మనిషి రోజువారీ సంతోషం ఒక క్లోస్డ్ లూప్ కంట్రోల్ సిస్టం.

మనిషి రోజువారీ సంతోషం ఒక క్లోస్డ్ లూప్ కంట్రోల్ సిస్టం.

———————————————————–

–ఇంజినీరింగ్ లో కంట్రోల్ సిస్టంస్ అని ఓ సబ్జెక్ట్ ఉండేది. మనిషి దైనందిక సంతోషాల(లేక ఆనందాల) గురించి ఆలోచించినపుడు, అవి ఒక క్లోస్డ్ లూప్ కంట్రోల్ సిస్టం ను అనుసరించి ఉంటాయనిపిస్తుంది. ఇక్కడ దాని బ్లాక్ డయాగ్రం గీసి చూపే ఓపిక నాకు లేదు. కానీ , ఓ నాలుగు ముక్కలలో దానిని వివరిస్తాను.
–మనిషి జీవితం లో అనేక పనులు చేయటం (తినటం, సెక్స్, మ్యూజిక్ వినటం మొ||) వలన అతనికి సంతోషం లేక విసుగు కలుగుతుంది.
–ఈ పనులు చేయటం లోని సుఖ దుఖాలు పీరియాడికల్ గా ఉంటాయి. మీకు ఆకలేసి అన్నం తినటం మొదలు పెడితే, మొదట మీ ఆకలి బాగా తీరుతుంది. కాసేపటి పొట్టనిండి తినటం ఆపేస్తారు. మళ్ళీ కొన్ని గంటలకి కడుపు లో ఎంజైం లు ఊరి మళ్ళీ ఆకలి వేస్తుంది. మళ్ళీ తింటారు. ఇదిద్ రిపీట్ అవుతుంది. ఈ సైకిల్ లో మనిషి కి ఆకలి అనే బాధా, అది తీరిన ఆనందం కూడా ఉన్నాయి.
–ఒక్కోసారి ఆకలేసి కాక రుచి కోసం కూడా తింటాము. ఓ మిఠాయి తింటాము. కొద్ది సేపటికి, ఓ నాలుగు మిఠాయిల తరువాత మన నాలుక పై ఉండే టేస్ట్ బడ్స్ సాచురేట్ అవుతాయి. మిఠాయి బోర్ కొడుతుంది తినటం ఆపేస్తాము. మళ్ళీ ఓ రెండ్రోజుల తరువాత, మళ్ళీ మిఠాయి తింటే బాగానే ఉంటుంది.
–మీకిష్టమైన సాంగ్ మ్యూజిక్ సిస్టం లో పెట్టుకొంటారు. పాటని మొదటి సారి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ రిపీట్ పెడతారు.అలా రిపీట్ చేస్తూ పోతే, కాసేపటికి పాట బోర్ కొడుతుంది. ఆ తరువాత ఎవరైనా మిమ్మల్ని కట్టేసి కూర్చోబెట్టి పాటను వినిపించినా వినలేరు. పైగా, పాట వినటం బాధాకరం గా పరిణమిస్తుంది. మళ్ళీ కొన్నాళ్ళ తరువాత అదే పాటని విని ఎంజాయ్ చేయగలరు.
–ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడు ఉంటాడు. అతనికి ఓ చిన్న పదవి వస్తుంది. సెలబ్రేట్ చేసుకొంటాడు. కొన్నిరోజులపాటు ఆ మజా అనుభవిస్తాడు. తరువాత లైఫ్ మమూలు గా సాగి, మళ్ళీ పెద్ద పదవి కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు. మళ్ళీ ఆనందం మళ్ళీ బోర్ డం, ఇలా రిపీట్ అవుతూ పోతుంది.
–మనం కూడా ఓ ఉద్యోగం లో సెటిల్ అవుతాం, ఓ ఊరూ, కుటుంబమూ స్థిరత్వమూ వస్తాయి. కానీ జీవితం లోకి “బోర్ డం” ఎంటరవుతుంది. ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఏ జాబ్ మార్పో జీవితం లో కాస్త కదలిక తెస్తుంది.

–కులాసా వేరు. సంతోషం వేరు. కులాసా స్థాయి లోని మార్పుని సంతోషం/ఆనందం అనవచ్చు.జీవితం లో కులాసా స్థాయి మారినపుడే ఆనందం మన ఎరుక లోకి వస్తుంది. ఒకే కులాసా స్థాయి కొనసాగితే కొంత కాలానికి విసుగు గానూ, ఆపై దిగులు గానూ, ఆ తరువాత కుంగుబాటు గానూ రూపాంతరం చెందుతుంది.    ఒ కొత్త విజయం లభించినపుడు మనం కులాసా స్థాయి లో ఓ మెట్టు పైకి ఎక్కుతాం. కులాసా స్థాయి మారిన కొత్త లో సంతోషం గా ఉంటాం. కానీ కొంత కాలానికి ఆ కులాసా స్థాయి కి అలవాటు పడి బోర్-డం మొదలౌతుంది.
–అందుకే అనిపిస్తుంది… గేదె కి మేత మేయటం ఎంత సహజమో మనిషికి సంతోషాన్ని మేయటం అంత సహజం. మేత మేయక పోతే గేదె చిక్కి , తరువాత చచ్చి పోతుంది. అలానే మనిషి కి ఆనందం లేక పోతే మానసికం గా చిక్కి, మానసికం గా చచ్చి పోతాడు.
ఈ ఆనంద విషాదాల సైకిల్ మనిషి జీవితమంతా కొనసాగి, మనిషి తన కోర్కెలను తీర్చుకోవటం కోసం జీవితమంతా పరుగెట్టేటట్లు చేస్తుంది. కానీ మనిషి కోర్కెలు చాలా ఖరీదైనవి. వాటి ecological footprint అణుబాంబ్ అంత ఖరీదైనది.
–ఇక మెడిటేషన్ ద్వారా యోగులు ఏ పనీ చేయకుండా కులాసా ని మెదడు లో జెనెరేట్ చేయటానికి ప్రయత్నిస్తారు. అంటే ఇన్-పుట్ లేకుండా అవుట్ పుట్ జెనెరేట్ చేయటం అన్న మాట. అంటే మనిషి కులాసా అనే DC లెవెల్ కొన్ని మెట్లు పైకి వెళ్తుంది. మన సంతోషం అనే సైన్ వేవ్ ఈ లెవల్ మీద రైడ్ అవుతుందన్న మాట.

–సంతోషానికి వర్తించిన రూల్స్ అన్నీ విషాదానికీ, బోర్-డం కీ కూడా వర్తిస్తాయి. తినగ, తినగ వేము తియ్యనుండు అంటారు కదా! అలానే, తినగ తినగ మిఠాయి కూడా చేదవుతందనేదీ నిజమే! ఒక పరిస్థితి ని చాలా కాలం అనుభవిచటం వలన సకారాత్మక భావోద్వేగాలు నెగటివ్ గానూ, నెగటివ్ ఫీలింగ్స్ పాజిటివ్  గానూ మారతాయి.

–కొన్ని సందర్భాలలో ఒక పరిస్థితి ని చాలా కాలం అనుభవిచటం వలన, సంతోష స్థాయి , మొదట కొంచెం ఉన్నా తరువాత చాలా పెరుగుతుంది..వీటినే acquired tastes అంటారు. ఉదాహరణకు కొన్ని పాటలు మొదటిసారి విన్నపుడు సాధారణం గా ఉన్నా, వినగా, వినగా బాగుంటాయి.ఇది, ఆ పాట విన్నకొద్దీ క్రమేణా, “మన (మెదడు) లో భాగం కావటం”, ద్వారా సాధ్య పడుతుంది. మన లో భాగమైన దాన్ని మనం ఎక్కువ ఇష్టపడుతాము కదా..!

–అడిక్షన్ల విషయం లో ఈ రూల్ వర్తించదని అనిపిస్తుంది. కానీ, అడిక్షన్లు చాలా వరకూ వాటిలో ఉన్న ఆనందం కంటే, అవి మానితే కలిగే బాధ వలన కంటిన్యూ అవుతాయి. ..కొన్ని అడిక్షన్లు, “కోరిక తీరటం వలననే మళ్ళీ కోరిక జెనరేట్ కావటం”, వలన కూడ సస్టెయిన్ అవుతాయి.ఉదాహరణ కు కొన్ని మాదక ద్రవ్యాలకు అలవాటు పడనంత కాలం ప్రమాదం ఉండదు. ఒక సారి ఏదైనా డ్రగ్ కి అలవాటు పడిన తరువాత, ఆ డ్రగ్ ఓ డోస్ వేసుకొంటే, తరువాతి డోస్ కోసం ఆరాటం పెరుగుతుంది.
–ఆనందం కూడా ఓ కండిషండ్ రెస్పాన్సే.. పావ్లోవ్ కుక్క లా.జంతువు ల లో తిండి తినటం వలన “ఆనందం సైకిల్” మొదలవుతుంది. తిండి తింటూనే ఓ నాలుగు గంటలు గడిపితే పొట్టపగిలి చచ్చిపోతాము, కనుక, తిండికి ఫుల్ స్టాప్ పెట్టటానికి, ఆనందం బాధ గా మారాలి. ఇది సర్వైవల్ కి అవసరం. తిండిని తీసేయండి… అయినా అ సైకిల్ అలా కొన సాగుతూనే ఉంటుంది (ఆహారం వెయ్యకుండా గంట కొట్టినపుడు కుక్క నోటి లో లాలాజలం ఊరినట్లు..మనం తిండి తినక పోయినా, మన పొట్ట పగిలే అవకాశం లేకపోయినా..మ్యూజిక్ విన్నపుడు కాసేపు ఎంజాయ్ చేస్తాం, అదేపని గా అదే పాట వింటే బోర్ ఫీలవ్వుతాం..కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి మళ్ళీ అదే పాట వింటే, మళ్ళీ ఎంజాయ్ చేస్తాం). మనుషుల లోని ఆనందం,  కండిషండ్ రెస్పాన్స్ కావటం వలన తిండీ వగైరా లు లేకుండా కూడా మనిషి బుర్ర లో సంతోషం యొక్క సైక్లికల్ రెస్పాన్స్ అలా కొనసాగుతూనే ఉంటుంది.  అందుకే మనిషి ఎప్పుడూ అనంతమైన సంతోషాన్ని (కులాసా లెవల్ లో jump ని ), అనంత కాలం పాటు అనుభవించలేదు. సంతోషం exponential గా పెరుగుతూనే ఉండటం సాధ్యం కాదు.దానికి ఫిజికల్ లిమిటేషన్ ఉంది. అలా అనుభవించాలని చూస్తే మనిషికి అనంతమైన శక్తి కావలసి వస్తుంది. ఆ శక్తిని సస్టెయిన్ చేయలేక మనిషి మెదడూ, శరీరమూ “టాప్..” మంటాయి. కాబట్టీ, eternal bliss, అదీ.. ఇదీ.. అంటూ ఎవరైనా చెప్పే మాటలని సందేహం తో చూడటం మంచిది.

–ఓ పని వలన కలిగే ఆనందానికి లిమిట్, ” ఆ పని మొదటి సారి ఏ టెన్షనూ లేకుండా అనుకూలమైన వాతవరణం లో చేసినప్పటి ఆనందం”, చేత నిర్ణయింపబడుతుంది. మొదటి ప్రే మ, మొదటి వర్షం, మొదటి రైలు ప్రయాణం ఇచ్చిన అనందాన్ని ఆ తర్వాతి ప్రేమ లూ, ప్రయాణాలూ అధిగమించలేవుకదా!తరువాతి అనుభవాలనీ మొదటి అనుభవపు జ్ఞాపకం తో compare చేయబడటం వలన, ఆ  differential ని మాత్రమే మన తరువాతి అనుభవాల లో ఎంజాయ్ చేస్తాం.  సహజం గా differential అసలు కంటే తక్కువ గా ఉంటుంది కదా!

–ఇక ఈ టపా లోని అసలు విషయానికి వద్దాం. మనిషి సంతోష వ్యవస్థ యావత్తూ ఓ క్లోస్డ్ లూఫ్ కంట్రోల్ సిస్టం ని పోలి ఉంది. ఇలా..
1. మనిషి చేసె పనులు  – ఇన్-పుట్.
2. మనిషికి వచ్చే కులాసా- అవుట్పుట్
3. మనిషి వ్యక్తిత్వం – సిస్టం.
4. పనులు చేసినపుడు కులాసా కలుగుతుంది.
5. ఆ కులాసా తాలూకూ గుర్తులు (ఇమేజ్) మన మెదడు లో స్టోర్ అవుతాయి.
6. పని చేసిన కాసేపటి వరకూ కులాసా పెరుగుతూ ఉంటుంది.
7. తరువాత, ఆ కులాసా మన మెదడు లో స్టోర్ అయిన ఇమేజ్ తో కంపేర్ చేయబడుతుంది.

స్టోర్ చేయబడిన కులాసా స్థాయి(ఓ నిమిషం లేక గంట కిందటిది)  నెగటివ్ గా ఫీడ్-బ్యాక్ అవుతుంది. (acquired tastes విషయం లో ఇది positive feedback అవుతుంది)
8. ఈ రెండిటి మధ్య తేడా (difference between present level and feedback level) మళ్ళీ ఇన్-పుట్ గా ఇవ్వబడుతుంది. .
9.పని చేస్తున్న కొద్దీ, మెదడు లో స్టోర్ అయ్యే ఇమేజ్ పరిణామం(magnitude) పెరిగి,  నెగటివ్ ఫీడ్ బ్యాక్ పెరుగుతుంది.  అంటే ఎఫెక్టివ్ ఇంపుట్ తగ్గుతుంది.
10. అంటే, ఎఫెక్టివ్ అవుట్ పుట్ తగ్గుతుంది.
11. అంటే, ఉదహరణ కి, పని మొదలుపెట్టిన ఓ గంటకి దాని లోని ఆనందం తగ్గుతూ పోతుంది.
12. కొన్ని రోజులు విరామం ఇస్తే, మెదడు లోని ఇమేజ్ బలహీన పడుతుంది.
13. అంతే ఇమేజ్ కీ అవుట్పుట్ కీ మధ్య డిఫరెన్షియల్ మళ్ళీ ఎక్కువవుతుంది.

14. ఈ డిఫరెన్షియల్ కి లిమిట్, మొదటి సారి చేసిన పని వలన కలిగిన కులాసా వలన సెట్ అవుతుంది.
15. కొన్నాళ్ళ తరువాత చేసిన పని వలన మళ్ళీ ఎఫెక్టివ్ ఇన్-పుట్ పెరిగి మళ్ళీ సంతోషం (అవుట్పుట్ పెరుగుతుంది)
16.ఈ విధం గా,  పని చేసే సమయాన్ని నట్టి అవుట్పుట్ సైనుసాయిడల్ గా పరిణమిస్తూనే ఉంటుంది.

PS:

1. కులాసా లోని స్థాయీ మార్పిడి ని సంతోషం అన్నాను.
2. సంతోషం, ఆనందం అనే పదాలను interchangeable గా వాడాను.

ప్రకటనలు

18 thoughts on “మనిషి రోజువారీ సంతోషం ఒక క్లోస్డ్ లూప్ కంట్రోల్ సిస్టం.”

 1. >> కాబట్టీ, eternal bliss, అదీ.. ఇదీ.. అంటూ ఎవరైనా చెప్పే మాటలని సందేహం తో చూడటం మంచిది.

  ఎటెర్నల్ బ్లిస్ అనే స్థితి ఈ “అలవాటు పడిపోవడం” అనే సహజ ధర్మాన్ని అధిగమిస్తుందేమో? That is why may be, you always feel good in that state.
  లేకపోతే ఆ ఎటెర్నల్ బ్లిస్ స్థితి మనల్ని మామూలు స్థితి కి రాకుండా ఆ ఎక్కువ సంతోష స్థితి ని నార్మల్ లెవెల్ గా చేస్తుందేమో? Then, you may not be having a point of coming back or ‘getting-used-to’ state.

  మెచ్చుకోండి

 2. సంతోషాన్ని క్లోస్డ్ లూప్ కంట్రోల్ సిస్టం తో పోల్చి మీరు చేసిన విశ్లేషణ బాగుంది. షేర్ మార్కెట్ నుంచి విశ్వం వరకూ ఏదయినా చలనం లో ఉంది అని చెప్పాలంటే అవి ఎప్పుడూ Cyclic Motion లో తిరుగుతూనే ఉండాలి(ఉదా : సృష్టి-నాశనం-సృష్టి). అందుకేనేమో నిశ్చలం గా ఉన్న వస్తువు స్ఠితీ, సమ వేగంతో ఉన్న వస్తువు స్ఠితీ ఒకటే అని ఫిజిక్స్ లో నేర్చుకున్నాం.

  మెచ్చుకోండి

 3. చందు గారు,
  ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి కులాసా స్థాయి. రెండవది సతోషం. వీటి మధ్య సంబంధం ఇలా ఉంటుంది… మనిషి లో కులాసా ఒక స్థాయి నుంచీ మరొక కులాసా స్థాయికి మారినపుడే సంతోషం మన ఎరుక లోకి వస్తుంది. మనిషి ఎప్పుడూ సంతోషం గా ఉండాలంటే, ఈ కులాసా స్థాయి ప్రతి గంటకీ పెరుగుతూ పోవాలి ( టైం ప్లాట్ గీస్తే ఒక స్టెయిర్ కేస్ లా కనపడుతుంది). కొంత సమయం తరువాత ఇది చాలా ఎక్కువ(అనంతమైన) కులాసా స్థాయి కావలసి వస్తుంది. ఈ కులాసా స్థాయి ని సస్టెయిన్ చేయాలంటే అనంతమైన శక్తి అవసరం. ఇది సాధ్యం కాదు కదా?.
  మెడిటేషన్ ద్వారా మామూలు కంటే ఎక్కువ కులాసాస్థాయి ని మెయింటెయిన్ చేయగలం. కానీ ఆ స్థాయి అలానే నిలకడ గా ఉంటుంది. అంటే ఆ స్థితి లో ఉన్నవారికి అలవాటైపోయి తాము సాపేక్షం గా మిగిలిన వారికంటే సంతోషం గా ఉన్నామని తెలియను కూడా తెలియక పోవచ్చు. ఉద్యోగం లేక నానా కష్టాలు పడిన వారు కూడా ఉద్యోగం వచ్చిన కొంత కాలానికి జీవితం చప్పగా ఉందంటారు . అలవాటై పోయి. కానీ వారి లో కులాసా స్థాయి ఉద్యోగం లేనప్పటి కంటే ఖచ్చితం గా ఎక్కువ గా ఉంటుంది.
  ఒక వేళ మళ్ళీ ఉద్యోగం లేని స్థితి వస్తే అప్పుడు మన కులాసా లెవల్ పడిపోవటం అనుభవం లోనికి వస్తుంది.
  అయితే మనం ఇలా intellectual గా అనలైజ్ చేసుకోవటం వలన(ఒక్కోసారి intuition వలన కూడా ) మనం భావోద్వేగపరం గా బోర్-డం ఫీలవుతున్నా, కులాసా లెవల్ గురించిన మేధోపరమైన తెలివిడి ఉంటుంది. అందుకే ఉద్యోగం ఉన్న స్థితి నుంచీ లేనిస్థితి కి చేరటానికి సాధారణం గా ప్రయత్నించం.
  ఎక్కువ కులాసా స్థాయి లో ఎంత బోర్ ఫీలయినా, ఆస్థాయి నుంచీ తక్కువ కులాసా స్థాయి కి పడటానికి ఎవరూ మామూలు గా ప్రయత్నించరు.

  మెచ్చుకోండి

 4. గోపి గారూ,
  కంట్రోల్ సిస్టంస్ లో పోల్స్ అండ్ జీరోస్ అని ఉంటాయి. ఇవి స్టెడీ స్టేట్ నూ, ఇన్-స్టెబిలిటీ నీ రిప్రసెంట్ చేస్తాయి. కానీ మరీ కొరుకుడు పడదేమో అని వదిలేశాను.

  మెచ్చుకోండి

 5. To understand them, a bit of maths is required ( Complex numbers, laplace transforms etc. Many readers do not know them So, I did not touch it. When I was studying control system in engineering, I felt it very boring. But after this application(analogy)came to my mind, I found it interesting and revisited it.
  So, the lecturers should make the student relate to the subject and inculcate interest in him. After that the interest will drive the student, then lecturer should guide him and it will be easy.
  One limitation for the lecturer is.. each student in the class relates to the subject in his own personal way. So, lecturer can’t cater to each students quirks/likes/dislikes.
  One of my lecturer used relate subjects to love stories and cricket, so that maximum students in the class could relate to the subject.

  మెచ్చుకోండి

 6. “ఎతెర్నల్ బ్లిస్స్, అదీ.. ఇదీ.. అంటూ ఎవరైనా చెప్పే మాటలని సందేహం తో చూడటం మంచిది”
  మీరే మనుకోక పోతే మీరు రాసిన కొన్ని వ్యాసాలు చదివితే యు.జి. ఫిలాసఫి చదివి, అర్థం చేసుకొన్న తరువాత కూడా, మీరు ఇలా ఆలోచిస్తున్నారేమిటి అని అనిపిస్తుంది. స్పష్టంగా చెప్పాలి అంటే మీరు రాసిన కొన్ని వ్యాసాలు గన్నయ గారి వాదనకి దగ్గరగా ఉన్నాయి. ఇక ఎటర్నల్ బ్లిస్/బ్రహ్మానందం మొదలైనవి లేకపోతే ఈ దేశ ఫిలాసఫిలో వాటి గురించి ఎందుకు ప్రస్తావించారు?

  మెచ్చుకోండి

 7. యూజీ eternal bliss ఉందని ఎక్కడైనా చెప్పారా?ఆయన ఇవన్నీ trash అని చెప్పినట్లు నాకు గుర్తు.యూజీ గురించి ఆయన కెలామిటీ ఓ తిరుగులేని సత్యం. దానిని నేను కాదనటం లేదు. కానీ, నేను మాట్లాడేది bliss గురించి. “ఆయన చెప్పిన దానిని ఒక్కొక్కరూ ఒక్కోవిధం గా అర్ధం చేసుకొంటారు”, అని సబ్జెక్టిబిటీ ని తేకండి.
  అనంతమైన bliss (పరిమాణం, కాలం) లేదనటానికి,నేనో వాదన కూడా చేశాను. నా వాదన మీకు అర్ధమై,(including poles, zeros etc) ఆ వాదన లో లోపం ఉంతే ఎత్తి చూపండి, ఒప్పుకొంటాను. ఎవరో గురూజీ చెప్పాడు ఒప్పుకోమంటే మాత్రం కష్టం.
  యూజీ attack చేయని వారు దేశ ఫిలాసఫీ లో ఎవరూ లేరు, including vedas, sankara.
  నేను అంత దూరం పోదలుచుకోలేదు
  –“ఇక ఎటర్నల్ బ్లిస్/బ్రహ్మానందం మొదలైనవి లేకపోతే ఈ దేశ ఫిలాసఫిలో వాటి గురించి ఎందుకు ప్రస్తావించారు?”
  దేశ ఫిలాసఫీ చెప్పింది కదా..దానినే అడగండి. నా దృష్టి లో eternal bliss, selfless action etc,…ideals మాత్రమే. ఆదర్శం కోసం ప్రయత్నిస్తే కొంతైనా సాధిస్తామని చెప్పి ఉంటారు.

  మెచ్చుకోండి

 8. యూజీ అభిప్రాయాలూ వ్యక్తిత్వమూ వేరు, ఆయన natural state వేరు. ఆయన natural state ని నేను నమ్ముతాను.
  నేను ఆయన వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలతో ఏకీభవించను. ఉదాహరణ కి ఆయన ఆలోచనలు బుర్ర బయటి నుంచీ వస్తాయి, బయట consciousness ఉంది అన్నారు. నేను దీనిని నమ్మటం లేదు. Absolute Truth తెలుసుకోవటం మనిషికి సాధ్యం కాదని యూజీ చెప్పారు. దీనితో అంగీకరిస్తాను.
  natural state మరియూ Absolute Truth ఒకటి కాదని నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

 9. BTW మీరు చెప్పిన ఇంకో ఆయన చెప్పిన వాటి లో కొన్ని limitations ఉన్నా, చాల వరకూ ఆయన తో నాకు పేచీ లేదు. ఈ మధ్య కులమూ, వర్ణమూ ఒకటే అని ఓ అనువాదం చేశాడు. దీనితో నేను ఏకీభవించటం లేదు.

  మెచ్చుకోండి

 10. మీరిచ్చిన సమాధానలకి చాలా థాంక్స్. మీరు రాసిన పైవ్యాసం లో 1 నుంచి 16 పాయింట్లవరకు వివరించింది అంతా చాలా తార్కికంగా రాశారు. ఇంకొక విధంగా క్లుప్తంగా చెప్పాలంటే జ్ణానం వలన అనుభవం, తద్వారా ఆనందం పుడుతుంది, అది కొంత కాలం ఉండిపోతుంది అని అర్థమొచ్చే విధంగా వివరించారు. మీ వాదన ప్రకారం జ్ణానం తో సంబంధం లేకుండా ఆనందం వీలుపడదు.

  ఎటర్నల్ బ్లిస్ సంగతి పక్కన పెట్టండి. ఎవరైనా ఏ కారణం లేకుండా, జ్ణానంతో సంభందం లేకుండా,ఉత్సహాం ఉరకేలెస్తూ, పగలు రాత్రి తేడ లేకుండా పట్టలేని సంతోషం తో కనీసం రెండు రోజులు ఆ స్థితిలో ఉంటే,ఆ ఆనందానికి కారణం కూడా తెలియకుంటె దానిని “బ్లిస్” అని అనుకోవచ్చంటారా?

  మెచ్చుకోండి

 11. జ్ఞానం వలన సంతోషం వస్తుందని మాత్రమే నేనటం లేదు. మనం చేసే పనుల వలన వస్తుంది. మనం చేసే పనులలొ జ్ఞానం సంపాదించటం, ధ్యానం చేయటం కూడా ఉండవచ్చు.
  bliss తో నాకు పేచీ లేదు. పేచీ అల్లా “eternal” bliss తో నే! రెండు రోజులు కాకపోతే నెల రోజుల తరువాతైనా మామూలు స్థితి కి రావలసినదే! అలానే అనంతమైన సంతోష స్థాయి లేదు. మనకి వచ్చే సంతోష స్థాయి ఎక్కువ ఉండవచ్చు కానీ అమితం గా ఉండదు.
  ఇక సంతోషం యొక్క కారణం గురించి..
  కారణాలు లేని వాటిని సైన్స్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తోంది eg: quantum mechanics.

  ఈ విషయం లో సంతోషానికి కారణాలు లేవని నేననుకోవటం లేదు.
  ఆనందానికి కారణం తెలియ లేడంటే ఈ కింది అవకాశాలు ఉన్నాయి.
  1. conscious గా కారణాలు ఉండకపోవచ్చు. unconscious గా కారణాలు ఉండటం. ఏ తెలియని మబ్బులో మన మానసాకాశం నుంచీ తొలహి పోవటం, తెలియని భయాలు తొలగి పోవటం, ఏ ప్రశ్నకో సమాధానం లభించటం.
  2. కారణం మనకి ఆ సమయం లో తెలియక పోవచ్చు. భవిష్యత్తు లో తెలియవచ్చు.
  3. కారణం ఉండి కూడా మనకి ఎప్పటికీ తెలియక పోవచ్చు.
  4. bipolar disorder వంటి వటి లో neurotransmitters వలన, ఏ బాహ్య కారణం లేకుండా అతి ఆనందం, అతి దిగులూ కలుగుతాయి.
  కారణం లేని విషయాలు కూడా కంట్రోల్ సిస్టంస్ పరిధి లోకి వస్తాయి. acausal systems అనీ anticausal systems అనీ, కంట్రోల్స్ లో పాత చింతకాయపచ్చడి కాన్సెప్ట్స్.
  మోడర్న్ సైంటిస్ట్స్ చాలానే తెలివయిన వారండీ. వారు చెప్పే equations అర్ధం చేసుకొనే సరికే బుర్ర వేడెక్కిపోతుంది. అవేమీ అర్ధం చేసుకోకుండా, “వీళ్ళు మన పాత రుషుల తో పోలిస్తే దిగదుడుపే. మన వారికే అసలు విషయాలు తెలుసు”, అనుకోవటం మన self love కి నిదర్శనం. అలా అని మన వారికేమీ తెలియదని నేను అనటం లేదు.

  మెచ్చుకోండి

 12. దీని మీద వివరణ ఇద్దామను కొన్నాను. గన్నయ అనటంలో వేరే ఉద్దేశం ఎమీ లేదు. మీరు రాసిన కొన్ని టాపాలు stephen hawking వాదన గుర్తుకు వచ్చేది. ఇద్దరులో ఉన్న సారుప్యత ఎమిటంటే ఎదో మత గ్రంథం లో రాసిన ఒక లైన్ తెచ్చి ఇప్పుడు పట్టి పట్టి విశ్లేషిస్తారు. మీరు రాసిన పై టాపానే తీసుకొంటే పూర్తి తార్కికతతో రాసారు. ఎక్కడ తార్కికత ఎక్కువై, విశ్లేషణ తో పట్టిపట్టి చూస్తామో అక్కడ సాధారణ బ్లిస్ కూడా స్థానం ఉండదు. మరి ఎటర్నల్ బ్లిస్ వరకు ఎలా వేళ్లారా అని అనిపించిది.
  మీరు ఆ వ్యాఖను తొలగించండి. నా భావం వ్యక్తం చేయటనికి ఉపయోగించానే కాని, పనిగట్టుకొని మిమ్మల్ని విమర్శించటానికి కాదు. ఇంతకు మునుపు విశ్వం/అంతరీక్షం గురించి రాసిన టపాను చాలా తారికికం గా రాసారు, పేరు మర్చిపోయాను. అప్పుడు వ్యాఖ్య రాద్దామనుకొన్నాను వీలు పడలేదు. తార్కికంగా రాయటం తప్పుకాదు, తార్కికత మరీ ఎక్కువైతే ఒక అంశం యొక్క పరిధి తగ్గి, వాదన లాగా మారి పోతుంది. మీరు రాసిన ఈ టప సంతోషం గురించి అది ఎంతో విసృతమైన అంశం.

  మెచ్చుకోండి

 13. “..ఎదో మత గ్రంథం లో రాసిన ఒక లైన్ తెచ్చి ఇప్పుడు పట్టి పట్టి విశ్లేషిస్తారు. ”
  –నాకు మతం గురించి ఏమీ తెలియదు. నేను మత గ్రంధం లోని వాక్యం పట్టుకొని టపాలు రాసింది చాలా చాలా అరుదు.
  “మీరు రాసిన కొన్ని టాపాలు stephen hawking వాదన గుర్తుకు వచ్చేది.”
  –మీరు హాకింగ్ ఏ వాదన గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు. With due respect to his achievements, హాకింగ్ గ్రహాంతరవాసుల వాదన లో లోపం ఉందని నాకు అనిపించింది.
  ఆయన మత గ్రంధాలలోని వాక్యాల గురించి విశ్లేషించారా?!..! నాకు తెలియదు.
  “ఎక్కడ తార్కికత ఎక్కువై, విశ్లేషణ తో పట్టిపట్టి చూస్తామో అక్కడ సాధారణ బ్లిస్ కూడా స్థానం ఉండదు.”
  –నేను bliss కోసం ఈ టపా రాయలేదు కదా?టపాలు రాయటం ద్వారా bliss పొందవచ్చని నాకు తెలియదే! టపాలు తార్కికం గా రాయకపోతే, టపా కు విలువ నివ్వరు. నాకు బ్లిస్ కావలసి వచ్చినపుడు టపాలు రాయనులెండి. అప్పుడు ఏ మెడిటేషనో ట్రై చేస్తాను.
  “మీరు రాసిన ఈ టప సంతోషం గురించి అది ఎంతో విసృతమైన అంశం.”
  –ఈ విషయం నాకు తెలుసు. సంతోషం గురించి నేను ప్రతిపాదించిన మోడల్ కి ఎవరైనా exceptions చెబుతారేమోననే, వాటికోసం ఈ టపా రాశాను. ఎవరైనా మినహాయింపులు చెపితే, Exceptions కి కూడా వర్తించేటట్లు ఈ మోడల్ ని అప్-డేట్ చేయవచ్చనేది నా ఆలోచన. మీరు మినహాయింపులు చెప్పండి మరి.
  “మీరు ఆ వ్యాఖను తొలగించండి. నా భావం వ్యక్తం చేయటనికి ఉపయోగించానే కాని, పనిగట్టుకొని మిమ్మల్ని విమర్శించటానికి కాదు.”
  –No problem

  మెచ్చుకోండి

 14. మనిషి వ్యక్తిత్వం – సిస్టం.
  పైన రాసిన వ్యాసంలో మనిషి వ్యక్తిత్వం – సిస్టం అన్నారు. వ్యక్తిత్వం కూడా అనుభవంతో మార్పుచేందేది అని అనుకొంటే, అది దేశ కాల పరిస్థితులను బట్టి మారుతూంట్టుంది. పెరిగే కొద్ది ఎన్నో కొత్తవిషయాలు నేర్చుకొంటాం, పరిస్థితులకు అనుగుణంగా మారుతూంటం. వీటన్నిటి వెనెకాల ఉన్న ఉద్దేశం ఒకటే అది ఉన్న పరిస్థితి కన్నా దిగజారకుండ, అనవసరంగా కష్ట్టాలపలవకుండ, ఉన్నదానితో సంతోషంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకొంటారు. అంటే బయటి ప్రపంచంలో ఎన్ని విషయాలు మారుతున్నా సంతోషం కొరకు మనలను ట్యున్ చేశుకొంటాం. మనిషికి సంతోషం అనే భావన శరీరం సహకరించినపుడే వీలుపడుతుంది. అందువలన మనిషి వ్యక్తిత్వం – సిస్టం అనేదాని కన్నా అరోగ్యవంతమైన శరీరం – సిస్టం అని అంటే బాగుంటూందేమో! అది ఉంటే అన్ని సంతోషాలు మనిషి అనుభవించగలడు.

  మెచ్చుకోండి

 15. ఇక్కడ వ్యక్తిత్వం అంటే personality అనే అర్ధం లో వాడాను. personality అంటే it includes both physical and mental personality.
  ఈ విషయాలని ఇంకా సునిశితం గా పట్టుకోవాలంటే, adaptive control systems అనీ, dynamic systems అనీ ఉన్నాయి. కానీ తెలుగు బ్లాగు చదువరుల పరిధి దృష్ట్యా వాటిని చర్చించ లేక పోయాను.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s