వంద దాటిన నా స్కోర్– రావూరి భరద్వాజ – యండమూరి

TSE-SS

స్వయం ప్రకాశక పుస్తకాల అమ్మకం ఎలా ఉంటుందో కానీ, కినిగె లో,  నా “ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ“, ఈ-పుస్తకం కొనుగోళ్ళు (అద్దెలూ,కొనుగోళ్ళూ కలిపి) వంద దాటింది.. కొనుగోలు దారులకు “రొంబ నండ్రి”.

కానీ ఎవరూ కామెంట్లు పెట్టలా..కామెంటేంత బాలేదనుకొంటా..ప్చ్..

—————————————————————————-

రావూరి భరద్వాజ – పాకుడు రాళ్ళు, చిన్నప్పుడెపుడో చదివాను. ఎంటీఆర్, నాగేస్రావు, సావిత్రి ల ను పోలిన పాత్రలు (లేదా నేను అలా పోల్చుకొన్న పాత్రలు) ఉన్నట్లు గుర్తు. అప్పట్లో యండమూరి రచనా ప్రవాహ ఉధృతి లో కొట్టుకుపోతున్న నేను, పాకుడు రాళ్ళ మీద నుంచీ జారి మళ్ళీ ప్రవాహం లో పడి కొట్టుకొనిపోయాను.
పుస్తకం మీది రావూరి గారి ఫొటో లో అప్పుడు కూడా ఇప్పటిలానే తెల్ల బవిరి గడ్డం, తెల్ల దుస్తులు ఉన్నట్లు గుర్తు. పుస్తకం రాసిన రెండు తరాల తరువాతైనా, ఆయన జీవించి ఉండగానే జ్ఞానపీఠ రావటం సంతోషం కలిగిస్తోంది. మన ప్రభుత్వం వారి పనులు అసలే నెమ్మది అనుకొంటే, అవార్డులు ఇవ్వటం లో ఇంకా స్లో అనుకొంటా!

నాగేస్రావూ, రామా రావూ ఓ వెలుగు వెలిగిన కాలం నాటి సినీ రంగపు వాస్తవ జీవితం, ఈ కాలపు సమాజానికి ఎంత వరకూ relevant? ఆ relevancy ఏదో తగ్గక ముందే, అప్పట్లోనే ఆ అవార్డ్ ఇస్తే, వాళ్ళ సొమ్మేం పోయింది?

ఇంకో విషయం మర్చిపోయా..అలానే, దీన్నిబట్టి చూస్తే, మా యండమూరి బావుక్కూడా, ఇప్పుడు కాక పోయినా, ఓ ఇరవై లేక ముప్పై యేళ్ళ తరువాత, ఆఖరి పోరాటానికి కాక పోయినా, ఏ ఆనందో బ్రహ్మకో, అంతర్ముఖానికో, ఓ జ్ఞానపీఠం వస్తుందని ఆశిస్తాండా!