దేవుడు లేడని నిరూపించండి…

అనగనగా ఓ రాజకీయ ఘరానా దొంగ. ఆ దొంగ పేరు రంగా.  గనులనీ, బొగ్గునీ మింగేశాడని రంగా ని కోర్ట్ లో ప్రవేశ పెట్టారు.
దొంగతనం అతను చేశాడా లేదా అనే విషయమై చాలా వాదోప వాదాల మీదట జడ్జ్ గారు తగినన్ని ఆధారాలు లేనందున రంగా కి శిక్ష విధించకుండా వదిలి పెట్టారు.జడ్జి గారు చాలా నిజాయితీపరుడూ, గంగి గోవు లాంటి వాడు.

జడ్జ్ గారు తీర్పు అయినాక తన ఇంటికి వెళ్ళారు. అక్కడ రంగాని పట్టుకొన్న సీబీఐ ఆఫీసర్ టీ తాగుతూ కనిపించాడు. ఆఫీసర్ జడ్జ్ గారికి వ్యక్తిగతం గా స్నేహితుడే!

ఆఫీసర్ :జడ్జ్ గారూ, మీరు రంగా ని వదిలేసి చాలా తప్పుచేశారండీ. వాడు చాలా పెద్దనేరం చేశాడు. దేశాన్ని దోచుకొన్నాడు.

జడ్జ్: వాడి మీద తగినన్ని సాక్ష్యాధారాలు లేవు. ఆధారాలు లేవన్నంత మాత్రాన దానర్ధం వాడు నేరం చేయలేదని కాదు. ఆధారాలు లేవంటే మన చేతిలో ఆధారాలు లేవని మాత్రమే!అదే వాడు దోచాడని ఆధారాలు ఉంటే వాడు దొంగతనం చేయలేదనటానికి చాన్సే ఉండేది కాదు. ఈ సారి ఆధారాలు పకడ్బందీ గా సేకరించండి.

********************************************************************

ఆ రాత్రి కి జడ్జ్ గారు క్లబ్ కి వెళ్ళారు. అక్కడ మన రాజకీయ దొంగ తన ఫ్రెండ్స్ తో పెద్ద పార్టీ చేసుకొంటున్నాడు. రా.దొంగ(రంగా) జడ్జ్ గారి దగ్గరి కి వెళ్ళి, “ఏం జడ్జ్ గారూ, మీరు కూడా జాయిన్ అవుతారా?”, అన్నాడు.
జడ్జ్ గారు, ” నేను నేరస్తుల పార్టీ ల లో పాలు పంచుకోను”, అన్నారు.
రంగా: “అదేంటి సార్? నేను నేరం చేశానని రుజువులు లేవని మీరే చెప్పారు కదా? అంటే నేను నిర్దోషినే కదా?”
జడ్జ్: “నువ్వు నేరం చేయలేదని ఎలిబీ ఏమైనా ఉందా? నువ్వు నేరం చేయలేదని రుజువు అయ్యే వరకూ నువ్వు నా వ్యక్తిగత మనస్సాక్షి దృష్టి లో నేరస్తుడివే!మొన్నటిదాకా జులాయి లా తిరిగిన నువ్వు, ఇవాళ ఇంత పెద్ద పార్టీ ఎలా ఇస్తున్నావు?  నువ్వు నేరం చేయలేదని రుజువులు ఉన్న రోజున నేను నీకే పిలిచి సన్మానం చేస్తాను”.

—————————————————————————————————————–
పై ఉదాహరణ కీ, ఆస్తికులూ నాస్తికుల మధ్య “దేవుడు ఉన్నాడా లేడా ?” అని జరిగే వాదనల కీ చాలా పోలిక ఉంది.
దేవుడు ఉన్నాడని ప్రూఫ్ లేనంత మాత్రాన దేవుడు లేడని అర్ధం కాదు. దాని అర్ధం మన చేతుల్లో ప్రూఫ్ లేదని మాత్రమే.
అలానే, “దేవుడు ఉన్నాడని ప్రూఫ్ లేదు” అంటే, దేవుడు లేడనటానికి ప్రూఫ్ అవసరం లేదని కాదు. దేని ప్రూఫ్ దానిదే! కాబట్టీ, నాస్తికులని దేవుడు లేడని ప్రూవ్ చేయమని అడగటం లో తప్పేమీ లేదు. ఎందుకంటే, మన దగ్గర ఉన్నది “ప్రూఫ్ మాత్రమే”. దేవుడు లేడు అని ప్రూవ్ అయ్యేంత వరకూ, లేడనే నమ్మకానికి ఋజువు లేనట్లే!  . అలానే ఉన్నాడని ప్రూవ్ అయ్యేంతవరకూ ఉన్నాడనే నమ్మకానికి ఋజువు లేనట్లే!
ఇంతకీ దేవుడు అంటే డెఫినిషన్ (నిర్వచనం) ఏమిటి?మన కళ్ళెదుట కనపడే వస్తువులకి (గోడా, కుర్చీ, టేబులూ వగైరాలకి) ప్రూఫ్ ఎందుకు అడగం?

PS: 1.ప్రూఫ్ లేని నమ్మకం వ్యక్తిగతమైనది. ప్రూఫ్ నమ్మకాన్ని వస్తుగతం చేస్తుంది.

2.డెఫినిషన్ లేని దానికి ప్రూఫ్ ఉండదు.

62 thoughts on “దేవుడు లేడని నిరూపించండి…”

  1. You tell me that you believe a ten headed monster caused the 2004 tsunami in Indian Ocean..
    I tell you that it’s your delusional thinking and challenge you to prove it…
    Now, the burden of proof is on you.
    It remains a delusional thought until proven otherwise.

    Here is a dictionary meaning of God:
    “the one Supreme Being, the creator and ruler of the universe”.
    It’s probably safe to assume that most people agree with this definition of God.

    You tell me that God created this universe and manages it..
    I tell you that there is no proof to support your argument…
    Now, the burden of proof is on you.
    It remains a belief in an imaginary entity until proven otherwise.

    మెచ్చుకోండి

  2. “I tell you that it’s your delusional thinking and challenge you to prove it…”
    I am not talking about Monsters and delusional thinking”
    “You tell me that God created this universe and manages it..”
    OK.
    “I tell you that there is no proof to support your argument…”
    OK. I too agree. I don’t have proof. I am a blind believer.
    “Now, the burden of proof is on you.”
    No. If I am a blind believer, I believe despite lack of proof.Now.. I am asking you , since you are a non-believer, could you prove there’s no God.
    If you do not have proof for that, that means you believe there is no God. Yours is also a belief. You are on equal footing with me.
    “It remains a belief in an imaginary entity until proven otherwise.”
    Suppose a villager from a remote tribal hamlet has visited Tajmahal. Without taking a photo of it, he came back to his village. He told his villagers he saw Tajmahal. But the villagers didn’t believe him and asked for proof. He does not have proof. That does not mean he hadn’t visited Taj mahal. Taj mahal does not become imaginary. He simply did not have the proof(photograph) with him.

    మెచ్చుకోండి

  3. నాకు నిజంగా తెలియదు ఇక్కడ ఏం రాయాలో? కానీ నాకు ఈ సబ్జెక్ట్ చాలా ఇష్టం. నా బ్లాగ్ లో రెందు పోస్ట్స్ కూడా రాశాను.
    1. Mr.God, do we need you?
    2. Am I being ignored?

    నాకు తటస్థం గా (ఎగ్నాస్టిక్) ఉండటమే ఇష్టం, నాస్తికుడిగా లేదా ఆస్తికుడిగా ఉండటం కన్నా.

    దేవుడు ఉంటే తన పని తాను చేస్తాడు. నేను అసలు పట్టించుకోను తన ఉనికిని. తను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే నాకు. ఈ కేస్ లో , నాకు మరణం తరువాత “వాళ్లు” చెప్పినట్టుగా ఆమ్నిసైంట్ నాలెడ్జ్ వస్తే , దేఉవ్డు ఉన్నాడు అని నేనెరిగితే నాకు వచ్చేదీ లేదు, పోయేదీ లేదు. ఎందుకంటే దేవుడు పూజించిన వాళ్లనే కరుణిస్తాడు అనేది ఒక బూతు. సో, అతను నాస్తికులనీ, ఆస్తికులనీ నిస్పక్షపాతం గా చూస్తాడు. పక్షపాతం అల్లా ఒక్క విషయం లోనే… మంచివాడా, చెడ్డవాడా?

    So, its better to be agnostic than being atheist or believer.
    But, whatever you are, do not criticize the other’s beliefs. You just be human and help each other.

    So, we dont have to prove existence of God.
    —-
    As they said in the movie “Wrath of the Titans”, and it is really a truth (even mentioned in Upanishads – Maandokya) “Prayers bring in energy for God”. People in traetaayuga or dvaaparayuga, they used to really “pray” god, which brings in energy for God and he used to appear or “work” for people. Now a days people hardly pray or our prayers are selfish or meaningless. So, God don’t have to be really working. And as mentioned in Christianity, when you dont pray God, it is Satan who gains energy. That’s what happenning now!

    Sorry for writing two confusing things.
    But just wanted to see how others really comment on this, honestly.

    మెచ్చుకోండి

  4. దేవుడు ఉన్నాడనో లేడనో అనుకోవటం వ్యక్తిగతమైన నమ్మకం. బొందలపాటిగారి సమాధానం బావుంది. అసలు సమస్యంతా ఈ నమ్మకాలను వాడుకుని మోసాలకు అరాచకాలకు పాల్పడేవారినుంచే.

    మెచ్చుకోండి

  5. Thank you.
    “అసలు సమస్యంతా ఈ నమ్మకాలను వాడుకుని మోసాలకు అరాచకాలకు పాల్పడేవారినుంచే”
    Correct. I think Atheists and Theists should not be enemies.
    Enemity should be a thing between goons/fakes and good people

    మెచ్చుకోండి

  6. వొక ప్రశ్న మీకు–
    నేను నా వేలితో గాల్లో వొక పెద్ద సున్నా చుట్టి అదేమిటని మిమ్మల్ని అడిగితే మీరేమని సమాధానం ఇస్తారూ.?సున్నా అనా?లేక వేలిని గాల్లో తిప్పాననా?ఇది మీరు రాసిన పోస్ట్ కి సంభందమున్న ప్రశ్నే ..

    మెచ్చుకోండి

  7. మీకు proof of burden gurimci తెలిసే ఉంటుంది.

    ఇప్పుడు నేను బల్లలకీ, కుర్చీలకీ ప్రాణం ఉంటుందనీ, అవి మనం లేనప్పుడు కదులుతాయనీ, మాట్లాడతాయనీ, మనం కనబడగానే నిర్రనీలుక్కుపోతాయనీ అన్నాననుకోండి, అప్పుడు దాన్ని ఋజువుచెయ్యాల్సిన బాధ్యత నామీద ఉంటుంది. అంతేగానీ మీమీదకాదు. కూడానేను క్యామెరాపెట్టినా కూడా అవి ఆవిషయాన్ని గ్రహించి, నిర్రనీలుక్కుపోతాయని అన్నాననుకోండి దానర్ధం నేను మీకు disproove చేసే అవకాశాలను మృగ్యం చేస్తున్నానన్నమాట.

    దేవుడున్నాడనుకుంటే ఇలాంటి సంజాయిషీలు ఎన్నో ఇవ్వాల్సుంటుంది. ఇన్ని సెలైన్లు ఎక్కించినా దేవుడనేది practicalకాదన్నీ చచ్చేదాన్ని బ్రతికించడమేనన్నవిషయం వీరభక్తుల ప్రవర్తనలోకూడా కనబడుతుంటుంది. దాన్నే ముద్దుగా మానవప్రయత్నం అంటారు.

    ఇక ప్రూఫుల దగ్గరికొస్తే వీళ్ళ ప్రూఫులన్నీ వీళ్ళురాసిన పుస్తకాలనుండే చూపిస్తారు. వాటిని ప్రశ్నించిన్వాళ్ళను సాతానులు/ప్రతివాదులు/నాస్తికులు అని నిందిస్తారు.

    మీకు తెలీనిదేముంది religion is all about controlling the masses and is a way to power.

    మెచ్చుకోండి

  8. “అసలు సమస్యంతా ఈ నమ్మకాలను వాడుకుని మోసాలకు అరాచకాలకు పాల్పడేవారినుంచే”
    “Correct. I think Atheists and Theists should not be enemies.
    Enemity should be a thing between goons/fakes and good people”

    I agree with you. In this context I would like to add few more thoughts ;

    ఎదుటివారి నమ్మకాలను గౌరవించడము అనేది ఉత్తమ సంస్కారం. ఒకరిని అనవసరంగా అవహెళన చేసినప్పుడు చాలా సమస్యలు వచ్చేందుకు అవకాశముంది. ఇందులో ఎవరూ ఎవరినీ మోసగించడం అనేది లేదు కానీ అవతలివారిని తెలివితక్కువ వారనో లేక చదువుకున్న మూర్ఖులనో అని బాధిస్తారు. ఏ నమ్మకమైనా అది ఆ నమ్మే వ్యక్తి కి కానీ లేక ఇతరులకు/సంఘానికి ఏ విధమైన హాని కలిగించనంతకాలం ఎవరికీ అభ్యంతరం ఉండకూడదు. అలాగే మంచిగా,మర్యాదగా చెబితే ఎవరైనా ఏ విషయాన్నైనా వింటారు మరియు తప్పక వారి వారి జ్ఞాన పరిధిలో ఆలోచిస్తారు.
    అస్తికులైనా,నాస్తికులైనా, మేమే తెలివైనవారమన్న ఆలోచన/అహంకారం ఎవరికీ తగదు. ఇద్దరూ చక్కగా మంచి స్నేహితులలాగా ఉండి మానవ సేవయే (మాధవసేవ ) ప్రధానమనుకొంటు ప్రగతిపథంలో సాగిపోవచ్చుఅనుకుంటాను.

    మీ బ్లాగ్ posts ఆసక్తికరంగా ఉంటాయండి; many thanks Bondalapati garu.

    మెచ్చుకోండి

  9. ధన్యవాదాలు రావు గారు.
    అవునండీ.. ఎవరైనా మనుషులు ఉండే పరిధికి లోబడే ఆలోచిస్తారు. కాబట్టీ ఒకరు ఏదో పేద్ద గొప్ప గా ఫీలవ్వనవసరం లేదు.

    మెచ్చుకోండి

  10. హెంత..ధైర్యం..హెంత ధైర్యం..నా బ్లాగ్ లోనే నాకు లీడింగ్ కొశ్చన్లా? ..
    రెండూ కాదు..హోటల్ కెళ్ళి ఇడ్లీలు తిందాం రమ్మంటున్నారనుకొంటాను.. 🙂
    నాది మీకో ప్రశ్న..మీరు చుట్టిన చుట్టు చూసి నేను మీకు మూడు వేళ్ళు చూపిస్తే మీరేమనుకొంటారు?

    Jokes apart…
    1.నార్మల్ గా అయితే సున్నా అనే చెబుతాం..
    2.మీరు లీడింగ్ ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టీ కొంచెం జాగ్రత్త పడి, “గాల్లో వేల్తొ సున్నా ఆకారం లో తిప్పారని”, చెప్తాం.
    3.ఏం చెప్తే ఏముందిలే అనుకొంటే ఏదో గాల్లో గీశాడని చెప్తాను.
    మీరు అర్ధం/సారం గురించి మాట్లాడుతున్నారని ఊహిస్తున్నాను.

    మెచ్చుకోండి

  11. Expert gaaru,
    దేవుడి నిర్వచనం మీద ఇవన్నీ ఆధారపడతాయి. దేవుడనే దానిని చాలా అబ్-స్ట్రాక్ట్ గా డిఫైన్ చేస్తే కొంచెం వెసులు బాటు ఉంటుంది.

    మెచ్చుకోండి

  12. “దేవుడి నిర్వచనం మీద ఇవన్నీ ఆధారపడతాయి.”

    అవును, కాని నిర్వచించిన వారే నిరూపించవలసిన బాధ్యత తీసుకొనవలసి వుంటుంది, ఇతరులు కాదు. అలా నిర్వచించిన వారు పలాయనం చిత్తగిస్తూ “తమది కేవలం నమ్మకం మాత్రమే” అని చెప్పినప్పుడు వారి నమ్మకాన్ని ఎదుటివారు తప్పుగా నిరూపించ వలసిన అవసరమూ లేదు. అది కేవలం తమ నమ్మకం మాత్రమే నని, సత్యం కాదని వారే ఒప్పుకుంటున్నారు కాబట్టి.

    “దేవుడనే దానిని చాలా అబ్-స్ట్రాక్ట్ గా డిఫైన్ చేస్తే కొంచెం వెసులు బాటు ఉంటుంది.”

    అలాంటి ప్రయతం ఇప్పటివరకు ఏ మతం లోనూ జరిగినట్టు లేదు.

    మెచ్చుకోండి

  13. పాతకాలం లో ఆస్థికులు, దేవుడంటే రక్షించే వాడనీ, మంచివాడనీ ఇలా స్పష్టం గానే నమ్మే వారు.
    ఈ కాలపు ఆస్థికులు ఏదో శక్తి ఉందనీ. దేవుని లీలలూ పనులూ మానవ మాత్రులకు అర్ధం కావనీ, ఇంకో మెట్టు పైకి వెళ్ళి దైవం అనిర్వచనీయమనీ, కానీ ఆ శక్తి లో తమకు నమ్మకం ఉందనీ చెప్తున్నారు.
    కాబట్టీ అస్తికులు కూడా దేవుడిని నిర్వచించటం లేదు.

    ““తమది కేవలం నమ్మకం మాత్రమే” అని చెప్పినప్పుడు వారి నమ్మకాన్ని ఎదుటివారు తప్పుగా నిరూపించ వలసిన అవసరమూ లేదు. ”
    మీరు సరిగానే చెప్పారు. ఆస్తికుల నిర్వచనాన్ని ఆస్తికులే నిరూపించుకోవాలి. అలానే, నాస్తికులు తమ వాదాన్ని తామే నిరూపించుకోవాలి. నాస్తికులు తమది నమ్మకం కాదంటున్నారు కాబట్టీ, తమ వాదాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నాస్తికులకేమన్నా ఈ సృష్టి గురించి సంపూర్ణ జ్ఞానం ఉందా? ఒక వేళ అలా ఉంటే, వారు కారణాల తో సహా దేవుడులేడని నిరూపించవచ్చు. ఒక వేళ వారికి సంపూర్ణ జ్ఞానం లేకపోతే, వారు దేవుడు లేడని చెప్పే మాటలు “వారికి తెలిసినంతలోనే” అనుకోవాల్సి వస్తుంది. అంతరిక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం ప్రకారం తీసుకొన్నా, ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. తెలిసినది కొంచెం. తెలియాల్సింది చాలా.

    చివరిగా ఆస్తికులూ నాస్తికులూ కూడా (ఉన్నాడు లేదు అనే మాటలను పక్కన పెడితే), తెలియదు, అనిర్వచనీయం, తెలుసుకోలేం అనే అభిప్రాయాలకే వస్తున్నారు.

    “అలాంటి ప్రయతం ఇప్పటివరకు ఏ మతం లోనూ జరిగినట్టు లేదు.”
    నాకు తెలిసినంతలో ఇస్లాం, అల్లా ని మనిషి అర్ధం చేసుకోలేడని చెప్పింది. కానీ తరువాత, అల్లా కి ప్రవక్త ద్వారా మార్గం ఏర్పడటం అవన్నీ వేరే విషయాలు.

    మెచ్చుకోండి

  14. మీరు రెండు విషయాలను కలగా పులగం చేస్తున్నారేమో అనిపిస్తుంది. విషయం దేవుని గురించి అయితే సృష్టి మధ్యలో ఎందుకు వచ్చింది?

    చరాచరాదులను దేవుడు సృషించాడు అని అస్తికులంటే దాన్ని అస్తికులే నిరూపించ వలసి వుంటుంది. అది నిరూపించేవరకు నాస్తికులు దాన్ని నమ్మరు. వేరొకరు ప్రతిపాదించి, నిరూపించకుండా వున్న సిద్ధాంతాన్ని నమ్మకుండా వుండడానికి అలా నమ్మని వారు దేన్నీ నిరూపించవలసిన అవసరం లేదు.

    ఇక నాస్తికులు దేవుడు కాక సృష్టికి మరొకరెవరో కారణం అని చెప్పడం లేదు. సృష్టికి కారణం ఇంతవరకు నిరూపించ బడలేదనే చెపుతున్నారు. కాబట్టి తాము ప్రతిపాదించని అంశాన్ని నిరూపించే అవసరం నాస్తికులకు లేదనుకుంటాను.

    మెచ్చుకోండి

  15. “విషయం దేవుని గురించి అయితే సృష్టి మధ్యలో ఎందుకు వచ్చింది?”
    ఎందుకంటే, దేవుడు అనే ఆసామీ ఉన్నాడా లేడా అని దేవుళ్ళాడవలసింది ఈ సృష్టి (విశ్వం) అనబడే పేట లోనే. ఈ పేట కి ఆవల ఏమి ఉందో మనకి తెలియదు.
    ఈ పేటలో ఉండే జనాల వివరాలు మనకి పూర్తిగా తెలియవు.
    ఈపేట లోనే అనేక ప్రదేశాలు మనకి తెలియదు. అలాంటపుడు ఆసామీ ఉనికి ఎలా తెలిసేది?
    ఆస్తికులు..వారూ ఏమీ ప్రతిపాదిస్తుంచటంలేదు. దేవుడి లీలలు మనకి అర్ధం కావు అంటున్నారు.

    “..నిరూపించకుండా వున్న సిద్ధాంతాన్ని నమ్మకుండా వుండడానికి అలా నమ్మని వారు దేన్నీ నిరూపించవలసిన అవసరం లేదు.”

    కరక్టే. అవసరం లేదు. అది మీ ఇష్టం. లేడని మీరు నిరూపిస్తే అది వస్తుగతమైన సత్యమౌతుంది. నిరూపించకపోతే మీ నమ్మకమౌతుంది. దేవుడు లేడని ఖరాకండిగా నిరూపించటం రెండు విధాలుగా సాధ్యమౌతుంది.
    1. సంపూర్ణమైన నాలెడ్జ్ ఉన్నపుడు సాధ్యమౌతుంది. ఊళ్ళో ఆసామీ లేడని నిరీపించటానికి ఊరూ, ఊళ్ళోని జనాలూ అంతా అభువణువూ తెలిసినపుడే సాధ్యం.
    2.ఆస్తికులు దేవుడికి ఓ నిర్వచనం ఇస్తే ఆ నిర్వచనం తప్పు అని నిరూపించటం ద్వారా సాధ్యమౌతుంది(ఆస్థికులు నిర్వచించిన దేవుడు లేడని ).
    కానీ ఆస్తికులు దేవుడు నిర్గుణుడు, అనిర్వచనీయుడు అంటున్నారంటే దానర్ధం, దేవుడిని నిర్వచించటానికి వారు నిరాకరిస్తున్నారు. నాస్తికులు సృష్టి కి కారణాన్ని నిర్వచించటానికి నిరాకరించినట్లు.

    మెచ్చుకోండి

  16. బొందలపాటి గారు,

    అస్తికులు మీరు చెప్పినట్టు “దేవుడు అనిర్వచనీయుడు” అని చెప్పి ఊరుకోవడం లేదు.

    దేవుడు విష్ణు, బ్రహ్మ, షివుడు… వారి గాథలు.
    దేవుడు సాయిబాబా, అయ్యప్ప, వేంకటేశ్వరుడు… గాథలు
    దేవుడు సాయిబాబా, మరిన్ని గాథలు
    ఇంకా అల్లా,

    ఇవన్నీ నిర్వచనాలే. పైగా వీరందరిని ప్రార్థించడానికి రకరకాల విధానాలు ఏర్పరచారు. తిరుపతి, షిర్డీ, శబరిమలై, చార్‌ధాం, మక్కా మొదలైన పుణ్య క్షేత్రాలు… అవి దర్శించుకోవడానికి ప్రజలు పడే కష్ట నష్టాలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు “దేవుడు అనిర్వచనీయుడు, ఆయన్ని దర్శించు కోవడానికి ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు, ఏ వ్రతాలు చేయనక్కరలేదు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవలసిన అవసరం అంతకన్నా లేదు” అని చెప్తున్న గురువులు ఎవరూ కనపడడం లేదు.

    అసలు ‘అస్తికులంటే ఎవరు?’ అన్న దగ్గరనుంచి చర్చ ప్రారంభించాలేమో?

    మెచ్చుకోండి

  17. “..అసలు ‘అస్తికులంటే ఎవరు?’ అన్న దగ్గరనుంచి చర్చ ప్రారంభించాలేమో?”
    అవును ఆస్తికులు అనే గొడుగు కిందికి అనేక రకాల మనుషులు వస్తారు. పాపులర్ ఆస్తికులు, భక్తులు, ఇలా. నేను మాట్లాడెది ఆస్తికులలో ఒక చిన్న వర్గం గురించి.
    అలానే నాస్తికులలో కూడా మనిషి పరిమితులు తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు (మనిషి అన్నీ కనిపెట్టేస్తాడనో, ఇంకా తెలుసుకోవాల్సింది లేదనో అనే వారు) ఉంటారు. రెండు వర్గాల లోనూ మూర్ఖ వాదన చేసే వారు కొట్టుకొంటూనే ఉంటారు. In principle రెండు వైపులా, కాస్తంత ఆలోచించ గలిగిన వారు చెప్పే విషయం లో, పెద్ద వ్యత్యాసం ఏమీ కనపడదు నాకు. అదే “సృష్ట్యాది,దేవుడు నిర్వచనాలకి అందరు, .. అర్ధం కారు, ..తెలియరు. “.
    మనిషికి సృష్టి లోని కొన్ని విషయాలు ఎప్పటికీ అర్ధం కావు అనేది నా అంచనా. నా గోల ఇక్కడ రాసుకొన్నాను. http://wp.me/pGX4s-K2

    మెచ్చుకోండి

  18. నాస్తికులు తమది నమ్మకం కాదంటున్నారు కాబట్టీ, తమ వాదాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నాస్తికులకేమన్నా ఈ సృష్టి గురించి సంపూర్ణ జ్ఞానం ఉందా? ఒక వేళ అలా ఉంటే, వారు కారణాల తో సహా దేవుడులేడని నిరూపించవచ్చు. ఒక వేళ వారికి సంపూర్ణ జ్ఞానం లేకపోతే, వారు దేవుడు లేడని చెప్పే మాటలు “వారికి తెలిసినంతలోనే” అనుకోవాల్సి వస్తుంది. అంతరిక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం ప్రకారం తీసుకొన్నా, ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. తెలిసినది కొంచెం. తెలియాల్సింది చాలా….. అని చక్కగా వ్రాసారు.

    మెచ్చుకోండి

  19. పూర్వకాలంలో కొందరు భక్తులు తాము దైవదర్శనాన్ని పొందామని స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఉదా..రామకృష్ణపరమహంస వారు .
    అయితే దైవదర్శనాన్ని కొందరు మాత్రమే పొందటానికి ఎన్నో కారణాలుంటాయి.

    నాస్తికులు ఏమంటారంటే , దైవాన్ని చూపించండి అంటారు.
    ఇక్కడ ఇద్దరు వ్యక్తుల సంభాషణను చూద్దాము.
    మొదటి వ్యక్తి మామిడిపండును తింటున్నాడనుకుందాము.
    ఇంతకు ముందు ఎప్పుడూ మామిడి పండును తినని రెండవ వ్యక్తి మొదటి వ్యక్తిని…. మామిడి పండు రుచి ఎలా ఉంటుంది ? అని అడిగితే….
    మొదటి వ్యక్తి ; మామిడిపండు తియ్యగా ఉంటుంది. అని జవాబిస్తాడు.
    రెండవవ్యక్తి ; తియ్యగా అంటే ఎలాంటి తీపి ? పనసపండు లాగానా ? లేక జామ పండు లాగానా ?
    మొదటి వ్యక్తి ; రెండూ కాదు. మామిడి పండు రుచి మామిడి పండుదే.
    రెండవవ్యక్తి ; అంటే ఎలా ఉంటుంది ?
    మొదటి వ్యక్తి ; చెప్పటం కుదరదు. నువ్వు కూడా మామిడిపండును తింటేనే ఆ రుచి నీకు తెలుస్తుంది. అంటాడు.
    దైవాన్ని దర్శించాలని అనుకునే నాస్తికులు దైవాన్ని చూపించమని ఇతరులను అడగటం కన్నా, తాము కూడా ఆ మార్గంలో ప్రయత్నిస్తే తప్పక దైవదర్శనాన్ని పొందగలరు.

    మెచ్చుకోండి

  20. ఈ సృష్టి ఎలా మొదలయ్యింది ? అనే ప్రశ్నకు …………

    ఆస్తికులు దైవం చేత సృష్టించబడింది అని జవాబిస్తారు.
    నాస్తికులు ( హేతువాదులు ) ఈ సృష్టి దానికదే మొదలయ్యింది అని జవాబిస్తారు.

    పై రెండు జవాబులను గమనిస్తే ఆస్తికులు ఇచ్చిన సమాధానమే హేతుబద్ధంగా ఉంది కదా !

    ఇక దైవాన్ని ఎవరు సృష్టించారు అంటే , ఈ ప్రశ్నకు సమాధానం మనకు తెలియకపోయినా, దైవం చక్కగా చెప్పగలరు.

    మెచ్చుకోండి

  21. దైవం కంటే ముందు ఏమి ఉంది ? అని నాస్తికుడయిన ఒక రాజు వేసిన ప్రశ్నకు …..
    గోదాదేవి తండ్రి గారు ఏమని సమాధానం ఇచ్చారంటే……… ఒకటి అనే సంఖ్య కన్నా ముందు ఏమి సంఖ్య ఉంది ? అని అడిగారు.
    అప్పుడు నాస్తికుడైన రాజు ఏమీ సమాధానం చెప్పలేకపోతాడు..
    ఒకటి అనే సంఖ్యకు ముందు సంఖ్య ఏమిటో మనకూ తెలియదు కదా ! సంఖ్యలకు అంతము లేదు. లెక్కపెట్టిన కొద్దీ వస్తూనే ఉంటాయి.

    * దైవానికి ఆదీ అంతమూ లేదు.

    మెచ్చుకోండి

  22. Thanks Anuradha Garu.
    “God does not have staring and ending”. This statement is similar to “The universe is started by itself”. The second statement implies that Universe does not have start and probably end. If you can accept a God that does not have start and end, you should also accept a Univers that started by itself.

    మెచ్చుకోండి

  23. ఇంతకుముందు వ్యాఖ్యలో అంకె అని వ్రాయటానికి బదులు సంఖ్య అని వ్రాశాను.
    …………………………………
    bondalapati గారు మీకు కృతజ్ఞతలండి.

    ఒక్క విషయమండి ! ఆలోచన లేనిదే ఏ పనీ జరగదు కదా ! ఆలోచనాశక్తి లేకుండా ఇంత అత్యద్భుతమైన సృష్టి దానికదే ఎలా ప్రారంభవుతుంది ? ఎలా నడుస్తుంది ? ఎలా తనలో తనే లీనమవుతుంది. అందుకని మనకు ఏమి తెలుస్తుందంటే , సృష్టికి ముందే ( సృష్టితోనే ) ఆలోచనాశక్తి ఉంది అని.

    ఇంత గొప్ప సృష్టి ఏర్పడాలంటే ఆలోచనాశక్తి ఎంతో అవసరం. ఆకాశంలో ఎగిరే పక్షులకు రెక్కలుంటాయి. నీటిలో ఈదే చేపకు ఈదటానికి అనువైన శరీరం ఉంటుంది. ఇలా సృష్టిలో అన్నీ ఏది ఎలా ఉండాలో అలా పద్ధతిగా ఉన్నాయి. ఇలా ఏర్పాటు చేయాలంటే ఎంతో అత్యద్భుతమైన ఆలోచనా శక్తి గల మహా శక్తికే సాధ్యం. విశ్వమంతటా వ్యాపించి ఉన్న ఈ మహాశక్తినే ఆస్తికులు దైవంగా ఆరాధిస్తారు.

    సృష్టి దానికదే మొదలయింది అనుకున్నా తప్పులేదు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, సృష్టి అన్నా దైవం అన్నా వేరు కాదు. రెండూ ఒకటే. అలాంటప్పుడు దైవం ( సృష్టి ) నుంచే సృష్టి మొదలయ్యింది ( దానికదే ).అని కూడా చెప్పుకోవచ్చు.

    ఈ మహా శక్తినే ఆస్తికులు దైవం అంటారు. నాస్తికులు విశ్వం ( Universe) అంటారు….
    ఈ మహాశక్తి సాకారము కావచ్చు నిరాకారము కావచ్చు.

    అయితే, ఈ శక్తి అత్యద్భుతమైన ఆలోచనాశక్తి కల మహాశక్తి ( దైవం ) అని మనం తెలుసుకోవాలి.

    వ్రాసిన విషయాలలో పొరపాట్లు ఉంటే దైవం దయచేసి క్షమించాలని ప్రార్ధిస్తున్నాను.

    మెచ్చుకోండి

  24. ***
    I tell you that it’s your delusional thinking and challenge you to prove it…”
    I am not talking about Monsters and delusional thinking”
    ***

    I chose this example to make a logical point of who has the burden of proof in an argument. One could substitute the monster in my example with any imaginary being, but the person that made the claim bears the responsibility for proof.

    ***
    “You tell me that God created this universe and manages it..”
    OK.
    “I tell you that there is no proof to support your argument…”
    OK. I too agree. I don’t have proof. I am a blind believer.
    “Now, the burden of proof is on you.”
    No. If I am a blind believer, I believe despite lack of proof.
    ***

    If you admit that your’s is a blind belief, you are also admitting that it has no validity beyond your imagination. The argument is over.

    ***
    Now.. I am asking you , since you are a non-believer, could you prove there’s no God.
    If you do not have proof for that, that means you believe there is no God. Yours is also a belief. You are on equal footing with me.
    ***

    With due respect, Bondalapati garu… this is no logical argument, not worthy of you. Allow me to explain by using a classic example atheists love to use: Collecting stamps is a hobby,but that doesn’t make ‘not collecting stamps’ a hobby too. If I don’t believe in an imaginary being, that doesn’t make me a believer of the non existence of the imaginary being. It just means that the being exists in imagination only.

    ***
    “It remains a belief in an imaginary entity until proven otherwise.”
    Suppose a villager from a remote tribal hamlet has visited Tajmahal. Without taking a photo of it, he came back to his village. He told his villagers he saw Tajmahal. But the villagers didn’t believe him and asked for proof. He does not have proof. That does not mean he hadn’t visited Taj mahal. Taj mahal does not become imaginary. He simply did not have the proof(photograph) with him.
    ***

    I am sorry Bondalapati garu, you chose an ill-suited example. It doesn’t help your argument. Here is why: Not having a photo of Tajmahal doesn’t make the existence of it unprovable. The existence of Tajmahal is a verifiable fact and a repeatable experience unlike that of god. The visitor has several other recourses to prove that Taj exists beyond any reasonable doubt, but that is not the case for god believers. With that said, the villagers have every right to question the validity of the visitor’s claim. It is the visitor’s responsibility to prove. The villagers’ inquisitiveness is admirable. After all, a curious and questioning mind leads one towards truth. Blind faith, on the other hand, leads one nowhere.

    మెచ్చుకోండి

  25. Chandu garu,

    ***But, whatever you are, do not criticize the other’s beliefs***

    My take on it is that, a lot of people misconstrue criticizing other people’s ideas and beliefs as criticizing the people themselves at a personal level. It doesn’t have to be that way. A healthy argument can not be sustained if either side fails to understand the difference between the criticism of ideas vs personal criticism.

    No one has any right to criticize your belief as long as you keep it to yourself. But, if you bring that personal belief into a public discussion or try to impose it on others, you should be well prepared to handle the criticism of that belief. (I am using the word ‘you’ for clarity sake only, మిమ్మల్ని వ్యక్తిగతంగా ఉద్దేశించినట్లుగా భావించవద్దని మనవి!)

    మెచ్చుకోండి

  26. ***మీరు రెండు విషయాలను కలగా పులగం చేస్తున్నారేమో అనిపిస్తుంది***

    ఎందుకో నాకూ అలానే అనిపిస్తుంది హరి గారు. నాకైతే, బొందలపాటి గారు కావాలనే ఈ చర్చకి తర్కబద్ధమైన ముగింపు కనుగొనకుండా , ముడి మీద ముడి పీట ముళ్ళతో మనందరినీ ఆయన బ్లాగు లో కట్టిపడేసే కించిత్తు చిలిపి ఆలోచన చేస్తున్నట్టుగా కనపడుతోంది. అంతేనంటారా, బొందలపాటిగారూ 🙂

    మెచ్చుకోండి

  27. Nagesh garu,
    If you admit that your’s is a blind belief, you are also admitting that it has no validity beyond your imagination. The argument is over.
    — It does not mean “no validity”. I do not have proof for now. Later it may be proved.
    Collecting stamps is a hobby,but that doesn’t make ‘not collecting stamps’ a hobby too.
    Agreed. Not collecting stamps is not a subset of Hobby. Not collecting stamps includes running, eating sleeping etc, which are not hobbies. Belief is different. Everything in the universe is in the purview of belief except physical things/phenomena/Truth.Its a big superset. If there is a proof that there is no God, then the absence of God will not be a belief.It will be a Truth.Let’s start with the assumption that God is not there. If we have complete knowledge of the existence, then only we can “prove” God is not there . Else it is not possible(according to the abstract definitions thrown by neo-theists). With out proof it’s a beleif.
    –If I don’t believe in an imaginary being, that doesn’t make me a believer of the non existence of the imaginary being.

    1.If you are talking about objects like a chair in your room, you are correct. Either it’s there or not. It’s presence or absence does not make you a beleiver or nonbeleiver. It’s all about the chair. Not about you. Even if you are not there chairs existence can be confirmed from it’s mass etc.
    2. Take electron. You do not see it. You imagine it’s presence. It’s existence in the physical world is proven by physics. So, even though it’s part of our imagination, it’s real/objective/physical also.
    3. Now comes God. Right now it’s part of my imagination only. I do not have proof with me. But mankind may find proof at a later stage. You are telling “you do not think there will be a proof of God in future too”. There is no reason why such a proof will not emerge in future. That’s why your is also a beleif.

    — you chose an ill-suited example.
    Just like your choosing Monster example,I chose this example to make a logical point of “Lack of proof need not make a thing imaginary”. I used the photo just to represent proof. Not to deny there will be practically other proofs.Consider the photo as an embodiment of all proofs of Tajmahal. I am not finding fault with villagers in anyway. One should not beleive blindly. But the other guy does not have proof does not imply the itself does not exist. Beleiver say,” beleive till its proven it does not exist”. Nonbelievers say, “do not beleive till it’s proven it exists”.

    మెచ్చుకోండి

  28. ఎవరైనా కామెంటితే ఆనంద పడతాను కానీ, కామెంటుకోసం ముళ్ళేయను, ముడులూ వేయను.. ఒరిజినల్ పోస్ట్ పరిధిలోలేనిది కామెంట్లలో ఏదీ లేదనుకొంటాను. నా సమాధానాలలో కూడా ఒరిజినల్ పోస్ట్ లో చెప్పినదే కొంచెం విపులం గా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. -)

    మెచ్చుకోండి

  29. అనురాధ గారు,
    భగవంతుడు ఆలోచనాపరుడై, పర్-ఫెక్ట్ అయితే సృష్టి లో లోపాలూ, విలయాలూ, ప్రళయాలూ ఉండకూడదు. ప్రళయాలు మనిషి పర్యావరణాన్ని పాడుచేసి తెచ్చుకొన్నవని అనకండి (మనిషి పాడు చేశాడు అనుకొన్నా మనిషి కి ఉన్న సోకాల్డ్ ఫ్రీ విల్ కూడా, భగవతుడు ఇచ్చిందే, లేక భగవంతుడు సృష్టించిన పరిస్థితుల వలన ఏర్పడిందే). మానవజాతి పుట్టకముందు నుంచీకూడా ప్రళయాలున్నాయి. అనేక మూగజీవాలు చనిపోయాయి.
    ఆలోచనలేకుండా ఈ డిజైన్ ఎలా వచ్చిందంటారా? ఓ జలపాతం ఒక కొండను ఒరుసుకొంటూ పోతేనే రాళ్ళలో అనేక రూపాలు ఏర్పడతాయి. ఇక కొన్ని బిలియన్ సంవత్సరాల వయసు కల సృష్టి లో అనేక జీవజాలపు వ్యవస్థలు ఏర్పడటం లో పెద్ద వింత లేదు. పరిణామ వాదం చాలా వరకూ దీనిని వివరించింది (పూర్తిగా కాదు).

    మెచ్చుకోండి

  30. మామిడిపండు రుచి అందరికీ ఒకేవిధం గా ఉంటే సమస్యే లేదు.
    ఒక్కొక్కరికీ ఒక్కో విధం గా ఉండటం వలనే వాదాలు వస్తాయి.కొందరు అసలు రుచే లేదు అనికూడా అంటారు. అప్పుడు ఎవరు కరక్టో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది.

    మెచ్చుకోండి

  31. Now, the burden of proof is on you.
    It remains a delusional thought until proven otherwise.
    ______________________________________________

    No it does not. It remains as a theory that has not been proved.

    “God exists” – the burden of the proof is on the theists
    “God does not exist” – Again, the burden of the proof is on atheists

    As long as you can not prove the non existence of God .. ie, if you can prove that Universe was born otherwise then you are correct as an atheist.

    Even to confirm that something does not exist, one needs proof.

    Until then, the theory remains disputed. As the author and Srikanth rightly said, absence of evidence is not same as the evidence of absence.

    మెచ్చుకోండి

  32. If I say something like “Your heart does not exist”, the burden of proof is on me to prove what I said, not on you. One should realize that there is a third state in addition to “Exists” and “Does not exist” … it is “Lack of sufficient knowledge either to prove or disprove it”. The people who always deny the existence of something tend to ignore the third one, saying “Non-existence can not be proved” … but when somebody asks them how they could be sure of non-existence .. there would be no response.

    మెచ్చుకోండి

  33. If I say “you don’t have a heart inside your body”, the burden is on me to prove it. Fully agreed. Why? Because it is a known fact that a man can not live without a heart. The existence of body and heart inside the body are proven things.

    It is already agreed that if some one says “God existed”, the burden is on that person to prove his case. Unless it is proved, at least theoretically, it is impossible to disprove it by others. So, as the author rightly said, unless the God is properly defined it can not be proved and also it can not be disproved either.

    But who has to define the God? Only the one who is proposing the existence. Without the definition no one else can either disprove or approve his saying. Only they can believe if they want.

    మెచ్చుకోండి

  34. It is already agreed that if some one says “God existed”, the burden is on that person to prove his case.
    _____________________________________________________________

    Agreed. Similarly if someone says God never existed, then the same kind of proof is needed from the other party too.

    Currently the situation is that the theists are not able to prove the existence of God and the atheists are not able to prove the non-existence ( Minimally, proving the non existence of God involves

    1. Proving the birth of the universe by means other than God
    2. Proving that all the activities in the universe self-controlled ( ie not controlled by God)

    At this point of time, we have no knowledge pertaining to the above things. So the conclusion is God MAY OR MAYNOT exist. But MAY OR MAYNOT is not the same as DOES NOT. People who fall into the MAY OR MAYNOT category are basically agnosts.

    Somebody defined God above, right? Its something that creates and controls the universe(s) at the macroscopic level. I am going with that definition for now.

    మెచ్చుకోండి

  35. Bondalapati garu, let’s try and deconstruct your argument# 3…

    ***3. Now comes God. Right now it’s part of my imagination only. I do not have proof with me. But mankind may find proof at a later stage. You are telling “you do not think there will be a proof of God in future too”. There is no reason why such a proof will not emerge in future. That’s why your is also a beleif***

    Premise 1: “But mankind may find proof at a later stage” – hypothetical
    Premise 2: “You are telling “you do not think there will be a proof of God in future too” – not my statement. But, I can tell you that there is no reason to believe in an imaginary being that people refer to as god.
    Premise 3: “There is no reason why such a proof will not emerge in future” – hypothetical
    Conclusion: “That’s why your is also a beleif”

    You reached a definitive conclusion based on two hypothetical premises and one incorrect statement. Doesn’t sound a valid argument to me. If anything, your conclusion is the very antithesis of my statement.

    మెచ్చుకోండి

  36. God does not exist” – Again, the burden of the proof is on atheists
    _________________________________________________________________
    Your statement that atheists bear the burden of proof is based on the false assumption that they believe/claim (in) the non existence of god.
    Atheists are not claiming the non existence of anything, let alone god. They are saying that there is no reason to believe in a god, presumably in response to the claims of god believers.

    As long as you can not prove the non existence of God .. ie, if you can prove that Universe was born otherwise then you are correct as an atheist
    _________________________________________________________________
    Again, a false assumption. Atheists are not claiming to know everything about the origins of the universe. Rather, they see it as the scientific community trying to understand it based on the Big Bang Theory, the Theory of Evolution and the other scientific advances being made at an ever increasing pace. All they seem to say is that the observable evidence suggests an evolving and expanding universe and that there is no evidence to prove that a god created and manages the universe. On the other hand, it is the god believers that claim a god created the universe simply because they couldn’t explain it any other way.

    Even to confirm that something does not exist, one needs proof
    _________________________________________________________________
    Of course, if I claim that something doesn’t exist, it’s my responsibility to prove it

    Until then, the theory remains disputed. As the author and Srikanth rightly said, absence of evidence is not same as the evidence of absence
    _________________________________________________________________
    So, what is your theory?

    మెచ్చుకోండి

  37. భగవంతుని సృష్టిలో లోపాలు ఉండవండి.. సూర్యుడు రోజూ ఉదయిస్తున్నాడు. గ్రహాలు గతులు తప్పటం లేదు. దైవసృష్టి లోపాలు లేని అద్భుతమైన సృష్టి..
    ………………………..
    1. నిజమేనండి, మానవజాతి పుట్టకముందు నుంచీ కూడా ప్రళయాలున్నాయి. అయితే విలయాలు వేరు ప్రళయాలు వేరు. ఇవి రావటానికి అనేక కారణాలున్నాయి. ప్రపంచంలో జీవజాతుల సంఖ్య అతిగా పెరిగినప్పుడు ఆహారసంక్షోభం వంటి సమస్యలు ఏర్పడకుండా విలయాల ద్వారా కొంత ప్రాణనష్టం జరిగి ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది.

    2. ఇంకొక కారణం ఏమిటంటే, ప్రపంచంలో పాపం పెరిగినప్పుడు విలయాలు సంభవించి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతుంది. ఆ విధంగా ప్రకృతి మానవులకు హెచ్చరికలు చేస్తుంది. పాఠం నేర్పిస్తుంది. జీవులకు భూమి ఒక పరీక్షా లోకం.
    ………………………………………
    విలయాలు అనే పదాలకు అర్ధం జీవుల పరిస్థితిని బట్టి ఉంటుంది.

    ఉదా……. ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే మందు స్ప్రే చేసి బొద్దింకలను చంపేస్తాము. . ఎన్నో బొద్దింకలు చాలాసేపు గిలగిలలాడుతూ కొట్టుకుని చనిపోతాయి. మన దృష్టిలో ఈ సంఘటనను ఇల్లును శుభ్రం చేసుకోవటంగా భావిస్తాము. బొద్దింకల దృష్టిలో ఈ సంఘటన మహావిలయం

    .అలాగే భూమి మీద పాపాలు పెరిగిపోయినప్పుడు దైవం విలయాలను కల్పిస్తారు. ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది. మన దృష్టిలో ఈ సంఘటన మహావిలయమే. అయితే, దైవం దృష్టిలో ఈ సంఘటన మానవులకు కనువిప్పు కలిగించి సృష్టిలో మంచి వాతావరణాన్ని ఏర్పరచటానికి జరిగిన సంఘటనగా భావించవచ్చు కదా !
    …………………………….
    నిజమేనండి, ఓ జలపాతం ఒక కొండను ఒరుసుకొంటూ పోతే రాళ్ళలో అనేక రూపాలు ఏర్పడతాయి. అయితే, కొన్ని బిలియన్ సంవత్సరాల కాలం ఈ ప్రక్రియ జరిగినా కూడా రాళ్ళలో అనేక రూపాలు ఏర్పడటం జరుగుతుందేమో కానీ, ఆ రాళ్ళరూపాలకు ప్రాణం రావటం అనేది జరగని పని.

    * సృష్టిలో జీవులలో ప్రాణం ఎలా వస్తుందో ఎవరికీ అంతుపట్టని విషయం.

    ………………………………….

    మెచ్చుకోండి

  38. ఇక పరిణామవాదులు చెప్పిన విషయాలు కొంతవరకే నిజం. పూర్తిగా నిజం కాదని నాకు అనిపించింది.
    పరిణామవాదం అంటే , జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందటం…, ఈ ప్రక్రియ జరిగి జీవులు తమ రూపాన్ని మార్చుకోవాలంటే కొన్ని తరాలపాటు జరుగుతుందని అంటారు.
    అయితే, ఒక జీవి ఇంకొక జీవిగా ఆకారం మార్చుకోవటానికి ….. బోలెడు తరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా…సీతాకోకచిలుక.

    గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

    * దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.

    ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ………..అన్నమాట

    కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదనిపిస్తుంది.
    ఉదా…టాన్సిల్స్ అంటే పనికిరాని శరీరభాగం అని కొందరి అభిప్రాయం. . అయితే, ఆపరేషన్ చేసి టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని ఈ మధ్య కాలంలో తేలిందట.

    దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

    ఉన్న దైవాన్ని లేరని ఎవరూ నిరూపించలేరు. విశ్వం అంటే భూమి ఒక్కటే కాదు. ఎన్నో ఇతర గ్రహాలు ( లోకాలు ) ఉన్నాయని , మనకు మించి విజ్ఞానం తెలిసిన జీవులు విశ్వంలో ఉన్నారని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ( దేవతలు అనుకోవచ్చు. )

    విశ్వంలో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయని కూడా అంటారు. విశ్వం గురించి ఇప్పటి వరకు మనకు తెలిసింది చాలా తక్కువ. ఇక దైవం గురించి మనకు తెలిసింది మరీ తక్కువ.

    మెచ్చుకోండి

  39. శెహభాష్ గురువు గారు, చాలా బాగుంది పోస్టు, అలాగే వాఖ్యలు కూడా! మంచి మేత మెదడు కి.
    ఇకపోతే : my two cents :
    మీరు చెప్పినట్టు దేవుడి నిర్వచనం కాల మాన పరిస్థితుల బట్టి మారుతున్నది. అది కూడా అతని లక్షణాల గురించే ! మహిమలు వున్నాయా లేవా ? ప్రత్యక్షం అవుతాడా లేదా మొదలగునవి.
    కాకపోతె సృష్టి నిర్మాత దేవుడే అన్న విషయం లొ ఇంకా ఏమి మార్పు లేదు. చాలా కాలం కిందట దేవుడు కనిపించి , వినిపించి మరియు మహిమలు చూపేవాడట .. కాకపొతే టెక్నాలజీ లేక ఋజువులు లేకపోయాయి అంటె దానిని తప్పు అని నిరూపించే దారి లేదు. ( it is just a light hearted banter, if hurted, my unconditional apologies)
    ఇకపోతె ఆస్తికులు సృష్టి నిర్మాత దేవుడే అంటె కాదు అని నిరూపించాల్సింది మటుకు మరి నాస్తికులే కద! ఇప్పటి వరకు కేవలం ప్రయోగ స్థాయి లోనె వున్నాయి అన్ని సిద్ధాంతాలు.( big bang etc)
    ఇక పూజలు పునస్కారాలు విషయానికి వస్తే , మిగిలిన మతాల సంగతి తెలియదు గాని, హిందు మతం చెప్పేది బహుశా పంచ భూతాలని పూజించడం అంటే సృష్టి పట్ల కృతజ్ఞత కలిగి వుండమని నాకు అర్ధం అయ్యింది. మన పూజల వలన వాటికి బలమని కాదేమో!
    దేవుడిని నమ్మడం నమ్మే వారి వ్యక్తిగత అవసరం. కష్ట కాలం లో, తన పరిధి దాటిన పరిస్థితులలో ఎవరో తనని ఆదుకుంటారనే ఒక దిలాసానే దేవుడు.
    అయితే నేను అజ్ఞేయ వాదిని అన్న మాట , ఇన్నాళ్లు నాస్తిక వాదిని అనుకున్నానే !
    మలక్, how are you ?
    దేవుడు ఒక అవసరం. మతం ..? బహుశా ప్రస్తుత పరిస్థితులలో ఒక విలాసం. అది లేకుండా కూడా మనం మనగలం.

    మెచ్చుకోండి

  40. దేవుడు ఉన్నాడు జగ్రత్త
    ప్రపంచములో రెండు తెగలు వారు ఉన్నారు 1)
    దేవుడు ఉన్నదని నమ్ముతున్న వారు.( Thiests) 2) దేవుడు లేడు అని
    నమ్ముతున్న వారు( ATHIESTS). ఈ రెండవ తెగలో ఎక్కువ మంది
    పండితులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరికి ప్రతిదీ కారణము తో
    కావాలి. నాన్నను, అమ్మను,అక్కను, చెల్లిని, తమ్ముడును చూపించమంటే
    చూపించచ్చు కానీ, దేవుడిని చూపించడము కష్టము. కారణము అయన
    కనపడదు.
    అదృశ్యుడు అన్నది అయన లక్షణము లేక గుణము. కనిపించని దేవునిని
    సమాజానికి చూపించవలసిన భాద్యత christians అయిన మనకు ఎంతగానో
    ఉన్నది.
    1) ముందుగా దేవుడు లేడు అని అంటున్నవారి దగ్గర ఉన్న విషయము ఏంటో
    ఇప్పుడు చూద్దాము. ఒక విషయాన్ని సామాన్యుడు చెబితే
    ప్రపంచము పట్టించుకోదు. అదే విషయాన్నీ scientists చెబితే
    వింటారు.scientists కు ఉండే బలము శాస్త్రము (science). ఈ
    శాస్త్రానికి పుట్టిన ఇల్లు ప్రకృతి. ఈ ప్రకృతిని శాస్త్రవేత్తలు చదివారు.
    చదివి అందులోనించి శాస్త్రాలను పుట్టించారు. భూమి మీద ఉంటున్నారు కనుక
    భూమిని
    చదివి భూగోళ శాస్త్రము ( GEOGRAPHY) అను పేరు పెట్టారు,
    భుగర్బoని
    చదివి భుగర్బo శాస్త్రము(GEOLOGY) అను పేరు పెట్టారు. భూమి మీద
    ఉన్న చెట్లను చదివి వృక్ష శాస్త్రము( BOTONY)
    అను పేరు పెట్టారు.జంతువులను చదివి జంతు శాస్త్రము( ZOOLOGY)
    ,పక్షులు
    చదివి పక్షి శాస్త్రము(ORNITHOLOGY),పండ్లు చదివి పండ్ల
    శాస్త్రము ( CORPOLOGY) పెట్టారు. కంటికి కనపడుతున్న వాటిని
    చదివారు. కనపడుతున్నాయి గనుక చదివారు. చదివి అర్థము చేసుకున్న దానికి
    పేరు పెట్టారు. “ కంటికి కనపడే ఒక వస్తువు అలోచించి దాని గురించి
    వీళ్ళకు ఏమి
    అర్థము అయిందో ఆ subject ని ఒక subject గా పిలిచి దానికి ఒక
    పేరు పెట్టారు. bible లో ఉన్న వాక్యాన్ని భట్టి
    మనుష్యులను ఆకర్శించువాడే christian…
    2) స్వయానా scientists యొక్క మాటలను మనకు ఆలోచిస్తే ‘” ఈ
    100% ప్రకృతి లో 30% పదార్ధము( matter) ఉంది అని చెప్పారు.
    మిగతా
    70 percent ఏమి ఉందొ మాకు తెలియదు అంటున్నారు. తెలియని దానికి
    dark energy అను పేరు పెట్టారు. ఈ 30% లో మాకు తెలిసింది 5%
    మాత్రమే. మిగిలిన 25% పదార్ధములో ఏమి,ఎలా అయ్యిఉంటుందో
    మాకు తెలియదు అంటున్నారు. మొత్తం మీద వీరికి తెలిసింది 5% మాత్రమే.
    వాళ్ళకు తెలిసిన దాంట్లో కొంచెము books రాసారు. ఆ books దిగుమతి
    అయ్యి ఇప్పుడు university, college లో భోదిస్తున్నారు.
    3) ఇప్పుడు bible ఏమి చెబుతుందో చూద్దాము.. యోబు 26:14- మిక్కిలి
    మెల్లనైన గుసగుస శబ్దము. దేవుడు చేసిన కార్యాలలో తెలుసుకున్నది
    కొంచమే
    అంటున్నాడు యోబు. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి పెద్ద
    శబ్దము ద్వార పుట్టిందని,దానికి big bang theory అని అంటున్నారు.
    శబ్దము వలన ప్రకృతి పుట్టినదని 25 years
    పూర్వము చెప్పారు శాస్త్రవేత్తలు. మరి శబ్దము ఏంటి, ఎక్కడ నుంచి వచ్చింది
    అంటే మాకు తెలియదు అంటున్నారు. శబ్దము అనగా మాట.
    ఆదికాండము 1:13-
    వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇలా
    ఆదికాండము 1:3,6,9,11,12
    లో దేవుడు పలుకగా నిర్మింపబడ్డయి. దేవుని మాట అనగా శబ్దము. ఈ
    ప్రకృతి ఎలా నిర్మాణము అయ్యాయి అని bible ను అడిగితే దేవుని
    మాట
    అని అంటుంది. హెబ్రే 11:3- దేవుని వాక్యము వలన
    నిర్మాణమయ్యాయి. అంటే ప్రకృతి దేవుని వాక్యము ద్వార
    ఏర్పడ్డయి.
    a) క్రీ శ 1648 లో issac newton భూమి సున్యములో వేలడుతుందని
    చెప్పాడు. యెబు 26:7 లో శూన్యము పైని భూమి వ్రేలాడ చేసెను.
    క్రీపు 1400 లో యెబు చెప్పాడు. క్రీ శ 3000 పూర్వము bible చెప్పింది.
    b) క్రీ శ 1543 లో nicolus copernicus భూమి కదులుతుంది అందుకే
    కాలాలు మారుతుంది అని చెప్పాడు. యెబు 9:6లో భూమిని కదిలించువాడు ఆయనే.
    కీర్తనలు 74:16,17 లో సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. వేసవి, చలి
    కాలము నీవే కలుగజేసితివి. క్రీపు 700 లో యెబు చెప్పాడు. క్రీ శ 2300
    years పూర్వము bible చెప్పింది.
    c) క్రీ శ 1610 లో galileo galile telescope invented.
    చంద్రునికి స్వయము ప్రకాశ శక్తీ లేదని, సూర్యుడు ఉంటేనే
    చంద్రుడు ప్రకాసిస్తాడాని చెప్పాడు. యోబు 25:5, యోబు 13:10
    లోయోబు చెప్పేసాడు. క్రి పు 740 లో bible చెప్పింది. క్రీ శ 2754
    years
    పూర్వము bible చెప్పింది
    d) క్రీ శ 1662 లో robert boyle గాలికి భారువు ఉందని చెప్పాడు.
    యోబు 28:25లో గాలికి ఇంత బరువు ఉండవలసిన అయన నియమించెను.
    క్రీపు 1400 bible చెప్పింది. క్రీ శ 3004 years పూర్వము bible
    చెప్పింది.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు శస్త్రవేత్తలు చెప్పక ముందే bible
    చెప్పింది. మొన్న మొన్న ఈ విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు గోప్పవారా?
    లేక కొన్ని వెల years క్రితము చెప్పిన bible గొప్పదా????
    conclusion:: ప్రకృతి ని కలిగించిన దేవుడు, తన ప్రియ కుమారుడిని
    పంపిన
    దేవుడు, క్రీస్తు ఈ లోకానికి వచ్చి చూపిన దేవుడే దేవుడు. ….

    మెచ్చుకోండి

  41. మనుషులలో దేవుని ఇష్టము నెరవేరుతుందా ???
    ఈ రోజులలో దేవుని కోసము మనము చేసేది ఏంటి అని ఎక్కువ మంది ఆలోచించవచ్చు. ఇంత వరకు మనిషి గా మనము అడగాలి and దేవునిగా అయన ఇవ్వాలి, ఇదే మనిషికి మరియు దేవునికి ఉన్న సంబంధము అని అనుకుంటున్నారు. దేవుని కొరకు మనము కూడా చేయవలసిన భాద్యత ఉన్నది. example:: మనము చిన్నగా ఉన్నపుడు మన parents మన భాగోగులు చూసుకునేవారు.అలాగే పిల్లలు పెద్దవారు అయిన తర్వాత parents గురించి వారు ఆలోచించాలి. అలానే ప్రారంభములో దేవుడు మన గురించి ఎంతగానో అలోచించి మనకు ఈ సృష్టిని ఇచ్చాడు.
    1) mathew 6:9 లో నీ ‘చిత్తము’ పరలోకమందు “నెరవేరుచున్నట్లు” భూమి యందును నెరవేరును గాక అని ఉన్నది. అంటే పరలోకము లో దేవుని ఇష్టము ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నేరవేరాలి అంటున్నాడు కానీ నెరవేరుతుంది అనడం లేదు. ఫై వాక్యా భాగము లో నెరవేరుచున్నట్లు అంటే పరలోకము లో దేవుని ఇష్టము జరుగుతుంది. పరలోకములో తండ్రి ఇష్టమును నెరవేర్చు వారు సేవకులైన ఆత్మలను దేవదూతలు దేవుని ఇష్టమును నెరవేరుస్తున్నారు. మరి భూమి మీద తన కుమారులు,కుమార్తెలైన మనము ఉన్నాము. సేవకులైన ఆత్మల మధ్య నేరవేరుతున్న దేవుని ఇష్టము కుమారులు,కుమార్తెలైన మన దగ్గరకు రాగానే నేరవేరటము లేదు అని jesus గుర్తించి నేరవేరాలి అని తండ్రి ని కోరుకోమన్నాడు. అంటే దేవుని ఇష్టము మనుషులలో నెరవేరటం లేదు అన్న మాట.. మానవులైనా మనము దేవుని ఇష్టమును ప్రక్కన పెట్టి తన ఇస్టాన్ని నేరవేర్చుకుంటున్నాడు.
    2) mathew 6: 25-34 లో మనo చూడగలిగితే దేవుని మాటలలో మనిషి ఆలోచనలో ఏమి ఉందో తెలియాజేయబడింది. “చింత మరియు భాద”. విపరీతమైన ఆలోచనలు వలన కలిగేది చింత or భాద. ఆకాశపక్షులు—విత్తవు( వ్యవసాయము చేయవు గనుక), వ్యవసాయము లేదు కనుక పంట కోసే పని లేదు,పంటే లేకుంటే godowns లో దాచుకోవలసిన అవసరత లేదు (mathew 6:26).అలానే అడవి పువ్వులు కూడా. mathew 6:31 లో ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో,ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అలానే luke 12:19 ను చుడండి.. ఇంతవరకు మానవుని ఆలోచనలో ఏమి ఉన్నదో తెలుస్కున్నాము.
    3) mathew 6:9 లో ని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును ”నెరవేరును గాక” . అలానే mathew 7:21 లో ప్రభువా ,ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోకo లో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము(ఇష్టప్రకారము) చేయువాడే ప్రవేశించేను….. mathew 6:9 లో ఇలాగు చెప్పమన్న దేవుడు mathew 7:21 లో చేయమంటున్నాడు.
    4) ఈ ప్రపంచమును కాపాడవలసిన ఆలోచనలు నీకు ఉండాలి. భాద్యత గలవాడిగా ఈ భూమి లో నిన్ను పంపాడు కానీ ఊరకే పంపలేదు. భూమి మీద మనము పుట్టాము అంటే దేవుని ఇష్టము నెరవేర్చడాని కోసమే..
    5) దేవుని ఇష్టము భూమి మీద నెరవేర్చక పోతే ఎంత ప్రమాదమో 1 కోరంది 10:1-5 లో చూస్తే అర్థమవుతుంది. దేవుడు అరణ్యము లో వారిని ఎందుకు చంపాడు అంటే దేవునికి ఇష్టులుగా ఉండలేకపోయారు గనుక సంహరింపబడిరి. అవసరమైన వస్తువు పనికి వస్తుంది అంటే మన ఇంట్లో ఉంచుతాము. అవసరము లేకపోతే భయట పడేస్తాము. నైపుణ్యo గలవాడని ఏ company కూడ వదులుకోదు అలనే దేవుని పని చేయువాడిని కూడ దేవుడు వదులుకోడు.
    6) అరణ్యం లో 6 lakhs ప్రజలు 40 years పాటు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. తిండి , భట్ట అను అవసరతులతో moses ను అవమానపరిచారు. నిర్గమ16:1-3 లో అరణ్య ప్రయాణములో moses మీద సనిగెను. తిండిని భట్టి దు:ఖమును వ్యక్తపరుస్తున్నారు. సంక్యకాండము 11:4 లో తిండి కొరకు దు:ఖమును వ్యక్తపరుస్తున్నారు( veg+non veg). isreal ప్రజలు అలాంటి స్థితి లో ఉన్నను కూడ దేవుడు తన ప్రేమ ,కపుదలను వారి మధ్య ఉంచాడు ( నేహామ్య 9:19-21). పైన చెప్పబడిన isreal ప్రజలు యొక్క స్థితిని జ్ఞాపకముంచుకొని ఇప్పుడు 1 కోరంది 10:1-5 చదివితే దేవుడు ఎందుకు సంహరించాడో అర్థమవుతుంది. దేవుని పనికోసము ఉంటె మనల్నిఉంచుతాడు. అయన ఇష్టాన్ని నేరవేర్చమని అడుగుతున్నారా? లేక మీ ఇష్టాన్ని నేరవేర్చమని అడుగుచున్నారా????
    ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడో తన మాటల ద్వార చూడడము…..
    A) హెబ్రీ 10:5 లో దేవ , నీ చిత్తము( ఇష్టము) నెరవేర్చుటకు నేను వచ్చియున్నాను.
    B) మార్క్1:38 లో ఇందు నిమిత్తమే కదా(ప్రకటించడానికి) నేను వచ్చింది.
    C) john 4:34 లో నన్ను పంపినవాని చిత్తము నేరవేర్చుటయు ,అయన పని తుదుముట్టించుటకు నాకు ఆహారమై ఉన్నది.
    D) john 6:38 and E) john 8:29.
    7) ఫైన చెప్పబడిన 5 references లో jesus తండ్రి యొక్క ఇష్టాన్ని నేరవేరుస్తున్నాడు,నెరవేర్చుటకు వచ్చాడు. తండ్రి ఇష్టము పాపిని మర్చటమే( luke15:10).దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటె ,నెరవేరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు… వాక్యము ప్రకటించే కార్యక్రము లేక ప్రకటించేవారికి సహాయపడడం, పాపిని మార్చడము దేవుని చిత్తము (ఇష్టము).
    8) ఒక పాపి మారితే భూమి మీద తండ్రికి సంతోషం అయితే పాపి మారడం కోసం ఎదన్న చేయాలి. వినుట వలన విశ్వాసము కలుగును, విన్న మాట క్రీస్తు మాటై ఉండాలి. కనుక వాక్యము భోదించి మరుమనస్సు కలిగిoపజేసి రక్షించాలి.
    9) చివరిగా ముక్యమైన ప్రతి christian చేయవలసియున్నది—ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపుర్నిగా చేసి అయన ఎదుట నిలువబెట్టవలేనని,సమస్త విధమైన జ్ఞ్యానంతో మేము ప్రతి మనుష్యుని భుద్ది చెప్పుచు, ప్రతి మనుష్యునికి భోదిoచుచు, ఆయనను ప్రకటించాలి .( colassians 1:28)…….

    మెచ్చుకోండి

  42. దేవుడు ఎవరు????
    ప్రభువు నామములో మీకు శుభములు. ప్రపంచములో రెండు తెగలు వారు ఉన్నారు 1)
    దేవుడు ఉన్నదని నమ్ముతున్న వారు.( Thiests) 2) దేవుడు లేడు అని
    నమ్ముతున్న వారు( ATHIESTS). ఈ రెండవ తెగలో ఎక్కువ మంది
    పండితులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరికి ప్రతిదీ కారణము తో
    కావాలి. నాన్నను, అమ్మను,అక్కను, చెల్లిని, తమ్ముడును చూపించమంటే
    చూపించచ్చు కానీ, దేవుడిని చూపించడము కష్టము. కారణము అయన
    కనపడదు.
    అదృశ్యుడు అన్నది అయన లక్షణము లేక గుణము. కనిపించని దేవునిని
    సమాజానికి చూపించవలసిన భాద్యత christians అయిన మనకు ఎంతగానో
    ఉన్నది.
    1) ముందుగా దేవుడు లేడు అని అంటున్నవారి దగ్గర ఉన్న విషయము ఏంటో
    ఇప్పుడు చూద్దాము. ఒక విషయాన్ని సామాన్యుడు చెబితే
    ప్రపంచము పట్టించుకోదు. అదే విషయాన్నీ scientists చెబితే
    వింటారు.scientists కు ఉండే బలము శాస్త్రము (science). ఈ
    శాస్త్రానికి పుట్టిన ఇల్లు ప్రకృతి. ఈ ప్రకృతిని శాస్త్రవేత్తలు చదివారు.
    చదివి అందులోనించి శాస్త్రాలను పుట్టించారు. భూమి మీద ఉంటున్నారు కనుక
    భూమిని
    చదివి భూగోళ శాస్త్రము ( GEOGRAPHY) అను పేరు పెట్టారు,
    భుగర్బoని
    చదివి భుగర్బo శాస్త్రము(GEOLOGY) అను పేరు పెట్టారు. భూమి మీద
    ఉన్న చెట్లను చదివి వృక్ష శాస్త్రము( BOTONY)
    అను పేరు పెట్టారు.జంతువులను చదివి జంతు శాస్త్రము( ZOOLOGY)
    ,పక్షులు
    చదివి పక్షి శాస్త్రము(ORNITHOLOGY),పండ్లు చదివి పండ్ల
    శాస్త్రము ( CORPOLOGY) పెట్టారు. కంటికి కనపడుతున్న వాటిని
    చదివారు. కనపడుతున్నాయి గనుక చదివారు. చదివి అర్థము చేసుకున్న దానికి
    పేరు పెట్టారు. “ కంటికి కనపడే ఒక వస్తువు అలోచించి దాని గురించి
    వీళ్ళకు ఏమి
    అర్థము అయిందో ఆ subject ని ఒక subject గా పిలిచి దానికి ఒక
    పేరు పెట్టారు. bible లో ఉన్న వాక్యాన్ని భట్టి
    మనుష్యులను ఆకర్శించువాడే christian…
    2) స్వయానా scientists యొక్క మాటలను మనకు ఆలోచిస్తే ‘” ఈ
    100% ప్రకృతి లో 30% పదార్ధము( matter) ఉంది అని చెప్పారు.
    మిగతా
    70 percent ఏమి ఉందొ మాకు తెలియదు అంటున్నారు. తెలియని దానికి
    dark energy అను పేరు పెట్టారు. ఈ 30% లో మాకు తెలిసింది 5%
    మాత్రమే. మిగిలిన 25% పదార్ధములో ఏమి,ఎలా అయ్యిఉంటుందో
    మాకు తెలియదు అంటున్నారు. మొత్తం మీద వీరికి తెలిసింది 5% మాత్రమే.
    వాళ్ళకు తెలిసిన దాంట్లో కొంచెము books రాసారు. ఆ books దిగుమతి
    అయ్యి ఇప్పుడు university, college లో భోదిస్తున్నారు.
    3) ఇప్పుడు bible ఏమి చెబుతుందో చూద్దాము.. యోబు 26:14- మిక్కిలి
    మెల్లనైన గుసగుస శబ్దము. దేవుడు చేసిన కార్యాలలో తెలుసుకున్నది
    కొంచమే
    అంటున్నాడు యోబు. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి పెద్ద
    శబ్దము ద్వార పుట్టిందని,దానికి big bang theory అని అంటున్నారు.
    శబ్దము వలన ప్రకృతి పుట్టినదని 25 years
    పూర్వము చెప్పారు శాస్త్రవేత్తలు. మరి శబ్దము ఏంటి, ఎక్కడ నుంచి వచ్చింది
    అంటే మాకు తెలియదు అంటున్నారు. శబ్దము అనగా మాట.
    ఆదికాండము 1:13-
    వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇలా
    ఆదికాండము 1:3,6,9,11,12
    లో దేవుడు పలుకగా నిర్మింపబడ్డయి. దేవుని మాట అనగా శబ్దము. ఈ
    ప్రకృతి ఎలా నిర్మాణము అయ్యాయి అని bible ను అడిగితే దేవుని
    మాట
    అని అంటుంది. హెబ్రే 11:3- దేవుని వాక్యము వలన
    నిర్మాణమయ్యాయి. అంటే ప్రకృతి దేవుని వాక్యము ద్వార
    ఏర్పడ్డయి.
    a) క్రీ శ 1648 లో issac newton భూమి సున్యములో వేలడుతుందని
    చెప్పాడు. యెబు 26:7 లో శూన్యము పైని భూమి వ్రేలాడ చేసెను.
    క్రీపు 1400 లో యెబు చెప్పాడు. క్రీ శ 3000 పూర్వము bible చెప్పింది.
    b) క్రీ శ 1543 లో nicolus copernicus భూమి కదులుతుంది అందుకే
    కాలాలు మారుతుంది అని చెప్పాడు. యెబు 9:6లో భూమిని కదిలించువాడు ఆయనే.
    కీర్తనలు 74:16,17 లో సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. వేసవి, చలి
    కాలము నీవే కలుగజేసితివి. క్రీపు 700 లో యెబు చెప్పాడు. క్రీ శ 2300
    years పూర్వము bible చెప్పింది.
    c) క్రీ శ 1610 లో galileo galile telescope invented.
    చంద్రునికి స్వయము ప్రకాశ శక్తీ లేదని, సూర్యుడు ఉంటేనే
    చంద్రుడు ప్రకాసిస్తాడాని చెప్పాడు. యోబు 25:5, యోబు 13:10
    లోయోబు చెప్పేసాడు. క్రి పు 740 లో bible చెప్పింది. క్రీ శ 2754
    years
    పూర్వము bible చెప్పింది
    d) క్రీ శ 1662 లో robert boyle గాలికి భారువు ఉందని చెప్పాడు.
    యోబు 28:25లో గాలికి ఇంత బరువు ఉండవలసిన అయన నియమించెను.
    క్రీపు 1400 bible చెప్పింది. క్రీ శ 3004 years పూర్వము bible
    చెప్పింది.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు శస్త్రవేత్తలు చెప్పక ముందే bible
    చెప్పింది. మొన్న మొన్న ఈ విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు గోప్పవారా?
    లేక కొన్ని వెల years క్రితము చెప్పిన bible గొప్పదా????
    conclusion:: ప్రకృతి ని కలిగించిన దేవుడు, తన ప్రియ కుమారుడిని
    పంపిన
    దేవుడు, క్రీస్తు ఈ లోకానికి వచ్చి చూపిన దేవుడే దేవుడు. ….

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి