ఓ సమైక్య వాది ఆత్మ పరిశీలన.

నేనో సామాన్య మానవుడిని. రాష్ట్రాన్ని కలిపీ ఉంచలేనూ, విడగొట్టాలేను. కానీ రాష్ట్రం కలిసి ఉండాలని కోరుకొనే నిఖార్సైన సమైక్య వాదిని.నేనే కనుక ఓ బలమైన రాజకీయ నాయకుడినైతే అనేక పనులు విలక్షణం గా చేసే వాడిని.

ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటి దాకా ఇప్పటి దాకా సమైక్య వాదం లోని లోటు పాట్లను తడమటానికి ఇదో చిన్న ప్రయత్నం. ఒక్క సమైక్య వాదం గురించి మాత్రమే రాస్తే అది ఈ అంశానికి న్యాయం చేసినట్లవదు. కాబట్టీ , ఆయా విషయాలలో తెలంగాణ వారి నుంచీ నేను ఏమి ఆశిస్తానో కూడా చెబుతాను.
1. అందరం ఓ రాష్ట్రం లో ఉంటున్నాం.  తెలంగాణ వాళ్ళు మనోళ్ళే. కాక పోతే “కొంచెం తక్కువ మనోళ్ళు (భాష వగైరా ల వలన)”, అనే వైఖరి ఆంధ్ర ప్రాంతపు సమైక్యవాదుల లో ఉండేది. సమానత్వం లేని సభ్యత్వం ఈ  రోజులలో నిలబడదు. తక్కువ గా చూడబడ్డ వాడు మొత్తం సమూహాన్నే కాదనుకొంటాడు, హిందువులలో తక్కువ గా చూడబడే కులాలు మొత్తం మతాన్నే విడిచిపెట్టినట్లు. ఈ సమూహం బయట పెద్ద శతృవు కాసుకొని ఉంటే తప్ప, అసమానత ను అంగీకరిస్తూ ఎవరూ లోపల ఉండరు. తనదే గొప్ప అని ప్రవర్తించే వాడికి ఆ ప్రవర్తన ఓ చిన్న విషయం గా కనిపించవచ్చు. కానీ అవతలి వాడికి అది చిన్న విషయం కాదు.

2. అనేక ఒప్పందాల ఉల్లంఘన. ఉల్లంఘించిన వాడికి అదో పెద్ద విషయం లా కనిపించక పోవచ్చు. కానీ అటువైపు వాడికి అది అంత చిన్న విషయమేమీ కాదు. దీనిని అవకాశం గా తమ రాజకీయ జీవితాన్ని ప్లాన్ చేసుకొనే నాయకులున్నపుడు, ఐటువంటి ఉల్లంఘనలు ఉన్న దానికంటే మరింత పెద్దవి గా చూపబడతాయి.
3. ఒక వేళ ఉల్లంఘించినా, “ఆరో వేలెందుకు?” లాంటి నిర్లక్ష్య ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోస్తాయి. బూర్గుల లాంటి వారు తమ పదవులను త్యాగం చేసిన తరుణం లో, ఇటువంటి ప్రకటనలు పుండు కి కారం రాసినట్లు ఉంటాయి.
4. అరవై ల లో ఉద్యమాలు నడిచినపుడన్నా తప్పు ఎక్కడ జరిగింది అని ఆలోచించి దీర్ఘకాలిక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.తరువాత కూడా అవే తప్పులు పునరావృతం అయ్యాయి. చెన్నమనేని రాజేశ్వరరావు సాక్షి.
5. చిత్త శుధ్ధి తో ఆరువందల పది లాంటి GO లు జారీ చేసినా, వాటిని follow-up చేయటం మరిచారు.
6. అప్పట్లో చంద్ర బాబు లాంటి కుర్ర నాయకుడికి జనాల పై ప్రాంతీయ అస్థిత్వ ప్రభావం ఎలా ఉంటుందో అంచనా కి అందలేదు.అంతకు ముందు అరవై ల లో జరిగిన ఉద్యమ తీవ్రత అతనికి అర్ధమై ఉండదు. ఎందుకంటే అతనికి అరవై లలో అంత వయసు లేదు. అంచనా కి అందినా అధికార మైకం లో పట్టించుకొనే స్థితి లేదు.
7. దేశం లో ప్రత్యేల్క రాష్ట్రం కోరుతున్న చిన్న చిన్న ఇతర ప్రాంతాల లా  కాకుండా, తెలంగాణ ఓ పెద్ద ప్రాంతం అన్న విషయం మరువ రాదు.
8. రాజధాని తెలంగాన లో ఉందనే విషయం దాదాపు మరిచిపోయి దానికి తామూ సొంత దారు అనే ఫీలింగ్ ఏర్పరచుకొన్నారు ( ఆ ఫీలింగ్ తప్పని కాదు).
9.ఏ విజయవాడ లోనో ఉమ్మడి రాజధాని పెడితే, అక్కడ అంతా తెలంగాణ వాళ్ళు హల్-చల్ చేస్తూ, ఆంధ్ర వాళ్ళు కూడా “కొంచెం తక్కువ మనోళ్ళే” అంటే, ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళ ని పొమ్మనే వారేమో . విజయవాడ చుట్టు పక్కల నీళ్ళు లేక ఎండి పోతే, అక్కడి ఉద్యోగాలలో చాలా వరకూ తెలంగాణ వారే ఉంటే, అప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా ఉద్యమం చేయల్సి వచ్చేదేమో!
అలంటి సమయం లో భాషా, తెలుగూ వగైరా లు గుర్తుకు రావు కదా?
10. ఒక వేళ విభజన వాదులు అబధ్ధపు లెక్కలు చూపితే, అలాంటప్పుడు జనాలలోకి వెళ్ళి అబధ్ధాలను ఎండగట్టి, సామాన్య జనాల్కి అర్ధమయ్యే టట్లు, పిట్ట కథలు గా చెప్పగల సామర్ధ్యం కల నాయకుడు లేదు.పైగా సమైక్య వాదులు తాము కూడా అబధ్ధాలు(తెలంగాన ఇస్తే దేశం నాశనమైపోతుంది లాంటివి) చెప్పి ఉన్న విశ్వసనీయత ని పోగొట్టుకొన్నారు.
11. సమైక్యం అనవలసినది 69 నుంచీ. దానికి ఒప్పించవలసినది 10 జిల్లాల తెలంగాణ ప్రజలని. ఒప్పించటం కష్ట సాధ్యమే అవ్వవచ్చు. కానీ భీభత్సమైన నాయకత్వ లక్షణాలున్న YS లాంటి వారే ఎందుకు ప్రయత్నించలేక పోయారు? ఎన్నికల ముందొక మాట, తరువాత సీమ లో వేరొక మాట!
12. CBN కానీ YS కానీ తె రా స తో ఎందుకు అంట కాగి మాటలు మార్చారు. దీనివలన వారి విశ్వసనీయతే కాక సమైక్యవాదం యొక్క విశ్వసనీయత కూడా తెలంగాణ ప్రజల లో దారుణం గా దెబ్బతినలేదా?
13. ముందు నుంచీ సమైక్యమే అని, మాట మార్చకుండా, ఆ దిశ లో జరిగిన కృషి గురించీ, పొరపాట్ల గురించీ నిజాయితీ గా ప్రజల్లోకి వెళ్తే, తెలంగాన లో వీళ్ళ పరిస్థితి ఇప్పటి కంటే మెరుగ్గా ఉండేదేమో! ప్రస్తుతానికి మాట మార్చని సమైక్య నాయకుడు లేదు. నిఖార్సైన సమైక్య వాద పార్టీ అసలే లేదు (CPM మినహా.)
14. పార్టీలు సమైక్యమన్నపుడు, ఆంధ్ర జనాలకి అది అవసరం లేకపోయింది. వారికి అప్పుడు ఉచిత కరెంటూ, బియ్యమూ, కష్టం లేని ఉద్యోగాలూ కావలసి వచ్చాయి. ఇప్పుడు జనాలు సమైక్యం అంటున్నారు. చేతులు కాలాక!

15.ఉద్యమాలు లేని సమయం లో అయినా సమైక్యత అవసరం గురించి ఎప్పుడైనా ప్రచారం చేశారా? దిక్కుమాలిన ప్రభుత్వ పధకాల గురించి వేల కోట్లు ప్రచారానికి తగలేశారు. విభజన వాదుల ప్రచారం ఎంత బాగా చేశారంటే, తొంభై ల లో పుట్టిన పిల్లవాడు యాభైలలో జరిగిన “అన్యాయా” ల గురించి ఏకరువు పెడతాడు. అభివృధ్ధి చెందిన వారుగా పిలవబడే సమైక్య వాదులు టెక్నాలజీ ని ఉపయోగించటం లో కూడ వెనుక బడ్డారు. పది సం|| ల కిందటే విభజన వాదులు వెబ్ సైట్లు పెట్టి ప్రచారం సాగించారు. సమైక్య వాదులు మొదలెట్టింది ఓనాలుగైదేళ్ళ క్రితం.  ఒక్క టీవీ చానల్ కూడా సమైక్య వాదానికి కట్టుబడి లేదు.అన్నీ so called సీమాంధ్ర ఛానల్సే అయినా చేసింది విభజన ప్రచారం. హైదరాబాదు లో విభజన వాదుల  భౌతిక దాడులకి దడిసి కావచ్చు, లేక వ్యాపారం కోసం కావచ్చు,ఒక్క ఛానల్/పేపర్ కూడా సమైక్యాన్ని సమర్ధించ లేదు.

16. విభజ అజెండా గా ఓ పార్టీ ఏర్పడ్డాక, విభజనకు సంబంచించిన అన్యాయాలను రూపుమాపినా, ఆ పార్టీ నిజాన్ని ఒప్పుకోదు. ఎందుకంటే  అంతా సరిగా ఉంతే ఆ పార్టీ మనలేదు కాబట్టీ.
ఇక ఒప్పించ వలసినది ప్రజానీకాన్ని. ధైర్యం కలిగించవలసినది తెలంగాణ లోని అల్పసంఖ్యాకులైన సమైక్య వాదులకి. తెలంగాణ లో సభ పెట్టటం రిస్కీ నే కావచ్చు. కానీ విభజన వాదులకి అప్పీల్ చేసి అక్కడి సమైక్య వాదులకి భరోసా కలిగించే ప్రయత్నం చేయలేదెచరూ. వారికి భరోసా ఉంటే వారు నరుగురి తో  చెప్పే వారు.
17.తెలంగాణ వచ్చాక ఉండే అభివృధ్ధి గురించి వాస్తవిక మైన చిత్రం గురించిన చర్చ ఎక్కడా జరుగ లేదు. విభజన వాదులు చూపించే స్వర్గం సినిమా గురించి వారిని ఎవరూ ఎదుర్కోలేదు.

18.–90 శాతం ఆంధ్ర వారున్న తెలుగు సినిమా రంగం , సమైక్యానికి అనుకూలం గా ఒక్క సినిమా తీయలేకపోయింది. విభజ వాదానికి అనుకూలం గా కనీసం 4 సినిమా లు వచ్చాయి. హైదరాబాదు లో ఉండి సమైక్య సినిమా తీయటం సాహసమే కావచ్చు. సాహసం లేని పెద్దలకు గౌరవం ఎందుకివ్వాలి?

19.హైదరాబాదు తో సహా ఆంధ్ర ప్రాంతీయుల హక్కుల గురించి సమైక్య ఉద్యమం చేశారు/చేస్తున్నారు. ఉద్యమానికి సమైక్య ఉద్యమమని పేరు పెట్టట వలన వారి అసలు డిమాండ్లను చెప్పలేని పరిస్థితి. ఏ ఉద్యమానికైనా కావలసినది లక్ష్యాలలో, డిమాండ్ల లో స్పష్టత. అది లేకుండా ఉపయోగం లేదు. ఓ విధం గా చెప్పాలంటే నిజమైన సమైక్య ఉద్యమం 23 జిల్లాలలో జరగాలి. 23 జిల్లాల వారూ సమైక్యమంటే, విభజన ప్రసక్తే రాదు. అంతేటే సమైక్య ఉద్యమానికి అవసరమే ఉండదు. సమైక్య ఉద్యమమనేది ఓ oxymoron. సమైక్య భావన అనేది పాదుకొపవలసిన ఓ భావన. అది active గా జరగాలి, తప్ప విభజన వాదానికి ఓ reaction గా కాదు.

విభజనకి చిదంబరం నీ, మొయిలీ నీ,డిగ్గీ రాజా నీ వాళ్ళు తెలుగు వారి మధ్య చిచ్చు పెట్టటానికి నిర్ణయాలు తీసుకొన్నారనీ అనటం సరి కాదు. ఇవి వారి వ్యక్తిగత నిర్ణయాలు కావు. వచ్చే ఎన్నికలలో రాజకీయ లబ్ధి కోసం చేసి ఉండవచ్చు. దాని బాధ్య త కాంగ్రెస్ పార్టీ అంతటిదీ.  మనం మనం కొట్టుకొని వారి దగ్గరకు వెళ్ళటం సిగ్గు చేటు.

20. చివరి గా హైదరాబాదు గురించిన ఓ ముక్క. నిజాము కట్టించిన హైదరాబాదు తెలుగు నగరం కాదు. భాష ఉర్దు. మతం ఇస్లాం. సంస్కృతి నవాబీ సంస్కృతి. అరవై ల వరకూ   హైదరాబాద్ లో రోడ్ల మీద వినపడే భాష ఉర్దూనే. మెజారిటీ ముస్లిములే! కానీ హైదరాబాదు భౌగోళికం గా తెలంగాణ నడిబొడ్డున ఉంది. చారిత్రకం గా ఈ ప్రాంత పరిపాలన ఇక్కడి నుంచే జరిగింది. కాబట్టీ తెలంగాణ వారు సొంతదారులే. అయితే ఇది ఆంధ్ర వారి రాష్ట్రానికి కూడా దాదాపు అరవై యేళ్ళు రాజధాని.ఆంధ్ర వారు తమ రాధాని లో తాము సొంత దారులు కాకుండా ఎలా పోతారు? ఈ సెంటిమెంట్ తెలంగాణ వారికి లెక్కలోకి తీసుకోదగినదిగా కనిపించకపోవచ్చుగాక. (ఒప్పందనల ఉల్లంఘన ఆంధ్ర వారికి చిన్న విషయం గా కనపడినట్లు.)   ఇక రాజధాని కావటం వలన, రాష్ట్రం లోని అన్నిపట్నాలపై కలిపి పెట్టే ఖర్చు కన్నా ఎక్కువ గా , రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రజల పన్నుల నుంచీ, ఈ నగరం పై గత 60 యేళ్ళు గా పెట్టటమైనది.
విభజన అనేది ఆంధ్ర వారు లోరుకొన్నది కాదు. అది వారి మీద రుద్దబడినది. ఆంధ్ర వారికి న్యాయం జరగాలంటే, హైదరాబాదు పై వారి shared right ని కొనసాగించేలా చర్యలు ఉండాలి(ప్రత్యేక చట్టం కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు). అన్ని సంస్థ లూ ఇక్కడే ఉన్నాయి. హైదరాబాదులోని సంస్థ ల లో ఆంధ్ర వారికి కూడా అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి( అటువంటి సంస్థలు ఆంధ్ర లో ఏర్పడే వరకూ).

హైదరాబాదు లో ఆంధ్ర వారి రక్షణ కి ప్రత్యేక చట్టం కూడా అవసరమే. దేశం లోని ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి ఇక్కడ నివశిస్తున్న వారికి అక్కర లేని భద్రత సీమాంధ్రుల కి ఎందుకు? ఎందుకంటే, ప్రత్యేక ఉద్యమం సీమాంధ్రులకి వ్యతిరేకం గానే జరిగింది (సీమాంధ్ర నాయకులకి కావచ్చు, ప్రజలకి కావచ్చు, పెట్టుబడి దారుల కి కావచ్చు– వీరంతా కూడా సీమాంధ్రులే) పేడ బిర్యానీ, జాగోభాగో, రామోజీ ఫిల్మ్ సిటీ ని నాగళ్ళ తో దున్నిస్తం, నాగార్జున సాగర్ కి అడ్డం గా గోడ కడతం,ఆంధ్ర వారిని రాక్షసుల తో పోల్చటం, సినిమా షూటింగ్ ల కి అడ్డుపడటం, వారి బిల్డింగ్ల పైకి రళ్ళు రువ్వటం, వారి భూములను ఆక్రమించటం, వసూళ్ళు. వసూళ్ళతో రాష్ట్రం రాకుండానే బడా నవాబులయ్యారు. రాష్ట్రం వచ్చినాక ఇంకెంత దందా నడుస్తుందో!  ఇవన్నీ వాస్తవాలు.  రేపు లోకల్-నాన్ లోకల్ అని ఏ చట్టాలు తెస్తారో తెలియదు. కావేరీ జలాల వివాదం సందర్భం గా బెంగుళూరు లో ఉన్న తమిళుల పై దాడులు జరిగిన విషయం తెలిసినదే. ఆంధ్ర తెలంగాణ ల మధ్య కావేరి వివాదం లాంటి మూడు నాలుఘు జల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు హైదరాబాదు లోని సీమధ్రుల పై దాడులు జరగవనే గారంటీ లేదు.

కాబట్టీ సీమాంధ్రుల భద్రత కి చట్టాలు ఉంటే మంచిది. కానీ స్థానిక ప్రజల తో ఉన్న సఖ్యత కంటే మించిన రక్షణ ఏ చట్టం తేలేదని కూడా సీమాంధ్రులు గుర్తెరగాలి.

అరవై ఏళ్ళ లో పెట్టిన ఖర్చు లెక్కలు తీసి అది ఆంధ్ర కి రాజధాని నిర్మించటానికి వచ్చే సంవత్సరాలలో ఉపయోగించాలి.  నీటి సమస్య కు ట్రిబ్యునల్స్ ప్రకారం పరిష్కారం వెతకాలి. (ఒప్పందాలు సరిగా అమలు జరగలేదని మొన్నటి దాకా గోల పెట్టిన విభజన వాదులు, భవిష్యత్తులో చేసుకోబోయే నీటి ఒప్పందాలగురించి అప్పుడే భరోసా ఇవ్వటం మొదలు పెట్టారు!దోపిడీ, వివక్ష లాంటి కారణాల నుంచీ సెంటిమెంట్ కీ, సెంటిమెంట్ నుంచీ, స్వయం పాలన కీ, స్వయం పాలన నుంచీ ప్రజాభీష్టానికి, విభజన కారణాలను మారుస్తూ వచ్చిన విభజన వాదుల భరోస ను ఎందుకు నమ్మాలి?  ఒక్కోసారి మావోయిస్టులకి ప్రాక్సీలుగా ఉన్న విభజన వాదుల మాటల అసలు అర్ధాన్ని సందేహించాల్సి వస్తుంది.   )

56 లో ఉన్న తెలంగాణ కావాలంటున్నారు(బీదర్, మరాఠ్వాడా వదిలి ) కాబట్టీ, భద్రచలాన్ని ఆంధ్ర కి ఇచ్చి వేయాలి.
కొత్త రాష్ట్రన్ని ఇవ్వాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ది, కాబట్టీ, కొంత ఖర్చును కేంద్రం భరించినా, మరి కొంత తెలంగాణ భరించాల్సి రావచ్చు. కేంద్రాన్ని ఎక్కువ గా అడిగితే, దేశం లోని మిగిలిన రాష్ట్రాలు ప్రశ్నిస్తాయి, “మీరూ మీరూ కొట్టుకొని విడిపోతే, మేమెందుకు చెల్లించాలి?”, అని.
తెలంగాణ వారి డిమాండ్లు ఇంకేమన్నా ఉంటే వాటికి కూడా న్యాయం చేయాలి.
ప్రస్తుతానికి కేంద్రం పై నమ్మకం పోవలసిన వసరం కనిపించటం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుతానికి త్వర త్వర గా నిర్ణయం తీసికొన్నా, ఆంధ్ర లో ఉన్న MP సీట్ల ను దృష్టి లోపెట్టుకొని, కేంద్రంసాధ్యమైనంత వరకూ ఆంధ్రకూ కూడా న్యాయం చేయటానికి వీలుంది.
ఆంధ్ర కు సంబంధించిన concerns ను అడ్రెస్ చేయకుండా జూలై 30 ప్రకటన ఉన్నా, స్పష్టత త్వరలోనే వస్తుంది. అప్పుడు సీమాంధ్ర ఉద్యమం తగ్గుముఖం పట్టవచ్చు.ఇప్పుడు రోల్స్ రివర్స్ అయ్యాయి. నిన్న మొన్నటి దాక ఉద్యమాల గురించి సీమాంధ్ర వాళ్ళు చేసిన విమర్శ ల ని తెలంగాణ వాదులు చేస్తున్నారు. తె. ఉద్యమం లో చేసిన పొరపాట్లను ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమకారుకు చేస్తున్నారు. మీడియ ఎప్పటిలానే అగ్నికి ఆజ్యం పోస్తోంది. అప్పుడు విభజన ఉద్యమానికి, ఇప్పుడు వ్యతిరేక ఉద్యమానికి.. అప్పుడు శాంతి వచనాలు చెప్పిన నాయకులు ఇప్పుడు ఉద్యమ బాట పట్టారు. అప్పుడు ఉద్యమాలు చేసిన వారు ఇప్పుడు శాంతి వచనలు చెబుతున్నారు. The stake holders in peace (status quo) have changed now).

ప్రకటనలు

120 thoughts on “ఓ సమైక్య వాది ఆత్మ పరిశీలన.

 1. ఇప్పటికీ సమైక్యంగా ఉండే అవకాశం లేదా? అందుకు ఎందుకు ప్రయత్నించకూడదు. నాలుగు సంవత్సరాలుగా చేయని నిర్ణయం కేవలం రెండు గంటలలో సిడబ్ల్యూసి, యుపియే లు చేసిన నిర్ణయాన్ని సమీక్షించలేమా?

  మెచ్చుకోండి

  1. ఇక కలిసి ఉండటం లో, భావోద్వేగపరం గా తప్ప, ఆంధ్ర కి లాభం కనపడటం లేదు. one side love ఎంత కాలం నిలుస్తుంది? తరువాత తెలంగాణ ప్రజలకి కలుద్దాం అనిపించినపుడు హాయిగా విరహ గీతాలు పాడుకోవచ్చు. ఓ సారి విడిపోయాక కలవడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే పాలక వర్గాలు కొత్త రాష్ట్రం కు అనుకూలం గా కథలు ప్రచారం చేస్తాయి. బ్రెయిన్ వాష్ చేస్తాయి.

   మెచ్చుకోండి

   1. It’s time, you know certain facts about Hyderabad , that you might have possibly not come across in your past, this Just re-ascertains who has the righteous claim over the city of Hyderabad and the concerned stakeholders.

    1) The city of Hyderabad was founded in 1591 AD by Quli Qutub Shah of Qutub Shahi Dynasty commonly known as Golconda Dynasty. This dynasty have had Hyderabad as their capital till 1687. This dynasty built buildings like Chaarminar, Golconda Fort, Tombs, Hussain Sagar lake, Gosh Mahal palace etc.

    THIS DYNASTY COVERED ALMOST ENTIRE ANDHRAPRADESH as we see today.(http://www.mapsofindia.com/history/qutb-sahi-dynasty.html) Which implicates that, All the people of Andhra and Rayalaseema and Bellary were paying taxes to Qutub shahis , which were used to built the city from 1591- 1687.

    #Fact1 Hyderabad has been Historically and Financially linked to People of Andhra and Rayalseema for the first 200 years of it’s inception. Not just the 60 years after independence

    2) After the annexation of Golconda Dynasty by Mughals in 1687, Entire Telangana, Rayalseema, Andhra came under the control of Aurangzeb, Later after the fall of Mughals, Nizam-ul-mulk established a new empire called ” Asif Jahi dynasty commonly known as Nizam state/ Hyderabad state in the year 1724.

    3) When the Nizams founded their dynasty, Even then the Entire Andhra pradesh, was a part of the dynasty , this means, even then Hyderabad has been the capital of Entire Andhra pradesh that we see today, taxes collected from all regions, with a greater proportion from fertile coastal lands were used in building the capital city of Hyderabad. In 1766 1st treaty nizam gave away the Northern Circars (Coastal Andhra) to british,in return for payment of 90,000 pounds annually by the British to the Nizam, With Guntur , Bellary, Rayalseema still being a part of Nizam empire. This is when 45 pounds of money would fetch you 1 Kg of Gold!

    4) in 1768- 2nd treaty- as nizam succumbed to British , had to forge a gesture of friendship ,british payed an annual allowance of 50,000 pounds. In 1788 nizam gave up Guntur district to British in return for an annual tribute of rs 7 lakhs. In 1798, nizam signed the subsidiary alliance treaty with british. In 1800, nizam ceded the 4 districts of then kadapa, ananthapur,kurnool,bellary,in return for the payment for the maintainanace of the subsidiary force in hyderabad. Thus by 1802 coastal andhra and rayalasemma came under the rule of British.

    #Fact2 Thus it clear The entire Andhra PRadesh that we see today has a historical association with hyderabad, which the congress Working Committee has snapped with a stroke of pen.

    5) The Hyderabad state, Nizam was finally ruling had 50% of Telangana and 50% of land from Maharastra , Karnataka ! This means, at no point of time in History, Hyderabad was built with taxes of Telangana alone, as claimed by Separatists politicians (http://bit.ly/1440vZt) . Again the same funda applies that Borefed Farming in Telangana is a very recent phenemenon, the naturally river deltas have been the dominant tax contributors, here the Raichur doab areas, Nanded areas have contributed more taxes than the counterpart Telangana region to Nizams, this was one of the reasons for the surplus budget of Nizams.

    After the Annexation of Nizam state by Indian army by operation Polo , in 1948 ! The new Hyderabad state was formed, with a Assembly, This region was split into 3 parts on the basis of 1st SRC report, on Linguistic grounds.The Marthawada going into Maharastra, Kannada part to Karantaka! (Ironically both these two regions are backward compared to other parts in their states, which means it has something to do with Dynastical rule of Nizams.)

    On 3 rd December 1955, Out of 147 Legislators present in the then Hyderabad State Assembly 103 voted in favor of Merger of Telangana and Andhra , while only 29 voted against it. While 15 remained Neutral. . And thus, Telangana was merged into Andhra Pradesh, according to the wishes of the representatives of People.

    In this backdrop, the state of Andhra PRadesh was re-unified! (not formed) and thus, with Hyderabad as the capital has been making good progress in all the aspects.

    I would like you to introspect, how fair it is … a) Divide the state b) Take Hyderabad away from Andhra/Telangana ? Is it justifiable in any sense? Except for 150 odd years of the 430 years of Hyderabad History! Hyderabad has always been an integral part of Andhra Pradesh ! Why separate now ?

    మెచ్చుకోండి

     1. The rights and liabilities are to be done in totality.
      If Seemandhra can claim right to Hyderabad then Telangana can claim to Right to VIZAG.

      On top of it, Telangana can Put the entire account of Loss to Telangana from its fare share over 60 years firs..

      My dear friend, it is not tax payer money that is spent in Hyderabad as much as the Indian Citizens and Indian and foreign companies did on the contrary its the Tax payers money that is spent in developing VIZAG.

      Its time Seemandhra people do not think Intelligence is their Own Property..
      To-day, entire region is acquiring such a bad reputation among Indians that it may take take decades to recover.. TRUST & Characte is not money they are easy to forego but Very Very Hard to earn..

      As well wisher, STOP finding fault with Telangana as it will only expose seemandhra more..

      Time to take following lessons and move on..
      1. Do not play with emotions, Respect Identities, Respect Diversity, Protect and Support them
      2: Stay away from GOEBELLS propaganda. It sometimes may have some quick gains but the BIGGER LOSS is Certain.
      3 : India stands for Unity in Diversity. Strengthen it. India Can Not pursue Unity thru removal of diversity.
      4 : State Merger, Demerger, Seperation are all more matters of Administrative Viability and Decentralization.
      5 : No State can take away any Constitutional Right of Indian, Makes no difference to any Citizen of India a FACT to be told

      మెచ్చుకోండి

      1. –If Seemandhra can claim right to Hyderabad then Telangana can claim to Right to VIZAG.
       –OK. Claim it. We’ll claim Warangal, Khammam etc.

       On top of it, Telangana can Put the entire account of Loss to Telangana from its fare share over 60 years firs..
       — Sure, go ahead.Show proofs. Do the calculations and settle the accounts.
       My dear friend, it is not tax payer money that is spent in Hyderabad as much as the Indian Citizens and Indian and foreign companies did on the contrary its the Tax payers money that is spent in developing VIZAG.
       –Any proof? What about the world bank loans spent on Flyovers, roads etc?Take any field (public sector, central government, educational, business), the number of institutions are many times more in Hyd than vizag. Anyway, if you want tax spent on vizag and claim it, go ahead

       –Its time Seemandhra people do not think Intelligence is their Own Property..
       Who told that. This post is not intended for that. May be your inferiority complex is reflected here OR your perception of Andhra people. Do not generalize.

       To-day, entire region is acquiring such a bad reputation among Indians that it may take take decades to recover.. TRUST & Characte is not money they are easy to forego but Very Very Hard to earn..
       –Gimme a break.I think to blame an entire region reeks of bias and bigotry.For what reasons? For the same and more reasons Telangana should also acquire bad name. But, I frankly think other Indians/states do not bother much about division or bifurcation. Give your sermons to somebody else.

       I agree with your last 5 points

       మెచ్చుకోండి

 2. అసలు సమస్య ఎక్కడ అంటే డిగ్గీ రాజా తన ప్రకటనలో “టి.ఆర్.ఎస్ పార్టీ మా కాంగ్రెస్ తో విలీనం అయిపోతుందని కె.సీ. ఆర్ చెప్పాడు కాబట్టి తెలంగాణా ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నాం” అని. అలా కాక తెలంగాణా ప్రజల ఆకాంక్ష కొరకు, తెలంగాణా వారి అనేక త్యాగాల ను గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తున్నాం” అని ప్రకటించి వుంటే గొడవ లేదు…
  2. హైదరాబాద్ గురించి అందరి వాదనలు ఎలా వున్నాయంటే నిజాం పాలన లోనే చక్కటి రోడ్లు వున్నాయి, పెద్ద పెద్ద భవంతులు వున్నాయి.. భారత దేశానికి చక్కటి రోడ్లు, చక్కటి రైలు మార్గాలు, పరిశ్రమలు, నదులపై బ్రిడ్జిలు, ఆనకట్టలు , ఆసుపత్రులు, పాటశాలలు ఇవన్నీ బ్రిటిష్ వారిచే కట్టబడ్డాయి.. మన వాళ్ళు పెద్దగా అభివృధ్ధి చేసింది లేదు అని అంటే ఒప్పుకుంటారా..

  ఒకప్పుడు నిజాం కి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణా వాళ్ళు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం నిజాం ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు..
  ఇక మహారాజశ్రీ కె.సీ.ఆర్ ఏమో “ఆంధ్రా వాళ్ళు ఆంధ్రా ప్రాంతానికి వెళ్ళిపోవల్సిందే వేరే ఆప్షన్ లేదు” అని సగర్వంగా, నిక్కచ్చిగా ప్రకటన చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడు కాని ఖండించ లేదు (ఒక్క విజయశాంతి తప్ప).
  ఇప్పుడే ఇలా వుంటే రేపు తెలంగాణా ఏర్పడి అధికారం వాళ్ళ చేతిలో వుంటే తెలంగాణా వాదులమనే ముసుగులో గూండాలు వచ్చి భూములు, ఆస్తులు కొల్లగొట్టి వెళ్ళగొట్టరని గ్యారంటీ ఏమిటి?? వుద్యమం పేరుతో వసూళ్ళు చేసి కోట్లు ఆర్జించిన పార్టీని మొదలు లోనే తుంచకుండా వటవృక్షంగా ఎదిగే వరకూ వుపేక్షించడమే పాలకుల నిర్లక్షం చేసారు, కనీసం నాలుగు సీట్లయినా రాని ఆ పార్టీ తో పొత్తులు పెట్టుకుని ముందు నించి తెలుగు దేశం, కాంగ్రెస్ కూడా నిర్లజ్జమైన ఒప్పందాలు చేసుకున్నారు.. తిలాపాపం తలా పిడికెడు… రాజకీయ ఒప్పందాల కోసమే తెలంగాణా ఏర్పడుతోంది తప్ప నిజంగా తెలంగాణా ప్రజల మీద ప్రేమతో ఏర్పడటం లేదన్నది ప్రత్యక్ష సాక్షం..

  అందుకే ఇవాళ సీమాంధ్ర ప్రజల్లో వువ్వెత్తున లేస్తున్న ప్రజా ఆగ్రహం.. తెలంగాణా సోదరులు ఈ విషయాన్ని గ్రహించాలి, ఒక్క నాయకుడు అయినా ప్రజల కోసమో, వారి త్యాగాల ఫలమో అని చెప్పకుండా తెచ్చేది, ఇచ్చేది మేమే కాబట్టి మాకే ఓట్లు వెయ్యండి అని శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు గాని ఇరుప్రాంతాల వారికి సమన్యాయం జరిగేలా మాట్లాడుట లేదు.ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నారు..

  మెచ్చుకోండి

  1. వెట్టి చాకిరీ అంటే తెలిసినవాడెవడైనా నిజాం అభివృధ్ధి చేశాడని అనరు. కొన్ని మౌలిక సదుపాయాలను తనకోసం బాగానే కల్పించుకొన్నాడు.

   మెచ్చుకోండి

 3. పైన చెప్పటం మరిచిన ఓ పాయింట్:
  ఈ మధ్య అంబేద్కర్ యొక్క holy cow status ని ఉపయోగించుకొని political correctness and credibility కోసం రాజధాని విషయం లో బాంబే గురించి అంబేద్కర్ చెప్పిన మాటలు వల్లె వేస్తున్నారు. బాంబే సొంత దారులు మరాఠీ లే నని దాని సారాంశం (అలానే హైదరాబాద్ తెలంగాణ కి మాత్రమే సొంతం అని కవి హృదయం). ఈ సందర్భం గా మనం అంబేద్కర్ ఓ మరాఠీ అనే విషయం మరువ రాదు. బంధువులు చెప్పిన తీర్పు ఆమోదం కాదు. మధ్యవర్తులే తీర్పు చెప్పాలి.
  historical గా demographic గా హైదరాబాద్ కీ బాంబే కీ చాలా తేడా ఉంది.
  అంబేద్కర్ రిజర్వేషన్లను పరిమితకాలానికి (పది లేక ఇరవై యేళ్ళు) మాత్రమే ప్రయత్నించి తరువాత తీసివేయాలన్నాడు. ఈ వాదనలను ముందుకు తెస్తున్న వారు రిజర్వేషన్ల గురించి ఆయన మాటలను అమలు చేయటానికి ఒప్పుకొంటారా?

  మెచ్చుకోండి

 4. Very balanced approach, thank you. I disagree in part or full with some of the points you mention. However, I don’t want to go into these as it will distract from the high quality of the post.

  As I think you are focusing at the way forward for Andhras, I have a few suggestions/remarks. (I have some for Telangana too but not listing them here).

  1. There is an urgent need to look at the same or similar points vis-a-vis Rayalaseema & Kalinga. For example, Sribagh pact violations & Kalinga employment share in VSP.
  2. How appropriate is it to equate development with big cities? Punjab & Haryana, the richest states, don’t have a single top 10 city between them. Bengal is doing badly even with Calcutta. Why not leverage one’s advantages instead of aping a different model?
  3. Andhra’s otherwise remarkable success story in IT is dented by three shortcomings: school education, manufacturing skills & soft skills.
  4. Distribution of wealth: as the rich farmers benefited, landlessness went up. It is tragic that tenant farmers suffer while absentee landlords are enjoying in cities.

  మెచ్చుకోండి

  1. I agree with you except about 4th point. The distribution of farmland is more equitable in South Andhra, than in other regions. But many of the moneyed are from this region because of the early bird advantage.
   If tenant farmers suffer in a year they do not take up farming next year, and some of the take the road to Hyderabad to be employed in small time jobs

   మెచ్చుకోండి

 5. తెలంగాణా ప్రజలు మానసికంగా దశాబ్దం కిందే విడిపోయారు,భౌతికంగా ఇప్పుడు విడిపోబోతున్నారు!దశాబ్దాలుగా వివిధ ముఖ్యమంత్రులు తప్పక చేయవలసిన న్యాయాన్ని చేయకుండా ఒప్పందాలను తుంగలో తొక్కి తెలంగాణాప్రజల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు!తెలంగాణా జిల్లాలను చిన్నచూపు చూశారు!జిల్లాలు జిల్లపురుగుల్లా జిలజిలలాడుతున్నాయి!తెలంగాణా పల్లెలను ససేమిరా పట్టించుకోలేదు!గ్రామాలు మురికినీటికుంటల్లా లుకలుకలాడుతున్నాయి!సీమాంధ్ర శాసన సభ్యులే మెజారిటీగా ఉండటంవల్ల,తెలంగాణా శాసన సభ్యులు మైనారిటీగా ఉండటంవల్ల వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా చెలామణీ అయింది!నీటి పంపిణీలో,ఉపాధికల్పనలో తెలంగాణా వారికి మొదటినుంచికూడా తీవ్ర అన్యాయం జరిగింది!కనుక తెలంగాణావారి ఆత్మగౌరవ పరిరక్షణకోసం,స్వపరిపాలన కోసం ప్రత్యేక తెలంగాణా ఉద్యమం ఊపందుకొని ఉద్విగ్నతకు లోనైన తొమ్మిదివందల పైన యువత ఆత్మబలిదానాలు చేసుకున్నారు!పది జిల్లాల తెలంగాణా మరీ చిన్న రాష్ట్రమేమీ కాదు!పాలనా సౌలభ్యం పెరుగుతుంది!హైదరాబాద్ తెలంగాణా గుండెకాయ!రాజధాని పెట్టుబడిదారులను సూదంటురాయిలా ఆకర్షించడం ఎక్కడైనా సహజమైన పరిణామం!పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచడానికికూడా తెలంగాణీయులు అంగీకరించారు!గతంలో విభజనలు జరిగినప్పుడు ఏ పద్ధతులు పాటించారో అవే ఇప్పుడూ మార్గదర్శకాలుగా,ఒరవడులుగా నిలుస్తాయి!రాష్ట్రాలుగా విడిపోదాం,తెలుగువాళ్లు గా సమైక్యంగా ఉందాం!

  మెచ్చుకోండి

  1. సీమాంద్రులకి రక్షణ చట్టాలు కావాలనే అర్ధం లేని డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఒకవేళ ఇలాంటి చట్టమే తెస్తే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఇలాంటి డిమాండే భారత దేశం మొత్తం వస్తాయి. ముంబై లో బీహారిలు, ఉత్తరాది వారు కూడా ఇలాంటి డిమాండ్స్ ఎందుకు చేయరనుకోవాలి. అప్పుడది భారత సార్వభౌమాధికారానికే సరికొత సమస్యలు తెస్తుంది. హైదరాబాద్ లో ఉండే సీమాన్ద్రులకు భారత చట్టాలు వర్తించవా. వారికి కొత్త రక్షణ చట్టాలు ఎందుకు.

   మెచ్చుకోండి

   1. Ippudu Seemandhra leaders bayapadedi kabja Lu chesina lands gurinchi, illegal business gurinchi. As a common man no body should be scared, evari illu gunjukoru, evari udyogam evaru teesukaporu. So normal people ila unnecessary ga bayapadedi meaning less.

    Inkatha lekkalloki vaste neellu, nidulu and land sales ilantivi easy ga cheyochu. Kani state division lo central govt chusukuntundi ilantivi anni, so cool and enjoy the time.

    మెచ్చుకోండి

    1. All the leaders of Seemaandhra and Telangana will maintain good relation. Once T materializes, Seemandhra leaders direct power will no doubt reduce. But they will excercise indirect power through their contacts with T leaders. They will keep some T people as proxies and continue landgrab. They will bribe officials and continue their deeds.
     As per T leaders (few city legisltoers, realtors) they will do the land grab with renewed vigor

     మెచ్చుకోండి

 6. Telangaana people can never claim to be part of development of Hyderabad. We can apply the same logic of the separatists who had surpassed Goebbels with their false propaganda on the lines of Taliban/LTTE. Can anyone name some industrialist, business men from Telangana in other states say for exmple Chennai or Bangalore. Has anyone stopped them from going out and to be enterprising. Certain facts are to accepted. Why did not their leaders or people develop their villages or towns. thisnis typical propaganda, you need to show a person as enemy for all your ills and incompetence, incompetent people are always ready to take all these arguments. if someone from seemandhra goes and buys land in the outskirts of Hyderbad, where no faclities are available, a dry land and at the rate prevailing at that time and in due course of time, if it develops and the proces go up, these people start saying that the land is grabbed, or bought by cheating. this is how any lazy person, who does not do any hardwork starts and after sometime, all these lauts form something like Telaban Rowdy Santhati

  మెచ్చుకోండి

  1. if someone from seemandhra goes and buys land in the outskirts of Hyderbad, where no faclities are available, a dry land and at the rate prevailing at that time and in due course of time, if it develops and the proces go up, these people start saying that the land is grabbed,
   –I agree with this part. That’s not land grab

   మెచ్చుకోండి

 7. మంచి పాయింట్లు వ్రాసారు.
  2004లో తెలుగుదేశం పార్టీ సమైక్యవాదమే మా వాదం అని చెప్పినా, సీమాంధ్ర ప్రజలు ఓట్లు వెయ్యలేదు. అప్పుడు అలా చేయకుండా ఉంటే ఇప్పుడు రోడ్లమీదకు రావాలిసిన అవసరం ఉండేది కాదు.
  ఇప్పుడు నాయకులందరినీ విమర్శించే పరిస్థితి ఉండేది కాదు.

  మరో పాయింటు.
  2001లో TRS పార్టీ పెట్టి, తెలంగాణా ఉద్యమం మళ్ళీ మొదలుపెట్టిన తరువాతైనా, తెలంగాణా ప్రజలపట్ల గతంలో జరిగిన పొరపాట్లు, తప్పులు సరిదిద్దే ప్రయత్నం ఏదీ జరగలేదు.
  అలాంటి ప్రయత్నం నిజాయితీగా జరిగి ఉంటే, బహుశా తెలంగాణా ఉద్యమం తగ్గుముఖం పట్టేది.

  మెచ్చుకోండి

  1. అవును. ఎన్నికల లో ఓడిపోయినా మళ్ళీ సమైక్యవాదాన్ని తలెత్తుకోవటానికి ఓ ప్రాంతీయ పార్టీ కి చాలా conviction, statesmanship కావాలి.
   2001 లో ప్రాంతీయ అస్థిత్వ భావజాలాన్ని చాలా తేలిక గా తీసుకొన్నారు.

   మెచ్చుకోండి

  2. అయ్యా శ్రీరామా,
   సీమాంధ్ర వాళ్ళ కు చాలా యంతర్ ప్రైన్యుర్ స్కిల్స్ ఉన్నాయని మీ అభిప్రాయం కాబోలు! సీమాంధ్ర ఆధిపత్య వర్గాల వ్యాపారవేత్తలు క్రొని కేపిటలిజం వలన బాగు పడ్డారని అందరికి తెలుసులెండి. ఈ రోజు ఎంత మంది తెలంగాణా నాయకులు స్కాం లు చేసి చంచల్ గూడా జైలో ఉన్నారు? రాజకీయాలను వ్యాపారం చేసిన ఘనత లో ఎక్కువ భాగం సీమాంధ్రవాళ్లదే. వ్యాపారం, కాంట్రక్ట్ లు చేయని సీమాంధ్ర రాజకీయ నాయకులు పట్టుమని పదిమంది ఉన్నారా? వాళ్లు రాజకీయాలలోకి వచ్చేది వ్యాపారం అభివృద్ది కోసం కదా!

   మెచ్చుకోండి

   1. Agreed fully on crony capitalists. Andhra has minimum entrepreneurs, max crony capitalists, compare with any neighboring states, you will know.
    But I think Telangana will catch up soon with Andhra in crony capitalism. Many real estate guys etc have become ministers and were at the forefront of T movement

    మెచ్చుకోండి

 8. గుడిసెల ఎంకటసామి చేసింది కబ్జా కాదు (ఈ మగానుబావుడు రాష్ట్రపతి పదవి ఆశించాడు. కొడుకు వివేకా ఇప్పుడు పెద్ద వ్యాపార వేత్త, MP), పీ జనార్ధన రెడ్డి చేసింది గొప్ప పని. వడ్డేపల్లి నర్సింగ రావు చేసినది పవిత్ర కార్యం. ఎవడన్నా ఆంధ్రా వాడు ఊళ్ళో పదెకరాలు అమ్ముకొని తెల్లాపూర్ లోనో, కొంప కొల్లేర్ పూర్ లోనో నాలుగు ఫ్లాట్ లు కొంటే అది లాండ్ గ్రాబ్.

  మెచ్చుకోండి

 9. @ వారికి అప్పుడు ఉచిత కరెంటూ, బియ్యమూ, కష్టం లేని ఉద్యోగాలూ కావలసి వచ్చాయి. ఇప్పుడు జనాలు సమైక్యం అంటున్నారు. చేతులు కాలాక!

  వాళ్ళెవరికీ ఇప్పుడు విభజన వల్ల బాధ లేదు. ఇంకా చిత్రం ఏంటి అంటే , వీళ్ళంతా ఇప్పుడు జగన్ మద్దతు దార్లు ( అప్పటి కాంగ్రెస్స్ వల్లే కదా ఇప్పటి జగన్ మద్దతు దార్లు ). వైకాపా నాకు తెలిసినంతవరకూ క్షేత్ర స్థాయిలో పోరాడటం లేదు. ఎందుకంటె సీమంధ్రలో విభజన వల్ల వాళ్లకొచ్చిన నష్టం ఏమి లేదు. చక్కగా కాంగ్రెస్సు, తెలుగుదేశం హడావిడి చేస్తుంటే విలాసంగా కూర్చొని వినోదం చూస్తున్నారు 🙂

  కాబట్టి అప్పుడు కాని, ఇప్పుడు కాని విభజన, సమైక్యం పై సీమాంధ్ర సామాన్యుడికి ఆసక్తి లేదు. వాళ్ళకి కావలసింది చంద్రబాబు కి ధీటైన ప్రాంతీయ పార్టీ . అది జగన్ లో కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాదు కి ధీటైన రాజధాని లేకున్నా , హైదరాబాదు లేకున్నా వీళ్ళకి నష్టం లేదు .

  ఇప్పుడు ఆందోళన చేస్తున్నది ఎవరు అయితే? హైదరాబాద్ లో ఉన్న సమైక్య జనానికి కావలసింది హైదరాబాదు తమ ఆధిపత్యం, నాయకత్వం లో ఉన్దదమ్. అందుకోసం సీమంధ్ర ప్రజల మద్దతు కావాలి. అంతకు మించి వారికి సీమాంధ్ర అభివృద్ధి, అక్కడి వారి సంక్షేమ పూచిక పుల్లతో సమానం. ఇది వారిని విమర్శించడం కాదు. అంట దూరం వెళ్లి అభివృద్ధి చెందినా వారికి ఆ మాత్రం తెలివి స్వార్ధం ఉండడం సహజం .

  అలాగే సీమాన్ద్రులకు హైదరాబాదులో ఉన్న సమైక్య వాదులపై పెద్ద సానుభూతి లేదు , ఉండదు .

  మెచ్చుకోండి

 10. @ఉద్యమాలు లేని సమయం లో అయినా సమైక్యత అవసరం గురించి ఎప్పుడైనా ప్రచారం చేశారా?

  అసలు సమైక్యత కోరుకుంటున్నది నిజంగా ఎంత శాతం ? తెలంగాణా ఉద్యోగుల సమ్మె కు, ఆంద్ర ఉద్యోగుల సమ్మెకు చాలా తేడా ఉన్ది. ఆంద్ర ఉద్యోగులకు సమ్మె చేసినా జీతం వస్తుందన్న గ్యారంటీ ఉంది. లేకపోతె వీరిలో డెబ్బైశాతం సమ్మె చేసేవారు కాదు . (ఇది వారి తప్పు కాదు ) మొత్తంగా సమ్మె వల్ల వారికి వచ్చే నష్టం ఏంలేదు, లాభం తప్ప. పనుల వత్తిడి లో అనుకోని బ్రేక్. లేదంటే నిర్ణయానికి ముందే ఒక్క సారైనా చేసి ఉండే వారు .

  అలాగే విద్యార్ధులు , వీరు నిజంగా బాధ్యతా యుతంగా ఉండి ఉంటె, అసలు విభజన వాళ్ళ నిజమైన నష్టాలు ఏంటి అన్నది ముందు జనం లోకి తీసికేల్లగలిగే వారు . తెలంగాణా విద్యార్దులు వారి ప్రజలకు విభజన కోసం ఎందుకు పోరాడుతున్నది వివరించగలిగారు .

  మెచ్చుకోండి

  1. “..తెలంగాణా విద్యార్దులు వారి ప్రజలకు విభజన కోసం ఎందుకు పోరాడుతున్నది వివరించగలిగారు .”
   నాకయితే అలా అనిపించలేదు. అనేక చిన్న చిన్న ప్రత్యక్ష అనుభవాల దృష్ట్యా..

   మెచ్చుకోండి

   1. విద్యార్దులే కాదు, మనలాంటి వాళ్ళు కూడా అక్కడి ఉద్యమం లో చాలా యాక్టివ్ గా ఉన్నారు . 2009 కి ముందు వారంతా చెప్పింది ఒకటే . రాజకీయ నాకులమీద నమ్మకం లెదు. వ్వారు లేనప్పుడు కూడా పోరాటం ఉన్ది. వారికి అవకాసం ఇస్తాం కాని గుడ్డిగా నమండం లేదు అని. కేసీఆర్ తప్పుకోగానే ముందుకు వచ్చి వాళ్ళు అన్నది నిజం అని నిరుపించుకొన్నారు.

    మెచ్చుకోండి

 11. @ఉద్యమానికి సమైక్య ఉద్యమమని పేరు పెట్టట వలన వారి అసలు డిమాండ్లను చెప్పలేని పరిస్థితి. ఏ ఉద్యమానికైనా కావలసినది లక్ష్యాలలో, డిమాండ్ల లో స్పష్టత. అది లేకుండా ఉపయోగం లేదు.

  ఈ ఒక్క మాట ఇప్పటి సీమంధ్ర మొత్తం ఉద్యమాన్ని ప్రతిబింబిస్తోంది. ఉద్యమం జరుగుతోంది ప్రజల కోసం కాదు . ఉద్యమం చేస్తున్నది ప్రజలు కాదు , విద్యార్దులు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల చందాలు లబ్ది పొందుతున్న బడుగు జీవులు.

  మెచ్చుకోండి

  1. ఉద్యమం జరుగుతోంది ప్రజల కోసం కాదు . – Agreed
   ఉద్యమం చేస్తున్నది ప్రజలు కాదు – Partially correct- అన్ని వర్గాలకు చెందిన ప్రజలూ స్వఛ్ఛందం గా పాల్గొంటున్నారు అని నాకు వ్యక్తిగతం గా(మీడియా ద్వారా కాదు ) తెలిసినది. కొంత మంది విద్యార్దులు, ఉద్యోగులు, రాజకీయ నాయకుల చందాలు లబ్ది పొందుతున్న బడుగు జీవులు ఉండవచ్చు.

   మెచ్చుకోండి

   1. @అన్ని వర్గాలకు చెందిన ప్రజలూ స్వఛ్ఛందం గా పాల్గొంటున్నారు అని నాకు వ్యక్తిగతం గా(మీడియా ద్వారా కాదు ) తెలిసినది.

    అవును ఇటువంటి సమాచారం ఎవరయినా ఇస్తారేమో అని చూస్తున్నాను. నాకు ఒక్క పార్టీలోను కనిపించలేదు 🙂

    స్వచ్చందంగా వచ్చినవారు ఎందుకు వచ్చారు ? వారి స్పష్టమైన డిమాండ్స్ ఏంటి అన్నది మీరు తెలుసుకొనే ఉంటారు . మరి ఆ మేరకు మీ వ్యాసాన్ని సరి చేస్తారా ?

    మెచ్చుకోండి

 12. @హైదరాబాదులోని సంస్థ ల లో ఆంధ్ర వారికి కూడా అవకాశాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి( అటువంటి సంస్థలు ఆంధ్ర లో ఏర్పడే వరకూ).

  Yes

  మెచ్చుకోండి

  1. కేంద్ర ప్రభుత్వ సంస్థలూ, PSU లు కాక, అనేక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలూ, CentralUniversity లాంటివి, చాలా ఉన్నాయి. ఇంతకు ముందు కనీసం non local గా అయినా కొన్ని సీట్లు వచ్చేవి.ఇక ముందు అవి కూద రావు.

   మెచ్చుకోండి

   1. కేంద్ర ప్రబుత్వ సంస్థలు గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రాకి కూడా ఏర్పడతాయి !!

    సెంట్రల్ యునివర్సిటీ లో మిగిలిన రాష్ట్రాలుతో బాటు మనకూ వాటా ఉంటుంది. ( మన హైదరాబాద్ ఆంధ్రులు, మాక్ష్జిమమ్ కవర్ చేస్తే మన కడుపు నిండి పోతుంది కదా ఎలాగు . )

    మెచ్చుకోండి

    1. కేంద్ర ప్రబుత్వ సంస్థలు గురించి పెద్దగా ఆందోళన అవసరం లేదు.
     –I wanted to say the same thing
     రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఆంధ్రాకి కూడా ఏర్పడతాయి !!
     Till then.
     సెంట్రల్ యునివర్సిటీ లో మిగిలిన రాష్ట్రాలుతో బాటు మనకూ వాటా ఉంటుంది.
     –Oh ..OK.
     ( మన హైదరాబాద్ ఆంధ్రులు, మాక్ష్జిమమ్ కవర్ చేస్తే మన కడుపు నిండి పోతుంది కదా ఎలాగు . )
     –అలా అయితే జై సమైక్యాంధ్ర అనే వాడిని.

     మెచ్చుకోండి

 13. @హైదరాబాదు లో ఆంధ్ర వారి రక్షణ కి ప్రత్యేక చట్టం కూడా అవసరమే. దేశం లోని ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి ఇక్కడ నివశిస్తున్న వారికి అక్కర లేని భద్రత సీమాంధ్రుల కి ఎందుకు? ఎందుకంటే, ప్రత్యేక ఉద్యమం సీమాంధ్రులకి వ్యతిరేకం గానే జరిగింది

  లాజికల్ గా బానే ఉన్నా , ప్రత్యేక ఉద్యమం సీమాంధ్రులకి వ్యతిరేకం గానే జరిగింది అనడం లో పేచీ ఉంది. సీమంధ్రులు అంటే ఎవరు? హైదరాబాదులో ఉన్న ఆంధ్రులా, వెలుపల ఉన్న ఆంధ్రులా ?హైదరాబాదులో ఉన్న యెంత మంది ఆంధ్రులకు వ్యతిరేకం గా జరిగింది? హైదరాబాదు వెలుపల ఉన్న ఎంతమంది ఆంధ్రులకు వ్యతిరేకం గా జరిగింది ? మీకు కూడా వ్యతిరేకంగా జరిగి ఉండొచ్చు ఉద్యమం ..కాని మీరు ఈ రెండు చోట్ల లేరు!!!భవిష్యత్తులో ఉంటారో లేదో తెలియదు. మరి మీకెందుకు వ్యతిరేకత ? ఎలాంటి రక్షణ కావాలి? ఎన్నాళ్ళు కావాలి ? అంటే భవిష్యత్తులో వీరు పర్మనెంట్ గా సీమంద్రులేనా , తెలంగాణా ప్రజలు ఎప్పటికీ కారా ? ఇండియా లో ఉండే పాకిస్తాన్ ప్రేమికుల కు కల్పించే రక్షణ లాంటిది కావాలేమో 🙂

  మెచ్చుకోండి

  1. “అంటే భవిష్యత్తులో వీరు పర్మనెంట్ గా సీమంద్రులేనా?”
   మీరు ఈప్రశ్న అడగవలసినది తె. వాదులను. ఒకప్పుడు తెలంగాన లో పుట్టిన వారంతా తెలంగాణ వారే అని KCR అంటే అతనిని తె.వాదులు KCR ని తిట్టారు. కొంతమంది, 1956 తరువాత వచ్చిన వారెవరూ తెలంగాణ వారు కారని చెప్పారు. అమెరికా లో ఉన్న భారతీయులు తమ కట్టుబాటు ఫాలో అయితే, మన సంస్కృతి మరిచిపోలేదని మురిసి పోతాం. హై. లో ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే బోనాలు ఎత్తాలి, బతుకమ్మ్ ఆడాలి. లేకపోతే వాళ్ళు తె. వారు కాదా?
   నేను ఈ రక్షణ అడగటానికి కారణాలను కూడా టపా లోనే ఇచ్చాను.
   మీ వాదన ప్రకారం హై-ఆంధ్ర వారంతా టెక్నికల్ గా తెలంగాణ వారు కాబట్టీ రక్షణ అడగకూడదు. కానీ ప్రాక్టికల్ గా నిజ జీవితం లో వసూళ్ళ దందా ఎదుర్కొన్న వారు ఏమి చేయాలి? అహా నాది తె. జాతి. నాకు ఏ రక్షణా అవసరం లేదని “పొమ్మన్న పోవేమి ఆంధ్ర దొరా” పాడుకోవాలా?

   మెచ్చుకోండి

   1. తెవాడులకి సంబంధం లేని ప్రశ్న ఇది ఒకవిధంగా. సమాధానం కూడా మీరే వ్యాసం లో చెప్పారు . అదే స్థానిక ప్రజల తో ఉన్న సఖ్యత. అది ఇప్పటికే ఉంది ఉంటుంది కలిసి పోయే వాళ్లకి . కలవని వాళ్ళు ఇబ్బంది పడతారు నిజమే కాని ఏ రక్షణ అయినా ఎంతవరకు ? అయినా చంద్రబాబు, చిరంజీవి అక్కడే ఉంటారు కదా వీళ్ళ మధ్య విద్వేషాలు పెంచుతూ పోవడానికి .

    ఆంధ్రులకి సంబంధం లేని సమస్య ఇది. మన దగ్గరికి వచ్చిన తెలంగాణా వాళ్ళు ఎలా ఉండాలని మనం అనుకుంటాము ?

    మెచ్చుకోండి

     1. అయ్యో మీకు తెలీదా , వాళ్ళు ఇప్పటికే డిక్లేర్ చేసారు అక్కడే ఉంటాం అని. రెండుకళ్ళ సిద్దాంతం, ప్రాంతీయ
      సామాజిక న్యాయాలు అలా సాగిపోతాయి. జనంలో జై తెలంగాణా అన్నా మనవాళ్ళ రక్షణకి పోరాడేది కూడా వాళ్ళే మరి .

      మెచ్చుకోండి

 14. @భద్రచలాన్ని ఆంధ్ర కి ఇచ్చి వేయాలి.

  హైదరాబాదుకు ఉన్నంత డిమాండ్ , భద్రాచలానికి ఉంది. ఇది తెలంగాణా లోకి వెళ్తే తెలంగాణా మంత్రాలు తో సీతారాముల కల్యాణం చేస్తారేమో . పట్టు చీర , ముత్యాల తలంబ్రాలు కు మారు తెలంగాణా ప్రభుత్వం ఇంకేమి ఇస్తుందో అన్న భయమా. ఇప్పుడు సాయిబాబా గుడి లో శివుడు, వినాయకుడు , ఆంజనేయస్వామి విగ్రహాలు పెట్టినట్లు అక్కడ బతుకమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ ల విగ్రహాలు పెట్టేస్తారేమో అన్న భయమా ? లేక అక్కడ ఆదాయం వస్తుందనా ?

  రాముడు సోనియా కలలోకి వచ్చి ఆంధ్రలో కలిపెయ్యమని చెబితే బాగుణ్ణు

  భద్రాచలం ప్రజ లు ఏమి కోరుకొంటున్నారు అన్నది అస్సలు ప్రాధాన్యం లేని భాగం అవడం విచిత్రం . ఈ డిమాండ్ అక్కడి వాళ్ళనుండి కూడా కలిపి వస్తే బాగుండేది .

  దానికి బదులు ఆంధ్రలో ఈ ప్రాంతం బాగు పడాలి, ఈ నగరాన్ని అభివృద్ధి చెయ్యాలి అని డిమాండ్లు పెడితే బావుతుందేమో.

  మెచ్చుకోండి

  1. again. ఇది కూడా తె. వాదుల డిమాండ్. 56 లో ఉన్న ది మాత్రమే కావాలని. నా ఉద్దేశం ప్రకారం అది కాకినాడ కంటఏ ఖమ్మం కి దగ్గర కాబట్టీ ఖమ్మం లో ఉండటమే మంచిది. అక్కది ప్రజలు కూడా అదే కోరుకొంటున్నారేమో! .

   మెచ్చుకోండి

   1. వాళ్ళ పెద్ద డిమాండ్ లో భద్రాచలాన్ని కలిపో విడగొట్టి నో చూడాలనుకోవడం మన సరదా .

    అక్కడ ప్రజలకి మూలాలు గోదావరి జిల్లాల వారితో ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాను, అందుకే కాస్త తెలంగాణా కి వేరుగా కనిపిస్తారు భాష ,గోస లలో.

    అయినా ఆ కాస్త ముక్క పరిపాలనా నిర్వహణకి ఇక్కడినుండి పెట్టె ఖర్చుకి రాముడిచ్చే డబ్బులు సరిపోతాయా ? లేకపోతె అక్కడి గోదావరిలో నీళ్ళు ఇంకో భాగీరధుడు వచ్చి మనకి తెచ్చిస్తాడా , అవకాసం ఉంటె మనదే మనదే ..

    లేదంటే వాళ్ళని ఖమ్మం తోనే ఉండనిస్తే వాళ్ళూ ప్రశాంతంగా ఉంటారు . తెవాదులు అవునన్నా, కాదన్నా పెద్ద పట్టించుకోరనుకుంటాను. ఇంకా ఆంధ్రలో ఈ డిమాండ్ కనీసం గోదావరి జిల్లా నుండి రావాలి కాని గుంటూరు, విజయవాడ కాదు అని నా ఉద్దేశ్యం.

    మెచ్చుకోండి

    1. మా గోజీ వాళ్ళకీ మాకూ తగువులు పెడదామనే! అయితే హైదరాబాదు గురించిన డిమాండు హైదరాబాద్ జిల్లా వాళ్ళు మాత్రమే చెయ్యాలి! 🙂

     మెచ్చుకోండి

     1. భద్రాచలం కి గోజి వాళ్ళకి ఉన్న సంబంధాలు మనకి లేవు, ఏదో గుడి తప్ప . ఏదో వాళ్ళు వాళ్ళు కలిసి ఉండాలనుకొంటే తప్ప మనకో యానాం ఉందని చెప్పుకోడానికి కాక ఎందుకా అని . హైదరాబాదు తో పోలికా

      మెచ్చుకోండి

 15. @ప్రస్తుతానికి కేంద్రం పై నమ్మకం పోవలసిన వసరం కనిపించటం లేదు. రాజకీయ లబ్ధి కోసం ప్రస్తుతానికి త్వర త్వర గా నిర్ణయం తీసికొన్నా, ఆంధ్ర లో ఉన్న MP సీట్ల ను దృష్టి లోపెట్టుకొని, కేంద్రంసాధ్యమైనంత వరకూ ఆంధ్రకూ కూడా న్యాయం చేయటానికి వీలుంది.

  ఇది నిజం . 2014 లో ప్రతి ఒక్కరు ఆంధ్రాకి మంచి మంచి మానిఫెస్టోలు తయారు చేస్తారు . కాకపొతే ఆ తలనొప్పి, ఆంధ్రను డెవలప్ చెయ్యడమనే చిరాకు ఎవరు పడతారు అని మిగిలిన పార్టీల అంతర్మధనం. అందుకే ఈ ఉద్యమాలు . కేంద్రం నిధులు వచ్చినా గెలుస్తామన్న నమ్మకమో లేకపోయే . కాంగ్రెస్ కి ఆ బాధ లేదు . నమ్మితే కాంగ్రెస్ ఎంతోకొంత బాగు చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రం బాగుకావాలా, పార్టీ పిచ్చి కావాలా అని ఆంధ్రులు నిర్ణయించుకోవాల్సిన సమయం .

  ఇప్పటి వరకు కాంగ్రెస్ విభజనకి అనుకూలం అయినా గెలిపించింది వాళ్ళు ఇవ్వరనే నమ్మకం తోనే అని చాల మంది వాదిస్తున్నారు. అంటే తమకు కావలసింది అబద్దాలకోర్లు అని సిగ్గు విడిచి చెప్పినట్లా?

  అయినా అబద్దాలు చెప్పిన వైఎస్సార్ , ఆయన వారసుడు కాంగ్రెస్ లో లేరు . మిగిలిన కాంగ్రెస్ కి కాస్తయినా నిజాలే చెప్పాల్సిన పరిస్థితి . ఈ నిర్ణయం వాళ్ళ కాంగ్రెస్స్ యెంత లాభ పడుతున్నది అన్నది నాకనవసరం . ఆంద్ర బాగుపడితే చాలు .

  మెచ్చుకోండి

  1. భద్రాచలం కి గోజి వాళ్ళకి ఉన్న సంబంధాలు మనకి లేవు, ఏదో గుడి తప్ప . ఏదో వాళ్ళు వాళ్ళు కలిసి ఉండాలనుకొంటే తప్ప మనకో యానాం ఉందని చెప్పుకోడానికి కాక ఎందుకా అని . హైదరాబాదు తో పోలికా 🙂

   మెచ్చుకోండి

 16. 1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబాటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?

  2. తెలంగాణా వాదులకి తెలుసో లేదో గాని విభజన నిర్ణయం జరిగాక సమైక్యాంధ్ర ఆందోళనల వెనక రాష్త్ర స్థాయి కాంగ్రెసు పెద్దలే ఉన్నారనేది యెమి చెబుతున్నది? ఇస్తారేమో అన్నప్పుదు హడావుడి చెసి ఇవ్వరని ధీమాగా ఉన్నప్పుదు ఆగిపోవటంలా నత్త నదక నడిచే ఉద్యమానికి చురుకు తెప్పించటం కొసమే వాళ్ళు ఈ ప్రకటన చేసారు. దాన్ని వేడెక్కించి ఆ బూచిని చూపించి విభజనని యెన్నికల తర్వాతకి వాయిదా వెయ్యటం కోసం అక్కడి పెద్దన్నలూ ఇక్కడి చిన్నన్నలూ కలిసి ఆడుతున్న దొంగాట ఇది.

  3. అవును అది మాకూ తెలుసనే తెలంగాణా వాదులకి నేనొక సూటి ప్రశ్న వేస్తాను. ఇట్లాంటి కాంగ్రెసుతో కచరా గారు యెందుకంత మమేకమయ్యారో, రాష్ట్రం రావటమంటూ జరిగితే అది కాంగ్రెసు వల్లనే అని నొక్కి చెప్పారో నిన్న గాక మొన్న రాష్ట్రం ఇస్తే కాంగ్రెసులో కలిసి పోవడానికి గూడా సిద్దపడ్దారో మీరు తేల్చుకోవల్సి వొస్తుంది.

  4. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యేమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?

  5. తెలంగాణా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఇవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూడు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?

  మెచ్చుకోండి

 17. 6. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుతుంది? విడిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్తంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్త్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్త్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.

  7. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వడం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు – అఖరికి ఇవ్వల్సిన శాసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లాగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.

  8. తెలంగాణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరాబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెండు రాష్ట్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.

  9. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు – జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.

  10. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపడే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విడిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విడిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)

  మెచ్చుకోండి

 18. ఇక ఆఖరుగా రెండు మాటలు చెప్పి నా వాదనని ముగిస్తాను.ఒకనాడు దేశం కొత్తగా స్వతంత్రం తెచ్చుకున్న రోజున భాషాప్రయుక్త రాష్త్రాల పేరుతో మనం ఒక ఒరవడి దిద్దాం. అదే దారిలో మిగతా వాళ్ళూ నడిచారు. ఇవ్వాళ మళ్ళీ అధికార వికేంద్రీకరణ సాధిస్తే మళ్ళీ మనం అందరికీ కొత్తదారి చూపించిన వాళ్ళ మవుతాం.నాకు చాలా బాధగా అనిపించే విషయం ఒకటి ఉంది. తెలంగాణా వాదులు మా భాష వేరు అంటున్నారు. అది చాలా తప్పు.మనం ఆ రొజున వేరే వాళ్ళకి వొదిలేసిన రాష్త్రాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరం తెలుగు వాళ్ళమే. నేను క్రిష్ణా జిల్లా వాడినే అయినా రాగద్వేషాలు లేని నిందు మనస్సుతో ఒక మాట చెబుతున్నా. క్రిష్ణా జిల్లా నించి అధికార కేంద్రాన్ని అంటకాగి బాగా బలిసిన వాళ్ళు ఇతర జిల్లాల వాళ్ళని చాలా హీనంగా చూసారు, చూస్తున్నారు,ఇకముందు కూదా వాళ్ళు సంస్కారం గలిగి ప్రవర్తిస్తారని నేననుకోవదం లేదు. వాళ్ళీ రోజున మా భాష నీటైనది అనుకోవడం సంస్కృతం తో అవసరమైన దానికన్న యెక్కువగా సంకరం అవ్వడం వల్ల వొచ్చిందే. తెలంగాణా లో మాట్లాడేదీ, రాయల సీమలో మాట్లాడేదీ, అంధ్రా జిల్లాల్లో మట్లాడేదీ అంతా తెలుగే. అన్నీ మాండలికాలు మాత్రమే.అవి వాడుక ఈజీ గా ఉండడం కోసం యేర్పడిన యాసలు మాత్రమే. ఉపనిషత్తులలో శ్రేయము ప్రేయము అని ఒక భావన ఉంది. దాని అర్ధమేమిటంటే శ్రేయం కలిగించేది ఇష్టమైనది కూదా అయితే వెంటనే తీసేసుకో – నిన్నెవరూ అపలేరు కూడ. ప్రియమైనది శ్రేయము కాదని తెలిసినప్పుదు తొందర పడగూడదు. అలా తీసుకుంటే తర్వాత నష్టం నీకే. అలాగే ఒకటి మనకు శ్రేయస్సు నిచ్చేది అయితే అప్పటికి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇష్టం కలిగించుకోవలసిందే, యెందుకంటే అది నీకు మంచి చేస్తుంది గనక.ఈ ఉపనిషత్తుల సుత్తిని నా స్వంత అవసరానికి వేస్తున్నానండీ యేమనుకోకండేం:-) పైన నేను చెప్పినవన్నీ నా వైపు నుంచి అన్ని జాగ్రత్తలూ తీసుకుని నా మాటల వల్ల అసలే వేడిగా ఉన్న వాతావరణం ఇంకా వేడెక్కని విధంగానే చెప్పినా తమకిష్టం లేని సంగతి కనబడగానే నన్ను మాత్రం ద్వేషించకుండా ఉంటారని:-)

  నా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే “జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ” మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.

  విభజనా? వికేంద్రీకరణా? యేది ఉత్తమం?

  మెచ్చుకోండి

 19. రాష్ట్రాన్ని విడదియ్యకుందా ఇప్పటి సమస్యని అధిగమించతానికి అధికార వికేంద్రీకరన ఒక్కటే మార్గం.కేవలం అధికారాల బదలాయింపుకి ఖర్చేమీ అవదు.ప్రజలకి అధికారం మరింత దగ్గరగా ఉండే ఒక మంచి వ్యవస్థ మొత్తం 23 జిల్లాలకీ మేలు చేస్తుంది. సమైక్య వాదుల అందోళన అంతా హైదరాబాదు గురించి అనే అవహేళనలు వొస్తున్నాయి. దాన్ని జిల్లాలకి మరిన్ని అధికారాలిచ్చే వికేంద్రీకరణ కోసం మళ్ళిస్తే బాగుంటుంది.తెలంగణా వారికి కొద ఇప్పుడు ల్కోరుతున్న ఒక అధికార కేంద్రం కన్న 10 వొస్తాయి.సర్వ సమగ్రమైన స్వయం పరిపాలన.

  మెచ్చుకోండి

 20. ఈ టపాను ఆలస్యంగా చూస్తున్నాను.
  రాజకీయ వాసనలు లేని మా వంటి తెలంగాణ విద్యావంతుల మనోభావాలను కొంత వరకు సమైక్య వాది ఆత్మ పరిశీలనగా ప్రతిబింబించిన మీ నిజాయితీకి నా అభినందనలు. కనీసం 2009లో తెలంగాణ ఏర్పాటుపై వచ్చిన మొదటి ప్రకటనకు, 2013లో తెలంగాణ ఏర్పాటుపై వచ్చిన రెండవ ప్రకటనకు మధ్య నాలుగేళ్ళలో ఇలాంటి ఆత్మ విమర్శలు విస్తృతంగా జరిగి, పద్ధతులు కొంత మార్చుకొని (…may be on both sides), పరిష్కారాలు కనుగొని ఉంటే – ఈ రెండవ ప్రకటన అవసరం ఉండేది కాదేమో!
  కాని, సీమాంధ్ర ప్రజలు, మేధావులు ఏమీ పట్టనట్టు ఊరుకొన్నారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు విద్వేషంతో అవహేళనలు చేస్తూ తెలంగాణ వాదులను మరింత రెచ్చగొట్టారు.
  ఇప్పుడు చేతులు కాలాయి. ఆకులు పట్టుకొని ప్రయోజనం లేకుండా పోయింది.

  మెచ్చుకోండి

  1. మీ అభిప్రాయం తో స్థూలం గా ఏకీభవిస్తాను. ఆంధ్ర నాయకులు పొరపాటునో తెలిసో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయానికి కారకులయ్యారు. విద్వేషం మాత్రం తె.రా.స పార్టీ నుంచీ మొదలయింది. కొంత కాలం ఓపిక పట్టిన ఆంధ్ర నాయకులు,తరువాత అదే విధం గా ప్రతిస్పందించారు. విద్వేషానికి ప్రేమ తో స్పందించాలంటే చాలా ఎక్కువ స్థాయి (మహాత్ముడి లా) ఉండాలి. ఆ స్థాయి ఈ కాలపు నాయకుల నుంచీ ఆశించలేం.
   తె.రా.స ఆవిర్భావం తరువాత పరిష్కారాల ప్రయోజనం లేదని నాకనిపిస్తుంది. సమైక్య పరిష్కారం కుదిరితే ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం.తన ఉనికి కి ఎసరు పెట్టే అయిడియాలను ఆ పార్టీ సహించేదా? వాటిని కుట్రలూ కుతంత్రాలు గా చిత్రీకరించేది.ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తెలంగాణ తప్పేది కాదు.
   సమైక్య పరిష్కారాలు తె రా స ఆవిర్భావానికి ముందే జరిగి ఉంటే బాగుండేది.

   మెచ్చుకోండి

   1. @ విద్వేషం మాత్రం తె.రా.స పార్టీ నుంచీ మొదలయింది.

    నిజం కాదు . టి ఆర్ ఎస్ కు ముందు కూడా వున్నాయి, పార్టీ వచ్చాక మీకు గమనిమ్పులోకి వచ్చి ఉండొచ్చు

    మెచ్చుకోండి

 21. రాష్ట్రాన్ని విడదియ్యకుందా ఇప్పటి సమస్యని అధిగమించతానికి అధికార వికేంద్రీకరన ఒక్కటే మార్గం.కేవలం అధికారాల బదలాయింపుకి ఖర్చేమీ అవదు.ప్రజలకి అధికారం మరింత దగ్గరగా ఉండే ఒక మంచి వ్యవస్థ మొత్తం 23 జిల్లాలకీ మేలు చేస్తుంది. సమైక్య వాదుల అందోళన అంతా హైదరాబాదు గురించి అనే అవహేళనలు వొస్తున్నాయి. దాన్ని జిల్లాలకి మరిన్ని అధికారాలిచ్చే వికేంద్రీకరణ కోసం మళ్ళిస్తే బాగుంటుంది.తెలంగాణా వారికి కూడ ఇప్పుడు కోరుతున్న ఒక అధికార కేంద్రం కన్న 10 అన్ని అధికారాలతో కూడిన సర్వ సమగ్రమైన జిల్లాలు వస్తాయి. వారు కోరుతున్నది కూడా స్వయం పరిపాలననే కదా.
  ఇప్పటికీ సమయం మించి పోలేదు.ఇది ఇప్పుడున్న స్థితి నించి వెనక్కి తిరగటమూ కాదు. ఇప్పటి పరిష్కారం కన్న అందరికీ అదే మంచిది.

  మెచ్చుకోండి

 22. While its welcome to see significant realization of past mistakes ..
  Still allow me to raise following questions
  1. Under what constitutional provision are you raising Seemandhra should get any share of Hyderabad?
  2. What makes you think Rayalaseema wants to be united with Andhra ?
  one root cause that made Andhra state from Kurnool sought merger with Hyderabad Telangana. It was not Telanagana seeking merger with Andhra.
  3. How does it benifit any Indian citizen having obtained domicile status in Telangana to be identified as an outside person under any act..
  That is actually giving legal status the avoidable word “settler”
  You can not have Cake and Eat it Too a mindset that is still to change after living it with for 57 years…

  మెచ్చుకోండి

  1. 1. Under what constitutional provision are you raising Seemandhra should get any share of Hyderabad?
   –I’m not a constitutional expert. As a commoner, I have already stated my reasons in the post. Don’t know if you are an expert on this. If you are can you mention the constitutional provision that forbids the share of Hyderabad? The CWC decision on formation of Telangana resulted due to the political advantages perceived by Congress party.
   Similarly, if there’s no constitutional provision that forbids the share of Hyderabad, if congress has some political advantage to be gained the share will be given
   2. What makes you think Rayalaseema wants to be united with Andhra ?
   –What makes you think I think that way?
   “one root cause that made Andhra state from Kurnool sought merger with Hyderabad Telangana. It was not Telanagana seeking merger with Andhra.”
   –If T leaders and people had not wanted, how did it happen? Do you think statesman like Boorgula, cabinet, Hyd-legislture did that just because Andhra wanted to merge?
   3. How does it benifit any Indian citizen having obtained domicile status in Telangana to be identified as an outside person under any act..
   That is actually giving legal status the avoidable word “settler”
   –Not talked about domicile status. There was an debate about who were Telanganites some two years back. KCR told all born here were Telanganites. Then some T vadis criticized KCR. Some told those who were here before 56 only were Telanganites. So some clarity is required on who are locals. L:ocals have advantages,for eg, In Karnataka non locals can’t buy sites sold by government.
   –You can not have Cake and Eat it Too a mindset that is still to change after living it with for 57 years…
   Irrelevant sermons. Applicable to Usurpers of others Hard-work more.

   మెచ్చుకోండి

   1. 1. Onus is on the one seeking share to find out present not to me but to the Union Home Ministry only constitutional body to deal with subject.

    2. If you have not thought about it yet then u r losing time 4 future much more critical subject to the 5 crore people ..
    State merger was decided by then union govt under Nehru as PM and as the tallest leaders of freedom fight people just followed it.

    3. Can understand the frustration of emotional attachment. Exceptions do not become rules my question is on principles and rules that prevail and impact lives for generations to come.

    మెచ్చుకోండి

 23. అన్ని బాగానే ఉన్నాయ్ కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి బ్రదర్స్..
  18 పాయింట్ కి జవాబు : 90 శతం ఉన్న సినిమా వాళ్ళు సమైక్యంగా ఉండడానికి సినిమా తీయక పోగా ఈ పదేళ్ళలో చాల సినిమాల్లో తమ తెలంగాణా వ్యతిరేకతను చూపించారు. ఇది తెలంగాణా వాళ్ళకు మరికొంత ఆగ్రహం తెప్పిచింది.. కాదంటారా..
  20 వ పాయింట్ : హైదరాబాద్ తెలుగు నగరం కాదనడం తప్పు.. నిజాం రాజుగా ఉన్నాడు కాబట్టి ఉర్దూ బాష అభివృద్దిలో ఉండొచ్చు కానీ తెలుగు అసలే లేదనడం మూర్ఖత్వం. అప్పటికే హైదరాబాద్ లో చాల తెలుగు పత్రికలు ఉన్నాయని మరువొద్దు
  ఇంకొక విషయం రాష్రం మొత్తం నిధులు హైదరాబాద్ లో ఖర్చు చేసరందం పాచి అబద్దం. నిజంగా ఖర్చు చేసుంటే హైదరాబాద్ ఇలా ఉండేది కాదు. హైదరాబాద్ లో షేర్డ్ రైట్స్ కావాలని అడిగే అర్హత సీమంద్రులకి లేనే లేదు. కారణాలు ఇవి.
  1. 60 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ఏలిన అందరు సీమంద్ర ముక్యమంత్రులు హైదరాబాద్ చుట్టూ కొన్ని లఖల కోట్ల భూములు కొల్లగొట్టి సీమంద్ర ప్రాంత అభివృద్ధి కి కేటాయించారు. వాటి విలువ కట్టి తెలంగాణా ప్రజలకు ఇవ్వవలసిన అవసరం ఉంది.
  2. సీమంద్ర ముక్యమంత్రుల లెక్కల ప్రకారమే తెలంగాణాకు ఉద్యోగాల్లో జరిగిన నష్టం సుమారు లక్ష ఉద్యోగాలు. అంటే తెలంగాణా లో లక్ష కుటుంబాలు ప్రభుత్వోద్యోగాలకు దూరమై అభివృద్దిని కోల్పోయారు. రెండు తరాల్లో ఈ లక్ష కుటుంబాలు ఎంత నష్ట పోయాయో లెక్కకట్టగలర.. వాటిని తెలంగాణా ప్రజలకి ఇవ్వగలర…
  3. తెలంగాణా లో ఒక్క హైదరాబాద్ మినహా మిగితా పట్టణాలు ఎందుకు డెవలప్ కాలేదు. సీమంద్ర లో 8 పెద్ద నగరాలూ అభివృద్ధి చేయబడినాయి. విశాఖపట్నం బారత దేశంలో నే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. రాజమండ్రి, కాకినాడ , విజయవాడ , నెల్లూరు , తిరుపతి, కడప, కర్నూల్ నగరాలు రాష్ట్రము మొత్తం నిధులతో అభివృద్ధి చెందలేద… ఇవన్ని వదిలి ఒక్క హైదరాబాద్ పైనే అందరికి హక్కులు ఎందుకు ఉండాలి.
  4. తెలంగాణా లో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కొత్తగా ఎయిర్ పోర్ట్ నిర్మింపబడింది. ( శంషాబాద్ ఎయిర్ పోర్ట్). కానీ సీమద్ర లో విశాఖపట్నం , రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప నగరాల్లో ఎయిర్ పోర్ట్లు కొత్తగా నిర్మిచారు. ఇవ్వన్ని రాస్తాం మొత్తం నిధులతో కదా.. మరి అలాంటప్పుడు తెలంగాణా లో
  కోతగా ఒక్క ఎయిర్ పోర్ట్ నిర్మించలేదు.. ఎందుకని

  మెచ్చుకోండి

  1. –ఈ పదేళ్ళలో చాల సినిమాల్లో తమ తెలంగాణా వ్యతిరేకతను చూపించారు. ఇది తెలంగాణా వాళ్ళకు మరికొంత ఆగ్రహం తెప్పిచింది.. కాదంటారా..

   తెలంగాణ వ్యతిరేకతా, తెలంగాణ వాదం బ్యతిరేకతా? ప్రస్తుతానికి తెలంగాణ భాష పెట్టాలంటేనే సినిమా వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొంటున్నారు. అది వారి creative freedom ను నొక్కివేసింది. అన్య్వయ్స్ తెలంగాణ ఫిల్మ్ ఛామ్నర్ అంటున్నారు. తెలంగాణ వారు తీసిన సినిమా లో తె. భాష పెడితే అప్పుడు ఏమీ అభ్యంతరాలూండవు.

   20 వ పాయింట్ : హైదరాబాద్ తెలుగు నగరం కాదనడం తప్పు.. నిజాం రాజుగా ఉన్నాడు కాబట్టి ఉర్దూ బాష అభివృద్దిలో ఉండొచ్చు కానీ తెలుగు అసలే లేదనడం మూర్ఖత్వం. అప్పటికే హైదరాబాద్ లో చాల తెలుగు పత్రికలు ఉన్నాయని మరువొద్దు
   –అసలే లేదన లేదు. ఇప్పటిలా బజారు లో మాట్లాడ లేదు అంటున్నాను.

   ఇంకొక విషయం రాష్రం మొత్తం నిధులు హైదరాబాద్ లో ఖర్చు చేసరందం పాచి అబద్దం.
   –మొత్తం ఓ సిటీ పై ఎలా ణర్చు చేస్తారు? కాపిటల్ కాబట్టీ, మిగిలిన ఏ సిటీ కన్నా ఇక్కడ ఎక్కువ ఖర్చ్ చేశారు.

   –60 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ఏలిన అందరు సీమంద్ర ముక్యమంత్రులు హైదరాబాద్ చుట్టూ కొన్ని లఖల కోట్ల భూములు కొల్లగొట్టి సీమంద్ర ప్రాంత అభివృద్ధి కి కేటాయించారు. వాటి విలువ కట్టి తెలంగాణా ప్రజలకు ఇవ్వవలసిన అవసరం ఉంది.

   ప్రూవ్ చేయండి. తరువాత లెక్కలు తేల్చండి అలానే ఇస్తాం. ]ఆరోపణలదేముంది. నా వాదన కి సపోర్ట్ ఏదైనా ఎన్నైనా ఆరోపణలు చేయవచ్చు.
   కొల్లగొట్టటం అంటే ఏమిటి. ఇల్లీగల్ గా కబ్జా చేస్తే, తిరిగి ఇచ్చేయవలసినదే. లీగల్ గా కొనుక్కొని,ఇన్వెస్ట్ చేస్తే, తరువాత్ పెరిగితే దానిని కొల్లగొట్టటం అన లేం. ఏమైనా అంటే ఆంధ్ర పెట్టుబడిదారులు దొంగలు అంటరు, మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తరువాత “పెట్టుబడులను ఆహ్వానిస్తాం. పెట్టుబడులకు వ్యతిరేకం కాదు అంటారు. అంటే వాళ్ళ డబ్బు ముద్దు. ఆ డబ్బు తెచ్చే ఉద్యోగాలు కావాలి. కానీ వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెరిగింది కాబట్టీ అది కొల్లగొట్టటమా? అసలు వాడు ఇన్వెస్ట్ చేయకపోతే ఆ భూమికి ఆ విలువ రాదు. అప్పుడు కొల్లగొట్టారు అనే అవకాశమే ఉండదు. అలానే తెలంగాణ రియల్టర్ల సంగతి ఏమిటి? మై హోం జ్యూయల్, మంజీరా గ్రూపూ వగైరా?. ఓహో వారు తెలంగాణ వారు కాబట్టీ అది కొల్లగొట్టటం కాదా?
   లీగల్ గా మిస్-యూజ్ చేశారనే అనుకొందాం.ఏదైనా నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది (ముఖ్యమంత్రి ఒక్కడి ఆమోదం కాదు). అంటె కొల్లగొట్టుడు నిర్ణయం లో క్యాబినెట్ లో ఉన్న తెలంగాణ మంత్రులకి కూడా పాత్ర ఉంటుంది.
   చెన్నా రెడ్డి, అంజయ్య, వెంగళ్ రావ్ వంటి తెలంగాణ ముఖ్యమంత్రుల హయాం లో ఆంధ్ర కు జరిగిన అన్యాయల గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అవన్నీ కూడా తిరిగి ఇయ్యాలె.
   — తెలంగాణాకు ఉద్యోగాల్లో జరిగిన నష్టం సుమారు లక్ష ఉద్యోగాలు.
   శ్రీకృష్ణ కమిటీ లేదని తేల్చింది. ఇంకో కమీషన్ వేసి లక్ష ఉద్యోగాలు అబధ్ధమని తేల్చినా, మీకు ఒప్పుకొనే నిజాయితీ ఉందా? మళ్ళీ కమీషన్ ని తిడతారా? ఒక వేళ లక్ష ఉద్యోగాలు నిజంగానే పోతే, సీమాంధ్ర నుంచీ ఆ ఉద్యోగాలు కట్ చేయండి. తెలంగాన వస్తే పోయిన ఉద్యోగాలు వస్తాయా?
   — సీమంద్ర లో 8 పెద్ద నగరాలూ అభివృద్ధి చేయబడినాయి.
   ఒక్క వైజాగ్ మాత్రమే. మిగిలినవన్నే AP కి ముందు నుంచే పెద్దవి. అవి అభివృధ్ధిచెందినది తక్కువ. హై. నుంచీ డబ్బులు పెట్టారనటానికి ఏ ఆధారాలూ లేవు.
   –తెలంగాణా లో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కొత్తగా ఎయిర్ పోర్ట్ నిర్మింపబడింది. ( శంషాబాద్ ఎయిర్ పోర్ట్). కానీ సీమద్ర లో విశాఖపట్నం , రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప నగరాల్లో ఎయిర్ పోర్ట్లు కొత్తగా నిర్మిచారు. ఇవ్వన్ని రాస్తాం మొత్తం నిధులతో కదా..
   –హైదరాబాదు లో “international” airport నిర్మించారు కదా? (అదేమంటే GMR వాడు దోచుకొన్నాడు?!) మరి ఇంకెక్కడా లేదే? సీమాంధ్ర లో మీరు చెప్పిన అయిర్పోర్ట్ ల లో రెండు మాత్రమే కొత్తవి. మిగిలినవి ముందునుంచే ఉన్నాయి. అయిర్ పోర్ట్ లు కేంద్ర ప్రభుత్వం డబ్బుతో, ప్రయివేటు దభ్భుతో నిర్మిస్తారు. స్టేట్ దబ్బు కాదు.
   మరి మీకు- ఇవన్నీ ఉన్నాయి కదా :
   –NIT
   -IIT
   -ISB
   -NIFT
   -DRDO labs
   ECIL
   NFC
   ఇంకా సవాలక్ష సంస్థలు. మరి మాకేవి?
   మా బందరు పోర్ట్ లాంటివి ఒకప్పుడు దేశం లోనే మూడో స్థానం లో ఉండేవి. ఆ డబ్బంతా మీ హై. కు తగలేశారంటే మెకెలా ఉంటుంది. ఇలా చెప్పుకొంటూ పోతే చాంతాడంత.
   పైన చెప్పిన కారణాలన్నిటి వల్నా సీమాంధ్ర కు కూడా హక్కు ఉంటుంది.

   మెచ్చుకోండి

   1. @–NIT
    -IIT
    -ISB
    -NIFT
    -DRDO labs
    ECIL
    NFC
    ఇంకా సవాలక్ష సంస్థలు.
    ————————————————-

    రాష్ట్ర విభజన వల్ల వీటిలో నష్టపోయేది ఉందని ఎవరైనా అంటే అది కేవలం అపోహ. నిజంగా అలాంటి అనుమానం వుంటే సూటిగా అడగాలి, భాగాల పంపిణీ తేల్చుకోవాలి కాని సమైక్యాంధ్ర ముసుగు పనిచెయ్యదు.

    మెచ్చుకోండి

     1. సరే ఎయిర్పోర్ట్ గురించి మీ అభ్యంతరాలు ఏమిటి , కలిసి ఉన్నందువల్ల అది ఆంధ్రా ఆస్తి అవుతుందా ?అది పక్క రాష్ట్రం లో ఉంటె ఇప్పటికన్నా విడిపోయాక కోల్పోయేది ఏమిటి అన్నది తెలుసుకోవాలని ఉంది . దాని వలన వస్తున్నా రెవిన్యు మూలంగా ఇప్పటి దాకా మన ప్రాంతం యెంత అభివృద్ధి పధం లోకి వెళ్ళింది ?

      మెచ్చుకోండి

      1. అన్ని ప్రశ్నలకీ సమాధానం “ఏమీలేదు”.
       నాకు ఈ ఎయిర్పోర్ట్లూ, రాజధానులూ, ఇండస్ట్రీలూ, దుమ్మూ, మశానమూ, పొగా ఇవి అన్నీ మా ఊరికి దూరం గా ఉండాలని ఉంది. నాకు అభివృధ్ధి వద్దు. కొత్త రాజధాని కోసం ఎవరైనా పోట్లాడి వారి జిల్లాలో పెట్టిస్తే బాగుంటుంది.

       మెచ్చుకోండి

 24. Nenu motham chadavaledu.. 1st point matrame chadiva.. inka remaining chadavadam waste ani apestuna.. telangana vallu takkuva samanama? miranukuntunaremo.. nenite anukovadam ledu.. alanti feeling e makunte,seemandra madi ani endukanukuntam… ma rayalaseema leka ma costal andhra anukovachu kada… inka asalu ma rayalaseema ni enduku na zilla anukovachu kada… malli na zilla enduku na town/city anukovachu kada.. inka ala last ki na intlo vallu matram samanam, inka migilina vallanta takkuva samanam kada…

  మెచ్చుకోండి

   1. 1. అందరం ఓ రాష్ట్రం లో ఉంటున్నాం. తెలంగాణ వాళ్ళు మనోళ్ళే. కాక పోతే “కొంచెం తక్కువ మనోళ్ళు (భాష వగైరా ల వలన)”, అనే వైఖరి ఆంధ్ర ప్రాంతపు సమైక్యవాదుల లో ఉండేది

    indulo kondarilo undedi ani ekkada undi?

    మెచ్చుకోండి

 25. విషయమేమిటంటే, ఉర్దూ, హైదరాబాదూ, నైజాం సంస్కృతీ (despite peoples travails during Nizam’s rule) తెలంగాణ అస్థిత్వం లో ఎలా కలిసిపోయాయో, హైదరాబాదు సీమాంచ్ర అస్థిత్వం లో గత అరవై యేళ్ళలో అదే విధం గా కలిసిపోయింది. అస్థిత్వం లో కలిసిపోయిన అంశాన్ని విడదీస్తే దాన్ని అంగీకరించటం చాలా కష్టం. సీమాంధ్ర ఉద్యమం లోని ఆగ్రహానికి ఇదే అసలు కారణం. (People do not bother about change as long as it does not try to change people).

  మెచ్చుకోండి

 26. @ ప్రస్తుతానికి తెలంగాణ భాష పెట్టాలంటేనే సినిమా వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొంటున్నారు. అది వారి creative freedom ను నొక్కివేసింది.

  చా …. అంత క్రియేటివిటి టాలెంట్ వుంటే ఆంద్ర ప్రదేశ్ లో చాలా యాసలున్నాయి. మిగిలిన వాళ్ళ భాషలకీ , యాసలకీ ఆ మేరకు అన్యాయం ,అవమానం జరుగుతున్నట్లే .

  మెచ్చుకోండి

 27. 1.
  “హైదరాబాదు లో ఆంధ్ర వారి రక్షణ కి ప్రత్యేక చట్టం కూడా అవసరమే” … what exactly do you mean by special provisions for security, Say if center is to takeover the policing of Hyd would it make you safer, given the arrangement(central policing) couldn’t even keep women safe in Delhi . Hyderabad witnessed huge communal riots between muslims & Hindus, still the security agencies could tackle it, it is a far more sensitive issue than “security of andhras” … a made up issue.

  2.
  There were multiple instances of attacks on Telangana people in Tirupathi, would you agree to making Tirupathi a UT, pointing out isolated incidents is a cheap trick.

  3. You are using the “1956 Telangana” argument for your advantage over Bhadrachalam , i can use the same argument to deny you rights over Hyderabad, Bhadrachalam stayed with Telangana for 56 yrs the same way andhra’s developed “affection” over Hyd for staying, most andhra settlers in Bhadrachalam want it to stay with TG.

  4. Finally the most important defect with your article : You are saying all those agreement with Telangana must have been honored only because of the sudden introspection , i must say Gentlemans agreement was created out of this “introspectory mood” of andhra leaders.. but the thing is it didn’t last long & yours wouldn’t too because of one fatal flaw… Andhra’s have the power to honor or violate these agreements & in a democratic setup , one set of people shouldn’t hold such absolute power over other group of people. Your article is written introspectively,like a cold corporate boardroom brain storming get over a problem,but not with a sense of justice & this is the flaw with your Samykhandhra movement not the weak organisational skills or lack of bravery as you mentioned … which you people have plenty of.

  మెచ్చుకోండి

  1. 1. Due to the decade long hate campaign sustained against Andhras (Andhra leaders, andhra businessmen, and andhra people), this has become extremely necessary. River water disputes make it more desirable. Even now hindu-muslim riots flare up in old city once in 3-4 years. Same thing should not happen targeting Andhrites. This is the most justifiable demand. What does telangana brethern loose by providing extra security to Andhrites?
   2.I have not mentioned UT anywhere. I do not support UT idea. It is easy for Andhrites to deal with Telanganites rather than with some Hindi babus. Similarly I do not support common capital demand. It’s better for Andhrites to build their own capital, rather than traveling 200-300 KMs to Hyd.
   If you wish , you can make Hyd, Tirupathi, Warangal, Vizag etc etc as UTs.So, the you need to own this cheap trick. Not me. I am not for UT.
   Equating few spantaneous outbursts with continuous venom spewed at seemandhra people through various fronts for the past 12 years, is the cheapest trick.
   3. OK Take Bhadrachalam.
   4.After introspection, I am supporting formation of Telangana (only pleading for some safeguards for Andhr people). That makes your defect non-existing. While a political party has sustained a hate campaign against Andhras bordering unconstitutional (will tear the tongues etc), for over a decade there were no words of compassion/support from T-vadis. Only cold silence was there. In response, we we need to be cold in our calculation

   మెచ్చుకోండి

 28. ఏంటి, తెలంగాణ కాస్త తక్కువ సమానమా?
  ఆ ఒక్క మెతుకూ దొరికింది దోస్త్! అన్నముడకలేదన తెలవడానికి!!
  ఇక మిగిలిన ఆ పప్పులు కూడా ఉడకవు
  తరాలు మారినా మీ సంస్కారాలు మారవు దోస్త్
  మీ ఆట్టిట్యూడూ మారదు
  అధికతెలివిని ఆడంబరంగా చూపుకోవడం తప్ప మీ పోస్టుల్లో ఏమీ లేదు దోస్త్.
  మీ పరిశీలనలు మీకే తెలియాలి కాని
  మీ ఆత్మలు (అంతరంగాలు) మాకెప్పుడో తెలుసు దోస్త్
  మీరు మారరు, అందుకే మార్పు!

  మెచ్చుకోండి

  1. మీ కామెంట్ వలన మీకు నా టపా అర్ధం కాలేదని తెలుస్తోంది. నేను ఒకప్పటి కొందరి సమైక్య వాదుల అభిప్రాయాలను నిజాయితీ గా చెబితే, అవి న అభిప్రాయాలనుకొన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎవరూ తక్కువ కాదు.వ్యక్తిగత కామెంట్స్ వద్దు మిత్రమా. నేను విభజన కు వ్యతిరేకం కాదు. సీమాంధ్ర హక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్నను. మీ కామెంట్ గురించి వచ్చిన 3 థంస్-అప్ ని బట్టి ఇంటర్నెట్ లో రాతలని అర్ధం చేసుకొనే వారు తక్కువ అని తెలుస్తోంది.

   మెచ్చుకోండి

   1. @
    నా అభిప్రాయం ప్రకారం ఎవరూ తక్కువ కాదు.వ్యక్తిగత కామెంట్స్ వద్దు మిత్రమా..@
    anna..naa varaku adi memali kadu.
    ” మీ ఆత్మలు (అంతరంగాలు) మాకెప్పుడో తెలుసు దోస్త్.
    మీరు మారరు, అందుకే మార్ప .

    idi naa opinion kuda.

    మెచ్చుకోండి

    1. “అధికతెలివిని ఆడంబరంగా చూపుకోవడం తప్ప మీ పోస్టుల్లో ఏమీ లేదు దోస్త్.”
     –దీని గురించి నే మాట్లడత..
     –రమణా రెడ్డి చాలా engaging గా మాట్లాడుతాడు. మా ప్రాంతం పెద్ద వాళ్ళు నీలం సంజీవ రెడ్డి చేసిన మోసాల గురించి కొన్ని ఊసులు చెబుతారు. ఆ ఊసుల్లో సంజీవరెడ్డే విలన్. మొత్తానికి కృష్ణా జిల్లా వారికి లేని గొప్పతనాన్ని అంటగట్టారు. ఓ ప్రాంతం/జిల్లా వారంతా అలాంటి వారు(stereotyping) అనే వారి మాటల పై నాకు నమ్మకం తక్కువ.
     శ్రీ శ్రీ ని విమర్శించిన రాడికల్ రమణారెడ్డీ ఈయనా ఒకరో కాదో నాకు తెలియదు.

     మెచ్చుకోండి

 29. హైదరాబాద్ లాంటి మహానగరాలను పెట్టుబడికేంద్రాలుగా, చుట్టూ ఉన్న గ్రామాలను శ్రమ కేంద్రాలుగా మార్చడమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు మూలం. చుట్టూ ఉన్న గ్రామాలు కోల్పోయిన ఉత్పత్తి, నీళ్లు, భూమి, ఉపాధి, జనజీవనం, పర్యావరణం, చెరువులు-కుంటల కంటే నగరాలు కల్పించిన *******ఉద్యోగావకాశాలు గొప్పవేమీ****కాదు . ఇవ్వన్ని లెక్కగడితే అభివృద్ధి డొల్లతనం బయటపడుతుంది. వందల, వేల కోట్ల ఆస్తులను గుప్పిట పట్టుకున్న ఘరానా వ్యాపారులు, దళారి పెట్టుబడిదారులు, మాఫియా శక్తుల ఆర్థిక-రాజకీయాధిపత్యం వెల్లడవుతుంది.
  $ >>>మహానగరాల జనసాంద్రతను తగ్గించడానికి వికారాబాద్‌లాంటి శాటిలైట్ పట్నాలను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంటే వాన చినుకులకే మునిగిపోయే అచ్చంగా హైదరాబాద్ లాంటి నగరమే రాజధానిగా నిర్మించుకోవాలనే హేతు బద్ధతను పరిశీలించుకోవాలి. పబ్లిక్‌రంగాన్ని ధ్వంసం చేసి ప్రైవేట్ పెట్టుబడిదార్ల, కార్పొరేట్ సంస్థల లాభాలను పండిస్తున్న మెగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం ఇది కాజాలదు. హైదరాబాద్ తెహజీబ్‌ను భాషా వైవిధ్యతను కాపాడుకోవడం అవసరం. తెలంగాణ ఉద్యమం ఆత్రాఫ్ బల్దా నుంచి నేటి అంతర్గత వలస హైదరాబాద్ చరిత్ర దాకా సాగిన విధ్వంసాన్ని వెలికితీసింది. రైతాంగం -నేత కార్మికుల బలవన్మారణాలను వలసజీవుల బతుకులను నిర్వాసితుల తిప్పలను చాటి చెప్పింది. ప్రజల జీవితాలను పరాయీకరించే సోకాల్డ్ అభివృద్ధిని ప్రశ్నించింది. వీటిని పరిమార్చే దిశగా పయనించడానికి దేశీయ విధానాలు ఆలంబన కావాలని దండోరా వేసి చాటిచెప్పింది. అందుకే అది ప్రాంతేతర వ్యక్తుల జోలికి పోలేదు. దోపిడీ విధానాలపై ప్రజాస్వామికంగా ప్రతిఘటించింది. (@దేశీయ పునాదులపై పునర్నిర్మాణం – అమర్..andrajothi aug 17)

  @నాకూ ఓ పాయింట్ అర్ధం కాలేదు. విడిపోయి కలిసిఉండటమేమిటి. అంత కలిసి ఉండే లెక్కన ఎందుకు విడిపోవాలి?
  28 rastalu,120 kotla janaba,vandala bashalu,manadalikalu,vibbina matalu…vuna manam bharatiyulam ane bava vundaga lenidi…telugu variki emi samasya..
  .@తెలంగాణా వాదులు మా భాష వేరు అంటున్నారు.
  evaranaru..evaru geli chesaru..meku telugu sariga radu aei aa bhavana rechagotindi(valla drustilo hasyam) andra varu?
  @సీమాంధ్రుల భద్రత కి చట్టాలు ఉంటే మంచిది.
  @విద్వేషం మాత్రం తె.రా.స పార్టీ నుంచీ మొదలయింది
  tg prajalu … “andra vallu dochukunaru ante motam aa prjalanta dochukunari meaning tho na?aa prantaniki chendina kondra vayktulana…?
  tg prajala dwesham,kopam dopidi pine kani prajala pina kadu…..
  kevalam prantanam peru meda kani,kulam peru mida kani,vesha bashala peru mida gani hasyam,anichiveta,dowrjanayam maa prantam(adilabad) nenu chudale(naku sambandinchi)….
  @@@deshamante matti kadu..manushulu annatu…kalasi vundala..vidi povala nnadi..telanagana vallu telchali…hyd meda anumanalu nivruthi chesukovadani pryatinchali,vatti kosam poratam cheyali..kani SAMAYKYAM RASTAM ani vudyamam cheyadam artam ledu..

  మెచ్చుకోండి

  1. తెలంగాణ వారి నుంచీ వచ్చిన అన్ని కామెంట్స్ లోకి నాకు మీది నచ్చింది. నాకు తెలంగాణ ఉద్యమ తాత్విక మూలాల పై గౌరవం ఉంది. కానీ వాస్తవం లో అవి అమలు కావటం లేదు. రాష్ట్రం ఏర్పడక ముందే, మేము పెట్టుబడులకు వ్యతిరేకం కాదు అంటారు. వ్యాపారవేత్తల తో closed door మీటింగులు పోడతారు. ఇవన్నీ తాత్విక స్ఫూర్తికి విరుధ్ధం.

   మెచ్చుకోండి

 30. ఒక సమైక్య వాదిగా నా అభిప్రాయం ప్రకారం ప్రస్తుత రాష్ట్ర విభజన నిర్ణయం పూర్తిగా సీమాంధ్ర ప్రజల/నాయకుల అలసత్వానికి ప్రతిఫలం. తెలంగాణ ఉద్యమానికి సమాంతరం గానే సమైక్య వాదాన్ని గట్టిగా వినిపించటంలోనూ, తెలంగాణా ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రతిస్పందించి వారికి భరోసా కల్పించటంలో సీమాంధ్ర ప్రజలు/నాయకులు ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు. దీనికి కారణం తెలంగాణ ఉద్యమాన్ని/ప్రజలను తక్కువగా అంచనా వెయ్యటం, సొంత నాయకులను అతిగా నమ్మటం, ఒక వేళ విభజన జరిగితే తమ సొంత ప్రాంతం దగ్గర కొత్త రాజధాని వస్తే సొంత ఆస్ఠుల విలువ పెరుగుతుందనే స్వార్ధం, విభజన వల్ల తలెత్తే తీవ్ర పరిణామాలు అంచనా వెయ్యలేకపోవటం (కేసీయార్ సీమాంధ్ర ఉద్యోగులని వెళ్ళిపొమ్మన్న తర్వాత సమైక్య ఉద్యమం తీవ్ర మవ్వటం ఉందుకు ఉదాహరణ)

  మెచ్చుకోండి

 31. @కేసీయార్ సీమాంధ్ర ఉద్యోగులని వెళ్ళిపొమ్మన్న తర్వాత సమైక్య ఉద్యమం తీవ్ర మవ్వటం ఉందుకు ఉదాహరణ

  గోపి.గారపాటి గారు,

  ఇది నిజం , అంతకు ముందు ఆంద్ర ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలేదు . కాని కే సి ఆర్ వ్యాఖ్యలకు బంద్ చెయ్యాల్సింది హైదరాబాదులోని ఉద్యోగులు కదా ? మరి ఆంధ్ర లోని ఉద్యోగులెందుకు చేస్తున్నారు ?ఎవరు ప్రేరేపించి చేయిస్తున్నారు ? లేక విభజన వల్ల ఆంధ్ర లోని ఉద్యోగులకి వఛ్చిన కష్టం ఏదో ఉండి ఉండాలి . అదేమిటి ?

  మెచ్చుకోండి

  1. మౌళి,
   మీకు నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. వారు హైదరాబాదు గురించే అని చెప్పకనే చెబుతున్నారు. ఏ వరంగల్ గురించో అని ఎందుకు చెప్పటం లేదు?

   మెచ్చుకోండి

   1. మంచి ప్రశ్న , ఎవరైనా వరంగల్, ఓరుగల్లు అంటే నా పూర్తీ మద్దతు సమైక్యాంధ్ర కే . ఎంచక్కా రామప్ప గుడి , చెరువు, వేయిస్తంభాల గుడి, ఖాజీపేట్ స్టేషన్ ఇవ్వన్ని వదులుకోలేక మొదటంతా సమైక్యాంధ్ర అని చెప్పమని నా తెలంగాణ మిత్రులని బెదిరిస్తేను నేను 🙂

    మెచ్చుకోండి

 32. అన్ని బాగానే ఉన్నాయ్ కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి బ్రదర్స్..
  18 పాయింట్ కి జవాబు : 90 శాతం ఉన్న సినిమా వాళ్ళు సమైక్యంగా ఉండడానికి సినిమా తీయక పోగా ఈ పదేళ్ళలో చాలా సినిమాల్లో తమ తెలంగాణా వ్యతిరేకతను చూపించారు. ఇది తెలంగాణా వాళ్ళకు మరికొంత ఆగ్రహం తెప్పిచింది.. కాదంటారా..
  20 వ పాయింట్ : హైదరాబాద్ తెలుగు నగరం కాదనడం తప్పు.. నిజాం రాజుగా ఉన్నాడు కాబట్టి , ఉర్దూ బాష అభివృద్దిలో ఉండొచ్చు. కానీ, తెలుగు అసలే లేదనడం మూర్ఖత్వం. అప్పటికే హైదరాబాద్ లో చాలా తెలుగు పత్రికలు ఉన్నాయని మరువొద్దు
  ఇంకొక విషయం రాష్రం మొత్తం నిధులు హైదరాబాద్ లో ఖర్చు చేసారనడం పచ్చి అబద్దం. నిజంగా ఖర్చు చేసుంటే హైదరాబాద్ ఇలా ఉండేది కాదు. హైదరాబాద్ లో షేర్డ్ రైట్స్ కావాలని అడిగే అర్హత సీమాంద్రులకి లేనే లేదు. కారణాలు ఇవి.
  1. 60 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ఏలిన అందరు సీమాంద్ర ముక్యమంత్రులు హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు కొల్లగొట్టి సీమాంద్ర ప్రాంత అభివృద్ధి కి కేటాయించారు. వాటి విలువ కట్టి తెలంగాణా ప్రజలకు ఇవ్వవలసిన అవసరం ఉంది.
  2. సీమంద్ర ముక్యమంత్రుల లెక్కల ప్రకారమే తెలంగాణాకు ఉద్యోగాల్లో జరిగిన నష్టం సుమారు లక్ష ఉద్యోగాలు. అంటే తెలంగాణా లో లక్ష కుటుంబాలు ప్రభుత్వోద్యోగాలకు దూరమై అభివృద్దిని కోల్పోయారు. రెండు తరాల్లో ఈ లక్ష కుటుంబాలు ఎంత నష్ట పోయాయో లెక్కకట్టగలర.. వాటిని తెలంగాణా ప్రజలకి ఇవ్వగలర…
  3. తెలంగాణా లో ఒక్క హైదరాబాద్ మినహా మిగితా పట్టణాలు ఎందుకు డెవలప్ కాలేదు. సీమంద్ర లో 8 పెద్ద నగరాలూ అభివృద్ధి చేయబడినాయి. విశాఖపట్నం బారత దేశంలో నే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. రాజమండ్రి, కాకినాడ , విజయవాడ , నెల్లూరు , తిరుపతి, కడప, కర్నూల్ నగరాలు రాష్ట్రము మొత్తం నిధులతో అభివృద్ధి చెందలేద… ఇవన్ని వదిలి ఒక్క హైదరాబాద్ పైనే అందరికి హక్కులు ఎందుకు ఉండాలి.
  4. తెలంగాణా లో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే కొత్తగా ఎయిర్ పోర్ట్ నిర్మింపబడింది. ( శంషాబాద్ ఎయిర్ పోర్ట్). కానీ సీమద్ర లో విశాఖపట్నం , రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప నగరాల్లో ఎయిర్ పోర్ట్లు కొత్తగా నిర్మిచారు. ఇవ్వన్ని రాష్ట్రము మొత్తం నిధులతో కాదా.. మరి అలాంటప్పుడు తెలంగాణా లో కొత్త ఎయిర్ పోర్టులు ఎందుకు నిర్మించలేదు. ఇక హైదరాబాద్ లోని సీమాంద్రులకి రక్షణ చట్టాలు కావాలనే అర్ధం లేని డిమాండ్ తెరపైకి తెచ్చారు.

  మెచ్చుకోండి

 33. During Rajagopalachari’s tenure as Chief Minister, a powerful movement for a separate Andhra State, comprising the Telugu-speaking districts of the Madras State, gained a foothold.[49][50] On 19 October 1952, an Indian independence activist and social worker from Madras named Potti Sriramulu embarked on a hunger strike reiterating the demands of the separatists and calling for the inclusion of Madras city within the proposed state.[49][50][51] Rajagopalachari remained unmoved by Sriramulu’s action and refused to intervene.[50][52] After fasting for days, Sriramulu eventually died on 15 December 1952, triggering riots in Madras city and the Telugu-speaking districts of the state.[49][50][51] Initially, both Rajagopalachari and Prime Minister Nehru were against the creation of linguistically demarcated states but as the law and order situation in the state deteriorated, both were forced to accept the demands.[50] Andhra State was thus created on 1 October 1953 from the Telugu-speaking districts of Madras, with its capital at Kurnool.[53][54] However, the boundaries of the new state were determined by a commission which decided against the inclusion of Madras city.[55]

  Though the commission’s report suggested the option of having Madras as the temporary capital of Andhra State to allow smooth partitioning of the assets and the secretariat, Rajagopalachari refused to allow Andhra State to have Madras even for a day.[56]

  అచ్చ తెలుగులో చెప్పాలంటే రాత్రికి రాత్రి మెడలు పట్టి గెంటేశాడు.

  Here in now we are accepting them to be in Hyderabad for 10 YEARS. why that soft corner for them.

  ( నాకు తెలిసి ఆంధ్రోళ్ళకు కరెక్ట్ మొ__.. – రాజాజీ -సి.రాజ గోపాలా చారి )

  మిత్రుడు ఆర్టికల్ చాలా పెద్దగా పాయింట్ వైజ్ గా రాశాడు ,
  అలాగే ఆంధ్రా వాళ్ళు మద్రాసు నుండి ఎందుకు విడి పోవలసి వచ్చిందో కాస్త చెబితే , నాలాంటి తెలియని వాళ్ళకు కనువిప్పు కలుగుతుంది అని ఆశిస్తున్నాను.

  మెచ్చుకోండి

  1. ఈ టపా రాసింది సమైక్య వాదం గురించి.నేను ఒఫెన్ మైండ్ తో రాశాను. మీరు ఎప్పుడో మద్రాస్ రాష్ట్రం గురించి రాసి మీ విద్వేషం వెలిగక్కితే నేనేం చేసేది? అప్పుడు విడిపోదామని ఉజ్జమాలు చేసినోళ్ళు రాజధానిని వదులు కొన్నాడు. మీరు అందుకు రెడీనా?
   పైనే ఓ కామెంట్లో చెప్పినట్లు నాలాంటోడు, హైదరాబాదు కావాలంటే ఇచ్చేస్తారా? ఎవరికి ఏమి వస్తుంది అనేది,అయాకాలాల లోని real politic మీద ఆధారపడి ఉంటుంది. ఆ కాలం లో రాజాజీ చాలా పవర్ఫుల్. ఇప్పుడు ఉన్న సమీకరణాలను బట్టీ, రాజకీయ లబ్ధి ని బట్టీ ఇప్పటి నిర్ణయాలు జరుగుతాయి.
   మీకు కావలసిన దానికి విరుధ్ధం గా ఉన్న ఏ డిమాండ్ పైన అయినా కాస్త సహనం ఉంటే మంచిది.

   మెచ్చుకోండి

 34. ఎది తాత్విక స్ఫూర్తి?
  హైదరాబాద్ అందరి సొత్తంటున్నారు. హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారు. మిగిలిన తెలంగాణ జిల్లాలు సమైక్యంలో భాగం కాద. . అసలు సమైక్యమంటే ఏమిటి? కేవలం హైదరాబాద్‌ను కోరుకోవటం సమైక్యమవుతుందా? ఒక వెళ హైదరాబాద్‌ను మినహాయించి తెలంగాణ ఏర్పాటుచేస్తే సీమాంధ్రలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో భావోద్వేగాలు లేవూ.వుందల్లా హైదరాబాద్ కాద? మరి ఎది తెలుగు జాతి సమైక్యత?
  తెలుగు జాతి ఆత్మగౌరవం.

  మెచ్చుకోండి

  1. అయ్యా ఇంకెక్కడి సమైక్యం. సాక్షాత్తూ తెలంగాణ వారే సమైక్యం కావాలన్నా ఇక సమైక్యం రాదు.సమైక్యం వీగిపోయిందని చెప్పటమే ఈ టపా ఉద్దేశం కదా? సమైక్యం లోని లోపాలను తడమటమే దీని ఉద్దేశం.

   మెచ్చుకోండి

 35. I would like to contribute my opinion here as a Normal Telangana person. By the time Telangana agitation came to prominence in 2004, I was only 20 years old. I don’t even know why I need Telangana. But few things which strongly influenced me to wish for separate state are:

  1) The History and cultural identity. (In United AP, I felt it was not given with enough respect)

  2) Socio economic differences in both regions (As I studied in Guntur, I know few areas in Andhra and how developed they are)

  Till now I was only wishing for it but these are few things which influenced me to the core 🙂

  3) YSRs statement in Nandyal saying he need a VISA to visit Telangana if it is going to be seperated

  4) The resignations of Seemandhra MPs & MLAs in 2009.

  మెచ్చుకోండి

 36. – రాజధానిని మీరు ఏమాత్రం అభివృద్ది చేయలేదు ఎందుకంటే ఆ తో ఉద్దేశ్యం మీరు రావడం జరగ లేదు , కేవలం బ్రతుకుతెరువుకోసమో లేక వ్యాపారోద్దేశ్యమో మీది! ఇది సత్యం.
  – మీలాగా ఎక్కడెక్కడినుడో వచ్చినవారు ఇతర రాష్ట్రాల వారు చాలా మంది వున్నారు.
  – రాజధాని అభివృద్ది అనే సంకల్పం ఏ సీమాంధ్రా పెట్టుబడి దారీలలో గతం లోనూ/ప్రస్తుతంలోనూ లేదు ఇది సరళమైన సత్యం.
  – అలాంటప్పుడు అభివృద్దిలో అది మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందనిపించుకోదు (నిజాం లాగా)
  – పైగా బ్రష్టు పట్టించారు (పారిశ్రామికంగా, కాలుష్య పరంగా,కబ్జాల్లో, అవినీతి పరంగా )
  – పెట్టుబడుల్లో మీ భాగం పెద్దదే, కాని డొమినేట్ చేసేంత పెద్దది మాత్రం కాదు.
  – సీమాoధ్ర వాదనల్లో మొండితనం తప్ప సహేతువు లేదు..

  మెచ్చుకోండి

  1. రాజధాని మేం అధివృధ్ధి చేశాం అని ఈ టపా లో ఎక్కడా నేను చెప్పలేదు.అయినా మీరు మాట్లాడుతున్నారంటే అది మీకున్న ఇన్ సెక్యూరిటీ ని సూచిచ్తుంది. Don’t worry, మీ రాజధాని ని ఎవరూ లాక్కొనిపోరు.
   Anyways you mentioned some points . Let me bite the bullet
   – రాజధానిని మీరు ఏమాత్రం అభివృద్ది చేయలేదు ఎందుకంటే ఆ తో ఉద్దేశ్యం మీరు రావడం జరగ లేదు , కేవలం బ్రతుకుతెరువుకోసమో లేక వ్యాపారోద్దేశ్యమో మీది! ఇది సత్యం.
   – మీలాగా ఎక్కడెక్కడినుడో వచ్చినవారు ఇతర రాష్ట్రాల వారు చాలా మంది వున్నారు.
   – రాజధాని అభివృద్ది అనే సంకల్పం ఏ సీమాంధ్రా పెట్టుబడి దారీలలో గతం లోనూ/ప్రస్తుతంలోనూ లేదు ఇది సరళమైన సత్యం.
   *****రాజధానిని వ్యాపారవేత్తలూ, వలస వచ్చినవారూ అభివృధ్ధి చేస్తారని ఎవరు చెప్పారు? ప్రభుత్వం మౌలిక సదుపాయలూ, వసతులూ, infrastructure కల్పించి దెవలప్ చేస్తుంది.
   – అలాంటప్పుడు అభివృద్దిలో అది మీ ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందనిపించుకోదు (నిజాం లాగా)
   *****నిజాం ది ప్రభుత్వం. ప్రభుత్వాన్నీ బిజినెస్ వాళ్ళనీ పోలుస్తారా? నిజాం ప్రభుత్వన్నీ, తరువాతి AP ప్రభుత్వాన్నీ పోల్చాలి. ప్రభుత్వం చేసిన అభివృధ్ధిలో ప్రజల భాగస్వామ్యమెంతో కూడా చూడాలి. 1940 ల లో హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ తెలుగు ప్రజల సంఖ్య సుమారు 10 శాతం ఉండేది. అంటే నిజాం చేసిన అభివృధ్ధి అంతా తన కోసం. అందుకే ఆయనకు వ్యతిరేకం గా పోరాటం చేసి ఆయనను మీరు దింపింది.
   ఇక AP ప్రభుత్వాలు చేసిన అభివృధ్ధి కొన్ని — రోడ్లూ, ఫ్లై ఓవర్లూ, మంజీరా నీళ్ళు, కృష్ణా-1 ఫేస్, 2- ఫేస్, పార్కులూ, ప్రభుత్వ భవనాలూ మొ||
   – పైగా బ్రష్టు పట్టించారు (పారిశ్రామికంగా, కాలుష్య పరంగా,కబ్జాల్లో, అవినీతి పరంగా )
   – పెట్టుబడుల్లో మీ భాగం పెద్దదే, కాని డొమినేట్ చేసేంత పెద్దది మాత్రం కాదు.
   ********ఈ టపా లోని కామెంట్ల లో ఆల్రెడీ సమాధానం చెప్పేశాను. సైట్ కొనుక్కొని అది పెరిగితే కబ్జా అనలేం. కాలుష్యం అనేది అధునిక పారిశ్రామిక సమాజపు శాపం. ఇండియాలో ఏ పెద్ద సిటీ లో అయిన కాలుష్యం ఉంటుంది. తెలంగాణ వచ్చిన ఎన్ని నెలల లో కాలుష్యం లేకుండా చేస్తారు?ఒక వేళ ఆంధ్ర వాళ్లే కాలుష్యం చేస్తున్నారనుకొంటే వాళ్ళు బాగా తక్కువ గ ఉందే ఏరియాలలో కలుష్యం లేకుండా చేసి చూపించండి.
   – సీమాఒధ్ర వాదనల్లో మొండితనం తప్ప సహేతువు లేదు..
   *******calling names is the easiest thing

   సరే ఆంధ్ర వాళ్ళు చేసింది సున్నా రూపాయల అభివృధ్ధే అనుకొందాం. ఓ central auditor ను నియమించి, 1956 తరువాత హైదరాబాద్ లో జరిగిన అభి వృధ్ధి ఎంతో లెక్క చెప్పమందాం. అతను ఎంత చెబితే అంత (0 రూపాయలు అయితే 0, ఒక లక్ష కోట్లు అయితే లక్ష కోట్లు) తెలంగాణ అకవుంట్ నుంచీ రాబోయే ఆంధ్ర రాష్ట్ర అకౌంట్ లో వేసేద్దాం. మీ ప్రకారం ఎలానూ అది 0 రూపాయలు ఉండాలి లేక పోతే చాలా చాలా తక్కువ ఉండాలి. అలానే దోపిడీ గీపిడీ కబ్జా జరిగితే, వాటిని నిరూపించి, లెక్కలు చూసి ఆంధ్రా అకవుంట్ లోంచీ తెలంగాణ అకవుంట్ లో వేసేద్దాం.
   PS: ఆడిటర్ లెక్కలు చెప్పిన తరువాత అతనిని తిట్టకూడదు.

   మెచ్చుకోండి

   1. అన్న ఓ central auditor ను నియమించి, హైదరాబాద్ లో ఫెట్టిన ఖర్చె కాదు..గత 60 ఏళ్ళ రాష్టం అదాయం,వివిధ ప్రాంతాల పై ఖర్చు లెక్క బెట్టితె సరి..అందరి అనుమానలు తిరుతాయి

    మెచ్చుకోండి

    1. అవునన్నా,
     నీళ్ళూ నిధులూ ఉద్యోగాలూ వగైరాలను రూపాయలు గా కన్వర్ట్ చేయటం (ఇన్-ఫ్లేషన్ ను లెక్క లోకి తీసుకొని) కొంచెం కష్టం. కానీ చేయలేని పనేం కాదు.

     మెచ్చుకోండి

 37. Thanks for expressing your opinions.

  One thing seems to be missing out of all of the debates is the number of Telangana people made a living in SeemaAndhra in the last 5 decades of AP is abysmally low.

  On the other hand millions have made a living in Telangana from SeemaAndhra.

  Do you guys ever contemplate about this?

  Isn’t this one point enough to prove that AP has been a failed experiment?

  Would love to hear your honest opinion on this?

  మెచ్చుకోండి

  1. Thank you
   Take a person who has migrated to a different land. Local’s response to him usually is: 1)curiousity 2)hostility
   Curious because he is different. Hostility because his values clash with those of locals.
   Now the person can think himself as a) Superior b) equal c) Inferior to the locals.

   If he thinks himself superior to the locals, he ignores their hostility (unless it interferes in his day to day practical life). Their hostility does not hurt him. He continues his venturing.

   If he thinks he is equal to locals, their hostility pains him. That deters him from venturing further.

   If he thinks him self inferior to locals, their hostility threatens him. Then he escapes and retreats.

   This should explain the T – SA scenario.
   This situation is very unlikely to change even after the creation of telangana state. Does that mean Tealangana vadam failed?

   మెచ్చుకోండి

 38. Your argument is just too abstract and philosophical as considering a lot of Indians , considering the poverty levels, just migrate to anywhere for a better living as long as the locals are inclusive.

  You just take a flight to middle east and you see loads of uneducated, poor people from Telangana working in their construction industry which probably needs more skill than the construction industry in India. The irony is crony capitalists of SeemaAndhra have managed to take over all the Nizam lands in the name of SEZs yet you hardly find anyone from Telangana working in their construction industry in Hyd itself. It upsets me that the educated Andhras seem to be blindsided to this.

  I am not expecting it to change after Telangana but at least there is no expectation of making a living in SeemaAndhra to start with as we no longer share any resources.

  Ideally, like any local in any part of the world, I want the telangana resources to be used for the betterment of T and its people and SeemaAndra resources for SeemaAndhras. We the current setup T & SA resources are blatantly used for SA people so hoping a balance will come out this. If it doesnt then obviously we need to continue the fight.

  మెచ్చుకోండి

 39. Please read : “Solutions to water problems between Seemandhra and Telangana”
  By T Hanumantha Rao
  (The writer is former Engineer-in-Chief, United Nations Operations Projects Services Consultant)
  http://gandhipv.wordpress.com/2013/08/23/solutions-to-water-problems-between-seemandhra-and-telangana/

  మెచ్చుకోండి

 40. నెహ్రూ గారి మాటగా (ఉపమానము) అందరూ అంటున్నట్టు , ఆంధ్రా , తెలంగాణకు సంబందించి , అమాయకపు అమ్మాయిని తుంటరి కుర్రాడికి ఇచ్చి పెళ్ళిచేస్తున్నాము , ఎప్పుడైనా ఇద్దరి మధ్య పొసగకపోతే విడిపోవచ్చు.

  ఇప్పుడు యూ.ఫీ.ఏ , కేంద్ర ప్రభుత్వం ఆంధ్రా, తెలంగాణకు విడాకులు (విభజన) ఇద్దాము అని నిర్ణయించింది. కాని 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని , ఆంధ్రా వాళ్ళు 10 సంవత్సరాలు ఇక్కడే వారికి రాజధాని నిర్మాణం , మౌలికవసతులు ఏర్పడే వరకు ఉంటారు అని అంటున్నారు .

  సరే రాష్ట్రాలు , విభజనలో ఇది ఒక భాగం , సరి ఐన సామాన్య విషయం అనుకోవచ్చా?
  పైన పోలికకు సమానంగా , నిజ జీవితంలో ఒక భార్య , తన భర్త తో ఇక నేను కలిసి ఉండలేను అని అంటే , విడాకులు ఇవ్వాలని నిర్ణయించిన పెద్దలు కొన్ని షరతులు అంటే ,
  నువ్వు ఉండే ఇంట్లో నే అతడు ఉంటాడు.
  అతనికి వంట చేసు కోవడం రాదు కాబట్టి , నువ్వే వండిపెట్టాలి .
  అతనికి బట్టలు ఉతుక్కోవడం రాదు కాబట్టీ , నువ్వే ఉతకాలి .
  అతనికి పెళ్ళి చేసు కోవడానికి ఇంకో అమ్మాయి దొరికే వరకు , నీతోనే కాపురం చేస్తాడు .
  ఇలా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా , వినే వారికి కూడా అసహ్యంగా ఉండదా.

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s