వంద దాటిన నా స్కోర్– రావూరి భరద్వాజ – యండమూరి

TSE-SS

స్వయం ప్రకాశక పుస్తకాల అమ్మకం ఎలా ఉంటుందో కానీ, కినిగె లో,  నా “ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ“, ఈ-పుస్తకం కొనుగోళ్ళు (అద్దెలూ,కొనుగోళ్ళూ కలిపి) వంద దాటింది.. కొనుగోలు దారులకు “రొంబ నండ్రి”.

కానీ ఎవరూ కామెంట్లు పెట్టలా..కామెంటేంత బాలేదనుకొంటా..ప్చ్..

—————————————————————————-

రావూరి భరద్వాజ – పాకుడు రాళ్ళు, చిన్నప్పుడెపుడో చదివాను. ఎంటీఆర్, నాగేస్రావు, సావిత్రి ల ను పోలిన పాత్రలు (లేదా నేను అలా పోల్చుకొన్న పాత్రలు) ఉన్నట్లు గుర్తు. అప్పట్లో యండమూరి రచనా ప్రవాహ ఉధృతి లో కొట్టుకుపోతున్న నేను, పాకుడు రాళ్ళ మీద నుంచీ జారి మళ్ళీ ప్రవాహం లో పడి కొట్టుకొనిపోయాను.
పుస్తకం మీది రావూరి గారి ఫొటో లో అప్పుడు కూడా ఇప్పటిలానే తెల్ల బవిరి గడ్డం, తెల్ల దుస్తులు ఉన్నట్లు గుర్తు. పుస్తకం రాసిన రెండు తరాల తరువాతైనా, ఆయన జీవించి ఉండగానే జ్ఞానపీఠ రావటం సంతోషం కలిగిస్తోంది. మన ప్రభుత్వం వారి పనులు అసలే నెమ్మది అనుకొంటే, అవార్డులు ఇవ్వటం లో ఇంకా స్లో అనుకొంటా!

నాగేస్రావూ, రామా రావూ ఓ వెలుగు వెలిగిన కాలం నాటి సినీ రంగపు వాస్తవ జీవితం, ఈ కాలపు సమాజానికి ఎంత వరకూ relevant? ఆ relevancy ఏదో తగ్గక ముందే, అప్పట్లోనే ఆ అవార్డ్ ఇస్తే, వాళ్ళ సొమ్మేం పోయింది?

ఇంకో విషయం మర్చిపోయా..అలానే, దీన్నిబట్టి చూస్తే, మా యండమూరి బావుక్కూడా, ఇప్పుడు కాక పోయినా, ఓ ఇరవై లేక ముప్పై యేళ్ళ తరువాత, ఆఖరి పోరాటానికి కాక పోయినా, ఏ ఆనందో బ్రహ్మకో, అంతర్ముఖానికో, ఓ జ్ఞానపీఠం వస్తుందని ఆశిస్తాండా!

ప్రకటనలు

68 thoughts on “వంద దాటిన నా స్కోర్– రావూరి భరద్వాజ – యండమూరి

 1. మీకిది చెప్పే సందర్భం వస్తుందనుకోలేదు . నేను అద్దెకి తీసికొని రెండు రోజులే కాస్త చదివా. వోడ్కా విత్ వర్మ లా గబా గబా చదివేసి అవతల పారేసే పుస్తకం కాదయ్యె 🙂

  మీరు ప్రింట్ అన్నా వేయించండి లేక పుస్తకం ని ఒక నెలకి బదులు ఆరునెలలు అద్దెకి వచ్చేలా చూడండి 🙂

  మెచ్చుకోండి

  1. మీరు ప్రింట్ అన్నా వేయించండి లేక పుస్తకం ని ఒక నెలకి బదులు ఆరునెలలు అద్దెకి వచ్చేలా చూడండి 🙂
   థాంక్సండీ మౌళి గారు! అంటే వోడ్కా లా నేను కూడా రీడబిలిటీ పెంచాలన్న మాట!
   కినిగే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షా, ఆరు నెలలకి అద్దె సమయం పెంచమని. 🙂

   మెచ్చుకోండి

   1. హ హ , ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ ముందు కొన్ని పార్ట్స్ చూసినా ఎక్కడో రివ్యు చూసి తీసికొవాలనిపించింది . మొదట కొంచెం చదవగానే చాలా నచ్చింది . కాకపొతే చదువుతున్నంతసేపు ఆ పరిసరాలు జ్ఞాపకం వచ్చేసి సాహిత్యం చదువుతున్నట్లు నెమ్మదిగా సాగింది 🙂

    జ్ఞానపీఠం వచ్చింది కేవలం పాకుడురాళ్ళ కోసమే అని ఎక్కడా చెప్పలేదు కదా. మీ యండమూరికి అజ్ఞాన పీఠం మాత్రం ఆ విజయానికి పదమూడు మెట్లకి ఇవ్వాలి తప్పకుండా 🙂

    మెచ్చుకోండి

    1. అవార్డు పాకుడు రాళ్ళకే అనుకొంటానండీ.. ఈలింక్ చూడండి:
     http://www.teluguthesis.com/2013/04/gnana-peeth-award-to-ravuri-bharadvaj.html
     నాకు పాకుడు రాళ్ళు చదివినపుడు అది అంత గొప్ప పుస్తకం అనిపించలా..బహుశా నా చిన్న వయసు వలన(అర్ధం చేసుకొనేంత వయసు లేకపోవటం వలన ) అనుకొంటా. అందుకే, జ్ఞానపీఠ వచ్చిందని తెలియగానే, ఆ పుస్తకానికి కూడా జ్ఞాన పీఠ ఇస్తారా అనిపించింది.
     నన్నేమైనా అనండి గానీ యండమూరి ని ఏమీ అనొద్దు.నా మాటలు నిజమైన తరువాత మీరే ముక్కున వేలేసుకొంటారు చూడండి.

     మెచ్చుకోండి

  1. @నన్నేమైనా అనండి గానీ యండమూరి ని ఏమీ అనొద్దు.

   😀

   మొదట రావూరి భరద్వాజ గారి గురించి :: నాకసలు ఆయనెవరో కూడా తెలియదు . అవార్డ్ వచ్చినపుడు కూడా భారత దేశంలో ఎవరికో వచ్చినట్లు అనుకున్నాను కాని మన అన్న భావం ఏమి లెదు. ఇదిగో మీ లాంటి వారి నాలుగు మాటలు చదివే వరకు . అర్ధం కాకున్నా చిన్న వయసులో చదివిన మంచిరచనలు వృధా కావు. ఇప్పటికీ మీకు ఎంతో కొంత జ్ఞాపకం ఉంది కదా . అది కేవలం మీరు మీకు తెలిసిన సినిమా వాళ్ళని అన్వయించుకోవడం వల్లనే కాదు. మనకి అర్ధం కానివి మనల్నే అట్టే వదిలెయ్యవు. అంతర్లీనంగా మనసు సమాధానాలు వెతుక్కుంటుంది కాదా .

   ——————————————————————————————————————————————
   వికీ పేజి లో ఈ పుస్తకం గురించి

   రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.

   ఇంకా ఆయన రచనల గురించి ఇలా ఉంది :

   తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి మరియు పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉన్నది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనినించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు.[4]
   ———————————————————————————————————————————

   యండమూరి పుస్తకాలు మీరు చెప్పినవి నేను చదివాను , ఒక్క అక్షరం ముక్క కూడా గుర్తు లేదు , కాని నేను ప్రస్తావించిన పుస్తకంలో మొదటి కొన్ని పేజీల్లో ఒక చాప్టర్ లో ‘ వినాశ కాలే …’ అన్న మాటలు గుర్తు చేసింది . మిగిలిన పుస్తకం చదవనవసరం లేదనుకోండి . కాబట్టి ఆయన్నే అనాలి కాని మిమ్మల్నెన్దుకు అనడం 🙂 చలం చివరి రోజుల్లో రివర్సు అయినట్లు, యండమూరి కూడా చివరి రోజుల్లో కాస్తయినా ఆ పుస్తకాన్ని రివర్సులో వ్రాస్తాడెమో . ఇప్పుడిప్పుడే కాస్త నిజాయితీ గా మాట్లాడుతున్నానని చెపుతున్నాడనుకోండి 🙂

   అది తప్పితే ఆయన రచనలు గొప్పవో, చెత్తవో అని నేను చెప్పడం లేదు , ఎందుకంటె అప్పటికే నవలలు చదవడం బోర్ కొట్టేసింది 🙂

   మెచ్చుకోండి

 2. రావూరి భరద్వాజ గారి “పాకుడు రాళ్ళు” నవలకు అవార్డ్ ఇవ్వటం అద్భుతమైన విషయం, పూర్తిగా సమంజసం.

  మీరు యండమూరి గారి పుస్తకాలకు కూడా అవార్డ్ రావచ్చు అని సరదాగా వ్రాసి ఉంటారు. కాని యండమూరి, రావూరి గార్లను ఒకే రకపు రచయితలు అని మనం అనుకోవటం సమంజసమా! కాని ప్రస్తుతపు పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు.

  ఒక టి వి షో లో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఇలా అన్నారు:

  “కొన్నాళ్ళు పొయ్యాక, మా మునిమనమల మనమలు, అబ్బ! మా వంశం వాడేనుట, బాలుట! అప్పట్లో అధ్బుతమైన కీర్తనలు పాడేవాడట అందులో “బంగారు కోడిపెట్ట” అనే “కీర్తన” భలే బాగుంటుంది. ఇప్పటికీ వింటూ ఉంటాము. ఇప్పటి పాటల్లో ఏముంది చప్పుడు తప్ప” అనుకుంటారు అని జోక్ చేసినా, రోజురోజుకీ సంగీత సాహిత్యాల మీద మన సమాజంలో ఉన్న టేస్ట్ ఎలా మారుతున్నది అన్న విషయానికి అద్దం పట్టింది ఈ వ్యాఖ్య.

  కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం పల్ప్ ఫిక్షన్ లేదా ప్రొఫెషనల్ రచయిత వ్రాసినవి అనుకునే వాటికి, మరికొంత కాలం పోయిన తరువాత, అప్పటికి రెలెటివ్ గా, అద్భుత సాహిత్యంగా పరిగణలోకి తీసుకుని, వాటికి జ్ఞానపీఠ్ అవార్డ్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. “అతడు” సినిమాకి బెస్ట్ పిక్చర్ గా నంది ఇవ్వగా లేనిది, యండమూరికి జ్ఞానపీఠ్ ఇస్తే తప్పేమున్నది!! డిటెక్టివ్ నవలలకు జ్ఞానపీఠ ఎవార్డు ఎందుకు ఇవ్వరు అని పాఠకులు ఉద్యమించే అవకాశమూ లేకపోలేదు.

  మీరు యండమూరి గారికి ఈ అవార్డ్ ఎప్పటికో ఇవ్వకపోతారా అని ఆశ చూపిస్తూ ఉంటె పై విషయం వ్రాయాలనిపించింది.

  మెచ్చుకోండి

  1. శివరామ ప్రసాద్ గారు,
   బాలు గారి ఆ ప్రోగ్రాం నేను కూడా చూశాను. అవునండీ, సిమ్హా సినిమా లో నటన కి బాలకృష్ణ కి ఉత్తమనటుడు అవార్డ్ వచ్చిందని నా మితృడు చెప్పినపుడు నమ్మలేకపోయాను.

   యండమూరి ది మరీ ఈ తరహా కాదు.ఆయనకు అవార్డ్ గురించి నేను సగం సరదా గా, సగం ఆశావహం గా రాశాను. ఆయన రాసిన వాటి లో కొన్ని మరీ కమర్షియల్ రచనలైతే, కొన్ని ఆలోచన రేకెత్తించే రచనలు కూడా చేశారు. ఈ రెండో కోవ లోని రచనలంటే నాకు ఇష్టం. బాలు గారి శంకరాభరణానికి అవార్డ్ వచ్చినట్లు, యండమూరి కి ఈ టైపు రచనలకి రావచ్చేమో!

   మెచ్చుకోండి

  2. భరధ్వాజ గారికి ఈ అవార్డ్ కి అర్హత ఉందా లేదా అని తేల్చే అర్హత నాకు లేదు. మీలాంటి మొహమాటానికి పోని “సాహిత్య అభిమానులు”, ప్రశంసిస్తున్నారంటే, తప్పని సరి గా అర్హమే అయి ఉంటుంది.

   మెచ్చుకోండి

 3. యండమూరి పుస్తకాలు గబగబా చదివించే ఆసక్తిని కలగ చేస్తాయి కాని, సాహిత్యపు లోతులు, గంభీరమైన వ్రాసే పధ్ధతి ఇదే శిల్పం అంటారేమో అవ్వేమీ కనపడవు. ఒకడున్నాడు, వాడేదే చేద్దామనుకుంటాడు. రచయిత వాడిచేత ఆపని చెయించాలనుకుంటె, వాడికి ఎమీ అడ్డురాని విధంగా వ్రాసేసి, వాడిచేత ఆ పని చేయించెస్తాడు. యండమూరి నవలలు అన్నీ ఈ మూసలోనే ఉన్నాయని నా అనుమానం.

  ఇర్వింగ్ వాలెస్ నవలలో అనుకుంటాను (ప్రైజ్ or వర్డ్ లో నో) ఒక ఉదంతం వర్ణించారు. 20 శతాబ్దపు మొదట్లో ఒక వార పత్రికలో ఒక ధారావాహిక వచ్చేదిట. ఎంతో ఆసక్తిగా అందరూ చదివే వారుట. అందులో ఒక వారంలో ఆ హీరో బావిలో పడిపోతాడు, ఎదురుగా ఒక విష సర్పం వాణ్ణి కాటెయ్యబోతూ ఉంటుంది అని ఆ వారం ఆపేసారుట. తరువాతి వారం హీరో ఎలా బయటకు వస్తాడా అని 7 రోజులు ఓపికపట్టిన పాథకులకు, రచయిత వ్రాసినది ఏమంటే:

  “హీరో బావిలోంచి బయటకు రాంగానే……” అంటూ నెక్స్ట్ వారం ధారావాహిక మొదలయ్యిందిట. ఇలా ఉంటాయి మన సస్పెన్స్ థ్రిల్లర్స్, వారంవారం వ్రాసే సాగతీపుడు రచనలు.

  మెచ్చుకోండి

  1. సస్పెన్స్ త్రిల్లర్ ల గురించి మీతో పూర్తి గా ఏకీభవిస్తున్నాను.
   శిల్పం అంటే వాస్తవ భ్రమ ను కల్పించే రచనా చాతుర్యం అనుకొంటున్నానే (ఏదైనా గొప్ప శిల్పాన్ని చూస్తే నిజమైనదా అని భ్రమ కలిగినట్లు),

   మెచ్చుకోండి

   1. సాహిత్యంలో శిల్పం అంటె ఎమిటి అన్న విషయం ఇదమిద్దంగా నాకూ తెలియదు. అదేదో బ్రహ్మ పదార్ధం లాగ అనిపిస్తుంది. కాని నాకు ఊహా మాత్రంగా అర్ధం అయ్యింది ఏమంటె, ఒక రచయిత వ్రాసినది చదవంగానే చాలా లోతుగా ఎంతో కధ చదివినట్టు ఆ పాత్రలు మనకు చిరపరిచితం అనిపిస్తుంది. మరొకరు వ్రాసినది చదువుతుంటె రైల్లో ఊసుబోక చెప్పుకునే కబుర్లులాగా, చిన్న పిల్లలు సినిమా చూసొచ్చి క్లాసులో లీజర్ లో చెప్పుకునే కథలులాగా ఉంటాయి కవనాలు. ఎప్పుడైతే మనం ఆ సాహిత్యపు అంశం, పద్యం కానివ్వండి, నాటిక కానివ్వండి, కథ కానివ్వండి, నవల కానివ్వండి, ఆ లోతును గ్రహించి మనసులోకి తెచ్చుకోగలుగుతామో అదే ఆ రచయిత రచనలో ఉన్న శిల్పం అని నా ఊహ.

    మనకు ఎపిక్ సినిమాలు అసలు లేవనే చెప్పాలి. అన్నీ ఫార్ములా సినిమాలే. గుప్పేడు పాటలు, పుంజీడు హాస్యపు సీన్లు, ఐదారు ఫైట్లు, కాస్తో కూస్తో ఏడుపు, ఇలాంటి సినిమాని మూడు గంటలు చూసినా తలనెప్పే కాని (మనం మూర్చలు పోతూ గొప్పగా చెప్పుకునే కొన్ని సినిమాలతో సహా), ఒక చక్కటి దృశ్య కావ్యం చూసిన అనుభూతి కలిగే అవకాశం మనవాళ్ళు అతి అరుదుగా, అరుదుగా ఏమిటి బహుశా మొత్తం తెలుగు సినిమాల్లో పదికి లోపే అటువంటి సినిమాలు అని నా అనుమానం. కొన్ని ఇంగ్లీషు సినిమాలు చూస్తుంటే, బెన్ హర్ కాని, లారెన్స్ ఆఫ్ అరేబియా కాని, ట్వెల్వె యాంగ్రీ మెన్ కాని ఇలాంటి సినిమాలు మన మీద చెరగని ముద్రవేసి కలకాలం గుర్తుండిపోతాయి. అలా గుర్తుంచుకునేట్టుగా చెయ్యగలగటమే శిల్పం అని చెప్పటానికే నా ఈ తిప్పలన్నీను.

    మెచ్చుకోండి

 4. రాబోయే రోజుల్లో యేమేమి వింతలు జరుగుతాయో చెప్పలేం.

  70వ దశకంలో ఒక డిగ్రీ చేస్తున్న తెన్నేటివారి కుర్రవాడు ఒకడు, గ్రంధాలయాల్లో యెవరూ చదవని పనికిరాని అరవిందుడు మరొకరూ రాసిన దింద్లులాంటి పుస్తకాలతో అరలు నింపటం యెందుకూ డిటెక్టివ్ నవలలు అందరూ చదివి ఆనందించేవి కదా అవి పెట్టితీరాలీ అని ఒక చిన్న సభలో ఘట్టిగా వాదించాడు. ఈ తరంలో కొందరు యండమూరిని జ్ఞాంపీఠం యెక్కించాలీ అని అడగటం ఆశ్చర్యపోవలసినదేమీ కాదనుకుంటాను.

  మెచ్చుకోండి

  1. శ్యామలరావు గారు,
   చలనచిత్రాలని కళ స్థాయి నుంచీ పూర్తి వ్యాపారం చేసి మురికి కాలువలలోకి వదిలిన వారికి దాదాసాహెబ్ ఫాల్కేలు ఇచ్చే కాలం, జ్ఞానపీఠాలకి కూడా ఆగతి కొంచెం ముందుగానో వెనుక గానో తప్పదు.

   మెచ్చుకోండి

  1. భాస్కర్ కొండ్రెడ్డి గారు,
   అవును. ఆయన గురించి ఇంతక్రితం నాకు పెద్దగా తెలియదు. జ్ఞానపీఠం వచ్చిన తరువాత, నేను చదివిన మీడియాలోని కధనాలను బట్టి అదే అనిపిస్తుంది.

   మెచ్చుకోండి

 5. @భాస్కర్ కొండ్రెడ్డి
  You are right. Shri Ravuri Bharadwaj is a great Radio Artist. His voice lent authenticity to any programme that he did. But he did not get the required fame or recognition there. That is the misfortune of All India Radio. All India Radio is not aware that they have to respect their Artists. AIR thinks that Clerks are more important than Artists, while Listeners think the other way.

  Shri Bharadwaj earned all his fame with his excellent stories and novels. HIs social work is another hallmark of the Man he is.

  మెచ్చుకోండి

 6. Pyraveerulu pyraveeranaareemanulu tama tama chakraalu thippi balagalu moharinchinaa Bharadwaja Paakudu raallaku gnaanapeetham dakkindi!aa navala aanaati cinema kullunu nagnamga vellagakkindi,trendsetter gaa kaala pareexanu tattukoni aa navala nilichindi!Vacche jnaanapeet barilo Dr Keshava Reddy balamga kondalaa nilustaadu!Yandamooriki mundu endaro peddalunnaru!

  మెచ్చుకోండి

 7. Yes Dr. Keshava Reddy is a great contender for Jnan Phith Award in Telugu. But in a period of more than 30 years only 3 people were given-Viswanatha, Narayana Reddy, Ravuri-and so whether he stands chance in his lifetime?!

  @Suryaprakash, it would be better either you write your comment in English language not script or in Telugu using Lekhini.org Reading Telugu in English script is very difficult and more so, గోడమీద గోరుపెట్టి గీకినట్టుంటుంది

  మెచ్చుకోండి

 8. సరేనండీ, మరి పుట్టపర్తివారికి జ్ఞానపీఠం యెందుకు రాలేదో తెలియదు. నిజానికి నారాయణరెడ్డికి రావటానికి ఆయనకున్న పలుకుబడి కారణంగానే నన్న అపప్రథ ఉంది.

  మెచ్చుకోండి

  1. నా దృష్టి లో రావిశాస్త్రికీ, కారా మాస్టారికీ, కొ.కుటుంబరావు గారి కీ, వ. చండీదాసు కీ కూడా రావాలి.
   శ్రీ శ్రీ ఏమి నేరం చేశాడు? ఈ అవార్డ్ ఇవ్వటానికి మినిమం ఇన్ని పేజీలున్న పెద్ద పుస్తకాలకే అని ఏమన్నా రూల్ ఉందా?
   సిధ్ధాంత పరం గా ప్రభుత్వాలను కడిగేసే వారెవరికీ ఈ అవార్డ్ వచ్చిన దాఖలాలు లేవు.

   మెచ్చుకోండి

   1. మీరు ఈ అవార్డుల గూర్చి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తోస్తుంది. ఈ రోజుల్లో నోబుల్ ప్రైజులకే విలువ లేదు. ‘పాకుడురాళ్ళ’లో ఇన్నేళ్ళ తరవాత జ్యూరి (అసలు జ్యూరి అంటూ ఉంటే) కి ఏమి గొప్పదనం గోచరించిందో! త్వరలోనే యండమూరికి కూడా ఈ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను!

    మెచ్చుకోండి

    1. ఈ జ్యూరీల గురించి నేను చెప్పటం కుదరక అవస్థపడుతున్న విషయాన్ని యరమణ స్టైల్లో అదరగొట్టేశారు.
     పాకుడురాళ్ళ గురించి నాకు పెద్దగా గుర్తులేదు కనుక benefit of doubt ఉంది.

     మెచ్చుకోండి

  2. ఎవరో తెలుగు వాడు తన పలుకుబడీ/పైరవీ ఉపయోగించి ఓ కేంద్ర సినిమా అవార్డో, సాహిత్య అవార్డో తెచ్చుకొన్నాడు అని తెలిసిన తరువాత కూడా, “ఓ తెలుగు వాడికి అవార్డ్ వచ్చిందని”, మనం గమ్మునుండాలా? అలాంటి వారి తప్పుని ఎత్తి చూపటం ఓర్వలేనితనం అవుతుందా? చూసీచూడనట్లుపోతే, అది మంచిదా?

   మెచ్చుకోండి

 9. “…ఓ తెలుగు వాడికి అవార్డ్ వచ్చిందని”, మనం గమ్మునుండాలా?…”

  Not necessary. If we know the truth, not rumour, such truth has to be exposed.

  మెచ్చుకోండి

 10. > ఇన్ని పేజీలున్న పెద్ద పుస్తకాలకే అని ఏమన్నా రూల్ ఉందా?
  నారాయణ రెడ్డి గారు ఆయనకున్న పరిచయాలూ పలుకుబడులూ‌ కారణంగా జ్ఞానపీఠం యెక్కలేదనుకుంటే, విశ్వంభర అని ఆయనకు తీఠం తెచ్చిన పుస్తకం చాలా చిన్నదే ననుకుంటాను.

  మెచ్చుకోండి

 11. యండమూరి నవల ఆనందోబ్రహ్మ చదివిన వారెవరు అంత సులభంగా అతడిని తీసివేయలేరు.ముఖ్యంగా తాతా,మనవళ్ళ కాలంలోకి వెళ్ళినప్పుడు మనం యేదో ఒక లోకంలోనికి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది.గుండెక్రింద తడి అంటారే అది యండమూరి ప్రతి నవల్లో అంతర్లీనంగా వుంటుంది.ఇక ఆనందో బ్రహ్మ దానికి పరాకాష్ట. అతని యొక్క ప్రతిభని గుర్తించడానికి నిరాకరించేవారే అసూయతో విమర్శిస్తూంటారేమో అని నాకో చిన్న అనుమానం.

  మెచ్చుకోండి

  1. ఆయనకి చాలామంది క్లాసిక్ రచయితలకంటే గొప్ప గా రాయగల సామర్ధ్యం ఉంది. కానీ కమర్షియల్ కారణాల వలన ఆయన పాపులర్ స్టైల్ లో ఆ విషయాల పై రాయాలని తెలిసే నిర్ణయించుకొని, ఆ విధం గా రాశారు. ఈ మధ్య చదివిన ఆయన ఇంటర్వ్యూ లో ఆయనకు తెలుగు భాషపై ఉన్న పరిజ్ఞానం నన్ను ఆశ్చర్య పరిచింది. క్లాసిక్ రచయితలు ఎవరూ చదివింప లేనంత మంది చేత తెలుగు సాహిత్యాన్ని చదివింపగలగటం నిర్ద్వంద్వం గా ఆయన ప్రతిభే.
   ఏ రచయితైనా తన టేస్ట్ ని బట్టి రాస్తాడు. యండమూరి చెప్పేదేమిటంటే నవలల విషయం లో పాపులర్ టేస్ట్ తో తన టేస్ట్ కలుస్తుందని. అదే సినిమా దర్శకత్వం విషయం లో పాపులర్ టేస్ట్ తో తన టేస్ట్ కలవకపోవటం వలన, తాను ఆ విషయం లో సఫలీకృతుణ్ణి కాలేక పోయినట్లు ఆయన చెప్పుకొన్నారు.

   మెచ్చుకోండి

 12. యండమూరి గారు తెలుగువారి ఆలొచనా పటిమను, తెలివితేటలను ఇతర భాషల వారికి పరిచయం చేసిన ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్. కన్నడం లో కూడా ఆయన తెలుగులో ఎంత పాపులర్ అంత పాపులర్. కన్నడం వారపత్రికలు చదివే వారికందరికి ఆయన పేరు సుపరిచితం. ఒకసారి ఇంఫొ సిస్ సుధామూర్తి గారు తెలుగులో యండమూరి నా అభిమాన రచయిత అని చెప్పినట్లు గుర్తు. ఆయన రాసిన వెన్నెలో ఆడపిల్ల నవల బలదింగల బాలే గా కన్నడం లో సినేమా తీశారు. అది 100 రోజులు పైన ఆడింది. కన్నడ వారికి కూడా ఆయన అభిమాన రచయిత. హిందిలో ఆయన రచనలు తర్జుమా అవ్వటమేకాక, వారపత్రికలలో సిరీయల్గా వచ్చాయి.
  అది ఆయన ప్రతిభకి ఒక సామర్థానికి ఒక నిదర్శనం.

  ఆయన ముందు సాహిత్యం రాసిన వారు`ఎక్కువమంది రష్యా ,యురోప్ ఎర్ర సాహిత్యం చదివి, వాటి ప్రభావం లో పడి సాహిత్య సృష్టి చేస్తూండేవారు. కమ్యునిష్ట్ లు ప్రజలలో చొచ్చుకొని పోలేకపోయినా, సాహిత్య రంగంలో మాత్రం బాగాచొచ్చుకొచ్చారు. . సుమారు 30- 40 ఏళ్లుగా రచనలను cEస్తూ ఒక కేరీర్ ను బిల్డ్ అప్ చేసుకొన్నావారు ఇప్పటికీ ఉన్నారు. అటువంటి వారికి ఈయన గారి లిబరల్ అభిప్రాయలనును జీర్ణించుకోలేకపోయేవారు. ఎందుకంటే ఆ లిబరల్ అభిప్రాయలు ఎక్కువగా విచక్షణకి, మధ్య తరగతి హిందూ సంస్కృతి కి దగ్గరగా ఉంటాయి. చదువుకొని కష్టపడి ఉద్యోగం చేయటమో/వ్యాపారం చేయటమో మధ్య తరగతి వారి లక్ష్యం. కమ్యునిష్ట్ లు ఆశయం ఈ మధ్య తరగతి వారిని మొదట సాహిత్యం తో ఆకట్టుకొని, ఆతరువాత ప్రజలను కూడ గట్టి అధికారం సంపాదించవచ్చు అని. అటువంటి విపత్కర పరిస్థితిలో యండమూరి రచనా వ్యాసంగాన్ని విజయవంతంగా కొనసాగించాడు.

  ఇక్కడ ఒక చిన్న విషయం ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. లిబరల్ వ్యుస్ సమర్ధించే వారు ఎక్కువగా బాగా డబ్బులున్న పెట్టుబడి వర్గానికి చెందిన వారు, ప్రభుత్వం లో మంచి పొసిషన్లో ఉన్నవారు, రాజాజి బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటారు. యండమూరి గారు పైన చెప్పిన ఏ కేటగిరిలోకి రాకపోయినా, వాటిని సమర్ధించిన దూరదృష్టి కలిగిన గొప్ప మేధావి. ఆయన ప్రతిభను తక్కువగా అంచనా వేయటం అసమంజసం.

  మెచ్చుకోండి

  1. “లిబరల్ వ్యుస్ సమర్ధించే వారు ఎక్కువగా బాగా డబ్బులున్న పెట్టుబడి వర్గానికి చెందిన వారు, ప్రభుత్వం లో మంచి పొసిషన్లో ఉన్నవారు, రాజాజి బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటారు. యండమూరి గారు పైన చెప్పిన ఏ కేటగిరిలోకి రాకపోయినా, వాటిని సమర్ధించిన దూరదృష్టి కలిగిన…”

   యండమూరి గురించి ఈ విషయం నేను కూడా ఫీలయాను. ఆయన కులం, రిజర్వేషన్లు మొదలైన వాటి గురించి, అనుకూలం గా గానీ ప్రతికూలం గా గానీ crib చేయటం నేను ఎప్పుడూ చూడలేదు.
   ఆయన లిబరల్ వ్యూస్ లో కొన్ని నాకు short sighted అనిపిస్తాయి. ఉదాహరణకు ఓ సారి ఆయన, “మన రైళ్ళ లో బార్లు తెరిస్తే బాగుంటుంది”, అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. ఇలాంటి వాటి లో అనేక లొసుగులు ఉంటాయి.
   ఓ మనిషి వ్యూస్ వేరు, వాస్తవ వ్యక్తిత్వం వేరు. వ్యూస్ కి పెద్దగా విలువనివ్వనవసరం లేదేమో!

   మెచ్చుకోండి

   1. “మన రైళ్ళ లో బార్లు తెరిస్తే బాగుంటుంది”

    అందులో మీకు తప్పుగా కనిపించిందో నాకు తెలియదుగాని, ఎదో ఒక ట్రైన్ లో ఆ సౌలభ్యం ఉందను కొంటాను ( ట్రావేలర్స్ ఆఫ్ వీల్ అని జైపూర్ కి వేళ్ళే ట్రైన్ ). ఈ మధ్య ట్రైన్, ఓల్వ బస్సు లలో ప్రయాణించిన ప్రతి సారి గమనించిందేమిటంటే, సినేమాలో చూపినట్లు చాలా మంది కోక్ బాటి లో మందు పోసుకొని తాగుతూంటారు. అది ఇప్పటికే మొదలైంది. ప్రయాణీకులంతా ఉన్నత తరగతికి చెందినవారే మరి.

    మెచ్చుకోండి

    1. పబ్లిక్ ప్లేసుల్లో తాగటాన్ని సమర్ధిస్తున్నారా? అయితే పబ్లిక్ ప్లేసుల్లో ఇంకా చండాలమైనవి చేయటాన్ని కూడా సమర్ధించాలి. చీన్న చిన్న ఊళ్ళలో ఇప్పటికే వీధికొక బెల్టు షాపు వచ్చి ఆడవాళ్ళు వీధిలోకి వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిష్తితి. ఇక రైళ్ళలో బారులు తెరుస్తే మందుబాబులు ఊరుకొంటారా? తాగి సైలెంట్ గా ఉండేవారు కొందరే ఉంటారు. వీరంగం వేసే వారు మరి కొందరు ఉంటారు.

     మెచ్చుకోండి

 13. నేను మొదటగా చదివింది యండమురి గారి రచనలే.విజయానికి ఐదుమెట్లు, వెల్లొ ఆడపిల్ల, మొ” లైనవి. చాలా గొప్పగా అనిపించాడు. అప్పటికింకా చలం,గారు, రంగనాయకమ్మ గారు లాంటివారు తెలియదు. ఆయన రచనలు చాలావరకు చినిమా స్టైల్లొ వుంటాయి. వెనెల్లొ ఆడపిల్ల లొ ఇద్దరు పురుషులు ఒక స్త్రీ బ్ర సైజు ఎలా తెలుసుకొవాలొ పందెం కట్టుకుంటారు. తులసిదళం నవల ఆయనకు చాలా పేరు తెచ్చింది. చేతబడి, బూతాలూ, దెయ్యాలు అంటూ చెత్తంతా రాశాడు.ఒక్కమాటలొ చెప్పాలంటె చిల్లర కొసం ఆయన ఎలాంటి చెత్తనైనా రాయడానికి సిద్దం.అంతటి గొప్ప మహాను బావుడికి అవార్డ్ రావాలని కొరుకుందాం. పాలకవర్గం కుడా అలాంటి వాళ్ళకు ఎప్పుడూ ఆసరాగా వుంటుంది.

  మెచ్చుకోండి

  1. చలం, రావిశాస్త్రి, రంగనాయకమ్మ, వంటి వారికి కూడా అవార్డులు రావచ్చు. కానీ ఎప్పుడు వస్తాయంటే వారి రచనలు రేపిన అలజడి సద్దుమణిగి, సమాజం (పాలక వర్గాలతో సహా) వారి విలువలను కొంచెం సహించే స్థితి వచ్చినపుడు (చాలా కాలం తరువాత, వారి జ్ఞాపకాలు దూరమైనాక వారిని సహించటం తేలిక) వారికి కూడా అవార్డులు ఇచ్చి వారిని కూడా establishment లో కలిపేసుకొంటారు. ఆ కలిపివేతకు ఆ రచయితల వారసులు (కొడుకులూ, మనవరాళ్ళూ) సంతోషం గా సహకరిస్తారు (డబ్బుకోసం కావచ్చు, అసలు రచయితల విలువల పై ఈ వారసులకి పెద్ద గౌరవం లేక కావచ్చు.) . ఓ యాభై సంవత్సరాల తరువాత ఏ దిగంబర కవుల మునిమనవడో పాలకో వర్గం లో కీలక స్థానం లో ఉన్నాడనుకొందాం, అప్పుడు పాలక వర్గాలకు, దిగంబర కవులకి ఓ పెద్ద అవార్డ్ ఇవ్వటం లో పెద్ద వ్యతిరేకత ఉండక పోవచ్చు.

   మెచ్చుకోండి

  2. నాకు అర్ధ కాని ఇంకో విషయం, … ఎవరో ఓ రచయిత అభ్యుదయమంటూ సమాజం లోని కుళ్ళు ను బయటపెడుతూ (ఆ కుళ్ళు లో ఉంటూనే!) ఓ రచనా రాజం వెలువరిస్తాడు. ఆ కుళ్ళు కు పతాక స్థానం అయిన పాలక వర్గం ఆ రచయిత కు ఓ అవార్డ్ పడ వేస్తుంది. ఆ సదరు రచయిత సంతోషం గా ఆ అవార్డును స్వీకరిస్తాడు. ఆ స్వీకరించటం వలన ఆ కుళ్ళులో తాను కూడా ఓ భాగం అయాననే స్పృహ రచయిత కి ఉంటుందో, ఉండదో! ఉన్నా రాజీ పడిపోయాడో! ఆయన దేని గురించి రాశారో ఆ కుళ్ళులో భాగమైన పత్రికలు ఆ వ్యక్తిని మోసేస్తూ ఆర్టికల్స్ రాస్తాయి. ..ఏమిటొ ఈ మాయ.. ! చాలా మంది మాజీ విప్లవ రచయితల, అచ్యుదయ రచయితల విషయం లో జరిగింది ఇదే. పైగా డబ్బులు అవసరమై అవార్డ్ తీసుకొన్నామనే బుకాయింపు ఒకటి. డబ్బు కోసం మేధావులైన వారు సిధ్ధాంత పట్టుదలలను పక్కన పెడితే, ఇక సామాన్యుల మాట ఏమిటి?

   మెచ్చుకోండి

  3. పాలక వర్గాలకి రచయితల మీద కక్ష చాలా రోజులు ఉండదు. అదేకాకుండా పాలక వర్గం ఎప్పుడు అందరితో మంచిగ ఉండటానికి ప్రయత్నిస్తుందే కాని శత్రువులను సృష్టించుకోవటానికి ప్రయత్నించదు. సదరు ఎర్ర రచయితలు వాళ్లని ఎక్కువగా ఊహించుకొని పాలక వర్గాన్ని ఆగర్భ శత్రువులు గా భావిస్తారు. తిట్టిపోస్తూంటారు. వాళ్ళు ఇచ్చిన గుర్తింపును తిరస్కరిస్తూ నిజాయితి పరులమని చంకలు గుద్దుకొంటారు.

   భారత పాలక వర్గాల వారు ఎంతో ఉత్తములు. కమ్యునిస్ట్ పార్టీ సిద్దాంతం లో విసృతి లేదు అని వారికి బాగా తెలిసి, దానిని పక్కన పెట్టారు. సిద్దాంతం తో అభిప్రాయ భేదాలు ఉన్నా, వ్యక్తిగతం గా కమ్యునిస్ట్లులపైన సధభిప్రాయం ఉన్న వాళ్ళు. నంబుద్రి ప్రసాద్ చనిపొతే అద్వాని అదే పని గా డిల్లి నుంచి కేరళకు పోయి చూసొచ్చాడు. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో మెచ్చుకొన్నాడు. అలాగే కాంగ్రెస్ పార్టి వారికి కూడా కమ్యునిస్ట్లు పైన తీవ్ర వ్యతిరేకత, వాళ్ళని ఎలాగైనా నాశనం చేయలనే ఉద్దేశం లేదు. వై యస్ రాజశేఖర్ రెడ్డి చిన్నపుడు కమ్యునిస్ట్ పార్టి కి చెందిన వ్యక్తి ఇంట్లో పెరిగానని చెప్పుకొన్నాడు. యర్రం నాయ్డు కి ఇంద్రజిత్ గుప్తా అంటే ఎంతో గౌరవం. ఇంతకూ చెప్పోచేదేమిటంటే సిద్దాంతం పడకపోవచ్చేమో గాని ఆ పార్టికిచెందిన వ్యక్తుల ప్రభావం మిగతా అన్ని పార్టిల పైన ఉన్నాది. అలాగే వారిని ఎవరు వ్యక్తిగతం గా అవమానించ లేదు. రచయితలే పేపర్లలో చాలెంజ్ చేసుకొంట్టుంటారు.

   ఒక్కపుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో కమ్యునిస్ట్ పార్టి ఉచ్చ స్థితిలో ఉండేది. ఇప్పుడు కనీసం ఆపార్టి బోర్డ్ కూడా ఎక్కడా ఆదేశాలలో ఉన్నట్టు లేదు.

   మెచ్చుకోండి

   1. 1.పాలక వర్గమైనా, విప్లవ వర్గమైనా తమ మనుగడ కి తమ ప్రత్యర్ధులు అడ్డుపడతారనే insecurity ఉన్నంత వరకూ ప్రత్యర్ధులను దరికి రానీయరు. తమ మనుగడ కి ఢోకా లేనపుడు చూసీ చూడనట్లు పోతారు. అవతలి వారి వ్యక్తిగత సద్గుణాలను గుర్తిస్తారు. నంబూదిరి ఒక మావోయిస్టు నాయకుడై, అతని హిట్ లిస్టు లో అద్వానీ ఉన్నట్లైతే, నంబూదిరి మరణం తరువాత అద్వానీ చూడటానికి వెళ్ళేవాడా? అద్వానీ హోమ్మినిస్టర్ గా ఉన్నపుడు ప్రమాదకరమైన మావోయిస్టుల encounters జరగలేదా?
    2. మార్క్సిస్ట్ సిధ్ధాంతాన్ని నమ్మిన వారికి ఆ సిధ్ధాంతం violate అయిన సందర్భాలలో తమ నిబధ్ధతని నిరూపించుకోవాల్సివస్తుంది. అందుకనే అవార్డుల తిరస్కరణ వగైరాలు. ఏ సిధ్ధాంతమూ నమ్మని వారు ఎవరినైనా కౌగలించుకోవటానికి రెడీ.

    మెచ్చుకోండి

    1. మీరేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం పెద్ద పనిగాదు. కాని ముందర మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకు స్వాతంత్రానంతరం పాకిస్తాన్,బంగ్లాదేశ్ లలో కమ్యునిస్ట్టు పార్టి ల పరిస్థితి క్షీణించింది. నిజం చెప్పాలి అంటే ఈ మధ్య ఆదేశం లో కమ్యునిస్ట్ పార్టి పేరు ఎక్కడా వినలేదు. ఆ దేశాలలో పార్టి పరిస్థితి అలా ఉంటే మార్క్సిస్ట్లు ఎప్పుడైనా వాటిని చర్చించి, కారణాలు తెలుసుకొన్నారా? ప్రతి మతం లో ను అంతో ఇంతో చాదసవాదం ఉంట్టుంది. రంగనాయక్కమ్మ గారు రామయణ విషవృక్షం రాసినట్లు, ఎవరైనా భారతీయ మార్క్సిస్ట్లు ఇతరమతాల లో ని చాదస వాదం పైన క్రిటికల్ అనలిసిస్ చేస్తూ పుస్తకాలు రాశారా? ఇవ్వన్ని ఎందుకడుగుతున్నాను అంటే 65సం|| వెన్నక్కి వేళితే మన మూడుదేశాలు ఒకటిగానే ఉండేవి కదా. అప్పట్లో కమ్యునిస్ట్ పార్టి ఇండియా అంటే అది పాక్ బంగలా లను కలుపు కొని అని మనం చూడాలి.

     మెచ్చుకోండి

     1. “ఒక్కపుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో కమ్యునిస్ట్ పార్టి ఉచ్చ స్థితిలో ఉండేది. ఇప్పుడు కనీసం ఆపార్టి బోర్డ్ కూడా ఎక్కడా ఆదేశాలలో ఉన్నట్టు లేదు.”

      బోర్డేం ఖర్మ సైట్లే ఉన్నాయి. కామెంటే ముందు కొంచెం గూగులమ్మ ను అడిగితే సరిపోయేది.
      http://cpbbd.org/
      http://www.cpp.net.pk/
      ఇవే సైట్ల లో ఇచ్చిన సమాచారం ప్రకారం, బంగ్లాదేశ్ లో మిలిటరీ పాలకులూ, పాకిస్తాన్ లో మిలిటరీ మరియూ మత పాలకులూ కమ్యూనిస్టులని అణగదొక్కాలని చూశారు. ఇండియా లో ముందునుంచీ ఉన్న ప్రజాస్వామిక సంస్కృతి వలనా, కొంత హిందూ మతం లో ఉన్న సహనం వలనా ఇక్కడ అణచివేత అంతగా లేకపోవచ్చు.
      ఇంతకీ మీరు ఏమంటారు? మనం కూడా కమ్యూనిస్టులను వాళ్ళ లా అణగదొక్కాలంటారా?

      మెచ్చుకోండి

      1. సీతారాం గారు,
       బంగ్లదేశ్, పాకిస్తాన్ గురించి మీకు ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. అందువలన మిమ్మల్ని అడిగాను. పాకిస్తాన్ పుట్టుక, చరిత్ర కూలం కషంగా వారి వర్షన్ తెలుసుకోవటానికి, పాకిస్తాన్ వాళ్ళు రాసిన అథెంటిక్ పుస్తకాలు అమేరికా నుంచి తెపించుకొని చదివాను. అంతే కాక పాకిస్తాన్ పేపర్లు డాన్, టి వి లో వచ్చే అన్ని ప్రముఖ టాక్ షోలు చూస్తాను. అక్కడి టివిలో కమ్యునిస్ట్ పార్టి గురించి ప్రస్థావన మాట మాత్రం ఒక్కసారిగా కూడా వినలేదు. అక్కడి రాజకీయాల పైన కమ్యునిస్ట్లు ల ప్రభావం కనీస స్థాయి లో ఉందను కొను. కాని కొంతమంది వ్యక్తులు నేను చదివిన పుస్తకాల రచయితలు చిన్నపుడు మార్క్సిస్ట్ లమని చెప్పుకొన్నారు.

       *కొంత హిందూ మతం లో ఉన్న సహనం వలనా ఇక్కడ అణచివేత అంతగా లేకపోవచ్చు*

       కమ్యునిస్ట్ లను చూసి యురోప్ దేశాల వారిలాగా, హిందువులు భయపడవలసిన అవసరమే లేకపోయింది. కారణం హిందుమతంలోని ఫ్రీ థింకింగ్/హిందూ మైండ్ కమ్యునిస్ట్ వాదనలోని పరిధి మీద అవగాహన ఉండటం వలన ఆపార్టికి పూర్తి స్వేచ్చనిస్తే ,అది ఎంతవరకు తన స్వశక్తి తో ఎదగ గలదో, అంతవరకు ఎదిగి ఆగి పోతుందని స్పష్టంగా తెలుసు. ఇంకా చెప్పాలి అంటే ఆ సిద్దాంతం కొంతకాలం గ్రామీణ, జిల్లా మహా ఎక్కువైతే కొన్ని రాష్ట్రలను ప్రభావితం చేయగలదేమో గాని అది దేశవ్యాప్తం గా కేంద్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని చేపట్టలేదని మనదేశ ప్రముఖ మేధావుల అందరికి తెలుసు. ఆ పార్టిని ఎవరు అణచివేయాలని ప్రయత్నించలేదు. వారిలో వారే వాదులాడుకొని అతివాదులు మితవాదులు గా చీలి కొందరు అడవులలో కి పోయారు.

       మెచ్చుకోండి

    2. “నంబూదిరి ఒక మావోయిస్టు నాయకుడై అద్వానీ చూడటానికి వెళ్ళేవాడా?”

     అద్వాని ప్రజస్వామ్య వ్యవస్థ పైన నమ్మకమ్మున్న వ్యక్తి. అవతలి వారికి దానిపైన నమ్మకమేలేదు, పైగా ఆ వ్యవస్థను తొలగించి గొట్టంద్వారా అధికారం లోకి రావలని విశ్వసించేవారు. ఒకవేళ అద్వాని వెళ్లి చూడటానికి అభ్యంతరం లేకపోయినా ప్రజాస్వామ్య వ్యవస్థకు కొమ్ముకాచే ప్రజలకి,ప్రభుత్వ సిబ్బందికి, తప్పక అభ్యంతరం ఉంట్టుంది. చట్టపరంగా కూడా వీలు పడకపోవచ్చు కూడాను. రాజీవ్ గాంధి హంతకులను మేము క్షమించి వేశాం, వారిని శిక్షించ వద్దు అని కుటుంబ సభ్యులు చెప్పినా, సుబ్రమణ్య స్వామి భారత ప్రభుత్వం తీవ్రవాదులు గా ప్రకటించిన వారిని ఎలా క్షమిస్తారు అని అభ్యంతరం లేవనెత్తి, వాళ్ల విడుదలను అడ్డుకొన్నాడు. అలాగే గాంధి గాడ్సేని వదిలేయమని చెప్పినా, శాంతికాముక (పావురాలను గాలిలో వదిలే విగ్రహంలో కనిపించే)నెహ్రు గారి ప్రభుత్వం క్షమించి వదిలేశిందా? చట్ట ప్రకారం గడ్సే గారికి ఏ శిక్ష పడాలో దాని అమలుజరిపి ఉరితీశారు. ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉంది అంటే అతను పోషించే రాజకీయ నాయకుడి పాత్ర, చట్టానికి లోబడి ఉండాలి. మీరు అద్వాని వరకు వెళ్ళారు కె యస్ చనిపోతే, ఆయన పార్టివాళ్లెవ్వరు కనీసం చూడటానికి ఎందుకు పోలేదు? దాని గురించి ఆలోచించారా ? మీరు ఈ ఇంటర్ వ్యూ ను చూడండి.?

     Hmtv with Kondapalli Koteswaramma _ Antharangam
     యు జి మాటలలో చెప్పాలి అంటే, మీ ఈ ప్రశ్నలో స్కూల్ బాయ్ లాజిక్ ఉంది.

     మెచ్చుకోండి

     1. కమ్యునిస్ట్ లు వారి సిద్దాంతం(ఆలోచన)కు ప్రత్యామ్న్యాయం గా ప్రతిపాదిస్తే, వారిని అనుమానించి అడ్డుతొలగించేవారు. ఆపని చేసి, ప్రపంచానికి కమ్యునిస్ట్ సిద్దాంత ఆచరణ వాస్తవానికి చాలా దగ్గర ఉన్నట్లు నమ్మించారు. ఈ క్రింది పేరాను చదవండి. ఒక వ్యక్తి ఆలోచనను/వాస్తవాన్ని వాళ్లు ఎలా పాశవికం గా ఎదుర్కొన్నారో అర్థమౌతుంది. ఆ వ్యవస్థను ఇలా బలవంతంగా నడిపి, ప్రపంచాన్ని మోసం చేశారు.
      “Karl Marx, who saw in the peasant both a capitalist because he owned a small piece of land and also a proletariat as he was his own wage worker, believed that the larger farmers would, in course of time, swallow the small peasants. [See Alexander Chayanov on the Theory of Peasant Economy. The University of Wisconsin Press]. In the 1920s, when the communist revolution shook Russia, a courageous intellectual — Alexander Chayanov — stood up against Marx and asserted that the small farmer would survive capitalism and, by implication, communism too. He postulated that peasant economy ought to be treated in its own right as a [non-capitalist] system of national economy, not as capitalist business enterprise. Asserting that peasant family farms were more competitive than large-scale farms, Chayanov said that family economy was distinct from the socialist economy and it should have its own theory. This logic defied the Marx-Lenin prescriptions and that was adequate to arrest and dump Chayanov in concentration camp in the 1930s. He was released but later arrested on October 3, 1937, tried and shot on the same day for contending that the small farmer was not a capitalist.”

      గ్లోబలైసేషన్ మొదలైన 20సం|| అవుతున్నా, మన దేశంలో రైతుల పరిస్థితి ఎంత బాగలేదని పేపర్లో వార్తలు వస్తున్నా, గ్రౌండ్ రియాలిటి ఎమిటంటే సన్నకారు రైతుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. ఇంకా పెరుగుతూనే ఉంది.

      మెచ్చుకోండి

 14. చిత్రమైన వాదన చేస్తున్నారు. పాలక వర్గం ఎలాంటిది అయినా కావఛ్చు , రచయిత ను గుర్తించడం లో ఇంకాస్త మెరుగ్గా ఉండాలనుకోవాలి కాని ఇస్తున్న గుర్తింపును కూడా వద్దనడం సరియైనదేనా? అవార్డ్ స్వీకరించినంత మాత్రాన కుళ్ళు అని మీరనే దానిలో భాగం అవుతారా ?

  ఇదే సమాధానం మీరు పత్రికలపై లేవనెత్తిన ప్రశ్నకూ వర్తిస్తుంది. మేధావులంతా సిద్దంతాలకోసం డబ్బు ప్రక్కన పెడతారు , కాని ఎప్పుడు ? వారికీ హద్దులు ఉంటాయి . ప్రతి ఒక్కరూ బాలగోపాల్ గారిలా చావుకి ఎదురు వెళ్ళరు . వెళ్తే మాత్రం ఎంతమందికి లెక్క?

  ఏది ఏమయినా మీ సంఘర్షణ మాకో రెండు మూడు మంచి టపాలు వ్రాయిస్తే చాలు.

  మెచ్చుకోండి

  1. అనేక ఋషులున్న ఓ ఆశ్రమం లో, ఓ ఋషి తపస్సుచేస్తున్నాడనుకొందాం (ఆయన అ తపస్సు ని దొంగలని అంతం చేయాలనే ఆశయం చేస్తున్నాడనుకొందాం).అతనికి ఓ అడవి దొంగ అంతకు ముందే తెలుసు. రుషి ఆశ్రమం లోని కృష్ణాజినాలమీద కన్నేసిన ఆ అడవి దొంగ వచ్చి ఋషి తపస్సుని పొగుడుతున్నాడనుకొందాం. ఋషి దొంగ పొగడ్తకి సంతోషించాలా? లేక దొంగ మాటల ని సందేహించి అవకాశం వచ్చినపుడు ఏదో దొంగిలించటానికే దొంగ అలా మాట్లాడుతున్నాడనుకోవాలా?

   దొంగ మాటలు మోసమని తెలిసీ, ఋషి దొంగ పొగడ్తలకి లొంగిపోయి దొంగని లోపలికి రానిచ్చినట్లయితే తరువాత జింక చర్మాలు మాయమవుతాయి. ఇతర ఋషుల తపస్సుపట్ల ఈ ఋషికి ఉన్న నిబధ్ధత ఏమిటి? ఈ ఋషి తెలిసి తెలిసీ దొంగకి సహకరించినట్లు కాదా? దొంగకి సహకరించినవాడిది మంచి బుధ్ధా?దొంగ సరిగా పొగడలేదు, మరింత గాఠిగా పొగడాలనుకోవాలా?ఇంతకీ, దొంగలను అంతం చేయలనే ఆశయానికీ, తపస్సుకీ ఏమైనట్లు?

   మెచ్చుకోండి

   1. 🙂 ఇది కాకుండా ఇంకో ఉదాహరణ ఇవ్వండి . ఋషి , తపస్సు , ఆయనికి అన్నీ తెలిసిపోవడం ఇయ్యన్నీ నా ఊహకి అందవు .

    ఏదో ట్రై చేద్దామన్నా , ఒక్క అంతర్ముఖం, ఇంకోటి వ్రాస్తే మిగిలిన అన్ని కమర్షియల్ రచనల వల్ల జరిగిన నష్టం పూడుతుందా , జ్ఞాన పీట వెయ్యాలా ?

    కృష్ణాజినాల ను కొట్టేస్తాడు అని అనుమానంతో ముందే వ్యక్తిని రానివ్వకపోవడం అంటే ఎవ్వరూ రాకపోతేనే అవి భద్రంగా ఉంటాయన్న మాట . అయినా కృష్ణాజినాలు ఎందుకండీ ఋషులకి ? ఖరీదైనవి పెట్టుకొని జనాలను అబద్దాలకు, దొంగతనాలకి పురికొల్పుతున్నది ఎవరు ?

    నా మొదటి సమాధానం ఇదేనండీ , ప్రభుత్వం లో తప్పులుంటే వాటిని విమర్శించాలి, పోరాడాలి కాని , తప్పులున్నాయి కాబట్టి పనులేమి చెయ్యడానికి వీల్లేదు అనడం అంగీకరించను. మహా అయితే వాటికి విలువ తగ్గుతుంది. మొదట బాధపడాల్సింది ప్రబుత్వం విలువ గురించి. అవార్డుల విలువ సంగతి అంత ముఖ్యం కాదు మీరు చెప్పిన పరిస్థితిలో .

    మీ వ్యాఖ్యానంకి నాకు తోచిన వాదన చెప్పాను.

    మెచ్చుకోండి

    1. మీకు ప్రభుత్వాలగురించి ఇంకా కొంత పాజిటివ్ అభిప్రాయం ఉన్నట్లుంది. నాకు అంత పాజిటివ్ అభిప్రాయం లేదు.ప్రభ్త్వన్ అంటే నాకు గుర్తొచ్చేది డబ్బు, అధికారం, ఆదర్శాలను అడ్డుపెత్తుకొని ప్రజల పేరు తో పొందే అధికారం.
     అక్కడ నేనున్నా చేయగలిగింది ఏమీ లేదు. చెప్పటం సులువు చేయటం కష్టం.

     “తప్పులున్నాయి కాబట్టి పనులేమి చెయ్యడానికి వీల్లేదు అనడం అంగీకరించను. మహా అయితే వాటికి విలువ తగ్గుతుంది.”
     యండమూరి విషయం లో కూడా మీ పై వాదన వరిస్తుందని మీకు అనిపించలేదా? anyways యండమూరి కి జ్ఞాన పీఠ అని నేఅన్నది సరదాకే! కాకపోతే శివరామ ప్రసాద్ గారి బాలు లాజిక్ ప్రకారం, యండమూరికి అవార్డ్ వచ్చినా నేను పెద్ద గా ఆశ్చర్య పోను. గారంటీ గా యండమూరి talent ఉన్న రచయిత అని నమ్ముతాను.

     మెచ్చుకోండి

     1. యండమూరికి కూడా వర్తిస్తుందనే నేను కూడా చెప్తుంటా. యండమూరికి అవార్డు వస్తే కూడా ప్రభుత్వాన్ని నేను పెద్దగా విమర్సించను . ఇప్పటివరకు ఏదో ఒక అవార్డు వచ్చిన వాళ్ళందరికీ కూడా అభిమానులు ఉన్నారు. సో ఈయన ఒక్కడినీ వ్యతిరేకించేది లేదు. కాని పోల్చవలసి వస్తే నా అభిప్రాయం ఇదీ అని చెప్పడం తప్పు కాదు అలానే చెప్పడం లో ప్రభుత్వానికి నేను అనుకూలమో వ్యతిరేకమో అవ్వాల్సిన పని లేదు .

      నిజమే నేను ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాన్ని పెద్దగా వ్యతిరేకించను , ప్రజలెందుకు ఎన్నుకున్నారో అర్ధం చేసికోవడానికి ప్రయత్నిస్తాను . అందరు ఇలానే చెయ్యాలని చెప్పను . ఎవరిష్టం వారిదే.

      పొతే మీ అసలు వాదన గురించి ,

      నా పై వ్యాఖ్య లో కాస్త కమ్యునిస్టు వాసనలు ఉన్నాయేమో అని అనుమానం అయితే ఉంది , అలాగే ప్రభుత్వం గురించి మీరు చెప్తున్నది కూడా ఇలానే ఉంది 🙂

      మెచ్చుకోండి

      1. మీకు కమ్యూనిజం తెలుసా? మీ సైట్లో అదివరకు కమ్యూనిస్టులను ఏవో ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం ఇద్దామనుకొన్నాఉ (నేను కమ్యూనిస్టును కాకపోయినా..).
       నేనూ లోకం యొక్క విశ్లేషణ లో కమ్యూనిజం స్టాండ్ సరైనదే అనుకొంటున్నాను.చాలా మంది ఈస్టాండ్ ను పూర్తి గా అర్ధం చేసుకోకుండా కమ్యూనిజం గురించిన అపోహలతో వాదిస్తుంటారు. ఓ ఆదర్శం గా కూడా మంచిదే. కానీ, “ఆ ఆదర్శం అనే స్థలానికి ప్రస్తుతం మనం ఉంటున్న చోటి నుంచీ ఎలా చేరాలి?”, అనే విషయం లో కమ్యూనిజం ఫెయిల్ అయింది అనుకొంటున్నాను. వాళ్ళ దగ్గర alternative కూడా ఇప్పటిదాకా ఉన్నట్లు లేదు.
       న నమ్మకం ఏమిటంటే వాళ్ళు చెప్పిన ఆదర్శ రాజ్యం కొన్ని వందల లేక వేల యేళ్ళ కి evolve అబుతుంది. అమెరికా, ఉత్తర ఐరోపా దేశాలు ఈ దిశ లో మనకంటే కొంచెం ముందు గా అడుగులు వేస్తున్నాయి.

       మెచ్చుకోండి

  1. లేదండీ నాకు కమ్యునిజం తెలీదు. కాని వ్యక్తుల జెనరల్ సమస్యలకి సమాజానికి ఉన్న సంబంధం అర్ధం అవుతుంది చాలావరకు . వాటినే నా ప్రశ్నల్లో పెట్టాను. కమ్యునిష్టులు కూడా మీరిక్కడ అన్నట్లుగానే ప్రభుత్వాన్ని ఆ వ్యవస్థ ని తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకిస్తారు కదా 🙂

   నా టపా ని బాగా గుర్తుంచుకొన్నారు, మీరు చెప్పగానే నేనేం వ్రాసానబ్బా అనుకున్నాను . మీకు వీలయితే సమాధానాలు ఇవ్వండి

   అవకాస వాదులను పక్కన పెడితే , ఎక్కువ మంది కమ్యూనిజాన్ని వ్యతిరేకించేది వ్యక్తిగత ఆస్తులపై దాడి జరుగుతుంది కాబట్టి అని అనుకుంటున్నాను . ఇందులో స్వార్ధ పరులొక్కరె బలి అవ్వరు .

   లోకం యొక్క విశ్లేషణ లో కమ్యూనిజం స్టాండ్ సరైనదే , సందేహం లేదు కాని యధాతధంగా సామాన్యులకు అర్ధం కాదు లేదా అంట తీరికలేదు.

   @ “ఆ ఆదర్శం అనే స్థలానికి ప్రస్తుతం మనం ఉంటున్న చోటి నుంచీ ఎలా చేరాలి?”, అనే విషయం లో కమ్యూనిజం ఫెయిల్ అయింది అనుకొంటున్నాను.@

   ఫెయిల్యూర్ కమ్యునిజం దా , వ్యక్తులదా అంటే అసలు ప్రయత్నించిన వ్యక్తులు మాత్రం ఎంతమంది? ఆ కొద్ది మంది చైతన్యం తో ఇంతమంది క్షేమాన్ని సాధించడం కష్టం . అలాగని అంత పెద్ద జనాభాలో చైతన్యం తీసికొని రావడం సామాన్యమైన విషయం కాదు . ఇక్కడే కమ్యునిజం లో ఖాళీలు ఉండి, కొంతమందిని నిరుత్సాహ పరచి కాస్త సాధించాదగ్గ గోల్స్ కి మాత్రం పరిమితం చేసాయి.

   విస్తృతమైన చర్చలు జరగాలి .

   మెచ్చుకోండి

   1. “ఫెయిల్యూర్ కమ్యునిజం దా , వ్యక్తులదా అంటే..” ఆచరణ సాధ్యం కాని వ్యవస్థ ఉంటే, అలా ఆచరించలేకపోవటం ఆ వ్యవస్థ లోపమే. ఉన్నత విలువల యుటోపియాదేముంది, ఊహించుకోవటం చాలా సులువు.ఓ పుస్తకం మీద రాసిపడేస్తే పడి ఉంటుంది. మనం ప్రస్థుతమున్న పరిస్థితులను అన్నిటినీ పరిగణనలోకి తీకొని (మన లోపాలనూ పరిమితులనూ, practicality నీ SWOT అనాలిసిస్ చేసి), గమ్యానికి చేర్చగలిగేదే విజయవంతమైన ఆదర్శం. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు చాలా వరకూ సమాజం లో ఇది ఉంది. ఇది ఒక విజయవంతమైన అదర్శ వ్యవస్థ కిందే లెక్క. బహుశా ప్రకృతీ, మనిషి నైజమూ సహకరించబట్టే కుటుమ వ్యవస్థ, ఆదర్శం స్థాయి నుంచీ, practical గా వాస్తవం అయింది.
    ఓ భవనం కట్టేటపుడు ముందు పిల్లర్ ల తో ఓ సూపర్-స్ట్రక్చర్ తయారు చేస్తారు. ఇది ఓ ఫ్రేంవర్క్..దీని మధ్య లో ఇటుకలని పెట్టి గోడ కడతారు.
    మన సమాజం కూడా ఓ భవనం లాంటిదే. అయితే ఇక్కడ ఫ్రేంవర్క్ లో పిల్లర్లు ఉండవు. అన్నీ ఇటుకలే (వ్యక్తులే) ఉంటాయి. ఫ్రేంవర్కనేది సమాజ వ్యవస్థా విలువలూ అనుకొంటే, ఫ్రేంవర్క్, భవనం లో పిల్లర్స్ తో ఉన్నట్లు గా సమాజపు ఫ్రేంవర్క్ (విలువలూ, నీతీ) వ్యక్తి కి బయట ఉండదు. ఈ సమాజపు విలువలూ గట్రా వ్యక్తుల మెదళ్ళలోనే/మనసులలోనే ఉంటాయి.ఇటుకలులేకుండానే పిల్లర్స్/ఫ్రేంవర్క్స్ ఉన్నట్లు, వ్యక్తులు లేకుండానే సామాజిక వ్యవస్థలు మాత్రం ఉండవు.వ్యక్తుల చర్యల ద్వారానే ప్రభుత్వ, సమాజ వ్యవస్థలు (ఫ్రేంవర్క్స్) ఏర్పడతాయి. రష్యాలాంటి చోట్ల ఎవరో పరిపక్వమైన విలువలు ఉన్న కొంతమంది, మెచ్యూర్ కాని అనేక మంది భౌతిక సాయం తో ఒక ఫ్రేంవర్క్ ని ఏర్పరిచారు. ఆఫ్రేంవర్క్ కొందరు ఉన్నత వ్యక్తుల మనసుల్లోనే ఉంది. సామాన్యజనాల మనసులు ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. ఆఫ్రేంవర్క్ తన ప్రభావాన్ని చూపి వ్యక్తులను అందరినీ మెచ్యూర్ గా మారుస్తుందనుకొన్నారు. కానీ వ్యక్తుల వ్యక్తిత్వం లో ఓ పరిమితమైన భాగాన్నే ఈ ఫ్రేంవర్క్ ప్రభావితం చేయగలదు. అలా కాకుండా వ్యక్తులే ముందు మెచ్యూరిటీ సాధిస్తే, తరువాత ఈ ఫ్రేంవర్క్ ఆటోమేటిక్ గా దృఢం గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్రేంవర్క్ మనిషి మనసులోనే ఉంది. బయటలేదు. మనుషులందరూ చనిపోతే విలువలూ, కట్టుబాట్లూ ఎక్కడ ఉంటాయి. బిఉల్డింగ్లో ఇటుకలన్నీ లేకపోయినా పిల్లర్స్ గట్రా ఉంటాయి. మనుషుల విషయం లో అలా కాదు. కాబట్టీ మెజారిటీ వ్యక్తులు పరిపక్వత సధించే వరకూ ఉన్నతమైన ఫ్రేంవర్క్ లు నిలబడవు. ఈ పరిపక్వత నెమ్మదిగా పరిణామంద్వారా వస్తుంది, అని నా విశ్వాసం.

    వ్యక్తిగత స్థాయి లో మనుషులు శీఘ్రం గా పరిపక్వం అవ్వాలంటే విద్యా, నాయ్తకత్వమూ బాగుండాలి.సరైన విద్య మనిషి దీర్ఘకాలిక మనుగడ కి అనువైన విలువలను నేర్పితే, సరైన నాయకత్వం, తన విద్యాభ్యాసం ముగించుకొని సమాజం లో అడుగిడిన వ్యక్తికి, కాలేజీ లో నేర్చిన ఉన్నత విలువల కు రివార్డ్ ఉండే సమాజ వ్యవస్థ ను అందిస్తుంది. మనుషులలో మెచ్యూరిటీ వచ్చిన తరువాత ఏ వ్యవస్థ అయినా పర్లేదు. బాగానే పని చేస్తుంది. ఆ పరిపక్వత రానప్పుడు మాత్రం ఏ దేశం లో ఉన్న వ్యవస్థ అ దేశానికి సరైనది.
    సో, ఈ సిధ్ధాంతాలూ వగైరా, ముందు మనిషి లో మెచ్యూరిటీ తీసుకొని రావటం ఎలా అనే విషయాన్ని లక్ష్యం గా పెట్టుకొంటే బాగుంటుంది.
    ఏదో నా పైత్యం రాశాను. పాకుడురాళ్ళ తో మొదలుపట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను. కానీ నాకు ఇందులో పెద్ద తప్పు కనపడదు. ఎందుకంటే, లోకం లో అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి దేనినీ సపరేట్ గా చూడలేము.

    మెచ్చుకోండి

 15. @వ్యక్తులే ముందు మెచ్యూరిటీ సాధిస్తే, తరువాత ఈ ఫ్రేంవర్క్ ఆటోమేటిక్ గా దృఢం గా ఉంటుంది

  ఎగ్జాట్లీ, మీరన్నట్లు ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని వందల సంవత్సరాల్లో వందశాతం కి దగ్గరగా విద్యా స్థాయికి చేరే సమయంలో ఈ మార్పులు అసాధ్యం కాకపోవచ్చు

  ఇక్కడి ప్రజల్లో ఇప్పటికే వ్యక్తిగత ఆస్తులపై తక్కువ ఆసక్తిని గమనిస్తున్నాను . అంటే ఇల్లు కొనుక్కోవాలని తొందరపదకపోవడం లాంటివి .

  ప్రభుత్వం విద్య వైద్య గృహ సదుపాయాలు ఉచితంగా అందించే స్థితిలో ఉండడం ఒక కారణం కావచ్చు . కాని అదే సమయం లో సోమరిగా అన్నీ అనుభవిస్తున్న వారి పై పరిమితులు కూడా నెమ్మదిగా చోటు చేసుకొంటున్నాయి . ఒక విధంగా రెండు వైపులా నుండీ స్లో గా ఎవాల్వ్ అవుతున్నాయి

  ప్రతిదీ పాశ్చాత్యులను అనుకరించే మనం పోను పోను ఇవి కూడా ఫాలో అవుతావేమో !

  ప్రభుత్వం ప్రకటిస్తున్న కొద్ది పధకాలు నాకు ఇవే నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని వర్గాలకే ఇస్తున్న ఈ పధకాలను నెమ్మది మిగిలిన వర్గాలకి విస్తరిస్తూ పోవాలి. అప్పుడే వ్యక్తులకి ఆలోచించుకోవడానికి, తమని సంస్కరించుకోవదానికీ సమయం దొరుకుతుందని నా అభిప్రాయం . కాబట్టి కమ్యునిష్టులకి విరుద్దంగా నేను ఉచితాలన్నీ ఆహ్వానిస్తున్నా . ఆహ్వానిస్తున్నా .
  అలాగే మనదేశం లో లా ఇక్కడి వాళ్లకి ప్రత్యెక రిజర్వేషన్స్ ఉండవ్ అనుకుంటాను . కారణం విదికితే సంక్షేమ పధకాలు బీభత్సంగా ఉండగా వీళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదు . అలాగే లేని వారు అందరికీ తిండీ , బట్ట , చదువు, ఇల్లు ఇచ్చేస్తే రిజర్వేషన్స్ పూర్తిగా తీసేయచ్చు . అప్పుడు కూడా వెళ్ళు ఊరికే తిని తిరుగుతున్నారని గోల చేసే వాళ్ళు ఉంటారనుకోండి .

  ఏదేమైనా ఒకే స్టెప్ లో మారారు కాబట్టి కమ్యునిష్టులు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా , ఉచితాలకి వ్యతిరేకంగా వెళ్లకుంటే బాగుంటుందేమో అని నా ఊహ . జరిగేది కూడా అదేనేమో

  మెచ్చుకోండి

 16. చాలా చర్చ జరిగింది. ఒక్క విషయం గమనించాలి.
  తొలిరోజుల్లో జ్ఞానపీఠం ఫలాని రచనకి అని ఇచ్చినా, ఎనభైలనించీ ఒక రచయిత సమగ్ర సాహిత్య సేవకుగాను ఇస్తున్నారు. భరద్వాజగారికి ఇచ్చినది కేవలము పాకుడు రాళ్ళు నవల వలన కాదు.

  మెచ్చుకోండి

  1. ధన్యవాదాలు నారయణస్వామి గారు. మీడియా లో కొన్ని చోట్ల పాకుడు రాళ్ళు నవల కి అని వచ్చింది. తప్పు గా రిపోర్ట్ చేశారనుకొంటాను.

   మెచ్చుకోండి

  1. http://www.saarangabooks.com/magazine/2013/04/24/%E0%B0%8F-%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%86-%E0%B0%97%E0%B0%A4%E0%B0%AE%E0%B1%87-%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4/
   రెంటాల జయదేవ కూడా పొరపడ్డారా? తెలియదు. అలానే కూడలి లో ఆ పుస్తకం కొత్తగా వచ్చింది, జ్ఞానపీఠ అవార్డ్ పొందిన నవల అని. మార్కెటింగ్ కావచ్చు. ఇవన్నీ స్వామి గారి విశ్వసనీయత ముందు నిలబడవు కాబట్టీ స్వామి గారే కరక్ట్ అనుకొంటున్నాను.
   యండమూరి ఎవరో ఒకడు కాదు. ఒకేఒక్కడు!

   మెచ్చుకోండి

 17. లేదండీ మీరు టపా వ్రాయడానికి మునుపే నేను చెక్ చేసుకొన్నాను , పాకుడురాళ్ళు కి ప్రత్యేకంగా ఈ అవార్డ్ రాలేదని అర్ధం అయ్యింది కాని వెబ్ లో మళ్ళీ వెదకడం కుదరలేదు.

  ఒకే ఒక్కడు అయితే పర్లేదు, బాల కృష్ణ సిన్మా కాదు కదా …(సరదాగా)

  మెచ్చుకోండి

  1. దాని పేరు ఒకేఒక్కడు కాదు. ఒక్కడు. ఆయ్! సరదా గా అంటారా!? నేను సీరియస్ గానే, అ చిత్ర రాజమునకు గాను మా బాలయ్య బాబు కి జాతీయ ఉత్తమ నటుడు పురస్కారమునూ మరియూ డైరెక్టర్ వై వీ ఎస్ చౌదరి కి జాతీయ ఉత్తమ దర్శకుడు పురస్కారమునూ అత్యవసరము గా ఇవ్వాల్సిందే నని కోరతాఉండా..!

   మెచ్చుకోండి

 18. మనదేశంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టి నాయకులు గాంధి మొదలుకొని టంగుటూరి ప్రకాశం వరకు, ప్రజలకొరకు వాళ్ల స్వంత డబ్బులు ఖర్చు చేసి దివాలా తీశారు. అదే చైనా సంగతి చూడండి.
  సంపన్న జాబితాల్లో మావో కుటుంబం! చైనా నిర్మాత మనవరాలు ఆస్తి 4,425 కోట్లు బిలియనీర్ల జాబితాల్లో 224వ స్థానం ‘న్యూ ఫార్చ్యూన్’ పత్రికవెల్లడి
  http://andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013/may/10/main/10main10&more=2013/may/10/main/main&date=5/10/2013#.UYx-wNgcrSg

  మెచ్చుకోండి

 19. శ్రీరామ్‌గారూ, టపాకు సంబంధం లేని విషయా లెందుకండీ? బోలెడు మంది నిజాయితీ పరులైన నాయకులు భారతస్వాతంత్ర్యపోరాటంలో సర్వం త్యజించారు. నెహ్రూలు చతురులు వారు తీన్‌మూర్తీ భవనం‌ ఇచ్చి దేశాన్నే పుచ్చుకున్నారు ప్రతిఫలంగా. పాపం చైనాలోనూ అనేకమంది విప్లవం కోసం సర్వం దేశార్పణం చేసినవా రుండవచ్చును కదా?

  మెచ్చుకోండి

  1. సాధారణంగా నేను రాసిన వ్యాఖ్యలకు ప్రతిగా బదులు ఉండదు. నా వ్యాఖ్యల పై అభిప్రాయం చెప్పిన వారు అరుదు. అందువలన ఇతరులు ఏవిధంగా అర్థం చేసుకొంట్టున్నారో నాకు తెలియదు. నేను రాసిన వాటి లో తప్పులు ఎమైనా ఉంటే ఎవరైనా నన్ను విమర్శించవచ్చు. కాని విమర్శించలనుకొనే వారు కూడా గుర్తుంచు కోవలసిందేమిటంటే నేను సందర్భానుసారంగా కోట్ చేసిన విషయాల వెనుక చాలా అధ్యాయనం ఉంది అని.

   మెచ్చుకోండి

   1. అబ్బో! మేమూ అంతే. ప్రశ్న అడిగాక జవాబుకోసం చూసే ప్రశ్నే వుండదు. ఏదో వాళ్ళు వాగుతారు, చూడాలనిపిస్తే చూస్తాము, మళ్ళీ ప్రశ్నించాలంటే ప్రశ్నిస్తాము.

    మెచ్చుకోండి

 20. ఇక్కడ నేను వ్యాఖ్యలు రాసినపుడు నా బదులు సీతారాం కి మాత్రమే ఇస్తున్నట్లు మనసులో అనిపిస్తుంది. అంతే గాని నా వ్యాఖ్యలు ఇక్కడ చర్చలోపాల్గొన్న వారిని కూడా ఉద్దేసిస్తూ రాయను. సీతారాం బ్లాగులొ చాలా రోజులనుంచి చర్చలో పాల్గొనటం వలన అతని తో చర్చిస్తున్నపుడు గతం లో చర్చించిన సంఘటనలు కూడా దృష్టిలొ పెట్టుకొని రాయటం జరుగుతుందేకాని, అచ్చం ఈ ఒక్క టపాకి సంబంధించినది మాత్రమే కాదు. నాయకులను దృష్ట్టిలో పెట్టుకొని రాస్తున్నాను కాని ప్రజలు చేసిన త్యాగలను దృష్ట్టిలో ఉంచుకొని కాదు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s