడు భరణం పొందడం న్యాయమే. కానీ, ఆవిడ ఉద్యోగం చేస్తున్నా కూడానా? అంటే అవుననే చెబుతారు. ఎలాంటి మొహమాటాలకు పోకుండా.

  12.మగవారు పిల్లల విషయములో కేవలం వీర్యదాతలు మాత్రమే అన్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అసలు తండ్రి అనే పదానికి విలువ లేదు. ఉంటే గింటే అది విడాకులు పొందనంత వరకు మాత్రమే. ఒక్కసారి విడాకులు పొందారా, ఇక అతను కేవలం విజిటర్ మాత్రమే. అతనికి విజిటేషన్ హక్కులు మాత్రమే ఇవ్వబడతాయి. అందుకే “మేల్ అబార్షన్”, “జాయింట్ కస్టడీ” లాంటివి తెరపైకి వచ్చాయి. అవిసాధించడం అనేది వీలవుతుందో లేదో చెప్పలేం.

  ======================
  మీ టపా అంత కామెంటెట్టాను. మరోళా భావించకండి. ఏదో నాకు తెలిసినవి చెప్పాలన్న ఫీలింగ్ తప్ప మరేమీ లేదు. ఇందులో నా అభిప్రాయాలు కూడా కలిసున్నాయి. అవే అందరూ పాటించాలి అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. నాకు తోచిన పరిష్కారం చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం.

  మెచ్చుకోండి

 13. మళ్ళీ మొదలు పెట్టారా, మీచర్చ … !!! ????? పురుషవాదం పేరుతో మీరిలా రాస్తే చులకన అవుతారు సుమా! అని హెచ్చరించిన తరువాత కూడా? 🙂 🙂

  మెచ్చుకోండి

 14. ఆమే ఎవరో ఆ బ్లాగులో ఎదో గీకితే ఈ టపాకి సంబందం ఎమిటి? రెవెంజ్ ఎమిటి. మీకు కాళి సమయం చాలా ఉంది గనుక అన్నిటపాలను చదవటం మీ అలవాటు అదే అందరికి ఉంట్టుందనుకొంటే ఎలా?

  మెచ్చుకోండి

 15. మీరు అభిమాని అని అందరికీ తెలుసు, మీరు కాని శైలజ గారు కాని ఈ వ్యాఖ్యను సరదాగానే తీసికొంటారని ఆ పెద్ద వ్యాఖ్యని లైట్ చెయ్యడానికి చెప్పాను. ముందే నాకీ చర్చ పట్ల ఆసక్తి లేదు. అందుకే సరదాగా రివెంజా అని అడిగి వదిలేసాను. కళ్ళజోడు టపాని , ఇంకెక్కడో కూడా గుర్తు చేసికొన్నాను

  మెచ్చుకోండి

 16. మీటపాలో నాకు కొత్తదనం కనిపించలేదు. అంతా చుట్టూ జరుగుతున్న విషయాలే, స్త్రీ దురహంకార అట్రాసిటీలే.
  ఏమున్నది? ఏ మున్నది?
  ఏమున్నది గర్వకారణం
  మగ జాతి సమస్తం, స్త్రీపీడితా మయం.

  మెచ్చుకోండి

 17. *ఉద్యోగం నుంచి స్వేచ్చ పొందడం. చేస్తున్న ఉద్యోగం వదిలేసి వేరే ఆసక్తుల వెంటపడడం, రికామీగా తిరుగుతూ లైఫ్ ఎంజాయ్ చేయడం.*

  నాకు తెలిసిన ఒకరు, విదేశాలలో 20సం|| పైన నుంచి చేస్తున్న ఉద్యోగం మీద ఆసక్తిని కోల్పోయి కూచిపూడి నృత్యాన్ని నేర్చుకోవటం,సాహిత్య పుస్తకాలు చదవటం మొదలు పెట్టాడు. వాళ్ల పిల్లలు పైకొచ్చారు. ఇల్లు వాకిలి ఉంది. అయినా అత్తగారికి అల్లుడు చేస్తున్న పని నచ్చక, మా అమ్మాయి పని చేస్తూంటే అల్లుడు సుఖపడిపోతున్నాడని, తెలిసిన వారందరికి చెప్పుకొని ఒకటే బాధపడిపోతూంట్టుంది. మారిన కాలం లో అల్లుడు (మగవారు)చేస్తున్న పని ఆహ్వానించవలసిన పరిణామం. ఈ రోజుల్లో ఉద్యోగం అంట్టు పగలు రాత్రి పోటి పడుతూ, అది ఉంట్టుందా పోతుందా అని భయపడుతూ, ఇతరులను చూసి ఈర్ష పడుతూ బతకవలసిన అవసరం, చాలా మందికి లేదు. కొంతమందికి పిల్లలు తక్కువ, ఆస్థులు ఎక్కువగా ఉన్నాయి. 60సం|| వయసు వరకు ఉద్యోగం చేయవలసిన అవసరం, నిన్నటి తరంవారిది. ఈ తరం వారికి ఆ అవసరం లేదు. మగవారు తమకిష్టమైన/నచ్చిన రంగాలలో, పని చేసే ఆప్షన్ ఉండటం ఒక మంచి పరిణామం.

  రెండో కారణం పంచభూతాలలో ఒక్క స్పేస్ తప్ప, మిగిలిన వాటిని ప్రపంచంలో డబ్బులున్న వారు ఎప్పుడో ఆక్రమించేశారు. చాలా మంది చదువుకొన్నవారు ఆ డబ్బులున్న వారు పెట్టిన కంపేనీలలో పనిచేస్తూ చాకిరి చేయటం ఒక్కటే మిగిలిన ఆప్షన్. ఎంత చదివినా, ఎన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నా మధ్యతరగతి వాడు స్వంతం గా తన కాళ్లపైన తాను నిలబడే అవకాశాలు రాను రాను మూసుకు పోయాయి. ఉద్యోగిగా డబ్బులు సంపాదించుకొన్నవారు, 45 సం|| వయసులో వ్యాపారం/పరిశ్రమలు పెట్టటం ఎంతో కష్టంతో కూడూకొన్న విషయం (రాజకీయ పలుకుబడి ఉంటే అది వేరే విషయం). భార్యా భర్తలు ఉద్యోగులుగా పనిచేస్తూ రెండు కార్లు, మూడు ఇళ్లు కొనుకొని అభివృద్ది చెందాననుకొని తృప్తి చెందాల్సిందే. ఇటువంటి మారిన పరిస్థితులలో ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే దానిని కొనసాగించటం చాలా మంచి విషయం. భారతీయులలో ఈ తరం వారికి చాలా తరాల తరువాత చిక్కిన గొప్ప అవకాశం. వీలున్న వారందరు దానిని సద్వినియోగం చేసుకోవాలి.

  మీకెవారికైనా ఈ వ్యాఖ్య అవుట్ ఆఫ్ కంటేక్స్ట్ గా అనిపిస్తే మన్నించండి.

  మెచ్చుకోండి

  1. “పంచభూతాలలో ఒక్క స్పేస్ తప్ప, మిగిలిన వాటిని ప్రపంచంలో డబ్బులున్న వారు ఎప్పుడో ఆక్రమించేశారు. చాలా మంది చదువుకొన్నవారు ఆ డబ్బులున్న వారు పెట్టిన కంపేనీలలో పనిచేస్తూ చాకిరి చేయటం ఒక్కటే మిగిలిన ఆప్షన్. ఎంత చదివినా, ఎన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నా మధ్యతరగతి వాడు స్వంతం గా తన కాళ్లపైన తాను నిలబడే అవకాశాలు రాను రాను మూసుకు పోయాయి. ఉద్యోగిగా డబ్బులు సంపాదించుకొన్నవారు, 45 సం|| వయసులో వ్యాపారం/పరిశ్రమలు పెట్టటం ఎంతో కష్టంతో కూడూకొన్న విషయం (రాజకీయ పలుకుబడి ఉంటే అది వేరే విషయం). భార్యా భర్తలు ఉద్యోగులుగా పనిచేస్తూ రెండు కార్లు, మూడు ఇళ్లు కొనుకొని అభివృద్ది చెందాననుకొని తృప్తి చెందాల్సిందే. ఇటువంటి మారిన పరిస్థితులలో ఎవరికి ఏ రంగంలో ఆసక్తి ఉంటే దానిని కొనసాగించటం చాలా మంచి విషయం.”
   మీరు నా నా చాకిరీ చేసి సంపాదించిన డబ్బుల్ని ద్రవ్యోల్బణం మళ్ళీ మీ జేబుల్లోంచీ లాగేస్తుంది. పెరుగుతున్న ఇంఫ్లేషన్ మనలని తీసుకెళ్ళి ఎక్కడ వదులుతుందో తెలియదు.ఇంత సంపాదించి విశ్రాంతి తీసుకొందాము అనుకొంటే, ఇంఫ్లేషన్ ఆడబ్బుని తేలిక చేసి అసభ్యం గా నవ్వుతుంది.
   కాబట్టీ, ఏదో ఓ గాడిద చాకిరీ చేసుకొంటూ, అదే సమయం లో ఇతర ఆసక్తులను ఆచరించటం మంచిది.

   మెచ్చుకోండి

 18. మీరు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతారని తెలుసు. రానున్న రోజులలో ప్రపంచంలో ఎన్నో మార్పులు పెను వేగంతో వస్తాయి. యురోప్ ఆధిపత్యపు కథ ముగిసింది. అలాగే జపాన్ కూడా. అది రాజకీయం గా, ఆర్ధికంగా ఇక ఏమాత్రాం కోలుకోలేదు. దిన దినం దాని పరిస్థితి దిగజారుడే తప్ప మెరుగయ్యేది ఉండదు. అమేరికా గొప్పగా వెలగకపోయినా, అందరితో పాటుగా గుంపులో గోవిందయ్య లా నెట్టుకొస్తుంది. కుంచించుకు పోతున్న ఆర్ధికవ్యవస్థలో ప్రపంచ దేశాలన్ని ఎక్కడో అక్కడ సర్ధుకు పోవలసిన అవసరం ఉంది. అంతకు మించి దేశాలకు వేరేదారి కూడా లేదు. మనదేశం లో ద్రవ్యోల్బణం అనేది అవినితీవలన పెరిగి పెద్దదయింది. దానికి ప్రధాన కారణం రాజకీయ నాయకత్వ లోపం. దానిని అడ్డుకోవాలంటే ప్రపంచ దేశాల మన్నలకు,పొగడ్తలకు మొహం వాచి పోయినట్లు వ్యవహరించే నాయకులకన్నా దేశభక్తి,నాయకత్వ లక్షణాలు కలిగిన వారిని ప్రజలెన్నుకొంటే ఆసమస్య దారికొస్తుంది.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s