చిన్నారి ఆసక్తి…..చిట్టి కథ..

దసరా సెలవలకి మా ఊరెళ్ళిన వాళ్ళం, ఈ రోజే తిరిగొచ్చి, మళ్ళీ  పట్నం లోని మా ఇంట్లో దిగబడ్డాం.

మా అమ్మాయి చిన్నారి,ఇంట్లో అడుగుపెట్టగానే నన్ను ఓ తెల్ల కాగితం ఇవ్వమని అడిగింది .
ఓ అరగంటైన తరువాత ఆ కాగితం మళ్ళీ నా చేతి లో పెట్టింది.

“ఓ డొంక, దారికి ఇరువైపులా తుమ్మ చెట్లు. డొంక లో బండి, దాని మీది రైతు, రైతు చేతి లో చెర్నా కోల,పరుగెడుతున్న ఎద్దులూ, వాటి కాళ్ళ దగ్గర లేచిన దుమ్మూ”.
అది ఏదో పిచ్చి గీతలు గీస్తుందని తెలుసు గానీ, ఇంత మంచి బొమ్మలేస్తుందని నాకు తెలీదు.

“బొమ్మ బానే వేశావు. డ్రాయింగ్ క్లాసు లో చేర్పిస్తాను. వెళ్తావేమే?”

తల గుండ్రం గా తిప్పింది. అవును అని కాదు. కాదు అనీ కాదు.

క్లాసు లో చేర్పించి చూద్దాం. పెద్ద చిత్రకారిణి అవుతుందేమో! ఎవరు చెప్పొచ్చారు!

ఈ మాటే మా ఆవిడ తో చెప్పాను.

“మీరు మాత్రం దానిని ఫోర్స్ చేయవద్దు. దానికిష్టమైతేనే చేర్పించండి”, అందామె.

“నేనేమీ ఫోర్స్ చేయటం లేదు. అది చేరను అంటే కదా నేను ఆగేది.ఈ రోజుల్లో పిల్లలు ఖాళీ గా ఉండటం లేదు. ఎక్కడ చూసినా ఏదో ఓ క్లాసు కి వెళ్తూనే ఉన్నారు. స్విమ్మింగ్ క్లాసుకో, చెస్ కొచింగ్ కో, లేకపోతే, స్కేటింగ్ కో, కరాటే కో..ఇలా.,…రేపట్నుంచీ డ్రాయింగ్ క్లాస్ కి పంపించి చూద్దాం..,” సమర్ధించుకొన్నాను.
*******************************
సంక్రాంతికి ఊరెళ్ళటం కుదరేట్టు లేదు,ఉద్యోగ పనుల వలన. మా అగ్గిపెట్టె ఫ్లాట్ లో, మంచం మీద పడుకొని వార పత్రిక సంక్రాంతి అనుబంధం చదువుతున్నాను. చిన్నారి స్కూల్ బ్యాగ్ భుజాలమీది నుంచీ కిందికి దించి, వచ్చి పక్కన కూర్చొంది.
“చిన్నారీ. ఈ మధ్య గీసిన బొమ్మ ఏదైనా చూపించు”
“ఈ మధ్య ఏమీ గీయలేదు నాన్నా. డ్రాయింగ్ పెద్ద బోర్!”
“నీకు డ్రాయింగ్ అంటే చాలా ఇంటరెస్ట్ కదా! మన ఊరి బొమ్మలు భలే గీశావు కదా నువ్వు?”

“నాన్నా, నేను ఆ డ్రాయింగ్ క్లాసు మానేస్తాను”.

“ఏమ్మా..బొమ్మలు బాగానే వేస్తున్నావు కదా! మొన్న ఓ సారి నువ్వేసిన స్కెచెస్ చూశాను. చాలా బాగున్నాయి”, అన్నాను “అయ్యో, దీన్ని ఓ పెద్ద ఆర్టిస్ట్ గా చూద్దామన్న ఆశ కి ఆది లోనే గండి పడేటట్లుందే!”, అనుకొంటూ.

“శైలూ, చిన్నూ ఇంకా మిగిలిన వాళ్ళంతా ఆడుకొంటుంటే నేనొక్క దాన్నే క్లాస్ కి వెళ్ళ బుధ్ధి కావటం లేదు”.
“వాళ్ళంతా చివరికి ఎందుకూ పనికి రాకుండా అవుతారు చూడు. నువ్వు మాత్రం మంచి ఆర్టిస్ట్ వి అవుతావు”.
“కాదు నాన్నా, డ్రాయింగ్ సార్, గీసిన స్కెచ్ నే పది సార్లు గీయిస్తున్నారు. బోర్ కొడుతూంది”
“మంచిదే కదా! ప్రాక్టీస్ చేసిన కొద్దీ పర్-ఫెక్ట్ గా వస్తుంది. ముందు కొంచెం కష్టమైనా, నెమ్మది గా అదే అలవాటవుతుంది బంగారం”
“లేదు. నేను ఇంట్లోనే ఉండి నాకు డ్రా చేయాలనిపించినపుడు, బొమ్మలు వేసుకొంటాను. ఒక వేళ ఏదైనా గీయటం కుదరక పోతే, అప్పుడు రమేష్ అన్న చేత చెప్పించుకొంటాను. అన్న కి డ్రాయింగ్ బానే తెలుసు కదా! వాళ్ళిల్లు పక్కనే కదా!”.
….నేను ఆలోచిస్తున్నాను… “దీనిని ఎలా మళ్ళీ క్లాసుకి పంపించాలా!”, అని…హఠాత్తు గా మా ఆవిడ గొంతుక..
“సరే చిన్నారీ, నువ్వు ఈ రోజు నుంచీ క్లాసు కి వెళ్ళొద్దు”, అంది గుమ్మానికి అనుకొని మా మాటలు వింటున్న మా ఆవిడ.మాటల లో పడి ఎప్పుడొచ్చిందో చూడనేలేదు.
నా వైపు తిరిగి, “మీరు దానిని ఫోర్స్ చేయొద్దు. దానిని అది ఫోర్స్ చేసుకొని, “క్లాస్ కి పంపించు నాన్నా”, అని అడిగే వరకూ, దానిని ఇంట్లోనే గీసుకోనివ్వండి”, అంది.
నిజమేననుకొంటా!సరేననక తప్పలేదు నాకు.
“నాన్నా…. అమ్మనూ నన్నూ పండగకి అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపించు. అక్కడ వాకిలి నిండా పెద్ద పేద్ద ముగ్గులు వేస్తాను, గొబ్బెమ్మ లు పెడతాను”, అంది చిన్నారి ఉత్సాహం గా.

ప్రకటనలు

10 thoughts on “చిన్నారి ఆసక్తి…..చిట్టి కథ..”

 1. థాంక్స్ ఎన్నెల గారు. చిన్న పిల్లలెప్పుడూ స్పష్టం గానే ఉంటారు. మనతో మనకే టచ్ పోవటం వలన మనమే మిస్-లీడ్ అవుతూ ఉంటాం.మీ ఆం ఆద్మీ ప్రహసనం చాలా బాగుంది.

  మెచ్చుకోండి

 2. Nagesh garu,
  Thank you. It’s the story of many middle class families :-).
  The formalization of the learning is the first step that kills interest/learning. We can’t avoid formal schooling in the case of academics. It’s a necessary evil. Atleast, in the case of hobbies, it’s better to avoid formalizing the learning/education that leads to decline of interest. Hobby should be interest driven, it should not be driven by formal training.
  When the kid grows up and is strongly interested in the hobby, he/she will be voluntarily ready to bear the hardships of formal training anyway.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s