తెలంగాణ సోదరుల కు ప్రత్యేకాంధ్ర ఉద్యమ విజయాభినందనలు

మొత్తానికి తెలంగాణ సోదరులు చేసిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఫలించింది.

“ఏమిటి ? పొరబడుతున్నారు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనాలంటున్నారా?”

“కాదండీ, నేను సరిగానే అంటున్నాను. కొత్త రాజధాని కోసం, కొత్త అసెంబ్లీ కోసం, కొత్త జీవనాధారం కోసం, ఎవరు కొత్త గా ప్రయాణం మొదలుపెట్టాలో వారిదే “కొత్త రాష్ట్రం”.  కాకపోతే ఈ ఉద్యమం అంధ్ర ప్రాంతీయులు చేయలేదు. కాబట్టీ, ప్రత్యేక  ఉద్యమం జరిగింది ప్రత్యేక ఆంధ్ర కోసం. చేసింది తెలంగాణ ప్రాంతీయులు.”
ఈ రోజు, వేరు వేరు సమయాలలో తెలంగాణ సోదరులకి అభినందనలు తెలుపుతున్న ఆంధ్ర మిత్రులు ఓ ముగ్గురు తారస పడ్డారు.
వారి ముగ్గురినీ ఒకే ప్రశ్న వేశాను.  “మీరు ఎందుకు అభినందనలు తెలుపుతున్నారు?. ఏర్పడబోయే కొత్త రాష్ట్రం ఆంధ్ర కదా?”
ఒకాయనకి ఆంధ్ర వారి పన్ను డబ్బులతో కూడా, అరవై యేళ్ళ గా బలిసిన హైదరాబాదు గురించి తెలియదు. ఈ యన తన ప్రాంతం కడుపు మీద కొట్టిన విషయాన్ని విస్మరించి అభినందనలు తెలుపుతాడు (అదేమంటే,అరవై ఏళ్ళు కడుపు మీద కొట్టారు. అరవై యేళ్ళు ఆంధ్రా వారి కడుపు మీద కొట్టిన సంఘటనలు ఇక ముందుకు వస్తాయి. ఇంక సమైక్యాంధ్ర అనవలసిన అవసరం లేదు కదా!) ఆహా ఏమి అజ్ఞానం? అందుకే అన్నారు ignorance is bliss అని.
ఇంకో ఆయన, “ఏదో కాస్త లౌక్యం గా ఉండాలి కదా అని చెబుతున్నాను అంటాడు”. ఎవడి స్వార్ధం వాడిది.
మూడో ఆయన కి, ” కావేరీ జలాల పంపిణీ లో సమస్య ఉందని తెలుసు గాని, అదే సమస్య మూడు రెట్లు ఎక్కువ గా ఇక్కడ వచ్చే అవకాశం ఉందని తెలియదు. తెలంగాణ ఇవ్వటమంటే, ఆంధ్ర వాళ్ళు ఇన్నాళ్ళూ దోపిడీ చేశారనే అపవాదుకి కేంద్రం అధికార ముద్ర ఇవ్వటమే అనే స్పృహ లేదు” . No wonder Andhra is getting a a raw deal.
Anyways, చూద్దాం, ఆంధ్రోల్లు దోపిడీ దారులన్న బాబు ఈ మొత్తం ప్రక్రియ లోంచీ ఏం బావుకొంటాడో.

మొత్తానికి డిగ్గీ రాజా గారు, ఆంధ్ర వారు తమకు పై నుంచీ  తా/సాగునీరు తెలంగాణ వారు వదలక పోయినా protest చేయటానికి కుదరని విధం గా ఓ పదేళ్ళు రాజధాని ని హైదరాబాదు లో పెడతామన్నారు.
ఇక మాకెన్ అట ఎవరో బొడ్డూడని కాంగీయుడు, పోలవరం గురించి అడుగుతాడట, రాజధాని నిర్మాణం లో సాయపడ్తారట, సీమాంధ్రులకు రక్షణ కలిపిస్తాడట, నీటి సమస్యలూ వగైరా లను చేత్తో తీసి పారేస్తాడట. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రం లో ఎవరు అధికారం లోకి వస్తారో?! అప్పటికి రాజెవరో, రెడ్డెవరో!Too good to believe. Stunt to pacify seemandhra feelings.

ఇక ఓ ఆంధ్రీయుడి గా కొంత ఆత్మ విమర్శ..:
“ఆంధ్రులు ఆరంభ శూరులు”, అని చిన్నప్పుడు చూచి రాత పుస్తకం లో ఓ నానుడి ఉండేది. ఆరంభ శూరులే కాదు, దూరదృష్టి లేని వారనిపిస్తోందిప్పుడు. ముందు చెన్నై లో ఊరేగారు. విశాలాలాంధ్ర అని sentimental fools  లా బయటెక్కడో   రాజధాని పెట్టటానికి ఒప్పుకొన్నారు.
దానికి తగిన బహుమతి లభించింది. ఇప్పుడు” ఏ బొత్స బాబు వత్తిడి తోనో విశాఖ రాజధాని అంటారేమో. కొన్నాళ్ళకి ఉత్తరాంధ్రోళ్ళు , “మాకూ ప్రత్యేక రాష్ట్రం కావద్దేటీ?”, అంటే, మిగిలిన వాళ్ళంతా తట్టా బుట్టా సర్దుకొని మళ్ళీ ఏ కర్నూలుకో పోవచ్చు. అక్కడ ఏ బైరెడ్డి మనవడో, “జై సీమ!”, అంటే, అక్కడి నుంచీ మళ్ళీ ఇంకో చోటకి పరుగెత్తవచ్చు, eternal gypsies లా.
“ఐకమత్యమే మహాబలం”, అనేది ఇంకో చూచి రాత పుస్తకం సామెత. ఆంధ్ర జనాలు వాళ్ళ లో వాళ్ళు కొట్టుకోవటమే బలం అని నమ్ముతారు. మతం పేరు మీద కాదు కానీ , కులం పేరు మీద, పార్టీ పేరు మీద . తెలంగాణ వస్తే ” ఇంచక్కా ఫలానా కులం వాడు నష్టపోతాడు”, అని చంకలు గుద్దుకొనే ఆయన ఒకరైతే, ” మా కులపోళ్ళు హైదరాబాదు లో ఎక్కువ లేరు, తెలంగాణ వచ్చినా మాకు పోయేదేమీ లేదు”, అనే ఆయన ఇంకొకరు.
మొత్తం ఆంధ్ర సమాజానికి ఉండే లాభ నష్టాల గురించి అవగాహన తో ఏ ఒక్కరూ ఆలోచించరు.
రాజకీయం గా ఆంధ్ర నాయకు లంత పిరికి స్వార్ధ పరులు ఎక్కడా ఉండరు. ముఖ్యమంత్రి, అధికార పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు ఈ ప్రాంతం నుండీ అయి కూడా, జరిగే అన్యాయాన్ని అపలేని నిస్సహాయులు వీరు.చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లు రాజీనామాలు?!
మొత్తానికి అంధ్ర వారికి జరిగి తీరవలసిన అన్యాయమే! ఏం చేద్దాం.
మనకు న్యాయం జరిగినా అన్యాయం జరిగినా, మన సోదరులైనా ఆనందం గా ఉంటారు,”

అమాయకుల త్యాగాలు, ఎన్నో పోరాటాలు, కొన్ని అబధ్ధాలు, కొంత విద్వేషం, అక్కడక్కడా హింస, కొండొక చోట గుంపుల విధ్వంసం, గాయపడిన మనోభావాలు, నాయకుల, ధనవంతుల స్వార్ధం. అపార్ధాలు, కొంత దురభిమానం, చాలా రాజకీయ లబ్ధులు, ఎంతో నిరీక్షణ, తరువాత..,  “తెలంగాణ సోదరుల కు ఉద్యమ విజయాభినందనలు”, “ఆంధ్ర సోదరులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అభినందనలు”.

ఆంధ్ర వారు అనవసరమైన రాజకీయ గొడవలు చేయకుండా , తమ సహజమైన కష్ట పడే గుణం తో మళ్ళీ సొంత రాష్ట్రం లో పురోగమించాలి.

సాగిపోవుటె బ్రతుకు…
————————-
సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి

ప్రకటనలు

7 thoughts on “తెలంగాణ సోదరుల కు ప్రత్యేకాంధ్ర ఉద్యమ విజయాభినందనలు”

 1. “కొన్నాళ్ళకి ఉత్తరాంధ్రోళ్ళు , “మాకూ ప్రత్యేక రాష్ట్రం కావద్దేటీ?”, అంటే, మిగిలిన వాళ్ళంతా తట్టా బుట్టా సర్దుకొని మళ్ళీ ఏ కర్నూలుకో పోవచ్చు. అక్కడ ఏ బైరెడ్డి మనవడో, “జై సీమ!”, అంటే, అక్కడి నుంచీ మళ్ళీ ఇంకో చోటకి పరుగెత్తవచ్చు, eternal gypsies లా.” ……
  అంటే …. ఇంకా ఆంధ్రా వాళ్ళు ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్ళకు కూడా సమన్యాయం చేయబోరని, భావిలో వారిపై కూడా తమ ఆభిజాత్యం, అహంకారం చూపుతారని ఒప్పుకొన్నట్టే కద.

  మెచ్చుకోండి

 2. నా మనసులో ఉన్న అభిప్రాయాలన్నీ నేను కష్టపడి రాయఖర్లేకుండా మీరే చెప్పేసినట్టనిపించిందండీ. “రాజకీయం గా ఆంధ్ర నాయకు లంత పిరికి స్వార్ధ పరులు ఎక్కడా ఉండరు.” ఇది మాత్రం అక్షర సత్యం. మన తెలుగు ప్రజల (కోస్తా + సీమ + తెలంగాణ) అమాయకత్వానికి తగిన దుష్(ఫలితం) దొరికింది. ఇంకో పదేళ్ళు అభివృధ్ధి గురించి మర్చిపోయి మనం మనం కొట్టుకుంటూ ఉంటే సోనియా(కొడుకుని ప్రధాన మంత్రిని చేసుకోవచ్చు), చిదంబరం, వీరప్ప మొయిలీ(వాళ్ళ సొంత రాష్ట్రాలు అభివృధ్ధి చేసుకోవచ్చు) లు చంకలు గుద్దుకుంటూ సినిమా చూసినట్టు చూస్తారు.

  మెచ్చుకోండి

 3. ఓ ప్రాంతం వారిని మొత్తాన్నీ అహంకారం అభిజాత్యం అని నిందించటం అజ్ఞానం. ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే! చిన్న చిన్న బేధాలను చూపి పుల్లలుపెట్టే నాయకులున్నపుడు, ఈ సమస్య మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. కృష్ణా వాళ్ళ మధ్యా గోదావరోళ్ళ మధ్యా, నెల్లూరోళ్ళ మధ్యా ప్రకాశమోళ్ళ మధ్యా ఇలా… అంతం లేదు.
  నేను ఈ వాక్యం అన్నది, “ఆంధ్ర వారికి తమకేది కావాలో తెలియని హ్రస్వదృష్టి ఉందని , అందు వలన పదే పదే వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందనీ”, ఆ ఉద్దేశం లో. దీనికి వేరే ఉద్దేశాలు అంటగట్టి మీ విద్వేషాన్ని బయట పెట్టుకొంటే చేయగలిగేదేమీ లేదు.
  తెలంగాణ ఉద్యమానికి ముందు చాలా మంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు తామేదో ఆంధ్ర వాళ్ళం అన్న ప్రాంతీయ స్పృహ లేదు గాక లేదు. ఉద్యోగాలలో ఎవరికి వారు వాళ్ళ ఊరి వారికో, వారి కులం వారికో సాయం చేసుకొనే వారేమో. అంతే తప్ప ఫలాని వాడు ఆంధ్ర వాడు, వాడికి ఫేవర్ చేద్దాం అనే ఉద్దేశం ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమం తరువాత వారు కూడా తమను తాము తె. ఉద్యమ కారుల నిర్వచనం లోంచీ చూడటం మొదలెట్టారు. అప్పట్లో కొద్దో గొప్పో తమ భాష సరైనదనే ఓ పిచ్చి ఫీలింగ్ ఉండేదేమో. కానీ దానిలో ఇతర ప్రాంతాల పై ద్వేషం లేదు.

  మెచ్చుకోండి

 4. తప్పు కేంద్రం లో ఉన్న నాయకులది కాదు. ముందు మన బంగారం మంచిదవాలి కదా. పొరపాట్లు ఏరాష్ట్రం లో అయినా జరుగుతాయి. ముందు ప్రశాంతం గానే ఉంది .కానీ చిన్న విషయాలను పెద్దవి చేసి అలజడులు లేపారు. నమ్మి మోసపోతున్న జనాలను అనుకోవాలి. ద్వేషాన్ని రెచ్చగొట్టటం చాలా సులువు. దానికి విరుధ్ధం గా కలిసి ఉందామని తగిన ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఎవరూ ప్రచారం చేయలేదు.సెంటిమెంట్ తో ఆడుకొన్నారు, నిప్పు తో ఆడుకొన్నట్లు. మంటలు లేచినాక వాటికి భయపడి లొంగిపోయారు. ఎదిరించి నిల్చొని, తెలంగాణ ప్రజలకి భరోసా ఇవ్వగలిగిన, కన్విన్స్ చేయగలిగిన నాయకుడు కరువయ్యాడు.
  ఇక ఆంధ్ర ప్రాంతం వారి నుంచీ తమకు జరిగిన అన్యాయాల లిస్టు బయటికి వస్తుంది, చూడండి.

  మెచ్చుకోండి

 5. — ఇక ఆంధ్ర ప్రాంతం వారి నుంచీ తమకు జరిగిన అన్యాయాల లిస్టు బయటికి వస్తుంది, చూడండి. — తెలంగాణేతర తెల్గు వాళ్ళకి అంత (అ)జ్ఞానం ఉంటుందని నేను అనుకోడం లేదు. మూణ్ణాలుగు రోజుల హడావిడి తర్వాత రోజీ రోటీ కా కాంలో పడిపోక తప్పదు అనుకుంటున్నాను.

  మెచ్చుకోండి

 6. @@@ “ఆంధ్ర వారికి తమకేది కావాలో తెలియని హ్రస్వదృష్టి ఉందని , అందు వలన పదే పదే వారికి అన్యాయం జరిగే అవకాశం ఉందనీ”@@@@

  నాయకుల హ్రస్వద్రుష్టి తెలంగాణా లో కూడా ఉంది, కాని కె సి ఆర్ వెనక్కి తగ్గినపుడు ఉద్యమం ఆగలేదు . అక్కడినుండి ఇంకా వేగవంతం అయ్యింది . రాజకీయ నాయకులు కూడా తప్పనిసరిగా అనుసరించాల్సి వచ్చింది.

  కారణం తెలంగాణా పోరాటం అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజల భాగస్వామ్యం తో జరిగింది. ఆంద్ర లో అది సాధ్యం కాదు. ఏదో ఇంటర్నెట్ లో మాట్లాడడమే కాని , ఐక్యత లేదు. కారణం అసలు సమస్యలు అవగాహనలో లేవు . జస్ట్ అక్కడ ఉద్యమం చేసేవాళ్ళని తిట్టిపోయ్యడానికి నాయకులు పిలిపించిన కొద్దిమంది ప్రజలు విద్యార్దులు చాలు కాని అది రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికొ లేక విడిపోయిన తర్వాతి సమస్యలు అర్ధం చేసికోవడానికొ సరిపోవు.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s