నరేంద్ర మోడి ని సపోర్ట్ చేయాలా వద్దా?

నరేంద్ర మోడీ ని ఈ కారణాల కోసం మాత్రమే అయితే, సపోర్ట్ చేయనవసరం లేదు:
1. అతను హిందూ జాతీయ వాది అయినందుకు.
2. అతనికి ట్విట్టర్ లో ఫేస్బుక్ లో చాలా ఫాలోయింగ్ ఉన్నందుకు.
3. అతను మీడియా సేవీ అయినందుకు.
4. అతని దూకుడు ని చూసి.
5. గుజరాత్ అల్లర్లు చూసి.
6. గెలిచిన తరువాత ఏదో ఉధ్ధరించి, ఆర్ధికం గా దేశం మొత్తాన్ని గుజరాత్ పధం లో నడిపిస్తాడని.
7. బొంబాయి తాజ్ దాడుల వంటి సందర్భాలలో అణుయుధ్ధానికి వెరవక పోవచ్చు.
8. B.C. నాయకుడు.
9. కాంగ్రెస్ political management ఏ రోజైనా, BJP కంటే మెరుగు.
10. కాంగ్రెస్ ఖాతా లో RTI, ఆధార్, NREGS వంటి పాక్షిక విజయాలూ, administrative professionalism ఉన్నాయి కనుక.
11. విద్య యొక్క కాషాయీకరణ.

కానీ ఇందుకు సపోర్ట్ చేయవచ్చు:
1. కాంగ్రెస్ అవినీతి తో విసుగు చెంది.
2. కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజం చూసి.
3. మూడో ఫ్రంట్ అనే అతుకుల బొంత ని అధికారం లో ఊహించుకోలేక.
4. రాహుల్ ఈ ఎన్నికలలో కాకపోతే వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ను లీడ్ చేస్తాడు.
5. మోడీ కి ఈ ఎన్నికల లో అవకాశం ఇవ్వకపోతే, పై ఎన్నికల లో అవకాశం ఉండదు.
6. అతనికి కుటుంబం లేక పోవటం వలన కొంత అవినీతి తగ్గవచ్చు.
7. మౌని బాబా కంటే నాయకత్వ లక్షణాలలో మైళ్ళు ముందుంటాడు కనుక.
8. కాంగ్రెస్ బాగా వీక్ అయ్యే పరిస్థితులలో, రాజకీయ స్థిరత్వానికి ఉన్న ఒకే అవకాశం మోడీ.
9. BJP తన అంతర్గత విబేధాలను అధిగమించి జాతి ముందుకు ఓ వారసుడు కాని నాయకుడిని ఉంచగలిగింది కనుక.
10. రాజకీయ స్థిరత్వం తో పాటు ఆర్ధికం గా మెరుగయ్యే అవకాశం ఉంది కనుక.
11. అతని హయాం లో మైనారిటీల కు పేద్ద ద్రోహం జరుగుతుందని అనిపించటం లేదు కనుక.
….మొత్తానికి మోడీ కి ఓ సారి అవకాశం ఇస్తే పోలా? అనిపిస్తోంది.

37 thoughts on “నరేంద్ర మోడి ని సపోర్ట్ చేయాలా వద్దా?”

 1. అవును నిజంగానే ఇచ్చేస్తే పోలా? చాలా కాలం తరువాత ఒక నాయకుడు గాంధీల వారసత్వం ప్రజాధరణను మించిన ప్రజాధరణ సంపాదించాడు. భారత దేశములో మొదటి సారిగా ఎన్నికలలో అభివృద్ది అనేదాన్ని అజెండాగా చేసుకుని గెలిచాడు. ఇప్పుడు ప్రస్తుతం మిగిలిన పార్టీలు కూడా తాము చేసిన అభివృద్ది అదీ, ఇదీ అంటూ గొప్పగా ప్రచారం చేసుకోవడానికి ట్విట్టర్లనూ, ఫేసుబుక్కులనూ ఉపయోగిస్తున్నాయంటే అది అతని మహిమే. విభజించే రాజకీయాలు పోయి, అభివృద్ది రాజకీయాలు రావాలంటే మోడీ రావాలని నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

 2. నిజమే కదా .. ఇంతకన్నా ( కాంగ్రెస్ పాలన కన్నా ) పోయేదేముంది . ఆ కుటుంబం తప్ప దేశానికి దిక్కులేనట్టు ..ఇంకెన్థ కాలం

  మెచ్చుకోండి

 3. మురళి గారు,
  వరుసగా మూడవ సారి కాంగ్రెస్ అధికారం లోకి వస్తే, అన్న ఊహే భయం గొలుపుతోంది. రాజీవ్ తక్కువ వయసు లో ప్రధాని గా ఎదుర్కొన్న సమస్యల ను దృష్టి లో పెట్టుకొని, రాహుల్ గాంధీ ని సోనియా అధికారానికి కొంత కాలం దూరం గా ఉంచినట్లుంది. ఇంకో ఐదేళ్ళు ప్రతి పక్షం లో ఉంటే నేర్చుకొంటాడు. ఇందిరా గాంధీ ని కూడా మొదట్లో గూంఘీ గుడియా అన్నారు. కానీ తరువాత సిండికేట్ తో కష్టాలు పడి ఆమె రాటుదేలింది. రాహుల్ విషయం లో కూడా ఇలా జరిగితే దేశానికి మంచిది.

  మెచ్చుకోండి

 4. నమో పాట్రియాటిక్ ప్రజల, మేధావుల మనసులను గెలుచుకొన్నవాడు. కాని కొంతమంది కళ్ళు ఉన్నా చూడలేని కమ్యునిస్ట్ సానుభూతి పరులు, పనిగట్టుకొని నమో గురించి ఎగతాళి చేస్తూ రాస్తూంటారు. కాని కమ్యునిస్ట్ పార్టి భీష్మపితామహుడు, మార్క్సిస్ట్ మేధావి , కమ్యునిస్ట్ పార్టి ప్రభుత్వంలో మాజీ మంత్రి, మాజి సుప్రీం కోర్ట్ జడ్జ్ అయిన జస్టిస్ కృష్ణ అయ్యార్ నరేంద్ర మోడిని మనస్పూర్తిగా అభినందించటం జరిగింది.
  http://m.thehindubusinessline.com/news/politics/v-r-krishna-iyer-greets-modi/article4800580.ece/?maneref=https%3A%2F%2Fwww.google.co.in

  మెచ్చుకోండి

 5. అయ్యర్ మోడీ ని లీడర్ గా గుర్తించాడు.
  Beyond that, నాకు ఆయన అభినందన లో ఫార్మాలిటీ నే కనపడింది. మోడీ సోషలిస్ట్ పార్టీ ని ఎలా లీడ్ చేస్తాడు.

  మెచ్చుకోండి

 6. అవినీతి అంటే చాలా మంది కి ప్రభుత్వ రంగం వాళ్ళ గురించి అని అనుకొంటారు. కాని ప్రైవేట్ రంగంలో అవినితీ, బాధ్యతా రాహిత్యం ప్రభుత్వ రంగంగాన్ని తలదన్నే విధంగా , ఈ మధ్య కాలంలో పెరిగి పోయింది. ప్రభుత్వం అంటెవ్వరికి భయం అనేదే లేదు. ఈ సంవత్సరం ఉత్తర దక్షిణ రాష్ట్రాలు తిరిగాను. అన్నిచోట్లా ఒకటే కామన్ అంశం అవినితి. రూపాయి పనికి పది రూపాయలు వసూలు చేస్తూ, ఆ పని కూడా సక్రమంగా చేయకుండా ఉండటం అనేది ఒక సాధారణ అంశమైకూర్చుంది.
  టీ బంక్ వాడు మొదలు కొని కారోపోరేట్ ఆసుపత్రివరకు ఇదే తంతు. ఇక రియల్ ఎస్టేట్ వాడి సంగతి చెప్పనక్కరలేదు. ఒక్కరికి అనుకొన్న సమాయనికి ఇల్లు ఇళ్లు కట్టి ఇచ్చిన పాపాన పోవటంలేదు. సరికదా ఇల్లు కొన్న వారందరు అసోసియేషన్ ఎర్పాటు చేసుకొని బిల్డర్ తో పోరాటం చేయటం సర్వసాధారణ అంశమైంది. ప్రజలు లక్షలలొ డబ్బులు కట్టినా, వాడు కొనుకొన్న వాళ్లను వాడి వెనుక తిప్పుకొంట్టు,అదేదో ఉచితంగా ప్రభుత్వమిచ్చే ఇళ్ల పథకానికి అప్లై చేసుకొన్నట్లు కస్టమర్లను తిప్పిచ్చుకోని బిల్డర్లు లేరంటే అతియోసక్తేమో!
  మానాన్నగారిని నెలన్నారక్రితం ఒక పెద్ద ఆసుపత్రిలో చేర్పించాం. పది రోజులు ఐసియు లో ఉండి, ఆ తరువాత చనిపోయారు.ఆ సమయంలో దేశం లో పెద్ద కార్పోరేట్ ఆసుపత్రిలో బాధ్యతా రాహిత్యం చూసిన తరువాత, డాక్టర్ల దగ్గర పోవటం కన్నా బుద్దితక్కువపని, వేరొకటి ఉండదు అని అర్థమైంది. ఆసుపత్రిలో తెలిసిన డాక్టర్లు ఉన్నా,డబ్బులు ధారాళంగా ఇచ్చినా నమ్మకం గా ,బాధ్యతగా పని చేస్తారన్నదానిని ఆశించటం, ఇప్పుడు పెద్ద తప్పుగా తయారైంది.
  యుపిఏ-II పాలనలో పెరిగిన అవినితి ఊహకు అందటంలేదు. అనుభవిస్తే నే అర్థమౌతుంది. ప్రతి రంగం పూర్తి విఫలం.

  మెచ్చుకోండి

 7. మీకలా అనిపించిందా! ఆయన ఆ ఉత్తరం రాయకపోయినా ఆయన్ని అడిగేవారు ఎవరు? ఆయన ఏమి బిజెపి పార్టి కాదు కదా! నేను ఆయన హృదయం నుంచి వచ్చిన మాటలుగా అనుకొంట్టున్నాను. అంతే కాదు, అదేసమయంలో ఆయన ఆర్ యస్ యస్ మోహన్ భగత్ ను అభినందిస్తూ ఉత్తరం కూడా రాశాడు.

  మెచ్చుకోండి

 8. నరేంద్ర మోడి కి ఒకసారి ప్రధానిగా అవకాశం ఇచ్చి చూద్దాం!ఎప్పుడూ ఒక పార్టీకే పట్టాభిషెఖం చేస్తే ప్రజాస్వామ్యం పుట్టి మునుగుతుంది!మార్పు ఉంటే మంచిది!కొత్తనీరు వచ్చి పాత నీరు కాలుష్యాన్ని కడిగివేయాలి!అన్నిరంగాలలో అవినీతి,ధరల పెరుగుదల తో ప్రజలు విసిగి మార్పుకోరుకుంటున్నారని సర్వేలు వెల్లడి చేస్తున్నాయి!రాహుల్ గాంధీ ప్రచారం చేసిన చోటల్లా కాంగ్రెస్ ఓడిపోయింది!ఆయనకు భవిష్య దర్శనం లేదు!గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడి అభివృద్ధిని చేసి చూపించాడు!దేశ పాలనాసరలిలో మెరుగయిన మార్పు తెస్తాదేమో!ఒకసారి అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేముంది!?కాంగ్రెస్ ను ఒక పదేల్లపాటయినా అధికారానికి దూరంగా ఉంచడం మంచిదని నాకు అనిపిస్తుంది!

  మెచ్చుకోండి

 9. మోడీ గురించి మీకు తెలిసిన రీతిలో వ్రాసారు. ధన్యవాదాలు. కానీ మీరు రాసినవే కరెక్టు అనుకుంటే ఖచ్చితంగా తప్పే. మీరు పై చెప్పిన వాటిలో కొన్ని కారణాలకు కూడా అతని యొక్క ప్రధాని అబ్యర్ధిత్వానికి, పదవికి అర్హతని చూపిస్తున్నాయి. కనుక ఇది నా అభిప్రాయము అని నొక్కివక్కాణించండి మహాప్రభో…..మన అభిప్రాయాలను ఇతరులమీద రుద్దకూడదు కదా….

  మెచ్చుకోండి

 10. ఒకవేల మోడీ నచ్చకపోయినా, కాంగ్రెస్ తో అంటకాగని వేరే పార్టీకి అయినా ఓటు వేసుకోవచ్చు. కాని కాంగ్రెస్ కి మూడో చాన్సు ఇచ్చి దేశాన్ని మాత్రం తగలబెట్టకండి. మన మంత్రుల మాటతీరూ పనితీరూ చూసిన తరువాత ఇంక వారికెలా ఓటు వెయ్యాలనిపిస్తుంది?

  మెచ్చుకోండి

 11. మీ నాన్న గారి కి శ్రధ్ధాంజలి.
  మోడీ అధికారం లోకి వస్తే బిల్డర్ లు బుధ్ధిమంతులైపోతారా? హాస్పిటల్స్ కి కంపాషన్ వస్తుందా? ఎదో చిన్న మార్పు వస్తుందేమో. మౌలిక మైన మర్పులేమీ రావు.

  మెచ్చుకోండి

 12. “కాంగ్రెస్ ను ఒక పదేల్లపాటయినా అధికారానికి దూరంగా ఉంచడం మంచిదని నాకు అనిపిస్తుంద”
  — మోడీ వచ్చి, వచ్చే ఐదేళ్ళ లో మోడీ, “కాంగ్రెసే మేలు”, అని మనచేత అనిపించక పోతే!

  మెచ్చుకోండి

 13. ఏమి దరిద్రం మన భారతజాతికి?
  120 కోట్లమందిలో రాహుల్, మోడి తప్ప అందరికీ నచ్చే మరో నాయకుడే లేడా?
  కమ్యూనల్, సూడో సెక్యులర్ పార్టీలు తప్ప ట్రూలీ సెక్యులర్ పార్టీలే లేవా?

  మెచ్చుకోండి

 14. “మూడోఫ్రంట్ అనే అతుకులబొంతను అధికారంలో ఊహించుకోలేక”
  “నాకు మూడోఫ్రంట్ కూడా ఇష్టంలేదు. మూడో ఫ్రంట్ కంటే కాంగ్రెసే నయం”
  మీ అభిప్రాయాలను వెల్లడించిన తీరు బాగుంది. అలాగే ఈ అంశాలను కూడా పరిశీలించాలేమో.
  1. సంకీర్ణ ప్రభుత్వాలు కూడా ఒకవిధంగా అతుకులబొంతలే. కాకపోతే ఎన్డీయే, యూపీయే సంకీర్ణాలలో ఒకటి పెద్దపార్టీ అయితే మిగిలినవి చిన్నపార్టీలు(సంఖ్యాపరంగా). తేడా రాశిలోనే తప్ప వాసిలో కాదు. యూపీయే తన 9 ఏళ్ల పాలనలో సంకీర్ణధర్మానికి దేశప్రయోజనాలను కొన్నింటిని పణంగా పెట్టిందన్న విమర్శ ఉండనే ఉంది. ఎన్డీయే హయాం లోకి వెళ్ళినా ఇటువంటివి కనిపించకపోవు. ఇక్కడా మహా అయితే తేడా రాశిలోనే తప్ప వాసిలో ఉండకపోవచ్చు.
  2. సంకీర్ణప్రభుత్వాల కొత్తలో ఏకపక్షప్రభుత్వాలే బాగుండేవనుకునే జనం ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. సంఖ్య తగ్గచ్చు కానీ ఇప్పటికీ అలా అనుకునేవారు ఉండేవుంటారు. చాలాకాలం ఏకపక్ష అధికారానికి అలవాటుపడిన కాంగ్రెస్ కూడా సంకీర్ణవాస్తవికతను గుర్తించి దానితో సమాధానపడదానికి సమయం పట్టింది. ఇప్పుడు ఏకపక్షప్రభుత్వాల వాదన వెనకపట్టి, అతుకులబొంత ప్రభుత్వాలకన్నా సంకీర్ణప్రభుత్వాలే నయమనుకునే పరిస్థితి వచ్చిందని మీ టపా చూస్తే అనిపించింది. ఏమో, సంకీర్ణం లానే రేపు అతుకులబొంత కూడా ఒక వాస్తవికత కాదని ఎలా చెప్పగలరు? వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఎన్నికల తీర్పు ప్రయోగాల బాట పడుతూనే ఉంటుంది. అతుకుల బొంత ప్రభుత్వమైనా నాయకుల ధోరణిలో మార్పువచ్చి దానిని పూర్తికాలం కొనసాగాలే చూసి సక్సెస్ చేయరని ఎలా చెబుతాం?
  3. యూపీయే ను పక్కన బెట్టి ఈసారి ఎన్డీయేకు అవకాశం ఇస్తారు, బాగానే ఉంది. అది కూడా విఫలమైనప్పుడు? అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కు అవకాశమిస్తారా? ఈ రెండు కూటముల మధ్యే ఎప్పుడూ అధికారం చేతులు మారుతూ ఉండాలా? అలా ఎంతకాలం? అనే ప్రశ్న వస్తుంది. అప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో ఫ్రంట్ అవసరమన్న అభిప్రాయం ఎలాగూ బలపడుతుంది. అది ఇప్పటికిప్పుడు వాస్తవం అవచ్చు, కాకపోవచ్చు. సూత్రరీత్యా ఆ అవకాశాన్ని ఎందుకు కాదనాలి?
  ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ కు అవకాశం లేదనడం వేరు. థర్డ్ ఫ్రంట్ సంభావ్యతను సూత్రరీత్యా వ్యతిరేకించడం వేరు. సూత్రరీత్యా అంగీకరించినప్పుడు ఈ ఎన్నికలలో కాకపోతే వచ్చే ఎన్నికలకో, లేదా ఆ పై ఎన్నికలకో అది నిజమయ్యే అవకాశం ఉంటుంది.

  మెచ్చుకోండి

 15. కొన్నాళ్ళకి అతుకుల బొంతలే సాధారణమైనా, అలంటి పరిణామం లో నాకు సకారాత్మకత ఏమీ కనపడటం లేదండీ. రెండు పక్షాలు విఫలమైనపుడు మూడవ పక్షాన్ని ప్రయత్నిస్తాం. కానీ మూడవ పక్షం కూడా మిగిలిన రెండు పక్షాలలాంటిదే అయినపుడు వాసి లో ఏమీ తేడా ఉండదు, పార్టీల రాసి లోనే తప్ప.

  మెచ్చుకోండి

 16. “నాకు మూడో ఫ్రంట్ కూడా ఇష్టం లేదు. మూడో ఫ్రంట్ కంటే కాంగ్రెసే నయం.” నిజమే మీరు చెప్పినది. కాకపొతే, దేశాన్ని తీసుకెళ్ళి డాలర్ దయాదాక్షణ్యాల మీద పెట్టిన చదువుల తండ్రి గారు మన్మోహనం గారి సేవలు లేకుండా ఉన్నట్లయితే మంచిది. ఎవరు వచ్చినా, మరీ ప్రపంచం అంత విశాల హృదయం లేనీ, కొద్దిగా దేశభక్తి గల వ్యక్తినీ ఆర్ధిక మంత్రిగా పెట్టవలసిన అవసరం ఉన్నది.

  మెచ్చుకోండి

 17. ఈ మొత్తం టపాలో మీరు ఉగ్రవాదుల దాడులను గురించి ఒక్క ముక్క రాయలేదు. గత 10 సంవత్సరాలుగా ఎన్ని దాడులు జరిగాయో మరచిపోవటం చాలా బాధాకరం. అవి ఏవి చిన్న చితకవి కావు. బాంబే తాజ్ హోటల్ లాంటి దాడులు మొదలుకొని మొన్న దిల్ షుక్ నగర్ లో జరిగిన బాంబు దాడుల వరకు ఎన్నో ఉన్నాయి.

  ఇక విద్య యొక్క కాషాయీకరణ గురించి మీరు ప్రస్తావించటం చూస్తే, ఆ విషయం పైన మీకు పూర్తి అవగాహన లేదని తెలుస్తున్నాది. పేపర్ లో వచ్చే మార్క్సిస్ట్ అకెడెమి వాళ్ల ప్రాపగండాని నమ్మి మీరు ప్రస్తావించినట్లు ఉంది. ఈ విషయం పైన అరుణ్ శౌరి రాసిన పుస్తకం ఉంది. ఆయన మంత్రిగా ఉన్నపుడు కొన్ని యునివర్సిటిలలో చారిత్రక అంశాల పైన జరిగే పరిశోధనలు ,వాటికి కేటయించిన నిధుల పై వాకాబు చేయటం జరిగింది. డిల్లి యునివర్సిటి ఆచార్యులు అందరు ఈ ప్రాపగండా మొదలు పెట్టారు. ఆయన రాసిన పుస్తకం లో ఒక్కొక్క ప్రాజేక్ట్ కి ఎంత బడ్జేట్ కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టారు అని లెక్కల తో సహా ఒక పుస్తకం రాశాడు.

  Eminent Historians, their technology, their line, their fraud
  http://pustakam.net/?p=1067

  వాస్తవాలు తెలియకపోయినా హిందుత్వని, నమోని తిట్టిపోయటానికి తెలుగు బ్లాగులోకంలో కొంతమంది పగలు రాత్రి పని చేస్తున్నారు.అది కొందరి వ్యాపారం. మీలాంటివారు కూడా ఆరోపణలు వెరిఫై చేసుకొకుండా మీడీయాలో వచ్చే అభిప్రాయలు బ్లాగులో రాస్తే ఎలా? విశ్వసనీయత దెబ్బ తింట్టుంది 🙂

  “బొంబాయి తాజ్ దాడుల వంటి సందర్భాలలో అణుయుధ్ధానికి వెరవక పోవచ్చు”
  పక్కదేశం తో అణుయుద్దమా? పిచుక మీద బ్రహ్మాస్రం తెలివి ఉన్నవాళ్లు ఎవరైనా వేస్తారా? వారికి అటువంటి సమస్యలు ఉన్నాయి.

  Balochistan bleeds by Vikram sood
  http://www.aninews.in/newsdetail2/story113758/balochistan-bleeds.html

  Militants blast Jinnah’s residence in Balochistan
  http://www.thehindu.com/news/international/south-asia/militants-blast-jinnahs-residence-in-balochistan/article4816883.ece

  మెచ్చుకోండి

 18. బొంబాయి దాడులను గురించి ప్రస్తావించాను. అది తీవ్రవాదం గురించి చెప్పటమే కదా?
  ఇక అణుయుధ్ధం గురించి: నమో మొదలుపెడతాడని కాదు. ఉగ్రవాదానికి నమో స్పందన తప్పనిసరిగా కాంగ్రెస్ కంటే దూకుడు గా ఉంటుంది. అంటే సైనిక పరిష్కారం కూడా కావచ్చు. ఒక్క సారి సైనిక ప్రతిస్పందన లోకి వెళ్తే, సామొరదాయ యుధ్ధం లో పాకిస్తాన్ కి పెద్ద ఎడ్జ్ ఉండదు. అది అణుబాంబులను బయటికి తీయటానికి పెద్ద సందేహించక పోవచ్చు.వారికి ఉన్న మత సమాజం కూడా ఇందుకు అడ్డు చెప్పదు. గ్యారంటీ గా చెప్పలేము, కానీ అవకాశం ఉంది.
  ఇక విద్య యొక్క కాషాయీకరణ గురించి. ఉత్తరాన భా జ పా ద్వారా కొన్ని సత్య దూరమైన అంశాలు పాఠ్య పుస్తకాలలో చేర్చబడటం నాకు తెలుసు.
  ఎర్ర బాబులు కూడా వారి ప్రచారం లో (అరుణీకరణ లో) తక్కువేమీ తిన లేదు. కానీ ఈ టపా వారి గురించి కాదు కదా?

  మెచ్చుకోండి

 19. బాంబే ది యుద్దం అని నేననుకొంటాను. నమో వస్తే యుద్దం వరకు వెళ్లదు. అతను గెలిచాడు అని తెలిస్తే వారి వైపునుంచి దూకుడు తగ్గుతుంది. ఇది చదివే వారికి అతియోశక్తిగా అనిపించవచ్చు. కాని వాస్తవమదే.

  మెచ్చుకోండి

 20. మోడీ ని గానీ ఇంకొకరిని గానీ ఫలితం రాకపోయినా ఎందుకు నమ్మాలి? సిధ్ధంతం రాధ్ధాంతం దీర్ఘకాలిక విధానాలు చచ్చిపోయి చాలా కాలం అయింది.
  గాంధీ కుటుంబమయితే ఎన్నిసార్లు ఓడిపోయినా నమ్మకానికి ఢోకా ఉండదు.

  మెచ్చుకోండి

 21. సిధ్ధంతం రాధ్ధాంతం దీర్ఘకాలిక విధానాలు చచ్చిపోయినవి BJP కి కాదు, మిగతా పార్టిలకి. అద్వానికన్న వయసులో ఎంతో చిన్న అయిన మోహన్ భగవత్ మాట మొన్న గోవ సమావేశాల సందర్భంగా మోడి విషయంలో అద్వాని విన్నాడు. అది ఎందుకని ? సిద్దాంతం మించి ఇంకేమి లేదు,అక్కడ ఆయన మాటవినటానికి.
  ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటాంటే ఒకప్పుడు స్వాతంత్ర పోరాట సమయంలో బ్రాహ్మణిజం పైన వ్యతిరేకత అంట్టూ భారతీయత మీద , కంచి శంకరాచార్య శ్రీ చంద్రశేఖర సరస్వతి , వివేకానందుడి లాంటివారి మీద, విరుచుకు పడిన జస్టిస్ పార్టి/ద్రవిడ కళగం వారసులు,హేతువాదులు కాలక్రమంలో సేక్యులర్ వాదుల అవతారం ఎత్తారు. ఇప్పుడు వారి అనుచరులను ఒకసారి గమనిస్తే, వారు శాఖోప శాఖలై తమిళనాడు లో కులానికొకటి చొప్పున పలు పార్టిలు పెట్టుకొని, వారి వారి శక్తి కొలది 2జి లాంటి లక్ష కోట్ల స్కాంలు నుంచి చిన్న స్కాముల వరకు చేసి, పరువు ప్రతిష్ట కోల్పోయి జైళ్లలో కూచొనివచ్చారు. మనదేశంలో ప్రాంతీయ పార్టిలు దాదాపు అన్ని కులపార్టిలు, కుటుంబ పార్టి లు .
  అవి ఈ మధ్య చాలా ఉదారవాదులైనట్లు సెక్యులర్ వాదన ముసుగేసుకొని , అధికారం చేపట్టాక డబ్బులను అవినీతి మార్గంలో విపరీతంగా సంపాదించు కోంట్టున్నాయి. సెక్యులర్ వాదన చివరికి కొంతమంది డబ్బులు సంపాదించుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాది.యు పి లో ఐఏయస్ ఆఫిసర్ విషయం లో చూస్తున్నాం కదా!
  ఇక మీడియా మతవాదులని విరుచుకు పడే కంచి స్వామి అనుచరులైన సుబ్రమణ్య స్వామి లాంటి వారు ఈ దోపిడిని ఆపటానికి పూనుకొని, జాతీయ స్థాయిలో హీరో లా పేరుతెచ్చుకొన్నారు. డిల్లి గాంగ్ రేప్ నిర్భయ కేసులో వీధుల్లో, మీడీయాలో ఎంతో గోల చేసిన అభ్యుదయవాదులు, కేసు కోర్ట్ విచారణకు వస్తే ఒక్కరు ముఖం కూడా చుపించటానికి ముందుకు రాలేదు. స్వామి కేసు ను టేకప్ చేసి నిందితుడికి శిక్ష పడేటట్లు చర్యలు తీసుకొంట్టున్నారు. రానున్న రోజులలో ప్రజలు వాళ్ల కష్ట్టాల గురించి టివి షో లలో వాగిన వారిని కాకుండా, పని చేసిన వారిని గుర్తిస్తారని, ఆదరిస్తారని ఆశిద్దాం .

  మెచ్చుకోండి

 22. naredra modi ni 3 saarlu CM ayyaru ante akkada prajalu edo aina nayakatwam chusarane kada! Gujarath attanni 3 saarlu ennukundi alantidi desham enduku ennukodu? congress lo andaru dongale endukante gandi ani peruke tappa evari ontlo gandhi raktam ledu kabatti. modi pedarikam nunchi vachchadu, ataniki kashtam ento telusu, bada ento telusu, endukante samanyude samanyula bada ardam telusukuntadu.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s