విశ్వసనీయత – కిరణ్ కుమార్ రెడ్డి, KCR.

రవీంద్ర టీవీ లో వార్తలు చూస్తున్నాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారం రోజుల సీమాంధ్ర ఉద్యమం తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు.  విద్యుత్ గురించి KCR ప్రణాళికలను ఉటంకిస్తూ, అవి ఎలా సాధ్యం కావో చెబుతున్నాడు.
“కిరణ్ కరక్ట్ గా మాట్లాడాడు. మాటల మరాఠీ మాటల లోని డొల్లతనాన్ని  బాగా ఎండ గట్టాడు”, అనుకొన్నాడు రవీంద్ర.

మరుసటి రోజు రవీంద్ర తన ఫ్రెండ్ రవీందర్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరికీ రాష్ట్ర విభజన విషయం లో విరుధ్ధమైన అభిప్రాయాలున్నా, తమ  స్నేహానికి ఆ అభిప్రాయాలు అడ్డు పడకుండా ఇంతకాలం చూసుకొన్నారు,.
రవీందర్ వాళ్ళింట్లో హాల్ లో టీ వీ రన్ అవుతోంది. నిన్నటి కిరణ్ మాటలకి KCR ప్రతిస్పందిస్తున్నాడు.
రవీందర్ అన్నాడు, “కిరణ్ అబధ్ధాలని KCR మంచి గా బయటపెట్టిండు”, అన్నాడు రవీందర్.ఈ సంఘటన లో రవీందర్ గానీ, రవీంద్ర గానీ కిరణ్ లేదా KCR చెప్పిన విషయాలను వెరిఫై చేసే స్థితి లో లేరు. నిజమేదో తేలటానికి నిపుణులూ, నివేదికలూ కావాలి.
కానీ, ఎవరి ప్రాంత నాయకుడు వారికి విశ్వసించదగిన వాడిగా కనిపించాడు.  వారికి తమ నాయకుడు చెప్పిన మాటలే పరమ సత్యాలు. ఎవరు చెప్పారు “సత్యం రెండు విరుధ్ధ రూపాలలో ఉండదని?!”

రవీందర్ ఛానల్ ని మార్చాడు.  స్పోర్ట్స్ ఛానల్.
ధోనీ ఇంటర్వ్యూ లో చెబుతున్నాడు, “ఇండియా వచ్చే మ్యాచ్ లో జింబాబ్వే పై గెలుస్తుందని”. ఈ విషయం లో రవీందర్ కీ రవీంద్ర కీ ఎటువంటి విబేధాలూ లేవు. ధోనీ ట్రాక్ రికార్డ్ అటువంటిది. ఇండియా టీం స్థితి అటువంటిది.

సాధారణం గా మనుషులకి తమ గురించి తమకు ప్రేమా, అభిమానమూ ఉంటాయి. మనుషులు కులం, మతం, ప్రాంతం, భాష, దేశం ఇలా అనేక సమూహాలకు చెందుతారు. తమ గురించిన self image నే తమ సమూహం పట్ల కూడా వారు కలిగి ఉంటారు. అంటే తమ సమూహం వారు మంచి వారనీ, నమ్మదగిన వారనీ, by default నమ్ముతారు. ఏదైనా వ్యక్తిగతమైన అనుభవం వల్ల ఈ రూల్ కి విరుధ్ధం గానూ వ్యవహరించే వారూ ఉంటారు, అరుదు గా.
విశ్వసనీయత లో రెండు రకాలుంటాయి. ఒకటి వస్తు పరమైన విశ్వసనీయత(#objective credibility#) అయితే, రెండవది వ్యక్తి పరమైన విశ్వసనీయత (#subjective credibility#).
వస్తుపరమైన విశ్వసనీయతను (objective credibility) మనం, వాస్తవం లో ఓ మనిషి ట్రాక్ రికార్డ్  ను చూసి ఏర్పరచుకొంటాం. దీని లో వేరు అభిప్రాయాలకు తావుండదు. “సూర్యుడు తూర్పున ఉదయించును”, అన్నంత సరిగా ఈ విశ్వసనీయత రుజువౌతుంది. ఉదాహరణ కి అమీర్ ఖాన్ తదుపరి చిత్రం కనీసం యావరేయ్ గా రన్ అవుతుంది. దీని లో భిన్నాభిప్రాయాలకు తావు లేదు.
ఇక రెండవ రకం విశ్వస నీయత వ్యక్తి పరమైన విశ్వసనీయత (subjective credibility) . ఇది మనిషికీ మనిషికీ మారుతుంది. నాకు విశ్వసనీయుడైన వ్యక్తి వేరొకరికి ఏ మాత్రం విశ్వసనీయుడు కాకపోవచ్చు. ఈ వ్యక్తి పరమైన విశ్వసనీయత లో …మనం ఏ సమూహానికైతే (కులం, ప్రాంతం వగైరా) చెందుతామో, అ సమూహానికే అవతలి వ్యక్తి చెందితే, మనకి అతని పై ఎక్కువ గా విశ్వసనీయత ఉండే అవకాశం ఉంటుంది. జనాలు తమ కులం నాయకుడు చెప్పిన మాటలని సులువు గా నమ్ముతారు. అతనికే ఓట్లు వేస్తారు. అలానే, వైరి పక్షానికి చెందిన నాయకుడిని అనుమానం తో చూస్తారు. సందేహిస్తారు. వేరే కులానికి చెందిన నాయకుడు ఆ కులం నుంచీ సపోర్ట్ ని కష్టపడి సంపాదించాలి. అదే తమ కులస్తుల విశ్వాసాన్ని అనాయాసం గా పొందవచ్చు.   అందుకే అనుకొంటా, వైరి  రాజకీయ పక్షాలు అవతలి పక్షం నాయకుడి పై ఆరోపణలు, ఆ నాయకుడి  కులానికో మతానికో చెందిన వారితో చేయిస్తారు.

మనకు అన్యాయం జరిగిపోయిందని మనోడు చెబ్తే, ఆలోచించకుండా నమ్మేస్తాం. మన కు ఏం పరవాలేదని వేరే వాడు చెప్తే, వాడి మాటలని అనుమానం గా చూస్తాం.
రాజకీయాలలో జనాలకి నాయకుల మాటలను వెరిఫై చేసే అవకాశం ఉండదు. అందుకే జనాల అస్థిత్వం(identity) అనేది నాయకుల credibility ని స్థిరపరచటం లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తుంది. సినిమా హీరో లకి కుల పరమైన అభిమాన సంఘాలున్నా, అంబేద్కర్ వంటి నేతల ను దైవ సమానం గా తప్పు చేయలేని వారి గా చూస్తున్నారన్నా, ఈ అస్థిత్వ ప్రభావముంటుంది. అలానే గొప్ప నాయకుల విశ్వసనీయతను అప్పుతెచ్చుకొని ఇతరులను దెబ్బ తీయటం కూడా ఈ మధ్య కాలం లో చూడ వచ్చు. ఉదాహరణకు, తెలంగాణ విషయం లో అంబేద్కర్ వేరు వేరు సందర్భాలలో చెప్పిన మాటలను ఇరు పక్షాలూ వల్లె వేస్తున్నాయి.    అయితే ఈ  credibility వ్యక్తి గతమైనది (subjective).  దురదృష్ట వశాత్తూ ఇండియా లో అనేక అస్థిత్వాలు (కులం, మతం, ప్రాంతం, భాష వగైరా, వగైరా) ఉండటం వలన ఏదో ఒక అస్థిత్వం ఉపయోగించి రాజకీయ నాయకులు విశ్వసనీయత సాధించుకొంటారు. కానీ ఈ వ్యక్తి పరమైన విశ్వసనీయత అనేది చాలా ప్రమాద కరమైనది. ఎందుకంటే , అది వాస్తవం మీద అధారపడి ఏర్పడినది కాదు. కొంత మందికి ఓ నాయడి విశ్వసనీయత మీద సందేహాలున్నా, అతనిని తెలిసే, తమ ప్రాంతం వాడనో, కులం వాడనో సపోర్ట్ చేస్తారు, వీరిని ఏమీ చేయలేం.
ఇంతకీ కిరణ్, KCR ల  లో ఎవరిని విశ్వసించాలంటారా? God is in details. దస్త్రాలు తీస్తే గానీ సత్యాలు బయటపడవ్.

ప్రకటనలు

9 thoughts on “విశ్వసనీయత – కిరణ్ కుమార్ రెడ్డి, KCR.”

 1. మీరు చెప్పిన సిద్ధాంతం కరెక్టే కావచ్చు. కాని మీరు ఎంచుకున్న ఉపమానం మాత్రం సరిగా లేదు. KCR, కిరణ్ లను equate చేయడం ద్వారా మీరు కిరణ్ మాటల్లోని అహేతుకతను, KCR మాటల్లోని సహేతుకతను కావాలని విస్మరిస్తున్నట్టు కనిపిస్తోంది.

  KCR గత దశాబ్ద కాలంగా ఒకే మాట మాట్లాడుతున్నాడు. కిరణ్ గత కొన్ని నెలలుగా తెలంగాణాకు అనుకూలంగా వ్యతిరేకంగా అనేక సార్లు మాట మార్చాడు. ఇప్పుడు కేంద్ర నిర్ణయం కళ్ళ ముందు కనిపించేసరికి తన అసలు బుద్ధి బయట పెట్టుకున్నాడు.

  రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు ఉత్పన్న మవుతాయని ఒక పెద్ద చిత్రాన్ని ఆవిష్కరించడానికి కిరణ్ ప్రయత్నం చేశాడు. దేశంలో అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, మద్రాసు నుండి విడివడ్డ ఆంధ్రతో సహా. ఆ సమస్యలు కొత్తవీ కావు, పరిష్కరించలేనివు కావు. రాష్ట్ర విభజన మినహా పరిష్కరించలేని సమస్యలున్నాయని గమనించిన తర్వాతే కెంద్రం రాష్ట్ర విభజనకు పూనుకొంది. విభజనలో కొన్ని సమస్యలు రావచ్చు… కాని అవి తాత్కాలికమైనవి. దీర్ఘ కాలిక సమస్యను పరిష్కరించడానికి పరిష్కరించ గలిగిన స్వల్పకాలిక సమస్యలను బూచిగా చూపి అడ్డుకోవాలనుకోవడంలోనే ముఖ్యమంత్రి అవివేకం గోచర మౌతుంది.

  కాబట్టి రవిందర్ KCRని మెచ్చుకోవడంలో చూపిన విస్వసనీయత భావాత్మకం కాక భౌతికాత్మకం కూడా కావచ్చు.

  మెచ్చుకోండి

 2. నా సిధ్ధాంతం సరైనదేననటానికి ఓ ఆధారం (నిరూపణ కాదు) కోసం చూస్తున్నాను. ఇంత లో మీ వ్యాఖ్య కనపడింది.
  1. ఈ టపా ఫోకస్ KCR గానీ కిరణ్ కానీ కాదు. వాళ్ళ మాటలు వినే రవీంద్ర/దర్ లాంటి వారి perceptions. అది మీకు తెలిసే ఈ కామెంట్ మొత్తం KCR Vs కిరణ్ గురించి మాత్రమే రాశారంటే, మీ మోటివ్ వేరే విషయం గురించిన మీ “అభిప్రాయం” చెప్పటానికే అయి ఉంటుంది. ఎవరి అభిప్రాయం వారిది. అభిప్రాయం వస్తుగతమైనది గా ప్రూవ్ చేయాలంతే నిరూపణ కావాలి.
  2. KCR కరక్టా, కిరణ్ కరెక్టా అని నిరూపించాలంటే కావలసినది ఛత్తీస్-ఘడ్ పవర్, installed capacity వగైరా ల కి సంబంధించిన డాక్యుమెంట్సూ, జీవో లూ వగైరా. మిగిలినవన్నీ అభిప్రాయాలే!
  3. ఇద్దరి మాటలలోనూ సహేతుకతా, అహేతుకతా ఉన్నాయి. మీరు KCR ని సమర్ధిస్తున్నారు కాబట్టీ మిమ్మల్ని తప్పని చూపడానికి, నేను కిరణ్ ను సమర్ధిస్తే, అది ఈ టపా ఉద్దేశానికి నప్పదు.
  4. ఇద్దరికీ వారి మాటలకి వారి వారి కారణాలు(motives) ఉన్నాయి.
  5. రాజకీయ నాయకుడన్న తరువాత మాటలు మారుస్తూనే ఉంటారు. అందరూ మాటలు మర్చిన వారే. వారి వారి అవసరాలను బట్టి తగిన సమయం లో మారుస్తూ ఉంటారు. ఫలాని కాల వ్యవధి లో మార్చలేదంటే అలాంటి అవసరం వారికి వచ్చి ఉండక పోవచ్చు.
  Let’s not enter into the pissing match of Andhra Vs Telangana, OR KCR Vs Kiran
  కొన్ని విషయాల లో అభిప్రాయాలు భౌతికాత్మకం గా ఉంటాయని ఒప్పుకొంటాను. కానీ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భావోద్వేగ పరమైన ఈ అంశం లో భౌతికాత్మకత కొసం వెతకాలంతే చాలా కష్టపడాలి.

  మెచ్చుకోండి

 3. You are thinking and going down the topics this much! Don’t you really feel irritated of the stupids or idiots you encounter who just blabber or argue without any reasoning or a firm base?

  May be, that is why Agnaanam is bliss. Because, the more you put your (good) reasoning, the more you knowledge you acquire. And, unfortunately you can find only idiots more in this world, you get irritated when you encounter with them.
  The more you argue with them the more idiotic nature of the other gets exposed.

  Nice article brother, as usual.

  Chandu

  మెచ్చుకోండి

 4. చాలా మంచి ఆర్టికల్ ప్రసాద్ గారు, నిజంగానే వ్యక్తిపరమయిన విశ్వసనీయత చాలా ప్రమాదకరమయినది. కానీ దురదృష్టవశాత్తూ దీని మూలాలు మన భారతీయుల్లో బలంగానే నాటుకుపోయాయని నా అభిప్రాయం. (ఉదాహరణకి కేవలం తాత్కాలికమయిన ప్రయోజనాల కోసం, వాస్తవాలని విస్మరించి, వ్యక్తిపరమయిన ఆధిపత్యానికి, మత పరమయిన ఆధిపత్యానికి, కులపరమయిన ఆధిపత్యానికి తలవంచటమనే అలవాటు.) దీనివల్ల మనం ఇప్పటికీ కూడా ఒక నిస్పక్షపాతమయిన, వ్యవస్థీకృతమయిన, ప్రజాస్వామ్యయుతమయిన, రాజకీయ వ్యవస్థని నిర్మించుకోవటంలో విఫలమయ్యాం.

  మెచ్చుకోండి

 5. థాంక్స్ గోపి గారు.
  “దీనివల్ల మనం ఇప్పటికీ కూడా ఒక నిస్పక్షపాతమయిన, వ్యవస్థీకృతమయిన, ప్రజాస్వామ్యయుతమయిన, రాజకీయ వ్యవస్థని నిర్మించుకోవటంలో విఫలమయ్యాం.”

  కరక్టే. అందుకే కాబోలు అంటారు ఇండియా లో casting the vote అంటే voting their caste. అని అర్ధం అట.

  మెచ్చుకోండి

 6. *నిజంగానే వ్యక్తిపరమయిన విశ్వసనీయత చాలా ప్రమాదకరమయినది*
  సీతారాం,
  పైన రాసిన వ్యాసం చదవలేదు. కాని మీ ఇద్దరి (గోపి గారివి,మీవి) కామేంట్లు చదివాను. పైన రాసిన అభిప్రాయం తో ఏకిభవించను. నా వరకే తీసుకొంటే నేను భారతదేశ రాజకీయలలో సుబ్రమణ్యస్వామి,పి వి నరసింహారావు, ప్రణబ్ ముఖర్జి, నమో లాంటి కొంత మందిని వ్యక్తిపరమయిన విశ్వసనీయత వలనే నమ్ముతాను. వీరిపైన కూడా మీడీయా లో చాలా రకాల ఆరోపణలు వచ్చిన, అవి కొన్ని రోజుల తరువాత అసత్యాలుగా నిరుపింపబడతాయని అన్న నా నమ్మకం ఎన్నో సార్లు ఋజువైంది.

  *ఇప్పటికీ కూడా ఒక నిస్పక్షపాతమయిన, వ్యవస్థీకృతమయిన, ప్రజాస్వామ్యయుతమయిన, రాజకీయ వ్యవస్థని నిర్మించుకోవటంలో విఫలమయ్యాం.*

  భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో పరిణతి సాధించింది.దాని విజయాలను తక్కువ అంచనాలను వేయలేము. తెలంగాణ ఉద్యమమే లేకుండా ఉండి ఉంటే మీరు పై మాటను అనగలిగే వారా? తెలంగాణ ఉద్యమం వలన, ప్రస్తుత పరిస్థితులను చూసి నిస్పక్షపాతమయిన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ లేదని అనటం సబబు కాదు. అయితే ఈ మధ్య కాలం లో సి.బి.ఐ లాంటి కొన్ని వ్యవస్థలను బలహీన పరచటమనేది జరిగింది. భవిషత్ లో కొత్త ప్రభుత్వం వస్తే అందుకు సరి అయిన చర్యలు తీసుకొంటారు.

  మెచ్చుకోండి

 7. వ్యాసం చదవకుండా ఎలా రాస్తారు ఈ కామెంట్? నేను చెప్పిన వ్యక్తి పరమైన విశ్వసనీయత వేరు. మీరు కామెంట్ లో చెప్పింది వేరు.తెలంగాణ ఉద్యమం ప్రభావం ఈ టపా పై లేదు. (పాజిటివ్ కానీ నెగటివ్ కానీ)

  మెచ్చుకోండి

 8. గోపి గారు రాసిన వ్యాఖ్యను చదివితే,మన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన కామెంట్ చేశారనిపించింది.. మీరు బదులిచ్చిన సమాధానం రెండు ప్రజాస్వామ్యం గురించి మాత్రమే ఉంది. మీకు టపాకు సంబంధం లేదు అనిపిస్తే తీసేయండి.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s