తెలంగాణ సోదరుల కు ప్రత్యేకాంధ్ర ఉద్యమ విజయాభినందనలు

మొత్తానికి తెలంగాణ సోదరులు చేసిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఫలించింది.

“ఏమిటి ? పొరబడుతున్నారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనాలంటున్నారా?”

“కాదండీ, నేను సరిగానే అంటున్నాను. కొత్త రాజధాని కోసం, కొత్త అసెంబ్లీ కోసం, కొత్త జీవనాధారం కోసం, ఎవరు కొత్త గా ప్రయాణం మొదలుపెట్టాలో వారిదే “కొత్త రాష్ట్రం”.  కాకపోతే ఈ ఉద్యమం అంధ్ర ప్రాంతీయులు చేయలేదు. కాబట్టీ, ప్రత్యేక  ఉద్యమం జరిగింది ప్రత్యేక ఆంధ్ర కోసం. చేసింది తెలంగాణ ప్రాంతీయులు.”
ఈ రోజు, వేరు వేరు సమయాలలో తెలంగాణ సోదరులకి అభినందనలు తెలుపుతున్న ఆంధ్ర మిత్రులు ఓ ముగ్గురు తారస పడ్డారు.
వారి ముగ్గురినీ ఒకే ప్రశ్న వేశాను.  “మీరు ఎందుకు అభినందనలు తెలుపుతున్నారు?. ఏర్పడబోయే కొత్త రాష్ట్రం ఆంధ్ర కదా?”
ఒకాయనకి ఆంధ్ర వారి పన్ను డబ్బులతో కూడా, అరవై యేళ్ళ గా బలిసిన హైదరాబాదు గురించి తెలియదు. ఈ యన తన ప్రాంతం కడుపు మీద కొట్టిన విషయాన్ని విస్మరించి అభినందనలు తెలుపుతాడు (అదేమంటే,అరవై ఏళ్ళు కడుపు మీద కొట్టారు. అరవై యేళ్ళు ఆంధ్రా వారి కడుపు మీద కొట్టిన సంఘటనలు ఇక ముందుకు వస్తాయి. ఇంక సమైక్యాంధ్ర అనవలసిన అవసరం లేదు కదా!) ఆహా ఏమి అజ్ఞానం? అందుకే అన్నారు ignorance is bliss అని.
ఇంకో ఆయన, “ఏదో కాస్త లౌక్యం గా ఉండాలి కదా అని చెబుతున్నాను అంటాడు”. ఎవడి స్వార్ధం వాడిది.
మూడో ఆయన కి, ” కావేరీ జలాల పంపిణీ లో సమస్య ఉందని తెలుసు గాని, అదే సమస్య మూడు రెట్లు ఎక్కువ గా ఇక్కడ వచ్చే అవకాశం ఉందని తెలియదు. తెలంగాణ ఇవ్వటమంటే, ఆంధ్ర వాళ్ళు ఇన్నాళ్ళూ దోపిడీ చేశారనే అపవాదుకి కేంద్రం అధికార ముద్ర ఇవ్వటమే అనే స్పృహ లేదు” . No wonder Andhra is getting a a raw deal.
Anyways, చూద్దాం, ఆంధ్రోల్లు దోపిడీ దారులన్న బాబు ఈ మొత్తం ప్రక్రియ లోంచీ ఏం బావుకొంటాడో.

మొత్తానికి డిగ్గీ రాజా గారు, ఆంధ్ర వారు తమకు పై నుంచీ  తా/సాగునీరు తెలంగాణ వారు వదలక పోయినా protest చేయటానికి కుదరని విధం గా ఓ పదేళ్ళు రాజధాని ని హైదరాబాదు లో పెడతామన్నారు.
ఇక మాకెన్ అట ఎవరో బొడ్డూడని కాంగీయుడు, పోలవరం గురించి అడుగుతాడట, రాజధాని నిర్మాణం లో సాయపడ్తారట, సీమాంధ్రులకు రక్షణ కలిపిస్తాడట, నీటి సమస్యలూ వగైరా లను చేత్తో తీసి పారేస్తాడట. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రం లో ఎవరు అధికారం లోకి వస్తారో?! అప్పటికి రాజెవరో, రెడ్డెవరో!Too good to believe. Stunt to pacify seemandhra feelings.

ఇక ఓ ఆంధ్రీయుడి గా కొంత ఆత్మ విమర్శ..:
“ఆంధ్రులు ఆరంభ శూరులు”, అని చిన్నప్పుడు చూచి రాత పుస్తకం లో ఓ నానుడి ఉండేది. ఆరంభ శూరులే కాదు, దూరదృష్టి లేని వారనిపిస్తోందిప్పుడు. ముందు చెన్నై లో ఊరేగారు. విశాలాలాంధ్ర అని sentimental fools  లా బయటెక్కడో   రాజధాని పెట్టటానికి ఒప్పుకొన్నారు.
దానికి తగిన బహుమతి లభించింది. ఇప్పుడు” ఏ బొత్స బాబు వత్తిడి తోనో విశాఖ రాజధాని అంటారేమో. కొన్నాళ్ళకి ఉత్తరాంధ్రోళ్ళు , “మాకూ ప్రత్యేక రాష్ట్రం కావద్దేటీ?”, అంటే, మిగిలిన వాళ్ళంతా తట్టా బుట్టా సర్దుకొని మళ్ళీ ఏ కర్నూలుకో పోవచ్చు. అక్కడ ఏ బైరెడ్డి మనవడో, “జై సీమ!”, అంటే, అక్కడి నుంచీ మళ్ళీ ఇంకో చోటకి పరుగెత్తవచ్చు, eternal gypsies లా.
“ఐకమత్యమే మహాబలం”, అనేది ఇంకో చూచి రాత పుస్తకం సామెత. ఆంధ్ర జనాలు వాళ్ళ లో వాళ్ళు కొట్టుకోవటమే బలం అని నమ్ముతారు. మతం పేరు మీద కాదు కానీ , కులం పేరు మీద, పార్టీ పేరు మీద . తెలంగాణ వస్తే ” ఇంచక్కా ఫలానా కులం వాడు నష్టపోతాడు”, అని చంకలు గుద్దుకొనే ఆయన ఒకరైతే, ” మా కులపోళ్ళు హైదరాబాదు లో ఎక్కువ లేరు, తెలంగాణ వచ్చినా మాకు పోయేదేమీ లేదు”, అనే ఆయన ఇంకొకరు.
మొత్తం ఆంధ్ర సమాజానికి ఉండే లాభ నష్టాల గురించి అవగాహన తో ఏ ఒక్కరూ ఆలోచించరు.
రాజకీయం గా ఆంధ్ర నాయకు లంత పిరికి స్వార్ధ పరులు ఎక్కడా ఉండరు. ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రాంతం నుండీ అయి కూడా, జరిగే అన్యాయాన్ని అపలేని నిస్సహాయులు వీరు.చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు రాజీనామాలు?!
మొత్తానికి అంధ్ర వారికి జరిగి తీరవలసిన అన్యాయమే! ఏం చేద్దాం.
మనకు న్యాయం జరిగినా అన్యాయం జరిగినా, మన సోదరులైనా ఆనందం గా ఉంటారు,”

అమాయకుల త్యాగాలు, ఎన్నో పోరాటాలు, కొన్ని అబధ్ధాలు, కొంత విద్వేషం, అక్కడక్కడా హింస, కొండొక చోట గుంపుల విధ్వంసం, గాయపడిన మనోభావాలు, నాయకుల, ధనవంతుల స్వార్ధం. అపార్ధాలు, కొంత దురభిమానం, చాలా రాజకీయ లబ్ధులు, ఎంతో నిరీక్షణ, తరువాత..,  “తెలంగాణ సోదరుల కు ఉద్యమ విజయాభినందనలు”, “ఆంధ్ర సోదరులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అభినందనలు”.

ఆంధ్ర వారు అనవసరమైన రాజకీయ గొడవలు చేయకుండా , తమ సహజమైన కష్ట పడే గుణం తో మళ్ళీ సొంత రాష్ట్రం లో పురోగమించాలి.

సాగిపోవుటె బ్రతుకు…
————————-
సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి

ప్రకటనలు