పాత ఆధిపత్య వర్గాలే.. .. ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొందరు ఆంధ్ర బహుజన మేధావులు, రాష్ట్రం విడిపోతే, రెండు రాష్ట్రాల లోనూ అగ్ర కుల ఆధిపత్యం తగ్గిపోతుందనీ, బహుజనులు అధికారానికి దగ్గరవుతారనీ, ఓ వాదన చేశారు. “ఈ వాదన కి ప్రాతిపదిక ఏమిటబ్బా?”, అని అప్పట్లో అనుకొని, “అంత మేధావులు చెప్పారంటే నిజమే అయి వుంటుంది లే!”, అనుకొని నా ఆలోచనలను నొక్కేసుకొన్నాను.

వాస్తవం గా , 23 జిల్లాల పెద్ద రాష్ట్రం లో ఐదారు జిల్లాల కి పరిమితమైన కమ్మా, వెలమ , రాజు వంటి కులాల ఆధిపత్యం మొత్తం మీద పరిమితం గా ఉంటుంది.23 జిల్లాల రాష్ట్రాన్ని సగం, సగం రెండు రాష్ట్రాలు గా విడగొట్టినపుడు, ఆ ఐదారు జిల్లాలూ మొత్తం ఏదో ఓ రాష్ట్రం లో పడి తే, పదీ పరక జిల్లాల చిన్న రాష్ట్రం లో వీరి డామినేషన్ ద్విగుణీకృతం అవుతుంది. రెండు రాష్ట్రాలు ఏర్పడినాక జరిగిందేమిటయ్యా అంటే, తెలంగాణ లో వెలమా, రెడ్డీ ఆధిపత్యం బిగుసుకొని పోతే, ఆంధ్ర లో కమ్మా రెడ్డీ see/saw కంటిన్యూ అవ్వబోతోంది. విజవాడ రాజధాని అంటే, ఈ hegemony మరింత బిగుసుకొని పోవటమే!

రాష్ట్రం విడిపోకుండా ఉంటే, రాష్ట్ర చరిత్ర లో మొట్టమొదటి సారి గా సంకీర్ణం ఏర్పడాల్సిన పరిస్థితి ఉండేది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం అనేది ఆధిపత్యం సడలటానికి ఓ మొదటి మెట్టులాంటిది. రాష్ట్ర విభజన ద్వారా సామాజిక సమీకరణాలలోని ఆ అవకాశాన్ని కోల్పోయి మళ్ళీ పాత ఆధిపత్యాలే, ఇంకా బిగిపోయాయి.

మొత్తానికి రాష్ట్రన్ని విడగొట్టటానికి ఎవరి కాకి లెక్కల తో వారు ఓ పుల్ల పెట్టారు.

ప్రకటనలు