గురూజీల గురించిన ఓ మూవీ…

గురూజీల గురించిన ఓ మూవీ…

http://www.gameinformer.com/forums/general_gaming/f/12/p/242119/2003074.aspx#2003074

చాలా మంది గురూజీలు ఈ కోవలోకే వస్తారనుకొంటా…

ప్రకటనలు

దేవుడు లేడని నిరూపించండి…

అనగనగా ఓ రాజకీయ ఘరానా దొంగ. ఆ దొంగ పేరు రంగా.  గనులనీ, బొగ్గునీ మింగేశాడని రంగా ని కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.
దొంగతనం అతను చేశాడా లేదా అనే విషయమై చాలా వాదోప వాదాల మీదట జడ్జ్ గారు తగినన్ని ఆధారాలు లేనందున రంగా కి శిక్ష విధించకుండా వదిలి పెట్టారు.జడ్జి గారు చాలా నిజాయితీపరుడూ, గంగి గోవు లాంటి వాడు.

జడ్జ్ గారు తీర్పు అయినాక తన ఇంటికి వెళ్ళారు. అక్కడ రంగాని పట్టుకొన్న సీబీఐ ఆఫీసర్ టీ తాగుతూ కనిపించాడు. ఆఫీసర్ జడ్జ్ గారికి వ్యక్తిగతం గా స్నేహితుడే!

ఆఫీసర్ :జడ్జ్ గారూ, మీరు రంగా ని వదిలేసి చాలా తప్పుచేశారండీ. వాడు చాలా పెద్దనేరం చేశాడు. దేశాన్ని దోచుకొన్నాడు.

జడ్జ్: వాడి మీద తగినన్ని సాక్ష్యాధారాలు లేవు. ఆధారాలు లేవన్నంత మాత్రాన దానర్ధం వాడు నేరం చేయలేదని కాదు. ఆధారాలు లేవంటే మన చేతిలో ఆధారాలు లేవని మాత్రమే!అదే వాడు దోచాడని ఆధారాలు ఉంటే వాడు దొంగతనం చేయలేదనటానికి చాన్సే ఉండేది కాదు. ఈ సారి ఆధారాలు పకడ్బందీ గా సేకరించండి.

********************************************************************

ఆ రాత్రి కి జడ్జ్ గారు క్లబ్ కి వెళ్ళారు. అక్కడ మన రాజకీయ దొంగ తన ఫ్రెండ్స్ తో పెద్ద పార్టీ చేసుకొంటున్నాడు. రా.దొంగ(రంగా) జడ్జ్ గారి దగ్గరి కి వెళ్ళి, “ఏం జడ్జ్ గారూ, మీరు కూడా జాయిన్ అవుతారా?”, అన్నాడు.
జడ్జ్ గారు, ” నేను నేరస్తుల పార్టీ ల లో పాలు పంచుకోను”, అన్నారు.
రంగా: “అదేంటి సార్? నేను నేరం చేశానని రుజువులు లేవని మీరే చెప్పారు కదా? అంటే నేను నిర్దోషినే కదా?”
జడ్జ్: “నువ్వు నేరం చేయలేదని ఎలిబీ ఏమైనా ఉందా? నువ్వు నేరం చేయలేదని రుజువు అయ్యే వరకూ నువ్వు నా వ్యక్తిగత మనస్సాక్షి దృష్టి లో నేరస్తుడివే!మొన్నటిదాకా జులాయి లా తిరిగిన నువ్వు, ఇవాళ ఇంత పెద్ద పార్టీ ఎలా ఇస్తున్నావు?  నువ్వు నేరం చేయలేదని రుజువులు ఉన్న రోజున నేను నీకే పిలిచి సన్మానం చేస్తాను”.

—————————————————————————————————————–
పై ఉదాహరణ కీ, ఆస్తికులూ నాస్తికుల మధ్య “దేవుడు ఉన్నాడా లేడా ?” అని జరిగే వాదనల కీ చాలా పోలిక ఉంది.
దేవుడు ఉన్నాడని ప్రూఫ్ లేనంత మాత్రాన దేవుడు లేడని అర్ధం కాదు. దాని అర్ధం మన చేతుల్లో ప్రూఫ్ లేదని మాత్రమే.
అలానే, “దేవుడు ఉన్నాడని ప్రూఫ్ లేదు” అంటే, దేవుడు లేడనటానికి ప్రూఫ్ అవసరం లేదని కాదు. దేని ప్రూఫ్ దానిదే! కాబట్టీ, నాస్తికులని దేవుడు లేడని ప్రూవ్ చేయమని అడగటం లో తప్పేమీ లేదు. ఎందుకంటే, మన దగ్గర ఉన్నది “ప్రూఫ్ మాత్రమే”. దేవుడు లేడు అని ప్రూవ్ అయ్యేంత వరకూ, లేడనే నమ్మకానికి ఋజువు లేనట్లే!  . అలానే ఉన్నాడని ప్రూవ్ అయ్యేంతవరకూ ఉన్నాడనే నమ్మకానికి ఋజువు లేనట్లే!
ఇంతకీ దేవుడు అంటే డెఫినిషన్ (నిర్వచనం) ఏమిటి?మన కళ్ళెదుట కనపడే వస్తువులకి (గోడా, కుర్చీ, టేబులూ వగైరాలకి) ప్రూఫ్ ఎందుకు అడగం?

PS: 1.ప్రూఫ్ లేని నమ్మకం వ్యక్తిగతమైనది. ప్రూఫ్ నమ్మకాన్ని వస్తుగతం చేస్తుంది.

2.డెఫినిషన్ లేని దానికి ప్రూఫ్ ఉండదు.

చిన్నారి ఆసక్తి…..చిట్టి కథ..

దసరా సెలవలకి మా ఊరెళ్ళిన వాళ్ళం, ఈ రోజే తిరిగొచ్చి, మళ్ళీ  పట్నం లోని మా ఇంట్లో దిగబడ్డాం.

మా అమ్మాయి చిన్నారి,ఇంట్లో అడుగుపెట్టగానే నన్ను ఓ తెల్ల కాగితం ఇవ్వమని అడిగింది .
ఓ అరగంటైన తరువాత ఆ కాగితం మళ్ళీ నా చేతి లో పెట్టింది.

“ఓ డొంక, దారికి ఇరువైపులా తుమ్మ చెట్లు. డొంక లో బండి, దాని మీది రైతు, రైతు చేతి లో చెర్నా కోల,పరుగెడుతున్న ఎద్దులూ, వాటి కాళ్ళ దగ్గర లేచిన దుమ్మూ”.
అది ఏదో పిచ్చి గీతలు గీస్తుందని తెలుసు గానీ, ఇంత మంచి బొమ్మలేస్తుందని నాకు తెలీదు.

“బొమ్మ బానే వేశావు. డ్రాయింగ్ క్లాసు లో చేర్పిస్తాను. వెళ్తావేమే?”

తల గుండ్రం గా తిప్పింది. అవును అని కాదు. కాదు అనీ కాదు.

క్లాసు లో చేర్పించి చూద్దాం. పెద్ద చిత్రకారిణి అవుతుందేమో! ఎవరు చెప్పొచ్చారు!

ఈ మాటే మా ఆవిడ తో చెప్పాను.

“మీరు మాత్రం దానిని ఫోర్స్ చేయవద్దు. దానికిష్టమైతేనే చేర్పించండి”, అందామె.

“నేనేమీ ఫోర్స్ చేయటం లేదు. అది చేరను అంటే కదా నేను ఆగేది.ఈ రోజుల్లో పిల్లలు ఖాళీ గా ఉండటం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఓ క్లాసు కి వెళ్తూనే ఉన్నారు. స్విమ్మింగ్ క్లాసుకో, చెస్ కొచింగ్ కో, లేకపోతే, స్కేటింగ్ కో, కరాటే కో..ఇలా.,…రేపట్నుంచీ డ్రాయింగ్ క్లాస్ కి పంపించి చూద్దాం..,” సమర్ధించుకొన్నాను.
*******************************
సంక్రాంతికి ఊరెళ్ళటం కుదరేట్టు లేదు,ఉద్యోగ పనుల వలన. మా అగ్గిపెట్టె ఫ్లాట్ లో, మంచం మీద పడుకొని వార పత్రిక సంక్రాంతి అనుబంధం చదువుతున్నాను. చిన్నారి స్కూల్ బ్యాగ్ భుజాలమీది నుంచీ కిందికి దించి, వచ్చి పక్కన కూర్చొంది.
“చిన్నారీ. ఈ మధ్య గీసిన బొమ్మ ఏదైనా చూపించు”
“ఈ మధ్య ఏమీ గీయలేదు నాన్నా. డ్రాయింగ్ పెద్ద బోర్!”
“నీకు డ్రాయింగ్ అంటే చాలా ఇంటరెస్ట్ కదా! మన ఊరి బొమ్మలు భలే గీశావు కదా నువ్వు?”

“నాన్నా, నేను ఆ డ్రాయింగ్ క్లాసు మానేస్తాను”.

“ఏమ్మా..బొమ్మలు బాగానే వేస్తున్నావు కదా! మొన్న ఓ సారి నువ్వేసిన స్కెచెస్ చూశాను. చాలా బాగున్నాయి”, అన్నాను “అయ్యో, దీన్ని ఓ పెద్ద ఆర్టిస్ట్ గా చూద్దామన్న ఆశ కి ఆది లోనే గండి పడేటట్లుందే!”, అనుకొంటూ.

“శైలూ, చిన్నూ ఇంకా మిగిలిన వాళ్ళంతా ఆడుకొంటుంటే నేనొక్క దాన్నే క్లాస్ కి వెళ్ళ బుధ్ధి కావటం లేదు”.
“వాళ్ళంతా చివరికి ఎందుకూ పనికి రాకుండా అవుతారు చూడు. నువ్వు మాత్రం మంచి ఆర్టిస్ట్ వి అవుతావు”.
“కాదు నాన్నా, డ్రాయింగ్ సార్, గీసిన స్కెచ్ నే పది సార్లు గీయిస్తున్నారు. బోర్ కొడుతూంది”
“మంచిదే కదా! ప్రాక్టీస్ చేసిన కొద్దీ పర్-ఫెక్ట్ గా వస్తుంది. ముందు కొంచెం కష్టమైనా, నెమ్మది గా అదే అలవాటవుతుంది బంగారం”
“లేదు. నేను ఇంట్లోనే ఉండి నాకు డ్రా చేయాలనిపించినపుడు, బొమ్మలు వేసుకొంటాను. ఒక వేళ ఏదైనా గీయటం కుదరక పోతే, అప్పుడు రమేష్ అన్న చేత చెప్పించుకొంటాను. అన్న కి డ్రాయింగ్ బానే తెలుసు కదా! వాళ్ళిల్లు పక్కనే కదా!”.
….నేను ఆలోచిస్తున్నాను… “దీనిని ఎలా మళ్ళీ క్లాసుకి పంపించాలా!”, అని…హఠాత్తు గా మా ఆవిడ గొంతుక..
“సరే చిన్నారీ, నువ్వు ఈ రోజు నుంచీ క్లాసు కి వెళ్ళొద్దు”, అంది గుమ్మానికి అనుకొని మా మాటలు వింటున్న మా ఆవిడ.మాటల లో పడి ఎప్పుడొచ్చిందో చూడనేలేదు.
నా వైపు తిరిగి, “మీరు దానిని ఫోర్స్ చేయొద్దు. దానిని అది ఫోర్స్ చేసుకొని, “క్లాస్ కి పంపించు నాన్నా”, అని అడిగే వరకూ, దానిని ఇంట్లోనే గీసుకోనివ్వండి”, అంది.
నిజమేననుకొంటా!సరేననక తప్పలేదు నాకు.
“నాన్నా…. అమ్మనూ నన్నూ పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపించు. అక్కడ వాకిలి నిండా పెద్ద పేద్ద ముగ్గులు వేస్తాను, గొబ్బెమ్మ లు పెడతాను”, అంది చిన్నారి ఉత్సాహం గా.