ఏమయ్యా చంద్ర బాబూ, ఇంకా రెండు కళ్ళ సిధ్ధాంతమంటావు, ఓ కంట్లో కారం కొట్టించుకొన్నాక కూడా

ఏమయ్యా చంద్ర బాబూ, ఇంకా రెండు కళ్ళ సిధ్ధాంతమంటావు, ఓ కంట్లో కారం కొట్టించుకొన్నాక కూడా! మీరు విభజన చట్టాన్ని సరిగా పాటించటం లేదంటే, “మీరు మొదట తుంగ లో తొక్కాకే మేం మొదలెట్టాం!” అని నిష్కర్ష గా చెప్పలేవు. ఉమ్మడి రాజధాని లో law and order గవర్నర్ చేతి లో ఎందుకు లేదని గట్టి గా అడగ లేవు?..అడిగించను కూడా లేవు.. తాగు నీటికి ఓ నాల్గు టీఎంసీ ల నీటిని ఎందుకివ్వరని గట్టి గా అడగలేవు.. ..మీ కరెంట్ కోసం , మేము నీళ్ళెందుకు వదులుకోవాలని అడగాలేవు, నీ మంత్రుల చేత అడిగించా లేవు!మా దగ్గర ఉత్పత్తి చేసిన కరెంట్ మాకే, అని ఎందుకు ఢంకా భజాయించవు?మీ అసెంబ్లీ కి పవర్ కట్ చేస్తామంటే, “జెనరేటర్ ల తో నడుపుకొని, డీజిల్ బిల్లు మీకు పంపిస్తాములే!”, అనీ చెప్పలేవు.
ఫీజు రీయంబర్స్-మెంటు గురించి కాంగ్రెస్ వాళ్ళు (డొక్కా ప్రభృతులు) కోర్టు లో వేస్తే గానీ గతి లేదు..(అలా అని కాంగ్రెస్ ని క్షమించామని కాదు) . ఎందుకూ?  .అక్కడ ఏ ఓట్లు పోతాయో అని. ఎప్పటికైనా అక్కడ చక్రం తిప్పకపోతానా అని..ఓ ఆశ..ఈ లోగా ఇక్కడి వాళ్ళు ఏమైపోయినా పర్లే..ఎందుకంటే నీ పని జరిగిపోయింది..గద్దె నెక్కావు. తెలంగాణ కు కూడా న్యాయం చేస్తాం అంటావు.పక్క రాష్ట్రాలకి న్యాయం చేయటం గురించి నీలా పాటు పడే ముఖ్యమంత్రి నాకు 29 రాష్ట్రాలలోనూ, ఏ కాలం లోనూ కనిపించలేదు.  .ముందు నిన్ను ప్రతినిధి గా ఎన్నుకొన్న వాళ్ళ మనోభావాలకీ, ఆశలకీ ప్రాతినిధ్యం వహించవయ్యా మగడా! ఎక్కడో పక్క రాష్ట్రం లో జరిగిన రైతుల ఆత్మ హత్యలకీ, నీకూ ఏమిటి సంబంధం? వాళ్ళ చేత నువ్వు తిట్టించుకొని కూడా, మళ్ళీ ఎందుకు అదే శైలి లో రెస్పాన్స్ ఇవ్వటం లేదు? మా ప్రతినిధివైన నిన్ను తిడితే, మమ్మల్ని తిట్టినట్లు కాదా? మా ముఖ్యమంత్రి వైన నీకు, మా కంటే,  నిన్ను రోజూ తిట్టే పక్క రాష్ట్రం మీద ధ్యాస ఎక్కువైనట్లు ఉంది. ఓహో..నా పార్టీ అక్కడ కూడా ఉంది అంటావా? మరి మాకు కరెంట్ ఇస్తున్నావని, నీ పార్టీ ఆఫీసు మీద అక్కడ దాడి చేస్తే, ప్రతి గా ఏం చేయగలిగావు..ఒహో.. అక్కడ ఓట్లు పోతాయని భయమా? తుమ్మితే ఊడే ముక్కు ఎంత కాలం?

నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రీ, మంత్రులూ విమర్శిస్తున్నట్లు, నువ్వు ఏ కర్నాటక ముఖ్య మంత్రి నో తిట్టు. కర్నాటక వాళ్ళ ప్రతి స్పందన ఏమిటో తెలుస్తుంది. చీటికీ మాటికీ మన రాష్ట్రం వ్యవహారలగురించి పేలుతూ ఉండే పక్క రాష్ట్రం వారికి, “మీ విషయం మీరు చూసుకోండి, మా వ్యవహారం మేం చూసుకొంటాం”, అని ఎందుకు చెప్ప లేక పోతున్నావ్? ఓహో నీ పార్టీ కి తెలుగు ప్రజలందరూ కావాలా(మాది తెలుగే కాదు పొమ్మన్న వారి ని వదిలేసి! )? మరి తెలుగు ప్రజలందరికీ నీ పార్టీ కావాలో ఒద్దో నీకు తెలీదా? నీకు రెండు వైపుల వాళ్ళూ కావాలి. మరి అవతలి వాళ్ళ కి నువ్వు అవసరమా? మీ వాళ్ళ విగ్రహల ను తీసుకొని పొమ్మంటే, తెలంగాణ నాయకుల విగ్రహాలను కూడా ఆంధ్ర లో పెట్టిస్తాం అంటావు. ఆంధ్ర లో ఏప్రాంతమైనా ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని గా ఉందా? రెండు రాష్ట్రాల కీ ఉమ్మడి రాజధాని ఆంధ్ర లో ఉందా? “ఉమ్మడి రాజధాని లో ఓ రాష్ట్రం వారి విగ్రహాలే ఎందుకుండాలి?” అని అడగలేవు. అక్కడి వారి విగ్రహాలు ఇక్కడ పెట్టటం లో తప్పు ఉందని కాదు. బ్లాక్ మెయిల్ కి లొంగటం, నీ ప్రాంతం వారి కి కూడా ప్రాంతీయ అస్థిత్వ భావాలు ఉంటాయని నువ్వు గుర్తించినట్లు కనపడదు. మనోళ్ళె కదా వీళ్ళ గురించి పట్టించుకొనేదేముంది అనుకొంటున్నావా?

నీ ప్రత్యర్ధి జగన్ కూడా నీ లానే, “ఎప్పటికైనా తెలంగాణ లో పాగా వేయక పోతానా!”, అని పగటి కలలు కంటున్నాడు. మీ ఇద్దరి expansionist dreams, మన రాష్ట్ర ప్రయోజనాలకి ఖచ్చితం గా విరుధ్ధం గా ఉన్నాయి (మీకూ, మీ పార్టీలకూ, దీర్ఘ కాలం లో లాభం ఉండవచ్చు గాక! కానీ మన రాష్ట్రానికి మాత్రం, మీ pipe dreams వలన ఏ కాలం లో అయినా నష్టమే. ఇప్పటి దాకా , తొండలు గుడ్లు పెట్టని ప్రాంతాలని ఉధ్ధరించింది చాలూ..ఇకనైనా మన రాష్ట్రం పై దృష్టి పెట్టండి) . లేక పోతే, మా ప్రయోజనాలను రక్షించటానికి, మేము కూడా ఆంధ్రా పార్టీ పెట్టుకొంటాం (తెలుగు నాడనో, సీమాంధ్ర సిమ్హమనో, మరొకటో..పేరుదేముంది లే!).

……….పని లో పని గా సినిమా వాళ్ళూ, టీ వీ చానళ్ళకు ఓ విజ్ఞప్తి..అయ్యలూ, మీరు గత రెండు మూడేళ్ళ లోనూ, మీ స్వార్ధానికి ఏన లేని సేవను చేసుకొన్నారు, మా రాష్ట్రానికీ దాని ప్రయోజనాలకూ మితి మీరిన హాని చేశారు. ఇక మీరు మా పక్క కి రాక పోతే మంచిది. వస్తే, మా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకోండి, అంతే కానీ మీ ఆస్తుల పరి రక్షణను కాదు.