పిల్లల పై అస్థిరత్వం ప్రభావం

చానాళ్ళ క్రితం ఓ టీవీ ఇంటర్వ్యూ లో, రాజీవ్ కనకాల తన చిన్నప్పటి విషయాల గురించి మాట్లాడాడు.
అతని కుటుంబం అతని బాల్యం లో మద్రాస్ నుంచీ హైదరాబాదు కి మారింది. మారిన కొత్తల్లో, కొత్త స్కూలూ, కొత్త పుస్తకాలూ కొత్త పాఠాల తో ఇమడ లేక చదువు లో వెనుక పడినట్లు  రాజీవ్ చెప్పినట్లు నాకు గుర్తు.
పాత కాలం లో పల్లెటూళ్ళ లో వ్యవసాయ కుటుంబాలు ఒకే ఊళ్ళో జీవితాంతం ఉండేవి. పిల్లలు ఒకే ఇంట్లో ఉంటూ చుట్టుపక్క ల ఊళ్ళలోనే చదివే వారు. ఆ జీవితం లో స్థిరత్వం ఉండేది. ఈ రోజుల్లో ఉద్యోగాల వలన కుటుంబాలు ఊర్లూ, నగరాలూ, ఒక్కోసారి దేశాలూ మారవలసిన పరిస్థితి. కొన్ని సందర్భాలలో పిల్లల అమ్మా నాన్న ల లో ఒకరు చాలా కాలం పాటు పిల్లల కు దూరం గా కూడా ఉండవలసి వస్తుంది.
పెద్ద వాళ్ళ స్థాన చలనాల వలన పిల్లలు బడి మారవలసి వస్తుంది. “ఈ అస్థిరత్వం ప్రభావం పిల్లల మనస్థత్వం పై ఎలా ఉంటుంది?” అనే విషయమై భిన్నాభి ప్రాయాలున్నాయి.
కొంత మంది ఈ అస్థిరత్వం పిల్లల పై ప్రతికూల స్వ భావం చూపుతుందంటే, ఇంకొంతమంది పిల్లలు మార్పుకి చాలా సులువు గా అలవాటు పడి పోతారంటారు. ఉదాహరణ కి అమెరికా నుంచీ వచ్చి ఇండియాలో బామ్మా తాతల దగ్గర పెరిగే పసి పిల్లలు చాలా త్వరగా అలవాటు పడతారు. అదే పిల్లలు పెద్దైన తరువాత, అంత సులువు గా సర్దుబాటు కారు.
ముందు గా స్థిరత్వం అంటే ఏమిటో పరిశీలించి , తరువాత దాని వ్యతిరేక అనుకూల వాదనలను ఆ క్రమం లో పరిశీలిద్దాం.
ఓ మనిషి, ఒక వాతావరణం లో,కొందరు వ్యక్తుల తో కొంత కాలం పెరిగినపుడు, అవన్నీఅతని మానసిక ప్రపంచం లో భాగమౌతాయి. వాటి తో అతని interaction, అతని వ్యక్తిత్వం లో భాగమౌతుంది. అలాంటి ఓ ప్రదేశాన్ని వదిలి వెళ్తున్నాం అంటే, మనలోని ఓ భాగం చనిపోతున్నట్లు అన్న మాట. అందుకే మనకి నచ్చిన స్నేహితులనూ, ఊరినీ వదిలి వెళ్తున్నప్పుడు కొంత దిగాలు గా ఫీల్ అవుతాం.

అలానే ఊళ్ళో, ఓ కమ్యూనిటీ (కమ్యూనిటీ అంటే కమ్యూనికేట్ చేసేది.మనుషులు తమ కష్టం, సుఖం, మంచీ చెడ్డా ఒకరి తో ఒకరు పంచుకొనే సమూహాన్ని కమ్యూనిటీ అనవచ్చు. దీని ప్రకారం మన పట్నాలలోని గేటేడ్ కమ్యూనిటీలు కమ్యూనిటీలే కాదు.  ఎవరికి వారై  పక్క వారెవరో కూడా తెయని దానిని కమ్యూనిటీ అనరాదు.) లో పెరిగినపుడు, ఒక మనిషి సామాజిక, సాంస్కృతిక విలువల కి ఓ ఫ్రేం-వర్క్ ఏర్పడుతుంది. ఒక reference plane తయారవుతుంది. అతని అస్థిత్వం (identity) లో అతని పరిసరాలు ఓ విడతీయరాని భాగం అవుతాయి. మనిషి సమాజం లో ఇమడాలనుకొంటాడు. తనకి ఓ మతమూ, దేశమూ, వగైరా ఉండాలనుకొంటాడు. ఇవి మనిషి యొక్క ఉనికి కి ఓ extension లాంటివి. నా భాష, నా దేశం అనుకోవటం తో మనిషి తన వ్యక్తిగత ఉనికి ని దేశం దాకా విస్తరించుకొని, ఆ మేరకు empower అయినట్లు ఫీలవుతాడు.దేశ, ప్రాంత భావనల పరిధి లో మనిషి తన బ్రతుకు కు కొంత వరకూ అర్ధాన్ని కూడా వెతుకు కొంటాడు. ఏ దేశమూ, భాషా ప్రాంతమూ లేని వాడు faceless గానీ rootless గానీ అవుతాడు. దాని లో కొంత ఒంటరి తనం ఉంటుంది.

ఓ కుటుంబం లేక మనిషి అనేక ప్రదేశాలు మారుతున్నపుడు, అతని పిల్లల పై ఆ అస్థిరత్వం ప్రభావం ఎలా ఉంటుంది?  పిల్లల కు అనేక భాషల తో సంస్కృతుల తో భౌగోళిక విషయాలతో పరిచయం ఏర్పడుతుంది. దీనివలన  పిల్లలు, ముందు ముందు జీవితం లో మనుగడ(survival) కు సంబంధించిన విషయాలలో బలం గా ఉంటారు. పిల్లల cultural framework అనేది విశాలమౌతుంది. చిన్నపుడే అనేక వాతావరణాలు పరిచయమవ్వటం వలన, వాటిలో ఉండే కుదుపులకు పిల్లలు అలవాటవుతారు. సాంస్కృతిక విషయాలను పెద్దగా పట్టించుకోకుండా (అధిగమించి), తమ వ్యక్తి గత మనుగడ కి విలువనిచ్చే మనస్తత్వం వీరికి అలవడవచ్చు.

చిన్న పిల్ల మనసు తెల్ల కాగితం లా ఖాళీ గా(in cultural context) ఉంటుంది. కొత్త వాతావరణం లోని సాంస్కృతిక విషయాల తో ఘర్షించే అంశాలు పిల్లల మనసు లో తక్కువ గా ఉంటాయి. కాబట్టీ పిల్లలు సులువు గా ఇమిడి పోతారు.
కానీ అస్థిరత్వం వలన, పిల్లలు ఓ సంస్కృతితోనో, విలువల తో నో identify కారు. దీనివలన cultural loneliness ఫీలయ్యే అవకాశం ఉంటుంది (వారి లాగే uproot అయిన స్నేహితులు వారికి ఉంటే అప్పుడు వారంతా ఓ సమూహం గా ఏర్పడి దీనిని అధిగమించవచ్చు). మొత్తం మీద rootless, faceless అనే పదాలు జ్ఞప్తికి వస్తాయి. రాజీవ్ కనకాల కు జరిగి నట్లు, కొత్త బడికీ, కొత్త పాఠాలకీ అలవాటు పడలేక పోతే, వీరు చదువు లో వెనుక పడి, తద్వారా జీవితం లో వెనుక పడే అవకాశాలూ ఉంటాయి.ఇతర దేశాలలో శరీర వర్ణం గురించిన, జాతి వివక్ష ఉండనే ఉంది.
ఇప్పుడు స్థిరం గా ఓ ప్రదేశం లో పెరిగిన పిల్ల ల గురించి ఆలోచిద్దాం. వీరికి identityలేక world view విషయం లో ఎలాంటి క్లిష్ట పరిస్థితీ ఎదురు కాకపోవచ్చు. కానీ, మొదటి సారి వెరే కల్చర్ కి expose అయినపుడు, వీరికి సర్దుకోవటం కొంచెం కష్టమవుతుంది. అప్పుడు వారు తమ దృక్పధాన్ని విశాలం చేసుకోవటానికి కష్టపడాల్సి రావచ్చు.  అలానే, వారి ఆలోచనలు తమ స్థిత్వానికి సంబంధించిన విషయాల చుట్టూ ఎక్కువ వెచ్చించబడటం వలన, దానినుంచీ బయటపడి, వారు తమ వ్యక్తిగత మనుగడ గురించి చురుకు గా ఆలోచించే సరికి పుణ్య కాలం కాస్తా గడిచిపోవచ్చు.

పరిమితమైన పరిధి వలన, తమ సమర్ధత పై వీరికి false confidence ఏర్పడి, complacent గా తయారు కావచ్చు. తరువాత బయటి ప్రపంచానికి ఎక్స్-పోస్ అయినపుడు, తమ పరిమితులు తెలిసి, వీరి ఆత్మవిశ్వాసం సన్నగిలే ప్రమాదం ఉంది.

స్థిరత్వం లోని లాభాలు చాలా వరకూ భావోద్వేగ పరమైనవీ మానసికమైనవైతే, అస్థిరత్వం లోని లాభాలు మనుగడకి సంబంచించినవి.

ఇవండీ ఈ స్థిరత్వం గురించిన నా ఆలోచనలు. మన బ్లాగర్లలో చాల మంది ఒకటి రెండు తరాల నుంచే, స్థాన చలనాల తో పరిచయమున్న వారూ, అస్థిరత్వాన్ని ఎదుర్కొన్న వారూ ఉంటారు. బ్యాంకు ఉద్యోగాలూ, పోలీసు నౌకరీ ల లో ట్రాన్స్ఫర్లు సాధారణమే. అస్థిరత్వానికీ – స్థిరత్వానికీ, సంపాదనకీ – నిలకడైన ప్రశాంతతకీ, ప్రస్తుతానికీ- భవిష్యత్తుకీ మధ్య మనం పాటించాల్సిన సమతౌల్యం ఏమిటి?  జీవితం లో అస్థిరత్వం మంచిదా కాదా అనే విషయమై మీ అనుభవాలనూ, అభిప్రాయాలనూ పంచుకోండేం?

ప్రకటనలు

10 thoughts on “పిల్లల పై అస్థిరత్వం ప్రభావం

 1. పిల్లలు అస్థిరత్వానికి తొందరగానే అలవాటు పడతారు!మా మనుమడు ఆరవ్ వయస్సు నాలుగుసంవత్సరాలు అమెరికా లో పుట్టాడు మొదటి జన్మదినం ఇండియాలో చేసుకున్నాడు అమెరికాలో ప్రీ schooling చేసాడు ఆనక తెలుగు నేర్చుకోవడానికి ఇండియా పంపారు 8 నెలలలో తలిదండ్రులకు దూరంగా ఒక్కడే మావద్ద ఉండి నర్సరీ పూర్తిచేసి మళ్ళీ అంతా కలసి అమెరికా వచ్చాము మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ లో చదువుతున్నాడు తెలుగు క్షున్నముగా మాట్లాడుతున్నాడు ఇంట్లో!!!ఎలాంటి సాంస్క్రతిక విఘాతం సంభవించలేదు!పిల్లలు పరిసరాలకు తొందరగా అలవాటుపడి పోతారు!

  మెచ్చుకోండి

  1. అవునండీ. చిన్నపిల్లల విషయం లో మీదే నా అనుభవం కూడా. పెద్దయినాక identity crisis వంటి విషయాలు చాలా వరకూ వారి కుటుంబం పై ఆధారపడతాయేమో. ఈ విషయాల గురించిన అవగాహన తో పెంచబడిన పిల్లలకు ఈ సమస్య తక్కువ గా ఉండవచ్చు.

   మెచ్చుకోండి

 2. /ఓ మనిషి, ఒక వాతావరణం లో,కొందరు వ్యక్తుల తో కొంత కాలం పెరిగినపుడు, అవన్నీఅతని మానసిక ప్రపంచం లో భాగమౌతాయి. వాటి తో అతని interaction, అతని వ్యక్తిత్వం లో భాగమౌతుంది. అలాంటి ఓ ప్రదేశాన్ని వదిలి వెళ్తున్నాం అంటే, మనలోని ఓ భాగం చనిపోతున్నట్లు అన్న మాట./

  అతని వ్యక్తిత్వంలో భాగం అయినవి అన్నీ అతనితోనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. అలాగే నిజంగా ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయాక (ఒకవేళ ఏర్పడితే ) సమస్య ఎలా వస్తుంది కొత్త ప్రదేశంలో ?

  @@ కానీ అస్థిరత్వం వలన, పిల్లలు ఓ సంస్కృతితోనో, విలువల తో నో identify కారు.

  నిజమే, కాని అలా identify అవ్వాల్సిన అవసరం కూడా వాళ్లకి ఉండదు. loneliness ఫీల్ అవడం నిజమే కాని వారు సంస్కృతి, విలువల డొల్లతనాన్ని బయటినుండి స్పష్టం గా చూడగలుగుతారు. ఆ పేరుతొ హడావిడి చేసేవారిని చూసి నవ్వుకొంటారు కూడా 🙂

  @ ఇప్పుడు స్థిరం గా ఓ ప్రదేశం లో పెరిగిన పిల్ల ల గురించి ఆలోచిద్దాం. వీరికి identityలేక world view విషయం లో ఎలాంటి క్లిష్ట పరిస్థితీ ఎదురు కాకపోవచ్చు. కానీ, మొదటి సారి వెరే కల్చర్ కి expose అయినపుడు, వీరికి సర్దుకోవటం కొంచెం కష్టమవుతుంది. అప్పుడు వారు తమ దృక్పధాన్ని విశాలం చేసుకోవటానికి కష్టపడాల్సి రావచ్చు. అలానే, వారి ఆలోచనలు తమ స్థిత్వానికి సంబంధించిన విషయాల చుట్టూ ఎక్కువ వెచ్చించబడటం వలన, దానినుంచీ బయటపడి, వారు తమ వ్యక్తిగత మనుగడ గురించి చురుకు గా ఆలోచించే సరికి పుణ్య కాలం కాస్తా గడిచిపోవచ్చు.

  మళ్ళీ వ్రాస్తాను 🙂

  మెచ్చుకోండి

  1. /ఓ మనిషి, ఒక వాతావరణం లో,కొందరు వ్యక్తు….”
   ఇక్కడ నేను కొంత గజిబిజి గా రాశాను. stress వ్యక్తిత్వం మీద కాదు. interaction మీద.
   BTW వ్యక్తిత్వం ఏర్పడిన వారిలో కూడా వారి మానసిక లోకానికి కూడికలూ, తీసివేతలూ ఉంటాయి. అంటే ముఖ్యం గా మైండ్ లో ఉన్న ఇష్టాఇష్టాలు స్థిరపడి పోయినా, బయటి పరిస్థితులతో interact అయిన విడి విడి అనుభవాలు వారి మానసిక ప్రపంచం లో భాగంవుతాయి. ఓ వ్యక్తి కి ఏ తరహా వ్యక్తిత్వం ఉన్నా, అతను, తాను కొత్తగా చూసిన గ్రాండ్ కెన్యాన్ తనకి కొత్త అనుభవమేనని ఒప్పుకోంటాడు.
   వ్యక్తి ప్రదేశం మారినపుడు, అతను కోల్పోయింది, “పాత వాతావరణం తో అతని interaction వలన అతని లో కలిగే స్పందనలని”. ఆ విషం గా ఆ స్పందనలు అతని లో లేనట్లే! అవి చనిపోయినట్లే! మన ఇష్టమైన ఓ వ్యక్తి చనిపోయినాక కూడా అతని జ్ఞాపకాలు మనని వెన్నంటే ఉంటాయి. కానీ అతని/ఆమె తో interaction సాధ్య పడదు. ఇదీ అంతే!

   “వారు సంస్కృతి, విలువల డొల్లతనాన్ని బయటినుండి స్పష్టం గా చూడగలుగుతారు. ఆ పేరుతొ హడావిడి చేసేవారిని చూసి నవ్వుకొంటారు కూడా ”
   ఇది individual capacity మీద ఆధార పడుతుంది. కొంతమంది కి డొల్ల తనాన్ని చూసే కెపాసిటీ ఉండకపోవచ్చు. సంస్కృతి లో అన్నీ విలువలూ డొల్లే అనుకోలేం. కొన్నిటికి deeper meaning ఉండవచ్చు కూడా.

   మెచ్చుకోండి

 3. @సంస్కృతి లో అన్నీ విలువలూ డొల్లే అనుకోలేం.

  విలువల్లో డొల్లతనం అన్నది నా ఉద్దేశ్యం కాదు …ఆచరణల్లో మాత్రమె .
  పిల్లలు గ్రంధస్తమైన సంస్కృతీ తెలిసికొనేది తక్కువ , అదీ ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ఉంటుంది కూడా. నేను ఉదహరించినది అక్కడక్కడ ఆచరణల్లో కనిపిస్తున్న సంస్క్రుతి లో డొల్లతనం గురించి మాత్రమే.

  @@ ఇప్పుడు స్థిరం గా ఓ ప్రదేశం లో పెరిగిన పిల్ల ల గురించి ఆలోచిద్దాం. వీరికి identityలేక world view విషయం లో ఎలాంటి క్లిష్ట పరిస్థితీ ఎదురు కాకపోవచ్చు. కానీ, మొదటి సారి వెరే కల్చర్ కి expose అయినపుడు, వీరికి సర్దుకోవటం కొంచెం కష్టమవుతుంది. అప్పుడు వారు తమ దృక్పధాన్ని విశాలం చేసుకోవటానికి కష్టపడాల్సి రావచ్చు. అలానే, వారి ఆలోచనలు తమ స్థిత్వానికి సంబంధించిన విషయాల చుట్టూ ఎక్కువ వెచ్చించబడటం వలన, దానినుంచీ బయటపడి, వారు తమ వ్యక్తిగత మనుగడ గురించి చురుకు గా ఆలోచించే సరికి పుణ్య కాలం కాస్తా గడిచిపోవచ్చు.

  వ్యక్తిగత మనుగడ గురించి వారిలో ఆలోచనలు తక్కువ. అది సంపాదించే ఆస్తుల్లోనే ఉంటుందనే నమ్మకం వల్ల కావచ్చు. విశాల దృక్పధం కేవలం వారి అవసరం మేరకు వస్తూ వుంటుంది. ఎక్కువకాలం ఉన్న స్థిరత్వం ఉన్నా వివాహమో ఉద్యోగమో తెచ్చిన అస్తిరత్వం లో వచ్చే ఇన్సెక్యురిటీ వాళ్ళ ప్రాధాన్యాలను నిర్ణయిస్తుంది. అప్పుడు ఎక్కువగా స్వంత ఊరిలోవీళ్ళే మన సంస్కృతులని, మూధనమ్మకాలని కాపాడుతూ ఉంటారు ఎక్కువగా. అన్లిమిటెడ్ టాక్ టైం అన్నది వీరి మొదటి ఫోన్ ఆప్షన్. వీళ్ళే మన సంస్కృతులని, మూధనమ్మకాలని కాపాడుతూ ఉంటారు ఎక్కువగా. అదే సమయం లో ఎక్కువరోజులు ఒక సమాజంలో ఉన్నప్పుడు పెంపొందించుకొనే లౌక్యం కొత్త ప్రదేశాల్లో మంచి ఆయుధం అవుతుంది. ఇది బయటి ప్రపంచాన్ని కొంతవరకు అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అనవసరమైన వాటికి జోలికి పోకుండా అక్కడే ఉంచుతుంది . మొత్తానికి సాఫీగా సాగుతున్నట్లుగా ఉంటుంది లైఫ్ కదా !

  మెచ్చుకోండి

  1. బయటి ప్రపంచన్ని అర్ధం చేసుకోవాలంటే సొంత ఊరే మొదటి మెట్టు. బయటి ప్రపంచానికి రిలేట్ చేసుకోవటానికి సొంత ఊరు ఓ రిఫరెన్స్ పాయింట్ లా ఉపయోగపడుతుంది.

   మెచ్చుకోండి

   1. అవును. కాని అదే స్వంత ఊరిలో ఎక్కువరోజులు ఉండి అర్ధం చేసుకొన్న బయటిప్రపంచం మూస వ్యక్తిత్వాలను ఏర్పరచదా ?

    అప్పుడు మనుషులు, సంబంధాలు చాలా భాగం మెకానికల్ గా మారిపోతాయి. దానిలో రిస్క్ తక్కువ , ఆనందం ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది కాని అది నిజమేనా ?

    మెచ్చుకోండి

    1. మొదటి విషయం కరక్టే అనిపిస్తుంది. “మా వూళ్ళో జనాలందరూ ఇటుకల్లా ఉన్నారని నేను అప్పుడప్పుడూ అనుకొంటాను. వారి అనుభవాలలో వెరైటీ లోపించటం వలన, వారు మూస గా ఉండే చాన్స్ ఉంది.
     సంబంధాలు యాంత్రికం గా ఎందుకు మారతాయో అర్ధం కాలేదు. ఆ సంబంధం లో ఉన్న వారికి అది యాంత్రికం కాదేమో.సంబంధాలలో డైనమిజం అంటే ఎలా ఉంటుంది? నమ్మకం ఉన్నపుడు యాంత్రికత అనివార్యం కాదా? బయటి లోకపు సంబంధాలలోని వెరైటీ ని చూసిన వారికి ఊరి సంబంధాలు మెకానికల్ గా అనిపించవచ్చు.
     మీకు ఈ విషయం లో ఏదో అనుభవం ఉన్నట్లున్నది. అన్లిమిటెడ్ టాక్ టైం వగైరాలు మీరు మీ వ్యక్తిగత పరిశీలనలోంచీ చెప్పినట్లున్నారు. అర్ధం కాలేదు . రిస్క్, ఆనందం గురించి నాకు పెద్దగా తెలియదు.(కంఫర్ట్ మాత్రం ఉంటుంది.) మీరే వివరించండి.

     మెచ్చుకోండి

     1. @ఆ సంబంధం లో ఉన్న వారికి అది యాంత్రికం కాదేమో.

      ఆ సంబంధం లో ఉన్నవారికి అది ఖచ్చితంగా యాంత్రికంగా కనిపించదు. అందుకే సౌకర్యమ్ గా అనిపిస్తుంది వాళ్లకి అని చెప్పాను .

      సంబంధాలలో డైనమిజం అనడం కరెక్ట్ కాదేమో , అంతకన్నా వ్యక్తి పరిస్థితులలో, సమస్యలలో , ఆచరణల్లో డైనమిజం ఉంటుంది కాబట్టి వాటి ప్రభావం సంబందాల మీదా, సమాజం పై తెచ్చుకొనే అవగాహన మీదా కూడా ఉంటుంది .

      @ బయటి లోకపు సంబంధాలలోని వెరైటీ ని చూసిన వారికి ఊరి సంబంధాలు మెకానికల్ గా అనిపించవచ్చు.

      అవును. ఇంటినుండి వెళ్ళిన సిద్దార్డుడికి బయటి సంబంధాలు లో ఆశ అనే లోపం, తప్పు కనిపించినట్లు 🙂

      రిస్క్ తక్కువ ఆనందం ఎక్కువ అని నేను చెప్పిన మాటనే మీరు ఒక్క మాటలో కంఫర్ట్ అన్నారు . రెండు ఒకటే కాని కంఫర్ట్ కోసం ‘మనకెందుకొచ్చిన గొడవ’ అనుకునే తత్వాన్ని పెంచి పోషించడం మామూలు గా జరిగిపోతుంది .

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s