ఏమయ్యా చంద్ర బాబూ, ఇంకా రెండు కళ్ళ సిధ్ధాంతమంటావు, ఓ కంట్లో కారం కొట్టించుకొన్నాక కూడా

ఏమయ్యా చంద్ర బాబూ, ఇంకా రెండు కళ్ళ సిధ్ధాంతమంటావు, ఓ కంట్లో కారం కొట్టించుకొన్నాక కూడా! మీరు విభజన చట్టాన్ని సరిగా పాటించటం లేదంటే, “మీరు మొదట తుంగ లో తొక్కాకే మేం మొదలెట్టాం!” అని నిష్కర్ష గా చెప్పలేవు. ఉమ్మడి రాజధాని లో law and order గవర్నర్ చేతి లో ఎందుకు లేదని గట్టి గా అడగ లేవు?..అడిగించను కూడా లేవు.. తాగు నీటికి ఓ నాల్గు టీఎంసీ ల నీటిని ఎందుకివ్వరని గట్టి గా అడగలేవు.. ..మీ కరెంట్ కోసం , మేము నీళ్ళెందుకు వదులుకోవాలని అడగాలేవు, నీ మంత్రుల చేత అడిగించా లేవు!మా దగ్గర ఉత్పత్తి చేసిన కరెంట్ మాకే, అని ఎందుకు ఢంకా భజాయించవు?మీ అసెంబ్లీ కి పవర్ కట్ చేస్తామంటే, “జెనరేటర్ ల తో నడుపుకొని, డీజిల్ బిల్లు మీకు పంపిస్తాములే!”, అనీ చెప్పలేవు.
ఫీజు రీయంబర్స్-మెంటు గురించి కాంగ్రెస్ వాళ్ళు (డొక్కా ప్రభృతులు) కోర్టు లో వేస్తే గానీ గతి లేదు..(అలా అని కాంగ్రెస్ ని క్షమించామని కాదు) . ఎందుకూ?  .అక్కడ ఏ ఓట్లు పోతాయో అని. ఎప్పటికైనా అక్కడ చక్రం తిప్పకపోతానా అని..ఓ ఆశ..ఈ లోగా ఇక్కడి వాళ్ళు ఏమైపోయినా పర్లే..ఎందుకంటే నీ పని జరిగిపోయింది..గద్దె నెక్కావు. తెలంగాణ కు కూడా న్యాయం చేస్తాం అంటావు.పక్క రాష్ట్రాలకి న్యాయం చేయటం గురించి నీలా పాటు పడే ముఖ్యమంత్రి నాకు 29 రాష్ట్రాలలోనూ, ఏ కాలం లోనూ కనిపించలేదు.  .ముందు నిన్ను ప్రతినిధి గా ఎన్నుకొన్న వాళ్ళ మనోభావాలకీ, ఆశలకీ ప్రాతినిధ్యం వహించవయ్యా మగడా! ఎక్కడో పక్క రాష్ట్రం లో జరిగిన రైతుల ఆత్మ హత్యలకీ, నీకూ ఏమిటి సంబంధం? వాళ్ళ చేత నువ్వు తిట్టించుకొని కూడా, మళ్ళీ ఎందుకు అదే శైలి లో రెస్పాన్స్ ఇవ్వటం లేదు? మా ప్రతినిధివైన నిన్ను తిడితే, మమ్మల్ని తిట్టినట్లు కాదా? మా ముఖ్యమంత్రి వైన నీకు, మా కంటే,  నిన్ను రోజూ తిట్టే పక్క రాష్ట్రం మీద ధ్యాస ఎక్కువైనట్లు ఉంది. ఓహో..నా పార్టీ అక్కడ కూడా ఉంది అంటావా? మరి మాకు కరెంట్ ఇస్తున్నావని, నీ పార్టీ ఆఫీసు మీద అక్కడ దాడి చేస్తే, ప్రతి గా ఏం చేయగలిగావు..ఒహో.. అక్కడ ఓట్లు పోతాయని భయమా? తుమ్మితే ఊడే ముక్కు ఎంత కాలం?

నిన్ను తెలంగాణ ముఖ్యమంత్రీ, మంత్రులూ విమర్శిస్తున్నట్లు, నువ్వు ఏ కర్నాటక ముఖ్య మంత్రి నో తిట్టు. కర్నాటక వాళ్ళ ప్రతి స్పందన ఏమిటో తెలుస్తుంది. చీటికీ మాటికీ మన రాష్ట్రం వ్యవహారలగురించి పేలుతూ ఉండే పక్క రాష్ట్రం వారికి, “మీ విషయం మీరు చూసుకోండి, మా వ్యవహారం మేం చూసుకొంటాం”, అని ఎందుకు చెప్ప లేక పోతున్నావ్? ఓహో నీ పార్టీ కి తెలుగు ప్రజలందరూ కావాలా(మాది తెలుగే కాదు పొమ్మన్న వారి ని వదిలేసి! )? మరి తెలుగు ప్రజలందరికీ నీ పార్టీ కావాలో ఒద్దో నీకు తెలీదా? నీకు రెండు వైపుల వాళ్ళూ కావాలి. మరి అవతలి వాళ్ళ కి నువ్వు అవసరమా? మీ వాళ్ళ విగ్రహల ను తీసుకొని పొమ్మంటే, తెలంగాణ నాయకుల విగ్రహాలను కూడా ఆంధ్ర లో పెట్టిస్తాం అంటావు. ఆంధ్ర లో ఏప్రాంతమైనా ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని గా ఉందా? రెండు రాష్ట్రాల కీ ఉమ్మడి రాజధాని ఆంధ్ర లో ఉందా? “ఉమ్మడి రాజధాని లో ఓ రాష్ట్రం వారి విగ్రహాలే ఎందుకుండాలి?” అని అడగలేవు. అక్కడి వారి విగ్రహాలు ఇక్కడ పెట్టటం లో తప్పు ఉందని కాదు. బ్లాక్ మెయిల్ కి లొంగటం, నీ ప్రాంతం వారి కి కూడా ప్రాంతీయ అస్థిత్వ భావాలు ఉంటాయని నువ్వు గుర్తించినట్లు కనపడదు. మనోళ్ళె కదా వీళ్ళ గురించి పట్టించుకొనేదేముంది అనుకొంటున్నావా?

నీ ప్రత్యర్ధి జగన్ కూడా నీ లానే, “ఎప్పటికైనా తెలంగాణ లో పాగా వేయక పోతానా!”, అని పగటి కలలు కంటున్నాడు. మీ ఇద్దరి expansionist dreams, మన రాష్ట్ర ప్రయోజనాలకి ఖచ్చితం గా విరుధ్ధం గా ఉన్నాయి (మీకూ, మీ పార్టీలకూ, దీర్ఘ కాలం లో లాభం ఉండవచ్చు గాక! కానీ మన రాష్ట్రానికి మాత్రం, మీ pipe dreams వలన ఏ కాలం లో అయినా నష్టమే. ఇప్పటి దాకా , తొండలు గుడ్లు పెట్టని ప్రాంతాలని ఉధ్ధరించింది చాలూ..ఇకనైనా మన రాష్ట్రం పై దృష్టి పెట్టండి) . లేక పోతే, మా ప్రయోజనాలను రక్షించటానికి, మేము కూడా ఆంధ్రా పార్టీ పెట్టుకొంటాం (తెలుగు నాడనో, సీమాంధ్ర సిమ్హమనో, మరొకటో..పేరుదేముంది లే!).

……….పని లో పని గా సినిమా వాళ్ళూ, టీ వీ చానళ్ళకు ఓ విజ్ఞప్తి..అయ్యలూ, మీరు గత రెండు మూడేళ్ళ లోనూ, మీ స్వార్ధానికి ఏన లేని సేవను చేసుకొన్నారు, మా రాష్ట్రానికీ దాని ప్రయోజనాలకూ మితి మీరిన హాని చేశారు. ఇక మీరు మా పక్క కి రాక పోతే మంచిది. వస్తే, మా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకోండి, అంతే కానీ మీ ఆస్తుల పరి రక్షణను కాదు.

ప్రకటనలు

24 thoughts on “ఏమయ్యా చంద్ర బాబూ, ఇంకా రెండు కళ్ళ సిధ్ధాంతమంటావు, ఓ కంట్లో కారం కొట్టించుకొన్నాక కూడా

 1. >>> తాగు నీటికి ఓ నాల్గు టీఎంసీ ల నీటిని ఎందుకివ్వరని గట్టి గా అడగలేవు

  కేటాయింపుల ప్రకారం తాగునీటికోసం సీమకు 10 TMCలు, తమిళనాడుకు 5 TMCలు ఇవ్వాలి. శ్రీశైలం రిజర్వాయరు నుండి ఇప్పటికే 54 TMCలు తీసుకువెళ్ళారు. ఆంధ్ర ప్రభుత్వం చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారమే 33 TMCలు తెలుగుగంగకు సంబంధించిన రిజర్వాయర్లలో ఈరోజున నిలువ వున్నాయి. ఇక ఎందుకివ్వరని అడిగే ఆస్కారమే లేదు.

  >>> మీ కరెంట్ కోసం , మేము నీళ్ళెందుకు వదులుకోవాలని అడగాలేవు

  శ్రీశైలం ప్రాజెక్టే జలవిద్యుత్తు కోసం నిర్మించ బడ్డ ప్రాజెక్టు. గతంలో చంద్రబాబు నాయుడు జారీ చేసిన GO ప్రకారమే 836 అడుగుల నీటిమట్టం వచ్చే వారకు జలవిద్యుత్తు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడున్న నీటిమట్టం 861 అడుగులు. అంటే మరో 25 అడుగులు తగ్గే వరకు విద్యుత్తు నిరహైభ్యంతరంగా తయారు చేసుకోవచ్చన్నమాట!

  >>> ఉమ్మడి రాజధాని లో law and order గవర్నర్ చేతి లో ఎందుకు లేదని గట్టి గా అడగ లేవు?

  హైదరాబాదు ఉమ్మడి రాజధాని కాదు, అది అన్ని విధాలుగానూ తెలంగాణాకు చెందిన ప్రాంతం మాత్రమే. కేవలం నిర్దేశించిన కార్యాలయాలు వాడుకోవడం వరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అవకాశం వుంది.

  విభజన విల్లు ప్రకారం హైదరాబాదు ప్రజల భద్రతను పర్యవేక్షించ వలసిన “బాధ్యత” మాత్రమే గవర్నర్‌కు ఉంది. అది ఆయన సరిగానే నిర్వర్తిస్తున్నారు.

  >>> ఉమ్మడి రాజధాని లో ఓ రాష్ట్రం వారి విగ్రహాలే ఎందుకుండాలి?

  ఉమ్మడి రాజధాని అన్న సమస్యే లేనపుడు ఉమ్మడి విగ్రహాల సమస్యే వుండదు. కావలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి కేటాయించిన కార్యాలయాల ఆవరణల్లో కావలసిన విగ్రహాలను వారున్నంత కాలం వరకు ప్రతిష్ఠించుకోవచ్చు.

  మెచ్చుకోండి

  1. చారి గారు,
   నేను సీమాంధ్ర ద్రోహి ఐన చంద్ర బాబు పని పడదామనుకొంటే, మీరు ఇలా చంద్ర బాబు తరపున వకాల్తా తీసుకొంటే ఎలా? బాబోయ్ నే పారిపోతున్నా..

   మెచ్చుకోండి

   1. bondalapati గారు,

    ఇద్దరి గమ్యం ఒక్కటే కాని దిషలు వేరు వేరు. మీరు ఆ వైపు నుండి వస్తున్నారు, నేను ఈ వైపు నుండి వస్తున్నాను. అంతే తేడా!

    మెచ్చుకోండి

 2. పోతే నేను కోరుకునేది కూడా అదేనండీ.

  చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలను వచ్చే ఎన్నికలవరకూ వాయిదా వేసి ఆంధ్ర ప్రభుత్వ నిర్వహణ మీద దృష్టి పెడితే బాగుంటుంది.

  తెలంగాణాలో బస్సుయాత్రలను నిర్వహించే వ్యూహాలను పన్నడానికి వెచ్చించిన విలువైన సమయాన్ని వైజాగ్ తుఫాను విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగిస్తే బాగుండేది.

  జలవిద్యుత్తు ఉపయోగిస్తున్నారొహో అని తానూ, మంత్రులూ పక్క రాష్ట్రంపై దాడులు చేసే బదులు, పూర్తైన కృష్ణపట్నం ప్రాజెక్టును ప్రారంభించడంలోను, విద్యుత్ డిమాండు అధికంగా ఉన్న సమయాల్లో నిర్వహణ పేరుతో కర్మాగారాలను ఆపకుండా వుండడంలోనూ శ్రద్ధ కనబరిస్తే బాగుంటుంది.

  ఊరికే పొరుగు రాష్ట్రం వారు తమ రాజధానో, మరోటో ఎలా వుండాలనుకుంటున్నారో అన్న దానిమీద విమర్శలు చేయడం బదులు తమ రాష్ట్ర రాజధాని నిర్మాణం సంగతి అటుంచి, కనీసం స్థలనిర్ధారణ కోసం అలోచన చేస్తే ఉపయోగకరంగా వుంటుంది.

  హైదరాబాదులోని తాత్కాలిక అఫీసులు, వసతి గృహాలకు నెలలతరబడి కోట్లు వెచ్చించి వాస్తు మార్పులు చేయడానికి సమయం, డబ్బు వెచ్చించే బదులు ఆ డబ్బులతో కనీసం ఒక ఆఫీసైనా తమ రాష్ట్రంలో నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తే మరింత ఉపయుక్తంగా వుంటుంది.

  మెచ్చుకోండి

  1. @ బొందలపాటి గారు టపా బాగుంది, కాని చంద్రబాబు పరిస్థితి అదీ :), చూసారా స్నేహం అన్నాక అసలు కాస్త కూడా విభేదం లేదు 😉

   @ శ్రీ కాంతా చారి
   ఇక్కడ బ్లాగర్ చంద్రబాబు కోసం వ్రాసిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చారు ( అది చంద్ర బాబు తరుపునో, వ్యతిరేకంగానో అర్ధం కావడం లేదు )

   మీరు చంద్రబాబు మీ రాష్ట్రం లో ఏమి చెయ్యకూడదొ చెప్పొచ్చు అది కూడా మీకు సంబంధించినది అయితే . మా రాష్ట్రం లో ఏమి చెయ్యాలో చెప్పడానికి మీరెవరు? లేక అతని ఇంటిని ఏం చేసుకుంటే మీ ఏడుపు ఏంటి ( అంటే మేం అనాలి కాని) . రాష్ట్రం దాకా ఎందుకు బ్లాగుల్లో ఎవరి పరిమితులు వాళ్ళు తెలుసుకోవడం మంచిది .

   ఇక చంద్రబాబు కి హైదరాబాదు మీద కూడా హక్కు ఉంది, ఉంటుంది ఒక పౌరుడిగా . అది ఆంధ్ర వాళ్ళం అయిన మాకు కూడా కాదనే హక్కు లెదు. అది మా సమస్య , మీ పని మీరు జాగ్రత్తగా చేస్కొని బాగు పడండి . మా చుట్టూ(బ్లాగుల్లో) తిరగడం మానేసి .

   మెచ్చుకోండి

   1. @Mouli

    >>> ఇక్కడ బ్లాగర్ చంద్రబాబు కోసం వ్రాసిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇచ్చారు

    నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు కోసం టపా రాస్తే చంద్రబాబే వచ్చి సమాధానలు ఇవ్వాలంటారా?

    >>> మా రాష్ట్రం లో ఏమి చెయ్యాలో చెప్పడానికి మీరెవరు?

    నిన్నటిదాకా మాట్లాడిన సమైక్యవాదం, తెలుగుజాతి అని చేసిన వాదనల్లోని పస ఇంతేనన్న మాట! సరే పోనీండి. ఇతర రాష్ట్రం అయితే మాట్లాడకుడదా? AP వారు కేవలం AP గురించే మాట్లాడుతున్నారా? మిగతా ప్రపంచం గురించి మాట్లాడడమే లేదా?

    >>> రాష్ట్రం దాకా ఎందుకు బ్లాగుల్లో ఎవరి పరిమితులు వాళ్ళు తెలుసుకోవడం మంచిది .

    నేను ఈ బ్లాగులోకి రావద్దంటే అది చెప్పవలసిన వారు మీరు కాదనుకుంటా!

    >>> ఇక చంద్రబాబు కి హైదరాబాదు మీద కూడా హక్కు ఉంది, ఉంటుంది ఒక పౌరుడిగా .

    కాని తెలంగాణా వారికి మాత్రం వేరొక బ్లాగులో కామెంటు రాసుకోవడానికి కూడా హక్కుండదు, అంతేనా?

    >>> మీ పని మీరు జాగ్రత్తగా చేస్కొని బాగు పడండి . మా చుట్టూ(బ్లాగుల్లో) తిరగడం మానేసి .

    నేను మరొకరి బ్లాగులో కామెంటితే పనిగట్టుకొని వచ్చి నీతులు చెప్తున్నది మీరు. ఈ బ్లాగు రచయిత ఒక పోస్టు రాసి, కామెంట్లు రాయడానికి అవకాశం ఇచ్చారు. అది ఉపయోగించుకుని నేనొక కామెంటు రాశాను. అది నచ్చకపోతే సదరు బ్లాగరు నా కామెంట్లు తొలగిస్తారు. అంతే కాని ఇక్కడికి నన్ను రావద్దని చెప్పే హక్కు మీకెక్కడిది?

    మెచ్చుకోండి

    1. @ శ్రీ కాంతా చారి

     చంద్రబాబు సాధకబాధకాలను తెలంగాణా వారి తరుపున మీరు తెలియ చెప్పారు . అంతవరకు నచ్చినా లేకున్నా మీ వాదన / . వ్యాఖ్య కు అభ్యంతరం లేదు , కాబట్టే ముందే నా వ్యాఖ్య లో ఆ మాత్రం జాగ్రత్త తీసికొన్నాను . మీ రెండవ వ్యాఖ్యతో పూర్తీ అభ్యంతరం ఉంది

     @ నిన్నటిదాకా మాట్లాడిన సమైక్యవాదం,

     ఇదీ మీ అసలు రంగు , కాబట్టే నాకు అభ్యంతరం ఉంది . మీకు చంద్రబాబునో ,ఆంధ్ర వారినో తిట్టిపోయ్యాలంటే కనపడ్డ వాళ్ళందరినీ సమైక్యవాదులని అబద్దం పుట్టించాలి, ప్రత్యెక తెలంగాణా వాదిగా మీకు మర్యాద ఇచ్చినందుకు ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది.

     నేను బ్లాగుల్లో అని చెప్పాను కాని ఈ బ్లాగులో అనలేదు . ఎక్కడైనా మాట్లాడేముందు మీకు సంబంధమో చెప్పి మాట్లాడండి .
     చంద్రబాబు AP కి ముఖ్య మంత్రి కాని తెలంగాణా వాడు కాదు అనడానికి లేదు కాబట్టి నేను చెప్పాను ఇక చంద్రబాబు కి హైదరాబాదు మీద కూడా హక్కు ఉంది, ఉంటుంది ఒక పౌరుడిగా . ఇది మా సమస్య కాక మీ సమస్యా ?

     ఈ బ్లాగేం ఖర్మ , చాలా బ్లాగుల్లో మీలాంటి కొందరు ఇలానే చేస్తున్నారు , కాబట్టే నేను చెప్పాల్సి వచ్చింది . మీ మొదటి వ్యాఖ్యకి అంతే ఘాటుగా సమాధానం చెప్పొచ్చు కాని ఇది మేము తెలంగాణా వారితో వాదన చేసే టపా కాదు . అలాగే బ్లాగు ఎవరిదన్నది ముఖ్యం కాదు ,టపా ఏంటి మీ వ్యాఖ్య ఏంటి ?

     మీ మొదటి వ్యాఖ్య టపాకి సమాధానం అనుకొనే వదిలేసాం , కాని రెండవ వ్యాఖ్యతో అభ్యంతరం వుంది , ఆ నాలుగు మాటలు ఎక్కడెక్కడ వ్రాద్దామా అని సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వ్రాయడం సరికాదు . ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలతో మీరు తెలంగాణా వాది అనికూడా నమ్మే పరిస్థితి లేదు . నిజంగా తెలంగాణా వాది అయితే చంద్రబాబు రాష్ట్రం లో మీకున్న సమస్యల గురించి మాట్లాడండి ఽది ఎక్కడ మాట్లాడినా తప్పులేదు. రాష్ట్రం అని తమిళనాడు వాల్లోచ్చి అన్నా ఇదే సమాధానం ఇస్తాం అలాగే అక్కడ జయలలిత గురింఛి చర్చల్లో పెత్తనం చెయ్యం .

     మెచ్చుకోండి

     1. >>> మీకు చంద్రబాబునో ,ఆంధ్ర వారినో తిట్టిపోయ్యాలంటే కనపడ్డ వాళ్ళందరినీ సమైక్యవాదులని అబద్దం పుట్టించాలి

      నేను కేవలం ఈ బ్లాగులో రాసిన విషయానికి స్పందించి రెండు వ్యాఖ్యలు చేశాను. కాని పనిగట్టుకుని వచ్చి నాపై ఎదురు దాడి చేస్తున్నది మీరు. ఒకసారి సమీక్షించుకోండి.

      మీరు చేసిన అభ్యంతర కరమైన వ్యాఖ్యలు ఒకసారి చూడండి.

      మా రాష్ట్రం లో ఏమి చెయ్యాలో చెప్పడానికి మీరెవరు?
      లేక అతని ఇంటిని ఏం చేసుకుంటే మీ ఏడుపు ఏంటి
      బ్లాగుల్లో ఎవరి పరిమితులు వాళ్ళు తెలుసుకోవడం మంచిది .
      మీ పని మీరు జాగ్రత్తగా చేస్కొని బాగు పడండి
      మా చుట్టూ(బ్లాగుల్లో) తిరగడం మానేసి .
      ఇదీ మీ అసలు రంగు
      మీకు మర్యాద ఇచ్చినందుకు ఇప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది.
      ఎక్కడైనా మాట్లాడేముందు మీకు సంబంధమో చెప్పి మాట్లాడండి .
      ఇది మా సమస్య కాక మీ సమస్యా ?
      ఆ నాలుగు మాటలు ఎక్కడెక్కడ వ్రాద్దామా అని సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ వ్రాయడం సరికాదు .

      నేను చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా తోస్తే బ్లాగరు మందలిస్తారు, లేక తొలగిస్తారు. మరి మధ్యలో మీరు ఎందుకు ఆవేశ పడుతున్నారు? (మీరు ఈ బ్లాగు ఓనరు ఒకటి కాదనుకుంటున్నాను).

      ప్రపంచంలో ఎక్కడైనా ఏ విషయమ్మీదనైనా ఎవరైనా స్పందిస్తున్న రోజులు ఇవి. పొరుగురాష్ట్రం ముఖ్యమంత్రి చేసే పనులమీద మాట్లాడకూడదు అనడం విచిత్రంగా వుంది. మీరు పిలవకుండానే వచ్చి నా కామెంటు పై అనవసర వ్యాఖ్యలు చేస్తూ ఉచిత సలహాలు ఇవ్వచ్చు, కాని నేను మాత్రం పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చేసే పనులమీద మాట్లాడగూడదన్న మాట! బాగుంది.

      ఇదే నా చివరి వ్యాఖ్య.

      మెచ్చుకోండి

      1. చివరి వ్యాఖ్య కాక ఇంకేముంది లెండి మీరు ఇక్కడ చెప్పడానికి . పనిగట్టుకొని మీ వ్యాఖ్యకు స్పందించే పని లెదు. మా రాష్ట్రం సమస్యలకి సంబంధించిన ముఖ్యమైన పోస్ట్ ఇది .మొదటే మీరు మీ రాష్ట్రం గురించి ఆరాట పడ్డ ‘ఒక్క’ చోటా అభినందించాల్సి వచ్చ్సిందంటే అనవసరమైన రచ్చ యెంత చూస్తున్నామో మీకు అర్ధం కావాలి . మా సమస్యలు మాకున్నాయి, ఆ పైన ఈ గోల. మీరసలు నిజంగా తెలంగాణా బ్లాగరేనా ??? కాస్త కూడా ఆ కళ లేదు .

       నా వ్యాఖ్య ఎందుకు అభ్యంతర కరమో చెప్పాలి ఊరికే మధ్యలో ముక్కలు కోట్ చెయ్యకుండా . నేను చెప్పాను కదా . లేదంటే నిజం అక్కడే ఉంది .

       మెచ్చుకోండి

   2. “కాని చంద్రబాబు పరిస్థితి అదీ :), చూసారా స్నేహం అన్నాక అసలు కాస్త కూడా విభేదం లేదు ;-)”
    అంతేలెండీ..ఈ రాజకీయ చర్చల వలన మనకి వ్యక్తిగతం గా పోయేదేమీ లేదు కనుక ఏదో మన ఆక్రోశం వెలి బుచ్చుతాం..అదే,మనమే ఓ రాజకీయనాయకులమై, ఓ stance తీసుకోవల్సివస్తే, అలా తీసుకోబోయే రాజకీయమైన stance వలన మనకి వ్యక్తిగతం గా నష్టమో, లాభమో ఉంటే అప్పుడు తెలుస్తుంది మన అసలు రంగు. మన పరిధిలోనే మనం మనకి లాభనష్టాలు ఉన్నపుడు అనేక సార్లు గోడమీది పిల్లుల్లా వ్యవహరిస్తాం. ఆ విషయం బాబు కే పాఠాలు నేర్పగలం. hot seat లో ఉన్న వాళ్ళ కి అర్ధమౌతుంది దాని లోని కష్టం. మీ అభిప్రాయం కూడా ఇదే అని భావిస్తున్నాను. లేక, మన స్నేహం చెడిపోయే విధం గా మాట్లాడానా!? 🙂

    మెచ్చుకోండి

  2. పక్క రాష్ట్రం గురించి గింజుకోవటం ఆపి,ఎవరి రాష్ట్రం గురించి వారు ఆలోచించుకోవటం మంచిది… అది మీరైనా, నేనైనా, చంద్ర బాబైనా, మరొకరైనా..

   మెచ్చుకోండి

    1. “”ఎవరి రాష్ట్రం గురించి ఆలోచించడం మంచిదే, కాని పక్క రాష్త్రం గురించి కూడా ఆలోచించడం తప్పు కాదేమో!””
     –చూశారా, మళ్ళీ మీరు చంద్ర బాబు తరపున సమాధానం చెప్పారు :-)! నేను మాత్రం చంద్ర బాబు తన రాష్ట్రం గురించి మాత్రమే ఆలోచించాలనుకొంటున్నాను.

     మెచ్చుకోండి

    2. jokes apart, ఇతర రాష్ట్రాల వ్యవహరాలలో తలదూర్చటం పై నా స్టాండ్ గురించి ఓ చిన్న క్లారిటీ: ఇరు రాష్ట్రాలమధ్య ఉన్న వివాదాస్పద అంశాల పై మాట్లడేటపుడు (ఉదా: నీళ్ళూ, కరెంటూ పంపకాలు), పక్క రాష్ట్రం గురించి మాట్లాడకుండా ముందుకు సాగలేం. మాట్లాడక పోతే, చివరికి మన సమస్యే పరిష్కారం కాదు. కానీ పక్క రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంతర్గత విషయాల గురించి judge చేయటం వలన ఉప యోగం లేదు. ఉదా: బతుకమ్మ ఖర్చులు, , చెరువుల అనుసంధానం గురించి ఆంధ్ర వారు మాట్లాడటం దండుగ.బతుకమ్మ పై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆంధ్ర కి వచ్చే నష్టం ఏమిటి? అలానే ఆంధ్ర రాజధాని గురించి, అక్కడి సినిమా పిచ్చి గురించీ తెలంగాణ వారు మాట్లాడి ఉపయోగం లేదు.ఆంధ్ర వారు సినిమాలు చూడటానికి డబ్బు తగలేసుకొంటే, తెలంగాన కు వచ్చే నష్టం/లాభం ఏమిటి? ఆంధ్ర రాజధాని ఎక్కడ ఉంటే, తెలంగాణ కి ఏం పట్టింది?మాట్లాడే హక్కు లేదా అంటే ..ఉంది..కానీ ఉపయోగం లేదు.

     మెచ్చుకోండి

    3. స్టేట్ విడిపోవటానికి ముందు, చాలా మంది ఆంధ్రా వాల్లు తెలంగాణ బ్లాగుల్లోకి వెళ్ళి, “కలిసుంటే మీకు ఇది లాభం, విడిపోతే మీకు ఇది నష్టం”, అని నచ్చ చెప్పాలని చూసే వాల్లు. respone గా వారికి వచ్చే సమాధానం, “మా సంగతి మేం చూసుకొంటాం, మీకెందుకు, ముందు ఈ సైట్ నుంచీ దొబ్బేయ్!” లాంటి సమాధానాలు. మరి ఇప్పుడు ఎదుటి వారి బ్లాగ్ లో కూడా అలాంటి సమాధానమే ఎదురైతే, నీతులు గుర్తుకు వస్తయి.
     world లో ఎవరైనా ఎవరికైనా సలహాలు చెప్పవచ్చు. మనం వెళ్ళి అమెరికా వాడికి అక్కడి సమాజం లోని problems నుంచీ ఎలా బయట పడాలో చెప్పవచ్చు. ఇది one sided గా ఉంటేనే ప్రాబ్లం.

     మెచ్చుకోండి

 3. ఏమిచేద్దాం, చంద్రబాబు కొండనాలికకు మందేయడములో బిజీగా ఉన్నాడు. ఉన్న నాలిక ఊడడం ఏదో ఒకరోజు జరుగుతుంది అనిపిస్తోంది. రెండు కళ్ళలో ఒక కన్ను తెలంగాణా వైపు, మరో కన్ను ఆంధ్రా వైపు .. ఎటు చూస్తున్నాడో అర్థం కాని ప్రజలు, ఏదో ఒక రోజు మూడో కన్ను తెరిచేస్తారు, బూడిదైపోతుంది అంతా !!

  మెచ్చుకోండి

 4. నిజమే, చంద్రబాబుగారు ఇంకా రెండు ప్రాంతాలకీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఆయన రెండు ప్రాంతాలలో ఉన్న పార్టీకి అధ్యక్షులు మాత్రమే. ఆయన పార్టీ అధ్యక్ష పదవిని (ఏ బాలకృష్ణకో) వదులుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే పూర్తి స్వార్థంతో పనిచేస్తే బాగుంటుంది.

  మెచ్చుకోండి

  1. బాబు గారు.. జ్యోతి బసు లాంటి సెక్యూర్ పొలిటిషియన్ కాదు. ఆయనకు insecure ఫీలింగ్ ఎక్కువ, తన లానే ఎవరు తనను వెన్నుపోటు పొడుస్తారో అని. గత పదేళ్ళు గా ఆయన పార్టీ వాళ్ళు ఆయనకు ఇచ్చిన జలక్ లు కూడా తక్కువ కాదు. ఆయన పార్టీ లోని ఒకప్పటి నంబర్ టూ, త్రీ (KCR,దేవేందర్, దాడి, నాగం, కడియం,ముద్దు కృష్నమ, రామ్మూర్తి నాయుడు,మైసూరా the list goes on and on) అందరూ ఆయనకు జలక్ లు ఇచ్చిన వారే. అదేం చిత్రమో, పార్టీ లో అయనకు జలక్ ఇవ్వని సీనియర్ నాయకులందరూ (బాలయోగి, మాధవ రెడ్డి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా) అకాల మృత్యువు పాలయ్యారు. ఒక్క కోడెల మిగిలి ఉన్నాడు. కోడెలా జాగ్రత్త!!)
   దానితో ఇక అధి కారాన్ని ఫామిలీ దాటి పోనివ్వరాదని నిర్ణయించుకొన్నాడు. లోకేష్ బాబు కెరీర్ ని కూడా చూడాలి.
   బాల్ థాకరే- మనోహర్ జోషి, లేక జయలలిత-పన్నీర్ సెల్వం లా ఓ డమ్మీ సీ-ఎం ని వెతుక్కొని, తను పార్టీ ప్రెసిడెంట్ గా ఉండొచ్చు. కానీ పనీల్ సెల్వం లాంటి వారు ఎవరూ దొరకటం లేదు లా ఉంది. ఆంధ్ర రాజకీయ నాయకులు విధేయత కు అంతగా పేరెన్నిక గన్న వారు కాదాయె. పనీర్ సెల్వం లాంటి వారు బాబుకు ఆంధ్ర లో దొరక క పోవచ్చు. పార్టీ ప్రెసిడెంట్ రెండు పోట్లాడుకొనే రాష్ట్రాలను మానేజ్ చేయాలి కాబట్టీ, సీ ఏం కంటే అదే కష్టమయిన పని.
   కానీ, బయటి వారి తో బాబు ఎక్స్-పీరియన్స్ అంత గొప్ప గా లేదు. అందరూ హాండిచ్చిన వాళ్ళే. ఈయన తన కుటుంబం లోని వారికి (NTR, హరికృష్న, దగ్గుబాటి) ఎక్కువగా హాండిచ్చాడు.
   బాలకృష్ణ ని AP సీ ఎం గా చేసి, తను పార్టీ ప్రెసిడెంట్ గా ఉండొచ్చు, గానీ ఆయనకి రోజుకో తలనొప్పి, సీమాంధ్ర జనాలకి రోజుకో కామెడీ షో గారంటీ!
   లోకేష్ బాబు ని CM గా చేస్తే, ఆ పని మొత్తం మళ్ళీ తనే చేసుకోవాలి..

   మెచ్చుకోండి

 5. చిన్న బిట్ మిస్ అయ్యారు . జయలలిత కి విధేయులు ఉంటానికి కారణం ఆవిడకి కుటుంబం లేదు. బాలథాకరే కూడా అదేనేమో తెలియదు . ఒకవేళ ఉన్నా బిజెపి లో కుటుంబ వారసత్వం కుదరదు. చాలా కష్టపడాలి. నీడపట్టున పెరిగిన వారు ఏం పడతారు . అదే కాంగ్రెస్, తీదీపిలలో కుటుంబాలు పెట్టిన పార్టీ, లేదా వాళ్ళు సినిమా వాళ్ళలాగా పాతుకుపోయారు .ఇక ఇంటిపేరు చాలు పెద్దగా కష్టపడక్కర లేదు .

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s