రజనీష్ పుస్తకమూ, నా సోదీ, గోలా, మొదలైనవి..

ఈ మధ్య నేను ఓషో అనబడు రజనీశ్ రాసిన The book of secrets ని చదువుతూ..ఊ.. ఉన్నాను.ఇది చాలా పెద్ద పుస్తకం. ఓ హార్డ్ కాపీ లభించటం వలన చదివే సాహసానికి ఒడిగట్టాను. ఓషో చాలా వివాదాస్పదమైన వ్యక్తి. ఇంటర్నెట్ లో ఆయన గురించిన సమాచారం చాలానే లభిస్తుంది. ఆయన ను అభిమానించే వారు కొందరైతే, వ్యతిరేకించే వారు కొందరు. ఆయన కొందరికి భగవాన్ అయితే మరికొందరికి కల్తీ స్వామి. నేను ఈ టపా లో ఓషో వ్యక్తిగత జీవితం గురించి రాయబోవటం లేదు.  ఆయనను ఎక్స్-పోజ్ చేస్తూ ఆయన బాడీ గార్డ్ రాసిన పుస్తకం దగ్గరి నుంచీ, ఆయనను దేవుడి గా స్థుతిస్తూ ఆయన అభిమానులు రాసిన అనేక పుస్తకాల వరకూ నెట్లో లభ్యం.
ఈ టపా , ఓషో పుస్తకం చదువుతూ ఉంటే నాలో కలిగిన ఆలోచనలను, పంచుకోవటానికి రాస్తున్నాను.
ఈ పుస్తకం లో ఓషో, “ఓ మనిషి కి జ్ఞానోదయం కావటానికి అవసరమైన తాంత్రిక పధ్ధతులు”, చెప్తున్నానంటాడు”. ఆయన సమకాలికుడైన జిడ్డు కృష్ణమూర్తి తో పోలిస్తే ఓషో చాలా resourceful. ఆయన తత్వ శాస్త్రం లో post graduate. దేశ విదేశాల తాత్విక ఆధ్యాత్మిక విషయాల గురించిన ఆయన పరిజ్ఞానం అమోఘం.ఆయన ఉపన్యాసాలలోని convincing power అమోఘం! అనేక దృష్టాంత కధలతో ఆయన ప్రవచనాలు చదువరులను కట్టిపడేస్తాయి.
జనాలకు ఏది కావాలో ఆయనకు బాగా తెలుసు. ఎటువంటి జనాలు తన దగ్గరకు వస్తారో కూడా తెలుసు.
ఆధ్యాత్మికత లో పడి ఆయన కోసం వచ్చే వారి లో చాలా మంది ఉన్నత తరగతుల వారు ఉంటారు. వారికి జీవితం లో అన్నీ అమరి ఉంటాయి. ఇక మిగిలింది ఆధ్యాత్మికత, enlightenment, మోక్షం, కైవల్యం.
“ఈ మోక్షం అనేది మానవ ప్రయత్నం తో సాధ్యం కాదు”, అని ఓషో చెబుతారు. ఎందుకంటే ఆ స్థితి లో “నేను” అనేది ఉండకూడదు. మనిషి ప్రయత్నం చేస్తున్నపుడు “నేను” తప్పకుండా ఉంటుంది. అలానే కైవల్యం అనేది కొన్ని రోజుల్లోనో , సంవత్సరాలలోనో సాధించేది కాదు. ఎందుకంటే, అలా సాధించే దానిలో “అహం” అన్నది తప్పకుండా ఉంటుంది. పాత వాసనలు ఉంటాయి.
ఇవన్నీ చెప్పిన ఓషో తన  అభిమానులను నిరాశ పరచదలుచుకోనట్లు కనపడుతుంది. ప్రయత్నం చేయాల్సిందే నంట. ఎందుకంటే ఈ జన్మ లో కాకపోయినా మరో జన్మ లో అయినా ఆ స్థితి నిన్ను వరించినపుడు, నీ వ్యక్తిత్వ వ్యవస్థ అందుకు సిధ్ధం గా ఉంటుందట. అంటే ఈ టెక్నిక్ పని చేయకపోయినా, సేఫ్ గా ఉండటానికి డిక్లెయిమర్ పారేశాడు. లేక పోతే, పక్కా గా ఈ టెక్నిక్స్ పని చేస్తాయని చెబితే, పని చేయని వాళ్ళు వచ్చి నిలదీస్తారు.

ఇక పోతే ఈ పుస్తకం లో వందకు పైగా తాంత్రిక టెక్నిక్స్ ఉన్నాయి-అని ఓషో చెప్పాడు. ఇవి చాలా వరకూ మనిషిని మోక్షానికి ప్రిపేర్ చేసేవట, కానీ వాటి వలన కైవల్యం ప్రాప్తించదట. కానీ వీటి లో కొన్ని(ఓ ఏడు) టెక్నిక్లు సడన్ గా మోక్షాన్ని తెచ్చేస్తాయట. కానె అవి ఏ యేడో ఆయన చెప్పలేదు. చెప్తే తేడా అయిపోద్ది మరి. అవి పని చేయవు గా.
పని లో పని గా జిడ్డు కృష్ణ మూర్తి మీద చెణుకులు. వాళ్ళిద్దరూ కాంపిటీటర్స్ అనుకొంటా! జిడ్డు కృష్ణ మూర్తి ధ్యానం వద్దన్నాడట. కాని ధ్యానంఅనేది ఓ necessary evil అట. జిడ్డు కృష్ణ మూర్తి కి జనాల కు వినోదాత్మకం  గా చెప్పటం రాదట.  (ఇది మాత్రం నిజం! జిడ్డు తో పోలిస్తే, ఓషో చాలా engaging గా చెబుతారు.”కారణ లోకాలూ, సూక్ష్మ లోకాలూ, పునర్జన్మల”, లాంటి మసాలా లేక పోతే, ఆ ప్రసంగాలు జిడ్డు కృష్ణమూర్తి ప్రసంగాల్లా నీరసం గా ఉంటాయి. కరక్టే! రజనీష్ ఎంటీవోడు లాంటోడైతే, జిడ్డు నాగేస్రావు లాంటోడన్న మాట!  ).  కానీ నాదో సందేహం! ఓ సీరియస్ విషయం గురించి సీరియస్ గా ఉన్న వారికి entertaining గా మాట్లాడటం కుదరదేమో!
నాకు ఈ పుస్తకం చదివాక ఓషో ఒకప్పుడు ప్రపంచం లోకెల్లా డబ్బున్న గాడ్-మేన్ ఎందుకయాడో అర్ధమయింది. యూ జీ కృష్ణ మూర్తి ఈ enlightenment బిజినెస్ గురించి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

ఓషో గారి ప్రకారం శంకరుడు, “జగం మిధ్య అని”, జనాలను ఆధ్యాత్మికత వైపుకి (జనాలకు తెలియకుండానే, వారి అనుమతి లేకుండానే) మళ్ళీంచే  ఓక చిట్కా(device) లా చెప్పాడట! అది సత్యాన్వేషణ లో భాగం గా చెప్పలేదట!అద్వైతాన్ని మొత్తాన్నీ ఓ చిట్కా అనేశాడు!  పాశ్చాత్యులు తప్పుగా, దానిని ఓ తత్వం గా అర్ధం చేసుకొన్నారట!   ఇంతకీ ఈయన చెప్పొచ్చేదేమిటంటే, జనాల మంచి కోరి శంకరుడు జనాలను మభ్యపెట్టాడని. అలానే యేసు క్రీస్తు గురించి కూడా చెప్పారు. Not convincing! శంకరుని లాంటి వారు ఓషోనా ఏమిటి, అలా చెప్పటానికి? ఒక వేళ అలా చెప్పినా దానిని ఈయన సమర్ధించటం నాకు నచ్చలా. అన్వేషకుడు ఎప్పుడూ సత్యం మీదే దృష్టి పెట్టాలి కదా?

నేను ఇంతకు ముందు దొంగ బాబా ల గురించి రాసిన టపాలోని బాబా కంటే, కొన్ని వందల రెట్లు తెలివైన, నిపుణుడైన బాబా గా కనిపించాడు రజనీశ్, ఈ పుస్తకం చదువుతూ ఉంటే!

ఆధ్యాత్మికత అంటే బాగా ఆసక్తి ఉన్న వారు(ప్రత్యక్షానుభవాల పట్ల ఆసక్తి ఉన్నవారు), దానిని నమ్మే వారూ, చక్క గా కృష్ణ భగవానుడి నుంచీ నేరుగా జాలువారిన ది గా చెప్పబడుతున్న, authentic అయిన గీత నే చదువుకోవచ్చు కదా!. “ఇలాంటి మధ్యవర్తుల interpretations మనకి అవసరమా?”, అనిపించింది. చాలా డబ్బులు పోసి మరీ ఇలాంటి వారి ఆశ్రమాలను సపోర్ట్ చేసే వారిని, ఈ గురువులు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచీ కోలుకోలేక జీవితాంతం బాధపడే వారినీ  గురించి జాలి వేసింది.

ఇక, ఈ పుస్తకం చదివిన తరువాత,  మేధోపరం గా సృష్టి రహస్యాల గురించి తెలుసుకోవాలంటే శాస్త్రీయ పరిశోధనలకు మించిన మార్గం లేదనే నా నమ్మకం మరింత బలపడింది.
ఈ పుస్తకం నెట్లో దొరికింది. సాఫ్ట్-కాపీ ఇక్కడ. Osho_The_Book_of_Secrets. ఆసక్తీ సమయమూ ఉన్న వారు చదువుకోవచ్చు. హెచ్చరిక: చాలా పెద్ద పుస్తకం.

ప్రకటనలు

28 thoughts on “రజనీష్ పుస్తకమూ, నా సోదీ, గోలా, మొదలైనవి..

 1. నేనూ ఓషో, జిడ్డు కృష్ణమూర్తి ఇద్దరివీ చెరో పుస్తకం చదివాను (ఓషో “Be Oceanic”,జిడ్డు కృష్ణమూర్తి “స్వీయ జ్ఞానం”) నాకు తెలిసినంత వరకూ ఓషో కన్నా జిడ్డు కృష్ణమూర్తి చెప్పేదాంట్లో నిజాయితీ ఉంది. ఓషో తాత్కాలికమయిన ఉపశాంతి కలిగేలాగా, మనం గట్టిగా నమ్మే లాగా తెలివిగా చెప్పి ఒప్పించగలడు. కానీ జిడ్డు కృష్ణమూర్తి మాత్రం దేన్నయినా ఉన్నదున్నట్టుగా ఆలోచించి, విశ్లేషించ గలిగితే సమాధానం మన దగ్గరే ఉంటుందనీ, జ్ఞానమనేది ఏ బాబాల దగ్గరా దొరికేది కాదని చెప్పాడు.

  మెచ్చుకోండి

  1. గోపి గారు, మీతో ఏకీభవిస్తూనే, జిడ్డు కూడా తను చెప్పిన వాటికి విరుధ్ధమైన పనులు చేశారు. ఆర్గనైజేషన్స్ ఉండకూడదంటూనే, స్కూల్స్ పెట్టారు. ఆయన చెప్పే పరిపూర్ణ సత్యాన్ని జనాలు చేరుకోలేరని తెలిసీ, సిటింగ్స్ పెట్టి ఫీజులు పెట్టి చెప్పాడు. యూ జీ జృష్ణ మూర్తి మాటలు చదివితే కొంత జిడ్డు లోని లోటుపాట్లు తెలుస్తాయి.

   మెచ్చుకోండి

   1. అవునండీ, నేను ఇప్పటి వరకూ యూ జీ కృష్ణమూర్తి పుస్తకాలు పెద్దగా చదవలేదు (మీ బ్లాగు లో ఆయన గురిచి కొన్ని చదివాను). ఇక పోతే జిడ్డు కృష్ణమూర్తి ఆర్గనైజేషన్స్ విషయం లో తన అనుచరులూ, అనిబిసెంట్ లను కూడా వ్యతిరేకించి తాను జగద్గురువు ని కాదని ప్రకటించి “Order of the Star in the East” ని రద్దు చేసి స్వతంత్రం గా వ్యవహరించారని తెలుసు, కానీ ఫీజులు వసూలు చేసాడని తెలీదు.

    మెచ్చుకోండి

    1. ఆయన యువకుడి గా ఉన్నపుడు “Order of the Star in the East” ను ఆ ఆవేశం లో రద్దు చేశారు. పెద్దయిన తరువత కొన్ని వీడియోలలో, “నాకు తెలిసిన ఒకే విద్య ఈ talks ఇవ్వటం, నా మనుగడ ఇలానే ఉంటుంది అనృ అర్ధం లో చెప్పారు. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ మీది control కోసం తన మితృడు రాజ గోపాల్ తో ఓ legal battle చేశారు. ఇతర సమర్ధించలేని వ్యక్తిగత రొమాన్స్ ల గురించి నేను మాట్లాడను.
     ఇవన్నీ తప్పులెంచటం కోసం నేను చెప్పటం లా. ఎంత గొప్ప వ్యక్తిమీదైనా అవాస్తవమైన అంచనాలు ఉండకూడదు అనే అభిప్రాయం తో చెబుతున్నాను.

     మెచ్చుకోండి

     1. మీరు చెప్పిన “ఎంత గొప్ప వ్యక్తిమీదైనా అవాస్తవమైన అంచనాలు ఉండకూడదు అనే అభిప్రాయం తో” నేను ఏకీభవిస్తాను. అన్నట్టు పలువురు గురువులు లేదా బాబా లు వాళ్ళు చెప్పిందే సత్యమని నమ్మించటానికి ప్రయత్నిస్తే వాళ్ళని ఆశ్రయించిన శిష్యులకి కూడా అవి సత్యాలుగా కనపడుతాయి, అంటే సత్యం అనేది గురువులని బట్టి మారుతూ ఉంటుంది, అంటే “సత్యం” అనేది స్థిరమయినది, శాశ్వతమయినది కాదు కూడా, అందుకే నాకు Friedrich Nietzsche చెప్పిన “There are no Facts, Only Interpretations” మీద నమ్మకమెక్కువ (ఇక్కడ కూడా నేను “సత్యమనేది లేదు అనేది సత్యం” గా నమ్మవలసి వస్తుంది), ఇది భగవద్గీత కీ అన్వయిస్తుందని నా అభిప్రాయం అందుకే మనకెంతో పవిత్రమయిన భగవద్గీతలో రష్యా వాడికి హింస కనిపించింది.

      మెచ్చుకోండి

      1. సింపుల్ విషయం ఎంత పేద్ద చిత్రంగా కనిపిస్తోంది. పైసలు వసూల్ చేయటం తప్పెలా అవుతుంది ?

       మనిషికీ మనిషికీ మధ్య వర్తకం పైసలతో కాక ఇంకెలా నడుస్తుందో ఎవరైనా చెప్తే బాగుంటుంది..

       మెచ్చుకోండి

       1. ఆయన తన వ్యక్తిగత ఖర్చుల కోసం పైసలు వసూలు చేస్తే అభ్యంతర లేదు. తరువాత ఓ పెద్ద ఆర్గనైజేషన్ ను స్థాపించారు. అది ఆయన సూత్రాలకే విరుధ్ధం.ఆయన, “వినటానికి వచ్చేవారికి సత్యం తెలిస్తే తెలుస్తుంది లేకపోతే లేదు”, అని యూ జీ తో అంటారు. అలాంటపుడు ఆయన talks అన్నీ నిరుపయోగం. ఆయనకు ఈ విషయం తెలిసి కూడా, జనాలు వస్తున్నారు కాబట్టీ వారి దగ్గర డబ్బు వసూలు చేయటం వారిని మోసం చేసినట్లే! ఆయన పైకి ఎప్పుడూ నా talks నిరుపయోగం అని ఒప్పుకోలేదు. కానీ, ప్రైవేట్ గా ఒప్పుకొన్నారు.

        మెచ్చుకోండి

      2. భగవద్గీత ultimate truth అని నమ్మకం ఉండి నేను ఆ para రాయలేదండీ. ఈ గురువుల సన్నిధి కంటే పవిత్ర గ్రంధాలు చదువుకోవటం harmless అనిపించి రాశాను.

       మెచ్చుకోండి

       1. మళ్ళీ.. జడ్జ్ లకు సాక్ష్యాలే కీలకం.. ఆర్గనైజేషన్ వద్దంటాడు.. మళ్ళీ అదే చేస్తాడు.. ఎంటీ వీళ్ళ లాజిక్ ? మీకు నాకు పైసలు అతి ముఖ్యమేమో కని.. వాళ్ళకి కాదు.. వాటిని ఎలా ఉపయోగించాలో మాత్రమే వాళ్ళకి తెలుసు..

        ఒక వేళ మీదగ్గర మస్తు పైసలు ఉండి మీకు వాటిపై విరక్తి కలిగింది అనుకుందాం, అప్పుడు ఏదో జరిగి మొత్తం ఊడ్చుకు పోతే మీరు హైరానా పడతారా ?

        వాళ్ళని సరిగా అర్థం చేసుకోవటానికి ధనం ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది అర్థం చేసుకోవాలి.. “శరీరము, ఆత్మ – ఆర్గనైజేషన్, అందులో విద్యార్థులు” .. భగవద్గీత లో కృష్ణుడు చెప్పినట్లే కర్మ చేస్తం ఫలం తీస్కోవచ్చు.. తీసుకోకపోవచ్చు.. ఆర్గనైజేషన్ ఉంటది.. కని అదే దాని పరమావధి కాదు.. అందులో విద్యార్థులు పోయి..శిష్యులు పుడతారు..

        జ్ఞానోదయం పొందని వాళ్ళు ఎప్పుడైనా రివర్స్‌లో వచ్చి గుద్దొచ్చు..వాళ్ళకు ఒక సారి అసలు సత్యం తెలిశాక శరీరంలో (ఆర్గనైజేషన్‌లో) ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.. సొంతంగా కొత్తగా మొదలు పెట్టొచ్చు.. వాళ్ళేం చేసుకుంటరు పైసలు.. పిల్లనా జెల్లనా..

        ఆర్గనైజేషన్ జస్ట్ మిగతా ప్రపంచపు రెసోర్సెస్ ని ఉపయోగించుకోటానికి దారి మాత్రమే..

        మెచ్చుకోండి

       2. అవునండీ బాబా లని ఆశ్రయించటం కన్నా భగవద్గీత ని ఆశ్రయించటం నూటికి నూరు శాతం సమంజసం. కానీ అంత ఓపిక, సహనం లేక జ్ఞానం/మనశ్శాంతి అంటే Ready Made గా ఎవరిదగ్గరో దొరుకుతుందనుకోవటం వల్లనే బాబా లకి గిరాకీ పెరిగిందనుకుంటా.(ఇటువంటి విషయాలు గురించి నా అభిప్రాయాలన్నీ ఒక పెద్ద టపా రాయామనుకుంటున్నా, వీలయితే ఒక పుస్తకం.)

        మెచ్చుకోండి

        1. “అవునండీ బాబా లని ఆశ్రయించటం కన్నా భగవద్గీత ని ఆశ్రయించటం నూటికి నూరు శాతం సమంజసం”

         బాబాలను విమర్శించేవారు ఒకటి మరచి పోతారు. రాజకీయ పార్టిలవారు ఇంటికొచ్చి మా పార్టికి ఓటేయండి అడిగినట్లు, ఏ బాబా అయిన తననొచ్చి కలవన్మని బతిమాలుతున్నాడా!? బాగా ఆలోచిస్తే చాలామందికి భగవద్గీత కూడ అవసరం లేదు. గాంధి, సుబాష్ చంద్ర బోస్, సుబ్రమణ్య స్వామి లాంటి వారికి గురువులు,భగవద్గీత అవసారమేమో! మిగతావారికి అది పెద్దగా అవసరం లేదు. మనదేశంలో ఎక్కువమంది ప్రజలు చేసేది అదే రోడ్డకొట్టుడు పని, మొదట పెళ్ళి ఆతరువాత పెళ్ళాం పిల్లలు, ఆఫీసులో బాసు సేవ, తీరిక సమయాలలో రాజకీయాలపై చర్చించటం, సినేమాలు చూడటం చేస్తూంటారు, అతి తక్కువ శాతం పుస్తకాలు చదువుతారు. వాళ్లు తీసుకొనే రిస్క్ ఎమీలేదు. అటువంటి వారికి భగవద్గీత అవసరం ఏముంది? చేతిలో ఉన్న పని చక్కగా జేసుకొంటే, జీవితం సులువుగా గడిచిపోతుంది. సమయం డబ్బులు రెండూ ఆదా అవుతాయి 🙂

         సీతారం గారు,
         ఇంతక్రితం టపాలో యండమూరిగురించి రాసిన వ్యాఖ్యలు వీలైతే తీసేయండి. రావురి భర్ద్వాజా గారికి మంచి అవార్డోస్తే ఆయన గురించి కాకుండా యండమూరిగురించి మాట్లాడటం నాకు అసందర్భంగా అనిపించాయి. భరద్వాజ గారి పుస్తకాలు ఎమి చదవలేదు గనుక అభినందనలు చెప్పటం మించి ఇంకేమి వ్యాఖ్యానించలేను.

         మెచ్చుకోండి

         1. మీ కామెంట్స్ వలన కొన్ని తెలియని విషయాలు తెలిశాయి. సుధామూర్తి కి యండమూరి అభిమాన రచయిత అనీ, ఆయన నవల కన్నడ సినిమా గా వచ్చిందనె ఇలా..
          నేను టపా లో యండమూరిగురించి ప్రస్తావించాను కాబట్టీ మీ కామెంట్ అసందర్భమైనదేమీ కాదు. అలానే సృష్టి లో ప్రతి విషయానికీ వేరే విషయం తో సంబంధం ఉంటుంది. అందుకే నాకు కామెంట్లలో అసందర్భం అని ఏవీ అనిపించవు. free wheeling discussion లోనే విషయలు తెలుస్తాయి. ఒక్కోసారి నాకు ఎవరి ప్రశ్న కైనా సమాధానం చెప్పటానికి ఇష్టం లేకపోతే మాత్రం తరువాత మాట్లాడ్దాం అంటాను.
          మీ కామెంట్లను ఉండనీయండి.

          మెచ్చుకోండి

 2. జడ్జ్‌లు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట జడ్జ్‌మెంట్ పాస్ చేయటం మామూలే. దాదాపు వెయ్యి పుస్తకాలలోనుంచి ఒకటీ రెండూ పుస్తకాలు చదివి, పాపం పిచ్చి వీళ్ళ మాయలో ఎలా పడతారో అనటం ఎక్కడి న్యాయం.

  సమాజంలో ఉన్న కంప్యూటర్లకు డెడ్ లాక్ వచ్చే కోడ్ ఇస్తేనే కంప్యూటింగ్ కొంత సేపు నడచిన పాడె పై ఉన్న కొంచెం జ్ఞానం అయినా లేచి ఇవన్నీ పిచ్చి పనులు అని తేల్చేస్తుంది.

  ఓషోని చదివే ముందు కొన్ని గమనికలు చదువుకోవాలి, కొన్ని వందల ఆర్టికల్స్ చదివిన వ్యక్తిగా నాకు అర్థం అయిన విషయం ఇది.
  1. ఎవరికి వారే మార్గదర్శి అని చెప్పే ఓషో పది కమాండ్‌మెంట్స్ చదవండి
  2. ప్రశ్నించిన వ్యక్తికీ, మరియూ ఓషో విధానాలు అర్థమయిన వ్యక్తులకు మాత్రమే ఓషొ చెప్పేవి అర్థం అవుతాయి.
  3. చెప్పిన విషయాలు ఆ కాలానికి మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే నది లాంటి కాలం ఎప్పుడూ ఒకటి కాదు.. అది నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది, కొత్త కొత్త పరిస్తితులు వస్తూనే ఉంటాయి..
  4. ఓషొ ఎవరి గురించి మాట్లాడినా ఆ వ్యక్తిని విశదీకరిస్తాడు. అన్ని వాదనలూ చదవండి. ఒక్క పుస్తకం తో తీరేది కాదు.
  5. అప్పట్లో ఆయనే చెప్పాడు, నా తరవాత కాలంలో జ్ఞానోదయం పొందినవారు నాతో తప్పక విభేదిస్తారు, ఎందుకంటే కాలం-పరిస్తితులూ ఎప్పటికీ పునరావృతం కావు, దేవుడు మొద్దు కాదు, సృజనాత్మకత కలిగి ఉన్నాడు.. దేవుడు ఎప్పటికీ పునరావృతం చేయడు అని చెప్తాడు..

  నాకు అనిపించింది, ఆ కాలం కంటే మనం చాలా వరకు బెటర్ పరిస్తితుల్లో ఉన్నాం, అందుకే మనకు గుడ్డి నమ్మకాలు తక్కువ అందుకు మనకు కొత్త గురువు కావాలి, లేద విజ్ఞాన భైరవ తంత్ర లో శివుడు చెప్పిన ధ్యాన పద్ధతులు పాటిస్తూ, ధ్యానం యొక్క మూల అంతరార్థం అవగతమైనప్పుడు గుడ్డిగా జీవించము, అప్పుడు పూర్తిగా జీవించటం మొదలు పెడతాం..

  నాకు దాదాపు రెండు సంవత్సరాలకు పైగా పట్టింది ఈ క్లారిటీ రావటానికి.

  మెచ్చుకోండి

  1. భయంకర్ గారు , మీ అభిప్రాయాలు పంచుకొన్నందుకు ధన్యవాదాలు. నా ప్రస్తుత అభిప్రాయాలు(impressions) నేను రాశాను.వాటికి లాజిక్ లూ ప్రూఫ్ లూ లేవు. ఎప్పుడైనా నేను వీటిని సమీక్షించుకొని, అవి సరైనవి కావు అనుకొంటే మార్చుకోవటానికి సిధ్ధం. ప్రస్తుతానికి మార్చుకోవటానికి సరిపడే కారణాలు కనపడటం లేదు. ఇక ముందు అవి మారితే ఇదే బ్లాగు లో రాస్తాను. అవి ఎందుకు మారాయో కూడా రాస్తాను.
   చివరి గా, ఆయనకి వ్యతిరేకం గా కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు వాటిలో ఎన్నిటిని చదివారు?

   మెచ్చుకోండి

 3. నేను పుస్తకాలు చదివే రకం కాదు.. ఆర్టికల్స్ చదివే రకం.. ఆదర్శవాదం నాకు లేదు.. నాది కేవలం యదార్థ వాదమే..
  చాలా ఆర్టికల్స్ చదివిన, ఎవరి వాదనా నాకు అర్థమైన విషయాన్ని కాదనలేకపోయింది..
  ఆయన చెప్పిన విషయల్లో చాలా విషయాలు ఎందుకోసం చెప్పాడో అర్థమైతుంటే, ఆయన కొన్ని సంగతుల్లో తనని తానే కాంట్రడిక్ట్ చేసుకునేలా మాట్లాడినా.. అది యథార్థం అయినప్పుడు కాదనలేం..ప్రపంచం అలా ఉంది అని..నవ్వుకుంటం..
  మంచి-చెడు, నిజం-అబద్ధం, ప్రేమ-ద్వేషం..ఇవన్ని అర్థమైతే మీరు రేపటి కోసం దాచుకుంటారా ? ఇప్పటికోసం బోల్డ్‌గా జీవిస్తారా ?

  మెచ్చుకోండి

  1. ఈ టపా లో నేను ముందుగానే చెప్పినట్లు ఈ గురువుల వ్యక్తిగత జీవితం లోని చెడుని చర్చించ దలుచుకోలేదు (including sex, drugs, stimulants, power, money etc). నా దృష్టి లో ఆ లోపాలు వీరు selfless state ని పొందటానికి అవరోధాలు కావు.
   selfless state వేరు, objective physical truth వేరు. ఈ రెండోది మనుషులెవరూ పొందలేరు. జిడ్డు కానీ, యూ జీ కానీ దీని గురించి ఇన్ డైరెక్ట్ గ ఇదే విషమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ఈ physical absolute truth గురించి నా అభిప్రాయాలు ఇక్కడ: http://wp.me/pGX4s-K2

   మెచ్చుకోండి

 4. బొందలపాటి గారు,
  మీ టపాల వరుసచూస్తుంటే మీరు హిమాలయాలకు వెళ్ళడమో, ఇక్కడే ఒక ఆశ్రమం పెట్టడమో చేసేట్టు ఉన్నారు త్వరలో … 🙂

  మెచ్చుకోండి

 5. ఎంటివోడి గురించో,నాగేస్రావు గురించొ…ఇంకా కిట్టన్న గురించో రాస్తే మాకు అర్దమయ్యిద్దిగాని ఇంత జటిలమైన సబ్జెక్టులు రాస్తే మేమేం గావల నాయన..?

  మెచ్చుకోండి

  1. వాస్తవం గా ఎంటీవోడు, నాగేస్రావులకే మేకప్పేసి, రజనీషూ, కృష్ణమూర్తిలు గ అమార్చి దీన్ని రాత్తన్నాను సారు. ఎంటీవోడు నాగేస్రావూ అంటే అదేంటంటారు కిళాసు ..కాదు కాదు క్లాసు అనుకోరని ఇలా మొదలెట్టాను.

   మెచ్చుకోండి

 6. యండమూరిగురించి నాకు తెలిసిన ఇంకొక విషయం చెప్పాలనుకొంట్టున్నాను. ఒకసారి చంద్రశేఖర్ గారిని యు జి గురించి ఎప్పుడు తెలుగు పేపర్లో ఒక్కసారి కూడా చదవలేదు. ఆయన గురించి తెలుగు వారికి తెలియదా అని అడిగాను. దానికి ఆయన సమాధానం ఇస్తూ. చలం గారి తో పరిచయం ఉన్న వారికి యు జి గురించి తెలుసని చెప్పారు. యు జి గారి మీద మహెష్ భట్ రాసిన యు జి ఏ లైఫ్ తెలుగు అనువాదం చంద్రశేఖర్ గారు తెలుగు అనువాదం చేశారు. ఆ పుస్తకాన్ని నాగార్జున తో మహేష్ భట్ తీసిన క్రిమినల్ సినేమా షుటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నపుడు విడుదల చేయటం జరిగింది. ఆ ఫంక్షన్ కి యండమూరి గారు హాజరయ్యారని, యు జి గురించి ఎన్నో వివరాలు తెలుసుకొని, దానిని చదివి చంద్రశేఖర్ గారి తెలుగు అనువాదం పైన పుస్తకం రివ్యూ పేపర్లో ఆదివారం అనుబంధంలో రాశారని ఆయన చెప్పారు.
  ప్రముఖ రచయిత అబ్బూరి ఛాయాదేవి అనే ఈ మధ్యే యు జి గారి గురించి ఒక పుస్తకం రాశారు. ఆమేకు యు జి గారు దూరపు బంధువట. అయినా ఆయన చనిపోయేవరకు ఆమేకు యు జి గారి (కెలామిటి) గురించి పెద్దగా తెలిసినట్లు లేదు. అదేలానో ఈమధ్య తైసినట్లు ఉంది, మరిన్ని వివరాలకొరకు ముకుంద్ రావు, చంద్రశేఖర్ గార్లను సంప్రదించి తెలుగు విశ్వవిద్యాలయం సి పి బ్రౌన్ పబ్లికేషన్ ద్వారా తెలుగు జాతి రత్నాల సిరీస్ లో భాగం గా ఒక పుస్తకం రాసారు. వీరిద్దరు కాకుండా తెలుగు వారిలో యు జి గురించి రాసింది మీరే. అందులోను బ్లాగు లో మొట్టమొదట రాసింది కూడా మీరే.

  మెచ్చుకోండి

  1. చెప్పటం మరచాను ఈ మధ్యే విశాఖపట్టాణం లో యు జి పుస్తకం విడుదల చేశారు. ఆ ఇన్విటేషన్ కార్డ్ బ్లాగులో ఉంది.
   https://premasamdesam.wordpress.com/2013/03/21/78/

   మెచ్చుకోండి

  2. So many interesting details Sri ram garu! Thank you. Few months back, I talked to Yandamoori once over phone. His glory days as popular writer are passed.. But there’s no trace of cynicism in his words. I have to say I had a positive impression of his personality from the few word he spoke with me.
   I came to know about UG for the first time from a Kannada colleague.Initially,I did not have s good opinion of UGs words because of the colleagues misrepresentation. But Once I read through his site I had a better understanding.

   మెచ్చుకోండి

 7. యు జి గురించి మిత్రులద్వారా తెలిసిన మరికొన్నివివరాలు.
  యు జి గారు చలం దూరపు బంధువులు. యు జి మీద వచ్చిన ఒక పుస్తకాన్ని భారత రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ విడుదల చేశారు. ఆపుస్తకం పేరు టేస్ట్ ఆఫ్ డెత్ రచయిత మహేష్ భట్. యు జి ని ప్రధానమంత్రి ఆఫిసు వాళ్ళు ప్రధాని నివాసానికి ఆహ్వానిస్తే ఆయన ఆ ఆహ్వానన్ని తిరస్కరించాడు. ఆ తరువాత ఒకసారి యు జి బెంగళురు కి వచ్చినపుడు, అప్పుడు ప్రధాని గా ఉన్న చంద్రశేఖర్ తన ప్రోగ్రాం లో బ్రేక్ తీసుకొని యుజి గారిని కలసి వెళ్ళాడు. యు జి పుస్తకాన్ని కన్నడంలో అప్పటి కర్ణాటక గవర్నర్ టి.యన్. చతుర్వేది ఆవిష్కరించారు.యు జి మీద వచ్చిన ఒక పుస్తకం ఆయన రెవల్యుషనరి మాటౌ, జీవన విధానం (ఆయన మాటలు జీవన విధానం రెండు ఒకటే, వేరు వేరు కాదు)తట్టుకోలేక యురోప్ లో ఒక కమ్యునిస్ట్ దేశం నిషేదించింది. భగవాన్ సత్య సాయిబాబా విద్యా సంస్థల స్థాపనలో ఎంతో ప్రముఖ పాత్రపోషించిన జాన్ హిస్లాప్ తరచూ ని కలుస్తుండేవారు. బాబా యు జి ని కలవమని చెప్పిపంపాడు. యు జి గారితో ఎంతో అనుబంధం ఉన్న చంద్రశేఖర్ గారికి కూడా భగవాన్ బాబా అంటే ఎంతో గౌరవం. ఎందుకంటే సత్యసాయి బాబా గారే యు.జి. దగ్గర కి వెళ్ళమని ఆయనకు గైడేన్స్ ఇచ్చారట.

  ఈ క్రింది వ్యాసం రాసిన స్వర్గీయ డాక్టర్ టి ఆర్ శేషగిరి రావు గారు యు జి గారికి బావమరిది అవుతారు( భార్య సోదరుడు). ఆయన కూతురే సినినటి గౌతమి.
  SCIENCE AND SPIRITUALITY ANY POINT OF CONTACT? By Dr. T. R. Seshagiri Rao
  http://www.well.com/~jct/sesha.html

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s